![Emma Stone Pops In Playful Popcorn Dress](/styles/webp/s3/article_images/2025/02/18/Pop.jpg.webp?itok=GuAnTMOW)
పాప్ కార్న్‌ని ఇష్టపడనివారు ఉండరు. టైం పాస్‌గానూ, మూవీ థియోటర్‌లలోనూ తప్పనిసరిగా ఇది ఉండాల్సిందే. అలాంటి ఈ పాప్ కార్న్ మన తాత ముత్తాతల కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకూ బెస్ట్ స్నాక్ ఐటెంగా రాజ్యమేలుతుంది. అలాంటి పాప్ కార్న్‌తో ఫ్యాషన్ ట్రెండ్ సెట్ చేసింది హాలీవుడ్ నటి ఎమ్మా స్టోన్. అసలు పాప్‌కార్న్‌తో ఫ్యాషన్ ఏంటి అనే కదా..!. ఆమె పాప్ కార్న్‌తో డిజైన చేసిన ఎరుపు రంగు గౌనులో మెరిసింది. ఇంతకీ ఆ గౌను ఎలా ఉంటుందో తెలుసా..!.
ఈ చిరుతిండితో ఫ్యాషన్‌గా ఉండొచ్చనే ఆలోచన ఆమెకు ఎలా వచ్చిందో గానీ ఆ గౌను డిజైనింగ్ మాత్రం అదుర్స్. ఎరుపు రంగుతో కూడిన క్లాసిక్ పాపకార్న్ బకెట్ మాదిరిగా ఉంది. అచ్చం మనం మూవీ థియేటర్‌లో కొనుగోలు చేసే పాప్ కార్న్ బకెట్ మాదిరిగా డిజైన్ చేశారు.
అంతేగాదు ఆమె నడుమ వద్ద శంఖాకారం మాదిరి పాకెట్స్‌లలో పాప్‌కార్న్‌తో నిండి ఉన్నాయి. ఎమ్మా రెడ్ కార్పెట్ మీద వయ్యారంగా నడుస్తూ వస్తూ..చేతిలో పాప్ కార్న్ ప్యాకెట్‌తో తింటూ వచ్చింది. చెప్పాలంటే ఈ ముద్దుగుమ్మ వచ్చిన విధానం చూస్తే..ఎవ్వరికైన నోరూరడమే గాక ఇలా చిరుతిండిని స్టైల్‌గా మార్చిన క్రియేటివిటిని మెచ్చుకోకుండా ఉండలేరు.
ఇక నటి ఎమ్మాస్టోన్ సాటర్డే నైట్ లైవ్ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇలా వెరైటీ లుక్‌లో తళుక్కుమంది. రెడ్ కార్పెట్‌పై ఏ లిస్ట్ సెలబ్రిటీల పాప్ సంస్కృతికి అద్దం పట్టేలా ఎమ్మా స్టోన్ ఇలా సరికొత్త ప్యాషన్ లుక్‌తో సందడి చేసింది. అయితే ఇలా ఆహార ప్రేరేపిత ఫ్యాషన్ స్టార్ట్ చేయడం తొలిసారి కాదు.
గతంలో మైఖేల్ షానన్ పసుపు చిప్స్ బ్యాగ్‌తో రెడీ అయ్యి 2024 మెట్ గాలాకు హాజరయ్యారు. మైఖేల్ డిజైనర్ వేర్‌ని ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ బాలెన్సియాగా రూపొందించారు. ఆ బ్రాండ్ పేరు "మ్యాక్సీ ప్యాక్". అంతేగాదు ఆ ఆహార ప్రేరేపిత డిజైనర్‌వేర్‌లో చీజ్, ఉల్లిపాయ వంటివి కూడా ఉండటం విశేషం. అయితే సోషల్ మీడియాలో ఈ డిజైనర్ వేర్ పలువురిని విశేషంగా ఆకర్షించింది.
Emma Stone and Meryl Streep #SNL50 pic.twitter.com/VvsIhIjs7e
— best of emma stone (@badpostestone) February 17, 2025
(చదవండి: డిజైర్ డిజైన్స్..! మధ్యతరగతి వాళ్లు కూడా కొనేలా డైమండ్స్..)
Comments
Please login to add a commentAdd a comment