Indias economic growth
-
భారత్ వృద్ధి రేటు.. 6 శాతం!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వృద్ధి ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో (2023–24) 6 శాతంగా ఉంటుందన్న తన అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తాజా నివేదికలో పేర్కొంది. 2024–25లో ఈ రేటు తిరిగి 6.9 శాతానికి చేరుతుందని అంచనా వేసిన రేటింగ్ దిగ్గజ సంస్థ– మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) ఎకానమీ వేగాన్ని 7 శాతంగా ఉద్ఘాటించింది. కాగా, ద్రవ్యోల్బణం కట్టడే ధ్యేయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను (ప్రస్తుతం 6.5 శాతం) మరింత పెంచే అవకాశం ఉందని కూడా రేటింగ్ దిగ్గజం అంచనా వేసింది. (ఇదీ చదవండి: జాక్ మా రిటర్న్స్: చిగురిస్తున్న కొత్త ఆశలు, షేర్లు జూమ్) ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి ఎస్అండ్పీ త్రైమాసిక ఎకనమిక్ అప్డేట్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతంకాగా, 2023–24లో ఈ రేటు 5 శాతానికి తగ్గనుంది. ► 2024–2026 మధ్య భారత్ ఎకానమీ వృద్ధి తీరు సగటున 7 శాతం. ► 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరంలలో భారత్ జీడీపీ వృద్ధి తీరు 6.9 శాతంగా ఉండనుంది. 2026–27లో 7.1%కి పెరుగుతుందని అంచనా. ► భారత్ ఎకానమీకి సాంప్రదాయకంగా ‘దేశీయ డిమాండ్’ చోదక శక్తిగా ఉంది. అయితే ఇటీవలి కాలంలో అంతర్జాతీయ ప్రతికూల ప్రభావం కొంత ఎకానమీపై కనబడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) జీడీపీ వృద్ధి రేట్లు వరుసగా 13.5 శాతం, 6.3 శాతాలుగా నమోదయ్యాయి. డిసెంబర్ త్రైమాసికంలో ఈ రేటు 4.4%కి నెమ్మదించడం గమనార్హం. ► ఆర్బీఐ రేటు పెంపునకు ప్రాతిపదిక అయిన వినియోగ ద్రవ్యోల్బణం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 5 శాతానికి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, వాతావరణ సవాళ్లుసహా పలు అడ్డంకులూ ఉన్నాయి. (రూ. 40లక్షల లోపు ఇల్లు కావాలా? అనరాక్ రిపోర్ట్ ఎలా ఉందంటే..!) అంతర్జాతీయంగా చూస్తే.. ఆసియా–పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి ఎస్అండ్పీ ఆశావాద దృక్పథాన్నే వెలువరించింది. ఈ సంవత్సరం చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉందని తెలిపింది. 2023 చైనా వృద్ధికి సంబంధించి నవంబర్‌లో వేసిన 4.8 శాతం అంచనాలను 5.5 శాతానికి పెంచింది. మార్చిలో జరిగిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ప్రకటించిన 5 శాతం అంచనాలకన్నా ఇది అధికం కావడం గమనార్హం. వినియోగం, సేవల రంగాలు ఎకానమీ పురోగతికి దోహదపడతాయని అభిప్రాయపడింది. అమెరికా, యూరోజోన్‌లో ఎకానమీలో 2023లో భారీగా మందగించవచ్చని రేటింగ్ దిగ్గజం పేర్కొంది. ఈ ఏడాది అమెరికా 0.7 శాతం, యూరోజోన్ 0.3 శాతం వృద్ధి సాధిస్తాయన్నది తమ అంచనాగా తెలిపింది. చైనా కోలుకోవడం ఆసియా–పసిఫిక్ ప్రాంతంపై అమెరికా, యూరప్‌లోని మందగమన ప్రభావాన్ని పూర్తిగా భర్తీ చేయబోదని పేర్కొన్న ఎస్అండ్పీ, ఇది కొంత ఉపశమనాన్ని మాత్రం కలిగిస్తుందని అంచనావేసింది. -
2017–18లో వృద్ధి 7.4 శాతం: ఇండ్–రా
న్యూఢిల్లీ: భారత్ ఆర్థికవృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18) 7.4 శాతంగా నమోదవుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్–రా) మంగళవారం పేర్కొంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను మాత్రం 7.9 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. కేంద్ర గణాంకాల విభాగం అంచనా 7.1 శాతంకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. వినియోగ డిమాండ్, ప్రభుత్వ వ్యయాల పెంపు వంటి కారణాల వల్ల వచ్చే ఏడాది వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాలో వృద్ధిరేటు వరుసగా 3%, 6.1%, 9.1%గా నమోదవుతాయన్న అంచనాలను వెలువరించింది. -
2017లో భారత వృద్ధి 7.1 శాతం
నొమురా అంచనా... న్యూఢిల్లీ: భారత వృద్ధి రేటు విషయంలో జపాన్‌కు చెందిన ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ నొమురా సానుకూల అభిప్రాయాలు వ్యక్తం చేసింది. 2017లో వృద్ధి రేటు విషయంలో తమ అంచనాల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని... ఇది 7.1 శాతంగా ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు స్వల్ప కాలంలో వృద్ధికి విఘాతం కలిగిస్తాయని స్పష్టం చేసింది. అయితే, ఈ చర్యల ఫలితంగా 2018లో వేగవంతమైన వృద్ధి రేటు సాధ్యమవుతుందని, 7.7 శాతానికి ఎగుస్తుందని తన నివేదికలో నొమురా పేర్కొంది. ‘‘నోట్లపై ఆంక్షల వల్ల స్వల్ప కాలంలో వృద్ధికి విఘాతం కలుగుతుంది. వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు, నిర్మాణం, రవాణా వంటి రంగాలు ఎక్కువగా నగదుపై ఆధారపడేవి. జీడీపీలో వీటి వాటా 55 శాతం. డీమోనిటైజేషన్ వల్ల మూడు నుంచి నాలుగు నెలల పాటు ఈ రంగాలపై ప్రభావం పడుతుంది. దీంతో 2016 నాల్గవ, 2017 తొలి త్రైమాసికాల్లో జీడీపీ రేటు 1 నుంచి 1.25 శాతం వరకు పడిపోతుంది’’ అని నొమురా వివరించింది.‘‘ప్రభుత్వ సంస్కరణల వల్ల స్వల్పకాలంలో ఇబ్బందులు ఎదురైనా మధ్య నుంచి దీర్ఘకాలంలో మాత్రం ఆర్థిక రంగానికి మంచి జరుగుతుందని నొమురా తన నివేదికలో తెలిపింది. -
భారత్ 7.6 శాతం వృద్ధి సాధిస్తుంది
ఐక్యరాజ్యసమితి నివేదిక ఐక్యరాజ్యసమితి: రేటింగ్ సంస్థలు భారత వృద్ధి రేటును తగ్గిస్తుంటే... ఐక్యరాజ్యసమితి మాత్రం భారత జీడీపీ 7.6 శాతం స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తుందని తన నివేదికలో పేర్కొంది. వ్యవస్థీకృత సంస్కరణలతో పెట్టుబడులు తిరిగి వేగాన్ని పుంజుకోవడంతోపాటు, తయారీ రంగం పరిధి బలోపేతం అవుతుందని పేర్కొంది. దీని వల్ల భారత ఆర్థిక రంగం 2016-17, 2017-18 సంవత్సరాల్లోనూ నిలకడగా 7.6 శాతం మేర వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్టు వార్షిక ముగింపు నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవస్థీకృత సంస్కరణలు ప్రైవేటు పెట్టుబడులకు ప్రయోజనం కలిగిస్తాయని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలం (ఏప్రిల్-జూన్)లో వృద్ధి మోస్తరుగా ఉండడానికి ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ తగ్గడమే కారణమని, ఇవి పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్టు పేర్కింది. -
భారత వృద్ధికి ఎన్నో సవాళ్లు: మూడీస్
♦ అధిక స్థాయిలో కార్పొరేట్ రుణాలు ♦ మొండిబకాయిల పెరుగుదలతో రుణాల లభ్యతపై ప్రభావం ♦ దీర్ఘకాలంలో భారత్ మెరుగ్గా రాణించే అవకాశముందని వెల్లడి న్యూఢిల్లీ: రానున్న సంవత్సరాల్లో భారత వృద్ధి రేటుకు ఎన్నో సవాళ్లు పొంచి ఉన్నాయని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. రాజకీయ వైరంతో సంస్కరణలకు అడ్డుపడే ధోరణితో కీలక బిల్లులు నిలిచిపోవడాన్ని అసాధారణ స్థితిగా పేర్కొంది. అంతర్జాతీయంగా గిరాకీ మందగించడం, కార్పొరేట్ రుణాలు అధిక స్థాయిలో ఉండడం, రుణాల లభ్యత తగ్గడం వృద్ధి రేటుకు సవాళ్లుగా పేర్కొంది. ఇవే రానున్న కొన్ని త్రైమాసికాలపాటు పెట్టుబడులకు విఘాతం కలిగిస్తాయని తెలిపింది. అంతేకాదు, అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నడుమ దేశీయంగా నెలకొన్న రాజకీయ పరిణామాలు 2016లో మార్కెట్ సెంటిమెంట్‌ను ఒత్తిడికి గురిచేయవచ్చంటూ ‘ఇన్సైడ్ ఇండియా’ నివేదికలో మూడీస్ పేర్కొంది. అయితే, నిర్దేశించుకున్న సంస్కరణలను క్రమంగా అమలు చేయడం, వ్యాపార పరిస్థితులు మెరుగుపడడం, మౌలిక వసతులు, ఉత్పాదకత పెరుగుదల వల్ల మధ్యకాలానికి భారత్ రాణిస్తుందని భావిస్తున్నట్టు మూడీస్ తెలిపింది. ‘పలు కార్పొరేట్ సంస్థలు అధిక స్థాయిలో తీసు కున్న రుణాల ప్రభావం వృద్ధిరేటుపై గణనీయంగా ఉంటుంది. రుణాల గిరాకీపై కూడా ప్రభావం చూపుతుంది. బ్యాంకింగ్ రంగంలో నిరర్ధక ఆస్తులు రుణాల లభ్యతకు విఘాతం. దిగువ స్థాయిలో నామమాత్రపు వృద్ధిరేటు కొనసాగడం ప్రభుత్వ రాబడులను ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల ప్రోత్సాహానికి సంస్కరణలు చేపట్టేందుకు... ఇంటా, బయట ప్రతికూలతలను అధిగమించేందుకు ప్రభుత్వం ముందున్న అవకాశాలు పరిమితం. రానున్న రెండు సంవత్సరాల్లో భారత జీడీపీ 7.5 శాతం వృద్ధి చెందుతున్న మా అంచనాలను ఈ పరిణామాలు ప్రభావితం చేస్తాయి’ అని మూడీస్ పేర్కొంది. ఈయూ నుంచి బ్రిటన్ తప్పుకోవడం వల్ల భారత్‌పై ప్రభావం నామమాత్రమేనని, భారత్ నుంచి ఈయూకు దిగుమతులు కేవలం 0.4 శాతంగానే ఉన్నాయని, ఇవి జీడీపీలో 1.7 శాతమని వివరించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను భారీగా పెంచడం వల్ల ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం ఉండదని అభిప్రాయపడింది. -
బ్రెగ్జిట్తో వృద్ధికి ఢోకా ఉండదు: క్రిసిల్
♦ 7.9% అంచనాలు కొనసాగింపు ♦ ఐటీ సహా పలు రంగాలపై ఒత్తిళ్లు ముంబై: బ్రెగ్జిట్ వల్ల కొన్ని రంగాలపై ప్రభావం ఉంటుందని, అయినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధిపై చెప్పుకోతగ్గ ప్రభావం ఏమీ ఉండదని రేటింగ్ సంస్థ క్రిసిల్ వెల్లడించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి 7.9 శాతంగా ఉంటుందన్న తమ అంచనాలను కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. వృద్ధికి వ్యవసాయం చోదకంగా నిలుస్తుందని, వృద్ధి సాధించడంలో జూలై, ఆగస్టులో కురిసే వర్షాలు కీలకమని పేర్కొంది. డిమాండ్ తగ్గుదల, కమోడిటీల ధరల్లో ఒడిదుడుకులతో భారతీయ కంపెనీలపై ప్రభావం ఉంటుందని క్రిసిల్ తన తాజా నివేదికలో తెలిపింది. ముఖ్యంగా ఐటీ, ఆటో, టెక్స్టైల్స్, ఫార్మా, లెదర్, మెటల్స్ రంగాలు మరింత ఒత్తిడిని ఎదుర్కొంటాయని అంచనా వేసింది. యూకే, యూరోప్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలపై కూడా ప్రభావం ఉంటుందని, హెడ్జింగ్ లేని విదేశీ రుణాల రూపంలో బ్యాలన్స్ షీట్లపై ఒత్తిడి పడుతుందని పేర్కొంది. ఐటీ రంగం... రూపాయి: దేశ ఎగుమతుల్లో అధిక భాగం ఐటీ రంగం నుంచే ఉంటున్నాయి. భారతీయ మొత్తం ఐటీ ఎగుమతుల్లో 17% బ్రిటన్‌కే వెళుతున్నాయి. యూరప్ వాటా 29%. బ్రెగ్జిట్ వల్ల ఇప్పుడు ఐటీ కంపెనీలపై ఒకేసారి పలు కష్టాలు వచ్చి పడ్డాయి. అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అధిక కేటాయింపులు చేయడంతోపాటు... యూకే నుంచి యూరోప్‌కు ఉద్యోగుల తరలింపు కారణంగా పరిపాలనా ఖర్చులు పెరిగిపోతాయి. రూపాయిపై కూడా గణనీయమైన ప్రభావం పడుతుంది. 2017 మార్చి నాటికి డాలర్‌తో పోలిస్తే 66.50 స్థాయిలో ఉంటుంది. భారత్ నుంచి బ్రిటన్‌కు సరుకుల ఎగుమతులు కేవలం 3 శాతంగానే ఉండడంతో ఎగుమతులపై భారీగా ప్రభావం ఉండదని అంచనా వేసింది. పోటీ కరెన్సీల గమనం భారత్‌కు కీలకమని పేర్కొంది. అయితే, మొత్తం మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు తగ్గుతాయి. -
విస్త్రుత అంశాల్లో భారత్ వృద్ధి: మోర్గాన్‌స్టాన్లీ
న్యూఢిల్లీ: భారత్ ఆర్థికాభివృద్ధి రికవరీ ఒక నిర్దిష్ట అంశంపై కాకుండా... పలు అంశాల్లో విస్తృత ప్రాతిపదికన పురోగమిస్తున్నట్లు గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ- మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ రంగ మూలధన వ్యయాలు పెరగడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో వినియోగ వృద్ధి వంటి పలు అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఆయా సానుకూల అంశాల నేపథ్యంలో దేశాభివృద్ధి రికవరీ మరింత వేగవంతం అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. విదేశీ డిమాండ్ మందగమనం, ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్ల ఒడిదుడుకులు, విధాన సంస్కరణల అమల్లో ఆలస్యం వంటి అంశాలు భారత్‌కు సవాళ్లని పేర్కొంది. ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన అంశాలను ప్రస్తావిస్తూ.... విధాన నిర్ణేతలు రుణ రేట్లు మరింత తగ్గాలనే భావిస్తున్నట్లు వివరించింది. పలు వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు బలహీనంగా ఉన్నా... కొంత స్థిరత్వాన్ని సంపాదించుకుంటున్నట్లు వివరించింది. -
భారత్ ఆర్థికాభివృద్ధి 7.3 శాతమే!
వాషింగ్టన్: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.3 శాతం వృద్ధి మాత్రమే సాధిస్తుందన్న అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పునరుద్ఘాటించింది. అయితే 2016-17, 1017-18లో మాత్రం ఈ రేటు 7.5 శాతానికి పెరుగుతుందని విశ్లేషించింది. అలాగే 2016కు సంబంధించి ప్రపంచ వృద్ధి అంచనాను 3.6 శాతం నుంచి 3.4 శాతానికి కుదించింది. ఈ మేరకు తన వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈఓ)ను ఐఎంఎఫ్ అప్డేట్ చేసింది. మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే.. * భారత్ వృద్ధి ధోరణి కొనసాగే అవకాశం ఉండగా.. చైనా మాత్రం తిరోగమించనుంది. 2016లో వృద్ధి రేటు 6.3% ఉండే వీలుంది. 2017లో ఇది మరింతగా 6%కి తగ్గొచ్చు. * చైనా మందగమనం, ప్రపంచవ్యాప్తంగా తయారీ రంగ బలహీనతలతో పలు దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. * అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో మందగమనం, దిగువస్థాయి కమోడిటీ ధరలు, కఠిన ద్రవ్య పరిస్థితుల దిశగా అమెరికా అడుగుల వంటివి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సవాళ్లను విసురుతున్నాయి. ఈ సవాళ్లను విజయవంతంగా నిర్వహించలేకపోతే... ప్రపంచ వృద్ధి పట్టాలు తప్పుతుంది. * అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధి రికవరీ సజావుగా సాగట్లేదు. ఇదే ధోరణి ఇకముందూ కొనసాగే వీలుంది. * చమురు ధరలు తగ్గినప్పటికీ, ఈ కమోడిటీ దిగుమతి దేశాల్లో వినియోగం బలహీనంగానే ఉంది. తగ్గిన ప్రయోజనాన్ని వినియోగదారుకు బదలాయించకపోవడం దీనికి ఒక కారణం. * అభివృద్ధి చెందిన దేశాలు 2016లో 0.2 శాతం వృద్ధి రేటును సాధిస్తాయి. అయితే 2017 ఏడాదిలో ఈ రేటు 2.1 శాతానికి పెరిగే అవకాశం ఉంది. వర్థమాన దేశాలకు సంబంధించి ఈ రేటు 4.3 శాతం, 4.7 శాతంగా ఉండే వీలుంది. 2015లో ఈ రేటు 4 శాతంగా ఉంది. -
ఐదేళ్లలో 280 బిలియన్ డాలర్లకు.. హెల్త్‌కేర్!
ఫిక్కీ-కేపీఎంజీ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: భవిష్యత్తులో భారత ఆర్థికాభివృద్ధిలో హెల్త్‌కేర్ రంగం ప్రధాన భూమిక పోషించనుంది. 2011లో 74 బిలియన్ డాలర్లుగా ఉన్న హెల్త్‌కేర్ రంగం 2020 నాటికి 16 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్)తో 280 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఫిక్కీ-కేపీఎంజీ తన నివేదికలో పేర్కొంది. హెల్త్‌కేర్ రంగంపై ప్రభుత్వం అంతగా దృష్టి కేంద్రీకరించడం లేదని తెలిపింది. కేంద్రం ప్రస్తుతం హెల్త్‌కేర్ రంగంపై వెచ్చిస్తోన్న మొత్తం జీడీపీలో 4.2 శాతంగా ఉందని, ఇది ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా తక్కువని పేర్కొంది. -
భారత వృద్ధి అంచనాలను తగ్గించిన ఫిచ్
న్యూఢిల్లీ : అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిట్ భారత వృద్ధి అంచనాలను తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవ త్సరంలో భారత ఆర్థిక వృద్ది 8%గా ఉంటుందని ఫిచ్ గతంలో అంచనా వేసింది. కానీ ఫిచ్ ఆ అంచనాలను ప్రస్తుతం 7.8%కి కుదించింది. 2016-17లో చైనాతో పోలిస్తే భారత వృద్ధి రేటు (8.1%) ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. 2017-18లో భారత వృద్ధి 8% ఉంటుందని పేర్కొంది. నిర్మాణాత్మక సంస్కరణల అమలుతో దేశంలోకి పెట్టుబడుల ప్రవాహం పెరిగి తద్వారా వృద్ధి రేటు పుంజుకోవచ్చని తెలిపింది. -
క్యూ2 వృద్ధి 5.3%: మూడీస్
న్యూఢిల్లీ: భారత ఆర్థికాభివృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో(2014-15, జూలై-సెప్టెంబర్) 5.3 శాతమని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేస్తోంది. గత రెండేళ్లలో 5% దిగువకు పడిపోయిన వృద్ధి రేటు 2014-15 తొలి త్రైమాసికంలో 5.7 శాతంగా నమోదయ్యింది. శుక్రవారం ఈ గణాంకాలను కేంద్రం విడుదల చేస్తున్న నేపథ్యంలో మూడీస్ తాజా అంచనాలను వెలువరించింది. 2013-14 రెండవ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 4.8 శాతం. తాజా సంస్కరణల అమలు తగిన వృద్ధి రూపంలో ప్రతిబింబించడానికి మరికొంత సమయం పడుతుందని కూడా మూడీస్ పేర్కొంది.