ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ: రూపాయిలో లావాదేవీలు చేపట్టేందు(రుపీ ట్రేడ్)కు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండటం, ఇతర అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే రూపాయి నిలకడ చూపడం ఇందుకు కారణమని పేర్కొన్నారు.
జేఎన్‌యూలో ఏర్పాటు చేసిన పండిట్ హృదయ్‌నాథ్ కుంజ్రు మెమోరియల్ లెక్చర్స్ 2024లో ప్రొఫెసర్లు, విద్యార్ధుల నుద్దేశించి సీతారామన్ ప్రసంగించారు. ప్రతీ రంగంలోనూ ప్రయివేట్ పెట్టుబడులకు భారత్ తలుపులు తెరచినట్లు వెల్లడించారు. ఏఐ, సెమీకండక్టర్స్, కొత్త పద్ధతుల్లో తయారీ తదితర రంగాలకు ఆర్థికంగానేకాకుండా విధానాల ద్వారా సైతం మద్దతును కొనసాగిస్తున్నట్లు వివరించారు.
డాలర్‌మినహా..
డాలరును మినహాయిస్తే ఇతర ప్రపంచ కరెన్సీలలో రూపాయి చాలావరకూ నిలకడను ప్రదర్శిస్తున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. డాలరుతో మారకంలో రూపాయి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నట్లు ప్రస్తావించారు. అయితే ఇదే విషయంలో ఇతర కరెన్సీలతో పోలిస్తే దేశీ కరెన్సీ నిలకడను ప్రదర్శిస్తున్నట్లేనని తెలియజేశారు. వెరసి పలు దేశాలు రుపీ ట్రేడ్ ద్వారా వాణిజ్య నిర్వహణకు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేశారు. కేంద్ర యూనివర్శిటీగా జేఎన్‌యూ తనకు దేశవ్యాప్త అవగాహనను కలి్పంచినట్లు సీతారామన్ పేర్కొన్నారు. ఇది విద్యారి్ధగా అభివృద్ధి చెందేందుకు దోహదం చేసినట్లు ఎక్స్(ట్విటర్) ద్వారా వెల్లడించారు. జేఎన్‌యూలో సీతారామన్ ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment