భారత్ ఆర్థికాభివృద్ధి 7.3 శాతమే! | IMF cuts world economic growth, holds on India | Sakshi
Sakshi News home page

భారత్ ఆర్థికాభివృద్ధి 7.3 శాతమే!

Published Wed, Jan 20 2016 1:49 AM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM

భారత్ ఆర్థికాభివృద్ధి 7.3 శాతమే!

భారత్ ఆర్థికాభివృద్ధి 7.3 శాతమే!

వాషింగ్టన్: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.3 శాతం వృద్ధి మాత్రమే సాధిస్తుందన్న అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పునరుద్ఘాటించింది. అయితే 2016-17, 1017-18లో మాత్రం ఈ రేటు 7.5 శాతానికి పెరుగుతుందని విశ్లేషించింది. అలాగే 2016కు సంబంధించి ప్రపంచ  వృద్ధి అంచనాను 3.6 శాతం నుంచి 3.4 శాతానికి కుదించింది. ఈ మేరకు తన వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈఓ)ను ఐఎంఎఫ్ అప్‌డేట్ చేసింది. మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే..
     
* భారత్ వృద్ధి ధోరణి కొనసాగే అవకాశం ఉండగా.. చైనా మాత్రం తిరోగమించనుంది. 2016లో వృద్ధి రేటు 6.3% ఉండే వీలుంది. 2017లో ఇది మరింతగా 6%కి తగ్గొచ్చు.
* చైనా మందగమనం, ప్రపంచవ్యాప్తంగా తయారీ రంగ బలహీనతలతో పలు దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
* అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో మందగమనం, దిగువస్థాయి కమోడిటీ ధరలు, కఠిన ద్రవ్య పరిస్థితుల దిశగా అమెరికా అడుగుల వంటివి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సవాళ్లను విసురుతున్నాయి. ఈ సవాళ్లను విజయవంతంగా నిర్వహించలేకపోతే... ప్రపంచ వృద్ధి పట్టాలు తప్పుతుంది.
* అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధి రికవరీ సజావుగా సాగట్లేదు. ఇదే ధోరణి ఇకముందూ కొనసాగే వీలుంది.
* చమురు ధరలు తగ్గినప్పటికీ, ఈ కమోడిటీ దిగుమతి దేశాల్లో వినియోగం బలహీనంగానే ఉంది. తగ్గిన ప్రయోజనాన్ని   వినియోగదారుకు బదలాయించకపోవడం దీనికి ఒక కారణం.
* అభివృద్ధి చెందిన దేశాలు 2016లో 0.2 శాతం వృద్ధి రేటును సాధిస్తాయి. అయితే 2017 ఏడాదిలో ఈ రేటు 2.1 శాతానికి పెరిగే అవకాశం ఉంది. వర్థమాన దేశాలకు సంబంధించి ఈ రేటు 4.3 శాతం, 4.7 శాతంగా ఉండే వీలుంది. 2015లో ఈ రేటు 4 శాతంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement