హోమ్ లోన్ ఖాతాదారులకు ఆర్‌బీఐ శుభవార్త చెప్పింది. ఆర్‌బీఐ అమల్లోకి తేనున్న కొత్త రూల్స్‌తో ఇంటి రుణాల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఫలితంగా రూ.50 లక్షల హోమ్‌లోన్‌పై చెల్లించే వడ్డీ రూ.33 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని తెలుస్తోంది.
గత ఏడాది ఆర్‌బీఐ వరుస వడ్డీ రేట్ల పెంచుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే, వడ్డీ రేటు పెరిగినప్పుడు కస్టమర్లు నెలవారీ చెల్లించే ఈక్వేటెడ్ నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం నుంచి కాపాడేందుకు బ్యాంకులు టెన్యూర్ కాలాన్ని పెంచుతున్నాయి. అయితే, కొన్నిసార్లు ఈ పొడిగింపులు ఎక్కువ కాల కొనసాగడంతో రుణాలు చెల్లించే సమయంలో రుణ గ్రహితలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ తరుణంలో రుణగ్రహీతల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, హోమ్‌లోన్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల కొన్ని రీపేమెంట్ నిబంధనలను రూపొందించింది . ఇందులో కొత్తదనం ఏమిటి? ఇది గృహ రుణ గ్రహీతలకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది?
హోమ్‌లోన్లపై ఆర్‌బీఐ కొత్త ఆదేశాలు, చోటు చేసుకున్న మార్పులు
అయితే ఆగస్టు 18,2023న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో హౌస్‌లోన్ తీసుకున్న రుణదాతలు ఈఎంఐని పెంచడానికి లేదా లోన్ కాలపరిమితిని పొడిగించడానికి లేదా హోమ్ లోన్‌లపై వడ్డీ రేట్లను రీసెట్ చేసే సమయంలో రెండు ఆప్షన్‌లను ఉపయోగించుకోవచ్చని ఆర్‌బీఐ సూచించింది.
1) ఈఎంఐ/టెన్యూర్..ఇలా రెండింటిలో మార్పుకు దారితీసే బెంచ్‌మార్క్ రేట్లలో మార్పుల్ని, వాటి ప్రభావాల్ని బ్యాంకులు ఇంటి రుణాలు తీసుకునే రుణగ్రహీతలకు తెలియజేయాలి.
2) వడ్డీ రీసెట్ సమయంలో, రుణగ్రహీతలకు స్థిర వడ్డీ రేటుకు మారే అవకాశం ఇవ్వాలి. ఫ్లోటింగ్ నుండి ఫిక్స్‌డ్‌కి మారడానికి వర్తించే అన్ని ఛార్జీలు లోన్ ప్రాసెసింగ్ సమయంలో వెల్లడించాలి.
3) రుణ గ్రహీతలకు లోన్ కాలపరిమితిని పొడిగించడానికి లేదా ఈఎంఐలలో మెరుగుదలను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలి.
4) రుణదాతలు ఇంటి రుణంపై చెల్లించే ఈఎంఐ టెన్యూర్ కాలాన్ని పొడిగించడం వల్ల ప్రతికూల ఇబ్బందులు ఏర్పడకుండా చూసుకోవాలి. అంటే రుణాలు తీసుకునే సామర్ధ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా బ్యాంకులు రుణాలకు సంబంధించిన అంశాలపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదు.
గృహ రుణాలపై కొత్త ఆర్‌బీఐ నియమం: ఇది రుణ గ్రహితలకు ఎలా ఉపయోగపడుతుంది?
ఉదాహరణకు మీరు 2020లో 20 సంవత్సరాలకు (240 నెలలు) 7% వడ్డీతో రూ. 50 లక్షల గృహ రుణాన్ని ఈఎంఐ చెల్లించడం ప్రారంభించారు అని అనుకుందాం. లోన్ తీసుకునే సమయంలో మీ నెలవారీ ఈఎంఐ నెలకు రూ. 38,765. మొత్తం వడ్డీ రూ.43.04 లక్షలు.
మూడేళ్ల తర్వాత వడ్డీ రేటు 9.25%కి పెరిగిందనుకుందాం. కొత్త ఆర్‌బీఐ ఆదేశం ప్రకారం, బ్యాంకులు మీ ఈఎంఐ లేదా టెన్యూర్ కాలాన్ని పెంచుకోవడానికి లేదా వడ్డీ రేటును రీసెట్ చేసేటప్పుడు పైన పేర్కొన్న రెండు ఆప్షన్‌లను ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలి.
మీరు మీ 20 సంవత్సరాల లోన్‌ను మిగిలిన 17 సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేయాలనుకుంటే (3 సంవత్సరాలు గడిచినందున), మీ ఈఎంఐ నెలకు రూ. 44,978కి పెరుగుతుంది. మీరు లోన్ టెన్యూర్ ముగిసే సమయానికి మొత్తం రూ. 55.7 లక్షల వడ్డీ చెల్లించుకోవచ్చు.
అయితే, మీరు మీ లోన్ కాలపరిమితిని పెంచుకోవాలనుకుంటే మీ లోన్ ఈఎంఐ రూ. 38,765 చెల్లిస్తే.. అదే లోన్ 321 నెలలు లేదా 26 సంవత్సరాల 10 నెలల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. లోన్ గడువు ముగిసే సమయానికి మీ మొత్తం వడ్డీ చెల్లింపు రూ. 88.52 లక్షలు అవుతుంది. ఈ సందర్భంలో మీరు అధిక ఈఎంఐకి బదులుగా ఈఎంఐ టెన్యూర్ కాలాన్ని పెంచుకుంటే మీరు రూ. 33 లక్షల అదనపు వడ్డీ చెల్లించకుండా ఉపశమనం పొందే అవకాశం లభిస్తుంది.
మీరు హోమ్ లోన్ ఈఎంఐని పెంచాలా లేదా ఈఎంఐ చెల్లించే టెన్యూర్ కాలాన్ని పొడిగించాలా?
వడ్డీ రేటు పెరిగినప్పుడు, గృహ రుణగ్రహీత ఈఎంఐ లేదా లోన్ టెన్యూర్ కాలాన్ని ఎంపిక చేసుకోవడం మంచిదని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తున్నారు.
(Disclaimer: హోమ్‌లోన్ల గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. రుణ గ్రహితలకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు తీసుకోవాలనుకుంటున్న హోమ్‌లోన్లు, ఇతర లోన్లపై సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment