World Economic Outlook
-
బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న కేంద్రం.. భారత్‌పై ఐఎంఎఫ్ ప్రశంసల వర్షం!
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి’ (imf) భారత వృద్ధిరేటుకు సంబంధించి కీలక అంచనాలను వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ప్రస్తుతం ఉన్న భారత ఆర్థిక వృద్ది రేటు 6.8 నుంచి 6.1 శాతానికి పడిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. కానీ తిరిగి పుంజుకుంటుందనే అంచనాల్ని ఉదహరిస్తూ ఓ నివేదికను విడుదల చేసింది. గ్లోబల్ వృద్ధి రేటు ఐఎంఎఫ్ అప్డేట్ చేసిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అవుట్‌లుక్‌ను విడుదల చేసింది. ఆ అవుట్ లుక్‌లో 2022 గ్లోబల్ వృద్ధి రేటు 3.4 ఉండగా 2023లో 2.9 శాతానికి తగ్గి 2024లో 3.1శాతానికి పెరుగుతున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ది రేటుపై ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్, రీసెర్చ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ పియరీ ఒలివర్ గౌరించాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 6.8శాతంతో వృద్ది రేటు అక్టోబర్ అవుట్ లుక్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. కానీ మార్చి తర్వాత ఇండియన్ ఎకానమీ 6.1 శాతానికి దిగజారుతుందనే అంచనా వేసినట్లు తెలిపారు. అందుకు దేశంలోనే పరిస్థితులేనని అన్నారు. పురోగతి సాధ్యమే 2022లో భారత వృద్ది రేటు 6.8 శాతం ఉండగా.. 2023లో 6.1 శాతం తగ్గింది. అయితే దేశీయంగా స్థిరమైన డిమాండ్ కొనసాగనుందనే అంచనాలతో పురోగతి సాధిస్తూ 2024లో 6.8 శాతానికి చేరుకోనుంది. ఆసియా దేశాల్లో ఆసియా దేశాల్లో అభివృద్ది నిలకడగా కొనసాగుతున్న తరుణంలో ఐఎంఎఫ్ ఆర్ధిక వృద్ది రేటును పెంచింది. 2023లో వృద్ది రేటు 5.2శాతం ఉండగా 2024లో 5.5శాతానికి పెంచింది. 2022లో ఊహించిన దానికంటే లోతైన మందగమనం తర్వాత ఆసియా దేశమైన చైనా ఆర్థిక వ్యవస్థకు 4.3 శాతానికి తగ్గించింది ఐఎంఎఫ్. చైనా అభివృద్దిలో అడ్డంకులు 2022 నాల్గవ త్రైమాసికంలో చైనా జీడీపీ మందగించింది. వెరసీ 40 ఏళ్ల చరిత్రలో ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉండటం చైనాకు ఇది మొదటిసారి. వ్యాపారంలో శక్తి సామర్ధ్యాలు తగ్గిపోవడం, క్షీణిత, నెమ్మదించిన నిర్మాణాత్మక సంస్కరణల కారణంగా 2022 క్యూ4లో 3.0 శాతంగా ఉన్న వృద్ది రేటును 0.2శాతానికి తగ్గించింది. అది అలాగే మరో రెండేళ్లు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇక అదే వృద్ది రేటు 2023లో 5.2 శాతం వరకు పెరగొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అభివృద్ధిలో ఆటుపోట్లు ఎదుర్కొనే అవకాశం ఉందనే అంచనాలతో 2024 కంటే ముందే వృద్ది రేటు 4శాతం తగ్గొచ్చంటూ సూత్రప్రాయంగా వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థలో భారత్‌ది తిరుగులేని స్థానం మీడియా ప్రతినిధులు సంధించిన ఓ ప్రశ్నకు సమాధానంగా గౌరించాస్ ఓ బ్లాగ్ పోస్ట్‌లో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ది ప్రకాశవంతమైన స్థానమని అన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్, చైనాదేనని వెల్లడించారు. అదే అమెరికా, యూరోప్రాంతం కలిసి కేవలం 10 శాతం మాత్రమే ప్రపంచ ఆర్థిక వృద్ధికి దోహదం చేయనున్నట్లు పేర్కొన్నారు. -
భారత వృద్ధి రేటు అంచనాలను తగ్గించిన ఐఎంఎఫ్
అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ భారత వృద్ధి అంచనాలను మరోసారి భారీగా కుదించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి రేటు అంచనాను 12.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించింది. దేశంలో కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్ తర్వాత ఏకంగా మూడు పాయింట్లు తగ్గించింది. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23 సంవత్సరానికి భారతదేశం ఆర్థిక వృద్ధి రేటును ఏప్రిల్ 2021లో అంచనా వేసిన 6.9 శాతం నుంచి 8.5 శాతానికి ఐఎంఎఫ్ పెంచింది. "మార్చి-మేలో విజృంభించిన కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారతదేశంలో వృద్ధి అవకాశాలు తగ్గించినట్లు, ఆ ఎదురుదెబ్బ నుంచి ఆర్ధిక వృద్ది నెమ్మదిగా రికవరీ కానున్నట్లు" ఐఎంఎఫ్ తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్ లుక్ (డబ్ల్యుఈఓ)లో తెలిపింది. ఐఎంఎఫ్ 2021 ప్రపంచ వృద్ధి అంచనాను మార్చకుండా 6 శాతం వద్దే ఉంచింది. వ్యాక్సిన్ రోల్ అవుట్ లో వ్యత్యాసం కారణంగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల వృద్ది అంచనాలను సవరించింది. 2021 జూన్ 4న జరిగిన రెండో ద్వైమాసిక ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కూడా 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) అంచనాను 10.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఐఎంఎఫ్ భారతదేశానికి ఆర్థిక వృద్ధి అంచనాలను మూడు శాతం, చైనాకు 0.3 శాతం, సౌదీ అరేబియాకు 0.5 శాతం తగ్గించింది. మెక్సికో, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో సహా మిగిలిన అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ పెంచింది. -
భారత్ : అంచనాలకు కోత అయినా టాప్‌లోనే..
న్యూఢిల్లీ : పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, ఆందోళన పరుస్తున్న డాలర్-రూపాయి ఎక్స్చేంజ్ రేటు, ద్రవ్యోల్బణం దెబ్బకు కఠినతరమవుతున్న మానిటరీ పాలసీ ఇవ్వన్నీ దేశీయ వృద్ధి అంచనాలకు కోత పెడుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) తాజాగా అప్డేట్ చేసిన వరల్డ్ ఎకానమిక్ అవుట్‌లుక్‌లో, దేశీయ వృద్ధి అంచనాలకు కోత పెట్టింది. 2018లో దేశీయ వృద్ధి అంచనాలను 10 బేసిస్ పాయింట్లు తగ్గించి, 7.3 శాతంగా ఉండనున్నట్టు తెలిపింది. అదేవిధంగా 2019లో వృద్ది అంచనాలను సైతం 30 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.5 శాతం నమోదవబోతున్నట్టు పేర్కొంది. అంతకముందు ఇవి 2018లో 7.4 శాతం, 2019లో 7.8 శాతంగా ఉండనున్నట్టు ఐఎంఎఫ్ అంచనావేసింది. అయితే ఐఎంఎఫ్ వృద్ధి అంచనాలను తగ్గించినప్పటికీ, భారత్ అత్యంత వేగవంతంగా ఆర్థిక వ్యవస్థగానే ఉందని తెలిపింది. చైనా ఆర్థిక వ్యవస్థ రేటు ఈ ఏడాది 6.6 శాతం, వచ్చే ఏడాది 6.4 శాతంగానే ఉండనున్నట్టు పేర్కొంది. ఎన్నికల ఏడాదిలో భారత వృద్ధి స్టోరీ ప్రపంచ దేశాలకు పోటీగా ఉంటుందని, ఈ ఏడాది ప్రపంచ వృద్ధి 3.9 శాతంగా ఉండబోతున్నట్టు అంచనా వేసింది. ‘వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్‌లో భారత్ వృద్ధి అంచనాలను 2018, 2019ల్లో 0.1 శాతం, 0.3 శాతం చొప్పున తగ్గించాం. దేశీయంగా పెరుగుతున్న డిమాండ్‌తో ఆయిల్ ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం దెబ్బకు అంచనాల కంటే కఠినతరంగా మానిటరీ పాలసీని రూపొందించడం ఇవన్నీ భారత్ వృద్ధి అంచనాలపై ప్రభావం చూపాయి’ అని తన ఐఎంఎఫ్ అప్డేట్లో పేర్కొంది. కాగ, గతవారం ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన రిపోర్టులో భారత్, ఫ్రాన్స్‌ను అధిగమించి ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్టు తెలిసిన సంగతి తెలిసిందే. కాగ, ద్రవ్యోల్బణం పెరుగుతుందనే అంచనాలతో గత నాలుగున్నరేళ్లలో మొదటిసారి సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ తన మానిటరీ పాలసీలో రెపో రేటును పెంచుతున్నట్టు ప్రకటించింది. 25 బేసిస్ పాయింట్లు పెంచి, రెపో రేటును 6.25 శాతంగా నిర్ణయించింది. ఆర్బీఐ భయపడిన విధంగానే టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఎన్నడు లేనంతగా 5.77 శాతానికి ఎగిసింది. ఈ ద్రవ్యోల్బణ భయాలతోనే అర్జెంటీనా, భారత్, ఇండోనేషియా, మెక్సికో, టర్కీ లాంటి ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీల సెంట్రల్ బ్యాంక్‌లు కూడా తమ పాలసీ రేట్లను పెంచాయి. -
భారత్ ఆర్థికాభివృద్ధి 7.3 శాతమే!
వాషింగ్టన్: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.3 శాతం వృద్ధి మాత్రమే సాధిస్తుందన్న అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పునరుద్ఘాటించింది. అయితే 2016-17, 1017-18లో మాత్రం ఈ రేటు 7.5 శాతానికి పెరుగుతుందని విశ్లేషించింది. అలాగే 2016కు సంబంధించి ప్రపంచ వృద్ధి అంచనాను 3.6 శాతం నుంచి 3.4 శాతానికి కుదించింది. ఈ మేరకు తన వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈఓ)ను ఐఎంఎఫ్ అప్డేట్ చేసింది. మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే.. * భారత్ వృద్ధి ధోరణి కొనసాగే అవకాశం ఉండగా.. చైనా మాత్రం తిరోగమించనుంది. 2016లో వృద్ధి రేటు 6.3% ఉండే వీలుంది. 2017లో ఇది మరింతగా 6%కి తగ్గొచ్చు. * చైనా మందగమనం, ప్రపంచవ్యాప్తంగా తయారీ రంగ బలహీనతలతో పలు దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. * అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో మందగమనం, దిగువస్థాయి కమోడిటీ ధరలు, కఠిన ద్రవ్య పరిస్థితుల దిశగా అమెరికా అడుగుల వంటివి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సవాళ్లను విసురుతున్నాయి. ఈ సవాళ్లను విజయవంతంగా నిర్వహించలేకపోతే... ప్రపంచ వృద్ధి పట్టాలు తప్పుతుంది. * అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధి రికవరీ సజావుగా సాగట్లేదు. ఇదే ధోరణి ఇకముందూ కొనసాగే వీలుంది. * చమురు ధరలు తగ్గినప్పటికీ, ఈ కమోడిటీ దిగుమతి దేశాల్లో వినియోగం బలహీనంగానే ఉంది. తగ్గిన ప్రయోజనాన్ని వినియోగదారుకు బదలాయించకపోవడం దీనికి ఒక కారణం. * అభివృద్ధి చెందిన దేశాలు 2016లో 0.2 శాతం వృద్ధి రేటును సాధిస్తాయి. అయితే 2017 ఏడాదిలో ఈ రేటు 2.1 శాతానికి పెరిగే అవకాశం ఉంది. వర్థమాన దేశాలకు సంబంధించి ఈ రేటు 4.3 శాతం, 4.7 శాతంగా ఉండే వీలుంది. 2015లో ఈ రేటు 4 శాతంగా ఉంది.