
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఎన్‌బీఎఫ్‌సీ విభాగం ఆకర్షణీయ ఫలితాలు సాధించనున్నట్లు సెకండ్‌హ్యాండ్(ప్రీఓన్‌డ్) వాహనాల ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ కార్స్24 అంచనా వేస్తోంది. వినియోగించిన కార్లకు కనిపిస్తున్న భారీ డిమాండు నేపథ్యంలో 80–100 శాతం వృద్ధిని సాధించే వీలున్నట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఎంవో గజేంద్ర జంగిడ్ పేర్కొన్నారు.
గతేడాది(2021–22) నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ) విభాగం రూ. 75 కోట్ల టర్నోవర్ సాధించింది. ఇందుకు ప్రీఓన్‌డ్ కార్ల ఫైనాన్సింగ్ బిజినెస్ దోహదం చేసింది. 2019లో కంపెనీ ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్సును పొందింది. తద్వారా కన్జూమర్లకు రుణాలివ్వడం ప్రారంభించినట్లు గజేంద్ర తెలియజేశారు.
కంపెనీ ద్వారా విక్రయమవుతున్న ప్రతీ 2 కార్లలో ఒకదానికి ఫైనాన్స్ అందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం దేశీయంగా ప్రీఓన్‌డ్ కార్ల విభాగంలో ఫైనాన్సింగ్ అవకాశాలు అతిస్వల్పమని వివరించారు. దీంతో ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్సును తీసుకున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment