second hand cars
-
వెహికిల్‌పై కేసుల వివరాలు క్షణాల్లో..
సెంకడ్హ్యాండ్లో వెహికిల్ కొనుగోలు చేస్తున్నారా..? తీరా వెహికిల్ తీసుకున్నాకా ఇంటికి పోలీసులు వచ్చి ‘మీ వాహనంపై క్రిమినల్ కేసు నమోదైంది. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం’ అని అంటే షాకింగ్‌గా ఉంటుంది కదా. అందుకే ముందే జాగ్రత్త పడండి. మీరు కొనాలనుకునే వాహనంపై ఏవైనా కేసులున్నాయో లేదో తెలుసుకోండి. అందుకోసం మీరు ఎక్కడకూ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే ఈ వివరాలు తెలుసుకునేలా ప్రభుత్వం క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్‌ను(సీసీటీఎన్ఎస్) ఆవిష్కరించింది. వాహనాలపై ఎలాంటి కేసు లేకపోతే నో అబజెక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ) పొందవచ్చు. చాలా వరకు దొంగతనం జరిగిన వాహనాలను ఏదో రూపంలో కన్సల్టెన్సీల ద్వారా ఇతరులకు అంటగట్టే ముఠాలూ ఉన్నాయి. కాబట్టి అలాంటి వాహనాలను కొనుగోలు చేయడానికి ముందుగానే కేసుల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. అందుకోసం..బ్రౌజర్‌లోకి వెళ్లి digitalpolicecitizenservices.gov.in అని టైప్ చేయాలి.క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్(సీసీటీఎన్ఎస్) సంబంధించిన విండో ఓపెన్ అవుతుంది.సిటిజన్ లాగిన్ పేరుతో డిస్ప్లే అయిన బ్లాక్‌లో వివరాలు ఎంటర్ చేయాలి. ముందుగా మొబైల్ నంబర్ ఎంటర్‌చేసి ‘సెండ్ ఓటీపీ’ బటన్‌పై క్లిక్ చేయాలి.మొబైల్‌కు వచ్చిన ఓటీపీను కింద ఎంటర్ చేయాలి. తర్వాత వినియోగదారుడి పేరు, క్యాప్చా కోడ్ ఇవ్వాలి. తర్వాత లాగిన్ బటన్ ప్రెస్ చేయాలి.తర్వాత వేరే విండో ఓపెన్ అవుతుంది. వెహికిల్ టైప్ ఎలాంటిదో సెలక్ట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నంబర్, చాసిస్ నంబర్, ఇంజిన్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేయాలి.ఏదైనా కేసులు ఉంటే వేరే విండోలో వాటికి సంబంధించిన వివరాలు డిస్ప్లే అవుతాయి. కేసులేవీ లేకపోతే ఎన్ఓసీ వస్తుంది.ఇదీ చదవండి: బ్లాకర్లు వాడుతున్నా యాడ్! ఇప్పుడేం చేయాలి..? -
సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా ?
-
Cars24: పదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు..
న్యూఢిల్లీ: ఆదాయాలు, మధ్యతరగతి ప్రజలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా యూజ్డ్ కార్ల మార్కెట్ గణనీయంగా పెరగనుంది. వచ్చే పదేళ్లలో ఇది 100 బిలియన్ డాలర్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు కార్స్24 సహ వ్యవస్థాపకుడు, సీఈవో విక్రమ్ చోప్రా తెలిపారు. తమ అంతర్గత అధ్యయనం ప్రకారం 2023లో 25 బిలియన్ డాలర్లుగా ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ 2034 నాటికి ఏటా 15 శాతం చక్రగతి వృద్ధితో 100 బిలియన్ డాలర్లకు చేరే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల క్రితం కార్స్24 ప్రారంభమైనప్పుడు ఇది 10–15 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండేదని, గత 3–4 ఏళ్లలో వివిధ రకాల కార్ల రాకతో మార్కెట్ వేగం పుంజుకుందని చోప్రా తెలిపారు. పట్టణీకరణ, పెరుగుతున్న మధ్య తరగతి వర్గాల ప్రజలు, వినియోగదారుల్లో మారుతున్న ప్రాధాన్యతలు, అందుబాటు ధరల్లో మొబిలిటీ సొల్యూషన్స్‌కి డిమాండ్ పెరుగుతుండటం మొదలైన అంశాలు వృద్ధికి తోడ్పడగలవని చోప్రా వివరించారు. సొంత కార్లు ఉన్న వారు తక్కువే.. అభివృద్ధి చెందిన ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో సొంత కారు ఉన్న వారి సంఖ్య చాలా తక్కువేనని చోప్రా తెలిపారు. అమెరికా, చైనా, యూరప్ జనాభాలో 80–90 శాతం మందికి కార్లు ఉంటే భారత్‌లో 8 శాతం మందికే సొంత ఫోర్ వీలర్లు ఉన్నాయని పేర్కొన్నారు. కాబట్టి మార్కెట్ పెరిగేందుకు మరింతగా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. యువ జనాభా .. కార్లను కొనుగోలు చేసిన 5–6 ఏళ్లలోనే విక్రయించేసి మరో కొత్త వాహనం వైపు మొగ్గు చూపుతున్నారని చోప్రా తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం కనీసం 10–12 ఏళ్లయినా కార్లను అట్టే పెట్టుకునే వారని వివరించారు. ఎస్‌యూవీలకు డిమాండ్.. గడిచిన నాలుగేళ్లలో వినూత్న ఫీచర్లున్న ఎస్‌యూవీలకు యూజ్డ్ కార్ల మార్కెట్లోనూ డిమాండ్ పెరిగింది. అంతర్గత అధ్యయనం ప్రకారం 2018–23 మధ్య కాలంలో రూ. 8 లక్షలకు పైబడిన విలువ గల కార్ల అమ్మకాలు 14 శాతం పెరిగాయి. ఆదాయాలు, మధ్యతరగతి ప్రజల జనాభా పెరుగుతుండటమనేది మార్కెట్ ముఖచిత్రాన్ని మార్చేస్తోందని చోప్రా తెలిపారు. 2022 ఆర్థిక సంవత్సరంలో ప్రీ–ఓన్డ్ కార్ల అమ్మకాల్లో మెట్రోపాలిటన్ నగరాల వాటా 65 శాతంగా ఉంది. మరోవైపు, పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా వచ్చే అయిదేళ్లలో యూజ్డ్ ఎలక్ట్రిక్ కార్లు కూడా పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చోప్రా చెప్పారు. -
Hyderabad: మార్కట్లో తక్కువ ధరకే కార్లు.. తొందరపడితే మోసపోతారు జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీకి చెందిన సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలకు హైదరాబాద్ అడ్డాగా మారింది. తక్కువ ధరలకు లభిస్తున్నాయనే ఆశతో కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఊరూ పేరూ లేని వాహనాలను కొనుగోలు చేసి ఏజెంట్ల చేతుల్లో దారుణంగా మోసపోతున్నారు. మరోవైపు ఇలాంటి అక్రమ వాహనాలపై కొందరు దళారులు తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి కొందరు ఆర్టీఏ అధికారుల సహకారంతో అధికారికంగా నమోదు చేయిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా అక్రమ వాహనాల అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. తరచూ ఇలాంటి వాహనాలను పోలీసులు గుర్తించి కేసులు నమోదు చేస్తున్నా అక్రమ అమ్మకాలకు అడ్డుకట్ట పడటంలేదు. ఇదో మచ్చుతునక.. కొద్ది రోజుల క్రితం నగరంలోని మలక్‌పేట్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఓ ఏజెంట్ సహాయంతో ఢిల్లీకి చెందిన సెకండ్ హ్యాండ్ ఇన్నోవా కారును కొనుగోలు చేశాడు. ఆరేళ్ల క్రితం షోరూమ్ నుంచి బయటకు వచ్చిన బండి కావడంతో అన్ని విధాలా బాగుందని భావించాడు. పైగా తక్కువ ధరకే లభించడంతో వెనుకడుగు వేయలేదు. కానీ వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో తాను దారుణంగా నష్టపోయినట్లు గుర్తించాడు. సదరు వాహనానికి సంబంధించిన నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) నకిలీదని తేలింది. నగరంలో లభించే సెకండ్ హ్యాండ్ వాహనాల కంటే ఢిల్లీకి చెందిన వాహనాలు తక్కువ ధరకే లభిస్తుండటంతో చాలామంది ఎలాంటి పత్రాలు పరీక్షించుకోకుండానే కొనుగోలు చేసి మోసపోతున్నారు. ఎన్ఓసీ ఎంతో కీలకం.. ► ఎలాంటి వాహనమైనా సరే ఒకరి నుంచి మరొకరికి యాజమాన్య బదిలీ అయ్యే సమయంలో నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఎంతో కీలకం. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ అయినా, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ అయినా తప్పనిసరిగా ఎన్ఓసీ ఉండాల్సిందే. ఉదాహరణకు ఢిల్లీకి చెందిన వాహనాన్ని హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కొనుగోలు చేసినప్పుడు వాహనం మొదటి యజమానికి పేరిట నమోదైన రిజి్రస్టేషన్ పత్రాలను అక్కడి ఆర్టీఏ అధికారులకు సమరి్పంచి ఎన్ఓసీ పొందాలి. దాని ఆధారంగా హైదరాబాద్‌లో ఆర్టీఏ అధికారులు తిరిగి నమోదు చేస్తారు. చట్టబద్ధంగా ఒకరి నుంచి మరొకరు కొనుగోలు చేసినట్లు నిరూపించుకోవాలి. కానీ.. ఢిల్లీ, హరియాణా నుంచి తరలిస్తున్న వాహనాలకు ఇలాంటి కీలకమైన డాక్యుమెంట్లు లేకపోవడం గమనార్హం. ► గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రతి రోజు సుమారు 3వేలకు పైగా వాహనాలు కొత్తగా నమోదవుతాయి. వాటిలో 600 నుంచి 800 వరకు ఇతర రాష్ట్రాలకు చెందిన సెకండ్ హ్యాండ్ వాహనాలే. ఢిల్లీ, హరియాణాలతో పాటు చెన్నై, బెంగళూరు, ముంబై తదితర నగరాల నుంచి కూడా సెకండ్ హ్యాండ్ వాహనాలు నగరంలో నమోదువుతున్నాయి. వీటిలో 70 శాతం వరకు ఢిల్లీకి చెందిన కార్లే ఉన్నట్లు అంచనా. వీటిపైన ఎక్కువ ఆదాయం లభిస్తూండడంతో ఏజెంట్లు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగి అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నారు. -
కార్ల అమ్మకాల్లో కార్స్24 దూకుడు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఎన్బీఎఫ్సీ విభాగం ఆకర్షణీయ ఫలితాలు సాధించనున్నట్లు సెకండ్‌హ్యాండ్(ప్రీఓన్డ్) వాహనాల ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ కార్స్24 అంచనా వేస్తోంది. వినియోగించిన కార్లకు కనిపిస్తున్న భారీ డిమాండు నేపథ్యంలో 80–100 శాతం వృద్ధిని సాధించే వీలున్నట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఎంవో గజేంద్ర జంగిడ్ పేర్కొన్నారు. గతేడాది(2021–22) నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ) విభాగం రూ. 75 కోట్ల టర్నోవర్ సాధించింది. ఇందుకు ప్రీఓన్డ్ కార్ల ఫైనాన్సింగ్ బిజినెస్ దోహదం చేసింది. 2019లో కంపెనీ ఎన్బీఎఫ్సీ లైసెన్సును పొందింది. తద్వారా కన్జూమర్లకు రుణాలివ్వడం ప్రారంభించినట్లు గజేంద్ర తెలియజేశారు. కంపెనీ ద్వారా విక్రయమవుతున్న ప్రతీ 2 కార్లలో ఒకదానికి ఫైనాన్స్ అందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం దేశీయంగా ప్రీఓన్డ్ కార్ల విభాగంలో ఫైనాన్సింగ్ అవకాశాలు అతిస్వల్పమని వివరించారు. దీంతో ఎన్బీఎఫ్సీ లైసెన్సును తీసుకున్నట్లు వెల్లడించారు. -
జోరుగా సెకండ్ హ్యాండ్ బైక్‌లు, కార్ల అమ్మకాలు.. కారణాలు ఇవే!
కర్నూలు(సెంట్రల్): అవసరాలకు అనుగుణంగా ప్రజలు సెకండ్ హ్యాండ్ కార్లు, బైక్‌ల కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో గతేడాది సెకండ్ హ్యాండ్ షోరూముల్లో దాదాపు 5 వేల కార్లు, 10 వేల బైక్‌ల వరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో బీఎస్ 6 వాహనాలు వచ్చాయి. ఏ కంపెనీ బైక్ తీసుకున్నా దాదాపు రూ.లక్షకు అటు ఇటుగా ధరలు ఉన్నాయి. ఈఎంఐల రూపంలో తీసుకుంటే వడ్డీ, ఇతర చార్జీలు కలుపుకొని రెండేళ్ల వ్యవధిలో రూ. 1.40 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఈ క్రమంలో సగం ధరకే సెకండ్ హ్యాండ్ బైక్‌లు లభిస్తుండడంతో చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, రైతులు, కూలీలు, చిన్నచిన్న పనులు చేసుకొని బతికేవారు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సెకండ్స్లో రూ.50 వేల నుంచి రూ. 70 వేల మధ్య రెండు, మూడేళ్ల సర్వీసు ఉన్న బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. విలాసవంతమైన జీవితం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల జీవన విధానంలో భారీ మార్పులు వచ్చాయి. ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడంతో అన్ని వర్గాల ప్రజల జీవన గమనంలో వృద్ధి కనిపిస్తోంది. ఇదే క్రమంలో సకాలంలో వర్షాలు కురుస్తుండడంతో మంచి పంటలు పండుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటికి గిట్టుబాటు ధరలు ఇస్తుండడంతో రైతన్నల ఇంటా ఆనందం వెల్లివిరుస్తోంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు విలాసవంతమైన జీవనం వైపు అడుగులు వేస్తున్నారు. అందులో అవసరాలకు తగ్గట్లుగా కార్లు, బైక్‌లు, ఇతర వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. వెలుస్తున్న షోరూంలు.. సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలుపై ప్రజలు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తుండడంతో వ్యాపారులు అందుకు తగ్గట్లుగా షోరూంలను తెరుస్తున్నారు. కర్నూలులో 15 కారు, 20 బైక్ షోరూంలు ఉన్నాయి. ఆదోనిలో 5 కారు, 10 బైక్, నంద్యాలలో 5 కారు, 13 బైక్ షోరూంలు వెలిశాయి. వీటిని ఆయా పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంత ప్రజలు ఆదరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సెకండ్ హ్యాండ్ షోరూముల్లో గతేడాది 5 వేల వరకు కార్లు, 10 వేల వరకు బైక్‌లు అమ్మకాలు జరిగాయి. ఈఎంఐ సదుపాయం సెకండ్ హ్యాండ్ కార్లు, బైక్‌లకు కూడా కొన్ని ఫైనాన్స్ కంపెనీలు లోన్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. తక్కువ వడ్డీ, తక్కువ డౌన్పేమెంట్స్తో ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ వసతి కూడా ఉంది. కొనుగోలు సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే మొదటికే మోసం వస్తుంది. కొనుగోలు చేసే వాహనాన్ని మొదట మెకానిక్కు చూపించి, దాని పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే రేటును నిర్ణయించుకోవాలి. తక్కువ దూరం తిరిగినవి మేలైన మన్నిక ఇస్తాయి. షోరూంలకు చిన్నపాటి మరమ్మతులకు గురైనవి అధికంగా వస్తుంటాయి. కొందరు అచ్చుబాటుకాక, మరికొందరు తక్షణ రుణావసరాల కోసం అమ్మి ఉంటారు. రికార్డులను పరిశీలించి, కొనుగోలు చేయడం ఉత్తమం. కార్లపై పెరిగిన ఆసక్తి... మార్కెట్లో పలు కంపెనీల కార్లు వివిధ మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంది. సెకండ్స్లో రూ.లక్ష నుంచి సరసమైన ధరకు కార్లు లభిస్తున్నాయి. నాలుగైదు లక్షలు వెచ్చిస్తే మంచి కంపెనీ..రెండు, మూడేళ్ల సర్వీసు ఉన్న కార్లను కొనుగోలు చేయవచ్చు. దీంతో సామాన్యులు సైతం కార్ల కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తున్నారు. సెకండ్స్లో కార్లు కొనుగోలు చేస్తున్న వారిలో ఉద్యోగులు, రైతులు, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వారు ఎక్కువగా ఉంటున్నారు. కార్లు ఎక్కువగా కొంటున్నారు కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో మా షోరూం ఉంది. ఇటీవల కాలంలో ప్రజలు ఎక్కువగా కార్లను కొనుగోలు చేస్తున్నారు. మా దగ్గర అన్ని రికార్డులు సక్రమంగా ఉంటాయి. కొనుగోలుదారులకు భవిష్యత్‌లో ఏమీ ఇబ్బందులు ఉండవు. నెలలో కనీసం 10 కార్ల అమ్మకాలు జరుగుతున్నాయి. – శ్రీనివాసులు సౌకర్యవంతంగా ఉంది మేం ఇటీవల సెకండ్ హ్యాండ్లో కారును కొనుగోలు చేశాం. దాని స్థితిగతి చాలా బాగుంది. మేము కొనుగోలు చేసిన వాహనం కొత్తదైతే రూ.10 లక్షల విలువ ఉంటుంది. సెకండ్స్లో దానిని రూ.4 లక్షలకే కొనుగోలు చేశాం. మా కుటుంబ అవసరాలకు చాలా సౌకర్యవంతంగా ఉంది. – రజనీకాంత్‌రెడ్డి, కర్నూలు సగం ధరకే కొనుగోలు చేశా నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. స్కూలుకు సమయానికి వెళ్లేందుకు కారును కొనుగోలు చేయాలని నిర్ణయించాను. అయితే మార్కెట్లో ఫస్టు హ్యాండ్ వాహనాలకు రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయనిపించింది. సెకండ్స్లో చూస్తే మేము అనుకున్న ధరకే లభించింది. దాదాపు సగం ధరకే కారును కొనుగోలు చేశా. – శ్రీనివాసరెడ్డి, కర్నూలు -
ఢిల్లీ సెకెండ్ హ్యాండ్ వాహనాలకు హైదరాబాద్‌లో ఫుల్ డిమాండ్.. ఎందుకంత మోజు?
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన వెంకటేశ్ కొద్ది రోజుల క్రితం ఓ ఏజెంట్ సహాయంతో ఢిల్లీకి చెందిన సెకెండ్ హ్యాండ్ ఇన్నోవా కారును కొనుగోలు చేశాడు. ఆరేళ్ల క్రితం షోరూమ్ నుంచి బయటకు వచ్చిన బండి కావడంతో అన్ని విధాలుగా బాగుందని భావించాడు. పైగా తక్కువ ధరకే లభించడంతో వెనుకడుగు వేయకుండా బండెక్కేశాడు. కానీ వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో తాను దారుణంగా నష్టపోయినట్లు గుర్తించాడు. సదరు వాహనానికి సంబంధించిన నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) నకిలీదని తేలింది. రూ.15 లక్షల వాహనం కేవలం రూ.10 లక్షలకే లభించిందని మొదట ఎగిరి గంతేశాడు. చదవండి: ట్రాన్స్‌కో ఏఈ పాడుపని.. నీతోనే పెళ్లంటూ యువతికి మత్తు మందు ఇచ్చి.. కానీ ఏజెంట్ చేతిలో తాను మోసపోయినట్లు గుర్తించి లబోదిబోమన్నాడు. ...ఒక్క వెంకటేశ్ మాత్రమే కాదు. ఇటీవల కాలంలో తక్కువ ధరలకు లభిస్తున్నాయనే ఆశతో ఢిల్లీకి చెందిన వాహనాలను కొనుగోలు చేసే నగరవాసులు సరైన ఆధారాలు లభించక నష్టపోతున్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నగరంలో లభించే సెకెండ్ హ్యాండ్ వాహనాల కంటే ఢిల్లీ నుంచి కొనుగోలు చేసే వాహనాలు కొంత మేరకు తక్కువ ధరకే లభిస్తున్నప్పటికీ సరైన డాక్యుమెంట్లు లేకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రతి రోజు సుమారు 3000లకు పైగా వాహనాలు కొత్తగా నమోదవుతాయి. వాటిలో 600 నుంచి 800 వరకు ఇతర రాష్ట్రాలకు చెందిన సెకండ్ హ్యాండ్ వాహనాలు..ప్రత్యేకించి కార్లు ఎక్కువగా ఉంటాయి. చెన్నై, బెంగళూరు, ముంబయి తదితర నగరాల నుంచి కూడా సెకెండ్ హ్యాండ్ వాహనాలు నగరంలో నమోదవుతున్నాయి. కానీ 70 శాతం వరకు ఢిల్లీకి చెందిన కార్లే ఎక్కువగా ఉన్నట్లు అంచనా. నగరంలో 15 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాల కాలపరిమితిని ప్రతి సంవత్సరం పొడిగించుకొనే అవకాశం ఉంది. కానీ ఢిల్లీలో నమోదైన వాహనాలు కేవలం 10 ఏళ్ల కాలపరిమితికే పరిమితం. దీంతో ఢిల్లీ వాసులు తమ వాహనాల కాలపరిమితి ఆరేడుళ్లు దాటితే వాటిని సెకండ్ హ్యాండ్ వాహనాలుగా విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇలా విక్రయించే వాటి ధరలు కూడా కొంత మేరకు తక్కువగా ఉండడంతో నగరంలో డిమాండ్ ఏర్పడింది. దీన్ని సొమ్ము చేసుకొనేందుకు ఏజెంట్లు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగి వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఈ వాహనాలపైన సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసి వినియోగదారులకు కట్టబెడుతున్నారు. ‘వాహన్’లో నమోదు తప్పనిసరి... ‘సెకెండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలుపైన జాగ్రత్తగా ఉండాలి. వినియోగదారులకు చూపించే వాటికి, విక్రయించే వాటికి ఒక్కోసారి సంబంధం ఉండకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ‘వాహన్’లో నమోదైన వాహనాలను మాత్రమే కొనుగోలు చేయాలి.’ అని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ సూచించారు. కొన్ని ముఠాలు వాహనాలను అపహరించి విక్రయిస్తాయి. ఈ క్రమంలో నకిలీ ఆధారాలను సృష్టిస్తారు. ఈ నకిలీల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ‘వాహన్’లో బండి వివరాలు పరిశీలించాలని ఆయన తెలిపారు. వాహనం ఆర్సీ (రిజి్రస్టేషన్), ఢిల్లీ రవాణా అధికారులు జారీ చేసిన నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ), బీమా పత్రాలు, తదితర డాక్యుమెంట్లను సమగ్రంగా పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత కొనుగోలు చేయడం మంచిది. సెకండ్ హ్యాండ్ వాహనాలపైన వాటి వయస్సు, కొనుగోలు చేసిన సమయంలో ఉన్న ధర ఆధారంగా నగరంలో నమోదుకు జీవితకాల పన్ను చెల్లించవలసి ఉంటుంది. -
సెకండ్ హ్యాండ్ కార్లకే మొగ్గు
ముంబై: కొత్త కార్ల కంటే.. అప్పటికే వేరొకరు వాడి విక్రయించే వాటి వైపు (ప్రీఓన్డ్ కార్లు) వినియోగదారులు పెద్ద మొత్తంలో మొగ్గుచూపిస్తున్నారు. కొత్త కారుతో పోలిస్తే సెకండ్ హ్యాండ్ కారు చాలా తక్కువ ధరకు రావడం వినియోగదారులను ఆకర్షిస్తోంది. వినియోగ కార్ల మార్కెట్ ఏటా 19.5 శాతం చొప్పున 2026–27 వరకు వృద్ధిని చూపిస్తుందని డాస్వెల్ట్ ఆటో, ఇండియన్ బ్లూబుక్ సంయుక్తంగా ప్రీఓన్డ్ కార్ల మార్కెట్‌పై ఓ సవివర నివేదికను విడుదల చేశాయి. ఇందులో డాస్ వెల్ట్ ఆటో అన్నది ఫోక్స్‌వ్యాగన్ ప్రీఓన్డ్ కార్ల కంపెనీ కావడం గమనించాలి. దేశంలోని టాప్ 40 పట్టణాల్లో ప్రీఓన్డ్ కార్లకు ఏటా డిమాండ్ 10 శాతం మేర పెరగనుండగా, మిగిలిన పట్టణాల్లో అయితే ఇది ఏటా 30 శాతం మేర వృద్ధి సాధిస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. 2021–22లో ప్రీఓన్డ్ కార్ల మార్కెట్ విలువ 23 బిలియన్ డాలర్లుగా (రూ.1.84 లక్షల కోట్లు) ఉన్నట్టు తెలిపింది. మారిన మార్కెట్ తీరు గతంతో పోలిస్తే సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ తీరు తెన్నుల్లో ఎంతో మార్పు వచ్చింది. ఆయా కార్లను కంపెనీలు సర్టిఫై చేస్తున్నాయి. తక్కువ వ్యవధికే కార్లు, ద్విచక్ర వాహనాలను మార్చే ధోరణి కూడా పెరిగింది. దీంతో ఇంచుమించు కొత్త వాహనాలే అయినా తక్కువ ధరలకు లభిస్తుండడం వినియోగదారులను ఆకర్షిస్తోంది. కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లతో ఆర్జనా శక్తి కలిగిన కస్టమర్లను లక్ష్యం చేసుకుంటున్నాయి. బైబ్యాక్ ఆఫర్లను కూడా ఇస్తున్నాయి. ఇవన్నీ కలసి ప్రీఓన్డ్ కార్ల మార్కెట్‌ను పరుగెత్తిస్తున్నట్టు ఈ నివేదిక అభిప్రాయపడింది. పైగా సంఘటిత రంగంలో ప్రీఓన్డ్ కార్లు, ద్విచక్ర వాహనాల వ్యాపారంలోకి కొత్త సంస్థలు ప్రవేశిస్తుండడం కూడా ఈ మార్కెట్ బలోపేతానికి సహకరిస్తోంది. 35 లక్షల కార్ల విక్రయం.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 35 లక్షల ప్రీఓన్డ్ కార్లు అమ్ముడుపోయాయి. అంతకుముందు సంవత్సరం రికార్డులను అధిగమించింది. ఇక అదే ఏడాది అంతర్జాతీయంగా విక్రయాలు 4 కోట్లుగా ఉన్నట్టు వెల్లడించింది. ‘‘మరిన్ని సంస్థలు ప్రీఓన్డ్ వాహన మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో రోడ్డు పక్కన మెకానిక్ గ్యారేజ్‌లు, బ్రోకర్ల ద్వారా జరిగే సెకండ్ హ్యాండ్ వాహనాల విక్రయ లావాదేవీలు సంఘటిత రంగానికి క్రమంగా మళ్లుతున్నాయి’’అని ఈ నివేదిక తెలిపింది. సంఘటిత రంగం మార్కెట్ వాటా ప్రీఓన్డ్ కార్ల విభాగంలో 2021–22 నాటికి 20 శాతం ఉంటే, 2025–26 నాటికి 45 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. 2026–27 నాటికి ప్రీఓన్డ్ కార్ల విక్రయాలు 80 లక్షలకు చేరుకోవచ్చని తెలిపింది. కరోనా తర్వాత ఈ మార్కెట్ రూపురేఖలే మారిపోయినట్టు పేర్కొంది. 2021–22లో ప్రీఓన్డ్, కొత్త కార్ల రేషియో 1:4గా ఉండగా, ఇది 2026–27 నాటికి 1:9కు చేరుకుంటుందని తెలిపింది. నాన్ మెట్రోల్లో 64 శాతం మంది ప్రీఓన్డ్ కారును తమ మొదటి వాహనంగా చేసుకుంటుంటే, మెట్రోల్లో ఇలాంటి వారు 55 శాతం ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సరఫరా అయిన మొత్తం ప్రీఓన్డ్ కార్లలో 65 శాతం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోనే ఉన్నాయి. -
పార్ట్ టైం పని అని రూ.3 లక్షలు టోపీ
మైసూరు: పార్ట్ టైం పని ఇప్పిస్తామని నమ్మించి యువతి వద్ద సైబర్ మోసగాళ్లు సుమారు రూ. 3.38 లక్షలను కొట్టేశారు. మైసూరు నగరంలోని కెసరెలో ఈ ఘటన జరిగింది. ఎన్. మైత్రి బాధితురాలు. ఆమె మొబైల్ ఫోన్‌కు పార్ట్ టైమ్ పని ఉందని గుర్తు తెలియని వ్యక్తి మొబైల్ నుంచి మెసేజ్ లింక్ వచ్చింది. తరువాత ఆమె వాట్సాప్‌కు మరో మెసేజ్ వచ్చింది. మీకు పార్ట్ టైమ్ పని కోసం కొన్ని వస్తువులను పంపిస్తాము. మీరు ఇంటి వద్ద ఉండే పని చేసుకోవచ్చు, ఇందుకు కొంత రుసుము చెల్లించాలని మోసగాళ్లు చెప్పారు. వారు చెప్పిన నంబర్‌కు మైత్రి రూ.100 పంపింది. తరువాత తన బ్యాంకు ఖాతా, ఇతర వివరాలను ఇచ్చింది. వెంటనే ఆమె ఖాతా నుంచి సుమారు రూ. 3.38 లక్షల నగదు మాయమైంది. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. టెక్కీకి రూ.2.90 లక్షలు మోసం ఐటీ ఇంజనీర్ ఒకరు వెబ్సైట్ ద్వారా సెకెండ్ హ్యాండ్ కారు కొనాలని భారీగా డబ్బు కోల్పోయాడు. ఈ ఘటన మైసూరు నగరంలో చోటు చేసుకుంది. రామకృష్ణ నగరవాసి, టెక్కీ ఎం.మనోజ్ బాధితుడు. ఇతడు కార్‌వాలె అనే వెబ్సైట్లో తక్కువ ధరకు సెకెండ్ హ్యాండ్ కార్ల కోసం వెతికాడు. అందులో ఒక కారు నచ్చడంతో అక్కడ ఉన్న నంబర్లకు కాల్ చేశాడు. వారు కాల్ ఎత్తకుండా, వాట్సాప్ ద్వారా సమాధానం ఇచ్చారు. వారు లింక్‌లో పంపినఒక వెబ్‌సైట్‌ను తెరిచి అన్ని వివరాలను నమోదు చేశాడు. కారును రూ.2.90 లక్షలకు అమ్ముతామని మోసగాళ్లు చెప్పారు, కారును మైసూరుకు తరలించడానికి రూ.3150 చార్జీ కట్టాలన్నారు. వారు చెప్పినట్లు మనోజ్ ఆన్లైన్లో నగదును చెల్లించాడు. తరువాత ఫోన్ చేయగా మోసగాళ్లు స్పందించలేదు. దీంతో టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (చదవండి: ఆమె సౌందర్యమే శాపమైంది) -
స్కోడా కీలక నిర్ణయం..సెకండ్ హ్యండ్ కార్ల కొనుగోలు ఇప్పుడు మరింత సులువు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్కోడా ఆటో ఇండియా ప్రీ–ఓన్డ్ కార్ల వ్యాపారంలో విస్తరిస్తోంది. దేశంలో 100కుపైగా డీలర్‌షిప్స్‌ను ఏర్పాటు చేసినట్టు కంపెనీ బుధవారం ప్రకటించింది. పాత కారు కొనుగోలు, విక్రయం.. లేదా పాత కారును ఇచ్చి కొత్త కారును ఈ కేంద్రాల్లో మార్పిడి చేసుకోవచ్చు. సర్టిఫైడ్ ప్రీ–ఓన్డ్ నెట్వర్క్ ద్వారా ఇప్పటికే 2,500లకుపైగా కార్లను విక్రయించినట్టు స్కోడా వెల్లడించింది. 115 క్వాలిటీ చెక్ పాయింట్స్ ఆధారంగా కారును ధ్రువీకరిస్తున్నట్టు తెలిపింది. చదవండి: ఫిబ్రవరిలో పెరిగిన ఉపాధి కల్పన.. కొత్తగా 14.12 లక్షల మంది -
పేరుకు సెకండ్ హ్యాండ్ కార్లే..! హాట్‌కేకుల్లా అమ్ముడైన బ్రాండ్స్ ఇవే..!
కారు కొనాలనే కోరిక అందరికీ ఉంటుంది. కుటుంబంతో కారులో షికారు చేయాలని ఎంతో మంది కల. బడ్జెట్ రేంజ్ కారు కొనేందుకు చాలా మంది ప్రయత్నాలను చేస్తుంటారు. కొంతమంది లోన్ తీసుకోనైనా కారును సొంతం చేసుకుంటారు. కొత్తమందికీ బడ్జెట్ అడ్జెట్స్ కాకపోవడంతో సెకండ్ హ్యాండ్ కారువైపు మళ్లుతారు. ఇలా పాత కార్లను కొనుగోలు చేసి వారి సొంత వాహన కలను నేరవేర్చుకుంటారు. పాత కార్లను విక్రయించేందుకు ఇప్పటికే పలు కంపెనీలు అవతరించాయి. ఈ కంపెనీలు నమ్మకమైనవిగా నిలుస్తూ ఆయా వాహన కొనుగోలుదారులకు కార్లను అందిస్తున్నాయి. పేరుకు సెకండ్ హ్యాండే..! పేరుకు సెకండ్ హ్యాండే కార్లేఐనా భారత్‌లో మారుతీ, హ్యుందాయ్, హోండా కార్లు అత్యధిక డిమాండ్ ఉన్న కార్ బ్రాండ్స్‌గా ఉన్నాయని కార్ల రిటైలింగ్ ప్లాట్‌ఫాం స్పిన్నీ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే 2021లో సుమారు 57 శాతం పైగా అమ్మకాలు జరిగాయని తెలిపింది. పీ అండ్ ఎస్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం...స్పిన్నీ ఈ ఏడాది అమ్మకాలలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. . అగ్రగామి ఫుల్-స్టాక్ కార్ రిటైల్ ప్లాట్‌ఫారమ్ వాహనాలను ఆస్వాదిస్తున్న నగరాల్లో బెంగళూరు కేవలం కొనుగోలుదారులలో 64 శాతం పెరుగుదలను అందించింది. తర్వాత అహ్మదాబాద్, ఢిల్లీ, హైదరాబాద్ గణనీయమైన అమ్మకాలు జరిగినటుల కంపెనీ పేర్కొంది. స్పిన్ని ప్రస్థానం యూజ్డ్ కారు రిటైలింగ్ ఫ్లాట్‌ఫామ్‌గా మార్కెట్లోకి ఎంటరైన అనతి కాలంలోనే తనదైన ముద్ర వేసింది స్పిన్ని. ఇటీవల ఈ సిరీస్ ఈ ఫండింగ్ రౌండ్లో స్పిన్ని సంస్థలోకి 238 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటి వరకు 530 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించింది స్పిన్ని. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ వ్యాల్యుయేన్ 1.80 బిలియన్ డాలర్లకు చేరుకుంది. చదవండి: భలే స్కూటర్.. మడత పెట్టి బ్యాగులో పెట్టేయోచ్చు! -
పాత కార్లతో వ్యాపారం..! వేల కోట్లను తెచ్చిపెట్టింది..!
Used-Car Platform Spinny Raises $283 Million: భారత్‌లో స్టార్టప్స్ దూకుడు మీదున్నాయి. అతి తక్కువ కాలంలో యూనికార్న్ (ఒక బిలియన్ డాలర్ విలువ గల) స్టార్టప్స్‌గా అవతరిస్తున్నాయి. క్రియోటివ్ ఆలోచనలతో భారత మార్కెట్లను శాసిస్తున్నాయి. సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలను జరిపే బెంగళూరు బేస్డ్ స్టార్టప్ స్పిన్నీ కంపెనీ సరికొత్త విలువకు చేరుకుంది. 283 మిలియన్ డాలర్ల సేకరణ..! అబుదాబికి చెందిన ఏడీక్యూ, టైగర్ గ్లోబల్ నేతృత్వంలోని ఫండింగ్ రౌండ్లో స్పిన్నీ సుమారు 283 మిలియన్ డాలర్లను సేకరించింది. దీంతో కంపెనీ విలువ 1.8 బిలియన్ డాలర్లకు చేరింది. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి , సాంకేతికత, పలు ఉత్పత్తులను అప్‌గ్రేడ్ చేయడానికి తాజా నిధులను ఉపయోగిస్తామని స్పిన్నీ ఒక ప్రకటనలో తెలిపింది. పాత కార్లే వారి బిజినెస్..! 2015లో స్థాపించిన స్పిన్నీ కంపెనీ ఆన్లైన్ పోర్టల్‌లో ఉపయోగించిన కార్లను విక్రయించే అవకాశాన్ని కల్పిస్తోంది. 2,000 కంటే ఎక్కువ సెకండ్ హ్యాండ్ మోడల్స్ కొనుగోలు దారులకు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా టెస్ట్ డ్రైవ్‌ను బుక్ చేసుకోనే వీలును కూడా కల్పిస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ వెబ్సైట్ ప్రకారం 20,000 సెకండ్ హ్యండ్ కార్లను విక్రయించింది. పాత కార్లను సొంతం చేసుకునేవారికోసం ఫైనాన్సింగ్‌ను కూడా స్పిన్నీ అందిస్తోంది. నామమాత్రపు వడ్డీరేట్లతో కొనుగోలుదారులకు రుణాలను ఇస్తోంది. చదవండి: అమ్మేది మాంసం..! సుమారు ఒక బిలియన్ డాలర్లు వారి సొంతం..! -
ఓలా కార్స్.. నడిపి చూడండి .. నచ్చితేనే కొనండి !
ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఓలా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లోకి అడుగు పెట్టాలని నిర్ణయించింది. అందుకోసమని కొత్తగా ఓలా కార్స్‌ను ప్రారంభించింది. ట్రై అండ్ బయ్ సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలు అమ్మకం విభాగంలోకి ఓలా ప్రవేశించింది. ఈ మేరకు ఓలా కార్స్ సంస్థను ప్రారంభించింది. ట్రయ్ అండ్ బయ్ నినాదంతో మార్కెట్లో ఎక్కువ వాటా పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సెకండ్ హ్యాండ కారును నడిపి చూసి సంతృప్తి చెందితేనే కొనండి అంటూ ఓలా కస్టమర్లకు ఆహ్వానం పలుకుతోంది సెకండ్‌కి పెరుగుతున్న డిమాండ్ కరోనా సంక్షోభం తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంటే వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణాలకు డిమాండ్ పెరిగింది. షోరూమ్ ధరకు కార్లను కొనుగోలు చేయలేని వారు, కొత్తగా కార్లు తీసుకోవాలనుకునే వారు సెకండ్ హ్యాండ్ మార్కెట్‌ని ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో సెకండ్‌హ్యాండ్ కార్ల మార్కెట్ విలువ 18 బిలియన్ డాలర్లు ఉండగా 2030 నాటికి 70 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని మార్కెట్ రీసెర్చ్ సంస్థ పీ అండ్ ఎస్ అంచనా వేసింది. దీంతో ఈ రంగంలో పట్టు కోసం ఓలా తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. ఓలాకి సచిన్ దన్ను గత కొంత కాలంగా మార్కెట్లో ఓలా దూకుడు ప్రదర్శిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్ సచిన్ బన్సాల్ ఓలాలో పెట్టుబడులు పెట్టారు. మరోవైపు ఓలా ఫౌండర్ భవీష్ అగర్వాల్ దూకుడు తోవడంలో ఓలా స్టార్టప్ నుంచి బ్రాండ్‌గా ఎదుగుతోంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇటీవల కాలంలో సంచలనమే సృష్టించింది. ఏకంగా ఏడాదికి పది కోట్ల యూనిట్ల స్కూటర్లు తయారు చేసేలా ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. చదవండి : ఐపీఓకి ఓలా,వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా సన్నాహాలు -
మీరు పాత కారు కొనాలనుకుంటున్నారా ?!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాత కార్ల విక్రయంలో ఉన్న మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్ దేశవ్యాప్తంగా శుక్రవారం 75 ఫ్రాంచైజీ కేంద్రాలను ప్రారంభించింది. దీంతో సంస్థ స్టోర్ల సంఖ్య 1,100 దాటింది. ఈ ఔట్లెట్లలో సర్టిఫైడ్ యూజ్డ్ కార్ల అమ్మకం, రుణ సౌకర్యం వంటి సేవలు పొందవచ్చు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ పాత కార్లకు డిమాండ్ భారీగా ఉందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశుతోశ్ పాండే తెలిపారు -
దారుణం: కారు కోసం 3 నెలల కొడుకును అమ్మేసిన తల్లిదండ్రులు
లక్నో: మనుషుల్లో మానవత్వం క్రమంగా సన్నగిల్లుతోంది. డబ్బు కోసం ఏదైనా చేసే స్థాయికి దిగజారుతున్నారు. జీవితంలో డబ్బే ముఖ్యమని భావించే కొందరు చివరికి మానవత్వాన్ని కూడా మరిచిపోతున్నారు. లగ్జరీ జీవితం కోసం ఓ జంట చేసిన పని అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. కారు కొనేందుకు కన్న పేగును అమ్మకానికి పెట్టిన దారణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కన్నౌజ్‌లోని తిర్వా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే దంపతులకు మూడు నెలల కిత్రం పండంటి మగబిడ్డ జన్మించాడు. కొన్నాళ్లు హాయిగా గడిచిన వీళ్ల జీవితంలో ఓ దుర్భుద్ది పుట్టింది. విలాసవంతంగా బతకాలన్న కోరిక కలిగింది. ఇందుకు ఏకంగా కన్న కొడుకునని కూడా చూడకుండా అమ్మేందుకు సిద్దపడ్డారు. సెకండ్ హ్యండ్ కారు కొనేందుకు మూడు నెలల పసికందుకు లక్షన్నర రూపాయలకు ఓ వ్యాపారవేత్తకు అమ్మేశారు. అంతేగాక ఇప్పటికే సెకండ్ హ్యాండ్ కారును సైతం తల్లిదండ్రులు కొనుగోలు చేశారు. అయితే ఈ ఘటనపై శిశువు అమ్మమ్మ, తాతయ్య గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతానికి ఇంకా శిశువు వ్యాపారవేత్త దగ్గరే ఉందని, వాళ్ల తల్లిదండ్రులను పిలిచి విచారణ చేపడతామని ఇన్స్పెక్టర్ శైలేంద్ర కుమార్ మిశ్రా తెలిపారు. చదవండి: మహిళ రెండో పెళ్లి.. ఉమ్మిని నాకాలని కుల పెద్దల శిక్ష తల్లి ప్రాణం తీసిన నలుగురు ఆడపిల్ల జననం -
సెకండ్ హ్యాండ్ కార్లకు కరోనా జోష్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ సెకండ్ హ్యాండ్ కార్ల పరిశ్రమకు కరోనా మహమ్మారి కలిసొచ్చింది. వైరస్ నేపథ్యంలో ప్రజా రవాణా సాధనాలను వినియోగించడం రిస్క్ అనే భావన పెరగడంతో సొంత వాహన కొనుగోళ్ల వైపు జనం మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కారుకు బదులుగా సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోళ్లకే జై కొడుతున్నారు. ఫస్ట్ టైమ్ కార్ కొనుగోలుదారులు యూజ్డ్ కార్లకే ఆసక్తి చూపిస్తుండటంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా యూజ్డ్ లేదా సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. గత రెండు సంవత్సరాలలో యూజ్డ్ కార్లకు, పాత కార్ల మధ్య నిష్పత్తి 1.4 నుంచి 1.6కి పెరిగింది. గతేడాది దేశంలో 37 లక్షల సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయమయ్యాయి. సమీప భవిష్యత్తులో ఈ సంఖ్య 40 లక్షలకు చేరుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్త కార్ల కొనుగోలు ఎంక్వైరీలు 16 శాతం క్షీణిస్తే.. సెకండ్ హ్యాండ్ కార్ల ఎంక్వైరీలు మాత్రం 10 శాతం పెరిగాయని మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శషాంక్ శ్రీవాస్తవ తెలిపారు. డిజైర్, బ్యాలెనో, స్విఫ్ట్ వంటి 7 ఏళ్ల క్రితంనాటి కార్ల ధరలు సగటున రూ.3.3 లక్షలుగా ఉంది. ఏడేళ్లు దాటినవయితే రూ.1.60 లక్షలకు దొరుకుతున్నాయి. (18 ఏళ్లు పైబడిన వారికి టీకా: ఖర్చు ఎంతో తెలుసా?) వ్యవస్థీకృత మార్కెట్ వాటా 20%.. దేశీయ యూజ్డ్ కార్ల మార్కెట్లో ఎక్కువ భాగం వ్యవస్థీకృత రంగంలోనే ఉంది. మారుతీ సుజుకీ ట్రూ వ్యాల్యూ, హోండా ఫస్ట్ చాయిస్, టాటా మోటార్స్ అష్యూర్డ్ వంటి వ్యవస్థీకృత కార్ల కంపెనీలతో పాటు స్పిన్నీ వంటి స్టార్టప్ కంపెనీలు కూడా సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయిస్తున్నాయి. యూజ్డ్ కార్ల పరిశ్రమలో వ్యవస్థీకృత రంగం వాటా 20 శాతం వరకుంటుంది. యూజ్డ్ కార్ల మార్కెట్లో 55 శాతం అమ్మకాలు కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ సేల్స్ ఉంటాయని శ్రీవాస్తవ చెప్పారు. గతేడాది కంటే ప్రస్తుతం యూజ్డ్ కార్ల వ్యవస్థీకృత కంపెనీలు చాలా వరకు అందుబాటులోకి వచ్చాయి. (కరోనా ముప్పు: ఎస్బీఐ సంచలన రిపోర్ట్) యూజ్డ్ కార్లకే ఫస్ట్ టైమ్ బయ్యర్ ఓటు.. ద్విచక్ర వాహనం నుంచి కారు కొనుగోళ్లకు.. ఇందులోనూ తొలిసారి కారు కొనుగోలుదారులు క్రమంగా పెరుగుతున్నారు. యూజ్డ్ కార్ల మార్కెట్లో వేగాన్ని బట్టి గేర్లను నియంత్రించే ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ కార్లకు కూడా డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. సమీప భవిష్యత్తులో ఈ తరహా కార్ల విభాగం రెండంకెల వృద్ధిని సాధిస్తుందని అంచనా వేశారు. గతేడాది ఎనిమిదేళ్లుగా ఉన్న యూజ్డ్ కార్ల సగటు వయసు ప్రస్తుతం తొమ్మిది సంవత్సరాలకు పెరిగిందని చెప్పారు. తొలిసారి కారు కొనుగోలుదారులు సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుకే మక్కువ చూపుతున్నారు. 2018–19 లో మొత్తం యూజ్డ్ కార్ల విక్రయాలలో ఫస్ట్ టైమ్ కారు కొనుగోలుదారులు వాటా 62 %గా ఉండగా.. ప్రస్తుతం ఇది 70%కి పెరిగిందని తెలిపారు. టాప్‌గేర్‌లో ట్రూ వ్యాల్యూ సేల్స్.. మారుతీ సుజుకీ ట్రూ వ్యాల్యూ బ్రాండ్ పేరిట యూజ్డ్ కార్లను విక్రయిస్తుంది. ఏటా 4,20 లక్షల కార్లను విక్రయిస్తుంది కంపెనీ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ట్రూ వ్యాల్యూకి 2.3 మిలియన్ల ఎంక్వైరీలు వచ్చాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఎంక్వైరీలు పెరిగాయి కానీ విక్రయాలు తగ్గాయని శ్రీవాస్తవ తెలిపారు. 2016-17లో 3,46,603 సెకండ్స్ కార్లను విక్రయించగా.. 2017-18లో 3,54,135 యూనిట్లు, 2018-19లో 4,22,892 వాహనాలు, 2019-20లో 4,18,897 కార్లను విక్రయించింది. ట్రూ వ్యాల్యూలో ఫస్ట్ టైం కారు కొనుగోలుదారుల విభా గం 3% మేర వృద్ధిని నమోదు చేసిందని చెప్పారు. మహారాష్ట్ర, గుజరాత్, వెస్ట్ బెంగాల్లో ట్రూ వ్యాల్యూ విక్రయాలు 12 శాతం క్షీణించాయి. ఉత్తరప్రదేశ్‌లో స్థిరంగా ఉన్నాయి. ఓడోమీటర్ల టాంపరింగ్ ఉండదు.. ఆర్గనైజ్ కంపెనీల యూజ్డ్ కార్లలో వాహనం తిరిగిన కిలో మీటర్లను తగ్గించే ఓడోమీటర్ల టాంపరింగ్ వంటి వాటికి అవకాశం ఉండదు. నాణ్యమైన కార్లను విక్రయించడంతో పాటు వారంటీ, మెయింటనెన్స్ రికార్డ్స్, ఇతరత్రా పారదర్శకమైన ఆఫర్లను అందిస్తుండటంతో మార్కెట్లో డిమాండ్ పెరిగిందని రీసెర్చ్ అండ్ అనలిటిక్ట్స్ కంపెనీ ఐహెచ్ మార్కిట్, పవర్‌ట్రెయిన్ అండ్ కంప్లెయిన్స్ ఫోర్కాస్ట్కు నాయకత్వం వహిస్తున్న సూరజ్ ఘోష్ తెలిపారు. ఉదాహరణకు మారుతీ ట్రూ వ్యాల్యూ ఇద్దరు యజమానుల కంటే ఎక్కువ చేతులు మారిన కార్లను విక్రయించదు. ట్రూ వ్యాల్యూ సేల్స్ ఎలా ఉన్నాయంటే? సంవత్సరం విక్రయాల సంఖ్య 2016–17 3,46,603 2017–18 3,54,135 2018–19 4,22,892 2019–20 4,18,897 -
పాత కారు.. టాప్ గేరు!
కరోనా వైరస్ పరిణామాలతో కొత్త కార్ల అమ్మకాలు కొంతకాలంగా దెబ్బతిన్నప్పటికీ యూజ్డ్ కార్ల (సెకండ్ హ్యాండ్) విక్రయాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. తొలిసారిగా సరఫరాకి మించి డిమాండ్ నెలకొనడం గమనార్హం. ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో కొత్త కార్ల అమ్మకాలు 26.14 శాతం క్షీణించగా, యూజ్డ్ కార్ల విక్రయాలు ఏకంగా 22 శాతం పెరిగాయి. కార్ల కంపెనీలు తమ దగ్గర పేరుకుపోయిన నిల్వలను వదిలించుకునేందుకు నానా తంటాలు పడుతుంటే.. యూజ్డ్ కార్ల విక్రయ సంస్థలు .. డిమాండ్‌కి తగ్గ స్థాయిలో వాహనాలను సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టాయి. ప్రీ–ఓన్డ్ కార్లను విక్రయించే శ్రీరామ్ ఆటోమాల్ గతంలో ప్రతి నెలా సుమారు 4,000–5,000 కార్లను విక్రయిస్తుండగా, ప్రస్తుతం ఇది రెట్టింపై 10,000కు చేరింది. కరోనా పూర్వ స్థాయిలతో పోలిస్తే ప్రస్తుతం తమ వెబ్సైట్ ట్రాఫిక్ నాలుగు రెట్లు పెరిగిందని ఆన్లైన్ విక్రయ సంస్థ కార్స్24 వెల్లడించింది. తగ్గిన లభ్యత.. కొత్త కార్ల కొనుగోళ్లు పడిపోయిన నేపథ్యంలో పాత కార్లను ఎక్స్చేంజీ చేసుకునే వారి సంఖ్య కూడా తగ్గింది. ఫలితంగా యూజ్డ్ కార్ల లభ్యత తగ్గిపోయింది. సాధారణంగా కొత్త కార్ల విక్రయాల్లో 26–27 శాతం దాకా ఉండే ఎక్స్చేంజీ విభాగం ఒక దశలో 6–7 శాతానికి పడిపోయింది. కొత్త కారు విలువ మూడు–నాలుగేళ్లలో సుమారు 30–50 శాతం దాకా పడిపోతుంది. చాలా మంది కస్టమర్లు ఇలాంటి వాహనాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. అయితే, ఎక్స్చేంజీ వ్యాపారం తగ్గి .. ఈ కేటగిరీ వాహనాలకు కొరత ఏర్పడింది. దీంతో కస్టమర్లు తప్పనిసరై.. దాదాపు అయిదారేళ్ల నుంచి తొమ్మిదేళ్ల దాకా పాతబడిన కార్ల వైపు చూడటం మొదలుపెట్టాల్సి వచ్చింది. ధరల్లో భారీ వ్యత్యాసం.. కొత్త, పాత కార్ల ధరల మధ్య వ్యత్యాసం భారీగా ఉండటం కూడా కస్టమర్లు ప్రీ–ఓన్డ్ వాహనాల వైపు మళ్లుతుండటానికి ఒక కారణమని పరిశ్రమవర్గాలు తెలిపాయి. బీఎస్–6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలు అమల్లోకి వచ్చాక ఈ వ్యత్యాసం మరింతగా పెరిగిపోయిందని వివరించాయి. సుమారు 50,000–60,000 కి.మీ. ప్రయాణించిన ఓ అయిదేళ్లు పాతబడిన కారు... ప్రస్తుతం కొత్త కారు రేటులో సగానికే దొరుకుతోంది. ఇక ఫైనాన్షియర్స్ కూడా గతంతో పోలిస్తే ప్రస్తుతం యూజ్డ్ కార్లకు కూడా రుణాలు అందించేందుకు మరింతగా ముందుకొస్తున్నారు. మార్కెట్లోని అన్ని వర్గాలకూ ఈ పరిణామాలు సానుకూలంగా ఉంటున్నాయని వివరించారు. పెరిగిన ఎంక్వైరీలు.. దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ యూజ్డ్ కార్ల విభాగానికి గతేడాది గణనీయంగా ఎంక్వైరీలు వచ్చాయి. 2019లో వీటి సంఖ్య 16,53,264గా ఉండగా గతేడాది 17,51,928కి పెరిగింది. కరోనా పరిస్థితుల కారణంగా ప్రజలు క్రమంగా ప్రజా రవాణా సాధనాల నుంచి వ్యక్తిగత వాహనాల వైపు మళ్లుతున్నారని మారుతీ సుజుకీ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. అయితే, ఆదాయాలు, ఉద్యోగాలపై అనిశ్చితి నెలకొనడంతో .. చేతిలో కాస్త డబ్బు ఉంచుకునే ఉద్దేశంతో కొత్త కార్ల కన్నా యూజ్డ్ కార్ల వైపు కొంత ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని వివరించారు. ఎర్న్స్ట్ అండ్ యంగ్ నివేదిక ప్రకారం 57%మంది.. ప్రీ–ఓన్డ్ కార్ల వైపే మొగ్గుతున్నారు. వాటా పెంచుకుంటున్న బడా కంపెనీలు.. అసంఘటితంగా ఉన్న యూజ్డ్ కార్ల విభాగంలో వృద్ధి అవకాశాలు గుర్తించిన పెద్ద కంపెనీలు క్రమంగా ఈ కేటగిరీలో కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఈ మార్కెట్లో సంఘటిత సంస్థల వాటా 2019లో సుమారు 18% ఉండగా.. గతేడాది 25–27%కి పెరగడం ఇందుకు నిదర్శనం. వారంటీలు, సర్టిఫికేషన్ వంటి అదనపు ప్రత్యేకతల కారణంగా పెద్ద కంపెనీల వైపు మళ్లే కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్.. గతేడాది జూలై–డిసెంబర్ మధ్యకాలం అమ్మకాల్లో అంతక్రితం ఏడాది అదే వ్యవధితో పోలిస్తే 20% వృద్ధి సాధించింది. 2021–22లో 25% వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ సీఈవో అశుతోష్ పాండే వెల్లడించారు. మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్.. తన నెట్వర్క్ ద్వారా ప్రతి నెలా సుమారు 14,000 వాహనాలు విక్రయిస్తోంది. కరోనా కష్టకాలంలో కూడా సుమారు 80 స్టోర్స్ తెరిచింది. దీంతో మొత్తం స్టోర్స్ సంఖ్య 1,000కి పైగా చేరింది. అటు ప్రీ–ఓన్డ్ లగ్జరీ కార్ల (పీవోసీ) అమ్మకాలు కూడా జోరందు కుంటున్నాయి. మెర్సిడెస్–బెంజ్ పీవోసీ గత తొమ్మిదేళ్లలో 21,000 కార్లు విక్రయించింది. 20% పైగా వార్షిక వృద్ధి నమోదు చేసింది. -
ఫస్ట్ టైమ్ కారు కొంటున్నారా? ఇటో లుక్కేయండి..!
సొంత ఇల్లు, కారు ఉండాలన్నది చాలా మంది కల. అయితే కారు కొనేటప్పుడు మనం చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ట్యాక్స్ విషయాలు, పేమెంట్ విధానం, ఏ మోడల్ కొనాలి, కొంత మంది విషయంలో అయితే సెంటిమెంట్లు.. ఇలా చాలా విషయాలను పరిశీలించాలి. మొదటిసారి కారుకొంటున్న వారు ముఖ్యంగా 10 విషయాల గురించి తెలుసుకుంటే మంచిది. 1. బడ్జెట్‌ను చూసుకోండి కొంత మంది విషయాల్లో తప్ప చాలా వరకు కారు కొనుక్కునే వారు మొత్తం డబ్బు ఒకేసారి చెల్లించి కాకుండా ఈఎంఐలో కారు కొంటారు. అయితే మీరు కారు తీసుకునేటప్పుడు మీ బడ్జెట్ ఎంత ఉంది, నెలవారీ మీ అవసరాలు పోను ఎంత మిగులుతుంది. ఎక్కువ భారం పడకుండా ఎంత వరకు ఈఎంఐ కట్టగలరో చూసుకొని కారును ఎంపిక చేసుకోవాలి. 2. ఎంత దూరం ప్రయాణించాలనుకుంటున్నారు కారు కొనే అవసరం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంతమంది ఫ్యామిలీతో సరదగా బయటకు వెళ్లడానికి కారు కొంటే కొంత మంది ఆఫీస్ అవసరాల కోసం కొంటారు. మరి కొంతమంది లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడానికి కారును ప్రిఫర్ చేస్తారు. దీనిలో మీరు దేనికోసం కారు కావాలనుకుంటున్నారో సరిగా ఆలోచించుకొని దాని ప్రకారం మీ కారును సెలక్ట్ చేసుకోండి. 3.రీసెర్చ్ చేయండి: కారు కొనడానికి బడ్జెట్ ఎంత ఈఎంఐ ఎంత ఇలా అని ప్లాన్ చేసుకున్న తరువాత మార్కెట్లో మీ బడ్జెట్‌కు ఏ ఏ కార్లు అందుబాటులో ఉన్నాయో పరిశోధించండి. మీకు తెలిసిన వారిని కనుక్కోవడమే కాకుండా కొంత టైం వెచ్చించి గూగుల్‌లో మీరు కొనాలనుకుంటున్న కారు ఫీచర్స్, డ్రాబ్యాక్స్, రివ్యూ, వేరువేరు డీలర్ల గురించి చెక్ చేయండి. 4. ఏవిధంగా కొనాలో నిర్ణయించుకోండి కారు కొనడానికి కావాల్సినంత డబ్బు మీరు సమకూర్చుకోలేకపోతే మీరు లోన్ కోసం బ్యాంక్‌ల మీద కానీ, క్రెడిట్ కార్డు ఎజెన్సీల మీద కానీ ఆధారపడాల్సి వస్తుంది. దీని కోసం బ్యాంకులు వాటి వడ్డీ రేట్లను, క్రెడిట్ కార్డు ఎజెన్సీలను పరిశీలించి లోన్ తీసుకోండి. 5. మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోండి: క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటే బ్యాంకులు మీకు రుణం ఇవ్వడానికి ఆసక్తిని చూపిస్తాయి. మీకు కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కాబట్టి లోన్ తీసుకునే ముందు మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోండి 6. పాత కారును ఎంచుకోవడానికి ప్రయత్నించండి మీరు మొదటి సారి కారు కొంటున్నట్లయితే పాత కారును ఎంచుకోవడానికి ప్రయత్నించండి. మార్కెట్లో ఐదేళ్ల నుంచి మూడేళ్ల ఓల్డ్ కారులు కూడా ఉంటాయి. మొదట వాటిని కొనండి. వీటిని కొనేటప్పుడు మీకు ఎక్కువ మార్జిన్ కూడా లభిస్తుంది. 7. టెస్ట్ డ్రైవ్‌కు వెళ్లండి మీ బడ్జెట్లో ఉన్న కారును నిర్ణయించుకున్న తరువాత ఒకటికి రెండుసార్లు టెస్ట్ డ్రైవ్‌కు వెళ్లండి. ఎందుకంటే మీకు ఆ కారు ఎంతవరకు సౌకర్యంగా ఉంది. ఎంత వరకు మీ అవసరాలకు సరిపోతుంది అనే విషయం అవగాహనకు వస్తుంది. 8. బేరం ఆడండి ఏ కారు కొనాలో నిర్ణయించుకున్న తరువాత దాని కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పూర్తిగా చదివి టర్మ్స్ అండ్ కండీషన్స్ తెలుసుకొండి. వారంటీ ఎంత కాలం ఉంది అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించండి. అనంతరం డీలర్‌తో మీరు ఎంతకు కొనాలనుకుంటున్నారో బేరం ఆడండి, దీని వలన మీకు ఇంకొంచెం తక్కువ రేటుకు కారు లభిస్తుంది. 9. కారును పరీక్షించండి మీరు సెకెండ్ హ్యాండ్ కారు బంధువుల నుంచి కానీ, మిత్రుల నుంచి కానీ లేదా డీలర్ల నుంచి కొనాలనుకుంటే దానిని కార్ల గురించి బాగా తెలిసిన వారి చేత టెస్ట్ చేయించండి. చాలా మెకానిక్ షోరూంలు ప్రీ ఇన్స్ఫెక్షన్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాయి. కాబట్టి అలాంటి వాటి దగ్గర మీరు కొనే కారును పరీక్షించండి. దాని ద్వారా కారు అసలైన పరిస్థితి మీకు అర్థం అవుతుంది. మీ డబ్బులకు సరైన విలువ దొరుకుతుంది. 10. రైడ్‌కు వెళ్లి ఎంజాయ్ చేయండి ఇక కారు కొనేటప్పుడు ఈ విషయాలన్ని చూసుకున్నతరువాత మీకు ఇష్టమైన కారును కొనుక్కొని మీ కోరిక నెరవేరిందనే సంతోషంలో ఒక డ్రైవ్‌కి వెళ్లి వచ్చేయండి. బడ్జెట్ ప్లానింగ్, రీసెర్చ్ అనేవి కారు కొనేటప్పుడు మీరు కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. -
సెకండ్ హ్యాండ్... భలే డిమాండ్!
సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్ విజృంభణ... దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు... ఎక్కడిక్కడ స్తంభించిపోయిన ప్రజారవాణా... వెరసి ఎవరికి వారు వ్యక్తిగత వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటి వరకు రోజు వారీ ప్రయాణాలకు బస్సులు, లోకల్ రైళ్లు, మెట్రో, షేర్ క్యాబ్స్, కార్ పూలింగ్లను వినియోగించినవారు సైతం ఇప్పుడు సొంత వాహనాలు వాడుతున్నారు. ఇప్పటికే వాహనాలు ఉన్న వారు వాటిని వాడుతుండగా... లేని వారు ఖరీదు చేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కొత్తవి కొనుక్కోవడం ఆర్థికంగా ఇబ్బందుల్ని తెచ్చిపెడుతోంది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా సెకండ్ హ్యాండ్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించిన కార్స్ 24 సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలోని మెట్రో నగరాల్లో 100 మంది డీలర్లు, పది వేల మంది కస్టమర్ల అభిప్రాయాలను సేకరించి ఈ విషయం నిర్థారించింది. లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో ఎత్తివేసినా.. ఇప్పుడప్పుడే ప్రజా రవాణాను వినియోగించడానికి అత్యధికులు సిద్ధంగా లేరు. ఫలితంగా లాక్డౌన్ ముందు కంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ వాహనాల డిమాండ్ భారీగా పెరిగినట్టు ఆ సంస్థ గుర్తించింది. లాక్‌డౌన్‌కు ముందు సెకండ్ హ్యాండ్ వాహనాల మార్కెట్ 19 శాతం ఉండగా... లాక్డౌన్ తర్వాత అది 37 శాతానికి పెరిగింది. అలాగే కొత్త వాహనాల మార్కెట్ 81 శాతం నుంచి 63 శాతానికి పడిపోయింది. దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే బెంగళూరులో ఈ డిమాండ్ అధికంగా ఉంది. ఈ ఏడాది మార్చికి ముందు, ఆ తర్వాత గణాంకాల ప్రకారం ఆ నగరంలో సెకండ్ హ్యాండ్ వాహనాల మార్కెట్ 81 శాతం పెరిగింది. ఈ తర్వాతి స్థానంలో ఢిల్లీ (35 శాతం పెరుగుదల) ఉండగా... 10 శాతం పెరుగుదలతో హైదరాబాద్ నగరంలో మూడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలోని పుణేలో ఈ డిమాండ్ 5 శాతం పెరిగింది. సెకండ్ హ్యాండ్ వాహనాల్లోనూ ద్విచక్ర వాహనాల కంటే కార్లు వంటి తేలికపాటి వాహనాలు ఖరీదు చేయడానికి అత్యధికులు మొగ్గు చూపుతున్నారు. రహదారిపై ప్రయాణిస్తున్నప్పుడు బైక్స్ కంటే కార్లు సురక్షితం కావడంతో ఇలా చేస్తున్నారు. మరోపక్క రోడ్లపై ప్రయాణించే సందర్భాల్లో వివిధ రకాలుగా కరోనా వైరస్ బారినపడకుండా ఉండటానికీ కార్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. సెకండ్ హ్యాండ్ కార్లను ఖరీదు చేసే వారిలో 45 శాతం మంది రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ధర ఉన్న వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారని కార్స్ 24 గుర్తించింది. ప్రధానంగా మారుతి స్విఫ్ట్, వ్యాగనార్, వోక్స్వ్యాగన్ పోలో, హుండై ఐ10, ఐ 20 బ్రాండ్లే ఎక్కువగా ఖరీదు చేస్తున్నారు. ఇన్నాళ్లు కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ తదితర కారణాలతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు మొగ్గు చూపినవారు కూడా ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్లు ఖరీదు చేస్తున్నారు. కేవలం సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే షోరూమ్స్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. కొన్ని ప్రముఖ వెబ్సైట్లు వివిధ రకాలైన ఆఫర్లతో వినియోగదారుల్ని ఆకర్షిస్తున్నాయి. వాహన విక్రేత, ఖరీదు చేసే వ్యక్తుల మధ్య కాంటాక్ట్ లెస్ సర్వీసులు, డోర్‌స్టెప్ టెస్ట్ డ్రైవ్‌లు, ఆన్లైన్ డాక్యుమెంటేషన్, డిజిటల్ చెల్లింపులు, ఉచిత ఓనర్ షిప్ ట్రాన్స్ఫర్, కారు కండిషన్ పరీక్షలు, తక్కువ వడ్డీకి తేలికగా ఫైనాన్స్ సర్వీసులు అందిస్తూ వినియోగదారుల్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వివిధ మెట్రో నగరాలకు చెందిన అనేక మంది సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఓఎల్ఎక్స్ వంటి ఈ–యాడ్స్ వెబ్సైట్లును ఆశ్రయిస్తున్నారు. ఉత్తరాదికి చెందిన సైబర్ నేరగాళ్లు దీన్ని తమకు అనువుగా మార్చుకుంటున్నారు. ప్రీ ఓన్డ్, యూజ్డ్ కార్లుగా పిలిచే సెకండ్ హ్యాండ్ వాహనాలను తక్కువ ధరకు విక్రయిస్తామంటూ ఆర్మీ అధికారుల మాదిరిగా ఓఎల్ఎక్స్లో ప్రకటనలు గుప్పిస్తున్నారు. వీటికి ఆకర్షితులై ఎవరైనా సంప్రదిస్తే... బేరసారాల తర్వాత అడ్వాన్సులు, ట్రాన్స్పోర్ట్ చార్జీల పేరుతో అందినకాడికి తమ ఖాతాల్లో జమ చేయించుకుని మోసం చేస్తున్నారు. ఈ సైబర్ నేరగాళ్లు కార్లు విక్రయిస్తామంటూ ఓఎల్ఎక్స్లో పోస్టు చేసిన వారినీ టార్గెట్ చేసుకుంటున్నారు. వారిని సంప్రదిస్తూ ఆయా వాహనాలను ఖరీదు చేస్తామంటూ ఎర వేస్తున్నారు. ఆపై నగదు చెలిస్తున్నామనే పేరుతో వివిధ పేమెంట్ యాప్స్‌కు చెందిన క్యూఆర్ కోడ్స్ పంపించి స్కానింగ్ చేయిస్తున్నారు. ఈ రకంగానూ టార్గెట్ చేసిన వ్యక్తుల ఖాతాల్లోంచి డబ్బు కాజేస్తున్నారు. ఈ తరహాకు చెందిన ఫిర్యాదులు నెలకు 100కు పైగా సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లకు వస్తున్నాయి. -
బండ్లకే ఫుట్‌పాత్!
అమీర్‌పేట: సెకండ్‌హ్యాండ్ సేల్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపార సముదాయాలుగా మార్చేస్తున్నారు. దీనికి తోడు ప్రైవేట్ సంస్థల వాహనాలనూ రోడ్లపైనే నిలుపుతుండడంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులను ఆదేశించినా ఫలితం లేకుండా పోతోందని స్థానికులు వాపోతున్నారు. కార్ల సెకండ్ సేల్స్‌కు బల్కంపేట, అమీర్‌పేట, సంజీవరెడ్డినగర్ ప్రాంతాలు కేంద్రాలుగా మారాయి. చాలామంది ఇక్కడి పరిసర ప్రాంతాల్లో వ్యాపారాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.అయితే వాహనాలు పార్కింగ్ చేసేందుకు వీలున్న చోట వ్యాపారాలు చేయాల్సి ఉండగా.. చాలామంది నివాస గృహాలను అద్దెకు తీసుకొని బిజినెస్ నడిపిస్తున్నారు. విక్రయానికి వచ్చే కార్లను రోజుల తరబడి ఫుట్‌పాత్‌లపై నిలిపి ఉంచుతున్నారు. ఫలితంగా నిత్యం రద్దీగా ఉండే బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వెనకా, 60 ఫీట్ రోడ్డు, బీకేగూడ, ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంతాల్లో తరుచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఎస్ఆర్నగర్ కమ్యూనిటీ హాలు నుంచి బీకేగూడ మున్సిపల్ వార్డు కార్యాలయం వరకు ఫుట్‌పాత్‌లు పూర్తిగా కనుమరుగయ్యాయి. దీనిపై బల్దియా అధికారులు, ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
జోరుగా సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు
-
లగ్జరీ కార్ల అమ్మకాల జోరు!
దేశంలో లగ్జరీ కార్ల మార్కెట్ జోరుగా ఉంది. కార్ల కంపెనీల మధ్య పోటీ పెరగడం, సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ విస్తరిస్తుండటంతో లగ్జరీ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2013-2014)లో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 6 శాతం తగ్గాయి. అదే సమయంలో లగ్జరీ కార్ల అమ్మకాలు 25 శాతం పెరిగి, 35 వేల యూనిట్లకు పెరిగాయి. అదే సమయంలో సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్ల మార్కెట్ 60 శాతం పెరిగి 30 వేల యూనిట్లకు చేరింది. సాధారణంగా ప్రతి రెండు మూడేళ్లలో లగ్జరీ కార్లను వాటి యజమానులు మార్చేస్తున్నారు. ఈ కారణంగా యూజ్డ్ కార్ల మార్కెట్ విస్తృతి పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో మెర్సిడెజ్-బెంజ్ యూజ్డ్ కార్ల అమ్మకాలు 42 శాతం పెరిగాయి. గడిచిన కొన్ని సంవత్సరాలుగా యూజ్డ్ లగ్జరీ కార్ల మార్కెట్ సగటున 25 శాతం చొప్పున వృద్ధి చెందుతూ వస్తోంది. బిఎండబ్లూ 3 సిరీస్ కారు కొత్తది 34 లక్షల రూపాయలు కాగా, సెకండ్ హ్యాండ్ ధర 22 లక్షల రూపాయలుగా ఉంది. కారు వయసు పెరిగే కొద్దీ ధర మరింతగా తగ్గుతుంది. ప్రస్తుతం మన దేశంలో బెంజ్, బిఎండబ్లూ, ఆడి కార్లు ప్రధానంగా లగ్జరీ కారు బ్రాండ్లుగా ఉన్నాయి. వీటికి పోటీగా టయోటా లెక్సస్, నిస్సాన్ ఇన్ఫినిటీ, జనరల్ మోటార్స్ క్యాడిల్లాక్ కంపెనీలు కూడా ఇండియన్ మార్కెట్ మీద దృష్టి పెట్టాయి. మార్కెట్ విస్తృతి పెరిగే కొద్దీ కొత్త కంపెనీలు రంగంలోకి రావడం సహజం. ఈ పోటీని తట్టుకునేందుకు ఇప్పటికే ఉన్న కంపెనీలు తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్స్ ఉండే లగ్జరీ కార్లను రంగంలోకి దించుతున్నాయి. మొత్తం మీద కుబేరులు, కోట్ల రూపాయల వేతనాలందుకునే ఎగ్జిక్యూటివ్‌లతోపాటు ఓ మాదిరి ధనవంతులు కూడా ఇప్పుడు లగ్జరీ కార్లు కొనుగోలు చేసే అవకాశం ఏర్పడుతోంది. **