రాబోయే రెండేళ్ళలో మధ్యతరహా ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో రిస్క్‌తో పోలిస్తే రివార్డ్ రేషియో ఎక్కువగా ఉంటుందని మోర్గాన్ స్లాన్లీ తెలిపింది. ఎన్‌బీఎఫ్‌సీ సెక్టార్‌కు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్సియల్, శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్, శ్రీరామ్ సిటి యూనియన్ ఫైనాన్స్, ఆదిత్యా బిర్లా క్యాపిటల్, పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు తమ టాప్‌పిక్‌లుగా ఉన్నట్లు బ్రోకరేజ్ పేర్కోంది. వచ్చే ఏడాదిలోగా షేర్లు 30-45శాతం రాబడులను ఇస్తాయని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తుంది.
డీప్ వాల్యూ, మిస్-ప్రైస్‌డ్ స్టాకుల కోసం అన్వేషిస్తున్న ఇన్వెస్టర్లకు ఈ స్టాకులను సిఫార్సులు చేస్తున్నట్లు మోర్గాన్‌స్టాన్లీ తెలిపింది. రెండేళ్ల పాటు సెక్టార్ సంబంధిత సవాళ్లను ఎదుర్కోన్న ఈ షేర్ల వాల్యూయేషన్లు ఇప్పుడు జీవితకాల కనిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్నట్లు బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ప్రీ-కోవిడ్19కి ముందు 2020 గరిష్టాలతో పోలిస్తే మిడ్‌క్యాప్ షేర్లు 95-190శాతం అప్‌సైడ్ ఉండగా, లార్జ్‌క్యాప్ షేర్లు కేవలం 22-77శాతం మాత్రమే అప్‌సైడ్‌లో ఉన్నాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది.
కోవిడ్ -19తో వ్యవస్థలో ఏర్పడిన అంతరాయాలు, రియల్ ఎస్టేట్ రంగంలో బలహీనత కారణంగా వివిధ ఎన్‌బీఎఫ్‌సీలు నష్టాలను ఎదుర్కొంటున్నాయని బ్రోకరేజ్ తెలిపింది. అధిక మూలధనం, లిక్విడిటీ, బలమైన వ్యాపార నమూనాతో పాటు మాతృసంస్థకు మార్కెట్ మంచి స్థాయి ఉండటంతో ఈ స్టాక్స్‌లు రానున్న రోజుల్లో మంచి స్థాయిలో ఉంటాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. మూడవ త్రైమాసిక ఫలితాల అనంతరం సెప్టెంబరులో ఎన్‌పీఏల గుర్తింపు తర్వాత సెక్టార్ ఎంతమేర నష్టాన్ని చవిచూచూసిందో అంచనావేయవచ్చని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment