సాక్షి, న్యూఢిల్లీ : అందుబాటులో ఉన్న వడ్డీ రేట్ల ఊరట ఇక ఎంతోకాలం నిలవదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంవత్సరాంతం నుంచి వడ్డీరేట్ల పెంపును ఆర్‌బీఐ ప్రారంభిస్తుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ నివేదిక వెల్లడించింది. 2018 నాలుగో త్రైమాసికం నుంచి వడ్డీరేట్ల పెంపు సీజన్ ప్రారంభమవుతుందని పేర్కొంది. ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ అంచనాల పరిధిలోనే ఉండే అవకాశం ఉండటంతో పాటు ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం వేగవంతమవడంతో వడ్డీరేట్ల పెంపు దిశగా ఆర్‌బీఐ చర్యలు చేపట్టవచ్చని మోర్గాన్ స్టాన్లీ పరిశోధన నివేదిక పేర్కొంది.
గత కొద్ది త్రైమాసికాల నుంచి ధరల పెరుగుదలను కారణంగా చూపుతూ ఆర్‌బీఐ కీలక రేట్లను యథాతథంగా ఉంచుతూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో వడ్డీరేట్లు అందుబాటులో ఉంటూ ఈఎంఐలు భారం కాకుండా ఉన్నాయి. అయితే వడ్డీరేట్ల పెంపు శకం ప్రారంభమైతే రుణ కస్టమర్ల ఈఎంఐ భారం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఆర్‌బీఐ త్వరలోనే వడ్డీరేట్ల పెంపునకు పూనుకుంటుందని డచ్ బ్యాంక్ సైతం అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment