ముంబై: రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన స్వల్ప, దీర్ఘ కాల చర్యలను ఆర్‌బీఐ నియమించిన ప్యానెల్ సిఫారసు చేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) స్పెషల్ డ్రాయంగ్ రైట్స్ (ఎస్‌డీఆర్) బాస్కెట్‌లో రూపాయిని చేర్చేందుకు కూడా చర్యలు తీసుకోవాలని కోరింది. ఎస్‌డీఆర్ అనేది ఐఎంఎఫ్ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ రిజర్వ్ ఆస్తులకు సంబంధించినది. సభ్య దేశాల అధికారిక రిజర్వ్‌లకు మద్దతుగా దీన్ని వినియోగిస్తుంటుంది. ఈ రిజర్వ్ కరెన్సీలను సభ్య దేశాలు స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు.
అంటే ఎస్‌డీఆర్‌లు అనేవి సభ్య దేశాల నిధుల అవసరాలకు మద్దతుగా నిలుస్తుంది. ఎస్‌డీఆర్ బాస్కెట్‌లో ప్రస్తుతం యూఎస్ డాలర్, యూరో, చైనీస్ యువాన్, జపనీస్ యెన్, బ్రిటిష్ పౌండ్ మాత్రమే ఉన్నాయి. ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్‌ఎస్ రాథో అధ్యక్షతన గల ప్యానెల్ ఈ సిఫారసులను ఆర్‌బీఐకి సమరి్పంచింది. ముందుగా ద్వైపాక్షిక, బహుళపాక్షిక వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా రూపాయి, స్థానిక కరెన్సీల్లో ఇన్‌వాయిస్, చెల్లింపులు చేయాలని సిఫారసు చేసింది. భారత్‌లో, భారత్ బయట ఐఎన్‌ఆర్ ఖాతాలు తెరిచేలా ప్రోత్సాహించాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment