ఏ కాలాన్నైనా బ్రైట్‌గా మార్చేసే గుణం పువ్వుల సొంతం. ఆ సౌందర్యాన్ని ధరించే దుస్తుల మీదకు తీసుకురావడం తరుణుల అభిమతం అందుకే జాతీయ అంతర్జాతీయ వేదికల మీద కూడా పువ్వుల ప్రింట్లు, డిజైన్లు అమితంగా ఆకట్టుకుంటుంటాయి. పెళ్లి, పుట్టిన రోజు వంటి వేడుకల్లోనే కాదు క్యాజువల్‌వేర్‌గానూ కట్టిపడేసే పూల డ్రెస్సులు ధరించడమంటే మేనిపైన పూల సంతకం చేసినట్టే.
ఎంబ్రాయిడరీ పూలు
చేతితో చేసిన ఎంబ్రాయిడరీ వర్క్‌లోనూ పువ్వులు, లతల అందం మన మదిని దోచేస్తూనే ఉంటుంది. ఎన్ని హంగులు దిద్దినా వాటినుంచి కొత్త స్ఫూర్తిని ΄పొందుతూనే ఉంటాం. అందుకే కొత్త డిజైన్లను సృష్టిస్తూనే ఉంటారు డిజైనర్లు.
అప్లిక్ పూలు
కావల్సిన పరిమాణంలో పువ్వులను ముందుగానే డిజైన్ చేసుకొని, ఎంపిక చేసుకున్న ఫ్యాబ్రిక్ మీద ఫ్యా చ్ వర్క్ చేస్తారు. ఈ పూల గుత్తులు డ్రెస్ అందాన్ని వెయ్యింతలుగా
పెంచుతుంది.
పువ్వుల ప్రింట్లు
ఏ హంగులూ చేయలేం అనుకున్నవారు పువ్వుల ప్రింట్లు ఉన్న సిల్క్ లేదా బ్రొకేడ్, కాటన్ ఫ్యాబ్రిక్‌లో ఏదైనా ఎంచుకోవచ్చు. కాలానుగుణంగా ఫ్యాబ్రిక్ ఎంపికలో మార్పులు ఉండవచ్చు గానీ, పువ్వుల సొగసులో మార్పులు ఉండవని నిరూపిస్తుంటారు అతివలు. అందుకే కాబోలు పువ్వుల ప్రింట్లు ఉన్న ఫ్యాబ్రిక్ ఎన్నో రకాల స్టైల్స్‌లో డ్రెస్ డిజైనర్ల చేతిలో మారిపో తుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment