International currency market
-
రుపీ ట్రేడ్‌కు పలు దేశాలు రెడీ
న్యూఢిల్లీ: రూపాయిలో లావాదేవీలు చేపట్టేందు(రుపీ ట్రేడ్)కు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండటం, ఇతర అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే రూపాయి నిలకడ చూపడం ఇందుకు కారణమని పేర్కొన్నారు. జేఎన్‌యూలో ఏర్పాటు చేసిన పండిట్ హృదయ్నాథ్ కుంజ్రు మెమోరియల్ లెక్చర్స్ 2024లో ప్రొఫెసర్లు, విద్యార్ధుల నుద్దేశించి సీతారామన్ ప్రసంగించారు. ప్రతీ రంగంలోనూ ప్రయివేట్ పెట్టుబడులకు భారత్ తలుపులు తెరచినట్లు వెల్లడించారు. ఏఐ, సెమీకండక్టర్స్, కొత్త పద్ధతుల్లో తయారీ తదితర రంగాలకు ఆర్థికంగానేకాకుండా విధానాల ద్వారా సైతం మద్దతును కొనసాగిస్తున్నట్లు వివరించారు. డాలర్‌మినహా.. డాలరును మినహాయిస్తే ఇతర ప్రపంచ కరెన్సీలలో రూపాయి చాలావరకూ నిలకడను ప్రదర్శిస్తున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. డాలరుతో మారకంలో రూపాయి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నట్లు ప్రస్తావించారు. అయితే ఇదే విషయంలో ఇతర కరెన్సీలతో పోలిస్తే దేశీ కరెన్సీ నిలకడను ప్రదర్శిస్తున్నట్లేనని తెలియజేశారు. వెరసి పలు దేశాలు రుపీ ట్రేడ్ ద్వారా వాణిజ్య నిర్వహణకు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేశారు. కేంద్ర యూనివర్శిటీగా జేఎన్‌యూ తనకు దేశవ్యాప్త అవగాహనను కలి్పంచినట్లు సీతారామన్ పేర్కొన్నారు. ఇది విద్యారి్ధగా అభివృద్ధి చెందేందుకు దోహదం చేసినట్లు ఎక్స్(ట్విటర్) ద్వారా వెల్లడించారు. జేఎన్‌యూలో సీతారామన్ ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేశారు. -
అంతర్జాతీయ కరెన్సీగా రూపాయి
ముంబై: రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన స్వల్ప, దీర్ఘ కాల చర్యలను ఆర్బీఐ నియమించిన ప్యానెల్ సిఫారసు చేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) స్పెషల్ డ్రాయంగ్ రైట్స్ (ఎస్డీఆర్) బాస్కెట్లో రూపాయిని చేర్చేందుకు కూడా చర్యలు తీసుకోవాలని కోరింది. ఎస్డీఆర్ అనేది ఐఎంఎఫ్ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ రిజర్వ్ ఆస్తులకు సంబంధించినది. సభ్య దేశాల అధికారిక రిజర్వ్‌లకు మద్దతుగా దీన్ని వినియోగిస్తుంటుంది. ఈ రిజర్వ్ కరెన్సీలను సభ్య దేశాలు స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు. అంటే ఎస్‌డీఆర్‌లు అనేవి సభ్య దేశాల నిధుల అవసరాలకు మద్దతుగా నిలుస్తుంది. ఎస్డీఆర్ బాస్కెట్లో ప్రస్తుతం యూఎస్ డాలర్, యూరో, చైనీస్ యువాన్, జపనీస్ యెన్, బ్రిటిష్ పౌండ్ మాత్రమే ఉన్నాయి. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ఎస్ రాథో అధ్యక్షతన గల ప్యానెల్ ఈ సిఫారసులను ఆర్బీఐకి సమరి్పంచింది. ముందుగా ద్వైపాక్షిక, బహుళపాక్షిక వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా రూపాయి, స్థానిక కరెన్సీల్లో ఇన్వాయిస్, చెల్లింపులు చేయాలని సిఫారసు చేసింది. భారత్‌లో, భారత్ బయట ఐఎన్ఆర్ ఖాతాలు తెరిచేలా ప్రోత్సాహించాలని కోరింది. -
ఏడాదిలో 120 బిలియన్ డాలర్ల ఫారెక్స్ డౌన్
ముంబై: అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీ డాలర్ మారకంలో రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకుల నిరోధం, కరెన్సీ విలువల్లో సర్దుబాట్లు వంటి అంశాల నేపథ్యంలో భారత్ విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గుతున్నాయి. రికార్డు నమోదు తర్వాత సంవత్సరం తిరిగే సరికి ఏకంగా 120 బిలియన్ డాలర్లమేర నిల్వలు పతనం అయ్యాయి. అక్టోబర్ 21తో ముగిసిన వారంలో (అంతక్రితం అక్టోబర్ 14వ తేదీతో ముగిసిన వారంతో పోల్చి) ఫారెక్స్ నిల్వలు 3.847 బిలియన్ డాలర్లు తగ్గి రెండేళ్ల కనిష్ట స్థాయి 524.52 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి. 2021 అక్టోబర్‌లో భారత్ ఫారెక్స్ నిల్వలు రికార్డు స్థాయిలో 645 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయిని తాకాయి. అటుతర్వాతి పరిణామాల నేపథ్యంలో ఏడాది కాలంలో క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్‌లో 606.5 బిలియన్ డాలర్ల వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వలు అటు తర్వాత భారీగా పడిపోయాయి. ప్రస్తుత నిల్వలు దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయన్నది అంచనా. ఇది తగిన స్థాయేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► డాలర్ల రూపంలో పేర్కొనే ఫారెన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ)అక్టోబర్ 21తో ముగిసిన వారంలో 3.593 బిలియన్ డాలర్లు పడిపోయి 465.075 బిలియన్ డాలర్లకు చేరాయి. ► పసిడి నిల్వల విలువ 247 మిలియన్ డాలర్లు తగ్గిపోయి 37.206 బిలియన్ డాలర్లకు పడింది. ► అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)కు సంబంధించి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) విలువ మాత్రం 7 మిలియన్ డాలర్లు తగ్గి 17.44 బిలియన్ డాలర్లకు దిగింది. ► ఇక ఐఎంఎఫ్ వద్ద దేశ నిల్వల పరిస్థితి చూస్తే ఈ పరిమాణం 14 మిలియన్ డాలర్లు తగ్గి, 4.799 బిలియన్ డాలర్లకు చేరింది. తగిన స్థాయిలో భారత్ ఫారెక్స్ నిల్వలు భారత్ విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగిన స్థాయిలో ఉన్నాయి. అమెరికాలో కఠిన ద్రవ్య విధానం, అంతర్జాతీయంగా కమోడీటీ ధరల తీవ్రత వంటి సవాళ్లను తట్టుకోగలిగిన స్థాయిలో ఈ నిల్వలు కొనసాగుతున్నాయి. ఈ పటిష్టత నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎదురయ్యే సవాళ్ల వల్ల దేశానికి ప్రస్తుతం మేము ఇస్తున్న సావరిన్ రేటింగ్‌కు (బీబీబీ మైనస్, స్టేబుల్ అవుట్‌లుక్‌తో) వచ్చిన ఇబ్బంది ఏదీ లేదు. – ఫిచ్ రేటింగ్స్ -
4 అంతర్జాతీయ బ్యాంకులపై 2.5 బిలియన్ డాలర్ల జరిమానా
వాషింగ్టన్: అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లలో అవకతవకలకు పాల్పడినందుకు గాను అమెరికాలోని నాలుగు భారీ బ్యాంకులు 2.5 బిలియన్ డాలర్ల మేర జరిమానా కట్టనున్నాయి. 2007-2013 మధ్య కాలంలో జేపీమోర్గాన్ చేజ్, సిటీగ్రూప్, బార్ క్లేస్, ది రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ ఒకదానితో మరొకటి కుమ్మక్కై అమెరికన్ డాలర్, యూరో మారకం విలువల్లో అవకతవకలకు పాల్పడ్డాయని ఆరోపణలు ఉన్నాయి. అభియోగాలను అంగీకరించిన బ్యాంకులు.. 2.5 బిలి యన్ డాలర్లు చెల్లించడానికి సిద్ధమై అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్తో సెటిల్మెంట్ చేసుకున్నా యి. కీలక వడ్డీ రేట్లను ప్రభావితం చేసినందుకు గాను మరో బ్యాంకు యూబీఎస్ విడిగా 203 మిలియన్ డాలర్లు కట్టేందుకు సిద్ధపడింది.