సీజన్ బతుకులు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : తన రాష్ట్రం వదిలి పొట్టచేత పట్టుకుని మరొక రాష్ట్రంలోకి వచ్చిన ఆ వ్యక్తి సీజన్ (కాలాని)కి తగ్గట్టు వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఉత్తర ప్రదేశ్‌లోని మెన్‌పురి జిల్లా అలీపుర్‌ఖెడా గ్రామానికి చెందిన రామ్‌బహుదూర్ 16 ఏళ్ల క్రితం అనంతపురం వచ్చాడు. వేసవిలో ఐస్‌క్రీమ్, శీతాకాలంలో మొక్కజొన్న కంకులు, పాప్‌కార్న్ హాట్ హాట్‌గా విక్రయిస్తున్నాడు.
ఇక్కడ తనతోపాటు తన కుమారుడు, కోడలుతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. తన వద్ద ముగ్గురు వర్కర్లు ఉన్నారని, వారికి కూడా తోపుడు బండ్లు ఇచ్చి ఇదేవ్యాపారం చేయిస్తున్నాడు. ప్రతిరోజూ 300–400 రూపాయల వ్యాపారం జరుగుతోంది. అందులో పెట్టుబడి పోను మిగతాది కుటుంబ పోషణకు సరిపోతోందని రామ్‌బహుదూర్ తెలిపాడు. ప్రతి ఏడాదీ దీపావళి, హోళీ పండుగలకు మాత్రమే స్వగ్రామానికి వెళ్లి వస్తామని చెప్పాడు.