లూజ్ సేల్స్‌పై వర్తింపు..
సెకండ్ హ్యాండ్ కార్ల జీఎస్‌టీపైనా స్పష్టత
న్యూఢిల్లీ: థియేటర్లలో లూజుగా విక్రయించే పాప్‌కార్న్‌పై జీఎస్‌టీ అనేది రెస్టారెంట్ల తరహాలో 5 శాతంగానే ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, సినిమా టికెట్‌తో పాటు కలిపి విక్రయిస్తే మాత్రం నిబంధనల ప్రకారం ఆ కాంబో ప్యాకేజీకి వర్తించే రేటు అమలవుతుందని పేర్కొన్నాయి. జీఎస్‌టీ కౌన్సిల్ 55వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వ వర్గాలు ఈ మేరకు వివరణనిచ్చాయి.
మరోవైపు, సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయానికి సంబంధించిన జీఎస్‌టీపైనా స్పష్టతనిచ్చాయి. విక్రయ విలువ కన్నా తరుగుదల విలువ ఎక్కువ ఉంటే మార్జిన్లపై 18 శాతం జీఎస్‌టీ వర్తించదని, అదే తక్కువగా ఉంటే వర్తిస్తుందని పేర్కొన్నాయి. మధ్యవర్తిత్వ సంస్థలు విక్రయించే పాత వాహనాల విషయంలో మార్జిన్లపై సింగిల్ జీఎస్‌టీ రేటు 18 శాతం వర్తింపచేయాలని జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడంపై అస్పష్టత నెలకొన్న నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment