భారత్ 7.6 శాతం వృద్ధి సాధిస్తుంది
ఐక్యరాజ్యసమితి నివేదిక
ఐక్యరాజ్యసమితి: రేటింగ్ సంస్థలు భారత వృద్ధి రేటును తగ్గిస్తుంటే... ఐక్యరాజ్యసమితి మాత్రం భారత జీడీపీ 7.6 శాతం స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తుందని తన నివేదికలో పేర్కొంది. వ్యవస్థీకృత సంస్కరణలతో పెట్టుబడులు తిరిగి వేగాన్ని పుంజుకోవడంతోపాటు, తయారీ రంగం పరిధి బలోపేతం అవుతుందని పేర్కొంది.
దీని వల్ల భారత ఆర్థిక రంగం 2016-17, 2017-18 సంవత్సరాల్లోనూ నిలకడగా 7.6 శాతం మేర వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్టు వార్షిక ముగింపు నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవస్థీకృత సంస్కరణలు ప్రైవేటు పెట్టుబడులకు ప్రయోజనం కలిగిస్తాయని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలం (ఏప్రిల్-జూన్)లో వృద్ధి మోస్తరుగా ఉండడానికి ఫిక్స్‌డ్ ఇన్వెస్ట్‌మెంట్ తగ్గడమే కారణమని, ఇవి పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్టు పేర్కింది.