International Monetary Fund
-
యూఎస్ ఎయిడ్ కాంట్రాక్టుల్లో 90 శాతం రద్దు!
వాషింగ్టన్: అమెరికా అంతర్జాతీయ విదేశీ సహాయ నిధి (యూఎస్ ఎయిడ్)కు ఇప్పటికే మంగళం పాడిన డొనాల్డ్ ట్రంప్ సర్కారు, దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 90 శాతానికి పైగా కాంట్రాక్టులను రద్దు చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ దెబ్బతో 6,200 కాంట్రాక్టుల్లో 54 బిలియన్ డాలర్ల విలువైన 5,800 పై చిలుకు ఒక్కసారిగా బుట్టదాఖలయ్యాయి. యూఎస్ ఎయిడ్ కాంట్రాక్టుల మొత్తం విలువ 60 బిలియన్ డాలర్లని సర్కారు వెల్లడించింది. యూఎస్ ఎయిడ్ రద్దును సవాలు చేస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే కోర్టుల తలుపులు తట్టాయి. సదరు కాంట్రాక్టులకు సంబంధించి నిలిపేసిన బిలియన్ల కొద్దీ డాలర్లను తక్షణం విడుదల చేయాల్సిందిగా డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి ఒకరు మంగళవారం తీర్పు ఇచ్చారు. కానీ దానిపై ట్రంప్ యంత్రాంగం బుధవారం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దిగువ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు దన్నుగా నిలిచే యూఎస్ ఎయిడ్ కార్యక్రమాన్ని అమెరికా 60 ఏళ్లకు పైగా కొనసాగిçస్తున్న సంగతి తెలిసిందే.ఖాళీకి పావుగంటఉద్వాసన పలికిన, దీర్ఘకాలిక సెలవులపై పంపిన యూఎస్ ఎయిడ్ సిబ్బందికి తమ డెస్కులను ఖాళీ చేసేందుకు గురు, శుక్రవారాల్లో ప్రభుత్వం కేవలం 15 నిమిషాల గడువిచ్చింది. దాంతో సిబ్బంది ఒక్కొక్కరుగా సంస్థ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. తమ కార్యాలయాన్ని, డెస్కును చివరిసారిగా చూసుకుంటూ భారమైన మనసుతో నిట్టూర్చారు. ఇది తమను మరింతగా అవమానించడమేనని వాపోయారు. -
అంచనాలకన్నా నెమ్మది: ఐఎంఎఫ్
వాషింగ్టన్: భారత్ వృద్ధి వేగం అంచనాలకన్నా తక్కువగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. పారిశ్రామిక క్రియాశీలత మందగమనలో ఉందని తన తాజా వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్‌లో పేర్కొంది. 2026 వరకూ దేశం 6.5 శాతం వృద్ధి రేటును కొనసాగిస్తుందని తెలిపింది. ఇక 2025, 2026లో ప్రపంచ వృద్ధి రేటు 3.3 శాతంగా ఐఎంఎఫ్ అంచనా వేసింది. 2000–2019 మధ్య సగటు 3.7 శాతంకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. ప్రపంచ ద్రవ్యోల్బణం 2025లో 4.2 శాతం, 2026లో 3.5 శాతం ఉంటుందని సంస్థ అంచనా వేసింది. -
అదనంగా 14.8 కోట్ల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ‘ఉపాధి కల్పనలో భారత్ జీ20 దేశాలలో వెనుకబడి ఉంది. జనాభా పెరుగుదల దృష్ట్యా 2030 నాటికి దేశం అదనంగా 14.8 కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉంది’ అని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఫస్ట్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ శనివారం తెలిపారు. 2010–20 మధ్య భారత్ సగటున 6.6 శాతం వృద్ధిని సాధించిందని, అయితే ఉపాధి రేటు 2 శాతం కంటే తక్కువగా ఉందని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వజ్రోత్సవంలో పాల్గొన్న సందర్భంగా గీత చెప్పారు. మరిన్ని ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రైవేట్ పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడం, నియంత్రణ వాతావరణాన్ని మెరుగుపరచడం, ట్యాక్స్ బేస్‌ను విస్తృతం చేయడం అవసరమని తెలిపారు. ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారత్ ఒక కీలక దేశంగా ఉండాలనుకుంటే దిగుమతి సుంకాలను తగ్గించాల్సిందేనని స్పష్టం చేశారు. -
భారత్, చైనా భేష్
వాషింగ్టన్: భారత్, చైనా, యూరప్ ఆర్థిక వృద్ధి విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తన అంచనాలను మెరుగుపరిచింది. అదే సమయంలో యూఎస్, జపాన్‌కు సంబంధించిన అంచనాలను కొంత తగ్గించింది. భారత్ 2024లో 7 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ అంచనా 6.8 శాతాన్ని పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం బలంగా ఉండడాన్ని పరిగణనలోకి తీసుకుని అంచనాలను ఎగువకు సవరించింది. ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదల నిదానించినట్టు తెలిపింది. 2024లో ప్రపంచ వృద్ధి 3.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఏప్రిల్‌లో వేసిన అంచనాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. 2023లో ప్రపంచ వృద్ధి రేటు 3.3 శాతంతో పోల్చి చూస్తే 0.1 శాతం తగ్గనున్నట్టు ఐఎంఎఫ్ అంచనాలు తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది ప్రపంచ వృద్ధిలో సగం చైనా, భారత్ నుంచే ఉంటుందని ఐఎంఎఫ్ ముఖ్య ఆర్తికవేత్త ఒలివర్ గౌరించాస్ బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొన్నారు. చైనా 5 శాతం 2024 ఆరంభంలో చైనా ఎగుమతులు పెరగడంతో ఆ దేశ వృద్ధి రేటు అంచనాలను గతంలో వేసిన 4.6 శాతం నుంచి 5 శాతానికి ఐఎంఎఫ్ పెంచింది. అయిన కానీ 2023లో నమోదైన 5.2 శాతం కంటే తక్కువే కావడం గమనార్హం. ఒకప్పుడు రెండంకెల వృద్ధి సాధించిన చైనా పెద్ద ఎత్తున సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు, ముఖ్యంగా అక్కడ ఇళ్ల మార్కెట్ కుదేలైనట్టు ఐఎంఎఫ్ తెలిపింది. వృద్ధ జనాభా పెరుగుదల, కార్మికుల కొరత నేపథ్యంలో 2029 నాటికి చైనా వృద్ధి రేటు 3.3 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. యూరప్ 0.9 శాతం వృద్ధిని సాధిస్తుందని పేర్కొంది. అక్కడ సేవల రంగం మెరుగుపడుతుండడాన్ని ప్రస్తావించింది. ఇక ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఈ ఏడాది 2.6 శాతం వృద్ధి రేటుకు పరిమితం కావచ్చని ఐఎంఎఫ్ తాజాగా పేర్కొంది. ఏప్రిల్‌లో 2.7 శాతంగా అంచనా వేయడం గమనార్హం. ఇక 2024 సంవత్సరానికి జపాన్ వృద్ధి రేటును 0.9 శాతం నుంచి 0.7 శాతానికి తగ్గించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ధరల మంట (ద్రవ్యోల్బణం) 2023లో ఉన్న 6.7 శాతం నుంచి 2024లో 5.9 శాతానికి దిగొస్తుందని తెలిపింది. ఆర్థిక వృద్ధి, ఆర్థిక స్థిరత్వం, పేదరిక నిర్మూలన దిశగా ఐఎంఎఫ్ కృషి చేస్తుంటుంది. -
త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారత్
న్యూఢిల్లీ: భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారే క్రమం (అమృత్ కాల్) తొలి దశలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని సాధించనున్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. భారతదేశం 2027–28లో ఐదు ట్రిలియన్ ఎకానమీతో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ అంచనా వేస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి స్థూల ఆర్థిక అంశాల స్థిరత్వం, దీనివల్ల ఏర్పడే బలమైన రూపాయి సహాయంతో భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ మైలురాయిని దాటుతుందని లోక్‌సభలో ఇచి్చన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ‘2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా అమృత్ కాల్ ప్రారంభ సమయంలోనే దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుంది‘ అని చౌదరి చెప్పారు. పురోగతి ఇలా... మంత్రి పేర్కొన్న సమాచారం ప్రకారం, 1980–81లో భారత్ ఎకానమీ పరిమాణం 189 బిలియన్ డాలర్లు. దశాబ్దకాలం గడిచే సరికి ఈ విలువ 326 బిలియన్ డాలర్లకు చేరింది. 2000–01 నాటికి 476 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2010–11 నాటికి ఈ విలువ 1.71 ట్రిలియన్ డాలర్లకు చేరగా, 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 2.67 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారింది. 2022–23 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఈ విలువ 3.75 ట్రిలియన్ డాలర్లు. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్ డాలర్లు) కొనసాగుతున్న భారత్ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98,374) అంచనా. 2047 నాటికి ఈ పరిమాణం 18,000 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. భారత్ 2047 నాటికి (స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు) 30 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తోంది. ఈ విజన్ డాక్యుమెంట్‌ను వచ్చే ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. విజన్ డాక్యుమెంట్– 2047 భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవసరమైన సంస్థాగత, నిర్మాణాత్మక మార్పులను సంస్కరణలను నిర్దేశించనుంది. దిగువ మధ్య ఆదాయ స్థితి నుంచి దేశ పురోగతి విజన్ 2047 ప్రధానంగా నిర్దేశించుకుంది. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ► భారతదేశం మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. మార్కెట్ నిర్ణయించిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), మారకపు రేటు ద్వారా ప్రభుత్వం ఆర్థిక పురోగతిని పర్యవేక్షిస్తుంది. ►దేశీయ–అంతర్జాతీయ మార్కెట్లు రెండూ భారతదేశ జీడీపీ మారకపు రేటు, జీడీపీకి సంబంధించి వివిధ రంగాల సహకారాన్ని నిర్ణయించే యంత్రాంగాలు. ►2022–23లో భారత్ ఎకానమీలో వ్యవసాయ రంగం వాటా 18.4 శాతం. పారిశ్రామిక రంగం వాటా 28.3 శాతం. సేవల రంగం వాటా 53.3 శాతం. ►వార్షిక బడ్జెట్లలో ప్రకటించిన చర్యలతో సహా విధానపరమైన నిర్ణయాల ద్వారా ప్రభుత్వం ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది. ►జీడీపీ వృద్ధి రేటును వేగంగా పెంచడం కోసం ప్రభుత్వం గత 9 ఏళ్లలో తీసుకున్న ప్రధాన కార్యక్రమాలలో... దివాలా (ఐబీసీ) కోడ్ అమలు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు తగిన మూలధన కల్పన, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు, కార్పొరేట్ పన్ను తగ్గింపు, మూలధన వ్యయాల్లో నాణ్యత పెంపు, 14 రంగాలలో ఉత్పత్తి ఆధారిత పథకాల పథకం అమలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు విధానాల్లో నిరంతర సరళీకరణ, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన ఉన్నాయి. -
4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారత్?
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల (ట్రిలియన్) మైలురాయిని అధిగమించేసిందన్న వార్తలు ఆదివారం సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీనిపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేసినప్పటికీ .. కేంద్ర ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో ఇది చర్చనీయాంశంగా మారింది. భారత్ 4 ట్రిలియన్ డాలర్ల స్థాయిని దాటినట్లు చూపుతూ ఓ స్క్రీన్‌షాట్ వైరల్ అయ్యింది. దీన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి పోర్టల్‌లో వివిధ దేశాల జీడీపీ గణాంకాల లైవ్ ఫీడ్ నుంచి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అటుపైన పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ, మహారాష్ట్ర డిప్యుటీ చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, జి. కిషన్‌రెడ్డి తదితరులు అభినందనలు తెలియజేశారు. అయితే, వార్తలపై అధికారిక స్పందన వెలువడలేదు. -
క్రిప్టో కరెన్సీపై జీ20 రోడ్‌మ్యాప్
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీకి సంబంధించి సమస్యలు, సవాళ్లను పరిష్కరించేందుకు ఒక రోడ్‌మ్యాప్‌ను వేగంగా, సమన్వయంతో అమలు చేయాలని జీ20 దేశాల ఆర్థికమంత్రులు పిలుపునిచ్చారు. క్రిప్టో ఆస్తులపై జీ20 రోడ్‌మ్యాప్‌కు సంబంధించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ (ఎఫ్ఎస్బీ) సంయుక్తంగా రూపొందించిన సింథసిస్ పేపర్‌ను జీ20 ఆర్థికమంత్రులు ఆమోదించారు. మొరాకో ఆర్థిక రాజధాని మరకే‹Ùలో జరుగుతున్న జీ20 దేశాల ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంలో ఈ మేరకు తీర్మానాలు ఆమోదించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం గురించి ఇక్కడ సమావేశం ఎటువంటి ప్రస్తావనా చేయకపోవడం గమనార్హం. చమురుపైన పశి్చమాసియా ఉద్రిక్తతల ప్రభావం... కాగా, ఈ సమావేశాల సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ, ‘మధ్యప్రాచ్యంలో ఇటీవలి సంక్షోభం వల్ల ఇంధనం (ధరల పెరుగుదల) గురించి ఆందోళనలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. ఇవి చాలా దేశాలు కలిగి ఉన్న ఆందోళనలు. భారత్ తరహాలోనే ఇతర దేశాలు కూడా ఈ అంశంపై ఆందోళన చెందుతున్నాయి. ఇంధన ఆందోళనలు ఆహార భద్రత అంశాలను, సరఫరాల చైన్‌ను ప్రభావితం చేస్తాయి’’ అని అన్నారు. జీ20 అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన–అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అంతర్ ప్రభుత్వ ఫోరమ్. ఇందులో అర్జెంటీనా, ఆ్రస్టేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేíÙయా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ సభ్యులుగా ఉన్నాయి. ఈ దేశాలు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 80 శాతం వాటాను, వాణిజ్యంలో 75 శాతం వాటాను, ప్రపంచ జనాభాలో దాదాపు 70 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మొరాకో ఆర్థిక రాజధాని మరకే‹Ùలో జీ20 ఇండియా ప్రెసిడెన్సీలో జరిగిన నాలుగవ, చివరి జీ20 ఆర్థిక మంత్రులు– సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కూడా చిత్రంలో ఉన్నారు. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఈ నెల 11న మారకేచ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆమె 15వ తేదీ వరకూ ఆమె వివిధ దేశాల ప్రతినిధులతో ద్వైమాసిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. -
నిర్మలా సీతారామన్ మొరాకో పర్యటన నేటి నుంచి
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఆరు రోజుల పర్యటన నిమిత్తం మొరాకో బయలుదేరనున్నారు. ఆ దేశ ఆర్థిక రాజధాని మారకేచ్‌లో ఈ ఆరు రోజుల అధికారిక పర్యటనను ప్రారంభించనున్నారు. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో ఆర్థికమంత్రి పాల్గొననున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. దీనితోపాటు ఇండోనేషియా, మొరాకో, బ్రెజిల్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్‌లతో భారత్ ద్వైపాక్షిక సమావేశాలు అక్టోబర్ 11–15 తేదీల మధ్య మరకేచ్‌లో జరగనున్నాయి. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వార్షిక సమావేశాల కోసం వెళుతున్న భారత ప్రతినిధి బృందానికి ఆర్థిక మంత్రి నాయకత్వం వహిస్తున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత్ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అధికారులు ఈ ప్రతినిధి బృందంలో సభ్యులుగా ఉంటారని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ఈ పర్యటనలో, సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నాల్గవ జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి సహ అధ్యక్షత వహిస్తారు.ఈ సమావేశంలో జీ20 దేశాలు, ఆహా్వనిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుండి దాదాపు 65 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. అంతర్జాతీయ సమస్యలు, సవాళ్లు, ఆర్థిక అనిశి్చతి, బహుళజాతి బ్యాంకుల పటిష్టత, క్రిప్టో కరెన్సీ వంటి అంశాలు ఈ సమావేశాల చర్చల్లో ప్రధాన భాగం కానున్నాయి. బహుళజాతి బ్యాంకుల పటిష్టతకు సంబంధించి నిపుణుల గ్రూప్ రూపొందించిన రెండవ వ్యాల్యూమ్ నివేదిక ఈ సమావేశాల్లో విడుదల కానుంది. మొదటి వ్యాల్యూమ్ నివేదిక గుజరాత్ గాం«దీనగర్‌లో జూలైలో జరిగిన మూడవ ఎఫ్‌ఎంసీబీజీ సమావేశాల్లో విడుదలైన సంగతి తెలిసిందే. -
ఎంతకాలం అడుక్కుంటాం.. ముందు చేతిలో చిప్ప విసిరేయాలి
ఇస్లామాబాద్: అసలే అంతంత మాత్రంగా ఉన్న పాకిస్తాన్ దేశ ఆర్ధిక పరిస్థితి ఎప్పటికి కుదుటపడుతుందో తెలీయని అనిశ్చితిలో దొరికిన చోట దొరికినంత అప్పు చేస్తోంది. తాజాగా తన మిత్ర దేశమైన చైనా దగ్గర మరికొంత ఋణం తీసుకునేందుకు అంతా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు సయ్యద్ అసీం మునీర్ స్పందిస్తూ మన చేతిలో ఉన్న చిప్పను అవతలకు విసిరేసి స్వాభిమానంతో బ్రతకడం అలవాటు చేసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ గత కొంతకాలముగా ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క ఉన్న ఆస్తులను అమ్ముకోవడంతో పాటు మరోపక్క రుణాల కోసం కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయాణంలో భాగంగా ఇటీవలే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) దగ్గర కొంత ఋణం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ మిత్రదేశం చైనా దగ్గర మరికొంత రుణాన్ని పొందనుంది. చైనాకు పాకిస్తాన్ ఇప్పటికే 2.07 బిలియన్ డాలర్ల రుణపడి ఉండగా తాజాగా తీసుకోనున్న మరో 600 మిలియన్ డాలర్ల రుణంతో కలిపి ఆ మొత్తం 2.44 బిలియన్ డాలర్లకు చేరనుంది. దీంతో విపరీతంగా పెరుగుతున్న అప్పుల భారం దృష్ట్యా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సయ్యద్ అసీం మునీర్ స్పందించారు. పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ బలపడేంత వరకు సైన్యం నిద్రపోకుండా పనిచేస్తుందని, అపార ప్రతిభావంతులను, ఉత్సాహవంతులైన వారిని చూసి పాకిస్తాన్ గర్విస్తోందని అన్నారు. ఎంతకాలం ఇలా పొరుగుదేశాల దగ్గర చిప్ప పట్టుకుని తిరుగుతాం. ముందు చేతిలోని ఆ చిప్పను విసిరేయాలి. రుణాల కోసం ఇతర దేశాల మీద మీద ఆధారపడటం మానేయాలి. సొంత కాళ్ళ మీద నిలబడి ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయటానికి ప్రయత్నించాలని అన్నారు. ఇది కూడా చదవండి: అక్రమ వలసలకు చెక్.. ఐరోపా దేశాలు-ట్యునీషియా మధ్య ఒప్పందం -
దయనీయంగా పాక్ పరిస్థితి.. బాంబు పేల్చిన ఐఎంఎఫ్, ఇప్పట్లో కష్టమే!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకి దయనీయంగా మారుతోంది. ఈ మేరకు పాకిస్తాన్ ఆర్ధిక స్థితిగతులపై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) 120 పేజీల నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం ప్రస్తుతానికైతే పాకిస్తాన్ అప్పులతో ఏదో ఒక విధంగా నెట్టుకొస్తుంది కానీ భవిష్యత్తులో వారికి మరిన్ని కష్టాలు తప్పవని తేటతెల్లం చేసింది. ఇప్పటికే పాకిస్తాన్ దేశం ఎక్కడెక్కడో ఉన్న వారి ఆస్తులను అమ్ముకుని నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇదే క్రమంలో వాషింగ్టన్ లోని వారి ఎంబసీ భవనాన్ని అమ్మకానికి పెట్టింది. అలాగే కరాచీ, లాహోర్ విమానాశ్రయాలను కూడా లీజుకు ఇవ్వాలన్న ఆలోచన చేస్తోంది. ఇస్లామాబాద్ విమానాశ్రయాన్నైతే ఇప్పటికే అవుట్సోర్సింగ్ కు ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఐఎంఎఫ్ ను ఆర్థిక సహాయం కోరిన విషయం తెలిసిందే. ఐఎంఎఫ్ కొంత నిధులను సమకూర్చినా కూడా పాకిస్తాన్ వారి ప్రస్తుత సంక్షోభం నుండి బయటపడాలంటే మరిన్ని నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది ఐఎంఎఫ్. పాకిస్తాన్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్ తోనూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నర్ జమీల్ అహ్మద్ తోనూ ఆర్థిక ద్రవ్య విధానాలపై వారు చేసిన ఒప్పందం ఆధారంగా నివేదిక తయారుచేశామని ఐఎంఎఫ్ ఈ నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం పాకిస్తాన్ ప్రస్తుత అంతర్గత విధానాలు, దీర్ఘకాలిక చెల్లింపులు దృష్ట్యా వెలుపల నుండి సహకారం అందిస్తున్నవారు మరికొంత కాలం పాక్ ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉండాల్సిన అవసరముందని తెలిపింది ఐఎంఎఫ్. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్ ఈ సంక్షోభం నుండి గట్టెక్కడం కష్టమని నివేదికలో చెప్పకనే చెప్పింది. మరోపక్క పెరుగుతోన్న నిత్యావసర వస్తువుల ధరలకు తాళలేక పాక్ ప్రజలు విలవిలలాడుతున్నారు. వీటితోపాటు ఇటీవలే యూనిట్ పై ఐదు పాకిస్తాన్ రూపాయల విద్యుత్ చార్జీలు, గ్యాస్ చార్జీలు 40% కూడా పెరగడంతో దిక్కుతోచని స్థితిలో జనం కొట్టుమిట్టాడుతున్నారు. ఇది కూడా చదవండి: బ్యూటీ పార్లర్ల నిషేధానికి నిరసనగా రోడ్డెక్కిన ఆఫ్ఘాన్ మహిళలు.. -
అంతర్జాతీయ కరెన్సీగా రూపాయి
ముంబై: రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన స్వల్ప, దీర్ఘ కాల చర్యలను ఆర్బీఐ నియమించిన ప్యానెల్ సిఫారసు చేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) స్పెషల్ డ్రాయంగ్ రైట్స్ (ఎస్డీఆర్) బాస్కెట్లో రూపాయిని చేర్చేందుకు కూడా చర్యలు తీసుకోవాలని కోరింది. ఎస్డీఆర్ అనేది ఐఎంఎఫ్ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ రిజర్వ్ ఆస్తులకు సంబంధించినది. సభ్య దేశాల అధికారిక రిజర్వ్‌లకు మద్దతుగా దీన్ని వినియోగిస్తుంటుంది. ఈ రిజర్వ్ కరెన్సీలను సభ్య దేశాలు స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు. అంటే ఎస్‌డీఆర్‌లు అనేవి సభ్య దేశాల నిధుల అవసరాలకు మద్దతుగా నిలుస్తుంది. ఎస్డీఆర్ బాస్కెట్లో ప్రస్తుతం యూఎస్ డాలర్, యూరో, చైనీస్ యువాన్, జపనీస్ యెన్, బ్రిటిష్ పౌండ్ మాత్రమే ఉన్నాయి. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ఎస్ రాథో అధ్యక్షతన గల ప్యానెల్ ఈ సిఫారసులను ఆర్బీఐకి సమరి్పంచింది. ముందుగా ద్వైపాక్షిక, బహుళపాక్షిక వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా రూపాయి, స్థానిక కరెన్సీల్లో ఇన్వాయిస్, చెల్లింపులు చేయాలని సిఫారసు చేసింది. భారత్‌లో, భారత్ బయట ఐఎన్ఆర్ ఖాతాలు తెరిచేలా ప్రోత్సాహించాలని కోరింది. -
సాయం కాదు, సంక్షోభాలు ఆపాలి!
అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ వద్ద ఉన్న వనరులు ప్రపంచ జీడీపీలో 1.1 శాతం మాత్రమే. దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం ద్వారా లభించే మొత్తాలు ఐఎంఎఫ్ ఇచ్చే రుణాల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఐఎంఎఫ్ కేవలం పర్యవేక్షణకు, నిఘాకు మాత్రమే పరిమితం కావాలి. ఐఎంఎఫ్ తలకెత్తుకుంటున్న చాలా పనులు ఇతర సంస్థలు ఇంతకంటే మెరుగ్గా నిర్వహించగలవు. చేపట్టిన కార్యక్రమాల పరిమాణం, ఇచ్చిన రుణ మొత్తాల ఆధారంగా ఐఎంఎఫ్ విజయాలను లెక్క వేయకూడదు. అగ్నిమాపక దళం సమర్థతను ఎన్నిసార్లు మంటలు ఆర్పగలిగిందో చూడటం ద్వారా కాకుండా... అగ్ని ప్రమాదాలు జరక్కుండా నివారించగలగడంపై అంచనా వేయడమే సరైన పని. ఇదే సూత్రం ఐఎంఎఫ్కూ వర్తిస్తుంది. ఎలాగైతే వాతావరణ మార్పుల మీద ప్రపంచ బ్యాంక్ ఏమీ చేయలేకపోతున్నదో, దాని కవల అయిన ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) సంస్థ కూడా దాని ప్రధాన కార్యకలాపాలపై చేష్టలుడిగి చూస్తోంది. ప్రపంచ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాలపై ఓ కన్నేసి ఉంచేందుకు ఏర్పాటు చేసుకున్న సంస్థ ఇది. కానీ అమెరికాలో బ్యాంకులు కుప్ప గూలాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీ కుదుపులకు లోనవు తోంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్లు పెంచడటంతో ఎదుగు తున్న మార్కెట్లలో రుణాలకు డిమాండ్ పెరిగిపోతోంది. అయినా వీటిని ఎదుర్కోవడంలో ఐఎంఎఫ్ ప్రధాన భూమిక పోషించడం లేదు. లింగవివక్ష, మానవాభివృద్ధి వంటి అంశాల మీద దృష్టి పెడుతూ– అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు సంక్షోభాలను ఎదుర్కొ నేలా, తక్కువ ఆదాయమున్న దేశాలు వృద్ధిని పెంచుకునేలా, పేదరి కాన్ని తగ్గించుకునేలా రూపొందించే కార్యక్రమాల మీద ఐఎంఎఫ్ తన మొత్తం శక్తిని వెచ్చిస్తోంది. కానీ ఇతర సంస్థలు కూడా ఈ పనులు మెరుగ్గా నిర్వహించగలవు. నిఘా నామమాత్రం అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఐఎంఎఫ్‌పై ప్రధానంగా ఆరు అభ్యంతరాలు వినిపిస్తాయి! ఆర్థిక మార్కెట్ల అస్థిరత్వానికి దారితీసే ఓపెక్ కేపిటల్ మార్కెట్లకు అవసరానికి మించి మద్దతివ్వడం వీటిల్లో ఒకటి. ఇక రెండో విమర్శ... అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాలకు భిన్నమైన సలహాలివ్వడం. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలపై నిఘా నామమాత్రంగా సాగడం, ఆ దేశాల విధానాలపై విశ్లేషణ కూడా అంతంతమాత్రంగానే చేయడం మూడో విమర్శ. దీని ప్రభావం చిన్న దేశాలపై కూడా పడుతుందన్నది ఇక్కడ గమనించా ల్సిన విషయం. ప్రపంచస్థాయి సంక్షోభాలను ముందుగానే గుర్తించగలిగే ఐఎంఎఫ్ అసమర్థత కూడా దీనికి జత కలుస్తుంది. ఇప్పుడు నాలుగో విమర్శ విషయానికి వద్దాం. ఐఎంఎఫ్ చేపట్టే కార్యక్రమాల పరిమాణం ఏకపక్షంగా ఉంటుంది. గ్రీస్, పోర్చుగల్, ఐర్లాండ్ వంటి చిన్న యూరోపియన్ దేశాలు తమ కోటా కంటే 30 రెట్లు అదనంగా ఐఎంఎఫ్ ప్రయోజనాలు పొందుతూంటాయి. ఒక వైపు యుద్ధం జరుగుతూండగా, ఉక్రెయిన్‌లో సుమారు 1500 కోట్ల డాలర్ల విలువైన ప్రాజెక్టును హడావిడిగా ఆమోదించారు. ఇదే సమ యంలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక కేవలం 300 కోట్ల డాలర్ల సాయం కోసం నెలలు వేచి చూడాల్సి వచ్చింది. శ్రీలంకకు మిత్రుడని చాటుకున్న చైనా కూడా సాయం కోసం ఏడాదిపాటు నిరీక్షింపజేసిన విషయం గమనార్హం. జీ7 దేశాల రాజకీయ మద్దతు లేకుంటే ఇంతకంటే చాలా తక్కువ మొత్తాలకు కూడా చిన్న దేశాలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఇలా చిన్న మొత్తాలను తీసుకున్నప్పుడు పొదుపునకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడే అవకాశాలూ తక్కువగా ఉంటాయి. బకాయిల వల్ల రుణాలివ్వడం నిలిపేసిన తరువాత కూడా ఐఎంఎఫ్ వరుసగా రుణాలిస్తోందన్నది ఐదవ విమర్శ. ఈ రుణాలు దివాళా తీయడానికే కాకుండా, ద్రవ్య లభ్యత లేమికీ ఇస్తూండటం గమనార్హం. ఐఎంఎఫ్ తరచూ ప్రైవేట్ రుణదాతలకూ డబ్బులిస్తూంటుంది. అది కూడా వారి వాణిజ్య ప్రభుత్వాలకిచ్చిన రుణాలు ప్రజా రుణంగా మారిన తరువాత కూడా. ఈ రుణాలను చెల్లించాల్సిన బాధ్యత పౌరు లపై పడుతుంది. ఐఎంఎఫ్ సభ్యదేశాల్లో 25 శాతం (48) తమ సభ్యత్వ కాలంలో సగంకాలం రుణగ్రహీతలుగా కొనసాగుతున్నాయి. ఇంకోలా చెప్పాలంటే, ఐఎంఎఫ్ ప్రాపకంలో ఉన్నాయన్నమాట. చివరిగా ఐఎంఎఫ్‌పై ఉన్న ఆరో విమర్శ... ఐక్యరాజ్య సమితి లోని పలు విభాగాలు లేదా బ్యాంకులు చేయదగ్గ పనుల్లో ఐఎంఎఫ్ వేలు పెడుతూండటం. రెసిలియ¯Œ్స అండ్ ట్రస్ట్ ఫెసిలిటీ పేరుతో ఏర్పాటు చేసుకున్న కొత్త పథకం ద్వారా ఇరవై ఏళ్ల గరిష్ఠ పరిమితితో సామాజిక కార్యక్రమాలకు రుణాలిస్తోంది. ఇది కాస్తా ఐఎంఎఫ్‌ను ఏదో అంతర్జాతీయ సహాయ సంస్థ స్థాయికి మార్చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచస్థాయి సమస్యలకు పనికిరాదు? 2008–09 ఆర్థిక మాంద్యం, 2020 నాటి కోవిడ్, తాజాగా రష్యా– ఉక్రెయి¯Œ యుద్ధం... ఈ అంశాలపై ఐఎంఎఫ్ వ్యవహారశైలిని గమనిస్తే, తనకున్న నియమ నిబంధనలు, వనరులను దృష్టిలో ఉంచుకుంటే... అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోగల సత్తా ఈ సంస్థకు లేదనే చెప్పాల్సి వస్తుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం, ఆయా ప్రాంతాల్లోని దేశాలు చేసుకునే ఒప్పందాల ప్రకారం లభించే మొత్తాలు ఐఎంఎఫ్ ఇచ్చేదాని కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఐఎంఎఫ్ వద్ద ఉన్న వనరులు ఇప్పుడు సుమారు లక్ష కోట్ల డాలర్లు లేదా ప్రపంచ జీడీపీలో 1.1 శాతం మాత్రమే. ఇది ఒకట్రెండు దేశాల ఆర్థిక సంక్షోభాలను గట్టెక్కించేందుకూ ఉపయోగపడని పరిస్థితి. అంతర్జాతీయ సంక్షోభాల మాట సరేసరి. ఈ మొత్తంలోనూ సగం సొంత వనరుల నుంచి సమ కూర్చున్నవి కాగా, మిగిలిన సగం విచక్షణపై లభించే రుణ ఏర్పాట్లు. ఐఎంఎఫ్ మూలధనాన్ని కనీసం రెట్టింపు చేయాల్సిన అవస రముంది. అలాగే జీడీపీ ఆధారంగా ఎప్పటికప్పుడు సర్దుబాట్లూ చేయాలి. రుణాలపై సంక్షోభం ఏర్పడే పరిస్థితులున్న ఈ తరు ణంలో ఇది మరీ ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఐఎంఎఫ్ ప్రాంతీయ స్థాయిలో లిక్విడిటీ ఏర్పాట్లు చేయడం ద్వారా సూక్ష్మ స్థాయిలో ఆర్థిక స్థిరత్వానికి తోడ్పాటునందించాలి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) కింద సుమారు 660.7 బిలియన్లుఉండగా(ఇది కరెన్సీ కాదు) ఇవి సుమారు 950 బిలియన్ డాలర్లకు సమానం. అంటే ప్రపంచ జీడీపీలో ఒక శాతం కంటే కొంచెం ఎక్కువ. ఒక్కో ఎస్డీఆర్ జారీ రాజకీయ ప్రభావానికి గురవుతూంటుంది. ఎస్‌డీఆర్‌లు ఐదేళ్లకు ఒకసారి ఆటోమెటిక్‌గా జారీ అయ్యేలా చూడాలి. అలాగే వీటి మొత్తం జీడీపీలో కనీసం ఒక్కశాతం ఉండేలా, తక్కువ ఆదాయమున్న దేశాలు ఎక్కువ షేర్లు కేటాయించేలా ఏర్పాట్లు చేయా ల్సిన అవసరముంది. అయితే ఈ అంశాలపై ఏకాభిప్రాయం ఇప్పు డున్న పరిస్థితుల్లో చాలా కష్టం. చిట్ట చివరి రుణ వితరణ సంస్థగా ఉండాలి ఆర్థిక వ్యవస్థకు కేంద్రబిందువుగా సంస్కరణలకు లోనైన ఐఎంఎఫ్ ఉండాలి. అలాగే ఇది కేవలం పర్యవేక్షణకు, నిఘాకు మాత్రమే పరిమితం కావాలి. చేపట్టిన కార్యక్రమాల పరిమాణం, ఇచ్చిన రుణ మొత్తాల ఆధారంగా ఐఎంఎఫ్ విజయాలను లెక్క వేయకూడదు. సూక్ష్మస్థాయిలో వాతావరణ మార్పుల ప్రభావాన్ని అంచనా వేయాలే గానీ... సాయం చేసే సంస్థగా మారకూడదు. ఐఎంఎఫ్‌ను చిట్టచివరి రుణ వితరణ సంస్థగా మాత్రమే పరిగణించాలి. ఉనికిలో ఉండేందుకు మాత్రమే కొత్త కొత్త పథకాలను సృష్టించడం, రుణ వితరణ చేపట్టడం చేయరాదు. అగ్నిమాపక దళం సమర్థతను ఎన్నిసార్లు మంటలు ఆర్ప గలిగిందో చూడటం ద్వారా కాకుండా... అగ్ని ప్రమాదాలు జరక్కుండా నివారించగలగడంపై అంచనా వేయడమే సరైన పని. సెంట్రల్ బ్యాంక్స్ పరస్పర సహకారాన్ని ఐఎంఎఫ్ ప్రోత్సహించాలి. అలాగే ప్రాంతీయ స్థాయిలో సహాయానికి కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. గతంలో ఇలాంటి ప్రయత్నాలను ఐఎంఎఫ్ నిరోధించిన మాట అందరికీ తెలిసిందే. అన్ని దేశాలకు సాయం చేసే ఏకైక సంస్థగా మారడం కాకుండా... ఆర్థిక సుస్థిరత కోసం బహుముఖీనంగా పని చేసే మరింత శక్తిమంతమైన వ్యవస్థగా ఎదిగేందుకు ఐఎంఎఫ్ ప్రయత్నించాలి. వ్యాసకర్త జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో విజిటింగ్ స్కాలర్ (‘ద బిజినెస్ స్టాండర్డ్’ సౌజన్యంతో) -
సాయం కాదు, సంక్షోభాలు ఆపాలి!
అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ వద్ద ఉన్న వనరులు ప్రపంచ జీడీపీలో 1.1 శాతం మాత్రమే. దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం ద్వారా లభించే మొత్తాలు ఐఎంఎఫ్ ఇచ్చే రుణాల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఐఎంఎఫ్ కేవలం పర్యవేక్షణకు, నిఘాకు మాత్రమే పరిమితం కావాలి. ఐఎంఎఫ్ తలకెత్తుకుంటున్న చాలా పనులు ఇతర సంస్థలు ఇంతకంటే మెరుగ్గా నిర్వహించగలవు. చేపట్టిన కార్యక్రమాల పరిమాణం, ఇచ్చిన రుణ మొత్తాల ఆధారంగా ఐఎంఎఫ్ విజయాలను లెక్క వేయకూడదు. అగ్నిమాపక దళం సమర్థతను ఎన్నిసార్లు మంటలు ఆర్పగలిగిందో చూడటం ద్వారా కాకుండా... అగ్ని ప్రమాదాలు జరక్కుండా నివారించగలగడంపై అంచనా వేయడమే సరైన పని. ఇదే సూత్రం ఐఎంఎఫ్కూ వర్తిస్తుంది. ఎలాగైతే వాతావరణ మార్పుల మీద ప్రపంచ బ్యాంక్ ఏమీ చేయలేకపోతున్నదో, దాని కవల అయిన ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) సంస్థ కూడా దాని ప్రధాన కార్యకలాపాలపై చేష్టలుడిగి చూస్తోంది. ప్రపంచ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాలపై ఓ కన్నేసి ఉంచేందుకు ఏర్పాటు చేసుకున్న సంస్థ ఇది. కానీ అమెరికాలో బ్యాంకులు కుప్ప గూలాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీ కుదుపులకు లోనవుతోంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్లు పెంచడటంతో ఎదుగుతున్న మార్కెట్లలో రుణాలకు డిమాండ్ పెరిగిపోతోంది. అయినా వీటిని ఎదుర్కోవడంలో ఐఎంఎఫ్ ప్రధాన భూమిక పోషించడం లేదు. లింగవివక్ష, మానవాభివృద్ధి వంటి అంశాల మీద దృష్టి పెడుతూ– అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు సంక్షోభాలను ఎదుర్కొ నేలా, తక్కువ ఆదాయమున్న దేశాలు వృద్ధిని పెంచుకునేలా, పేదరి కాన్ని తగ్గించుకునేలా రూపొందించే కార్యక్రమాల మీద ఐఎంఎఫ్ తన మొత్తం శక్తిని వెచ్చిస్తోంది. కానీ ఇతర సంస్థలు కూడా ఈ పనులు మెరుగ్గా నిర్వహించగలవు. నిఘా నామమాత్రం అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఐఎంఎఫ్‌పై ప్రధానంగా ఆరు అభ్యంతరాలు వినిపిస్తాయి! ఆర్థిక మార్కెట్ల అస్థిరత్వానికి దారితీసే ఓపెన్ కేపిటల్ మార్కెట్లకు అవసరానికి మించి మద్దతివ్వడం వీటిల్లో ఒకటి. ఇక రెండో విమర్శ... అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాలకు భిన్నమైన సలహాలివ్వడం. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలపై నిఘా నామమాత్రంగా సాగడం, ఆ దేశాల విధానాలపై విశ్లేషణ కూడా అంతంతమాత్రంగానే చేయడం మూడో విమర్శ. దీని ప్రభావం చిన్న దేశాలపై కూడా పడుతుందన్నది ఇక్కడ గమనించా ల్సిన విషయం. ప్రపంచస్థాయి సంక్షోభాలను ముందుగానే గుర్తించగలిగే ఐఎంఎఫ్ అసమర్థత కూడా దీనికి జత కలుస్తుంది. ఇప్పుడు నాలుగో విమర్శ విషయానికి వద్దాం. ఐఎంఎఫ్ చేపట్టే కార్యక్రమాల పరిమాణం ఏకపక్షంగా ఉంటుంది. గ్రీస్, పోర్చుగల్, ఐర్లాండ్ వంటి చిన్న యూరోపియన్ దేశాలు తమ కోటా కంటే 30 రెట్లు అదనంగా ఐఎంఎఫ్ ప్రయోజనాలు పొందుతూంటాయి. ఒక వైపు యుద్ధం జరుగుతూండగా, ఉక్రెయిన్ లో సుమారు 1500 కోట్ల డాలర్ల విలువైన ప్రాజెక్టును హడావిడిగా ఆమోదించారు. ఇదే సమయంలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక కేవలం 300 కోట్ల డాలర్ల సాయం కోసం నెలలు వేచి చూడాల్సి వచ్చింది. శ్రీలంకకు మిత్రుడని చాటుకున్న చైనా కూడా సాయం కోసం ఏడాదిపాటు నిరీక్షింపజేసిన విషయం గమనార్హం. జీ7 దేశాల రాజకీయ మద్దతు లేకుంటే ఇంతకంటే చాలా తక్కువ మొత్తాలకు కూడా చిన్న దేశాలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఇలా చిన్న మొత్తాలను తీసుకున్నప్పుడు పొదుపునకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడే అవకాశాలూ తక్కువగా ఉంటాయి. బకాయిల వల్ల రుణాలివ్వడం నిలిపేసిన తరువాత కూడా ఐఎంఎఫ్ వరుసగా రుణాలిస్తోందన్నది ఐదవ విమర్శ. ఈ రుణాలు దివాళా తీయడానికే కాకుండా, ద్రవ్య లభ్యత లేమికీ ఇస్తూండటం గమనార్హం. ఐఎంఎఫ్ తరచూ ప్రైవేట్ రుణదాతలకూ డబ్బులిస్తూంటుంది. అది కూడా వారి వాణిజ్య ప్రభుత్వాలకిచ్చిన రుణాలు ప్రజా రుణంగా మారిన తరువాత కూడా. ఈ రుణాలను చెల్లించాల్సిన బాధ్యత పౌరు లపై పడుతుంది. ఐఎంఎఫ్ సభ్యదేశాల్లో 25 శాతం (48) తమ సభ్యత్వ కాలంలో సగంకాలం రుణగ్రహీతలుగా కొనసాగుతున్నాయి. ఇంకోలా చెప్పాలంటే, ఐఎంఎఫ్ ప్రాపకంలో ఉన్నాయన్నమాట. చివరిగా ఐఎంఎఫ్‌పై ఉన్న ఆరో విమర్శ... ఐక్యరాజ్య సమితి లోని పలు విభాగాలు లేదా బ్యాంకులు చేయదగ్గ పనుల్లో ఐఎంఎఫ్ వేలు పెడుతూండటం. రెసిలియన్్స అండ్ ట్రస్ట్ ఫెసిలిటీ పేరుతో ఏర్పాటు చేసుకున్న కొత్త పథకం ద్వారా ఇరవై ఏళ్ల గరిష్ఠ పరిమితితో సామాజిక కార్యక్రమాలకు రుణాలిస్తోంది. ఇది కాస్తా ఐఎంఎఫ్‌ను ఏదో అంతర్జాతీయ సహాయ సంస్థ స్థాయికి మార్చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచస్థాయి సమస్యలకు పనికిరాదు? 2008–09 ఆర్థిక మాంద్యం, 2020 నాటి కోవిడ్, తాజాగా రష్యా– ఉక్రెయిన్ యుద్ధం... ఈ అంశాలపై ఐఎంఎఫ్ వ్యవహారశైలిని గమనిస్తే, తనకున్న నియమ నిబంధనలు, వనరులను దృష్టిలో ఉంచుకుంటే... అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోగల సత్తా ఈ సంస్థకు లేదనే చెప్పాల్సి వస్తుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం, ఆయా ప్రాంతాల్లోని దేశాలు చేసుకునే ఒప్పందాల ప్రకారం లభించే మొత్తాలు ఐఎంఎఫ్ ఇచ్చేదాని కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఐఎంఎఫ్ వద్ద ఉన్న వనరులు ఇప్పుడు సుమారు లక్ష కోట్ల డాలర్లు లేదా ప్రపంచ జీడీపీలో 1.1 శాతం మాత్రమే. ఇది ఒకట్రెండు దేశాల ఆర్థిక సంక్షోభాలను గట్టెక్కించేందుకూ ఉపయోగపడని పరిస్థితి. అంతర్జాతీయ సంక్షోభాల మాట సరేసరి. ఈ మొత్తంలోనూ సగం సొంత వనరుల నుంచి సమ కూర్చున్నవి కాగా, మిగిలిన సగం విచక్షణపై లభించే రుణ ఏర్పాట్లు. ఐఎంఎఫ్ మూలధనాన్ని కనీసం రెట్టింపు చేయాల్సిన అవస రముంది. అలాగే జీడీపీ ఆధారంగా ఎప్పటికప్పుడు సర్దుబాట్లూ చేయాలి. రుణాలపై సంక్షోభం ఏర్పడే పరిస్థితులున్న ఈ తరుణంలో ఇది మరీ ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఐఎంఎఫ్ ప్రాంతీయ స్థాయిలో లిక్విడిటీ ఏర్పాట్లు చేయడం ద్వారా సూక్ష్మ స్థాయిలో ఆర్థిక స్థిరత్వానికి తోడ్పాటునందించాలి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) కింద సుమారు 660.7 బిలియన్లు ఉండగా(ఇది కరెన్సీ కాదు) ఇవి సుమారు 950 బిలియన్ డాలర్లకు సమానం. అంటే ప్రపంచ జీడీపీలో ఒక శాతం కంటే కొంచెం ఎక్కువ. ఒక్కో ఎస్డీఆర్ జారీ రాజకీయ ప్రభావానికి గురవుతూంటుంది. ఎస్‌డీఆర్‌లు ఐదేళ్లకు ఒకసారి ఆటోమెటిక్‌గా జారీ అయ్యేలా చూడాలి. అలాగే వీటి మొత్తం జీడీపీలో కనీసం ఒక్కశాతం ఉండేలా, తక్కువ ఆదాయమున్న దేశాలు ఎక్కువ షేర్లు కేటాయించేలా ఏర్పాట్లు చేయా ల్సిన అవసరముంది. అయితే ఈ అంశాలపై ఏకాభిప్రాయం ఇప్పు డున్న పరిస్థితుల్లో చాలా కష్టం. చిట్ట చివరి రుణ వితరణ సంస్థగా ఉండాలి ఆర్థిక వ్యవస్థకు కేంద్రబిందువుగా సంస్కరణలకు లోనైన ఐఎంఎఫ్ ఉండాలి. అలాగే ఇది కేవలం పర్యవేక్షణకు, నిఘాకు మాత్రమే పరిమితం కావాలి. చేపట్టిన కార్యక్రమాల పరిమాణం, ఇచ్చిన రుణ మొత్తాల ఆధారంగా ఐఎంఎఫ్ విజయాలను లెక్క వేయకూడదు. సూక్ష్మస్థాయిలో వాతావరణ మార్పుల ప్రభావాన్ని అంచనా వేయాలే గానీ... సాయం చేసే సంస్థగా మారకూడదు. ఐఎంఎఫ్‌ను చిట్టచివరి రుణ వితరణ సంస్థగా మాత్రమే పరిగణించాలి. ఉనికిలో ఉండేందుకు మాత్రమే కొత్త కొత్త పథకాలను సృష్టించడం, రుణ వితరణ చేపట్టడం చేయరాదు. అగ్నిమాపక దళం సమర్థతను ఎన్నిసార్లు మంటలు ఆర్ప గలిగిందో చూడటం ద్వారా కాకుండా... అగ్ని ప్రమాదాలు జరక్కుండా నివారించగలగడంపై అంచనా వేయడమే సరైన పని. సెంట్రల్ బ్యాంక్స్ పరస్పర సహకారాన్ని ఐఎంఎఫ్ ప్రోత్సహించాలి. అలాగే ప్రాంతీయ స్థాయిలో సహాయానికి కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. గతంలో ఇలాంటి ప్రయత్నాలను ఐఎంఎఫ్ నిరోధించిన మాట అందరికీ తెలిసిందే. అన్ని దేశాలకు సాయం చేసే ఏకైక సంస్థగా మారడం కాకుండా... ఆర్థిక సుస్థిరత కోసం బహుముఖీనంగా పని చేసే మరింత శక్తిమంతమైన వ్యవస్థగా ఎదిగేందుకు ఐఎంఎఫ్ ప్రయత్నించాలి. అజయ్ ఛిబ్బర్ వ్యాసకర్త జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో విజిటింగ్ స్కాలర్ (‘ద బిజినెస్ స్టాండర్డ్’ సౌజన్యంతో) -
భారత్ వృద్ధి రేటు 5.9 శాతమే!
వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సంలో (2023–24) 5.9 శాతానికి పరిమితం అవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజాగా అంచనావేసింది. ఈ మేరకు క్రితం 6.1 శాతం అంచనాలకు 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. అయితే 5.9 శాతం వృద్ధి సాధించినప్పటికీ, ఇది ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి రేటు కావడం గమనార్హం. సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ ఎకానమీ పటిష్ట పనితీరును కనబరుస్తుందని అభిప్రాయపడింది. కాగా, మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు అంచనాలను 6.8 శాతంగా ఐఎంఎఫ్ ప్రపంచ వార్షిక ఎకనమిక్ అవుట్‌లుక్ అంచనావేస్తోంది. 2024–25లో భారత్ వృద్ధి రేటు అంచనాలను సైతం క్రితం (జనవరిలో) 6.8 శాతం అంచనాల నుంచి అవుట్‌లుక్ 6.3 శాతానికి తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకన్నా భారత్ వృద్ధికి సంబంధించి ఐఎంఎఫ్ అంచనాలు తక్కువగా ఉండడం గమనార్హం. 2022–23లో 7 శాతం, 2023–24లో 6.4 శాతం వృద్ధిని ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2022–23 భారత్ జీడీపీ అధికారిక గణాంకాలు వెలువడాల్సి ఉంది. నివేదికలో మరికొన్ని అంశాలు చూస్తే... ► 2023లో చైనా వృద్ధి రేటు 5.2 శాతంగా ఉంటుంది. 2024లో ఈ రేటు 4.5 శాతానికి తగ్గుతుంది. అయితే 2022లో నమోదయిన 3 శాతం వృద్ధిరేటు కన్నా తాజా అంచనాలు అధికంగా ఉండడం గమనార్హం. ► మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల ఎదురవుతున్న సవాళ్ల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతున్నట్లే కనబడుతోంది. చైనా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. సరఫరాల సమస్యలు తొలుగుతున్నాయి. అయితే ఇప్పుడు ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా సెంట్రల్ బ్యాంకులు అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానమే వృద్ధికి ప్రతికూలతలు సృష్టించవచ్చు. ► ప్రపంచ ఆర్థిక వృద్ధి 2023లో 2.8 శాతంగా నమోదుకావచ్చు. 2024లో ఈ రేటు 3 శాతానికి పెరుగుతుందని అంచనావేస్తున్నాం. ► 2022లో 8.7 శాతంగా ఉన్న గ్లోబల్ ఇన్ఫ్లెషన్ (అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం) 2023లో 7 శాతానికి, 2024లో 4.9 శాతానికి తగ్గవచ్చు. ► యూరోజోన్, బ్రిటన్లు మందగమనం అంచన నిలబడ్డాయి. యూరోజోన్‌లో 2023లో కేవలం 0.8 శాతం వృద్ది నమోదయ్యే అవకాశం ఉంది. బ్రిటన్‌లో అసలు వృద్ధిలేకపోగా 0.3 శాతం క్షీణత నమోదుకావచ్చు. అయితే 2024లో ఈ రేట్లు వరుసగా 1.4 శాతం, 1 శాతం వృద్ధి బాటకు మళ్లవచ్చు. -
పరిస్థితులు బాలేవు.. ఆర్థిక క్రమశిక్షణ అవసరం
న్యూఢిల్లీ: అమెరికాలో ఇటీవలి పరిణామాల తర్వాత ప్రపంచ అనిశ్చితి పెరుగుతోందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, కంపెనీలు, వ్యక్తులు తమతమ ఆర్థిక, కార్పొరేట్, పొదుపు ఖాతా ప్రణాళికలో ’భద్రత మార్జిన్లను’ జాగ్రత్తగా నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి సంబంధించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) జనవరిలో ఇచ్చిన అంచనాలు పాతవిగా కనిపిస్తున్నాయని పేర్కొన్న ఆయన, గత వారంలో అమెరికాలో జరిగిన పరిణామాలు ఆర్థిక విశ్వాసం, బ్యాంకింగ్ రుణాల వృద్ధి, సంబంధిత సరఫరాల వ్యవస్థలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయన్న విషయం తాజాగా తేలాల్సి ఉందని అన్నారు. ప్రపంచ వృద్ధికి మరింత విఘాతంగా ఆయా పరిణామాలు కనిపిస్తున్నాయని అన్నారు. వారం రోజుల వ్యవధిలో అమెరికాలో రెండు బ్యాంకులు (సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్) మూతబడగా తాజాగా స్విట్జర్లాండ్‌కి చెందిన క్రెడిట్ సూసీ భవిష్యత్తుపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగం పరిస్థితుల పై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన క్రిసిల్ ఇండియా అవుట్‌లుక్ సెమినార్‌ను ఉద్దేశించి అనంత నాగేశ్వరన్ ప్రసంగిస్తూ.. ప్రపంచ, భారత్ ఎకానమీ అంశాలను చర్చించారు. ఆయ న ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► అనిశ్చితి పెరుగుతున్న ధోరణి కనిపిస్తోంది. గత వారంలో కొన్ని తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి ప్రతికూల వాతావారణం ఈ ఏడాది మాత్రమే కాకుండా వచ్చే ఏడాది కూడా కొనసాగవచ్చు. ఆయా తీవ్ర పరిణామాలను దేశాలు ఎదుర్కొనాల్సి రావచ్చు. ► గత వారంలో జరిగిన పరిణామాలు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపును ఆపాల్సిన పరిస్థితిని, అవసరాన్ని సృష్టించింది. ఈ పరిస్థితుల్లో అమెరికాలో వడ్డీ రేట్ల పరిస్థితి ఏమిటి? డాలర్ల దారి ఎటు అన్న అంశంపై మీమాంస నెలకొంది. ► తాజా పరిణామాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ఎలాంటి చిక్కులను కలిగిస్తాయన్న అంశాన్ని ఇక్కడ పరిశీలించాలి. ఒక కోణంలో ఆయా దేశాలకు సంబంధించి కరెన్సీలపై ఒత్తిడి తగ్గుతుందని, ఇది సానుకూల అంశమని నేను విశ్వసిస్తున్నాను. వడ్డీరేట్ల పెంపుకే అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ కట్టుబడితే, ప్రపంచంలోని పలు దేశాలకు ఇది ఒక సవాలునే సృష్టిస్తుంది. ► ఈ తరుణంలో భారతదేశం వంటి దేశాలపై ఈ పరిణామాల ప్రభావాన్ని లెక్కించడం ప్రస్తుతం కొంత క్లిష్టమైన అంశమే. ఎగుమతుల వృద్ధిపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉన్నప్పటికీ, మొత్తంగా క్లిష్ట ఆర్థిక పరిస్థితులను భారత్ తట్టుకోగలదని విశ్వసిస్తున్నాను. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ 7 శాతం స్థూల దేశీయోత్పత్తిని సాధిస్తుందని విశ్వసిస్తున్నాం. ప్రస్తుత పరిధులలో ఉష్ణోగ్రతలు భారత్‌లో కొనసాగితే, (ముందుగా విత్తడం వల్ల) గోధుమ పంటకు సంబంధించి మనం సానుకూల ఫలితాన్ని పొందుతాయి. ఈ అంశాలు చక్కటి పంట దిగుబడికి, ద్రవ్యోల్బణం కట్టడి కి, సరళతర ద్రవ్య పరపతి విధానాలకు తద్వా రా ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. ఆయా అంశాలను పరిశీలనలోకి తీసుకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్ కనీసం 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందన్న విశ్వాసం ఉంది. ► ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, భారత్‌లో దాదా పు అన్ని రంగాలూ కోవిడ్–19 ముందస్తు స్థితి కి చేరుకున్నాయి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) లో వినియోగం వాటా కూడా పెరుగుతోంది. ► ప్రస్తుత అనిశ్చితి వాతావరణంలో 8–9 శాతం జీడీపీ వృద్ధిరేటు గురించి ఎక్కువగా ఆశాజనకంగా ఉండకూడదు. వచ్చే 7–8 సంవత్సరాలలో 6.4 నుంచి 7 శాతం శ్రేణిలో వృద్ధి సాధించగలిగినా అది మనం మంచి ఫలితం సాధించినట్లే. 2023–24లో 6 శాతం వృద్ధి: క్రిసిల్ భారత్ వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) 6 శాతం వృద్ధిని సాధించవచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనావేసింది. ప్రైవేట్ రంగంలో పెరుగుతున్న మూలధన పెట్టుబడులు ఇందుకు దోహదపడతాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. పలు సంస్థల 6.5%–7% అంచనాలకన్నా క్రిసిల్ లెక్క మరింత తక్కువగా ఉండ డం గమనార్హం. కాగా, వచ్చే ఐదు ఆర్థిక సంవత్సరాల్లో భారత్ ఎకానమీ సగటున 6.8% వృద్ధిని నమోదుచేసుకుంటుందన్న అంచనాలను క్రిసిల్ తన వార్షిక నివేదిక వెలువరించింది. ఈ సందర్భంగా క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ డీకే జోషి మాట్లాడుతూ, 2022–23లో ఆర్బీఐ రెపో రేటుకు ప్రాతిపదిక అయి న రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 6.8 శాతంగా నమోదవుతుందని అన్నా రు. అయితే ప్రధానంగా బేస్ ఎఫెక్ట్‌తోపాటు క్రూడ్, కమోడిటీ ధరల తగ్గుదల కారణంగా 2023– 24లో రిటైల్ ద్రవ్యోల్బణం 5%కి దిగివస్తుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మంచి రబీ దిగుబడి కూడా ద్రవ్యోల్బణం కట్టడికి దోహ దపడుతుందని అంచనావేశారు. 2023–24లో కార్పొరేట్ రంగం రెవెన్యూ వసూళ్లు రెండంకెల్లో ఉంటాయని కూడా జోషి అభిప్రాయపడ్డారు. మార్కెట్ల సంక్షోభాన్ని సులువుగా దాటేయగలం ► చౌక క్రూడాయిల్ దేశానికి సానుకూలం ► అంతర్జాతీయ అనిశ్చితిపై ఉదయ్ కొటక్ వ్యాఖ్యలు స్థూల ఆర్థికాంశాలు సానుకూలంగా మారుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్ల సంక్షోభాన్ని భారత్ సులువుగా దాటేయగలదని కొటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో ఉదయ్ కొటక్ వ్యాఖ్యానించారు. ముడి చమురు రేట్లు తగ్గడం, కరెంటు అకౌంటు లోటు తగ్గుతుండటం మొదలైనవి దేశానికి సానుకూలాంశాలని గురువారం ఒక ట్వీట్లో ఆయన పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో సంక్షోభం కొనసాగుతోంది. అదే సమయంలో, భారత్‌కు సంబంధించి స్థూల ఆర్థికాంశాలు సానుకూలంగా మారుతున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో కరెంటు అకౌంటు లోటు 2.5% లోపు ఉండవచ్చని అంచనాలు నెలకొన్నా యి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 2 శాతం దిగువకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి, మనం చెప్పేది చేసి, జాగ్రత్తగా వ్యవç ßæరిస్తే ఈ సంక్షోభం నుంచి సులువుగానే బైటపడవచ్చు‘ అని కొటక్ పేర్కొన్నారు. అమెరికాలో వారం రోజుల వ్యవధిలో రెండు బ్యాంకులు (ఎస్వీబీ, సిగ్నేచర్) మూతబడటంతో మార్కె ట్లు అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఆయ న వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ప్రపంచ ఎకానమీలో భారత్ వెలుగులు
వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ‘‘ప్రకాశవంతమైన ప్రాంతం‘గా కొనసాగుతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) క్రిస్టాలినా జార్జివా అన్నారు. 2023లో ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 15 శాతంగా ఉంటుందని భారత్‌లో పర్యటించనున్న ఆమె అంచనా వేశారు. కరోనా మహమ్మారి సమస్య నుంచి ప్రపంచంలోని ఐదవ–అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను ‘‘డిజిటలైజేషన్’’ బయటపడవేయగలిగిందన్నారు. దీనికితోడు దేశం అనుసరిస్తున్న వివేకవంతమైన ఆర్థిక విధానం, వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23)లో మూలధన పెట్టుబడులను గణనీయంగా పెంచుతూ (33 శాతం పెంపుతో రూ.10 లక్షల కోట్లకు) బడ్జెట్లో తీసుకున్న కీలక నిర్ణయాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతుండడం దేశ వృద్ధి వేగాన్ని కొనసాగించడంలో సహాయపడతాయని జార్జివా పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు తెలిపిన అభిప్రాయాల్లో కొన్ని ముఖ్యాంశాలు... ► 2022–23లో భారత్ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉండొచ్చు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 6.1%గా ఉంటుందన్నది మా అభిప్రాయం. ఆయా గణాంకాలు దేశాన్ని ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీగా నిలుపుతాయి. ► ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును 5.9 శాతానికి తగ్గించాలన్న ప్రభుత్వ చిత్తశుద్ధి అభినందనీయం. ► భారత్ ఎకానమీ మిగతా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలాగా కాస్త నెమ్మదించినప్పటికీ, ప్రపంచ సగటు కంటే, భారత్ వృద్ధి వేగం ఎక్కువగా ఉంది. 2023లో ప్రపంచ వృద్ధిలో భారతదేశం వాటా దాదాపు 15 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. ► దేశాన్ని ‘గ్రీన్ ఎకానమీ’ వైపు మళ్లించడానికి, తద్వారా వృద్ధిని కొనసాగించడానికి పునరుత్పాదక ఇంధనాలతో సహా వివిధ విభాగాల్లో పెట్టుబడులు పెట్టడంపై భారతదేశం ఎంత శ్రద్ధ కనబరుస్తోందో నేను ప్రత్యేకంగా గమనించాను. -
బ్రిటన్కేమైంది? ముసురుకుంటున్న మాంద్యం.. తీవ్ర ఆర్థిక సంక్షోభం!
యునైటెడ్ కింగ్డమ్. స్థిరత్వానికి మారుపేరు. ఎన్ని సంక్షోభాలు, ప్రపంచ యుద్ధాలు జరిగినా ఆర్థిక మూలాలు చెక్కు చెదరని దేశం. కానీ ఇప్పుడు ఆ దేశం కనీవినీ ఎరుగని గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. ఏడాదిలో ముగ్గురు ప్రధానమంత్రులు మారారు. అయినా బలహీనపడిపోతున్న ఆర్థిక వ్యవస్థని కాపాడే దిక్కు లేకుండా పోయింది. ధనిక దేశాల కంటే అన్నింట్లోనూ వెనుకబడిపోతూ మాంద్యం ఉచ్చులో చిక్కుకుంటోంది. నానాటికీ పతనం... బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి పతనమైపోతోంది. ధరాభారం ప్రజల జేబుల్ని గుల్ల చేస్తోంది. పెరుగుతున్న ధరలకి తగ్గట్టుగా ఆదాయాలు పెరగకపోవడంతో ప్రజలకి కొనుక్కొని తినే స్థోమత కూడా కరువు అవుతోంది.దీంతో సమాజంలోని వివిధ వర్గాలు వేతనాల పెంపు డిమాండ్‌తో సమ్మెకు దిగుతున్నాయి. ప్రపంచంలోని మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలు ఈ ఏడాది ఆర్థికంగా పుంజుకుంటే బ్రిటన్ మరింత క్షీణిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేస్తోంది. ఆర్థిక మాంద్యం ఎదుర్కోక తప్పదని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో చమురు లభ్యత చాలా దేశాలకు అతి పెద్ద సమస్యగా మారింది. అమెరికా తన సొంత గడ్డపై లభించే శిలాజ ఇంధనాలపై ఆధారపడితే, ఫ్రాన్స్ అణు విద్యుత్‌పైనా, నార్వే జలవిద్యుత్‌పైన ఆధారపడ్డాయి. యూకే గ్యాస్‌పైనే ఆధారపడే దేశం కావడంతో విద్యుత్ బిల్లులు తడిసిపోపెడైపోయాయి. ఒకానొక దశలో 100% పెరిగాయి. దేశం ఆర్థికంగా కుదేలు కావడానికి ఇంధనం అసలు సిసలు కారణమని ఫిస్కల్ స్టడీస్ ఇనిస్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ కార్ల్ ఎమ్మర్సన్ అభిప్రాయపడ్డారు. జీ–7 దేశాల్లో వెనక్కి అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి సంపన్న దేశాల కంటే బ్రిటన్ ఎందుకు వెనుకబడిందనే చర్చ జరుగుతోంది. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రపంచ ఆర్థిక వ్యవస్థలనే ఛిన్నాభిన్నం చేశాయి. కరోనా విసిరిన సవాళ్ల నుంచి కోలుకునే దశలో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన యుద్ధం పులి మీద పుట్రలా మారింది. అన్నింటిని తట్టుకొని ధనిక దేశాలు మళ్లీ పూర్వ స్థితికి వస్తూ ఉంటే బ్రిటన్ మాత్రం కోలుకోలేకపోతోంది. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. రాజకీయాలు, వాతావరణ పరిస్థితులు వంటివి కూడా ప్రభావం చూపిస్తాయి. ఇతర దేశాలు విద్య, ఆరోగ్య రంగం ఆధారంగా పరిస్థితుల్ని అంచనా వేస్తే బ్రిటన్ మాత్రం సేవల ఆధారంగా నిర్ణయిస్తుంది. జీ–7 దేశాలన్నీ ఈ ఏడాది కోలుకుంటాయని ఐఎంఎఫ్ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. కానీ బ్రిటన్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. డాలర్‌తో పౌండ్ విలువ : 0.83 బ్రిటన్ జీడీపీ వృద్ధి రేటు అంచనా: 0.6% ద్రవ్యోల్బణం : 10.1% బ్రెగ్జిట్ దెబ్బ... ప్రపంచదేశాలు కరోనా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి సంక్షోభాలను ఎదుర్కొంటే బ్రిటన్ ఆర్థిక సమస్యలకు బ్రెగ్జిట్ అదనపు కారణంగా నిలిచింది. 2016లో యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచీ దేశానికి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. బ్రెగ్జిట్ కారణంగా యూకే ఆర్థిక వ్యవస్థకు ఏడాదికి ఏకంగా 10 వేల కోట్ల పౌండ్ల నష్టం వాటిల్లుతోందని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. దీర్ఘకాలంలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 4 శాతానికి తగ్గుతుందని తెలిపింది. 2021 జనవరి నుంచి బ్రిటన్ నుంచి ఈయూకు ఎగుమతులు 16% పడిపోయాయి. ఈయూ నుంచి వచ్చే పెట్టుబడులు 2,900 కోట్ల పౌండ్లు తగ్గిపోయాయి. శ్రామికులు కావలెను... బ్రెగ్జిట్ ముందు వరకు ఈయూ నుంచి బ్రిటన్‌కి స్వేచ్ఛగా పని చేయడానికి వచ్చేవారు. ఇప్పుడు వర్కర్లు రావడం మానేశారు. ఫలితంగా ఆతిథ్యం, వ్యవసాయం, సేవా రంగాల్లో సిబ్బంది కొరత ఏర్పడింది. యువత పని చేయడం కంటే ఉన్నత చదువులపై దృష్టి పెడుతూ ఉంటే, వయసు మీద పడ్డ వారు ముందస్తుగా పదవీ విరమణ చేస్తున్నారు. అత్యధికులు రోగాల పాలై ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారే తప్ప పని చేసే వారి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. ఇవన్నీ దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాకిస్తాన్ రూపాయి రికార్డు స్థాయిలో పతనం.. శ్రీలంక సీన్ రిపీట్!
ఇస్లామాబాద్: దాయాది దేశంలో పాకిస్తాన్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్తాన్ కరెన్సీ(రూపాయి) విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. రూపాయి విలువ గురువారం డాలర్‌కు 255 రూపాయలకు పడిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కేవలం ఒక్కరోజులోనే 24 రూపాయలు పతనమైనట్లు తెలిపాయి. ఇక, బుధవారం పాక్ కరెన్సీ విలువ రూ. 230.89గా ఉండగా.. అది గురువారానికి రికార్డు స్థాయిలో పతనమైంది. అయితే, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కెందుకు పాక్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే కరెన్సీ మారకపు రేటు నిబంధనలను మరింత సరళతరం చేసింది. దీంతో, కరెన్సీ విలువ ఒక్కసారిగా పడిపోయింది. మరోవైపు.. కరెన్సీపై పాక్ ప్రభుత్వం నియంత్రణలను సరళీకరించాలని, రూపాయి మారకపు విలువను మార్కెట్ నిర్ణయించేలా చూడాలని ఐఎంఎఫ్(అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) పాకిస్తాన్‌ను కోరింది. ఈ క్రమంలోనే ఐఎంఎఫ్ వద్ద ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 6.5 బిలియన్ డాలర్ల నిధుల విడుదలకు ఆమోదం తెలుపుతుందనే ఉద్దేశంతో పాకిస్తాన్ వెంటనే ఈ నిబంధనకు అంగీకారం తెలిపింది. ఇదిలా ఉండగా.. 2019లోనే పాకిస్తాన్‌కు సాయం అందించేందుకు ఐఎంఎఫ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కానీ, 6.5 బిలియన్ డాలర్ల సాయం విషయంలో కొన్ని షరతులు విధించింది. పాక్‌కు నిధులు ఇవ్వాలంంటే కరెంట్స్ సబ్సిడీలను ఉపసహరించుకోవాలని ఐఎంఎఫ్ సూచించింది. అలాగే, పాక్ రూపాయి మారక విలువను మార్కెట్ ఆధారంగా నిర్ణయించాలనీ, లెటర్ ఆఫ్ క్రెడిట్లపై నిషేధం తొలగించాలని ఐఎంఎఫ్ కండీషన్స్ పెట్టింది. అయితే, ఈ షరతులకు అప్పటో పాకిస్తాన్ ఒప్పుకోలేదు. దీంతో, ఆర్థిక సాయం నిలిచింది. తాజా పరిస్థితుల్లో ఆర్థిక సాయం తప్పనిసరి కావడంతో పాక్ ఐఎంఎఫ్ షరతులకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్తాన్లో పలు ప్రాంతాల్లో ఇప్పటికే విద్యుత్ సంక్షోభం నెలకొనగా, ఆహార ధాన్యాల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఒక ప్యాకెట్ పిండి రూ.3వేల కంటే ఎక్కువ ధర పలుకుతోంది. అంతే కాకుండా పాకిస్తానీలు ఆహార ట్రక్కుల వెంట పరుగులు తీస్తున్న వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. విదేశీ మారక నిల్వల తగ్గిపోవడంతో ఇంధన కొరతకు దారి తీసింది. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద దారి పొడవునా వాహనదారులు బారులుతీరారు. పొదుపు చర్యలే శరణమంటున్న పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ పొదుపు చర్యలపై దృష్టి పెట్టింది. ఎంపీల వేతనాల్లో 15 శాతం కోత పెట్టింది. వారి విదేశీ పర్యటనలు, లగ్జరీ వాహనాల కొనుగోలుపై నిషేధం విధించింది. గ్యాస్, విద్యుత్ ధరలు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. నిఘా సంస్థలకు విచ్చలవిడిగా నిధులు విడుదల చేయరాదని తీర్మానించింది. చమురు దిగుమతులు గుదిబండగా మారిన నేపథ్యంలో అన్ని స్ధాయిల్లో పెట్రోల్ వాడకాన్ని 30 శాతం తగ్గించుకోవాలని నిర్ణయానికొచ్చింది. -
మాకు అదొక్కటే మార్గం! లేదంటే కోలుకోలేం: విక్రమసింఘే కీలక వ్యాఖ్యలు
శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే శుక్రవారంట్రేడ్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. " దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని తెలుసు. అలాగే దేశం ఎదుర్కొంటున్న కష్టాలు గురించి కూడా తెలుసు. ఉపాధి తగ్గింది. మరీ ముఖ్యంగా ద్రవ్యోల్బణం జీవన వ్యయాన్ని పెంచడమే గాక జీవనశైలిని కూడా మార్చింది. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లోంచి బయటపడాలంటే ప్రపంచ రుణదాత, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ మద్దతు పొందడం ఒక్కటే మార్గం" అని పునరుద్ఘాటించారు. ఈ ఘోరమైన ఆర్థిక పరిస్థితి విద్య, ఆరోగ్య రంగాలను ప్రభావితం చేయడంతో ప్రజలు ఇంతకుముందు అనుభవించిన సౌకర్యాలు పొందలేకపోతున్నారని ఆవేదనగా చెప్పారు. ఈ సమస్యలను ఎదుర్కొనడానకి గల కారణాల గురించి మాట్లాడటం వ్యర్థం అని, ప్రస్తుతం ఉన్న స్థితిలో తమకు ఐఎంఎఫ్ సాయం పొందడం ఒక్కటే మార్గమని లేకపోతే ఎన్నటికీ కోలుకోలేం అని నొక్కి చెప్పారు. ప్రస్తుతం తాము రుణ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అని తెలిపారు. ఇప్పటికే ఈ విషయం గురించి జపాన్‌తో చర్చలు పూర్తి చేశామని అన్నారు. తాము రుణా సాయం పొందిన మూడు ప్రధాన దేశాలు (చైనా, జపాన్, భారత్)లో జపాన్ కూడా ఒకటని చెప్పారు. అలాగే యూరప్‌లో ఆర్థిక వృద్ధి మందగించిందని చెప్పారు. ఇలాంటి స్థితిలో వచ్చే ఏడాది తమ ఎగుమతి మార్కెట్ పడిపోయే అవకాశం ఉన్నందున పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వం, సెమీ ప్రభుత్వం, ప్రైవేటు కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులతో దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనడం, దిద్దుబాటు చర్యలు తదితరాలపై రణిల్ చర్చించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి విశ్వాసాన్ని పొందేలా విజయవంతమైన చర్చలు జరపడంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది తొలి త్రైమాసికం తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని భావిస్తునట్లు చెప్పారు. 2024 కల్లా మెరుగైన ఆర్థిక ప్రగతిని సాధించగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగమే కాకుండా ప్రైవేటు రంగాన్నికూడా బలోపేతం చేస్తూ.. దేశంలో అభివృద్ధి కార్యక్రమాలను కూడా కొనసాగించాలి, తద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించాలని రణిల్ చెప్పారు. (చదవండి: నేపాల్‌లో రన్‌వేపై కూలిన విమానం.. 72 మంది ప్రయాణికులు..) -
రూపీ ట్రేడ్‌పై దక్షిణాసియా దేశాలతో చర్చలు
న్యూఢిల్లీ: రూపాయి మారకంలో సీమాంతర వాణిజ్య లావాదేవీలు నిర్వహించడంపై దక్షిణాసియా దేశాలతో ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ చర్చలు జరుపుతోంది. యూపీఐ విధానం ద్వారా ప్రాంతీయంగా సీమాంతర చెల్లింపులను సులభతరం చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా యూపీఐకి సంబంధించి ఇప్పటికే భూటాన్, నేపాల్ తదితర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. శుక్రవారం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సదస్సులో కీలకోపన్యాసం చేసిన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాలు తెలిపారు. అలాగే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ప్రస్తుతం ప్రయోగదశలో ఉందని ఆయన చెప్పారు. క్లోనింగ్‌వంటి రిస్కులు ఉన్న నేపథ్యంలో డిజిటల్ రూపీని పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టడంపై ఆర్బీఐ ఆచితూచి వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘కేంద్ర ప్రభుత్వంతో కలిసి అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలో సెటిల్ చేసుకునే విధానంపై ఆర్బీఐ కసరత్తు చేస్తోంది. ప్రాంతీయంగా ఇప్పటికే కొన్ని దేశాలతో చర్చలు జరుపుతోంది‘ అని దాస్ వివరించారు. ద్రవ్యోల్బణ కట్టడికి ప్రాధాన్యం .. కోవిడ్, ద్రవ్యోల్బణం, ఆర్థిక మార్కెట్ల నిబంధనలు కఠినతరం కావడం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి సవాళ్ల నేపథ్యంలో దక్షిణాసియా ప్రాంత దేశాలు విధానపరంగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయన్నారు. భారత్ వంటి దక్షిణాసియా దేశాలు ద్రవ్యోల్బణ కట్టడిపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. ఇందుకోసం విశ్వసనీయమైన ద్రవ్యపరపతి విధానాలతో పాటు సరఫరాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోవడం, ద్రవ్య.. వాణిజ్య విధానాలు, పాలనాపరమైన చర్యలు అవసరమని ఆయన వివరించారు. ఇటీవల కమోడిటీ ధరలు, సరఫరాపరమైన సమస్యలు కొంత తగ్గడం వల్ల రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టవచ్చని పేర్కొన్నారు. అయితే ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో కొనసాగిన పక్షంలో వృద్ధికి, పెట్టుబడులకు రిస్కులు ఏర్పడవచ్చని దాస్ చెప్పారు. దక్షిణాసియా ప్రాంత దేశాలు ఇంధనాల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుండటం వల్ల, ఇంధన దిగుమతిపరమైన ద్రవ్యోల్బణంతో సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. దక్షిణాసియా దేశాలు వాణిజ్యం విషయంలో పరస్పర సహకరించుకుంటే ప్రాంతీయంగా వృద్ధికి, ఉపాధికి మరిన్ని అవకాశాలు లభించగలవని దాస్ చెప్పారు. -
భారత్ వృద్ధి 6.8 శాతం
వాషింగ్టన్: భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) 6.8 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. 2023–24లో ఈ రేటు 6.1 శాతానికి తగ్గుతుందని విశ్లేషించింది. అంతర్జాతీయ తీవ్ర క్లిష్ట పరిస్థితుల్లో భారత్ నెట్టుకు వస్తోందని వర్చువల్‌గా జరిగిన విలేకరుల సమావేశంలో ఐఎంఎఫ్ ఇండియా మిషన్ చీఫ్ చౌయిరీ నాడా పేర్కొన్నారు. అంతక్రితం ఆమె భారత్ అధికారులతో జరిగిన వార్షిక సంప్రదింపులకు సంబంధించి ఒక నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం, భారత్ వృద్ధి ఒక మోస్తరుగా కొనసాగుతుంది. అవుట్‌లుక్ ‘పేవరబుల్’కన్నా దిగువస్థాయిలోనే ఉంటుంది. కఠిన ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందిని కల్పిస్తాయి. అయితే క్రితం అంచనాలకన్నా ప్రస్తుత పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. ‘వాస్తవానికి, మా అంచనాల్లో ఈ సంవత్సరం– తదుపరి సంవత్సరం ప్రపంచ వృద్ధికి భారతదేశం అరశాతంమేర భాగస్వామ్యాన్ని కలిగిఉంటుంది’’ అని ఆమె చెప్పారు. ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితుల ప్రభావం అటు వాణిజ్య పరంగా ఇటు ఫైనాన్షియల్ రంగం పరంగా భారత్‌పై ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా దేశం ద్రవ్యోల్బణం సవాళ్లపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత్‌తో విస్తృత స్థాయి సంస్కరణలు –వాటి అమలు ఊహించినదానికన్నా వేగంగా ఉందన్నారు. అలాగే దేశంలో విస్తరిస్తున్న డిజిటలైజేషన్ ప్రయోజనాలను భారత్ భారీగా పొందనుందని వివరించారు. వృద్ధిలో బలహీనతలు ఉన్నాయ్: జయంత్ వర్మ ఇదిలాఉండగా, భారత్ ఎకానమీ వృద్ధి ధోరణి చాలా బలహీనంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయంత్ ఆర్ వర్మ పేర్కొన్నారు. వృద్ధి పటిష్టతకు నాలుగు అంశాల్లో బలపడాల్సి ఉందని పేర్కొంటూ... ఎగుమతులు, ప్రభుత్వ వ్యయాలు, మూలధన పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం పెంపుపై తక్షణ దృష్టి అవసరమని పేర్కొన్నారు. 2022–23లో భారత్ వృద్ధి రేటును ఆర్బీఐ 6.8 శాతంగా అంచనావేస్తుండగా, ప్రపంచ బ్యాంక్ విషయంలో ఈ రేటు 6.9 శాతంగా ఉంది. -
ఐఎంఎఫ్ అంచనాలకు మించి భారత్ వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనాలు 6.8 శాతం మించి నమోదవుతుందన్న విశ్వాసాన్ని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ వ్యక్తం చేశారు. పెరుగుతున్న మూలధన పెట్టుబడులు తమ విశ్వాసానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో భారత్ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ వరుసగా రెండోసారి తగ్గించింది. తొలుత ఈ ఏడాది జనవరిలో 2022–23లో వృద్ధి అంచనాలను 8.2 శాతంగా వెలువరించింది. అయితే జూలైలో దీనిని 7.4 శాతానికి కుదించింది. అంతర్జాతీయంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వంటి అంశాల నేపథ్యంలో రేటు అంచనాలను ఈ నెల మొదట్లో మరింతగా 6.8 శాతానికి ఐఎంఎఫ్ కుదించింది. ఈ నేపథ్యం అనంత నాగేశ్వరన్ సోమవారం చేసిన ఒక ప్రకటనలో తన తాజా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► భారతదేశ పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బహుశా ఒక కీలక మైలురాయిని దాటింది. ఇది పటిష్ట ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుతోపాటు అధిక వృద్ధికి కూడా దోహదపడే అంశం. ► ఆర్థిక, ద్రవ్య విధానలు సాధారణంగా ఒకదానికి మరోటి అనుసంధానమై ఉంటాయి. ఒకదానికొకటి సమతుల్యత కలిగి ఉంటాయి. ► దేశీయ రుణం– జీడీపీ నిష్పత్తి విషయంలో ఆందోళన లేదు. అసెట్ మానిటైజేషన్ (నిరర్ధక ఆస్తుల నుంచి ఆర్థిక ప్రయోజనం) ఈ నిష్పత్తి మరింత తగ్గుతుంది. క్రెడిట్ రేటింగ్ పెరుగుదల విషయంలోనూ ఇది సానుకూల అంశం. ► ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం, తయారీ, నిర్మాణంసహా అన్ని కీలక రంగాలూ మంచి పనితీరు ప్రదర్శిస్తున్నాయి. -
ద్రవ్యోల్బణంపై పోరు తప్పదు!
వాషింగ్టన్: ద్రవ్యోల్బణం పూర్తిగా అదుపు తప్పుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలిన్ జార్జివా హెచ్చరించారు. అసాధారణమైన ఆర్థిక సంక్షోభ సమయంలో మరింత బాధను కలిగించే అవకాశం ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా విధాన నిర్ణేతలు ద్రవ్యోల్బణంపై పోరు సల్పాలని ఆమె పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలను తీసుకుంటున్న నేపథ్యంలో ఐఎంఎఫ్ చీఫ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ వార్షిక సమావేశం నేపథ్యంలో ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒకదాని తర్వాత మరొ కటి షాక్‌లు తగులుతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా దాడి, ఇప్పుడు ద్రవ్యోల్బణం తీవ్రత అన్నీ సమస్యాత్మకమే. ► ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని ఎలా ఎదుర్కొనాలన్నదే ప్రధాన అంశం. మనం ధర స్థిరత్వాన్ని పునరుద్ధరించలేకపోతే, వృద్ధి అవకాశాలకూ విఘాతం కలుగుతుంది. ప్రత్యేకించి పేద ప్రజల జీవనం మరింత సంక్షోభంలోకి వెళుతుంది. ► మహమ్మారితో పోరాడిన నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు రుణ సమస్యల్లో ఉన్నాయి. ఆహార కొరత లేకుండా చేయడం, ఇంధన వ్యయాల కట్టడి, పేద వారికి సహాయం చేయడంపై తక్షణం దేశాలు దృష్టి పెట్టాలి. విస్తృత వ్యయ కార్యక్రమాలపై ఇప్పుడు ప్రణాళికలు సరికాదు. విధాన చర్యలు పటిష్టం లక్ష్యంతో సాగాలి. ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పోటీ రాజకీయ కూటములతో ‘విచ్ఛిన్నం’ చేయడం వల్ల ద్రవ్యోల్బణాన్ని అడ్డుకోవడంలో మరింత జాప్యం జరుగుతుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల సరఫరాల చెయిన్ పూర్తిగా దెబ్బతింటుంది. రేటు పెంపు వల్ల అనుకున్న లక్ష్యాలను సకాలంలో సాధించలేం. ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఐక్యతా ప్రయోజనాలను మనం కోల్పోతే, మనమందరం పేదలుగా ఉండే అవకాశం ఉంది. -
నగదు బదిలీ అద్భుతం: ఐఎంఎఫ్
వాషింగ్టన్: కేంద్రం చేపట్టిన ప్రత్యక్ష నగదు బదిలీతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు నిజంగా అద్భుతమంటూ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కొనియాడింది. అంతటి సువిశాల దేశంలో ఇంత భారీ పథకాలను అత్యంత కచ్చితత్వంతో అమలు చేయడం అద్భుతమేనని ఐఎంఎఫ్ డిప్యూటీ డైరెక్టర్ పావులో మారో అన్నారు. ‘‘ఈ విషయంలో భారత్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సంక్టిష్ట సమస్యల పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అద్భుతంగా వాడుకుంటూ ప్రపంచానికి భారత్ స్ఫూర్తిదాయకంగా నిలిచింది’’ అని బుధవారం ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఈ పథకాల్లో చాలావరకు మహిళలకు సంబంధించినవే. మరికొన్ని వృద్ధులకు, రైతులకు ఉద్దేశించిన పథకాలూ ఉన్నాయి. వీటి సమర్థ అమలుకు ఆధార్‌ను చక్కగా వినియోగించుకోవడం అభినందనీయం’’ అన్నారు. కేంద్రం 2013 నుంచి ఇప్పటిదాకా రూ.24.8 లక్షల కోట్లను లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా బదిలీ చేసింది. -
వృద్ధి, ద్రవ్యోల్బణం రానున్న బడ్జెట్ లక్ష్యాలపై నిర్మలా సీతారామన్
వాషింగ్టన్: ఆర్థికాభివృద్ధి, ద్రవ్యోల్బణం కట్టడే 2022-23 వార్షిక బడ్జెట్ (2023 ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో సమర్పించే అవకాశం) లక్ష్యాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికిగాను ఆరు రోజుల అమెరికా పర్యటనకు వచ్చిన నిర్మలా సీతారామన్ మొదటిరోజు-మంగళవారం వాషింగ్టన్ డీసీలో బిజీబిజీగా గడిపారు. అమెరికా ఆర్థికమంత్రి జనెత్ యెల్లెన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో భేటీ, ప్రతిష్టాత్మక బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఇందులో ఉన్నాయి. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో కార్యక్రమంలో ప్రముఖ ఆర్థికవేత్త ఈశ్వర్ ప్రసాద్‌సహా పలువురు నిపుణుల అడిగిన ప్రశ్నలకు ఆమె సవివరంగా సమాధానాలు ఇచ్చా రు. ఆమె ప్రసంగంలో మరిన్ని ముఖ్యాంశాలు.. ► భారత్ ఎకానమీ సమీప భవిష్యత్తులో ఎదుర్కొనబోయే ప్రధాన సవాళ్లలో అధిక ఇంధన ధరలు ఒకటి. ► మహమ్మారి సవాళ్ల నుంచి సమర్థవంతంగా బయటపడిన భారత్ అటు వృద్ధి-ఇటు ద్రవ్యోల్బణాన్ని సమర్థవంతంగా సమతౌల్యం చేయగలుగుతోంది. ఇది గమనించడం చాలా ముఖ్యం. ► భారత్ దేశ ఆర్థిక వ్యవస్థను గమనిస్తున్న పలు రేటింగ్, విశ్లేషణా, ఆర్థిక సంస్థలు కూడా భారత్ ఎకానమీ బలహీనపడలేదన్న విషయాన్ని గుర్తిస్తున్నాయి. ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి వల్ల ఇంధనం, ఎరువులు, ఆహార రంగాలకు సంబంధించిన సవాళ్లను భారత్ ఎదుర్కొంటోంది. వీటన్నింటినీ భారత్ జాగ్రత్తగా గమనిస్తోంది. ► అంతర్జాతీయ ఒత్తిళ్లు ప్రజలకు చేరకుండా చూసుకుంటున్నాము. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల ఇంధన ధరల పెరుగుదల భారం సామాన్య ప్రజలపై పడ్డం లేదు. ► రూపాయిని తమ దేశాల్లో ఆమోదయోగ్యంగా మార్చేందుకు వివిధ దేశాలతో భారత్ చర్చలు జరుపుతోంది. ► యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), బీహెచ్ఐఎం యాప్, ఎన్సీపీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అన్నీ ఇప్పుడు ఆయా దేశాల్లో వ్యవస్థలతో కలిసి పటిష్టంగా పనిచేయడానికి తగిన ప్రయత్నం జరుగుతోంది. మన వ్యవస్థకు ఇంటర్–ఆపరేటబిలిటీ కూడా ఆ దేశాల్లోని భారతీయుల నైపుణ్యానికి బలాన్ని ఇస్తుంది. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో ప్రముఖ ఆర్థికవేత్త ఈశ్వర్ ప్రసాద్‌తో ఆర్థికమంత్రి -
తగ్గేదెలే! అగ్రరాజ్యం బ్రిటన్ను దాటేసిన భారత్.. మరింత బలంగా..
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లను తట్టుకొని నిలబడ్డ భారత్ ప్రపంచ పటంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. అగ్రరాజ్యమైన బ్రిటన్ను దాటి అయిదోస్థానంలోకి దూసుకుపోయింది. 2022 మార్చి చివరి నాటికి భారత్ ప్రపంచంలోని బలమైన ఆర్థిక దేశాల్లో అయిదో స్థానంలో ఉందని బ్లూమ్‌బర్గ్ సంస్థ తాజా కథనంలో వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి సేకరించిన జీడీపీ గణాంకాలు, డాలర్‌తో మారకపు రేటు ఆధారంగా బ్లూమ్‌బర్గ్ లెక్కలు వేసి ఒక నివేదికను రూపొందించింది. ప్రపంచంలో బలమైన ఆర్థిక దేశంగా అమెరికా మొదటి స్థానంలోనూ, చైనా రెండో స్థానంలో ఉంటే జపాన్, జర్మనీ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. పదేళ్ల క్రితం పదకొండో స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు బ్రిటన్ను ఆరో స్థానానికి నెట్టేసి అయిదో స్థానానికి ఎగబాకింది. 2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 854.7 బిలియన్ డాలర్లు ఉంటే, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 816 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది భారత్‌రూపాయితో పోల్చి చూస్తే బ్రిటన్ పౌండ్ విలువ 8% మేరకు క్షీణించింది. మరోవైపు భారత్ ఆర్థిక వృద్ధి ఈ ఏడాది 7శాతానికి పైగా నమోదు చేయవచ్చునని అంచనాలున్నాయి. 2021–22లో మన దేశం 8.7% వృద్ధి నమోదు చేసింది. అయితే తలసరి ఆదాయం, మానవ అభివృద్ధి సూచిలో మాత్రం మనం బ్రిటన్ కంటే వెనుకబడి ఉండడం గమనార్హం. విద్య, ఆరోగ్యం, ప్రజల జీవన ప్రమాణాలతో కొలిచే మానవ అభివృద్ధిలో బ్రిటన్ 1980లో ఉన్నప్పటి స్థితికి చేరాలన్నా మనకు మరో పదేళ్లు పడుతుందని ఆర్థిక వేత్తలంటున్నారు. వలస పాలకుల్ని నెట్టేయడం గర్వకారణం దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకొని ఆజాదీ అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ మన దేశం అయిదో స్థానానికి చేరుకోవడంతో కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన దేశాన్ని వలస రాజ్యంగా మార్చి పరిపాలించిన బ్రిటన్నే ఆర్థికంగా వెనక్కి నెట్టేయడం ప్రతీ భారతీయుడు గర్వించాల్సిందేనని ట్వీట్లు చేశారు. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కర్మ సిద్ధాంతం పని చేసిందని, దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన ప్రతీ భారతీయుడి గుండె ఉప్పొంగిపోతుందని ట్వీట్ చేస్తే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ‘‘రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్’’ అన్న సూత్రంతోనే విజయం సాధించామని, ప్రధాని నరేంద్ర మోదీకే ఈ క్రెడిట్ దక్కుతుందని ట్విటర్లో పేర్కొన్నారు. ఆర్థిక కష్టాల్లో బ్రిటన్ బ్రిటన్ గత కొన్నేళ్లుగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుంది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకుంది. ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యులకి బతుకు భారమైపోయింది. ఆర్థిక మాంద్యం ప్రమాదాన్ని కూడా ఎదుర్కొంటోంది. 2021 ద్వైమాసికంలో బ్రిటన్ జీడీపీ కేవలం 1% మాత్రమే పెరిగింది. కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లను ఎదుర్కోలేక ఆర్థికంగా చతికిల పడిపోయింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ అస్థిరత్వం, బోరిస్ జాన్సన్ రాజీనామా వంటివి ఆ దేశాన్ని మరింత కుదేల్ చేశాయి. 2024 వరకు ఇవే పరిస్థితులు ఉంటాయని బ్యాంకు ఆఫ్ ఇంగ్లండ్ అంచనా వేస్తోంది. -
'ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ'..ఐఎంఎఫ్ గీతా గోపినాథ్ సరికొత్త రికార్డ్‌లు!
న్యూఢిల్లీ: భారతీయ సంతతికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ– ఐఎంఎఫ్ మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ మరో అరుదైన గుర్తింపును పొందారు. ఐఎంఎఫ్ ‘వాల్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ ఎకనమిస్ట్స్’పై ఆమెకు చోటు లభించింది. ఈ గొప్ప స్థానాన్ని సంపాదించిన మొదటి మహిళ గీతా గోపీనాథ్‌కాగా, ఈ స్థానానికి చేరిన భారత్ సంతతికి చెందిన రెండవ వ్యక్తి. ఇంతక్రితం రఘురామ్ రాజన్ ఈ గౌరవం లభించింది. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ 2003 నుంచి 2006 మధ్య ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్‌గా బాధ్యతలు నిర్వహించారు. గీతా గోపీనాథ్, 2018 అక్టోబర్‌లో ఐఎంఎఫ్ మొట్టమొదటి మహిళా చీఫ్ ఎకనమిస్టుగా నియమితులయ్యారు. గత ఏడాది డిసెంబర్లో ఐఎంఎఫ్ మొట్టమొదటి మహిళా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. గోపీనాథ్ పరిశోధనలు అనేక అగ్ర ఆర్థిక శాస్త్ర పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్‌గా నియామకానికి ముందు ఆమె హార్వర్డ్ యూనివర్శిటీలోని ఆర్థిక శాస్త్ర విభాగంలో అంతర్జాతీయ అధ్యయనాలు, ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు.2005లో హార్వర్డ్ యూనివర్శిటీ ఫ్యాకల్టీలో చేరడానికి ముందు, ఆమె యూనివర్శిటీ ఆఫ్ చికాగోలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. బ్రేకింగ్ ది ట్రెండ్ ‘ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ, నేను ఐఎంఎఫ్ మాజీ చీఫ్ ఎకనామిస్ట్‌ల గోడపై చేరాను’ అని గీతా గోపీనాథ్ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. మాజీ చీఫ్ ఎకనామిస్ట్‌ల గోడపై నెలకొలి్పన తన ఫొటో వద్ద ఫోజిచ్చిన్న చిత్రాన్ని కూడా ఆమె తన ట్వీట్‌కు జోడించారు. Breaking the trend 👊💥…I joined the wall of former Chief Economists of the IMF 😀 pic.twitter.com/kPay44tIfK — Gita Gopinath (@GitaGopinath) July 6, 2022 మూడేళ్ల పాటు ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న గీతా గోపినాథ్ మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఆ తర్వాత హార్వర్డ్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు చేపట్టాలని అనుకున్నట్లు గీతా గోపినాథ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. -
భారత్‌పై ఉక్రెయిన్–రష్యా సంక్షోభ ప్రభావం
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుంగుబాటుకు గురికావడం.. భారత ఆర్థిక వ్యవస్థపై ఎన్నో రూపాల్లో ప్రతికూల ప్రభావాలను చూపిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) డైరెక్టర్ జెర్రీరైస్ తెలిపారు. చైనాపై ఈ ప్రభావం తక్కువేనన్నారు. చమురు ధరలు గణనీయంగా పెరగడం స్థూల ఆర్థికంగా ఎక్కువ కుదుపులకు గురి చేస్తుందన్నారు. ‘‘అధిక ద్రవ్యోల్బణం కరెంటు ఖాతా లోటుకు దారితీస్తుంది. అయితే భారత్ ఎగుమతి చేసే ఉత్పత్తులకు అధిక కమోడిటీ ధరల దన్నుతో కరెంటు ఖాతా లోటును కొంత వరకు సర్దుబాటు చేసుకోవచ్చు’’ అని రైస్ తెలిపారు. ఉక్రెయిన్‌లో యుద్ధం యూఎస్, ఈయూ, చైనాలపై ప్రభావం చూపిస్తుంది కనుక.. భారత ఎగుమతులకు డిమాండ్ తగ్గే ప్రమాదం ఉంటుందన్నారు. కఠిన ద్రవ్య పరిస్థితులు, పెరిగిన అనిశ్చితి దేశీయ డిమాండ్‌పై ప్రభావం చూపించొచ్చని, అధిక రుణ వ్యయాలు ద్రవ్య పరిస్థితిని నిర్ణయిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత వృద్ధి చుట్టూ ఎన్నో అనిశ్చితులున్నట్టు పేర్కొన్నారు. భారత్‌పై చమురు భారం : ఎస్అండ్పీ అంచనా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చమురును గణనీయంగా దిగుమతి చేసుకునే భారత్, థాయిలాండ్‌పై రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం అధికంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2022 ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే) భారత జీడీపీ 7.8 శాతం వృద్ధి సాధించొచ్చని అంచనా వేసింది. 2023–24లో 6 శాతం, 2024–25లో 6.5 శాతం చొప్పున వృద్ధి నమోదు కావచ్చని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (మార్చితో ముగిసే/2021–22) ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని (ఏపీఏసీ) బ్యాంకులు రష్యాతో స్వల్ప స్థాయిలోనే ఎక్స్పోజర్ కలిగి ఉన్నందున యుద్ధం తాలూకు ప్రభావం వాటిపై స్వల్పంగానే ఉంటుందని పేర్కొంది. ప్రధానంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో ఉన్న అతిపెద్ద రిస్క్‌లలో మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులకుతోడు.. అధిక కమోడిటీ చార్జీలను ప్రస్తావించింది. ముఖ్యంగా ఇంధనాన్ని అధికంగా దిగుమతి చేసుకునే ఆర్థిక వ్యవస్థలకు రిస్క్ ఎక్కువ ఉన్నట్టు చెప్పింది. దేశ చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతులపైనే భారత్ ఆధారపడిన విషయం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇటీవల బ్యారెల్‌కు 140 డాలర్ల వరకు వెళ్లి 100 డాలర్ల దిగువకు రావడం తెలిసిందే. -
Gita Gopinath: అనూహ్య పరిణామం.. అంతర్జాతీయ వేదికపై మన ‘గీత’
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)లో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన గీతా గోపినాథ్‌కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు గురువారం ప్రకటించారు. అంతర్జాతీయ సంస్థ ఐఎంఎఫ్‌కు ఇంతకుముందు తొలి ఉమెన్ ఛీఫ్ ఎకనమిస్ట్‌గా చరిత్ర సృష్టించిన గీతా గోపినాథ్.. ఇప్పుడు మరో ఘనత దక్కించుకున్నారు. ఏకంగా ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టబోతున్నారామె. ప్రస్తుతం ఈ అంతర్జాతీయ ఆర్థిక సంస్థకు నెంబర్ 2గా ఉన్నజియోఫ్రె విలియమ్ సెయిజి ఒకమోటో( ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్).. వచ్చే ఏడాది మొదట్లో బాధత్యల నుంచి తప్పుకోనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ స్థానాన్ని గీతా గోపినాథ్‌తో భర్త చేయనుంది ఐఎంఎఫ్. నిజానికి ఆమె వచ్చే ఏడాది జనవరిలో ఐఎంఎఫ్‌ను వీడి.. హర్వార్డ్ యూనివర్సిటీలో చేరతానని ప్రకటించుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించింది ఐఎంఎఫ్. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌కు మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో 68 ఏళ్ల క్రిస్టలీనా జార్జియేవా(బల్గేరియా) కొనసాగుతోంది. ఇక ఇప్పుడు రెండో పొజిషన్లో గీతా గోపినాథ్(49) నియమితురాలయ్యింది. దీంతో కీలకమైన ఒక అంతర్జాతీయ ఆర్థిక విభాగపు కీలక బాధ్యతల్ని ఇద్దరు మహిళలు చూసుకోబోతున్నారన్నమాట. మైసూర్ టు వాషింగ్టన్ గీతా గోపినాథ్.. పుట్టింది డిసెంబర్ 8, 1971 కోల్‌కతా(కలకత్తా)లో. అయితే ఆమె చదువు మొత్తం మైసూర్ (కర్ణాటక)లో సాగింది. చిన్నతనంలో గీతాకు చదువంటే ఆసక్తే ఉండేది కాదట. ముఖ్యంగా ఎక్కాల్లో ఆమె సుద్దమొద్దుగా ఉండేదని గీత తల్లి విజయలక్క్క్ష్మి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కూడా. ఇక ఏడో తరగతి నుంచి చదువులో మెరుగైన ప్రతిభ కనబరుస్తూ వచ్చిన గీత.. ఫ్లస్ టు సైన్స్‌లో విద్యను పూర్తి చేసింది. అయితే డిగ్రీకొచ్చేసరికి తనకు ఏమాత్రం సంబంధం లేని ఎకనమిక్స్‌ను ఎంచుకుని పేరెంట్స్‌ను సైతం ఆశ్చర్యపరిచిందామె. ఢిల్లీలోనే బీఏ, ఎంఏ ఎకనమిక్స్ పూర్తి చేసి.. ఆపై వాషింగ్టన్లో మరో పీజీ, ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకుంది. ఈ రీసెర్చ్‌కి గానూ ఆమెకు ప్రిన్స్టన్ వుడ్రో విల్సన్ ఫెలోషిప్ రీసెర్చ్ అవార్డు అందుకుంది. ఆపై చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారామె. కీలక బాధ్యతలెన్నో.. 2018, అక్టోబర్‌లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌కు ఛీఫ్ ఎకనమిస్ట్‌గా గీతా గోపీనాథ్ నియమించబడింది. అంతేకాదు ఐఎంఎఫ్‌లో కీలక బాధ్యతలు చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తి కూడా ఆమెనే!. ఇక ఆ పదవిలో కొనసాగుతూనే.. ఇంటర్నేషనల్ ఫైనాన్స్‌కు కో డైరెక్టర్‌గా, నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రీసెర్చ్‌లో మాక్రోఎకనమిక్స్ ప్రొగ్రామ్‌ను నిర్వహించారామె. ఇంతేకాదు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్‌లో ఎకనమిక్ అడ్వైజరీ ప్యానెల్లో సభ్యురాలిగా, కేరళ ముఖ్యమంత్రికి ఆర్థిక సలహాదారుగా, ఈ ఏడాది జూన్‌లో వరల్డ్ బ్యాంక్-ఐఎంఎఫ్ హైలెవల్ అడ్వైజరీ గ్రూపులో కీలక సభ్యురాలిగా వ్యవహరించారు. గౌరవాలు 2011లో యంగ్ గ్లోబల్ లీడర్‌గా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నుంచి అవార్డుతో పాటు 2019లో భారత సంతతి వ్యక్తి హోదాలో ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారం అందుకున్నారామె. కరోనా సంక్షోభంలో ఐఎంఎఫ్ తరపున ఆమె అందించిన సలహాలు, కార్యనిర్వహణ తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. వ్యక్తిగత జీవితం గీతా గోపీనాథ్ భర్త ఇక్బాల్ సింగ్ ధాలివాల్.. మాజీ ఐఏఎస్ ఈయన. 1995 ఏడాది సివిల్స్ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంకర్ ఆయన. కొంతకాలం విధులు నిర్వహించి.. ఆపై ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈయన కూడా ఆర్థిక మేధావే. ప్రస్తుతం మస్సాచుషెట్స్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్, జే-పాల్లో ఎకనమిక్స్ విభాగంలో గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ జంటకు ఒక బాబు.. పేరు రోహిల్. గీతా గోపినాథ్‌కు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాతో పాటు అమెరికన్ పౌరసత్వం కూడా ఉంది. -సాక్షి, వెబ్‌స్పెషల్ -
2021–22లో 10 శాతం వృద్ధి: నీతి ఆయోగ్
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో 10 శాతం ఉంటుందని విశ్వసిస్తున్నట్లు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఏడు సంవత్సరాల మోదీ ప్రభుత్వం దేశంలో పటిష్ట ఆర్థిక వృద్ధికి పునాదులు వేసిందన్నారు. కోవిడ్–19 వల్ల ఎదురయిన సవాళ్లను దేశం సమర్థవంతంగా ఎదుర్కొంటోందని వివరించారు. వచ్చే ఐదేళ్లూ భారత్ ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నివేదికను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రపంచ పెట్టుబడిదారులను భారత్ ఆర్థిక వ్యవస్థ ఆకర్షించగలుగుతోందన్నారు. అయితే దేశంలో ఉపాధి కల్పన అనుకున్నంత వేగంగా లేదని ఆయన అంగీకరించారు. మోదీ ప్రభుత్వం ఏడేళ్లలో 485 ప్రభుత్వ పథకాలను ప్రత్యక్ష ప్రయోజన బదలాయింపు (డీబీటీ) పరిధిలోకి తీసుకుని వచ్చిందన్నారు. డీబీటీ ద్వారా రూ.5.72 లక్షల కోట్లు బదిలీ అయినట్లు కూడా కుమార్ తెలిపారు. -
ఐఎంఎఫ్‌కు గీతా గోపీనాథ్ గుడ్‌బై
వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ ఎకానమిస్ట్‌గా వ్యవహరిస్తున్న గీతా గోపీనాథ్ (49) వచ్చే ఏడాది పదవి నుంచి వైదొలగనున్నారు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా తిరిగి చేరనున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ అయిన గీతా గోపీనాథ్ .. ఐఎంఎఫ్ తొలి మహిళా చీఫ్ ఎకానమిస్ట్‌గా 2019 జనవరిలో బాధ్యతలు చేపట్టారు. ఆమె సెలవును హార్వర్డ్ యూనివర్సిటీ పొడిగించడంతో మూడేళ్ల పాటు ఐఎంఎఫ్‌లో కొనసాగారు. తాజాగా అదే వర్సిటీకి తిరిగి రానున్నారు. గీతా గోపీనాథ్ స్థానంలో మరొకరిని ఎంపిక చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తామని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జియేవా తెలిపారు. ‘ఐఎంఎఫ్‌కు గీతా గోపీనాథ్ అందించిన సేవలు అసమానమైనవి. ఫండ్ తొలి మహిళా చీఫ్ ఎకానమిస్టుగా ఆమె చరిత్ర సృష్టించారు. గీతా గోపీనాథ్ మేధస్సు, అంతర్జాతీయ ఫైనాన్స్.. స్థూలఆరి్థకాంశాలపై ఆమెకున్న అపార అవగాహన, ఐఎంఎఫ్‌కు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రభావవంతమైన పనితీరుతో ఆమె అందరి అభిమానం, గౌరవం చూరగొన్నారు‘ అని జార్జియేవా పేర్కొన్నారు. తన విధుల నిర్వహణలో సహకరించినందుకు సహోద్యోగులకు గీతా గోపీనాథ్ ధన్యవాదాలు తెలిపారు. టీకాల ఊతంతో కోవిడ్–19 మహమ్మారిని అంతమొందించేందుకు తీసుకోతగిన చర్యలపై రూపొందించిన ’పాండెమిక్ పేపర్’కు ఆమె సహరచయితగా వ్యవహరించారు. ఇందులోని ప్రతిపాదనలకు అనుగుణంగా అల్పాదాయ దేశాలకు కూడా టీకాలను చేర్చేందుకు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ తదితర ఏజెన్సీలు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశాయని ఐఎంఎఫ్ పేర్కొంది. మైసూరు నుంచి అమెరికా వరకు... గీతా గోపీనాథ్ 1971లో మైసూరులో జన్మించారు. మలయాళీ కుటుంబ నేపథ్యం గల గీతా గోపీనాథ్ కోల్‌కతాలో పాఠశాల స్థాయి విద్యాభ్యాసం, ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లోను, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో మాస్టర్స్ చేశారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మాజీ చైర్మన్ బెన్ బెర్నాంకీ వంటి దిగ్గజాల గైడెన్స్‌తో 2001లో ప్రతిష్టాత్మక ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఎకనమిక్స్‌లో పీహెచ్డీ చేశారు. అదే ఏడాది యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన గీతా గోపీనాథ్ 2005లో హార్వర్డ్‌కు మారారు. 2010లో టెన్యూర్డ్ ప్రొఫెసర్ (దాదాపు పర్మనెంట్ స్థాయి) గా పదోన్నతి పొందారు. హార్వర్డ్ చరిత్రలో ఈ గౌరవం దక్కించుకున్న మూడో మహిళగాను, నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ తర్వాత తొలి భారతీయురాలిగాను ఆమె ఘనత సాధించారు. -
సంస్కరణలతో వృద్ధి వేగవంతం
న్యూఢిల్లీ: సంస్కరణలు, సరళీకరణ విధానాల బాటలో మరింత ముందుకు వెళ్లడం ద్వారా భారత్ కరోనా మహమ్మారి సవాళ్ల నుంచి వేగంగా బయటపడుతుందని, అంతర్జాతీయంగా మరిన్ని ప్రయోజనాలు పొందగలుగుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. ఎయిర్ ఇండియా విక్రయం ఒక మైలురాయిగా అభివరి్ణంచింది. పలు దేశాలకు వ్యాక్సినేషన్ సరఫరాలను చేసి కోవిడ్–19 మహమ్మారిపై పోరులో భారత్ తన చిత్తశుద్ధిని నిరూపించుకుందని కూడా పేర్కొంది. కోవిడ్–19 మహమ్మారి సమయంలో భారత్ భారీ ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడం సానుకూల అంశమని ఐఎంఎఫ్–ఎస్టీఐ ప్రాంతీయ శిక్షణా సంస్థ డైరెక్టర్, ఐఎంఎఫ్ (ఇండియా) మాజీ మిషన్ చీఫ్ ఆ్రల్ఫెడ్ షిప్కే పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► ఇటీవలి సంవత్సరాలలో వ్యవసాయం, రక్షణ, టెలికమ్యూనికేషన్ సేవలు, బీమా రంగాల్లో ప్రభుత్వ ఇటీవలి సరళీకరణ విధానాలు దేశానికి భారీగా ఎఫ్‌డీఐలను ఆకర్షించడానికి దోహదపడ్డాయి. ఇది కరెంట్ ఖాతా ఫైనాన్సింగ్ పరిస్థితిని మెరుగుపరిచింది. దీనితోపాటు అంతర్జాతీయ ఒడిదుడుకులను భారత్ తట్టుకోడానికి దోహదపడింది. బయోటెక్నాలజీ, రక్షణ, డిజిటల్ మీడియా, ఔషధ రంగాల వంటి కీలక విభాగాల్లో సరళీకరణల వల్ల దేశం మరింత భారీగా ఎఫ్డీఐఅను ఆకర్షించే అవకాశం ఉంది. ► ఆయా సరళీకరణ విధానాలకు భూ, కార్మిక రంగాలకు సంబంధించి వ్యవస్థాగత సంస్కరణలూ మద్దతునివ్వాలి. అలాగే పాలనా, నియంత్రణ, న్యాయ వ్యవస్థల మరింత పటిష్టతకు సంస్కరణలను అనుసరించాలి. ► మహమ్మారి వల్ల గడచిన ఏడాదిన్నర కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. మహమ్మారి నుంచి అందరూ బైటపడేంతవరకూ ఏ ఒక్కరూ సురక్షితం కాబోరు. ► మహమ్మారి ప్రభావం నుంచి వ్యవస్థలు బయటపడ్డానికి భారత్ ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చేపట్టిన పలు పాలనా, ద్రవ్యపరమైన చర్యలు సత్ఫలితాలను అందించాయి. సామాన్యుని ఆహార భద్రతకు కేంద్రం చర్యలు హర్షణీయం. ► ఆరోగ్య రంగంలో అన్ని దేశాల సన్నిహిత సమన్వయం అవసరం. ప్రత్యేకించి వ్యాక్సినేషన్ విషయంలో ఇది కీలకం. తద్వారానే ప్రపంచం మహమ్మారి సవాళ్ల నుంచి బయటపడగలుతుంది. వైద్యరంగంతోపాటు విద్యా రంగంలో పురోగతి సమాజాభివృద్ధికి దోహదపడుతుంది. ఈ మేరకు ప్రభుత్వాల చర్యలు తీసుకోవాలి. -
తాలిబన్ ప్రభుత్వానికి రుణాలివ్వం
వాషింగ్టన్/కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి ప్రస్తుతం ఎలాంటి రుణాలు ఇవ్వబోమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) తాజాగా తేల్చిచెప్పేసింది. ఇతర ఆర్థికపరమైన వనరులు కూడా సమకూర్చే ప్రశ్నే లేదని ఐఎంఎఫ్ స్పష్టంచేసింది. ఈ మేరకు తాజాగా ఐఎంఎఫ్ ఒక ప్రకటన జారీ చేసింది. తాలిబన్ల పట్ల అంతర్జాతీయ సమాజం వైఖరికి అనుగుణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. విదేశాల్లో రూ.66,600 కోట్లున్నాయి ప్రస్తుతం తమ దేశంలో నగదు నిల్వలు ఏవీ లేవని అఫ్గానిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అజ్మల్ అహ్మదీ చెప్పారు. అయితే విదేశాల్లో మాత్రం 9 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.66,600 కోట్లు) ఉన్నాయని గవర్నర్ అజ్మల్ అహ్మదీ తెలిపారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. 9 బిలియన్ డాలర్లలో 7 బిలియన్ డాలర్లు అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ బాండ్లు, బంగారం, ఇతర ఆస్తుల రూపంలో ఉన్నాయని పేర్కొన్నారు. తమ వద్ద అమెరికా డాలర్లు నిండుకున్నాయన్నారు. అఫ్గాన్‌ను తాలిబన్లు మళ్లీ ఆక్రమించుకోవడంతో విదేశాల నుంచి రావాల్సిన నగదు ఆగిపోయిందన్నారు. ఇక వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదన్నారు. అమెరికా డాలర్లు తగినన్ని లేకపోతే ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని, ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని, ఫలితంగా సామాన్యులకు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. అఫ్గాన్‌కు ఆయుధాల అమ్మకంపై నిషేధం తాలిబన్ల పునరాక్రమణ నేపథ్యంలో అఫ్గానిస్తాన్ ప్రభుత్వానికి అన్ని రకాల ఆయుధాల విక్రయంపై అమెరికా సర్కారు నిషేధం విధించింది. ఈ మేరకు విదేశాంగ శాఖకు చెందిన రాజకీయ, సైనిక వ్యవహారాల బ్యూరో డిఫెన్స్ కాంట్రాక్టర్లకు నోటీసు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న లేదా ఇంకా అందజేయని ఆయుధాల విషయంలో పునఃసమీక్ష నిర్వహించాలని సూచించింది. -
కరోనా బాధిత దేశాలకు ఐఎంఎఫ్ సాయం
వాషింగ్టన్: కరోనా మహమ్మారితో పోరాడుతూ ఆర్థిక పరిస్థితి దిగజారిన దేశాలకు అండగా నిలవాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం 650 బిలియన్ డాలర్లు(రూ.48.44 వేల కోట్లు) ఖర్చు చేసేందుకు ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం తెలిపింది. ఐఎంఎఫ్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఆర్థిక సాయం కానుందని సంస్థ ఎండీ క్రిస్టలినా జార్జివా శుక్రవారం చెప్పారు. ఐఎంఎఫ్ తాజా నిర్ణయాన్ని పలు అంతర్జాతీయ సంస్థలు స్వాగతించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు తక్షణమే 200 బిలియన్ డాలర్ల సాయాన్ని పొందానికి అవకాశం ఉందని అమెరికాలోని జూబ్లీ యూఎస్ఏ నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ లికాంప్టీ చెప్పారు. పేద దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు ఈ సాయం ఉపయోగపడుతుంది. -
బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ డైరెక్టరుగా ఆర్థికవేత్త కల్పన కొచర్
వాషింగ్టన్: ప్రముఖ భారతీయ ఆర్థికవేత్త కల్పన కొచర్ తాజాగా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌లో డైరెక్టరుగా (డెవలప్మెంట్ పాలసీ అండ్ ఫైనాన్స్ విభాగం) చేరనున్నారు. ప్రస్తుతం ఆమె అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో మానవ వనరుల విభాగం హెడ్‌గా ఉన్నారు. ఐఎంఎఫ్‌లో దాదాపు మూడు దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో సుదీర్ఘ కాలంపాటు సేవలు అందించిన కొచర్ ఈ ఏడాది జూలై 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌లో చేరతారు. గడిచిన 33 ఏళ్లుగా సంస్థ పట్ల ఆమె అంకితభావంతో పనిచేశారని, అంతర్జాతీయ ద్రవ్య నిధి లక్ష్యాల సాధనకు ఎంతో కృషి చేశారని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జియేవా ప్రశంసించారు. 1988లో ఆర్థికవేత్తగా ఐఎంఎఫ్‌లో కొచర్ కెరియర్ ప్రారంభించారు. -
2021లో భారత్ వృద్ధి 12.5 శాతం!
వాషింగ్టన్: భారత్ ఆర్థిక వ్యవస్థ 2021లో భారీగా 12.5 శాతం పురోగమిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. ఇదే జరిగితే వేగంగా వృద్ధి చెందుతున్న దేశం హోదాను భారత్ తిరిగి సాధించగలుగుతుంది. కాగా 2022లో భారత్ వృద్ధి 6.9 శాతంగా ఉంటుందని పేర్కొంది. కోవిడ్–19 మహమ్మారి సవాళ్లలోనూ 2020లో వృద్ధి సాధించిన పెద్ద ఎకానమీగా చైనా నిలబడిన సంగతి తెలిసిందే. 2020లో భారత్ ఆర్థిక వ్యవస్థ ఎనిమిది శాతం క్షీణించగా, చైనా 2.3 శాతం వృద్ధి సాధించింది. 2021లో ఆ దేశం 8.6%, 2022లో 5.6 శాతం పురోగతి సాధిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రపంచబ్యాంక్‌తో కలిసి త్వరలో వార్షిక ‘స్పింగ్’ సమావేశాలు నిర్వహించనున్న బహుళజాతి బ్యాకింగ్ దిగ్గజం– ఐఎంఎఫ్ తాజాగా వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్‌ను ఆవిష్కరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 6 శాతం వృద్ధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి గత అంచనాలను ఐఎంఎఫ్ మెరుగుపరచింది. 2020లో 3.3 శాతం క్షీణించిన గ్లోబల్ ఎకానమీ.. 2021, 2022లో వరుసగా 6 శాతం, 4.4 శాతం పురోగమిస్తుందని అంచనావేసింది. 2020 అక్టోబర్ నివేదికతో పోల్చితే 2020కి సంబందించి క్షీణత అవుట్‌లుక్ 1.1 శాతం మెరుగుపరచింది. 2020 చివరి ఆరు నెలల్లో పలు దేశాల్లో కఠిన లాక్డౌన్ ఆంక్షలు సడలించడం దీనికి కారణమని తాజా అవుట్‌లుక్ వివరించింది. లాక్డౌన్ ఆంక్షలు తగ్గడం వల్ల ఆర్థికరంగం క్రియాశీలత అంచనాలకు మించి మెరుగుపడిందని తెలిపింది. దీనికి అనుగుణంగానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను 2021, 2022ల్లో వరుసగా గతంకన్నా 0.8 శాతం, 0.2 శాతం మెరుగుపడినట్లు వివరించింది. చదవండి: (అదానీ గ్రూప్ సరికొత్త రికార్డ్) ఆరోగ్యరంగంపై భారీ వ్యయాలు అవుట్‌లుక్‌లోని కొన్ని ముఖ్యాంశాలను చూస్తే, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా వేగవంతం కావాల్సిన అవసరం ఉంది. మరోవైపు ద్రవ్యపరమైన మద్దతుకు అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. పర్యాటక రంగమూ మెరుగుపడలేదు. ప్రస్తుతం ఆరోగ్య రంగంపై అధిక వ్యయాలు చేయాలి. హెల్త్‌కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడాలి. కోవిడ్–19 ప్రభావానికి గురైన కుటుంబాలు అలాగే సంస్థలకు ద్రవ్యపరమైన మద్దతు అవసరం. ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్న దేశాల్లో సరళతర ద్రవ్య విధానాలను కొనసాగించాలి. ప్రతి దేశం ఫైనాన్షియల్ స్థిరత్వానికి తగిన చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించాలి. సంక్షోభం ఒక్కసారి ముగిసిన వెంటనే, రికవరీ వేగవంతం, ఉత్పత్తి పెంపుసహా ఆర్థిక వ్యవస్థల పటిష్ట పునర్నిర్మాణానికి తగిన ముందస్తు చర్యలను, వ్యూహాలను ప్రభుత్వాలు సిద్ధం చేసుకోవాలి. పర్యావరణ అనుకూలమైన పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వాలి. వాతావరణ మార్పుల ప్రతికూలతలను తద్వారా నివారించుకోవచ్చు. ఉత్పాదక సామర్థ్యాన్ని మెరుగుపరచుకోడానికి డిజిటల్ ఇన్ఫ్రాపై పెట్టుబడులను పెంచాలి. అసమానతలను తగ్గించడానికి సామాజిక సహాయ సహకారాలను పటిష్టం చేసుకోవాలి. సవాళ్లు పొంచి ఉన్నాయ్.. అటు అంతర్జాతీయంగా, ఇటు వివిధ దేశాల్లో అంతర్గతంగా రికవరీ వేగం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న దశలో ఈ అవుట్‌లుక్‌ను విడుదల చేస్తున్నాం. ఇంకా మనం వైరస్‌ను ఓడించలేదన్న విషయాన్ని గమనించాలి. పైగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ సంక్షోభం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లే ఎక్కువ ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే తాజా అవుట్‌లుక్‌ను విడుదల చేస్తున్నాం. – గీతా గోపీనాథ్, ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ నెల లాక్‌డౌన్‌తో జీడీపీ నష్టం 2 శాతం: బీఓఎఫ్ఏ భారత్ ఎకానమీ రికవరీ ఇంకా విస్తృత ప్రాతిపదికన పటిష్టంగా లేదని అమెరికన్ బ్రోకరేజ్ సంస్థ– బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఎఫ్ఏ) సెక్యూరిటీస్ మంగళవారం హెచ్చరించింది. పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి భారత్ నెలపాటు లాక్డౌన్ విధిస్తే, ఎకానమీ 1 నుంచి 2 శాతం వరకూ పతనం అవుతుందని అంచనావేసింది. పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను తిరిగి ప్రకటించనప్పటికీ, రాత్రి పూట కర్ఫ్యూలు, స్థానిక లాక్డౌన్ విధింపు ద్వారా కరోనా సెకండ్ వేవ్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇది కూడా ఎకానమీపై ప్రతికూలత చూపే అంశమేనని తెలిపింది. 2021–22లో భారత్ ఎకానమీ 9% వృద్ధి రేటును నమోదుచేసుకోవచ్చని అంచనావేసిన సంస్థ, దీనికి ప్రధాన కారణాల్లో బేస్ ఎఫెక్ట్ (2020–21లో అతి తక్కువ ఎకానమీ గణాంకాలు) ఒకటని తెలిపింది. సెకండ్‌వేవ్‌తో జీడీపీ నష్టం 0.3 శాతమే: యూబీఎస్ కోవిడ్–19 కేసులు ఫిబ్రవరి నుంచీ తిరిగి పెరుగుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా లేదా రాష్ట్రాల వ్యాప్తంగా కఠిన లాక్డౌన్ విధింపు మరోసారి ఉండబోదన్న అభిప్రాయాన్ని స్విస్ బ్రోకరేజ్ సంస్థ– యూబీఎస్ అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో వైరస్ సెకండ్‌వేవ్ సమస్య ఉన్నప్పటికీ, దీని ప్రతికూల ప్రభావం ఎకానమీపై 20 నుంచి 30 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర మాత్రమే ఉంటుందని యూబీఎస్ విశ్లేషించింది. 2021–22లో భారత్ ఆర్థిక వ్యవస్థ 11.5 శాతం పురోగమిస్తుందన్న తమ సంస్థ అభిప్రాయంలో మార్పులేదని యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ తన్వీ గుప్తా జైన్ మంగళవారం పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్య పరపతి విధానం దాదాపు యథాతథంగా కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. అయితే రివర్స్ రెపో రేటు 25–40 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని తన్వీ అభిప్రాయపడ్డారు. -
ప్రజారోగ్యం, సంక్షేమంపై దృష్టి పెట్టాలి
వాషింగ్టన్: కోవిడ్–19 మహమ్మారితో యుద్ధం చేస్తున్న భారత్ తక్షణం ప్రజారోగ్యం, పేద ప్రజల కనీస అవసరాలను తీర్చడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) క్రిస్టాలినా జార్జియేవా పేర్కొన్నారు. అలాగే లఘు, చిన్న మధ్య తరహా ప్రయోజనాల పరిరక్షణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా ఆయా సంస్థలను వ్యాపార పరంగా కుప్పకూలకుండా చూడవచ్చని పేర్కొన్నారు. ఆయా చర్యలతో దీర్ఘకాలంలో దేశాన్ని వృద్ధి బాటలో విజయవంతంగా నడిపించవచ్చని విశ్లేషించారు. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వార్షిక సదస్సు నేపథ్యంలో ఎండీ మీడియాను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► ప్రపంచదేశాలన్నీ ఆరోగ్య రంగంపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి గట్టెక్కితే ఎన్నో అవరోధానాలు అధిగమించవచ్చు. అనిశ్చితి, అసంపూర్తి ఆర్థిక రికవరీ పరిస్థితుల నుంచీ బయటపడవచ్చు. ► కోవిడ్–19... ప్రపంచ మానవాళికి ఒక సంక్షోభం. భారత్‌సహా పలు దేశాల్లో మృతుల సంఖ్య తీవ్రంగా ఉంటోంది. ► సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి భారత్ తన శక్తిసామర్థ్యాల మేరకు కృషి చేస్తోంది. ప్రత్యక్ష్య ద్రవ్య పరమైన చర్యలు లేకపోయినా, ఉద్దీపనలతో ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి కృషి చేస్తోంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న కొన్ని దేశాల ఉద్దీపనలతో పోల్చితే ఇది తక్కువే. గణనీయమైన ఉద్దీపనలను అందించడంలో భారత్ ఆర్థిక వ్యవస్థకు పరిమితులు ఉన్నాయి. 2020లో 10.3 శాతం క్షీణిస్తుందని అంచనావేసిన ఐఎంఎఫ్, అయితే 2021లో దేశం 8.8 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని ఇప్పటికే విశ్లేషించింది. తద్వారా తిరిగి వేగంగా వృద్ధి చెందుతున్న హోదాను దక్కించుకుంటుందని పేర్కొంది. ► కష్టాలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడ్డానికి ప్రపంచదేశాలు తగిన పటిష్ట ఆర్థిక చర్యలను తీసుకోవాలి. అయితే ఇలాంటి పటిష్ట ఆర్థిక మూల స్తంభాలను కష్టాలు రావడానికి ముందే నిర్మించుకోవాలి. ఇది మనకు కరోనా తాజాగా నేర్పిన పాఠం. ‘బ్రెట్టన్ వుడ్స్’ తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్న ప్రపంచం కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచం కొత్తగా ‘బ్రెట్టన్ వుడ్స్ సమావేశం’ నాటి స్థితిగతులను ఎదుర్కొంటోందని ఐఎంఎఫ్ ఎండీ పేర్కొన్నారు. ఐఎంఎఫ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత భవిష్యత్ ఘర్షణల నివారణ, పరస్పర ఆర్థిక సహకారం లక్ష్యంగా పటిష్టమైన ప్రపంచస్థాయి సంస్థలు, ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు 1944లో అమెరికా, న్యూ హ్యాంప్‌షైర్, కారోల్లోని బ్రెట్టన్ వుడ్స్ ప్రాంతంలో మిత్రపక్ష దేశాలు జరిపిన సమా వేశం అదే ప్రాంతం పేరుతో ప్రసిద్ధమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో తిరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా నిలబెట్టడానికి పటిష్ట చర్యలు అవసరమని పేర్కొంటూ, ‘‘ప్రస్తుతం మనం బ్రెట్టన్ వుడ్స్ తరహా పరిస్థితిన ఎదుర్కొంటున్నాం. మహమ్మారి లక్షలాదిమంది ప్రాణాలను బలితీసుకుంటోంది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 4.4 శాతం క్షీణతలోకి జారే పరిస్థితి ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 11 ట్రిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తి నష్టపోతున్నామన్న అంచనా ఉంది. దశాబ్ద కాలాల్లో మొట్టమొదటిసారి లక్షలాదిమంది పేదరికంలోకి వెళ్లిపోతున్నారు. మానవాళికి తీవ్ర సంక్షోభ పరిస్థితి ఇది. ఇప్పుడు మన ముందు రెండు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. అందులో ఒకటి కరోనాతో పోరాటం. రెండు అత్యుత్తమైన రేపటిరోజును నేడు నిర్మించుకోవడం. ఈ దిశలో వృద్ధి, ఉపాధి కల్పన, జీవన ప్రమాణాల మెరుగుదల జరగాలి. ఇందుకు పటిష్ట ఆర్థిక విధానాలు, సంస్థలు అవసరం. ప్రపంచ దేశల పరస్పర సహకారం ఇక్కడ ఎంతో కీలకం’’ అని సదస్సును ఉద్దేశించి ఐఎంఎఫ్ ఎండీ అన్నారు. ‘వీ’ నమూనా వృద్ధి కనిపిస్తోంది: నిర్మలా సీతారామన్ ఇదిలావుండగా, ఐఎంఎఫ్ మంత్రిత్వస్థాయి కమిటీ అయిన అంతర్జాతీయ ద్రవ్య, ఆర్థిక సంఘం (ఐఎంఎఫ్సీ) వీడియోకాన్ఫరెన్స్ సమావేశంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడారు. భారత్ ఆర్థిక రంగానికి సంబంధించి పలు విభాగాల్లో ‘వీ’ (ఠి) నమూనా వృద్ధి కనబడుతోందని ఈ సందర్భంగా వివరించారు. దేశ ఆర్థిక పురోగతికి భారత్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఐఎంఎఫ్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. -
తలసరి ఆదాయంలో భారత్‌ను మించనున్న బంగ్లా!
న్యూఢిల్లీ: తలసరి ఆదాయం విషయంలో 2020లో భారత్‌ను పొరుగున ఉన్న బంగ్లాదేశ్ మించిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేస్తోంది. ఒక దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువను ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం. ఐఎంఎఫ్ ‘‘వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్’’ నివేదిక ప్రకారం, 2021 మార్చి 31వ తేదీతో ముగిసే ఆర్థిక సంవత్సరంలో భారత్ తలసరి ఆదాయం 1,877 డాలర్లుగా (డాలర్ మారకంలో రూపాయి విలువ 70 ప్రకారం చూస్తే, రూ.1,31,390)నమోదుకానుంది. ఇక ఇదే కాలంలో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం 1,888 డాలర్లకు పెరగనుంది. కరోనా సవాళ్ల నేపథ్యంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 2020లో 10.3% క్షీణిస్తుందని ఐఎంఎఫ్ ఇదే నివేదికలో అంచనావేసింది. కొనుగోలు శక్తి ప్రమాణాల్లో భారత్‌దే పైచేయి! ఐఎంఎఫ్ అంచనాల ప్రభావాన్ని తగ్గించే గణాంకాలను అధికార వర్గాలు ప్రస్తావిస్తుండడం ఇక్కడ మరో అంశం. దేశాల ఉత్పాదకత, కరెన్సీల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలకు సంబంధించిన పర్చేజింగ్ పవర్ ప్యారిటీ (పీపీపీ) విధానం ప్రకారం చూస్తే, భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2019లో బంగ్లాదేశ్‌కన్నా 11 రెట్లు అధికమని అధికార వర్గాలు బుధవారం పేర్కొన్నాయి. తలసరి ఆదాయంలో భారత్‌ను బంగ్లాదేశ్ అధిగమించనున్నదన్న ఐఎంఎఫ్ అంచనాలను ప్రస్తావిస్తూ, ‘‘ఆరు సంవత్సరాల్లో బీజేపీ పాలన సాధించిన ఘనత ఇదీ’ అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఒక ట్వీట్ నేపథ్యంలో అధికార వర్గాలు తాజా వివరణ ఇచ్చాయి. 2014– 15లో రూ.83,091గా ఉన్న భారత్ తలసరి ఆదా యం 2019–20లో రూ.1,08,620కి చేరిందని అధి కార వర్గాలు వివరించారు. పీపీపీ విధానం ప్రకారం, 2020లో భారత్ తలసరి ఆదాయం 6,284 డాలర్లు ఉంటుందని అంచనావేసిన ఐఎంఎఫ్, బంగ్లాదేశ్ విషయంలో దీన్ని 5,139 డాలర్లుగానే లెక్కగట్టడాన్ని అధికారులు ప్రస్తావించారు. జీడీపీలో 90 శాతానికి కేంద్ర రుణ భారం వాషింగ్టన్: కరోనా నేపథ్యంలో గవర్నమెంట్ బాండ్లు, ట్రెజరీ బిల్లులు, స్వల్పకాలిక రుణాలకు సంబంధించిన కేంద్ర రుణ భారం(పబ్లిక్ డెట్) భారీగా పెరిగే అవకాశం ఉందని ఐఎంఎఫ్ అంచనావేస్తోంది. 1991 నుంచీ జీడీపీలో పబ్లిక్ డెట్ స్థిరంగా దాదాపు 70% వద్ద కొనసాగుతుండగా, తాజా పరిస్థితుల్లో ఇది దాదాపు 90 వరకూ పెరిగే అవకాశం ఉందని ఐఎంఎఫ్ ఫైనాన్షియల్ వ్యవహారాల డైరెక్టర్ విక్టర్ గ్యాస్పర్ తెలిపారు. -
కరోనా కష్టంతో 9.6% క్షీణత
వాషింగ్టన్: భారత్ ఆర్థిక వ్యవస్థ 2020 (ఏప్రిల్)–2021 (మార్చి) ఆర్థిక సంవత్సరంలో 9.6 శాతం క్షీణతను నమోదుచే సుకుంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనావేస్తోంది. కరోనా కట్టడికి విధించిన కఠిన లాక్డౌన్ పరిస్థితులు, గృహాలు, పరిశ్రమల ఆదాయాలు పడిపోవడం వంటి అంశాలు దీనికి కారణంగా వివరించింది. ‘దక్షిణాసియా ఆర్థిక పరిస్థితిపై దృష్టి’ పేరుతో గురువారంనాడు విడుదలైన ప్రపంచబ్యాంక్ నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. భారత్ ఇంతకుముందెన్నడూ లేని దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోందని పేర్కొంది. తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) భారత స్థూల దేశీయోత్పత్తి 23.9 శాతం క్షీణించిన నేపథ్యంలో ప్రపంచబ్యాంక్ తాజా నివేదిక విడుదలైంది. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వార్షిక సమావేశాల నేపథ్యంలో విడుదలైన నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు... ► దక్షిణాసియా ప్రాంతం ఆర్థిక వ్యవస్థ గడచిన ఐదేళ్ల నుంచీ వార్షికంగా 6 శాతం వృద్ధి నమోదుచేసుకోగా, 2020లో 7.7 శాతం క్షీణించనుంది. అయితే 2021లో ఈ ప్రాంతం 4.5 శాతం వృద్ధిని నమోదు చేసుకునే అవకాశం ఉంది. ► కరోనా వైరస్ ప్రభావంతో భారత్‌లో సరఫరాలు–డిమాండ్ పరిస్థితుల మధ్య సమతౌల్యత పూర్తిగా దెబ్బతింది. ► వృద్ధికి మౌలిక రంగంలో పెట్టుబడులు అవసరం. అయితే ఇప్పుడు ద్రవ్య వనరులను ఆరోగ్యం, సామాజిక భద్రతపై అధికంగా కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఆయా అంశాలకు అనుగుణంగా మధ్య కాలానికి ద్రవ్య వ్యవస్థ–వ్యయ ప్రక్రియలను పునఃసమీక్షించాల్సి ఉంటుంది. అయితే క్లిష్ట ద్రవ్య పరిస్థితుల్లోనూ కేంద్రం తన వంతు తగిన చర్యలను సమర్థవంతంగా తీసుకుంటోంది. ► అసలే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను కరోనా మహమ్మారి మరింత దెబ్బతీసింది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపాధి అవకాశాలను కోల్పోయారు. దీనితో పేదరికం సమస్య తీవ్రమవుతోంది. ఏడాదిలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య 33 శాతం పెరిగే అవకాశం ఉంది. ► బ్యాంకింగ్‌లో పెరుగుతున్న మొండిబకాయిల (ఎన్పీఏ) పరిమాణం ఆందోళన కలిగిస్తోంది. అన్ని అంచనాలూ క్షీణతలోనే... మొదటి త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో భారత్ ఆర్థిక వ్యవస్థ 23.9% క్షీణ రేటును నమోదుచేసుకున్న నేపథ్యంలో... 2020–21లో అంచనాలను పరిశీలిస్తే (అంచనాలు శాతాల్లో).. -
ఆత్మనిర్భర్ భారత్‌కు ఐఎంఎఫ్ కితాబు
వాషింగ్టన్: ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ (స్వావలంబన భారత్) కార్యక్రమాన్ని చాలా ముఖ్యమైనదిగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పేర్కొంది. ‘‘స్వావలంబన భారత్ (తన అవసరాలకు తనపైనే ఆధారపడడం) కార్యక్రమం కింద ఇచ్చిన ఆర్థిక ప్యాకేజీ భారత ఆర్థిక వ్యవస్థకు సాయపడింది. మరింత అగాథంలోకి పడిపోకుండా కాపాడింది. కనుక ఈ కార్య్రమాన్ని చాలా ముఖ్యమైనదిగా చూస్తున్నాము. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. అందుకు ఆర్థిక వ్యవస్థ సామర్థ్య, పోటీతత్వాన్ని ఇనుమడింపజేసే విధానాలను అనుసరించడం కీలకమవుతుంది. ప్రపంచం కోసం తయారీ అన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు గాను.. అంతర్జాతీయ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలో భారత్ మరింతంగా చొచ్చుకునిపోయే విధానాలపై దృష్టి పెట్టాలి’’ అంటూ ఐఎంఎఫ్ డైరెక్టర్ గెర్రీరైస్ వాషింగ్టన్లో జరిగిన మీడియా సమావేశంలో భాగంగా చెప్పారు. ఆరోగ్యసంరక్షణ రంగంలో స్థిరమైన వృద్ధి లక్ష్యాలను సాధించేందుకు భారత్ జీడీపీలో ప్రస్తుతం ఈ రంగానికి కేటాయిస్తున్న 3.7 శాతాన్ని క్రమంగా పెంచాల్సి ఉందన్నారు. మధ్య కాలానికి మరింత సమ్మిళిత, స్థిరమైన వృద్ధిని సాధించేందుకు సమగ్రమైన, నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. -
వ్యాక్సిన్ పంపిణీపై ఐఎంఎఫ్ కీలక వ్యాఖ్యలు
న్యూయార్క్ : కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం ఇప్పట్లో సమసిపోదని, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అది అందరికీ అందేలా బహుముఖ సహకారం అవసరమని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) హెచ్చరించింది. ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకుల చొరవతో చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా కోవిడ్-19 నుంచి కోలుకునే పరిస్థితి కనిపిస్తోందని, దీనికి మరిన్ని చర్యలు అవసరమని ఫారెన్ పాలసీ మ్యాగజీన్లో ప్రచురితమైన ఓ వ్యాసంలో ఐఎంఎఫ్ పేర్కొంది. కరోనా వైరస్ నుంచి చోటుచేసుకుంటున్న రికవరీ పరిమితంగానే ఉందని, అన్ని రంగాలు, ప్రాంతాల్లో అసమానతలతో నిండిఉందని ఈ వ్యాసంలో ఐఎంఎఫ్ మేనజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా, ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌లు పేర్కొన్నారు. చదవండి : ఊహించినదానికంటే లోతైన మాంద్యం : గీతా గోపీనాథ్ కరోనా వైరస్ కల్లోలంతో ఈ సంక్షోభ ఫలితంగా 2021 సంవత్సరాంతానికి 12 లక్షల కోట్ల డాలర్ల మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఫలితంగా అల్పాదాయ దేశాలకు నిరంతర సాయం కీలకమని తెలిపింది. కరోనా వైరస్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 75 దేశాలకు ఐఎంఎఫ్ అత్యవసర నిధులను సమకూర్చగా, మధ్యాదాయ దేశాలకు విస్తృతస్ధాయిలో ఊతమిచ్చే చర్యలను కొనసాగించేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. ఇక పేద దేశాలు సహా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో 76 సంపన్న దేశాలు కోవ్యాక్స్ కూటమికి వెన్నుదన్నుగా నిలవడం పట్ల ఐఎంఎఫ్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఈ కూటమిలో చేరబోమని అమెరికా ప్రకటించడం గమనార్హం. -
మార్కెట్లను పునరుద్ధరిస్తాం
వాషింగ్టన్: కోవిడ్ ధాటికి విలవిలలాడుతున్న అగ్రరాజ్యంలో తిరిగి మార్కెట్లు ప్రారంభించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు దశల ప్రణాళికను ప్రకటించారు. దేశంలో నిరుద్యోగ భృతి కోసం మరో 52 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని కార్మిక శాఖ చెబుతున్న నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. కోవిడ్ ఉధృతికి మార్చిలో దేశవ్యాప్తంగా 2.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ ఏడాది అమెరికా ఆర్థిక వ్యవస్థ 5.9 శాతం కుంచించుకుపోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచంలో అతి పెద్దదైన తమ ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దడానికి ట్రంప్ ప్రభుత్వం మార్కెట్లను తెరవాలని అనుకుంటోంది. ఇన్నాళ్లూ మార్కెట్ల పునరుద్ధరణపై అధ్యక్షుడిదే తుది నిర్ణయం అని వాదించిన ట్రంప్ ఇప్పుడు ఆయా రాష్ట్రాల గవర్నర్లే దీనిపై నిర్ణయం తీసుకోవాలంటూ మాటమార్చారు. రాష్ట్ర గవర్నర్లకు ఫెడరల్ ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. ఇందుకోసం మూడు దశల ప్రణాళికను ప్రకటించారు. -
ఉదారత ఇప్పటి అవసరం
భూగోళాన్ని చుట్టుముట్టిన కరోనా వైరస్‌కు ధనిక, బీద దేశాల తారతమ్యత లేదు. కానీ అన్ని దేశాలూ ఆ మహమ్మారిని ఒకే తీరున ఎదుర్కొనే పరిస్థితి లేదు. డబ్బున్న దేశాలు నయానో భయానో తమకు కావలసినవి సమకూర్చుకుంటున్నాయి. గండం గడవడానికి సమృద్ధిగా ఖర్చు చేస్తున్నాయి. అమెరికా అయితే ఒకటికి రెండుసార్లు చైనా నుంచి వేరే దేశాలకు పోవాల్సిన మాస్క్‌లు, వైద్య ఉపకరణాలు హైజాక్ చేసి తీసుకుపోయింది. మన దేశం హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతిని నిలుపుదల చేస్తే, ఒత్తిడి తెచ్చి మళ్లీ పునరుద్ధరించేలా చేసింది. పేద దేశాలు వున్న వనరులతోనే, ఆ పరిమితుల్లోనే పౌరుల ప్రాణాలు కాపాడుకునేందుకు శక్తికొద్దీ పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో మూడు రోజుల్లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం కాబోతోంది. కరోనా వైరస్ సృష్టిస్తున్న బీభత్సం కారణంగా ప్రపంచ మార్కెట్లన్నీ దెబ్బతిన్నాయని, ఆర్థిక వ్యవస్థ లన్నీ తలకిందులవుతున్నాయని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జీవా వారంరోజులక్రితం ప్రకటించారు. ఆ సంస్థలో 189 సభ్య దేశాలుండగా దాదాపు వంద దేశాలు తమకు ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నాయి. ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేసుకునేందుకు, వైద్య సేవల్లో నిమగ్న మైనవారికి వైద్య ఉపకరణాలు, మాస్క్‌లు అందించడానికి, వారికి వేతనాలు చెల్లించడానికి రుణం అవసరమని ఈ దేశాలు కోరుతున్నాయి. దీంతోపాటు పాత బకాయిల చెల్లింపును వాయిదా వేయా లని, కొంత భాగాన్ని రద్దు చేయాలని బలంగా కోరుతున్నాయి. ఎందుకంటే 64 దేశాలు వైద్య రంగంపై కన్నా ఐఎంఎఫ్ బకాయిల చెల్లింపునకే అధికంగా ఖర్చు చేయాల్సివస్తోంది. ఈలోగా కరోనా వైరస్ పంజా విసరడంతో ఆ దేశాలు అనిశ్చితిలో పడ్డాయి. పాకిస్తాన్, అంగోలా, శ్రీలంక, గాంబియా, కాంగో, ఘనా, లెబనాన్, కామెరూన్, లావోస్ వంటివి ఈ చిట్టాలో వున్నాయి. ఇవన్నీ వాటి ఆదాయంలో 20 శాతాన్ని పాత బకాయిల చెల్లించడానికి ఖర్చు పెడుతున్నాయి. అదే సమయంలో వైద్య రంగానికి అవి పది శాతం మొత్తాన్ని కూడా కేటాయించలేకపోతున్నాయి. అసలే అంతంతమాత్రంగా వున్న ఆర్థిక వ్యవస్థతో ఈదుకొస్తున్న బంగ్లాదేశ్ మయన్మార్ నుంచి వచ్చిపడిన రోహింగ్యా శరణార్థులతోనే సతమతమవుతుండగా ఆ కష్టాలను కరోనా మహమ్మారి మరింత పెంచింది. తాము చెల్లించాల్సిన బకాయిలను వాయిదా వేయడం లేదా కొంత మొత్తాన్ని రద్దు చేయడం అవసరమని ఈ దేశాల్లో అనేకం కోరుతున్నాయి. నిజానికి ఈ కరోనా మహమ్మారి తొలుత సంపన్న దేశాలను తాకింది. ఆ తర్వాత పేద దేశాలపై విరుచుకు పడింది. అన్నిచోట్లా మరణమృదంగాన్ని మోగించడంతోపాటు భిన్న రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. డిమాండు, సరఫరాల మధ్య నిరంతరం వుండాల్సిన సంబంధాన్ని ఇది దెబ్బ తీసింది. ఈ సంక్షోభం తాత్కాలిక దశగానే వుండాలి తప్ప, శాశ్వత సంక్షోభంగా మారకూడదని... ఉపాధి దెబ్బతిని, దివాళా తీసి జనం ఇక్కట్లపాలు కాకూడదని అన్ని దేశాలూ బలంగా కోరుకుం టున్నాయి. ఆర్థిక సంక్షోభం అందరిలోనూ అశాంతి సృష్టించి, అది శాంతిభద్రతల సమస్యకు దారి తీస్తే అన్ని సమాజాలు అస్తవ్యస్థమవుతాయి. కనుకనే ఇప్పుడు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్, ఆసియా అభివృద్ధి బ్యాంకు తదితర సంస్థలతోపాటు ధనిక దేశాలు కూడా రంగంలోకి దిగి ఆదుకోవాల్సిన అవసరం వుంది. మొట్టమొదట కరోనా బారినపడిన చైనాలో తయారీ రంగం, సేవారంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. ఫిబ్రవరి నెలలో ఆ రంగాలు రెండూ కళ్లు తేలేశాయి. చైనా సంపన్న దేశం గనుక ఆ రెండు రంగాలూ యధావిధిగా తమ కార్యకలాపాలు మొదలుపెట్టాయి. కానీ ప్రపం చమంతా సంక్షోభంలో వున్నప్పుడు అవి మునుపటిలా సమర్థవంతమైన ఫలితాలనీయడం సాధ్యం కాదు. కనుక ప్రపంచంలో ఒక దేశమో, ఒక ప్రాంతమో కోలుకుంటే సరిపోదు. అన్ని దేశాలూ సాధారణ స్థితికి చేరాలి. ప్రపంచ పౌరులందరిలో కొనుగోలు శక్తి పెరగాలి. ఇందుకు ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, జీ–20వంటివి ప్రధాన పాత్ర పోషించవలసివుంటుంది. కేవలం లాభార్జన దృష్టితో కాక ప్రపంచ దేశాలన్నీ మళ్లీ మెరుగైన స్థితికి చేరాలన్న లక్ష్యంతో పనిచేసినప్పుడే మంచి ఫలితా లొస్తాయి. మన దేశంతోపాటు దక్షిణాసియా దేశాల్లో ఈ నాలుగు దశాబ్దాల్లో కనీవినీ ఎరుగని స్థాయిలో వృద్ధి మందగించబోతున్నదని ప్రపంచబ్యాంకు ప్రకటించింది. ఈ దేశాలన్నీ 1.8 శాతం నుంచి 2.8 శాతం లోపు మాత్రమే వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం ఉన్నదని ఆ సంస్థ అంచనా వేస్తోంది. ఈ సందర్భంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏర్పడ్డ అంతర్ సంస్థల టాస్క్‌ఫోర్స్ అభివృద్ధి సాధనకు పెట్టుబడులు పెట్టడం అనే అంశంపై రూపొందించిన నివేదిక గురించి చెప్పుకోవాలి. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు తదితర 60 అంతర్జాతీయ సంస్థలున్న ఆ టాస్క్‌ఫోర్స్ ప్రపంచ ఆర్థిక విపత్తును నివారించేందుకు అనేక సూచనలు చేసింది. ఆహారం, మందులు వంటి ప్రజల మౌలిక అవసరాలు తీర్చడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు విపత్తులను ఎదుర్కొనడానికి వర్థమాన దేశాలను సంసిద్ధం చేసే దిశగా కార్యక్రమాలు అమలు చేయాలని ప్రతిపాదించింది. ప్రపంచంలో అతి తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు 44 వున్నాయి. ఈ దేశాలకు అందే ఆర్థిక సాయం నానాటికీ కుంచించుకుపోతూవుంది. 2018లో ఈ సాయం అంతక్రితంకంటే 4.3 శాతం తగ్గిపోయింది. ఈ ధోరణి మారకపోతే ప్రమాదకర పర్యవసానాలు ఏర్పడతాయి. ఈ మహమ్మారి అంతరించేసరికి 780 కోట్ల ప్రపంచ జనాభాలో సగంమంది పేదరికంలో మగ్గవలసి వస్తుందని ఆక్స్‌ఫాం సంస్థ ఈ మధ్యే అంచనా వేసింది. కనుక ముంచుకొస్తున్న ఈ పెను ముప్పును గ్రహించి నిరుపేద దేశాలకు ఉదా రంగా ఆర్థిక సాయం అందించేందుకు సంపన్న దేశాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఉదారంగా ముందుకు రావాలి. ఐఎంఎఫ్ ఈ విషయంలో చొరవ తీసుకుని అందరికీ మార్గదర్శకం కావాలి. -
మాంద్యం గుప్పిట్లోకి ప్రపంచం!
వాషింగ్టన్: ప్రపంచ దేశాలు తీవ్రమైన మాంద్యం పరిస్థితులను ఎదుర్కోనున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జీవా అన్నారు. కరోనా వైరస్ కారణంగా 1930 తీవ్ర మాంద్యం తర్వాత మరో విడత అటువంటి తీవ్ర పరిస్థితులు 2020లో రానున్నాయని, 170 దేశాలలో తలసరి ఆదాయం వృద్ధి మైనస్‌లోకి వెళ్లిపోవచ్చన్నారు. వాషింగ్టన్లో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ‘సంక్షోభాన్ని ఎదుర్కోవడం: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందున్న ప్రాధాన్యతలు’ అనే అంశంపై జార్జీవా మాట్లాడారు. ‘‘నేడు ప్రపంచం ఇంతకుముందెన్నడూ లేనటువంటి సంక్షోభంతో పోరాడుతోంది. కరోనా వైరస్ కాంతి వేగంతో మన సామాజిక, ఆర్థిక క్రమాన్ని అస్తవ్యస్తం చేసింది. మన జీవిత కాలంలో గుర్తున్నంత వరకు ఈ స్థాయి ప్రభావాన్ని చూడలేదు’’ అని జార్జీవా పేర్కొన్నారు. వైరస్‌పై పోరాడేందుకు లాక్డౌన్ అవసరమని, ఇది వందల కోట్ల ప్రజలపై ప్రభావం చూపిస్తోందన్నారు. ప్రపంచం అసాధారణ అనిశ్చితిని చవిచూస్తోందని, ఈ సంక్షోభం తీవ్రత, ఎంత కాలం కొనసాగేదీ తెలియడం లేదని పేర్కొన్నారు. ఫలితంగా 2020లో ప్రపంచ వృద్ధి ప్రతికూల దశలోకి వెళ్లిపోతుందన్నది స్పష్టమన్నారు. వర్ధమాన దేశాలకు ట్రిలియన్ డాలర్ల నిధుల సాయం అవసరమని, ఇందులో ఆయా దేశాలు కొంత వరకే సమకూర్చుకోగలవని చెప్పారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రకటించిన ద్రవ్యపరమైన చర్యలు 8 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఆమె తెలిపారు. -
భారత్‌లో ఆర్థిక మందగమనం
వాషింగ్టన్: భారత్‌లో ఆర్థిక మందగమన పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభిప్రాయపడింది. దీర్ఘకాల ఈ ధోరణిని అరికట్టడానికి కేంద్రం తక్షణం విధానపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఐఎంఎఫ్ డైరెక్టర్స్ నివేదిక వెలువరించిన అంశాలను సంస్థ ఆసియా, పసిఫిక్ శాఖలో భారత్ వ్యవహారాల చీఫ్ రానిల్ సల్గాడో విలేకరులకు తెలిపారు. దీని ప్రకారం– భారత్ ఆర్థిక రంగానికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► నిజానికి భారత్ ఇటీవలి సంవత్సరాల్లో భారీ ఆర్థిక విస్తరణ బా టలో ముందడుగు వేసింది. దీనితో లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడ్డారు. అయితే 2019 సంవత్సరం నుంచీ దేశంలో ఆర్థిక వృద్ధి పూర్తి మందగమనంలో జారిన జాడలు సుస్పష్టమయ్యాయి. తగిన విధానపరమైన చర్యలు తీసుకోకపోతే, ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. ► అయితే భారీ వృద్ధి తర్వాత వచ్చే దిగువబాటగానే (సైక్లికల్) మేము ఈ పరిస్థితిని ఇంకా పరిగణిస్తున్నాం. వ్యవస్థాగతమైన ఇబ్బందులు కనబడ్డంలేదు. అయితే ఈ సైక్లికల్ ప్రతికూలతలను ఎదుర్కొనడానికి కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఫైనాన్షియల్ రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి. ► ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టం 4.5 శాతానికి పడిపోయింది. దేశీయంగా ప్రైవేటు డిమాండ్‌లో కేవలం ఒక శాతం వృద్ధి రేటు నమోదయ్యిందని గణాంకాలు పేర్కొంటున్నాయి. పరిస్థితి చూస్తుంటే, డిసెంబర్ త్రైమాసికంలోనూ ప్రతికూల జీడీపీ గణాంకాలే వెలువడతాయని భావించాల్సి వస్తోంది. ► బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థల్లో (ఎన్బీఎఫ్సీ) రుణ వృద్ధి లేకపోవడం, ఆదాయాల వృద్ధి ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో పడిపోవడం మొత్తంగా ప్రైవేటు వినియోగంపై కనబడుతోంది. ► తగినంత వ్యాపార విశ్వాసం లేకపోవడం వల్ల బ్యాంకింగ్ రంగంలో రుణ వృద్ధి మందగమనం కొనసాగుతోంది. ► వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మంచి వ్యవస్థాగత సంస్కరణే అయినప్పటికీ, అమల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. వృద్ధి మందగమనంలో దీనిపాత్ర కూడా ఉండొచ్చనిపిస్తోంది. ► బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల సమస్య పరిష్కార దిశలో తగిన చర్యలు ఉండాలి. ► ప్రస్తుతం 2019–20లో భారత్ జీడీపీ వృద్ధిరేటు 6.1% ఉంటుందని అంచనా. అంచనాల సవరణ నిర్ణయం జనవరిలో ఉంటుంది. గత వృద్ధి అంచ నాలను గణనీయంగా తగ్గించే అవకాశాలే ఉన్నా యి. ప్రస్తుతం వివిధ జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు భారత్ వృద్ధి అంచనాలను దాదాపు 5% దిగువనకు కుదించిన సంగతి తెలిసిందే. ► భారత్ ఆర్థిక రంగానికి సంబంధించి కొన్ని సానుకూల అంశాలూ ఉన్నాయి. అందులో విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో ఉండడం ఒకటి. నవంబర్ 15తో ముగిసిన వారంలో 441 మిలియన్ డాలర్ల పెరుగుదలతో 448.249 బిలియన్ డాలర్లకు ఎగశాయి. దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం కరెంట్ అకౌంట్ లోటు కూడా కట్టడిలోనే ఉంది. కూరగాయల ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం ఇటీవల కట్టుతప్పినప్పటికీ, గడచిన కొన్ని సంవత్సరాలుగా పూర్తి నియంత్రణలో ఉంది. కార్పొరేట్ పన్ను రేటును 30 నుంచి 15 శాతానికి తగ్గించడమూ సానుకూలాంశమే. ఇన్ని చర్యలు ఉన్నా... ఆర్థిక మందగమనం ఆశ్చర్యకరమే. అందువల్ల ఈ మందగమనాన్ని ఆర్థిక సంక్షోభంగా అభివర్ణించలేం. ► కార్మిక, భూ, ప్రొడక్ట్ మార్కెట్ వంటి విభాగాల్లో భారత్ సంస్కరణలు తీసుకురావాలని ఐఎంఎఫ్ భావిస్తోంది. అలాగే మార్కెటింగ్‌లో ప్రత్యేకించి అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని ఎదుర్కొనేందుకూ చర్యలు అవసరం. ఇక విద్యా, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లోనూ సంస్కరణలు అవసరం. ► అయితే ఇక్కడ ఒక అంశాన్ని ఐఎంఎఫ్ విశ్వసిస్తోంది. ప్రస్తుతం భారత్ ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) సమస్యను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనలు ప్రకటించడానికి పరిమితులు ఉన్నాయి. 2019– 20 ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ పరిమాణం రూ.7.03 లక్షల కోట్లుగా ఉండాలన్నది (జీడీపీలో 3.3 శాతం) బడ్జెట్ లక్ష్యం. కానీ అక్టోబర్ ముగిసే నాటికే ఈ మొత్తం రూ.7,20,445 కోట్లకు చేరింది. ద్రవ్యలోటు కట్టడికి తగిన చర్యలపై దృష్టి పెట్టాలి. -
భారత్‌పై ‘అంతర్జాతీయ మందగమనం’ ఎఫెక్ట్!
వాషింగ్టన్: అంతర్జాతీయ ఆర్థిక మందగమన ప్రభావం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఒక్కింత ఎక్కువగా ఉండనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తం దాదాపు ఒకేసారి మందగమనంలోకి జారిన పరిస్థితులను మనం చూస్తున్నామని పేర్కొన్నారు. అంటే ప్రపంచ ఆర్థిక వృద్ధి 90 శాతం ఈ ఏడాది మందగమనంలోకి జారిపోనుందని వివరించారు. ఇంకా చెప్పాలంటే, వృద్ధి రేటు ఈ దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయిలను చూడనుందని తెలిపారు. 2019, 2020 వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ వచ్చే వారంలో విడుదల కానుందని పేర్కొన్న ఆమె, ఈ అవుట్‌లుక్‌లో వృద్ధి రేట్ల అంచనాలకు కోత పడే అవకాశం ఉందనీ సూచించారు. వచ్చేవారం ఇక్కడ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచబ్యాంక్ వార్షిక సమావేశం జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఐఎంఎఫ్ చీఫ్ ఇక్కడ కీలక ముందస్తు ప్రసంగం ఒకటి చేశారు. ఇందులో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► అంతర్జాతీయంగా పలు దేశాల ఆర్థిక గణాంకాలను చూస్తే, క్లిష్టమైన పరిస్థితి కనిపిస్తోంది. ► మొత్తంగా వృద్ధి మందగమనం ఉన్నప్పటికీ, 40 వర్థమాన దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 5 శాతం పైనే ఉంది. ఆయా దేశాల్లో 19 సహారా ప్రాంత ఆఫ్రికా దేశాలూ ఉన్నాయి. ► పలు దేశాలు ఇప్పటికే ఆర్థిక తీవ్ర క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి దేశం ఆర్థిక స్థిరత్వం పటిష్టత లక్ష్యంగా ద్రవ్య, పరపతి విధానాలను అనుసరించాలి. తక్కువ వడ్డీరేట్ల ఆర్థిక వ్యవస్థల్లో అదనపు నిధలు వ్యయాలకు కొంత అవకాశం ఉంది. ► వ్యవస్థాగత సంస్కరణలతో ఉత్పాదకత పెంపు తద్వారా ఆర్థిక క్రియాశీలత మెరుగుదలకు అవకాశం ఉంది. తద్వారా అధిక వృద్ధి సాధించడం అవసరం. ఇందుకు తగిన మదింపు జరగాలి. -
ఆర్థిక మందగమనంపై ఐఎంఎఫ్ హెచ్చరిక
-
పెట్టుబడులు, వినియోగమే భారత్‌కు దన్ను!
వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) 7.5 శాతంగా నమోదవుతుందని ప్రపంచబ్యాంక్ తాజా నివేదిక ఒకటి పేర్కొంది. దేశంలో పెట్టుబడుల పరిస్థితి పటిష్టం అవుతోందని, ఎగుమతులు మెరుగుపడుతున్నాయని, వినియోగ పరిస్థితులు బాగున్నాయని ప్రపంచబ్యాంక్ ఈ నివేదికలో పేర్కొంది. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాసహా పలు ఆర్థిక సంస్థలతో అంచనాలతో పోల్చితే, ప్రపంచబ్యాంక్ ప్రస్తుత వృద్ధి అంచనాలు అధికంగా ఉండడం గమనార్హం. త్వరలో జరగనున్న ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) స్పింగ్ సమావేశాల నేపథ్యంలో విడుదలైన తాజా నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ► 2018–2019లో భారత్ వృద్ధి రేటు 7.2 శాతంగా అంచనా. ఇది మరింత మెరుగుపడుతుందనడానికి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ► 2018–19 మొదటి మూడు త్రైమాసిక గణాంకాలను (ఏప్రిల్–డిసెంబర్) పరిశీలిస్తే, వృద్ధి ఏ ఒక్క రంగానికే పరిమితం కాకుండా, విస్తృత ప్రాతిపదికన ఉంది. సేవల రంగం కొంత తగ్గినా, పారిశ్రామిక వృద్ధిరేటు మాత్రం 7.9 శాతంగా ఉంది. ► వ్యవసాయ రంగం 4 శాతం వృద్ధి మంచి ఫలితమే. ► డిమాండ్ కోణంలో చూస్తే, దేశీయ వినియోగం వృద్ధి పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తోంది. పెట్టుబడులు, ఎగుమతుల వృద్ధి ధోరణి కూడా బాగుంది. మూడవ త్రైమాసికంలో చూస్తే, పలు రంగాల్లో సమతౌల్యమైన డిమాండ్, వృద్ధి పరిస్థితులు కనిపించాయి. ► గడిచిన ఆర్థిక సంవత్సరం (2018–19) ద్రవ్యోల్బణం పరిస్థితులు పూర్తి సానుకూలంగా ఉన్నాయి. ఆహార ఉత్పత్తుల ధరలు అందుబాటులో ఉన్నాయి. ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా 4 శాతంలోపే ఉంటుందని భావించడం జరుగుతోంది. ► దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య మధ్య నికర వ్యత్యాసం– కరెంట్ అకౌంట్‌లోటు, అలాగే ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు అదుపులోనే ఉన్నాయి. ఎగుమతులు పెరుగుతుండడం, తక్కువ ముడి చమురు దిగుమతుల వల్ల దేశానికి తగ్గే చమురు బిల్లు భారం కరెంట్ అకౌంట్ లోటును 1.9%కి (2019–20 జీడీపీ విలువలో) కట్టడిచేసే అవకాశంఉంది. అలాగే ద్రవ్యలోటు 3.4%కి దాటకపోవచ్చు. -
ఆర్థిక వృద్ధి.. అంతకు మించి!
దావోస్: అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, భారత్ మాత్రం ఈ ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతం వృద్ధి సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసినట్లు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. ఇది భారత్ సత్తాకు నిదర్శనమంటూ... తాము అంతకు మించిన ఆర్థిక వృద్ధిని సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో(డబ్ల్యూఈఎఫ్) మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పట్టణీకరణే కీలకం... భవిష్యత్తులో ఆర్థిక వృద్ధికి పట్టణీకరణ జోరే కీలకమని కాంత్ వివరించారు. వంద స్మార్ట్ సిటీల అభివృద్ధి జరుగుతోందని, ఇది పట్టణీకరణ జోరును మరింతగా పెంచగలదని పేర్కొన్నారు. ‘‘ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పన వేగవంతమైంది. సంస్కరణలు కొనసాగుతున్నాయి. దీంతో వృద్ధి మరింత జోరందుకుంటుంది. మరోవైపు ద్రవ్యోల్బ ణం, ద్రవ్యలోటు వంటి ఆర్థిక అంశాలు నియంత్రణలోనే ఉన్నాయి’’ అని ఆయన వివరించారు. వినియోగదారుడికే అగ్ర పీఠం... టెక్నాలజీ కారణంగా సరైన ఉత్పత్తులను, సేవలను వినియోగదారులకు అందించగలమని బజాజ్ ఫిన్సర్వ్ చీఫ్ సంజీవ్ బజాజ్ తెలిపారు. వినియోగదారుడికే అగ్రపీఠం అనే విధానాన్ని తాము అనుసరిస్తామని చెప్పారు. టెక్నాలజీని సరిగ్గా వినియోగించుకోవడం వల్లే వినియోగదారులకు తక్షణం రుణాలందించగలుగుతున్నామని తెలిపారు. చేయాల్సింది ఎంతో ఉంది... భారత్, చైనాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రభావం చూపడం మొదలైందని జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ చెప్పారు. అంతర్జాతీయ సంస్థలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. అమెరికా వంటి దేశాలు తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ బాగా పాడైందని, దీనిని బాగుకోసం చాలా చేయాల్సింది ఉందన్నారు. అమెరికా, చైనా, భారత్‌లు ముందుండాలి: జపాన్ ప్రధాని షింజో అబె ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై మళ్లీ విశ్వాసం పెరిగేలా చూడాలని ప్రపంచ దేశాల నాయకులను జపాన్ ప్రధాన మంత్రి షింజో అబె కోరారు. ప్రపంచ వాణిజ్య సంస్థకు (డబ్ల్యూటీఓ) కొత్త జవసత్వాలు కల్పించడానికి అమెరికా, చైనా, భారత్ కృషి చేయాలని కోరారాయన. పెరిగిపోతున్న వృద్ధ జనాభా సమస్యను ఉమెనామిక్స్ (మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించడం) ద్వారా అధిగమించామని, ఓటమినే ఓడించామని పేర్కొన్నారు. తమ దేశంలో 65 ఏళ్ల వ్యక్తులు కూడా పనిచేయడానికి ముందుకు వస్తారని, వంద మంది కాలేజీ పట్టభద్రులు ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉంటే, 98 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. మిత్రులతో వ్యాపారం వద్దు: జాక్ మా వ్యాపార వీరులు పోటీ గురించి, ఒత్తిడి గురించి అస్సలు ఆలోచించరని చైనా ఆన్లైన్ దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా వ్యాఖ్యానించారు. పిల్లలు సృజనాత్మకంగా, వినూత్నంగా ఆలోచించేలా చూడాలని, యంత్రాల మాదిరిగా వాళ్లు తయారు కాకూడదని పేర్కొన్నారు. భవిష్యత్తులో యంత్రాలకు చిప్‌లుంటాయని, కానీ మానవులకు హృదయం ఉంటుందని, ఈ దిశలో విద్యావిధానాలు ఉండాలని సూచించారు. పర్యావరణ హితంగా టెక్నాలజీ ఉండాలన్నారు. వ్యాపారం కంటే స్నేహం విలువైనదని, మీ మిత్రులను ఎప్పుడూ వ్యాపారంలో కలుపుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు. -
ముందు బ్యాంకింగ్ సవాళ్లను ఎదుర్కొనాలి!
వాషింగ్టన్: భారత్ మొదట బ్యాంకింగ్ రంగ సవాళ్లను అధిగమించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. పెట్టుబడులకు ఊతమివ్వటానికి, సమగ్ర అభివృద్ధికి ఇదెంతో కీలకమని విశ్లేషించింది. రెండు వారాలకు ఒకసారి నిర్వహించే విలేకరుల సమావేశంలో ఐఎంఎఫ్ ప్రతినిధి గ్యారీ రైస్ మాట్లాడుతూ, భారత్ బ్యాంకింగ్ సవాళ్లపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆయన జవాబుల్లోని ముఖ్యాంశాలు చూస్తే... మొండిబకాయిల (ఎన్పీఏ) భారం తగ్గించడానికి భారత అధికారులు తగిన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి విజయవంతం కూడా అవుతున్నట్లు సంకేతాలున్నాయి. మొండిబకాయిల గుర్తింపు, దివాలా చట్టం పరిధిలో కేసుల సత్వర పరిష్కారం వంటి చర్యలు బ్యాంకింగ్ సమస్యల పరిష్కార దిశలో ఉన్నాయి. ఈ చర్యలు తొలిదశలోనే ఉన్నప్పటికీ, ప్రోత్సాహకర పరిస్థితులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆయా అంశాల్లో పూర్తి విజయవంతమైన ఫలితాలు సాధించినతర్వాత, పాలనాపరమైన వ్యవహారాల్లో ప్రత్యేకించి రిస్క్ మేనేజ్మెంట్, కార్యకలాపాల్లో సంస్కరణల అమలు, లక్ష్యాల సాధన భారత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌కు కీలకం. ఇక బ్యాంకులకు తగిన మూలధనం అందించాలన్న అధికారుల సంకల్పం హర్షణీయం. ప్రస్తుత పరిస్థితి ఇదీ... బ్యాంకులకు 2017–18, 2018–19కు గాను కేంద్రం రూ.2.11 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్ ప్రణాళికను ప్రకటించింది. ఇందులో రూ. 65,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేటాయించారు. ఈ డబ్బు మూలధనానికి సంబంధించి రెగ్యులేటరీ అవసరాలకు తప్ప రుణ వృద్ధికి దోహదపడబోదని మూడీస్ పేర్కొనగా, బ్యాంకులు ప్రకటించిన భారీ నష్టాల కారణంగా... ఇప్పటికే సమకూర్చిన రూ.65 వేల కోట్ల అదనపు మూలధనం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందని రేటింగ్స్ ఏజెన్సీ ఫిచ్ విశ్లేషించించడం గమనార్హం. -
భారత జీడీపీకి ‘మహిళా’ మెరుపు!
న్యూఢిల్లీ: భారత్‌లో పని ప్రదేశాల్లో పురుషులతో సమానంగా మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచితే అది ఆ దేశ జీడీపీని 27 శాతం అధికం చేస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ చీఫ్ క్రిస్టీన్ లగార్డ్, నార్వే ప్రధాని ఎర్నా సోల్బెర్గ్ అన్నారు. దావోస్‌లో సోమవారం ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వీరు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మహిళలపై వివక్షకు, వేధింపులకు కాలం చెల్లిందన్నారు. మహిళల సాధికారత ఈ ఏడాది సదస్సులో ప్రధాన అంశంగా ఉండనుంది. మహిళల పట్ల గౌరవ భావం, అపార అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని వీరు పేర్కొన్నారు. ఈ ఏడాది సదస్సులో సుమారు 3,000 మంది ప్రముఖులు పాల్గొంటుండగా, అందులో 21% మహిళలే. వీరిలో లగార్డ్, సోల్బెర్గ్తోపాటు మన దేశానికి చెందిన మహిళా ఉద్యమకర్త చేతన సిన్హా కూడా ఉన్నారు. అలాగే, మన దేశ ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా అనేకమంది దిగ్గజాలు సదస్సుకు హాజరవుతున్నారు. -
వాక్యూమ్ క్లీనర్లా లాగేశారు!
డీమోనిటైజేషన్ ప్రక్రియపై అంతర్జాతీయ ద్రవ్య నిధి వ్యాఖ్యలు... ⇒ కొత్త నోట్ల సరఫరా మాత్రం నత్తనడకే... ⇒ ప్రజలు తీవ్ర నగదు కొరతను ఎదుర్కొన్నారు... ⇒ వినిమయంపై భారీగా ప్రతికూల ప్రభావం... వాషింగ్టన్: మోదీ సర్కారు చేపట్టిన నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) వ్యవహారంపై అంతర్జాతీయ ఆర్థిక సంస్థల విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. రద్దు రేసిన రూ.1,000; రూ.500 పెద్ద నోట్లను వ్యవస్థ నుంచి వాక్యూమ్ క్లీనర్ మాదిరిగా వెనక్కి లాగేశారని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) పేర్కొంది. అయితే, వాటి స్థానంలో కొత్త నోట్ల సరఫరా మాత్రం నత్తనడకగా సాగిందని ఐఎంఎఫ్ ఆసియా, పసిఫిక్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ పాల్ ఎ.కషిన్ అభిప్రాయపడ్డారు. డీమోనిటైజేషన్‌తో దేశంలో తీవ్ర నగదు కొరతకు దారితీసిందని.. ప్రజల వినిమయంపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు ఆయన అన్నారు. ‘రద్దయిన నోట్లను వ్యవస్థ నుంచి వెనక్కి గుంజేసిన తర్వాత వాక్యూమ్ క్లీనర్ రివర్స్‌లో పనిచేయడం మొదలుపెట్టింది. కొత్త నోట్ల సరఫరా చాలా నెమ్మదిగా జరిగింది. దీనివల్ల నగదు కొరత తీవ్రతరమై.. వినిమయం తీవ్రంగా పడిపోయింది’ అని ఆయన చెప్పారు.‘అభివృద్ధి చెందిన దేశాలు ప్రవేశపెట్టిన సహాయ ప్యాకేజీలు ‘హెలీకాప్టర్ డ్రాప్స్’గా (హెలికాప్టర్ ద్వారా నగదు వెదజల్లడం) చాలా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు భారత్‌లో చేపట్టిన డీమోనిటైజేషన్ ప్రక్రియను ‘వాక్యూమ్ క్లీనర్’తో పోల్చవచ్చు’ అని ఐఎంఎఫ్ ఆసియా, పసిఫిక్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ పాల్ ఎ.కషిన్ విశ్లేషించారు. భారత్‌పై ఐఎంఎఫ్ వార్షిక నివేదిక విడుదల చేసిన సందర్భంగా అడిగిన ఒక ప్రశ్నకు కషిన్ పైవిధంగా స్పందించారు. ఇండియా మిషన్ చీఫ్‌గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. నివేదికలో వివరాలు... ⇔ ప్రస్తుతం ఇంకా మార్కెట్లో నగదు కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో కొత్త నోట్ల సరఫరా పెంపును కొనసాగించాలి. అవసరమైతే తాత్కాలిక మినహాయింపులను పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో పాత నోట్లను మళ్లీ వినియోగించడం కూడా ఇందులో ఒకటి. ⇔ నోట్ల రద్దు కారణంగా తాత్కాలికంగా ఎదురుకానున్న వృద్ధి మందగమనాన్ని తట్టుకునే సామర్థ్యం ఫైనాన్షియల్ వ్యవస్థకు ఉంది. అయితే, కార్పొరేట్ రంగంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా మొండి బకాయిలు మరింత ఎగబాకే అవకాశం ఉంది. ⇔ దీనివల్ల బ్యాంకులు ఇతరత్రా ఆర్థిక సంస్థలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. దీనిపై ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి. డీమోనిటైజేషన్ వల్ల దెబ్బతిన్న రంగాలకు తగిన చేయూతనివ్వాలి. ⇔ నోట్ల రద్దు ప్రకంపనలు ఆర్థిక వ్యవస్థలో ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనూ కొనసాగే అవకాశం ఉంది. మార్చి చివరికి ఈ సమస్యలు తగ్గుముఖం పట్టొచ్చు. అంతర్జాతీయంగా చమురు ధరలు తక్కువ స్థాయిలోనే ఉండటం... సానుకూల రుతుపవనాలు, సరఫరాపరమైన అడ్డంకుల తొలగింపులో పురోగతి వంటివి డీమోని టైజేషన్ ఇబ్బందులను అధిగమించడంలో తోడ్పడతాయి. గ్లోబల్ షాక్‌ల ప్రభావం భారత్‌పై తక్కువే.. భారత్ ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగైన స్థితిలో ఉందని ఐఎంఎఫ్ సీనియర్ అధికారి పాల్ కషిన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి ఎదురయ్యే షాక్‌ల ప్రభావం ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్‌పై తక్కువగానే ఉంటుందని చెప్పారు. ‘ఇటీవలి కాలంలో పలు దేశాల్లో వృద్ధి మందగమనాన్ని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి తీవ్రంగా దెబ్బతినడం, డిమాండ్ పడిపోవడం వంటివి జరిగితే భారత్‌పైనా ప్రభావం చూపుతుంది. అయితే, ఇతర వర్ధమాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే ఈ ప్రభావం స్వల్పమే’ అని ఆయన తెలిపారు. ప్రధానంగా దేశీ డిమాండ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌లో డీమోనిటైజేషన్‌కు ముందు వినిమయం అత్యంత మెరుగైన స్థితిలో ఉండేదని ఆయన పేర్కొన్నారు. కాగా, గడచిన కొన్నేళ్లుగా భారత్ అనుసరిస్తున్న ద్రవ్యపరపతి విధానం, కార్యాచరణ భేషుగ్గా ఉందని కషిన్ చెప్పారు. ‘డీమోనిటైజేషన్ వల్ల వినిమయం దెబ్బతినడం వంటి స్వల్పకాలిక అడ్డంకులు తొలగిపోతే.. వృద్ధి మళ్లీ పట్టాలెక్కుతుంది. ప్రస్తుత 2016–17లో వృద్ధి రేటు 6.6%కి తగ్గొచ్చు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనూ ఈ ప్రభావం ఉంటుంది. అయితే, మధ్యకాలానికి మళ్లీ 8%పైగా వృద్ధి రేటు బాటలోని వచ్చేస్తుంది’ అని కషిన్ వివరించారు. -
భారత్ లాంటి దేశాలు ద్రవ్యలోటును తగ్గించాల్సిందే!
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సూచన న్యూఢిల్లీ: భారత్ లాంటి అధిక ప్రభుత్వ రుణ భారమున్న దేశాలు రుణంసహా ద్రవ్యలోటును తగ్గించడానికి తమ మధ్య కాలిక ప్రణాళికలను తప్పనిసరిగా కొనసాగించాల్సి ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జాంగ్ తావో సూచించారు. ప్రభుత్వ–ఆదాయ వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసమే ద్రవ్యలోటు. దీనిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 3.5 శాతానికి (రూ. 5.33 లక్షల కోట్లు)కట్టడి చేయాలని, వచ్చే ఏడాది 3 శాతానికి తగ్గించాలన్న లక్ష్యాన్ని రానున్న ఫిబ్రవరి 1 బడ్జెట్ పక్కనబెట్టే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఐఎంఎఫ్ అధికారి తాజా ప్రకటన చేయడం గమనార్హం. హాంకాంగ్‌లో జరిగిన ఆసియా ఫైనాన్షియల్ ఫోరమ్ సమావేశంలో ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు... ⇔ భారత్‌తోపాటు జపాన్, మలేషియాలు కూడా ద్రవ్యలోటు లక్ష్యాలను సాధించాల్సిన అవసరం ఉంది. ⇔ ప్రపంచ వృద్ధిలో ఆసియా దేశాలు కీలకపాత్ర పోషిస్తాయి. 2017, 2018 సంవత్సరాలో ఈ ప్రాంతంలోని ఆర్థిక వ్యవస్థల వృద్ధి 5 శాతంగా ఉంటుంది. ⇔ 2016లో ఆసియా ఫైనాన్షియల్ మార్కెట్లు సానుకూలంగానే ఉన్నాయి. సవాళ్లను తట్టుకుని నిలబడ్డాయి. ఇదే తీరు కొనసాగుతుందని భావిస్తున్నాం. ⇔ నోట్ల రద్దు వినియోగంపై తాత్కాలిక ప్రభావం చూపుతుందన్న అంచనాలతో ఐఎంఎఫ్ 2016–17 జీడీపీ వృద్ధి రేటును 7.6 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించడం జరిగింది. -
బ్యాంకులది ఒడిదుడుకుల బాటే!
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నివేదిక వాషింగ్టన్: భారత్ బ్యాంకులది ఒడిదుడుకుల బాటేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. లాభాలు తగ్గడం, మొండిబకాయిల బరువు దీనికి కారణంగా వివరించింది. ‘గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ’ పేరుతో ఐఎంఎఫ్ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. మొండిబకాయిల గురించి ప్రత్యేక, అదనపు, సకాల చర్యలు అవసరమని సూచించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌యూ) రుణాల్లో స్థూల మొండిబకాయిలు 2014-15లో 5.32% (రూ.2.67 లక్షల కోట్ల) ఉంటే ఈ పరిమాణం 2015-16లో 9.32%కి (రూ.4.76 లక్షల కోట్లు) పెరగడం ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. గత 12 నెలల్లో 39 లిస్టెడ్ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 96% పెరిగాయి. 2016 జూన్ నాటికి రూ.6.3 లక్షల కోట్ల స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ భారత్ బ్యాం కింగ్‌కు సంబంధించి సంస్థ విడుదల చేసిన నివేదికలో ముఖ్యాంశాలు... ⇔ ఎన్పీఏలతో ఇందుకు సంబంధించి అదనపు ప్రొవిజనింగ్ (కేటాయింపులు) బ్యాంకింగ్‌కు భారంగా మారతాయి. దీనితో వ్యవస్థకు మరింత అధిక మొత్తంలో మూలధనం అవసరం అవుతుంది. ⇔ సమస్య పరిష్కార దిశలో కార్పొరేట్ దివాలా చట్టాల సంస్కరణల పటిష్ట అమలు అవసరం. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్, ఈక్విటీకి రుణ మార్పిడి, సమగ్ర, పారదర్శక నియమ నిబంధనల అమలు ముఖ్యం. ⇔ కార్పొరేట్ రుణ ఒత్తిడులను ఎదుర్కొనే ఒక ప్రత్యేక యంత్రాంగమూ మొండిబకాయిల సమస్య పరిష్కారంలో కీలకం. ⇔ భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు వర్ధమాన దేశాల్లోనూ మొండిబకాయిల సమస్య ఉంది. ఆయా దేశాల్లో బ్యాంకింగ్ పర్యవేక్షణ పటిష్టత అవసరం. అలాగే ప్రపంచవ్యాప్తంగా సమస్య తీవ్రమవకుండా నిరోధించే క్రమంలో వ్యవస్థలు, సెంట్రల్ బ్యాంకుల మధ్య సమన్వయ అవసరం ఎంతో ఉంది. ⇔ స్థిరమైన రాజకీయ వాతావారణ పరిస్థితి భారత్‌కు లాభిస్తున్న అంశాల్లో కీలకమైనది. ⇔ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి సమస్య పరిష్కారంలో కీలకం. -
భారత్‌లో పడిపోతున్న మహిళా కార్మిక శక్తి
న్యూఢిల్లీ: ఆకాశంలో సగం మాదే అని సగర్వంగా చెప్పుకుంటున్న భారత మహిళలు ఉన్నత విద్యలో ఇంతకుముందు కన్నా ఎంతో ముందుకు దూసుకుపోతున్న కార్మిక శక్తిలో మాత్రం ఇంతకుముందు కన్నా వెనకబడి పోతున్నారు. ఉన్నత విద్యలో మహిళలు 2007లో 39 శాతం ఉండగా, అది 2014 నాటికి 46 శాతానికి పెరిగింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 1999లో భారత్‌లో మహిళల కార్మిక శక్తి 34 శాతం ఉండగా, 2014 నాటికి అది 27 శాతానికి పడిపోయింది. మహిళా కార్మికుల్లో ప్రపంచ సగటు 50 శాతం ఉండగా, భారత్‌లో మాత్రం 27 శాతానికి పడిపోవడం విచారకర పరిణామం. తూర్పు ఆసియా దేశాల్లో ఈ సగటు 63 శాతం ఉండడం గమనార్హం. ఉన్నత విద్యలో మహిళల శాతం ఏటేటా పెరుగుతున్నప్పటికీ కార్మిక శక్తిలో మాత్రం ఎందుకు వెనకబడి పోతున్నారు. మహిళలకు ఉద్యోగావకాశాలు లేకనా? వర్క్ ప్లేస్‌లో సరైన వసతులు లేకనా? పలు రంగాల్లో మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పటికీ, ఆటోమొబైల్, రవాణా వ్యవస్థలతోపాటు, రక్షణ రంగంలో కూడా మహిళలకు అవకాశాలు పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో ఎందుకు మహిళలు కార్మిక శక్తిలో వెనకబడుతున్నారన్నది ప్రధాన ప్రశ్న. మహిళలు పెళ్లి చేసుకొని ఇంటిపట్టునే ఉండాలనే సామాజిక ధోరణి ఇప్పటికీ కొనసాగడమే అందుకు కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉద్యోగం పురుష లక్షణం నానుడి కనుమరగయ్యేంత వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చని వారంటున్నారు. పదవ తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు విద్యా సంస్థల్లోకి యువతుల ప్రవేశం యువకులకన్నా ఎక్కువగా ఉంటునప్పటికీ ఉన్నత విద్యలో, ముఖ్యంగా ఎంఫిల్, పీహెచ్డీలలో మగవాళ్లతో పోలిస్తే వారు ఇంకా వెనకబడే ఉన్నారు. దానికి కారణం కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని వర్గాల ప్రజల్లో యుక్త వయస్సులోనే ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయడం కారణమని తెలుస్తోంది. అయినప్పటికీ దేశంలో సగటు మహిళలను తీసుకుంటే ఉన్నత విద్యలో వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఉన్నత విద్యలో 2012-13 సంవత్సరంలో మహిళలు 20.8 శాతం ఉండగా, మహిళల సంఖ్య 2014-15 సంవత్సరం నాటికి 23.6 శాతానికి పెరిగింది. అయితే ఇది గ్లోబల్ సగటు 27 శాతం కన్నా తక్కువే. ఈ సగటు చైనాలో 26 శాతం ఉండగా, బ్రెజిల్లో 36 శాతం ఉంది. దేశంలో యువకులు సరాసరి సగటున 23.5 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకుంటోండగా, యువతులు సరాసరి సగటున 19.2 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకుంటున్నారు. గతంతో పోలిస్తే మహిళల్లో కూడా పెళ్లి చేసుకునే వయస్సు పెరిగినప్పటికీ వారి కార్మిక శక్తి మాత్రం తగ్గుతోంది. భారత ఆర్థిక వృద్ధి రేటు పెరిగినప్పుడల్లా మహిళా కార్మిక శక్తి పడిపోతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా వేసింది. మహిళల్లో విద్యా స్థాయి పెరగడంతోపాటు మహిళాకార్మిక శక్తికి విలువ పెరిగినప్పుడే భారత్‌లో మహిళా కార్మిక శక్తి పెరుగుతోందని సూత్రీకరించింది. -
గ్రీస్ అత్యవసర రుణానికి ఈయూ ఓకే
బ్రసెల్స్ : సంక్షోభంలో ఉన్న గ్రీస్‌కు అత్యవసరంగా 7.8 బిలియన్ డాలర్ల స్వల్పకాలిక వ్యవధి రుణం ఇవ్వడానికి యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆమోదముద్ర వేసింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ), అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)కు కట్టాల్సిన బాకీలను చెల్లించడానికి గ్రీస్‌కు ఈ నిధులు అత్యవసరం. సోమవారం నాటికల్లా ఈసీబీకి 4.2 బిలియన్ డాలర్లు, మిగతాది ఐఎంఎఫ్‌కు గ్రీస్ కట్టాల్సి ఉంది. యూరోపియన్ స్థిరత్వ యంత్రాంగం (ఈఎస్ఎం) నుంచి తదుపరి ఆర్థిక సహాయం అందే దాకా గ్రీస్‌ను ఈ నిధులు గట్టెక్కించనున్నాయి. -
గ్రీస్ సంక్షోభం
ప్రపంచం మొత్తం... ముఖ్యంగా యూరో దేశాలు భయపడిందే నిజమైంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్)కు మంగళవారానికల్లా చెల్లించాల్సిన 170 కోట్ల డాలర్ల వాయిదా మొత్తాన్ని తీర్చలేమని గ్రీస్ చేతులెత్తేసింది. సామ, దాన, భేద ప్రయోగాలన్నీ పూర్తయి ఇక దండోపాయమే తరవాయని హెచ్చరిస్తూ వచ్చిన యూరో జోన్ దేశాలకు ఈ పరిణామంతో ఊపిరి ఆగిపోయి ఉండాలి. వామపక్ష సిరిజా పార్టీ ఆధ్వర్యంలోని గ్రీస్ ప్రభుత్వాన్ని గత కొన్ని నెలలుగా యూరో దేశాలన్నీ బతిమాలి, బుజ్జగించి దారికి తెచ్చుకుందామని చూశాయి. ఆఖరి నిమిషంలో యూరొపియన్ కమిషన్ చీఫ్ జీన్ క్లాడ్ జంకర్ రంగంలోకి దిగి బెయిలవుట్ ప్యాకేజీకి అంగీకరించమని అడిగారు. సరికొత్త షరతులకు ‘సరే’నని లిఖితపూర్వకంగా చెబితే యూరప్ దేశాల ఆర్థిక మంత్రుల అత్యవసర భేటీని ఏర్పాటుచేసి అప్పు తీర్చడానికి వారితో కొత్త అప్పు ఇప్పిస్తానని గ్రీస్ ప్రధాని సిప్రాస్‌కు హామీ ఇచ్చారు. అయితే ఈ ప్యాకేజీ ప్రతిపాదనలపైనా, దాంతోపాటు వచ్చే కొత్త షరతులపైనా జనం ముందుకెళ్లి వారి మనోగతాన్ని తెలుసుకుని అడుగుముందుకేయాలని...అందుకోసం వచ్చే ఆదివారం రిఫరెండం నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్లే రుణ వాయిదా చెల్లింపు విషయంలో మరో అయిదు రోజులు ఆగమని సిప్రాస్ జంకర్‌ను కోరారు. అందుకు ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఐఎంఎఫ్ రుణ వాయిదాను తాము చెల్లించడంలేదని గ్రీస్ ఆర్థికమంత్రి ప్రకటించారు. ఊరంతా అప్పులు చేసినవాడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యతా, అతని బాగోగులను పట్టించుకోవాల్సిన అవసరం రుణదాతలకే ఉంటుంది. ఎందుకంటే, అతనికేమైనా అయితే దెబ్బతినేది రుణదాతలే. పచ్చగా బతికిన దేశాన్ని వినియోగ వస్తు వ్యామోహంలో ముంచెత్తి నిజానికి అప్పులపాలు చేసింది ‘యూరోత్రయం’గా అందరూ పిలిచే యూరోపియన్ కమిషన్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు, ఐఎంఎఫ్‌లే! దివాలా స్థితికి చేరుకున్నాక అప్పులు తీర్చడానికి బెయిలవుట్ ప్యాకేజీల పేరిట కొత్త అప్పులివ్వడం, అందుకోసం పొదుపు చర్యలు అమలు చేయాలని ఒత్తిళ్లు తీసుకురావడం, అందుకనుగుణంగా గ్రీస్ ప్రభుత్వాలు వ్యవహరించడం గత ఏడేళ్లుగా సాగుతూనే ఉంది. ప్రభుత్వ వ్యయంలో కోత విధించడం, పన్నులు పెంచడం ఇందులో ముఖ్యమైనవి. ఈ చర్యల పర్యవసానంగా లక్షలాదిమంది ఉద్యోగులకు జీతాలు కోతబడ్డాయి. చాలా మందికి పింఛన్లు ఆగిపోయాయి. పబ్లిక్ రంగంలో లక్షన్నరమంది ఉద్యోగాలు పోగా... గత అయిదేళ్లలో సుమారు 4 లక్షల వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. ప్రజల ఆదాయంలో 40 శాతం మేర కోతపడింది. నిరుడు ఏప్రిల్‌నాటికి జనాభాలో 26 శాతం నిరుద్యోగిత ఉంటే...యువతలో ఇది 50 శాతం! జనం అర్ధాకలితో రోజులు వెళ్లదీసే పరిస్థితులు వచ్చాయి. లక్షలమంది తిండి తినడం మానేసి కేవలం సూప్‌లతో ఆకలి తీర్చుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులకు తట్టుకోలేక ఈ అయిదేళ్లలో వేలాదిమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తిండికే ఇబ్బందులు పడుతున్నచోట ఎంతగా పన్నులు పెంచినా ప్రభుత్వానికి వచ్చే రాబడి ఏముంటుంది? ఇలాంటి చర్యలతో విసిగి వేసారిన గ్రీస్ జనం పాలక పార్టీలకు గుణపాఠం చెప్పారు. మొన్న జనవరిలో జరిగిన ఎన్నికల్లో వామపక్ష సిరిజా పార్టీ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు అమలవుతున్న పొదుపు చర్యలే జనాన్ని బెంబేలెత్తిస్తుంటే తాజాగా మరిన్ని కోతలు విధించాలని సిప్రాస్ ప్రభుత్వంపై యూరో జోన్ దేశాలు ఒత్తిళ్లు తెస్తున్నాయి. దారిద్య్రరేఖకు దిగువనున్నవారికిచ్చే పింఛన్లలో కోత, ఆహార పదార్థాలపై అదనంగా మరో 23 శాతం వ్యాట్ విధింపు వంటివి వాటిలో కొన్ని. ఈ చర్యలతోపాటు వచ్చే ఏడాదికల్లా గ్రీస్ బడ్జెట్లో ప్రభుత్వ వ్యయం కంటే పన్ను రాబడి 1 శాతం ఎక్కువగా ఉండాలని...ఇది క్రమేపీ 3.5 శాతానికి చేరాలని షరతు. ఇలాంటి షరతుల్ని విధించడమంటే గ్రీస్ పౌరుల జీవితాలతో క్రూర పరిహాసమాడటమే. ఎందుకంటే యూరో జోన్ దేశాలతో పోలిస్తే గ్రీస్‌లో పింఛన్ల కోత ఇప్పటికే అత్యంత దారుణంగా ఉంది. వాస్తవానికి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టు సిప్రాస్ ప్రభుత్వం పొదుపు చర్యలకు స్వస్తి చెప్పలేదు. పాత బెయిలవుట్ ప్యాకేజీల కోసం అప్పటి ప్రభుత్వాలు అంగీకరించిన కోతలు యథాతథంగా అమలు చేస్తామని...అదనపు కోతలకు తాము సిద్ధంగా లేమని ప్రకటించింది. అధికారంలో కొచ్చి ఆర్నెల్లయ్యాక తొలిసారి దానికి ఈ ‘కోతల’ పరీక్ష మొదలైంది. ఒక దశలో యూరో పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి తాజా పొదుపు చర్యలకు సిప్రాస్ సిద్ధపడినా పార్లమెం టులో సొంత పార్టీ ఎంపీలనుంచే ఆయనకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఓటింగ్ జరి గితే ఓటమి ఖాయమని తేలాకే ఆయన రిఫరెండం ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. గ్రీస్‌లో ఇప్పుడు బ్యాంకుల మూత, ఏటీఎంలలో డ్రా చేసే నగదుపై పరిమితులు వగైరా చర్యలు బెంబేలెత్తిస్తున్నాయి. యూరొపియన్ యూనియన్ (ఈయూ) నుంచి గ్రీస్ వైదొలగే పరిస్థితులువస్తే అది ఆ దేశానికి మాత్రమే కాదు... ఈయూకి కూడా పెనుముప్పే. దాని విచ్ఛిన్నానికి ఇక రోజులు దగ్గరపడినట్టే. ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతాయని, అది 1930 నాటి పరిస్థితులకంటే తీవ్రంగా ఉండొచ్చునని జోస్యాలు వెలువడుతున్నాయి. కనుక పరిణతితో ఆలోచించాల్సిందీ...బుద్ధెరిగి ప్రవర్తించాల్సిందీ యూరో జోన్ దేశాలే. ఇప్పుడు గ్రీస్‌ను చూసీచూడనట్టు వదిలేస్తే స్పెయిన్...ఆ తర్వాత ఐర్లాండ్, ఇటలీవంటివి సైతం అదే బాటలో వెళ్తాయన్నది జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల భయం. అందుకే అవి గ్రీస్‌ను ఎలాగైనా బెదిరించి దారికి తెచ్చుకోవాలని చూస్తున్నాయి. కానీ అంతులేని కోతలతో ఏ ఆర్థిక వ్యవస్థా గట్టెక్కలేదు. వర్తమాన గ్రీస్ సంక్షోభంలో తమ బాధ్యత కూడా ఉన్నదని అంగీకరించి, అందుకు పరిహారంగా రుణమాఫీకి సిద్ధపడటంతోపాటు ఆ దేశ పునర్నిర్మాణంలో భాగస్తులు కావాలి. గ్రీస్ మనుగడతోనే తమ భవితవ్యం కూడా ముడిపడి ఉన్నదని తెలుసుకోవాలి. -
బ్యాంకులకు రేట్ల కోత సాధ్యంకాదు
ముంబై: ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అధిక ద్రవ్యోల్బణమే అతిపెద్ద అడ్డంకిగా నిలుస్తోందని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఉద్ఘాటించారు. కరెన్సీ రేటు తీవ్ర హెచ్చుతగ్గులు, పొదుపు దెబ్బతినడానికి.. వడ్డీరేట్లను తగ్గించకపోవడానికి అధిక ధరలే కారణమని పేర్కొన్నారు. తాజా పాలసీ సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించడాన్ని సమర్థించుకున్నారు. సమీక్ష అనంతరం ఒక మీడియా ఇంటర్వ్యూలో రాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వడ్డీరేట్లను ఎలాబడితేఅలా తగ్గించేందుకు నా చేతిలో మంత్రదండం ఉందని ప్రజలు అనుకుంటారు. వీటిని నేనొక్కడినే నిర్ణయిస్తాననేది కూడా వారి అభిప్రాయం. వడ్డీరేట్లను కేవలం దేశ ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులే నిర్ధారిస్తాయి. ఒకవేళ నేను పాలసీ రేట్లను భారీగా తగ్గించినా.. బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను తగ్గించేందుకు సిద్ధంగా లేవు. అధిక ద్రవ్యోల్బణమే దీనికి కారణం. అందువల్ల ముందుగా ధరలకు కళ్లెం వేయాలి. ఈ విషయంలో మేం(ఆర్బీఐ) కొంత విజయం సాధించాం. అయితే, ధరల కట్టడిపై పోరు ఇంకా పూర్తికాలేదు’ అని రాజన్ వ్యాఖ్యానించారు. ఎస్ఎల్ఆర్, సీఆర్ఆర్ నిబంధలను సడలిస్తాం బ్యాంకింగ్ వ్యవస్థ పనితీరు మరింత పెంచడంతోపాటు.. ప్రాధాన్య రంగాలకు రుణాల(పీఎస్ఎల్)ల కల్పన ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయడానికి ఆర్బీఐ ప్రాధాన్యమిస్తోందని రాజన్ చెప్పారు. తాజా సమీక్షలో పాలసీ వడ్డీరేట్లను తగ్గించకపోయినప్పటికీ.. చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్-బ్యాంకుల ప్రభుత్వ బాండ్లలో తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సిన నిధుల పరిమాణం)ని అర శాతం తగ్గించడానికి ఇదే కారణమన్నారు. ఎస్ఎల్ఆర్, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్-బ్యాంకుల తమ డిపాజిట్ నిధుల్లో తప్పకుండా ఆర్బీఐ వద్ద ఉండచాల్సిన నిధుల పరిమాణం) తగ్గింపు వంటి చర్యలను దీర్ఘకాలంపాటు కొనసాగించనున్నామని కూడా రాజన్ తెలిపారు. సమీక్ష అనంతరం సాంప్రదాయంగా విశ్లేషకులతో జరిపిన సంభాషణల్లో ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు. తాజా కోతతో ఎస్ఎల్ఆర్ 22.5% నుంచి 22%కి దిగొచ్చిన సంగతి తెలిసిందే. దీనివల్ల బ్యాంకులకు అదనంగా రూ.40 వేల కోట్లు అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకులతో పాటు ఇతరత్రా వర్గాలు కూడా ఎస్ఎల్ఆర్, సీఆర్ఆర్ వంటి తప్పనిసరి నిబంధనల విషయంలో వెసులుబాటునివ్వాలని ఎప్పటినుంచో అడుగుతున్నారని... ఈ దిశగా తగిన చర్యలు తీసుకుంటామని రాజన్ చెప్పారు. ద్రవ్యోల్బణం దిగొస్తేనే..: తమ అంచనాల కంటే వేగంగా ద్రవ్యోల్బణం దిగొస్తే.. వృద్ధికి చేయూతనిచ్చేందుకు వడ్డీరేట్లను కచ్చితంగా తగ్గిస్తామని రాజన్ పేర్కొన్నారు. అయితే, వేగంగా ధరలు గనుక ఎగబాకితే, వడ్డీరేట్లను పెంచేందుకు కూడా వెనుకాడబోమని తేల్చిచెప్పారు. రిటైల్ ద్రవ్యోల్బణం 2015 జనవరికల్లా 8 శాతం, 2016 జనవరి నాటికి 6 శాతానికి పరిమితం కావాలని ఆర్బీఐ లక్ష్యంగా నిర్ధేశించింది. ప్రపంచ మార్కెట్లు మరోసారి క్రాష్ కావచ్చు.. ప్రపంచ మార్కెట్లు మరోసారి క్రాష్ అయ్యే ప్రమాదం ఉందని రాజన్ హెచ్చరించారు. ధనిక దేశాల సరళ ద్రవ్య విధానాల కారణంగా ఏర్పడిన రిస్కీ ఆస్తులను అధిక ధరలకు ఇన్వెస్టర్లు కొంటూపోయి, ఆతర్వాత ఒక్కసారిగా అమ్మడం మొదలుపెడితే మార్కెట్లు పతనమయ్యే అవకాశాలుంటాయన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితిని మహా మాంద్యం సంభవించిన 1930వ దశకంనాటితో పోల్చారు. అప్పటికంటే సరళ ద్రవ్య విధానాలను ఇప్పుడు కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్నాయని, ఈ విధానాల వ్యయాన్ని భరించేస్థితి ప్రస్తుత ప్రపంచానికి లేనందున, మరో పతన ప్రమాదం ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. -
ఉదారవాద విధానాలతో తీవ్ర నష్టం
* ఆర్థికవేత్త ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ * హన్మకొండలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు వరంగల్: దేశంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి, బహుళజాతి సంస్థలు, కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం మితిమీరి...ఆకలి, పేదరికం, దారిద్య్రం పెరుగుతున్నాయని ప్రముఖ ఆర్థిక వేత్త, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సరళీకరణ విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకొని రైతులు, కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హన్మకొండలో గురువారం ప్రారంభమైన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ 8వ మహాసభలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ప్రజా ఉద్యమాల ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ పథకాన్ని ఎన్డీయే ప్రభుత్వం నీరుగార్చేందుకు చేస్తున్న కుట్రలను నిలదీయాలన్నారు. కా గా, హన్మకొండలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మహాసభల ప్రారం భం సందర్భంగా సంఘం జెండాను జాతీయశాఖ అధ్యక్షుడు పాటూరు రామయ్య ఆవిష్కరించారు. మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్ జి.నాగయ్య స్వాగత ఉపన్యాసం, ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సభల్లో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు తదితరులు పాల్గొన్నారు. 29 రాష్ట్రాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరయ్యూరు. మరో రెండు రోజుల పాటు సభలు జరుగుతాయి. -
బ్రిక్స్ ముందడుగు!
బుడి బుడి నడకలతో మొదలైన బ్రిక్స్ దేశాల ఆచరణ ఇప్పుడు కాస్త వేగం పుంజుకుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్), ప్రపం చబ్యాంకువంటి అంతర్జాతీయ ఆర్ధిక వేదికల్లో పెత్తందారీతనం పెరిగి, అవి పరమ అప్రజాస్వామికంగా తయారైన ప్రస్తుత దశలో ఇలాంటి ప్రాంతీయ కూటముల అవసరం అంతా ఇంతా కాదు. డాలర్‌ను మాత్రమే రిజర్వ్ కరెన్సీగా భావించే ఆ సంస్థల తీరువల్లా, అంతర్జా తీయ మార్కెట్లను నియంత్రించలేని వాటి నిస్సహాయతవల్ల సంక్షో భాలు బయలుదేరడం... అవి దేశదేశాలనూ చుట్టుముట్టడం వర్తమాన ప్రపంచ వాస్తవం. మొదట్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలతో మాత్రమే ఏర్పడిన కూటమి దక్షిణాఫ్రికా చేరాక బ్రిక్స్‌గా రూపుదిద్దు కుంది. తొలి శిఖరాగ్ర సదస్సునాటికే వచ్చిపడిన ఆర్ధికమాంద్యంలో ఈ కూటమి దేశాలు వ్యవహరించిన తీరు ఆ మాంద్యం తీవ్రతను చాలా తగ్గించిందనే చెప్పాలి. ఇందుకు అప్పటికే జీ-20వంటి వేదికల్లో ఈ కూటమి దేశాలు పనిచేయడం చాలా అక్కరకొచ్చింది. ఆరేళ్ల సుదీర్ఘ అనుభవం తర్వాత ఇప్పుడు బ్రెజిల్‌లోని ఫోర్ట లేజాలో రెండురోజులపాటు జరిగిన శిఖరాగ్ర సదస్సు బ్రిక్స్ బ్యాంకును, అత్యవసర రిజర్వు నిధిని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రక టించింది. ఆకాంక్షలనుంచి ఆచరణ వరకూ జరిపిన ఈ ఆరేళ్ల ప్రయా ణంలోనూ బ్రిక్స్ దేశాలకు ఎన్నో అనుభవాలయ్యాయి. ప్రాంతీయ దేశాలు ఒక కూటమిగా ఏర్పడి అగ్రరాజ్యాలనుంచి, సంస్థలనుంచి స్వీయ రక్షణ చర్యలు తీసుకోవడం, తమ ప్రయోజనాలకు భంగం వాటిల్లే పరిస్థితులు ఏర్పడితే సమైక్యంగా ప్రతిఘటించడం ఒక మంచి పరిణామం. బ్రిక్స్ ఏర్పడిననాడు దాన్ని అగ్ర రాజ్యాలు పట్టించుకున్న పాపాన పోలేదు. అప్పటికే ఉన్న అనేక కూటములకు మరొకటి వచ్చిచేరిందన్న భావనకూడా వాటికి ఉంది. దానికితోడు బ్రిక్స్ దేశాలమధ్య పొడసూపిన విభేదాలు కూడా తక్కువేమీ కాదు. బ్రిక్స్ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉండాలనే అంశం దగ్గరనుంచి బ్యాంకు తొలి చైర్మన్ ఎవరు కావాలన్న అంశం వరకూ ఎన్నిటినో తేల్చుకోవాల్సి వచ్చింది. బ్యాంకు ప్రధాన కార్యాలయం గురించీ, చైర్మన్‌గిరీ గురించి మన దేశమూ, చైనా పోటీపడ్డాయి. చివరకు ప్రధాన కార్యాలయం చైనా వాణిజ్య రాజధాని షాంఘైకు పోగా, ఆరేళ్లపాటుండే చైర్మన్ పదవి మన దేశానికి దక్కింది. బ్యాంకు గురించి 2012లో తొలిసారి అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ప్రతిపాదించారు. ఆ తర్వాత సభ్య దేశాలమధ్య ఎడతెగని సంప్రదింపులు జరుగుతున్నా అవి ఒక కొలిక్కిరాలేదు. ఈసారైనా బ్యాంకు ఏర్పాటు కల సాకారమ వుతుందానన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. వంద కోట్ల డాలర్ల రిజర్వు నిధితో మరో రెండేళ్లలో ప్రారంభమయ్యే ఈ బ్యాంకు సభ్య దేశాల్లో మౌలిక సదుపాయాల పెంపునకు అవసరమైన రుణాలను సమకూరుస్తుంది. రుణాలివ్వడం సభ్యదేశాలకే పరిమితం చేయాలా లేక ఇతర వర్ధమాన దేశాలకు కూడా అందించాలా అన్న అంశాన్ని ఇంకా నిర్ధారించవలసి ఉన్నది. బ్రిక్స్ బలంగా ఉంటే, దానిద్వారా ప్రాంతీయ సహకారం పెరిగితే వనరుల సమీకరణ విస్తృతమవుతుంది. మౌలిక సదుపాయాలు పెంపొందించుకునే వీలుంటుంది. మౌలిక సదుపాయాల కోసం ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు సంస్థలను సంప్రదించినప్పుడు అవి సవాలక్ష షరతులు విధిస్తున్నాయి. బ్రిక్స్ బ్యాంకు వర్ధమాన దేశాలకు అవసరమైన స్థాయిలో రుణాలివ్వలేకపోవచ్చుగానీ వాటి అవసరాల్లో కొంత భాగాన్నయినా భరిస్తుంది. ఆ రకంగా చిన్న దేశాలకు ఎంతో మేలు కలిగే అవకాశం ఉన్నది. ఇక ఐఎంఎఫ్‌ను పునర్వ్యవస్థీకరించా లని చాన్నాళ్లుగా డిమాండు ఉన్నా దాన్ని పట్టించుకునే నాథుడు లేడు. అగ్రదేశాలకున్న ‘అతి సభ్యత్వాన్ని’ తగ్గించి, వర్ధమాన దేశాలకు వాటి వాటాకు అనుగుణంగా సభ్యత్వమివ్వాలని ఎప్పటినుంచో కోరుతు న్నారు. సరైన ప్రాతినిధ్యంలేని దేశాలన్నిటికీ కలిపి 48 శాతం కోటా ఇవ్వాలన్న అంశంలో చివరకు ఒప్పందం కుదిరినా అమెరికా కాంగ్రెస్ అయిదేళ్లుగా దాన్ని ఎటూ తేల్చకుండా వదిలేసింది. గత ఏడాది జన వరిలో కోటా పెంపు సమస్య ఎజెండాలోకొచ్చినప్పుడు ఐఎంఎఫ్ దాన్ని నిరవధికంగా వాయిదా వేసింది. ఇతర సంస్కరణల ప్రతిపాద నలు ఇంతవరకూ చర్చకే రాలేదు. ఈ పరిస్థితుల్లో బ్రిక్స్ బ్యాంకు ఎంతో కొంతమేర ఒత్తిడి తెచ్చేందుకు ఉపయోగపడుతుంది. అయితే, బ్రిక్స్ తాజా చర్యల పర్యవసానంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో పెను మార్పులు సంభవిస్తాయని, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు పెత్తనం తగ్గు తుందన్న భ్రమలు ఎవరికీ లేవు. అయితే, స్వల్పస్థాయిలోనైనా బ్రిక్స్ బ్యాంకువంటివి ప్రభావం చూపగలవు. వర్ధమాన దేశాలు ఇకనుంచి తమ స్వరాన్ని పెంచగలవు. బేరమాడేందుకు సాహసించగలవు. బ్రిక్స్ వేదికనుంచి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రా యెల్, సిరియా, ఇరాక్ ఘర్షణలవంటి ప్రపంచ సంక్షోభాలలో సమష్టి స్వరం వినిపిద్దామని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంతో పోరాడుతున్న అఫ్ఘానిస్థాన్‌కు సాయపడదామని కోరారు. ఇది శుభసూచకం. ఏక ధ్రువ ప్రపంచాన్ని కలగంటూ ప్రతి అడుగునూ ఆ దిశగానే వేస్తూ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెడుతున్న అమెరికాపై ఏదో ఒక మేర ఒత్తిడి తెచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. శిఖరాగ్ర సదస్సు సంద ర్భంగా సభ్యదేశాల అధినేతలతో మోడీ చర్చలు జరిపారు. ముఖ్యంగా చైనాతో సరిహద్దు సమస్య విషయమై మాట్లాడారు. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను తేల్చుకుందామని జి జిన్‌పింగ్ ముందుకు రావడం కూడా ఆశావహమైన పరిణామం. మొత్తానికి బ్రిక్స్ సదస్సు ఒక మంచి వాతావరణంలో ముగిసింది. ఒక కొత్త దశను వాగ్దానం చేసింది. -
ద్రవ్యోల్బణంపైనే సెంట్రల్ బ్యాంకుల దృష్టి సరికాదు: మాంటెక్
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం కట్టడే ప్రధాన లక్ష్యంగా సెంట్రల్ బ్యాంకులు పనిచేయడం సరికాదని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా సోమవారం పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సెంట్రల్ బ్యాంకులు పలు అంశాలు లక్ష్యంగా పనిచేయాల్సి ఉంటుందన్నది తన అభిప్రాయమని అన్నారు. రఘురామ్ రాజన్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత, ద్రవ్యోల్బణమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ రెండుసార్లు రెపో రేటు పెంచిన నేపథ్యంలో మాంటెక్ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. పారిశ్రామిక ఉత్పత్తి క్షీణదశలో నడుస్తున్న నేపథ్యంలో- జనవరి 28వ తేదీన ఆర్బీఐ తన మూడవ త్రైమాసిక పరపతి విధాన సమీక్షను నిర్వహించనుంది. ఆర్థిక రంగంలో సంస్కరణల ప్రక్రియ కొనసాగాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. రూపాయి ప్రస్తుతం (సోమవారం 61.52 వద్ద స్థిరపడింది) తన వాస్తవ విలువ దగ్గరగా ఉందని మాంటెక్ తెలిపారు. -
మా బిల్లులను చెల్లిస్తాం: బరాక్ ఒబామా
వాషింగ్టన్: అమెరికా తన బిల్లులను చెల్లిస్తుందని అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రపంచ దేశాలకు భరోసా ఇచ్చారు. రుణ పరిమితిని పెంచితే, ఆర్థిక మార్కెట్లు కుదేలవుతాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) హెచ్చరించినా, ఒబామా ఈ మేరకు భరోసా ఇవ్వడం గమనార్హం. అమెరికా ఇప్పటి వరకు తన బిల్లులను చెల్లిస్తూ వచ్చిందని, ఇకపై కూడా చెల్లిస్తుందని ఒబామా చెప్పారు. ప్రతి దేశంలోనూ, ముఖ్యంగా ప్రతి ప్రజాస్వామిక దేశంలోనూ బడ్జెట్‌కు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయని అన్నారు. ప్రపంచ నేతల్లో పలువురు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అమెరికన్ కాంగ్రెస్‌లోని ఒక పార్టీ తమ పంతం నెగ్గకుంటే పరిస్థితిని తలకిందులు చేస్తుందనే అపోహలో పలువురు ప్రపంచ నేతలు ఉన్నారని, ముఖ్యంగా 2011 నాటి పరిణామాల దృష్ట్యా వారు కలత చెందుతున్నారని అన్నారు. అయితే, దివాలా తీసే పరిస్థితి వాటిల్లుతుందని ఎవరూ తమను బెదిరించలేరని వ్యాఖ్యానించారు. బడ్జెట్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రిపబ్లికన్ పార్టీ సభ్యులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే, వారు బెదిరింపులకు దిగితే చర్చలు జరిపే ప్రసక్తే లేదని చెప్పారు. ఇదే విషయాన్ని ప్రతినిధుల సభ స్పీకర్ బోహ్నెర్కు ఫోన్ ద్వారా తెలిపారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు స్వల్పకాలానికి రుణ పరిమితిని పెంచేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు ఒబామా చెప్పారు. వారం రోజులుగా కొనసాగుతున్న షట్డౌన్కు ముగింపు పలకాల్సిందిగా రిపబ్లికన్లకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, ఉగ్రవాదం మరికొంతకాలం కొనసాగగలదని ఒబామా అభిప్రాయపడ్డారు. అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌లలోని కీలక ఉగ్రవాద నేతలు హతమైనప్పటికీ, ఉగ్రవాదం బెడద మరికొంత కాలం కొనసాగవచ్చని అన్నారు. లిబియాలో అమెరికన్ బలగాలపై జరిగిన దాడికి కుట్ర పన్నిన అల్‌కాయిదా నాయకుడు అబు అనస్ అల్ లిబీని చట్టం ముందుకు తెస్తామని అన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు సైనిక వ్యూహాలే కాకుండా, దీర్ఘకాలిక వ్యూహాలు అవసరమని చెప్పారు. -
క్షీణించిన రూపాయి, స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
భారత ఆర్ధిక వృద్ధి రేటు అంచనాలపై ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సందేహాలు వ్యక్తం చేయడంతో ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో డాలర్ తో పోల్చితే రూపాయి బలహీన పడింది. మానుఫాక్చరింగ్, సర్వీస్ సెక్టార్ రంగంలో పురోగతి మందగించడంతో 2013 సంవత్సరంలో వృద్ధి రేటును 5.7 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. నిన్నటి ముగింపుకు రూపాయి 51 పైసలు కోల్పోయి 62.30 వద్ద ట్రేడ్ అవుతోంది. మంగళవారం రూపాయి 61.79 వద్ద ముగిసింది. డాలర్, యూరో బలపడటం, రూపాయిపై ఒత్తిడి పెరిగడంతో భారత ఈక్విటీ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్ ఆరంభంలో సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయి 19826 కనిష్టస్థాయిని నమోదు చేసుకుంది. ఆతర్వాత నష్టాలనుంచి కోలుకుని ప్రస్తుతం 40 పాయింట్ల నష్టంతో 19942 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. జయప్రకాశ్ అసోసియేట్స్, సన్ ఫార్మా, లుపిన్, హెచ్ సీఎల్ టెక్, టాటా మోటార్స్ కంపెనీలు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. ఐసీఐసీఐ, భారతీ ఎయిర్ టెల్, ఎస్ బీఐ, ఎం అండ్ ఎం, ఎన్ టీ పీసీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.