Morgan Stanley
-
మూడేళ్లలో మూడో అతిపెద్ద ఎకానమీ..
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 2028 నాటికి అవతరిస్తుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న వినియోగ మార్కెట్‌గా భారత్ మారుతోందంటూ.. స్థూల ఆర్థిక స్థిరత్వానికితోడు, మెరుగైన మౌలిక వసతులతో ప్రపంచ ఉత్పాదకతలో భారత్ తన వాటా పెంచుకోనున్నట్టు తెలిపింది. 2023 నాటికి 3.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. 2026 నాటికి 4.7 ట్రిలియన్ డాలర్లకు విస్తరించడం ద్వారా యూఎస్, చైనా, జర్మనీ తర్వాత నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేసింది. 2028లో 5.7 ట్రిలియన్ డాలర్లతో జర్మనీని అధిగమించి భారత్ మూడో స్థానానికి చేరుతుందని పేర్కొంది. 1990లో ప్రపంచంలో 12వ స్థానంలో భారత్ ఉన్నట్టు తన నివేదికలో గుర్తు చేసింది. ఆ తర్వాత 2000 నాటికి 13వ స్థానానికి దిగిపోయిందని..తిరిగి 2020లో 9వ ర్యాంక్నకు, 2023లో 5వ స్థానానికి మెరుగుపడినట్టు వివరించింది. ప్రపంచ జీడీపీలో 3.5 శాతంగా ఉన్న భారత్ వాటా 2029 నాటికి 4.5 శాతానికి చేరుతుందని తెలిపింది. 2035 నాటికి 10.3 ట్రిలియన్ డాలర్లు.. భారత ఆర్థిక ప్రగతి విషయమై మోర్గాన్ స్టాన్లీ మూడు రకాల అంచనాలు వేసింది. ‘‘బేర్ కేసులో (ప్రతికూల పరిస్థితుల్లో) భారత ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి ఉన్న 3.65 ట్రిలియన్ డాలర్ల స్థాయి నుంచి 2035 నాటికి 6.6 ట్రిలియన్ డాలర్లకు విస్తరించొచ్చు. బేస్ కేసులో (తటస్థ పరిస్థితుల్లో) 8.8 ట్రిలియన్ డాలర్లకు.. బుల్ కేసులో (సానుకూల పరిస్థితుల్లో) 10.3 ట్రిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుంది’’అని తెలిపింది. 2025లో తలసరి ఆదాయం 2,514 డాలర్లుగా ఉంటే బేర్ కేసులో 4,247 డాలర్లకు, బేస్ కేసులో 5,683 డాలర్లకు, బుల్ కేసులో 6,706 డాలర్లకు వృద్ది చెందుతుందని అంచనా వేసింది. ‘‘అంతర్జాతీయ ఉత్పాదకతలో భారత్ వచ్చే దశాబ్ద కాలంలో తన వాటాను పెంచుకుంటుంది. జనాభాలో వృద్ధి, స్థిరమైన ప్రజాస్వామ్యం, విధానపరమైన మద్దతుతో స్థూల ఆర్థిక స్థిరత్వం, మెరుగైన మౌలిక వసతులు, పెరుగుతున్న వ్యాపార వర్గం, సామాజిక పరిస్థితుల్లో మెరుగుదల అనుకూలించనున్నాయి’’అని మోర్గాన్ స్టాన్లీ నివేదిక తెలిపింది. అతిపెద్ద వినియోగ మార్కెట్ ప్రపంచంలో టాప్ వినియోగ మార్కెట్‌గా భారత్ అవతరించనుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా. ఇంధన పరివర్తనం దిశగా భారత్ అతిపెద్ద మార్పును చూడనుందని.. జీడీపీలో రుణ నిష్పత్తి పెరుగుతోందని, అదే సమయంలో జీడీపీలో తయారీ రంగం వాటా సైతం వృద్ధి చెందుతోందని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది.. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. ‘‘ఇటీవలి వారాల్లో అధిక ఫ్రీక్వెన్సీ సంకేతాలు మిశ్రమంగా ఉన్నాయి. కానీ, కొన్ని నెలల క్రితంతో పోల్చి చూస్తే మెరుగ్గా ఉన్నాయి. ద్రవ్య, పరపతి విధాన మద్దతుకుతోడు, సేవల ఎగుమతులు పుంజుకోవడంతో 2024 ద్వితీయార్ధంలో మందగమనం నుంచి వృద్ధి కోలుకుంటుందని భావిస్తున్నాం’’అని పేర్కొంది. 2024–25లో జీడీపీ 6.3 శాతం మేర, 2025–26లో 6.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. రానున్న రోజుల్లో వినియోగం అన్ని విభాగాల్లోనూ కోలుకోవచ్చంటూ.. ఆదాయ పన్ను తగ్గింపు పట్టణ డిమాండ్‌కు ప్రేరణనిస్తుందని, గ్రామీణ వినియోగానికి మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. 2024–25లో ద్రవ్యోల్బణం 4.9 శాతంగా, 2025–26లో 4.3 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. సేవల ఎగుమతుల్లో ఉన్న వృద్ధి వస్తు ఎగుమతుల్లో ఉన్న బలహీనతను కొంత వరకు భర్తీ చేస్తుందని తెలిపింది. అంతర్జాతీయంగా మందగమనం లేదా సమీప కాలంలో మాంద్యం వంటి పరిస్థితులు తలెత్తితే అవి తమ అంచనాలకు సవాలు కాగలవని.. అలాంటి పరిస్థితుల్లో 2025లో భారత ఈక్విటీలు గరిష్ట స్థాయిలకు దూరంగా ఉండొచ్చని పేర్కొంది. -
పెళ్లికి వెనుకాడుతున్న పడతులు!
‘పెళ్లిపై నమ్మకం లేదు.పెళ్లి చేసుకోవడమంటే స్వేచ్ఛను కోల్పోవడమే. అలా బతకడం నాకే మాత్రం ఇష్టం లేదు. ఒక్కసారి వైవాహిక జీవితంలోకి ప్రవేశించిన తర్వాత సొంత ఆలోచనలకు, అభిప్రాయాలకు, ఆకాంక్షలకు, చివరకు అభిరుచులకూ అవకాశం ఉండదు. ఇలా ఎంతోమందిని చూశాను. అందుకే పెళ్లికి దూరంగా ఉన్నాను..’ ఇది 35 ఏళ్ల విజయ (పేరు మార్చాం) బలమైన అభిప్రాయం. ఆమె ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ (Moinabad) సమీపంలోని ఓ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. అక్కడే ఒక మహిళల హాస్టల్లో ఉంటున్నారు.చాలామంది మహిళలు ఇటీవలి కాలంలో వివాహ బంధం, దాంపత్య జీవితంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పాతికేళ్ల వయసు దాటినా పెళ్లి (Marriage) ఊసు ఎత్తేందుకు కూడా ఇష్టపడని వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విజయలా స్వతంత్రంగా జీవించాలనుకునే వారితో పాటు వృత్తిపరమైన బాధ్యతల వల్ల కొందరు, మంచి కెరీర్ (Career) కోసం ప్రయత్నించే క్రమంలో ఒత్తిడికి గురవుతూ మరికొందరు వివాహం విషయంలో నిరాసక్తతను ప్రదర్శిస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ అధ్యయనం వెల్లడించింది. తమ జీవితాన్ని తమకు ఇష్టమైన విధంగా గడపడానికి వీలవుతుందనే భావనే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది.ఒకవేళ పెళ్లి చేసుకున్నా పిల్లల్ని కనేందుకు ఇష్టపడటం లేదని తెలిపింది. భారత్ (India) సహా ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థ సర్వే నిర్వహించింది. 2030 నాటికి ఒంటరి మహిళల సంఖ్య 45 శాతానికి పెరగవచ్చునని అంచనా వేసింది. వీరిలో 25–44 ఏళ్ల లోపు వయసున్న వారే అత్యధిక సంఖ్యలో ఉంటారని పేర్కొంది. వ్యక్తిగత అభివృద్ధి, తాము ఎంచుకున్న రంగాల్లో పురోగతికే యువతులు ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించింది. మరోవైపు కుటుంబ బాధ్యతలూ ఇందుకు కారణమవుతున్నాయి.బాధ్యతలు పంచుకుంటూ.. కెరీర్ కోసంకష్టపడుతూ.. సాధారణంగా అమ్మాయిలు 25 ఏళ్లలోపే పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ ఇటీవలి కాలంలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా కుటుంబ బాధ్యతలను పంచుకుంటున్నారు. తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటున్నారు. తోబుట్టువుల కెరీర్ కోసం కష్టపడుతున్నారు. అదే సమయంలో జీవితంలో స్వేచ్చను కోరుకుంటున్నారు. అల్వాల్‌కు చెందిన సుజాత (పేరు మార్చాం.) ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. ‘పదేళ్ల క్రితమే నాన్న చనిపోయారు. అప్పటి నుంచి తమ్ముడు, చెల్లి, అమ్మను చూసుకోవడం నా వంతైంది. చూస్తూండగానే 40 ఏళ్లు వచ్చేశాయి..’అంటూ నవ్వేశారు ఆమె.సుజాత లాగానే చాలామంది అమ్మాయిలు కుటుంబ బాధ్యతల నేపథ్యంలో వయసు దాటి పోయిందనే భావనతో వివాహ బంధానికి దూరమవుతున్నారు. కానీ కొంతమంది యువతుల్లో స్వేచ్ఛాయుత జీవితంపై ఆసక్తి పెరుగుతోంది. వారి ఆలోచనలు, అభిప్రాయాలు వైవాహిక జీవితానికి వ్యతిరేకంగా ఉంటున్నాయి. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన శైలజ.. ‘పెళ్లి కంటే ఆర్ధిక స్వాతంత్య్రం ఎంతో ముఖ్యం. అది లేకుండా పెళ్లి చేసుకోవడం ఆత్మహత్యాసదృశం..’అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. ఆమె ప్రస్తుతం ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్నారు. ఇప్పటికే 28 ఏళ్లు దాటాయి. అయినా ఒంటరిగానే ఉండిపోవాలని కోరుకుంటున్నారు. పిల్లలూ భారమేనా..! పెళ్లి చేసుకున్నప్పటికీ మరికొంతమంది మహిళలు పిల్లల్ని కనేందుకు వెనుకాడుతున్నారు. ‘ఈ రోజుల్లో పిల్లల్ని కనడం. పెంచడం ఎంతో ఖరీదైన విషయం. ఆ విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది..’ అని ఒక యువతి వ్యాఖ్యానించారు. నేను, నా స్వేచ్ఛ అనే భావన బలపడుతోంది దేశంలో అలాగే హైదరాబాద్‌లోనూ ఇలాంటి ట్రెండ్ కనిపిస్తోంది. మా అమ్మాయి పెళ్లిచేసుకోవడం లేదంటూ ఇటీవల కొందరు తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చినపుడు.. పెళ్లి ఎందుకు, ఆ అవసరం ఏమిటీ, పిల్లలు ఇతర బాదరాబందీ అంతా ఎందుకంటూ అమ్మాయిలు ప్రశ్నిస్తున్నారు. పెళ్లితో తమ స్వేచ్ఛ, కెరీర్ దెబ్బతింటుందని, ఒకవేళ వివాహానికి ఒప్పుకున్నా పిల్లలు వద్దనుకునే వాళ్లనే చేసుకోడానికి సిద్ధమని చెబుతున్నారు. కొంతమంది చదువు, ఉద్యోగాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటూ స్వేచ్ఛా జీవితం గడిపాక.. ఇక కుటుంబం, సంతానం వంటివి వద్దనుకుంటున్నారు. మనం అనే ఉమ్మడి భావన పోయి నేను, నా స్వేచ్ఛ, నా కెరీర్ అనే భావన బలపడుతోంది. తల్లిదండ్రుల కోరిక మేరకు ఇలాంటి వారికి మేం కౌన్సెలింగ్ ఇస్తున్నాం. – పి.జ్యోతిరాజా, సైకాలజిస్ట్, శ్రీదీప్తి కౌన్సెలింగ్ సెంటర్నచ్చిన వరుడు, మెచ్చిన ఉద్యోగం కోసంఎదురుచూస్తూ.. మరోవైపు నచ్చిన వరుడు లభించకపోవడం కూడా కొంతమంది అమ్మాయిలకు శాపంగా మారుతోంది. ప్రత్యేకంగా కొన్ని సామాజిక వర్గాలకు చెందిన యవతులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మంచి విద్యార్హతలు, ఉద్యోగం, కెరీర్ అవకాశాలు, వ్యక్తిత్వం, అభిరుచులు తమకు నచ్చినట్లు ఉంటేనే పెళ్లికి అంగీకరిస్తున్నారు. అలాంటి అబ్బాయి లభించే వరకు నిరీక్షిస్తున్నారు. మరోవైపు విదేశీ సంబంధాల కోసం ఎదురుచూసే కుటుంబాల్లోనూ అమ్మాయిలకు పెళ్లిళ్లు ఆలస్యంగా జరుగుతున్నాయి. కొంతమంది సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు ఏళ్ల తరబడి చదువుతున్నారు. లక్ష్యాన్ని సాధించేవరకు పెళ్లికి దూరంగా ఉండాలనే భావనతో ఐదారేళ్లకు పైగా గడిపేస్తున్నారు.అప్పటికే పెళ్లి వయసు దాటిపోతోంది.చదవండి: ఏం చేయాలో అర్థం కావడం లేదు.. పారిపోవాలనిపిస్తోంది!భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు!వచ్చే 10, 15 ఏళ్లలో వివాహ బంధానికి సంబంధించి మరింత ఎక్కువగా సవాళ్లు ఎదురుకావొచ్చు. ప్రస్తుతం 20 నుంచి 25 ఏళ్లు పైబడిన యువతుల్లో కొంతమంది పెళ్లి అంటే విముఖత వ్యక్తం చేస్తున్నారు. క్రమంగా ఈ ఆలోచన విధానం అమ్మాయిల్లో పెరుగుతోంది. వివాహం అనగానే బాధ్యతల్లో చిక్కుకుపోవడం, పిల్లల్ని కని వారి సంరక్షణలో, సంసార బాధ్యతల్లో మునిగిపోవడం అని అనుకుంటున్నారు. తమ స్వేచ్ఛకు, స్వతంత్రతకు భంగం వాటిల్లుతుందని భయపడుతున్నారు. ఉన్నత చదువులు చదివి, సమాజంలో మంచి ఉద్యోగం చేస్తున్నా.. మళ్లీ కుటుంబపరంగా ఎన్నో బరువు బాధ్యతలు మోయాల్సి రావడం కూడా ఇందుకు కారణమవుతోంది. అమ్మాయిల్లో పెళ్లి, పిల్లల పట్ల విముఖత పెరగడానికి పురుషుల మనస్తత్వాల్లో మార్పు రాకపోవడం కూడా ఒక కారణంగా భావించవచ్చు. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్, యూ అండ్ మీ కౌన్సెలింగ్ సెంటర్ -
ప్రైవేట్ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త!
ప్రైవేట్ బ్యాంకుల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు బంపరాఫర్. భారత్‌లో దేశీయ బ్యాంకుల నుంచి అంతర్జాతీయ గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థల వరకు మహిళా ఉద్యోగుల్ని ఆకర్షిస్తూ, వారిని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా వారికి ప్రోత్సహకాలు అందిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా ప్రైవేట్ బ్యాంకుల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు భారీ ఊరట కలగనుంది. భారత్‌లోని హెచ్ఎస్బీసీ సంస్థలో ఆరేళ్లకు మించి పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా బోనస్‌లు అందిస్తుంది. గర్భిణీ సిబ్బంది క్యాబ్ రైడ్లకు అయ్యే ఖర్చును మోర్గాన్ స్టాన్లీ భరిస్తుంది. సిటీ గ్రూప్ సంస్థ కొత్తగా తల్లైన మహిళ ఉద్యోగుల మెటర్నిటీ లీవులు పూర్తయితే మరో ఏడాది పాటు ఇంటి వద్ద నుంచి పనిచేసేలా వెసలు బాటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక నియామకం వరల్డ్ బ్యాంక్ జెండర్ డేటా పోర్టల్ ప్రకారం, భారత్ ఇప్పటికే పూర్తి వేతనంతో మహిళ ఉద్యోగులకు కనీసం 26 వారాల ప్రసూతి సెలవును తప్పనిసరి చేసింది. 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే సదరు బ్యాంకులు మహిళలకు డేకేర్ (0-5 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల సంరక్షణ చూసుకునే బాధ్యత) సౌకర్యాల్ని కల్పించేలా చట్టాల్ని తెచ్చింది.రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో ప్రతిభావంతులైన మహిళల్ని ఎంపిక చేసుకోవడం, ఇప్పటికే బ్యాంకుల్లో పనిచేస్తున్న వారి నిర్ధిష్ట అవసరాల్ని హెచ్ఎస్బీసీ తీరుస్తుంది. దీంతో పాటు మహిళా ఉద్యోగుల 0 నుంచి 6 వయస్సున్న పిల్లల సంరక్షణ కోసం నెలావారీ 216 డాలర్లను అందిస్తుంది. మెటర్నిటీ లీవులు పూర్తయితే మోర్గాన్ స్టాన్లీ ముంబై, బెంగుళూరులలో గర్భిణీ ఉద్యోగులు డెలివరీ ముందు చివరి మూడునెలల్లో ట్రైన్లు, బస్సుల్లో ప్రయాణించే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు ఆ కారణంతో ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ ఇండియా హెచ్ఆర్ హెడ్ రజత్ మాథుర్ అన్నారు. కాబట్టే మెటర్నిటీ లీవులు పూర్తయిన మహిళా ఉద్యోగులు తిరిగి సంస్థల్లో పనిచేసేలా కోచింగ్‌తో పాటు శిక్షణ ఇస్తుంది. తండ్రులకు కనీసం 16 వారాల వరకు సెలవులను అందిస్తుంది. భారతీయ చట్టం ప్రకారం.. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పెటర్నిటీ సెలవుల్ని అందిస్తుంది. అయితే ప్రైవేట్ రంగానికి కనీస నిబంధనలు లేవు. అమెరికాలో అంతంతమాతమ్రే ఇక్కడ ఇలా ఉంటే అమెరికాలో మాత్రం నిబంధనలు అందుకు విరుద్దంగా ఉన్నాయి. మహిళ ఉద్యోగులు సెలవుల్లో ఉంటే వారికి పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించాలనే చట్టపరమైన నిబంధనలు లేవు. కాబట్టే జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో, బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్లు తల్లదండ్రులిద్దరికి 16 వారాల సెలవును అందిస్తుంది. గోల్డ్‌మాన్ సాచెస్ గ్రూప్ తల్లిదండ్రులకు 20 వారాల మెటర్నిటీ లీవ్‌ల్ని అందిస్తుంది. -
విమాన ప్రయాణికులకు శుభవార్త
-
దశాబ్దంలోనే భారత్‌లో ఎంతో మార్పు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం కింద భారత్ పదేళ్లలోనే ఎంతో మార్పు చెందినట్టు అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. అంతర్జాతీయంగా భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుందని, ఆసియా, ప్రపంచ వృద్ధిని నడిపించే కీలక దేశంగా అవతరించినట్టు తన తాజా నివేదికలో ప్రస్తావించింది. (రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే!) భారత్ తన సామర్థ్యాల మేరకు ఫలితాలను చూపించలేదని, ఈక్విటీ వ్యాల్యూషన్లు గరిష్టాల్లో ఉన్నాయన్న విమర్శలను తోసిపుచ్చింది. ఈ తరహా దృక్పథం గత తొమ్మిదేళ్లలో చేపట్టిన వ్యవస్థీకృత సంస్కరణలను విస్మరించడమేన పేర్కొంది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రెండో ఆర్థిక వ్యవస్థకు తోడు, గత 25 ఏళ్లలో గొప్ప పనితీరు చూపిన స్టాక్ మార్కెట్‌ను నిదర్శనాలుగా ప్రస్తావించింది. 2013తో పోలిస్తే ఇప్పుడున్న భారత్ భిన్నమైనదిగా పేర్కొంది. (సెబీ షాక్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ రిజిస్ట్రేషన్ రద్దు) ఇవీ మార్పులు..: 2014లో ప్రధానిగా మోదీ కొలువుదీరిన తర్వాత చోటు చేసుకున్న పది పెద్ద మార్పులను మోర్గాన్ స్టాన్లీ ప్రస్తావించింది. పోటీ దేశాల స్థాయిలో కార్పొరేటు పన్నును తగ్గింపు, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెంచడం అతిపెద్ద సంస్కరణలుగా పేర్కొంది. జీఎస్టీ కింద పన్నుల ఆదాయం క్రమంగా పెరుగుతుండడాన్ని ప్రస్తావించింది. అలాగే, జీడీపీలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతుండం ఆర్థిక వ్యవస్థ మరింత క్రమబద్ధీకరణ చెందుతుందనడానికి నిదర్శంగా పేర్కొంది. ఎగుమతుల్లో భారత్ వాటా రెట్టింపై 2031 నాటికి 4.5%కి చేరుకుంటుందని అంచనా వేసింది. తలసరి ఆదాయంలో వృద్ధి ప్రస్తుతం భారత్‌లో తలసరి ఆదాయం 2,200 డాలర్లుగా (రూ.1,80,400) ఉంటే, 2032 నాటికి 5,200 డాలర్లకు (రూ.4,26,400) పెరుగుతుందని మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో పేర్కొంది. ఇది బారత్‌లో వినియోగ పరంగా పెద్ద మార్పునకు కారణమవుతుందని అంచనా వేసింది. మరిన్ని బిజినెస్వార్తలు,ఎకానమీ గురించిన వార్తల కోసం చదవండి సాక్షిబిజినెస్ -
1600 మందికి ఉద్వాసన పలికిన మరో దిగ్గజ సంస్థ
శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళన నేపథ్యంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ కూడా ఉద్యోగుల తీసివేతకే మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 2 శాతం లేదా దాదాపు 1,600 మంది ఉద్యోగుల తొలగించినట్టు తెలుస్తోంది. (వాట్సాప్ అవతార్ వచ్చేసింది..మీరూ కస్టమైజ్ చేసుకోండి ఇలా!) కొంతమందిని తొలగించబోతున్నామన్న మోర్గాన్ స్టాన్లీ సీఈవో జేమ్స్ గోర్డాన్ ఇటీవల వ్యాఖ్యలను ఉటింకిస్తూ సీఎన్‌బీసీ మీడియా నివేదించింది. మోర్గాన్ స్టాన్లీ ఇటీవలి సంవత్సరాల్లో చాలామంది ఉద్యోగులను నియమించుకుంది. 2020 మొదటి త్రైమాసికం నుండి ఈ ఏడాది మూడో త్రైమాసికం వరకు కంపెనీ ఉద్యోగుల సంఖ్య 34 శాతం పెరిగింది. కంపెనీలో దాదాపు 81,567 మంది ఉద్యోగులున్నారు. ఈ నివేదికపై గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇంకా వ్యాఖ్యానించలేదు. మోర్గాన్ స్టాన్లీ ప్రత్యర్థి గోల్డ్‌మన్ సాచ్స్ ,సిటీ గ్రూప్, బార్క్లేస్ సహా ఇతర పెట్టుబడి సంస్థలు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. తాజాగా ఈ జాబితాలో మోర్గాన్ స్టాన్లీ చేరింది. కాగా ఆర్థిక మాంద్యం, ఆదాయా కక్షీణత నేపథ్యంలో ట్విటర్, అమెజాన్, మెటా, పెప్సీకో లాంటి అనేక ఇతర కంపెనీలు ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. -
మోర్గాన్ స్టాన్లీ కోత..భారత్ జీడీపీ వృద్ధి అంచనా కుదింపు!
ముంబై: భారత్ 2022–23 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుకు అమెరికన్ బ్రోకరేజ్ సంస్థ– మోర్గాన్ స్టాన్లీ 40 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) కోత పెట్టింది. దీనితో ఈ రేటు 7.6 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గింది. 2023–24 వృద్ధి అంచనాలను సైతం 0.30 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.7 శాతం నుంచి 6.4 శాతానికి దిగివచ్చింది. ప్రపంచ వృద్ధి మందగమన ధోరణి భారత్ ఎకానమీపై ప్రతికూల ప్రభావం చూపనుందని మోర్గాన్ స్టాన్లీ తన తాజా నివేదికలో విశ్లేషించింది. ఇక 2022 డిసెంబర్‌తో ముగిసే సంవత్సరంలో ప్రపంచ వృద్ధి 1.5 శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. 2021లో ఈ రేటు 4.7 శాతం. కాగా ఆర్బీఐ రెపోరేటు ప్రస్తుత 4.9% నుంచి 2023 ఆగస్టు నాటికి 6.5%కి చేరుతుందని మోర్గాన్ స్టాన్లీ విశ్లేషించింది. -
స్థూల ఆర్థిక అంశాల విషయంలో జాగ్రత్త!
ముంబై: భారత వృద్ది రేటు అంచనాలను 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాలకు గాను 30 బేసిస్ పాయింట్ల మేర మోర్గాన్ స్టాన్లీ తగ్గించింది. స్థూల ఆర్థిక అంశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం మరింత పెరిగిపోవచ్చంటూ హెచ్చరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.6 శాతం వృద్ధి రేటును నమోదు చేయవచ్చని పేర్కొంది. గతంలో ఈ అంచనా 7.9 శాతంగా ఈ సంస్థ ప్రకటించింది. 2023–24లో వృద్ధి రేటు 6.7 శాతానికి క్షీణిస్తుందని తెలిసింది. గత అంచనా 7 శాతంగా ఉంది. అంతర్జాతీయ వృద్ధి నిదానించడం, అధిక కమోడిటీల ధరలు, అంతర్జాతీయ క్యాపిటల్ మార్కెట్లలో రిస్క్‌తీసుకునే ధోరణి తగ్గడం భారత్ వృద్ధి రేటు క్షీణతకు రిస్క్‌లుగా పేర్కొంది. ‘‘అధిక ద్రవ్యోల్బణం, బలహీన వినియోగ డిమాండ్, ఆర్థిక పరిస్థితులు కఠినతరం కావడం (రేట్ల పెంపు) అన్నవి వ్యాపార సెంటిమెంట్‌పై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. ఇవి మూలధన రికవరీని ఆలస్యం చేయవచ్చు’’అని మోర్గాన్ స్టాన్లీ తాజాగా విడుదల చేసి నివేదికలో పేర్కొంది. సరఫరా వైపు ప్రభుత్వం తీసుకునే చర్యల మద్దతు, వ్యాపార కార్యకాలపాలను పూర్తి స్థాయిలో అనుమతించడం అన్నవి ఈ రిస్క్‌ల ప్రభావాన్ని తగ్గించొచ్చని అభిప్రాయపడింది. రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 2022–23కు 6.5 శాతం, కరెంటు ఖాతా లోటు పదేళ్ల గరిష్ట స్థాయి 3.3 శాతానికి చేరుకోవచ్చని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. -
చమురు, బొగ్గు ధరల భారం
ముంబై: అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు, బొగ్గు ధరలు భారత్‌కు సవాలుగా మారనున్నట్లు ఫారిన్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ గురువారంనాటి తన తాజా నివేదికలో విశ్లేషించింది. ఇప్పటికే ద్రవ్యోల్బణం, వృద్ధి సవాళ్లు పొంచిఉన్న భారత్‌కు కీలక కమోడిటీల ధరలు పెరగడం ప్రతికూలాంశమని వివరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► చమురు ధరలు వార్షికంగా 14 శాతం పెరిగి బేరల్‌కు 84 డాలర్లకు చేరాయి. ఇక బొగ్గు ధర మెట్రిక్ టన్నుకు 15 శాతం ఎగసి 200 డాలర్లకు చేరింది. ఇంధన ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుదల భయాలు నెలకొన్నాయి. దీనితో వృద్ధి మందగించే అవకాశం ఉంది. ఆయా పరిస్థితులు ద్రవ్య పరపతి విధానం కఠినతరం కావడానికి దారితీయవచ్చు. ► 10 శాతం చమురు ధర పెరిగితే ఆ ప్రభావం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణంపై 0.40 శాతం మేర ఉంటుంది. చమురు ప్రధాన దిగుమతి దేశమైన భారత్‌పై ఈ బిల్లు భారంగా మారుతుంది. 10 శాతం చమురు దరల పెరుగుదల ప్రభావం కరెంట్ అకౌంట్‌పై (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిధుల మధ్య నికర వ్యత్యాసం) 0.30 శాతం (జీడీపీ విలువతో పోల్చి) ప్రభావం చూపుతుంది. ► తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత్ నుంచి ఎగుమతులు మరింత పెరగాల్సి ఉంటుంది. 78కి రూపాయి: యూబీఎస్ స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ సేవల దిగ్గజం యూబీఎస్ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల వల్ల భారత్ కరంట్ అకౌంట్ లోటు 14 బిలియన్ డాలర్లక చేరుతుందని (జీడీపీలో 0.5 శాతం) పేర్కొంది. చమురు ధర 100 డాలర్లు తాకితే, క్యాడ్ 3 శాతం వరకూ పెరుగుతుందని యూబీఎస్ అంచనా వేసింది. దీనితో రూపాయి డాలర్ మారకంలో 78కి చేరే అవకాశం ఉంటుందని అంచనావేసింది. అయితే క్యాడ్ సమస్య భారత్‌కు తాత్కాలికంగానే ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. భారత్ ఉన్న భారీ విదేశీ మారకపు నిల్వలు (600 బిలియన్ డాలర్లకుపైగా) ఈ నష్టాన్ని కట్టడి చేయడానికి దోహదపడతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదే విధంగా 2022 మార్చి నాటికి క్రూడ్ ధర బేరల్‌కు 68 బిలియన్ డాలర్లకు దిగివస్తుందన్న అంచనాలనూ వెలువరించింది. బొగ్గు కొరత వల్ల విద్యుత్ ఉత్పత్తికి, సెమికండక్టర్ చిప్స్ వల్ల ఆటో రంగానికి స్వల్ప కాలంలో తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఎదురుకానున్నాయని విశ్లేíÙంచింది. వ్యవస్థలో అదనపు లిక్విడిటీని వెనక్కు తీసుకోవడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రివర్స్ రెపో రేటును (ఆర్బీఐ వద్ద ఉంచిన తమ అదనపు నిధులకుగాను బ్యాంకులు పొందే వడ్డీరేటు– ప్రస్తుతం 3.35 శాతం) పెంచే అవకాశం ఉందని సంస్థ అంచనావేసింది. ఈ రేటును 0.15 శాతం–0.20 శాతం శ్రేణిలో పెంచే వీలుందని పేర్కొంది. వచ్చే ఏడాది డిసెంబర్, ఫిబ్రవరి ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. -
మిడ్‌క్యాప్ ఎన్బీఎఫ్సీ షేర్లు ఆకర్షణీయం: మోర్గాన్ స్టాన్లీ
రాబోయే రెండేళ్ళలో మధ్యతరహా ఎన్బీఎఫ్సీ షేర్లలో రిస్క్‌తో పోలిస్తే రివార్డ్ రేషియో ఎక్కువగా ఉంటుందని మోర్గాన్ స్లాన్లీ తెలిపింది. ఎన్బీఎఫ్సీ సెక్టార్‌కు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్సియల్, శ్రీరాం ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, శ్రీరామ్ సిటి యూనియన్ ఫైనాన్స్, ఆదిత్యా బిర్లా క్యాపిటల్, పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు తమ టాప్పిక్లుగా ఉన్నట్లు బ్రోకరేజ్ పేర్కోంది. వచ్చే ఏడాదిలోగా షేర్లు 30-45శాతం రాబడులను ఇస్తాయని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తుంది. డీప్ వాల్యూ, మిస్-ప్రైస్డ్ స్టాకుల కోసం అన్వేషిస్తున్న ఇన్వెస్టర్లకు ఈ స్టాకులను సిఫార్సులు చేస్తున్నట్లు మోర్గాన్‌స్టాన్లీ తెలిపింది. రెండేళ్ల పాటు సెక్టార్ సంబంధిత సవాళ్లను ఎదుర్కోన్న ఈ షేర్ల వాల్యూయేషన్లు ఇప్పుడు జీవితకాల కనిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్నట్లు బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ప్రీ-కోవిడ్19కి ముందు 2020 గరిష్టాలతో పోలిస్తే మిడ్‌క్యాప్ షేర్లు 95-190శాతం అప్‌సైడ్ ఉండగా, లార్జ్‌క్యాప్ షేర్లు కేవలం 22-77శాతం మాత్రమే అప్‌సైడ్‌లో ఉన్నాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. కోవిడ్ -19తో వ్యవస్థలో ఏర్పడిన అంతరాయాలు, రియల్ ఎస్టేట్ రంగంలో బలహీనత కారణంగా వివిధ ఎన్బీఎఫ్సీలు నష్టాలను ఎదుర్కొంటున్నాయని బ్రోకరేజ్ తెలిపింది. అధిక మూలధనం, లిక్విడిటీ, బలమైన వ్యాపార నమూనాతో పాటు మాతృసంస్థకు మార్కెట్ మంచి స్థాయి ఉండటంతో ఈ స్టాక్స్‌లు రానున్న రోజుల్లో మంచి స్థాయిలో ఉంటాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. మూడవ త్రైమాసిక ఫలితాల అనంతరం సెప్టెంబరులో ఎన్పీఏల గుర్తింపు తర్వాత సెక్టార్ ఎంతమేర నష్టాన్ని చవిచూచూసిందో అంచనావేయవచ్చని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. -
కరెక్షన్లో షేర్లు కొంటాం: మోర్గాన్ స్టాన్లీ
పుష్కలమైన లిక్విడిటీ, బలమైన సెంటిమెంట్ ఉన్న కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్... వర్ధమాన మార్కెట్లను అధిగమించే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ ఇన్వెస్టింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. ‘‘గత కొన్ని వారాలుగా జరుగుతున్న ర్యాలీ వల్ల కొన్ని షేర్లలో కరెక్షన్ జరిగే అవకాశం ఉన్నందున మార్కెట్ ఒడిదుడుకులు పెరిగే అవకాశం ఉంది. అలాగే కరెక్షన్ అయ్యే షేర్లను మేము కొనుగోలు చేసేందుకు ఇష్టపడతాము. అలాంటి షేర్లు వచ్చే నెలల్లో అధిక అప్‌సైడ్ ర్యాలీ చేసేందుకు అవకాశం ఉంది.’’ అని మోర్గాన్ స్లాన్టీ తన నివేదికలో తెలిపింది. మార్చి కనిష్టస్థాయి నుంచి బీఎస్ఈ ఇండెక్స్ 34శాతం లాభపడింది. అయితే ఏడాది ప్రాతిపాదికన 15శాతం క్షీణించింది. ఎంఎస్సీఐ వర్థమాన మార్కెట్ల ఇండెక్స్‌తో పోలిస్తే భారత మార్కెట్ 9.7శాతం పతనాన్ని చవిచూసింది. ఇటీవల కనిష్టస్థాయి నుంచి ఇండియా స్టాక్ మార్కెట్ ఓలటాలిటి తగ్గింది. అయితే ఇప్పటికీ ఓలటాలిటీ గరిష్టంలోనే ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈ మార్చిలో 8.4బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్న తర్వాత మే, జూన్ నెలల్లో దేశీయ ఈక్విటీలను తిరిగి కొనుగోలు చేస్తున్నారు. -
2 ట్రేడింగ్ సెషన్‌ల్లోనే 50శాతం ర్యాలీ
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్(ఐబీహెచ్ఎఫ్) షేరు కేవలం 2ట్రేడింగ్ సెషన్‌ల్లోనే 50శాతం పెరిగింది. గడచిన రెండురోజుల్లో ఇన్వెస్ట్మెంట్ సంస్థ మోర్గాన్ స్టాన్లీతో సహా అనేక సంస్థలు బల్క్‌డీల్స్ ద్వారా ఐబీహెచ్ఎఫ్ లో వాటాను కొనుగోలు చేసినట్లు ఎక్చ్సేంజ్ గణాంకాలు చెబుతున్నాయి. ఎన్ఎస్ఈలో గణాంకాల ప్రకారం సింగపూర్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ గతవారంలో చివరి ట్రేడింగ్ సెషన్లో ఐబీహెచ్‌ఎఫ్‌కి చెందిన ప్రతి ఈక్విటీ షేరును రూ.184.76 చొప్పున మొత్తం 45.22లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. ఈ డీల్ మొత్తం విలువ సుమారు రూ.83.50కోట్లుగా ఉంది. ఈ ఒప్పందం తరువాత, ఇండియా బుల్స్ హౌసింగ్ షేరు శుక్రవారం 31 శాతం, సోమవారం 19శాతం చొప్పును మొత్తం 50శాతం లాభపడింది. కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా వేతనాల కోత, ఉద్యోగాలు పోయే పరిస్థితితో నెలకొనడంతో ఈఎంఐలు డిఫాల్ట్ అవుతాయనే భయాలతో ఇన్వెసర్లు ఈ షేర్ల అమ్మకాలు మొగ్గుచూపారు. ఫలితంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ షేరు 23శాతం క్షీణించింది. కరోనా మహమ్మారి ప్రభావం రుణగ్రహీత జీవనోపాధిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, తద్వారా ఇది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల అసెట్ క్వాలిటీలను దెబ్బతీస్తుందని దేశీయ రేటింగ్ సంస్థ ఇక్రా అభిప్రాయపడింది. సోమవారం మార్కెట్ ముగిసే సరికి ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 19శాతం లాభంతో రూ.242.20 వద్ద స్థిరపడింది. -
రిలయన్స్ షేరుపై బ్రోకరేజ్‌లకు ఎందుకంత మోజు..?
దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఈ ఏడాది మార్చి కనిష్టస్థాయి నుంచి షేరు ఏకంగా 80శాతం పెరిగింది. కేవలం 3నెలల్లోనే 10 విదేశీ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు రిలయన్స్ జియోలో దాదాపు రూ.1.04లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం షేరు ర్యాలీకి కారణమైనట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వారంలో మంగళవారం ఇంట్రాడే షేరు రూ.1647 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. ఈ షేరు ఇంత స్థాయిలో ర్యాలీ చేసినప్పటికీ.., రానున్న రోజుల్లో మరింత లాభపడేందుకు అవకాశాలున్నట్లు బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలైన మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మెన్ శాక్స్, సీఎల్‌ఎస్‌ఏలు రిలయన్స్ షేరుపై ఇప్పటికీ బుల్లిష్ వైఖరిని కలిగి ఉన్నాయి. ఈ షేరుపై ఆయా సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి... మోర్గాన్ స్టాన్లీ: ఆస్తుల అమ్మకాలు, ఇంధన విభాగంలో క్యాష్ ఫ్లోలు తిరిగి పుంజుకోవడం, రిటైల్ అమ్మకాలు పెరగడం, టెలికాం యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పెరగడం తదితర కారణాలతో షేరు రానున్న రోజుల్లో మరింత ర్యాలీ చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో తెలిపింది. ‘‘ ఏడాది తర్వాత ప్రైస్-టు-ఎర్నింగ్ (పీ/ఈ), ప్రైస్-టు-బుక్ (పీ/బీ)లు ఇప్పుడు సైకిల్ లెవల్లో గరిష్టస్థాయి వద్ద ఉన్నాయి. అయితే ఈక్విటీపై రిటర్న్(ఆర్ఓఈ), వృద్ధి ఆదాయాలను తన సహచర కంపెనీలు(పీర్స్)తో పోలిస్తే అధికంగా ఉన్నాయి.’’ అని మోర్గాన్ స్టాన్లీ ఈక్విటి విశ్లేషకుడు మయాంక్ మహేశ్వర్ తెలిపారు. మోర్గాన్ స్లాన్టీ ఈ షేరుపై ఓవర్‌వెయిట్ రేటింగ్‌ను కొనసాగించడంతో పాటు షేరు టార్గెట్ ధరను రూ.1801కి పెంచింది. గోల్డ్‌మెన్ శాక్స్: బ్రోకరేజ్ అంచనాల ప్రకారం.... ఆఫ్‌లైన్ గ్రాసరీ స్టోర్ విస్తరణ-ఆధారిత మార్కెట్ వాటా, ఆన్లైన్ గ్రాసరీ మార్కెట్ విస్తరణతో రిలయన్స్ గ్రాసరీ రీటైల్ స్థూల వ్యాపారణ విలువ ఆర్థిక సంవత్సరం 2029 నాటికి 83బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. అంతేకాకుండా, రిటైల్ వ్యాపారం ఎబిడిటా ఎఫ్వై 20-29 మధ్య 5.6 రెట్ల వృద్ధిని సాధిస్తుందని బ్రోకరేజ్ సంస్థ ఆశిస్తోంది. గోల్డ్‌మెన్ శాక్స్ ''బై'' రేటింగ్ కేటాయించడంతో పాటు పాటు షేరు టార్గెట్ ధరను రూ.1755గా నిర్ణయించింది సీఎల్ఎస్ఏ: ఈ-కామర్స్ రంగంలో విజయవంతం కావడం, ఇన్విట్ టవర్ల వాటా అమ్మకం, జియో ఫ్లాట్‌ఫామ్‌లో మరింత వాటా విక్రయం, అరామ్కో ఒప్పందం తదితదర అంశాలు రిలయన్స్ షేరు తదుపరి ర్యాలీని నడిపిస్తాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఇటీవల ఫేస్‌బుక్‌తో ఒప్పందం జియో మార్ట్‌కు కలిసొస్తుంది. ఫేస్బుక్ అనుబంధ సంస్థ వాట్సప్ ద్వారా వినియోగదారులతో సత్సంబంధం పెంచుకోవడం, నిరంతరం వారికి అందుబాటులో ఉండటంతో వ్యాపార అభివృద్ధికి మరింత కలిసొస్తుందని సీఎల్ఎస్ఏ తెలిపింది. సీఎల్‌ఎస్‌ఈ బ్రోకరేజ్ సంస్థ సైతం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరుపై బుల్లిష్ వైఖరిని కలిగి ఉంది. -
రాబోయేది భారీ బుల్ మార్కెట్!
కరోనా సంక్షోభ భయాలు సద్దుమణిగి, ప్రభుత్వ ప్యాకేజీలు ఫలితాలు ఇవ్వడం ఆరంభమైతే ప్రపంచ వ్యాప్తంగా భారీ బుల్ మార్కెట్ వస్తుందని మోర్గాన్‌స్టాన్లీ ఇండియా ఎండీ రిధమ్ దేశాయ్ అభిప్రాయపడ్డారు. కోవిడ్19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ బలమైన ఉద్దీపనలు తీసుకువచ్చాయని, ఇంత బలమైన పత్రిస్పందన ఎప్పుడూ చూడలేదని చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం సైతం ప్రపంచ దేశాలు ఇంత పకడ్బందీగా, సమన్వయపూరకంగా స్పందించడం జరగలేదన్నారు. 2008 సంక్షోభం తర్వాత ఇచ్చిన ఉద్దీపనలకన్నా ప్రస్తుత ఉద్దీపనలు ఎన్నో రెట్లు ఎక్కువన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు చక్కబడితే ప్రపంచవ్యాప్తంగా ఈ ఉద్దీపనలు మార్కెట్లకు ఇచ్చే ఉత్తేజం ఆరంభమవుతుందని, దీంతో అన్ని దేశాల్లో భారీ బుల్ ర్యాలీ వస్తుందని అంచనా వేశారు. ఎకానమీలో, సమాజంలో భరోసా తిరిగివస్తే ఈ ప్యాకేజీలన్నీ అద్భుత ఫలితాలిస్తాయన్నారు. ఇందుకోసం ముందుగా కరోనాకు వాక్సిన్ కానీ, మందుకానీ కనుక్కోవాల్సిఉంటుందన్నారు. ఒక్కసారి ఈ వైరస్‌కు విరుగుడు వచ్చిందంటే అసెట్ మార్కెట్లలోకి భారీగా పెట్టుబడులు వస్తాయన్నారు. అయితే విరుగుడు వచ్చేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమన్నారు. లాక్డౌన్ ముగిసిపోవడమే అతిపెద్ద ప్యాకేజీ ఎకానమీకి అన్నింటి కన్నా పెద్ద ఉద్దీపన లాక్డౌన్ ముగిసిపోయి కార్యకలాపాలు ఆరంభం కావడమేనని దేశాయ్ చెప్పారు. భారత ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ సామర్ధ్యాధారితంగా ఉందన్నారు. బహుశ ప్రభుత్వం వద్ద ఇంకో ప్యాకేజీ రెడీగా ఉండిఉండొచ్చని లేదంటే అటు వృద్ధి ఉద్దీపనతో పాటు ఇటు స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్యాకేజీని ప్రకటించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ నుంచి మనకు తెలియకుండానే క్రమంగా బయటపడుతున్నామని చెప్పారు. వచ్చే రెండు మూడువారాల్లో ఎకానమీలో చురుకుదనం తెస్తే క్రమంగా అంతా సర్దుకుంటుదన్నారు. ప్రస్తుత, రాబోయే త్రైమాసికాలకు కంపెనీల ఫలితాలు, ప్రదర్శనపై పెద్దగా ఫోకస్ చేయాల్సిన పనిలేదని, ఆపైన మాత్రం అంతా బాగుంటుందని అంచనా వేశారు. మక్కువ మారుతోంది ప్రస్తుతం ఇన్వెస్టర్ల ఫోకస్ ఫైనాన్షియల్స్ నుంచి ఫార్మా, టెలికం, డిజిటల్ రంగాల షేర్లవైపు మరలుతోందని దేశాయ్ చెప్పారు. ప్రతి బుల్మార్కెట్లో కొత్త రంగాలు ప్రకాశిస్తుంటాయని గుర్తు చేశారు. 90ల్లో ఎనర్జీ, ఆ తర్వాత కన్జూమర్, టెక్నాలజీ రంగాల హవా నడిచిందని, ఆపైన బీఎఫ్ఎస్ఐ రంగంపై ఫోకస్ పెరిగిందని చెప్పారు. గత ఫిబ్రవరిలో నిఫ్టీలో ఫైనాన్షియల్స్ మార్కెట్ క్యాప్ 30 శాతాన్ని చేరిందని, దీంతో ఈ రంగం టాప్‌అవుట్ చెందినట్లు భావించవచ్చని చెప్పారు. అందువల్ల రాబోయే బుల్మార్కెట్లో కన్జూమర్, హెల్త్‌కేర్, టెలికం రంగాల్లాంటి షేర్ల హవా ఉంటుందన్నారు. మార్చి 24న మార్కెట్ బాటమ్ అవుట్ అయినట్లు అభిప్రాయపడ్డారు. అంతమాత్రాన ఫైనాన్షియల్ స్టాక్స్‌లో అసలు ర్యాలీలే ఉండవని భావించకూడదని, కాకపోతే గతంలోలాగా మార్కెట్‌ను ముందుండి నడిపించలేవని మాత్రమే భావించాలని చెప్పారు. ఈ రంగంలో టాప్ స్టాక్స్‌ను నమ్మవచ్చన్నారు. కరోనా కారణంగా దేశీయ కస్టమర్ల వైఖరిలో మార్పురావచ్చనే ఊహలను ఆయన కొట్టిపారేశారు. లాక్డౌన్ పూర్తయ్యాక టైమ్‌గ్యాప్‌తో అన్ని రంగాలు గాడిన పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదీ ఏమైనా కరోనా కారక సంక్షోభం 6-12 నెలలకు మించి ఉండకపోవచ్చని దేశాయ్ చెప్పారు. -
మాది దీర్ఘకాలిక ఒప్పందం.. దీటుగా నిలబడతాం!
సాక్షి, ముంబై : వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్ నుంచి వైదొలగుతుందా? అంటూ మార్కెట్లో వర్గాల్లో తీవ్ర సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈ వార్తలను ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తీవ్రంగా ఖండించారు. ప్రతికూల ప్రభావం కారణంగా ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ భారతీయ మార్కెట్లలో పెట్టుబడులు ఉపసంహరించుకోవచ్చన్న మోర్గాన్ స్టాన్లీ నివేదికను ఆయన తిరస్కరించారు. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ సీఈవో ఉద్యోగులకు అంతర్గత ఈ మెయిల్ సమాచారాన్ని అందించారు. మోర్గాన్ స్టాన్లీ రిపోర్టు అవాస్తమని భవిష్యత్తులో తేలిపోతుందని, భారతదేశంలో ఈ కామర్స్ వ్యాపారానికి వాల్‌మార్ట్ కట్టుబడి వుందని స్పష్టం చేశారు. భారతీయ ఈ కామర్స్ బిజినెస్‌లో ఫ్లిప్‌కార్ట్ ముందు వరుసలో నిలుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వాల్‌మార్ట్ ఒప్పందం దీర్గకాలిక దృష్టితో చేసుకున్నదని, ఈ నేపథ్యంలో స్వల్పకాలిక అడ్డంకులు సంస్థను ప్రభావితం చేయలేవని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కామర్స్ మార్కెట్లో అతిపెద్ద డీల్ గా నిలిచిన వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్డ్ ఒప్పందానికి సంబంధించిన మోర్గాన్ స్టాన్లీ సంచలన అంచనాలను వెల్లడించింది. దేశీయంగా ఈ-కామర్స్ కంపెనీలకు సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నూతన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో వాల్‌మార్ట్ ఈ డీల్ నుంచి వైదొలగనుంచి పేర్కొంది. 2017లో చైనాలో అమెజాన్‌కు దాపురించిన పరిస్థితే దేశీయంగా వాల్‌మార్ట్‌కు రానుందని నివేదించింది. అంతేకాదు ఫ్లిప్‌కార్ట్ నష్టాలు 20నుంచి 25శాతం దాకా పెరగొచ్చనీ, దీంతో వాల్‌మార్ట్ పలాయనం చిత్తగించక తప్పదని వ్యాఖ్యానించింది. కాగా ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్.. 16 బిలియన్ డాలర్లతో 77శాతం వాటాను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
షాకింగ్ : ఏడాది చివర్లో ఆర్బీఐ వడ్డింపు షురూ
సాక్షి, న్యూఢిల్లీ : అందుబాటులో ఉన్న వడ్డీ రేట్ల ఊరట ఇక ఎంతోకాలం నిలవదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంవత్సరాంతం నుంచి వడ్డీరేట్ల పెంపును ఆర్బీఐ ప్రారంభిస్తుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ నివేదిక వెల్లడించింది. 2018 నాలుగో త్రైమాసికం నుంచి వడ్డీరేట్ల పెంపు సీజన్ ప్రారంభమవుతుందని పేర్కొంది. ద్రవ్యోల్బణం ఆర్బీఐ అంచనాల పరిధిలోనే ఉండే అవకాశం ఉండటంతో పాటు ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం వేగవంతమవడంతో వడ్డీరేట్ల పెంపు దిశగా ఆర్బీఐ చర్యలు చేపట్టవచ్చని మోర్గాన్ స్టాన్లీ పరిశోధన నివేదిక పేర్కొంది. గత కొద్ది త్రైమాసికాల నుంచి ధరల పెరుగుదలను కారణంగా చూపుతూ ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగా ఉంచుతూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో వడ్డీరేట్లు అందుబాటులో ఉంటూ ఈఎంఐలు భారం కాకుండా ఉన్నాయి. అయితే వడ్డీరేట్ల పెంపు శకం ప్రారంభమైతే రుణ కస్టమర్ల ఈఎంఐ భారం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఆర్బీఐ త్వరలోనే వడ్డీరేట్ల పెంపునకు పూనుకుంటుందని డచ్ బ్యాంక్ సైతం అంచనా వేసింది. -
అరుదైన మైలురాయికి చేరువలో మైక్రోసాఫ్ట్
సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఓ అరుదైన మైలురాయికి చేరువవుతోంది. ఈ సంస్థ త్వరలోనే మార్కెట్ విలువ పరంగా ఒక ట్రిలియన్ డాలర్ల(సుమారు రూ.65 లక్షల కోట్లు) కంపెనీగా అవతరించబోతున్నట్టు ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ షేర్లు కూడా సోమవారం ఏడు శాతానికి పైగా పెరిగాయని టెక్నాలజీ వెబ్సైట్ గీక్‌వైర్ రిపోర్టు చేసింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ 722 బిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 47లక్షల కోట్లు)గా ఉంది. ఏడాది కాలంలోనే ఈ విలువ ట్రిలియన్ డాలర్లకు పెరిగే అవకాశాలున్నాయని మోర్గాన్ స్టాన్లీ భావిస్తోంది. అయితే ఆపిల్, ఆల్ఫాబెట్, అమెజాన్ కంపెనీల్లో ఒకటి తొలి ట్రిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించబోతుందని పలువురు టెక్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోర్గాన్ స్టాన్లీ అంచనాలు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఆపిల్ మార్కెట్ విలువ 876 బిలియన్ డాలర్లు కాగ, అమెజాన్ 753 బిలియన్ డాలర్లుగా, ఆల్ఫాబెట్ 731 బిలియన్ డాలర్లుగా ఉంది. క్లౌడ్ టెక్నాలజీ, మెరుగైన కస్టమర్ బేస్, మార్జిన్స్, అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ వంటివి మైక్రోసాఫ్ట్ మార్కెట్ పెరగడానికి దోహదపడతాయని మోర్గాన్ స్టాన్లీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
చైనాకు ఇన్వెస్టర్ల ఝలక్
బ్లూమ్‌బర్గ్ : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఒన్ బెల్ట్ ఒన్ రోడ్‌కు (ఓబీఓఆర్) ఇన్వెస్టర్లు ఝలక్ ఇచ్చారు. ప్రధానంగా ఒన్ బెల్ట్ ఒన్ రోడ్ అత్యంత తీవ్రవాద ప్రభావిత దేశాల్లో నిర్మిస్తుండడంతో అక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు, బ్యాంకులు సైతం వెనకంజ వేస్తున్నాయి. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లోని 68 దేశాలను కలుపుతూ.. ఎకనమిక్ కారిడార్ నిర్మించాలని చైనా ప్రతిపాదించింది. చైనా ప్రతిపాదిత 68 దేశాల్లో 27 దేశాలకు బిలో ఇన్వెస్టిమెంట్ గ్రేడ్ (సాధారణ పెట్టుబడి)ను అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఇచ్చాయి. అలాగే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, ఇరాక్ వంటి 14 దేశాలకు సున్నా రేటింగ్‌ను ఇచ్చాయి. మరికొన్ని దేశాలు అత్యంత అవినీతికరమైనవిగా రేటింగ్ సంస్థలు ప్రకటించాయి. ఒన్ బెల్ట్ ఒన్ రోడ్ కింద రహదారులు, రైల్వేలు, పోర్టులు, పవర్ గ్రిడ్లు, నిర్మించాలని.. ఇందుకు 1.2 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు అవసరమవుతాయని మోర్గాన్ స్టాన్లీ సంస్థ అంచనా వేసింది. ఇదిలా ఉండగా.. 2050 నాటికి భూమి సరిహద్దుల వరకూ ఒన్ బెల్ట్ ఒన్ రోడ్ ద్వారా విస్తరిస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ఒబీఓఆర్‌ను తమ దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. రేటింగ్ సంస్థలు పేర్కొన్న ఫైనాన్షియల్ రిస్క్ గురించి చైనాలోని నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్, వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందించేందుకు నిరాకరించాయి. -
భారత మార్కెట్లలో లిక్విడిటీ సూపర్ సైకిల్
డ్రీమ్ రన్ మొదలైంది: మోర్గాన్ స్టాన్లీ న్యూఢిల్లీ: భారత ఈక్విటీ మార్కెట్లు బలమైన నిధుల ప్రవాహం మధ్యలో ఉన్నాయని, డ్రీమ్ రన్ ఇప్పుడే మొదలైందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. దీన్ని దేశీయంగా నిధుల ప్రవాహ సూపర్ సైకిల్ (దీర్ఘకాలం)గా అభివర్ణించింది. వరుసగా 17వ నెల అయిన ఆగస్ట్‌లో నిధులు సానుకూలంగానే ఉన్నట్టు తెలిపింది. దేశీయ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 3.9 బిలియన్ డాలర్ల (25,000 కోట్లు) నిధుల్ని స్వీకరించినట్టు, ఒక నెలలో ఈ స్థాయి నిధులు రావడం ఇదే మొదటిసారని, ఈటీఎఫ్‌లను కూడా కలిపితే ఇది 4.1 బిలియన్ డాలర్లు ఉంటుందని తన నివేదికలో మోర్గాన్ స్టాన్లీ వివరించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు దేశీయ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి 18.6 బిలియన్ డాలర్ల (రూ.1.19 లక్షల కోట్లు) నిధులు వచ్చాయని, ఈటీఎఫ్ లోకి వచ్చిన నిధులు 2.6 బిలియన్ డాలర్లు (16,640 కోట్లు)గా ఉన్నట్టు తెలిపింది. ‘‘ఆగస్ట్ చివరి నాటికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తుల విలువ 111 బిలియన్ డాలర్లు (రూ.7.10 లక్షల కోట్లు)గా ఉంది. మార్కెట్ క్యాప్ 5.3 శాతానికి పెరిగింది. 2000 తర్వాత ఇదే గరిష్ట స్థాయి. 3.2 శాతం స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్ట్ నెలకు సంబంధించి 3.2 శాతంగా ఉండొచ్చని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. ఆహారం, నూనెల ధరలు పెరగడంతో ఈ మేరకు అంచనా వేసింది. జూలైలో ఇది 2.4 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే, టోకు ద్రవ్యోల్బణం సైతం ఆగస్ట్ నెలలో 2.9 శాతానికి పెరుగుతుందని మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో అంచనా వేసింది. దేశ కరెంట్ ఖాతా లోటు ఏప్రిల్–జూన్ క్వార్టర్లో 11.2 బలియన్ డాలర్లకు విస్తరిస్తుందని ఈ సంస్థ పేర్కొంది. అయినప్పటికీ కరెంటు ఖాతా లోటు ఆర్బీఐకి అనుకూలమైన జోన్లోనే కొనసాగుతుందని తెలిపింది. అధిక నూనె ధరలు, అననుకూలమైన బేస్ ప్రభావంతో ఎగుమతులు, దిగుమతుల వృద్ధి వార్షికంగా చూస్తే మోస్తరుగా ఉంటుందని పేర్కొంది. -
మరింత పెరగనున్న ధరలు
♦ ఆగస్టులో 3 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం ♦ నివేదికలో మోర్గాన్ స్టాన్లీ అంచనాలు న్యూఢిల్లీ: రానున్న నెలల్లో టోకు, రిటైల్ ద్రవ్యోల్బణాలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఒక నివేదికలో పేర్కొంది. దీంతో.. రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధానాన్ని మరింత సడలించే అవకాశాలు తక్కువేనని వివరించింది. జూలైలో పెరిగిన టోకు, రిటైల్ ద్రవ్యోల్బణాలు.. ఇకపై అదే ధోరణిలో కొనసాగుతాయని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. జూన్‌లో 0.90 శాతంగా ఉన్న టోకు ద్రవ్యోల్బణ పెరుగుదల.. ప్రధానంగా కూరగాయలు తదితర ఆహారోత్పత్తుల రేట్లు ఎగియడంతో జూలైలో 1.88 శాతంగా నమోదైంది. పంచదార, కన్ఫెక్షనరీ ఉత్పత్తులు, పొగాకు తదితర ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం 2.36 శాతానికి ఎగిసింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 3.0 శాతానికి, టోకు ద్రవ్యోల్బణం 2.1 శాతానికి పెరగొచ్చని పేర్కొంది. అంతర్జాతీయంగా కమోడిటీల రేట్లు, ఇటు దేశీయంగా ఆహారపదార్ధాల రేట్లు పెరుగుతుండటం ఇందుకు కారణమని అధ్యయన నివేదికలో వివరించింది. ద్రవ్యోల్బణం క్రమంగా లకి‡్ష్యత 4 శాతం స్థాయి దిశగా వెడుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ .. కీలక పాలసీ రేట్లను మరింతగా తగ్గించే అవకాశాలు ఉండకపోవచ్చని పేర్కొంది. -
వచ్చే నెలలో మోతెక్కనున్న ధరలు
న్యూఢిల్లీ : ధరలు వచ్చే నెలల్లో మరింత మోతకెక్కనున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. జూలై నెలలో ఒక్కసారిగా పైకి ఎగిసిన రిటైల్, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం, వచ్చే నెలల్లో మరింత పెరుగనున్నాయని గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ అంచనావేస్తోంది. ఈ అప్‌ట్రెండ్ ఇలానే కొనసాగనుందని పేర్కొంది. దీంతో గత పాలసీ రివ్యూలో చేపట్టిన ద్రవ్య సడలింపు సన్నగిల్లనుందని చెప్పింది. జూలై నెలలో సీపీఐ, డబ్ల్యూపీఐ పైకి ఎగిసిందని, ఇది మరింత పెరిగే అవకాశాలున్నాయంటూ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. 2017 జూన్‌లో 0.90 శాతంగా ఉన్న హోల్ సేల్ ద్రవ్యోల్బణం, ఒక్కసారిగా జూలై నెలలో 1.88 శాతానికి పెరిగింది. ఫుడ్ ఆర్టికల్స్ ముఖ్యంగా కూరగాయలు పెరుగుదల దీనికి దోహదం చేసింది. అదేవిధంగా రిటైల్ ద్రవ్యోల్బణం కూడా ఈ నెలలో 2.36 శాతానికి జంప్ చేసింది. చక్కెర, పాన్, టుబాకో, మత్తుపదార్థాల ధరలు ఎగియడంతో, ఈ ద్రవ్యోల్బణం కూడా పెరగడం ప్రారంభమైంది. ఆగస్టు నెలలో సీపీఐ, డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణాలు 3.0 శాతం, 2.1 శాతానికి పెరుగుతాయని అంచనావేస్తున్నట్టు, ఆహార ధరలు, గ్లోబల్ కమోడిటీ ధరల్లో ప్రస్తుత ట్రెండ్లతో ఈ పెరుగుదలను చూడొచ్చని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గిందని కీలక రెపో రేటులో 25 బేసిస్పాయింట్లు కోత పెట్టిన ఆర్బీఐ, మరోసారి రేటు కోతను చేపట్టకపోవచ్చని కూడా మోర్గాన్ స్టాన్లీ చెబుతోంది. ఆక్టోబర్ సమావేశంలో రేట్లను యథాతథంగా ఉంచుతూ వెయిట్ అండ్ వాచ్ పాలసీని ఎంపీసీ అవలంభిస్తుందని తెలిపింది. ఒకవేళ రేట్లను తగ్గించాలంటే, ద్రవ్యోల్బణ ఒత్తిడులు మరింత తగ్గాలని పేర్కొంది. -
ఎస్బీఐ వడ్డీ మార్జిన్ 0.14 శాతం పెరగొచ్చు
ముంబై: సేవింగ్ అకౌంట్ డిపాజిట్‌పై వడ్డీరేటు తగ్గింపు వల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 14 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర పెరిగే అవకాశం కనబడుతోందని ఆంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణా సంస్థ– మోర్గాన్ స్టాన్లీ మంగళవారం తన తాజా నివేదికలో అంచనావేసింది. ఇతర బ్యాంకులూ ఎస్బీఐ బాటను అనుసరించే అవకాశం ఉందనీ, దీనివల్ల నికర వడ్డీ మార్జిన్లు 0.05 శాతం నుంచి 0.15 శాతం శ్రేణిలో పెరిగే వీలుందని నివేదిక విశ్లేషించింది. ఆరేళ్లలో మొట్టమొదటిసారి తన పొదుపు ఖాతాలపై లభించే వడ్డీరేటును ఎస్బీఐ అరశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 3.5 శాతానికి తగ్గింది. -
ఐదేళ్లలో నిఫ్టీ @30,000
♦ మోర్గాన్ స్టాన్లీ అంచనా ♦ నిఫ్టీ ఎర్నింగ్స్ వచ్చే ఐదేళ్లలో 20 శాతం వృద్ధి ♦ దీర్ఘకాలంలో సూచీలు పైపైకే.... న్యూఢిల్లీ: నిఫ్టీ ఇంకా 10,000 పాయింట్లను కూడా క్రాస్ చేయలేదు. భవిష్యత్తులో సూచీలు ఏ స్థాయికి చేరతాయన్న అంచనాల విషయంలో ఇన్వెస్టర్లలో ఎన్నో అంచనాలు, సందేహాలు ఉండి ఉండొచ్చు. కానీ, ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ మాత్రం నిఫ్టీ వచ్చే ఐదేళ్లలో 30,000 పాయింట్ల స్థాయికి చేరుతుందని అంటోంది. సమీప కాలంలో అంటే ఈ నెలలోనే సెన్సెక్స్ 34,000 వరకూ పెరగొచ్చంటోంది. ‘‘2003 నుంచి 2007 మధ్య ఏం జరిగిందో గుర్తు చేసుకోండి. నిఫ్టీ ఎర్నింగ్స్ (కాంపౌండెడ్) 39 శాతంగా ఉంది. అప్పుడు సూచీ ఏడు రెట్లు పెరిగింది. వచ్చే ఐదేళ్ల కాలంలో ఎర్నింగ్స్ 20 శాతం (కాంపౌండెడ్)గా ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. ఇది సూచీని 30,000కు తీసుకెళుతుంది. ఇవి మోస్తరు అంచనాలే’’ అని మోర్గాన్ స్టాన్లీ ఎండీ రిధమ్ దేశాయ్ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంత భారీ అంచనాల వెనుక... జీడీపీలో లాభాల వాటా జీవిత కాల కనిష్ట స్థాయిలో ఉండడమే ఈ అంచనాల వెనుకనున్న పెద్ద కారణంగా దేశాయ్ తెలిపారు. ఇది అక్కడే స్థిరంగా ఉండకుండా తిరిగి కోలుకుంటుందన్న విషయాన్ని మర్చిపోరాదన్నారు. వినియోగం పుంజుకోవడం, వేతనాలు పెరుగుదల, ఎగుమతుల్లో వృద్ధి, ప్రభుత్వ వ్యయాలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో ఉండడం ఇవన్నీ కూడా జీడీపీలో లాభాల నిష్పత్తిని పెంచేవే. కాకపోతే ప్రైవేటు మూలధన వ్యయం ఒక్కటే చప్పగా ఉంది. అయితే, ఇది కూడా వచ్చే ఏడాదిలో రికవరీ అవుతుంది. మార్కెట్ ఏకధాటిగా ముందుకు వెళ్లదు కానీ, ఇది బాగా స్థిరపడిన బుల్‌మార్కెట్ అని చెప్పొచ్చు. దీర్ఘకాలానికి ఇది మరింత పైకి వెళుతుందని ఆశించొచ్చు’’ అని దేశాయ్ వివరించారు. అధిక వ్యాల్యూషన్స్వల్ల 3–6 నెలల కాలానికి కొన్ని సమస్యలు ఎదురుకావచ్చని, దీర్ఘకాల ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. వ్యాల్యూషన్స్ భారీగా ఏం లేవు... ‘‘వ్యాల్యూషన్స్పై ఆందోళన లేదు. స్మాల్, మిడ్ క్యాప్ విభాగంలోనే వ్యాల్యూషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆదాయాలు క్షీణించినందున పీఈ మల్టిపుల్స్ తక్కువగానే ఉన్నాయి’’ అని దేశాయ్ వివరించారు. అమెరికాతో పోలిస్తే మన మార్కెట్ల వ్యాల్యూషన్స్ కొంచెం అధికంగా, వర్ధమాన దేశాలతో పోల్చుకుంటే సగటు కంటే ఎక్కువగా ఉన్నాయని.. అధిక వృద్ధి కారణంగా ఇది సబబేనన్నారు. స్వల్ప కాలంలో కరెక్షన్ స్వల్ప కాలంలో జీఎస్టీ కారణంగా మార్కెట్లలో కరెక్షన్ చోటు చేసుకోవచ్చని దేశాయ్ పేర్కొన్నారు. మోర్గాన్ స్టానీ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో దేశంలోని సగం మేర సంస్థలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీని అమలు చేసేందుకు ఇంకా సన్నద్ధం కాలేదని తేలిపాయి. దీంతో స్వల్ప కాలంలో వృద్ధికి విఘాతం కలుగుతుందని, మార్కెట్లు దీనికి ప్రతికూలంగా స్పందించొచ్చని... అంతర్జాతీయ అంశాలు కూడా తోడైతే నిఫ్టీ 5–10 శాతం మేర నష్టపోవచ్చని దేశాయ్ అన్నారు. ర్యాలీలో పాల్గొనే రంగాలు... ఆర్థిక సేవలకు చెందిన కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు, బ్యాంకులు), ఆ తర్వాత వినియోగంపై ఆధారపడే కంపెనీలు బుల్ ర్యాలీని ముందుకు తీసుకెళ్లే వాటిలో ఉంటాయని దేశాయ్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో 20+ వయసులో ఉన్నవారు ఎక్కువ మంది రుణాలు తీసుకుంటున్నారని, దీంతో రుణాలకు డిమాండ్ ఉంటుందన్నారు. తలసరి ఆదాయం పెరుగుతోందని, ఆహారేతర వినియోగ డిమాండ్ కు ఊతమిస్తుందన్నారు. ప్రభుత్వ బ్యాంకులు మార్కెట్ వాటాను మరింత కోల్పోతాయని, ఈ షేర్లు ట్రేడింగ్ కోసమేగానీ పెట్టుబడుల కోసం కాదని అభిప్రాయపడ్డారు. -
టాటా మోటార్స్‌లో నేడు ఏం జరుగబోతుంది?
ముంబాయి : టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్ధాంతరంగా బయటికి గెంటివేయబడ్డ సైరస్ మిస్త్రీకి కష్టకాలం వెన్నంటే ఉన్నట్టు కనిపిస్తోంది. గ్రూప్‌లోని ఒక్కొక్క కంపెనీ మిస్త్రీని చైర్మన్‌గానే కాక, డైరెక్టర్‌గాను పీకేస్తున్న సంగతి తెలిసిందే. అసాధారణ సర్వసభ్య సమావేశాలు ఏర్పాటుచేసి మరీ డైరెక్టర్‌గా ఆయన్ను తొలగించేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశీయ ఆటో దిగ్గజం ఉన్న టాటా మోటార్స్ మిస్త్రీని తొలగించడానికి డిసెంబర్ 22న షేర్‌హోల్డర్స్ మీటింగ్ నిర్వహించబోతుంది. ఈ మీటింగ్‌లో మిస్త్రీకి వ్యతిరేకంగా ఓటింగ్‌లో పైచేయి సాధించడానికి రహస్యంగా షేర్లను కొనుగోలుచేయాలని టాటా సన్స్ భావిస్తోంది. దీనికోసం నేడు ఓ భారీ బ్లాక్డీల్ను టాటా సన్స్ నిర్వహించబోతుందట. ఓ రహస్య క్లయింట్ కోసం విదేశీ బ్రోకరేజ్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ 5 కోట్ల షేర్లను, సోమవారం ముగింపు ధర రూ.454.4కు 10 శాతం ప్రీమియంగా కొనుగోలు చేస్తోందని తెలుస్తోంది. ఈ డీల్ మొత్తం విలువ రూ.2,500కోట్లగా ఉండబోతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇది టాటా మోటార్స్ ఈక్విటీ క్యాపిటల్‌లో 1.73 శాతం. ఈ లావాదేవీ మంగళవారమే జరిగే అవకాశముందని తెలుస్తోంది. మిస్త్రీకి వ్యతిరేకంగా ఓటింగ్ లో నెగ్గడానికి కంపెనీలో 33 శాతం కంటే ఎక్కువగా తమ హోల్డింగ్‌ను పెంచుకోవాలని టాటా సన్స్ భావిస్తోందని, ఈ మేరకే వ్యూహాలు రచిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం టాటా మోటార్స్‌లో టాటా సన్స్ 33 శాతం వాటా కలిగి ఉంది. ఈ అదనపు షేర్ల కొనుగోలు ద్వారా మిస్త్రీకి అనుకూలంగా ఓట్లు వేసే వారిమీద టాటా సన్స్ పైచేయి సాధించనుంది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం ఓపెన్ లెటర్ అవసరం లేకుండా ఒక ఆర్థికసంవత్సరంలో ప్రమోటర్స్ కంపెనీలో 5 శాతం మాత్రమే వాటా కొనుగోలు చేసే అవకాశముంది. చారిత్రాత్మకంగా టాటా గ్రూప్ రహస్య డీల్ ద్వారా గ్రూప్ కంపెనీలో తన వాటాను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. కాగ, టాటా సన్స్ ఆదేశాల మేరకు కంపెనీ బోర్డు నుంచి మిస్త్రీని తొలగించడానికి ఆరు దిగ్గజ కంపెనీలు ముందస్తుగా అన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. అదేవిధంగా టాటా సన్స్ నుంచి మెజార్టీ సపోర్టు పొందాలని ఆశిస్తున్నాయి. ఈ రహస్య భారీ బ్లాక్ డీల్ ద్వారా గ్రూప్ కంపెనీల భవిష్యత్తును కాపాడటానికి పేరెంట్ కంపెనీ ఏదైనా చేయగలదనే సందేశాన్ని మార్కెట్లోకి పంపనుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. -
ఏప్రిల్ నుంచి భారత్ వృద్ధి రికవరీ!
మోర్గాన్ స్టాన్లీ అంచనా న్యూఢిల్లీ: భారత్ వృద్ధి వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రికవరీ బాట పడుతుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. ఇందుకు వినియోగం, ఎగుమతులు దోహదపడతాయని పేర్కొంది. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి ప్రస్తుత ప్రతికూల ప్రభావం స్వల్పకాలమేనని అభిప్రాయపడింది. ఈ మేరకు విడుదల చేసిన ఒక నివేదికలోని ముఖ్యాంశాలు... ⇔ పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిపై డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో కనిపిస్తుంది. వృద్ధిపై దాదాపు 50 నుంచి 70 బేసిస్ పారుుంట్ల మేర (100 బేసిస్ పారుుంట్లు ఒక శాతం) ఈ ప్రభావం ఉంటుంది. ⇔ అరుుతే విసృ్తత ప్రాతిపదికన భారత్ వృద్ధికి ఢోకా లేదు. భారత్‌కు వృద్ధికి సంబంధించి మొత్తంమీద నిర్మాణాత్మక అవుట్‌లుక్‌ను మేము కొనసాగిస్తున్నాము. ⇔ స్థూల దేశీయోత్పత్తితో పోల్చితే దాదాపు 60 శాతంగా ఉన్న వినియోగ రంగం వచ్చే ఏడాది జూన్ త్రైమాసికం నుంచీ బలపడే వీలుంది. దీనికితోడు పెరిగే ప్రభుత్వ వ్యయాలు, ఎఫ్‌డీఐల ప్రభావం ఆర్థిక వ్యవస్థకు కలిసి వచ్చే వీలుంది. -
వచ్చే ఏడాది 15% రాబడి
భారత్ స్టాక్ మార్కెట్‌పై మోర్గాన్ స్టాన్లీ అంచనా ముంబై: రెండేళ్ల నుంచి తక్కువస్థారుులో రాబడులనిస్తున్న భారత్ ఈక్విటీ మార్కెట్ 2017లో రెండంకెల లాభాల్ని అందించగలదని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ఈక్విటీ విలువలు కనిష్టస్థారుుకి తగ్గడం, డీమానిటైజేషన్ ప్రభావంతో తాత్కాలికంగా ఆర్థికాభివృద్ధి క్షీణించే అవకాశాలుండటం, ప్రపంచ మార్కెట్లతో భారత్ మార్కెట్ అనుసంధానమైవుండటం వంటి అంశాలు వచ్చే ఏడాది అధిక రాబడులకు కారణాలని మోర్గాన్ స్టాన్లీ తాజాగా విడుదల చేసిన నివేదిక విశ్లేషించింది. పెద్ద నోట్లను రద్దుచేయడం జీడీపీ వృద్ధి అంచనాల్ని తగ్గిస్తుందని, దాంతో కార్పొరేట్ లాభాలు, మార్కెట్ తిరిగి పుంజుకోవడంలో రెండు త్రైమాసికాలవరకూ జాప్యం జరగవచ్చని పేర్కొంది. నివేదిక ముఖ్యాంశాలు.... ⇔ రూపారుు కరెన్సీ రూపంలో 2017లో భారత్ మార్కెట్ 15% రాబడినివ్వవచ్చు. 2015, 2016 సంవత్సరాల్లో ఈ రాబడి మైనస్ 3%. ⇔ సెన్సెక్స్ 30,000 పారుుంట్ల స్థారుుని చేరవచ్చు (50% అవకాశం). బుల్లిష్‌గా చూస్తే 39,000 పారుుంట్లకు పెరగవచ్చు (30% అవకాశం). 24,000 పారుుంట్లకు పతనం కావొచ్చు (20% అవకాశం). ⇔ 2016-17 ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ కంపెనీల లాభాలు 2.5% వృద్ధిచెందవచ్చు. 2017-18లో ఈ వృద్ధి 16%, 2018-19లో 15% వుండవచ్చు. -
వృద్ధి అంచనాలు కట్
• 7.3 శాతానికి తగ్గించిన మోర్గాన్ స్టాన్లీ • 7.1 శాతానికి కుదించిన బీవోఎఫ్ఎ • నోట్ల రద్దు ప్రభావమే కారణం ముంబై: నోట్ల రద్దు పరిణామాల నేపథ్యంలో కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్లు (బీవోఎఫ్ఎ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను కుదించారుు. పెద్ద నోట్ల రద్దు సమీప భవిష్యత్‌లో ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చంటూ వృద్ధి అంచనాలను మోర్గాన్ స్టాన్లీ.. 7.7 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. అలాగే, 2017-18 అంచనాలను కూడా 7.8 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గించిన మోర్గాన్ స్టాన్లీ.. 2018-19లో 7.9 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు కారణంగా డిసెంబర్ ఆఖరు దాకా నగదు లావాదేవీలు అస్తవ్యస్తమై, దేశీయంగా డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడగలదని తెలిపింది. నల్లధనంపై పోరు పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మూలంగా గృహస్తులు.. సమీప భవిష్యత్‌లో భారీ కొనుగోళ్లను నిలిపివేయొచ్చని, మధ్యకాలికంగా ప్రాపర్టీలపై ఇన్వెస్ట్ చేయడం తగ్గవచ్చని వివరించింది. ’మొత్తం మీద దేశం వృద్ధి బాటలోనే ఉన్నా, పెద్ద నోట్ల రద్దు పరిణామం సమీప భవిష్యత్‌లో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో వృద్ధి రికవరీ మందకొడిగా ఉండవచ్చు’ అని తెలిపింది. మరోవైపు, విదేశాల్లో డిమాండ్ మెరుగుపడి, కమోడిటీయేతర ఉత్పత్తుల సారథ్యంలో గడిచిన నాలుగు నెలలుగా ఎగుమతులు పెరుగుతుండటం సానుకూల అంశమని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. 2016లో 3 శాతంగా ఉన్న ప్రపంచ దేశాల వృద్ధి 2017లో 3.4 శాతానికి పెరగవచ్చని, భారత్ నుంచి ఎగుమతులు కూడా దీనికి తోడ్పడగలవని తెలిపింది. 2017 తొలి త్రైమాసికం అనంతరం పరిస్థితులు కాస్త చక్కబడి.. ప్రైవేట్ పెట్టుబడులు మొదలైతే 2018 నుంచి ఎకానమీ పూర్తి స్థారుులో దూసుకుపోతుందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. 30 బేసిస్ పారుుంట్లు కట్: బీవోఎఫ్ఎ డీమానిటైజేషన్ దరిమిలా 2016-17లో భారత్ వృద్ధి ముందుగా భావించిన దానికన్నా 30 బేసిస్ పారుుంట్లు తక్కువగా 7.1 శాతం స్థారుులో మాత్రమే ఉండగలదని బీవోఎఫ్‌ఏ పేర్కొంది. అటు 2017-18లో కూడా జీడీపీ వృద్ధి 30 బేసిస్ పారుుంట్ల తగ్గుదలతో 7.3 శాతంగా ఉండగలదని వివరించింది. 2016-17లో 7.4 శాతంగాను, 2017-18లో 7.6 శాతంగాను భారత్ వృద్ధి ఉండొచ్చని బీవోఎఫ్ఎ గతంలో అంచనా వేసింది. మరోవైపు డిసెంబర్ 7న జరిగే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్లను 25 బేసిస్ పారుుంట్ల మేర తగ్గించవచ్చని పేర్కొంది. అరుుతే, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) అంశం ద్వారా వడ్డీ ఆదాయమేదీ రాదు కనుక ఒకవేళ ఆర్బీఐ పాలసీ రేట్లు 25 బేసిస్ పారుుంట్లు తగ్గించినా బ్యాంకులు మాత్రం ఆ మేరకు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించలేకపోవచ్చని బీవోఎఫ్ఎ తెలిపింది. ప్రభుత్వం మార్కెట్ స్థిరీకరణ పథకం (ఎంఎస్ఎస్) బాండ్లను తగు పరిమాణంలో జారీ చేసిన తర్వాత సీఆర్ఆర్ పెంపు నిర్ణయాన్ని సమీక్షిస్తామంటూ ఆర్బీఐ వెల్లడించడం సానుకూలాంశమని బీవోఎఫ్ఎ తెలిపింది. -
అన్నీ మంచి ఆర్థిక శకునములే..!
భారత్‌పై అంతర్జాతీయ క్రెడిట్, ఫైనాన్షియల్ దిగ్గజ సంస్థల అంచనాలు న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థపై భరోసాను కల్పించే అంచనాలను అంతర్జాతీయ క్రెడిట్, ఫైనాన్షియల్ దిగ్గజ సంస్థలు వెలువరించాయి. వచ్చే కొద్ది సంవత్సరాలూ 8 శాతం వృద్ధి రేటు ఖాయమని ప్రముఖ రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ తన ‘ఏపీఏసీ ఎకనమిక్ స్నాప్సార్ట్స్-సెప్టెంబర్ 2016’ నివేదికలో పేర్కొంది. ఇక బ్యాంకింగ్ మొండిబకాయిల భారం తగ్గుతున్నట్లు మూడీస్ అభిప్రాయపడింది. ఆర్థిక సేవల ప్రపంచ దిగ్గజ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ తన తాజా నివేదికలో భారత్ క్రమ వృద్ధి బాటలో ఉందని వివరించింది. ఆయా సంస్థల అభిప్రాయాలు క్లుప్తంగా... సంస్కరణల అమలు బలం: ఎస్ అండ్ పీ భారత్‌కు పటిష్ట దేశీయ వినియోగం పెద్ద బలం. రానున్న కొద్ది సంవత్సరాలు 8% వృద్ధి సాధిస్తుందని అంచనావేస్తున్నాం. ముఖ్యంగా భారత్ చేపట్టిన వ్యవస్థాగత సంస్కరణలు కూడా వృద్ధి పథానికి బలం చేకూర్చుతున్నాయి. ఇటీవల పార్లమెంటు ఆమోదం పొందిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ఇక్కడ కీలకమైనది. ఇక ద్రవ్యోల్బణంపై ఒక కన్నేసి ఉంచాలి. ముఖ్యంగా ఆహారం, ఇంధనం, ధరల ఒడిదుడుకులు ఉండే ఇతర వస్తువుల విషయంలో ఆర్బీఐ అప్రమత్తత అవసరం. కాగా, 2016-17కు సంబంధించి ఆర్బీఐ వృద్ధి రేటు అంచనా 7.6%. క్రమ వృద్ధి: మోర్గాన్ స్టాన్లీ భారత్‌సహా పలు వర్థమాన దేశాల్లో క్రమ వృద్ధి నమోదవుతుంది. ఈ ఏడాది వర్థమాన దేశాల వృద్ధి రేటు 4 % కాగా వచ్చే ఏడాది ఆయా దేశాల వృద్ధి రేటు 4.7%గా ఉంటుందని భావిస్తున్నాం. వృద్ధి విషయంలో ప్రస్తుత స్థాయిల నుంచి భారత్, ఇండోనేషియాలు మరింత పురోగతి సాధించవచ్చు. అయితే చైనా, కొరియాల పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. బ్యాంకింగ్ బెటర్: మూడీస్ బ్యాంకింగ్ మొండిబకాయిల తీవ్రత తగ్గుతోంది. వచ్చే 12 నెలల నుంచి 18 నెలల మధ్య బ్యాంకింగ్ అవుట్‌లుక్ స్థిరపడవచ్చు. ఇటీవలి రుణ నాణ్యత గుర్తింపు (ఏక్యూఆర్), తగిన ప్రొవిజనింగ్ కేటాయింపులు కీలకమైనవి. 11 బ్యాంకుల అవుట్‌లుక్ పాజిటివ్‌గా ఉంది. మున్ముందు నికర వడ్డీ మార్జిన్లు (ఎన్ఐఎం)లు స్థిరపడే వీలుంది. అయితే రానున్న మూడేళ్లలో భారత్ ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత మూలధనం అవసరం ఉంటుంది. రేటింగ్ (ప్రస్తుతం చెత్త శ్రేణికి ఒక అంచె ఎగువన ‘బీఏఏ3’) పెంపునకు సంబంధించి సెప్టెంబర్ 21న మూడీస్ ప్రతినిధులు, ఆర్థిక వ్యవహారాల శాఖ ఉన్నత స్థాయి అధికారుల మధ్య సమావేశం వార్తల నేపథ్యంలో ఈ నివేదిక వెలువడింది. -
భారత్ ఆర్థిక వ్యవస్థపై బ్రెగ్జిట్ ఎఫెక్ట్!: మోర్గాన్ స్టాన్లీ
ముంబై: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వేరుపడిన (బ్రెగ్జిట్) ప్రభావం భారత్ ఆర్థిక వ్యవస్థపై తప్పనిసరిగా ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం- మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ఈ పరిణామం వల్ల రానున్న రెండేళ్లలో స్థూల దేశీయోత్పత్తి 60 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గే అవకాశం ఉంటుందని తన తాజా నివేదికలో పేర్కొంది. వాణిజ్య, ఫైనాన్షియల్ మార్గాల్లో ఈ ప్రతికూలత ఉంటుందనీ వివరించింది. అయితే ఇతర వర్థమాన దేశాలతో పోల్చితే భారత్‌పై ఈ ప్రభావం తక్కువగా ఉంటుందని కూడా నివేదిక అభిప్రాయపడింది. కనీస స్థాయిలో జీడీపీపై ఈ ప్రభావం 10 నుంచి 20 బేసిస్ పాయింట్లు ఉంటుందన్నది తమ అంచనాఅనీ, గరిష్ట స్థాయిలో 30 నుంచి 60 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని భావిసున్నామనీ వివరించింది (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం). దేశ ఆర్థిక వ్యవస్థ విస్తృత స్థాయిలో రికవరీ దిశగా అడుగులు వేస్తున్నట్లు కూడా నివేదిక పేర్కొంది. -
భారత్ మౌలిక రంగంపై జపాన్ దృష్టి!
ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ * ఆరు రోజుల పర్యటన ప్రారంభం టోక్యో: జపాన్ ఇన్వెస్టర్లు భారత్ మౌలిక రంగంలో పెట్టుబడులకు ఉత్సుకత చూపుతున్నారని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఆరురోజుల జపాన్ పర్యటనను ప్రారంభించారు. ఆసియాలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి భారీ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ఆయన ఈ పర్యటన ప్రారంభమైంది. తొలి రోజు పర్యటనలో జైట్లీ సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ సీఈఓ మసయోషీ సన్తో సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఇంటర్నెట్, సోలార్ ఎనర్జీలో పెట్టుబడులకు సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కసరత్తు జైట్లీతో సమావేశం అనంతరం మసయోషీ సన్ విలేకరులతో మాట్లాడుతూ, ఇంటర్నెట్ కంపెనీలు, సోలార్ విద్యుత్ రంగాల్లో పెట్టుబడులకు తమ సంస్థ కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇంధన రంగంలో ఇప్పటికే తమ కంపెనీ 20 బిలియన్ డాలర్ల పెట్టుబడితో భారతీ ఎంటర్ప్రైజెస్ అండ్ తైవాన్ ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్‌తో కలిసి ఒక జాయింట్ వెంచర్‌ను ప్రారంభించిందని వెల్లడించారు. మరో అర శాతం రేటు కోత: మోర్గాన్ స్టాన్లీ ఇదిలా ఉండగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో అరశాతం రెపోరేటు కోత నిర్ణయం తీసుకుంటుందని రేటింగ్ దిగ్గజ సంస్థ- మోర్గాన్‌స్టాన్లీ అంచనావేసింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో ప్రస్తుతం 6.5 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి 2017 నాటికి 4.7 శాతంగా ఉంటుందని, ఇది రేటు కోతకు దారితీసే ప్రధాన అంశమని తన తాజా నివేదికలో వివరించింది. -
విస్త్రుత అంశాల్లో భారత్ వృద్ధి: మోర్గాన్‌స్టాన్లీ
న్యూఢిల్లీ: భారత్ ఆర్థికాభివృద్ధి రికవరీ ఒక నిర్దిష్ట అంశంపై కాకుండా... పలు అంశాల్లో విస్తృత ప్రాతిపదికన పురోగమిస్తున్నట్లు గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ- మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ రంగ మూలధన వ్యయాలు పెరగడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో వినియోగ వృద్ధి వంటి పలు అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఆయా సానుకూల అంశాల నేపథ్యంలో దేశాభివృద్ధి రికవరీ మరింత వేగవంతం అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. విదేశీ డిమాండ్ మందగమనం, ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్ల ఒడిదుడుకులు, విధాన సంస్కరణల అమల్లో ఆలస్యం వంటి అంశాలు భారత్‌కు సవాళ్లని పేర్కొంది. ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన అంశాలను ప్రస్తావిస్తూ.... విధాన నిర్ణేతలు రుణ రేట్లు మరింత తగ్గాలనే భావిస్తున్నట్లు వివరించింది. పలు వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు బలహీనంగా ఉన్నా... కొంత స్థిరత్వాన్ని సంపాదించుకుంటున్నట్లు వివరించింది. -
భారీ ఐపీఓ బాటలో వొడాఫోన్!
రూ.13,200-16,500 కోట్ల రేంజ్లో హాంకాంగ్: భారత్‌లో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రావడానికి వొడాఫోన్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా వ్యవహరించడానికి సిటిగ్రూప్, గోల్డ్‌మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్, యూబీఎస్ గ్రూప్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి దిగ్గజ సంస్థలను వొడాఫోన్ గ్రూప్ ఆహ్వానించిందని సమాచారం. ఐపీఓ వ్యవహారాలను చూడడానికి రెండు వారాల్లో ఆరు సంస్థలను ఎంపిక చేయనున్నదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆరు సంస్థలను ఈ ఐపీఓ విలువ 200 కోట్ల డాలర్ల నుంచి 250 కోట్ల డాలర్ల(రూ.13,200 కోట్ల నుంచి రూ.16,500 కోట్లు) రేంజ్లో ఉంటుందని ఆ వర్గాల అంచనా. 2010లో ప్రభుత్వ రంగ కోల్ ఇండియా కంపెనీ ఐపీఓ ద్వారా 350 కోట్ల డాలర్లు సమీకరించింది. దాని తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ కానున్నది. విశ్లేషకుల అంచనా ప్రకారం వొడాఫోన్ ఇండియా విలువ 2,000 కోట్ల డాలర్లు(రూ.1,32,000 కోట్లు) ఉంటుందని అంచనా. -
వచ్చే ఏడాది వృద్ధి పరుగులు!
దేశీయ వినిమయమే దన్ను...మోర్గాన్ స్టాన్లీ అంచనా ముంబై: వినిమయం దన్నుగా భారత్ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2016-17) పటిష్ట వృద్ధి సాధిస్తుందన్న అంచనాలను ప్రముఖ వాల్‌స్ట్రీట్ బ్రోకరేజ్ సంస్థ- మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. సంస్థ రూపొందించిన నివేదికలో ముఖ్యాంశాలు... ♦ ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం, వాస్తవ వడ్డీరేటు సానుకూలంగా మారడం వంటి అంశాల నేపథ్యంలో వినియోగం బలపడనుంది. 1998 నుంచి 2002 వరకూ సాగిన రికవరీ సైకిల్కన్నా మంచి వృద్ధి తీరు ఉంటుంది. ♦ ముఖ్యంగా ప్రైవేటు వినియోగం భారీగా పెరగడానికి 7వ వేతన కమిషన్ అమలు ప్రధాన కారణం. కొత్త ఉపాధి సృష్టి అవకాశాలూ మెరుగుపడ్డం మరొక కారణం. ♦ వచ్చే ఆర్థిక సంవత్సరం కేంద్ర, రాష్ట్రాల ద్రవ్యలోటు 5.8% ఉంటుంది. (కేంద్రానికి సంబంధించి 3.5%, రాష్ట్రాలకు సంబంధించి 2.3%). ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) ఈ పరిమాణం 5.9 శాతం. గడచిన మూడేళ్లుగా ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసానికి సంబంధించిన ద్రవ్యలోటు తగ్గుతూ రావడం ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు దోహదపడుతోంది. ♦ కార్పొరేట్ల అధిక రుణభారం, బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిలు.. ఆర్థిక వ్యవస్థకు సవాళ్లను విసురుతున్న అంశాల్లో కీలకమైనవి. -
భారత్ వృద్ధి అంచనాలను తగ్గించిన మోర్గాన్ స్టాన్లీ
7.9% నుంచి అంచనాలు సవరించిన మోర్గాన్ స్టాన్లీ న్యూఢిల్లీ: ఈ సంవత్సరం భారత్ వృద్ధి అంచనాలను 7.9 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించినట్లు కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. పలు విదేశీ అంశాల కారణంగా రికవరీ అంతంతమాత్రంగానే ఉండటమే ఇందుకు కారణమని వివరించింది. గడిచిన రెండేళ్లుగా దేశీయంగా పరిస్థితులు మెరుగుపడుతున్నప్పటికీ.. అంతర్జాతీయ అంశాల వల్ల వృద్ధి రికవరీ వేగం ఆశించిన దానికన్నా నెమ్మదిగానే ఉందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు అంచనాలను 7.9 శాతం నుంచి 7.5 శాతానికి, 2017లో 8 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గిస్తున్నట్లు ఒక నివేదికలో వివరించింది. అంచనాలను తగ్గించినప్పటికీ.. పట్టణ ప్రాంతాల్లో వినియోగం, ప్రభుత్వం చేసే వ్యయాలు మెరుగుపడటంతో పాటు విదేశీ నిధుల రాక మొదలైనవి వృద్ధి రికవరీకి తోడ్పడగలవని పేర్కొంది. కరెంటు అకౌంటు లోటు, ద్రవ్యోల్బణం ఒక మోస్తరుగానే ఉండొచ్చని తెలిపింది. -
సంస్కరణలు నెమ్మదిస్తాయ్: మోర్గాన్ స్టాన్లీ
న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక సంస్కరణలు మందగించనున్నట్లు ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ- మోర్టాన్ స్టాన్లీ అంచనావేస్తోంది. 2016-17 బడ్జెట్ ఈ విషయాన్ని స్పష్టంగా సూచిస్తున్నట్లు పేర్కొంది. కీలక బిల్లుల విషయంలో ప్రతిపక్షం వ్యతిరేకత, విధాన నిర్ణయాల అమల్లో బ్యూరోక్రసీ అడ్డంకులు సంస్కరణలు నెమ్మదించడానికి కారణంగా విశ్లేషించింది. దేశంలో మార్కెట్ ఒడిదుడుకులకు ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఉందని పేర్కొంది. క్రూడ్ ధరల పతనం, చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలతోపాటు కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు బాగుండకపోవడం, బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య వంటి అంశాలు సైతం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నట్లు సంస్థ తాజా నివేదిక అభిప్రాయపడింది. -
ఏడాదిపాటు స్థిరంగానే భారత్ రేటింగ్
►అప్‌గ్రేడ్ కావాలంటే ద్రవ్యలోటు కట్టడి, ►సంస్కరణలపై మరిన్ని చర్యలు కీలకం ►మోర్గాన్ స్టాన్లీ రీసెర్చ్ నివేదిక... ముంబై: భారత్ సార్వభౌమ(సావరీన్) పరపతి రేటింగ్ వచ్చే ఏడాదిపాటు స్థిరంగానే కొనసాగవచ్చని అంతర్జాతీయ బ్రోకరేజి దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. అయితే, రేటింగ్ అప్‌గ్రేడ్ కావాలంటే మాత్రం ప్రభుత్వం ద్రవ్యలోటు కట్టడి, ప్రభుత్వ వ్యయాల తగ్గింపు, ఇంధన సబ్సిడీల్లో కోత, సంస్కరణల దిశగా మరిన్ని నిర్ణయాత్మక, సమయానుకూల చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. మూడీస్ ప్రస్తుతం భారత్‌కు ‘బీఏఏ3’ రేటింగ్‌ను, ఫిచ్ ‘బీబీబీ-’ రేటింగ్‌ను స్టేబుల్(స్థిరం) అవుట్‌లుక్‌తో కొనసాగిస్తున్నాయి. అయితే, ఒక్క స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ) మాత్రమే ‘బీబీబీ-’ నెగటివ్(ప్రతికూల) అవుట్‌లుక్‌తో రేటింగ్‌ను కొనసాగిస్తోంది. ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్‌లో ఇదే అతితక్కువ స్థాయి రేటింగ్. ఇంతకంటే తగ్గితే జంక్(పెట్టుబడులకు అత్యంత ప్రతికూలం) స్థాయికి పడిపోతుంది. దీనివల్ల దేశీ కంపెనీలు, ప్రభుత్వానికి విదేశీ నిధుల సమీకరణ చాలా భారంగా మారుతుంది. భారత్ రేటింగ్ రానున్న కాలంలో డౌన్‌గ్రేడ్ అయ్యేందుకు ఏజెన్సీలు ఎలాంటి నిర్దిష్ట కారకాలనూ(ట్రిగ్గర్స్) పేర్కొనలేదు. అయితే, రేటింగ్ అవుట్‌లుక్‌ను నెగటివ్ నుంచి మళ్లీ స్థిరానికి పెంచాలంటే.. వృద్ధి పుంజుకోవడం, ఆర్థిక క్రమశిక్షణ, ద్రవ్యోల్బణం తగ్గుదల చాలా ముఖ్యమని ఎస్అండ్పీ అంటోంది. రేటింగ్ ఏజెన్సీలతో ఆర్థిక శాఖ సమావేశాలు... భారత్ సావరీన్ రేటింగ్‌ను పెంచాల్సిందిగా కోరేందుకు వచ్చే 2-3 నెలల్లో అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలతో కేంద్ర ఆర్థిక శాఖ సమావేశం కానుంది. ద్రవ్యలోటు కట్టడికి(ఈ ఏడాది 4.1 శాతం లక్ష్యం) తాజా బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించిన చర్యలను ఈ సందర్భంగా వివరించనుంది. ఆగస్టు 12న ఎస్అండ్పీ, 28న జపాన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ(జేసీఆర్ఏ) ప్రతినిధులతో భేటీ కానున్నట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఫిచ్, మూడీస్ ప్రతినిధులతో సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో సమావేశాలు ఉండొచ్చని ఆయన చెప్పారు. 2016-17కల్లా ద్రవ్యలోటును 3%కి తగ్గించాలనేది కేంద్రం లక్ష్యం. -
అరబిందో ఫార్మా లాభం రూ. 501 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం అరబిందో ఫార్మా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 501 కోట్ల నికర లాభం నమోదు చేసింది. క్రితం క్యూ4లో లాభం రూ. 109 కోట్లతో పోలిస్తే ఇది సుమారు అయిదు రెట్లు అధికం. మరోవైపు, ఆదాయం రూ. 1,570 కోట్ల నుంచి రూ. 2,330 కోట్లకు పెరిగింది. షేరుకి రూ. 1.75 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. అరబిందో ఫార్మాలో షేర్లు విక్రయించిన మోర్గాన్ స్టాన్లీ కాగా అరబిందో ఫార్మాలో 17.32 లక్షల షేర్లను మోర్గాన్ స్టాన్లీ ఆసియా సింపూర్ సంస్థ ఓపెన్ మార్కెట్లో విక్రయించింది. షేరుకి రూ. 670 చొప్పున వీటి విలువ సుమారు రూ. 116 కోట్లు. 2014 మార్చి 31 నాటికి అరబిందో ఫార్మాలో మోర్గాన్ స్టాన్లీకి 46.16 లక్షల షేర్లు ఉన్నాయి. ఇవి సుమారు 1.58 శాతం వాటాకు సమానం. ఇంకో వైపు, మరో లావాదేవీలో అబు ధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అరబిందోలో 14.75 లక్షల షేర్లను దాదాపు రూ. 99 కోట్లకు కొనుగోలు చేసింది. శుక్రవారం బీఎస్ఈలో సంస్థ షేరు సుమారు 4.76 శాతం ఎగిసి రూ. 667.70 వద్ద ముగిసింది. -
సెన్సెక్స్ టార్గెట్ 30,000!
* ఏడాదిలో చేరే అవకాశం... * స్టాక్ మార్కెట్లపై నిపుణుల అంచనా.. * మోడీ-బీజేపీ అఖండ విజయంతో * ఇక సంస్కరణలకు జోష్ * అభివృద్ధిపైనే మోడీ పూర్తిగా దృష్టిసారించే చాన్స్ * ఆర్థిక వ్యవసపై విశ్వాసం పెరుగుతోందని వెల్లడి న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ తాజా ఎన్నికల్లో సాధించిన అపూర్వ విజయం దేశ ఆర్థిక వ్యవస్థకు దివ్వ ఔషధంగా పనికొస్తుందా? అవుననే అంటున్నారు నిపుణులు. ఎన్డీఏ కూటమి సాధారణ మెజారిటీ కంటే భారీగా సీట్లను కైవసం చేసుకోవడం... బీజేపీ ఒక్కటే సొంతంగా మేజిక్ ఫిగర్ 272 సీట్లను అధిగమించడంతో ఇక ఆర్థిక సంస్కరణలు కొంత పుంతలు తొక్కుతాయనే అంచనాలు సర్వత్రా బలపడుతున్నాయి. ఈ ప్రభావంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఇప్పటికే రోజుకో కొత్త ఆల్‌టైమ్ గరిష్టాలను తాకుతున్నాయి కూడా. అయితే, మోడీ నేతృత్వంలోని సుస్థిర సర్కారు తీసుకోబోయే సాహసోపేత పాలసీ చర్యలతో మార్కెట్లు మరింత పరుగు తీస్తాయనేది విశ్లేషకుల అభిప్రాయం. సంస్కరణలకు గనుక చేయూత లభిస్తే... సెన్సెక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) చివరినాటికి అంటే వచ్చే ఏడాది మార్చికల్లా 30,000 పాయిం ట్లను తాకొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంకా పెరుగుతుంది... ప్రస్తుతం సెన్సెక్స్ గత రికార్డులన్నీ చెరిపేసి 24,500 స్థాయిలో కదలాడుతోంది. మోడీ విజయం రోజున ఏకంగా 25,000 పాయింట్లనూ అధిగమించింది. అయితే, చరిత్రాత్మక గరిష్టాల వద్దే సెన్సెక్స్ ఇప్పుడు ఉన్నప్పటికీ... మరింత దూసుకెళ్లేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని యాంబిట్ క్యాపిటల్ అభిప్రాయపడింది. మార్చినాటికి తమ సెన్సెక్స్ లక్ష్యాన్ని 30,000 పాయింట్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. అంతక్రితం ఏడాది జనవరిలో ఈ లక్ష్యం 24,000 పాయింట్లుగా ఉంది. గత దశాబ్దపు కాలానికి పైగా సంకీర్ణ ప్రభుత్వాల పాలన కారణంగా ఆర్థిక, విధానపరమైన నిర్ణయాల్లో జడత్వం నెలకొందని.. ఇప్పుడు మోడీ నేతృత్వంలో 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా బీజేపీ సొంతంగా సంపూర్ణ మెజారిటీ సాధించడంతో పారిశ్రామిక రంగానికి సానుకూల పరిస్థితులు నెలకొంటాయన్న విశ్వాసాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్‌లోని మోడీ సర్కారు విజయాలు.. తాజా ఎన్నికల ప్రచారంలో అభివృద్ధిపైనే మోడీ దృష్టిసారించడం కూడా ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచుతోందంటున్నారు. ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగింది... విదేశీ సంస్థ డాయిష్ బ్యాంక్ కూడా ఈ ఏడాది డిసెంబర్‌నాటికి సెన్సెక్స్ 28,000 పాయింట్లకు, నిఫ్టీ 8,000 పాయింట్లకు ఎగబాకవచ్చని అంచనా వేసింది. ‘దేశీ, విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతోంది. పెట్టుబడులకు భారత్ మెరుగైన గమ్యంగా భావిస్తున్నారు. దీంతో మరిన్ని నిధులు ఇక్కడకు తరలనున్నాయి’ అని డీబీఎస్ బ్యాంక్ హెడ్(ట్రెజరీ-మార్కెట్స్) విజయన్ ఎస్ పేర్కొన్నారు. ఇక మోర్గాన్ స్టాన్లీ కూడా తన తాజా రీసెర్చ్ నోట్లో మార్కెట్లు మరింత దూకుడును కనబరుస్తాయని అంచనా వేసింది. వచ్చే ఏడాది జూన్‌నాటికి సెన్సెక్స్ టార్గెట్‌ను 26,300 పాయింట్లకు పెంచింది. గతంలో ఈ టార్గెట్ 21,280 పాయింట్లుగా ఉంది. ‘మోడీ సాధించిన భారీ విజయం, ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై దృష్టిపెడుతూ ఆయన సాగించిన ప్రచారంతో సంస్కరణలు, ప్రస్తుత పాలసీ చర్యలు మరింత ముందుకెళ్తాయన్న నమ్మకం పెరుగుతోంది. భారత్ ఈక్విటీ మార్కెట్‌పై మా బులిష్ ధోరణి కొనసాగుతోంది. ఇప్పుడప్పుడే లాభాలను స్వీకరించడం తొందరపాటే’ అని యూబీఎస్ తన నివేదికలో పేర్కొంది. సంస్కరణలు, సరైన ఆర్థిక మంత్రే కీలకం: డీబీఎస్ ముంబై: మోడీ ప్రభుత్వం చేపట్టబోయే సంస్కరణల ఎజెండా... ఆర్థిక మంత్రి ఎంపిక, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను కొనసాగించడం... ఈ అంశాలే మార్కెట్ సెంటిమెంట్‌ను ముందుకు నడిపిస్తాయని సింగపూర్‌కు చెందిన బ్రోకరేజి దిగ్గజం డీబీఎస్ అభిప్రాయపడింది. గతేడాది జపాన్‌లో షింజో అబే నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పుడు అక్కడి మార్కెట్లు దూసుకెళ్లిన అంశానికీ... ఇప్పుడు మోడీ భారీ విజయంతో భారత్ మార్కెట్లలో దూకుడుకు ఎలాంటి పోలికలూ లేవని కూడా డీబీఎస్ పేర్కొంది. తక్షణం మార్కెట్ల సెంటిమెంట్‌కు బూస్ట్ ఇచ్చేది సరైన ఆర్థిక మంత్రి నియామకమేనని, రాజన్‌ను కొనసాగించడం కూడా రూపాయి విలువకు మద్దతుగా నిలుస్తుందని తన రీసెర్చ్ నివేదికలో వెల్లడించింది.