ముంబై: భారత్ 2022–23 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుకు అమెరికన్ బ్రోకరేజ్ సంస్థ– మోర్గాన్ స్టాన్లీ 40 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) కోత పెట్టింది.
దీనితో ఈ రేటు 7.6 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గింది. 2023–24 వృద్ధి అంచనాలను సైతం 0.30 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.7 శాతం నుంచి 6.4 శాతానికి దిగివచ్చింది.
ప్రపంచ వృద్ధి మందగమన ధోరణి భారత్ ఎకానమీపై ప్రతికూల ప్రభావం చూపనుందని మోర్గాన్ స్టాన్లీ తన తాజా నివేదికలో విశ్లేషించింది. ఇక 2022 డిసెంబర్‌తో ముగిసే సంవత్సరంలో ప్రపంచ వృద్ధి 1.5 శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. 2021లో ఈ రేటు 4.7 శాతం. కాగా ఆర్‌బీఐ రెపోరేటు ప్రస్తుత 4.9% నుంచి 2023 ఆగస్టు నాటికి 6.5%కి చేరుతుందని మోర్గాన్ స్టాన్లీ విశ్లేషించింది.
Comments
Please login to add a commentAdd a comment