అంచనాలకన్నా నెమ్మది: ఐఎంఎఫ్‌ | Growth in India slowed more than expected says IMF | Sakshi
Sakshi News home page

అంచనాలకన్నా నెమ్మది: ఐఎంఎఫ్‌

Published Sat, Jan 18 2025 5:00 AM | Last Updated on Sat, Jan 18 2025 7:13 AM

Growth in India slowed more than expected says IMF

వాషింగ్టన్‌: భారత్‌ వృద్ధి వేగం అంచనాలకన్నా తక్కువగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. పారిశ్రామిక క్రియాశీలత మందగమనలో ఉందని తన తాజా వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌లో పేర్కొంది. 2026 వరకూ దేశం 6.5 శాతం వృద్ధి రేటును కొనసాగిస్తుందని తెలిపింది. 

ఇక 2025, 2026లో ప్రపంచ వృద్ధి రేటు 3.3 శాతంగా ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. 2000–2019 మధ్య సగటు 3.7 శాతంకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. ప్రపంచ ద్రవ్యోల్బణం 2025లో 4.2 శాతం, 2026లో 3.5 శాతం ఉంటుందని సంస్థ అంచనా వేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement