విస్త్రుత అంశాల్లో భారత్ వృద్ధి: మోర్గాన్స్టాన్లీ
న్యూఢిల్లీ: భారత్ ఆర్థికాభివృద్ధి రికవరీ ఒక నిర్దిష్ట అంశంపై కాకుండా... పలు అంశాల్లో విస్తృత ప్రాతిపదికన పురోగమిస్తున్నట్లు గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ- మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ రంగ మూలధన వ్యయాలు పెరగడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో వినియోగ వృద్ధి వంటి పలు అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఆయా సానుకూల అంశాల నేపథ్యంలో దేశాభివృద్ధి రికవరీ మరింత వేగవంతం అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
విదేశీ డిమాండ్ మందగమనం, ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్ల ఒడిదుడుకులు, విధాన సంస్కరణల అమల్లో ఆలస్యం వంటి అంశాలు భారత్‌కు సవాళ్లని పేర్కొంది. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన అంశాలను ప్రస్తావిస్తూ.... విధాన నిర్ణేతలు రుణ రేట్లు మరింత తగ్గాలనే భావిస్తున్నట్లు వివరించింది. పలు వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు బలహీనంగా ఉన్నా... కొంత స్థిరత్వాన్ని సంపాదించుకుంటున్నట్లు వివరించింది.