trade
-
Stock Market: కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు
-
యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య కూటమితో డీల్
యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య కూటమి (ఈఎఫ్టీఏ)తో చేసుకున్న వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టెపా)తో భారత్ 400–500 బిలియన్ డాలర్ల (సుమారు రూ.43.5 లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించగలదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈఎఫ్టీఏ సభ్య దేశాల నుంచి 15 ఏళ్ల కాలంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు హామీ ఇచ్చినప్పటికీ, వాస్తవంగా నాలుగైదు రెట్లు అధికంగా ఎఫ్‌డీఐ దేశంలోకి వస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు.ఈ ఒప్పందం ఈ ఏడాది చివరి నాటికి అమల్లోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈఎఫ్‌టీఏలో ఐస్‌ల్యాండ్, లీచెన్‌స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్ సభ్య దేశాలుగా ఉండడం గమనార్హం. ఈఎఫ్టీఏ కోసం ఉద్దేశించిన ప్రత్యేకమైన డెస్క్‌ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి గోయల్ మాట్లాడారు. ఈ ఒప్పందం కింద స్విస్ వాచీలు, చాక్లెట్లు, కట్, పాలిష్డ్ వజ్రాల దిగుమతులను చాలా తక్కువ రేటుపై లేదా సున్నా రేటుపై భారత్ అనుమతించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రతిఫలంగా సభ్య దేశాలు ఇచ్చిన హామీలో భాగంగా 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నది అంచనా. నాలుగు సభ్య దేశాలు ఈ ఒప్పందం ఆమోదం దిశగా కీలకమైన చర్యలు తీసుకున్నాయంటూ, ఈ ఏడాది చివరికి ఇవి అమల్లోకి రావచ్చని మంత్రి గోయల్ చెప్పారు.ఇదీ చదవండి: 462 కంపెనీలపై దర్యాప్తు!పారిశ్రామిక స్మార్ట్ సిటీల్లో కేటాయింపులుఎన్ఐసీడీసీ అభివృద్ధి చేస్తున్న 20 పారిశ్రామిక స్మార్ట్ పట్టణాల్లో ప్రత్యేకంగా కొంత భాగాన్ని ఈఎఫ్టీఏ సభ్య దేశాలకు ఆఫర్ చేయనున్నట్టు మంత్రి గోయల్ తెలిపారు. లేదా బడ్జెట్లో ప్రకటించినట్టు 100 హబ్ అండ్ స్పోక్ పారిశ్రామిక కేంద్రాలను కేటాయించనున్నట్టు తెలిపారు. ఈ దిశగా ఆయా దేశాలతో చర్చలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈఎఫ్టీఏ–భారత్ మధ్య 2023–24లో 24 బిలియన్ డాలర్ల (రూ.2.08 లక్షల కోట్లు) ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైనట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంటే, ఆ తర్వాతి స్థానంలో నార్వే ఉంది. 2000–2004 మధ్య స్విట్జర్లాండ్ నుంచి భారత్‌కు 10.72 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. -
యూఎస్-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం.. భారత్‌కు లాభం
అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు(US-China trade tensions) భారత్‌కు కొత్త అవకాశాలను చూపిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా వస్తువులపై అమెరికా సుంకాలు విధించడంతో భారతీయ ఎగుమతిదారుల ఆర్డర్లలో పెరుగుదల నమోదవుతుందని తెలియజేస్తున్నారు. అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య సంఘర్షణతో భారతదేశం లబ్ధిదారుగా మారుతుందని చెబుతున్నారు.గతంలో ఇలా..గతంలో యూఎస్-చైనాల మధ్య సుంకాల పరంగా నెలకొన్న వాణిజ్య యుద్ధాల సమయంలో భారతదేశం భారీగానే లాభపడింది. ఉదాహరణకు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత హయాంలో ప్రారంభించిన వాణిజ్య యుద్ధం కాలంలో భారత్ అమెరికాకు భారీగానే వస్తువులను ఎగుమతి చేసింది. ఆ సమయంలో అమెరికాకు ఎగుమతి చేసే దేశాల్లో ఇండియా నాలుగో అతిపెద్ద లబ్ధిదారుగా అవతరించింది. ప్రస్తుతం చైనా దిగుమతులపై సుంకాలు విధించడంతో యూఎస్ ప్రత్యామ్నాయ సరఫరాదారులను అన్వేషిస్తోంది. అందులో ప్రధానంగా భారత్‌వైపు మొగ్గు చూపేందుకు అవకాశం ఉంది.ఏయే వస్తువులకు గిరాకీఎలక్ట్రానిక్స్, మెషినరీ, దుస్తులు, తోలు, పాదరక్షలు, ఫర్నిచర్, ఫార్మాస్యూటికల్స్, బొమ్మలు వంటి కీలక రంగాల్లో యూఎస్-చైనా టారిఫ్‌ల వల్ల భారత్ లబ్ధి పొందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా దిగుమతులతో ముడిపడి ఉన్న అధిక ఖర్చులను నివారించడానికి యూఎస్ కొనుగోలుదారులు భారతీయ కంపెనీలపై దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా భారత్, చైనా రెండింటిలోనూ తయారీ కార్యకలాపాలు కలిగి ఉన్న సంస్థలకు యూఎస్ నుంచి ఆర్డర్లు పెరుగుతాయని భావిస్తున్నారు.ఇదీ చదవండి: త్వరలో జీఎస్టీ శ్లాబ్‌ల సరళీకరణఆర్డర్ల పెరుగుదలఈ పరిణామంపై ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈఓ) ఎగుమతిదారుల్లో సానుకూల సెంటిమెంట్ ఉందని తెలిపింది. ఇప్పటికే చాలా మంది ఆర్డర్లు పెరిగినట్లు పేర్కొంది. ఈ వ్యవహారం భారత ఎగుమతులను పెంచుతుందని, ఆర్థిక వృద్ధికి, ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే భారత మౌలిక సదుపాయాలు, సులభతర వాణిజ్యం మెరుగుపడాలని తెలియజేస్తున్నారు. ఈ అంశంపై కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ ప్రస్తుత విధానాలు భారతదేశానికి ప్రపంచ వాణిజ్య ఉనికిని పెంచుకోవడానికి అవకాశాన్ని అందిస్తున్నట్లు చెబుతున్నారు. -
అనుకున్నదొకటి.. అయినదొకటి!
ప్రపంచంలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతోంది. ఇటీవల అమెరికా చైనా దిగుమతులపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో చైనా కూడా అందుకు తగ్గట్టుగా ప్రతిస్పందించింది. అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్‌లు విధిస్తున్నట్లు చైనా స్పష్టం చేసింది. చైనా నుంచి అమెరికా బొగ్గు, ద్రవరూపంలో ఉన్న సహజ వాయువు (ఎల్ఎన్జీ), ముడి చమురు, వ్యవసాయ యంత్రాలు, కొన్ని కంపెనీలకు చెందిన ప్రీమియం కార్లు.. వంటివాటిని బారీగానే దిగుమతి చేసుకుంటోంది. దాంతో భవిష్యత్తులో వీటిపై ప్రభావం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.ఇటీవల అమెరికా విధించిన సుంకాల పెంపునకు ప్రతిస్పందనగా చైనా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. అమెరికా అనుసరించిన సుంకాల పెంపు విధానం ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలను ఉల్లంఘిస్తుందని, రెండు దేశాల మధ్య సాధారణ ఆర్థిక, వాణిజ్య సహకారానికి విఘాతం కలిగిస్తుందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వచ్చే సోమవారం నుంచి ఈ సుంకాల పెంపు అమల్లోకి వస్తుందని చైనా స్పష్టం చేసింది. కొత్త టారిఫ్‌ల్లో బొగ్గు, ఎల్ఎన్జీ ఉత్పత్తులపై 15 శాతం సుంకం, ముడిచమురు, వ్యవసాయ యంత్రాలు, ప్రీమియం కార్లపై 10 శాతం సుంకం విధిస్తున్నట్లు చైనా తెలిపింది. అమెరికాలోకి అక్రమ వలసదారులు, మాదకద్రవ్యాల ప్రవాహాన్ని నిరోధించడంలో విఫలమైన దేశాలను శిక్షించడమే లక్ష్యంగా ట్రంప్ ఇటీవల చైనా వస్తువులపై 10% సుంకం విధిస్తున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: వణికిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే..చైనా అమెరికాకు వాణిజ్య విధానానికి వ్యతిరేకంగా కౌంటర్ టారిఫ్‌లతో పాటు, యాంటీట్రస్ట్ చట్టాలను ఉల్లంఘించారనే అనుమానంతో స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ గూగుల్‌పై దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తును అమెరికా వాణిజ్య చర్యలకు ప్రతీకార చర్యగా భావిస్తున్నారు. చైనా మార్కెట్లో గూగుల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా పోటీదారులకు అన్యాయం చేసే ఏదైనా వ్యాపార పద్ధతులను ఉపయోగించిందా అనే దానిపై దర్యాప్తు దృష్టి సాగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాపై సుంకాలు విధిస్తే వాణిజ్యం పరంగా కొంత వెనక్కి తగ్గుతుందని భావించిన అమెరికాకు.. చైనా ఇలా తిరికి టారిఫ్‌లు విధించడం కొంత ఎదురుదెబ్బే అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల కోసం యూఎస్ భారత్‌వైపు చూసేలా ప్రయత్నాలు జరగాలని సూచిస్తున్నారు. -
అమెరికా సుంకాలకు కారణాలు.. భారత్‌పై ప్రభావం
అమెరికా ‘కంట్రీఫస్ట్’ విధానంతో ముందుకెళ్తోంది. అందులో భాగంగా కెనడా, మెక్సికో, చైనా దిగుమతులపై సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అమెరికా విధించిన సుంకాలను భారత్ కూడా ఎదుర్కొనే అవకాశం ఉందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ వాణిజ్య సంఘర్షణ భారతీయ విధానకర్తలు, వ్యాపారుల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా కెనడా, మెక్సికో దేశాలపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలు విధించింది. ఈ సెగ భారత్‌కు సైతం తాకనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.అమెరికా, భారతదేశం చాలా సంవత్సరాలుగా సంక్లిష్టమైన వాణిజ్య సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఇరు దేశాల మధ్య కొన్ని అంశాలపై సహకారం ఉన్నా, కొన్నింటిపై వివాదాలున్నాయి. ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో ఇరు దేశాలు ఆరు దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరించుకున్నాయి. ఇది ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సానుకూల చర్యగా ఇరు వర్గాలు అభివర్ణించాయి. ఏదేమైనా, కొత్త సుంకాల భయం ప్రస్తుతం కీలకంగా మారుతుంది.టారిఫ్ భయాలకు కారణాలుముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాల్లో భారత్‌తో వాణిజ్య లోటుపై అమెరికా గళమెత్తింది. ఈ అసమతుల్యతలను పరిష్కరించడానికి, దేశీయ పరిశ్రమలను రక్షించడానికి సుంకాలను ఒక మార్గంగా చూస్తుంది. సుంకాలు విధించాలన్న అమెరికా నిర్ణయంలో ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేసే విస్తృత వ్యూహంలో భాగంగా అమెరికా ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలని చూస్తోంది. విదేశీ పోటీ నుంచి దేశీయ పరిశ్రమలను రక్షించడానికి సుంకాలు అనుకూలమైన సాధనంగా అమెరికా పరిగణిస్తుంది. యూఎస్ ఆర్థిక ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉందని భావిస్తే టారిఫ్‌ల విధానం భారత్‌కు విస్తరించే అవకాశం ఉంది.యూఎస్ సుంకాల వల్ల భారత్‌పై ప్రభావంఎగుమతుల క్షీణత: భారత ఎగుమతిదారులు, ముఖ్యంగా సుంకాల ద్వారా లక్ష్యంగా చేసుకున్న రంగాల్లో మార్కెట్ అవకాశాలు తగ్గడం, ఆదాయాలు క్షీణించడం వంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇది ఆ రంగాల్లో ఉపాధి, ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతుంది.ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు: దిగుమతి చేసుకున్న వస్తువులపై అధిక సుంకాలు భారతీయ వినియోగదారులకు ఖర్చులు పెరగడానికి దారితీస్తాయి. ఇది దేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దోహదం చేస్తుంది.వాణిజ్య సంబంధాలు: టారిఫ్‌ల విధింపు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తుంది. ఇది ప్రతీకార చర్యలకు దారితీస్తుంది. రెండు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసే వాణిజ్య యుద్ధానికి తెరతీసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఓపెన్ ఏఐ ‘డీప్ రీసెర్చ్’ ఆవిష్కరణఇప్పుడేం చేయాలంటే..సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి, దానివల్ల ఏర్పడే సమస్యలను పరిష్కరించడానికి భారత్, అమెరికా పరస్పర ప్రయోజనకరమైన విధానాలు అన్వేషించాలి. అందుకు ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలు జరగాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ఎగుమతి మార్కెట్లను వైవిధ్యపరచడం కూడా అమెరికా మార్కెట్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు తోడ్పడుతుంది. -
ఇచ్చింది రూ.720 ..పోయింది రూ.4.49 లక్షలు
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన మహిళను టార్గెట్‌గా చేసుకున్న సైబర్ నేరగాళ్లు పెట్టుబడుల పేరుతో ఎర వేశారు. ఆమెకు రూ.720 లాభం ఇవ్వడం ద్వారా నమ్మకం కలిగించి ఏకంగా రూ.4.49 లక్షలు టోకరా వేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఓ వివాహితకు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా ట్రేడ్ మార్కెటింగ్‌లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో ఎర వేశారు. దానికి ముందు కొన్ని టాస్్కలు పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇందులో ఆయా వీడియోలు, ఫొటోలను షేర్ చేయడం, ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వడం ద్వారా ఆదాయం పొందవచ్చని నమ్మబలికారు. మొదటి టాస్క్ పూర్తి చేసిన ఆమెకు రూ.120, రెండో టాస్క్ పూర్తి చేయడంతో రూ.300 చెల్లించారు. దీంతో వారిపై పూర్తిగా నమ్మకం కలిగిన గృహిణి తాను పెట్టుబడులు పెడతానంటూ వాట్సాప్ ద్వారా సందేశం ఇచ్చారు. దీంతో ఆమెకు ఓ లింక్ పంపిన సైబర్ నేరగాళ్లు అందులో ఖాతా తెరవడం ద్వారా పెట్టుబడులు పెట్టాలన్నారు. తొలుత రూ.వెయ్యి పెట్టుబడి పెట్టిన ఆమెకు రూ.300 లాభంతో రూ.1300 చెల్లించారు. ఆపై పెద్ద మొత్తాలు ఇన్వెస్ట్ చేయిస్తూ, త్వరలోనే లాభాలు వస్తాయని కాలయాపన చేశారు. మొత్తమ్మీద రూ.4.49 లక్షలు పెట్టుబడి పెట్టిన తర్వాత రిఫండ్ కోరితే మరికొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తేనే వస్తుందని చెప్పారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తెలుగు మ్యాట్రిమోనీలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే... తెలుగు మ్యాట్రిమోనీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రైవేట్ ఉద్యోగికి పెళ్లి కూతురి పేరుతో ప్రొఫైల్ పంపిన సైబర్ నేరగాళ్లు రూ.2.05 లక్షలు కాజేశారు. దీనికోసం వాళ్లు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కథ చెప్పారు. నగర యువకుడు తెలుగు మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకోగా... మలేíÙయాలో ఉంటున్న విశాఖపట్నం యువతిగా ఓ యువతి తన ప్రొఫైల్ పంపింది. వాట్సాప్ ద్వారా ఇద్దరూ కొన్నాళ్లు చాటింగ్ చేసుకున్నారు. ఆపై తన తండ్రి క్రిప్టో కరెన్సీ యాప్స్‌లో పెట్టుబడులు పెట్టి, లాభాలు పొందటంతో నిష్ణాతుడని చెప్పింది. తొలుత నిజమైన క్రిప్టో కరెన్సీ యాప్‌లోనే పెట్టుబడి పెట్టి, లాభాలు పొందేలా చేశారు. ఆపై నకిలీ యాప్ లింక్‌ను పంపి, అందులో రూ.2.05 లక్షలు ఇన్వెస్ట్ చేయించి కాజేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే తెలుగు మ్యాట్రిమోనీ నుంచి వాట్సాప్ ద్వారా బాధితుడికి ఓ మెసేజ్ వచి్చంది. అందులో సైబర్ నేరగాళ్లు పెళ్లి కుమారులు, పెళ్లి కుమార్తెలుగా పరిచయమై ఎర వేస్తున్నారని, ఆపై వివిధ అంశాల్లో తమ అంకుల్, తండ్రి నిష్ణాతులని చెప్పి మోసం చేస్తున్నారని ఉంది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తక్షణం ఫిర్యాదు చేయండిఅపరిచితులతో ఎలాంటి లావాదేవీలు వద్దు. ఆన్లైన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అంటూ వచ్చే ప్రకటనలు నమ్మవద్దు. ఎవరైనా సైబర్ నేరాల బారినపడితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 1930కు కాల్ చేసి లేదా 8712665171 నెంబర్‌ను వాట్సాప్ ద్వారా,(cybercrimespshyd@gmail.com) మెయిల్‌కు ఐడీకి ఈ–మెయిల్ ద్వారా సంప్రదించి లేదా (www.cybercrime.gov.in) వెబ్సైట్లోకి వెళ్లి ఫిర్యాదు చేయాలి. – సైబర్ క్రైమ్ పోలీసులు -
మళ్లీ హౌడీ.. అంటారా?
న్యూఢిల్లీ: చరిత్రాత్మక విజయంతో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో విడత శ్వేతసౌధంలోకి కాలు మోపుతున్న నేపథ్యంలో వ్యూహాత్మక భాగస్వామి భారత్‌తో వాణిజ్య, దౌత్య సంబంధాలు ఇకపై ఎలా ఉంటాయి? ‘‘హౌడీ.. మోదీ!’’ ‘‘నమస్తే ట్రంప్..!’’ స్నేహ బంధం కొనసాగుతుందా? మరి మనకు అనుకూలతలు – ప్రతికూలతలు ఏమిటన్నవి ఆసక్తికరంగా మారాయి. ‘అమెరికా ఫస్ట్’ అనే సూత్రాన్ని అనుసరిస్తూ విదేశాంగ విధానాన్ని సంస్కరించనున్నట్లు ట్రంప్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. అందువల్ల సహజంగానే ఆయన విధానాలు అందుకు అనుగుణంగానే ఉంటాయి. భారత్–రష్యా సంబంధాల విషయంలో చూసీ చూడనట్లు ఉన్నా వాణిజ్యం, ఇమిగ్రేషన్ నిబంధనలు, సుంకాల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించవచ్చని భావిస్తున్నారు. మిత్రుడంటూనే..2017 నుంచి 2021 వరకు ట్రంప్ తొలిసారి అధ్యక్షు డిగా ఉన్నప్పుడు అమెరికా పరిశ్రమల కోసం రక్షణాత్మక విధానాన్ని అనుసరించారు. భారత్, చైనా సహా పలు దేశాల ఎగుమతులపై భారీ సుంకాలను విధించారు. అమెరికా ఉత్పత్తులు, సేవలపై అత్యధిక సుంకాలు విధించే దేశాలపై కఠిన వైఖరి అనుసరించారు. ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ పలు సందర్భాల్లో తన స్నేహితుడిగా అభివర్ణించినా అదే సమయంలో భారత విధానాలను గట్టిగా వ్యతిరేకించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీ సుంకాలను విధించటాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. వాణిజ్య నిబంధనలను భారత్ ఉల్లంఘిస్తోందని, అత్యధికంగా సుంకాలను విధిస్తోందని.. టారిఫ్ కింగ్ అంటూ ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ కోరిన విధంగా సుంకాల తగ్గింపు నిబంధనలను అమలు చేస్తే భారత జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) 2028 నాటికి 0.1 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ సంబంధాలు..గతంలో ట్రంప్ హయాంలో అమెరికా – చైనా మధ్య సంబంధాలు గణనీయంగా క్షీణించాయి. చైనాను ఆయన గట్టి ప్రత్యర్థిగా పరిగణిస్తారు. ఇది కొంతవరకు భారత్ – అమెరికా మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం కావటానికి దోహదం చేసింది. చైనాకు దీటుగా ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్ కూటమి బలంగా ఎదగాలని ట్రంప్ భావించారు. ఇప్పుడు ఆయన రెండోసారి అధ్యక్షుడు అవుతున్నందున అమెరికా – భారత్ మధ్య ఆయుధ సంపత్తి, సంయుక్త సైనిక విన్యాసాలు, సాంకేతిక మార్పిడి విషయంలో మెరుగైన సమన్వయం ఉండవచ్చు.వీసా విధానం..ట్రంప్ విధానాలు వలసదారులకు ఇబ్బందికరమే! స్థానికుల ఉద్యోగాలను వారు లాక్కుంటున్నారని గుర్రుగా ఉన్నారు. వీసా నిబంధనలను కఠినతరం చేస్తే ఐటీ సంస్థలకు, నిపుణులకు కష్టకాలమే!! -
నేటి నుంచి యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో
లక్నో: ఉత్తరప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో (యూపీఐటీఎస్) నేటి (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. ఇది సెప్టెంబర్ 25 నుండి సెప్టెంబర్ 29 వరకకూ కొనసాగనుంది. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో నేడు ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్ దీనిని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి నంద్ గోపాల్ గుప్తా నంది తదితరులు హాజరుకానున్నారు.ఈ ప్రదర్శనను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఇండియా ఎక్స్పొజిషన్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రదర్శనలో 2500కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. 70 దేశాల నుంచి దాదాపు 500 మంది విదేశీ కొనుగోలుదారులు ఈ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను సందర్శించనున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శన ఉండనుంది. 'वैश्विक व्यापार का महाकुंभ'Uttar Pradesh International Trade Show के द्वितीय संस्करण का उद्घाटन आज माननीय उपराष्ट्रपति श्री जगदीप धनखड़ जी के कर कमलों से सम्पन्न होगा।कार्यक्रम में #UPCM श्री @myogiadityanath जी की भी गरिमामयी उपस्थिति रहेगी।दिनांक: 25 सितंबर 2024समय:… pic.twitter.com/wAk8ZggvqN— Government of UP (@UPGovt) September 25, 2024గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్‌లో జరిగిన ప్రీ-ఈవెంట్ బ్రీఫింగ్లో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) మంత్రి రాకేష్ సచన్ మాట్లాడుతూ ఈ ఏడాది ట్రేడ్ ఫెయిర్ గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుందని అన్నారు. యూపీ ఆర్థికాభివృద్ధికి యూపీఐటీఎస్ చిహ్నంగా మారిందని సచన్ తెలిపారు. ఈ సంవత్సరం ఐదు లక్షల మంది సందర్శకులు వస్తారని భావిస్తున్నామన్నారు.ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన కొత్త ఫోను సంబురం -
వాణిజ్యానికి ప్రత్యేక పోర్టల్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా వాణిజ్యానికి ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ట్రేడ్ కనెక్ట్ ఈప్లాట్‌ఫామ్ పేరుతో ఏర్పాటు చేసిన పోర్టల్ ద్వారా ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించనుంది. వెరసి ప్రస్తుత, కొత్త వ్యాపారవేత్తల(ఆంట్రప్రెన్యూర్స్)కు ట్రేడ్ పోర్టల్ సహాయకారిగా నిలవనుంది.ఎంఎస్ఎంఈ శాఖ, ఎగ్జిమ్ బ్యాంక్, టీసీఎస్, ఆర్థిక సేవల శాఖ, విదేశీ వ్యవహారాల శాఖల సహకారంతో తాజా ట్రేడ్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ట్రేడ్ పోర్టల్‌ను వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టారు. కస్టమ్స్ సుంకాలు, నిబంధనలు, నియంత్రణలు తదితర అన్ని రకాల సమాచారానికి ఒకే సొల్యూషన్‌గా తాజా పోర్టల్ నిలవనున్నట్లు గోయల్ వివరించారు. తద్వారా సమాచార లోపాలకు చెక్ పెట్టనున్నట్లు తెలియజేశారు. -
ఇండో-బంగ్లాదేశ్ వాణిజ్యం బంద్!
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున చెలరేగిన అల్లర్లు, ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండో-బంగ్లాదేశ్ వాణిజ్యం సోమవారం మధ్యాహ్నం నిలిచిపోయింది. ఆ దేశంలో హింసాత్మక నిరసనల ఫలితంగా అధ్యక్షురాలు షేక్ హసీనా రాజీనామా చేశారు.దేశంలో అత్యవసర సేవలు మినహా మూడు రోజుల వాణిజ్య సెలవును ప్రకటిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. బంగ్లాదేశ్ కస్టమ్స్ నుంచి తమ ల్యాండ్ పోర్ట్‌లలో క్లియరెన్స్ లేకపోవడంతో, అన్ని ల్యాండ్ పోర్ట్‌లలో ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు నిలిచిపోయాయని పశ్చిమ బెంగాల్ ఎగుమతిదారుల సమన్వయ కమిటీ కార్యదర్శి ఉజ్జల్ సాహా తెలిపారు.గత రెండు రోజులుగా బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనల కారణంగా వాణిజ్యానికి అంతరాయం ఏర్పడింది. హసీనా సోమవారం రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లినట్లు పలు వార్తా కథనాలు తెలిపాయి. సోమవారం ఉదయం కొంత మేర వాణిజ్య కార్యకలాపాలు జరిగినా అధ్యక్షురాలి రాజీనామా, దేశం నుంచి నిష్క్రమణ వార్తల తర్వాత ఆగిపోయిందని బెనాపోల్ సి&ఎఫ్ స్టాఫ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సాజేదుర్ రెహ్మాన్ చెప్పారు.బెనాపోల్ పశ్చిమ బెంగాల్‌లోని పెట్రాపోల్ సరిహద్దులో బంగ్లాదేశ్ వైపు ఉంది. రాష్ట్రంలోని కొన్ని ఇతర ల్యాండ్ పోర్ట్‌లలో అత్యధికంగా ద్వైపాక్షిక వాణిజ్యానికి కారణమయ్యే అతిపెద్ద ల్యాండ్ పోర్ట్ అయిన పెట్రాపోల్ కూడా ప్రభావితమైందని వ్యాపార వర్గాలు తెలిపాయి. -
రుపీ ట్రేడ్‌కు పలు దేశాలు రెడీ
న్యూఢిల్లీ: రూపాయిలో లావాదేవీలు చేపట్టేందు(రుపీ ట్రేడ్)కు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండటం, ఇతర అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే రూపాయి నిలకడ చూపడం ఇందుకు కారణమని పేర్కొన్నారు. జేఎన్‌యూలో ఏర్పాటు చేసిన పండిట్ హృదయ్నాథ్ కుంజ్రు మెమోరియల్ లెక్చర్స్ 2024లో ప్రొఫెసర్లు, విద్యార్ధుల నుద్దేశించి సీతారామన్ ప్రసంగించారు. ప్రతీ రంగంలోనూ ప్రయివేట్ పెట్టుబడులకు భారత్ తలుపులు తెరచినట్లు వెల్లడించారు. ఏఐ, సెమీకండక్టర్స్, కొత్త పద్ధతుల్లో తయారీ తదితర రంగాలకు ఆర్థికంగానేకాకుండా విధానాల ద్వారా సైతం మద్దతును కొనసాగిస్తున్నట్లు వివరించారు. డాలర్‌మినహా.. డాలరును మినహాయిస్తే ఇతర ప్రపంచ కరెన్సీలలో రూపాయి చాలావరకూ నిలకడను ప్రదర్శిస్తున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. డాలరుతో మారకంలో రూపాయి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నట్లు ప్రస్తావించారు. అయితే ఇదే విషయంలో ఇతర కరెన్సీలతో పోలిస్తే దేశీ కరెన్సీ నిలకడను ప్రదర్శిస్తున్నట్లేనని తెలియజేశారు. వెరసి పలు దేశాలు రుపీ ట్రేడ్ ద్వారా వాణిజ్య నిర్వహణకు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేశారు. కేంద్ర యూనివర్శిటీగా జేఎన్‌యూ తనకు దేశవ్యాప్త అవగాహనను కలి్పంచినట్లు సీతారామన్ పేర్కొన్నారు. ఇది విద్యారి్ధగా అభివృద్ధి చెందేందుకు దోహదం చేసినట్లు ఎక్స్(ట్విటర్) ద్వారా వెల్లడించారు. జేఎన్‌యూలో సీతారామన్ ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేశారు. -
పరిశ్రమల భూకేటాయింపులు మరింత సరళం
సాక్షి, అమరావతి : సులభతర వాణిజ్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు భూ కేటాయింపులను మరింత సరళతరం చేసింది. 2023–27 పారిశ్రామిక విధానం కింద.. పరిశ్రమలు లీజు విధానంలో కాకుండా నేరుగా భూములు కొనుగోలు చేసేలా పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు 33/99 ఏళ్లకు లీజు విధానంలో ఈ కేటాయింపులు చేస్తుండగా నిధుల సమీకరణకు లీజు ఒప్పందాలు అడ్డంకిగా మారుతున్నాయంటూ పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన విజ్ఞప్తిని మన్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా పొందుపరిచారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుచేసే వారు భూమి విలువను మొత్తం ఒకేసారి చెల్లిస్తే తక్షణం వారితో ఏపీఐసీసీ లేదా పరిశ్రమల శాఖ భూమి కొనుగోలు ఒప్పందం చేసుకుంటుంది. ప్రాజెక్టు ఏర్పాటుచేసేటప్పుడు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలన్నీ నిర్ధిష్ట కాలపరిమితిలోగా చేసుకుంటే వెంటనే ఆ భూమిపై పూర్తి హక్కులను కేటాయిస్తూ తుది సేల్ డీడ్‌ను అందజేస్తారు. అదే మధ్య, పెద్ద, భారీ పరిశ్రమల విషయానికొస్తే.. దశల వారీగా ప్రాజెక్టులు చేపట్టినా మొత్తం భూమి విలువ ఒకేసారి చెల్లిస్తే సేల్ అగ్రిమెంట్ చేస్తారు. అలాగే, డీపీఆర్ ప్రకారం దశల వారీగా ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలుచేసిన తర్వాత తుది అమ్మకం డీడ్‌ను అందజేస్తారు. ఒకవేళ పరిశ్రమలు పెట్టేవారు దశల వారీగా సేల్‌డీడ్‌ను కోరుకుంటే ఆ ఫేజ్‌లో చేరుకోవాల్సిన లక్ష్యాలు చేరుకుంటే ఆ మేరకు ఆ భూమికి సేల్‌డీడ్ చేస్తారు. ఒకవేళ రెవెన్యూ శాఖ భూమి కొనుగోలు చేసి ఇవ్వాల్సి వస్తే అప్పుడు కూడా పరిశ్రమల శాఖ ఆమోదించిన డీపీఆర్ నిబంధనలు చేరుకున్న తర్వాతనే భూమిని కేటాయిస్తారు. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2020 నుంచి అమల్లోకి వస్తాయని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. -
చైనాలో మరో దారుణం వెలుగులోకి: మండిపడుతున్న జనం
Cats being killed and sold as mutton or pork in china డ్రాగన్ కంట్రీ చైనాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మటన్ పేరుతో పిల్లుల మాంసాన్ని విక్రయిస్తున్న వైనం కలకలం రేపింది. దేశంలో జంతురక్షణ చట్టాలు,ఆహార భద్రత మరోసారి చర్చకు దారి తీసింది. దాదాపు 1,000 పిల్లులను కబేళాకు తరలిస్తుండగా చైనా పోలీసులు పట్టుకున్నారు. దీంతో పిల్లి మాంసాన్ని పంది మాంసం లేదా మటన్‌గా విక్రయించే అక్రమ వ్యాపారం గుట్టు రట్టయింది. ఈ నెల ప్రారంభంలో జంతు పరిరక్షణ కార్యకర్తల సూచన మేరకు, తూర్పు చైనీస్ ప్రావిన్స్ జియాంగ్సులోని జాంగ్జియాగాంగ్ అధికారులు దాడులు నిర్వహించారని ది పేపర్ నివేదించింది. పిల్లుల మాంసాన్ని మటన్ గా నమ్మించి దేశంలోని దక్షిణ ప్రాంతానికి సరఫరా చేస్తున్నారని తెలిపింది. దక్షిణ చైనా ప్రావిన్స్‌లోని గ్వాంగ్‌డాంగ్‌లో ఇంతకుముందు ఇలాంటి అక్రమ వ్యాపారాలను నిలిపివేసినట్లు జంతు సంరక్షణ ఉద్యమకర్త హాన్ జియాలీ చెప్పారు. చైనాలో ఒక్కో క్యాటీ (600 గ్రాములు) పిల్లి మాంసం ధర 4.5 యువాన్లు పలుకుతోందట. జాంగ్జియాగాంగ్ నగరంలోని కబేళాలో భారీ ఎత్తున పిల్లులను వేలాడదీసి ఉండటంతో అనుమానం వచ్చిన యానిమల్ రైట్స్ ప్రొటెక్షన్ కార్యకర్తలు నిఘా వేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఒక ట్రక్కులో అక్రమంగా రవాణా చేస్తుండగా ఈ పిల్లులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీటిని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. తాజా ఘటనతో చైనీయులలో ఆహార భద్రత పై ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. సోషల్ మీడియా సంస్థ వీబోలో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇది తిన్న మనుషులకు భయంకరమైన చావు తప్పదని ఒకరు వ్యాఖ్యానించగా, ఈ దేశంలో పిల్లులకు, కుక్కలకు జీవించే హక్కు లేదా అని మరొకరు ప్రశ్నించారు. అంతేకాదు చచ్చినా ఇకపై బార్బెక్యూ మాంసం తినను అని మరొక యూజర్ కమెంట్ చేయడం గమనార్హం. -
అమెరికాతో వాణిజ్యం.. చైనాను వెనక్కు నెట్టిన ఇండియా
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, ఎగుమతులు, దిగుమతులు తగ్గడం వంటి ప్రతికూల పరిణామాల మధ్యలోనూ అమెరికాతో వాణిజ్యం మెరుగ్గానే కొనసాగడం గమనార్హం. ప్రపంచంలో అగ్రరాజ్యంగా పేరుగాంచిన అమెరికాతో భారత వాణిజ్య సంబంధాలు క్రమేపీ బలపడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబరు మధ్య చైనాను వెనక్కునెట్టి యూఎస్‌కు ఇండియా అతిపెద్ద ట్రేడ్ పార్టనర్‌గా ఉద్భవించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితితో పాటు ఎగుమతులు, దిగుమతుల్లో భారీ క్షీణత ఏర్పడింది. అయినప్పటికీ భారత్‌కు అమెరికా ఆతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 11.3 శాతం మేర క్షీణించి 59.67 బిలియన్ డాలర్లకు చేరినట్లు ప్రభుత్వ తాత్కాలిక డేటా వెల్లడించింది. 2023 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య అమెరికాకు ఎగుమతులు 38.28 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాదిలో 41.49 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఎగుమతులు తగ్గాయి. దిగుమతుల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. గతేడాది మొదటి ఆరు నెలల్లో 25.79 బిలియన్ డాలర్ల మేర భారత్ దిగుమతులు చేసుకోగా.. ఈసారి ఇది 21.39 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఇక భారత్, చైనాల మధ్య వాణిజ్యం కూడా 3.56 శాతం తగ్గి 58.11 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో చైనాకు ఎగుమతులు 7.84 బిలియన్ డాలర్ల నుంచి స్వల్పంగా 7.74 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దిగుమతులు అంతకు ముందు ఏడాది 52.42 బిలియన్ డాలర్లు కాగా..ఇప్పుడు 50.47 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా ఇండియా, అమెరికా మధ్య ఎగుమతులు, దిగుమతులు క్షీణిస్తున్నాయి. వృద్ధి రేటు త్వరలోనే సానుకూలంగా మారుతుందని వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. -
భారత్-కెనడా వాణిజ్య చర్చలకు బ్రేక్
ఒట్టావా: భారత్- కెనడా మధ్య దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఢిల్లీలో ఇటీవల జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశం అనంతరం ఇరు దేశాల సంబంధాలు మరింత తీవ్రతరమయ్యాయి. ఫలితంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలకు బ్రేక్ పడింది. ఇప్పటికే జీ20 సదస్సుకు కొద్ది రోజుల ముందు భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కెనడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అక్టోబర్‌లో ఆ చర్చలను తిరిగి ప్రారంభిచాల్సి ఉండగా తాజాగా మరోసారి ఇవి వాయిదా పడ్డాయి. భారత్‌తో జరగాల్సిన స్వేచ్చా వాణిజ్య ఒప్పందంపై చర్చలను వాయిదా వేస్తున్నట్లు కెనడా వెల్లడించింది. భారత్‌తో అక్టోబరులో జరగాల్సిన వాణిజ్య మిషన్‌ను వాయిదా వేయాలని ఆదేశ వాణిజ్యశాఖ మంత్రి మేరీ ఎన్జీ నిర్ణయించారని సదరుశాఖ అధికార ప్రతినిధి శాంతి కోసెంటినో తెలిపారు. అయితే వాయిదా వేయడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చర్చలు జరిపిన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం వెలుగుచూసింది. సెప్టెంబర్9, 10 న భారత్ అధ్యక్షతన నిర్వహించిన జీ 20 సమావేశాల్లో భాగంగా ప్రధాని మోదీ ప్రపంచ దేశాధినేతలతో ధైపాక్షక చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఖలిస్థానీ సానుభూతిపరులకు కెనడా అడ్డాగా మారుతుందనే విషయాన్ని నేరుగా ట్రూడో దృష్టికి మోదీ తీసుకెళ్లారు. భారత్ వ్యతిరేక శక్తులు కెనడాలో ఆశ్రయం పొందుతున్నారని, అక్కడ నివసిస్తున్న భారతీయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. తీవ్రవాద శక్తులు కెనడా కేంద్రంగా భారత్‌పై విషం చిమ్ముతున్నాయని, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఇది కెనడాకు కూడా ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలంటే పరస్పర గౌరవం, విశ్వాసం చాలా ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్నాయి. -
India-ASEAN Cooperation: మరింత సహకారానికి 12 సూత్రాలు
జకార్తా: 10 దేశాలతో కూడిన ఆసియాన్ కూటమి, భారత్ మధ్య మరింత సహకారానికి 12 సూత్రాల ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ తెరమీదకు తెచ్చారు. కనెక్టివిటీ మొదలు వర్తకం, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దాకా పలు అంశాల్లో పరస్పర సహకారం పెంపునకు ఎంతగానో అవకాశాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. కరోనా అనంతరం మరింత క్రమశిక్షణతో కూడిన ప్రపంచం కోసం పాటుపడదామని పిలుపునిచ్చారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో గురువారం ఆసియాన్ –భారత్ వార్షిక శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి మోదీ మాట్లాడారు. మల్టీ మోడల్ కనెక్టివిటీ, ఆగ్నేయాసియా, పశి్చమాసియా, యూరప్‌లతో భారత్‌ను అనుసంధానిస్తూ ఆర్థిక కారిడార్ తదితరాలను ప్రస్తావించారు. శాంతి, ప్రగతి, పరస్పర వృద్ధే లక్ష్యంగా ఆసియాన్ –భారత్ భాగస్వామ్య కార్యాచరణను పటిష్టంగా ప్రణాళిక అమలు చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. సముద్ర వర్తకంలో పరస్పర సహకారాన్ని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలని పేర్కొన్నాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో నిరంతర కనెక్టివిటీ, బ్లూ ఎకానమీ, ఆహార భద్రత మొదలుకుని అంతరిక్షం దాకా అన్ని రంగాల్లోనూ భారత కృషికి, ప్రయత్నాలకు ఆసియాన్ పూర్తి మద్దతుంటుందని ప్రకటన పేర్కొంది. అలాగే పరస్పర వర్తకం, పెట్టుబడుల ద్వారా ఆహార భద్రత, పౌష్టికాహారం తదితర రంగాల్లో సహకారాన్ని మరింతగా పటిష్టపరచుకోవాలని మరో సంయుక్త ప్రకటనలో నిర్ణయించాయి. ఉగ్రవాదం, దానికి నిధులు తదితరాల మీద ఉమ్మడి పోరు జరపాలని నిర్ణయించారు. మరింత స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ దిశగా ప్రగతి సాధనలో కలిసి రావాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. సదస్సుకు సహాధ్యక్ష హోదాలో ఆయన మాట్లాడారు. ‘21వ శతాబ్దం ఆసియాకు సొంతం. ఇది మన శతాబ్దం’’ అని పేర్కొన్నారు. ఆ ప్రతిపాదనల్లో కొన్ని... ► కనెక్టివిటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, వర్తకం, ఆహార భద్రత నుంచి బ్లూ ఎకానమీ దాకా వంటి పలు రంగాల్లో మరింత సహకారం ► ఉగ్రవాదం, దాని ఆర్థిక మూలాల మీద ఉమ్మడి పోరు ► దక్షిణాది ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను అంతర్జాతీయ వేదికల మీద లేవనెత్తడం ► ఆసియాన్–భారత్ డిజిటల్ ఫ్యూచర్ నిధి ► ఆసియాన్, ఈస్ట్ ఏషియా ఆర్థిక, పరిశోధన సంస్థ ( ఉఖఐఅ) పునరుద్ధరణ, దానికి మరింత మద్దతు ► భారత్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌లో భాగం కావాలంటూ ఆహా్వనం ► విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాల కల్పన యత్నాల్లో భాగస్వామ్యం ► జన్ ఔషధీ కేంద్రాల ద్వారా పేదలకు అందుబాటు ధరల్లో మందులు అందించడంలో భారత అనుభవాన్ని అందిపుచ్చుకోవడం ► ఆసియాన్–భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలును నిరీ్ణత కాలావధిలో సమీక్షించుకోవడం 30 ఏళ్ల బంధం ► వ్యూహాత్మక భాగస్వామ్య కూటమి ఏర్పాటు దిశగా ఆసియాన్– భారత్ చర్చలు 1992 నుంచే మొదలయ్యాయి. ► 1995 కల్లా పూర్తిస్థాయి రూపు సంతరించుకున్నాయి. ► 2002 నాటికి శిఖరాగ్ర సదస్సు స్థాయి భాగస్వామ్యంగా రూపుదాల్చాయి. ► ఆసియాన్ సభ్య దేశాలతో కొన్నేళ్లుగా భారత సంబంధాలు ఊపు మీదున్నాయి. రక్షణ, భద్రత, పెట్టుబడులు, వర్తకం తదితర రంగాల్లో సహకారం పెరుగుతూ వస్తోంది. ఆ పది దేశాలు... ► ఆసియాన్ కూటమి పది దేశాల సమాహారం. అంతర్జాతీయంగా శక్తిమంతమైన కూటముల్లో ఇదొకటి. దాని సభ్య దేశాలు... ► ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా. ► ఆసియాన్ కూటమిలో చర్చా భాగస్వాములుగా భారత్, అమెరికా, చైనా, జపాన్, ఆ్రస్టేలియా వంటి దేశాలున్నాయి. -
నాడు కుక్క మాంసంపై నిషేధం.. నేడు ఎత్తివేత.. మధ్యలో ఏం జరిగింది?
రాష్ట్రంలో కుక్క మాంసం అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విధిస్తూ నాగాలాండ్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ను గౌహతి హైకోర్టు ఆమధ్య రద్దు చేసింది. హైకోర్టు సింగిల్ బెంచ్.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2011పై ఈ సందర్భంగా పలు ప్రశ్నలు లేవనెత్తింది. కుక్క మాంసం అమ్మకాల నిషేధం వెనుక.. నాగాలాండ్ ప్రభుత్వం2020, జూలై 4న కుక్క మాంసాన్ని నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేశారు. కుక్క మాంసం కొనుగోళ్లు, అమ్మకాలను నిషేధించారు. నోటిఫికేషన్లో తెలిపిన వివరాల ప్రకారం వాణిజ్య, రెస్టారెంట్లు వంటి ప్రదేశాలలో కూడా కుక్క మాంసం అమ్మకాలను నిషేధించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ 2014 సర్క్యులర్‌ను అనుసరించి నాగాలాండ్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్, 2011లో పేర్కొన్న జంతువులు మినగా ఇతర జాతుల జంతువులను వధించడాన్ని నిషేధించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్, 2011లోని రూల్ 2.5.1(a)లోని వివరాల ప్రకారం గొర్రెలు, మేకలు, పందులు,పౌల్ట్రీ, చేపలను ఆహారంగా భావించి, వాటిని వధించేందుకు అనుమతి కల్పించారు. ‘ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’ హైకోర్టులో జస్టిస్ మార్లీ వాన్‌కుంగ్ సింగిల్ జడ్జి ధర్మాసనం కేసును విచారిస్తూ ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రణ- 2011లో కుక్క పేరు చేర్చకపోవడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఎందుకంటే ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కుక్క మాంసం కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో దాని పేరును జాబితాలో చేర్చకపోవడం ఊహకు అతీతమేమీ కాదని వివరించింది. కుక్క మాంసం అంటే ఎంతో ఇష్టం నాగా ప్రాంతాల్లో నేటికీ కుక్క మాంసాన్ని ఇష్టంగా తింటున్నారని, ఇది శతాబ్దాలుగా కొనసాగుతోందని హైకోర్టు పేర్కొంది. ది అంగామి నాగాస్, ది ఏఓ నాగాస్ ది రెంగ్మా నాగాస్ తదితర పుస్తకాలు, వివిధ పత్రాలను పరిశీలిస్తే నాగాలాండ్‌లోని వివిధ గిరిజన సమూహాలలో కుక్క మాంసం వినియోగం శతాబ్దాలుగా వస్తున్నదని హైకోర్టు పేర్కొంది. ‘కుక్కలను హింసిస్తున్నారు’ విచారణ సందర్భంగా యానిమల్స్ అండ్ హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్/ఇండియా తరఫు న్యాయవాది తన వాదనలో కుక్కలను స్మగ్లింగ్ చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నదన్నారు. కుక్కల కాళ్లకు తాడు కట్టి, దాని నోటికి కూడా తాడు కట్టి గోనె సంచిలో వేస్తారని పేర్కొన్నారు. వీటికి రోజుల తరబడి ఆహారం, నీరు ఇవ్వరని ఆరోపించారు. ఇది జంతువుల పట్ల క్రూరత్వం ప్రదర్శించడం కిందకు వస్తుందన్నారు. అయితే తాము కుక్క మాంసంపై నిషేధం విధించడాన్ని సమర్థించలేదని హైకోర్టు ముందు విన్నవించారు. దీనిపై స్పందించిన కోర్టు జంతువులపై క్రూరత్వానికి సంబంధించిన కేసుల్లో ఐపీసీని ఆశ్రయించవచ్చని తెలిపింది. ఇది కూడా చదవండి: బజరంగ్ దళ్ ఎప్పుడు, ఎలా ఆవిర్భవించింది? కాంగ్రెస్‌తో దీనికి కనెక్షన్ ఏమిటి? -
విదేశాల్లో ‘రూపీ ట్రేడింగ్’.. బ్యాంకులకు త్వరలో ఆర్బీఐ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: ఇతర దేశాలతో రూపాయిలో వాణిజ్య లావాదేవీలను నిర్వహించేటప్పుడు ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల పరిష్కారం కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) త్వరలో బ్యాంకులకు మార్గదర్శకాలను జారీ చేయనుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రూపాయి ట్రేడింగ్ మెకానిజం విషయానికొస్తే, కొన్ని అంశాలకు సంబంధించి మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని, అయితే వీటిలో చాలా వరకూ పరిష్కారమయ్యాయని తెలిపారు. పరిష్కారం కాని అంశాల్లో ఎలక్ట్రానిక్ బ్యాంక్ రియలైజేషన్ సర్టిఫికేట్ (ఈ–బీఆర్‌ఈ) ఒకటని తెలిపారు. ఈ సమస్య పరిష్కా రంపై ఆర్బీఐ ప్రస్తుతం దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. కాగా, యూరో లేదా దిర్హామ్ లేదా యువాన్ లేదా డాలర్లో చెల్లింపు చేయడానికి ఎటువంటి అడ్డంకి లేదని కూడా అధికారి ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఇతర భాగస్వామ్య దేశాలతో రూపాయి వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. -
ముంబైలో దారుణం..అందరూ చూస్తుండగా కత్తితో దాడి చేసి..
ముంబై: ముంబైలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఒక సముహం ఒక వ్యక్తి కారుని ఢీ కొట్టి, అతనిపై కత్తితో దాడి చేశారు. దీంతో ఆప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సమీపంలోని సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఆ వీడియోలో ఒక పిక్ అప్ వ్యాన్ మరో వాహనాన్ని ఢీ కొట్టినట్లు కనిపించింది. ఆ తర్వాత ఒక గుంపు వాహనంలోని ఓ వ్యక్తిని బయటకు లాగి కత్తితో పదేపదే దాడి చేసి గాల్లో కత్తిని ఊపుతూ.. అక్కడ ఉన్న వారందర్నీ భయబ్రాంతులకు గురి చేశారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. గాయపడిన వ్యక్తిని ఎవరూ కాపడే ప్రయత్నం చేయనీయకుండా ఆ దుండగులు గాల్లో కాల్పులు జరిపినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం దాడికి గురైన వ్యక్తిని హర్జిత్‌సింగ్‌గా గుర్తించారు పోలీసులు. నిందితులు దాడి అనంతరం ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కత్తిని, ఆ కారుని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివాదం పంది మాంస వ్యాపారంతో ముడిపడి ఉండవచ్చని అన్నారు. వారంతా పందిమాంస వ్యాపారులని చెప్పారు. ఐతే అదే వాహనంలోని ఇతర వ్యక్తులపై దుండగు దాడి జరగనట్లు సీసీటీవీ విజ్యువల్స్ చూపిస్తున్నాయని చెప్పారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: షాకింగ్ వీడియో: ఆడుకుంటూ బావిలో పడ్డ బాలుడు.. మూడు నిమిషాల్లోనే!) -
రష్యాతో ’రూపాయి’ట్రేడింగ్, ఇక పెత్తనం అంతా ఎస్బీఐదే!
న్యూఢిల్లీ: రష్యాతో రూపాయి మారకంలో వాణిజ్య నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐని అధీకృత బ్యాంకుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎ. శక్తివేల్ తెలిపారు. త్వరలో రష్యా కూడా తమ దేశం తరఫున అధీకృత బ్యాంకును ఎంపిక చేసి, 15 రోజుల్లోగా ప్రకటించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఈ విషయాలు చెప్పినట్లు శక్తివేల్ వివరించారు. ఎగుమతి, దిగుమతి లావాదేవీలను దేశీ కరెన్సీ మారకంలో నిర్వహించేందుకు అదనంగా ఏర్పాట్లు చేయాలంటూ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రష్యా–భారత్ మధ్య సింహభాగం వాణిజ్యం డాలర్ మారకంలో కాకుండా రూపాయి మారకంలోనే జరుగుతోంది. ఉక్రెయిన్ మీద దాడులకు తెగబడినందుకు గాను రష్యాపై అమెరికా, యూరప్ ఆంక్షలు విధించడమే ఇందుకు కారణం. -
ఆస్ట్రేలియాలో భారత్ ఐటీ సంస్థల పన్ను భారంపై దృష్టి
న్యూఢిల్లీ: భారత్– ఆస్ట్రేలియాల వాణిజ్య మంత్రుల మధ్య వచ్చే నెలలో జరిగే కీలక సమావేశంలో భారతీయ ఐటీ కంపెనీలు ఎదుర్కొంటున్న పన్ను సమస్యలను లేవనెత్తనున్నట్లు ఇక్కడ అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. నిజానికి రెండు దేశాలూ 1991లో డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (డీటీఏఏ)పై సంతకం చేశాయి. 2013లో ఈ ఒప్పందంలో కాలానుగుణ మార్పులూ జరిగాయి. కాగా, ఆస్ట్రేలియాలో సాంకేతిక సేవలను అందించే భారతీయ సంస్థల ఆఫ్‌షోర్ ఆదాయంపై పన్ను విధింపును కూడా డీటీఏఏ కిందకు తీసుకురావాలన్న డిమాండ్ ఉంది. ఈ పన్ను విధింపును నిలిపివేయడానికి డీటీఏఏ కింద నిబంధనలను త్వరగా సవరించాలని ఆస్ట్రేలియాను భారత్ కోరుతోంది. ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్ ఫారెల్ సెప్టెంబరు చివర్లో జాయింట్ మినిస్టీరియల్ కమిషన్ సమావేశంలో పాల్గొనడానికిగాను భారతదేశాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా భారత్ డీటీఏఏ నిబంధనల సమస్యను లేవనెత్తుతుందని అధికారి తెలిపారు. -
NITI Aayog governing council: జీఎస్టీ వసూళ్లు పెరగాలి
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో భారత్ స్వయంసమృద్ధంగా మారడంతో పాటు ప్రపంచ సారథిగా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇందుకు సాగు, పశుపోషణ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను ఆధునీకరించాల్సిన అవసరముందన్నారు. దిగుమతులను బాగా తగ్గించుకుని ఎగుమతులను ఇతోధికంగా పెంచుకోవాలని ఆకాంక్షించారు. ఇందుకోసం ట్రేడ్ (వాణిజ్యం), టూరిజం (పర్యాటకం), టెక్నాలజీ అనే మూడు ‘టి’లపై మరింతగా దృష్టి సారించాల్సిందిగా రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. నీతి ఆయోగ్ పాలక మండలి ఏడో సమావేశం ఆదివారం ఢిల్లీలో మోదీ సారథ్యంలో జరిగింది. 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు తదితరులు భేటీలో పాల్గొన్నారు. గత రెండేళ్లలో ఇది నీతి ఆయోగ్ తొలి భౌతిక సమావేశం. కరోనా కారణంగా 2021లో భేటీ వర్చువల్‌గా జరిగింది. 4 కీలకాంశాలను పాలక మండలి లోతుగా చర్చించింది. పంట వైవిధ్యం, తృణధాన్యాలు, నూనె గింజలు తదితర వ్యవసాయ దిగుబడుల్లో స్వయంసమృద్ధి, పాఠశాల, ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం అమలు, పట్టణ పాలన విషయంలో చేపట్టాల్సిన చర్యలపై సభ్యులంతా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నీతి ఆయోగ్ భేటీని బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కరోనా నుంచి కోలుకుంటున్న బిహార్ సీఎం నితీశ్‌కుమార్ సమావేశానికి రాలేదు. రాష్ట్రానికో జీ20 టీమ్ నీతీ ఆయోగ్ పాలక మండలి ఏడో భేటీని జాతీయ ప్రాథమ్యాలను గుర్తించేందుకు కేంద్ర రాష్టాల మధ్య నెలల తరబడి జరిగిన లోతైన మేధోమథనం, సంప్రదింపులకు ఫలితంగా మోదీ అభివర్ణించారు. పలు అంశాల్లో కేంద్ర రాష్ట్రాల నడుమ సహాయ సహకారాలు మరింతగా పెరగాల్సిన అవసరముందన్నారు. భేటీలో చర్చించిన అంశాలు వచ్చే పాతికేళ్లలో జాతి ప్రాథమ్యాలను నిర్ణయించడంలో కీలకంగా మారతాయని వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లు మెరుగ్గా ఉన్నా అవి భారీగా పెరగాల్సి ఉందదన్నారు. అందుకు అపారమైన అవకాశాలు కూడా ఉన్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని రాష్ట్రాలకు సూచించారు. అప్పుడే ఆర్థికంగా దేశం మరింత బలపడి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదాలుస్తుందన్నారు. వీలైన ప్రతిచోటా స్థానిక వస్తువులనే వాడేలా ప్రజలను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించారు. వోకల్ ఫర్ లోకల్ అన్నది ఏ ఒక్క పార్టీ అజెండానో కాదని, అందరి ఉమ్మడి లక్ష్యమని గుర్తుంచుకోవాలన్నారు. ‘‘శరవేగంగా సాగుతున్న పట్టణీకరణను సమస్యగా కాకుండా దేశానికి గొప్ప బలంగా మలచుకోవాల్సి ఉంది. సేవల్లో పారదర్శకత, పౌరులందరి జీవన ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి’’అన్నారు. కరోనాపై పోరాటంలో ప్రతి రాష్ట్రమూ చురుకైన పాత్ర పోషించిందని కొనియాడారు. తద్వారా ఇవాళ వర్ధమాన దేశాలు స్ఫూర్తి కోసం భారత్‌వైపు చూసే పరిస్థితి ఉందని హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తొలిసారిగా ఒక్కచోటికి వచ్చి జాతీయ ప్రాధాన్యమున్న అంశాలపై మూడు రోజుల పాటు చర్చించడం గొప్ప విషయమన్నారు. సంపన్న, వర్ధమాన దేశాలతో కూడిన జీ20కి 2023లో భారత్ సారథ్యం వహించనుండటాన్ని మోదీ ప్రస్తావించారు. దీన్నుంచి గరిష్టంగా లబ్ధి పొందే మార్గాలను సూచించేందుకు ప్రతి రాష్ట్రమూ ఓ జీ20 టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రాలేమన్నాయంటే... వ్యవసాయ రంగానికి ఆంధ్రప్రదేశ్ అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్రాలపై విధానాలను కేంద్రం బలవంతంగా రుద్దొద్దని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం అమలుకు ఒత్తిడి తేవొద్దన్నారు. రాష్ట్రాల డిమాండ్లకు కేంద్రం మరింత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న ఛత్తీస్‌గఢ్, కేరళ, రాజస్తాన్ సీఎంలు కోరారు. జార్ఖండ్‌లో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం హేమంత్ సోరెన్ కోరారు. వ్యవసాయ, విద్యా రంగాల్లో మహారాష్ట్రకు కేంద్రం మరింత దన్నుగా నిలవాలని సీఎం ఏక్నాథ్ షిండే విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టాలు చేయడాన్ని మానుకోవాలని కేరళ సీఎం పినరాయి విజయన్ డిమాండ్ చేశారు. రాజ్యాంగం తాలూకు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పోవొద్దన్నారు. విపత్తుల నిర్వహణకు ఒడిశాకు మరిన్ని నిధులు కేటాయించాలని సీఎం నవీన్ పట్నాయక్ కోరారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టపరమైన హామీ ఇవ్వాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ డిమాండ్ చేశారు. రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలు, వాటి ఆందోళనలు, అవి ఎదుర్కొంటున్న సవాళ్లు తదితరాలను నీతీ ఆయోగ్ లోతుగా అధ్యయనం చేస్తుందని మోదీ ప్రకటించారు. చిన్న అణు విద్యుత్కేంద్రాలు మేలు ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు పాతబడుతున్న థర్మల్ విద్యుత్కేంద్రాల స్థానంలో చిన్న మాడ్యులర్ రియాక్టర్ల (ఎస్ఎంఆర్)ను ఏర్పాటు చేసుకోవడంపై కేంద్రం దృష్టి సారించాలని నీతీ ఆయోగ్ సభ్యుడు, శాస్త్రవేత్త వీకే సారస్వత్ సూచించారు. అణు విద్యుత్కేంద్రాల స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఎస్ఎంఆర్లు 300 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన అధునాతన అణు రియాక్టర్లు. ప్రస్తుతం దేశంలో 6,780 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 22 అణు రియాక్టర్లు పని చేస్తున్నాయి. జాతీయ విద్యా విధానం కింద టీచర్ల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను, అభ్యసన ఫలితాలను మెరుగు పరిచేందుకు చేపట్టిన చర్యలను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. కరోనా అనంతర పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రగతికి కేంద్రం, రాష్ట్రాలు కలసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం మరింతగా ఉందని నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్సుమన్ బెరీ అన్నారు. కేంద్ర విధానాలను రుద్దొద్దు: రాష్ట్రాలు వ్యవసాయ రంగానికి ఆంధ్రప్రదేశ్ అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్రాలపై విధానాలను కేంద్రం బలవంతంగా రుద్దొద్దని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం అమలుకు ఒత్తిడి తేవొద్దన్నారు. రాష్ట్రాల డిమాండ్లకు కేంద్రం మరింత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న ఛత్తీస్‌గఢ్, కేరళ, రాజస్తాన్ సీఎంలు కోరారు. జార్ఖండ్‌లో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం హేమంత్ సోరెన్ కోరారు. వ్యవసాయ, విద్యా రంగాల్లో మహారాష్ట్రకు కేంద్రం మరింత దన్నుగా నిలవాలని సీఎం ఏక్నాథ్ షిండే విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టాలు చేయడాన్ని మానుకోవాలని కేరళ సీఎం పినరాయి విజయన్ డిమాండ్ చేశారు. విపత్తుల నిర్వహణకు ఒడిశాకు మరిన్ని నిధులు కేటాయించాలని సీఎం నవీన్ పట్నాయక్ కోరారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టపరమైన హామీ ఇవ్వాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ డిమాండ్ చేశారు. రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలు, వాటి ఆందోళనలు, అవి ఎదుర్కొంటున్న సవాళ్లు తదితరాలను నీతీ ఆయోగ్ లోతుగా అధ్యయనం చేస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. -
బలమైన, ఐక్య ఆసియాన్
న్యూఢిల్లీ: అర్ధవంతమైన, దృఢమైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా కృషి చేయాలని ఆసియాన్, భారత్ నిర్ణయించాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వాణిజ్యం, ప్రాంతీయ భద్రతకు సంబంధించి తలెత్తిన ఇబ్బందుల పరిష్కారానికి అన్వేషించాలని అంగీకరించాయి. గురువారం ఢిల్లీలో జరిగిన ఆసియాన్ విదేశాంగ మంత్రుల భేటీలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రారంభోపన్యాసం చేశారు. యుద్ధం ప్రభావం ఆహారం, ఇంధన భద్రత, వినియోగవస్తువులు, ఎరువుల ధరల పెరుగుదలతోపాటు రవాణా, సరఫరా గొలుసుపై పడిందన్నారు. వాణిజ్యం, అనుసంధానత, రక్షణ, టీకా ఉత్పత్తి, ఇంధనం వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని భారత్– ఆసియాన్ తీర్మానించాయి. ఆసియాన్–భారత్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ (ఏఐటీఐజీఏ)పై సమీక్ష జరపాలని నిర్ణయించాయి. 10 దేశాలతో కూడిన ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య(ఆసియాన్)తో సంబంధాలకు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఈ సమావేశానికి సింగపూర్, బ్రూనై, ఇండోనేసియా, కాంబోడియా, మలేసియా, వియత్నాం దేశాల విదేశాంగ మంత్రులు వారు ప్రధాని మోదీతోనూ సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. ఏడీపీని విస్తరించాలి: మోదీ న్యూఢిల్లీ: ఆకాంక్ష జిల్లాల పథకం(ఏడీపీ)ను బ్లాకులు, నగరాల్లో కూడా అమలు చేయాలని ప్రధాని మోదీ కోరారు. అవి స్ఫూర్తిదాయ జిల్లాలుగా మారాలని ఆకాంక్షించారు. ‘‘దేశ వ్యాప్తంగా 112 వెనకబడ్డ జిల్లాల్లో కేంద్రం 2018 నుంచి అమలు చేస్తున్న ఈ పథకం ఎంతో విజయవంతమైంది’’ అన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరుగుతున్న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల భేటీలో ప్రధాని గురువారం మాట్లాడారు. టీచర్లు డిజిటల్ టెక్నాలజీ, మొబైల్ యాప్‌లతో విద్యాబోధనను బలోపేతం చేయాలన్నారు. రిటైర్డ్ టీచర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఉపాధ్యాయ శిక్షణ కోసం ప్రత్యేకంగా టీవీ చానల్ అవసరం ఉందని చెప్పారు. -
భారత్–ఆస్ట్రేలియా బంధం విద్యార్థులకు వరం
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాల పటిష్టత విద్యార్థులకు పెద్ద ఎత్తున అవకాశాలను కల్పించనుందని వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాతో ప్రస్తుత, భవిష్యత్ భారత్ సంబంధాల్లో విద్య ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుందని ఆయన అన్నారు. ‘‘రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు విస్తరిస్తున్నందున, విద్యార్థులకు అవకాశాలు కూడా సహజంగా పెరుగుతాయి. మేము ఈ దిశలో ప్రత్యేకంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాము’’ అని న్యూ సౌత్ వేల్స్ (ఎన్ఎస్డబ్ల్యూ) విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన అన్నారు. భారత్‌కు చెందిన దాదాపు లక్ష మంది ఆస్ట్రేలియా వెళ్లి విద్యను అభ్యసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి విద్యార్థులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం క్లుప్తంగా... విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి విద్యలో భారతదేశం–ఆస్ట్రేలియా భాగస్వామ్యాన్ని మరింత ఉన్నతికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇందుకు వీలుగా భారత్‌లో న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం కార్యకలాపాలను విస్తరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సేవల రంగాన్ని రెండు దేశాలూ పరస్పరం విస్తరించుకోవాలని కోరుకుంటు న్నాము. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల మరింత బలపడుతున్నాయి. స్టార్టప్‌లలో కూడా వ్యాపారాన్ని విస్తరింపజేస్తున్నందున, మీ అందరి (ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థులు) సహకారం మరింత అవసరం అవుతుంది. విద్యార్థులకు అవకాశాలు మరింత పెరుగుతాయి. భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య విద్య వారధిగా పనిచేస్తుంది. విద్య ఎల్లప్పుడూ రెండు దేశాల భాగస్వామ్యంలో ముఖ్యమైన అంశం. కోవిడ్ అనంతర ప్రపంచంలో, మనం వృద్ధికి సంబంధించి అధునాతన విధానాలను అన్వేషించాలి. ఇందులో భాగంగా ఎన్ఎస్డబ్ల్యూ భారత్‌లో తన కార్యకలాపాలను పెంచాలి. ఉపాధికీ అవకాశాలు: ఆస్ట్రేలియన్ మంత్రి టెహాన్ ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియన్ వాణిజ్య మంత్రి డాన్ టెహన్ మాట్లాడుతూ, ఆస్ట్రేలియాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఇక్కడ పని చేసే విషయంలో కొంత తర్జన భర్జనలు పడుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇలాంటి సందేహాలకు తావు లేదని ఆయన అన్నారు. ‘‘రెండు దేశాల మధ్య ఒప్పందంలో భాగంగా, మేము ఒక కీలక నిర్ణయం తీసుకున్నాము. ఒక విద్యార్థి ఎస్టీఈఎం (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం) డిగ్రీ తీసుకున్నట్లయితే అలాగే డిగ్రీలో భాగంగా ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో పని చేస్తున్నట్లయితే అప్పుడు ఆ విద్యార్థి అదనపు పోస్ట్ స్టడీ వర్క్ వీసా పొందుతాడు. అలా సంబంధిత విద్యార్థి ఇక్కడే ఉండగలడు. పని చేయగలడు. ఎక్కువ కాలమూ తన సేవలను అందించగలడు’’ అని ఆయన అన్నారు. ఆస్ట్రేలియాలో విద్య ఉపాధి అవకాశాలను అంది స్తుందని తాము ఖచ్చితంగా చెప్పగలమని పేర్కొన్నారు. అలాగే రాబోయే ఆరు నెలల్లో, భారత్ విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న దానికంటే చాలా ఎక్కువ అవకాశాలు లభిస్తాయని తాము ఆశిస్తున్నామనీ ఆయన అన్నారు. ఆస్ట్రేలియాలో ఫైనాన్స్ అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ చదువుతున్న ముష్కాన్ అనే భారతీయ విద్యార్థిని అంతకుముందు ఒక ప్రశ్న అడుగుతూ, ‘‘నేను ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినప్పుడల్లా (ఇక్కడ), మీరు ఆస్ట్రేలియన్ పౌరుడు లేదా ఆస్ట్రేలియన్ టీఆర్ (తాత్కాలిక నివాసి) అయి ఉండాలనే నిబంధన ఎప్పుడూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో నేను సంబంధిత ఉద్యోగాలకు దరఖాస్తు చేయలేకపోతున్నాను. ఇది నిజంగా నిరుత్సాహపరుస్తుంది’’అని అన్నారు. అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుందని మంత్రులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ద్వైపాక్షిక వాణిజ్యం... సంబంధాల వారధి భారత్–ఆస్ట్రేలియాల మధ్య వాణిజ్య సంబంధాల పురోగతి వల్ల విద్య, సాంస్కృతిక వంటి ఇతర అన్ని రంగాల మధ్య భాగస్వామ్యం మరింత పటిష్టమవుతుందని బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా సిడ్నీలో నిర్వహించిన బిజినెస్ లీడర్స్ మీటింగ్‌ను ఉద్దేశించి గోయల్ అన్నారు. ‘‘వివిధ రంగాలకు సంబంధించి మీరు (ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలు) మీ సాంకేతికతలను భారత్‌కు తీసుకోవచ్చు. భారత్‌లో ఈ టెక్నాలజీని విస్తరించవచ్చు. ఆస్ట్రేలియా అద్భుతమైన ఆవిష్కరణలను, ప్రయోగ ఫలితాలను.. పరిశోధనా సంస్థలు లేదా విశ్వవిద్యాలయాల నుండి భారతదేశం వంటి పెద్ద మార్కెట్‌కు తీసుకెళ్లవచ్చు. ఆయా అంశాలకు సంబంధించి భారతీయులు ప్రదర్శించే ప్రతిభ, నైపుణ్యాలను మీరూ ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ నేను భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియాను ప్రస్తావించదలచాను. మేక్ ఇన్ ఇండియా అనేది భారతదేశ పురోగతి కోసమే ఉద్దేశించినది కాదు. ఈ ప్రయోజనం ప్రపంచ దేశాలకూ అందాలన్నది మా సంకల్పం’’ అని గోయల్ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పంద ప్రయోజనం గణనీయంగా పొందడానికి భారతదేశం ప్రత్యేకంగా ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయాన్ని ప్రారంభిస్తుందని తెలిపారు. అలాగే కొన్ని నెలల్లో ఆస్ట్రేలియాలో ట్రేడ్ ప్రమోషన్ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తుందని గోయల్ సూచించారు. భారత్‌లో పెట్టుబడులు పెడితే, మెరుగైన రాబడులు వస్తాయని మంత్రి పేర్కొన్నారు. 27.5 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక స్నేహం భారత్–ఆస్ట్రేలియా ద్వైపాక్షిక వాణిజ్యా న్ని ప్రస్తుతం 27.5 బిలియన్ డాలర్లు. ఈ పరిమాణాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు పెంచుకోవడంపై రెండు దేశాలూ దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా ఈ నెల రెండవతేదీన రెండు దేశాలు ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందాన్ని (స్వేచ్ఛా వాణిజ్యం) కుదుర్చుకున్నాయి. దీని కింద ఇరు దేశాలు 85–96 శాతం ఉత్పత్తుల దిగుమతులపై టారిఫ్‌లు ఎత్తివేయనున్నాయి. విద్య, పరిశోధన, స్టార్టప్‌లు, అగ్రి టెక్ విభాగాల్లో సహకారాన్ని పెంచుకునేందుకు అవకాశాలున్నట్టు రెండు దేశాలూ భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఈ నెల 4న భారత్ వాణిజ్య మంత్రి గోయల్ మూడు రోజుల కీలక పర్యటన ప్రారంభమైంది. వ్యూహాత్మక భద్రతా చర్చలకు సంబంధించి (చైనా ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా అని కొందరు విశ్లేషి స్తారు) నాలుగు దేశాల క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ (క్యూఎస్డీ– కొన్నిసార్లు క్యూ యూఏడీ అని కూడా పిలుస్తారు) సభ్య దేశా ల్లో భారత్–ఆస్ట్రేలియాలు కూడా ఉన్నాయి. వీటితోపాటు జపాన్, అమెరికాలకు క్వాడ్‌లో సభ్యత్వం ఉంది. క్వాడ్‌లో సభ్యదేశమైనప్ప టికీ, అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గకుండా భారత్ రష్యాకు మద్దతు నిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. అదే సమయంలో ఆస్ట్రేలియాతో కీలక స్వేచ్ఛా వాణిజ్యానికి తెరతీయడం గమనార్హం. -
వాణిజ్య ఖిల్లా ‘పశ్చిమ’
సాక్షిప్రతినిధి, ఏలూరు: అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ లక్ష్యంగా ఏర్పడిన నూతన పశ్చిమగోదావరి జిల్లా వాణిజ్య ఖిల్లాగా అవతరించింది. డెల్టా, గోదావరి, సముద్ర తీర ప్రాంతాలతో ఆవిష్కృతమైంది. జిల్లాగా ఏర్పడిన నరసాపురం పార్లమెంటరీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఐదు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ ఉన్నాయి. రెండు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటుచేశారు. ఆక్వా ఉత్పత్తులు, విదేశీ ఎగుమతులు, వాణిజ్య, విద్యాసంస్థలు కలబోతగా భీమవరం కేంద్రంగా జిల్లా అవతరించింది. ఆధ్యాత్మిక సౌరభం, రాజకీయ చైతన్యంతో విరాజిల్లనుంది. ఆక్వాహబ్‌గా పేర్గాంచి.. ప్రధానంగా 1.80 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగుతో భీమవరం ఆక్వాహబ్‌గా మారింది. ఆక్వా చెరువులు, పరిశ్రమలు, ప్రాసెసింగ్, సీడ్ యూనిట్లు జిల్లాలో ఉన్నాయి. ఇక్కడి నుంచి అమెరికా, చైనా, మలేషియా, ఆస్ట్రేలియా, సింగపూర్, శ్రీలంకతో పాటు యూరప్ దేశాలకు నిత్యం ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. రెండో బార్డోలి: స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంలో భీమవరానికి ప్రత్యేక స్థానం ఉంది. రెండో బార్డోలిగా పేర్గాంచింది. ఆధ్యాత్మిక సౌరభం: పాలకొల్లు, భీమవరంలో పంచారామక్షేత్రాలు, భీమవరంలో మావుళ్లమ్మవారి ఆలయం, పెనుగొండలో వాసవీ మాత ఆలయం, నరసాపురంలో ఆదికేశవ ఎంబేరుమన్నార్ కోవెలతో జిల్లా ఆధ్యాత్మికంగా విలసిల్లుతోంది. కళలకు ప్రసిద్ధి: పాలకొల్లు, నరసాపురం, భీమవరం ప్రాంతాలు కళలకు ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రాంతానికి చెందిన ఎందరో రంగస్థల, సినీ నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులుగా వెలుగొందుతున్నారు. రాజకీయ చైతన్యం: నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం రాజకీయంగా కీలకం. ఇక్కడి నుంచి పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. చారిత్రక నేపథ్యం: నరసాపురం ప్రాంతానికి చారిత్రక నేపథ్యం ఉంది. మొగల్తూరు రాజులు మొగల్తూరు కేంద్రంగా కృష్ణా జిల్లా వరకూ పాలన సాగించారు. డచ్, బ్రిటిషర్లు ఇక్కడ స్థావరాలు ఏర్పాటుచేసుకున్నారు. 300 ఏళ్ల క్రితం డచ్ వారు నిర్మించిన వైఎన్ కళాశాల పరిపాలనా భవనం చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. లేసు, వాణిజ్య ఉత్పత్తులు: ఐర్లాండ్ దేశస్తులు పరిచయం చేసిన లేసు అల్లికల పరిశ్రమ ఈ ప్రాంతంలో ఉంది. మొగల్తూరు మామిడి, మోళ్లపర్రు ఎండుచేపలు, పాలకొల్లు కొబ్బరి, నరసాపురం బంగారం వ్యాపారం, తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్, ఆయిల్ విక్రయాలకు పేర్గాంచింది. ఇస్రో ఇంధన తయారీ: అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగాల్లో అవసరమైన ఇంధనాన్ని తణుకు కేంద్రంగా ఉత్పత్తి చేస్తున్నారు. 1988 నుంచి ఆంధ్రా సుగర్స్ అనుబంధ సంస్థలో తయారైన ఇంధనాన్ని ఇస్రో ఉపయోగిస్తోంది. విద్యా నిలయం: జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఏపీ నిట్, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీలు ఉన్నాయి. భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం కేంద్రంగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. -
కీలక చట్టంపై బైడెన్ సంతకం.. చైనాకు చుక్కలే!
Joe Biden Signed Uyghurs Rights Protection Bill To Check China Atrocities: కీలకంగా భావించిన ఉయిగర్ చట్టంపై ఎట్టకేలకు అగ్రరాజ్యం అధినేత రాజముద్ర పడింది. చైనాను ఇరకాటంలో పడేసే ‘ఉయిగుర్ ఫోర్స్డ్ లేబర్ ప్రివెన్షన్ యాక్ట్’(బలవంతపు కార్మిక నిరోధక చట్టం) మీద గురువారం అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. అనంతరం ఆయన ట్విటర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ద్వైపాక్షిక ఒప్పందం మీద సంతకం చేశా. కేవలం షిన్జియాంగ్ మాత్రమే కాదు.. చైనాలోని మిగతా ప్రాంతాలకు కూడా ఇది వర్తిస్తుంది. చైనా ప్రతీ మూల నుంచి వచ్చేవి బలవంతపు చాకిరీ ఉత్పత్తులు కావని నిర్ధారించుకునేందుకు మా వద్ద (అమెరికా ప్రభుత్వం) ఉన్న ప్రతీ సాధనాన్ని ఉపయోగించుకుంటాం’’ అంటూ ఉయిగర్ల చట్టాన్ని బలంగా అమలు చేసే ఉద్దేశాన్ని అధ్యక్షుడు జో బైడెన్ ట్విటర్ వేదికగా వినిపించారు. Today, I signed the bipartisan Uyghur Forced Labor Prevention Act. The United States will continue to use every tool at our disposal to ensure supply chains are free from the use of forced labor — including from Xinjiang and other parts of China. pic.twitter.com/kd4fk2CvmJ — President Biden (@POTUS) December 23, 2021 ఇదిలా ఉంటే చైనా పశ్చిమ ప్రాంతంలో పదిలక్షల మైనార్టీ వర్గపు జనాభాపై మానవ హక్కుల ఉల్లంఘన జరగుతోందని, వెట్టిచాకిరీ చేయించుకుంటోందని చైనా మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అయితే ఈ వ్యవహారంలో చైనా మీద మొదటి నుంచే కొరడా ఝళిపిస్తోంది. ఈ క్రమంలో షిన్జియాంగ్ నుంచి తమ దేశానికి అన్ని దిగుమతులను నిషేధిస్తూ ఓ బిల్లు తీసుకొచ్చింది. బిల్లుకు సెనేట్ గత గురువారమే ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేయగా.. చివరి పేరాలో అభ్యంతరాల మేరకు మరో వారం ఆమోద ముద్ర వాయిదాపడింది. దీంతో ఆ అభ్యంతరాలపై క్లియరెన్స్ అనంతరం.. గురువారం (డిసెంబర్ 23న) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేయడంతో చట్టం అమలులోకి వచ్చింది. Uyghur Forced Labor Prevention Act ప్రకారం.. బలవంతపు చాకిరీ లేకుండానే తయారుచేశామని నిరూపించగలిగిన ఉత్పత్తులను మాత్రమే ఇకపై అమెరికా చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇది నిరూపించుకోవాలంటే షిన్జియాంగ్ ప్రావిన్స్‌లోకి అమెరికా ప్రతినిధుల్ని, అంతర్జాతీయ జర్నలిస్టులు తప్పనిసరిగా అనుమతించాల్సి ఉంటుంది. అదే జరిగితే అక్కడ జరిగే అకృత్యాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇలా వర్తకవాణిజ్యాన్ని ముడిపెట్టి.. చైనా బండారం బయటపెట్టాలన్నదే బైడెన్ ప్రభుత్వం వేసిన స్కెచ్. ఇక్కడో కొసమెరుపు ఏంటంటే.. కేవలం షిన్జియాంగ్ను మాత్రమే తొలుత చట్టంలో చేర్చిన అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్).. ఆపై మిగతా ప్రావిన్స్‌లకు సైతం ఈ చట్టాన్ని అన్వయింపజేయడం. ఇదిలా ఉంటే వర్తకవాణిజ్యాల పరంగా అమెరికాకు వచ్చే వీలైనన్నీ దారులను చైనాకు మూసేస్తోంది బైడెన్ ప్రభుత్వం. బొమ్మలపై విషపు రసాయనాల పూత ఉంటోందని ఆరోపిస్తూ.. మేడ్ ఇన్ చైనా బొమ్మలను అమెరికాలో అడుగు పెట్టనివ్వట్లేదు. ఇక ఉయిగర్లపై జరుగుతున్న అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ.. ఆ దేశ బయోటెక్, నిఘా కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు.. ఇలా ఒక్కోదానిపై ఆంక్షలు విధిస్తూ పోతోంది. ఇక అమెరికా వైపు నుంచి కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతులు పొందకుండా.. చైనాకు ఎలాంటి ఉత్పత్తులను విక్రయించడానికి వీల్లేదని ఆదేశాలు అమలు చేస్తోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా.. అమెరికాతో వర్తకం ద్వారా భారీ ఆదాయం వెనకేసుకుంటోంది. అయితే కరోనా పరిణామాల అనంతరం ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం బెడిసికొడుతోంది. ఈ క్రమంలో చైనాను దూరం పెడుతూ.. క్రమంగా భారత్ సహా ఇతర ఆసియా దేశాలకు దగ్గర అవుతోంది అమెరికా. సంబంధిత వార్త: డ్రాగన్‌కు దెబ్బలు.. షిన్జియాంగ్ మీదే ఫోకస్ -
పాక్‌తో వాణిజ్య చర్చలు వృథా.. సిద్ధూ వ్యాఖ్యలపై విమర్శలు
లుధియానా: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆ పార్టీ ఎంపీ మనీష్ తివారీ విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్‌తో వాణిజ్య సంబంధాలు పెంచుకోవటం వల్ల ఇరు దేశాల స్నేహబంధం పెరుగుతుందన్న సిద్ధూ వ్యాఖ్యలను ఖండించారు. భారత్‌పై.. పొరుగు దేశం పెంచుకుంటున్న వ్యతిరేకత ఆగేవరకు పాక్‌తో వాణిజ్య చర్చలు జరపడం వ్యర్థమని స్పష్టం చేశారు. చదవండి: మొదటి వారం రాజ్యసభ సమావేశాలు.. 52 శాతం సమయం వృథా పాకిస్తాన్ ఇండియాలోకి ఉగ్రవాదులను పంపుతోందని మండిపడ్డారు. మారణాయుధాలు, డ్రగ్స్‌ను పాక్ తమ డ్రోన్ల ద్వారా భారత భూభాగంలో చేరవేస్తోందని అన్నారు. ఇలాంటి చర్యలు ఆగేవరకు పాక్‌తో వాణిజ్య చర్చలు జరపడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. కరాచీ సరిహద్దు తెరిచి ఉంటే.. వ్యాపారం కోసం అట్టారీ సరిహద్దును ఎందుకు తెరవలేరని సిద్ధూ ప్రశ్నించిన విషయం తెలిసిందే. -
అమెరికాకు మామిడి ఎగుమతులు
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య ఎగుమతి, దిగుమతుల పరిధిలోకి మరిన్ని ఉత్పత్తులను చేర్చడంపై భారత్, అమెరికా దృష్టి సారించాయి. ఈ ప్రయత్నాలు ఫలవంతమైతే భారత్ నుంచి అమెరికాకు మామిడి, దానిమ్మ ఎగుమతి చేయడానికి, అక్కడి నుంచి చెర్రీ పళ్లను దిగుమతి చేసుకోవడానికి వీలు కానుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై కసరత్తు చేయాలని మంగళవారం జరిగిన భేటీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అమెరికా ట్రేడ్ రిప్రెజెంటేటివ్ (యూఎస్టీఆర్) కేథరిన్ టై అంగీకరించారు. అలాగే ఇతరత్రా వాణిజ్యాంశాలను కూడా వారు చర్చించారు. నాలుగేళ్లలో తొలిసారిగా జరిగిన భారత్–అమెరికా ట్రేడ్ పాలసీ ఫోరం (టీపీఎఫ్) 12వ మంత్రుల స్థాయి సమావేశానికి వారు సహ–సారథ్యం వహించారు. మామిడి, దానిమ్మ పళ్ల ఎగుమతులకు తోడ్పడేందుకు అవసరమైన చర్యలను అమెరికా తీసుకోనున్నట్లు, అలాగే అక్కడి నుంచి చెర్రీలు, పశువుల ఆహారం ఆల్ఫాఆల్ఫా ఎండుగడ్డిని దిగుమతి చేసుకునేందుకు కావాల్సిన సర్టిఫికేషన్ ప్రక్రియను భారత్ ఖరారు చేయనున్నట్లు ఇరు వర్గాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. 2007 నుంచి అమెరికాకు భారత మామిడి ఎగుమతులు పుంజుకోగా.. కరోనాతో రెండేళ్లుగా నిల్చిపోయాయి. ఈసారి 100 బిలియన్ డాలర్ల వాణిజ్యం.. ఈ ఏడాది రెండు దేశాల మధ్య వర్తక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు చేరగలదని గోయల్, కేథరిన్ అభిప్రాయపడ్డారు. వాణిజ్యపరంగా అడ్డంకులను తొలగించేందుకు మరిన్ని అంశాలపై కలిసి పనిచేయాలని తీర్మానించారు. అటు, దేశీ ఎగుమతిదారులకు ప్రాధాన్య హోదా (జీఎస్పీ) ప్రయోజనాలను పునరుద్ధరించాలని సమావేశం సందర్భంగా అమెరికాను భారత్ కోరింది. దీన్ని పరిశీలిస్తామంటూ అమెరికా హామీ ఇచ్చింది. అలాగే వివిధ ఉత్పత్తులపై టారిఫ్‌ల తగ్గింపు అవకాశాలపై ఇరు పక్షాలు చర్చించాయి. -
China vs India: కుదురుగా ఉంటే ఓకే.. లేదంటే సీన్ మారిపోద్ది
భారత్, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం క్రమంగా ఇతర రంగాలకు విస్తరిస్తోంది. చైనా ఒంటెద్దు పోకడలను వీడకపోవడంతో ఇండియా సైతం ధీటుగా బదులిచ్చేందుకు రెడీ అవుతోంది. అవి ఉండాల్సిందే తాజాగా విదేశాంగ కార్యదర్శి హర్షవర్థన్ శ్రింగ్లా చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. గురువారం జరిగిన లీవరేజింగ్ చైనాస్ ఎకనామి అనే సదస్సులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకయితే చైనాతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు బాగానే ఉన్నాయని. గతేడాదితో పోల్చితే ఇరు దేశాల మధ్య వాణిజ్యం 49 శాతం పెరిగింది కూడా ఆయన తెలిపారు. అయితే ఇక ముందు వాణిజ్య సంబంధాలు ఇలాగే ఉంటాయనేందుకు గ్యారెంటీ లేదన్నారు శ్రింగ్లా. 1988 నుంచి భారత్ , చైనాల మధ్య సంబంధాలు సానుకూల పథంలోనే నడుస్తున్నాయి. ఈ సంబంధాలు ఇలాగే కొనసాగాలంటే ఇరు దేశాల మధ్య శాంతి, సామరస్యపూర్వక వాతావరణం ఉండాలని తేల్చి చెప్పారు. మాదారి మేం చూసుకుంటాం ‘భారత్, చైనా మధ్య జరుగుతున్న వ్యాపారంలో ఎక్కువ శాతం చైనాలో ఉత్పత్తి అయిన వస్తువులు ఇండియాకు దిగుమతి అవుతున్నాయి. దీని వల్ల చైనాకే ఎక్కువ లబ్ధి జరుగుతోంది. దీన్ని సరి చేయాలనే లక్ష్యంతోనే ఆత్మ నిర్భర్ భారత్‌ను అమలు చేస్తున్నాం. దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యం పెంచుతున్నాం. త్వరలోనే స్వయం సమృద్ధి సాధించడంతో పాటు ఎగుమతులు కూడా చేస్తాం’ అంటూ హర్షవర్థన్ అన్నారు. Our relations generally followed positive trajectory since 1988 when we reestablished contacts at highest level.Advancement of ties in this period was clearly predicated on ensuring that peace&tranquillity weren't disturbed: Foreign Secy at Seminar on "Leveraging China's Economy" pic.twitter.com/nZTtrGJomn — ANI (@ANI) October 21, 2021 Even as we continue to pursue these issues with China, we also need to do work at home. That is why, Atmanirbhar Bharat – an India with greater capabilities not just helping itself but being a force for good in the international arena, becomes important: Foreign Secretary pic.twitter.com/6P3Nw7hsi8 — ANI (@ANI) October 21, 2021 బుద్ది మార్చుకోని డ్రాగన్ గతేడాది కోవిడ్ సంక్షోభానికి తోడు తూర్పు లదాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. దీంతో పలు చైనా బేస్డ్ యాప్‌లను కేంద్రం నిషేధించింది. ఐనప్పటికీ ఇరు దేశాల మధ్య 88 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. ఈ ఏడాది కేవలం 9 నెలల్లోనే ఇరు దేశాల మధ్య వ్యాపార లావాదేవీల విలువ 91 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుడుపడుతున్నాయని భావించే లోగానే ఇటు లాదాఖ్లో గల్వాన్ , అటు అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్లోయలో చైనా ఆగడాలు శృతి మించుతున్నాయి. మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. గట్టిగానే విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్థన్ తాజా వ్యాఖ్యలతో దేశ రక్షణ, శాంతి భద్రతల తర్వాతే వాణిజ్యమని ఇండియా స్పష్టం చేసినట్టయ్యింది. అంతేకాదు చైనాతో వాణిజ్యం విషయంలో ఇండియా పునరాలోచనలో పడిందనే సంకేతాలను విదేశాంగ కార్యదర్శి హర్షవర్థన్ ఇచ్చినట్టయ్యింది. చదవండి :చైనాలో భారీ కార్పొరేట్ పతనం తప్పదా? -
విజయవాడలో నేడు, రేపు వాణిజ్య ఉత్సవం
-
Vijayawada: నేడు, రేపు వాణిజ్య ఉత్సవం - 2021
సాక్షి, కృష్ణా: రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ‘వాణిజ్య ఉత్సవం-2021’ నేడు(మంగళవారం) విజయవాడలో వైభవంగా ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 10:30 గంటలకు ప్రారంభించనున్నారు. కాగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల రెట్టింపు దిశగా చర్యలు చేపట్టనున్నారు. ఈ రోజు ప్రారంభం కానున్న వాణిజ్య ఉత్సవం బుధవారం కూడా కొనసాగుతుంది. ఏపీ నుంచి అత్యంత చౌకగా ఎగుమతుల లక్ష్యంగా ఈడీబీ ప్రణాళికలు చేస్తుంది. ప్రస్తుతం ఏపీ నుంచి 4 ఓడరేవుల ద్వారా ఎగుమతులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా ఏపీ నుంచి 16.8 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. 2030 నాటికి 33.7 బిలియన్ డాలర్ల ఎగుమతులే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. చదవండి: ఎగుమతులకు ప్రత్యేక ప్రణాళిక -
రేపు వాణిజ్యోత్సవాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విజయవాడలో రేపు, ఎల్లుండి(మంగళ,బుధ) ‘వాణిజ్య ఉత్సవం-2021’ నిర్వహించనున్నారు. వాణిజ్యోత్సవాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు ఎగుమతుల సదస్సు ప్రారంభం కానుంది. ఉదయం 11.15 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను సీఎం జగన్ వివరించనున్నారు. (చదవండి: వన్‌టైం సెటిల్మెంట్ పథకం అమలుకు సీఎం జగన్ ఆదేశం) వాణిజ్యోత్సవానికి మంత్రులు, అధికారులు హాజరవుతారని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఏపీ నుంచి అత్యంత చౌకగా ఎగుమతులు చేసుకునే అవకాశాలను ఎగుమతుదారులను వివరించే విధంగా ప్రణాళికలను ఏపీ ఈడీబీ సిద్ధం చేసింది. ప్రసుత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు ఓడరేవుల ద్వారా 16.8 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు అవుతున్నాయి. 2030 నాటికి 33.7 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో ఏపీ ముందడుగు వేస్తోంది. ఏపీ ఎగుమతులకు ఉన్న అవకాశాలను రెండు రోజుల సదస్సులో జాతీయ, అంతర్జాతీయ ఎగుమతిదారులకు వివరించే అవకాశం ఉంది. చదవండి: ఈ ఫలితాలు నా బాధ్యతను మరింత పెంచాయి: సీఎం జగన్ -
ఎగుమతుల రెట్టింపే లక్ష్యం.. వాణిజ్య ఉత్సవం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. విజయవాడలో మంగళ, బుధవారాల్లో (21, 22 తేదీల్లో) నిర్వహిస్తున్న ‘వాణిజ్య ఉత్సవ్’ను ఇందుకు వేదికగా వినియోగించుకుంటోంది. రాష్ట్రం నుంచి అత్యంత చౌకగా ఎగుమతులు చేసుకునే అవకాశాలను ఎగుమతుదారులకు వివరించే విధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీ ఈడీబీ) ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి నాలుగు ఓడ రేవుల ద్వారా 16.8 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరగ్గా వీటిని 2030 నాటికి 33.7 బిలియన్ డాలర్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ ఈడీబీ సీఈవో జె.వి.ఎన్.సుబ్రమణ్యం తెలిపారు. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో ఎగుమతులకు ఉన్న అవకాశాలు, లాజిస్టిక్, ఎంతచౌకగా ఎగుమతులు చేయగలమన్న వివరాలను ఈ రెండు రోజుల సదస్సులో జాతీయ, అంతర్జాతీయ ఎగుమతిదారులకు వివరించనున్నారు. 2020–21లో 159 ఎంఎంటీల సరుకు రవాణా ప్రస్తుతం మన రాష్ట్రంలోని పోర్టులకు 253.89 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీల) సరుకు రవాణా సామర్థ్యం ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విశాఖ పోర్టుకు 127 ఎంఎంటీల సామర్థ్యం ఉంది. రాష్ట్రానికి చెందిన గంగవరం పోర్టు 64 ఎంఎంటీలు, కాకినాడ పోర్టు 18 ఎంఎంటీలు, కృష్ణపట్నం పోర్టు 45 ఎంఎంటీల సామర్థ్యంతో ఉన్నాయి. 2020–21లో రాష్ట్రంలోని పోర్టుల ద్వారా 159 ఎంఎంటీల సరుకును రవాణా చేయడం ద్వారా దేశంలో రెండో స్థానంలో నిలిచింది. గుజరాత్ రాష్ట్రం 412 ఎంఎంటీల సరుకు రవాణాతో మొదటి స్థానంలో ఉంది. కొత్తగా రాష్ట్రంలో నిర్మిస్తున్న నాలుగు పోర్టులు అందుబాటులోకి వస్తే సరుకు రవాణా నిర్వహణ సామర్థ్యం 450 మిలియన్ టన్నులకు చేరనుంది. రాష్ట్రంలో నిర్వహణ వ్యయం చాలా తక్కువ రాష్ట్రానికి వచ్చిన ఓడ అత్యంత తక్కువ సమయంలో సరుకును దిగుమతి, ఎగుమతి చేసుకుని వెళ్లే అవకాశం ఉండటంతో ఎగుమతిదారులకు వ్యయం చాలా తగ్గుతోంది. రాష్ట్ర పోర్టులైన గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల టర్న్ ఎరౌండ్ సమయం (సరుకు దింపి నింపుకొని వెళ్లే సమయం) 1.5 రోజులు. విశాఖ పోర్టు టర్న్ ఎరౌండ్ సమయం 2.51 రోజులు. దేశంలో ఇంత తక్కువ టర్న్ ఎరౌండ్ మన రాష్ట్రంలోనే ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నాలుగు పోర్టుల్లో 39 బెర్తులున్నాయి. వీటిలో 57 శాతం బల్క్ కార్గో నిర్వహించేవి కావడం కూడా తక్కువ టర్న్ ఎరౌండ్‌కు ఒక కారణం. దీనికితోడు ఎగుమతులు, దిగుమతులకు అవసరమైన లాజిస్టిక్స్ ఉండటం కూడా కలిసి వస్తోంది. రాష్ట్రంలో 13.38 లక్షల టన్నుల సరుకును నిల్వ చేసుకునే విధంగా 109 గిడ్డంగులు అందుబాటులో ఉన్నాయి. 104 కోల్డ్ స్టోరేజీలు, 3 ఇన్లాండ్ కంటైనర్ డిపోలు (ఐసీడీ), 15 కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు ఉన్నాయి. సరుకు రవాణా వ్యయం మరింత తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం లాజిస్టిక్ పాలసీ ద్వారా ఈ రంగంలో కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తోంది. -
తాలిబన్ల ఎఫెక్ట్.. భారత్‌కు ఇక భారీ దెబ్బే!
తాలిబన్ల దురాక్రమణతో అఫ్గనిస్తాన్‌లో నెలకొన్న సంక్షోభం.. అంతర్జాతీయంగా అన్ని రంగాల్లో అన్ని విధాల ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతోంది. ముఖ్యంగా భారత్‌తో వర్తక వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశం ఉందని ఇదివరకే వర్తకవ్యాపార విశ్లేషకులు తేల్చేశారు. అయితే ఈ నష్టం వాళ్లు ఊహించిన దానికంటే భారీగానే ఉండబోతోందని ఇప్పుడు ఒక అంచనాకి వస్తున్నారు. అఫ్గన్ నుంచి భారత్‌కు రావాల్సిన ఉత్పత్తులు రోడ్డు మార్గంలో పాకిస్థాన్ మీదుగా వస్తుంటాయి. ప్రస్తుతం తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో ఎక్కడి కార్యకలాపాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో భారత వర్తకులకు భారీ నష్టం వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటికి తోడు ఇప్పటికే పూర్తైన చెల్లింపులను సైతం నిలిపివేయడంతో వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఇవేం తక్షణ పరిణామాలు కావని, నెలన్నర నుంచే ముందు నుంచే నడుస్తున్నా ప్రభుత్వం అప్రమత్తం చేయలేదని వ్యాపారులు వాపోతున్నారు. ఇప్పటికే చాలావరకు ఉత్పత్తుల దిగుమతి ఆగిపోగా, మధ్యవర్తులతో సంబంధాలూ తెగిపోయాయని, వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందాలు రద్దు అయినట్లు చాలామంది చెబుతున్నారని కొందరు చెబుతున్నారు. మరికొందరు తమకు రావాల్సిన ట్రక్కులు నిలిచిపోవడంతో.. ఇంక వేచిచూడడమే మార్గంగా భావిస్తున్నారు. ‘వర్తక వ్యాపారాలు నిరాటంకంగా కొనసాగుతాయని తాలిబన్లు హామీ ఇస్తున్నారు. కానీ, అంతకు ముందు పూర్తి ఆర్థిక వ్యవస్థను సమీక్షించాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. కాబట్టి, వర్తక వ్యాపారాల క్లియరెన్స్‌కు ఎంత సమయం పడుతుందనేది కచ్చితంగా చెప్పలేం. కానీ, భారత్ నుంచి వెళ్లే గూడ్స్ నార్త్-సౌత్ ట్రేడ్ కారిడార్ మార్గంలో లేదంటే దుబాయ్ నుంచి అక్కడికి చేరుకునే అవకాశాలు మాత్రం ఉన్నాయి. చాబహర్ పోర్ట్ నుంచి ముంబైకి రవాణా కొనసాగే ఛాన్స్ ఉంది. కానీ, అన్నింటి కంటే ముందు తాలిబన్ల అనుమతులు అవసరం పడొచ్చు’ - ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ సీఈవో, డైరెక్టర్ జనరల్ అజయ్ షా హాట్ న్యూస్: అఫ్గన్ పరిణామాలు.. తాలిబన్లు తెచ్చిన తంటాలు దిగుమతులు ఇవే పాక్(48 శాతం) తర్వాత అఫ్గన్ నుంచి ఎక్కువ దిగుమతులు చేసుకునే దేశంగా భారత్(19) ఉంది. ఆ తర్వాతి ప్లేసులో రష్యా, ఇరాన్, ఇరాక్, టర్కీలు ఉన్నాయి. 2020-2021కిగానూ భారత్-అఫ్గన్ల మధ్య ద్వైపాక్షిక్ష వాణిజ్య ఒప్పందాల విలువ 1.4 బిలియన్ డాలర్లుగా ఉంది(2019-20తో పోలిస్తే తక్కువే). ఇందులో భారత్ దిగుమతుల విలువ 826 మిలియన్ డాలర్లు, ఎండు ద్రాక్ష, వాల్నట్, ఆల్మండ్, అంజీర్, పైన్, పిస్తా, ఎండు ఆప్రికాట్ బిజినెస్ కోట్లలో నడుస్తుంది. వీటితో పాటు తాజా ఆప్రికాట్, చెర్రీ, వాటర్ మిలన్, మూలికలు తదితరాలను దిగుమతి చేసుకుంటాయి. ఎగుమతుల మీదా.. దిగుమతుల మీదే కాదు.. అఫ్గన్‌కు భారత్ నుంచి ఎగుమతి అయ్యే వర్తకం మీదా ప్రతికూల ప్రభావం పడనుంది. భారత్ నుంచి సుమారు 509 మిలియన్ డాలర్ల విలువ చేసే వర్తకంపై తీవ్ర ప్రభావం పడింది. టీ, కాఫీ, మిరియాలు, కాటన్, బొమ్మలు, చెప్పులు, ఇతరతత్రా ఉత్పత్తుల ఎగుమతులు ఎక్కడికక్కడే నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అయితే వ్యాపారుల్లో నెలకొన్న ఆర్థిక భయాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని సీఏఐటీ కార్యదర్శి ప్రవీణ్ ఖండెల్వాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అఫ్గన్ జీడీపీపై ప్రభావం వ్యవసాయం, పశు పోషణ అఫ్గన్ల జీవనాధారంగా. తొలినాళ్లలో వ్యక్తిగత సాగు, వలస పశు పోషణ మీదే వాళ్లు ఎక్కువగా దృష్టి సారిస్తూ.. విదేశాలకు ఎగుమతిపైనా తక్కువగా దృష్టిపెట్టేవాళ్లు. అయితే తర్వాతి కాలంలో ఎగుమతుల మీద ఆసక్తి మొదలుపెట్టారు. డ్రైడ్ ఫ్రూట్స్, నట్స్, కార్పెట్స్, ఉన్ని ఎగుమతులు సాగాయి. ఇక విదేశాల నుంచి వాహనాలను, పెట్రోలియం ప్రొడక్టులను, చక్కెర, దుస్తులు, ప్రాసెస్ట్ యానిమల్-వెజిటెబుల్ ఆయిల్, టీను దిగుమతి చేసుకుంటాయి. ఇక ఎగుమతులే అఫ్గన్ ఆర్థిక వ్యవస్థలో 20 శాతం జీడీపీని శాసిస్తున్నాయి. -
శ్రీవారి దర్శనం టికెట్లతో వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు: టీటీడీ
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనం టికెట్లతో వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన చెన్నైకి రేవతి పద్మావతి ట్రావెల్స్‌పై కేసు నమోదైంది. రేవతి పద్మావతి ట్రావెల్స్ సంస్థపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. దళారులను నమ్మి మోసపోవద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
జొమాటో రికార్డ్ ... ఒక్క రోజులో లక్ష కోట్లు
ముంబై: మార్కెట్ లో జొమాటో కొనుగోళ్ల విందు చేసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజీ (ఎన్ఎస్ఈ)లో 53 శాతం ప్రీమియంతో ఒక్కో షేరు ధర రూ.116గా లిస్ట్ అయింది. లిస్ట్ అయిన కొద్దిసేపటికే షేర్ ధర 62 శాతం పెరిగింది. ఒకానొక దశలో రూ.138ని తాకింది. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్ల మార్కును టచ్ చేసినట్టయింది. మార్కెట్ ముగిసే సమయానికి రూ, 126 దగ్గర ట్రేడ్ అవుతోంది. సెక్సెక్స్ 50 బాంబే స్టాక్ ఎక్స్ చేంజీ (బీఎస్ఈ)లో 51 శాతం ప్రీమియంతో రూ.115గా లిస్ట్ లో చేరింది. ఈ కంపెనీ షేర్ వాస్తవ ఐపీవో ధర రూ.76. అయితే, 50 శాతం అదనపు ధరతో లిస్ట్ కావడం విశేషం. 2020 తర్వాత 50 శాతం అదనపు ప్రీమియంతో లిస్ట్ అయిన 10 కంపెనీల జాబితాలో జొమాటో చేరింది. బీఎస్ఈలో అత్యధిక విలువ కలిగిన 50 సంస్థల సరసన చేరింది. అదే జోరులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలనూ వెనక్కి నెట్టింది. సానుకూల ధోరణి వల్లే ప్రస్తుతం మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతుండటం జోమాటోకు కలిసివచ్చిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. సంస్థ విలువను ఎక్కువ చేసి చూపుతున్నారన్న విమర్శలు ఐపీవో లిస్టింగ్ పై పెద్దగా ప్రభావం చూపలేదు. లాభాలు మరీ ఎక్కువగా లేకపోయినప్పటికీ.. పెట్టుబడుల్లో స్థిరత్వమే జొమాటో విషయంలో సానుకూల ధోరణికి కారణమై ఉంటుందని విళ్లేషకులు అంటున్నారు. -
స్వల్ప లాభాలతో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 56 పాయింట్ల లాభంతో 53,215 వద్ద.. నిఫ్టీ 23 పాయింట్లు లాభపడి 15,947 వద్ద కొనసాగుతున్నాయి.ప్రస్తుతం ఐటీసీ,ఏసియన్ పెయింట్స్, రిలయన్స్, సన్ ఫార్మా, ఎయిర్టెల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఐటీ కంపెనీలు క్యూ 1 ఫలితాలను ప్రకటిస్తుండడంతో టెక్ లాభాల బాట పట్టాయి. బ్యాంకింగ్, ఆటో మొబైల్ స్టాక్ సైతం లాభాల బాట పట్టాయి. -
సినిమాటోగ్రఫీ చట్టం సవరణ ప్రతిపాదనలకు నిరసన
ముంబై: సినిమాటోగ్రఫీ చట్ట సవరణలకు సంబంధించి ఒక వినతిపత్రాన్ని ఆరు ట్రేడ్ ఫిల్మ్ అసోసియేషన్స్ శుక్రవారం ప్రభుత్వానికి సమర్పించాయి. సినిమాటోగ్రఫీ చట్ట సవరణల బిల్లు–2021 ముసాయిదాపై ప్రజలు స్పందించాలని కోరుతూ ప్రభుత్వం జూన్ 18న ప్రకటన జారీ చేసింది. సినిమా పైరసీని నేరంగా పరిగణిస్తూ జైలుశిక్షతో పాటు జరిమానా విధించడం, సర్టిఫికేషన్‌కు కాల వ్యవధి, సర్టిఫికెట్ పొందిన సినిమాపై ఫిర్యాదులొస్తే మళ్లీ సర్టిఫికేషన్(రీసర్టిఫికేషన్) జరిపేందుకు కేంద్రానికి అధికారం.. తదితర ప్రతిపాదనలను ఆ ముసాయిదాలో పొందుపర్చారు. రీసర్టిఫికేషన్ ప్రతిపాదనను సినీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది భావప్రకటనా స్వేచ్ఛపై దాడి అంటూ పలువురు సినీ ప్రముఖులు సమాచార, ప్రసార శాఖకు లేఖ రాశారు. -
ఏపీ: ఎగుమతుల్లో 2.7శాతం వృద్ధి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా వాణిజ్య ఎగుమతులు క్షీణించినా.. మన రాష్ట్రం ఎగుమతుల్లో వృద్ధి సాధించింది. దేశ వాణిజ్య ఎగుమతుల్లో గణనీయమైన వాటాను పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం సత్ఫలితాలు అందుకుంటోంది. 2020–21లో దేశవ్యాప్తంగా ఎగుమతులు క్షీణించినప్పటికీ రాష్ట్రం వృద్ధిని నమోదు చేయడంతోపాటు రెండు స్థానాలను మెరుగుపర్చుకుంది. 2020–21లో దేశ వాణిజ్య ఎగుమతులు 7.4 శాతం క్షీణించాయి. అదే సమయంలో రాష్ట్ర ఎగుమతులు 2.71 శాతం వృద్ధి చెందాయి. 2019–20లో 313 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీయ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతం క్షీణించి 290.18 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీనికి భిన్నంగా రాష్ట్రంలో ఎగుమతులు రూ.1,04,828.84 కోట్ల నుంచి రూ.1,07,730.13 కోట్లకు పెరిగాయి. ఈ ఏడాది రాష్ట్ర ఎగుమతుల వృద్ధిలో డ్రగ్ ఫార్ములేషన్స్, స్టీల్–ఐరన్, బంగారు ఆభరణాలు, బియ్యం, రసాయనాలు, ఆటోమొబైల్స్, విద్యుత్ ఉపకరణాలు వంటి రంగాలు కీలకపాత్ర పోషించాయి. మన రాష్ట్ర ఎగుమతులు దేశీయ ఎగుమతుల్లో 5.8 శాతానికి సమానం. దీంతో 2019–20లో దేశీయ ఎగుమతుల్లో 7వ స్థానంలో ఉన్న మన రాష్ట్రం రెండు స్థానాలకు ఎగబాకి 5వ స్థానానికి చేరుకుంది. 21 శాతం వాటాతో గుజరాత్ మొదటిస్థానంలో ఉండగా, తరువాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర (20 శాతం), తమిళనాడు (9 శాతం), ఉత్తరప్రదేశ్ (6 శాతం) ఉన్నాయి. 10 శాతం వాటాపై రాష్ట్రం దృష్టి 2030 నాటికి దేశ ఎగుమతుల్లో 10 శాతం వాటాను చేజిక్కించుకోవడం ద్వారా టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం బ్లూఎకానమీలో భాగంగా సముద్ర ఆధారిత వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా 4 పోర్టులు, 8 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తోంది. ఇందులో 2024 నాటికి కనీసం 2 పోర్టులు, 4 ఫిషింగ్ హార్బర్లను అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ మారిటైమ్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో 15 శాతం వాటాతో సముద్ర ఉత్పత్తులు మొదటి స్థానంలో ఉండగా, ఓడలు, పడవలు తయారీ 8.4 శాతంతో రెండో స్థానంలో ఉన్నాయి. ఐరన్ అండ్ వోర్ (7.4%), డ్రగ్ ఫార్ములేషన్స్ (7.3%), బియ్యం (4.6%), రసాయనాలు (3.6%) ఉన్నాయి. చదవండి: Andhra Pradesh: చెప్పినవే కాదు... చెప్పనివీ చేశాం Andhra Pradesh Government: నాణ్యమైన విద్యకు బాటలు -
మిత్రభేదానికి బైడెన్ విరుగుడేమిటి?
అమెరికా జాతీయ భద్రత సాకుతో గతంలో ట్రంప్ విదేశాల నుంచి వచ్చే విదేశీ ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై భారీ సుంకాలు విధించారు. దాంట్లో కూడా ఆస్ట్రేలియా, మెక్సికో, దక్షిణ కొరియా వంటి మిత్రదేశాలకు సుంకాల పెంపు నుంచి మినహాయించి, ఈయూ, జపాన్‌తో సహా ఇతర దేశాలను పన్నులపెంపు జాబితాలో చేర్చారు. ఇప్పుడు వాణిజ్య ప్రతిష్టంభనను సడలించాలంటే ఆ దేశాలకు కూడా మినహాయింపునివ్వడం లేదా సుంకాల పెంపు చట్టాన్ని రద్దుచేయడం తప్ప జో బైడెన్ ముందు మరో మార్గం లేదు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ వాణిజ్య ఉద్రిక్తతలను సడలించడంలో అమెరికా తన మిత్రదేశాలతో కలిసి పనిచేసేలా విధానాలు రూపొంది స్తానని, అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడేలా చైనాపై ఒత్తిడి పెంచుతానని ఎన్నికల ప్రచార సమయంలో నొక్కి చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థలో అనేక దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా నిలిచిన నేపధ్యంలో నాయకత్వ వివాదాన్ని పరిష్కరించేందుకు తగిన అవకాశం బైడెన్ ముందుంది. తన వాణిజ్య భాగస్వాములపై అధికభారం మోపుతూ ట్రంప్ పాలనాయంత్రాంగం ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై పెంచిన భారీ సుంకాలను కూడా బైడెన్ ఎత్తివేసే అవకాశముంది. వచ్చే ఏడాది ప్రారంభంలో గ్రూప్–20 దేశాల అత్యవసర సమావేశానికి పిలుపునివ్వడం ద్వారా ప్రపంచ ఆర్థిక రంగాన్ని బైడెన్ నియంత్రించవచ్చు. వాతావరణ మార్పు ప్రత్యేక ప్రతినిధిగా మాజీ విదేశీమంత్రి జాన్ కెర్రీని నియమించడం ద్వారా, గతంలో ట్రంప్ కుదుర్చుకున్న కొన్ని అంతర్జాతీయ ఒప్పందాలను రద్దు చేయగలనన్న ఉద్దేశాన్ని ఈ వారం జో బైడెన్ ప్రకటించారు. ఇకపోతే ప్రపంచ వాణిజ్య సంస్థ కొత్త నేత ఎన్నికపై నెలకొన్న ప్రతి ష్టంభనను తొలగించడం బైడెన్ తీసుకునే చర్చల్లో ఒకటి. అనేక దేశాలు సమర్థించిన నైజీరియా మాజీ ఆర్థికమంత్రి, ప్రపంచ బ్యాంక్ మాజీ ఉన్నతాధికారి ఎంగోజి ఒకాన్జో లెవెలా అభ్యర్థిత్వాన్ని ట్రంప్ పాలనాయంత్రాంగం గతంలో వ్యతిరేకించింది. ఒకాం జోకు ప్రపంచ వాణిజ్యంలో తగినంత అనుభవం లేదని ఆరోపిస్తూ ట్రంప్ యంత్రాంగం దక్షిణ కొరియా వాణిజ్య మంత్రి యో మ్యున్గీని బలపర్చింది. వీరిద్దరిలో ఎవరు ఎన్నికైనా ప్రపంచ వాణిజ్య సంస్థకు తొలిసారిగా ఒక మహిళ నాయకత్వం వహించినట్లు అవుతుంది. ఒకాంజో గెలిస్తే ఆఫ్రికా నుంచి డబ్ల్యూటీవోకు ఎంపికైన తొలి నేతగా కూడా చరిత్రకెక్కుతారు. నైజీరియా అభ్యర్థిని ఆమోదించడం ద్వారా బైడెన్ యంత్రాంగం ఈ అంశంపై ఏర్పడిన ప్రతిష్టంభనకు ముగింపు పలకవచ్చు. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల మధ్యవర్తిగా డబ్ల్యూటీవో పాత్రను పునరుద్ధరించే దశగా బైడెన్ తగు చర్యలను తీసుకోవడం ప్రారంభించాలని ఆయన సన్నిహిత బృందం సూచిస్తోంది. డబ్ల్యూటీవోలో న్యాయం లేదని ఆరోపించిన ట్రంప్ ఈ సంస్థ అప్పిలేట్ బాడీకి కొత్త న్యాయమూర్తుల నియామకాన్ని కూడా నిషేధించారు. కాగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో ప్రధానమైనది సుంకాల పెంపు. జాతీయ భద్రత పరిరక్షణ పేరుతో ట్రంప్ ఇతరదేశాలనుంచి దిగుమతి చేసుకునే ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం సుంకాలు విధించారు. జాతీయ రక్షణకు అత్యవసరమైన దేశీయ పరిశ్రమను కాపాడుకునేందుకు ఈ చర్యలు తప్పవని ట్రంప్ చెప్పారు. ట్రంప్ పెంచిన సుంకాలు అమెరికా ఉక్కు తయారీ సంస్థలకు మిశ్రమ ప్రయోజనాలు కల్పిచాయి. అయితే అమెరికా ఉత్పత్తిదారులను ఇవి మరోవిధంగా దెబ్బతీశాయి. ఇతర దేశాలు కూడా అమెరికానుంచి దిగుమతి చేసుకునే ఉక్కు ఉత్పత్తులపై ప్రతీకార చర్యలతో అధిక పన్నులు విధించడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఆస్ట్రేలియా, మెక్సికో, దక్షిణ కొరియా వంటి మిత్రదేశాలకు సుంకాల పెంపునుంచి మినహాయించిన ట్రంప్ ఈయూ, జపాన్‌తో సహా ఇతర దేశాలను పన్నులపెంపు జాబితాలో చేర్చారు. జో బైడెన్ ప్రస్తుతం చేయవలసింది ఏమిటంటే విదేశీ ఉక్కు దిగుమతులపై సుంకాల పెంపును రద్దు చేయడమేనని రాక్ గ్రీక్ గ్లోబల్ అడ్వైజర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ స్మార్ట్ స్పష్టం చేశారు. అదేసమయంలో కొత్త పాలనా యంత్రాంగం వ్యాపారాన్ని ప్రోత్సహించే అధికార యంత్రాంగంతో ఎలా వ్యవహరించాలనే విషయాన్ని మొదటగా నిర్ణయించుకోవాల్సి ఉంది. ఏ వ్యాపార ఒప్పందాన్నైనా ఆమోదించడానికి ముందు దాన్ని కాంగ్రెస్‌కు సమర్పించే అధికారాన్ని వాణిజ్య అధికారులకు కల్పిస్తూ కొత్త చట్టం అవకాశం కల్పించింది. రిపబ్లికన్లు సెనేట్‌పై నియంత్రణను కలిగి ఉన్నందున, భవిష్యత్ వాణిజ్య ఒప్పం దాలలో కార్మికుల, పర్యావరణ రక్షణపై విభేదాలు కొనసాగనున్నాయి. కాబట్టి కొత్త వాణిజ్య అదికార యంత్రాంగాన్ని పునరుద్ధరించడంలో కచ్చితంగా ఘర్షణలు చోటు చేసుకుంటాయి. ఈ వాణిజ్య అధికారుల నియంత్రణ ప్రాతిపదికన ట్రంప్ యంత్రాంగం ప్రారంభించిన యునైటెడ్ కింగ్డమ్తో వాణిజ్య ఒప్పందంపై కూడా బైడెన్ చర్చలు కొనసాగించాల్సి ఉంది. పైగా కరోనా వైరస్ రికవరీపై అంతర్జాతీయ అజెండాను ఏర్పర్చడానికి వచ్చే సంవత్సరం ప్రారంభంలో జీ–20 దేశాల అత్యవసర సదస్సుకు పిలుపునివ్వాల్సిందిగా డెమాక్రాటిక్ పార్టీకి చెందిన పలువురు మాజీ అధికారులు బైడెన్‌ను కోరుతున్నారు. -నికోలస్, సీనియర్ పాత్రికేయులు -
చైనాకు మరో పెద్ద దెబ్బ
టోక్యో : అమెరికా, ఇండియా నుంచి వరుస షాక్ లతో సతమవుతున్న చైనాకు వాణిజ్యపరంగా మరో దెబ్బ పడింది. జపాన్ తయారుదారుల పెట్టుబడులు చైనా నుంచి వెనక్కి తీసుకునేందుకు రంగం సిద్దమవుతోంది. తమ యూనిట్లను చైనానుంచి ఇతర ఆసియా దేశాలకు తరలించే తమ దేశ ఉత్పత్తిదారులకు బ్సిడీలను ఇవ్వాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. జపాన్ తయారీదారులు చైనా నుండి ఉత్పత్తిని భారతదేశం లేదా బంగ్లాదేశ్ కు మార్చినట్లయితే సబ్సిడీలకు అర్హులని ఆర్థిక, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. (చైనాకు ఇస్కాన్ షాక్) జపాన్ వాణిజ్య విస్తరణ కార్యక్రమం ద్వారా దేశ సరఫరాలను నిర్దిష్ట ప్రాంతంపై ఆధారపడటాన్ని తగ్గించాలని, సబ్సిడీ కార్యక్రమం పరిధిని విస్తరించడం ద్వారా వైవిధ్యంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఆగ్నేయాసియా దేశాలకు ఉత్పత్తిని తరలించే సంస్థలకు 2020 ఆర్థిక సంవత్సరానికి జపాన్ అనుబంధ బడ్జెట్ 23.5 బిలియన్ యెన్లను కేటాయించింది. ప్రధానంగా అత్యవసర పరిస్థితులలో కూడా వైద్య సామగ్రి, ఎలక్ట్రానిక్ భాగాల స్థిరమైన సరఫరాను అందించే వ్యవస్థను నిర్మించాలని భావిస్తోంది. జపాన్ నుంచి ప్రామాణిక పెట్టుబడుదారులనుంచి నమ్మకమైన భాగస్వాములకోసం చూస్తున్నామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ గత నెలలో ప్రకటించడం గమనార్హం. జపాన్, భారతదేశం వాణిజ్య వ్యాపార సంబంధాలను విస్తరించడం చాలా ముఖ్యం అని వ్యాఖ్యానించారు. అలాగే దేశీయ తయారీని ప్రోత్సహించడం, ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా 13వ జపాన్ పారిశ్రామిక టౌన్‌షిప్‌ను అస్సాంలో ఏర్పాటు చేయాలని భారత్ యోచిస్తోందని పరిశ్రమ, అంతర్గత వాణిజ్య శాఖ కార్యదర్శి గురుప్రసాద్ మహాపాత్ర ఒక సమావేశంలో తెలిపారు. జపాన్ కంపెనీల సరఫరా గొలుసు చైనాపై ఎక్కువగా ఆధారపడుతుంది. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఇది నిలిచిపోయింది. దీంతో మొదటి దశలో వియత్నాం లావోస్‌లలో హోయా ఎలక్ట్రానిక్ భాగాల ప్రాజెక్టు తయారీ సహా 30 తయారీ సంబంధిత ప్రాజెక్టులను జపాన్ ప్రభుత్వం ఆమోదించింది. మొత్తం10 బిలియన్ యెన్లకు సబ్సిడీలను అందించింది. ఈ క్రమంలోనే తరువాతి ప్రణాళికలను కూడా తయారు చేస్తోంది. -
ఇక ఆ షాపులు స్వచ్ఛంద లాక్డౌన్..
అబిడ్స్/చార్మినార్/రాంగోపాల్‌పేట: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వివిధ వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించేందుకు నిర్ణయించాయి. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లోని షాపులను మూసివేయనున్నట్లు ప్రకటించాయి. హైదరాబాద్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ గురువారం సమావేశమై బేగంబజార్ మార్కెట్‌ను ఈ నెల 28 నుంచి జూలై 5వ తేదీ వరకు పూర్తిగా మూసేయాలని నిర్ణయించింది. గత కొన్నిరోజులుగా బేగంబజార్, అఫ్జల్‌గంజ్, ఫీల్‌ఖానా, షాహినాయత్‌గంజ్, మహారాజ్‌గంజ్, ఉస్మాన్‌గంజ్ మార్కెట్లలో పలువురు వ్యాపారులకు కరోనా రావడంతో మిగిలిన వారంతా వణికిపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లోనేకాక రాష్ట్రం నలుమూలల వ్యాపారస్తులంతా బేగంబజార్ నుంచి కిరాణా సామగ్రితో పాటు పప్పులు, ఇతర వస్తువులు హోల్‌సేల్ రేట్లకే కొనుగోలు చేసి విక్రయాలు చేస్తారు. వ్యాపారస్తులకు కరోనా వస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా మొత్తం కిరాణా హోల్‌సేల్ దుకాణాలను మూసేయాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రాఠి తెలిపారు. పాతబస్తీలోని వస్త్ర వ్యాపారులు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటించడానికి నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ ఎత్తేసిన అనంతరం సిటీలో కరోనా వైరస్ ప్రభావం అధికం కావడంతో ఈ నెల 30వ తేదీ వరకు తమ వ్యాపారాలను మూసి ఉంచాలని వస్త్ర వ్యాపారుల సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. ఇందులో భాగంగా గురువారం ఉదయం నుంచి అన్ని రకాల రిటైల్ మార్కెట్లతో పాటు హోల్‌సేల్ వస్త్ర వ్యాపారాలను మూసివేశారు. ఇటు పాతబస్తీలోని లాడ్‌బజార్ కూడా మూతపడనుంది. అక్కడి వ్యాపారులు కూడా వారం రోజుల పాటు స్వచ్ఛందంగా షాపులు మూసేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సికింద్రాబాద్ జనరల్‌బజార్‌లో చీరల వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేశారు. చిత్ర దర్గా నుంచి మహంకాళి స్ట్రీట్ వరకు కొనసాగుతున్న పట్టు, ఫ్యాన్సీ చీరల వ్యాపారులు గురువారం నుంచి జూలై 5 వరకు మూసివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇటు జనరల్‌బజార్‌లోని బంగారు ఆభరణాల దుకాణాలను జూలై 5 వరకు మూసేస్తున్నట్లు సికింద్రాబాద్ గోల్డ్ సిల్వర్ జ్యువెలరీ డైమండ్ మర్చంట్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
చైనా, భారత్ వ్యూహాలు ఏమిటి?
ముంబై: లద్దాఖ్‌లోని గాల్వన్ లోయా వద్ద చైనా దాడిలో భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో వ్యాపార రంగంలో తీవ్ర అలజడి నెలకొంది. మంగళవారం శాంతిని కోరుకుంటున్నట్లు భారత్ ప్రకటించినప్పటికి అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్, టాటా మోటార్స్ లిమిటెడ్ లాంటి కంపెనీలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు సంస్థ ముఖ్య అధికారలు తెలిపారు. ఇలాగే ఉద్రిక్తతలు కొనసాగితే చైనా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులకు ఇబ్బందులు ఏర్పడతాయని, తాము ప్రత్యామ్నాయం చూసుకోక తప్పదని దేశీయ స్టార్ హెల్త్ఇన్సూరెన్స్ ఆఫీసర్ అనీష్ శ్రీవాస్తవ తెలిపారు. ప్రపంచానికే అనేక వస్తువులను దిగుమతి చేస్తున్న చైనా.. ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో సంస్థ వ్యాపార వ్యూహాలు మార్చనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి సంక్షోభాలను దిగ్గజ దేశాలు సమర్థవంతంగా ఎదుర్కోగలవని.. గతంలో భారత్, చైనా యుద్ధం తరువాత ఇరు దేశాలు నిలదొక్కుకున్న విషయాన్ని షాంఘైకి చెందిన ఫండ్ మేనేజర్ దై మింగ్ గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితులతో చైనా తయారీ రంగానికి ఎలాంటి నష్టం లేదని మింగ్ అభిప్రాయపడ్డాడు. కాగా చైనా దిగ్గజం ఆలీబాబా గ్రూప్ డాటా సెంటర్లను భారత్‌లోనే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆలీబాబా గ్రూప్‌కు చెందిన యూసీ బ్రౌసర్ అత్యధిక పేజీ వ్యూస్‌తో దేశీయ ప్రజలను ఆకట్టుకుంటున్నట్లు సంస్థ తెలిపింది. కాగా చైనీస్ బ్రాండ్ షియోమీ స్మార్ట్‌ఫోన్ విభిన్న సిరీస్‌లతో దేశ ప్రజలను ఆకట్టుకుందని సంస్థ పేర్కొంది. యూఎస్‌కు బదులుగా దేశంలోనే పెట్టుబడులు పెట్టడానికి చైనా వైర్లెస్ నెట్వర్క్ దిగ్గజం హువావే టెక్నాలజీస్ 5జీనీ అందించేందుకు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. చైనా కంపెనీల నుండి సోర్సింగ్ పరికరాలను దేశీయ టెలికాం కంపెనీలు నిలిపివేయవచ్చని ఓ ప్రభుత్వ అధికారి అభిపప్రాయపడ్డారు. ప్రైవేటు మొబైల్ ఫోన్ ఆపరేటర్లు ఉపయోగించే పరికరాలు భారత ప్రభుత్వం నిషేధించవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా దేశీయ ఫార్మారంగం(రెడ్డీస్ ల్యాబ్, అరబిందో) కూడా చాలా వరకు ముడిపదార్థాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఫార్మారంగం కొంత ఇబ్బంది ఎదుర్కొవచ్చని ఫార్మా నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితుల్లో పరికరాల కొనుగోలు తదితర అంశాల్లో డిఫెన్స్ రంగం గణనీయ వృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. చదవండి: చైనా సంస్థకు షాక్.. రూ. 470 కోట్ల ప్రాజెక్టు రద్దు -
పారిశ్రామిక, వాణిజ్య వర్గాలకు ఊరట
సాక్షి, అమరావతి: లాక్డౌన్ కాలంలో మూతపడిన పరిశ్రమలు, తెరుచుకోని వాణిజ్య సంస్థలకు విద్యుత్ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. వాస్తవ వినియోగానికి సంబంధించి మీటర్ రీడింగ్ తీసే వరకు పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారుల నుంచి బిల్లుల వసూళ్లను నిలిపివేయాలని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలకు ఉన్నతాధికారులు బుధవారం సంకేతాలు పంపించారు. వాస్తవ రీడింగ్ తీసే వరకూ.. ► లాక్డౌన్ కారణంగా మార్చి 22 నుంచి రాష్ట్రంలో పరిశ్రమలు చాలా వరకూ మూతపడ్డాయి. వాణిజ్య సముదాయాలు, సినిమాహాళ్లు, హోటళ్లు వంటివి కూడా కార్యకలాపాలు నిర్వహించడం లేదు. ► లాక్డౌన్ కారణంగా రీడింగ్ తీసే సిబ్బంది వినియోగదారుల ఇళ్లకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఫిబ్రవరిలో వినియోగించిన యూనిట్ల ఆధారంగా మార్చి నెలకు ఇచ్చిన బిల్లులనే చెల్లించాలని వినియోగదారులకు మెసేజ్‌లు వెళ్లాయి. ► మార్చి నెలలో కొన్ని రోజులు విద్యుత్ వినియోగించ లేదని, అయినా బిల్లులు ఎలా చెల్లిస్తామని పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు అభ్యంతరం లేవనెత్తాయి. ► దీనిపై స్పందించిన ఇంధన శాఖ వాటికి బిల్లులు ఇచ్చినా వాస్తవ రీడింగ్ తీసే వరకూ చెల్లింపుల కోసం ఒత్తిడి తీసుకురావద్దని ఆదేశాలిచ్చింది. ► ఈ నిర్ణయం వల్ల పారిశ్రామిక, వాణిజ్య వర్గాలకు రూ.వెయ్యి కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందని అంచనా. ► ఏప్రిల్‌లో కూడా లాక్డౌన్ కొనసాగుతుంది కాబట్టి ఇదే తరహా మినహాయింపు ఉంటుందని అధికారులు అంటున్నారు. వసూళ్లు నిలిపేశాం విద్యుత్ వాడనప్పుడు బిల్లులు వసూలు చేయడం సరికాదని ఇంధన శాఖ భావించింది. ఈ దృష్ట్యా పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు జారీ అయిన బిల్లుల వసూలుకు ఎలాంటి ఒత్తిడి చేయవద్దని కచ్చితమైన ఆదేశాలిచ్చాం. తదుపరి ఉత్తర్వులు అందే వరకూ డిస్కమ్‌లు ఈ ఆదేశాల్ని పాటిస్తాయి. – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధన శాఖ కార్యదర్శి -
భారత్‌తో వాణిజ్యం.. చైనాను దాటేసిన అమెరికా
న్యూఢిల్లీ: భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో చైనాను వెనక్కి నెట్టేసి అమెరికా మరింత ముందుకు వచ్చేసింది. కేంద్ర వాణిజ్య శాఖ వివరాల ప్రకారం 2018–19లో అమెరికాతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 87.95 బిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందింది. అదే ఏడాది చైనాతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 87.07 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2019–20లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు చూసుకున్నా.. అమెరికా–భారత్ మధ్య 68 బిలియన్ డాలర్ల వాణిజ్య లావాదేవీలు చోటు చేసుకున్నాయి. ఇదే కాలంలో చైనాతో వాణిజ్యం 64.96 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం. అమెరికా– భారత్ తమ వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తుండడంతో, ఇదే పరిస్థితి ఇక ముందూ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అమెరికా–భారత్ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్‌టీఏ) వస్తే అప్పుడు ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని నిపుణులు భావిస్తున్నారు. మనదేశ వస్తు సేవలకు అమెరికా పెద్ద మార్కెట్‌గా ఉన్నందున ఎఫ్‌టీఏ మనకే ఎక్కువ ప్రయోజనకరమని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ పేర్కొన్నారు. 2018–19లో అమెరికాతో మన దేశానికి వాణిజ్య మిగులు 16.85 బిలియన్ డాలర్లుగా ఉండగా, చైనాతో 53.56 బిలియన్ డాలర్ల లోటు ఉండడం గమనార్హం. -
బంగారంపై బాదుడు తగ్గేనా..?
న్యూఢిల్లీ: పసిడిపై ప్రస్తుతం అమల్లో ఉన్న 12.5 శాతం ఇంపోర్ట్ డ్యూటీ (దిగుమతి సుంకం)ని సాధ్యమైనంత మేర తగ్గించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. వచ్చే నెల తొలి వారంలో ప్రవేశపెట్టనున్న 2020–21 కేంద్ర బడ్జెట్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని విన్నవించినట్లు విశ్వసనీయ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. ఇప్పటికే ఈ రేటును 4 శాతానికి తగ్గించాలని దేశీయ రత్నాభరణాల పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే కాగా, పరిశ్రమను ఆదుకోవడం కోసం ఈ తగ్గింపు తప్పనిసరని సూచించినట్లు తెలుస్తోంది. ఈ విన్నపాన్ని ప్రభుత్వం మన్నిస్తే.. సుంకాల కోత మేర బంగారం ధరల్లో తగ్గింపు ఉంటుందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే, భారత్‌లో అధిక శాతం సప్లై దిగుమతుల ద్వారానే కొనసాగుతోంది. ఏడాదికి 800–900 టన్నుల పసిడిని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. ఎందుకింత రేటు..: గతేడాది బడ్జెట్‌కు ముందు బంగారంపై దిగుమతి సుంకం 10 శాతంగా ఉంది. అయితే, విదేశాల నుంచి ఈ కమోడిటీ దిగుమతులు గణనీయంగా పెరిగిపోతూ ఉండడం వల్ల కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) అదుపు తప్పుతోందని, దీనిని కట్టడి చేయడంలో భాగంగా గత బడ్జెట్లో 12.5 శాతానికి పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ పెంపు తరువాత ఫలితాలు కేంద్రం అనుకున్న విధంగా ఉన్నప్పటికీ.. దేశీయ రత్నాభరణాల పరిశ్రమకు మాత్రం తగిన ప్రోత్సాహం లభించలేదు. ఏప్రిల్–నవంబర్ కాలంలో ఈ రంగ ఎగుమతులు 1.5% తగ్గడం ఇందుకు నిదర్శనం. దిగుమతి సుంకాలు అధికంగా ఉన్న కారణంగా పలు కంపెనీలు సరిహద్దు దేశాలకు వెళ్లిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంతటి రేటు ఉండడం సమంజసం కాదని వాణిజ్య శాఖ కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. -
సులభతర వాణిజ్యానికి గ్రేడింగ్!
సాక్షి, హైదరాబాద్: సులభతర వాణిజ్య విధానాల ద్వారా పారిశ్రామికీకరణ, తద్వారా ఉపాధి కల్పనను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ అధీనంలోని పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డిప్) ప్రతీ ఏటా రా ష్ట్రాలకు ర్యాంకులను కేటాయిస్తోంది. సులభతర వాణిజ్య విధానం (ఈఓడీబీ) కోసం ఆయా రాష్ట్రాలు చేపట్టే సంస్కరణల ఆధారంగా.. ప్రపంచ బ్యాంకు సహకారంతో డిప్ ఈ ర్యాంకులను నిర్ణయిస్తోంది. పారిశ్రామిక రంగానికి సంబంధించి 340 అంశాల్లో రాష్ట్రాలు చేపట్టే వాణిజ్య సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (బ్రాప్)ను ప్రాతిపదికగా తీసుకుని ర్యాంకులను ఏటా ప్రకటిస్తున్నారు. అయితే ఈ ర్యాంకింగ్‌ల విధానంపై తెలంగాణ, గుజరాత్ సందేహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఈఓడీబీ ర్యాంకింగ్ విధానాన్ని సమీక్షించిన డిప్.. 2019 నుంచి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ర్యాంకులకు బదులుగా గ్రేడింగ్ విధానం పారిశ్రామికీకరణలో ముందంజలో ఉన్న తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ర్యాంకింగులో వెనుకబడి పోవడం కూడా ఈఓడీబీ ర్యాంకింగ్‌పై సందేహాలకు కార ణమైంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నుంచి మార్కులు కేటాయించే విధానానికి స్వస్తి పలికి.. గ్రేడింగ్ విధానం పాటించాలని డిప్ నిర్ణయించగా, మార్కులకు బదులుగా దశాంశమాన పద్ధతిలో పాయింట్లు కేటాయిస్తోంది. ఒక్కో సంస్కరణకు సంబంధించి కనీసం 75కు పైగా పాయింట్లు వస్తేనే గ్రేడింగ్ సాధ్యమవుతుంది. గతంలో ఇచ్చిన ర్యాంకింగుల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేసిన డిప్.. ఈ ఏడాది పరిశ్రమల శాఖ అందిస్తున్న సేవలను గ్రేడ్ల కేటాయింపులో ప్రాతిపదికగా తీసుకుంటోంది. బడ్జెట్లో ఏటా నిధులు కేటాయిస్తున్నా.. విడుదల కాకపోవడంపై పారిశ్రామికవర్గాలు డిప్ సర్వేలో ప్రతికూలంగా స్పందిం చే అవకాశముంది. ర్యాంకుల స్థానంలో టాప్ అచీవర్ (95 శాతానికి పైగా పాయింట్లు), అచీవర్ (90 నుంచి 95), ఫాస్ట్ మూవర్ (80 నుంచి 90), ఆస్పైరర్స్ (80 కంటే తక్కువ పాయింట్లు) పేరిట డిప్ ఈ ఏడాది ఈఓడీబీ గ్రేడ్లను ప్రకటించనుంది. ఈ ఏడాది గ్రేడింగ్‌పై ప్రభావం ఈ ఏడాది సులభతర వాణిజ్య గ్రేడింగ్‌లో తొలి స్థానం చేరుకునేందుకు అవసరమైన సంస్కరణల అమలుపై తెలంగాణ పరిశ్రమల శాఖ కసరత్తు చేస్తోంది. వివిధ అంశాలకు సంబంధించి చేపట్టిన సంస్కరణలపై.. పారిశ్రామికవర్గాల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఈ ఏడాది ఈఓడీబీ గ్రేడింగ్‌లో కీలకం కానుంది. డిప్ నిర్వహించే సర్వేలో పారిశ్రామిక ప్రోత్సాహకాలు, రాయితీలకు సంబంధిం చిన ప్రతిస్పందన కీలకంగా మారే అవకాశముంది. -
ట్రంప్ బెదిరింపు ధోరణి
మన దేశాన్ని, చైనాను అభివృద్ధి చెందిన దేశాలుగా పరిగణించాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుధవారం డిమాండ్ చేశారు. ఆయన ఇలా అనడం వారం రోజుల వ్యవధిలో రెండోసారి. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలను అడ్డం పెట్టుకుని ఈ రెండు దేశాలూ ‘అభివృద్ధి చెందుతున్న దేశాల’ ముసుగులో అనేక వెసులుబాట్లు పొందుతూ అమెరికాకు నష్టం కలిగిస్తున్నాయన్నది ఆయన ప్రధాన ఆరోపణ. డబ్ల్యూటీఓ లొసుగులతో ఎవరైనా లబ్ధిపొం దాలని చూస్తే ఊరుకోమని ఆయన హెచ్చరిస్తున్నారు. చైనాతో ఆయన వాణిజ్యయుద్ధం మొదలు పెట్టి ఏడాది దాటింది. అది తీవ్ర స్థాయికి చేరుకుని ఈమధ్యే కుదుటపడిన సూచనలు కనిపించి నంతలోనే చైనా ఎగుమతులపై సెప్టెంబర్ మొదటివారంలో 30,000 కోట్ల డాలర్ల మేర సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనడం ఆపేయాలని వెను వెంటనే తమ పబ్లిక్ రంగ సంస్థలకు చైనా సూచించింది. చైనా ప్రకటన వెలువడగానే అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పడిపోయాయి. జరిగిన నష్టాన్ని గ్రహించి సుంకాల పెంపు ఇప్పట్లో ఉండ దని ట్రంప్ ప్రకటించవలసి వచ్చింది. ఇదిగాక ఆ రెండు దేశాల మధ్యా కరెన్సీ తగువు నడుస్తోంది. ఎగుమతులను పెంచుకోవడం కోసం చైనా తన కరెన్సీ విలువను కృత్రిమంగా తక్కువ స్థాయిలో ఉంచుతున్నదని, ఇది తమకు నష్టం తెస్తున్నదని అమెరికా ఆరోపిస్తోంది. ట్రంప్ కయ్యానికి కాలు దువ్వే ధోరణి అమెరికాతోపాటు ప్రపంచ దేశాల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. ట్రంప్ కేవలం భారత్, చైనాలపై మాత్రమే కాదు... దక్షిణాఫ్రికా, ఇండొనేసియా దేశాలపైనా ఈ మాదిరే మాట్లా డుతున్నారు. ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాల ముసుగులో ప్రత్యేక సదుపాయాలు పొంది అమె రికాకు నష్టం కలిగిస్తున్నాయన్నది ఆయన ఆరోపణ. అధికారంలోకొచ్చిన నాటినుంచీ ట్రంప్ ఎవరో ఒకరితో తగువు పడుతూనే ఉన్నారు. ఇరాన్‌తో అమెరికాతోసహా అయిదు దేశాలు, యూరప్ యూనియన్(ఈయూ) కుదుర్చుకున్న అణు ఒప్పం దానికి ఆయన స్వస్తి చెప్పారు. కొత్త ఒప్పందానికి సిద్ధపడాలని ఒత్తిడి తెస్తూ ఇరాన్‌పై కొత్త ఆంక్షలు విధించారు. తమ దేశంలో ఉత్పత్తయ్యే హార్లీ–డేవిడ్సన్ బైక్‌లపై విధించిన సుంకాలు తగ్గించాలని ఆయన భార™Œ ను డిమాండ్ చేయడం మొదలెట్టారు. తగ్గించినా అదింకా చాల్లేదని పేచీకి దిగారు. ఆ విషయంలో తన మాట విననందుకు ప్రతీకారంగా నిరుడు మన ఉక్కుపై 25శాతం, అల్యూ మినియం ఉత్పత్తులపై 10శాతం అదనపు టారిఫ్‌లు విధించారు. మన దేశానికి అయిదు దశాబ్దా లుగా సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ(జీఎస్పీ) కింద కల్పిస్తున్న వెసులుబాట్లు రద్దు చేయాలని కూడా అక్కడి ప్రతినిధుల సభకు ఆయన లేఖ రాశారు. మన దేశం ఇది సరికాదని పలుమార్లు చెప్పి చివరకు అమెరికా నుంచి మన దేశానికొచ్చే 29 వ్యవసాయ ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధించింది. డబ్ల్యూటీఓ తీరుతెన్నులపై ట్రంప్ మొదటినుంచీ అసంతృప్తిగా ఉన్నారు. ఆ సంస్థలో అమెరికా సభ్య దేశంగా ఉండటం వల్ల తన ‘అమెరికా ఫస్ట్’ నినాదాన్ని సమర్థవంతంగా అమలు చేయలేకపోతున్నానని, దేశ ఆర్థిక వ్యవస్థను తాను అనుకున్న రీతిలో పటిష్టంగా తీర్చిదిద్దలేకపోతు న్నానని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే గత నెలలో డబ్ల్యూటీఓపై ఆయన ధ్వజమెత్తారు. దేన్న యినా అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణించడానికి ఇప్పుడనుసరిస్తున్న విధానాలను మార్చ వలసిన అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఆర్థికంగా మెరుగ్గా ఉన్న దేశమేదైనా ఈ నిబం ధనల కింద లబ్ధి పొందుతుంటే కఠిన చర్యలు తీసుకోవాలంటూ వెనువెంటనే లేఖ రాయాలని అమెరికా ప్రతినిధులను ఆదేశించారు. డబ్ల్యూటీఓపై ధ్వజమెత్తడం... భారత్, చైనాలను అభివృద్ధి చెందిన దేశాలుగా పరిగణించాలని కోరడం వెనక ట్రంప్‌కు పెద్ద ప్రణాళికే ఉంది. వచ్చే ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థుల్ని నిర్ణయించే ప్రక్రియ మొదలైంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం రెండోసారి కూడా దక్కించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ట్రంప్ తాజాగా ఈ వివాదం రేకెత్తిం చారు. మరోపక్క దిగుమతులపై విధించే అదనపు సుంకాలతో అమెరికన్ కంపెనీల ఉత్పత్తులకు రక్షణ కల్పించి, దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉన్నట్టు చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇందువల్ల దేశంలో తనకు అనుకూల వాతావరణం పెరిగి రిపబ్లికన్ పార్టీలో తిరుగు ఉండదని ఆయన భావిస్తున్నారు. కానీ ఇలాంటి వివాదాల పర్యవసానంగా అమెరికా వాణిజ్యం దేశ సరి హద్దులు దాటి విస్తరించడం అసాధ్యమవుతుందన్న సంగతిని ఆయన విస్మరిస్తున్నారు. ట్రంప్ పేచీ వెనక మరో ఉద్దేశం కూడా ఉంది. వచ్చే నెలలో మన దేశంతోపాటు చైనాతో కూడా వాణిజ్య అంశాలపై అమెరికా చర్చించాల్సి ఉంది. 2024నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవాలని మన దేశం ఆశిస్తోంది. అది సాధించాలంటే అమెరికాతో వాణిజ్యం సవ్యంగా ఉండా లని మోదీ ప్రభుత్వానికి తెలుసు. తన ఆర్థిక పురోగతి యధావిధిగా సాగాలంటే అమెరికాతో వాణి జ్యానికి అవరోధాలుండకూడదని చైనాకు కూడా తెలుసు. మొన్న జూన్‌లో జరిగిన జీ–20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ట్రంప్‌తో రెండు దేశాల అధినేతలూ చర్చించారు. వచ్చే నెలలో ఇరు దేశా లతో జరగబోయే చర్చలు దానికి కొనసాగింపే. ఈలోగా వాణిజ్య విభేదాల విషయంలో తాను పట్టుదలగా ఉన్నట్టు నిరూపించుకోవడం ట్రంప్‌కు అవసరం. అప్పుడు మాత్రమే ఈ రెండు దేశా లనూ దారికి తెచ్చుకోవడం సులభమవుతుందని ఆయననుకుంటున్నారు. ట్రంప్ తీరు వల్ల ఏర్ప డిన అనిశ్చితి కారణంగా అమెరికా తయారీ రంగంలో 4శాతం, ప్రైవేటు మదుపు 1.2 శాతం క్షీణిం చిందని తాజా సర్వే చెబుతోంది. కనుక దౌత్యంలోనైనా, వాణిజ్యంలోనైనా బెదిరింపు ధోరణి సత్ఫ లితాన్నివ్వబోదని, తమకూ నష్టం వాటిల్లుతుందని ట్రంప్ గ్రహించాలి. -
నాడే భారత్ బిగ్ మార్కెట్!
సాక్షి, న్యూఢిల్లీ : నాడు పలు ప్రపంచ దేశాల వర్తకులు సముద్ర మార్గాన వచ్చి భారత్‌తో జరిపిన వాణిజ్య లావాదేవీల గురించి ప్రస్తావనకు వచ్చిందంటే చాలు మనకు నాటి వలసపాలకులు గుర్తుకు వస్తారు. ముందుగా పోర్చుగీసు, ఆ తర్వాత డచ్, ఫ్రెంచ్, చివరకు బ్రిటీష్ వర్తకులు మలబార్, గోవా, గుజరాత్, బెంగాల్ సముద్ర మార్గాల ద్వారా భారత్‌తో వ్యాపారం నిర్వహించడానికి వచ్చి వ్యాపార సంస్థల పేరుతో ఇక్కడే స్థిరపడడం, మన రాజకీయాల్లో జోక్యం చేసుకొని మనల్నే పాలించడం గుర్తుకురాక తప్పదు. ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి ఏ బడి పిల్లవాడిని అడిగినా ఆ కంపెనీ పేరుతో వచ్చిన బ్రిటీష్ వ్యాపారులు దాదాపు రెండు వందల సంవత్సరాలు మనల్ని పాలించారని చెబుతాడు. నాటి వలసపాలన చీకటి రోజులు గుర్తుకు రావడం వల్ల అంతకుముందు పలు ప్రపంచ దేశాలు, భారత్ మధ్య భారీ ఎత్తున జరిగిన సముద్ర వాణిజ్యం గురించి పూర్తిగా మరచిపోతాం, పోయాం. దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితమే భారత్, ఇతర దేశాల మధ్య భారీ ఎత్తున సముద్ర మార్గాన వాణిజ్య లావాదేవీలు కొనసాగాయి. పైగా నాడు ఆవిరితో నడిచే ఓడలు లేవు. కేవలం గాలి వాటున నడిచే చిన్న, మధ్యతరహా నౌకలు ఉండేవి. ఎండకాలంలో నైరుతి, చలిగాలంలో ఈశాన్య దిశ గాలులు ఏటవాలున నాటి వాణిజ్య తెరచాపల పడవలు ప్రయేణించేవి. ఆయా ప్రాంతాల్లోని దేశాలతోని వాణిజ్యం నెరపేవి. మొదట గ్రీకు వర్తకులు ఈజిప్లు, తూర్పు ఆఫ్రికా, దక్షిణ అరేబియా, భారత్‌తో వ్యాపారం నిర్వహించేవారు. వీరు తూర్పు ఆఫ్రికా తీరం నుంచి, అరేబియా ద్వీపకల్పం, పర్సియన్ గల్ఫ్ నుంచి, రెండు మార్గాల ద్వారా భారత్‌కు వచ్చేవారు. పలు మధ్యధరా సముద్ర తీర దేశాలు కూడా భారత్‌తో వర్తకం నిర్వహించేవి. విదేశీ సముద్ర వర్తకులు ఎక్కువగా హిందూ మహా సముద్ర నుంచి భారత్‌కు చేరుకునేవారు. అప్పట్లో భారత్‌తో భారుచ్ రేవు పట్టణం వాణజ్యానికి ప్రధాన కేంద్రం. మధ్యధరా సముద్ర తీర దేశాలు, భారత్, పర్షియా, ఆఫ్రికా, చైనా, ఆగ్నేయ ఆసియా దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు కొనసాగాయి. భారత్‌లోని దాదాపు 20 రేవు పట్టణాలు నాడు వాణిజ్యానికి పేరు పొందాయి. భారత్‌లోని మలబార్ తీరం నుంచి విదేశాలకు భారీ ఎత్తున మిరియాలు ఎగుమతయ్యేవి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత వాస్కోడిగామ భారత్‌కు సముద్ర మార్గాన్ని కనుగొనడానికి కూడా ‘బ్లాక్ గోల్డ్’గా అభివర్ణించే మిరియాలే కారణమట. నాడు భారత్ నుంచి మిరియాలతోపాటు ఇతర మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలతోపాటు వివిధ రకాల అత్తర్లలో కలిపే సువాసన మూలకాలు, పత్తి, ఏనుగు దంతాలు, ముత్యాలు, చైనీస్ సిల్స్ భారత్ నుంచి ఎగుమతి అయ్యేవి. ఇక అరబ్ వ్యాపారులతోపాటు భారతీయ వ్యాపారులు కూడా బియ్యం, నువ్వుల నూనె, నెయ్యి, చక్కెర, కాటన్ గుడ్డలు విక్రయించేవారు. ఇటలీ, అరబ్ వైన్లు, ఆలివ్ నూనె, వెండి, గాజు పాత్రలతోపాటు భారతీయులు బానిస సంగీత కళాకారులు, వేశ్య వృత్తి కోసం అమ్మాయిలను కొనుగోలు చేసేవారు. రోమన్ బంగారు, వెండి నాణెలను భరతీయులు కొనుగోలు చేసేవారు. అటు సముద్ర దొంగలు, ప్రకృతి విలయాలను ఎదురొడ్డి నాడు వర్తకులు వ్యాపారం నిర్వహించాల్సి వచ్చేది. వస్తు మార్పిడి, నాటి నాణెంల ద్వారా వ్యాపార లావాదేవీలు నడిచేవి. ఇవన్నీ ఎలా వెలుగులోకి వచ్చాయంటే.. ‘పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ’ పేరిట ఒకటవ శతాబ్దంలో, అంటే 1900 సంవత్సరాల క్రితం, వాస్కోడిగామా భారత్‌కు సముద్ర మార్గాన్ని కనుగొనడానికి 1400 ఏళ్ల ముందు ఓ గ్రీకు రచయిత గ్రీకు భాషలో చేతితో రాసిన పుస్తకం ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పదవ శతాబ్దంలో పైటపడిన ఆ రాతపతిని బ్రిటీష్ మ్యూజియలంలో భద్రపరిచారు. దాన్ని లింకన్ కాసన్ ఇటీవల ఆంగ్లంలోకి అనువదించారు. నాడు ఏయే దేశాలు ఏయే సముద్ర మార్గం గుండా భారత్‌కు వచ్చి వర్తకాన్ని నిర్వహించేవి. భారత్‌లో ప్రసిద్ధి చెందిన రేవులు, మార్కెట్లు, వాటి వివరాలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి. 1550 రూపాయల ధర కలిగిన ఈ పుస్తకాన్ని 33 శాతం నుంచి 25 శాతం వరకు తగ్గించి విక్రయించేందుకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఆన్లైన్ వ్యాపార సంస్థలు పోటీ పడుతున్నాయి. -
వాణిజ్యలోటు గుబులు
న్యూఢిల్లీ: ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం... వాణిజ్యలోటు భయపెడుతోంది. మే నెలలో ఏకంగా ఈ లోటు 15.36 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గడచిన ఆరు నెలల్లో ఇంత ఎక్కువ స్థాయి (2018 నవంబర్‌లో 16.67 బిలియన్ డాలర్లు) వాణిజ్యలోటు ఇదే తొలిసారి. ఎగుమతులు తక్కువగా ఉండడం దీనికి ప్రధాన కారణం. శుక్రవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం– మేలో దేశం ఎగుమతులు 3.93 శాతం (2018 ఇదే నెలతో పోల్చి) పెరిగాయి. విలువ రూపంలో 30 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతుల విలువ 4.31 శాతం పెరుగుదలతో 45.35 బిలియన్ డాలర్లుగా నమోదయ్యియి. దీనితో వాణిజ్యలోటు 15.36 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ♦ ఎలక్ట్రానిక్స్ (51 శాతం), ఇంజనీరింగ్ (4.4 శాతం), కెమికల్స్ (20.64 శాతం), ఫార్మా (11 శాతం), తేయాకు (24.3 శాతం) ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధి బాగుంది. ♦ అయితే పెట్రోలియం ప్రొడక్టులు, చేతితో తయారుచేసే నూలు, రత్నాలు, ఆభరణాలు, సముద్ర ఉత్పత్తులు, కాఫీ, బియ్యం ఎగుమతులు పెరక్కపోగా (2018 మేతో పోల్చి) మే నెలలో క్షీణించాయి. ♦ దిగుమతుల బిల్లు పెరగడానికి ప్రధాన కారణాల్లో క్రూడ్ ఆయిల్, పసిడి దిగుమతుల విలువ పెరగడం ఉన్నాయి. ♦ చమురు దిగుమతులు 8.23 శాతం పెరిగాయి. విలువ రూపంలో 12.44 బిలియన్ డాలర్లు. చమురు యేతర దిగుమతులు 2.9 శాతం పెరిగాయి. విలువ 32.91 బిలియన్ డాలర్లు. ♦ పసిడి దిగుమతులు ఏకంగా 37.43 శాతం పెరిగి 4.78 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్– మే నెలల్లో..: 2019–20 తొలి రెండు నెలలనూ తీసుకుంటే, ఎగుమతులు 2.37% వృద్ధితో 56 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 4.39% పెరుగుదలతో 86.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి వాణిజ్యలోటు 30.69 బిలియన్ డాలర్లుగా నమోదైంది. -
వాణిజ్య ఉద్రిక్తతలు... ప్రపంచ ఆర్థికానికి ముప్పు
ఫుకోవా (జపాన్): వాణిజ్య ఉద్రిక్తతలు అధ్వానంగా మారాయని, ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు అని జీ20 దేశాలు అంగీకరించాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధి ఇప్పటికే తక్కువగా ఉండగా, వాణిజ్య ఉద్రిక్తతల రిస్క్‌తో ఇది ఇంకా తగ్గిపోతుందన్న ఆందోళన జీ20 దేశాల ప్రకటనలో వ్యక్తమైంది. మరీ ముఖ్యంగా వాణిజ్య, భౌగోళిక ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయని, అవసరమైన తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది. వాణిజ్య ఉద్రిక్తతలు పరిష్కారం కావాల్సిన అవసరాన్ని బలంగా చెప్పింది. జపాన్ పోర్ట్ పట్టణం ఫుకోవాలో రెండు రోజుల పాటు జరిగిన జీ20 దేశాల సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఈ సమావేశంలో అన్ని దేశాలు ఒక్కతాటిపై నిలవగా, అమెరికా మాత్రం వేరుగా వ్యవహరించింది. ప్రతీ ఒక్కరు వాణిజ్య ఉద్రిక్తతలు ఆర్థిక వృద్ధికి ముప్పుగా అభిప్రాయపడినట్టు, అమెరికా యంత్రాంగంలో ఈ తరహా భావన లేదని ఈయూ ఆర్థిక, మానిటరీ వ్యవహారాల కమిషనర్ పీరే మోస్కోవిసి తెలిపారు. -
వారాంతాన బలహీనపడిన రూపాయి
ముంబై: డాలరుతో రూపాయి మారకం విలువ మరోసారి కుదేలైంది. శుక్రవారం 20 పైసలు నష్టపోయి 70.23 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 70.22 వద్ద ప్రారంభమై ఒక దశలో 70.32 వద్దకు పతనమైంది. గురువారం నాటి ముగింపు 70.03తో పోల్చితే చివరకు 20 పైసలు బలహీనపడింది. వరుసగా మూడు రోజులపాటు బలపడుతూ వచ్చిన భారత కరెన్సీ.. పెరిగిన ముడిచమురు ధరలు, విదేశీ నిధుల ఉపసంహరణ కారణంగా వారాంతాన మళ్లీ బక్కచిక్కిందని ఫారెక్స్ మార్కెట్ నిపుణులు విశ్లేషించారు. వారం మొత్తం మీద చూస్తే.. 31 పైసలు నష్టపోయి, వరుసగా రెండవ వారంలోనూ బలహీనతను నమోదుచేసింది. అమెరికా డాలరుతో ఆసియా దేశాల కరెన్సీలు బలహీనపడడం కూడా రూపాయిపై ఒత్తిడికి మరో కారణంగా నిలిచిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెడ్ (పీసీజీ, క్యాపిటల్ మార్కెట్స్ స్ట్రాటెజీ విభాగం) వీకే శర్మ అన్నారు. ఎగ్జిట్ పోల్స్, సాధారణ ఎన్నికల ఫలితాలు ఉన్నందున వచ్చేవారం రోజుల్లో భారీ ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని అంచనావేశారు. -
రూపాయిని భయపెట్టిన వాణిజ్య ఉద్రిక్తతలు
ముంబై: అమెరికా – చైనా మధ్య తాజా ఉద్రిక్తతలు డాలర్ మారకంలో రూపాయి విలువను బలహీనపరిచాయి. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ గత శుక్రవారంతో పోల్చితే 18 పైసలు తగ్గి, 69.40కి చేరింది. చైనా దిగుమతులపై సుంకాలు పెంచుతామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు ఈక్విటీ మార్కెట్లకు కూడా ప్రతికూలం కావడం రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. క్యాపిటల్ మార్కెట్లలో ఫారెన్ ఇన్వెస్టర్లు నికర అమ్మకాలు జరిపారు. సోమవారం ట్రేడింగ్ మొదట్లోనే రూపాయి బలహీనంగా 69.38 వద్ద ప్రారంభమైంది. క్రూడ్ ధరలు, ఎన్నికల ఫలితంపై అనిశ్చితి వంటి అంశాల నేపథ్యంలో మే నెల మొత్తం రూపాయి తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉందని నిపుణుల అంచనా. సమీప కాలంలో 70–68 శ్రేణిలో స్థిరీకరణ పొందే అవకాశాలు ఉన్నాయన్నది విశ్లేషణ. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే క్రూడ్ ధరల పతనం భారీ పతనం, ఎన్నికల అనంతరం మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాల నేపథ్యంలో రూపాయి రెండు నెలల క్రితం 68 స్థాయినీ చూసింది. -
ఫిబ్రవరిలో తగ్గిన వాణిజ్యలోటు
న్యూఢిల్లీ: ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు ఫిబ్రవరిలో ఉపశమించింది. దిగుమతులు తగ్గడం దీనికి ప్రధాన కారణం. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే... ► దిగుమతుల విషయంలో ఈ మొత్తం 36.26 బిలియన్ డాలర్లు. గత ఏడాది (2018 ఫిబ్రవరి) ఇదే నెలతో పోల్చిచూస్తే, ఈ విలువ 5.4 శాతం తగ్గింది. ► వెరసి వాణిజ్యలోటు ఫిబ్రవరిలో 9.6 బిలియన్ డాలర్లు. వాణిజ్యలోటు 2018 ఫిబ్రవరిలో 12.3 బిలియన్ డాలర్లు అయితే, 2019 జనవరిలో ఈ విలువ 14.73 బిలియన్ డాలర్లు. ►పసిడి, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు తగ్గాయి. దీనితో దిగుమతులు మొత్తంగా తగ్గాయి. పసిడి దిగుమతులు 11 శాతం తగ్గి 2.58 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 2.89 బిలియన్ డాలర్లు. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు 8 శాతం తగ్గి 9.37 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్– ఫిబ్రవరి మధ్య... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– ఫిబ్రవరి మధ్య ఎగుమతుల విలువ 8.85 శాతం పెరిగి 298.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతుల విలువ 9.75 శాతం పెరిగి 464 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు దాదాపు 166 బిలియన్ డాలర్లు. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ విలువ 149 బిలియన్ డాలర్లు. అవరోధాలను అధిగమిస్తున్నాం: ఎఫ్ఐఈఓ అంతర్జాతీయంగా వాణిజ్య రక్షణాత్మక విధానాలు ఉన్నాయి. కఠిన అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులు ఉన్నాయి. దేశీయంగానూ ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ ఎగుమతులు కొంత సానుకూలంగానే నమోదయ్యాయి. మొత్తం 30 ప్రధాన గ్రూపుల్లో 18 సానుకూల ఫలితాలను అందించాయి. – గణేశ్ కుమార్ గుప్తా, ఎఫ్ఐఈఓ సేవలు తగ్గాయి... సేవల ఎగుమతులు 2018 డిసెంబర్‌తో పోల్చితే, 2019 జనవరిలో 1.02 శాతం తగ్గాయి. 17.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక సేవల దిగుమతులు కూడా ఇదే కాలంలో 3.07 శాతం తగ్గి 11.03 బిలియన్ డాలర్లకు చేరాయి. -
ప్రజా రవాణా.. భద్రతకేదీ ఠికాణా
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ 30వ భద్రతా వారోత్సవాలు ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. కాలం చెల్లిన బస్సులను పక్కనబెట్టనంత వరకు ఈ ఉత్సవాల వల్ల ప్రయోజనం లేదని కార్మికులు, కార్మికసంఘాల నుంచి విమర్శలొస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో తక్షణం పక్కనబెట్టాల్సిన బస్సులు 4,549. అంటే ఇవి 12 లక్షల కిలోమీటర్లకుపైగా తిరిగాయి. ఇపుడు మన బస్సులు ఎప్పుడు, ఎక్కడ ఎలాంటి ప్రమాదానికి గురవుతాయో చెప్పలేని దుస్థితిలో ఉన్నాయి. ముందుగా ఆర్టీసీని ప్రక్షాళన జరపకుండా ఇలాంటి భద్రతా వారోత్సవాలు ఎన్ని జరిపితే ఏం లాభమని కార్మిక యూనియన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రతీరోజు 40 లక్షల మందికిపైగా ప్రజలు ప్రమాదకరంగా కాలంచెల్లిన బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. ఇప్పటికైనా కొత్త బస్సుల కొనుగోలుకు చర్యలు తీసుకుంటారా? లేదా అన్నది చర్చానీయాంశంగా మారింది. తెల్ల ఏనుగులపైనే ఆసక్తి.. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి నేటి వరకు తెలంగాణ ఆర్టీసీ కొనుగోలు చేసిన బస్సుల సంఖ్య 1,095గా ఉంది. తుక్కు దశకు చేరిన బస్సుల స్థానంలో ప్రధానంగా జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలకు నడిచే బస్సులు కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఆర్టీసీలో అంతగా లేదు. కేవలం సంస్థకు భారంగా పరిణమించే తెల్ల ఏనుగుల్లాంటి ఏసీ బస్సులపైనే అమితాసక్తిని ప్రదర్శిస్తోంది. ►ఇదే క్రమంలో 2017లో దాదాపుగా రూ.20 కోట్లు వెచ్చించి వజ్ర బస్సులు కొనుగోలు చేశారు. వీటి ఆక్యుపెన్సీ రేషియో కేవలం 58కి పరిమితమైంది. చాలారూట్లలో ఈ బస్సులు సగం కూడా నిండటం లేదు. ►సెప్టెంబర్ 5వ తేదీన దాదాపుగా రూ.100 కోట్లు పెట్టి ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకుంది. వీటిలో తొలివిడగా 40 ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాయి. ఇవి త్వరలోనే రోడ్డుకెక్కనున్నాయి. ఇలాంటి చర్యలను ఆహ్వానించినా.. ఇవి అందరికీ అందుబాటులోకి ఉండవన్న విషయం మరవకూడదు. ఇతర సంస్థలంటేనే మమకారమా..? రాష్ట్రంలో అతిపెద్ద ప్రజారవాణ సంస్థగా ఉన్న ఆర్టీసీకి ఎలాంటి అదనపు కేటాయింపులు చేయడం లేదు. ఈ సంస్థకు చేయకపోగా.. పోలీసు శాఖకు దాదాపుగా రూ.800 కోట్లు ఇచ్చి దాదాపుగా 3000 వాహనాల కొనుగోలుకు సహకరించింది. హైద రాబాద్‌లో పరుగులు తీస్తున్న మెట్రోకు ఏకంగా రూ.14 వేల కోట్లు వరకు వెచ్చించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక.. 1,400 బస్సులు మినహాయించి కొత్తగా కొనుగోలు చేసింది ఏమీ లేదు. ఇందులో ఎక్స్‌ప్రెస్, సూపర్ డీలక్స్ తదితరాలు ఉన్నాయి. కనీసం బడ్జెట్లో కేటాయించిన నిధులను కూడా పూర్తిగా కేటాయించడం లేదు. ఆర్టీఏ తనిఖీలు ఉండవా? ఆర్టీసీ బస్సుల తనిఖీ అంటేనే ఆర్టీఏ అధికారులు అస్సలు పట్టించుకోరు. పోనీ, పట్టించుకుని తనిఖీలు చేపడితే.. వెంటనే ఫోన్లు చేసి వారిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు వస్తాయని ఆర్టీఏ ఉన్నతాధికారులు అంటున్నారు. అందుకే, నిబంధనలకు విరుద్ధంగా కాలంచెల్లిన బస్సులు పరిమితికి మించి రోడ్డుపై తిరుగుతున్నా కళ్లప్పగించి చూడటం మినహా వారేం చేయలేని దుస్థితి. సాంకేతికంగా ఈ బస్సులను నడిపించేందుకు ఏమాత్రం అర్హత లేదు. అయినా వీటిల్లో జనాలను కుక్కి ఆర్టీసీ పంపుతోంది.గతేడాది సెప్టెంబరు 11న 65 మంది అమాయకుల ప్రాణాలు బలితీసుకున్న కొండగట్టు దుర్ఘటనే ఇందుకు చక్కని ఉదాహరణ.ఆక్యుపెన్సీ రేషియో పడిపోతే.. డ్రైవర్లు కండక్టర్లపై ఒత్తిడి తెచ్చి మరీ పెంచుకుంటోంది. అంతే తప్ప ప్రజల రక్షణ కోసం.. జిల్లాలు గ్రామీణ బస్సుల్లో కొత్త బస్సులు వేయాలన్న దిశగా చర్యలు లేక పోవడం విమర్శలకు ఆస్కారమిస్తోంది. ఇదీ బస్సుల దుస్థితి.. ఆర్టీసీలో మొత్తం బస్సులు 10,500 కుపైగా రోజువారీ ప్రయాణికులు 97,00,000 ఒకరోజు ఆదాయం దాదాపు రూ.12,00,00,000 (రూ.12కోట్లు) సంస్థలో కాలంచెల్లిన బస్సులు 4,549. ఈ బస్సుల్లో ఒకరోజు ప్రయాణం చేసేవారు 40,00,000కిపైగా -
ఎగుమతులు పెరిగినా.. వాణిజ్యలోటు భయాలు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు అక్టోబర్‌లో (2017 అక్టోబర్‌తో పోల్చి) 17.86 శాతం పెరిగాయి. విలువ రూపంలో చూస్తే 26.98 బిలియన్ డాలర్లు. అయితే ఇదే కాలంలో దిగుమతులు భారీగా 17.62 శాతం పెరిగి 44.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు–దిగుమతులకు మధ్య నికర వ్యత్యాసం 17.13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. అక్టోబర్‌లో వాణిజ్యలోటు 14.61 బిలియన్ డాలర్లు. గురువారం వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ►గత ఏడాది అక్టోబర్‌లో మరీ తక్కువ ఎగుమతు లు జరగడం (బేస్‌ఎఫెక్ట్) ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో వృద్ధి రేటు భారీగా కనబడ్డానికి కారణమని ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్, ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ప్రతినిధులు వ్యాఖ్యానించడం గమనార్హం. ►అక్టోబర్‌లో ఎగుమతులు పెరిగినా, నెలవారీగా చూస్తే తగ్గాయి. సెప్టెంబర్‌లో ఎగుమతుల విలువ 27.95 బిలియన్ డాలర్లు. ► అక్టోబర్ ఎగుమతుల్లో మంచి ఫలితాలను సాధించిన రంగాల్లో పెట్రోలియం (49.3 శాతం), ఇంజనీరింగ్ (8.87 శాతం), రసాయనాలు (34 శాతం) ఫార్మా (13 శాతం), రత్నాలు, ఆభరణాలు (5.5 శాతం) వంటివి ఉన్నాయి. ► అయితే కాఫీ, బియ్యం, పొగాకు, జీడిపప్పు, ఆయిల్సీడ్స్సహా పలు వ్యవసాయ సంబంధ ఉత్పత్తుల ఎగుమతులు ప్రతికూలతను నమోదుచేసుకున్నాయి. ఊ అక్టోబర్‌లో చమురు దిగుమతులు 52.64 శాతం పెరిగి 14.21 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురేతర దిగుమతులు 6 శాతం పెరిగి 29.9 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఏప్రిల్–అక్టోబర్ మధ్య... కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ మధ్య ఎగుమతులు 13.27 శాతం పెరిగాయి. విలువ రూపంలో ఇది 191 బిలియన్ డాలర్లు. దిగుమతులు ఇదే కాలంలో 16.37 శాతం పెరిగి 302.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి రెండింటి మధ్యా నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 111.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో వాణిజ్యలోటు 91.28 బిలియన్ డాలర్లు. కాగా ఏప్రిల్– అక్టోబర్ మధ్య చమురు దిగుమతులు 50.48 శాతం పెరిగి 83.94 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో 19 శాతం పెరిగిన సేవలు... ఇదిలావుండగా, సెప్టెంబర్‌కు సంబంధించి సేవల రంగం గణాంకాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసింది. ఈ నెలలో సేవల ఎగుమతులు 19 శాతం పెరిగాయి. విలువ రూపంలో 16.38 బిలియన్ డాలర్లు. దిగుమతులు 18 శాతం పెరిగాయి. విలువ 9.95 బిలియన్ డాలర్లు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ భారత్ సేవల ఎగుమతులు విలువ 101.07 బిలియన్ డాలర్లు. ఇదే కాలంలో దిగుమతుల విలువ 62.57 బిలియన్ డాలర్లుగా నమోదైంది. భారీగా తగ్గిన పసిడి దిగుమతులు మరోవైపు అక్టోబర్‌లో పసిడి దిగుమతులు భారీగా 42.9 శాతం తగ్గాయి. విలువలో 1.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో పసిడి దిగుమతుల విలువ 2.95 బిలియన్ డాలర్లు. డాలర్ మారకంలో రూపాయి విలువ పడిపోవడం పసిడి డిమాండ్‌ను తగ్గించింది. ఇది కరెంట్ అకౌంట్ లోటుకు ప్రతికూల అంశమే. ఆభరణాల పరిశ్రమ నుంచి ప్రధానంగా పసిడికి డిమాండ్ ఉంది. ఆభరణాల పరిశ్రమ నుంచి ఎగుమతులు ఈ నెల్లో 5.5 శాతం పెరిగాయి. విలువ రూపంలో ఇది 34.9 బిలియన్ డాలర్లు. -
లాభ, నష్టాల దోబూచులాట
రోజంతా తీవ్రమైన ఒడిదుడుకులకు గురైన స్టాక్ సూచీలు చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. క్యాపిటల్ గూడ్స్, బ్యాంక్, వాహన, లోహ షేర్ల లాభాలను ఐటీ, ఫార్మా, టెక్నాలజీ, ఎఫ్ఎమ్సీజీ షేర్లు హరించివేశాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తరిలిపోతుండటం ప్రతికూల ప్రభావం చూపించింది. స్టాక్ సూచీలు లాభ, నష్టాల మధ్య దోబూచులాడాయి. రోజంతా 376 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 10 పాయింట్లు నష్టపోయి 34,432 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ట్రేడింగ్ ఆద్యంతం వంద పాయింట్ల రేంజ్లో కదలాడిన నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయి 10,380 పాయింట్ల వద్ద ముగిసింది. రూపాయి రికవరీ కారణంగా ఐటీ, ఫార్మా షేర్లు నష్టపోయాయి. గత నెల వాహన విక్రయాలు ఒకింత మెరుగ్గా ఉండటంతో వాహన షేర్లు లాభపడ్డాయి. లాభాల స్వీకరణతో క్షీణించిన సూచీలు... ఆసియా మార్కెట్ల దన్నుతో సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. సరళతర వ్యాపార విధానాల్లో భారత ర్యాంక్ వంద నుంచి 77వ స్థానానికి ఎగబాకడం, వరుసగా 15వ నెలలోనూ భారత తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ పెరగడం, దాదాపు ఐదు నెలల తర్వాత అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ. లక్ష కోట్లకు పెరగడం, చమురు ధరలు దిగిరావడం, రూపాయి బలపడటం, తదితర అంశాలు సానుకూల ప్రభావం చూపించాయి. ఆరంభంలో కొనుగోళ్ల జోరుతో సెన్సెక్స్ 238 పాయింట్ల లాభంతో 34,680 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఇటీవల లాభపడిన బ్లూ చిప్ షేర్లలో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. 139 పాయింట్ల నష్టంతో 34,303 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఇక నిఫ్టీ 10,442, 10,342 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. అంటే ఒక దశలో 55 పాయింట్లు లాభపడి, మరో దశలో 45 పాయింట్లు పతనమైంది. ట్రేడింగ్ మొత్తంలో సెన్సెక్స్ ఐదు సార్లు, నిఫ్టీ నాలుగు సార్లు నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చాయి. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య రచ్చ దాదాపు సమసిపోయిందనే అంచనాలతో మార్కెట్ సానుకూలంగానే ఆరంభమైందని నిపుణులు పేర్కొన్నారు. బుధవారం సెన్సెక్స్ 551 పాయింట్లు లాభపడటంతో గురువారం లాభాల స్వీకరణ చోటు చేసుకుందని, దీంతో స్టాక్ సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయ్యాయని వారు పేర్కొన్నారు. ►ఇన్ఫోసిస్ 3 శాతం నష్టపోయి రూ.666 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► యస్ బ్యాంక్ 8.3 శాతం లాభంతో రూ.204 వద్ద ముగిసింది. యూపీఐ ద్వారా ఐపీఓ చెల్లింపులు రిటైల్ ఇన్వెస్టర్లు ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లో యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ద్వారా షేర్లను కొనుగోలు చేయవచ్చు. వచ్చే ఏడాది జనవవరి 1 నుంచి యూపీఐ విధానంలో చెల్లింపులను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ అందుబాటులోకి తెస్తోంది. ఫలితంగా స్టాక్ మార్కెట్లో కంపెనీల లిస్టింగ్ సమయం ప్రస్తుతమున్న ఆరు రోజుల నుంచి మూడు రోజులకు తగ్గనున్నది. ఈ కొత్త చెల్లింపుల విధానం కారణంగా ప్రస్తుత విధానం సామర్థ్యం మరింతగా పెరుగుతుందని, వివిధ దశల్లో మానవ జోక్యం తగ్గుతుందని సెబీ పేర్కొంది. -
అమెరికా–చైనా ట్రేడ్‌వార్ మనకు మంచిదే!
న్యూఢిల్లీ: చైనా నుంచి వచ్చే 34 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై అమెరికా అదనపు టారిఫ్ లు విధించడం అన్నది పలు భారత ఉత్పత్తులు మరింత పోటీగా మారేందుకు తోడ్పడుతుందని సీఐఐ పేర్కొంది. మెషినరీ, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, వాహనాలు, రవాణా, కెమికల్స్, ప్లాస్టిక్స్, రబ్బర్ ఉత్పత్తుల విషయమై అమెరికా మార్కెట్‌పై దృష్టి సారించాలని సూచించింది. ‘‘చైనా–అమెరికా ఒకరికొకరు మరో దేశ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు విధించుకున్న దృష్ట్యా, ఆ రెండు దేశాలకు ఎన్నో ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు భారత్ దృష్టి సారించొచ్చు’’ అని సీఐఐ పేర్కొంది. మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ప్రముఖ ఉత్పత్తులు పంపులు, మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాలు, ఎలక్ట్రోడయాగ్నస్టిక్ ఉపకరణాలు, 1500 – 3000సీసీ సామర్థ్యం కలిగిన ప్యాసింజర్ వాహనాలు, వాల్వ్ బాడీలు, ట్యాప్ భాగాలు టారిఫ్‌లు విధించిన జాబితాలో ఉన్నాయని సీఐఐ తెలిపింది. 2017లో మన దేశం నుంచి ఈ ఉత్పత్తుల ఎగుమతులు 50 మిలియన్ డాలర్ల మేర ఉన్నాయని, గట్టి ప్రయత్నాల ద్వారా వీటిని పెంచుకోవచ్చని సూచిం చింది. ప్రస్తుతం మన దేశం నుంచి అమెరికాకు జరుగుతున్న ఎగుమతుల ఆధారంగా, రక్షణ, ఎయిరో స్పేస్ విడిభాగాలు, వాహనాలు, వాహన విడిభాగాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తులను పెంచుకునేందుకు అధిక అవకాశాలున్నాయని పేర్కొంది. టెక్స్టైల్స్, పాదరక్షలు, ఆటబొమ్మలు, గేమ్స్, సెల్ఫోన్ల తయారీ భారత్ నుంచి పోటీపడతగ్గ పరిశ్రమలని, వీటికి ప్రోత్సాహం అవసరమని సూచించింది. -
35,880పైన ముగిస్తే అప్‌ట్రెండ్
అమెరికా–చైనాల మధ్య ట్రేడ్‌వార్ తీవ్రతరమై అమెరికా, చైనా, హాంకాంగ్‌లతో సహా గతవారం ప్రధాన ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాలతో ముగిసినప్పటికీ, భారత్ మార్కెట్ లాభాలు సాధించడం సానుకూలాంశం. అలాగే సెన్సెక్స్ బాస్కెట్లో ఇప్పటికే కొత్త గరిష్టస్థాయిని చేరిన బ్లూచిప్‌లు టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్లకు తోడుగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ద్వయం క్రితంవారం ర్యాలీ సాగించడం విశేషం. ఇందుకు మరిన్ని షేర్లు తోడైతే...ప్రపంచ ట్రెండ్ ఎలా వున్నా మన ప్రధాన సూచీలు కొత్త రికార్డును నెలకొల్పడం తొందర్లోనే సాధ్యపడుతుంది. అయితే నాటకీయంగా క్రూడ్ ధర పెరిగిన కారణంగా పైన పేర్కొన్న బ్లూచిప్‌ల్లో..విదేశీ సంస్థాగత ఇన్వస్టర్లు ఇక్కడి మార్కెట్లో భారీగా విక్రయాలు జరిపి, అమెరికాకు నిధుల్ని తరలించుకుపోయే ప్రమాదం కూడా వుంది. ఈ కారణంగా రూపాయి మరింత పతనమైతే మన మార్కెట్ ర్యాలీకి బ్రేక్‌పడి, కరెక్షన్బాటలోకి మళ్లిపోవొచ్చు. సెన్సెక్స్ సాంకేతికాలు జూన్ 22తో ముగిసిన వారంలో గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన 35,880–35,250 పాయింట్ల శ్రేణి మధ్యే కదిలిన సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 67 పాయింట్ల లాభంతో 35,690 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ లాభాలతో ముగియడం వరుసగా ఇది ఐదో వారం. అయితే ఈ ఐదు వారాలు కొద్దిపాటి లాభాల్ని మాత్రమే ఆర్జించడంతో పాటు గతవారంలో సెన్సెక్స్ హెచ్చుతగ్గుల శ్రేణి కుదించుకుపోయింది. ఈ కారణంగా సమీప భవిష్యత్తులో ఎటోవైపు వేగంగా కదిలే అవకాశం వుంది. ఈ క్రమంలో పైన ప్రస్తావించిన శ్రేణిని ఎటువైపు ఛేదిస్తే అటువైపు వేగంగా కదలవచ్చు. ఈ వారం 35,880 పాయింట్ల వద్ద తొలి నిరోధం ఏర్పడవచ్చు. రెండు వారాల శ్రేణికి ఇది అప్పర్‌బ్యాండ్ అయినందున, ఈ స్థాయిపైన ముగిస్తే అప్‌ట్రెండ్ ఏర్పడి 35,990 పాయింట్లస్థాయిని వేగంగా అందుకోవొచ్చు. ఈ స్థాయిని కూడా అధిగమిస్తే 36,250 పాయింట్ల వరకూ పరుగులు కొనసాగవచ్చు. అటుపైన కొద్ది రోజుల్లో కొత్త రికార్డును నెలకొల్పవచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటకపోయినా, గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైనా 35,500 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభ్యమవుతున్నది. ఈ లోపున 35,330 పాయింట్ల వద్దకు పతనం కావొచ్చు. ఈ లోపున ముగిస్తే 34,800 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. 10,895 అవరోధం నిఫ్టీకి కీలకం ఎన్ఎస్ఈ నిఫ్టీ గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన 10,700 సమీపంలో రెండు దఫాలు మద్దతు పొంది...వారంలో చివరిరోజున 10,837 పాయింట్ల గరిష్టస్థాయివరకూ ర్యాలీ జరిపింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 4 పాయింట్ల లాభంతో 10,822 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ తరహాలోనే నిఫ్టీకి 10,700–10,895 పాయింట్ల శ్రేణి కీలకమైనది. ఈ శ్రేణి ఎటువైపు ఛేదిస్తే అటు వేగంగా కదలవచ్చు. ఈ వారం నిఫ్టీ పెరిగితే 10,895 పాయింట్ల వద్ద తొలి అవరోధం కలుగుతున్నది. ఈ స్థాయిని దాటితే వెంటనే 10,930 స్థాయిని అందుకోవొచ్చు. ఈ పైన 10,980–11,000 శ్రేణి వద్దకు పెరిగే ఛాన్స్ వుంటుంది. ఈ స్థాయిని కూడా అధిగమించగలిగితే..కొద్దిరోజుల్లో కొత్త గరిష్టస్థాయి కష్టమేమీ కాదు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటకపోయినా, గ్యాప్డైన్తో మొదలైనా 10,750 వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే 10,710 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఈ లోపున ముగిస్తే 10,550 వరకూ క్షీణత కొనసాగవచ్చు. -
నేనే నిందితుడిని..నేనే బాధితుడిని
రాజాం: జిల్లాను ఓ కుదుపు కుదిపేసిన ట్రేడ్ వ్యవహారంలో నిందితుడు టంకాల శ్రీరామ్ ఎట్టకేలకు నోరు విప్పారు. ఆరు నెలల పాటు మౌనంగా ఉన్న శ్రీరామ్ శుక్రవారం ‘సాక్షి’తో ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడారు. ట్రేడ్ వ్యవహారంలో తన వల్ల చాలా మంది నష్టపోయారని, తాను కూడా కొందరి వల్ల నష్టపోయానని చెప్పారు. ఈ వ్యవహారంలో తాను నిందితుడినే అయినా బాధితుడిని కూడా అని తెలిపారు. ఈ తప్పటడుగు వల్ల తన జీవితం మారిపోయిందని, కుటుంబ సభ్యులకు కూడా దూరం కావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సన్నిహితుల సూచనతో.. తాను 2013–14 నుంచే షేర్ బిజినెస్ చేస్తున్నానని, ప్రారంభంలో మంచి లాభాలు కూడా వచ్చాయని, పెట్టుబడులు భారీగా రావడం వల్ల సకా లంలో ఇన్వెస్టర్లకు లాభాలు చూపించగలిగానని చెప్పారు. ఆ సమయంలో రాజాంలో కార్యాలయం ఉండేదని, తన వ్యాపారం కంటే అధికంగా పెట్టుబడులు వచ్చేవని, కొన్నింటిని తిరస్కరించానని తెలిపారు. అయితే ఆ సమయంలో తన స్నేహితులు కొద్ది మంది షేర్స్‌తో ఇతర వ్యాపారాలు చేయవచ్చని సూచించారని, వారి ఒత్తిడి మేరకే అధిక పెట్టుబడులు తీసుకోవాల్సి వచ్చిం దని చెప్పారు. ఈ డబ్బు వృథాగా ఖర్చవుతూ ఉండేదని, దాన్ని తగ్గించడానికి సంతకవిటి మం డలం తాలాడ వద్ద సొంతంగా భవనాన్ని నిర్మిం చి, పరిశ్రమల కోసం బ్యాంకు లోన్లకు దరఖాస్తు చేసుకున్నానని వివరించారు. భూములు కూడా కొనడానికి సిద్ధంగా ఉన్న సమయంలో తనతోనే తిరుగుతున్న కొందరు తాము పెట్టిన పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారని, అంతటితో ఆగకుండా అమాయకుల వద్ద తన పేరుతో డబ్బు తీసుకుని, తనకు తెలీకుండా దోచేశారని ఆరోపించారు. ఈ విషయాలు తనకు తెలీసే సరికి పరిస్థితి చేయి దాటిపోయిందని చెప్పారు. ఐపీ ఆలోచనే లేదు.. తన వద్ద ఆరంభంలో రూ. 100 కోట్ల వరకూ పెట్టుబడులతో లావాదేవీలు జరిగేవని శ్రీరామ్ ‘సాక్షి’కి తెలిపారు. మోసం చేయాలనుకుంటే ఇం త పెద్ద మొత్తంలో లావాదేవీలు ఉన్న సమయంలోనే తాను కంపెనీ ఎత్తివేసి ఉండేవాడినని, అలా కాకుండా వ్యాపారాన్ని వృద్ధి చేయడంతో పాటు బ్యాంకు లోన్ల ద్వారా వేరే పరిశ్రమలు ప్రారంభించి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పా టు తాను కూడా మరికొంచెం ముందుకు వెళ్లాలని అనుకున్నానని తెలిపారు. అయితే నవంబర్ 2016లో వచ్చిన నోట్లు రద్దు ఈ పరిస్థితిని మార్చేసిందని, అప్పటి నుంచి పెట్టుబడులు నిలిచిపోయాయని అన్నారు. ఇదే అదనుగా తన చుట్టూ తి రుగుతున్న 23 మంది బడాబాబులు తమ డబ్బును బ్లాక్ మెయిల్ చేసి వెనక్కు తీసుకోవడంతో పాటు కొత్త పెట్టుబడిదారులను వెతికి తనకు తెలియకుండా తన పేరుతో వసూళ్లు చేశారని ఆరోపించారు. తాను ఇచ్చిన చెక్‌లు కూడా కొన్ని నకిలీవే ఉంటాయని అన్నారు. ఓ వైపు బ్యాంకు లోన్లు మంజూరు కాకపోగా, మరో వైపు నిరుపేదలు బలికావడం మనసు కలిచివేసిందని అన్నా రు. తన వద్ద పెట్టుబడులు పెట్టిన నిరుపేదలకు ఎలాగైనా డబ్బులు ఇచ్చేద్దామని అనుకుని రూ. 20 కోట్లు అప్పు చేయడానికి ప్రయత్నిస్తే, కొం దరు బడాబాబులు అడ్డుకున్నారని చెప్పారు. చేసేదేమీ లేక చివరి నిమిషంలో కొంతమంది తప్పుడు వ్యక్తుల సలహాలు తీసుకుని ఐపీకి సిద్ధపడ్డానని, ఈ ఐపీ తర్వాత కూడా పెట్టుబడులు పెట్టిన పేదలకు న్యాయం చేయాలని అనుకున్నానని అన్నారు. అయితే పరిస్థితి వికటించి తాను అరెస్టు అయ్యే వరకూ వచ్చిందని తెలిపారు. పోలీసులకు అంతా చెప్పా.. తాను దివాలా తీసే సమయంలో తన వద్ద వాస్తవ పెట్టుబడులు రూ. 20 నుంచి రూ.25 కోట్లకు మిం చిలేవని శ్రీరామ్ అన్నారు. కేవలం 78 మందికి మాత్రమే తాను న్యాయం చేయాల్సి ఉందని అన్నారు. తన వద్ద అక్రమ మార్గంలో డబ్బులు దోచేయడంతో పాటు, తన పేరుతో డబ్బులు దోచుకున్న 23 మంది పేర్లు తన వద్ద ఉన్నాయని, ఈ వివరాలు అన్నీ పోలీసుల ముందు పెట్టానని శ్రీరామ్ అన్నాడు. కేసు ముందుకు వెళ్తే గ్యారంటీగా తనతో పాటు నష్టపోయిన వారందరికీ న్యా యం జరుగుతుందని, బాధితులు సహకరించాలని కోరారు. బడాబాబుల హడావుడే... వాస్తవంగా తన వద్ద పెట్టుబడులు పెట్టి నష్టపోయిన బాధితులు ముందు రోడ్డు మీదకు రాలేదని, తన వద్ద పెట్టిన పెట్టుబడుల కంటే అధికంగా దోచుకున్న బడాబాబులు హడావుడి చేయడంతో పాటు తనను నిందితున్ని చేశారని శ్రీరామ్ తెలిపాడు. తాను బయటకు వచ్చి వీటిని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుండగా, అవకాశం లేకుండా దారులన్నీ మూసేసే ప్రయత్నాలు చేస్తున్నారని, తనపై మరిన్ని అభాండాలు వేసి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. దర్యాప్తులో నిజం బయటపడుతుందని తెలిపాడు. ప్రస్తుతం పైసా కూడా లేదు.. ప్రస్తుతం నీ వద్ద ఉన్న డబ్బు ఎంత అని ‘సాక్షి’ ప్రశ్నించగా తన వద్ద పైసా కూడా లేదని శ్రీరామ్ సమాధానమిచ్చాడు. అయితే బడాబాబులు అక్రమంగా సంపాదించిన డబ్బును బయటకు తీయడంతో పాటు పోలీసులు సీజ్ చేసిన తన ఆస్తులను విక్రయిస్తే రూ. 15 కోట్లకు పైబడి డబ్బు వస్తుందని అన్నారు. అసలైన బాధితులకు కొంతమేర న్యాయం చేయగలనని, మిగిలిన మొత్తాన్ని కూడా ఏదో ఒక రూపంలో చెల్లించేందుకు అవకాశం ఉందని తెలిపారు. -
ఆ ఇంట్లో శబ్దాలెందుకు వస్తున్నాయి?
రాజాం/సంతకవిటి : సంతకవిటి మండలం తాలాడ వద్ద ట్రేడ్ కార్యాలయం పెట్టి వందలాది మంది వద్ద పెట్టుబడుల రూపంలో నగదు సేకరించి ఆన్లైన్ మోసానికి పాల్పడిన ట్రేడ్ బ్రోకర్ టంకాల శ్రీరామ్ కేసులో కదలిక ప్రారంభమైంది. ట్రేడ్ బ్రోకర్ ఇంటి వద్ద ఏం జరుగుతోందనే విషయంపై సీఐడీ పోలీసులు ఆరా తీయడం ప్రారంభించారు. స్థానిక పోలీసులు తాము సీజ్ చేసిన ట్రేడ్ బ్రోకర్ కొత్త ఇంటిని, పాత గృహాలను గురువారం పరిశీలించారు. సంతకవిటి ఎస్ఐ ఎస్.చిరంజీవితో పాటు సిబ్బంది మందరాడ గ్రామానికి చేరుకుని ట్రేడ్ బ్రోకర్ ఇంటి పరిసర ప్రాంతాలపై ఆరా తీశారు. ఇటీవల సాక్షిలో వచ్చిన కథనంతో పాటు తమకు అందిన సమాచారం మేరకు ఇంటిని పరిశీలించడంతో పాటు ట్రేడ్ బ్రోకర్ ఆస్తులపై ఆరా తీస్తున్నామని అన్నారు. ఇంట్లోకి ఎవరో చొరబడుతున్నట్లు తెలుస్తోందని, ఏ కారణంగా వీళ్లు వస్తున్నారనే అంశంపై ఆరా తీస్తున్నామన్నారు. ఇంటికి సంబంధించి కిటికీ తలుపులు పగలగొట్టడంతో పాటు పోలీసులు వేసిన సీజ్ కాగితాలు చిరిగిపోవడంపై అనుమానంగా ఉందన్నారు. ఇంట్లోకి చొరబడిన వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సీఐడీ పోలీసుల రంగప్రవేశం నిన్నమొన్నటి వరకూ గుంభనంగా ఉన్న ట్రేడ్ బ్రోకర్ కేసుకు సంబంధించి విశాఖ సీఐడీ పోలీసులు గురువారం సంతకవిటి, రాజాం మండలాల్లో పర్యటించారు. బ్రోకర్ వద్ద పనిచేసిన ఒకరిద్దరు యువకులతో పలుచోట్లకు వెళ్లారు. పలు అంశాలపై ఆరాతీసి దర్యాప్తు కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సంతకవిటి ఎస్ఐ చిరంజీవి మాట్లాడుతూ ట్రేడ్ బ్రోకర్ ఆస్తులు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని, వాటి పరిరక్షణ నిమిత్తం పరిశీలన చేశామన్నారు. సీఐడీ డీఎస్పీ భూషణనాయుడు మాట్లాడుతూ కేసుకు సంబంధించి దర్యాప్తు జరుగుతోందని, ఈ మేరకు పరిశీలనలు జరుగుతున్నాయని అన్నారు. రాజాం చుట్టుపక్కలే ట్రేడ్ బ్రోకర్ టంకాల శ్రీరామ్ రాజాం చుట్టు పక్కలే ఉండి చక్కర్లు కొడుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. బెయిల్‌పై ఉన్న ఆయన రాజాం పోలీస్ సర్కిల్కార్యాలయానికి కండీషన్ ప్రకారం రావాల్సి ఉంటుంది. దీంతో విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాలతో పాటు రాజాం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాడనే అనుమానాలు ఉన్నాయి. అతడి కదలికలను, పోలీస్‌స్టేషన్‌కు హాజరవుతున్న వివరాలను మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. మాకు న్యాయం జరుగుతుందా.. మందరాడ వచ్చిన సంతకవిటి ఎస్ఐ వద్ద మందరాడతో పాటు పరిసర గ్రామాలకు చెందిన ట్రేడ్‌బ్రోకర్ బాధితులు మొరపెట్టుకున్నారు. పోలీసులే న్యాయం చేయాలని వేడుకున్నారు. తామంతా నిరుపేద కుటుంబాలుకు చెందినవారమని, పెట్టుబడులు పెట్టి మోసపోయామని వివరించారు. శ్రీరామ్‌తో పాటు అతని బంధువులు కూడా అందుబాటులో లేకపోవడంతో ఆందోళనగా ఉందని వాపోయారు. -
రక్షణాత్మక వాణిజ్యం వృద్ధికి విఘాతం
హాంకాంగ్: వివిధ దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక వాణిజ్య విధానాలు ప్రపంచ వృద్ధికి విఘాతంగా మారతాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టినా లగార్డ్ పేర్కొన్నారు. ఇలాంటి విధానాలు విడనాడాలని హెచ్చరించారు. అమెరికా–చైనాల మధ్య ‘వాణిజ్య యుద్ధ’ భయాల నేపథ్యంలో ఆమె ఇక్కడ ఒక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రసంగంలో మరిన్ని ముఖ్యాంశాలు... ► ప్రపంచ వృద్ధికి స్వేచ్ఛా వాణిజ్య విధానాలే సరైనవి. ఇందుకు విరుద్ధమైన బాటను దేశాలు విడనాడాలి. ఏ రూపంలోనూ వాణిజ్య రక్షణాత్మక విధానాలు అనుసరించకూడదు. ►తగిన వాణిజ్య విధానాలు లేనందువల్లే వాణిజ్య లోటు ఏర్పడ్డానికి కారణమన్న అభిప్రాయం తప్పు. (అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే ఈ తరహా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ►ఒక విషయం గుర్తుంచుకోవాలి. బహుళ వాణిజ్య విధాన వ్యవస్థే ప్రపంచం మార్పునకు కారణం. అత్యంత పేదరికంలో జీవిస్తున్న ప్రజల పేదరికాన్ని కొంతవరకైనా తగ్గించడానికి ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. అధిక వేతనాలతో లక్షలాది ఉద్యోగాలను ప్రపంచవ్యాప్తంగా సృష్టించడానికి ఈ వ్యవస్థ దోహదపడింది. ►వ్యవస్థలో లోపాలు ఏమన్నా ఉంటే సరిదిద్దుకోవాలి తప్ప, దీనిని మొత్తంగానే తప్పుపట్టడం తగదు. ►కొత్త సాంకేతికత, ఇందుకు సంబంధించి విద్య, శిక్షణల్లో పెట్టుబడుల పెంపుతో వృద్ధిని మరింత పెంపొందించడానికి వీలు కలుగుతుంది. ఇందుకు ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. ►ప్రపంచ వాణిజ్య వృద్ధి పట్ల మేము పూర్తి ఆశావహంతో ఉన్నాము. 2018, 2019లో 3.9 శాతం వృద్ధి నమోదవుతుందన్నది జనవరిలో ఐఎంఎఫ్ వేసిన అంచనా. ►అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం తాజా వృద్ధి రికవరీ ధోరణి బాగుంది. చైనా, భారత్, జపాన్‌లో కూడా పటిష్ట వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నాం. -
లెమన్ ట్రీ డెబ్యూ అదిరింది
సాక్షి, ముంబై: ఆతిథ్య రంగ సంస్థ లెమన్ ట్రీ హోటల్స్ మొట్టమొదటి ట్రేడింగ్‌లో అదరగొట్టింది. మొట్టమొదటి ట్రేడింగ్‌లోనే లాభాల మోతమోగించింది. లిస్టింగ్‌లో 10 శాతం ప్రీమియాన్ని సాధించిన లెమన్ ట్రీ హోటల్స్ స్టాక్ ట్రేడింగ్ ఆద్యంతం జోరుగా సాగింది. ఇష్యూ ధర రూ. 56కాగా ఆరంభంలోనే 10శాతం దూసుకెళ్లింది. అనంతరం దాదాపు 32శాతానికి పైగా ఎగిసింది. చివరికి 28 శాతం లాభంతో 73.90వద్ద ముగిసింది. గత నెలాఖరున ఐపీవోకి వచ్చిన కంపెనీ దాదాపు రూ. 1039 కోట్లను సమీకరించింది. ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 311 కోట్లను సమీకరించింది. అయితే ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి అంతంత మాత్ర స్పందనే కనిపించింది. ఇష్యూకి 1.2 రెట్లు అధికంగా మాత్రమే బిడ్స్ దాఖలయ్యాయి. ఐపీవోలో భాగంగా లెమన్ ట్రీ 12.98 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 15.47 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల(క్విబ్) కోటా 3.88 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌కాగా.. సంపన్న వర్గాలు, రిటైల్ విభాగాల నుంచి నామమాత్రంగా 0.12 శాతమే దరఖాస్తులు లభించాయి. కాగా మిడ్ రేంజ్లో దేశీయంగా అతిపెద్ద సంస్థ అయిన లెమన్ ట్రీ హోటల్స్ 28 పట్టణాలలో 45 హోటళ్లను నిర్వహిస్తోంది. లెమన్ ట్రీ ప్రీమియం, లెమన్ ట్రీ, రెడ్ ఫాక్స్ బ్రాండ్లతో ప్రీమియం, మధ్యస్థాయి, ఎకానమీ విభాగాల్లో మొత్తంగా 4,700 రూములను ఆఫర్ చేస్తోంది. -
ఎవరా ప్రతాప్..ఆ లేఖలపై ఆరా..
