NBFC
-
లైసెన్స్‌లు వెనక్కి ఇచ్చేసిన ఎన్బీఎఫ్సీలు
రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, ఐడీఎఫ్సీ లిమిటెడ్ తమ ఎన్బీఎఫ్సీ లైసెన్స్‌లను వెనక్కిచ్చేశాయి. ఇలా మొత్తం 20 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (సీవోఆర్)లను స్వాధీనం చేసినట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఇందులో మనోవే ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎన్బీఎఫ్సీ వ్యాపారం నుంచి తప్పుకున్నాయి.ఐడీఎఫ్సీ లిమిటెడ్, ఐడీఎఫ్సీ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ లిమిటెడ్ తదితర 16 సంస్థలు విలీనాల కారణంగా సీవోఆర్ను స్వాధీనం చేశాయి. వీటికి అదనంగా ఆర్బీఐ తనంతటగా 17 ఎన్‌బీఎఫ్‌సీల సీవోఆర్లను రద్దు చేసింది. వీటి రిజిస్టర్డ్ కార్యాలయం పశ్చిమబెంగాల్లో ఉన్నట్టు ఆర్బీఐ తెలిపింది. మరోవైపు కామధేను ఫైనాన్స్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్ లైసెన్స్‌ను పునరుద్ధరించినట్టు ప్రకటించింది.ఎన్బీఎఫ్సీ అంటే.. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) అనేది కంపెనీల చట్టం, 1956 కింద నమోదైన ఒక కంపెనీ. ఇది రుణాలు ఇవ్వడం, ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలు జారీ చేసిన షేర్లు, స్టాక్‌లు, బాండ్లు, డిబెంచర్లు, సెక్యూరిటీలను కొనుగోలు చేయడం, బీమా వ్యాపారం, చిట్ వ్యాపారం వంటి కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటుంది. ఎన్బీఎఫ్సీలు, బ్యాంకులకు తేడాఎన్బీఎఫ్సీలు రుణాలు ఇస్తాయి. పెట్టుబడులు పెడతాయి. కాబట్టి వాటి కార్యకలాపాలు బ్యాంకుల కార్యకలాపాలను పోలి ఉంటాయి. అయితే వీటి మధ్య ప్రధానంగా కొన్ని తేడాలు ఉన్నాయి. ఎన్బీఎఫ్సీ డిమాండ్ డిపాజిట్లను అంగీకరించదు. ఎన్బీఎఫ్సీలు చెల్లింపు, సెటిల్మెంట్ వ్యవస్థలో భాగం కావు. తమపైనే చెక్కులను జారీ చేయలేవు. బ్యాంకుల మాదిరిగా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ డిపాజిట్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఎన్‌బీఎఫ్‌సీల డిపాజిటర్లకు అందుబాటులో లేదు. -
బంగారం వేలం నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
న్యూఢిల్లీ: బంగారం వేలం విషయంలో బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బంగారం తనఖాపై రుణం తీసుకున్న వారు సకాలంలో చెల్లించకపోతే, బ్యాంక్‌లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) ఆ బంగారాన్ని వేలంలో విక్రయించి రుణ బకాయిలతో సర్దుబాటు చేసుకుంటుంటాయి. ఇందుకు నిర్దేశిత ప్రక్రియలు, నిబంధనలను బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు అనుసరించాల్సి ఉంటుంది. ఈ విషయమై లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నకు ఆర్థిక మంత్రి బదులిచ్చారు. ఎన్బీఎఫ్సీలు, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌లకు ఈ విషయంలో నిబంధనలు ఒకే విధంగా ఉన్నట్టు చెప్పారు. రుణ చెల్లింపులు సరిగ్గా లేవంటూ ఖాతాదారులకు బ్యాంక్‌లు తగినన్ని సార్లు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయినప్పటికీ రుణ గ్రహీత చెల్లింపులకు ముందుకు రాకపోతే అప్పుడు బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ బంగారం వేలానికి వెళ్లాల్సి ఉంటుందని వివరించారు. నిబంధనలను బ్యాంక్‌లు ఉల్లంఘించినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బంగారానికి డిమాండ్: దేశంలో బంగారానికి డిమాండ్ తగ్గలేదని, పెరుగుతూ వెళుతోందని కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ ప్రశ్నకు సమాధానంగా మంత్రి సీతారామన్ బదులిచ్చారు. ‘‘దేశంలో వ్యక్తులు, చిన్న వర్తకులు సురక్షితమైన, లిక్విడ్ సాధనమన్న ఉద్దేశ్యంతో బంగారంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు’’అని వివరించారు. -
'ఏఏ' వ్యాపారానికి ఫోన్‌పే గుడ్‌బై.. లైసెన్స్ వెనక్కి..
ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే (PhonePe) అకౌంట్ అగ్రిగేషన్ (ఏఏ) వ్యాపారం నుంచి వైదొలిగినట్టు ప్రకటించింది. ఈ సేవలు అందించేందుకు సరిపడా భాగస్వాములను పొందలేకపోయినట్టు తెలిపింది. ఎన్బీఎఫ్సీ–ఏఏ లైసెన్స్‌ను (license) ఆర్బీఐకి (RBI) స్వాధీనం చేయాలని నిర్ణయించినట్టు, అకౌంట్ అగ్రిగేషన్ కార్యకలాపాలను మూసివేసే చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది.తన యూజర్ల ఆమోదం మేరకు వారి ఆర్థిక సమాచారాన్ని బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లతో పంచుకోవడం ద్వారా రుణాలు, క్రెడిట్ కార్డులు తదితర సేవలు అందించేందుకు ఈ లైసెన్స్ కింద అనుమతి ఉంటుంది. 2023 జూన్‌లో ఫోన్‌పేకు ఎన్బీఎఫ్సీ–ఏఏ లైసెన్స్ రావడం గమనార్హం. ‘‘రెండేళ్లలోపే మా ఏఏ ప్లాట్‌ఫామ్‌పై 5 కోట్ల మంది భారతీయులను చేర్చుకోవడం గర్వకారణంగా ఉంది. పోటీ ప్రాధాన్యతల దృష్ట్యా ఎక్కువ మంది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్లను మా ప్లాట్‌ఫామ్ వైపు ఆకర్షించలేకపోయాం. దీంతో ఫోన్‌పే గ్రూప్ అకౌంట్ అగ్రిగేషన్ వ్యాపారం నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. దీనికి బదులు మార్కెట్లో ఉన్న ఇతర ఏఏలతో జట్టు కడతాం’’అని ఫోన్‌పే ప్రకటించింది. తమ ఏఏ యూజర్లకు త్వరలోనే ఈ విషయాన్ని తెలియజేస్తామని తెలిపింది. -
గరిష్ట వడ్డీరేట్లను బహిర్గతం చేయాలని ఆదేశాలు
రుణాలపై విధించే వడ్డీరేట్లలో పారదర్శకతను పెంపొందించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్యలు తీసుకుంటోంది. విభిన్న రుణాలపై వసూలు చేసే గరిష్ట వడ్డీ రేట్లను బహిర్గతం చేయాలని బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలను (NBFC) ఆదేశించింది. ఇందులో భాగంగా వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, బీమా, ఇతర ఛార్జీలను స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది.ఆర్బీఐ ఆదేశాల్లోని కీలక అంశాలుతనఖా, వాహనం, ఆస్తి, బంగారం, విద్యా రుణాలు వంటి వివిధ రుణ కేటగిరీలకు కాంపోజిట్ సీలింగ్ రేట్ల(గరిష్ట వడ్డీరేట్లు)ను ఎన్బీఎప్సీలు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ గరిష్ట రేట్లను సంబంధిత డైరెక్టర్ల బోర్డులు ఆమోదించాలి. ఆర్థిక సంస్థల కార్యకలాపాలు ఆర్బీఐ ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్‌కు అనుగుణంగా ఉండాలి. ఇది వివిధ కేటగిరీల రుణగ్రహీతలకు వేర్వేరు రేట్లను వసూలు చేసే విధానాలపై స్పష్టతను ఇస్తుంది. రుణ రేట్లపై ఆర్బీఐ పరిమితులు విధించనప్పటికీ, బోర్డు ఆమోదం లేకుండా ఎన్బీఎఫ్సీలు వెల్లడించిన గరిష్ట రేట్లను మించరాదు.ఇదీ చదవండి: కోటక్ బ్యాంకు అలెర్ట్.. ‘డెబిట్ కార్డులు పని చేయవు’పెరుగుతున్న గృహ రుణభారం, రుణగ్రహీతలకు వారి రుణాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంది. దీనిపై కొంత ఆందోళనలు వస్తున్న నేపథ్యంలో దానికి ప్రతిస్పందనగా ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది. ఆర్బీఐ నేరుగా రుణ రేట్లను నియంత్రించనప్పటికీ ఎన్బీఎఫ్సీలు తమ రుణ ధరల్లో పారదర్శకతను కొనసాగించడానికి ఈ ఆదేశాలు ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది సంస్థలపై కొంత ఆర్థిక ఒత్తిడిని కలిగించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ఇక లోన్లు ఇవ్వొద్దు.. 4 కంపెనీలపై ఆర్బీఐ బ్యాన్
నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠిన చర్యలు తీసుకుంది. రుణాల మంజూరు, పంపిణీని నిలిపివేయాలని ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్, ఆరోహణ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, డీఎంఐ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నవీ ఫిన్సర్వ్ లిమిటెడ్‌లకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది . అక్టోబరు 21న వ్యాపార కార్యకలాపాలు ముగిసిన అనంతరం నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని పేర్కొంది.ఈ కంపెనీల వెయిటెడ్ యావరేజ్ లెండింగ్ రేట్ (WALR), వాటి నిధుల వ్యయంపై విధించే వడ్డీ స్ప్రెడ్ పరంగా ఈ కంపెనీల ప్రైసింగ్ పాలసీలో గమనించిన మెటీరియల్ సూపర్వైజరీ లోపాల ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇవి ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: ఏటీఎంలో చిరిగిన నోట్లు వస్తే.. ఆర్బీఐ రూల్స్ తెలుసా?అయితే ఆయా కంపెనీలు తమ కస్టమర్లకు ఇతర సేవలను, రుణాల వసూలు, రికవరీ కార్యకలాపాలను యథావిధిగా నిర్వహించుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్థిక రంగంలో స్థిరత్వం కోసం, సంస్థలన్నీ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూసేందుకు ఆర్బీఐ అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలపై చర్యలు చేపడుతూ వస్తోంది. -
ముందస్తు విత్‌డ్రాకు ఆర్బీఐ నిబంధనలు
ముంబై: ఎన్బీఎఫ్సీల్లో డిపాజిట్ చేసిన మూణ్నెల్ల వ్యవధిలోనే డిపాజిటర్లు అత్యవసర పరిస్థితుల కోసం మొత్తం డబ్బును వెనక్కి తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రిమెచ్యూర్ విత్డ్రాయల్స్పై వడ్డీ లభించదని పేర్కొంది. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) నిబంధనలను సమీక్షించిన సందర్భంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. వైద్యం, ప్రకృతి వైపరీత్యాలతో పాటు ప్రభుత్వం ప్రకటించే విపత్తులను అత్యవసర పరిస్థితులుగా పరిగణిస్తారు. మరోవైపు, డిపాజిట్లు స్వీకరించే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీ) పాటించాల్సిన లిక్విడ్ అసెట్స్ పరిమాణాన్ని అవి ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లలో 13 శాతం నుంచి 15 శాతానికి ఆర్బీఐ పెంచింది. అలాగే, పబ్లిక్ డిపాజిట్లకు అన్ని వేళలా పూర్తి కవరేజీ ఉండేలా చూసుకోవాలని, ఏడాదికి ఒకసారైనా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల నుంచి ’ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్’ రేటింగ్ పొందాలని హెచ్ఎఫ్సీలకు సూచించింది. పబ్లిక్ డిపాజిట్లను 12 నెలల నుంచి 60 నెలల్లోపు తిరిగి చెల్లించేయాల్సి ఉంటుంది. -
ఆర్బీఐ కఠిన చర్యలు.. నాలుగు కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఓ ప్రైవేటు బ్యాంక్‌పై కఠిన చర్యలు తీసుకుంది. నాలుగు ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను రద్దు చేసింది. అలాగే ఓ ప్రైవేటు బ్యాంకుకు రూ.1కోటి జరిమానా విధించింది. ఆర్బీఐ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన కంపెనీలలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుండల్స్ మోటార్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడుకు చెందిన నిత్య ఫైనాన్స్ లిమిటెడ్, పంజాబ్ ఆధారిత భాటియా హైర్ పర్చేజ్ ప్రైవేట్ లిమిటెడ్, హిమాచల్ ప్రదేశ్ ఆధారిత జీవన్‌జ్యోతి డిపాజిట్స్ అండ్ అడ్వాన్సెస్ లిమిటెడ్ ఉన్నాయి. ఆర్బీఐ చట్టంలో నిర్వచించిన విధంగా ఈ కంపెనీలు ఇప్పుడు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వ్యాపార లావాదేవీలను నిర్వహించలేవు. ఇక 'రుణాలు, అడ్వాన్సులు - చట్టబద్ధమైన ఇతర పరిమితులు'పై ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించనందుకు గానూ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు రూ.1కోటి పెనాల్టీ విధించింది. తమ ఆదేశాలు, చట్టబద్ధమైన నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఈ బ్యాంకుకు ఇదివరకే షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆర్బీఐ పేర్కొంది. -
టాటా సన్స్ మెగా ఐపీవో!
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా సన్స్ పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు ఈక్విటీ మార్కెట్ రీసెర్చ్ సంస్థ స్పార్క్ క్యాపిటల్ పేర్కొంది. టాటా గ్రూప్ ఎన్బీఎఫ్సీ హోల్డింగ్ కంపెనీ విలువను రూ. 7.8 లక్షల కోట్లుగా మదింపు చేసింది. గ్రూప్ కంపెనీల ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం విలువ మదింపు చేయగా.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రానున్న 18 నెలల్లో టాటా సన్స్ ఐపీవో చేపట్టనున్నట్లు తెలియజేసింది. అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా ఆర్బీఐ గతేడాది గుర్తింపునిచి్చన నేపథ్యంలో 2025 సెపె్టంబర్‌కల్లా తప్పనిసరిగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ కావలసి ఉన్నట్లు స్పార్క్ పేర్కొంది. ఇందుకు ఏడాదిన్నర కాలంలో పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసి ఉంటుందని తెలియజేసింది. దీంతో సంక్లిష్టంగా ఉన్న గ్రూప్ హోల్డింగ్ నిర్మాణం సరళతరమయ్యేందుకు వీలుంటుందని అభిప్రాయపడింది. కాగా.. ఇటీవల వెలువడిన సమాచారం ప్రకారం కంపెనీ రూ. 11 లక్షల కోట్ల విలువను అందుకోగలదని వెల్లడించింది. వెరసి ఐపీవో పరిమాణం రూ. 55,000 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేసింది. టాటా సన్స్ హోల్డింగ్స్‌లో 80 శాతం మోనిటైజబుల్ కానప్పటికీ పునర్వ్యవస్థీకరణ కారణంగా కంపెనీ రీరేటింగ్ను సాధించే వీలున్నట్లు పేర్కొంది. విలువ జోడింపు అన్‌లిస్టెడ్ పెట్టుబడులతో పలు మార్గాల ద్వారా టాటా సన్స్‌కు అదనపు విలువ జమకానున్నట్లు స్పార్క్ క్యాపిటల్ తెలియజేసింది. ఇటీవల సెమీకండక్టర్స్ తదితర ఆధునికతరం విభాగాలలోకి టాటా గ్రూప్ ప్రవేశించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. టాటా ఎలక్ట్రానిక్స్.. చిప్ తయారీ ప్రణాళికలు ప్రకటించిన విషయం విదితమే. టాటా టెక్నాలజీస్, టాటా మెటాలిక్స్, ర్యాలీస్ తదితర అనుబంధ సంస్థలను పేర్కొంది. ఫలితంగా టాటా గ్రూప్ మరో రూ. 1–1.5 లక్షల కోట్ల విలువను జోడించుకోనున్నట్లు అంచనా వేసింది. లిస్టెడ్, అన్ లిస్టెడ్ కంపెనీలు, ప్రిఫరెన్స్ షేర్లు, ఫండ్స్‌లో పెట్టుబడులను పరిగణించి విలువను మదింపు చేసింది. టీసీఎస్ బలిమి టాటా సన్స్ విలువలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ అతిపెద్ద వాటాను ఆక్రమిస్తోంది. టీసీఎస్ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం టాటా సన్స్ వాటా విలువ రూ. 10 లక్షల కోట్ల వరకూ ఉంటుంది. అన్‌లిస్టెడ్ కంపెనీలు, పెట్టుబడులుకాకుండా గ్రూప్‌లోని ఇతర లిస్టెడ్ దిగ్గజాలు టాటా మోటార్స్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్‌లో యాజమాన్య వాటాలు కలిగి ఉంది. టాటా కెమికల్స్‌లో అత్యధిక స్థాయి(కంపెనీ విలువలో 80 శాతం)లో యాజమాన్య హక్కులను కలిగి ఉంది. కాగా.. టాటా సన్స్‌లో దొరాబ్జీ టాటా ట్రస్ట్ 28 శాతం, రతన్ టాటా ట్రస్ట్ 24 శాతం, సైరస్ మిస్త్రీ కుటుంబ పెట్టుబడి సంస్థ(స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్) 9 శాతం, ఇతర ప్రమోటర్లు 14 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. -
బ్యాంక్ లైసెన్స్‌లు కోరుకోవడం అసాధారణం
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) ఒకవైపు నియంత్రణపరమైన ప్రయోజనాలను అనుభవిస్తూనే మరోవైపు బ్యాంకింగ్ లైసెన్స్ కోరుకోవడం అనుచితమని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఎన్బీఎఫ్సీలపై సీఐఐ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వడ్డీ రేట్లపై నియంత్రణ సంస్థ (ఆర్బీఐ) ఇచి్చన స్వేచ్ఛను కొన్ని సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐలు) దురి్వనియోగం చేస్తున్నాయని, అధిక రేట్లను వసూలు చేస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. పీర్ టు పీర్ (పీటుపీ) రుణ ప్లాట్‌ఫామ్‌లు లైసెన్స్ మార్గదర్శకాల పరిధిలో లేని వ్యాపార విధానాలను అనుసరిస్తుండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి ఉల్లంఘనలను ఆమోదించేది లేదని హెచ్చరించారు. ఎన్బీఎఫ్సీలు బ్యాంక్‌లుగా మారే విషయంలో వస్తున్న డిమాండ్‌పై రాజేశ్వరరావు మాట్లాడారు. టాప్ టైర్ ఎన్‌బీఎఫ్‌సీలకు సైతం నియంత్రణ విధానాలు యూనివర్సల్ బ్యాంకుల మాదిరిగా లేవని స్పష్టం చేస్తూ, ఎన్బీఎఫ్సీలు కొన్ని ప్రయోజనాలను అనుభవిస్తున్నట్టు చెప్పారు. ‘‘ఎన్బీఎఫ్సీలు కీలక సంస్థలుగా మారి ప్రత్యేకమైన ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కనుక అవి బ్యాంక్‌గా మారాలని అనుకోవడం సముచితం కాదు’’అని రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న బజాజ్ ఫిన్సర్వ్ చైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ ఎన్బీఎఫ్సీలు బ్యాంక్ లైసెన్స్‌లు ఎందుకు కోరుకోరాదంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా రాజేశ్వరరావు మాట్లాడడం గమనార్హం. బ్యాంక్‌గా ఎందుకు మారకూడదు? ఆర్బీఐ పటిష్ట నియంత్రణల మధ్య ఎన్బీఎఫ్సీలు పెద్ద సంస్థలుగా, బలంగా మారినట్టు సంజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని ఎన్బీఎఫ్సీలు బ్యాంక్ లైసెన్స్ గురించి ఎందుకు ఆలోచించకూడదు?. ముఖ్యంగా ఈ ఎన్బీఎఫ్సీలు పదేళ్లకు పైగా సేవలు అందిస్తూ, నిబంధనలను సరిగ్గా అమలు చేస్తూ, తమను తాము నిరూపించుకున్నాయి’’అని సంజీవ్ బజాజ్ అన్నారు. దీనికి రాజేశ్వరావు స్పందిస్తూ.. ‘‘యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్‌లను ఆన్‌టాప్ విధానం కిందకు కొన్నేళ్ల క్రితం ఆర్బీఐ మార్చింది. కానీ, ఏ ఒక్క సంస్థ కూడా బ్యాంక్‌గా పనిచేసేందుకు ఆమోదం పొందలేదు’’అని చెప్పారు. ప్రవేశించడం, తప్పుకోవడానికి సంబంధించి ఎలాంటి అవరోధాలు ఎన్‌బీఎఫ్‌సీలకు లేవని, యూనివర్సల్ బ్యాంక్ ఏర్పాటుకు రూ.1,000 కోట్ల అవసరం ఉంటే, ఎన్బీఎఫ్సీ ఏర్పాటుకు ఇది రూ.10 కోట్లుగానే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్బీఎఫ్సీలు తమ నిధుల అవసరాల కోసం బ్యాంక్‌లపై ఎక్కువగా ఆధారపడకుండా ఇతర మార్కెట్ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవాలని రాజేశ్వరరావు సూచించారు. -
అంబానీ చేతుల్లోకి పేటీఎం వాలెట్? నిజమెంత..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షలు విధించినప్పటి నుంచి పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ తరుణంలో కంపెనీ తమ వాలెట్ బిజినెస్ ముకేశ్ అంబానీకి చెందిన NBFCతో పాటు HDFC బ్యాంకుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తీవ్ర సంక్షోభంలో ఉన్న కంపెనీ తమ వ్యాపారాన్ని ముకేశ్ అంబానీకి చెందిన కంపెనీకి విక్రయిస్తుందనే పుకార్లు వెల్లువెత్తడంతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 14 శాతం పెరిగి 288.75 రూపాయల గరిష్ఠానికి చేరుకున్నాయి. పేటీఎం వాలెట్ బిజినెస్ కొనుగోలు చేయడానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జియో ఫైనాన్షియల్‌లు ముందున్నాయని, కంపెనీ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ బృందం ఈ విషయాన్నే.. గత నవంబర్ నుంచి జియో ఫైనాన్షియల్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. RBI నిషేధానికి ముందే ఈ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మొత్తం మీద పేటీఎం వాలెట్ బిజినెస్ కొనుగోలు చేయడానికి జియో కూడా సుముఖత చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్బీఐ పేటీఎం లైసెన్స్ రద్దు చేస్తుందా.. పేటీఎంలో మనీలాండరింగ్, కేవైసీ ఉల్లంఘనల కారణంగా బ్యాంకింగ్ లైసెన్స్‌ను కూడా రద్దు చేసే విషయాన్ని RBI పరిశీలిస్తోంది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించినట్లు.. ఫిబ్రవరి 29 తరువాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌ల వంటి వాటి ద్వారా డిపాజిట్లు, టాప్ అప్‌లను స్వీకరించకూడదనే నియమాలు అమలులోకి వస్తాయా? అనేది తెలియాల్సి ఉంది. పేటీఎం సీఈఓ ఏమన్నారంటే.. ఫిబ్రవరి 29 తరువాత కూడా పేటీఎం యధాతధంగా పనిచేస్తుందని, ప్రతి సవాలుకు ఒక పరిష్కారం ఉంటుందని, దేశానికి సేవ చేయడానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటామని విజయ్ శేఖర్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. పేటీఎం ఆవిష్కరణతో ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఆర్థిక లావాదేవీల్లో ఈ యాప్ ఇతర యాప్స్ కంటే అద్భుతంగా పనిచేస్తుండటం వల్ల ఎక్కువ మంది దీని వినియోగానికి ఆసక్తి చూపుతున్నారని, పేటీఎం కరో ఓ ఛాంపియన్‌గా నిలుస్తుందని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాద్వారా వెల్లడించారు. ఇదీ చదవండి: జేఈఈ, యూపీఎస్సీలలో ఏది కష్టం?.. ఆనంద్ మహీంద్రా ఏం చెప్పారంటే.. -
ఆశీర్వాద్ మైక్రోకు సెబీ బ్రేకులు
న్యూఢిల్లీ: ఎన్బీఎఫ్సీ.. మణప్పురం ఫైనాన్స్ అనుబంధ సంస్థ ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తాజాగా సెబీ బ్రేకు వేసింది. సంస్థ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను ప్రస్తుతానికి పక్కనపెట్టింది. అయితే వెబ్సైట్లో సెబీ ఇందుకు కారణాలను వెల్లడించలేదు. ఈక్విటీ జారీ ద్వారా రూ. 1,500 కోట్ల సమీకరణకు వీలుగా ఆశీర్వాద్ మై క్రో 2023 అక్టోబర్‌లో సెబీకి దరఖాస్తు చేసింది. సాధారణంగా ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన 30 రోజుల్లోగా సెబీ పరిశీలనా పత్రాన్ని జారీ చేస్తుంది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు అనుమతిస్తుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో ఆశీర్వాద్ మైక్రో పే ర్కొంది. 2008లో తమిళనాడులో ప్రారంభమైన కంపెనీ ప్రస్తుతం 1,684 బ్రాంచీలతో దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించింది. గతేడాది(2022–23)కల్లా నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ. 10,041 కోట్లకు చేరాయి. ఈ వార్తల నేపథ్యంలో మణప్పురం ఫైనాన్స్ షేరు బీఎస్ఈలో దాదాపు 5 శాతం పతనమై రూ. 168 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 163 వద్ద కనిష్టాన్ని తాకింది. -
ఎన్బీఎఫ్సీ వృద్ధి అంతంతే..
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఇటీవల అసురక్షిత రిటైల్ రుణాల నిబంధనలు కఠినతరం చేయడంతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్బీఎఫ్సీ)పై ప్రభావం చూపనుంది. కఠిన నిబంధనల వల్ల రుణాల మంజూరు నెమ్మదించి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్బీఎఫ్సీ రంగ వృద్ధి ఒక మోస్తరుగానే ఉండనుంది. 16–18 శాతం కన్నా తక్కువే ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. రాబోయే రోజుల్లో ఉత్పత్తుల్లో వైవిధ్యం, రుణాల ప్రొఫైల్ వంటివి వృద్ధి వ్యూహాల్లో కీలకంగా ఉండగలవని ఒక ప్రకటనలో తెలిపింది. పటిష్టమైన స్థూల, సూక్ష్మ ఆర్థిక పరిస్థితులు .. రిటైల్ రుణాల వృద్ధికి ఊతమివ్వగలవని వివరించింది. రిటైల్‌గా గృహాలు, వాహనాలు, కన్జూమర్ డ్యూరబుల్స్ మొదలైన వాటిపై చేసే వ్యయాలు పటిష్టంగా ఉండటంతో ప్రైవేట్ వినియోగమనేది దీర్ఘకాలిక సగటుకు పైన కొనసాగుతోందని క్రిసిల్ రేటింగ్స్ ఎండీ గుర్ప్రీత్ చత్వాల్ తెలిపారు. అసురక్షిత రిటైల్ రుణాల నిబంధనలు కఠినతరం అయినప్పటికీ హామీతో కూడుకున్న రుణాలపై ప్రభావం ఉండబోదని పేర్కొన్నారు. ముఖ్యంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలపై (హెచ్ఎఫ్సీ) ప్రభావం ఉండదని తెలిపారు. పటిష్టమైన అమ్మకాల దన్నుతో వాహన రుణాల విభాగం ఈ ఆర్థిక సంవత్సరం 18–19 శాతం వృద్ధి చెందగలదని వివరించారు. వచ్చే ఏడాది గృహ రుణాలు 14 శాతం అప్.. ఎన్‌బీఎఫ్‌సీల నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో (ఏయూఎం) ప్రస్తుతం గృహ, వాహన రుణాలకు చెరో 25–27 శాతం వాటా ఉన్నట్లు క్రిసిల్ తెలిపింది. ఈ రెండూ స్థిరంగా వృద్ధి చెందగలవని వివరించింది. అఫోర్డబుల్ గృహ రుణాలపై (రూ. 25 లక్షల కన్నా లోపు) హెచ్ఎఫ్సీలు ప్రధానంగా దృష్టి పెడుతుండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరం హోమ్ లోన్ సెగ్మెంట్ 12–14 శాతం వృద్ధి చెందగలదని క్రిసిల్ తెలిపింది. వాహన రుణాల విభాగం 2024–25 మధ్యకాలంలో స్థిరంగా 17–18 శాతం వృద్ధి నమోదు చేయొచ్చని పేర్కొంది. ఎన్బీఎఫ్సీ ఏయూఎంలో అసురక్షిత రుణాల సెగ్మెంట్ మూడో అతి పెద్ద విభాగంగా ఉంది. మరోవైపు, బ్యాంకుల నుంచి ఎన్‌బీఎఫ్‌సీల నిధుల సమీకరణ వ్యయాలు 25–50 బేసిస్ పాయింట్ల మేర పెరగవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. అయితే, అవి ఎంత మేర బ్యాంకు రుణాలపై ఆధారపడి ఉన్నాయనే అంశంపై వాటి ఆర్థిక పనితీరు మీద ప్రభావం ఉంటుందని వివరించింది. -
సూక్ష్మ రుణాల్లో ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్‌ఐల ప్రధాన పాత్ర
కోల్‌కతా: దేశంలో సూక్ష్మ రుణాల పంపిణీలో ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నట్టు సూక్ష్మ రుణ సంస్థల నెట్వర్క్ (ఎంఫిన్) ప్రకటించింది. 2022–23 సంవత్సరానికి సూక్ష్మ రుణ పరిశ్రమకు (ఎంఎఫ్ఐలు) సంబంధించి నివేదికను రూపొందించి విడుదల చేసింది. 2023 మార్చి 31 నాటికి రూ.1,38,310 కోట్ల రుణాలను ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు అందించాయి. మొత్తం సూక్ష్మ రుణాల్లో ఇది 39.7 శాతానికి సమానం. సూక్ష్మ రుణాల్లో బ్యాంక్‌ల వాటా 34.2 శాతంగా ఉంది. ఇవి రూ.1,19,133 కోట్ల రుణాలను సమకూర్చాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు అందించిన సూక్ష్మ రుణాలు రూ.57,828 కోట్లుగా (16.6 శాతం వాటా) ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి ఎంఎఫ్‌ఐల మొత్తం పోర్ట్‌ఫోలియో (రుణాలు) రూ.3,48,339 కోట్లుగా ఉంది. ఎంఎఫ్ఐ రంగానికి అపార వృద్ధి అవకాశాలు ఉన్నాయని, 2024 మార్చి నాటికి సూక్ష్మ రుణ పరిశ్రమ పరిమాణం రూ.13 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొంది. నూతన నియంత్రణలు సూక్ష్మ రుణ సంస్థల కార్యకలాపాలను బలోపేతం చేస్తాయని అభిప్రాయపడింది. కరోనా తర్వాత నిధుల వితరణ, పోర్ట్‌ఫోలియో నాణ్యత, క్లయింట్ల చేరికలో ఎంఎఫ్ఐ పరిశ్రమ బలంగా పుంజుకున్నట్టు తెలిపింది. -
చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు సిడ్బీ సాయం
ముంబై: చిన్న ఎన్‌బీఎఫ్‌సీల వృద్ధిని వేగవంతం చేసేందుకు చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బీ) ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. తద్వారా బ్యాంక్‌ల నుంచి నిధుల పొందే అర్హతను వాటికి కలి్పంచనుంది. ఈ కార్యక్రమంలో తొలుత 18 చిన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను (ఎన్బీఎఫ్సీలు) చేర్చింది. చిన్న ఎన్బీఎఫ్సీలు మరింత విస్తరించేందుకు వీలుగా, వాటి అర్హతలను పెంచేందుకు ఐదు నెలల కార్యక్రమాన్ని రూపొందించినట్టు సిడ్బీ చైర్మన్, ఎండీ శివసుబ్రమణియన్ రామన్ తెలిపారు. రిస్క్, కార్యకలాపాలు, పరిపాలన, టెక్నాలజీ తదితర అంశాల్లో నిపుణుల మార్గదర్శకత్వాన్ని వాటికి అందించనున్నట్టు చెప్పారు. దేశంలో 8 కోట్ల చిన్న వ్యాపార సంస్థలు ఉంటే, కేవలం 15 శాతం వాటికే సంఘటిత మార్కెట్ (ఇనిస్టిట్యూషన్స్) నుంచి రుణ సాయం అందుతున్నట్టు రామన్ తెలిపారు. దీంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) రుణ వితరణ విభాగంలో భారీ అవకాశాలున్నట్టు చెప్పారు. గడిచిన మూడేళ్లలో ఎంఎస్ఎంఈలకు సిడ్బీ రుణ వితరణ రూ.50,000 కోట్ల మార్క్‌ను అధిగమించినట్టు తెలిపారు. వ్యవస్థ మొత్తం మీద ఎంఎస్ఎంఈలకు సంబంధించి రూ.25 లక్షల కోట్ల రుణ పుస్తకం ఉండగా, వచ్చే రెండేళ్లలో రెట్టింపు అవుతుందన్నారు. ఇప్పుడున్న ఎంఎస్ఎంఈ రుణాల్లో కేవలం 28 శాతమే ఎన్బీఎఫ్సీలు సమకూర్చినవిగా తెలిపారు. తాము చేపట్టిన కార్యక్రమంలో భాగంగా.. ఎంఎస్ఎంఈలు ప్రధాన లక్ష్యంగా పనిచేసే ఎన్‌బీఎఫ్‌సీలకు సంఘటిత మార్కెట్ నుంచి నిధులు పొందే అర్హతను కలి్పంచడం ప్రధాన లక్ష్యమని రామన్ చెప్పారు. -
వారికి 6 నెలలే సమయం.. ఆర్బీఐ కీలక నిబంధనలు
అప్పుల ఎగవేతదారులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిబంధనలు ప్రతిపాదించింది. అకౌంట్లు నిరర్థకంగా మారిన ఆరు నెలల్లోపు సదరు రుణగ్రహీతలను ఉద్దేశపూర్వక ఎగవేతదారులు (Wilful Defaulters)గా ప్రకటించాలని బ్యాంకులకు, రుణ సంస్థలకు సూచించింది. (20 శాతం ట్యాక్స్.. అక్టోబర్ 1 నుంచే..) బకాయిలను చెల్లించగల సామర్థ్యం ఉండీ కూడా రుణాలు తిరిగి చెల్లించకుండా నిధులను ఇతర మార్గాలకు మళ్లీంచేవారిని ఆర్బీఐ ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారులు’ పరిగణిస్తుంది. అయితే దీనికి నిర్ధిష్ట కాల వ్యవధిని మాత్రం ఆర్బీఐ ఇంతవరకూ నిర్దేశించలేదు. ఇప్పుడు ప్రతిపాదించిన 6 నెలల కాలవ్యవధి నిబంధనలకు అనుగుణంగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFC) కూడా ఉద్దేశపూర్వక ఎగవేతదారులను ప్రకటించవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా సమీక్షా కమిటీని ఏర్పాటు చేయాలని బ్యాంకులకు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్బీఐ సూచించింది. అలాగే రుణగ్రహీత రాతపూర్వకంగా సమాధానమిచ్చేందుకు 15 రోజుల సమయం ఇవ్వాలని, అవసరమైతే వ్యక్తిగతంగా విచారణకు సైత అవకాశం ఇవ్వాలని ఆర్బీఐ తన డ్రాఫ్ట్ మాస్టర్ ఆదేశాలలో పేర్కొంది. ఒక ఖాతా ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ అయినట్లు ప్రకటిస్తే.. తిరిగి ఆ ట్యాగ్ తొలగించిన ఒక సంవత్సరం వరకు బ్యాంకులు అదనపు రుణాలు మంజూరు చేయకూడదని ఆర్బీఐ నిర్దేశించింది. డిఫాల్ట్ అయిన ఖాతాను మరొక బ్యాంకుకు, రుణ సంస్థకు లేదా అసెట్ రీకన్‌స్ట్రక్షన్‌కు బదిలీ చేయడానికి ముందు 'విల్‌ఫుల్ డిఫాల్ట్'ని నిర్ధారించడానికి లేదా తోసిపుచ్చడానికి దానిపై విచారణ పూర్తి చేయాల్సి ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అటువంటి ఖాతాలను రీస్ట్రక్చర్ చేయడానికి వీలుండదని స్పష్టం చేసింది. ముసాయిదా నిబంధనలపై వాటాదారులు అక్టోబర్ 31 వరకు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. -
కొత్త వ్యాపారంలోకి బంధన్ బ్యాంక్.. త్వరలో ఒప్పందాలు
కోల్‌కతా: కో లెండింగ్ (ఇతర సంస్థలతో కలసి రుణాలు ఇవ్వడం) వ్యాపారంలోకి తాము అడుగు పెడుతున్నట్టు బంధన్ బ్యాంక్ ఎండీ, సీఈవో చంద్రశేఖర్ ఘోష్ ప్రకటించారు. ఇందుకోసం తాము ఎన్బీఎఫ్సీలతో జట్టు కడతామని తెలిపారు. బంధన్ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం గురువారం కోల్‌కతాలో జరిగింది. ఈ సందర్భంగా ఘోష్ ఈ ప్రకటన చేశారు. కో లెండింగ్ కింద అన్ని రకాల రుణాలు మంజూరు చేస్తామని చెప్పారు. ఇప్పటికే కొన్ని ఎన్బీఎఫ్సీలను ఎంపిక చేశామని, త్వరలోనే వారితో ఒప్పందాలు చేసుకోనున్నట్టు తెలిపారు. 6,100 బ్యాంకింగ్ అవుట్లెట్లు ఎనిమిదేళ్ల క్రితం బంధన్ బ్యాంక్ తన కార్యకలాపాలు ప్రారంభించగా, నేడు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 6,100 బ్యాంకింగ్ అవుట్లెట్లు కలిగి ఉన్నట్టు చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లోని లేహ్‌లో తాజాగా ఒక శాఖను తెరవగా, సెప్టెంబర్‌లో కార్గిల్‌లో ఒకటి ప్రారంభించనున్నట్టు తెలిపారు. తమకు 3 కోట్ల కస్టమర్లు ఉన్నారని, వ్యాపారం రూ.2 లక్షల కోట్లు అధిగమించిందని వెల్లడించారు. కాసా డిపాజిట్ల రేషియో 39 శాతంగా ఉందన్నారు. బ్యాంకు లావాదేవీల్లో 94 శాతం డిజిటల్‌గా నమోదవుతున్నట్టు తెలిపారు. భౌగోళికంగా, రుణ విభాగాల పరంగా తాము మరింత వైవిధ్యాన్ని అమలు చేస్తామని, అందరికీ ఆర్థిక సేవలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్! ఇకపై మరింత.. -
ఎన్‌బీఎఫ్‌సీలకు భారీగా బ్యాంకు రుణాలు
ముంబై: బ్యాంకుల నుంచి ఎన్బీఎఫ్సీలు భారీగా నిధుల సమీకరణ చేస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకుల రుణాలు జూన్‌లో 35 శాతం పెరిగి రూ.14.2 లక్షల కోట్లకు చేరినట్టు కేర్ రేటింగ్స్ తెలిపింది. ఎన్బీఎఫ్సీలు అంతర్జాతీయ రుణాలపై ఆ ధారపడడాన్ని తగ్గించినట్టు ఇది తెలియజేస్తోందని పేర్కొంది. మొత్తం రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 2022 జూన్ నాటికి ఉన్న 8.5 శాతం నుంచి ఈ ఏడాది జూన్ నాటికి 9.9 శాతానికి పెరిగినట్టు కేర్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనం జూలై 1 నుంచి అమల్లోకి వచి్చనందున.. బ్యాంకుల రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా తగ్గుతుందని అంచనా వేసింది. హెచ్డీఎఫ్సీ రుణాలు పునర్వర్గీకరణకు గురవుతాయని పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీలకు మ్యూచువల్ ఫండ్స్ డెట్ పథకాల ఎక్స్పోజర్ సై తం జూన్‌లో 14.5 శాతం పెరిగి రూ.1.62 లక్షల కోట్లకు చేరుకున్నట్టు కేర్ రేటింగ్స్ వివరించింది. బ్యాంకుల రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 2018 ఫిబ్రవరి నాటికి 4.5 శాతంగా ఉంటే, అది ఈ ఏడా ది జూన్ నాటికి 10 శాతానికి చేరుకున్నట్టు తెలిపింది. 2021–22 ద్వితీయ ఆరు నెలల కాలం నుంచి ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకుల రుణాలు పెరుగుతూ వ స్తున్నట్టు కేర్‌రేటింగ్స్ వెల్లడించింది. కరోనా తర్వా త ఆరి్థక కార్యకలాపాలను తిరిగి పూర్తి స్థాయిలో తెరవడం ఇందుకు అనుకూలించినట్టు తెలిపింది. -
ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ ఐపీవో కుదింపు
ముంబై: ఎన్బీఎఫ్సీ.. ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ లక్ష్యాన్ని కుదించుకుంది. తొలుత వేసిన రూ. 1,600 కోట్లలో రూ. 400 కోట్లమేర కోత పెట్టుకుంది. వెరసి రూ. 1,200 కోట్ల సమీకరణకు సిద్ధపడుతోంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 450 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ గతేడాది నవంబర్‌లో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. ఐపీవోలో భాగంగా ప్రయివేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ. 150 కోట్లు సమకూర్చుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఆఫర్ పరిమాణం తగ్గే అవకాశముంది. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) ఏప్రిల్–డిసెంబర్ కాలంలో రూ. 525 కోట్ల ఆదాయం సాధించింది. -
ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌కు నిధుల్లేక సుస్తీ
సాక్షి, హైదరాబాద్: నష్టాల అంచులో ఉన్న సూక్ష్మ, చిన్నపరిశ్రమలను ఆదుకుని వాటి కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం 2018లో ‘ది తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్’(టీఐహెచ్‌సీఎల్)ను ఏర్పాటు చేసింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)గా ప్రస్థానం ప్రారంభించిన హెల్త్ క్లినిక్ నిధుల కొరత ఎదుర్కొంటోంది. రూ.100 కోట్ల కార్పస్ ఫండ్‌తో హెల్త్ క్లినిక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా పదోవంతు అనగా రూ.10 కోట్లు విడుదల చేసింది. కేంద్రం నుంచి మరో రూ.50 కోట్లు, ఎంఎస్ఎంఈలు, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి రూ.40 కోట్లు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతలో రూ.10 కోట్లు విడుదల చేసినా కేంద్రం నుంచి నయాపైసా రాలేదు. మరోవైపు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి కూడా స్పందన శూన్యం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మరో రూ.10 కోట్లు విడుదల చేసింది. ఈ కొద్ది నిధులతోనే ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ నష్టాల అంచులో ఉన్న పరిశ్రమలకు కన్సల్టింగ్, కౌన్సెలింగ్, మార్గదర్శనం వంటి సేవలను అందిస్తోంది. నిధుల సేకరణ కోసం ప్రయత్నాలు పారిశ్రామికంగా శరవేగంగా పురోగమిస్తున్న తెలంగాణలో సూక్ష్మ, చిన్న పరిశ్రమలే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఉద్యమ పోర్టల్ వివరాల ప్రకారం రాష్ట్రంలో 3.25 లక్షల సూక్ష్మ, చిన్న పరిశ్రమలు నమోదయ్యాయి. అయితే కరోనా పరిస్థితుల్లో అనేక సూక్ష్మ, చిన్న పరిశ్రమలు పెట్టుబడి వ్యయం(వర్కింగ్ క్యాపిటల్) దొరక్కపోవడం, ఇతరత్రా కారణాలతో నష్టాల బాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నష్టాల అంచులో ఉన్న సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌ను ఆశ్రయిస్తున్నా నిధుల కొరతమూలంగా ఆశించిన సాయం అందడంలేదు. ఈ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వ ఆర్థిక సంస్థ ‘జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ’(జికా)తో రుణ వితరణ ఒప్పందం కోసం ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ప్రయత్నిస్తోంది. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేసే ‘స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’(సిడ్బి)తో కూడా సంప్రదింపులు చేస్తోంది. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ కార్యకలాపాలు మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు నష్టాల అంచులో ఉన్న 45 పరిశ్రమలకు రూ.5.50 కోట్ల మేర ఆర్థిక సాయం లభించింది. నష్టాల అంచులో ఉన్న మరో 430 వరకు సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేసినట్లు సమాచారం. ఆదుకునేందుకు అన్ని రకాల ప్రయత్నం ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ కార్పస్ ఫండ్ కోసం ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాం. నష్టాల అంచు లో ఉన్న పరిశ్రమల వివరాలను బ్యాంకర్ల ద్వారా సేక రించడంతోపాటు సర్వేల ద్వారా కూడా గుర్తిస్తున్నాం. అయితే చాలా పరిశ్రమలు మూసివేతకు గురైన తర్వాతే యాజమాన్యాలు మా దగ్గరకు వస్తున్నాయి. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ కార్యకలాపాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సంబంధిత వర్గాలను కోరాం. – వెంకటేశ్వర్లు శిష్లా్ట, సీఈవో, ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ -
కార్ల అమ్మకాల్లో కార్స్24 దూకుడు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఎన్బీఎఫ్సీ విభాగం ఆకర్షణీయ ఫలితాలు సాధించనున్నట్లు సెకండ్‌హ్యాండ్(ప్రీఓన్డ్) వాహనాల ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ కార్స్24 అంచనా వేస్తోంది. వినియోగించిన కార్లకు కనిపిస్తున్న భారీ డిమాండు నేపథ్యంలో 80–100 శాతం వృద్ధిని సాధించే వీలున్నట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఎంవో గజేంద్ర జంగిడ్ పేర్కొన్నారు. గతేడాది(2021–22) నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ) విభాగం రూ. 75 కోట్ల టర్నోవర్ సాధించింది. ఇందుకు ప్రీఓన్డ్ కార్ల ఫైనాన్సింగ్ బిజినెస్ దోహదం చేసింది. 2019లో కంపెనీ ఎన్బీఎఫ్సీ లైసెన్సును పొందింది. తద్వారా కన్జూమర్లకు రుణాలివ్వడం ప్రారంభించినట్లు గజేంద్ర తెలియజేశారు. కంపెనీ ద్వారా విక్రయమవుతున్న ప్రతీ 2 కార్లలో ఒకదానికి ఫైనాన్స్ అందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం దేశీయంగా ప్రీఓన్డ్ కార్ల విభాగంలో ఫైనాన్సింగ్ అవకాశాలు అతిస్వల్పమని వివరించారు. దీంతో ఎన్బీఎఫ్సీ లైసెన్సును తీసుకున్నట్లు వెల్లడించారు. -
ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తులు రూ.54 లక్షల కోట్లు
ముంబై: ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తులు 2022 మార్చి నాటికి రూ.54 లక్ష కోట్లకు చేరాయని, వాణిజ్య బ్యాంకుల బ్యాలన్స్ షీట్ పరంగా చూస్తే పావు శాతం మేర ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కృష్ణారావు కరాడ్ తెలిపారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీలు కుప్పకూలిపోవడంతో, ఎన్బీఎఫ్సీ రంగం దీర్ఘకాలంగా సంక్షోభాన్ని చూడడం తెలిసిందే. దీన్నుంచి ఈ రంగం బయటకువచ్చి మెరుగైన పనితీరు చూపిస్తుండడాన్ని మంత్రి ప్రస్తావించారు. సీఐఐ నిర్వహించిన ఎన్బీఎఫ్సీ సదస్సులో భాగంగా మంత్రి మాట్లాడారు. సూక్ష్మ, మధ్య స్థాయి కంపెనీలకు రుణాలు అందించడం ద్వారా ఎన్బీఎఫ్సీలు దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. ఎంఎస్ఎంఈల కార్యకలాపాల విస్తరణకు, మరింత మందికి ఉపాధి కల్పనకు ఎన్బీఎఫ్సీలు సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. బ్యాంకులతో పోలిస్తే రుణాల మంజూరులో ఎన్బీఎఫ్సీలే అధిక వృద్ధిని చూపిస్తున్నట్టు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎన్బీఎఫ్సీలు రుణాల పరంగా 10 శాతం వృద్ధిని చూపిస్తే, బ్యాంకుల రుణ వితరణ వృద్ధి ఇందులో సగమే ఉందన్నారు. -
ఎన్‌బీఎఫ్‌సీల కోసం క్యాష్‌ఫ్రీ డిజిటల్ సొల్యూషన్
హైదరాబాద్: నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ), వాటి భాగస్వామ్య సంస్థల కోసం కొత్తగా డిజిటల్ సొల్యూషన్‌ను ప్రవేశపెట్టినట్లు క్యాష్‌ఫ్రీ పేమెంట్స్ సీఈవో ఆకాష్ సిన్హా తెలిపారు. రుణ వితరణ, వసూళ్ల కోసం ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత డిజిటల్ లెండింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ సొల్యూషన్స్ పని చేస్తుందని సిన్హా వివరించారు. రుణగ్రహీత గుర్తింపు, బ్యాంకు ఖాతా ధృవీకరణ, ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా నేరుగా రుణ గ్రహీత ఖాతాలోకే రుణాల బదలాయింపు మొదలైనవి దీనితో సులభతరం అవుతాయని పేర్కొన్నారు. -
ఎన్బీఎఫ్సీ కంపెనీలకు మంచి రోజులు
ముంబై: ఎన్బీఎఫ్సీ రంగానికి సంబంధించి క్రిసిల్ రేటింగ్స్ సానుకూల అంచనాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) వాటి ఆస్తులు నాలుగేళ్ల గరిష్ట స్థాయి అయిన 11–12 శాతం మేర వృద్ధి చెందుతాయని అంచనా వేసింది. కరోనా కారణంగా వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల పాటు ఎన్బీఎఫ్సీ ఆస్తుల వృద్ధి కుంటుపడిందని, 2021–22లో కేవలం 5 శాతం వృద్ధికి పరిమితమైనట్టు వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటి ఆస్తులు రెండంకెల స్థాయిలో పెరగొచ్చని అంచనా వేస్తూ.. అయినప్పటికీ కరోనా ముందున్న 20 శాతం వృద్ధి కంటే తక్కువేనని పేర్కొంది. బ్యాంకుల నుంచి తీవ్ర పోటీ ఉండడం, వడ్డీ రేట్ల పెరుగుదల కొన్ని విభాగాల్లో ఎన్‌బీఎఫ్‌సీల పోటీతత్వాన్ని ప్రభావితం చేస్తాయని అంచనా వేసింది. దీనివల్ల ఎన్బీఎఫ్సీలు అధిక రాబడులు వచ్చే విభాగాలపై దృష్టి సారించొచ్చని పేర్కొంది. వాహన రుణాల్లో మెరుగైన వృద్ధి.. ఎన్బీఎఫ్సీ ఆస్తుల్లో (అవి ఇచ్చిన రుణాలు) సగం మేర వాహన రుణాలే ఉంటాయి. ఇవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11-13 శాతం వరకు పెరుగుతాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. క్రితం రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ వాహన రుణాల్లో వృద్ధి 3–4 శాతంగానే ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. పునర్వినియోగ వాహన రుణాల్లో అధిక వృద్ధిని ఎన్బీఎఫ్సీలు చూస్తాయని, వీటిల్లో అధిక మార్జిన్లు ఉంటాయనే విషయాలను ప్రస్తావించింది. వాహన రుణాలు ఆశాజనకంగా ఉండడం, ఇన్ఫ్రా రంగం నుంచి వాహనాలను మార్చేందుకు బలమైన డిమాండ్ ఉంటుందని క్రిసిల్ తెలిపింది. తీవ్ర పోటీ, పెరిగే వడ్డీ రేట్ల వల్ల కొత్త వాహన రుణాల్లో బ్యాంకులు పైచేయి చూపించొచ్చని పేర్కొంది. -
ప్రస్తుత డిజిటల్ రుణాలకూ కొత్త నిబంధనలు
ముంబై: డిజిటల్ రుణాలకు సంబంధించి ఇటీవల ప్రకటించిన కొత్త నిబంధనలను, ఇప్పటికే పంపిణీ చేసిన డిజిటల్ రుణాలకు సైతం వర్తింపజేయాలని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలను ఆర్బీఐ ఆదేశించింది. ఇందుకు నవంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. అసాధారణ స్థాయిలో వడ్డీ రేట్లు, అనైతిక రుణ వసూళ్లను కట్టడి చేస్తూ నూతన నిబంధనలను ఆర్బీఐ గత నెలలో ప్రకటించింది. డిజిటల్ రుణాలకు మధ్యవర్తులుగా వ్యవహరించే ఫిన్‌టెక్ సంస్థలు కస్టమర్ల నుంచి చార్జీ వసూలు చేయకూడదని కూడా ఆదేశించింది. బ్యాంకులే ఈ చార్జీలను చెల్లించాలని నిర్దేశించింది. మొబైల్ యాప్‌లు, డిజిటల్ మాధ్యమాల ద్వారా మంజూరు చేసే రుణాలకు ఈ నూతన నిబంధనలు వర్తిస్తాయి. ఇప్పటికే తీసుకున్న డిజిటల్ రుణాలు, తాజాగా తీసుకునే వాటికి కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. ప్రస్తుత రుణాలనూ కొత్త నిబంధనల పరిధిలోకి తీసుకొచ్చేందుకు తగిన సమయం ఇస్తున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. కొత్త నిబంధనల కింద రుణాన్ని బ్యాంకు నేరుగా రుణ గ్రహీత ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ లేదా డిజిటల్ లెండింగ్ యాప్ (డీఎల్ఏ) ద్వారా రుణ దరఖాస్తు వచ్చినప్పటికీ, ఆ రుణాన్ని మంజూరు చేసే సంస్థ, నేరుగా రుణ గ్రహీతకు అందించాలి. -
పేదల నడ్డి విరుస్తున్న అడ్డగోలు వడ్డీ వసూళ్లు, ఆర్బీఐ కీలక నిర్ణయం!
ముంబై: డిజిటల్‌గా రుణాల మంజూరుకు సంబంధించి నిబంధనలను ఆర్బీఐ కఠినతరం చేసింది. ఇష్టారీతిన వడ్డీ రేట్లు వసూలు చేయడం, అనైతిక వసూళ్ల విధానాలకు చెక్ పెట్టే లక్ష్యంతో వీటిని తీసుకొచ్చింది. కొత్త నిబంధనల కింద.. బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలు రుణాలను నేరుగా రుణ గ్రహీత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాల్సి ఉంటుంది. మధ్యలో రుణ సేవలను అందించే ఫిన్‌టెక్‌లు కానీ, మరో సంస్థ (మూడో పక్షం)లకు ఇందులో పాత్ర ఉండకూడదు. రుణ సేవలను అందించినందుకు మధ్యవర్తులకు ఫీజులు, చార్జీలను ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలే (బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు/ఆర్ఈలు) చెల్లించాలి. రుణ గ్రహీతల నుంచి వసూలు చేయకూడదు. ముఖ్యంగా థర్డ్ పార్టీ సంస్థల అగడాలను అరికట్టడానికి ఆర్బీఐ ప్రాధాన్యం ఇచ్చింది. రుణ ఉత్పత్తులను అడ్డగోలుగా మార్కెటింగ్ చేయడం, డేటా గోప్యతను ఉల్లంఘించడం, అనైతిక వ్యాపార విధానాలు, భారీ వడ్డీ రేట్లు, అనైతిక వసూళ్ల విధానాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను తీసుకొచ్చింది. ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలు లేదా ఇతర చట్టాల కింద అనుమతించిన సంస్థల ద్వారానే రుణాల మంజూరు కొనసాగాలన్నది ఆర్బీఐ కార్యాచరణగా ఉంది. నిబంధనల్లో ఇతర ముఖ్యాంశాలు.. ► రుణ ఒప్పందానికి ముందు రుణ గ్రహీతకు కీలకమైన వాస్తవ సమాచార స్టేట్మెంట్ (కేఎఫ్ఎస్) ఇవ్వాలని ఆర్బీఐ నిర్ధేశించింది. ఆర్బీఐ నియంత్రణల కింద పనిచేసే సంస్థలు, డిజిటల్ లెండింగ్ యాప్‌లు, వీటి కింద పనిచేసే రుణ సేవల సంస్థలు (థర్డ్‌పార్టీ) దీన్ని తప్పక పాటించాలి. ► రుణ గ్రహీత ఆమోదం లేకుండా ఆటోమేటిక్‌గా రుణ పరిమితి పెంచడాన్ని నిషేధించింది. ► డిజిటల్ రుణాలను అసలుతోపాటు, అప్పటి వరకు వడ్డీతో చెల్లించి (ఎటువంటి పెనాల్టీ లేకుండా) క్లోజ్ చేసేందుకు వీలుగా కూలింగ్ ఆఫ్/ లుక్ అప్ పీరియడ్‌ను కల్పించాలి. ► రుణ గ్రహీత తన ఫిర్యాదుపై నియంత్రిత సంస్థ 30 రోజుల్లోపు పరిష్కారం చూపకపోతే.. అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చు. ► డిజిటల్ లెండింగ్ యాప్‌లు, రుణ సేవల సంస్థలు రుణ గ్రహీత అనుమతితో, కావాల్సిన వివరాలను మాత్రమే తీసుకోవాలి. డేటా వినియోగంపై రుణ గ్రహీత అనుమతి తీసుకోవాలి. ► ఫిన్‌టెక్, డిజిటల్ లెండింగ్ సేవలపై ఫిర్యాదుల పరిష్కారానికి వీలుగా నియంత్రిత సంస్థలు, వాటి కింద రుణ సేవలను అందించే సంస్థలు తగిన యంత్రాంగాన్ని కలిగి ఉండాలి. వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా అందించే రుణాలను డిజిటల్ లెండింగ్‌గా పరిగణిస్తారు. -
Foreclosure: వేలంలో ‘ప్రాపర్టీ’ కొనొచ్చా?
సొంతిల్లు ప్రతి ఒక్కరి లక్ష్యాల్లో ఒకటిగా ఉంటుంది. కానీ, మార్కెట్లో ఇళ్ల ధరలు చూస్తే.. అంత పెట్టి కొనగలమా? అనేట్టు ఉన్నాయి. మధ్యతరగతి వారు కూడా కొనలేని విధంగా కొన్ని ప్రాంతాల్లో రేట్లు ఉన్నాయంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఈ పరిస్థితుల్లో కొంచెం అందుబాటు ధరల ఇళ్లు ఎక్కడ ఉన్నాయి? కొన్నేళ్ల పాతది అయినా ఫర్వాలేదని భావించే వారికి.. ‘ఫోర్ క్లోజ్డ్’ ప్రాపర్టీలు (జప్తు చేసిన ఆస్తులు) ఒక మార్గం. బ్యాంకులు జప్తు చేసిన ఈ ఆస్తులలో తమ స్థోమతకు తగ్గట్టు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు. ఇందుకు ఏం చేయాలి? అనుసరించాల్సిన ప్రక్రియ ఏంటి? ఇందులో ఉండే లాభ, నష్టాల వివరాలను తెలియజేసేదే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం... బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఇళ్లు, ఫ్లాట్ల కొనుగోలుకు రుణాలు ఇస్తుంటాయి. రుణ గ్రహీతలు నెలవారీ ఈఎంఐల చెల్లింపుల్లో విఫలమైతే ఆయా ఆస్తులను బ్యాంక్‌లు స్వాధీనం చేసుకుంటాయి. నిర్ణీత కాలం పాటు రుణ వాయిదాలు చెల్లించకపోతే రుణ గ్రహీతకు నోటీసు ఇచ్చిన తర్వాత బ్యాంకులు ఈ చర్యలు చేపడతాయి. ఇలా బ్యాంకుల స్వాధీనంలోకి వెళ్లిన వాటిని ఫోర్క్లోజ్డ్ ప్రాపర్టీస్‌గా చెబుతారు. ఇలాంటి ఆస్తులకు బ్యాంకులు వేలం నిర్వహిస్తుంటాయి. వేలంలో విక్రయించగా వచ్చిన మొత్తాన్ని రుణ వసూలుగా అవి ఖాతాల్లో చూపిస్తాయి. అంటే తాము ఇచ్చిన రుణాన్ని ఈ రూపంలో అవి రికవరీ చేసుకుంటాయి. ఒక్కసారి బ్యాంక్ ఓ ఇంటిని స్వాధీనం చేసుకుందంటే.. సర్ఫేసీ చట్టం కింద దానికి యజమానిగా మారిపోతుంది. అటువంటి ఇళ్లను విక్రయించేందుకు నూరు శాతం హక్కులు వాటికి దఖలు పడతాయి. ఈ తరహా ప్రాపర్టీలను మార్కెట్లో పలుకుతున్న రేటు కంటే తక్కువకే బ్యాంకులు సాధారణంగా విక్రయిస్తుంటాయి. ఎందుకంటే తమ రుణ బకాయిలను రాబట్టుకోవడమే ఇక్కడ బ్యాంకులకు ప్రాధాన్యంగా ఉంటుంది. అంతేకానీ, మార్కెట్ రేటు కంటే మెరుగైన ధరకు విక్రయించుకుని, కాస్త లాభపడదామన్న సగటు వినియోగదారుని ధోరణి బ్యాంకులకు ఉండదు. పైగా బ్యాంకులు ప్రాపర్టీ విలువలో 70–80 శాతానికే రుణం ఇస్తాయి. అది కూడా ప్రభుత్వ రికార్డుల్లోని వ్యాల్యుయేషన్ ఆధారంగానే ఉంటుంది. మార్కెట్ రేటు ఆధారంగా రుణాలు ఇవ్వవు. ప్రాపర్టీని సగం ధరకు విక్రయించినా వాటి రుణం మొత్తం వసూలైపోతుంది. అందుకనే తక్కువ రేటుకు ఫోర్క్లోజ్డ్ ప్రాపర్టీలు లభిస్తుంటాయి. అనుకూలతలు... ప్రతికూలతలు బ్యాంకులు వేలానికి పెట్టే ఇళ్ల ధరలు మార్కెట్ రేటు కంటే తక్కువకు లభించడమే ప్రధాన అనుకూలతగా చెప్పుకోవాలి. ఎంత మేర తక్కువకు వస్తాయంటే..? కచ్చితంగా ఇంత శాతం అని కాకుండా, సంబంధిత ప్రాపర్టీ పట్టణంలోనా, పట్టణ శివారులోనా, మండల కేంద్రంలోనా అనే దాని ఆధారంగా రేట్ల వ్యత్యాసం ఉంటుంది. సాధారణంగా 20–30 శాతం వరకు మార్కెట్ రేటు కంటే చౌకగా ఇవి లభిస్తాయి. ఇంకో విషయం ఏమిటంటే రుణ బకాయి ఎంత మేరకు బ్యాంకుకు వసూలు కావాల్సి ఉందన్న అంశం కూడా ధరను నిర్ణయిస్తుంది. ఇచ్చిన రుణంలో సగమే తిరిగి రావాలనుకుంటే బ్యాంకులు ఇంకాస్త తక్కువ ధరకే వాటిని విడిచిపెట్టొచ్చు. ఇలా వేలంలో కొనుగోలు చేసే జప్తు ఆస్తులకు న్యాయపరమైన చిక్కులు దాదాపుగా ఉండవు. ఎందుకంటే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఆయా ప్రాపర్టీలకు రుణాలు ఇచ్చే ముందు న్యాయపరమైన అన్ని కోణాలను పరిశీలిస్తాయి. పైగా బ్యాంక్ వేలాలకు చట్టపరమైన రక్షణ ఉంది. ఇవి సర్ఫేసీ చట్టం, డీఆర్టీ చట్టం పరిధిలోకి వస్తాయి. బ్యాంకుల వేలంలో కొనుగోలు చేసిన వాటి బదిలీ ప్రక్రియ రెండు మూడు నెలల్లో పూర్తయిపోతుంది. యాజమాన్య హక్కులు ఒక నెలలోనే లభిస్తాయి. కాకపోతే వాటి స్వాధీనానికి మరో నెల, రెండు నెలలు పట్టొచ్చు. ∙ బ్యాంకులు స్వాధీనం చేసుకుని విక్రయించే ఇళ్ల నాణ్యత ఏ మేరకు అన్నది సందేహమే. బ్యాంకులు రుణం వసూలు కాకపోతే రుణ గ్రహీత నుంచి ప్రాపర్టీని స్వాధీనం చేసుకుని వేలం పెడతాయే కానీ, దాని వయసు ఎంత? కండీషన్ బాగుందా, లేదా, నాణ్యత ఇత్యాది అంశాలేవీ అవి పట్టించుకోవు, ఆ వివరాలను వెల్లడించవు. ఏవైనా మరమ్మతులు చేయాల్సి ఉంటే అవి వేలంలో కొనుగోలు చేసుకున్న వ్యక్తే భరించాల్సి ఉంటుంది. బ్యాంకులు చేయించి ఇవ్వవు. వాటిపై ఆ బాధ్యత కూడా ఉండదు. ఉన్నది ఉన్న స్థితిలోనే వేలం పెడుతున్నట్టు నియమ, నిబంధనల్లో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు స్పష్టంగా పేర్కొంటాయి. కనుక నాసిరకం నిర్మాణం అయితే ఆ మేరకు కొనుగోలుదారు నిరాశకు గురికావచ్చు. చూడాల్సినవి.. ముందు జాగ్రత్తలు.. జప్తు చేసిన ఇంటికి పూర్వపు యజమాని (రుణం చెల్లించలేకపోయిన) నుంచి కొన్ని బాకీలు ఉండొచ్చు. ప్రాపర్టీ పన్నులు, సొసైటీ మెయింటెనెన్స్ చార్జీలు, విద్యుత్ బిల్లులు, ఇతరత్రా ఏవైనా బకాయిలు ఉంటే వాటికి బ్యాంకులు బాధ్యత వహించవు. వేలంలో కొనుగోలు చేసిన వారే స్వయంగా ఆయా బకాయిలు తీర్చేయాల్సి ఉంటుంది. వేలానికి పెట్టిన ఇల్లు, ధర ఆకర్షణీయంగా ఉన్నాయని, ఇంకేవీ తెలుసుకోకుండా ఉత్సాహంగా పాల్గొని కొనేయడం కాకుండా.. ముందస్తుగా ఈ వివరాలు అన్నీ ఆరాతీయాలి. కనుక ప్రాపర్టీ వ్యవహారాల్లో అనుభవం ఉన్న న్యాయవాదిని సంప్రదించాలి. వారితో డాక్యుమెంట్లను తనిఖీ చేయించాలి. మరీ పాత ఇళ్లను కొనుగోలు చేయడం మంచి నిర్ణయం అనిపించుకోదు. ఎందుకంటే 20–30 ఏళ్లు దాటిన ఇళ్లకు ఏమంత విలువ ఉండదు. అందులో నివాసం ఉండేట్టు అయితే పూర్తిగా నవీకరించుకోవాల్సి రావచ్చు. అందుకోసం ఖర్చు అంచనా ఉండాలి. వేలానికి వచ్చే ఇళ్లు/ఫ్లాట్లలో ఎవరైనా అద్దెకు ఉంటే, వారిని ఖాళీ చేయించుకోవాల్సిన బాధ్యత కూడా కొనుగోలుదారుపైనే ఉంటుంది. చాలా కాలంగా కిరాయిదారు ఉంటే, కొన్ని సందర్భాల్లో ఖాళీ చేసి వెళ్లిపోవడానికి నిరాకరించొచ్చు. అందుకని వేలానికి ఉంచిన ఇళ్లల్లో కిరాయిదారు ఉంటున్నట్టు అయితే వాటిని ఎంపిక చేసుకోకుండా ఉండడమే మంచి నిర్ణయం అవుతుంది. గుర్తించడం ఎలా..? జప్తు చేసిన ఆస్తులకు సంబంధించిన సమాచారం అంతగా ప్రచారంలో ఉండదు. వీటి గురించి తెలియజేసే ఓ ఏకీకృత డేటాబేస్ అంటూ లేదు. అందుకని ఫోర్ క్లోజ్డ్ ఆస్తులకు సంబంధించిన సమాచారం కోసం ప్రత్యేకంగా కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. వాటిని పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. ‘ఫోర్క్లోజర్ఇండియా డాట్ కామ్’, ఎన్‌పీఏసోర్స్ డాట్ కామ్, బ్యాంక్ ఈఆక్షన్స్, బ్యాంకుడీఆర్టీ డాట్ కామ్ పోర్టళ్లను పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే, స్థానిక పత్రికల్లోనూ బ్యాంకులు ప్రకటనలు ఇచ్చి వేలం నిర్వహిస్తుంటాయి. వీటికి సంబంధించి బ్యాంక్ శాఖల వద్ద బ్యానర్లు కూడా కనిపిస్తుంటాయి. ఎస్బీఐ అయితే తన పోర్టల్‌లోనే ఇలాంటి వేలం ఆస్తులకు ప్రత్యేక పేజీ నిర్వహిస్తోంది. బ్యాంకు శాఖలను సంప్రదించడం ద్వారా వేలానికి వచ్చే ప్రాపర్టీల వివరాలు తెలుసుకోవచ్చు. ప్రాపర్టీ ఎంపిక, వేలంలో పాల్గొనడం..? వేలానికి సంబంధించి ప్రాథమిక సమాచారం తెలుసుకున్న తర్వాత బ్యాంక్ అధికారితో కలసి జప్తు చేసిన ఇంటిని సందర్శించొచ్చు. వేలం పోర్టల్‌లో ఇంటిపై రుణం తీసుకుని చెల్లించలేకపోయిన వ్యక్తి పేరు, ప్రాపర్టీ ఏ ప్రాంతంలో ఉంది?, రిజర్వ్ ధర, వేలం తేదీ, సమయం, ముందస్తుగా చేయాల్సిన డిపాజిట్, ఇలాంటి వివరాలు అన్నీ ఉంటాయి. వేలంలో పాల్గొనాలని నిర్ణయించుకుంటే దరఖాస్తుతోపాటు, కేవైసీ డాక్యుమెంట్లను బ్యాంక్‌కు సమర్పించాలి. అలాగే బిడ్ విలువలో 5–20 శాతాన్ని వేలానికి ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. వేలం రోజున అధికంగా బిడ్ చేసిన వ్యక్తిని విజేతగా బ్యాంక్ ప్రకటిస్తుంది. సంబంధిత వ్యక్తి బిడ్ ధరలో ముందుగా చెల్లించింది మినహాయించగా, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు చెప్పిన తేదీలోపు చెల్లించాలి. దీనికి ఎంత వ్యవధి, నియమ, నిబంధనలను బ్యాంకులు ముందే ప్రకటిస్తాయి. అవసరమైతే అప్పుడు రుణ మార్గాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. కానీ, ముందుగా సంబంధిత ప్రాపర్టీకి సరిపడా తమ వంతుగా సమకూర్చుకునే సామర్థ్యం ఉంటేనే వేలంలో పాల్గొనాలి. -
ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీలకు సానుకూలం
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), గృహ రుణ సంస్థలు (హెచ్ఎఫ్సీలు) నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9-11 శాతం మేర వృద్ధిని చూస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీల ఏయూఎం వృద్ధి ప్రధానంగా చివరి త్రైమాసికం (2022 జనవరి-మార్చి)లో నమోదైనట్టుగా పేర్కొంది. హెచ్ఎఫ్సీల ఆస్తులు 10 శాతం పెరగ్గా, ఎన్‌బీఎఫ్‌సీల రిటైల్ ఆస్తులు 8.5 శాతం, హోల్‌సేల్ ఆస్తులు 12 శాతం చొప్పున వృద్ధి చెందాయని బుధవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు (ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ కంపెనీలు కాకుండా) మొత్తం మీద 9–11 శాతం మేర వృద్ధిని నమోదు చేయగలవని అంచనా వేస్తున్నట్టు ఇక్రా వివరించింది. ఈ సంస్థలు ఇచ్చిన రుణాలనే ఆస్తులుగా పరిగణిస్తారు. నిధుల మార్గాలు ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు తమ నిధుల అవసరాల కోసం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ (ఎన్సీడీలు) ఇష్యూలను చేపట్టడం అన్నది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎన్నో త్రైమాసికాల కనిష్టానికి చేరినట్టు ఇక్రా నివేదిక తెలియ జేసింది. 2021-22 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 28 శాతం తగ్గాయని, 2020-21 మొదటి త్రైమాసికంలోని ఇష్యూలతో పోల్చినా 65 శాతం తక్కువగా ఉన్నట్టు వివరించింది. ఆర్బీఐ ఈ ఏడాది మే, జూన్ నెలల్లో రెపో రేట్లు పెంచడం, ద్రవ్యోల్బణం పెరిగిన పరిస్థితుల్లో వీటి ఇష్యూలకు ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతగా లేదని తెలిపింది. కమర్షియల్ పేపర్ల రూపంలో నిధుల సమీకరణ గత కొన్ని నెలల్లో కొంత పుంజుకున్నట్టు పేర్కొంది. వడ్డీ రేట్లు పెరుగుతున్న క్రమం, పోటీ ఒత్తిళ్ల నేపథ్యంలో ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు మార్జిన్లను కాపాడుకు నేందుకు స్వల్పకాల నిధుల వాటాను పెంచుకోవచ్చని ఇక్రా అంచనా వేసింది. -
పెరిగిపోతున్న ఆర్ధిక నేరాలు, బ్యాంకులకు ఆర్బీఐ కీలక నిబంధనలు!
ముంబై: బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు సహా తన నియంత్రణలో ఉన్న ఇతరత్రా సంస్థలు ఆర్థిక, పరపతిపరమైన రిస్కుల్లో పడకుండా చూసేలా..ఐటీ సర్వీసుల అవుట్సోర్సింగ్కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను ప్రతిపాదించింది. వీటి ప్రకారం బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు, ఎన్బీఎఫ్సీలు మొదలైనవి బోర్డు ఆమోదిత సమగ్ర ఐటీ అవుట్సోర్సింగ్ విధానాన్ని పాటించాల్సి ఉంటుంది. ఏ కార్యకలాపాలనైనా అవుట్సోర్సింగ్కు ఇచ్చినంత మాత్రాన సదరు నియంత్రిత సంస్థ (ఆర్ఈ) తన బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి కుదరదని, అంతిమంగా ఆయా అంశాలకు సంబంధించి జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిందేనని ఆర్బీఐ స్పష్టం చేసింది. అవుట్సోర్సింగ్ సంస్థ కచ్చితంగా ఆర్ఈ ప్రమాణాలతోనే కస్టమర్లకు అందించాల్సి ఉంటుందని, అలా చేసేలా చూడాల్సిన బాధ్యత ఆర్ఈదేనని తెలిపింది. బోర్డు .. సీనియర్ మేనేజ్మెంట్ పాత్ర, క్లౌడ్ కంప్యూటింగ్ సేవల వినియోగం, సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (ఎస్వోసీ) అవుట్సోర్సింగ్ మొదలైన వాటికి సంబంధించిన నిబంధనలను ముసాయిదా ప్రతిపాదనలో ఆర్బీఐ పేర్కొంది. ఆర్ఈలు పటిష్టమైన ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. వీటిపై జూలై 22లోగా పరిశ్రమ వర్గాలు తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. -
అన్ని రుణాలూ భారమే
న్యూఢిల్లీ: వాహన, గృహ, వ్యక్తిగత రుణాలు మరింత భారంగా మారుతున్నాయి. ఆర్బీఐ కీలకమైన రెపో రేటు పెంచడంతో దాదాపు అన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రేట్లను పెంచుతూ నిర్ణయాలను ప్రకటిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా (బీవోబీ), పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ), బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుతోపాటు హెచ్డీఎఫ్సీ ఇప్పటికే రేట్ల పెంపు అమల్లోకి తీసుకొచ్చాయి. బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే స్వల్పకాల రుణాలపై వసూలు చేసే రేటునే రెపో రేటుగా చెబుతారు. ప్రస్తుతం బ్యాంకులు ఎక్కువగా రెపో ఆధారిత రేట్ల విధానాన్నే రుణాలు, డిపాజిట్లకు అనుసరిస్తున్నాయి. జూన్ 8నాటి సమీక్షలో ఆర్బీఐ అర శాతం మేర రెపో రేటును పెంచింది. దీనికి నెల ముందు 0.40 శాతం పెంచడంతో నెలన్నర వ్యవధిలోనే 0.90 శాతం రేటు పెంపు అమల్లోకి వచ్చింది. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధంతో కమోడిటీల ధరలు అదుపు తప్పాయి. అంతర్జాతీయంగా ఆహార సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ద్రవ్యోల్బణం నియంత్రణ పరిధి దాటిపోయింది. ఫలితంగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ రేట్ల పెంపు బాట పట్టింది. ఒక్కో బ్యాంకు.. ► ఐసీఐసీఐ బ్యాంకు రెపో అనుసంధానిత ‘ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు’ (ఈబీఎల్ఆర్)ను 8.10 శాతం నుంచి 8.60 శాతం చేస్తున్నట్టు ప్రకటించింది. జూన్ 8 నుంచి కొత్త రేటు అమల్లోకి వచ్చింది. ► పీఎన్బీ రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)ను 6.90% నుంచి 7.40% చేసింది. ► బ్యాంకు ఆఫ్ బరోడా సైతం ఆర్ఎల్ఎల్ఆర్ను 7.40 శాతానికి సవరించింది. ► ఎస్బీఐ ఈబీఎల్ఆర్ రేటును 7.05 శాతానికి సవరిస్తూ ఆర్బీఐ జూన్ పాలసీకి ముందే నిర్ణయాన్ని ప్రకటించింది. దీనికి క్రెడిట్ రిస్క్ ప్రీమియం కూడా కలిపి రుణాలపై వడ్డీ రేటును అమలు చేయనుంది. ► హెచ్డీఎఫ్సీ.. రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (ఆర్పీఎల్ఆర్)ను గృహ రుణాలపై అర శాతం పెంచింది. ఇది జూన్ 10 నుంచి అమల్లోకి వచ్చింది. 20 ఏళ్ల కాల గృహ రుణాలపై ప్రతీ రూ.లక్షకు రూ.31 పెరిగినట్టయింది. ► ఇండియన్ బ్యాంకు ఆర్ఎల్ఎల్ఆర్ను 7.70 శాతానికి, బ్యాంకు ఆఫ్ ఇండియా 7.75 శాతానికి పెంచాయి. ► ఐఓబీ ఆర్ఎల్ఎల్ఆర్ను జూన్ 10 నుంచి 7.75%కి సవరించినట్టు తెలిపింది. ► బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర సైతం ఆర్ఎల్ఎల్ఆర్ను 7.20 శాతం నుంచి 7.70 శాతానికి సవరించినట్టు, ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) రుణాలపైనా 0.30% మేర రేటును పెంచింది. ► కెనరా బ్యాంకు ఏడాది ఎంసీఎల్ఆర్ను 7.35 శాతం నుంచి 7.40 శాతం చేస్తూ, జూన్ 7 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ► 2019 అక్టోబర్ 1 నుంచి రెపో, ట్రెజరీ బిల్లు ఈల్డ్ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును బ్యాంకులు అమలు చేస్తున్నాయి. అంతక్రితం ఎంసీఎల్ఆర్ విధానం ఉంది. -
హోమ్‌లోన్.. భారంగా మారుతోంది!
నాలుగేళ్ల విరామం తర్వాత కీలక రెపో రేటును ఆర్బీఐ 0.40 శాతం పెంచడం ఆలస్యం.. వరుసగా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రుణ రేట్ల పెంపును అమల్లోకి తెస్తున్నాయి. ముఖ్యంగా 2020 నుంచి వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగాయి. మంచి క్రెడిట్ స్కోరుతో మూడు నెలల క్రితం బ్యాంకును సంప్రదించి ఉంటే 6.5 శాతానికే గృహరుణం లభించేది. కానీ, ఇప్పుడు వెళ్లి అడిగితే 6.9–7 శాతం కంటే చౌక ఆఫర్ వినిపించకపోవచ్చు. ప్రముఖ గృహ రుణ సంస్థ హెచ్డీఎఫ్సీ సైతం రుణ రేట్లను 7–7.45 శాతానికి పెంచింది. ఎస్బీఐ సహా ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా రేట్లను సవరించాయి. రుణాల రేట్లే కాదు డిపాజిట్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. దీంతో గృహ రుణం తీసుకోవాలని భావించే వారు ఇప్పుడు అప్రమ్తతం కావాలి. ఎందుకంటే గత ఏడాది కాలంలో మంజూరు చేసిన రుణాల్లో సగానికి సగం రెపో రేటు ఆధారితమే. కనుక రెపోతో పాటు రెపో రుణ రేట్లు కూడా వెనువెంటనే సవరణకు లోనవుతాయి. ఇది రుణ గ్రహీతలకు భారంగా మారుతుంది. కనుక గృహ రుణ గ్రహీతలు ఈ తరుణంలో ఏది చేస్తే బావుంటుంది..? నిపుణుల సూచనలు ఎలా ఉన్నాయి..? వేచి చూస్తే లాభం లేదు.. వడ్డీ రేటు తక్కువకు లభిస్తుందేమో..? అని వేచి చూడడం పొరపాటే అవుతుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుంటున్న వేళ రేట్లను తక్కువ స్థాయిలో ఉంచడం అసాధ్యం. రానున్న ఏడాది కాలంలో పలు విడతలుగా ఆర్బీఐ కీలక రేట్లను పెంచుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఒకవేళ రెండు, మూడో ఇల్లు కొనుగోలు చేస్తుంటే కనుక వేచి చూస్తానంటే అది వేరే విషయం. కానీ, మొదటి ఇల్లు సమకూర్చుకోవాలన్నది మీ ప్రాధాన్య జాబితాలో ఉంటే వెంటనే గృహ రుణంతో ఇల్లు సమకూర్చుకోవడమే రైట్. ఇక్కడ గృహ రుణ రేటే కాదు.. ప్రాపర్టీ రేటు కూడా చూడాలి. కరోనా సంక్షోభానంతరం రియల్టీ మార్కెట్లో ధరలు పడిపోయి అక్కడి నుంచి కోలుకున్నాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. కనుక ప్రాపర్టీ ధరలతో ముడిపెట్టి గృహ రుణ రేటును చూడాలి. వేచి చూస్తే ప్రాపర్టీ ధరలు దిగొస్తాయా..? లేక రెక్కలు విప్పుకుంటాయా..? ఎవరు చెప్పగలరు. ఆలస్యం చేస్తే ముందు ముందు మరింత అధిక రేటుపై రుణం తీసుకోవాల్సి రావచ్చు. ప్రతి 10 బేసిస్ పాయింట్లు (అంటే 0.1 శాతం) రుణ రేటు పెరిగితే రూ.లక్షపై ఒక ఏడాదికి పడే అదనపు భారం రూ.100. రూ.50 లక్షల గృహ రుణం తీసుకున్నారని అనుకుంటే అప్పుడు రూ.5000 భారం అవుతుంది. కనుక మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారు రుణదాతలతో సంప్రదింపులు చేయడం వల్ల కనిష్ట రేటుపై గృహ రుణం లభించే అవకాశం లేకపోలేదు. రుణ రేట్లను తగ్గించే అధికారం అందరికీ ఉండదు. బ్యాంకు హోంశాఖ లేదంటే ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్‌ను ఈ విషయమై సంప్రదించొచ్చు. ఫోన్ కాల్స్‌తో రుణ రేట్ల గురించి బేరమాడడం ఫలితాలనివ్వదు. మరోవైపు కమోడిటీల మంటలతో నిర్మాణ వ్యయాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ భారాన్ని ఇళ్ల విక్రయధరలతో డెవలపర్లు సర్దుబాటు చేసుకోవాల్సిందే. అందుకే ఆలస్యం చేస్తే రెండు విధాలుగా భారం పడొచ్చు. రుణ కాలవ్యవధి గృహ రుణం తీసుకునే సమయంలో సాధారణంగా ఈఎంఐ(ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్) ఎంతన్నది చూసి చెల్లించగలిగే సామర్థ్యం ఆధారంగా కాలవ్యవధిని నిర్ణయించుకుంటూ ఉంటారు. తక్కువ టర్మ్ పెట్టుకుంటే ఎక్కువ ఈఎంఐ చెల్లించాలి. అప్పుడు వడ్డీ భారం తక్కువగా ఉంటుంది. అదే ఎక్కువ కాల వ్యవధిని నిర్ణయించుకోవడం వల్ల ఈఎంఐ భారం తగ్గినట్టు అనిపించొచ్చు. కానీ, దీర్ఘకాలంలో వడ్డీ రూపంలో చెల్లించే మొత్తం పెరిగిపోతుంది. అయితే, ఎంత గృహ రుణం తీసుకోవాలి, ఈఎంఐ ఎంత నిర్ణయించుకోవాలన్నది అంత సులభంగా తేలే అంశం కాదు. కచ్చితంగా నిపుణుల సాయం తీసుకోవడం మంచిది. ఇక్కడ పన్ను ఆదా ప్రయోజనాన్ని కూడా చూడాలి. రిటైర్మెంట్కు ఎన్నేళ్ల కాలం మిగిలి ఉంది? చెల్లింపుల సామర్థ్యం, ఇతర జీవిత లక్ష్యాలు, వాటికి సంబంధించి చేయాల్సిన కేటాయింపులు అన్నీ చూసుకున్న తర్వాత గృహ రుణాన్ని అనుకూలమైన కాలవ్యవధికి తీసుకోవాలి. నిపుణుల అవసరం వద్దనుకుంటే మధ్యే మార్గంగా మీడియం టర్మ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు రూ.50 లక్షల రుణాన్ని 6.99 శాతం వడ్డీ రేటుపై తీసుకుంటే పదేళ్ల టర్మ్‌లో చెల్లించే వడ్డీ రూ.19 లక్షలుగా ఉంటుంది. రుణ కాలాన్ని 20 ఏళ్లకు పెంచుకుంటే చెల్లించే వడ్డీ మొత్తం రూ.43 లక్షలు. కనుక వెసులుబాటు ఉంటే అధిక ఈఎంఐను నిర్ణయించుకోవడమే సరైనది. ఒకవేళ టర్మ్ ఎక్కువ పెట్టుకున్నా.. వెసులుబాటు ఉన్నప్పుడల్లా అదనంగా చెల్లిస్తూ వెళ్లడం మంచి ఐడియా. లోన్ టు వ్యాల్యూ ప్రాపర్టీ విలువలో బ్యాంకు మంజూరు చేసే రుణాన్ని లోన్ టు వ్యాల్యూ (ఎల్టీవీ)గా చెబుతారు. సాధారణంగా బ్యాంకులు ప్రాపర్టీ విలువలో 60–65 శాతం వరకు రుణంగా మంజూరు చేస్తుంటాయి. అదే ఎన్బీఎఫ్సీలు అయితే ఇంకొంచెం రిస్క్ చేసి 75 శాతం వరకు రుణంగా ఇస్తాయి. మిగిలిన మేర రుణ గ్రహీత స్వయంగా సమకూర్చుకోవాలి. ఉదాహరణకు రూ.1.50 కోట్ల విలువ చేసే ఫ్లాట్‌ను కొనుగోలు చేస్తున్నారనుకుంటే.. బ్యాంకులు రుణదాత వంతుగా రూ.60 లక్షలు సమకూర్చుకోవాలని కోరొచ్చు. బ్యాంకులు కొంచెం అధికంగా ఇచ్చినా.. రుణదాత తనవైపు నుంచి వీలైనంత అధిక భాగాన్ని సమకూర్చుకుని, మిగిలిన మేరే బ్యాంకు నుంచి తీసుకోవడం మంచిది. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది. ముఖ్యంగా రుణ రేట్లు పెరిగే కాలంలో రుణ గ్రహీతలు తమ భాగం ఎక్కువ ఉండేలా చూసుకోవడం ఒక మార్గం. లేదంటే అధిక పన్ను శ్లాబు (30 శాతం) పరిధిలోకి వచ్చి.. భారీగా ఆదాయపన్ను కడుతూ ఎక్కువ ఆదా చేసుకోవాలని అనుకునే వారు బ్యాంకులు ఇచ్చే గరిష్ట ఎల్టీవీవైపే మొగ్గు చూపించడం మంచిది. దీనివల్ల వడ్డీకి చేసే చెల్లింపులు, అసలుపై క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఫిక్స్డ్ టెన్యూర్ దాదాపు చాలా బ్యాంకులు గృహ రుణాలను రెపో రేట్లతో అనుసంధానించాయి. రెపోను ఆర్బీఐ 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచిన తర్వాత పలు బ్యాంకులు రెపో ఆధారిత రుణ రేటును పెంచాయి. రెపో రేటు మార్పునకు లోనైతే త్రైమాసికం వారీగా గృహ రుణ రేటు కూడా సవరణకు లోను కావచ్చు. బ్యాంకులు రెపో రేటు సవరణను వెంటనే ఆచరణలో పెట్టే విధంగా ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేటు విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. కనుక ఇక మీదట వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో గృహ రుణ రేట్లు కూడా ఆ మేరకు సవరణకు లోనవుతాయి. ఇది రుణాలు తీసుకున్న వారి నగదు ప్రవాహాలపై ప్రభావం చూపిస్తుంది. ఫ్లోటింగ్ రుణంలో సహజం గానే ఈ రిస్క్ ఉంటుంది. ఫిక్స్డ్ రేటు రుణాలను ఇప్పుడు బ్యాంకులు దాదాపుగా ఆఫర్ చేయడం లేదు. చేస్తే కనుక ఫిక్స్డ్ రేటుపై రుణం తీసుకోవడమే లాభదాయకం. ఫ్లోటింగ్ రేటుకు వెళ్లాలా? కొన్ని బ్యాంకులు 2–3 ఏళ్లపాటు ఫిక్స్డ్ రేటును, ఆ తర్వాత నుంచి ఫ్లోటింగ్ రేటును అమలు చేస్తున్నాయి. రుణ గ్రహీతపై ఒకేసారి భారం పెరగకుండా ఈ విధానాన్ని అనుసరిస్తుంటాయి. ఉదాహరణకు 15 ఏళ్ల గృహ రుణ కాలంలో మొదటి ఐదేళ్లు చేసే చెల్లింపుల్లో అధిక భాగం వడ్డీకే వెళుతుంది. కనుక ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని టైమ్‌బౌండ్ ఫిక్స్డ్ విధానాన్ని ఎంపిక చేసుకోవాలా లేక ఫ్లోటింగ్ రేటు రుణానికే వెళ్లాలా? అన్నది నిర్ణయించుకోవాలి. ఎన్బీఎఫ్సీలు టైమ్‌బౌండ్ ఫిక్స్డ్ రేటు విధానంపై రుణాలను ఆఫర్ చేస్తుంటాయి. ఒకవేళ కొనుగోలు చేసే ప్రాపర్టీ ధర రూ.2–3 కోట్లు అంతకుమించి ఉండి, లోన్ వ్యాల్యూ రూ.1.5 కోట్లకు పైన ఉంటే బ్యాంకులు సైతం టైమ్‌బౌండ్ ఫిక్స్డ్ రేటుపై ఆఫర్ చేయవచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే ఎన్బీఎఫ్సీలు, గృహ రుణ సంస్థల రుణ రేట్లు 25–35 బేసిస్ పాయింట్లు అధికంగా ఉంటాయి. బ్యాంకులకు సేవింగ్స్, కరెంటు ఖాతాల రూపంలో తక్కువకే నిధుల లభ్యత ఉంటుంది. కనుక అవి కొంచెం తక్కువ రేటుకు రుణాలను ఇస్తుంటాయి. ఇది అటు బ్యాంకులు, ఇటు రుణ గ్రహీతలకూ మంచిదే. . భారం దింపుకోవాలంటే..? కొత్తగా రుణాలు తీసుకునే వారే కాకుండా.. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కూడా బ్యాంకులు కొత్త రేట్లను అమలు చేస్తున్నాయి. మరి ఈ తరుణంలో గృహ రుణంపై పడే అదనపు భారాన్ని తగ్గించుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఈఎంఐ పెరగకూడదని అనుకుంటే ఆ మేరకు కాలవ్యవధిని పెంచుకోవాలి. ఈఎంఐ పెరిగినా ఫర్వాలేదు కట్టగలిగే స్వేచ్ఛ ఉందంటే అది కూడా నయమే. అదనంగా చెల్లించే వెసులుబాటు ఉందంటే.. అటువంటి వారు ఈఎంఐకి అదనంగా కొంత మొత్తాన్ని ప్రతి నెలా చెల్లిస్తూ వెళ్లొచ్చు. దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. నిర్ణీత కాలవ్యవధికి ముందే గృహ రుణాన్ని ముగించేయవచ్చు. ఫలితంగా వడ్డీ రూపంలో కొంత ఆదా చేసుకోవచ్చు. లేదంటే ప్రతి నెలా అదనంగా చెల్లిస్తూ వెళ్లడం వల్ల.. భవిష్యత్తులో ఏవైనా కారణాల వల్ల ఆదాయం తగ్గినా.. కొంతకాలం పాటు ఉపాధి కోల్పోయినా పరిమిత కాలం పాటు తక్కువ ఈఎంఐ చెల్లించుకోవచ్చు. ఏటా సంస్థ ఇచ్చే బోనస్‌లు, ఇతరత్రా వచ్చే అదనపు ఆదాయాన్ని రుణ చెల్లింపులకు వినియోగించుకోవాలి. టాపప్ రెండో ప్రాపర్టీ కొనుగోలు చేసే వారు లేదంటే అప్పటికే సమకూర్చుకున్న ప్రాపర్టీ విస్తరణ కోరుకునే వారు ప్రస్తుత గృహ రుణానికి టాపప్ లోన్ తీసుకోవచ్చు. అది కూడా తక్కువ రేటుకే. సాధారణంగా ఇంటి నవీకరణ కోసం పొదుపు చేసుకున్న మొత్తాలను ఎక్కువ మంది వినియోగిస్తుంటారు. లేదంటే వ్యక్తిగత రుణానికి వెళ్లేవారు కూడా ఉన్నారు. వాటికి బదులు గృహ రుణానికి అనుబంధంగా వచ్చే టాపప్‌లోన్ తీసుకోవచ్చు. టాపప్‌పై గృహ రుణం మాదిరే తక్కువ వడ్డీ రేటు అమలవుతుంది. ప్రైవేటు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఎక్కువగా హోమ్‌లోన్ టాపప్లోన్స్ ఆఫర్ చేస్తుంటాయి. కొన్ని బ్యాంకులు టాపప్ రుణాలు ఆఫర్ చేస్తున్నాయి. కానీ, వీటిపై అప్పటికే తీసుకున్న గృహ రుణంతో పోలిస్తే 10–15 బేసిస్ పాయింట్లు అధిక రేటును అమలు చేస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు ప్రత్యేక రుణంగా పరిగణించి అధిక రేట్లను చార్జ్ చేస్తున్నాయి. అయినా, వ్యక్తిగత రుణ రేట్ల కంటే తక్కువే ఉన్నాయి. కనుక అవసరమైతేనే ఈ మార్గాన్ని పరిశీలించాలి. గృహ రుణం తీసుకున్న సమయంలోనే ఈ యాడాన్ లోన్ సదుపాయాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే యాడాన్ రుణం తీసుకోకుండా ఫ్రీజ్ చేసుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో కావాల్సినప్పుడు వినియోగించుకునేందుకు రుణదాతలు అనుమతిస్తారు. ఒక్క ప్రాసెసింగ్ ఫీజు మినహా అదనంగా చెల్లించే పని ఉండదు. 10–15 బేసిస్ పాయింట్లు అధికంగా ఉన్నా సరే గృహ రుణం సమయంలోనే యాడాన్ను కూడా ఓకే చేసుకుని ఉంచుకోవాలి. -
బ్యాంకుల బాదుడు.. పెరుగుతున్న వడ్డీరేట్లు..
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు కీలక రెపో రేటు పెంపు తర్వాత బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు సైతం రుణ రేట్లను పెంచడం ప్రారంభించాయి. ప్రైవేటురంగ గృహ రుణాల దిగ్గజం హెచ్డీఎఫ్సీ తన బెంచ్‌మార్క్ లెండింగ్ (రుణాలు) రేట్లను 30 బేసిస్ పాయింట్లు (0.30 శాతం) పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో రుణ గ్రహీతలపై ఈ మేరకు అదనపు భారం పడనుంది. ప్రభుత్వరంగ ఇండియన్ బ్యాంకు సైతం 0.40 శాతం రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. దీనికంటే ముందు ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయాలు ప్రకటించడాన్ని గమనించాలి. అనూహ్యంగా ఆర్బీఐ రెపో రేటును 0.40 శాతం పెంచుతున్నట్టు గత వారం ప్రకటించడం తెలిసిందే. అలాగే, సీఆర్ఆర్ను 0.50 శాతం పెంచింది. రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (ఆర్పీఎల్ఆర్)ను గృహ రుణాలపై 30 బేసిస్ పాయింట్లు పెంచినట్టు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. కొత్తగా రుణాలు తీసుకునే వారికి 7% నుంచి 7.45 శాతం మధ్య రేట్లను అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి 0.30 శాతం పెంపు అమలవుతుందని హెచ్డీఎఫ్సీ తెలిపింది. ప్రస్తుతం గృహ రుణాలపై ఈ సంస్థ 6.70–7.15% మధ్య రేట్లను అమలు చేస్తోంది. హెచ్డీఎఫ్సీ తన రుణాలకు మూడు నెలల సైకిల్‌ను అమలు చేస్తుంటుంది. అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి రుణాలపై రేట్లు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సవరణకు గురవుతుంటాయి. ఇండియన్ బ్యాంకు పెంపుబాట.. ఇండియన్ బ్యాంకు రెపో అనుసంధానిత లెండింగ్ రేటును 0.40 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ నెల 9 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. రెపో రుణాల రేట్లు ఆర్బీఐ రెపో రేటును సవరించిన ప్రతిసారీ మార్పునకు లోనవుతాయి. ‘‘బ్యాంకు అస్సెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ కమిటీ రెపో రేటుకు లింక్ అయిన అన్ని రుణాల రేట్లను సమీక్షించింది. రెపో రేటును 4 శాతం నుంచి 4.40 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది’’అని ఇండియన్ బ్యాంకు ప్రకటన విడుదల చేసింది. -
సెక్యూరిటైజ్డ్ ఆస్తల విలువ...రూ.1.25 లక్షల కోట్లు!
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), గృహ రుణ సంస్థల (హెచ్ఎఫ్సీలు) సెక్యూరిటైజ్డ్ (రక్షణతో కూడిన) రుణ ఆస్తులు గడిచిన ఆర్థిక సంవత్సరంలో 43 శాతం పెరిగి రూ.1.25 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం కలిసొచ్చింది. 2020–21 సంవత్సరానికి సెక్యూరిటైజ్డ్ రుణ ఆస్తులు రూ.87,300 కోట్లుగా ఉన్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) చివరికి ఇవి కరోనా ముందున్న రూ.2 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా వేసింది. ‘‘2021–22లో సెక్యూరిటైజ్డ్ రుణ ఆస్తుల వృద్ధికి ప్రధాన కారణం.. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో బేస్ తక్కువగా ఉండడంతోపాటు.. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం. కరోనా మూడో విడతలో అవరోధాలు తక్కువగా ఉండడమే’’ అని ఇక్రా తెలిపింది. చెల్లింపులు సక్రమంగా జరిగే రుణాలనే సెక్యూరిటైజ్డ్ రుణ ఆస్తులుగా పేర్కొంటారు. మోర్ట్గేజ్, రుణాలు, బాండ్లు, క్యాపిటల్ మార్కెట్లలో జారీ చేసే సెక్యూరిటీలు వీటి కిందకు వస్తాయి. ఈ తరహా రిటైల్ రుణాలు రూ.1.1 లక్షల కోట్లుగా ఉంటే, హోల్‌సేల్ రుణ ఆస్తులు రూ.15,000 కోట్లుగా ఉన్నాయి. -
కొంటే ఖర్సయిపోతారు..!
ఆన్లైన్ షాపింగ్. ముందు రూపాయి కట్టక్కర్లేదు. వడ్డీ కూడా లేదు. తీరిగ్గా తర్వాత ఇద్దురు. ఏంటి ఇదంతా.. అనుకుంటున్నారా..? అదే బై నౌ పే లేటర్. లేదా స్పెండ్ నౌ పే లేటర్. అమెజాన్ వంటి దిగ్గజాలు, బడా బ్యాంకుల నుంచి, చిన్న ఎన్బీఎఫ్సీ సంస్థల వరకు క్రెడిట్ ఇచ్చేందుకు బారులు తీరాయి. వినియోగం ఆధారంగా అవి అరువు ఇచ్చేస్తాయి. కాకపోతే వాడేసుకోవడమా.. లేక వేరే మార్గం చూసుకోవడమా? అన్న విచక్షణ వినియోగదారులదే. బీఎన్‌పీఎల్ రూపంలో లభించే క్రెడిట్ స్వల్ప మొత్తమే. కానీ, వీటిని సరిగ్గా నిర్వహించకపోతే తెలియకుండానే బ్యాలన్స్ కరిగిపోతుంది. 15–30 రోజుల వరకు వడ్డీ ఉండదు. మర్చిపోయారా..? అరువు ఇచ్చిన కంపెనీలకు అవకాశం ఇచ్చినట్టే. అవి తమకు నచ్చిన వడ్డీ బాదుడు షురూ చేస్తాయి. పెనాల్టీ అంటాయి. చెల్లించాల్సింది రూ.200 అయినా.. రూ.50–100 వరకు పిండేస్తాయి. కొరివితో తలగోక్కున్నట్టు కోరి క్రెడిట్ స్కోరును దెబ్బతీసుకున్నట్టు అవుతుంది. ∙ బ్యాంకు ఖాతాలో రూపాయి లేకపోయినా కొనుగోళ్లకు వీలు కల్పించేది క్రెడిట్ కార్డు. అయితే, ఇప్పటికీ దేశంలో క్రెడిట్ కార్డు విస్తరణ చాలా పరిమితంగానే ఉంది. ఇదే చక్కటి అవకాశంగా భావించి ఫిన్‌టెక్ సంస్థలు బీఎన్‌పీఎల్ రూపంలో మార్కెట్లో చొచ్చుకుపోయే క్రమంలో ఉన్నాయి. క్రెడిట్ కార్డుపై లభించేది రుణమే. బై నౌ పే లేటర్ రూపంలో వచ్చేదీ కూడా రుణమే. రెండింటిపైనా నిర్ణీత కాలం పాటు వడ్డీ ఉండదు. సారూప్యతలు అంతవరకే. కంటికి కనిపించని అంశాలు బీఎన్‌పీఎల్ సదుపాయంలో ఎన్నో ఉన్నాయి. ∙ ఇప్పుడు కొను, తర్వాత చెల్లించు (బై నౌ.. పే లేటర్/బీఎన్‌పీఎల్) చాలా మందిని ఆకర్షిస్తున్న సదుపాయం. క్రెడిట్ కార్డు మాదిరి ముందు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ కామర్స్ సంస్థలు, ఆన్లైన్ మార్కెట్ ప్లాట్‌ఫామ్‌లతో జతకట్టి ఎన్బీఎఫ్సీ సంస్థలు ఇస్తున్న ముందస్తు రుణ సదుపాయం. దీనికి పాన్ నంబర్ ఉంటే సరిపోతుంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య పోటీ వల్ల పుట్టుకొచ్చిన కొత్త సాధనమే ఇది. చార్జీలు/ఫీజులు 15–30 రోజుల పాటు వడ్డీ లేని రుణ సదుపాయమే బీఎన్‌పీఎల్. ఇచ్చిన గడువులోపు చెల్లిస్తే రూపాయి అదనంగా కట్టాల్సిన పరిస్థితి ఉండదు. రుణం కనుక అశ్రద్ధ చూపినా, సకాలంలో చెల్లింపులు చేయకపోయినా తర్వాత భారాన్ని మోయాల్సి రావచ్చు. గడువు దాటితే మిగిలిన బ్యాలన్స్ మొత్తంపై 10–30 శాతం మేర వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. గడువు తర్వాత చెల్లించేవారు వడ్డీకి అదనంగా లేట్ ఫీజు కూడా కట్టాలి. కన్వినియన్స్ ఫీజు పేరుతో నెలవారీ వ్యయంపై 1–3 శాతం మధ్య వసూలు చేసే సంస్థలు కూడా ఉన్నాయి. బీఎన్‌పీఎల్ సంస్థలు ఓలా పోస్ట్‌పెయిడ్, జెస్ట్‌మనీ, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పే లేటర్, యూని, పేటీఎం పోస్ట్‌పెయిడ్, స్లైస్, యూనికార్డ్స్ ఇలా ఎన్నో సంస్థలు బై నౌ పే లేటర్ పేరుతో క్రెడిట్‌ను ఆఫర్ చేస్తున్నాయి. రుణ సదుపాయం ఆన్లైన్లో వస్తువులు లేదా సేవల కోసం బీఎన్‌పీఎల్‌తో ఆర్డర్ చేసేయవచ్చు. నిర్ణీత కాలంలోపు వడ్డీ లేకుండా తీర్చేయాలి. ఇది అన్సెక్యూర్డ్ రుణం. దీంతో ఆన్లైన్ మార్కెట్లో ఈ సదుపాయాన్ని వినియోగించుకునే వారు పెరుగుతున్నారు. క్రెడిట్ కార్డుపై రూ.లక్షల రుణ సదుపాయం లభిస్తుంది. కానీ, బీఎన్‌పీఎల్ అలా కాదు. ఇవి చిన్న రుణాలు. ఎక్కువ శాతం రూ.2,000 నుంచి రూ.15,000 మధ్య రుణ సదుపాయం (క్రెడిట్లైన్) ఉంటుంది. స్మాల్ టికెట్ లోన్స్గా చెబుతారు. పేమెంట్ ఆప్షన్ పేజీలో బీఎన్‌పీఎల్ ఫీచర్ కనిపిస్తుంది. ఈ సదుపాయం కోసం కస్టమర్ ఆయా ప్లాట్‌ఫామ్‌లపై ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి. ఇది ఒక్కసారి యాక్టివేట్ అయితే అది మీ క్రెడిట్ రిపోర్ట్‌లో రుణ సదుపాయంగానే ప్రతిఫలిస్తుంది. రుణ గ్రహీతలు బీఎన్‌పీఎల్ కింద పొందిన రుణ సదుపాయాన్ని ఒకే సారి తీర్చే వెసులుబాటు లేకపోతే అప్పుడు ఈఎంఐ కిందకు మార్చుకోవచ్చు. కానీ, అన్సెక్యూర్డ్ రుణం కనుక గడువులోపు తీర్చేయడమే మంచిది. లేదంటే క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. కొన్ని సంస్థలు ఎటువంటి వడ్డీ విధించకుండా బిల్లు మొత్తాన్ని మూడు, నాలుగు నెలల సమాన వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. బీఎన్‌పీఎల్ రూపంలో వచ్చే రుణాన్ని ఎన్బీఎఫ్సీలు లేదా బ్యాంకులు అందిస్తుంటాయి. ఉదాహరణకు పేటీఎం బీఎన్‌పీఎల్ అన్నది ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌తో ఒప్పందంపై అందిస్తున్న సదుపాయం. అమెజాన్ బీఎన్‌పీఎల్ అన్నది అమెజాన్ ఇండియా అందిస్తున్న సదుపాయం. ఇక ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ సదుపాయాన్ని ఆ సంస్థతో ఒప్పందంపై ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు సమకూరుస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం ఇలా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్/ఈకామర్స్ సంస్థ ఏదైనా కావచ్చు.. రుణ గ్రహీత, రుణదాతలను కలిపే వేదికలుగానే పనిచేస్తాయి. రుణ సదుపాయంతో వాటికి ప్రత్యక్ష సంబంధం ఉండదు. చెల్లింపుల్లో విఫలమైతే.. మొదట లేట్ ఫీజు పడుతుంది. ఫ్లిప్‌కార్ట్ అయితే తీర్చాల్సిన బ్యాలన్స్ రూ.100–500 మధ్య ఉంటే, విఫలమైన రుణగ్రహీతలకు రూ.60 చార్జీ విధిస్తోంది. రూ.5,000 అంతకుమించి మొత్తం చెల్లించడంలో విఫలమైతే అప్పుడు రూ.600 వరకు చార్జీ పడుతుంది. అమెజాన్ పే లేటర్ అయితే చెల్లించని మొత్తం రూ.200లోపు ఉంటే ఆలస్యపు రుసుం అమలు చేయడం లేదు. కానీ, పెనాల్టీ రూపంలో రూ.100–600 వరకు రాబడుతోంది. జీఎస్టీ అదనం చెల్లించాల్సి రావచ్చు. దీనికితోడు రుణం ఇచ్చిన సంస్థ వసూలుకు చర్యలు ప్రారంభించొచ్చు. రుణ గ్రహీత వివరాలను అవి క్రెడిట్ బ్యూరోలకు పంపిస్తాయి. ఇది క్రెడిట్ స్కోరును ప్రభావితం చేస్తుంది. దీంతో భవిష్యత్తు రుణాలు మరింత భారంగా మారతాయి. క్రెడిట్ డీలింక్వెన్సీగా క్రెడిట్ బ్యూరోలకు రుణ సంస్థలు సమాచారం ఇస్తాయి. కనీస బ్యాలన్స్ చెల్లించి మిగిలిన రుణాన్ని క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. అయినప్పటికీ అది కూడా క్రెడిట్ స్కోరును ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోవాలి. కస్టమర్ రిజిస్టర్ చేసుకున్న, వినియోగించుకున్న ప్రతీ బీఎన్‌పీఎల్ కూడా ఒక రుణం కింద వారి క్రెడిట్ రిపోర్ట్‌లో చేరుతుంది. కొద్ది బ్యాలన్స్ కోసం బీఎన్పీఎల్ను వాడేసుకుని మర్చిపోయారనుకోండి. ఇలా ఒకటికి మించిన రుణ సదుపాయాలు అన్నీ కలసి తలనొప్పిగా మారొచ్చు. క్రెడిట్ స్కోరు క్షీణిస్తుంది. దీనికంటే క్రెడిట్‌కార్డు మెరుగైన సాధనం అవుతుంది. 30–45 రోజుల క్రెడిట్ పీరియడ్‌తో వస్తుంది. కావాలంటే ఈఎంఐ కిందకు బ్యాలన్స్‌ను మార్చుకోవచ్చు. రుణ పరిమితి అధికంగా ఉంటుంది. యాక్టివేట్ అయినట్టే.. శ్రీరామ్ ఏప్రిల్ నెల క్రెడిట్ స్కోరు క్షీణించడాన్ని గమనించాడు. కారణం ఏంటా అని క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలించగా.. ఆశ్చర్యపోవడం అతని వంతు అయింది. ‘‘క్యాపిటల్ ఫ్లోట్, కరూర్ వైశ్యా బ్యాంకు (కేవీబీ) నుంచి రెండు రుణాలు అతడి రిపోర్ట్‌లో యాక్టివ్‌గా కనిపించాయి. ఆయా సంస్థల నుంచి శ్రీరామ్ రుణాలు తీసుకోలేదు. దాంతో అవి ఎందుకు తన రిపోర్ట్‌లో వచ్చాయో మొదట అర్థం కాలేదు. క్రెడిట్ కార్డు తప్పించి అతడి పేరిట మరే రుణం లేదు. ఈ రెండూ బీఎన్‌పీఎల్ రుణాలని అతడికి తర్వాత తెలిసింది. అమెజాన్ పే లేటర్ సదుపాయం కోసం ఒకటి రెండు సార్లు అతడు లాగిన్ అయ్యాడు కానీ, బ్యాంకు ఖాతాను లింక్ చేయలేదు. అయినా కానీ, క్రెడిట్ సదుపాయాన్ని యాక్టివేస్ చేసేసింది సదరు సంస్థ. ఇది శ్రీరామ్ ఒక్కడి విషయంలోనే కాదు. చాలా మందికి ఎదురవుతున్న అనుభవం. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాలపై ప్రస్తావిస్తున్నారు. తమ తరఫున బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణ సదుపాయాన్ని పలు ప్లాట్‌ఫామ్‌లు పొందుతున్నట్టు ఆరోపిస్తున్నారు. తమ అనుమతి లేకుండా రుణ సదుపాయాన్ని పొందినట్టు చేస్తున్న ఆరోపణ నిజం కాదు. ‘‘వినియోగదారులు తాము క్రెడిట్లైన్ కోసం సైనప్ చేసుకున్నామే కానీ, రుణం కోసం కాదని భావిస్తుంటారు. క్రెడిట్లైన్ అన్నది ఒక రుణ పరిమితి. వినియోగదారులు దీన్ని వినియోగించుకోవచ్చు. వినియోగించుకోకపోవచ్చు. కానీ, దీన్ని బుక్స్‌లో రుణంగానే పేర్కొంటారు’’ అని ‘యూని’ సంస్థ సీఈవో, వ్యవస్థాపకుడు నితిన్ గుప్తా తెలిపారు. అందుకే వీటిని క్రెడిట్ నివేదికల్లో పేర్కొనడం జరుగుతుందన్నారు. ఆయా అంశాల నేపథ్యంలో ఈ కొత్త వ్యవస్థ పట్ల తస్మాత్ జాగ్రత్త. -
2022-23లో పెరగనున్న ఎన్బీఎఫ్సీ ఆస్తులు
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల(ఎన్బీఎఫ్సీలు) నిర్వహణలోని ఆస్తులు(రుణాలు/ఏయూఎం) వచ్చే ఆర్థిక సంవత్సరంలో(2022–23)లో 8-10 శాతం వరకు పెరుగుతాయని ఇక్రా రేటింగ్స్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఆస్తుల వృద్ధి 5-7 శాతంగా ఉండొచ్చని తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (గృహ రుణాలు ఇచ్చే సంస్థలు/హెచ్ఎఫ్సీలు) ఆస్తులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8-10 శాతం మేర, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9-11 శాతం వరకు పెరుగుతాయని తెలిపింది. ఎన్బీఎఫ్సీలలో రిటైల్ విభాగం, వ్యక్తిగత రుణాలు, మైక్రోఫైనాన్స్, బంగారం రుణాలు ప్రధానంగా వృద్ధికి దోహదపడతాయని వివరించింది. వాహన రుణాలు, వ్యాపార రుణాలు ఇప్పటికీ సమస్యలను ఎదుర్కొంటున్నట్టు పేర్కొంది. ఈ విభాగాల్లో ఆస్తుల నాణ్యత అంశాలు ఇంకా సమసిపోలేదని గుర్తు చేసింది. ఎన్బీఎఫ్సీ హోల్‌సేల్ రుణాల ఏయూఎం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్షీణిస్తుందని అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం, మూడో త్రైమాసికంలో రుణాల పంపిణీ అంచనాలను సవరించామని.. కరోనా మూడో విడత ప్రభావం తక్కువగానే ఉండడంతో నాలుగో త్రైమాసికంలో (2022 జనవరి-మార్చి) సవరించొచ్చని పేర్కొంది. రుణాల మంజూరులో వృద్ధి ఆరోగ్యకరంగా ఉన్నట్టు తెలిపింది. ‘‘ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలకు రానున్న ఆర్థిక సంవత్సరంలో వ్యాపార వృద్ధి కోసం రూ.1.8-2.2 లక్షల కోట్ల తాజా నిధులు అవసరమవుతాయి’’ అని ఈ నివేదిక వెల్లడించింది. (చదవండి: దేశంలో క్రిప్టోకరెన్సీ ప్రవేశపెట్టే ఆలోచన లేదు: కేంద్రం) -
వాహనాల ఫైనాన్స్ విభాగంపై దెబ్బే, క్యూ3పై క్రిసిల్ రేటింగ్ కీలక వ్యాఖ్యలు!
మొండిపద్దుల వర్గీకరణ నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ సవరించడం వల్ల మూడో త్రైమాసికంలో నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్బీఎఫ్సీ) నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) పరిమాణం 1.50 శాతం ఎగిసి 6.80 శాతానికి చేరిందని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. ఒకవేళ నిబంధనలను సవరించకపోయి ఉంటే స్థూల ఎన్పీఏలు (జీఎన్‌పీఏ) 0.30 శాతం మేర తగ్గి 5.3 శాతానికి దిగి వచ్చేవని పేర్కొంది. అయితే, ఎకానమీలో ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడుతుండటం, చాలా మటుకు ఎన్బీఎఫ్సీలు .. తమ వసూళ్ల ప్రక్రియను పటిష్టం చేసుకోవడం తదితర పరిణామాల కారణంగా రాబోయే రోజుల్లో ఎన్‌బీఎఫ్‌సీల జీఎన్‌పీఏలు క్రమంగా తగ్గగలవని క్రిసిల్ ఒక నివేదికలో వివరించింది. డిసెంబర్ క్వార్టర్‌కి ఎన్పీఏల వర్గీకరణ విధానాన్ని సవరిస్తూ ఆర్బీఐ గతంలో ఒక సర్క్యులర్ జారీ చేసింది. పలు విభాగాలపై దీని ప్రభావం వివిధ రకాలుగా ఉందని క్రిసిల్ తెలిపింది. బంగారం రుణాల విభాగం మెరుగ్గానే ఉండగా.. వాహనాల ఫైనాన్స్ విభాగంపై అత్యధికంగా ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొంది. అయితే, సర్క్యులర్‌లో నిబంధనల అమలును ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ ఆర్బీఐ వాయిదా వేయడంతో ఎన్‌బీఎఫ్‌సీలకు కాస్త వెసులుబాటు లభించవచ్చని క్రిసిల్ తెలిపింది. -
కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త..!
న్యూఢిల్లీ: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త తెలిపింది. కొత్త ఏడాది సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అర్హులైన గృహ రుణ దరఖాస్తుదారులకు తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్స్ ఇవ్వనున్నట్లు గతంలో పేర్కొంది. ఈ ఆఫర్ కింద గృహ రుణాలపై వడ్డీ రేట్లు 6.65% నుంచి ప్రారంభమవుతాయి. అయితే, ప్రస్తుతం ఉన్న ఆఫర్ గడువు తేదీని ఫిబ్రవరి 28 వరకు పొడగిస్తున్నట్లు పేర్కొంది. అయితే, ఆఫర్ పొందాలంటే కొన్ని షరతులు కూడా విధించింది. ఈ ఆఫర్ పొందాలంటే రుణ దరఖాస్తుదారుడు వేతన ఉద్యోగి, వైద్యుడు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యి ఉండాలి. వేతన దరఖాస్తుదారులు కనీసం 3 సంవత్సరాల పాటు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగ సంస్థ లేదా బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేసి ఉండాలి. ఎంబిబిఎస్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత కలిగిన వైద్యులు, ఆసుపత్రి లేదా రిజిస్టర్డ్ హెల్త్ కేర్ ప్రొవైడర్‌తో లేదా వారి స్వంత ప్రాక్టీస్‌లో కనీసం 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం వైద్యులకు ఉండాలి. ప్రాక్టీస్ సర్టిఫికేట్, 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ఈ ఆఫర్ పొందవచ్చు. కొత్త ఏడాది సందర్భంగా తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం క్రెడిట్ స్కోర్ 800 లేదా అంతకంటే ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది అని తెలిపింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. 750 - 799 మధ్య సిబిల్ స్కోరు ఉన్నవారికి రుణదాత గృహ రుణాలను 6.65% కంటే స్వల్ప మొత్తంలో ఎక్కువగా వడ్డీ రేట్లను అందిస్తున్నట్లు తెలిపింది. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఫిబ్రవరి 28 నాటికి దరఖాస్తు చేసిన దరఖాస్తుదారులు, మార్చి 31 వరకు పంపిణీ చేసిన రుణాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇంకా, కొత్త గృహ రుణం కోసం చూస్తున్న వారు, అలాగే తమ ప్రస్తుత గృహ రుణాన్ని మరొక రుణదాత నుంచి బదిలీ చేయాలని చూస్తున్నవారు ఈ ఆఫర్‌కు అర్హులు. (చదవండి: ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణ.. హిమాలయన్ 'యోగి'ల.. అదృశ్య కథ..!) -
జొమాటో సంచలన నిర్ణయం..!
రెస్టారెంట్ అగ్రిగేటర్, ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సేవల వ్యాపారంలోకి ప్రవేశించాలని కంపెనీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. జొమాటో యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీను ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలను కంపెనీ ముమ్మరం చేసింది. ఫుడ్ డెలివరే కాదు..లోన్లను కూడా..! నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇన్‌క్రెడ్‌తో జొమాటో 2020లోనే ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా జొమాటోకు చెందిన రెస్టారెంట్ భాగస్వాములకు రుణాలను అందజేస్తుంది. ప్రస్తుతం జొమాటో తీసుకున్న నిర్ణయంతో త్వరలోనే రుణాలను అందజేసే అవకాశం ఉంది. కరోనావైరస్ (కోవిడ్-19) మహమ్మారి ఫుడ్ డెలివరీ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. ఇది స్థూల సరుకుల విలువలో గణనీయమైన క్షీణతకు దారితీసింది. పేరు ఇంకా ఖరారు కాలేదు..! రూ.10 కోట్లతో ఎన్బీఎఫ్సీని ఏర్పాటు చేయాలని జొమాటో భావిస్తోంది. ఇది పూర్తిగా జొమాటో అనుబంధ సంస్థగా ఉండనుంది. కాగా సబ్సీడరీ కంపెనీకి ఏ పేరు పెట్టాలనేది కంపెనీ ఇంకా నిర్ణయించలేదని సమాచారం.ఈ సంస్థకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలు మంత్రిత్వశాఖ, ఆర్బీఐ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదానికి లోబడి కంపెనీ పేరు ఖరారు చేయబడుతుందని జొమాటో బిఎస్ఇకి ఇచ్చిన ఫైలింగ్‌లో తెలిపింది. ఇదిలా ఉండగా హైదరాబాద్‌కు చెందిన యాడ్ఆన్మో అనే స్టార్టప్‌లో జొమాటో వాటాలను కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా అర్భన్ పైపర్ కంపెనీలో కూడా 5 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఇప్పటికే షిస్‌రాకెట్, సామ్‌సెట్ టెక్నాలజీస్, క్యూర్ ఫిట్ వంటి సంస్థల్లో వాటాలు కొనుగోలు చేసింది. చదవండి: ప్రభుత్వం చేయలేనిది.. టాటా గ్రూపు చేసి చూపింది -
బ్యాంకుల్లో పాలన మెరుగుపడాలి
ముంబై: బ్యాంకుల్లో కార్పొరేట్గవర్నెన్స్ (పాలన) మరింత బలోపేతం కావాల్సిన అవసరాన్ని ఆర్బీఐ ప్రస్తావించింది. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకునే క్రమంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా తమ మూలధన నిధులను బలోపేతం చేసుకోవాలని, తగినన్ని నిల్వలు ఉండేలా చూసుకోవాలని సూచించింది. ‘భారత్‌లో బ్యాంకింగ్ ధోరణులు, పురోగతి 2020–21’ పేరుతో వార్షిక నివేదికను ఆర్బీఐ మంగళవారం విడుదల చేసింది. ‘‘కరోనా మహమ్మారి చూపించిన ప్రభావం వల్ల కార్పొరేట్, గృహాలు ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వం, ఆర్బీఐ కలసికట్టుగా ఆర్థిక స్థిరత్వ సవాళ్లను కట్టడి చేయగలిగాయి. ఆర్థిక వ్యవస్థ కోలుకునే క్రమంలో వచ్చే సవాళ్లకు తగ్గట్టు బ్యాంకులు బ్యాలన్స్‌షీట్లను బలోపేతం చేసుకోవాలి’’అని అభిప్రాయపడింది. ఆర్థిక వృద్ధిపైనే.. ఇకమీదట బ్యాంకు బ్యాలన్స్ షీట్లు పుంజుకోవడం అన్నది ఆర్థిక వృద్ధిపైనే ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. 2021–22లో ఇప్పటి వరకు చూస్తే రుణ వృద్ధి పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నాటికి ఆరు నెలల్లో డిపాజిట్లు 10 శాతం వృద్ధి చెందాయి. గతేడాది ఇదే కాలంలో ఇది 11 శాతం మేర ఉంది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల స్థూల ఎన్పీఏల నిష్పత్తి 2020 మార్చి నాటికి 8.2 శాతంగా ఉంటే, 2021 మార్చి నాటికి 7.3 శాతానికి తగ్గింది. 2021 సెప్టెంబర్ నాటికి 6.9 శాతానికి దిగొచ్చింది’’ అని వివరించింది. సవాళ్లను అధిగమించేందుకు వ్యూహాత్మక విధానం భవిష్యత్తు సవాళ్లను అధిగమించేందుకు భారత ఆర్థిక వ్యవస్థకు శ్రద్ధతో కూడిన వ్యూహాత్మక విధానం అనుసరణీయమని ఆర్బీఐ పేర్కొంది. వాతావణం మార్పులు, టెక్నాలజీ ఆవిష్కరణలు, కరోనా మహమ్మారి కారణంగా ఎదురవుతున్న సవాళ్లను నివేదికలో ప్రస్తావించింది. వాతావరణ మార్పుల తాలూకు సంస్థాగత ప్రభావం ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్థిరత్వంపై ఏ మేరకు ఉంటుందో మదింపు చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు రుణాలు (గ్రీన్ ఫైనాన్స్), ద్రవ్యోల్బణం, వృద్ధి తదితర స్థూల ఆర్థిక అంశాలపై వాతావరణ మార్పుల ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకునేందుకు అధ్యయనం చేస్తున్నట్టు వివరించింది. ఎన్బీఎఫ్సీలు నిలదొక్కుకోగలవు రానున్న రోజుల్లో బ్యాంకిగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) నిలదొక్కుకుని బలంగా ముందుకు సాగుతాయన్న విశ్వాసాన్ని ఆర్బీఐ వ్యక్తం చేసింది. టీకాలు విస్తృతంగా ఇవ్వడం, ఆర్థిక వ్యవస్థ పుంజకుంటూ ఉండడం అనుకూలిస్తుందని పేర్కొంది. కరోనా మహమ్మారి ఎన్‌బీఎఫ్‌సీల సామర్థ్యాన్ని పరీక్షించినప్పటికీ.. ఈ రంగం బలంగా నిలబడి, తగినంత వృద్ధితో కొనసాగుతున్నట్టు తెలిపింది. కోపరేటివ్ బ్యాంకులు విస్తరించాలి కరోనా మహమ్మారి కాలంలో పట్టణ, గ్రామీణ సహకార బ్యాంకింగ్ (కోపరేటివ్ బ్యాంకులు) రం గం బలంగా నిలబడినట్టు ఆర్బీఐ తెలిపింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకునే కొద్దీ ఇవి మరింత బలోపేతమై, విస్తరించాల్సి ఉందని పేర్కంది. వీటి నిధుల స్థాయి, లాభాలు మెరుగుపడినట్టు తెలిపింది. ప్రాథమిక నమూనాలోనే డిజిటల్ కరెన్సీ సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విషయంలో తొలినాళ్లలో ప్రాథమిక నమూనాతోనే వెళ్లడం సరైనదన్న అభిప్రాయంతో ఆర్బీఐ ఉంది. ‘సమగ్రంగా పరీక్షించాలి. అప్పుడే ద్రవ్య విధానం, బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభావం పరిమితంగా ఉంటుంది’ అని పేర్కొంది. నగదుకు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన, బలమైన, సౌకర్యవంతమైన సాధనంగా ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది. పౌరులకు, ఆర్థిక సంస్థలకు ప్రతిష్టాత్మక సీబీడీసీని అందించడంపైనే భారత చెల్లింపుల పురోగతి ఆధారపడి ఉంటుందని పేర్కొంది. రూ.36,342 కోట్ల మోసాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి ఆరు నెలల్లో బ్యాంకింగ్ రంగంలో మోసాలకు సంబంధించి 4,071 కేసులు నమోదయ్యాయి. మోసపోయిన మొత్తం రూ.36,342 కోట్లుగా ఉందని ఆర్బీఐ తన నివేదికలో వెల్లడించింది. వీటిల్లో రుణ మోసాలే ఎక్కువగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో మోసపూరిత కేసులు 3,499తో పోలిస్తే పెరిగాయి. కానీ, గతేడాది మోసాల విలువ రూ.64,261 కోట్లతో పోలిస్తే సగం మేర తగ్గింది. వీటిని మరింత వివరంగా చూస్తే.. ‘‘2021–22 మొదటి ఆరు నెలల్లో రుణ మోసాలకు సంబంధించి 1,802 కేసులు నమోదు అయ్యాయి. వీటితో ముడిపడిన మొత్తం రూ.35,060 కోట్లు. కార్డు, ఇంటర్నెట్ రూపంలో మోసాలకు సంబంధించి నమోదైన కేసులు 1,532. వీటి విలువ రూ.60 కోట్లే’’ అని నివేదిక తెలియజేసింది. డిపాజిట్లకు సంబంధించి 208 మోసాలు నమోదైనట్టు, వీటి విలువ రూ.362 కోట్లుగా పేర్కొంది. -
ఎన్‌బీఎఫ్‌సీల రుణ వృద్ధి 10శాతం!
ముంబై: బ్యాంకింగ్ యేతర ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) రుణ వృద్ధి 2021–22 ఆర్థిక సంవత్సరంలో 8 నుంచి 10 శాతం వరకూ నమోదవుతుందని క్రిసిల్ రేటింగ్స్ తాజా నివేదిక తెలిపింది. ఆర్థిక క్రియాశీలత మెరుగుపడ్డం, పటిష్ట బ్యాలెన్స్ షీట్స్ నిల్వలు ఇందుకు కారణంగా పేర్కొంది. నివేదికలోని ముఖ్యాంశాలు చూస్తే... - ఎన్‌బీఎఫ్‌సీల రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6 నుంచి 8 శాతం ఉంటుందని భావిస్తున్నాం. కరోనా తీవ్ర సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు కేవలం 2 శాతం. - నాన్ బ్యాంక్ రుణదాతల స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) 25 నుంచి 300 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెరిగే అవకాశం ఉంది. - అధిక లిక్విడిటీ, మూలధనం, ప్రొవిజినింగ్ బఫర్స్ (ఎన్పీఏలకు కేటాయింపులు) వంటి అంశాల్లో ఇటీవలి కాలంలో ఎన్బీఎఫ్సీలు పటిష్టంగా ఉన్నాయి. దీనికితోడు ఆర్థిక క్రియాశీలత కూడా తోడవడంతో, వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వాటికి తగిన పటిష్ట స్థితి నెలకొంది. - ప్రస్తుత, రానున్న త్రైమాసికాల్లో రిటైల్ రుణాలు భారీగా పెరిగే వీలుంది. డిమాండ్, విక్రయాలు పెరిగడం దీనికి కారణం. - బంగారం, గృహ, అన్సెక్యూర్డ్ రుణాల విషయంలో వృద్ధి వేగం అధికంగా ఉండవచ్చు. కాగా, కోవిడ్–19 తాజా వేరియంట్ ప్రస్తుత ఆందోళనలకు కారణం అవుతోంది. వ్యవస్థలపై ఇది ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న విషయాన్ని వేచిచూడాల్సి ఉంది. చదవండి:HDFC Report: బేస్ ఎఫెక్ట్ ప్రభావంతో 9.4 శాతం వృద్ధి -
ఇంటి ఈఎమ్ఐ సరైన సమయానికి చెల్లించకపోతే ఏమవుతుంది..?
ప్రజలు సాధారణంగా తమ కలల గృహాన్ని కొనుగోలు చేయడం కోసం గృహ రుణం(Home Loan) తీసుకుంటారు. గృహ రుణాలు ఎక్కువగా దీర్ఘకాలం వరకు ఉంటాయి. అయితే గృహరుణం తీసుకున్న తర్వాత కొందరు ఉపాధి కోల్పోవడం, ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాల వల్ల రుణ వాయిదాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలా వాయిదాలు.. వాటిపై వడ్డీ, రుసుములు పెరిగి ఓ పెద్ద గుదిబండగా మారతాయి. ఒక్కోసారి తిరిగి చెల్లించలేని పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మనం గృహ రుణాల ఈఎమ్ఐ చెల్లించకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురు అవుతాయి. అవేంటో తెలుసుకుందాం.. క్రెడిట్ స్కోరుపై ప్రభావం మీరు గనుక హోమ్ లోన్ ఈఎమ్ఐ కట్టకపోతే ఆలస్య ఫీజులు కింద జరిమానాలు విధిస్తారు. ఈ పెనాల్టీ ఛార్జ్ సాధారణంగా ఈఎమ్ఐలో 1-2% వరకు ఉంటుంది. అయితే, పరిస్థితిని బట్టి, కొన్ని సందర్భాల్లో డిఫాల్ట్ కాలానికి మొత్తం బకాయి మొత్తంపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రుణదాత వసూలు చేసే ఆలస్య ఫీజులకు ఇది అదనంగా ఉంటుంది. ఒక్క ఈఎమ్ఐ పేమెంట్ కట్టకపోయిన అది మీ క్రెడిట్ హిస్టరీపై ప్రభావం చూపిస్తుంది. మీ ఇంటి రుణంపై సింగిల్ డిఫాల్ట్ వల్ల మీ క్రెడిట్ స్కోరు 50-70 పాయింట్ల వరకు తగ్గవచ్చు. అటువంటి పరిస్థితి వల్ల తర్వాత ఏదైనా లోన్ పొందే అవకాశం కోల్పోతారు.(చదవండి: ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి దూసుకొస్తున్న కొత్త కంపెనీలు) నిరర్ధక ఆస్తిగా లోన్ అయితే, ఒకవేళ మీరు ఈఎమ్ఐని మిస్ అయినట్లయితే చివరి పేమెంట్ చేసిన 90 రోజుల్లోగా కట్టాల్సి ఉంటుంది. ఇది చిన్న డిఫాల్ట్ గా వర్గీకరిస్తారు. మీరు సకాలంలో దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లయితే దాని ప్రభావం నుంచి మీరు కోలుకోవచ్చు. మిస్ అయిన ఈఎమ్ఐని తర్వాత గడువు తేదీనాటి నుంచి చెల్లించండి. అలాగే, మిగతా ఈఎమ్ఐలను మిస్ కాకుండా చూసుకోండి. ఉద్యోగ నష్టం/ ఆరోగ్య పరిస్థితుల వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే రుణదాతను సంప్రదించండి. వారిని ఏదైనా పరిష్కారం చెప్పమనండి. మీ రుణం నిరర్ధక ఆస్తి(ఎన్‌పిఎ)గా మారడానికి ముందు మీ బకాయిలను చెల్లించడానికి మీకు 90 రోజుల గడువు ఉంది. ఒకవేళ మీరు 90 రోజుల తర్వాత కూడా మీ ఈఎమ్ఐ బకాయిలను తిరిగి చెల్లించలేకపోతే SARFAESI 2002 చట్టం ప్రకారం.. మీ ఆస్తిని వేలం వేసే హక్కు రుణదాతకు లభిస్తుంది. కాబట్టి, అలా౦టి పరిస్థితుల నుంచి తప్పి౦చుకోవడానికి ము౦దుగానే చర్యలు తీసుకో౦డి. గృహ రుణ ఎగవేత నుంచి తప్పించుకోవడం కోసం మీరు మీ రుణదాతను తక్కువ ఈఎమ్ఐ కోసం అభ్యర్థించవచ్చు.ఒకవేళ మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోయిన/మీ వ్యాపార కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లయితే ఈఎమ్ఐ చెల్లింపులపై బ్యాంకులు మీకు మూడు నుంచి ఆరు నెలల మాఫీని ఇవ్వవచ్చు. అయితే, రుణదాత తర్వాత ఈ కాలానికి బకాయి రుణ మొత్తంపై వడ్డీని వసూలు చేయవచ్చు. (చదవండి: రిలయన్స్ జియో సరికొత్త రికార్డు..!) ఆస్తిపై హక్కులు చేజారిపోతాయి మీరు ఇక రుణం చెల్లించని పక్షంలో మీకు రుణం ఇచ్చిన బ్యాంకులు, ఇతర సంస్థలు గానీ ఇంటి వాస్తవ విలువను అంచనా వేసి తర్వాత వేలం ప్రక్రియను ప్రారంభిస్తాయి. వేలానికి సంబంధించిన వివరాలను దినపత్రికలో ప్రచురిస్తాయి. ఒకవేళ వేలంలో పేర్కొన్న విలువ వాస్తవ విలువ కంటే తక్కువ అని యజమాని భావిస్తే ఆ సంస్థలను సంప్రదించవచ్చు. ఒకసారి ఇలా ఆస్తిని స్వాధీనం చేసుకున్న సంస్థలు దాన్ని విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం లేదా ఆ ఆస్తిపై హక్కులను వేరే సంస్థకు అప్పగించే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ అంత వేలం ద్వారా జరుగుతుంది. సంబంధిత ఇంటిని వేలంలో విక్రయించగా వచ్చిన మొత్తం నుంచి బ్యాంకు ముందుగా తన రుణ బకాయిలను సర్దుబాటు చేసుకున్న తర్వాత అదనంగా ఏమైనా మిగిలితే ఆ మొత్తాన్ని మీకు పంపిస్తుంది. మరో మార్గం ఇలాంటి సమస్య నుంచి మీరు బయటపడటానికి మీకు మరో మార్గం ఉంటుంది. బ్యాంక్/రుణం తీసుకున్న సంస్థ వేలం వేయడానికి ముందే మీరు ఆ ఇంటిని విక్రయించండి. ఎందుకంటే, రుణదాతలు ఎక్కువ సార్లు మార్కెట్ విలువ కంటే తక్కువకు ఆ ఇంటిని విక్రయిస్తాయి. దీని వల్ల మీరు మరింత నష్టపోయే అవకాశం ఉంది. అందుకని మీరు ఆ ఇంటిని విక్రయించగా వచ్చిన మొత్తం నుంచి ఈఎమ్ఐని ఒకేసారి క్లియర్ చేయండి. దీని వల్ల మీరు కొంత లాభపడే అవకాశం ఉంది. మీకు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండటానికి గృహ రుణం తీసుకునే ముందు మీ ఆదాయంలో 40% ఈఎమ్ఐ చెల్లింపులు ఉండే విధంగా చూసుకోండి. (చదవండి: ఆహా ఏమి అదృష్టం! ఏడాదిలో వారి దశ తిరిగింది) -
క్యూ2లో పెరగనున్న సెక్యూరిటైజేషన్
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల సెక్యూరిటైజేషన్ భారీగా ఎగసే వీలున్నట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అభిప్రాయపడింది. క్యూ2(జులై–సెపె్టంబర్)లో సెక్యూరిటైజేషన్ 45 శాతం జంప్‌చేయనున్నట్లు ఇక్రా రూపొందించిన తాజా నివేదిక పేర్కొంది. వీటి విలువ రూ. 25,000 కోట్లను తాకవచ్చని అంచనా వేసింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 17,200 కోట్ల విలువైన సెక్యూరిటైజేషన్ నమోదుకాగా.. గతేడాది(2020–21) క్యూ2లో ఈ విలువ రూ. 15,200 కోట్లకు చేరింది. ఒకేతరహా ఇల్లిక్విడ్ ఫైనాన్షియల్ అసెట్స్‌ను క్రోడీకరించి మార్కెట్లో విక్రయించగల సెక్యూరిటీలుగా రీప్యాకేజింగ్ చేయడాన్ని సెక్యూరిటైజేషన్‌గా పేర్కొనే సంగతి తెలిసిందే. వీటిని సంబంధిత ఇన్వెస్టర్లకు విక్రయిస్తారు. ఆర్బీఐ తీసుకువచి్చన తాజా మార్గదర్శకాల నేపథ్యంలో సెక్యూరిటైజేషన్ మార్కెట్ విస్తరించనున్నట్లు ఇక్రా తెలియజేసింది. దీంతో గత నెలలో పరిమాణరీత్యా 60 శాతం సెక్యూరిటైజేషన్ నమోదైనట్లు వెల్లడించింది. తొలి అర్ధభాగంలో... సెకండ్ వేవ్ పరిస్థితుల్లోనూ ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య రూ. 42,200 కోట్ల సెక్యూరిటైజేషన్‌కు వీలున్నట్లు ఇక్రా అంచనా వేసింది. గతేడాది ఇదే కాలంలో ఈ విలువ రూ. 22,700 కోట్లు మాత్రమేకాగా.. ఈ ఏడాది సెక్యూరిటైజేషన్ పరిమాణం రూ. 1.2 లక్షల కోట్లను తాకనున్నట్లు తాజాగా అభిప్రాయపడింది. ఇది 40% అధికమని తెలియజేసింది. -
ఎన్‌బీఎఫ్‌సీల ఏయూఎం డౌన్
ముంబై: నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) వెనకడుగు వేశాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో రుణ పంపిణీ తగ్గడం, పోర్ట్‌ఫోలియో విలువలు క్షీణించడం ప్రభావం చూపినట్లు రేటింగ్స్ సంస్థ ఇక్రా నివేదిక పేర్కొంది. అయితే గతేడాది(2020–21) ద్వితీయార్థంలో ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ(హెచ్ఎఫ్సీ)ల రుణ మంజూరీ పుంజుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. అంటే గత క్యూ3(అక్టోబర్–డిసెంబర్), క్యూ4(జనవరి–మార్చి)లతో పోలిస్తే త్రైమాసిక ప్రాతిపదికన ఈ క్యూ1లో 55 శాతం తిరోగమించినట్లు తెలియజేసింది. గతేడాది క్యూ1తో పోలిస్తే మారటోరియంలు లేని పరిస్థితుల్లో ఈ క్యూ1లో ఎన్‌బీఎఫ్‌సీల ఏయూఎం నీరసించినట్లు నివేదిక వివరించింది. హెచ్ఎఫ్సీల ఏయూఎం మాత్రం దాదాపు యథాతథంగా నమోదైనట్లు పేర్కొంది. పెంటప్ డిమాండ్ .. పెంటప్ డిమాండ్ కారణంగా ఈ జులైలో రుణ విడుదల ఒక్కసారిగా ఊపందుకున్నట్లు ఇక్రా నివేదిక వెల్లడించింది. ఈ స్పీడ్ కొనసాగేదీ లేనిదీ స్థూల ఆర్థిక సంకేతాలపై ఆధారపడి ఉంటుందని తెలియజేసింది. కోవిడ్–19 సెకండ్ వేవ్ ఎన్బీఎఫ్సీ రంగంలో రికవరీని తాత్కాలికంగా దెబ్బతీసినట్లు ఇక్రా వైస్‌ప్రెసిడెంట్, ఫైనాన్షియల్ రంగ హెడ్ మనుశ్రీ సగ్గర్ పేర్కొన్నారు. అయితే ఈ ఏడాదిలో రుణ మంజూరీ వార్షిక ప్రాతిపదికన 6–8 శాతం పుంజుకోగలదని అంచనా వేశారు. ఇక ఏయూఎం అయితే 8–10 శాతం స్థాయిలో బలపడవచ్చని అభిప్రాయపడ్డారు. గతే డాది లోబేస్ కారణంగా పలు కీలక రంగాల నుంచి డిమాండ్ మెరుగుపడనున్నట్లు తెలియజేశారు. ఆస్తుల నాణ్యతపై.. స్థానిక లాక్డౌన్ల కారణంగా ఈ క్యూ1లో ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తుల(రుణాల) నాణ్యత భారీగా బలహీనపడినట్లు ఇక్రా నివేదిక పేర్కొంది. అయితే వసూళ్లు ప్రోత్సాహకరంగానే ఉన్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది నికర రికవరీలు, రద్దులతో కూడిన ఓవర్డ్యూస్లో 0.5–1 శాతం పెరుగుదల నమోదుకావచ్చని అంచనా వేసింది. ఇవి ఇకపై లాక్డౌన్లు ఉండబోవన్న అంచనాలుకాగా.. రుణ నాణ్యతపై ఒత్తిళ్లు కొనసాగనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుత అనిశి్చతుల నేపథ్యంలో రైటాఫ్‌లు అధికంగా నమోదుకావచ్చని అభిప్రాయపడింది. -
‘స్కోర్’ బాగుంటే రుణం ఈజీ!
మీరు తీసుకున్న రుణమే మీ అర్హతలను నిర్దేశిస్తుంది. భవిష్యత్తులో మీకు అవసరం ఏర్పడితే రుణదాతలు క్యూ కట్టి ‘బాబ్బాబు మేము ఇస్తాం’ అనే విధంగా చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. నేటి రోజుల్లో రుణం లభించడం ఎంత సులభమో.. అంత కష్టం కూడా. ఎందుకంటే ఓ వ్యక్తి రుణ చరిత్ర అంతా క్రెడిట్ బ్యూరోల రికార్డుల్లో వివరంగా నమోదవుతుంటుంది. రుణాల మంజూరుకు ముందు బ్యాంకు అయినా ఎన్బీఎఫ్సీ అయినా దరఖాస్తుదారుని క్రెడిట్ స్కోరును కచి్చతంగా పరిశీలిస్తాయి. క్రెడిట్ స్కోరు మీ రుణ అర్హతను నిర్ణయించడమే కాదు.. ఎంత వడ్డీ రేటు వసూలు చేయాలనే విషయంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. క్రెడిట్ స్కోర్ ఎంత బాగుంటే.. మీకు అంత ఆకర్షణీయమైన వడ్డీ రేటుకు, కోరుకున్నంత రుణం లభిస్తుందన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే మీ రుణ దరఖాస్తు స్వీకరణ లేదా తిరస్కరణ అనేది మీ క్రెడిట్ స్కోర్ మీదే ఆధారపడి ఉంటుంది. అసలు క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? దాన్ని ఎలా లెక్కిస్తారు? మీ స్కోర్‌ను ఎలా పెంచుకోవాలన్నది ఓసారి చూద్దాం... ఎలా లెక్కిస్తారంటే.. రుణ గ్రహీతల విశ్వసనీయతను.. చెల్లింపుల సామర్థ్యాన్ని కొలిచే ప్రమాణాల్లో క్రెడిట్ స్కోర్ ఒకటి. దరఖాస్తుదారుల రుణ అర్హతను అంచనా వేయడానికి, రుణ మొత్తాన్ని నిర్ణయించడానికి బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేస్తుంటాయి. దీనికితోడు, ఇతర సమాచారం ఆధారంగా రుణాలకు అర్హులా, కాదా? అన్నది నిర్ణయిస్తారు. వడ్డీ రేటుకూ ఇదే ప్రామాణికం అవుతుంది. రుణాల మంజూరు, తిరిగి చెల్లింపుల సమాచారాన్ని రుణ గ్రహీతల పాన్ నంబర్ ఆధారంగా.. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) క్రమం తప్పకుండా నిరీ్ణత కాలానికోసారి క్రెడిట్ బ్యూరో సంస్థలకు (సిబిల్ తదితర) అందిస్తుంటాయి. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని క్రెడిట్ స్కోరును నిర్ణయిస్తుంటాయి బ్యూరోలు. సాధారణంగా గత 36 నెలల రుణ చరిత్ర ఆధారంగా క్రెడిట్ స్కోర్ ఉంటుంది. చెల్లింపుల తీరు, సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మిశ్రమం ఎలా ఉంది, రుణాల కోసం విచారణలు, రుణాల వినియోగం.. ఈ నాలుగు అంశాలు మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంటాయి. అయితే ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆల్గోరిథమ్‌ల సాయంతో.. రుణ చరిత్రతోపాటు వినియోగదారుల దీర్ఘకాలిక ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్ (చెల్లించాల్సిన బకాయిలు), క్రెడిట్ కార్డ్‌ల లావాదేవీల చరిత్ర, కొత్త ఖాతాల ప్రారంభం లేదా తొలగింపులు, తిరిగి చెల్లింపుల నిష్పత్తి వంటివి కూడా క్రెడిట్ బ్యూరోలకు ప్రామాణికంగా మారాయి. సాధారణంగా.. 300 నుంచి 900 వరకు క్రెడిట్ స్కోర్ ఉంటుంది. రుణదాతలకు వ్యక్తిగత రుణాలు లభించాలంటే.. కనీస సిబిల్ స్కోర్ 720 నుంచి 750 మధ్య అయినా ఉండాలి. ఇంతకంటే ఎక్కువ స్కోర్ ఉంటే రుణాన్ని అధిక మొత్తంలో పొందే అర్హత ఉంటుంది. స్కోర్ తక్కువగా ఉంటే రుణం కూడా తక్కువే వస్తుంది. స్కోర్‌ను చెక్ చేసుకోవచ్చు.. క్రెడిట్ బ్యూరో సంస్థలు ఏటా ఒక్కసారి ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్ పొందే సౌకర్యాన్ని కలి్పస్తున్నాయి. ఇక వివిధ రకాల ఆర్థిక సేవల సంస్థలు సైతం తమ పోర్టళ్ల నుంచి, యాప్స్ నుంచి క్రెడిట్ స్కోరును ఉచితంగా తెలుసుకునే అవకాశాన్ని కలి్పస్తుంటాయి. తద్వారా రుణాల ఆఫర్లను అందించొచ్చన్న ప్రయోజనం అందులో దాగుంటుంది. మీకు రుణ అవసరం ఉన్నా, లేకపోయినా క్రెడిట్ స్కోర్‌ను ఉచితంగా తెలుసుకునే సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. పాన్ నంబర్ సాయంతో ఈ వివరాలు తెలుసుకోవచ్చు. మొబైల్ నంబరుకు వచ్చే వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారంగా మీ గుర్తింపును ధ్రువీకరించిన అనంతరం క్షణాల్లో ఉచితంగా మీ క్రెడిట్ స్కోర్ రిపోర్ట్‌ను అందుకుంటారు. స్కోర్‌ను మెరుగుపరుచుకోవాలంటే.. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించడమే స్కోర్‌ను పెంచుకోవడానికి ప్రాథమిక సూత్రం. రుణ వాయిదాల చెల్లింపుల్లో డిఫాల్ట్ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా పొరపాటు వల్ల, మర్చిపోవడం కారణంగానే వాయిదా రోజున చెల్లింపులు చేయలేకపోతే.. కంపెనీ నుంచి మీ కాల్ వచ్చిన తర్వాత అయినా వెంటనే ఆ వాయిదాను చెల్లించేయాలి. రీపేమెంట్లో ఎలాంటి జాప్యం చేసినా సరే రుణదాతలు దీన్ని ప్రతికూల అంశంగా పరిగణిస్తుంటారు. గృహ, వాహన రుణాలు సెక్యూర్డ్ రుణాల కిందకు వస్తాయి. వ్యక్తిగత, క్రెడిట్ కార్డ్ రుణాలు అన్‌సెక్యూర్డ్‌గా ఉంటాయి. సెక్యూర్డ్ రుణాల్లో రుణదాత విఫలమైనా, రుణమిచి్చన సంస్థలకు రిస్క్ పెద్దగా ఉండదు. ఎందుకంటే హామీగా ఆస్తులు ఉంటాయి. వాటిని విక్రయించి సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ, అన్సెక్యూర్డ్ రుణాలను ఎగ్గొడితే.. వసూలు చేసుకోవడం రుణమిచి్చన సంస్థలకు తలనొప్పిగా పరిణమిస్తుంది. అందుకే రుణదాతలు అన్సెక్యూర్డ్స్ రుణాలు, వాటిని తిరిగి ఏ విధంగా చెల్లిస్తున్నారన్న చరిత్ర గురించి లోతైన విశ్లేషణ చేస్తుంటారు. మీ సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపించేవి కూడా ఈ అన్సెక్యూర్డ్ రుణాలే. ముఖ్యంగా..జాయింట్ బ్యాంక్ అకౌంట్‌ను కలిగి ఉన్న వారికి హామీ ఇవ్వటంలో జాగ్రత్త వహించాలి. ఒకవేళ ఆయా ఖాతా చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులెదురైనా ఆ బాధ్యత జాయింట్ ఖాతాదారులైన మీ మీద కూడా పడుతుంది. అంతిమంగా దీని ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ మీద కూడా ఉంటుంది. ఇక ప్రత్యేకంగా మీ స్కోర్‌ను పెంచుకోవాలంటే.. వ్యక్తిగత రుణం, క్రెడిట్‌కార్డు వినియోగం, వాహన రుణం, గృహ రుణం ఇలా రుణ పోర్ట్‌ఫోలియో వైవిధ్యంగా ఉండడం కూడా ప్రభావం చూపిస్తుంది. క్రెడిట్‌కార్డు లేకపోతే దాన్ని తీసుకుని పరిమిత వినియోగంతోపాటు సకాలంలో చెల్లింపులతోనూ స్కోర్‌ను పెంచుకోవచ్చు. -
బ్యాంకింగ్ అవుట్‌లుక్... స్టేబుల్
ముంబై: భారత బ్యాంకింగ్ రంగానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘స్టేబుల్’ అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు ఇండియా రేటింగ్స్ ప్రకటించింది. అయితే రిటైల్, సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు పంపిణీ చేసిన రుణాలకు సంబంధించి బ్యాంకింగ్ 2022 మార్చి ముగిసే నాటికి కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా పేర్కొంది. బ్యాంకింగ్‌పై దేశీయ రేటింగ్ సంస్థ విడుదల చేసిన అర్థవార్షిక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. - ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూలంగా మొండిబకాయిలు (జీఎన్‌పీఏ) ఇచ్చిన రుణాల్లో 8.6 శాతంగా కొనసాగవచ్చు. ఒత్తిడిని ఎదుర్కొనే రుణాల విషయంలో ఈ శాతం 10.3 శాతంగా ఉండే వీలుంది. - కోవిడ్–19 ప్రేరిత సవాళ్లను ఎదుర్కొనే విషయంలో బ్యాంకింగ్ పటిష్టంగా ఉండడం అవుట్‌లుక్ యథాతథ కొనసాగింపునకు కారణం. - బ్యాంకులకు తగిన మూలధనం అందే అవకాశం ఉంది. అందువల్ల వాటి ఫైనాన్షియల్ పరిస్థితులు స్థిరంగా కొనసాగుతాయి. - మొండిబకాయిలకు సంబంధించి కూడా గత నాలుగు సంవత్సరంల్లో తగిన ప్రొవిజన్స్ (కేటాయింపులు) జరుగుతున్నాయి. - రుణాలు, డిపాజిట్ల విషయంలో ప్రైవేటు బ్యాంకుల మార్కెట్ షేర్ పెరుగుతుందని వాటికి సంబంధించి ‘స్టేబుల్’ అవుట్‌లుక్ సూచిస్తోంది. దిగ్గజ ప్రైవేటు బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) గట్టి పోటీని ఇవ్వగలుగుతాయి. ఆయా బ్యాంకులు మూలధన నిల్వలను పెంచుకోగలుగుతున్నాయి. తమ పోర్ట్‌ఫోలియోను సానుకూలంగా, క్రియాశీలంగా నిర్వహించుకోగలుగుతున్నాయి. - భారీ మూలధన కేటాయింపుల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వ మద్దతు కొనసాగుతుందని భావిస్తున్నాం. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి 2020–21 ఆర్థిక సంవత్సరం వరకూ ప్రభుత్వ బ్యాంకులకు కేంద్రం రూ.2.8 లక్షల కోట్ల మూలధనం అందించింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 0.2 లక్షల కోట్ల కేటాయింపులు జరిగాయి. - బ్యాంకింగ్ వ్యవస్థ డిపాజిట్లలో 6.5 శాతం వాటా కలిగిన ఐదు బ్యాంకుల విషయంలో ఇండియా రేటింగ్స్ ‘నెగిటివ్ అవుట్‌లుక్’ను కలిగిఉంది. బలహీన మూలధనం, ఆయా బ్యాంకుల ఆర్థిక పరిస్థితుల విషయంలో బలహీనతలు దీనికి కారణం. - రిటైల్ రంగంలో రుణ నాణ్యత విషయానికి వస్తే, ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలో ఈ విలువ 2020–21తో పోల్చితే 2021–22లో 100 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో ఇది 45 శాతానికి పరిమితం కావచ్చు. - గృహ రుణాలుసహా రిటైల్ రుణాల విషయంలో బ్యాంకులు రుణ పునర్వ్యవస్థీకరణ జరిపే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల తక్షణం డిఫాల్డ్లకు అవకాశం ఉండదు. ఈ విభాగంలో ఒత్తిడిలో ఉన్న రుణాలు, పునర్వ్యవస్థీకరణలో ఉన్న రుణాలు కలిపి 2021–22 ముగిసే నాటికి 5.8 శాతానికి (మొత్తం రుణాల్లో) చేరవచ్చు. - ఎంఎస్ఎంఈ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. పెద్ద నోట్ల రద్దు నుంచీ ఈ సమస్య తలెత్తింది. దీనికితోడు జీఎస్టీ, ఆర్ఈఆర్ఏలూ ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. ఇప్పడు కోవిడ్–19తో సవాళ్లు మరింత తీవ్రమయ్యాయి. అయితే సవాళ్లను ఎదుర్కొనడంలో ప్రభుత్వం నుంచి తగిన మద్దతు అందుతోంది. ఇందులో అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) కింద తగిన లిక్విడిటీ లభ్యం అవుతుండడం గమనార్హం. రుణ పునర్వ్యవస్థీకరణ కూడా ఆయా రంగాలకు ప్రయోజనం కలిగిస్తోంది. - ఎంఎస్ఎంఈ రంగానికి ఇచ్చిన మొత్తం రుణాల్లో స్థూలంగా మొండిబకాయిలు (జీఎస్‌పీఏ) 2021–22 ముగిసేనాటికి 13.1 శాతానికి పెరిగే అవకాశం ఉంది. 2020–21 ముగిసే నాటికి ఈ రేటు 9.9 శాతం. ఇక ఇదే సమయంలో ఒత్తిడిలో ఉన్న రుణాల శాతం 11.7 శాతం నుంచి 15.6 శాతానికి చేరవచ్చు. కార్పొరేట్ రుణాల విషయంలో ఇది జీఎన్‌పీఏ 10.2 శాతానికి, ఒత్తిడి ఉన్న రుణాలు 11.3 శాతానికి ఎగసే వీలుంది. ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకోవడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రుణ వృద్ధి 8.9 శాతం 2021–22 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రుణ వృద్ధి 8.9 శాతంగా ఉంటుందన్న తమ అంచనాల్లో ఎటువంటి మార్పూ ఉండబోదని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. ప్రభుత్వ వ్యయాలు ప్రత్యేకించి మౌలిక రంగంలోకి వెళుతున్న పెట్టుబడులు, రిటైల్ రుణాలకు డిమాండ్ పునరుద్దరణ వంటి అంశాలు దీనికి దోహదం చేసే అంశాలుగా పేర్కొంది. స్టేబుల్ టూ ఇంప్రూవింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు సంబంధించి 2021–22 అవుట్‌లుక్‌ను గత వారమే ఇండియా రేటింగ్స్ ‘‘స్టేబుల్’’ నుంచి ‘‘ఇంప్రూవింగ్’’కు మార్చింది. నిర్వహణా పరమైన, తక్కువ వడ్డీరేటు చర్యల వల్ల నాన్ బ్యాంకింగ్ తగిన లిక్విడిటీ, మూలధన నిల్వలు, స్థిర మార్జిన్లు కలిగి ఉందని కూడా ఇండియా రేటింగ్స్ తెలిపింది. సవాళ్లను తట్టుకుని నిలబడగలిగిన స్థాయిలో నాన్స్ బ్యాంక్ ఉన్నాయని విశ్లేషించింది. చదవండి : టీప్లస్1 సెటిల్మెంట్కు సెబీ గ్రీన్‌సిగ్నల్ ఎకానమీ వృద్ధిరేటు భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్ రా) ఇటీవలే 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెంచింది. ఇంతక్రితం 9.1 శాతం ఉన్న అంచనాలను 9.4 శాతానికి అప్‌గ్రేడ్ చేసినట్లు తన తాజా నివేదికలో పేర్కొంది. అధిక ఎగుమతులు, తగిన వర్షపాతం నేపథ్యంతో కోవిడ్–19 సెకండ్‌వేవ్ సవాళ్ల నుంచి దేశం ఆశ్చర్యకరమైన రీతిలో వేగంగా కోలుకుంటుండడమే తమ అంచనాల పెంపునకు కారణమని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్నది ‘వీ’ ( ఠి) నమూనా రికవరీ కాదని, ‘కే’ ( జు) నమూనా రికవరీ అని సంస్థ పేర్కొంటోంది. వృద్ధి నుంచి కొందరు మాత్రమే ప్రయోజనం పొందే పరిస్థితి ‘కే’ నమూనా రికవరీలో ఉంటుంది. -
బంగారంపై రుణం అందరికీ ఆమోదమే!
భారతీయులకు బంగారంతో అనుబంధం ఎంతో ప్రత్యేకం. ఆభరణాలు, బంగారంతో చేసిన వస్తువులు.. ఇలా ఏదో ఒక రూపంలో బంగారం కలిగి ఉండడాన్ని హోదాగానూ చూస్తారు. బంగారాన్ని సంపదగా భావిస్తుంటారు. అందుకే సామాన్యుడి కుటుంబంలోనూ ఎంతో కొంత బంగారం ఉంటుంది. ఇదే బంగారం ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలకు మరో రూపంలో ఆదుకుంటోంది. ఆదాయాలు పడిపోయి, ఉపాధి కరువైన వేళ బంగారంపై సులభంగా రుణాలు పొందే పరిస్థితి వారికి కొంత ఊరటనిస్తోంది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్బీఎఫ్సీలు) సైతం బంగారం రుణాలు ఆమోదనీయంగా ఉంటున్నాయి. రుణ గ్రహీతలు చెల్లింపులు చేయలేని పరిస్థితుల్లో వారు తనఖాగా ఉంచిన బంగారాన్ని వేలం వేసుకునే సౌలభ్యం వాటికి ఉంటుంది. కనుక రిస్క్ తక్కువ. రుణ గ్రహీతలకూ తక్కువ రేటుపైనే రుణాలు లభించే పరిస్థితి. వెరసి ఇరువురికీ ఆమోదనీయమైన బంగారం రుణాల మార్కెట్ భారీగా విస్తరిస్తోంది. కరోనా మహమ్మారి రాకతో బంగారం రుణ మార్కెట్ 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారీ వృద్ధిని చూసిందని చెప్పుకోవాలి. ఆర్బీఐ గణాంకాలను పరిశీలించినట్టయితే.. బ్యాంకుల రుణ పుస్తకంలో 2020 మార్చి నాటికి రూ.33,303 కోట్లుగా ఉన్న బంగారం రుణాలు.. 2021 మార్చి నాటికి ఏకంగా 86 శాతం పెరిగి రూ.60,464 కోట్లకు విస్తరించాయి. 2019 మార్చి నుంచి 2020 మార్చి మధ్యన చూసినా కానీ బ్యాంకుల బంగారం రుణాలు 33.9 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ఇవి కేవలం ఆర్బీఐ వద్దనున్న బ్యాంకుల రుణ పుస్తకాల్లోని గణాంకాలే. ప్రత్యేకంగా బంగారం రుణాలను మంజూరు చేసే ముత్తూట్, మణప్పురం ఇతర ఎన్‌బీఎఫ్‌సీల పరిధిలోని గణాంకాలనూ కలిపి చూస్తే ఈ వృద్ధి మరింత ఎక్కవగానే ఉంటుంది. కరోనా కష్టాల్లో ఆసరా.. బంగారం రుణాల మార్కెట్ ఏటేటా భారీ వృద్ధినే నమోదు చేస్తోంది. ఇందుకు పెరిగిన బంగారం ధరలు రూపంలో అనుకూలత ఏర్పడింది. ఇక 2020 మార్చిలో కరోనా నియంత్రణకు లాక్డౌన్లు విధించడంతో చాలా వ్యాపారాలు కుదేలయ్యాయి. దీంతో కొంత మంది ఉపాధిని కోల్పోగా.. కొంత మంది వేతన కోతలను ఎదుర్కొన్నారు. చిన్న వ్యాపారస్తులు, చిన్న పరిశ్రమలు కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో బంగారం తనఖా పెట్టి తీసుకున్న రుణాలతో ప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తీసుకున్న రుణాలపై ఆరు నెలల మారటోరియంను బ్యాంకులు కల్పించాయి. గతేడాది ఆగస్ట్‌లో మారటోరియం ముగిసిన తర్వాత వ్యాపార కార్యకలాపాల కోసం ఈ బంగారం రుణాలే చాలా పరిశ్రమలను, వ్యాపారులను ఆదుకున్నాయి. అదే సమయంలో ఆర్బీఐ సైతం బంగారం రుణాల విషయంలో నిబంధనలను సడలించి ఆశలు కలి్పంచింది. లోన్ టు వ్యాల్యూ (అంటే బంగారం విలువలో మంజూరు చేసే రుణం పరిమాణం/ఎల్టీవీ)ను పెంచుతూ 2020 ఆగస్ట్‌లో ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయేతర అవసరాల కోసం మంజూరు చేసే బంగారం రుణాలకు ఎల్టీవీని 75 శాతం నుంచి 90 శాతానికి పెంచింది. ప్రభుత్వ బ్యాంకుల పాత్ర బంగారం ఆభరణాలు, వస్తువుల తాకట్టుపై ఎస్బీఐ మంజూరు చేసిన రుణాలు (సాధారణ అవసరాల కోసం ఇచ్చినవి) మార్చి 31 నాటికి ఏడాది కాలంలో ఏకంగా 465 శాతం పెరిగి రూ.20,987 కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి వి రూ.3,715 కోట్లుగానే ఉండడం గమనార్హం. బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర రిటైల్ బంగారం రుణాలు 2021 మార్చి నాటికి రూ.1,370 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవతత్సరంలో 11 రెట్ల వృద్ధి నమోదైంది. బ్యాంకు ఆఫ్ బరోడా రిటైల్ బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో కూడా 2020 మార్చి నాటికి ఉన్న రూ.436 కోట్ల నుంచి.. 2021 మార్చి నాటికి రూ.1,101 కోట్లకు వృద్ధి చెందింది. ప్రైవేటురంగంలోని ఫెడరల్ బ్యాం కు 70 శాతం, సీఎస్బీ బ్యాంకు 61 శాతం మేర బంగారం రుణాల్లో ప్రగతిని చూపించాయి. లిక్విడిటీ ఎక్కువ.. బంగారం రుణాలకు సంబంధించి పూర్తి సామర్థ్యాలను గతంలో తమ బ్యాంకు చూడలేదని బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర ఎండీ, సీఈవో రాజీవ్ ఎండీ పేర్కొన్నారు. దీంతో బంగారం రుణాల్లో మార్కెట్‌ను పెంచుకునేందుకు సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో, కస్టమర్లకు అనుకూలమైన పథకాన్ని రూపొందించినట్టు చెప్పారు. ‘‘క్లిష్ట సమయాల్లో చాలా మంది వ్యక్తులు, చిన్న వ్యాపారస్థులు నగదు కొరతను ఎదుర్కొంటున్నారు. తక్షణ నిధుల అవసరాలను బంగారం రుణాలు తీరుస్తున్నాయి. మా బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో 2021 మార్చి నాటికి రూ.1,939 కోట్లకు పెరిగింది. అంటే 2020–21 ఆర్థిక సంవత్సరంలోనే ఏడు రెట్ల వృద్ధి నమోదైంది. ఇప్పటికైతే బంగారం రుణ పుస్తకం రూ.2,100 కోట్లుగా ఉంటుంది’’ అని రాజీవ్ బంగారం రుణాల విస్తృతి గురించి వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో రూ.5,000 కోట్లకు విస్తరిస్తుందని అంచనా వ్యక్తం చేశారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో పెరిగిన తమ రుణ పుస్తకంలో ఎక్కువ వృద్ధి బంగారం రుణాల విభాగం నుంచే ఉన్నట్టు సీఎస్బీ బ్యాంకు ఎండీ, సీఈవో రాజేంద్రన్ సైతం ఇటీవలే పేర్కొనడం గమనార్హం. 76 శాతం వృద్ధి బంగారం రుణాల నుంచే వచ్చినట్టు చెప్పారు. ‘‘బంగారం రుణాల్లో వృద్ధి ఎంతో బాగుంది. ఎందుకంటే ఎన్బీఎఫ్సీలు ఈ విభాగంలో అంత చురుగ్గా లేవు. ఒక్క సారి కస్టమర్ ఎన్బీఎఫ్సీ నుంచి బ్యాంకుకు బంగారం రుణం కోసం వస్తే.. ఇక తిరిగి ఎప్పటికీ ఎన్బీఎఫ్సీ సంస్థల వద్దకు వెళ్లరు. ఎందుకంటే చాలా ఆకర్షణీయమైన వడ్డీ రేటుకే బ్యాంకులో బంగారంపై రుణాలు లభిస్తాయి’’ అంటూ బంగారం రుణాలకు సంబంధించి బ్యాంకులు మంచి ఎంపిక అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బంగారం రుణాలు సురక్షితమైనవి (సెక్యూర్డ్ లోన్స్). డిఫాల్ట్ (రుణ ఎగవేతలు) రిస్క్ చాలా తక్కువ. దీంతో బ్యాంకులకు బంగారం రుణాలు ఆకర్షణీయంగా మారాయి. పెరిగిన ధరలతో అధిక రుణం ఒకవైపు అధిక ఎల్టీవీ, మరోవైపు పెరిగిన బంగారం మార్కెట్ ధరలు.. తనఖా బంగారంపై ఎక్కువ మొత్తంలో రుణాలు పొందే పరిస్థితికి దారితీశాయి. మరోవైపు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు సైతం ఎక్కువ మందికి బంగారంపై రుణాలు అనుకూల మార్గంగా తోచాయి. ప్రభుత్వరంగంలోని బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర అయితే 7.35 శాతం, ఎస్బీఐ 7.50 వార్షిక వడ్డీ రేటుపై బంగారం రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా బంగారం రుణాల మార్కెట్‌ను అధిక శాతం ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ సంస్థలే శాసిస్తుంటాయి. కానీ, ఆకర్షణీయమైన రుణ రేట్లతో ప్రభుత్వరంగ బ్యాంకులు సైతం ఈ మార్కెట్లోకి బలంగా చొచ్చుకుపోతున్నాయి. దీంతో వినియోగదారులు కష్ట సమయాల్లో తక్కువ రేటుపైనే రుణాలు పొందే సౌలభ్యం ఏర్పడింది. నిజానికి ఎన్బీఎఫ్సీ సంస్థలైన ముత్తూట్, మణప్పురం సంస్థలు బంగారం రుణాలపై అధిక రేట్లను వసూలు చేస్తుంటాయి. ప్రకటనల్లోనే 12 శాతం వడ్డీ రేటు అని చెబుతాయి కానీ.. ఒక్కో కస్టమర్‌కు గరిష్టంగా రూ.30వేలకు మించి ఈ రేటుపై రుణాలను ఇవ్వవు. పెద్ద మొత్తంలో రుణం కోరుకుంటే 18, 24 శాతం వడ్డీ రేటును చెల్లించేందుకు సిద్ధపడాల్సిందే. కానీ, బ్యాంకుల్లో 60 పైసల వడ్డీ రేటుకే బంగారంపై రుణాలు లభిస్తున్నాయి. ఇక్కడ కాల వ్యవధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎన్బీఎఫ్సీలు మూడు నెలలు, ఆరు నెలలకే రుణాలు ఇస్తుంటాయి. వడ్డీని ప్రతీ నెలకోసారి చెల్లించుకోవాలి. లేదంటే దానిపై మరింత చార్జీలను బాదుతాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అలా కాదు. ఏడాది, రెండేళ్లకూ రుణాలను ఇవ్వడమే కాకుండా.. వడ్డీని ఏడాదికోసారి చెల్లించే విధంగా పథకాలను రూపొందిస్తున్నాయి. కాకపోతే కాలవ్యవధి తీరిన తర్వాత వడ్డీ మాత్రమే చెల్లించి రుణాలను రెన్యువల్ చేసుకోవాలంటే ప్రక్రియను మొదటి నుంచి బ్యాంకులు అనుసరిస్తున్నాయి. దీంతో తిరిగి బంగారం అప్రైజర్ (విలువ మదింపుదారు) చార్జీలు, స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ చార్జీల రూపంలో భారాన్ని భరించాల్సి ఉంటుంది. -
మొండిబకాయిలు, బంగారం విషయాల్లో రిస్క్ తక్కువేనంట
ముంబై: కరోనా సెకండ్‌వేవ్ నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల(ఎన్బీఎఫ్సీ) రుణాలపైనా ప్రతికూల ప్రభావం చూపనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ముగిసే మార్చి నాటికి ఎన్‌బీఎఫ్‌సీల మొండిబకాయిలు (ఎన్పీఏ) ఒక శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. ఇదే జరిగితే ఒత్తిడిలో ఉన్న ఎన్‌బీఎఫ్‌సీల రుణ శాతం దాదాపు 8 శాతం వరకూ (దాదాపు రూ.2 లక్షల కోట్లు) పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ పునర్ వ్యవస్థీకరణసైతం రెట్టింపై 3.3 శాతానికి చేరవచ్చని అంచనావేసింది. 2020–21లో ఇది 1.6 శాతం మాత్రమే కావడం గమనార్హం. తగ్గిన వసూళ్ల సామర్థ్యం.. ఎన్బీఎఫ్సీలతోపాటు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (హెచ్ఎఫ్సీ) వసూళ్ల సామర్థ్యం మహమ్మారి వల్ల తీవ్రంగా పడిపోయినట్లు ఇక్రా పేర్కొంది. మూడవవేవ్ సమస్యలు లేకుండా ఉంటే, ఈ రంగం కొంత మెరుగుపడే అవకాశం ఉందని విశ్లేషించింది. ఆయా అంశాల నేపథ్యంలో ఈ రంగానికి ‘‘నెగటివ్’’ అవుట్‌లుక్ ఇస్తున్నట్లు పేర్కొంది. నాన్ బ్యాంకింగ్ రూ.24 లక్షల కోట్ల రుణాల్లో 30 శాతం ‘‘హై రిస్క్ కేటగిరీ’’ (తీవ్ర ఇబ్బందికరమైన)లో ఉన్నాయని పేర్కొంది. ఆయా రంగాలను పరిశీలిస్తే, సూక్ష్మ, వ్యక్తిగత, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఇచ్చిన రుణాలు ఇందులో ఉన్నాయని పేర్కొంది. రియల్టీ కూడా ఇదే కోవలోకి వస్తుందని తెలిపింది. అయితే బంగారం, హౌసింగ్ విషయాల్లో రిస్క్ కొంత తక్కువగా ఉందని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి రూ.2 లక్షల కోట్ల అదనపు మూలధనం అవసరం అవుతుందని కూడా ఇక్రా అంచనావేస్తోంది. -
ఎన్‌బీఎఫ్‌సీల అసెట్స్‌లో 15 శాతం వృద్ధి
ముంబై: బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థల్లో (ఎన్బీఎఫ్సీ) సుమారు 42 శాతం సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం తమ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎ) 15 శాతం పైగా వృద్ధి చెందుతుందని ఆశాభావంతో ఉన్నట్లు ఇక్రా రేటింగ్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఎన్బీఎఫ్సీలపై కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావాలను, వాటి భవిష్యత్ అంచనాలను తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహించినట్లు సంస్థ వివరించింది. పరిశ్రమ ఏయూఎంలో 60 శాతం వాటా ఉన్న 65 ఎన్బీఎఫ్సీలు ఇందులో పాల్గొన్నట్లు తెలిపింది. చాలా మటుకు ఎన్బీఎఫ్సీలు తమ ఏయూఎం 10 శాతం దాకా వృద్ధి చెందవచ్చని అంచనా వేసుకుంటున్న నేపథ్యంలో మొత్తం పరిశ్రమ వృద్ధి 7–9 శాతం స్థాయిలో ఉండవచ్చని భావిస్తున్నట్లు ఇక్రా రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ మనుశ్రీ సగ్గర్ తెలిపారు. ఎన్బీఎఫ్సీ సెగ్మెంట్లో అంతర్గతంగా సూక్ష్మ రుణాల సంస్థలు (ఎంఎఫ్ఐ), చిన్న సంస్థలకు రుణాలిచ్చేవి, అఫోర్డబుల్ హౌసింగ్ రుణాలిచ్చే సంస్థలు మిగతా వాటికన్నా మరింత అధిక వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. లాక్డౌన్ల సడలింపు, కొత్త కోవిడ్ కేసులు ఒక మోస్తరు స్థాయికి పరిమితం అవుతుండటం, టీకాల ప్రక్రియ పుంజుకోవడం వంటి అంశాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం మిగతా భాగంలో గత ఆర్థిక సంవత్సరం కన్నా వృద్ధి మెరుగ్గా ఉండవచ్చని ఎన్బీఎఫ్సీలు భావిస్తున్నట్లు ఇక్రా రేటింగ్స్ తెలిపింది. -
మరింత చౌకగా హోమ్లోన్స్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే!
ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక సొంతిళ్లు ఉండాలని చాలా కలలు కంటుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే ఆ కలలను నిజం చేసుకుంటారు. తమ కలను నిజం చేసుకోవడానికి తగినంత డబ్బు లేక, బ్యాంకు వడ్డీ రేట్లు చూసి వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారికి ఇది మంచి సమయం అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం గృహ రుణాల వడ్డీ రేట్లు నాలుగు దశాబ్ధాల కనిష్టానికి పడిపోయాయి. ఈ సమయంలో అతి తక్కువ వడ్డీకే గృహ రుణాలను పొందవచ్చు. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీజులను కొంత మేరకు తగ్గించాయి. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ వడ్డీకే హోమ్లోన్స్ అందిస్తున్న బ్యాంకుల జాబితాను ఒకసారి పరిశీలిద్దాం. బ్యాంకులు/ రుణదాతలు వడ్డీ రేట్లు Kotak Mahindra Bank 6.65% Punjab & Sind Bank 6.65% State Bank of India 6.70% HDFC Bank 6.75% ICICI Bank 6.75% Bank of Baroda 6.75% Union Bank of India 6.80% Punjab National Bank 6.80% Central Bank of India 6.85% IDBI Bank 6.85% Axis Bank 6.90% Canara Bank 6.90% LIC Housing Finance 6.90% UCO Bank 6.90% Bank of India 6.95% Indian Overseas Bank 7.05% PNB Housing Finance 7.35% Karnataka Bank 7.50% Federal Bank 7.65% Standard Chartered Bank 7.99% YES Bank 8.95% బ్యాంకుకు, బ్యాంకుకి మధ్య ప్రాసెసింగ్ ఫీజులు అనేవి మారుతుంటాయి కాబట్టి ఆ ఫీజుల గురుంచి ముందుగా తెలుసుకోవాలి. అలాగే, వీలైనంత తక్కువ మొత్తంలో గృహ రుణం తీసుకుంటే మంచిది అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చదవండి: బంగారం రుణాలపై వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత? -
బంగారం రుణాలపై వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత?
భారతీయులకు చాలా కాలం నుంచి బంగారం పట్ల బలమైన అనుబంధం ఉంది. అందుకే బంగారం ఎక్కువగా కొనుగోలు చేసే దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. ఇలా కొన్న బంగారాన్ని ప్రజలు అమ్మడానికి ఇష్టపడరు. దానికి ఒక కారణం ఉంది. ఒకవేల ఏదైనా కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు, ఆర్ధికంగా ఇబ్బందులు గురైనప్పుడు బంగారం ఆదుకుంటుంది అనే భరోసా వారిది. వారి ఆలోచనలకు తగ్గట్టుగానే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు కూడా తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. కఠిన పరిస్థితులలో డబ్బుల కోసం బంగారం తాకట్టుపెట్టి రుణాలు తెచ్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అంతే తప్ప ఎక్కువగా అమ్మడానికి ఇష్టపడరు. అప్పులు ఇచ్చే వాళ్లు కూడా బంగారాన్ని మంచి తాకట్టు వస్తువుగా పరిగణిస్తారు. అందుకే కరోనా సమయంలో మణప్పురం గోల్డ్ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు(ఎన్బీఎఫ్సీలు) ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మరింత ఎక్కువగా రుణాలు ఇస్తూ వాటిపై వడ్డీలు ఆర్జిస్తున్నాయి. సాధారణ వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్ల కంటే బంగారం రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. బంగారు నగలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కిట్లను తాకట్టు పెడతారు కాబట్టి బ్యాంకులు కూడా తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు ఇస్తుంటాయి. వడ్డీ రేట్లు అనేవి బ్యాంకులు, ఫైనాన్సింగ్ ఇచ్చే సంస్థలను బట్టి మారుతూ ఉంటాయి. కస్టమర్ క్రెడిట్ హిస్టరీ ఆధారంగా ఈ వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ సంస్థల కన్నా బ్యాంకుల్లోనే బంగారం రుణాల వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. సాధారణంగా బంగారం మార్కెట్ విలువలో 75శాతం కంటే ఎక్కువ రుణ మొత్తాన్ని ఇవ్వరు. బంగారు రుణాలకి సంబందించి బ్యాంక్‌కి, బ్యాంక్‌కి మధ్య మధ్య వ్యత్యాసం ఉంటుంది. వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ-క్లోజర్ మరియు పార్ట్ ప్రీపేమెంట్ ఛార్జీలు, ఆలస్యంగా చెల్లింపు ఛార్జీలు, రుణ ధరఖాస్తు సౌలభ్యం మొదలైన వాటి కోసం ముందే తనిఖీ చేసుకోవాలి. తక్కువ వడ్డీకే బంగారం రుణాలు ఇస్తున్న ఎన్బీఎఫ్సీలు, బ్యాంకుల గురుంచి ఈ క్రింద తెలుసుకోండి. జూన్ 1, 2021న సంబంధిత వెబ్సైట్ల నుండి సేకరించిన డేటా ఇది. బ్యాంకు పేరు వడ్డీ రేటు (ఏడాదికి) Punjab & Sind Bank 7.00% Bank of India 7.35% State Bank of India 7.50% Canara Bank 7.65% Union Bank 8.20% Karnataka Bank 8.49% Indian Bank 8.50% UCo Bank 8.50% Federal Bank 8.50% Punjab National Bank 8.75% Jammu & Kashmir Bank 8.85% Central Bank 8.85% Indian Overseas Bank 8.85% HDFC Bank 8.95% Bank of Baroda Bank 9.00% Dhanalaxmi Bank 9.50% Karur Vyasya Bank 10.10% ICICI Bank 11.00% South Indian Bank 11.95% AXIS Bank 12.50% NBFCs IIFL Finance 9.24% Muthoot Finance 11.90% Bajaj Finserv 12.00% Manappuram Finance 12.00% చదవండి: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై భారీ ఆఫర్ -
మూడు నెలల్లో రూ.404 కోట్ల విలువైన బంగారం వేలం
ముంబై: పసిడి రుణాల విషయంలో బ్యాంకింగ్‌లో ‘బబుల్’ ఆందోళనలు తలెత్తుతున్న పరిస్థితి కనిసిస్తోంది. మణప్పురం ఫైనాన్స్ వంటి పసిడి హామీగా రుణాలను మంజూరుచేసే బ్యాంకింగ్యేతర ఫైనాన్షియల్ సంస్థలు(ఎన్బీఎఫ్సీ) బంగారాన్ని పెద్ద ఎత్తున వేలం వేసే పరిస్థితి నెలకొంది. ఒక్క మణప్పురం ఫైనాన్స్ 2021 జనవరి-మార్చి మధ్య రికార్డు స్థాయిలో దాదాపు రూ.404 కోట్ల విలువైన టన్ను బంగారాన్ని వేలం వేసింది. కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. 2021-22 సెప్టెంబర్ త్రైమాసికం నుంచీ బ్యాంకింగ్‌కూ మొండిబకాయిల(ఎన్పీఏ) సెగ తీవ్రమయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. మహమ్మారి వల్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రజానీకం కష్టాల నుంచి గట్టెక్కడానికి 2020లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పలు చర్యలు తీసుకుంది. తనఖాలకు సంబంధించి పసిడి విలువలో 90 శాతం వరకూ రుణాలను అందించవచ్చన్నది ఆర్బీఐ సడలించిన నిబంధనల్లో ఒకటి. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో (ఆగస్టులో గ్రాముకు గరిష్టంగా రూ.5,600 పలికింది) కష్టకాలంలో ఈ మెటల్ ప్రజలను ఆదుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పసిడి పోర్ట్ ఫోలియోలూ భారీగా పెరిగాయి. 2020-21లో ఈ విలువ దాదాపు రూ.2 లక్షల కోట్లకు పెరిగింది. 2019-20లో ఈ విలువ రూ.1.6 లక్షల కోట్లు కావడం గమనార్హం. పసిడి రుణ పరిశ్రమ విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లు. ఇందులో 75 శాతం వాటా అసంఘటిత, చిన్నపాటి రుణదాతలదే. బ్యాంకింగ్ వంటి వ్యవస్థీకృత సంస్థల వాటా కేవలం 25 శాతం (రూ.2 లక్షల కోట్లు). 2020-21లో వ్యవస్థీకృత రంగంలో బ్యాంకింగ్ పసిడి రుణ పోర్ట్‌ఫోలియో వాటా రూ.1.2 లక్షల కోట్లయితే, ఎన్‌బీఎఫ్‌సీల వాటా రూ.80,000 కోట్లు. ఇటీవల మోతీలాల్ ఓశ్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విడుదల చేసిన ఒక నివేదిక ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది. ఈ నివేదిక ప్రకారం భారత్‌లో 2020 మహమ్మారి విసిరిన సవాళ్లలో (మొదటి వేవ్‌లో) ప్రైవేటు రంగమే 80 శాతం ఆదాయం నష్టపోయింది. ప్రభుత్వం భరించిన నష్టం 20 శాతమే. ఇందులోనూ కార్పొరేట్ రంగం కేవలం 12 నుంచి 16 శాతం భరిస్తే, మిగిలినది కుటుంబాలు భరించాయి. త్రైమాసికాల్లోనే టాప్... మార్చి త్రైమాసికంలో మేము దాదాపు రూ.404 కోట్ల విలువైన 1,000 కేజీల తనఖా బంగారాన్ని వేలం వేశాము. అంతక్రితం మూడు త్రైమాసికాల్లో కేవలం రూ.8 కోట్ల విలువచేసే పసిడినే వేలం వేశాం. ఒక త్రైమాసికంలో వేలం ద్వారా రూ.404 కోట్ల రికవరీ ఇదే తొలిసారి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రికవరీలు రికార్డు స్థాయిలో రూ.1,932 కోట్లు. ఇక ఇప్పటికి మా ఖజానాలో 300 టన్నుల పసిడి ఉంది. కాగా, బ్యాంకులు, ఇతర పోటీ సంస్థలు ఆరు నుంచి 12 నెలల కాలానికి పసిడీ రుణ కాలపరిమితులను అనుసరిస్తుండగా, మేము మూడు నెలల కాలపరిమితినే అనుసరిస్తున్నాం. అందువల్ల మేము ప్రతి నేలా పసిడి వేలం నిర్వహిస్తాము. నిజానికి 2020లో ధరలు భారీగా పెరిగాయి. పసిడి విలువలో 90 శాతం వరకూ రుణాలకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పుడు ధరలు అప్పటితో పోల్చితే భారీగా పడిపోయాయి. దీనితో ఈ రుణాల విషయంలో ‘బబుల్’ ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఏడాది వరకూ రుణ కాలపరిమితి ఉన్నందున, బ్యాంకులు అలాగే ఇతర ఎన్బీఎఫ్సీలు తమ రుణ నాణ్యత సమస్యలపై మార్చి లేదా జూన్ త్రైమాసికం వరకూ తమ రుణ నాణ్యతను తెలియజేయవు. అయితే ఈ విషయంలో సెప్టెంబర్ త్రైమాసికం నుంచీ ఎన్పీఏల సెగ తీవ్రమయ్యే అవకాశం ఉంది. తమ గోల్డ్ రుణ పుస్తకంలో దాదాపు 90 శాతాన్ని బ్యాంకులు ప్రాధాన్యతా పూర్వక రుణంగా పేర్కొన్నాయి. - వీపీ నందకుమార్, మణప్పురం ఎండీ, సీఈఓ బ్యాంకులకు ఎన్పీఏల తీవ్రత! గ్రాము ధర రూ.5,600 ఉన్న గరిష్ట స్థాయిల నుంచి చూస్తే, ఇప్పుడు ధరలు 10 నుంచి 13 శాతం పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ త్రైమాసికం నుంచీ బ్యాంకుల రుణ నాణ్యత సమస్యలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి మా సంస్థ భారీ వేలాలు ఏవీ నిర్వహించలేదు. మా రుణ కాలపరిమితి 9 నుంచి 12 నెలలు ఉండడమే దీనికి కారణం. - థామస్ జాన్ ముత్తూట్, ముత్తూట్ గ్రూప్ చైర్మన్ -
మెరుపు తగ్గిన బంగారం..బ్యాంకింగ్‌కు ఇబ్బందే!
సాక్షి, ముంబై: బంగారం ధర తగ్గడం వల్ల బ్యాంకింగ్ యేతర ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) రుణ నాణ్యతపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. బంగారం హామీగా రుణాలు ఎన్‌బీఎఫ్‌సీల ప్రధాన వ్యాపార కార్యకలాపాల్లో ఒకటన్న సంగతి తెలిసిందే. కాగా, బంగారాన్ని తాకట్టుగా ఉంచుకుని గత ఆర్థిక సంవత్సరం (2020–21) భారీగా రుణాలు ఇచ్చిన బ్యాంకుల రుణ నాణ్యతకు కొంత ఇబ్బంది తప్పకపోవచ్చని అంచనావేసింది. ఈ నేపథ్యంలో క్రిసిల్ విడుదల చేసిన నివేదిక ముఖ్యాంశాలు చూస్తే... ♦ గత కొన్ని ఆర్థిక సంవత్సరాలగా బంగారం హామీగా ఎన్బీఎఫ్సీలు ఇస్తున్న రుణ తీరును పరిశీలిస్తే, పసిడి ధరపై రుణ విలువ (లోన్-టూ-వ్యాల్యూ-ఎల్టీవీ) 75 శాతం దిగువనే ఉంది. దీనికితోడు క్రమానుగతంగా వడ్డీని సంస్థలు సక్రమంగా వసూలు చేస్తున్నాయి. ♦ 2020 డిసెంబర్ 31వరకూ పరిశీలిస్తే, ఎన్‌బీఎఫ్‌సీల సగటు ఎల్టీవీ 63 నుంచి 67 శాతం వరకూ ఉంది. అయితే కేవలం 2020 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ త్రైమాసికాన్ని చూస్తే, ఇది 70 శాతంగా ఉంది. ♦ ఎల్టీవీ విషయంలో ఎన్బీఎఫ్సీలు చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వాటి లోన్ బుక్స్‌ను పరిశీలిస్తే, బంగారంపై వడ్డీ ఆదాయాలు స్థిర రీతిన 2 నుంచి 4 శాతంగా ఉంటున్నాయి. ♦ మరోవైపు గడచిన ఆర్థిక సంవత్సరం ఎన్బీఎఫ్సీలతో పోల్చితే బంగారం హామీగా బ్యాంకులు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేశాయి. వీటి ఎల్టీవీ ఏకంగా 78 నుంచి 82 శాతం వరకూ ఉంది. ♦ ఫిబ్రవరి 2021 వరకూ గడచిన 11 నెలల్లో బంగారం హామీగా బ్యాంకుల రుణ మంజూరీ దాదాపు 70 శాతం పెరిగి రూ.56,000 కోట్లకు చేరాయి. బ్యాంకులకు 90శాతం వరకూ ఎల్టీవీ వెసులుబాటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కల్పించడం ఈ భారీ మంజూరీలకు ఒక కారణం. 2021 మార్చి 31 వరకూ బ్యాంకులకు ఈ వెసులుబాటు లభించింది. ♦ 2020 ఆగస్టు నుంచీ బంగారం ధరల 18 నుంచి 20 శాతం వరకూ పడిపోయాయి. దీనికితోడు బంగారంపై ఇచ్చిన రుణాలకు వడ్డీలు కూడా సరిగా వసూలు కాకపోతే, రుణ నాణ్యతపై కొంతమేర ప్రతికూల ప్రభావం తప్పకపోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ రేటింగ్ ఆఫీసర్ కృష్ణన్ సీతారామన్ పేర్కొన్నారు. ♦ ఆయా అంశాలను పరిశీలిస్తే, బంగారం ధరల్లో అస్థిరతల సమస్య నుంచి బయటపడ్డానికి రెండు కీలక మార్గాలు కనబడుతున్నాయి. పటిష్టమైన ‘ఇబ్బందుల నిర్వహణా వ్యవస్థ ఏర్పాటు’ ఇందులో ఒకటి. సకాలంలో కుదువ పెట్టిన బంగారాన్ని వేలం వేసేలా చర్యలు తీసుకోవడం రెండవ కీలక చర్య. పసిడి ధరల్లో ఒడిదుడుకులు ఇలా... కరోనా తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లను ‘సురక్షిత పెట్టుబడుల సాధనంగా’ పసిడి ఆకర్షించింది. గత సంవత్సరం ఆగస్టులో అంతర్జాతీయ కమోడిటీస్ ఫ్యూచర్స్ మార్కెట్-న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్చేంజ్ (నైమెక్స్)లో ఔన్స్ (31.1గ్రాము) చరిత్రాత్మక గరిష్ట స్థాయి రూ.2,089 డాలర్లను తాకింది. అయితే అమెరికా ఆర్థిక ఉద్దీపన, తిరిగి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటాయన్న విశ్వాసం బలపడ్డం, ఈక్విటీ మార్కెట్ల బలోపేత ధోరణి, డాలర్ ఇండెక్స్ (89 నుంచి 92 పైకి అప్) బలోపేతం వంటి అంశాల నేపథ్యంలో పసిడి ధర క్రమంగా భారీగా తగ్గింది. ఈ వార్తరాసే సోమవారం (12 ఏప్రిల్) రాత్రి 8 గంటల సమయంలో నైమెక్స్‌లో ధర 1,733 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గడచిన నెలరోజుల్లో పసిడికి 1,640 డాలర్ల వద్ద రెండుసార్లు పటిష్ట మద్దతు లభించింది. ఈ స్థాయి కిందకు పడితే పసిడి మరింత పతనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా పసిడి చరిత్రాత్మక గరిష్టం వద్ద ఉన్నప్పుడు దేశీయంగా ధర 10 గ్రాములు పూర్తి స్వచ్చత ధర రూ.56,000 పలికింది. ప్రస్తుతం కొంచెం అటుఇటుగా రూ.46,500 వద్ద ధర ఉంటోంది. ఈ వార్త రాస్తున్న సమయంలో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్-మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ధర రూ.46,578 వద్ద ట్రేడవుతోంది. ఎన్బీఎఫ్సీలు పటిష్టం: ఇండియా రేటింగ్స్ ఇదిలాఉండగా, కరోనా సెకండ్‌వేవ్‌ను తట్టుకోగలిగిన సామర్థ్యంలో ఎన్బీఎఫ్సీలు ఉన్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఇందుకు తగిన పటిష్ట మూలధనం, ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) ఎన్బీఎఫ్సీలు కలిగి ఉన్నట్లు వివరించింది. సెకండ్ వేవ్‌తో వ్యాపార కార్యకాలాపాలకు తిరిగి కఠిన ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషించింది. ఎన్బీఎఫ్సీలు తమ కస్టమర్లకు చక్కటి సేవలు అందించగలుతున్నట్లు వివరించింది. రిటైల్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎన్‌బీఎఫ్‌సీలకు ప్రస్తుతం తాను ఇస్తున్న ‘స్టేబుల్ అవుట్‌లుక్’ను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. అలాగే 2021-22కు హోల్‌సేల్ ఎన్‌బీఎఫ్‌సీలకు నెగటివ్ అవుట్‌లుక్‌ను కొనసాగుతుందని వివరించింది. సెకండ్‌వేవ్ విసిరే కొత్త సవాళ్లు వృద్ధి రికవరీపై ఏ మేరకు ప్రభావం చూపుతాయన్న విషయాన్ని వేచి చూడాల్సి ఉందని పేర్కొంది. -
బీమా సంస్థలలో భారీ వాటాల విక్రయం!
ముంబై: కీలకం కాని బీమా బిజినెస్‌లలో బ్యాంకింగ్ సంస్థలు నియంత్రిత స్థాయిలో వాటాలను కలిగి ఉండటంపై రిజర్వ్ బ్యాంక్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. బీమా వెంచర్లకు బ్యాంకింగ్ సంస్థలు అధిక పెట్టుబడులను వెచ్చించాల్సి రావడంతో వాటాలపై పరిమితి విధించే యోచనలో ఆర్బీఐ ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి బీమా రంగ సంస్థలలో బ్యాంకుల వాటాను గరిష్టంగా 20 శాతానికి పరిమితం చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించాయి. ఈ బాటలోనే ఇటీవల మ్యాక్స్ లైఫ్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్‌ను అనుమతించినట్లు పేర్కొన్నాయి. మ్యాక్స్ లైఫ్‌లో ప్రత్యక్షంగా 10 శాతం వాటాను మాత్రమే కలిగి ఉండేందుకు యాక్సిస్ బ్యాంక్ ప్రతిపాదించింది. అంతేకాకుండా 20 శాతానికి వాటాను పరిమితం చేసుకునేందుకు అంగీకరించినట్లు తెలియజేశాయి. ప్రస్తుతం 50 శాతం ప్రస్తుతం బీమా రంగ వెంచర్లలో బ్యాంకులు 50 శాతం వరకూ వాటాను పొందేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఈ వాటాను 20 శాతానికి పరిమితం చేయాలని కేంద్ర బ్యాంకు భావిస్తున్నట్లు ఒక నివేదిక అభిప్రాయపడింది. ఇది జరిగితే కేవలం మూడు బ్యాంకింగ్ దిగ్గజాలు విక్రయించే వాటా విలువే రూ.1.21 లక్షల కోట్లుగా ఉండగలదని విశ్లేషకులు అంచనా వేశారు. తాజా ప్రతిపాదనల ప్రకారం బీమా అనుబంధ సంస్థలలో పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ, ప్రయివేట్ రంగ బ్లూచిప్స్ హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ వాటాలను విక్రయించవలసి వస్తే వీటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని పేర్కొన్నారు. బీమా వెంచర్లలో వాటాను 20 శాతానికి పరిమితం చేసుకోమంటూ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలను ఆర్బీఐ ఆదేశిస్తే.. ఈక్విటీ ఫ్రీఫ్లోట్ భారీగా పెరుగుతుందని తెలియజేశాయి. దిగ్గజాల తీరిలా లిస్టెడ్ కంపెనీలలో హెచ్‌డీఎఫ్‌సీకి బీమా అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో 50 శాతం వాటా ఉంది. తాజా ప్రతిపాదనలకు అనుగుణంగా ఈక్విటీని తగ్గించుకోవలసి వస్తే రూ. 44,100 కోట్ల విలువైన వాటాను విక్రయించవలసి ఉంటుంది. ఇక ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్‌లో 51 శాతం వాటా కలిగిన ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ధర ప్రకారం రూ.22,100 కోట్ల విలువైన షేర్లను అమ్మకానికి ఉంచవలసి వస్తుంది. ఇదే విధంగా ఐసీఐసీఐ లంబార్డ్‌లోనూ 52 శాతం వాటాను కలిగి ఉంది. ఈ వెంచర్లో రూ. 21,700 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫ్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ బాటలో ఎస్బీఐ లైఫ్‌లో 55 శాతం వాటాను సొంతం చేసుకున్న స్టేట్‌బ్యాంక్ అయితే రూ. 32,200 కోట్ల విలువైన వాటాను తగ్గించుకోవలసి వస్తుంది. ఈ నాలుగు దిగ్గజాల వాటాలను పరిగణించినప్పటికీ వీటి విలువ రూ. 1.21 లక్షల కోట్ల వరకూ నమోదు కావచ్చని విశ్లేషకులు మదింపు చేశారు. పలు సంస్థలు.. అన్ని పీఎస్‌యూ బ్యాంకులతోపాటు.. పలు ప్రయివేట్ రంగ బ్యాంకులు సైతం బీమా రంగంలో అనుబంధ సంస్థలను ఏర్పాటు చేశాయి. అయితే.. కోవిడ్–19 నేపథ్యంలో మొండి రుణాలు తదితర సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా బ్యాంకులకు బీమా రంగ వెంచర్లు ఉపయోగపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. బీమా రంగ కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా సమకూర్చుకున్న నిధులను ప్రొవిజనింగ్ తదితరాలకు బ్యాంకులు వినియోగించుకునేందుకు వీలు చిక్కుతున్నట్లు తెలియజేసింది. ఉదాహరణకు 2016–18 కాలంలో హెచ్డీఎఫ్సీ ఇలా సమీకరించిన నిధులను 40 శాతం వినియోగించుకోగా.. ఐసీఐసీఐ బ్యాంక్ సైతం ఇదే స్థాయిలో ప్రొవిజన్లకు కేటాయించింది. జీవిత బీమా, సాధారణ బీమా సంస్థలలో వాటాల విక్రయం ద్వారా 2016 నుంచి చూస్తే హెచ్డీఎఫ్సీ రూ. 10,900 కోట్లు సమకూర్చుకోగా.. ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 15,300 కోట్లు, ఎస్బీఐ రూ. 12,670 కోట్లు అందుకున్నట్లు నివేదిక తెలియజేసింది. చదవండి: డెస్క్ టాప్లోనూ వాయిస్, వీడియో కాల్స్ ఇండియాలోకి ఎఫ్‌డిఐ పెట్టుబడుల జోరు -
బంగారంపై రుణమా?.. ఇవి గుర్తుంచుకోండి
మన దేశంలో అందరికి బంగారంపై మక్కువ ఎక్కువ. తరతరాల నుంచి బంగారాన్ని కొని దాచుకోవడం ఒక అలవాటు. ఇంట్లో ముఖ్యమైన వేడుకలు జరిగినప్పుడు బంగారం కొనుగోలుకు ఎక్కువ ఇష్టపడతారు. అలాగే ఇది ఒక ఆభరణంగా మాత్రమే కాకుండా తాత్కాలికంగా సమస్యలు ఎదురైనప్పుడు దీనిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటారు. ఇది చాలా సమస్యలను పరిష్కరించడానికి ఎక్కువ ఉపయోగిస్తారు. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు(ఎన్బీఎఫ్సీ) కూడా బంగారంపై రుణాలు ఇవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపుతాయి. బంగారంపై రుణాలను జారీ చేసేందుకు బ్యాంకులు కూడా క్రెడిట్ స్కార్‌లను పరిగణలోకి తీసుకోవు. బంగారంపై రుణం ఇచ్చేటప్పుడు రుణ గ్రహిత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని కూడా అంచనా వేయవు. ప్రస్తుతం మణప్పురం, ముత్తూట్ ఫైనాన్స్ వంటివి బంగారు రుణ వ్యాపారంపైనే ప్రధానంగా దృష్టి సారించాయి. అయితే మనం బంగారంపై కొన్ని విషయాలు గురుంచుకోండి. బ్యాంకులు వర్సెస్ ఎన్బీఎఫ్సీ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉంది. బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తే ఎన్బీఎఫ్సీలు ఎక్కువ మొత్తంలో రుణాలు అందజేస్తాయి. అలాగే బ్యాంకులు ఎక్కువ మొత్తం రుణాలు అందజేస్తాయి. కాకపోతే బ్యాంకులతో పోలిస్తే వడ్డీరేటు 1 నుంచి 2 శాతం ఎక్కువ ఉంటుంది. ఉదాహారణకు మీ దగ్గర ఉన్న 20గ్రాముల బంగారానికి రుణాలు తీసుకుంటే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ రెండు వాస్తవిక బంగారం విలువలో 75 శాతం అందిస్తుంటాయి. మీకు ప్రభుత్వ బ్యాంకులు 10 గ్రాముల బంగారానికి రూ.40వేలు అందిస్తే, ఎన్బీఎఫ్సీలు కొంచెం ఎక్కువ అందించే అవకాశం ఉంటుంది. కానీ ఎన్‌బీఎఫ్‌సీల కంటే బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాయి. రుణ మంజూరు విషయంలో ఎన్బీఎఫ్సీలు ముందు ఉంటాయి. ఎలాంటి బంగారం తాకట్టు పెట్టొచ్చు? బంగారం రుణం కావాలంటే బంగారం కనీస స్వచ్ఛత 18 క్యారెట్లు ఉండాలి. మనం సాధారణంగా ధరించే బంగారం 22 క్యారెట్లు ఉంటుంది. 18 క్యారెట్ల కంటే తక్కువ నాణ్యత ఉంటే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రుణాలు మంజూరు చేయవు. అభరణాలు, బంగారు నాణేలను తాకట్టు పెట్టవచ్చు కానీ బంగారు కడ్డీలపై చాలా బ్యాంకులు రుణాలు ఇవ్వవు. అలాగే తనఖా పెట్టిన అభరణాల్లో భాగమైన వజ్రాలు, రాళ్లకు విలువ ఉండదు. కేవలం బంగారం విలువను మాత్రమే లెక్కిస్తారు. నాణేల విషయంలో కూడా స్వేచ్ఛత అడగవచ్చు. 50 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న నాణేలను అంగీకరించరు. బంగారంపై ఛార్జీలు బ్యాంకులను, ఫైనాన్సింగ్ సంస్థలను బట్టి మారుతుంటాయి. వ్యాల్యుయేషన్ ఛార్జెస్, ప్రాసెసింగ్ ఫీజ్ లాంటివి ఉంటాయి. రీపేమెంట్ రుణం తిరిగి చెల్లించే విషయంలో రకరకాల ఆప్షన్లు ఉంటాయి. నెలవారీగా వాయిదాలలో(ఈఎంఐ) చెల్లించవచ్చు లేదా రుణ కాలపరిమితి ఉన్నంత వరకు వడ్డీని మాత్రమే చెల్లించి చివరలో ఒకేసారి మొత్తం రుణం చెల్లించవచ్చు. అసలుతో పాటు వడ్డీ కలిపి చివరలో చెల్లించవచ్చు. గోల్డ్ లోన్ చెల్లించకపోతే ఏమవుతుంది? రుణాన్ని సమయానికి తిరిగి చెల్లించకెపోతే రుణదాతలకు మీ బంగారాన్ని విక్రయించే హక్కు ఉంటుంది. విక్రయించే ముందు బ్యాంకు లేదా ఫైనాన్సింగ్ సంస్థలు నోటీసులు ఇస్తాయి. బంగారం ధర పడిపోతే రుణదాత అదనపు బంగారాన్ని తాకట్టు పెట్టాలని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల కోరే అవకాశం ఉంది. రుణం, బంగారం విలువ నిష్పత్తిని ఎప్పటికప్పుడు నిబంధనల మేరకు కొనసాగించాలని బ్యాంకులు కోరుతుంటాయి. చదవండి: వాహనదారులకు కేంద్రం తీపికబురు -
బంగారం రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే!
బంగారం విషయంలో భారత ప్రజలకు ఎక్కువగా భావోద్వేగపరమైన సంబంధం ఉంటుంది. అందుకే ప్రజలు ఎక్కువగా బంగారం అమ్మటానికి ఇష్టపడరు. ఒకవేల ఏదైనా కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు డబ్బుల కోసం బంగారం తాకట్టుపెట్టి రుణాలు తెచ్చుకోవడానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తారు. మన దేశంలో ప్రజలు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు బంగారాన్ని ఒక ఆస్తిగా వాడుకోవటానికే ఇష్ట పడుతారు. అప్పులు ఇచ్చే వాళ్లు కూడా బంగారాన్ని మంచి తాకట్టు వస్తువుగా పరిగణిస్తారు. అందుకే కరోనా సమయంలో మణప్పురం గోల్డ్ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు) ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మరింత ఎక్కువగా రుణాలు ఇస్తూ వాటిపై వడ్డీలు ఆర్జిస్తున్నాయి. సాధారణంగా వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్ల కంటే బంగారం రుణాల వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. బంగారు నగలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కిట్లను తాకట్టు పెడతారు కాబట్టి బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు ఇస్తుంటాయి. భవిష్యత్ లో వీటి ధరలు పెరుగుతుంటాయి కాబట్టి బ్యాంకులు కూడా త్వరగా రుణాలు ఇవ్వడానికి చూస్తాయి. వడ్డీ రేట్లు అనేవి బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థలను బట్టి మారుతూ ఉంటాయి. కస్టమర్ క్రెడిట్ హిస్టరీ ఆధారంగా ఈ వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ సంస్థల కన్నా బ్యాంకుల్లోనే బంగారం రుణాల వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. తక్కువ వడ్డీకే బంగారం రుణాలు ఇస్తున్న ఎన్బీఎఫ్సీలు, బ్యాంకుల గురుంచి ఈ క్రింద తెలుసుకోండి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ - 7 శాతం. బ్యాంక్ ఆఫ్ ఇండియా- 7.35 శాతం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 7.50 శాతం. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- 7.50 శాతం. కెనెరా బ్యాంక్- 7.65 శాతం. కర్నాటక బ్యాంక్- 8.38 శాతం. ఇండియన్ బ్యాంక్- 8.50 శాతం. యూకో బ్యాంక్- 8.50 శాతం. ఫెడరల్ బ్యంక్- 8.50 శాతం. పంజాబ్ నేషనల్ బ్యాంక్- 8.75 శాతం. యూనియన్ బ్యాంక్- 8.85 శాతం. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్- 8.90 శాతం. సెంట్రల్ బ్యాంక్- 9.05 శాతం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్- 9.25 శాతం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్- 9.50 శాతం. బ్యాంక్ ఆఫ్ బరోడా- 9.60 శాతం. యెస్ బ్యాంక్- 9.99 శాతం. ఐసీఐసీఐ బ్యాంక్- 10 శాతం. ఇండస్ ఇండ్ బ్యాంక్- 10 శాతం. కొటక్ మహీంద్రా బ్యాంక్- 10.50 శాతం. ముత్తూట్ ఫైనాన్స్- 11.99 శాతం. మణప్పురం ఫైనాన్స్- 12 శాతం. యాక్సిస్ బ్యాంక్- 13 శాతం.చదవండి చదవండి: బంగారం కొనుగోలుదారులకు తీపికబురు -
పిరమల్ చేతికి దివాన్ హౌసింగ్
న్యూఢిల్లీ: దివాళా చట్ట చర్యలకు లోనైన ఎన్బీఎఫ్సీ.. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్ఎఫ్ఎల్)ను పిరమల్ గ్రూప్ సొంతం చేసుకోనుంది. ఇందుకు ఆర్బీఐ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రుణ భారంతో కుదేలైన డీహెచ్ఎఫ్ఎల్ను కొనుగోలు చేసేందుకు పిరమల్ గ్రూప్ ప్రతిపాదించిన రుణ పరిష్కార ప్రణాళికకు ఇప్పటికే రుణదాతల కమిటీ(సీవోసీ) ఆమోదముద్ర వేసింది. పిరమల్ గ్రూప్ కంపెనీ పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ రూపొందించిన రుణ పరిష్కార ప్రణాళికను జనవరి 15న సీవోసీ ఆమోదించింది. భారీ నష్టాలు..: ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో డీహెచ్ఎఫ్ఎల్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 13,095 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ3లో రూ. 934 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్)లోనూ డీహెచ్ఎఫ్ఎల్ రూ. 2123 కోట్ల నష్టాలు ప్రకటించడం గమనార్హం! ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న డీహెచ్ఎఫ్ఎల్పై దివాళా చర్యలకు వీలుగా 2019 నవంబర్‌లో జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కు సిఫారసు చేస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఈలో డీహెచ్ఎఫ్ఎల్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 18 వద్ద ముగిసింది. -
రుణ అర్హతలను పెంచుకోండిలా..
మీరు తీసుకున్న రుణమే మీ అర్హతలను నిర్దేశిస్తుంది. భవిష్యత్తులో మీకు అవసరం ఏర్పడితే రుణదాతలు క్యూ కట్టి ‘బాబ్బాబు మేము ఇస్తాం’ అనే విధంగా చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. నేటి రోజుల్లో రుణం లభించడం ఎంత సులభమో.. అంత కష్టం కూడా. ఎందుకంటే ఓ వ్యక్తి రుణ చరిత్ర అంతా క్రెడిట్ బ్యూరోల రికార్డుల్లో వివరంగా నమోదవుతుంటుంది. రుణాల మంజూరుకు ముందు బ్యాంకు అయినా ఎన్బీఎఫ్సీ అయినా దరఖాస్తుదారుని క్రెడిట్ స్కోరును కచ్చితంగా పరిశీలిస్తాయి. క్రెడిట్ స్కోరు మీ రుణ అర్హతను నిర్ణయించడమే కాదు.. ఎంత వడ్డీ రేటు వసూలు చేయాలనే విషయంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. క్రెడిట్ స్కోర్ ఎంత బాగుంటే.. మీకు అంత ఆకర్షణీయమైన వడ్డీ రేటుకు, కోరుకున్నంత రుణం లభిస్తుందన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే మీ రుణ దరఖాస్తు స్వీకరణ లేదా తిరస్కరణ అనేది మీ క్రెడిట్ స్కోర్ మీదే ఆధారపడి ఉంటుంది. అసలు క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? దాన్ని ఎలా లెక్కిస్తారు? మీ స్కోర్‌ను ఎలా పెంచుకోవాలన్నది ఓసారి చూద్దాం. ఎలా లెక్కిస్తారంటే... రుణ గ్రహీతల విశ్వసనీయతను.. చెల్లింపుల సామర్థ్యాన్ని కొలిచే ప్రమాణాల్లో క్రెడిట్ స్కోర్ ఒకటి. దరఖాస్తుదారుల రుణ అర్హతను అంచనా వేయడానికి, రుణ మొత్తాన్ని నిర్ణయించడానికి బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేస్తుంటాయి. దీనికితోడు, ఇతర సమాచారం ఆధారంగా రుణాలకు అర్హులా, కాదా? అన్నది నిర్ణయిస్తారు. వడ్డీ రేటుకూ ఇదే ప్రామాణికం అవుతుంది. రుణాల మంజూరు, తిరిగి చెల్లింపుల సమాచారాన్ని రుణ గ్రహీతల పాన్ నంబర్ ఆధారంగా.. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) క్రమం తప్పకుండా నిర్ణీత కాలానికోసారి క్రెడిట్ బ్యూరో సంస్థలకు (సిబిల్ తదితర) అందిస్తుంటాయి. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని క్రెడిట్ స్కోరును నిర్ణయిస్తుంటాయి బ్యూరోలు. సాధారణంగా గత 36 నెలల రుణ చరిత్ర ఆధారంగా క్రెడిట్ స్కోర్ ఉంటుంది. చెల్లింపుల తీరు, సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మిశ్రమం ఎలా ఉంది, రుణాల కోసం విచారణలు, రుణాల వినియోగం.. ఈ నాలుగు అంశాలు మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంటాయి. అయితే ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆల్గోరిథమ్‌ల సాయంతో.. రుణ చరిత్రతోపాటు వినియోగదారుల దీర్ఘకాలిక ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్ (చెల్లించాల్సిన బకాయిలు), క్రెడిట్ కార్డ్‌ల లావాదేవీల చరిత్ర, కొత్త ఖాతాల ప్రారంభం లేదా తొలగింపులు, తిరిగి చెల్లింపుల నిష్పత్తి వంటివి కూడా క్రెడిట్ బ్యూరోలకు ప్రామాణికంగా మారాయి. సాధారణంగా.. 300 నుంచి 900 వరకు క్రెడిట్ స్కోర్ ఉంటుంది. రుణదాతలకు వ్యక్తిగత రుణాలు లభించాలంటే.. కనీస సిబిల్ స్కోర్ 720 నుంచి 750 మధ్య అయినా ఉండాలి. ఇంతకంటే ఎక్కువ స్కోర్ ఉంటే రుణాన్ని అధిక మొత్తంలో పొందే అర్హత ఉంటుంది. స్కోర్ తక్కువగా ఉంటే రుణం కూడా తక్కువే వస్తుంది. స్కోర్‌ను మెరుగుపరుచుకోవాలంటే.. రుణ వాయిదాల చెల్లింపుల్లో డిఫాల్ట్ కాకుండా చూసుకోవాలి. గృహ, వాహన రుణాలు సెక్యూర్డ్ రుణాల కిందకు వస్తాయి. వ్యక్తిగత, క్రెడిట్ కార్డ్ రుణాలు అన్‌సెక్యూర్డ్‌గా ఉంటాయి. సెక్యూర్డ్ రుణాల్లో రుణదాత విఫలమైనా, రుణమిచ్చిన సంస్థలకు రిస్క్ పెద్దగా ఉండదు. ఎందుకంటే హామీగా ఆస్తులు ఉంటాయి. వాటిని విక్రయించి సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ, అన్సెక్యూర్డ్ రుణాలను ఎగ్గొడితే.. వసూలు చేసుకోవడం రుణమిచ్చిన సంస్థలకు తలనొప్పిగా పరిణమిస్తుంది. అందుకే రుణదాతలు అన్సెక్యూర్డ్స్ రుణాలు, వాటిని తిరిగి ఏ విధంగా చెల్లిస్తున్నారన్న చరిత్ర గురించి లోతైన విశ్లేషణ చేస్తుంటారు. మీ సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపించేవి కూడా ఈ అన్సెక్యూర్డ్ రుణాలే. ముఖ్యంగా..జాయింట్ బ్యాంక్ అకౌంట్‌ను కలిగి ఉన్న వారికి హామీ ఇవ్వటంలో జాగ్రత్త వహించాలి. ఒకవేళ ఆయా ఖాతా చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులెదురైనా ఆ బాధ్యత జాయింట్ ఖాతాదారులైన మీ మీద కూడా పడుతుంది. అంతిమంగా దీని ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ మీద కూడా ఉంటుంది. వ్యక్తిగత రుణం, క్రెడిట్‌కార్డు వినియోగం, వాహన రుణం, గృహ రుణం ఇలా రుణ పోర్ట్‌ఫోలియో వైవిధ్యంగా ఉండడం కూడా ప్రభావం చూపిస్తుంది. క్రెడిట్‌కార్డు విషయంలో సకాలంలో చెల్లింపులతోనూ స్కోర్ పెంచుకోవచ్చు. స్కోర్‌ను చెక్ చేసుకోవచ్చు.. క్రెడిట్ బ్యూరో సంస్థలు ఏటా ఒక్కసారి ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్ పొందే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఇక వివిధ రకాల ఆర్థిక సేవల సంస్థలు సైతం తమ పోర్టళ్ల నుంచి, యాప్స్ నుంచి క్రెడిట్ స్కోరును ఉచితంగా తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంటాయి. తద్వారా రుణాల ఆఫర్లను అందించొచ్చన్న ప్రయోజనం అందులో దాగుంటుంది. మీకు రుణ అవసరం ఉన్నా, లేకపోయినా క్రెడిట్ స్కోర్‌ను ఉచితంగా తెలుసుకునే సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. పాన్ నంబర్ సాయంతో ఈ వివరాలు తెలుసుకోవచ్చు. మొబైల్ నంబరుకు వచ్చే వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారంగా మీ గుర్తింపును ధృవీకరించిన అనంతరం క్షణాల్లో ఉచితంగా మీ క్రెడిట్ స్కోర్ రిపోర్ట్‌ను అందుకుంటారు. -
ఆర్బీఐ లోపాలే.. లోన్ యాప్‌లకు లాభాలు!
సాక్షి, హైదరాబాద్: అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ వ్యవహారాలకు పాల్పడిన చైనా లోన్ యాప్స్ కేసుల దర్యాప్తులో సైబర్ క్రైమ్ పోలీసులు కీలకాంశాలు గుర్తించారు. అవసరార్థులకు రుణాల మంజూరు, వడ్డీ వసూళ్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల్లో ఉన్న లోపాలనే చైనా యాప్స్ తమకు అనుకూలంగా మార్చుకున్నాయని తేల్చారు. వీటికి దేశంలోని వివిధ మెట్రో నగరాలకు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) సహకరించినట్లు గుర్తించారు. ఇటీవల సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో ఆర్బీఐ సహా వివిధ సంస్థలతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా పోలీసు విభాగం తమ దర్యాప్తులో గుర్తించిన వ్యవస్థాగత లోపాలను వారి దృష్టికి తీసుకెళ్లింది. రాజధానిలోని మూడు కమిషనరేట్లలోనూ నమోదైన కేసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత సమగ్ర నివేదికను రూపొందించి ఆర్బీఐకి పంపాలని నిర్ణయించింది. ఒప్పందం చేసుకుని జంప్.. ఇక అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్‌తో పాటు బలవంతపు రివకరీల కోసం కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది చైనాకు చెందిన సంస్థలే అని తేలింది. అయితే రుణాలు ఇవ్వడానికి వినియోగించిన నగదు మాత్రం దేశం బయట నుంచి రాలేదు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా మరికొన్ని మెట్రో నగరాల్లో ఉన్న ఎన్బీఎఫ్సీలతో చైనా కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రుణాలు అందించడానికి, తిరిగి వసూలు చేయడానికి అవసరమైన ఫ్లాట్‌ఫామ్స్ (యాప్స్, కాల్ సెంటర్లు) తాము రూపొందిస్తామని, ఆయా కస్టమర్లకు రుణాలు మాత్రం మీరు ఇవ్వాలంటూ చైనా కంపెనీలు ఎన్బీఎఫ్సీలతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ పత్రాలపై సంతకాలు చేసిన సమయంలో మాత్రమే సూత్రధారులైన చైనీయులు ఎన్బీఎఫ్సీ నిర్వాహకుల్ని కలిశారు. ఆపై వాళ్లు పత్తాలేకుండా పోయి తమ అనుచరుల ద్వారా ఇక్కడి వ్యవహారాలు చక్కబెట్టారు. సర్వీసు చార్జీల కింద కొంత.. వడ్డీ పేరిట అంత! ఇక ఎన్బీఎఫ్సీలు - చైనా కంపెనీలు ఆర్బీఐ నిబంధనల్లో ఉన్న లోపాలను అధ్యయనం చేశాయి. అప్పులపై వసూలు చేసే వడ్డీ ఏడాదికి 36 శాతం దాటకూడదంటూ ఆయా నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్లలో రుణాలు మంజూరు చేసేప్పుడు ఆయా కంపెనీలు సర్వీస్ చార్జ్ కింద గరిష్టంగా ఎంత మొత్తం వసూలు చేయాలనేది మాత్రం ఆర్బీఐ నిబంధనల్లో ఎక్కడా లేదు. దీన్నే చైనా కంపెనీలు, ఎన్బీఎఫ్సీలు తమకు కలసి వచ్చే అంశంగా మార్చుకున్నాయి. రూ.5 వేల రుణానికి రూ.1200 చొప్పున సర్వీసు చార్జ్ కింద మినహాయించుకుని రుణగ్రహీతకు రూ.3,800 మాత్రమే చెల్లించాయి. ఈ రుణాన్నీ వారం రోజుల్లో తిరిగి చెల్లించేలా నిబంధన విధించాయి. ఆ సమయంలో వడ్డీగా మాత్రం కేవలం రూ.15 నుంచి రూ.20 మాత్రమే వసూలు చేస్తున్నాయి. ఈ మొత్తం సరాసరిన చూస్తే ఏడాదికి 25 శాతం లోపే ఉంటోంది. వడ్డీ మొత్తం ఎన్‌బీఎఫ్‌సీలకే వెళ్తున్నప్పటికీ సర్వీస్ చార్జీని మాత్రం వీరిలో పాటు యాప్, కాల్ సెంటర్ల నిర్వాహకులు పంచుకుంటున్నారు. మరోపక్క ఈ లోన్ యాప్స్ లావాదేవీలపై పోలీసులకు ఇప్పటివరకు స్పష్టత రాలేదు. 3 వీటి ద్వారా రుణగ్రస్తులకు నగదు ఇచ్చిన, ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించిన రోజర్‌పే సంస్థ అందించిన వివరాల ప్రకారం ఆయా ఎన్‌బీఎఫ్‌సీల టర్నోవర్ రూ.25 వేల కోట్ల వరకు ఉంది. అయితే ఎన్బీఎఫ్సీలు కేవలం లోన్ యాప్స్ ద్వారా అప్పులు ఇవ్వడమే కాకుండా ఇతర ఆర్థిక కార్యకలాపాలు సాగిస్తుంటాయి. అవన్నీ కలుపుకుంటే ఈ మొత్తం వస్తోందని పోలీసులు చెప్తున్నారు. ఇందులో కేవలం రుణ యాప్‌ల ద్వారా మాత్రమే జరిగిన లావాదేవీలు ఎంత అనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదని పేర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా ఈ లోన్ యాప్స్‌కు సంబంధించిన వ్యవహారశైలిలో మార్పు వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. ఒకప్పుడు ఇవి ఫోన్లు, సందేశాలు, సోషల్ మీడియా ద్వారా డిఫాల్టర్లను వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా చేశాయి. అయితే వీటిపై కేసుల నమోదు, నిందితుల అరెస్టులు, ఎన్‌బీఎఫ్‌సీల బ్యాంకు ఖాతాల ఫ్రీజింగ్ వంటి చర్యల్ని పోలీసులు తీసుకున్నారు. దీంతో ఇటీవల కాలంలో ఎగవేతదారులకు ఫోన్లు చేస్తున్న కాల్ సెంటర్ల వారు చాలా మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తున్నారు. మొత్తం కట్టలేకుంటే సర్వీసు చార్జ్, వడ్డీ మినహాయించి అప్పుగా తీసుకున్న నగదు చెల్లించాలని కోరుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీటిపై వచ్చే ఫిర్యాదులు లేవని పేర్కొంటున్నారు. రూ.320 కోట్లు ఫ్రీజ్ చేశాం.. లోన్ యాప్స్ కేసులకు సంబంధించి ఇప్పటివరకు చైనా జాతీయుడి సహా 20 మందిని అరెస్టయ్యారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.320 కోట్లు ఫ్రీజ్ చేశాం. గతంలో నమోదైన కలర్ ప్రిడెక్షన్ కేసులో రూ.105 కోట్లు హాంకాంగ్‌లోని బ్యాంకు ఖాతాలకు మళ్లినట్లు గుర్తించాం. ఏదైనా యాప్ వ్యవహారాలపై అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయండి. అక్కడ ఓ బృందం వీటిపైనే 24 గంటలూ పని చేస్తుంటుంది. -- అంజనీకుమార్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ చదవండి: "వికీలీక్స్" వీరుడి కోసం వేట మొదలైంది! తీపి కబురు: దిగొచ్చిన బంగారం ధరలు! -
ఎన్బీఎఫ్సీలు : ఆర్బీఐ కొత్త ప్రతిపాదనలు
సాక్షి, ముంబై: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) వ్యవస్థ మరింత పటిష్టవంతం కావడానికి తగిన చొరవలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శ్రీకారం చుడుతోంది. ఈ దిశలో నాలుగు అంచెల నియంత్రణా వ్యవస్థను ప్రతిపాదించింది. ఆర్బీఐ విడుదల చేసిన చర్చా పత్రం ప్రకారం- ‘బేస్ (ఎన్బీఎఫ్సీ-బీఎల్), మిడిల్ (ఎన్బీఎఫ్సీ-ఎంఎల్), అప్పర్ (ఎన్బీఎఫ్సీ-యూఎల్), టాప్ (ఎన్బీఎఫ్సీ-టీఓపీ)’ అనే నాలుగు అంచల నియంత్రణలోకి ఎన్బీఎఫ్సీలు వెళతాయి. వారి పరిమాణం, నిధుల సమీకరణ పరిస్థితులు, అనుసంధాన విధాన ప్రక్రియలు, స్థిరత్వం, క్లిష్టత, క్రియాశీలత విషయంలో తీరు తెన్నులు వంటి అంశాల ప్రాతిపదికన ఈ వర్గీకరణ ఉంటుంది. ‘‘ఎన్‌బీఎఫ్‌సీలకు సవరించిన నియంత్రణా వ్యవస్థ– అంచలవారీ ధోరణి’’ అన్న పేరుతో వెలువడిన ఈ ఆర్బీఐ చర్చా పత్రంపై సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను నెలరోజుల్లో పంపాల్సి ఉంటుంది. (రూ.100 నోటు షాకింగ్ న్యూస్!) ఎన్‌బీఎఫ్‌సీల ప్రయాణం... పలు సంవత్సరాలుగా పటిష్ట నియంత్రణలు, పారదర్శకత దిశగా ఎన్బీఎఫ్సీ రంగం అడుగులు వేస్తూ వస్తోంది. 1964 నుంచీ ఎన్బీఎఫ్సీలు ఆర్బీఐ నియంత్రణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2006లో సెంట్రల్ బ్యాంక్ సమగ్ర రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్‌ను ప్రవేశపెట్టింది. 2014లో దీనిని మరోసారి సమీక్షించి, మార్పులూ చేర్పులూ చేయడం జరిగింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్బీఐ నియంత్రణా పరమైన చర్యలను తీసుకుంటూనే ఉంది. పెద్ద ఎన్‌బీఎఫ్‌సీలకు అదనపు నియంత్రణలూ అమలు జరుగుతున్నాయి. ‘‘సంస్థల వ్యాపార వృద్ధిపై తగిన నియంత్రణలు లేకపోతే, అనుసంధాన ఫైనాన్షియల్ వ్యవస్థలో వ్యవస్థాకతమైన ఇబ్బందులు తలెత్తుతాయి. భారీగా విస్తరించిన ఎన్బీఎఫ్సీలో ఏదైనా సమస్య తలెత్తితే, అది మొత్తం ఫైనాన్షియల్ వ్యవస్థపై ప్రతికూలత చూపుతుంది. ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. చిన్న, మధ్య స్థాయి ఎన్బీఎఫ్సీలపై కూడా ఈ ప్రభావం కనబడుతుంది’’ అని ఆర్బీఐ తన చర్చా పత్రంలో పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నియంత్రణా పరమైన పటిష్టతా పెరగాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపింది. జాగ్రత్తలతో కూడిన, వర్గీకృత నియంత్రణా వ్యవస్థలు ఎన్‌బీఎఫ్‌సీల పటిష్టతకు దారితీస్తాయన్న అభిప్రాయాన్నీ వ్యక్తం చేసింది. వర్గీకరణ విధమిది... ఎన్బీఎఫ్సీ-బీఎల్: రూ.1,000 కోట్ల వరకూ అసెట్ సైజ్ పరిమాణం ఉంటుంది. ఎన్బీఎఫ్సీలు అత్యధిక భాగం ఇదే కేటగిరీలోకి వెళతాయి. డిపాజిట్లు స్వీకరించని 9425 ఎన్బీఎఫ్సీల్లో 9209 ఇదే విభాగం కిందకు వస్తాయి. ఎన్బీఎఫ్సీ-ఎంఎల్: ‘వ్యవస్థాగతంగా ప్రాముఖ్యత కలిగిన’’ ప్రస్తుత అన్ని నాన్–డిపాజిట్ టేకింగ్ ఎన్బీఎఫ్సీలు అలాగే డిపాజిట్లు తీసుకునే అన్ని ఎన్బీఎఫ్సీలు ఈ విభాగంలోకి వస్తాయి. ఎన్బీఎఫ్సీ-యూఎల్: ‘‘వ్యవస్థాగతంగా కీలకంగా గుర్తించిన 25 నుంచి 30 టాప్ ఎన్బీఎఫ్సీలు ఈ పరిధిలోకి వస్తాయి. బ్యాంకుల విషయంలో ఎలాంటి రెగ్యులేషన్లు ఉంటాయో, వీటికీ అవే వర్తిస్తాయి. టాప్ లేయర్: ఈ విభాగం ప్రస్తుతానికి ఖాళీగా ఉంటుంది. ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి చోటుచేసుకునే సవాళ్లకు అనుగుణంగా ఈ విభాగాన్ని పునర్నిర్వచించడం జరుగుతుంది. -
రెండు నిమిషాల్లోనే పేటిఎమ్ పర్సనల్ లోన్!
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో పేటిఎమ్ తన వినియోగదారులకు శుభవార్త తెలిపింది. ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటిఎమ్ తన 1 మిలియన్ కస్టమర్లకు ఇన్స్టంట్ పర్సనల్ లోన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అర్హత గల వినియోగదారులు కేవలం 2 నిమిషాల్లోనే వ్యక్తిగత రుణాలను 365రోజుల్లో ఎప్పుడైనా పొందవచ్చు అని పేటీఎం పేర్కొంది. రుణాలను వినియోగదారులు 18-36 నెలల్లో వాయిదా పద్దతిలో తీర్చవచ్చు. పేటిఎమ్ యొక్క ఇన్స్టంట్ పర్సనల్ లోన్ ఎన్బీఎఫ్సీలచే ప్రాసెస్ చేయబడతాయి. యూజర్లు తీసుకునే వాయిదాను బట్టి ఈఎంఐను నిర్ణయిస్తారు.(చదవండి: ఎయిర్టెల్ యూజర్లకు బంపరాఫర్) ఈ చర్యవల్ల ‘క్రెడిట్ టు న్యూ’ కస్టమర్లు అధికారిక ఆర్థిక మార్కెట్ పరిధిలోకి వస్తారు. పేటిఎమ్ యొక్క ఈ క్రొత్త సేవల ద్వారా బ్యాంకింగ్ సంస్థలు అందుబాటులో లేని చిన్న చిన్న పట్టణాల వారికీ ఆర్థిక సహాయం అందనున్నట్లు పేర్కొంది. రుణ దరఖాస్తు కోసం ఎటువంటి పేపర్ డాక్యుమెంటేషన్ లేకుండా మొత్తం ప్రక్రియను డిజిటలైజ్ చేసింది. ఈ ప్రక్రియ కోసం అత్యాధునిక టెక్ ప్లాట్‌ఫామ్‌ను నిర్మించినట్లు పేటిఎమ్ పేర్కొంది. కొత్త ఇన్స్టంట్ పర్సనల్ లోన్ పథకం కింద అర్హులు గల ఉద్యోగులు, చిన్న వ్యాపారులకు, ఇతరులకు 2 నిమిషాల్లోనే రూ.2 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు పేటీఎం ఒక ప్రకటన విడుదల చేసింది. అర్హత కలిగిన కస్టమర్లు ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం కింద 'పర్సనల్ లోన్' టాబ్ ద్వారా ఈ సేవలను పొందవచ్చు. ఈ సేవల సులభతరం చేయడానికి పేటీఎం వివిధ ఎన్‌బిఎఫ్‌సిలు, బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఒప్పందం కుదుర్చుకుంది. -
బ్యాంకింగ్ రేస్‌లో... టాటా, బిర్లా, బజాజ్!
ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ఆర్థిక రంగం ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం బలంగా ఉండాలి. అయితే ప్రస్తుతం మన దేశంలో బ్యాంకింగ్ రంగం బలహీనంగానే ఉంది. మన బ్యాంకింగ్ రంగంలో అధిక ప్రభావం ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు మొండిబకాయిల భారంతో కునారిల్లుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలోని ఉత్పాదకత రంగాల ఆర్థిక అవసరాలను తీర్చడానికి మరిన్ని ప్రైవేట్ బ్యాంక్‌లు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ దిశగా ఇటీవల ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ కొన్ని ప్రతిపాదనలు చేసింది. భారీ కార్పొరేట్ సంస్థలను బ్యాంకింగ్ రంగంలోకి అనుమతించడం, రూ.50,000 కోట్ల పైబడిన ఆస్తులున్న ఎన్బీఎఫ్సీలను బ్యాంక్‌లుగా మారే వెసులుబాటును ఇవ్వడం, ప్రమోటర్ వాటాను 15 శాతం నుంచి 26 శాతానికి పెంచుకునే ప్రతిపాదనలు వాటిల్లో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయానికి మరో మూడు నెలలు పట్టవచ్చు. ముందు వరుసలో భారీ ఎన్బీఎఫ్సీలు... బ్యాంక్ లైసెన్స్‌లు పొందడానికి టాటా, బిర్లా, బజాజ్, పిరమళ్ సంస్థలు రేసులో ఉన్నాయి. ఈ దిగ్గజ సంస్థలకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్(ఎన్బీఎఫ్సీ) సంస్థలున్నాయి. రూ.50,000 కోట్ల పైబడిన ఆస్తులున్న ఎన్బీఎఫ్సీలను బ్యాంక్‌లుగా మార్చుకునే వెసులుబాటు ఉండటం ఈ సంస్థలకు కలసివస్తోంది. టాటా గ్రూప్‌నకు చెందిన టాటా క్యాపిటల్ ఆస్తులు రూ.83,280 కోట్లుగా ఉన్నాయి. ఈ కంపెనీ అనుబంధ సంస్థ టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ ఆస్తులు రూ.46,807 కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ లైసెన్స్ పొందడానికి ఆసక్తిగా ఉన్నామని టాటా గ్రూప్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్‌లకు సంబంధించి ప్రస్తుతానికి ప్రతిపాదనలే వెలువడ్డాయని, ఈ దశలో తమ బ్యాంకింగ్ ప్రణాళికలను వివరించడం సముచితం కాదని ఆయన పేర్కొన్నారు. పూర్తి స్పష్టత వచ్చాక ఈ విషయమై పరిశీలన జరుపుతామని వివరించారు. 2012లో కూడా కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్‌లు ఇస్తామని ఆర్బీఐ ప్రకటించింది. అప్పుడు టాటా గ్రూప్ కూడా దరఖాస్తు చేసింది. అయితే నిబంధనలు మరీ కఠినంగా ఉన్నాయంటూ 2013లో తన దరఖాస్తును వెనక్కి తీసుకుంది. ఇక బిర్లా గ్రూప్‌నకు చెందిన ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఆస్తులు రూ.70,015 కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ లైసెన్స్ పొందడానికి ఈ సంస్థ కూడా రేసులో ఉంటుందని నిపుణులంటున్నారు. మరోవైపు పిరమళ్ గ్రూప్ కూడా బ్యాంక్ లైసెన్స్ రేసులో ఉంది. సంక్షోభంలో కూరుకుపోయిన డీహెచ్ఎఫ్ఎల్ రిటైల్ ఆస్తులను కొనుగోలు చేయాలనుకుంటున్న ఈ గ్రూప్ ఎన్బీఎఫ్సీ ఆస్తులు రూ.50,000 కోట్ల మేర ఉన్నాయి. ఎన్బీఎఫ్సీ రంగంలో పిరమళ్ గ్రూప్‌నకు మంచి అనుభవం ఉంది. అయితే ఈ కంపెనీకి రియల్ ఎస్టేట్ రంగానికి ఎక్స్పోజర్ బాగా ఉండటం ఆందోళన కలిగించే అంశమని కొంతమంది నిపుణులంటున్నారు. డీహెచ్ఎఫ్ఎల్ రిటైల్ ఆస్తుల్ని కొనుగోలు చేస్తే, పిరమళ్ గ్రూప్‌నకు నిలకడైన క్యాష్ ఫ్లోస్ ఉంటాయని వారంటున్నారు. బ్యాంక్ లైసెన్స్‌ల కోసం 2012లోనే బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ సంస్థలు ప్రయత్నాలు చేశాయి. కానీ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, బంధన్ బ్యాంక్‌లకు మాత్రమే అప్పుడు లైసెన్స్‌లు లభించాయి. తాజా ప్రతిపాదనల కారణంగా మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్ తదితర సంస్థలు తమ ప్రమోటర్ల వాటాను తగ్గించుకునే ప్రయత్నాలు చేయవచ్చని నిపుణులంటున్నారు. కార్పొరేట్ సంస్థలకు బ్యాంక్ లైసెన్స్...! కార్పొరేట్ సంస్థలకు బ్యాంక్ లైసెన్స్‌లు ఇచ్చే దిశగా ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ సూచనలు చేసింది. అయితే ఈ కమిటీలో ఒక్క వ్యక్తి మినహా మిగిలిన వారందరూ కార్పొరేట్లకు బ్యాంక్ లైసెన్స్‌లు ఇవ్వొద్దనే సూచించారు. అయితే బ్యాంకింగ్ చట్ట సవరణ అంశాన్ని ఈ కమిటీ ప్రభుత్వ అభీష్టానికే వదిలేసింది. కాగా ఇవి సాహసోపేత ప్రతిపాదనలని నిపుణులంటున్నారు. అయితే కార్పొరేట్ హౌజ్‌లకు బ్యాంక్ లైసెన్స్‌లు లభించడం కష్టమేనని మాక్వెరీ క్యాపిటల్ పేర్కొంది. అంతే కాకుండా యస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ల సంక్షోభం నేపథ్యంలో ఉదారంగా బ్యాంక్ లైసెన్స్‌లు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని వివరించింది. కాగా కార్పొరేట్ హౌజ్‌లకు బ్యాంక్ లైసెన్స్‌లు ఇవ్వడం ప్రమాదకరమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్సులు సరికాదు..! రేటింగ్ దిగ్గజం ఎస్ అండ్ పీ ప్రకటన బడా కార్పొరేట్ సంస్థలకు బ్యాంకింగ్ లైసెన్సులు ఇవ్వడం సరికాదన్న అభిప్రాయాన్ని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) వ్యక్తం చేసింది. భారత్ కార్పొరేట్ పాలన బలహీనంగా ఉందని, అలాగే గత కొన్ని సంవత్సరాలుగా రుణ చెల్లింపుల్లో వైఫల్యం చెందుతున్నాయని సోమవారం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రతిపాదన పలు అనుమానాలకు తావిస్తుందని తెలిపింది. కొత్తగా బ్యాంకులను నెలకొల్పడానికి బడా కార్పొరేట్ సంస్థలకు అనుమతి ఇవ్వవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంతర్గత కార్యాచరణ బృందం సమర్పించిన ఒక నివేదికను శుక్రవారం సెంట్రల్ బ్యాంక్ ప్రజాబాహుళ్యంలో ఉంచింది. దీనిపై ఒక నిర్ణయానికి ముందు సంబంధిత వర్గాలు, నిపుణుల సలహాలను తీసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. నివేదికపై 2021 జనవరి 15వ తేదీలోపు అభిప్రాయాలను తెలపాలని కోరింది. ఎస్అండ్పీ ప్రకటనలో ముఖ్యాంశాలు ... ► కార్పొరేట్లే బ్యాంకింగ్ నిర్వహించే అంశంలో పలు క్లిష్టతలు ఉంటాయి. అంతర్గత గ్రూప్‌లకు రుణం, నిధుల మళ్లింపు, పరస్పర ప్రయోజనాల కోణంలో ప్రశ్నలు, ఆర్థిక స్థిరత్వం వంటి ఎన్నో అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. రుణ బకాయిల చెల్లింపుల్లో కార్పొరేట్ల వైఫల్యాల వల్ల ఫైనాన్షియల్ వ్యవస్థలో నెలకొనే ప్రతికూలతలు మరింత తీవ్రమయ్యే అవకాశాలూ ఉంటాయి. ► 2020 మార్చి నాటికి మొత్తం కార్పొరేట్ రుణాల్లో దాదాపు 13% మొండిబకాయిలు(ఎన్పీఏ)గా మారడం ఇప్పుడు చర్చనీయాంశం. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో ఎన్పీఏల సమస్య తీవ్రంగా ఉంది. ► అయితే రూ.50,000 కోట్లు, ఆపైన భారీ రుణ పరిమాణం కలిగి, 10 సంవత్సరాలకు పైగా చక్కటి వ్యాపార నిర్వహణ కలిగిన పెద్ద బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీ) బ్యాంకులగా మార్చే ప్రతిపాదన మంచిదే. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. అది పిడుగుపాటే..! కార్పొరేట్ బ్యాంకింగ్‌పై రఘురామ్ రాజన్, విరాల్ ఆచార్య ఆర్బీఐ మాజీ గరవ్నర్ రఘురామ్ రాజన్, మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్యలు కూడా ఈ అంశంపై తీవ్ర ప్రతికూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిని అమలుచేస్తే, అది బ్యాంకింగ్‌పై పిడుగుపాటు అవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఇరువురు సంయుక్తంగా రాసిన ఒక ఆర్టికల్ సోమవారం రాజన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో పోస్ట్ అయ్యింది. బ్యాంకింగ్ రంగంలో కార్పొరేట్ సంస్థల జోక్యం ఎంతమాత్రం సమంజసం కాదని ఆర్టికల్ పేర్కొంది. ఇలాంటి క్లిష్ట రుణదాత–గ్రహీత అనుసంధాన వ్యవస్థ సజావుగా మనుగడ సాగించిన చరిత్ర ఏదీ లేదనీ పేర్కొంది. రుణ గ్రహీతే యజమానిగా ఉన్న ఒక బ్యాంక్ మంచి వ్యాపారం ఎలా చేయగలుగుతుందని ఆర్టికల్ రచయితలు ప్రశ్నించారు. ఫైనాన్షియల్ వ్యవస్థలో ఎక్కడో ఒకచోట జరిగే ‘పేలవ రుణ తీరు’ను ప్రతిసారీ కట్టడి చేయడం సాధ్యంకాదని ఇప్పటికే పలు సందర్భాల్లో రుజువయ్యిందని ఆర్టికల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్ ప్రతిపాదన మంచిదికాదని స్పష్టం చేసింది. ప్రతిపాదనను క్షుణ్ణంగా పరిశీలిస్తే, ‘‘అసలు ఇప్పుడు ఈ అవసరం ఏమి వచ్చింది...’’ అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోందని ఆర్టికల్ పేర్కొంది. ఆర్బీఐ అధికారాల పెంపు అవశ్యం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారాలను మరింత పెంచాలన్న సూచించిన ఆర్టికల్, ఈ పరిస్థితి ఉన్నట్లయితే, మొండిబకాయిల సమస్య ఇంతలా పెరిగేది కాదనీ స్పష్టం చేసింది. ఆర్బీఐకి మరిన్ని అధికారాలు, మొండిబకాయల తగ్గింపునకు ఆర్బీఐ వర్కింగ్ కమిటీ చేసిన పలు ప్రతిపాదనలను తొలుత అమలు చేయాలని, ‘కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్’ను ప్రస్తుతం పక్కనపడేయాలనీ తమ ఆర్టికల్‌లో ఆర్థిక నిపుణులు సూచించారు. ప్రపంచంలో పలు దేశాల తరహాలోనే భారత్‌లో కూడా బ్యాంకింగ్ వైఫల్యం వల్ల ఖాతాదారులు నష్టపోయే పరిస్థితి ఉండదని వారు అన్నారు. ఇందుకు యస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంకులను ప్రస్తావించారు. అందువల్ల బ్యాంకుల్లో తమ డబ్బుకు భద్రత ఉంటుందని డిపాజిటర్లు భావిస్తారని పేర్కొన్నారు. అందువల్లే బ్యాంకులు పెద్ద ఎత్తున డిపాజిట్లను సమీకరించగలుగుతున్నాయని కూడా విశ్లేషించారు. ప్రస్తుతం రాజన్, ఆచార్యలు ఇరువురూ అమెరికాలో ఉన్నారు. యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ విభాగానికి సంబంధించి ప్రొఫెసర్‌గా రాజన్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, స్టెర్న్ స్కూల్ ప్రొఫెసర్‌గా ఆచార్య పనిచేస్తున్నారు. -
ప్రాధాన్యతా రంగాలకు మరిన్ని రుణాలు
ముంబై: ప్రాధాన్యతా రంగాలకు మరిన్ని రుణాలు అందించే దిశలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం ఒక కీలక విధానాన్ని ప్రకటించింది. బ్యాంకులు–బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ) కలిసి ఆయా రంగాలకు రుణ లభ్యత కల్పించడానికి వీలుగా ‘కో–లెండింగ్ నమూనా (సీఎల్‌ఎం) పథకాన్ని ఆవిష్కరించింది. విధివిధానాలు ఇలా... సహ–రుణాలను అందించడానికి ఆయా బ్యాంకులు–ఎన్బీఎఫ్సీ మధ్య ఒక ముందస్తు అవగాహన ఉండాలి. రుణాలకు సంబంధించి లాభ–నష్టాలను వాటి వాటి వాటాల ఆధారంగా బ్యాంకులు–ఎన్బీఎఫ్సీ పంచుకుంటాయి. కో–లెండింగ్ విషయంలో ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం, రుణ గ్రహీతతో ఎన్బీఎఫ్సీ ఒక స్పష్టమైన అవగాహన కుదుర్చుకోవాలి. ఒప్పంద స్వభావం స్పష్టంగా ఉండాలి. రుణ ఒప్పందంలో బ్యాంకులు–ఎన్‌బీఎఫ్‌సీల పాత్ర, బాధ్యతలు సవివరంగా ఉండేలా చూడాలి. అటు బ్యాంకులకు ఇటు ఎన్బీఎఫ్సీలు రెండింటికీ వర్తించే నిర్దిష్ట మార్గదర్శకాలకు అనుగుణంగా, పరస్పర అవగాహనా పూర్వక వడ్డీరేటును రుణగ్రహీత నుంచి వసూలు చేయాలి. బ్యాంకులతో కలిసి నిర్వహించే ఒక ఎస్క్రో ఖాతా ద్వారా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య అన్ని లావాదేవీలు (పంపిణీలు, పునఃచెల్లింపులు) జరగాలి. ఫిర్యాదుల పరిష్కారానికి వస్తే, రుణగ్రహీత ఎన్బీఎఫ్సీలో నమోదు చేసిన ఏదైనా ఫిర్యాదును 30 రోజుల్లోగా పరిష్కరించాలి. ఇందుకు సహ–రుణదాతలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఒక వేళ ఈ స్థాయిలో ఫిర్యాదు పరిష్కారం జరక్కపోతే, సమస్యను రుణ గ్రహీత సంబంధిత బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్ లేదా ఎన్బీఎఫ్సీకి సంబంధించి అంబుడ్స్‌మెన్ లేదా ఆర్బీఐలోని కస్టమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ సెల్ దృష్టికి తీసుకెళ్లవచ్చు. ప్రాధాన్యతా రంగాలంటే..: సమాజంలో బలహీన వర్గాలు, వ్యవసాయం, లఘు మధ్య చిన్న తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు, సామాజిక మౌలిక వసతులు వంటి వాటిని ప్రాధాన్యతా రంగాలుగా పరిగణిస్తారు. దేశాభివృద్ధి లో ఆయా వర్గాలు, విభాగాలకు కీలక పాత్ర ఉంటుంది. ఈ రంగాలకు తగిన రుణ సౌలభ్యత సకాలంలో కలగాలి. ఈ దిశలో బ్యాంకులు తమ వార్షిక రుణాల్లో 40 శాతాన్ని తప్పనిసరిగా ప్రాధాన్యతా రంగాలకు మంజూరు చేయాల్సి ఉం టుంది. సాధ్యమైనంత తక్కువ వడ్డీరేటుకు అందించాలి. -
గోల్డ్ లోన్ కంపెనీలు జిగేల్!
సాక్షి,ముంబై: బంగారంపై రుణాలిస్తున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణలో ఉన్న ఆస్తులు 15-18 శాతం వృద్ధి సాధిస్తాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక వెల్లడించింది. వ్యక్తులు, చిరు వర్తకుల నుంచి గోల్డ్ లోన్ల డిమాండ్ ఇందుకు కారణమని తెలిపింది. నివేదిక ప్రకారం.. లాక్డౌన్ కారణంగా తక్కువ పంపిణీతో ఏప్రిల్-జూన్ కాలంలో బంగారంపై రుణాల వృద్ధి స్థిరంగా ఉంది. లాక్డౌన్ సడలింపుతో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకున్నాయి. దీంతో బంగారంపై రుణాలు అధికమవుతున్నాయి. వ్యక్తిగత అవసరాలతోపాటు వ్యాపారాలను తిరిగి ప్రారంభించేందుకు కావాల్సిన మూలధనం కోసం ఈ రుణాలను తీసుకుంటున్నారు. చిరుద్యోగులు, సూక్ష్మ, చిన్నతరహా కంపెనీలు, వ్యాపారులకు ఇచ్చే రుణాల విషయంలో ఎన్బీఎఫ్సీలు, బ్యాంకులు పూచీకత్తు నిబంధనలు కఠినం చేశాయి. దీంతో వినియోగదార్లు గోల్డ్ లోన్లను ఎంచుకుంటున్నారు. పుత్తడిపై రుణాలిచ్చే కంపెనీలకే.. ఇతర లోన్లతో పోలిస్తే వసూళ్లు, పంపిణీ, తిరిగి తనఖా విషయంలో గోల్డ్ లోన్లు పెద్దగా సమస్యలను ఎదుర్కోలేదని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ క్రిష్ణన్ సీతారామన్ వెల్లడించారు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు చాలామటుకు వసూళ్లు చేయలేకపోతున్నాయని, వీటికి రాని బాకీలు అధికమవుతాయని అన్నారు. దీంతో ఎంఎస్ఎంఈలకు కొత్త రుణాలు, తనఖా రహిత రుణాలు తక్కువగా ఉన్నాయని గుర్తుచేశారు. తద్వారా పుత్తడిపై రుణాలిచ్చే కంపెనీలు ప్రయోజనం పొందుతాయని చెప్పారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఎన్‌బీఎఫ్‌సీల వద్ద తిరిగి తనఖా పెట్టి తీసుకున్న గోల్డ్ లోన్లతోసహా బంగారంపై రుణాల పంపిణీ వరుసగా సెప్టెంబరు త్రైమాసికంలో రెండింతలకు పైగా అధికమైంది. 12 నెలల కాలానికి తీసుకున్న రుణంలో 60-65 శాతం మొత్తాన్ని కస్టమర్లు ఆరు నెలల్లోనే తిరిగి చెల్లిస్తున్నారని క్రిసిల్ తెలిపింది. చాలా లోన్లు తక్కువ నిడివి ఉండడం, ముందస్తుగా చెల్లించే వెసులుబాటు, రిబేట్ల మూలంగా ఎన్బీఎఫ్సీలు అనుకూలమైన ఎంపిక అని వివరించింది. -
మిడ్‌క్యాప్ ఎన్బీఎఫ్సీ షేర్లు ఆకర్షణీయం: మోర్గాన్ స్టాన్లీ
రాబోయే రెండేళ్ళలో మధ్యతరహా ఎన్బీఎఫ్సీ షేర్లలో రిస్క్‌తో పోలిస్తే రివార్డ్ రేషియో ఎక్కువగా ఉంటుందని మోర్గాన్ స్లాన్లీ తెలిపింది. ఎన్బీఎఫ్సీ సెక్టార్‌కు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్సియల్, శ్రీరాం ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, శ్రీరామ్ సిటి యూనియన్ ఫైనాన్స్, ఆదిత్యా బిర్లా క్యాపిటల్, పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు తమ టాప్పిక్లుగా ఉన్నట్లు బ్రోకరేజ్ పేర్కోంది. వచ్చే ఏడాదిలోగా షేర్లు 30-45శాతం రాబడులను ఇస్తాయని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తుంది. డీప్ వాల్యూ, మిస్-ప్రైస్డ్ స్టాకుల కోసం అన్వేషిస్తున్న ఇన్వెస్టర్లకు ఈ స్టాకులను సిఫార్సులు చేస్తున్నట్లు మోర్గాన్‌స్టాన్లీ తెలిపింది. రెండేళ్ల పాటు సెక్టార్ సంబంధిత సవాళ్లను ఎదుర్కోన్న ఈ షేర్ల వాల్యూయేషన్లు ఇప్పుడు జీవితకాల కనిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్నట్లు బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ప్రీ-కోవిడ్19కి ముందు 2020 గరిష్టాలతో పోలిస్తే మిడ్‌క్యాప్ షేర్లు 95-190శాతం అప్‌సైడ్ ఉండగా, లార్జ్‌క్యాప్ షేర్లు కేవలం 22-77శాతం మాత్రమే అప్‌సైడ్‌లో ఉన్నాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. కోవిడ్ -19తో వ్యవస్థలో ఏర్పడిన అంతరాయాలు, రియల్ ఎస్టేట్ రంగంలో బలహీనత కారణంగా వివిధ ఎన్బీఎఫ్సీలు నష్టాలను ఎదుర్కొంటున్నాయని బ్రోకరేజ్ తెలిపింది. అధిక మూలధనం, లిక్విడిటీ, బలమైన వ్యాపార నమూనాతో పాటు మాతృసంస్థకు మార్కెట్ మంచి స్థాయి ఉండటంతో ఈ స్టాక్స్‌లు రానున్న రోజుల్లో మంచి స్థాయిలో ఉంటాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. మూడవ త్రైమాసిక ఫలితాల అనంతరం సెప్టెంబరులో ఎన్పీఏల గుర్తింపు తర్వాత సెక్టార్ ఎంతమేర నష్టాన్ని చవిచూచూసిందో అంచనావేయవచ్చని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. -
ఫార్మా షేర్లలో వాటాను తగ్గించుకున్న ఫండ్స్
మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు షేర్ల ఎంపిక విషయంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ జూన్‌లో హెల్త్‌కేర్, ఫార్మారంగ షేర్లలో తమ వాటాను తగ్గించుకున్నారు. భారీ నష్టాలను చవిచూస్తున్న బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ షేర్లలో వాటాను పెంచుకున్నారు. నెల ప్రాతిపదికన ఫండ్ మేనేజర్ల ఫోర్ట్‌ఫోలియోలో హెల్త్‌కేర్, ఫార్మా రంగాల వెయిటేజీ 50బేసిస్ పాయింట్ల క్షీణించింది. అంతకు ముందు నెలలో ఫార్మా, ఐటీ రంగాల వెయిటేజీ 8.3శాతంగా ఉండగా, ఈ జూన్ ముగింపు నాటికి 7.8శాతానికి పరిమితమైంది. వరుస 5నెలల పెంపు తర్వాత ఫండ్‌మేనేజర్లు 2సెక్టార్లకు వెయిటేజీ తగ్గించడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి ప్రారంభం నుంచి ఫండింగ్ హౌస్‌లు ఈరెండు రంగాల్లో భారీగా వాటాలను కొనుగోలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే జూన్‌లో ఆయిల్‌అండ్‌గ్యాస్ రంగ షేర్ల కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా ఈ పోర్ట్‌ఫోలియో ఈ రంగ వెయిటేజీ 40బేసిస్ పాయింట్లు పెరిగింది. అయితే రియలన్స్ షేరు ర్యాలీ కారణంగా వెయిటేజీ పెరిగి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ షేరు 28శాతం పెరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు పోర్ట్ఫోలియతో ప్రైవేట్ బ్యాంక్స్, ఎన్బీఎఫ్సీ షేర్ల వెయిటేజీలు వరుసగా 40 బేసిస్ పాయింట్లు, 50 బేసిస్ పాయింట్లు పెరిగాయి. పోర్ట్‌ఫోలియోలో వెయిట్ పెంపు అనేది ఒక నిర్దిష్ట రంగంపై లేదా స్టాక్ ఫండ్ మేనేజర్ ఎంత ఎక్స్పోజర్ తీసుకుంటుందో సూచిస్తుంది. -
ఎస్బీఐ డిపాజిట్ రేట్లు 0.40% కోత
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అన్ని కాలపరిమితుల స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను 40 బేసిస్ పాయింట్ల (0.40 శాతం) వరకూ తగ్గించింది. డిపాజిట్లపై ఎస్బీఐ రేట్లు తగ్గించడం ఇది వరుసగా రెండవసారి. తాజా నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుందని బ్యాంక్ వెబ్సైట్ తెలిపింది. రెండు కోట్లు ఆపైబడిన బల్క్ డిపాజిట్లపై వడ్డీరేటును బ్యాంక్ ఏకంగా 50 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించడం గమనార్హం. ఈ కేటగిరీ కింద బ్యాంక్ ఆఫర్ చేస్తున్న గరిష్ట వడ్డీరేటు మూడు శాతం. ఈ నిర్ణయం కూడా తక్షణం అమలోకి వచ్చింది. సీనియర్ సిటిజన్లకు అదనం.. సీనియర్ సిటిజన్లకు పైన పేర్కొన్న వడ్డీరేటు కన్నా అరశాతం (50 బేసిస్ పాయింట్లు) అదనంగా అందుతుంది. సీనియర్ సిటిజన్ల విషయంలో 50 బేసిస్ పాయింట్ల అదనంతోపాటు, మరో 30 బేసిస్ పాయింట్ల వడ్డీరేటు ప్రీమియంగా ఇచ్చే ఒక ప్రత్యేక పథకాన్ని ‘ఎస్బీఐ వెల్ఫేర్’ పేరుతో ఇప్పటికే బ్యాంక్ ప్రకటించింది. ఐదేళ్లు, ఆపైన డిపాజిట్లకు వర్తించే ఈ పథకాన్ని తీసుకోడానికి గడువు ఈ ఏడాది సెప్టెంబర్ 30. ఎస్ఎంఎస్కు ‘ఎస్’ అంటే... వాయిదా కాగా రుణ బకాయిల ఈఎంఐ చెల్లింపులపై మారటోరియం అమలు విధానాన్ని మరింత సరళతరం చేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. దీని ప్రకారం... దాదాపు 85 లక్షల మంది అర్హత కలిగిన రుణ గ్రహీతలకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఎస్ఎంఎస్ కమ్యూనికేషన్‌కు ప్రతిగా కస్టమర్ ‘ఎస్’ అని సమాధానం ఇస్తే చాలు... నెలవారీ చెల్లింపులపై మారిటోరియం వారికి అమలవుతుంది. రేట్ల కోత ప్రయోజనం దక్కట్లేదు కస్టమర్లు, డెవలపర్లకు బదలాయించడం లేదు... బ్యాంకులపై ఆర్బీఐకి క్రెడాయ్ ఫిర్యాదు న్యూఢిల్లీ: రుణాలపై వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గినప్పటికీ బ్యాంకులు ఆ ప్రయోజనాలను కస్టమర్లు, నిధుల కొరతతో కటకటలాడుతున్న డెవలపర్లకు బదలాయించడం లేదంటూ రియల్టీ సంస్థల సమాఖ్య క్రెడాయ్ తాజాగా రిజర్వ్ బ్యాంక్‌కు ఫిర్యాదు చేసింది. రియల్ ఎస్టేట్ డెవలపర్ల నిధుల అవసరాలకు కీలకమైన నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), గృహ రుణ సంస్థలకు (హెచ్ఎఫ్సీ) కూడా రేట్ల కోత ప్రయోజనాలను బ్యాంకులు అందించేలా చూడాలంటూ కోరింది. ఆర్బీఐకి క్రెడాయ్ ఈ మేరకు లేఖ రాసింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో వ్యవస్థలో తగినంత ద్రవ్య లభ్యత ఉండేలా చూసేందుకు వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు రుణాల చెల్లింపుపై మారటోరియం వంటి చర్యలు కూడా తీసుకున్నప్పటికీ రియల్టీ రంగానికి మాత్రం ఆ ప్రయోజనాలేమీ దక్కడం లేదని క్రెడాయ్ పేర్కొంది. ‘2019 జనవరి నుంచి ఆర్బీఐ 2.50 శాతం మేర రెపో రేటును తగ్గించింది. కానీ గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటిదాకా బ్యాంకులు గరిష్టంగా 0.7–1.3 శాతం స్థాయిలో మాత్రమే బదలాయించాయి’ అని క్రెడాయ్ పేర్కొంది. అధిక వడ్డీ రేటు కట్టాల్సి వస్తోంది.. గృహ రుణాలపై వడ్డీ రేట్లను ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌కు అనుసంధానించాలని బ్యాంకులకు సూచించినా ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలకు మాత్రం ఆర్బీఐ దీన్ని వర్తింపచేయడం లేదని తెలిపింది. బ్యాంకులు సైతం తగ్గిన వడ్డీ రేట్ల ప్రయోజనాలను ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలకు ఇవ్వకపోతుండటంతో వాటి నుంచి తాము తీసుకునే రుణాలపై భారీ వడ్డీ రేటు కట్టాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. -
ఎన్‌బీఎఫ్‌సీలకు కేంద్రం ఊరట
న్యూఢిల్లీ: బ్యాంకింగ్యేతర ఫైనాన్స్ (ఎన్బీఎఫ్సీ), గృహ రుణ సంస్థలు (హెచ్ఎఫ్సీ), సూక్ష్మ రుణ సంస్థలకు ఊరటనిచ్చేలా కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మరిన్ని సంస్థలు పాక్షిక రుణ హామీ పథకం (పీసీజీఎస్) పరిధిలోకి వచ్చేలా నిబంధనలు సడలించడంతో పాటు కాల వ్యవధిని జూన్ 30 దాకా పొడిగించింది. దీని కాలపరిమితి వాస్తవానికి మార్చి 31తో తీరిపోయింది. సవరించిన పీసీజీఎస్ ప్రకారం ఏఏ కన్నా తక్కువ రేటింగ్ ఉన్న ఎన్బీఎఫ్సీ, ఎంఎఫ్ఐ, హెచ్ఎఫ్సీ బాండ్లను కొనుగోలు చేసే ప్రభుత్వ రంగ బ్యాంకులకు నష్టం వాటిల్లితే.. అందులో సుమారు 20 శాతం దాకా భర్తీ అయ్యేలా ప్రభుత్వం పూచీకత్తునిస్తుంది. మరోవైపు, కరోనా వైరస్ సంక్షోభాన్ని అధిగమించే దిశగా రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీలకు ప్రకటించిన రూ. 30,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. 2018 సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీల డిఫాల్ట్‌తో మొదలుపెట్టి ఆ తర్వాత చోటుచేసుకున్న అనేక పరిణామాలతో ఎన్బీఎఫ్సీలు నిధులు దొరక్క సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు, సూక్ష్మ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలకు తోడ్పాటు అందించేందుకు రూ. 10,000 కోట్లతో కొత్త పథకానికి కూడా క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనితో 2,00,000 యూనిట్లకు రుణ ఆధారిత సబ్సిడీని అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. 2024–25 దాకా అయిదేళ్లు ఈ స్కీము అమలవుతుంది. ఆదాయంలో ప్రభుత్వానికి వాటాలిచ్చే ప్రాతిపదికన వాణిజ్య కార్యకలాపాల కోసం బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆదాయంలో ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తారన్న అంశం ఆధారంగా కంపెనీలు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. నాలుగు శాతం వాటా కనీస స్థాయిగా ఉంటుంది. -
ఎన్‌బీఎఫ్‌సీలకు... నిధుల కటకట
ముంబై: నిధుల సమస్యలతో సతమతమవుతున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ) తాజాగా కరోనా వైరస్ పరమైన లాక్డౌన్, రుణాల చెల్లింపులపై మారటోరియం తదితర పరిణామాలతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతున్నాయి. కొన్ని సంస్థలు ఈ పరిస్థితిని తట్టుకోలేక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను వాపసు చేస్తుండగా.. సంక్షోభంలో ఉన్న మరికొన్నింటి రిజిస్ట్రేషన్‌ను రిజర్వ్ బ్యాంకే రద్దు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీల అసెట్ క్వాలిటీ క్షీణించి, నిధుల కొరత మరింత తీవ్రం కానున్నదంటూ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. ఎన్బీఎఫ్సీలు బలహీనపడటం వల్ల వాటికి రుణాలిచ్చిన బ్యాంకులకు కూడా గణనీయంగా రిస్కులు పొంచి ఉన్నాయని హెచ్చరించింది. 2018లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ డిఫాల్ట్ అయినప్పట్నుంచీ ఇన్వెస్టర్లు రిస్కీ సాధనాలకు దూరంగా ఉంటుండటంతో ఎన్బీఎఫ్సీ రంగానికి నిధుల లభ్యత తగ్గిపోయిన సంగతి తెలిసిందే. ’గడిచిన కొన్నాళ్లుగా ఆర్థిక మందగమనం నెమ్మదిగా కమ్ముకొస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఆర్థిక పరిస్థితులు మరింతగా దెబ్బతింటాయి. ఫలితంగా ఎన్‌బీఎఫ్‌సీల అసెట్ నాణ్యత కూడా ఇంకా దిగజారుతుంది’ అని మూడీస్ పేర్కొంది. బ్యాంకులతో పోలిస్తే ఎన్బీఎఫ్సీలు అత్యధిక రిస్కులు ఉన్న వర్గాలకు రుణాలిస్తాయి కాబట్టి సగటున వాటి అసెట్ క్వాలిటీ క్షీణత మరింత తీవ్రంగా ఉంటుందని తెలిపింది. మారటోరియం దెబ్బ...: ఇక రుణాల చెల్లింపునకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) 3 నెలల పాటు మారటోరియం ప్రకటించడం కూడా ఎన్‌బీఎఫ్‌సీలకు స్వల్పకాలిక నిధుల లభ్యతపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుందని మూడీస్ తెలిపింది. చాలా మటుకు ఎన్బీఎఫ్సీలు తమకు వసూలయ్యే బాకీల నుంచే తాము కట్టాల్సిన రుణాలను చెల్లిస్తుంటాయి. వాటి దగ్గర భారీ స్థాయిలో నిధులు ఉండవు. ప్రస్తుతం మారటోరియం కారణంగా తమకు బాకీలు వసూలు కాకపోవడం వల్ల ఎన్బీఎఫ్సీలు తాము బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కూడా సకాలంలో తిరిగి చెల్లించలేని పరిస్థితి తలెత్తుతుందని మూడీస్ తెలిపింది. మారటోరియం వల్ల రాబోయే మరికొన్ని నెలల పాటు ఎన్‌బీఎఫ్‌సీలకు రావాల్సిన నిధుల ప్రవాహం గణనీయంగా తగ్గిపోతుందని పేర్కొంది. రుణ చెల్లింపులపై మారటోరియం ఎత్తివేసినా, ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలు ఎంత ఎక్కువ కాలం కొనసాగితే .. రుణాల రీపేమెంట్ తిరిగి సాధారణ స్థాయికి రావడానికి అంత ఎక్కువ సమయం పట్టేసే అవకాశం ఉందని తెలిపింది. మారటోరియం వ్యవధిలో రుణాల రీపేమెంట్లు కనీసం 50 శాతం పడిపోవచ్చని అంచనా వేసింది. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వాపసు చేసిన 9 ఎన్బీఎఫ్సీలు.. తాజా పరిస్థితుల నేపథ్యంలో తొమ్మిది ఎన్బీఎఫ్సీలు తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను వాపసు చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. రిలయన్స్ నెట్, నిశ్చయ ఫిన్వెస్ట్, పెన్రోజ్ మెర్కంటైల్స్, మనోహర్ ఫైనాన్స్ ఇండియా, షాండిలియర్ ట్రాకోన్, సంఘి హైర్ పర్చేజ్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను ఆర్బీఐకి తిరిగి ఇచ్చేయడం వల్ల ఈ కంపెనీలు బ్యాంకింగ్యేతర ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడానికి ఉండదు. 14 ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు ఆర్బీఐ మరో ప్రకటనలో తెలిపింది. ప్రైమస్ క్యాపిటల్ (గతంలో ర్యాపిడ్ గ్రోత్ క్యాపిటల్), భారత్ ఫైనాన్స్ అండ్ ఇండస్ట్రీస్, సిగ్నేచర్ ఫైనాన్స్, డీ బీ లీజింగ్ అండ్ హైర్ పర్చేజ్, జిందాల్ ఫిన్‌లీజ్, బీఎల్ఎస్ ఇన్వెస్ట్మెంట్స్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. నిధుల సమీకరణ కష్టమే.. గడిచిన కొన్నాళ్లుగా తమకు రావాల్సిన బాకీలను తనఖా పెట్టి ఎన్బీఎఫ్సీలు కాస్త అదనంగా నిధులను సమీకరించుకోగలుగుతున్నాయి. అయితే, మారటోరియం కారణంగా వసూళ్లు పడిపోవడం వల్ల ఈ మార్గంలో నిధుల సమీకరణ కూడా కష్టంగా మారగలదని మూడీస్ పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీల రుణపత్రాల కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం ఇటీవల ప్రకటించిన చర్యలు సమీప భవిష్యత్‌తో వాటికి ఊరట కలిగించేవే అయినప్పటికీ.. వ్యవస్థాగతమైన నిధుల కొరత కష్టాలు తీర్చేందుకు సరిపోవని అభిప్రాయపడింది. -
చిన్న సంస్థలకు.. పెద్ద ఊరట!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దెబ్బతో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంపై కేంద్రం దృష్టి సారించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన కేటాయింపులను రంగాలవారీగా వెల్లడించే ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో భాగంగా చిన్న సంస్థలు, ఎన్బీఎఫ్సీలు, రియల్టీ మొదలైన రంగాలకిస్తున్న ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం వెల్లడించారు. చిన్న సంస్థలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలు, నిల్చిపోయిన రియల్టీ ప్రాజెక్టుల డెడ్‌లైన్ పొడిగింపు, ఎన్‌బీఎఫ్‌సీల కోసం ప్రత్యేక లిక్విడిటీ పథకం, సంక్షోభంలో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ. 90,000 కోట్ల మేర నిధులు సమకూర్చడం మొదలైన వరాలు వీటిలో ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి దిశగా .. మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి ఆర్థిక కార్యకలాపాలన్నీ స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని మినహాయింపులనిస్తూ రెండు విడతల్లో లాక్‌డౌన్‌ను మే 17 దాకా కేంద్రం పొడిగించింది. లాక్డౌన్ దెబ్బతో ఏప్రిల్‌లో 12.2 కోట్ల మంది ఉద్యోగాలకు కోత పడి ఉంటుందని, వినియోగ డిమాండ్ పూర్తిగా పడిపోయిందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దేశ ఎకానమీకి ఊతమిచ్చేలా రూ. 20 లక్షల కోట్లతో (స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 10 శాతం) ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఎంఎస్ఎంఈలకు వరాలు చిన్న, మధ్య తరహా సంస్థలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 3 లక్షల కోట్ల మేర రుణాలు అందించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనితో 45 లక్షలకు పైగా చిన్న సంస్థలకు ప్రయోజనం కలుగుతుందని ఆమె వివరించారు. రుణాల చెల్లింపునకు 4 ఏళ్ల కాలవ్యవధి, 12 నెలల మారటోరియం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ రుణాలకు ప్రభుత్వ పూచీకత్తు ఉంటుంది. ఇక, ఎంఎస్ఎంఈల కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్ కూడా కేంద్రం ఏర్పాటు చేస్తోంది. వృద్ధి సామర్థ్యం ఉన్న చిన్న సంస్థలకు ఇది దాదాపు రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులు సమకూర్చనుంది. తీవ్ర రుణ ఒత్తిళ్లలో ఉన్నవి, డిఫాల్ట్ అవుతున్న సంస్థలకు రూ. 20,000 కోట్ల మేర రుణ సదుపాయంతో .. రెండు లక్షల పైచిలుకు వ్యాపారాలకు తోడ్పాటు లభించనుంది. చిన్న సంస్థలకు చెల్లించాల్సిన దాదాపు రూ. 1 లక్ష కోట్ల బకాయీలను ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు 45 రోజుల్లో విడుదల చేస్తాయి. స్థూల దేశీయోత్పత్తిలో చిన్న, మధ్య స్థాయి కంపెనీల వాటా మూడో వంతు ఉంటుంది. ఈ రంగంలో 11 కోట్ల మంది పైగా ఉపాధి పొందుతున్నారు. భారీ పెట్టుబడులున్న వాటిని కూడా ఎంఎస్ఎంఈల కింద వర్గీకరించేందుకు వీలుగా ఎంఎస్ఎంఈల నిర్వచనాన్ని కూడా కేంద్రం సవరించింది. టర్నోవరును ప్రాతిపదికగా తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా మరిన్ని సంస్థలు ఎంఎస్ఎంఈల పరిధిలోకి వచ్చి, ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా ప్రయోజనాలను కూడా పొందేందుకు వీలు లభించనుంది. దేశీయంగా చిన్న సంస్థలకు ఊతమిచ్చేలా రూ. 200 కోట్ల దాకా విలువ చేసే ప్రభుత్వ కొనుగోళ్లకు సంబంధించి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించే విధానాన్ని ప్రభుత్వం తొలగించింది. మరోవైపు, డిజిటల్ పేమెంట్స్ వంటి సంస్కరణలను అమలు చేసే డిస్కమ్‌లకు తోడ్పాటు లభించనుంది. వాటికి రావాల్సిన బకాయీల ప్రాతిపదికన ప్రభుత్వ రంగ పీఎఫ్సీ, ఆర్ఈసీ రూ. 90,000 కోట్ల మేర నిధులు సమకూర్చనున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు తీరనున్న నిధుల కష్టాలు.. తీవ్రంగా నిధుల కొరత కష్టాలు ఎదుర్కొంటున్న బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ), గృహ రుణాల సంస్థలు (హెచ్ఎఫ్సీ), సూక్ష్మ రుణాల సంస్థల(ఎంఎఫ్ఐ)కు బాసటనిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటి కోసం రూ. 30,000 కోట్లతో ప్రత్యేక లిక్విడిటీ పథకాన్ని ప్రకటించింది. ఈ సంస్థలకు రుణాల తోడ్పాటుతో పాటు మార్కెట్లో విశ్వాసం పునరుద్ధరించడానికి కూడా ఇది తోడ్పడుతుందని మంత్రి తెలిపారు. అలాగే, తక్కువ స్థాయి క్రెడిట్ రేటింగ్ ఉన్న ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు, ఎంఎఫ్ఐలు కూడా వ్యక్తులు, ఎంఎస్ఎంఈలకు మరింతగా రుణాలు ఇవ్వగలిగేలా రూ. 45,000 కోట్లతో పాక్షిక రుణ హామీ పథకం 2.0ని కేంద్రం ప్రకటించింది. పీఎఫ్ భారం తగ్గింది.. 100 మంది కన్నా తక్కువ ఉద్యోగులున్న కంపెనీలకు ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపులపరంగా ఊరటనిచ్చారు. పీఎఫ్ చందాలకు సంబంధించి కంపెనీలకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరో మూడు నెలల పాటు ఆగస్టు దాకా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. దీనితో 3.67 లక్షల సంస్థలు, 72.22 లక్షల మంది ఉద్యోగులకు రూ. 2,500 కోట్ల మేర నిధుల లభ్యతపరమైన ప్రయోజనాలు లభించనున్నాయి. ఇక, బేసిక్ వేతనంలో తప్పనిసరిగా ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)కు జమ చేయాల్సిన మొత్తాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలు, ఉద్యోగుల చేతిలో కాస్త నిధులు ఆడేందుకు ఇది ఉపయోగపడనుంది. ‘ఇది సుమారు 6.5 లక్షల సంస్థలు, 4.3 కోట్ల పైచిలుకు ఉద్యోగులకు తోడ్పడనుంది. మూడు నెలల వ్యవధిలో రూ. 6,750 కోట్ల మేర లిక్విడిటీపరమైన లబ్ధి చేకూరుతుంది‘ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం యథాప్రకారంగా 12% చందా జమ చేయడం కొనసాగిస్తాయని తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగానికి ఊపిరి.. కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ కారణంగా నిర్మాణాలు నిల్చిపోయి తీవ్రంగా ఇబ్బందిపడుతున్న నిర్మాణ రంగానికి తోడ్పాటు లభించింది. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు డెడ్‌లైన్‌ను ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఊరట కల్పించారు. రైల్వే సహా రహదారి రవాణా శాఖ, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మొదలైనవన్నీ కూడా నిర్మాణ పనులు, వస్తు.. సేవల కాంట్రాక్టులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లకు ఈ వెసులుబాటు కల్పించాల్సి ఉంటుంది. మరోవైపు, ఇందుకు సంబంధించి బిల్డర్లు .. రియల్టీ చట్టం రెరాలో ఫోర్స్ మెజూర్ నిబంధనను ఉపయోగించుకునేందుకు వీలు కల్పించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రియల్టీ నియంత్రణ సంస్థలకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ తగు సూచనలు జారీ చేస్తుంది. దీని ప్రకారం.. మార్చి 25తో లేదా ఆ తర్వాత (లాక్డౌన్ అమల్లోకి వచ్చిన రోజు) గడువు ముగిసిపోయే ప్రాజెక్టులన్నింటికీ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనక్కర్లేకుండా.. రిజిస్ట్రేషన్, కంప్లీషన్ తేదీలను సుమోటో ప్రాతిపదికన 6 నెలల పాటు నియంత్రణ సంస్థలు పొడిగించవచ్చు. అవసరమైతే మరో 3 నెలల గడువు కూడా ఇవ్వొచ్చు. పన్ను చెల్లింపుదారులపై పెద్ద మనసు వేతనయేతర చెల్లింపులకు సంబంధించిన టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్), టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) రేటును 2021 మార్చి 31 దాకా 25 శాతం మేర తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. దీంతో వ్యవస్థలో రూ. 50,000 కోట్ల నిధుల లభ్యత పెరుగుతుందన్నారు. కాంట్రాక్టులకు చెల్లింపులు, ప్రొఫెషనల్ ఫీజులు, వడ్డీ, అద్దె, డివిడెండ్, కమీషను, బ్రోకరేజీ మొదలైన చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. పన్ను రిటర్నుల దాఖలుకు గడువు పొడిగింపు ఆదాయ పన్ను రిటర్నులు, ఇతర అసెస్‌మెంట్స్‌ను దాఖలు చేసేందుకు తేదీలను కూడా పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. దీని ప్రకారం.. వివిధ వర్గాలకు సంబంధించి 2019–20 ఆర్థిక సంవత్సర ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గడువును జూలై 31 నుంచి అక్టోబర్ 31, నవంబర్ 30 దాకాను, ట్యాక్స్ ఆడిట్ తుది గడువును సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 31 దాకా పొడిగించారు. ‘వివాద్ సే విశ్వాస్‘ స్కీమును డిసెంబర్ దాకా పొడిగించారు. వివద్ సే విశ్వాస్ పేరుతో కేంద్ర సర్కారు గతంలో ప్రకటించిన పథకం గడువును మరో 6 నెలలు అంటే 2020 డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ తాజా నిర్ణయం వెలువడింది. రిఫండ్స్ సత్వరమే దాతృత్వ సంస్థలు, ఎల్ఎల్పీలు, నాన్ కార్పొరేట్ వ్యాపార సంస్థలు, ప్రొప్రయిటర్షిప్ సంస్థలకు అపరిష్కృతంగా ఉన్న రిఫండ్స్‌ను ఆదాయపన్ను శాఖ వెంటనే పరిష్కరించనున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. రూ.5 లక్షల్లోపు ఉన్న వాటికి సంబంధించి ఇప్పటికే రూ.18,000 కోట్ల రిఫండ్స్‌ను పూర్తి చేసినట్టు చెప్పారు. ఎంఎస్ఎంఈలకు మేలు... ఆర్థిక మంత్రి సీతారామన్ నేడు ప్రకటించిన నిర్ణయాలు.. వ్యాపార సంస్థలు ముఖ్యంగా ఎంస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలకు దీర్ఘకాలం పాటు పరిష్కారాలు చూపుతాయి. లిక్విడిటీని వ్యాపారవేత్తల సాధికారతను పెంచుతాయి. వారి పోటీతత్వాన్ని బలోపేతం చేస్తాయి. – ప్రధాని నరేంద్రమోదీ వృద్ధికి ఊతమిస్తుంది... స్వయం సమృద్ధమైన భారత్‌ను నిర్మించేందుకు, వృద్ధికి ఊతమిచ్చేందుకు ఇవి తోడ్పడతాయి. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడంతో పాటు స్థానిక బ్రాండ్స్‌ను నిర్మించేందుకు తోడ్పాటునిస్తాయి – నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి డెవలపర్లకు బూస్ట్... రెరా కింద ప్రాజెక్టు పూర్తి చేసే గడువును పొడిగించడం, కరోనాను ఊహించని విపత్తుగా ప్రకటించడం అన్నవి రియల్ ఎస్టేట్ డెవలపర్లకు కీలకమైన నిర్ణయాలు. – జక్సయ్ షా, క్రెడాయ్ చైర్మన్ చిన్న సంస్థలకు తక్షణ శక్తి... ప్రభుత్వం ప్రకటించిన చర్యలు ఎంఎస్ఎంఈలకు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలకు, సమస్యల్లో ఉన్న రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు వెంటనే పెద్ద ఊరటనిస్తాయి. – దీపక్‌సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ కరోనాను ఎదుర్కొనే వ్యూహం... నేటి సమగ్రమైన నిర్ణయాలు దేశీయ పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికి వీలు కల్పిస్తాయి. ఆర్థిక మంత్రి ప్రకటించిన చర్యల తీరు చూస్తుంటే మన ప్రభుత్వం భారత్‌ను కరోనా బారి నుంచి బయటపడవేసేందుకు, మరింత బలంగా తీర్చిదిద్దేందుకు ముందుండి నడిపిస్తుందన్న నమ్మకం కలుగుతోంది. – సంగీతారెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ దీర్ఘకాల ప్రభావం ఉంటుంది... చాలా ముఖ్యమైన నిర్ణయం, దీర్ఘకాలం పాటు ప్రభావం చూపించేది.. ఎంఎస్ఎంఈ నిర్వచనాన్ని మార్చడం. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్ 2006 నుంచి ఇది మారలేదు. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరెక్టర్ జనరల్ -
తగ్గిపెరిగిన ఎస్బీఐ ‘రేటు’
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4.4 శాతం) ఆధారిత గృహ రుణ రేటును 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. కోవిడ్–19 నేపథ్యంలో రుణ గ్రహీతల నుంచీ, రియల్టీ సంస్థల నుంచీ క్రెడిట్ రిస్క్ (రుణ బకాయిల చెల్లింపుల సామర్థ్యంలో ఇబ్బంది) పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల నుంచి వస్తున్న విశ్లేషణలు ఎస్బీఐ తాజా నిర్ణయానికి నేపథ్యమని సంబంధిత ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. ఆస్తిని తనఖా పెట్టుకుని ఇచ్చే వ్యక్తిగత రుణాలపై సైతం వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్లమేర ఎస్బీఐ పెంచింది. మే 1వ తేదీ నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంక్ తెలిపింది. ఎస్బీఐ తాజా నిర్ణయం బాటలో మిగిలిన బ్యాంకులూ నడిచే అవకాశం ఉంది. గృహ రుణాల్లో భారీ మొత్తం అటు రెపో రేటుకో లేక ఎంసీఎల్ఆర్కో అనుసంధానమై ఉంటాయి. మరోపక్క, బెంచ్‌మార్క్ రుణ రేటు–ఎంసీఎల్ఆర్ను స్వల్పంగా 0.15% (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. ప్రస్తుతం 7.40% ఉంటే దీనిని 7.25%కి తగ్గించింది. మే 10వ తేదీ నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుంది. దీనిప్రకారం– ఒక వ్యక్తి 30 ఏళ్లలో తీర్చే విధంగా రూ.25 లక్షల గృహ రుణం తీసుకుంటే (ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన వడ్డీ రేటుకు) అతనికి నెలవారీ వాయిదా చెల్లింపులపై దాదాపు రూ.255 భారం తగ్గుతుంది. వృద్ధులకు ఊరట: రిటైల్ టర్మ్ డిపాజిట్ విభాగంలో సీనియర్ సిటిజన్లకోసం ‘ఎస్బీఐ వియ్‌కేర్ డిపాజిట్’ పథకం ఒకటి ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో వడ్డీరేట్లు భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో వృద్ధులకు ఊరటనిచ్చే నిర్ణయం ఇది. ఐదేళ్లు, ఆపైన కాలపరిమితికి సీనియర్ సిటిజన్లు చేసే డిపాజిట్లకు మామూలుగా వచ్చే వడ్డీకన్నా 30 బేసిస్ పాయింట్ల అదనపు ప్రీమియం వడ్డీ చెల్లించడమే ఈ కొత్త ప్రొడక్ట్ ప్రత్యేకత. అయితే ఈ స్కీమ్ సెప్టెంబర్ 30వరకూ మాత్రమే అమల్లో ఉంటుంది. ఇప్పటికే మామూలుగా వచ్చే డిపాజిట్లరేటుకన్నా సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల వడ్డీరేటు అదనంగా అందుతుంది. తాజా నిర్ణయం ప్రకారం... ఐదుళ్లు, ఆపైన కాలపరిమితికి డిపాజిట్ చేస్తే 80 బేసిస్ పాయింట్ల వడ్డీరేటు (50 బేసిస్ పాయింట్లకు 30 బేసిస్ పాయింట్లు ప్రీమియం) అందుతుంది. మూడేళ్లలోపు రేటు తగ్గింపు: మరోపక్క, మూడేళ్ల కాలపరిమితిలోపు రిటైల్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. మే 12వ తేదీ నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఎన్బీఎఫ్సీలకూ ‘రుణ మారటోరియం’ వర్తింపు కోల్‌కతా: కరోనా కష్టాల నేపథ్యంలో రుణ బకాయిల చెల్లింపులపై మే 31వ తేదీ వరకూ మూడు నెలల పాటు విధించిన ‘మరటోరియం’ను ఎన్బీఎఫ్సీ (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు)లకూ వర్తింపజేయాలని ఎస్బీఐ గురువారం నిర్ణయించింది. కరోనా కష్టాల్లో ఉన్న రుణ గ్రహీతలకు ఊరటనిచ్చేలా ‘బకాయిల చెల్లింపులపై’ 3 నెలలు(మార్చి–ఏప్రిల్–మే) మారటోరియం విధించడానికి ఆర్బీఐ బ్యాంకింగ్‌కు అనుమతి నిచ్చింది. అయితే ఈ మారటోరియంను ఎన్బీ ఎఫ్‌సీలకు వర్తింపజేసేలా ఆర్బీఐ అనుమతి నివ్వడంతో ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. ఇదే బాటలో మరికొన్ని బ్యాంకులూ నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ నిర్ణయం వల్ల ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) విషయంలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలకు ఊరట కలుగుతుంది. దీనితోపాటు 3 నెలల మారటోరియం ప్రయోజనాన్ని ఎన్‌బీఎఫ్‌సీలూ తమ కస్టమర్లకు అందించగలుగుతాయి. మేతో ముగియనున్న మూడు నెలల మారటోరియం మరో మూడు నెలలు పొడిగించవచ్చంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. -
కరోనా కష్టాల్లో రుణగ్రహీతలు
ముంబై: కరోనా వైరస్ పరిణామాలతో రుణగ్రహీతలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రుణాలను 2021 దాకా వన్–టైమ్ ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరించేందుకు అనుమతించాలంటూ రిజర్వ్ బ్యాంక్‌ను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ) కోరాయి. అలాగే రుణ వాయిదాలపై మారటోరియం వెసులుబాటు తమకూ ఇవ్వాలని, ప్రొవిజనింగ్ నిబంధనల సడలింపునివ్వాలని విజ్ఞప్తి చేశాయి. ఆర్బీఐతో జరిగిన సమావేశంలో పరిశ్రమ వర్గాలు ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలియజేసినట్లు ఎన్‌బీఎఫ్‌సీల సమాఖ్య ఆర్థిక రంగ అభివృద్ధి మండలి (ఎఫ్ఐడీసీ) వెల్లడించింది. లాక్‌డౌన్‌తో తమ కస్టమర్ల ఆదాయాలు గణనీయంగా దెబ్బతిన్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం మిగతా కాలం కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని ఎన్బీఎఫ్సీలు ఆర్బీఐకి తెలిపాయి. ప్రధానంగా రవాణా ఆపరేటర్లు, కాంట్రాక్టర్లు, లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) మొదలైన వాటిపై ఎక్కువగా ప్రతికూల ప్రభావం ఉందని ఎన్బీఎఫ్సీలు వివరించాయి. ‘ఈ నేపథ్యంలో మొండిపద్దుల కింద వర్గీకరించే పరిస్థితి రాకుండా.. 2021 మార్చి దాకా రుణాల రీపేమెంట్ షెడ్యూల్స్‌ను సవరించేందుకు లేదా వాయిదాలను పొడిగించేందుకు లేదా ఈఎంఐలను పునర్వ్యవస్థీకరించేందుకు వన్ టైమ్ రీస్ట్రక్చరింగ్‌కు అనుమతివ్వాలి‘ అని కోరినట్లు ఎఫ్ఐడీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఎంఎస్ఎంఈలకు ఇచ్చిన రుణాలను 2020 డిసెంబర్ దాకా వన్–టైమ్ పునర్వ్యవస్థీకరణ చేసేందుకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్బీఐ అనుమతించింది. దీన్ని మిగతా రుణ గ్రహీతలందరికీ కూడా వర్తింపచేయాలని ఎన్బీఎఫ్సీలు కోరుతున్నాయి. ఇక మూడు నెలల పాటు ఈఎంఐలను వాయిదా వేసుకునేందుకు ఆర్బీఐ ప్రకటించిన మారటోరియంతో రుణగ్రహీతలకు కాస్త ఉపశమనం లభించిందని ఎఫ్ఐడీసీ తెలిపింది. అయితే, పరిస్థితులు ఇంకా చక్కబడనందున నాలుగో నెలలోనూ వారు వాయిదాలు చెల్లించగలిగే అవకాశాలు ఉండకపోవచ్చని పేర్కొంది. నిధుల లభ్యత పెంచాలి .. తమ రుణ వితరణ కార్యకలాపాలు యథాప్రకారం సాగేలా తోడ్పడేందుకు రీఫైనాన్స్ మార్గం ద్వారా చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బి).. నాబార్డ్ నుంచి మరిన్ని నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని ఎన్బీఎఫ్సీలు కోరాయి. టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ (టీఎల్టీఆర్వో 2.0)కి సగం స్థాయిలోనే బిడ్లు రావడమనేది .. బ్యాంకులు రిస్కు తీసుకోవడానికి ఇష్టపడకపోవడాన్ని సూచిస్తోందని ఎఫ్ఐడీసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో మిగతా మొత్తాన్ని సిడ్బి, నాబార్డ్లకు కేటాయించి తద్వారా తమకు నిధుల లభ్యత మెరుగుపడేలా చూడాలని కోరింది. ఇక, గడువు తీరి 1 రోజు దాటిన రుణ పద్దులన్నింటికీ 10 శాతం దాకా ప్రొవిజనింగ్ చేయాలన్న ఆదేశాలను కాస్త సడలించాలని కోరింది. తమ దగ్గర రుణాలు తీసుకునే ట్రక్కు ఆపరేటర్లు లాంటి వివిధ వర్గాలవారు పలు కారణాలతో ఈఎంఐలను కాస్త ఆలస్యంగా చెల్లించడం సాధారణమేనని పేర్కొంది. కొంత ఆలస్యమైనా 30 రోజుల్లోపే చెల్లించేస్తుంటారు కాబట్టి, ఈ పద్దులను క్రెడిట్ రిస్కు కింద పరిగణించడానికి లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రొవిజనింగ్ నిబంధనను 30 రోజులు దాటిపోయిన రుణాలకు మాత్రమే వర్తింపచేసేలా అనుమతినివ్వాలని ఎన్బీఎఫ్సీలు విజ్ఞప్తి చేశాయి. పీఎస్బీలకు మొండిపద్దుల భారం ► ఈసారి 2–4% పెరుగుతాయి ► బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మొండిబాకీల భారం 2–4 శాతం మేర పెరిగే అవకాశం ఉందని బ్రోకరేజి దిగ్గజం బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీవోఎఫ్‌ఏ) హెచ్చరించింది. దీనితో బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ కింద ప్రభుత్వం 7–15 బిలియన్ డాలర్ల దాకా అదనపు మూలధనం సమకూర్చాల్సి రావొచ్చని పేర్కొంది. ఉద్దీపన ప్యాకేజీలు, పన్ను వసూళ్లు పడిపోవడం, డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలు నెరవేరే అవకాశాలు లేకపోవడం తదితర అంశాల కారణంగా ద్రవ్య లోటు 2 శాతం మేర పెరగవచ్చని బీవోఎఫ్‌ఏ తెలిపింది. బ్యాంకులకు అదనపు మూలధనం అందించడానికి అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవడానికి ప్రభుత్వం వివిధ మార్గాలు అన్వేషించాల్సి రావచ్చని వివరించింది.రీక్యాపిటలైజేషన్ బాండ్లను జారీ చేయడం లేదా ఆర్బీఐ దగ్గరున్న నిల్వల నుంచి కొంత భాగాన్ని వినియోగించడం వంటి అంశాలు పరిశీలించవచ్చని తెలిపింది. కరోనా వైరస్ కట్టడికి సంబంధించిన పరిణామాలతో బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు భారీగా పెరగవచ్చంటూ విశ్లేషకులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో బీవోఎఫ్‌ఏ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. -
రుణాల మారటోరియం మోసాలతో జాగ్రత్త
న్యూఢిల్లీ: రుణాల నెలవారీ వాయిదాల చెల్లింపుల (ఈఎంఐ)పై మారటోరియం అమలు నేపథ్యంలో మోసగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారులను బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. ఈఎంఐ మారటోరియం మోసాల గురించి అవగాహన పెంచుతున్నాయి. కీలకమైన ఓటీపీ, పిన్ నంబర్ల వివరాలను ఎవరికీ ఇవ్వొద్దని సూచిస్తున్నాయి. ఖాతాల వివరాలను చోరీ చేసేందుకు సైబర్ క్రిమినల్స్, మోసగాళ్లు అనుసరిస్తున్న కొంగొత్త విధానాల గురించి అవగాహన కల్పించే దిశగా యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకులు గత కొద్ది రోజులుగా ఖాతాదారులకు ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ పంపిస్తున్నాయి. ఈఎంఐల మారటోరియంపై సహకరిస్తామనే పేరుతో మోసగాళ్లు .. ఓటీపీ, సీవీవీ, పాస్వర్డ్ లేదా పిన్ నంబర్ల వివరాలను ఇవ్వాలంటూ ఫోన్లు చేసే అవకాశాలు ఉన్నాయని బ్యాంకులు తెలిపాయి. ఇలాంటి విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. అటు కరోనా వైరస్ బాధితులకు తోడ్పాటు అందించేందుకు ఉద్దేశించి ప్రధాని ప్రారంభించిన పీఎం–కేర్స్ నిధికి చందాల సేకరణ పేరుతో కూడా మోసాలు జరుగుతున్నాయని, వీటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నాయి. ఎన్బీఎఫ్సీలకూ మారటోరియం... రుణాలపై మూడు నెలల మారటోరియం వెసులుబాటును నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) కూడా వర్తింపచేయాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) పరిధిలోని బ్యాంకులు యోచిస్తున్నాయి. తద్వారా కరోనా వైరస్ సంక్షోభం నుంచి అవి గట్టెక్కేందుకు తోడ్పాటు అందించాలని భావిస్తున్నాయి. తాము కూడా రుణగ్రహీతల కోవలోకే వస్తాం కాబట్టి తమకు కూడా మారటోరియం ఇవ్వాలంటూ ఎన్బీఎఫ్సీలు డిమాండ్ చేస్తున్నాయి. వివిధ వర్గాలకు రుణాలు ఇచ్చే ఎన్బీఎఫ్సీలు ప్రధానంగా నిధుల కోసం బ్యాంకులపైనే ఆధారపడుతుంటాయి. డిజిటల్ చెల్లింపులపై ప్రచారం... కరోనా వైరస్ కల్లోలాన్ని కట్టడి చేయడానికి కేంద్రం విధించిన లాక్డౌన్ సమయంలో డిజిటల్ చెల్లింపులను అనుసరించాలని ప్రజలను ఆర్బీఐ కోరింది. ఈ మేరకు అమితాబ్ బచ్చన్‌తో ట్విట్టర్ ప్రచారాన్ని ఆర్బీఐ ప్రారంభించింది. కరోనా వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి సామాజిక దూరం పాటించడం సరైన చర్య అని ఆర్బీఐ తెలిపింది. -
బ్యాంకింగ్ బోర్లా!
న్యూఢిల్లీ: భారత బ్యాంకింగ్ రంగ దృక్పథాన్ని స్థిరం నుంచి ప్రతికూలానికి (నెగెటివ్) మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తగ్గించేసింది. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన అవరోధాలతో వృద్ధి మందగిస్తుందని.. దీంతో బ్యాంకుల ఆస్తుల నాణ్యత తగ్గిపోవచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. కార్పొరేట్, సూక్ష్మ, మధ్య తరహా సంస్థలు, రిటైల్ విభాగంలోని మొండిబాకీలు పెరగవచ్చని.. ఫలితంగా బ్యాంకుల లాభాలు, నిధులపై ఒత్తిళ్లు పెరిగిపోతాయని మూడీస్ నివేదికలో పేర్కొంది. ‘‘ఉన్నట్టుండి ఆర్థిక కార్యకలాపాలు ఒకేసారి ఆగిపోవడంతో నిరుద్యోగం పెరుగుతుంది. ఇది గృహాలు, కంపెనీల ఆదాయాలు తగ్గిపోయేందుకు దారితీస్తుంది. దీంతో చెల్లింపుల్లో జాప్యం పెరిగిపోయేందుకు కారణమవుతుంది. ఎన్బీఎఫ్సీ సంస్థల్లో నిధుల ఒత్తిళ్లు బ్యాంకుల రిస్క్‌ను పెంచుతుంది. ఎందుకంటే ఎన్బీఎఫ్సీ రంగానికి బ్యాంకుల ఎక్స్పోజర్ (రుణ పోర్ట్‌ఫోలియో) ఎక్కువగా ఉంది’’ అని మూడీస్ వెల్లడించింది. ఈ అంశాలు బ్యాంకుల లాభదాయకతను దెబ్బతీయడంతోపాటు రుణ వృద్ధికి విఘాతం కలిగిస్తాయని అంచనా వేసింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నిధుల లభ్యత స్థిరంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. యస్ బ్యాంకు డిఫాల్ట్‌తో రిస్క్ తీసుకోవడానికి కస్టమర్లు వెనుకాడడం చిన్న ప్రైవేటు బ్యాంకులకు నిధుల ఒత్తిళ్లు పెరగవచ్చని అంచనా వేసింది. ఈ బ్యాంకుల పట్ల నెగెటివ్.. ఇండస్ ఇండ్ బ్యాంకు రేటింగ్స్‌ను డౌన్‌గ్రేడ్ చేసేందుకు పరిశీలనలో పెడుతున్నట్టు మూడీస్ ప్రకటించింది. ఇండస్ ఇండ్ బ్యాంకు పోర్ట్‌ఫోలియో ఎక్కువగా వాహన రుణాలు, సూక్ష్మ రుణాలు కావడంతో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులతో బ్యాంకుపై ఎక్కువ ప్రభావం ఉండొచ్చని మూడీస్ పేర్కొంది. అలాగే, ప్రస్తుత సవాళ్లతో కూడిన వాతావరణంలో ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు రేటింగ్లను డౌన్‌గ్రేడ్ చేసింది. యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకుల రేటింగ్‌ను స్థిరం (స్టేబుల్) నుంచి నెగెటివ్‌కు తగ్గించింది. ఐడీబీఐ బ్యాంకు రేటింగ్‌ను పాజిటివ్ నుంచి స్టెబుల్‌కు డౌన్‌గ్రేడ్ చేసింది. అయితే, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకుల గ్లోబల్ రేటింగ్స్‌లో మార్పులు చేయలేదు. లౌక్‌డౌన్ కారణంగా రుణ గ్రహీతల వేతనాలకు ఇబ్బందులు ఎదురైతే అది రిటైల్, క్రెడిట్‌కార్డు రుణాల చెల్లింపులపై ప్రభావం చూపిస్తుందని అంచనా వేసింది. ఈ రంగాలపై ఎక్కువ ప్రభావం.. ఎయిర్‌లైన్స్, ఆటోమొబైల్ ఓఈఎం కంపెనీలు, ఆటో విడిభాగాల సరఫరా కంపెనీలు, ఆయిల్ అండ్ గ్యాస్ తయారీదారులు, గేమింగ్, గ్లోబల్ షిప్పింగ్, విచక్షణా రహిత రిటైల్ వినియోగం, ఆతిథ్య రంగాలు కరోనా వైరస్ కారణంగా ఎక్కువ ప్రతికూలతలను చవిచూసే రంగాలుగా మూడీస్ పేర్కొంది. -
విదేశీ పెట్టుబడులకు చర్యలు: శక్తికాంత దాస్
న్యూఢిల్లీ: మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ సత్వర చర్యలను పూనుకుంటోంది. ఇందులో భాగంగా విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందకు కసరత్తును ముమ్మరం చేసింది. తాజాగా విదేశీ మదుపర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ బాండ్లను అంతర్జాతీయ సూచీలో ప్రవేశపెట్టడానికి చర్చలు కొనసాగుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అంతర్జాతీయ సూచీలో విదేశీ నిధులు తప్పనిసరి కావడంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. ఈ చర్యల వల్ల విదేశీ నిధులు దేశంలోకి ప్రవేశించే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అంతర్జాతీయ సూచీలో అత్యధిక విదేశీ నిధులు పొందుతున్న దేశాల నిపుణులతో చర్చిస్తున్నామని, దేశీయ ప్రభుత్వ బాండ్ల ద్వారా విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి అనేక చర్యలు చేపట్టామన్నారు. ఆర్థిక వ్యవస్థను బలపరిచే క్రమంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్బీఎఫ్సీ)లో నిధులు ప్రవాహాన్ని విశ్లేషిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న విదేశీ పెట్టుబడుదారుల సలహాను ఈ ఏడాది బడ్జెట్లో ప్రస్తావించినట్టు శక్తికాంత దాస్ గుర్తు చేశారు. ఈ పనిని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే ఆర్థిక వ్యవస్థకు కీలకమైన బ్యాంకింగ్ రంగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో రుణ వృద్ధి లేకపోవడం వల్ల బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయని, వీటన్నింటికి పరిష్కరించేందుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నేషనల్ హౌసింగ్ బ్యాంక్(ఎన్‌హెచ్‌బీ)ను ప్రారంభించిందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. చదవండి: త్వరలో రూ.50 నోటు కొత్త సిరీస్ -
ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టాలి
మొండిబాకీల సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే కొంత గాడిలోకి వస్తున్న బ్యాంకింగ్ రంగం రానున్న బడ్జెట్లో భారీస్థాయి ఆశలేవీ పెట్టుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే మూలధన నిధులను అందించడం, బలహీన బ్యాంకులను విలీనం చేయడం తదితర చర్యలతో ప్రభుత్వం తన ప్రాధాన్యతలను చెప్పకనేచెప్పింది. అయితే, ఎన్పీఏ భయాలతో కార్పొరేట్ రంగానికి రుణాలను ఇచ్చేందుకు ఇప్పటికీ బ్యాంకులు జంకుతున్నాయి. ఈ తరుణంలో బడ్జెట్లో బ్యాంకులు ఏం కోరుకుంటున్నాయి? ఈ రంగంలో నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం... హౌసింగ్‌కు ప్రోత్సాహకాలివ్వాలి... ‘ఆర్థిక రంగానికి బ్యాంకులు జీవనరేఖ లాంటివి. ఎకానమీ పుంజుకుంటే ముం దుగా లాభపడేవి బ్యాంకులే. అందుకే బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే చర్యలను బడ్జెట్లో చేపడతారని భావిస్తున్నాం. అయితే, నేరుగా బ్యాంకులకు సంబంధించి భారీ ప్రకటనలేవీ ఉండకపోవచ్చు’ అని ఫెడరల్ బ్యాంక్ ఎండీ, సీఈఓ శ్యామ్ శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. కీలకమైన రంగాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు బ్యాంకింగ్ రంగంపై ప్రభావం చూపుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే లక్ష్యంగా బడ్జెట్లో నిర్ణయాలు తీసుకోవాలి. ఇందులో విఫలమైతే మున్ముందు నిరుద్యోగం మరింతగా పెరుగుతుంది. నాన్‌బ్యాంకింగ్ సంస్థల ద్వారా నేరుగా రుణాలిచ్చిన తనఖాల్లేని రుణాలు(అన్సెక్యూర్డ్)తో బ్యాంకుల రిస్కులు మరింత తీవ్రం అవుతాయి’ అని ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్ అధికారి ఒకరు హెచ్చరించారు. ఇప్పటికే మంచి కార్పొరేట్ కంపెనీల నుంచి రుణాలకు సంబంధించి డిమాండ్ ఘోరంగా పడిపోవడంతో దీన్ని భర్తీ చేసుకోవాడానికి రిటైల్ రుణాలపై బ్యాంకులు అత్యధికంగా దృష్టిసారిస్తున్నాయి. ‘వాహన, గృహ రుణాలకు సంబంధించి ఎలాంటి ఆందోళనా లేదు. అయితే, వ్యక్తిగత రుణాల చెల్లింపుల్లో మొండి బాకీలు గనుక పెరిగాయంటే బ్యాంకింగ్‌కు కొత్త సమస్యలు తప్పవు’ అని మరో బ్యాంక్ అధికారి అభిప్రాయపడ్డారు. ఇంకా ఏం ఆశిస్తున్నారంటే... ► హౌసింగ్ రంగానికి ప్రోత్సాహం ఇచ్చే చర్యలు తీసుకోవాలి. దీనివల్ల బ్యాంకింగ్‌కు పరోక్షంగా ప్రయోజం ఉంటుంది. ► నిలిచిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ప్రకటించిన రూ.25,000 కోట్ల ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి(ఏఐఎఫ్)ను మరింతగా పెంచాలి. దీనివల్ల రియల్టీ రంగం పునరుత్తేజంతో పాటు బ్యాంకింగ్ రంగంలో మొండిబాకీల సమస్యలకు కూడా అడ్డుకట్టపడుతుంది. ► ద్రవ్యలోటు కట్టడితో పాటు బడ్జెట్లో ప్రకటించబోయే ఇతరత్రా విధానపరమైన చర్యల ఆధారంగానే... ఆర్బీఐ తదుపరి పాలసీ చర్యలు(వడ్డీరేట్ల విషయంలో) ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీరేట్ల తగ్గింపునకు గత పాలసీ సమీక్షలో ఆర్బీఐ విరామం ప్రకటించింది. తదుపరి సమీక్ష ఫిబ్రవరి 6న జరగనుంది. ► ఇక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)లకు సంబంధించి పాక్షిక హామీ పథకం(పీసీజీ)ని ప్రభుత్వం పొడిగించే అవకాశం ఉంది. సంక్షోభంతో నిధుల సమస్యలను ఎదుర్కొంటున్న ఎన్‌బీఎఫ్‌సీలకు ద్రవ్య సరఫరా పెంచేందుకు కేంద్రం ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. -
బంగారం రుణాలు @ 4.61 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: బంగారం రుణాల మార్కెట్ శరవేగంగా మన దేశంలో వృద్ధి చెందుతోంది. 2022 నాటికి ఈ మార్కెట్ రూ.4,617 బిలియన్ రూపాయిలకు (రూ.4,61,700 కోట్లు) చేరుకుంటుందని కేపీఎంజీ నివేదిక వెల్లడించింది. ఐదేళ్లలో రుణాల వృద్ధి వార్షికంగా 13.4 శాతం మేర ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు ఓ నివేదికను కేపీఎంజీ శుక్రవారం విడుదల చేసింది. నివేదికలోని అంశాలు - 2018–19లో బంగారంపై రుణాలు ఇచ్చే కంపెనీలు దేశంలోని ఉత్తరాది, తూర్పు ప్రాంతాల్లోకి తమ శాఖలను వేగంగా విస్తరించాయి. - ఎన్బీఎఫ్సీలు, ఇంటి వద్దకే వచ్చి రుణాలను అందించే నూతన తరం ఫిన్‌టెక్ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించడంతో డిజిటల్ వేదికగా కొత్త కస్టమర్లను చేరుకునేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. - బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ కంపెనీలతో కూడిన వ్యవస్థీకృత రంగం వాటా 35 శాతంగా ఉంది. బంగారం రుణ మార్కెట్లో సంఘతిత రంగంతో పోలిస్తే అసంఘటిత రంగ మార్కెట్ రెండు రెట్లు అధికంగా ఉంది. దీంతో సంఘటిత రంగం విస్తరించేందుకు అపార అవకాశాలు ఉన్నాయి. - ఇంత కాలంగా బంగారం రుణాలకే పరిమితమైన పెద్ద కంపెనీలు తమ వృద్ధిని కాపాడుకునేందుకు సూక్ష్మ రుణాలు, ఎస్ఎంఈ రుణాలపైనా దృష్టి పెట్టాయి. - బంగారం రుణ మార్కెట్ ధరల పరంగా అస్థిరత, ఎన్బీఎఫ్సీ రంగంలో నిధుల లభ్యత సమస్యలను ఎదుర్కొంటోంది. అయితే, బంగారం రుణాలను ఇచ్చే కంపెనీలు లోన్ టు వ్యాల్యూ (బంగారం విలువలో ఇచ్చే రుణ నిష్పత్తి)ను తక్కువగా నిర్ణయించడం, తక్కువ కాల వ్యవధికే రుణాలను ఇవ్వడం ద్వారా ధరల అస్థిరతలను అధిగమిస్తున్నాయి. -
భారత్‌లో ఆర్థిక మందగమనం
వాషింగ్టన్: భారత్‌లో ఆర్థిక మందగమన పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభిప్రాయపడింది. దీర్ఘకాల ఈ ధోరణిని అరికట్టడానికి కేంద్రం తక్షణం విధానపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఐఎంఎఫ్ డైరెక్టర్స్ నివేదిక వెలువరించిన అంశాలను సంస్థ ఆసియా, పసిఫిక్ శాఖలో భారత్ వ్యవహారాల చీఫ్ రానిల్ సల్గాడో విలేకరులకు తెలిపారు. దీని ప్రకారం– భారత్ ఆర్థిక రంగానికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► నిజానికి భారత్ ఇటీవలి సంవత్సరాల్లో భారీ ఆర్థిక విస్తరణ బా టలో ముందడుగు వేసింది. దీనితో లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడ్డారు. అయితే 2019 సంవత్సరం నుంచీ దేశంలో ఆర్థిక వృద్ధి పూర్తి మందగమనంలో జారిన జాడలు సుస్పష్టమయ్యాయి. తగిన విధానపరమైన చర్యలు తీసుకోకపోతే, ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. ► అయితే భారీ వృద్ధి తర్వాత వచ్చే దిగువబాటగానే (సైక్లికల్) మేము ఈ పరిస్థితిని ఇంకా పరిగణిస్తున్నాం. వ్యవస్థాగతమైన ఇబ్బందులు కనబడ్డంలేదు. అయితే ఈ సైక్లికల్ ప్రతికూలతలను ఎదుర్కొనడానికి కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఫైనాన్షియల్ రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి. ► ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టం 4.5 శాతానికి పడిపోయింది. దేశీయంగా ప్రైవేటు డిమాండ్‌లో కేవలం ఒక శాతం వృద్ధి రేటు నమోదయ్యిందని గణాంకాలు పేర్కొంటున్నాయి. పరిస్థితి చూస్తుంటే, డిసెంబర్ త్రైమాసికంలోనూ ప్రతికూల జీడీపీ గణాంకాలే వెలువడతాయని భావించాల్సి వస్తోంది. ► బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థల్లో (ఎన్బీఎఫ్సీ) రుణ వృద్ధి లేకపోవడం, ఆదాయాల వృద్ధి ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో పడిపోవడం మొత్తంగా ప్రైవేటు వినియోగంపై కనబడుతోంది. ► తగినంత వ్యాపార విశ్వాసం లేకపోవడం వల్ల బ్యాంకింగ్ రంగంలో రుణ వృద్ధి మందగమనం కొనసాగుతోంది. ► వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మంచి వ్యవస్థాగత సంస్కరణే అయినప్పటికీ, అమల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. వృద్ధి మందగమనంలో దీనిపాత్ర కూడా ఉండొచ్చనిపిస్తోంది. ► బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల సమస్య పరిష్కార దిశలో తగిన చర్యలు ఉండాలి. ► ప్రస్తుతం 2019–20లో భారత్ జీడీపీ వృద్ధిరేటు 6.1% ఉంటుందని అంచనా. అంచనాల సవరణ నిర్ణయం జనవరిలో ఉంటుంది. గత వృద్ధి అంచ నాలను గణనీయంగా తగ్గించే అవకాశాలే ఉన్నా యి. ప్రస్తుతం వివిధ జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు భారత్ వృద్ధి అంచనాలను దాదాపు 5% దిగువనకు కుదించిన సంగతి తెలిసిందే. ► భారత్ ఆర్థిక రంగానికి సంబంధించి కొన్ని సానుకూల అంశాలూ ఉన్నాయి. అందులో విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో ఉండడం ఒకటి. నవంబర్ 15తో ముగిసిన వారంలో 441 మిలియన్ డాలర్ల పెరుగుదలతో 448.249 బిలియన్ డాలర్లకు ఎగశాయి. దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం కరెంట్ అకౌంట్ లోటు కూడా కట్టడిలోనే ఉంది. కూరగాయల ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం ఇటీవల కట్టుతప్పినప్పటికీ, గడచిన కొన్ని సంవత్సరాలుగా పూర్తి నియంత్రణలో ఉంది. కార్పొరేట్ పన్ను రేటును 30 నుంచి 15 శాతానికి తగ్గించడమూ సానుకూలాంశమే. ఇన్ని చర్యలు ఉన్నా... ఆర్థిక మందగమనం ఆశ్చర్యకరమే. అందువల్ల ఈ మందగమనాన్ని ఆర్థిక సంక్షోభంగా అభివర్ణించలేం. ► కార్మిక, భూ, ప్రొడక్ట్ మార్కెట్ వంటి విభాగాల్లో భారత్ సంస్కరణలు తీసుకురావాలని ఐఎంఎఫ్ భావిస్తోంది. అలాగే మార్కెటింగ్‌లో ప్రత్యేకించి అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని ఎదుర్కొనేందుకూ చర్యలు అవసరం. ఇక విద్యా, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లోనూ సంస్కరణలు అవసరం. ► అయితే ఇక్కడ ఒక అంశాన్ని ఐఎంఎఫ్ విశ్వసిస్తోంది. ప్రస్తుతం భారత్ ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) సమస్యను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనలు ప్రకటించడానికి పరిమితులు ఉన్నాయి. 2019– 20 ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ పరిమాణం రూ.7.03 లక్షల కోట్లుగా ఉండాలన్నది (జీడీపీలో 3.3 శాతం) బడ్జెట్ లక్ష్యం. కానీ అక్టోబర్ ముగిసే నాటికే ఈ మొత్తం రూ.7,20,445 కోట్లకు చేరింది. ద్రవ్యలోటు కట్టడికి తగిన చర్యలపై దృష్టి పెట్టాలి. -
సహకార బ్యాంకుల పనితీరుపై ఆర్బీఐ సమీక్ష
భువనేశ్వర్: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు (పీఎంసీ) స్కామ్‌తో లక్షల మంది డిపాజిటర్లు సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అర్బన్ సహకార బ్యాంకుల పనితీరును రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డు శనివారం సమీక్షించింది. ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, అంతర్గతంగాను.. అంతర్జాతీయంగాను దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు మొదలైన అంశాలు కూడా చర్చించింది. గవర్నర్ శక్తికాంత దాస్ సారథ్యంలో సమావేశమైన సెంట్రల్ బోర్డు.. పట్టణ ప్రాంత కోఆపరేటివ్ బ్యాంకులు, వాటితో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల్లో నిబంధనల అమలు తదితర అంశాలను సమీక్షించిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రియల్టీ సంస్థ హెచ్‌డీఐఎల్‌కు మొత్తం రూ. 6,226 కోట్ల మేర రుణాలిచ్చినప్పటికీ .. పీఎంసీ బ్యాంకు కేవలం రూ. 440 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు ఆర్బీఐకి చూపించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్ బైటపడటంతో పీఎంసీ బ్యాంకు ఖాతాదారుల విత్డ్రాయల్స్పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. -
దివాలా కోడ్‌కు మరిన్ని సవరణలు
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియను క్రమబద్ధీకరించే దిశగా దివాలా కోడ్ (ఐబీసీ)లో మరిన్ని సవరణలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీనితో పాటు ఇతరత్రా పలు ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలుపుతూ కేంద్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఐబీసీ సవరణలకు సంబంధించి.. దివాలా తీసిన సంస్థలను కొనుగోలు చేసిన బిడ్డర్లకు ఊరట లభించే ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయి. వీటి ప్రకారం ఆయా కంపెనీల గత ప్రమోటర్లు చేసిన తప్పిదాలకు కొత్త యాజమాన్యం.. క్రిమినల్ విచారణ ఎదుర్కొనాల్సిన అవసరం ఉండదు. 2016లో అమల్లోకి వచ్చిన ఐబీసీకి ఇప్పటికే మూడు సార్లు సవరణలు చేశారు. తాజాగా కొన్ని సెక్షన్లను సవరించడంతో పాటు కొత్తగా మరో సెక్షన్‌ను చేర్చారు. ఐబీసీ (రెండో సవరణ) బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం దివాలా పరిష్కార ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా దర్యాప్తు సంస్థలు ఆయా కంపెనీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం కొనసాగిస్తున్నాయి. దీంతో దివాలా సంస్థల కొనుగోలుకు ఇన్వెస్టర్లు వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా సవరణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు బాసట.. సంక్షోభంలో ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు(ఎన్బీఎఫ్సీ), గృహ రుణ సంస్థలకు (హెచ్ఎఫ్సీ) ఊరటనిచ్చే స్కీమునకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. ఆర్థికంగా బలంగా ఉన్న ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలకు సంబంధించిన అత్యధిక రేటింగ్ గల ఆస్తులను కొనుగోలు చేసే ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) ప్రభుత్వం పాక్షికంగా రుణ హామీ కల్పిస్తుంది. ఆయా అసెట్స్ విలువలో పది శాతం లేదా రూ. 10,000 కోట్ల దాకా (ఏది తక్కువైతే అది) నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఈ పూచీకత్తు ఉపయోగపడుతుంది. 2020 జూన్ దాకా ఆరు నెలల పాటు లేదా రూ. 1,00,000 కోట్ల అసెట్స్ కొనుగోలు పూర్తయ్యేదాకా ఈ స్కీము అమల్లో ఉంటుంది. అవసరమైతే దీన్ని మరో మూడు నెలల పాటు ఆర్థిక మంత్రి పొడిగించవచ్చు. ఎన్హెచ్ఏఐ ‘ఇన్విట్’... ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) ఏర్పాటు చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐకి అనుమతినిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే ఇది కూడా పలువురు ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించి, ఇన్ఫ్రా అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు రాబడులు అందిస్తుంది. దాదాపు రూ. 5,35,000 కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా 24,800 కి.మీ. మేర రహదారులు అభివృద్ధి చేసే దిశగా 2017 అక్టోబర్‌లో కేంద్రం భారత్‌మాలా పరియోజన కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఈ ప్రాజెక్టుల పూర్తికి భారీ స్థాయిలో నిధులు అవసరమవుతాయి. -
అలా ఎలా రుణాలిచ్చేశారు?
ముంబై: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) వివాదం... తాజాగా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల మెడకు కూడా చుట్టుకుంటోంది. తనఖా పెట్టిన షేర్ల గురించి పూర్తిగా మదింపు చేయకుండా అవి కార్వీకి ఎలా రుణాలిచ్చాయన్న అంశంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. దీనికి సంబంధించి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలపై విచారణ జరపాలంటూ రిజర్వ్ బ్యాంక్‌కు సెబీ లేఖ రాసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అక్రమంగా క్లయింట్ల సెక్యూరిటీలను తనఖా పెట్టి రుణాలు తీసుకున్నప్పుడే బ్యాంకులు అప్రమత్తం కావాల్సిందని సెబీ వర్గాలు పేర్కొంటున్నాయి. కార్వీ తనఖా పెట్టిన షేర్లను క్లయింట్ల ఖాతాల్లోకి మళ్లించాలంటూ డిసెంబర్ 2న సెబీ ఆదేశించటంతో నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) దాదాపు 90 శాతం మంది క్లయింట్లకు షేర్లను బదలాయించడం తెలిసిందే. అయితే, తమకు పూచీకత్తుగా ఉంచిన షేర్లను క్లయింట్లకెలా బదలాయిస్తారంటూ బ్యాంకులు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ‘ఆ షేర్లపై కార్వీకే అధికారాల్లేనప్పుడు.. వాటిని తనఖా పెట్టుకుని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రుణాలెలా ఇచ్చాయి? వాటిని క్లయింట్ల ఖాతాల్లోకి బదలాయించొద్దంటూ ఎలా చెబుతాయి?‘ అని సెబీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. షేర్లన్నింటికీ రిస్కు.. భారీ ఆస్తులను తనఖా పెట్టి స్వల్ప మొత్తంలో రుణాలు తీసుకుంటున్నప్పుడే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు అనుమానం రావాల్సిందని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. దాదాపు రూ.5,000 కోట్ల విలువ చేసే ప్రమోటర్ అసెట్స్‌కు ప్రతిగా కార్వీకి బ్యాంకులు రూ.1,200 కోట్లు రుణమిచ్చాయి. అలాగే రూ. 2,300 కోట్ల విలువ చేసే క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి కార్వీ మరో రూ.600 కోట్లు రుణం తీసుకుంది. కార్వీ తీసుకున్న రుణాల్లో ఏ కొంచెం ఎగ్గొట్టినా.. ఇంత భారీ స్థాయిలో తనఖా పెట్టిన షేర్లన్నింటినీ బ్యాంకులు అమ్మేసే ప్రమాదం ఉంటుంది. పైపెచ్చు కార్వీ సొంత బ్యాలెన్స్ షీట్లో రూ.27 లక్షల విలువ చేసే షేర్లు మాత్రమే ఉండటం చూసైనా.. ఏదో పొరపాటు జరుగుతోందని బ్యాంకులు మేల్కొని ఉండాల్సిందని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు కచ్చితంగా తప్పు చేశాయని ఇలాంటి ఉదంతాలు రుజువు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంకులతో పాటు బజాజ్ ఫైనాన్స్ వంటి సంస్థలు షేర్లను తనఖా పెట్టుకుని కార్వీకి దాదాపు రూ.1,800 కోట్ల మేర రుణాలిచ్చాయి. ఈవోడబ్ల్యూకీ సెబీ ఫిర్యాదు..? కార్వీ కేసుకు సంబంధించి ముంబై పోలీస్‌లో భాగమైన ఆర్థిక నేరాల విభాగానికి (ఈవోడబ్ల్యూ) కూడా సెబీ ఫిర్యాదు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ‘కార్వీ కేసు కేవలం సెక్యూరిటీస్ చట్టానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఇది సివిల్ కేసు కూడా కనక సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు (శాట్) ఆదేశాలిచ్చే అధికారాల్లేవు. కాబట్టి క్లయింట్ల షేర్లను దొంగిలించిందంటూ కార్వీపై ఈవోడబ్ల్యూకి సెబీ ఫిర్యాదు చేయొచ్చు‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి రుణాలు తీసుకుంటున్న ఇతర బ్రోకరేజీ సంస్థలపైనా సెబీ దృష్టి సారించింది. సెక్యూరిటీలను తనఖా పెట్టి రూ.50 కోట్ల పైగా రుణాలు తీసుకున్న సంస్థలు నాలుగే ఉన్నాయని, మిగతా సంస్థలన్నీ సొంత షేర్లనే పూచీకత్తుగా పెట్టాయని తేలినట్లు సమాచారం. -
మీ రుణం ‘బంగారం’ గాను..
ఎవరికైనా అత్యవసరంగా డబ్బులు అవసరం పడితే వెంటనే తెలిసిన వారి దగ్గర చేబదులు తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. పర్సనల్ లోన్‌కు వెళ్లాలంటే అందుకు కొన్ని రోజుల సమయం తీసుకుంటుంది. వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రుణం తెచ్చుకోవడం వల్ల ఆర్థికంగా ఎంతో భారం పడుతుంది. ఇటువంటి అవసరాల్లో అన్నింటికంటే మెరుగైన మార్గంగా బంగారంపై రుణాన్ని చెప్పుకోవాలి. గోల్డ్‌లోన్ ఇతర రుణాలతో పోలిస్తే ఎన్నో విధాలుగా సౌకర్యమైనదే కాదు, మన డబ్బును కొంత ఆదా చేస్తుంది. పర్సనల్ లోన్, ఇతర వ్యక్తిగత రుణాల్లో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇది 12.75 శాతం నుంచి 19 శాతం వరకు ఉండొచ్చు. అదే గోల్డ్ లోన్స్‌పై వడ్డీ రేటు 12 శాతం నుంచి ప్రారంభమవుతుంది. కనుక ఇతర రుణాలతో పోలిస్తే ఈ విషయంలో గోల్డ్‌లోన్ చౌక అని చెప్పుకోవాలి. ఇతర రుణాలతో పోలిస్తే ఆ మేరకు ఆదా చేసుకోవచ్చు. కాకపోతే బంగారం విలువలో గరిష్టంగా ఎంత మేరకు రుణాన్ని తీసుకుంటున్నారు? అనే అంశమే వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. ఉదాహరణకు మణప్పురం సంస్థ బంగారం విలువలో 45 శాతం వరకు రుణం తీసుకుంటే కేవలం 12 శాతం రేటునే చార్జ్ చేస్తోంది. ఇంకాస్త అదనంగా కావాలనుకుంటే అప్పుడు 18 శాతం వడ్డీ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక బంగారం విలువలో 75 శాతం వరకు రుణం కోరుకుంటే అప్పుడు 24–26 శాతం వరకు వడ్డీ రాబడుతోంది. కనుక రుణం తీసుకునే వారు ఈ అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి. తమవద్దనున్న బంగారం విలువలో సగానికి మించకుండా రుణం తీసుకుంటే అధిక వడ్డీ బాదుడు ఉండదు. గంటలోపే రుణం వ్యక్తిగత రుణం తీసుకోవాలని భావిస్తే అందుకు ఎంతలేదన్నా కనీసం రెండు మూడు రోజుల సమయం తీసుకుంటుంది. మధ్యలో సెలవు రోజు ఉంటే ఇంకా ఒకటి రెండు రోజుల అదనపు సమయం తీసుకోవచ్చు. కానీ, బంగారంపై రుణానికి ఇంత సమయం వేచి ఉండక్కర్లేదు. మీ వద్దనున్న బంగారం, ఆధార్ కార్డు, మీ చిరునామా వివరాలతో ఎన్బీఎఫ్సీ సంస్థను ఆశ్రయిస్తే అరగంట నుంచి గంటలోపే రుణంతో తిరిగి వెళ్లిపోవచ్చు. ముత్తూట్ ఫైనాన్స్ అయినా మణప్పురం ఫైనాన్స్ అయినా గంటలోపే ప్రాసెస్ చేస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజు పర్సనల్ లోన్‌పై కచ్చితంగా ప్రాసెస్ ఫీజు భరించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రుణం మొత్తంలో 1–2.5 శాతం వరకూ ఉండొచ్చు. గృహ, వాహన రుణాల్లోనూ ఈ చార్జీ తప్పదు. కానీ, బంగారంపై రుణానికి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండకపోవడం ఎంతో వెసులుబాటు. కొన్ని సందర్భాల్లో చార్జీ తీసుకున్నా, ఆ మొత్తం రూ.10–50 మధ్యే ఉంటోంది. క్రెడిట్ స్కోరు అవసరం లేదు బంగారంపై రుణం అన్నది సెక్యూర్డ్ లోన్. పర్సనల్ లోన్ అన్నది అన్సెక్యూర్డ్ లోన్. బంగారంపై రుణం ఎగవేతకు అవకాశాలు చాలా చాలా తక్కువ. రుణ గ్రహీత చెల్లింపులు చేయడంలో విఫలమైతే సంస్థ తనఖాగా ఉంచిన బంగారాన్ని విక్రయించి రుణం కింద సర్దుబాటు చేసుకుంటుంది. అందుకే దీన్ని సెక్యూర్డ్ లోన్ అంటారు. తక్కువ వడ్డీ రేటుకు రుణం లభించడం ఇందువల్లే. ముఖ్యంగా ఇతర ఏ రుణానికైనా క్రెడిట్ స్కోరు చాలా కీలకం అవుతుంది. స్కోరు బాగాలేకపోతే దరఖాస్తును తిరస్కరించే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ, బంగారంపై రుణానికి క్రెడిట్ స్కోరుతో పనిలేదు. తనఖాగా బంగారం ఉంచితే చాలు. ముందుగా రుణాన్ని తీర్చేయవచ్చు.. వ్యక్తిగత, వాహన, గృహ రుణాలను నిర్ణీత కాల వ్యవధికి ముందుగానే తీర్చివేస్తే అందుకు కొంత మొత్తం చార్జీలను భరించాల్సి వస్తుంది. అదే బంగారంపై రుణాన్ని ఈ రోజు తీసుకుని రేపు తీర్చివేసినా ఎటువంటి చార్జీల్లేకపోవడం మరో సానుకూలత. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంటే.. మణప్పురం, ముత్తూట్ వంటి సంస్థలు పట్టణాలకే పరిమితం. బ్యాంకులు మండల స్థాయి వరకు విస్తరించాయి. కనుక పట్టణాలకు కొంచెం దూరంలో ఉండే గ్రామీణులకు.. సమీపంలో ఉండే బ్యాంకుల నుంచి గృహ రుణం తీసుకోవడం కొంచెం సౌకర్యంగా ఉండొచ్చు. ఇంటివద్దకే రుణం కావాలంటే.. రుపీక్ అనే స్టార్టప్ ఇంటి వద్దకే వచ్చి బంగారంపై రుణాన్ని ఆఫర్ చేస్తోంది. ఆరు నెలల నుంచి ఏడాది వరకు కాల వ్యవధిపై రుణాలను ఇస్తోంది. వడ్డీ చెల్లింపుల్లో విఫలమైతే వడ్డీరేటును పెంచే చర్యలను అమలు చేయడం లేదు. పైగా ఆరు నెలలకు ఒకేసారి చెల్లించే సదుపాయాన్ని కూడా ఇస్తోంది. సేవల నాణ్యత బంగారంపై రుణం కోరుకునే వారు సేవల నాణ్యతను కూడా చూడాల్సిందే. బ్యాంకులతో పోలిస్తే ఎన్‌బీఎఫ్‌సీల సేవలు కాస్త మెరుగ్గా ఉంటాయి. ముత్తూట్ వంటి సంస్థలు మొబైల్ అప్లికేషన్ ద్వారా రుణంపై వడ్డీ చెల్లింపులు, అసలు చెల్లింపు తదితర ఎన్నో సేవలను అందిస్తున్నాయి. ఆదాయంతో కూడా పనిలేదు రుణం కావాల్సిన వారిలో గృహిణులు, వితంతువులు, వృద్ధులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా ఉండొచ్చు. మరి రుణం కోసం ఆదాయ ధ్రువీకరణ చూపించడం అంటే వీరికి కష్టమే. పర్సనల్ లోన్, వాహన రుణం, గృహ రుణాలకు ఆదాయాన్ని (బ్యాంకు స్టేట్మెంట్, పేస్లిప్ తదితర) కూడా చూపించాలి. కానీ, బంగారంపై రుణానికి ఎటువంటి ఆదాయ ధ్రువీకరణలు కూడా అవసరం లేదు. వడ్డీ వరకే.. బంగారంపై రుణంలో ఉన్న మరో సాకర్యం.. కేవలం వడ్డీ మాత్రమే చెల్లించే అవకా శం ఇవ్వడం. ఉదాహరణకు బంగారాన్ని తనఖా గా ఉంచి రూ.లక్ష రుణాన్ని తీసుకున్నారనుకోం డి. 12 శాతం వడ్డీ రేటు ఆధారంగా ప్రతీ నెలా రూ.1,000 మొత్తాన్ని చెల్లిస్తూ వెళ్లొచ్చు. అసలు మొత్తాన్ని బంగారం విడిపించుకోవాలనుకునే సమయంలో చెల్లించేందుకు అవకాశం ఉంది. కాకపోతే గోల్డ్ లోన్ 3 నెలలు, 6 నెలల కాల వ్యవధితో ఉంటుంటాయి. లోన్ టర్మ్ అయిన తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది. మణప్పురం, ముత్తూట్ వంటి ఎన్బీఎఫ్సీ సంస్థల్లో ఇలా ఉంటుంది. అదే బ్యాంకుల్లో అలా కాదు అసలు, వడ్డీతో కలసిన ఈఎంఐ మొత్తాన్ని ప్రతీ నెలా చెల్లిస్తూ వెళ్లాలి. ఒకవేళ విఫలమైతే చార్జీలు బాదేస్తాయి. ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే అవకాశం లేని వారికి ఇది ఇబ్బందే. అందుకే అటువంటి వారు ఎన్బీఎఫ్సీ సంస్థల నుంచి తీసుకోవడం సౌకర్యం. కాల వ్యవధి బ్యాంకులు సాధారణంగా దీర్ఘకాలానికి అంటే – ఏడాది నుంచి మూడేళ్ల కాల వ్యవధికి బంగారం రుణాలను మంజూరు చేస్తుంటాయి. వ్యాపారానికి బంగారాన్ని తనఖాగా ఉంచి రుణా న్ని పొందే వారికి దీర్ఘకాలం అనుకూలం. కనుక అటువంటి వారికి బ్యాంకులే అనుకూలం. వీటిని గమనించాలి.. ► బంగారు ఆభరణాలు, బంగారం కాయిన్లపై బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. అయితే, మణప్పురం, ముత్తూట్ ఫైనాన్స్ వంటి సంస్థలు బంగారు ఆభరణాలపైనే రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. బంగారం స్వచ్ఛత 18–24 క్యారెట్ల మధ్య ఉండాలి. ► చిరునామా, గుర్తింపు ధ్రువీకరణలు, ఇందులో ఆధార్ తప్పనిసరి, ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ► ఎన్బీఎఫ్సీ సంస్థల నుంచి తీసుకున్న బంగారం రుణంపై అసలు తర్వాత చెల్లించినా కానీ, వడ్డీని 30 రోజులు మించకుండా చెల్లించేయాలి. లేదంటే వడ్డీపై వడ్డీ పడుతుంది. అంతేకాదు, 12 శాతం వడ్డీ రేటు తీసుకుని 30 రోజులు దాటినా వడ్డీని చెల్లించకపోతే అప్పుడు ఆ రేటు కాస్తా 18 శాతానికి పెరిగిపోతుంది. ► అసలు, వడ్డీ చెల్లింపుల్లో విఫలమైతే మూడు, ఆరు నెలల పాటు వేచి చూసి అప్పటికీ చెల్లించకపోతే.. ఆ తర్వాత సంస్థలు వేలానికి వెళ్లొచ్చు. ► మీ వద్ద రూ.లక్ష బంగారం ఉంటే రూ.లక్ష రుణంగా లభించదు. బంగారం విలువలో 60–75 శాతం వరకు రుణంగా (లోన్ టు వ్యాల్యూ/ఎల్టీవీ) ఎన్బీఎఫ్సీలు ఇస్తున్నాయి. పెద్ద మొత్తంలో రుణం కోరుకుంటే అప్పుడు 60 శాతానికే పరిమితం చేస్తున్నాయి. అదే బ్యాంకులు అయితే బంగారం విలువలో 65 శాతానికే రుణాన్ని పరిమితం చేస్తున్నాయి. ► బ్యాంకులతో పోలిస్తే, సులభంగా, వేగంగా రుణం కోరుకుంటే గోల్డ్‌లోన్ కంపెనీలను ఆశ్రయించడమే మంచిది. కొన్ని బ్యాంకులు బంగారం రుణాలపైనా ప్రాసెసింగ్ చార్జీని రాబడుతున్నాయి. ► బంగారం రుణాలను టర్మ్ లోన్స్గానే బ్యాంకులు పరిగణిస్తున్నాయి. కనుక వడ్డీ, అసలు కలిపి వాయిదాలుగా చెల్లించాల్సి ఉంటుంది. ► బ్యాంకుల్లో బంగారం రుణాలపై వడ్డీ 14–18 శాతం మధ్య ఉంది. కానీ, ఎన్బీఎఫ్సీల్లో ఇది గరిష్టంగా 26 శాతం వరకు ఉండడం గమనార్హం.