prints
-
పూల సంతకం
ఏ కాలాన్నైనా బ్రైట్‌గా మార్చేసే గుణం పువ్వుల సొంతం. ఆ సౌందర్యాన్ని ధరించే దుస్తుల మీదకు తీసుకురావడం తరుణుల అభిమతం అందుకే జాతీయ అంతర్జాతీయ వేదికల మీద కూడా పువ్వుల ప్రింట్లు, డిజైన్లు అమితంగా ఆకట్టుకుంటుంటాయి. పెళ్లి, పుట్టిన రోజు వంటి వేడుకల్లోనే కాదు క్యాజువల్వేర్గానూ కట్టిపడేసే పూల డ్రెస్సులు ధరించడమంటే మేనిపైన పూల సంతకం చేసినట్టే. ఎంబ్రాయిడరీ పూలు చేతితో చేసిన ఎంబ్రాయిడరీ వర్క్‌లోనూ పువ్వులు, లతల అందం మన మదిని దోచేస్తూనే ఉంటుంది. ఎన్ని హంగులు దిద్దినా వాటినుంచి కొత్త స్ఫూర్తిని ΄పొందుతూనే ఉంటాం. అందుకే కొత్త డిజైన్లను సృష్టిస్తూనే ఉంటారు డిజైనర్లు. అప్లిక్ పూలు కావల్సిన పరిమాణంలో పువ్వులను ముందుగానే డిజైన్ చేసుకొని, ఎంపిక చేసుకున్న ఫ్యాబ్రిక్ మీద ఫ్యా చ్ వర్క్ చేస్తారు. ఈ పూల గుత్తులు డ్రెస్ అందాన్ని వెయ్యింతలుగా పెంచుతుంది. పువ్వుల ప్రింట్లు ఏ హంగులూ చేయలేం అనుకున్నవారు పువ్వుల ప్రింట్లు ఉన్న సిల్క్ లేదా బ్రొకేడ్, కాటన్ ఫ్యాబ్రిక్‌లో ఏదైనా ఎంచుకోవచ్చు. కాలానుగుణంగా ఫ్యాబ్రిక్ ఎంపికలో మార్పులు ఉండవచ్చు గానీ, పువ్వుల సొగసులో మార్పులు ఉండవని నిరూపిస్తుంటారు అతివలు. అందుకే కాబోలు పువ్వుల ప్రింట్లు ఉన్న ఫ్యాబ్రిక్ ఎన్నో రకాల స్టైల్స్‌లో డ్రెస్ డిజైనర్ల చేతిలో మారిపో తుంటుంది. -
ఏకరూప కవలల వేలిముద్రలు మారిపోతాయా?
సాక్షి, న్యూఢిల్లీ: వేలిముద్రలు లేదా ఫింగర్ ప్రింట్స్ మన జీవన విధానంలో వీటికున్న ప్రాధాన్యత చాలా కీలకం. జీవి గుర్తింపుకు ప్రతీకలివి. అందుకే నేరస్తులను పట్టుకోవడంలో వేలిముద్రలు ప్రధాన సాక్క్క్ష్యాలుగా మారిన ఉదాహరణలు ఎన్నో..ఎందుకంటే ఈ భూమిపై ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవు. మరి ఒకే డీఎన్ఏను పంచుకున్న ఏక రూప కవలల ఫింగర్ ప్రింట్స్ మాటేమిటి? లేదా వేరు వేరుగా ఉంటాయా? మధ్యలో మారిపోతాయా? ఈ వేలిముద్రల ఆసక్తికర విషయాలగురించి తెలుసుకుందాం.. ఆధునిక సమాజంలో వ్యక్తి గుర్తంపునుంచి ఆఫీస్ అటెండెన్స్ నుంచి..అంతా ఫింగర్‌ప్రింట్ బయోమెట్రిక్ అథెంటికేషన్ సిస్టంతోనే నడుస్తుంది. మనం ముందే చెప్పుకున్నట్టుగా ఏ ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ ఒకరితో ఒకరికి సరిపోలవు. అంతేకాదు ఒకే వ్యక్తికి సంబంధించిన ఏ రెండు వేళ్ళ ముద్రలు కూడా ఒకేలా ఉండవు, వాటిని ఎవరూ దొంగిలించలేరు కూడా. ఎందుకో తెలుసా..! జన్యుపరమైన నిర్మాణాన్ని అనుసరించి వేళ్లపై ఉండే గీతలు రూపొందుతాయి కాబట్టి. మరి ఒకే డీఎన్ఏను పంచుకునే ఏక రూప కవలల ఫింగర్ ప్రింట్స్ విషయమేంటి? వారి వేలి ముద్రలు ఒకేలా ఉంటాయా? అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా..ఏక రూప కవలలను మోనోజెనెటిక్ ట్విన్స్ అనికూడా అంటారు. అంటే ఒకే అండం (జైగోట్) నుంచి అభివృద్ధి చెంది, పెరెంట్స్ నుంచి దాదాపుగా ఒకే జన్యువులను పంచుకుని ఒకేలా కనిపించే కవలలు అన్నమాట! సమరూపజీవులకు ఒకే గర్భం సమానంగా స్థలాన్ని పంచినా, జెనెటిక్ నిర్మాణాన్ని మాత్రం వంద శాతం సమానంగా ఒకేలా పంచదని పెన్సిల్వేనియా యూనివర్సిటీ లైవ్ సైన్స్ విభాగం గతంలో వెల్లడించింది. ఏదిఏమైనప్పటికీ.. ఏకరూపకవలల ఫింగర్ ప్రింట్స్ ఒకేలా ఉండవని ఫోరెన్సిక్ సైంటిస్ట్ సిమోనా ఫ్రాన్సిస్ (షిఫీల్డ్ హల్లామ్ యూనివర్సిటీ ) స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ ప్రపంచంలో ఏ ఇద్దరి వేలి ముద్రలు ఒకేలా ఉన్నట్టు నిరూపించబడలేదు. వేళ్ళపై ఉండే రిడ్జ్ ప్యాట్రన్ మార్పుకు కేవలం డీఎస్ఏ మాత్రమే కారణం కాదు. గర్భంలోని భిన్న వాతావరణ కారకాలు కూడా వేలి ముద్రల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా అభివృద్ధి చెందిన గర్భస్థ శిశువుకు 13 నుంచి 19 వారాల వ్యవధిలో వేలి ముద్రలు రూపొందుతాయి. ఈ సమయంలో గర్భం వైశాల్యం, బొడ్డు తాడు పొడవు, తల్లి నుంచి సంక్రమించే పోషకాల స్థాయి.. వేలి ముద్రల నిర్మాణంలో ప్రభావం చూపుతాయి. కవలలు పుట్టిన తర్వాత కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వేలి ముద్రలు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మారే అవకాశం కూడా ఉంది. అంటే.. చర్మ స్వభావం, మచ్చలు, కాలిన గాయాలు, వాడే మందులు వంటి అరుదైన పరిస్థితుల్లో వేలి ముద్రలు మారతాయని ఫ్రాన్సిస్ తెలిపారు. ఏకరూప కవలలు తమ పేరెంట్స్‌ను, ఫ్రెండ్స్‌ను.. ఇతరులను మోసం చేయవచచ్చునేమో కానీ, వేలి ముద్రలు మాత్రం పట్టించేస్తాయి. -
ఈ ‘చేప’ వయసు 12 కోట్ల ఏళ్లు
రాతిపై పెయింట్ చేసిన చేప బొమ్మలాగా ఉంది కదూ ఇది. కానీ, ఇది నిజమైన చేప అచ్చు. సహజంగా ఇలా రాతిలో నిక్షిప్తమైంది. దీని వయసు ఎంతో తెలుసా? దాదాపు 12 కోట్ల ఏళ్లు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. శిలాజంగా మారిన ఆ చేప ఆకృతి ఇలా రాతి పొరల్లో ఉండిపోయింది. సాక్షి, హైదరాబాద్: కోట్ల ఏళ్ల నాటి చేపలు, వృక్షాలు, ఆకులు, జంతువుల పాద ముద్రలతో కూడిన అచ్చులకు సంబంధించిన శిలాజాలు రాష్ట్రంలో లభ్యమయ్యాయి. శిలాజంగా మారిన చేప ఆకృతి రామగుండం ఎన్టీపీసీ పరిధిలో లభించింది. ఈ ప్రాంతంలో శిలాజాలకు కొదవే లేదు. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో రాక్షస బల్లులు కూడా జీవించాయనడానికి సాక్ష్యంగా గతంలో వాటి శిలాజాలు లభ్యమయ్యాయి. బీఎం బిర్లా సైన్స్ సెంటర్లోని డైనోసారియంలో ఉన్న రాక్షసబల్లి ఆకృతి శిలాజాల రూపం ఇక్కడ లభించిందే. ఇప్పటికీ పూర్వపు ఆదిలాబాద్ జిల్లా పరిధిలో రకరకాల శిలాజాలు లభిస్తూనే ఉన్నాయి. తాజాగా కోట్ల ఏళ్ల నాటి చేపలు, వృక్షాలు, ఆకులు, జంతువుల పాద ముద్రలతో కూడిన అచ్చులకు సంబంధించిన శిలాజాలు లభించాయి. చెన్నూరు కోటపల్లి అటవీ ప్రాంతంలో లభించిన ఆకుల ముద్రలున్న శిలాజం ఔత్సాహిక పరిశోధకుడు సముద్రాల సునీల్ తాజాగా వీటిని సేకరించారు. చెన్నూరు కోటపల్లి అటవీ ప్రాంతంలో కొన్ని ఆకుల ఆకృతులతో కూడిన శిలాజాలు లభించాయి. ఇవి ప్రాచీన వృక్షజాతి గ్లోసోప్టెరీస్‌కు చెందినవిగా నిష్ణాతులు అభిప్రాయపడుతున్నట్లుగా వాటిని పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ఈ జాతి చెట్లలో నారవేప, తిరుమణి తదితరాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పత్ర శిలాజాల వయసు 10 కోట్ల ఏళ్లుగా ఉంటుందని అంచనా వేశారు. మంచిర్యాల జైపూర్ ప్రాంతంలో ఒక జంతువు పాద ముద్ర నిక్షిప్తమైన శిలాజాన్ని కూడా గుర్తించారు. -
ఇంటింటా బీఎఫ్‌డీ ప్రక్రియ : డీఎస్ఓ
కాకినాడ సిటీ: రేషన్ లబ్ధిదారుల పది మంది చేతివేలిముద్రలు ఇంటింటికీ వెళ్ళి సేకరించే బెస్ట్‌ఫింగర్ డిటెక్షన్(బీఎఫ్‌డీ) ప్రక్రియను చేపట్టినట్టు పౌర సరఫరాలశాఖ అధికారి జి.ఉమామహేశ్వరరావు బుధవారం తెలిపారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశాల మేరకు ఇంటింటికీ వెళ్లి వేలిముద్రలు సేకరించాలని చౌకడిపో డీలర్లకు ఆదేశాలు జారీ చేశారన్నారు. జిల్లావ్యాప్తంగా 15 లక్షల మంది రేషన్‌కార్డులకు సంబంధించి 40,20,904 మంది లబ్ధిదారుల వేలిముద్రలు సేకరించాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకూ 17,63,671 మంది వేలిముద్రలను సేకరించినట్టు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు ఈ ప్రక్రియను నిర్వహించి తిరిగి ఆగస్టు 10 నుంచి 30 వరకు చేపట్టనున్నట్టు తెలిపారు. కాగా ఆగస్టు నుంచి పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకానికి సంబంధించి బియ్యం చౌక దుకాణాలలోని ఈ పోస్ మెషీన్ల ద్వారా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. జిల్లాలోని 4,309 పాఠశాలలకు సంబంధించి 926 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనున్నామన్నారు. -
చేతివేళ్ల ముద్రలకూ ర్యాం‘కింగ్’
రేషన్‌కార్డుదారుల కుటుంబ సభ్యుల పది వేళ్ల ముద్రల సేకరణ బాగా ముద్ర పడే వేలుకు మొదటి ర్యాంక్ ఆ వేలితోనే బయోమెట్రిక్ ద్వారా సరుకుల పంపిణీ వేలిముద్రల సేకరణలో డీలర్లు బిజీ అమలాపురం టౌన్: చేతివేళ్ల ముద్రలకు ర్యాంకింగ్... ఇదేమిటా? అనే సందేహం కలుగుతోంది కదూ... చేతి వేలిముద్రలు అరిగిపోయి ఒక్కోసారి బయోమెట్రిక్ మిషన్లకు అనుసంధానం కాదు. సమస్య పరిష్కారానికి పౌరసరఫరాల శాఖ రేషన్ కార్డుదారుల కుటుంబంలోని అందరి చేతుల పదివేళ్ల ముద్రలను సేకరిస్తారు. అందులో వేలిముద్ర బాగా ఉన్న వేలును బయో మెట్రిక్కు ఉపయోగించుకుంటారు. ప్రస్తుతం నిత్యావసర వస్తువులను ఇ–పాస్ విధానంతో బయోమెట్రిక్ ఆధారంగా రేషన్ సరుకులు బట్వాడా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పింఛన్లు, రేషన్ బట్వాడా సమయంలో ఎక్కువlమంది లబ్ధిదారుల చేతి వేలిముద్రలు బయో మెట్రిక్ మిషన్లతో సరిపోలక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో రేషన్ పంపిణీకి అంతరాయం ఏర్పడుతోంది. దీంతో బెస్ట్ ఫింగర్ డిటెక్షన్ (బీఎఫ్‌డీ) పేరుతో రేషన్‌కార్డు కలిగిన కుటుంబంలోని ప్రతి ఒక్కరి చేతుల పదివేళ్ల వేలిముద్రలు విడివిడిగా సేకరిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని దాదాపు 2400 రేషన్ డిపోల్లో ప్రస్తుతం బీఎఫ్‌డీ ప్రక్రియ సాగుతోంది. గురువారం నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయాలని కూడా నిరే్ధశించారు. జిల్లాలో దాదాపు 15 లక్షల కుటుంబాలకు చెందిన 54 లక్షల జనాభా ఉన్నారు. అంటే 54 లక్షల మంది నుంచి ప్రతి ఒక్కరి పది వేళ్ల ముద్రలను సంబంధిత డీలర్లు బయోమెట్రిక్ మిషన్ ద్వారా సేకరించాల్సి ఉంది. అక్కడికక్కడే బెస్ట్ ఫింగర్‌కు ర్యాంకింగ్ ఈనెల సరుకుల కోసం కార్డుదారులను కుటుంబ సమేతంగా రమ్మని డీలర్లు కోరుతున్నారు. లేదా డీలర్లే బయోమెట్రిక్ మిషన్లతో కార్డుదారుల ఇళ్లకుSవెళ్లి కుటుంబంలోని సభ్యులందరి పది వేళ్ల ముద్రలనూ సేకరిస్తున్నారు. పది వేళ్లలో ఏ వేలిముద్రలు బాగా ఉన్నాయో... దాని తర్వాత ఏ వేలి ముద్ర బాగుందో... ఇలా వేళ్ల వారీగా పది వేళ్లకు ర్యాంకులు నిర్ధారిస్తూ ప్రింటింగ్ పత్రాని అందిస్తోంది. మిషన్ బెస్ట్ ఫింగర్ డిటెక్షన్ చేసిన వేలును ఇకనుంచి బయో మెట్రిక్కు ఉపయోగించేలా ఆధార్ కార్డు నంబరుతో అనుసంధానం చేస్తారు. ఇక నుంచి డీలరు బీఎఫ్‌డీ ప్రకారం కార్డుదారుడు వచ్చినప్పుడు ఈ వేలునే బయోమెట్రిక్‌కు ఉపయోగించడం ద్వారా వేలిముద్రల సమస్యకు సరికొత్త పరిష్కారాన్ని కనుగొంటున్నారు. ఒక్కో వేలుకు ఒక్కో నిమిషం డీలర్లకు పదివేళ్ల ముద్రల సేకరణ ఓ ప్రసవంగా మారింది. ఇ–పాస్ సర్వర్ సరిగా పనిచేస్తే ఒక్కో వేలుకు కనీసం నిమిషం సమయం పడుతుంది. అంటే పదివేళ్లకు పది నిమిషాలు పడుతోంది. ఇక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికీ పదేళ్లకూ వేలిముద్రల సేకరణ అంటే ఎంత సమయం పడుతుందో అంచనా వేయవచ్చు. ఒక్కో చౌక డిపో పదిధిలో 2,000 నుంచి 2,500 వరకూ కార్డులు ఉంటాయి. ఇప్పటి వరకూ జిల్లాలో ప్రతి డిపో పరిధిలో 600 నుంచి 1000 వరకూ కార్డులు మాత్రమే మాత్రమే పూర్తయ్యాయి. గడువు మరో నెల రోజులు పెంచితేనే బీఎఫ్‌డీ పూర్తవుతుందని డీలర్లు అంటున్నారు. -
చీర కొంటున్నారా?
ఏ చీర కట్టుకున్నా బాగుంటుంది అని సరిపెట్టుకోవడం కాదు. ఏ చీరలో బాగుంటాం, శరీరాకృతికి, మేని రంగుకు ఎలాంటివి నప్పుతాయి అనేది తెలుసుంటే ఎంపిక పర్ఫెక్ట్ అని కితాబులు కొట్టేస్తారు. లావుగా ఉన్నవారు బాగా గంజిపెట్టినట్టున్న కాటన్ చీరలు కట్టుకుంటే మరింత లావుగా కనిపిస్తారు వయసు పైబడిన వారు పెద్ద పెద్ద ప్రింట్లు ఉన్న చీరలను ఎంచుకోకపోవడమే మంచిది ఎత్తు తక్కువ ఉన్నవారు పెద్ద పెద్ద ప్రింట్లు ఉన్న చీరలు కట్టుకుంటే మరింత పొట్టిగా కనిపిస్తారు పొడవుగా ఉన్నవారు పెద్ద అంచున్న చీర కట్టుకుంటే బాగుంటారు లావుగా ఉన్నవారు ముదురు రంగుల చీరలు ధరిస్తే చూడటానికి స్లిమ్‌గానూ, అందంగానూ కనిపిస్తారు.