సంతకవిటి: మండలంలో మందరాడ గ్రామానికి చెందిన ట్రేడ్‌బ్రోకర్ టంకాల శ్రీరామ్ ఆన్లైన్ మోసానికి సంబంధించిన కేసుపై విశాఖ సీఐడీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మందరాడకు చెందిన గార ప్రతాప్, గార ఉమామహేశ్వరరావు, యడ్ల హరిబాబు, సాకేతి ప్రసాద్‌లను గురువారం విశాఖపట్నం పిలిపించుకొని విచారణ చేపట్టారు. ట్రేడ్బ్రోకర్కు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించడంతోపాటు పలు అంశాలపై దర్యాప్తు జరిపినట్లు తెలిసింది. శ్రీరామ్‌తో వీరికి ఉన్న సంబంధాలపై ఆరా తీసినట్లు సమాచారం. ఎవరా ప్రతాప్.. మందరాడకు చెందిన గార ప్రతాప్ హైదరాబాద్‌లో ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన తన స్నేహితులతో కలసి శ్రీరామ్ వద్ద భారీగా పెట్టుబడులు పెట్టారు. శ్రీరామ్‌తో పలు సందర్భాల్లో సన్నిహితంగా గడపడంతో ప్రతాప్‌ను విచారించినట్లు తెలిసింది. అయితే తన వద్ద ఎటువంటి సమాచారం లేదని, కేవలం పెట్టుబడులు మాత్రమే పెట్టానని ప్రతాప్ చెప్పినట్లు సమాచారం. మిగిలిన ముగ్గురెవరు.. సీఐడీ పోలీసులు విచారణకు ఆదేశించిన వారిలో గార ఉమామహేశ్వరరావు మందరాడ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త. ఈయన కూడా శ్రీరామ్‌తో సన్నిహితంగా ఉండేవాడు. గార ప్రతాప్‌కు స్వయాన తండ్రి. శ్రీరామ్ వద్ద పెట్టుబడులు పెట్టడంతోపాటు లాభాలు కూడా పొందినట్లు పలువురు బాధితులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఉమామహేశ్వరరావును విచారణకు పిలిచినట్లు తెలిసింది. సాకేతి ప్రసాద్, యడ్ల హరిబాబులు శ్రీరామ్ వద్ద ట్రేడ్ కార్యాలయంలో పనిచేసేవారు. శ్రీరామ్‌తో సన్నిహితంగా ఉంటూ ఖాతాదారుల వద్దకు వెళ్తుండేవారు. ఈ నేపథ్యంలోనే వీరిని కూడా విచారణకు పిలిచించారు. సుదీర్ఘ విచారణ.. గార ప్రతాప్‌ను సుదీర్ఘంగా విచారణ జరిపినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. మిగిలిన ముగ్గురిని శుక్రవా రం విచారించనున్నట్లు సమాచారం. పలు రికార్డులపై సంతకాలు కూడా తీసుకుంటున్నట్లు తెలి సింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడంతోపాటు పెట్టుబడులు ఎటువైపు మళ్లి ఉంటాయోనన్న దానిపై ఈ దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం. ఆ లేఖలపై ఆరా.. సీఐడీ పోలీసులు శ్రీరామ్ పరారీకి ముందు రాసిన లేఖలపై ఆరా తీసినట్లు అధికారులు తెలిపారు. లేఖలు ఏ పరిస్థితిలో రాయాల్సి వచ్చింది.. లేఖలు అందినవారు ఎటువంటి సలహాలు ఇచ్చారనేదానిపై ఆరా తీస్తున్నారని పోలీసులు విలేకరులకు తెలిపారు. -
అందని సాయం..మానని గాయం
దాదాపు వంద రోజుల విచారణ, వందలాది మంది పెట్టుబడిదారుల ఆందోళన, ఇద్దరి ప్రాణార్పణ, రూ.187 కోట్ల స్వాహాపై ఇంకా కొనసాగుతున్న ఉత్కంఠ.. ఇదీ క్లుప్తంగా ట్రేడ్ బ్రోకర్ కేసు స్వరూపం. మూడు నెలల కిందట జిల్లాలో తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ కేసు విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. దీనిపై పెట్టుబడిదారులు అసంతృప్తిలో ఉన్నారు. సీఐడీ చేతికి కేసు వెళ్లినా విచారణలో పురోగతి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన నిందితుడికి బెయిల్ రావడాన్ని కూడా వారు స్వాగతించలేకపోతున్నారు. ఏ వైపు నుంచీ సాయం అందక, గుండెకు తగిలిన గాయం మానక బాధితులు నరకం చూస్తున్నారు. రాజాం: ట్రేడ్ బ్రోకర్ ఆన్లైన్ మోసం కేసు నీరుగారుతుందా..? బాధితులతో పాటు ఈ కే సును ఫాలో అవుతున్న వారి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న ఇది. సం తకవిటి మండలం మందరాడలో షేర్ మార్కెట్ పేరిట రూ.187 కోట్లకు ప్రజలను ముంచి వం ద రోజులు గడిచిపోయా యి. ఈ కేసు విచారణను మొదటి నుంచీ గమనిస్తు న్న వారిలో ఇప్పు డు జరుగుతున్న పరిణామాలు కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మూడు నెలల కిందట ఈ ఘటనతో జిల్లా ఉలిక్కిపడింది. అంత పెద్ద మొత్తంలో మోసం జరిగిందా అంటూ ఆశ్చర్యపోయింది. ఇప్పుడు విచారణ చూసినా అదే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ప్రధా న నిందితునికి బెయిల్ రావడం, బాధితులు ఎంత మోసపోయారో ఇంకా గుర్తించకపోవడం, ఎంత రికవరీ చేశారో చెప్పకపోవడం వంటి అంశాలు అనుమానాలకు ఊతమిస్తున్నాయి. 900 మందికి పైగా బాధితులను, పెట్టుబడిదారులను నిలువునా ముంచినా కేసు విచారణ ఇంత నెమ్మదిగా సాగడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నవంబర్ 10న.. 2017, నవంబర్ 10వ తేదీన తాలాడ గ్రామంలో ట్రేడ్ బ్రోకర్ సిబ్బంది కార్యాలయానికి తాళా లు వేయడంతో సంచలనం ఏర్పడింది. టం కాల శ్రీరామ్ అనే పేరు ఓవర్ నైట్‌లో జిల్లా మొత్తం తెలిసిపోయింది. అప్పటి వరకు పెట్టుబడిదారులు అతని వద్ద రెండు మూడు కోట్లు ఉంటాయని మాత్రమే అనుకునేవారు. కానీ మోసం విలువ రూ.187 కోట్లని తెలిసి వారంతా ఆశ్చర్యపోయారు. శ్రీరామ్ కార్యాలయానికి తాళం పడడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. మొదట సంతకవిటి పోలీ స్ స్టేషన్లో బ్రోకర్ హామీల రూపంలో ఇచ్చిన చెక్‌లతో కేసులు పెట్టగా మొత్తం రూ.36 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. అయితే అక్కడితో కథ ముగియలేదు. కొంతమంది కో ర్టును కూడా ఆశ్రయించారు. ఈ ఆధారాలతో నష్టపోయినవారి నగదు రూ. 50 కోట్లు వరకూ ఉంటుందనేది అంచనా. ఇవి కాకుండా కొంతమంది ఉద్యోగులు భయపడి కేసులు పెట్టలేదు. నవంబర్ 10న ట్రేడ్ బ్రోకర్ కార్యాలయానికి తాళాలు వేసిన అనంతరం చాలా మంది నిరుపేదలు మంచంపట్టారు. రూ. 25 లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టిన ఇద్దరు బాధితులు ఈ మోసాన్ని జీర్ణించుకోలేక మృతి చెందారు. ఏదీ పురోగతి? కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు పాలకొండ డీఎస్సీ జి. స్వరూప శరవేగంగా కేసును ముందుకు నడిపా రు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నా రు. కొంతమంది ఇచ్చిన ఫిర్యాదులు మేరకు బ్రోకర్ శ్రీరామ్‌తో పాటు మరో ఐదుగురిని అ రెస్టు చేశారు. దీనిపై కొందరు ఎస్పీ కార్యాల యం ఎదుట గగ్గోలు పెట్టినా పోలీసు అధికారులు పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత ఎందుకో విచారణలో స్పీడు తగ్గింది. మూడు నెలలుగా కేసులో పురోగతి ఏమీ కనిపించడం లేదు. ఇదంతా ఎవరి సొత్తు.. తాలాడ వద్ద హంగులతో నిర్మించిన ట్రేడ్ బ్రోకర్ కార్యాలయం, పక్కనే 25 ఎకరాల తోట సీఐడీ ఏం చేస్తోంది? నెలరోజుల కిందట విశాఖపట్నంకు చెందిన సీఐడీ అధికారులు కేసును తమ పరిధిలోకి తీసుకున్నారు. పలువురు ట్రేడ్ బ్రోకర్ ఉద్యోగులపై ఆరా తీశారు. ప్రత్యేక అనుమానితులను పిలు పించుకుని విచారణ చేపట్టారు. ఇదంతా జరిగి నెలరోజులు కావస్తున్నా అసలు విషయం ఇంతవరకూ బయటకు రాలేదు. ఈ మోసానికి ప్రధా న కారకులు ఒక్క శ్రీరామేనా, ఇంకెవరైనా ఉ న్నారా అన్నది ఇంతవరకూ వెల్లడికాలేదు. పె ట్టుబడిదారులు పెట్టిన పెట్టుబడులకు సంబం ధించి ఎంత రికవరీ అయ్యిందనేది పత్రికా పరంగా కూడా వెల్లడికాలేదు. అసలేం జరుగుతుందో తెలీని పరిస్థితి ఉందని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. ఎక్కువ మంది తమ పి ల్లలకు వివాహాల కోసం, భవిష్యత్ ఉపయోగా ల కోసమే పెట్టుబడులు పెట్టారు. వీరంతా ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు. కొంతమంది మంచం పట్టారు. నీరు గారుతోందా? ప్రధాన నిందితునికి బెయిల్ రావడంపై బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేసులో పు రోగతి ఏమీ లేదని వారంటున్నారు. సీఐడీ కేసును తీసుకోవడంతో పెట్టుబడి వివరాలు తెలిసి, తమకు న్యాయం జరుగుతుందని, ఎం తో కొంత రికవరీ అవుతుందని ఆశ పడిన వా రంతా ప్రస్తుతం అయోమయంలో ఉన్నారు. అధికార పార్టీ నేతల హస్తం ఉందా? ట్రేడ్ బ్రోకర్ శ్రీరామ్ అధికార పార్టీ నేతలను కూడా ముంచినట్లు సమాచారం. పెట్టుబడులు ఎక్కువగా రాబట్టేందుకు అధికార పార్టీకి చెందిన నేతలను వినియోగించుకోవడంతో పాటు పలువురు నాయకుల నుంచి కూడా పెట్టుబడులు తీసుకుని ప్రస్తుతం వారికి కూడా ఎగనామం పెట్టినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నేతలు శ్రీరామ్‌ను బయటకు వచ్చేవిధంగా ఏర్పాట్లు చేసి తాము నష్టపోయిన మొత్తంలో ఎంతో కొంత నగదును రికవరీ చేసుకునేం దుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు అంతా గోప్యంగా ఉండి, కేసుపై కదలికలు లేకుండా జాగ్రత్తలు వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ డబ్బు ఏమైనట్టు? బ్రోకర్ శ్రీరామ్ ఎంత డబ్బును పెట్టుబడి రూపంలో తీసుకున్నాడు? ప్రస్తుతం ఎంత ఉందనేది ఇంకా కొలిక్కిరాలేదు. పోలీసులు, సీఐడీ అధికారులు కూడా ఈ విషయాన్ని వెల్లడించడం లేదు. ప్రస్తుతం శ్రీరామ్ కుటుంబ సభ్యులు, బంధువులను, స్నేహితులను విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ వివరాలు కూడా గోప్యంగా ఉన్నాయి. ఈ అక్రమ ఆస్తుల వివరాల కోసం ఎదురుచూస్తున్న బాధితులకు మాత్రం కళ్లు కాయలు కాస్తున్నాయి. ముమ్మర దర్యాప్తు ట్రేడ్ బ్రోకర్ కేసుకు సంబంధించి ముమ్మర దర్యాప్తు జరుగుతున్నట్లు విశాఖపట్నం సీఐడీ డీఎస్పీ ఎస్.నాగభూషణంనాయుడు ‘సాక్షి’కి తెలిపారు. అయితే ఏ కోణంలో వి చారిస్తున్నామో, ఎవరెవరిని విచారిస్తున్నామన్నది గోప్యంగా ఉంచాల్సి ఉందని అన్నారు. త్వరలోనే బ్రోకర్ వద్ద పెట్టిన పెట్టుబడులతో పాటు అక్రమ ఆస్తులు వివరాలు వెల్లడించి ఉన్నతాధికారులకు నివేదించడంతో పాటు బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. -
ట్రేడ్
‘దాలయమ్మ వద్దు. దివ్యా అని పెట్టుకుందాం. ఎవరైనా అడిగితే అసలు పేరు అదే అని నువ్వు కూడా చెప్పు’ ‘ఊ’ అన్నాను. ‘ఏమైనా మనం అదృష్టవంతులం. పిల్ల దొరికింది. పదునాలుగు లోకాలు తిరిగితే పాతాళంలో దొరికింది పిల్ల. తూర్పు ప్రాంతం అంటే పాతాళమేలే. ఏం ఉండి చచ్చింది కనుక ఇక్కడ’ మళ్లీ ‘ఊ’ అన్నాను. నా దృష్టంతా పెద్ద రింగుల అమ్మాయి మీదే ఉంది. చిన్న రింగుల అమ్మాయి నా కాళ్ల దగ్గర కూచుని ఉంది. ఇద్దరూ మాలాగే శ్రీకాకుళం రోడ్డులో రైలెక్కారు. హౌరా నుంచి వాస్కో వెళ్లే రైలంటే ఇసుకలారీ కన్నా అధ్వాన్నం. రిజర్వేషన్ ఉన్నా లేకున్నా ఎక్కడ దొరికితే అక్కడ దూరిపోతారు. ఈ ఇద్దరు ఆడపిల్లలు కూడా దూరిపోయారు బతిమిలాడుకుని. రెండు పెద్ద సూట్‌కేసులు ఉన్నాయి. ఒక మూటలో వంట గిన్నెలు ఉన్నట్టున్నాయి. పక్క కంపార్ట్మెంట్లో వీళ్లలాగే చోటు చేసుకోగలిగిన ఒక మొరటు మనిషి గంటగంటకూ వచ్చి ఈ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారా లేరా చూసి వెళుతున్నాడు. పెద్దరింగుల అమ్మాయి సైడ్ బెర్త్ పక్కన నిలుచుని ఉంది. ఇందాకటి స్టేషన్లో ఎక్కిన కుర్రాడు ఆ అమ్మాయికి దగ్గరగా నిలుచున్నాడు. వాడంత దగ్గరగా నిలుచున్నా చలించడం లేదేమిటా అని చూస్తున్నాను. ‘బ్రోకరుగాడు దొంగముండా కొడుకులాగున్నాడు. ఐదు లక్షలకు టోపీ వేద్దామనుకున్నాడు. మూడున్నరకే తెగ్గొట్టడం మంచిదయ్యింది. లక్షకు మూడెకరాలొచ్చే ప్రాంతంలో మూడున్నరంటే ఎక్కువే. అదీగాక పెళ్లి ఖర్చులు మనవే. మంటపం ఖర్చు మనదే. తాళిబొట్టు, గాజులు... ఒకటేమిటి... రేపు మనింటి కోడలైతే మనాస్తి తనాస్తి కాదా. హూ. మన ప్రాంతం అమ్మాయి మన తాహతు అమ్మాయి దొరుకుతుందనుకున్నాను. నాగుపాము నెత్తిన మణైనా దొరికేలా ఉందికాని ఆడపిల్ల దొరికేలా లేదు. కులం గోత్రం కూడా వదిలేయాల్సొస్తుంది. అయితే అమ్మాయ్... నేను మాత్రం మీ పెద్ద పిన్నిలాగా ఈవైపు నుంచి తెచ్చుకుని వేషం మార్చి రూపు మార్చి కాటను చీరలకు బదులు కంచి పట్టుచీరలు కట్టి ఇంట్లో బుట్టబొమ్మలాగా కూచోబెట్టినా మరీ సంవత్సరానికి ఒకసారి తీర్థం కోసమే పుట్టింటికి పంపను.ఎన్నిసార్లయినా రావొచ్చు. ఎన్నిసార్లయినా పోవచ్చు. ఆడపిల్లనే కదా తెచ్చుకుంటున్నాం. బానిసను కాదు గదా’ రాత్రి పది దాటేసింది. మార్కాపురం కూడా దాటేసినట్టుంది. లైట్లు మందం అయ్యాయి. ఆ కుర్రాడు ఆ అమ్మాయి చెవి దగ్గరకు వాలాడు. వాలాడా? చలించదేంటా పిల్లా? ‘ఏమైనా బ్రోకరు తెలివైనోడేలే. అమ్మాయిని కూచోబెట్టి దాని అమా ్మబాబుని కూచోబెట్టి అన్నీ వైనంగా చెప్పాడు. ఇక్కడుంటే ఏముంది మట్టి బతుకు... రైకగుడ్డకి కూడా కూలిపనికి వెళ్లి గాడిద చాకిరీ చేయాలి. ఇక్కడి పిల్లోణ్ణి చేసుకుంటే పగలు బయటి కష్టం రాత్రి మంచం కష్టం తప్ప ఏమీ ఉండదు. పైగా తాగొచ్చి బాదడం ఒకటి. మన ఆడ పిల్లలు ఎందరిప్పుడు సుకంగా లేరూ? తుంగబద్ర పక్కకెళ్లి కర్నాటకలో సెటిలైన తెలుగాళ్లు అక్కడ వ్యవసాయం చేసి ఆరుసార్లు తిని మూడుసార్లు వెళ్లేంత సంపాదిచ్చారు. కార్లు బంగళాలు నౌకర్లు చాకర్లు పట్టుపరుపుల మీద పడుతుంది బతుకు. అదేమైనా దుబాయా గిబాయా బయపట్టానికి. మూడు నెలలు బెజవాడ బాష మాట్లాడటంలో ట్రైనింగ్ ఇస్తా. పోయి బెజవాడ ప్రాంతం అమ్మాయిలాగా కలిసిపోవడమే. వాళ్లు ఎదురిచ్చిన డబ్బుతో మీ అమ్మా అప్పా బాగుపడతారు. మన పక్కూరు పుల్లెంకి పుష్పలా మారి గుంటూరుకు కోడరికం వెళ్లలేదా. అప్పలమ్మ అనూషా పేరుతో నూజివీడులో చెలాయించడం లేదా. ఇది బూదిగుంపు కేంపు సంబందం. హోస్పేటకు దగ్గర. సినిమాల్లో చూపించినట్టు స్వర్గంలా ఉంటుందా చోటు. ఎర్రగా బుర్రగా ఉండబట్టి నీ పంట పదహారుసార్లు పండినట్టే పో అనంటే అప్పుడు ఒప్పుకున్నారు’‘అయినా వాళ్ల భయాలు వాళ్లకున్నాయిగా అత్తా’ అన్నాను.‘ఎందుకుండవు. కూటికి లేనోళ్లని తెచ్చి కోడలిగా కూచోబెట్టాక మన పద్ధతులు తెలిసే దాకా కసరమా.. కొసరమా? ఛీఛాలు చీత్కారాలు ఉంటాయ్. నిఘా ఉంటుంది. డబ్బుకు అమ్ముడుపోయాక అన్నీ పడాల్సిందే. మన పక్క అమ్మాయిలు కరువై ఒక్కో ఊళ్లో యాభై అరవైమంది కుర్రాళ్లు పెళ్ళిళ్లుగాక ఆడచెట్టుకైనా ఇచ్చి చేయండో అని తిరగతా ఉన్నారనిగానీ’....ఏదో కదలిక. మైగాడ్. బేరం కుదిరినట్టుంది.పెద్ద రింగుల అమ్మాయి, ఆ కుర్రాడు టాయిలెట్‌వైపు వెళుతున్నారు. కాళ్ల దగ్గర కూచున్న చిన్న రింగుల అమ్మాయి ఏమీ పట్టనట్టే చూస్తోంది. ఇదంతా నా కంట్లో పడుతుందేమిటీ.ఐదు పది నిమిషాలు కూడా కాలేదు. ఆ కుర్రాడు వేగంగా రాసుకుంటూ ఈ వైపుకు వెళ్లాడు. పెద్ద రింగుల అమ్మాయిని గంట గంటకీ వచ్చి చెక్ చేస్తున్న మనిషి టపాటపా రెండు బాదుతున్నాడు. ‘అప్పుడే మొదలెట్టావా సొంత బిజినెస్సు. దొంగముఖం దానా’ తిడుతున్నాడు. ఆ అమ్మాయి ఏం పట్టనట్టుగా వచ్చి ఇందాక నిలుచున్న చోట నిలుచుంది. కుర్రాడు డబ్బులెగ్గొట్టి వెళ్లినట్టున్నాడు.. అటే చూస్తోంది.‘ఎక్కడికెళుతున్నారు?’ అడిగాను.‘గోవా’‘ఏం చేస్తారక్కడ’‘క్లబ్బుల్లో పేకలు కలపడం, మందు పొయ్యడం, రాత్రిళ్లు ఈడు పంపినోళ్ల దగ్గర ఉండటం. మా అమ్మా బాబులకు అడ్వాన్స్ ఇచ్చి తీసుకెళుతున్నాడు. ఇది రెండోసారి’ ఏ భావం లేకుండా చెప్పింది.‘ఎంత సంపాదిస్తావ్’‘ఎంత సంపాదించినా అదంతా నరకం. ఎంతమందొస్తారో చెప్పలేం. ఒక్కోసారి ఇద్దరుముగ్గురొచ్చి ఒకేసారి అంటారు. కొట్టేవాళ్లు.. కొరికేవాళ్లు... రాజాం పక్కన వంద గడపల ఊరు మాది. తినడానికి తిండి లేదు. అక్కడైతే టేబుల్ మీదొదిలేసిన చికెన్ ముక్కలైనా దొరుకుతాయి. ఆకలికి ఏడ్వడం కన్నా మగాడు మీద పడ్డప్పుడు ఏడ్వడం మేలుగదా’ లోగొంతుకలో జీరగా అంది.వికారంగా అనిపించింది. టాయిలెట్ వైపు వెళుతుంటే ఆ కుర్రాడు కనిపించి ఐదువందల నోటు ముందు సాచాడు.‘ఇది ఆ అమ్మాయికి ఇవ్వండి. దీని మీద నా నంబర్ ఉంది. ఇష్టమైతే బళ్లారిలో దిగిపొమ్మనండి’ అన్నాడు.బళ్లారిలో గోలగోలగా తెల్లారింది.‘తప్పించుకున్నారా ముండల్లారా... తప్పించుకున్నారా.. ఎక్కడికెళతారో చూస్తాను’ అని ఆ చెకింగు మనిషి రంకెలేస్తూ తిరుగుతున్నాడు.ఎస్కేప్ అయ్యారన్నమాట. మా మేనత్త లేచి తీరిగ్గా ఆవలించిజుట్టు ముడివేసుకుంటోంది.ఈ పిల్లలు వాడి నుంచి తప్పించుకున్నారు. మా అత్త నుంచి ఆ దాలయమ్మ తప్పించుకుంటుందా?కథ ముగిసింది.మన్నం సింధుమాధురి రాసిన ‘తూరుపు కండ’ కథ ఇది.అసమ ఆర్థిక వ్యవస్థలో ట్రేడ్ అయ్యే మొదటి వస్తువు స్త్రీయే. స్త్రీతో ముడిపడిన వ్యాపారం శృంగార బానిసత్వానికే కాదు సాంస్కృతిక బానిసత్వంలోకి కూడా కొనసాగుతూ ఉంటుంది. నాగరీకం నేర్చిన కోస్తాంధ్ర ఉన్నత వర్గాలు ఒకరితో ఇద్దరితో సరిపెట్టుకుని ఆప్షన్స్ కోల్పోయి చతికిల పడటం తెలుస్తోంది. పూర్వం పాలఘాట్ నుంచి ఆడపిల్లలను పెళ్లి చేసుకుని తెచ్చేవారు. ఇప్పుడు తూరుపుకు వెళుతున్నారు. హింస అంటే కొట్టడం తిట్టడమే కాదు. కల్చరల్ డిస్ప్లేస్మెంట్ కూడా. ఎన్ని కథలొస్తే ఈ బాధ తెలుస్తుంది. పునః కథనం: ఖదీర్ మన్నం సింధుమాధురి -
వాణిజ్య బంధంతో ముందడుగు!
ఆవిష్కరణలు ఒక దేశ ఆర్థిక వ్యవస్థపై చూపే కీలకమైన, సానుకూల ప్రభావం ఎలాంటిదో హైదరాబాద్‌లో ఈ మధ్యే జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో మనం చూశాం. భారత్ మార్కెట్‌ను అమెరికా వ్యాపార, వాణిజ్యం కోసం విస్తరించడం వల్ల మన రెండు ఆర్థిక వ్యవస్థలను కాపాడగలిగే అధునాతన సాంకేతికతలను అందిపుచ్చుకోవచ్చు. అమెరికన్ సంస్థల వద్ద ఉన్న వినూత్న సాంకేతికతలు భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 100 స్మార్ట్ నగరాల ప్రాజెక్టుకు ఎంతగానో ఉపయోగపడతాయి. అమెరికా– భారత్ మధ్య భాగస్వామ్యం అన్ని అంతర్జాతీయ వ్యవహారాల మాదిరిగానే పరిణామాత్మకమైంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం మన దేశాలను పటిష్టం చేయడంతో పాటు ఇండో–పసిఫిక్ ప్రాంతంపై ప్రయోజనకరమైన ప్రభావం చూపుతుంది. గత పదిహేడు సంవత్సరాల కాలంలో మన దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాది వేశాం. ఇది ఈ 21వ శతాబ్దంలో మాత్రమే కాదు, తదనంతర కాలంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ బలమైన పునాదిపై మరింత నిర్మాణం చేయాల్సి ఉంది. మనకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి ఈ ప్రాంత సుస్థిర నిర్మాణం కోసం కృషి చేయాలి. అమెరికా – భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టంగా మలచాల్సిన అవసరం ఉంది. మనందరి ప్రయోజనం కోసం స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన ప్రాంతంగా ఇండో–పసిఫిక్ ప్రాంతం ఉండాలనే అమెరికా దీర్ఘకాలిక నిబద్ధత వలన ఈ ప్రాంతంలో సుస్థిరత ఏర్పడి, గణనీయ స్థాయిలో వాణిజ్య ఎదుగుదలకు దోహదపడుతుంది. మనందరి భవిష్యత్తు ఇండో–పసిఫిక్ ప్రాంత అభివృద్ధితో విడదీయలేని విధంగా ముడిపడి ఉన్నందువల్ల ఈ ప్రాంత స్థిరత్వానికి అమెరికా కట్టుబడి ఉంది. అంతర్జాతీయంగా అందరికీ వర్తించే నియమాలకు మనందరం కట్టుబడుతున్నాము. ఒక దృఢమైన నమ్మకంతో భాగస్వాములుగా ఎదుగుతున్నాం. అమెరికా విదేశాంగమంత్రి టిల్లెర్ సన్ మాటల్లో చెప్పాలంటే, అవ్యవస్థత, సంఘర్షణ, దోపిడీ ఆర్థిక విధానాల స్థానంలో ఇండో–పసిఫిక్ ప్రాంతాన్ని ఒక శాంతియుతమైన, సుస్థిరమైన, సంపద్వంతమైన ప్రాంతంగా ఎదిగించేందుకు, ఒక ప్రాంతీయ నిర్మాణ చట్రంపై భావసారూప్యం కలిగిన దేశాలన్నీ కృషి చేయడంలో భాగంగా ఈ ప్రాంత వాణిజ్యంలో భారత్ నాయకత్వాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. రక్షణ రంగంలో పూర్తి సహకారం రక్షణ, ఉగ్రవాద నిరోధంపై మన దేశాల మధ్య సహకారం అతి ముఖ్యమైనది. అమెరికా రక్షణ సంస్థలు ఇప్పటికే ఇండియాలో పెట్టుబడులు పెట్టి అత్యంత కీలకమైన రక్షణ వ్యవస్థల కోసం విడిభాగాలు తయారు చేస్తున్నాయి. దేశీయంగా రక్షణ సామర్థ్యాలు పెంచుకునేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మేము మద్దతునిస్తాం. ప్రధాన రక్షణ భాగస్వాములుగా, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మన రెండు దేశాల సేనల సామర్థ్యాన్ని పరస్పర సహకారంతో వినియోగించుకోవడాన్ని మరిం తగా విస్తరింపచేసేందుకు కృషి చేస్తాం. మన రక్షణ రంగ భాగస్వామ్యం లాగానే మన దేశాల మధ్య ఉన్న వాణిజ్య భాగస్వామ్యంపై కూడా దృష్టి పెట్టాలి. చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు, వ్యాపారం చేసేందుకు ఉన్న అడ్డంకుల గురించి అనేక అమెరికన్ సంస్థలు విచారం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలు తగ్గించుకుంటే, మరికొన్ని సంస్థలు ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి పెట్టాయి. ఇండియా ఈ వ్యూహాత్మక అవకాశాన్ని ఉపయోగించుకొని, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అమెరికన్ సంస్థల పెట్టుబడులు, వాణిజ్యానికి ప్రత్యామ్నాయ కేంద్రంగా ఎదగాలి. స్వేచ్ఛ, న్యాయమైన వాణిజ్యం అనేవి ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్న భారత్ దీర్ఘకాలిక వృద్ధికి ఉపయోగపడుతాయి. మోదీ ప్రకటించిన ‘మేక్ ఇన్ ఇండియా’, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతి పాదించిన ‘అమెరికా ఫస్ట్’ అనేవి పరస్పరం విరుద్ధమైనవి కావు. పైగా, రెండు దేశాలు ఇతర మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వలన మన వ్యాపార సంబంధాలు పెరగడంతో పాటు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో సహకారం, ఉద్యోగాల కల్పనలో పరస్పరం సహకరించుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ మొదలుపెట్టిన ఆర్థిక సంస్కరణ ప్రక్రియల వలన భారత్ ఒక సమర్థవంతమైన, పారదర్శక మార్కెట్‌గా అవతరిస్తోంది. ఈ సంస్కరణలు, వాణిజ్య సరళీకరణ వల్ల భారతీయ వస్తువులు ప్రపంచ విపణిలో మరింత విస్తృతంగా దొరుకుతాయి. ఇది మరిన్ని ఉద్యోగాల కల్ప నకు దారి తీస్తుంది. స్మార్ట్ నగరాలకు సాంకేతిక సొబగులు మన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యం వల్ల, భారత్ ఒక ప్రాంతీయ కేంద్రంగా అవతరించడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఆవిష్కరణలు ఒక దేశ ఆర్థిక వ్యవస్థపై చూపే కీలకమైన, సానుకూల ప్రభావం ఎలాం టిదో హైదరాబాద్‌లో ఈ మధ్యే జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో మనం చూశాం. వ్యవస్థాపకత, ఆవిష్కరణ రంగాల్లో అమెరికా అగ్రగామిగా ఉంటోంది. టెక్నాలజీ రంగంలో అమెరికా ఇప్పటికే భారత్‌తో విస్తృతమైన సంబంధాలు ఏర్పరచుకుంది. భారత్ మార్కెట్‌ను అమెరికా వ్యాపార, వాణిజ్యం కోసం విస్తరించడం వల్ల మన రెండు ఆర్థిక వ్యవస్థలను కాపాడగలిగే అధునాతన సాంకేతికతలను– ప్రత్యేకించి ఆధునిక తయారీ, సైబర్ భద్రతా రంగాల్లో అందిపుచ్చుకోవచ్చు. పెరిగిన అమెరికా వాణిజ్యం, పెట్టుబడుల వల్ల మరిన్ని పెట్టుబడులు, మేధో జ్ఞాన రంగాల్లో భాగస్వామ్యం పెరుగుతుంది. సాంకేతికతలో వస్తున్న వేగవంతమైన మార్పులను అందిపుచ్చుకోవడానికి దేశాల మధ్య ప్రతిబంధకాలు లేని వ్యాపార, డేటా ప్రవాహం ఉండాలి. అమెరికాలో తయారయ్యే వస్తువులను భారత్‌లో మరింతగా అందుబాటులోకి తీసుకురావడం, అమెరికన్ సంస్థల ఉనికి దేశంలో మరింత విస్తరించడం వల్ల ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయి. వీటి వల్ల మౌలిక వసతులు, కనెక్టివిటీ కూడా మెరుగవుతాయి. ఉదాహరణకి అమెరికన్ సంస్థల వద్ద ఉన్న వినూత్న సాంకేతికతలు భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 100 స్మార్ట్ నగరాల ప్రాజెక్టుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ముడి చమురు నుంచి ఇంధన భద్రతదాకా.. ఇంధన రంగంలో కూడా మన దేశాలు సహకరించుకోవచ్చు. భారత్–అమెరికా ఒక సమగ్రమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోగలవు. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, అణు విద్యుత్ వంటి అన్ని రకాల ఇంధన సంబంధిత రంగాల్లో సహకరించుకోవచ్చు. అంతేకాకుండా శిలాజ ఇంధనాలు, స్మార్ట్ గ్రిడ్లు, ఇంధన నిల్వలు, పునరుత్పాదక వనరులు వంటి వాటికి సంబంధించి టెక్నాలజీ విషయంలో కూడా సహకరించుకోవచ్చు. గత సంవత్సరం అమెరికా తొలి ముడి చమురును భారత్‌కి ఎగుమతి చేసింది. దేశీయ ఇంధన వనరులను అభివృద్ధి చేసుకుని, ఇంధన భద్రతను పెంపొందించుకోవడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అవసరమైన మద్దతు సేవలు, మౌలిక వసతులు, సాంకేతిక జ్ఞానాన్ని అందించడంలో కూడా అమెరికా తన సహాయం తప్పకుండా అందించగలదు. భారత్– అమెరికా వ్యాపార సంబంధాలు మరింత బలపడడం వల్ల ఇండియా పట్ల, ఇండో–పసిఫిక్ ప్రాంతం పట్ల అమెరికా మరింత దీర్ఘకాలిక నిబద్ధతను కలిగి ఉంటుంది. దీని వల్ల మన రక్షణ, ఉగ్రవాద నిరోధక భాగస్వామ్యం మరింత బలపడుతుంది. మన విధానాల్లో ఏమైనా తేడాలుంటే చక్కదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. నిరంతరం మారుతూ ఉండే ఈ కల్లోల ప్రపంచంలో భారత్–అమెరికా దేశాల భాగస్వామ్యం స్థిరమైనది. స్వాతంత్య్రం, సార్వభౌమత్వం మన రెండు దేశాలకు ఎంతో విలువైనవి. పరస్పర భాగస్వామ్యంతో మనం ముందుకెళితే అది ప్రపంచంపై అనుకూల ప్రభావం కూడా చూపుతుంది. మన ప్రజానీకం భద్రత, శ్రేయస్సు గురించిన ఆకాంక్షలు కూడా నెరవేరతాయి. - కెన్నెత్ ఐ. జస్టర్ వ్యాసకర్త భారత్‌లో అమెరికా రాయబారి -
'ట్రేడ్ ఆగితే, యుద్ధం ప్రారంభమే'
దావోస్ : ప్రపంచీకరణను ఎవరూ ఆపలేరని, ఒకవేళ ట్రేడ్ ఆగితే, యుద్ధం ప్రారంభమవుతుందని చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ చైర్మన్ జాక్‌మా హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించేందుకు ప్రపంచీకరణను కొనసాగించాల్సివసరం ఉంటుందని, ఇది మన బాధ్యత అని జాక్ మా తెలిపారు. దీన్ని మెరుగుపరిచే అవకాశం కూడా మనదేనన్నారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే 30 ఏళ్లలో ప్రపంచంలో పెద్ద మొత్తంలో మార్పులు సంభవిస్తాయని ఆందోళన చెందుతుంటే, వ్యాధులు, వాతావరణ కాలుష్యం, పేదరికంపై యుద్ధం చేయాల్సి ఉందన్నారు. ఎవరూ కూడా ప్రపంచీకరణను ఆపలేరని కూడా ఉద్ఘాటించారు. వాణిజ్య లావాదేవీలు, బాంబులాంటివన్నారు. ''ఎవరూ ప్రపంచీకరణను ఆపలేరు. ఒకవేళ ట్రేడ్ ఆపితే, ప్రపంచమే ఆగిపోతుంది. ట్రేడ్ కేవలం యుద్ధం బారి నుంచి బయటపడేయగలదు. కానీ యుద్ధాన్ని సృష్టించదు'' అని పేర్కొన్నారు. టెక్నాలజీతో ప్రస్తుతం ప్రపంచం పరివర్తన దశలో ఉందని, ఇది ప్రజలకు ఆసక్తికరమైన కెరీర్లను సృష్టించడానికి సాయపడుతుందని తెలిపారు. కానీ కొన్ని సామాజిక సమస్యలు ఉంటాయన్నారు. ప్రపంచ వాణిజ్యం చాలా సాధారణంగా, ఆధునీకరంగా ఉండాలన్నారు. పలు అంశాలపై మాట్లాడిన జాక్ మా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ(ఏఐ), మానవ వనరులకు పెద్ద ముప్పుగా మారుతోందని, భవిష్యత్తులో చాలా మందిని ఇది రీప్లేస్ చేస్తుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఉద్యోగాలను ఏఐ, రోబోట్స్ హరించుకుపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఏఐ, మానవ వనరులకు మద్దతు ఇచ్చేలా ఉండాలని, టెక్నాలజీ ఎల్లప్పుడూ ప్రజలకు ఏదో ఒకటి చేసేలా ఉండాలని కానీ, డిసేబుల్ చేసేలా ఉండకూడదన్నారు. ఈ శతాబ్దంలో గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, అలీబాబాలు చాలా అదృష్టకర కంపెనీలని అన్నారు. -
పోలీసుల అదుపులో ట్రేడ్ కంపెనీ సిబ్బంది
సంతకవిటి : మండలంలోని మందరాడ గ్రామానికి చెందిన ట్రేడ్ బ్రోకర్ టంకాల శ్రీరామ్ ఏర్పాటుచేసిన ట్రేడ్ కంపెనీలో పనిచేసిన సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కేసు విచారణలో భాగంగా శ్రీరామ్‌ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మందరాడకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ట్రేడ్‌లో పనిచేసి రెండు నెలల క్రితం మానేసిన మందరాడ గ్రామానికి చెందిన సాకేటి ప్రసాద్‌రావు అనే యువకుడుతోపాటు మరో ఇద్దరిని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. రాజాం రూరల్ సీఐ ఎం.వీరకుమార్ ఈ ముగ్గురిని సంతకవిటి పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి ఆరా తీస్తున్నారు. వీరి వద్ద ఉన్న డాక్యుమెంట్లు, ట్రేడింగ్‌కు సంబంధించి ఆన్లైన్ వ్యవహారాలను, బ్యాంకు ఖాతాలను, నగదు లావాదేవీలను పరిశీలిస్తున్నారు. తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని, కేవలం ఉద్యోగ విధులు మాత్రమే నిర్వహించేవారమని, ఎక్కువగా రిసెప్షనిష్టులుగా వ్యవహరించామని వీరు చెప్పినట్లుగా తెలిసింది. మరికొందరి కోసం పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అరెస్టులకు ప్రత్యేక బృందాలు.. ఓ వైపు దర్యాప్తు చేస్తూనే మరోవైపు ఈ వ్యవహారంలో ఉన్న నిందితులందరినీ అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. మూడు ప్రత్యేక బృందాలుగా పోలీసులు ఏర్పడి దర్యాప్తును పలు కోణాల్లో ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడైన శ్రీరామ్‌ను అరెస్టు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిసింది. ఈయన ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా మరికొందరినీ కూడా అరెస్టు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో ఓ ప్రభుత్వ ఉద్యోగితోపాటు ట్రేడ్‌బ్రోకర్ బినామీలు, ప్రజాప్రతినిధులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ వివరాలన్నీ బహిర్గతం చేసేందుకు పోలీసులు నిరాకరించారు. ట్రేడ్ కార్యాలయంలో బీర్ సీసాలు, నైటీలు..! తాలాడలోని ట్రేడ్ బ్రోకర్ కార్యాలయంలో బీరు సీసాలు, నైటీలు ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల కార్యాలయాన్ని పోలీసులు తనిఖీచేసిన అనంతరం ఓ గదిలో ఇవి ఎక్కువగా బయటపడినట్లు సమాచారం. ట్రేడ్ కార్యాలయంలో పగలు విధులు అనంతరం సిబ్బంది ఇంటికి వెళ్లిపోగా సాయంత్రం కార్యాలయ గదుల్లో ఈ రాసలీలలు జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో బ్రోకర్ శ్రీరామ్‌తోపాటు కొంతమంది మండలానికి చెందిన ప్రధాన వ్యక్తుల పాత్ర కూడా ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘టంకాలది వ్యక్తిగత ఫ్రాంచైజీ మాత్రమే’ శ్రీకాకుళం సిటీ: ఇండీట్రేడ్ బ్రోకింగ్ హౌస్‌లో టంకాల శ్రీరామ్ది వ్యక్తిగత ఫ్రాంచైజీ మాత్రమే అని ఇండీట్రేడ్ చీఫ్ డిజిటల్ ఆఫీసర్ ఆనంద్ మలివాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దక్షిణ భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు, ఆర్థిక వ్యాపారంలో పేరొందిన ఆర్థిక సేవల ప్రదాతగా ఇండీట్రేడ్ ప్రముఖ పాత్ర పోషిస్తోందని గుర్తు చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈక్విటీ, కమొడిటి బ్రోకింగ్ వ్యాపారాలు చేస్తూ విశ్వసనీయ సంస్థగా పేరు సంపాదించిందని తెలిపారు. అత్యున్నత సాంకేతిక విలువలస్వీకరణ, క్రెడిట్, రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థ పటిష్టపరచడం, నూతన ఉత్పత్తులు సృజించడం, క్లయింట్స్ సంబంధాలు బలోపేతం చేయడం వంటి సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. -
ఆ బంగారం.. జస్ట్ టిప్ మాత్రమే!?
ఖట్మాండు : నేపాల్-చైనా వాణిజ్య రహదారిలో బంగారంతో వెళుతున్న ఒక వాహనాన్ని నేపాల్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. టిబెట్ నుంచి స్వచ్ఛమైన బంగారంతో ఈ వాహనం ఖట్మాండు వెళుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నేపాల్-చైనా మధ్య అధికారికంగా నిర్వహించబడుతున్న హైవే ఈ వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కీరంగ్ బోర్డర్ పాయింట్ వద్ద వాహనాన్ని అనుమతించిన ఒక పోలీస్ అధికారికి వాహనదారులు స్వచ్ఛమైన 17 కిలోగ్రాములు బంగారాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ బంగారాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. -
7.5 శాతం జీడీపీ వృద్ధి రేటు అసాధ్యం-ఆర్థిక సర్వే
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు (శుక్రవారం) ఆర్థిక సర్వే 2016-17 వాల్యూం -2 ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. భారత ఆర్ధికవ్యవస్థ లోని వివిధ అంశాలపై దృష్టి పెట్టిన సర్వే దేశ ఆర్ధిక పరిస్థితుల నిర్వహణ తదితర అంశాలపై నివేదించింది. 2017-18 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం మొదటిసారిగా, రెండవ లేదా మిడ్ టెర్మ్ ఆర్థిక సర్వేను సమర్పించింది. పుంజుకుంటున్న రూపాయి విలువ, వ్యవసాయ రుణాల రద్దు, జీఎస్టీ అమలు తదితర సవాళ్ల కారణంగా గతంలో అంచనా వేసిన 6.75-7.5 శాతం వృద్ధిని సాధించడం చాలా కష్టమవుతుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. ముఖ్యంగా జీఎస్టీ నిర్మాణాత్మక సంస్కరణలు, డీమానిటైజేషన్ తదనంతర పరిణామాలను చర్చించింది. అలాగే ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ సహా, పలు రంగాల్లో సంస్కరణలు చేపట్టాలని ఆ సర్వే నివేదిక ప్రతిపాదించింది. దీంతోపాటు భారతదేశ ఆర్ధికవ్యవస్థ ప్రస్తుత స్థితి, మొత్తం వాణిజ్యం, బాహ్య రుణం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్‌డీఐ కింది విదేశీ నిధుల ప్రవాహం తదితర అంశాలపై నివేదికలో ఆర్థిక సర్వే వివరించింది. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలికసదుపాయాలు, విద్య, ఆరోగ్యంలాంటి రంగాల్లో సంస్కరణలు అత్యవసరమని ఆర్థికసర్వే సూచించింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ధరల నియంత్రణ కోసం మార్కెటింగ్ లాంటి మౌలికసదుపాయాలను స్థిరీకరించాలని నివేదిక తెలిపింది. పంటల దిగుబడి, రైల్వే ఆదాయాన్ని పెంచాలని అభిప్రాయపడింది. మధ్యతరహా పోర్టుల అభివృద్ధి, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ అవసరమని పేర్కొన్నది. ఇండియాను గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మార్చాలంటే నిబంధనలను సరళీకరించాలని పేర్కొంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో 7.5 శాతం జీడీపీ వృద్ధి రేటును సాధించడం అసాధ్యమని సర్వే స్పష్టం చేసింది. రైతు రుణాల మాఫీతో వృద్ధి రేటను సాధించడం కుదరదని నివేదిక తెలిపింది. ద్రవ్యోల్బణం 2018 మార్చినాటికి రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన టార్గెట్ 4 శాతం కిందికి దిగి వస్తుందని పేర్కొంది. మరోవైపు 2017-18 సంవత్సరానికి పెట్టుకున్న జీడీపీ టార్గెట్ రేటును అందుకోవడం పెద్ద సవాల్ అని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబిస్తూ, భారత ఎగుమతులు 2016-17 నాటికి 12.3 శాతం వద్ద సానుకూలంగా మారాయి. దిగుమతులు 1.0 శాతం పెరగడంతో 2016-17 నాటికి వాణిజ్య లోటు 112.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2015-16 నాటికి ఇది 130.1 బిలియన్ డాలర్లు. ప్రస్తుత ఆర్థిక లోటు 2016-17 నాటికి జీడీపీ 0.7 శాతం వరకు పెరిగింది, 2015-16లో 1.1 శాతం నుండి వాణిజ్య లోటులో పదునైన సంకోచం ఏర్పడింది. 2013-14 నుంచి 2015-16 మధ్యకాలంలో చెల్లింపుల పరిస్థితిని నిరుపయోగం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్థిక లోటు తగ్గడంతో 2016-17లో మరింత మెరుగుపడింది. విదేశీ మారకద్రవ్యం మరింత పెరిగిందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2015-16 నాటికి 55.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా , 2016-17 లో స్థూల ఎఫ్‌డీఐ 60.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే నికర పెట్టుబడులు 35.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2015-16 నాటికి ఇది 36.0 బిలియన్ డాలర్ల నుంచి 1.1 శాతానికి పరిమితమైంది. కరెంట్ అకౌంట్ లోటును నడుపుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో, బ్రెజిల్ తర్వాత 2017 జూలై 7 వ తేదీ నాటికి 386.4 బిలియన్ డాలర్ల నిల్వలతో భారత్ రెండవ అతిపెద్ద విదేశీ మారకద్రవ్యాన్ని కలిగి ఉందని సర్వే తేల్చింది. 2017 మార్చి చివరినాటికి విదేశీ రుణ సూచికలు 2017 చివరినాటికి మెరుగయ్యాయి. 2017 మార్చి చివరినాటికి భారత్ మొత్తం విదేశీ రుణాల నిల్వ 471.9 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 3.1 బిలియన్ డాలర్లు (2.7 శాతం) విదేశీ మారకద్రవ్యం గత ఏడాది 74.3 శాతంతో పోలిస్తే విదేశీ మారకద్రవ్యం 78.4 శాతం విదేశీ రుణాన్ని అందించింది. అయితే, విదేశీ మారకద్రవ్యం జిడిపికి 20.2 శాతానికి పడిపోయింది. ఋణ సేవల నిష్పత్తి 8.8 శాతం నుండి 8.3 శాతానికి పడిపోయిందని ఆర్థిక సర్వే నివేదించింది. -
వాణిజ్యంలో ‘అవినీతి’ కలకలం
► ట్యాక్స్ తగ్గించేందుకు లంచం డిమాండ్ ► రూ. 50వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం ► డీసీటీఓ, ఏసీటీఓలపై కేసు నమోదు ► కలకలం రేపిన ఏసీబీ దాడులు ఏసీబీ దాడులు వరుసగా జరుగుతున్నాయి. కేవలం నెల రోజుల్లోనే పార్వతీపురం డివిజన్లో ఇద్దరిని వరుసగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయినా మిగిలిన అధికారుల తీరులో మార్పురావడంలేదు. ఇందుకు తాజా ఉదాహరణే మంగళవారం మరోఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కిన వైనం. ట్యాక్స్ తగ్గించేందుకు రూ. 50వేలు లంచం తీసుకుంటూ డీసీటీఓ, ఏసీటీఓ ఈ సారి ఏసీబీకి చిక్కారు. పార్వతీపురంటౌన్: నెలరోజుల వ్యవధిలో పార్వతీపురం డివిజన్లో రెండుచోట్ల ఏసీబీ అధికారులు దాడులు చేసి అవినీతి చేపలను వలపన్ని పట్టుకున్న సంఘటనలు ఇంకా మరువకముందే మరో రెండు అవినీతి చేపలు మంగళవారం ఏసీబీ వలకు చిక్కాయి. రూ. 50వేలు లంచం తీసుకుంటూ పార్వతీపురం వాణిజ్య పన్నులశాఖలో పనిచేస్తున్న డీసీటీఓ(ఇన్చార్జ్ సీటీఓ) ఎచ్చెర్ల మన్మథరావు, ఏసీటీఓ వి.వి.ఎల్.ఎన్.మూర్తిలు ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ షకీలాభాను ఆధ్వర్యంలో ఏసీబీ బృందం మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో దాడులు జరిపి లంచం తీసుకుంటున్న డీసీటీఓ, ఏసీటీఓలను అదుపులోకి తీసుకున్నారు. రైతు బజారు కూడళ్లలోని వాణిజ్య పన్నులశాఖ కార్యాలయంలో డీసీటీఓ కార్యాలయంలోనే బాధితుడు కొత్తకోట ప్రసాద్ రూ. 50వేలు ఏసీటీఓకు ఇస్తుండగా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాలు ఇలావున్నాయి. పార్వతీపురం పట్టణానికి చెందిన వ్యాపారి కొత్తకోట ప్రసాద్‌కు సుమిత్ర కలెక్షన్స్ పేరుతో డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంది. విధి నిర్వహణలో భాగంగా వాణిజ్య పన్నులశాఖ అధికారులైన డీసీటీఓ మన్మథరావు, ఏసీటీఓ వి.వి.ఎల్.ఎన్.మూర్తి ఫిబ్రవరి 23న సుమిత్ర కలెక్షన్స్ షాపులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం రికార్డులను పట్టుకొని వాణిజ్య పన్నులశాఖ కార్యాలయానికి వెళ్లిపోయారు. షాపు యజమాని కొత్తకోట ప్రసాద్ కార్యాలయానికి వెళ్లగా ఆయన పన్నులు సక్రమంగా చెల్లించలేదని, ఐదారు లక్షల వరకు పన్ను కట్టాల్సి వుంటుందని స్పష్టం చేశారు. దీంతో ప్రసాద్ ప్రతీనెలా పన్నులు కడుతున్నానని, అంత పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించలేనని ప్రాధేయపడ్డాడు. అయితే పన్నును తగ్గిస్తామని తమకు లంచం ఇవ్వాలని డీసీటీఓ డిమాండ్ చేశారు. ఐదారు లక్షల పన్ను చెల్లించాల్సి ఉండగా దానిని రూ. 50వేలకు కుదించి అపరాథరుసుంగా మరో రూ. 50వేలు కలిపి లక్ష రూపాయలు ట్యాక్స్ చెల్లించాలని చూపించేందుకు తమకు రూ. 50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతమొత్తం ఇచ్చుకోలేనని ప్రసాద్ చెప్పినప్పటికీ రికార్డులు అప్పజెప్పలేదు. విసిగిపోయిన ప్రసాద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు రంగప్రవేశం చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి వాస్తవ పరిస్థితులను నిర్ధారించుకొని పథకం పన్నారు. ఇందులో భాగంగా కొత్తకోట ప్రసాద్ చేత మంగళవారం డీసీటీఓకు ఫోన్ చేసి మీరగిన డబ్బులు ఇచ్చేస్తాను. ఎక్కడికి రావాలని అడిగించారు. ఆ డబ్బును ఏసీటీఓ మూర్తికి ఇవ్వమని ఆయన ఫోన్లో చెప్పారు. వెంటనే ప్రసాద్ ఏసీబీ అధికారులు ఇచ్చిన 25 రూ. రెండువేల నోట్లను(రూ. 50వేలు) తీసుకొని డీసీటీఓ చాంబర్లోవున్న ఏసీటీఓ మూర్తికి ఇచ్చారు. ఆ నగదును డీసీటీఓకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం వీరిని విచారణ జరిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ, ఇన్స్పెక్టర్ రమేష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. తప్పుడు లెక్కలతో ఇబ్బంది పెట్టారు. సుమిత్ర కలెక్షన్స్ షాపులో గత నెల 23న రికార్డులు పరిశీలించిన డీసీటీఓ, ఏసీటీవో రికార్డులను వారి వెంట తీసుకొని వెళ్లిపోయారు. నన్ను కార్యాలయానికి రప్పించుకొని పన్ను అధికంగా కట్టాల్సిందిగా లెక్కలు చూపించి ఇబ్బంది పెట్టారు. సక్రమంగా పన్నులు కడుతున్నట్లు చెప్పినా వినిపించుకోకుండా రూ. 50వేలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. డబ్బులు ఇస్తేనే ట్యాక్స్ తగ్గించి రికార్డులు ఇస్తామని చెప్పారు. చాలాసార్లు ఆఫీసుకు వెళ్లి అంత మొత్తం ఇవ్వలేనని వేడుకున్నా వినిపించుకోలేదు. అందుకే ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. – కొత్తకోట ప్రసాద్ , బాధితుడు కావాలనే ఇరికించారు ఏసీబీ ట్రాప్ ఒక పథకం ప్రకారం కావాలనే చేసినట్లుంది. కొత్తకోట ప్రసాద్ ఎవరో నాకు తెలియదు. నేను ఎప్పుడూ తనతో మాట్లాడలేదు. ట్యాక్స్ తగ్గించి రాస్తానని నేను చెప్పలేదు. లక్ష్యాలను చేరుకోవడానికి ఈ మధ్య వ్యాపారుల వద్ద కఠినంగా మాట్లాడి పన్నుల వసూళ్లు చేస్తున్నాం. దీనిని దృష్టిలో పెట్టుకొని కావాలనే ఇలా పథకం ప్రకారం చేశారు. మంగళవారం ఏసీటీవో నాకు ఇచ్చిన రూ. 50వేలు ట్యాక్స్ కలెక్షన్ అనుకున్నాను తప్ప ఇలా ఏసీబీ ట్రాప్‌లో ఇరికిస్తారని ఊహించలేదు. – ఎచ్చెర్ల మన్మథరావు, డీసీటీఓ నిర్ధారణ చేసుకున్నాకే దాడి చేశాం బాధితుడు కొత్తకోట ప్రసాద్‌నుంచి డీసీటీఓ లం చం డిమాండ్ చేస్తున్నట్లు క్షేత్రస్థాయిలో పరిశీ లన జరిపి నిర్ధారించుకున్న తరువాతే దాడి చేశాం. బాధితుడితో డీసీటీఓ జరిపిన ఫోన్ సంభాషణ పరిశీలించి లంచంగా రూ. 50వేలు తీసుకురమ్మని కోరిన తరువాతే బాధితుడి చేత డబ్బులు పంపించాం. బాధితుడు ప్రసాద్ రూ. 50వేలు డీసీటీఓ, ఏసీటీఓకు ఇస్తుండగానే పట్టుకున్నాం. నిందితులను ఏసీబీ కోర్టుకు తరలిస్తాం. – షకీలా భాను, ఏసీబీ డీఎస్పీ -
టీ అసోసియేషన్ కీలక నిర్ణయం
జమ్మూ కాశ్మీర్ లో టెర్రర్ దాడుల నేపథ్యంలో ఇండియన్ టీ ఆసోసియేషన్ (ఐటీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కోరితే పాకిస్తాన్ తో టీ వ్యాపారం రద్దు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఐటీఏ ప్రకటించింది. ఈ మేరకు బోర్డు నిర్ణయించినట్టు ఐటీఏ ఛైర్మన్ అజాం మెనం పీటీఐకి చెప్పారు. టీ వాణిజ్యానికి సంబంధించి పాకిస్తాన్ ముఖ్యమైనప్పటికీ, ఎగుమతులు నిలిపివేత ప్రభావం తమ వ్యాపారంపై అంతగా ఉండదన్నారు. ఈ అంశంలో తమకు టీ బోర్డు మార్గనిర్దేశం చేస్తుందని భావిస్తున్నానన్నారు. దక్షిణ భారతంనుంచి80 శాతం, ఉత్తర భారతదేశం నుంచి 20 శాతం పాకిస్తాన్ టీ దిగుమతి చేసుకుంటుందని మెనం వివరించారు. మొత్తం 230 మిలియన్ కేజీల ఎగుమతుల్లో పాకిస్తాన్ వాటా15 నుంచి 18 మిలియన్ కేజీలని వివరించారు. భారతదేశం యొక్క ఎగుమతి మార్కెట్లలో రష్యా, కజఖిస్తాన్, అమెరికా, చైనా, ఇరాన్, ఈజిప్ట్ , లాటిన్ అమెరికా ఉన్నాయన్నారు. సాధారణంగా శ్రీలంక, కెన్యాలనుంచి పాకిస్తాన్ టీ కొనుగోలు చేస్తుందని,ధరలు చవగ్గా ఉన్నపుడు భారత్ నుంచి దిగుమతి చేసుకుంటుందని తెలిపారు. కన్సల్టేటివ్ కమిటీ ఆఫ్ ప్లాంటేషన్ అసోసియేషన్ (సీసీపీఏ) ప్రెసిడెంట్ కూడా అయిన అజాం దక్షిణ భారత యునైటెడ్ ప్లాంటర్స్ అసోసియేషన్ కి కూడా విజ్ఞప్తి చేశారు. -
సోమవారం నుంచి గోల్డ్ బాండ్స్ ట్రేడింగ్
ముంబై: ఫిబ్రవరి 8, మార్చి 29న జారీ అయిన గోల్డ్ బాండ్లు సోమవారం (ఆగస్టు 29) నుంచి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ కానున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మొదటి విడత జారీ అయిన సావరిన్ గోల్డ్ బాండ్ల ట్రేడింగ్ ఇప్పటికే ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. 2015 అక్టోబర్ 30న పసిడి బాండ్ల పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఇప్పటికి నాలుగు దఫాలుగా పసిడి బాండ్ల జారీ పక్రియ జరిగింది. చివరి దశలో జారీ చేసిన పసిడి బాండ్లు ఎప్పుడు ట్రేడవుతాయన్న విషయాన్ని తర్వాత ప్రకటిస్తామని ఆర్బీఐ పేర్కొంది. కాగా ఐదవ విడత పసిడి బాండ్ల జారీ ప్రక్రియను వచ్చే నెల్లో ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. బాండ్లకు సంబంధించి తొలి పెట్టుబడిపై వార్షిక స్థిర వడ్డీరేటు 2.75 శాతం. ఆరు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లింపులు ఉంటాయి. రెండు గ్రాముల నుంచి 500 గ్రాముల వరకూ విలువైన బాండ్ల కొనుగోలుకు వీలుంది. బాండ్ల కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఐదేళ్ల తరవాత ఎగ్జిట్ ఆఫర్ ఉంటుంది. -
గుట్కా వ్యాపారంపై పోలీసుల నిఘా
మంగపేట: నిషేధిత గుట్కా, అంబర్ పాకెట్ల వ్యాపారంపై స్థానిక పోలీసులు నిఘా పెడుతున్నారు. గుట్కాల నివార ణపై ఏటూరునాగారం సీఐ రఘుచందర్ ఆదేశం మేరకు ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రాజుపేట, కమలాపురం తదితర గ్రామాల్లో దాడులు నిర్వహించి పలువురిని పట్టుకుని కేసు నమోదు చేశారు. కొందరు షాపుల యజమానులు రహస్యంగా గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో గురువారం రాత్రి మంగపేట, కమలాపురం గ్రామాల్లో గుట్కాలు విక్రయిస్తున్న కిరా ణ షాపులపై దాడులు నిర్వహించారు. గుండా సత్యనారాయణ, కమలాపురాని కి చెందిన అనంతుల క్రిçష్ణమూర్తి, చిదురాల సతీష్ కిరాణ షాపుల్లో గుట్కా, అంబర్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఏటూరునాగారం : మండల కేంద్రం లోని కిరాణం షాపుల్లో ఎస్సై నరేష్ సిబ్బందితో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. మేర్గు స్వామికి చెందిన కిరాణం షాపులో రూ.7వేల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. గు ట్కాలు విక్రయించినట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామ న్నారు. గుట్కాలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
అతి తక్కువ ధరకే ఆ.. వీడియోల విక్రయం..!
న్యూఢిల్లీః ఉత్తరప్రదేశ్, ఢిల్లీల్లో డార్క్ ట్రేడ్ జోరుగా సాగుతోంది. రోజురోజుకూ మహిళలపై నేరాల ఘటనలు పెరుగుతుండటమే కాక.. దానివెనుక పెద్ద నల్లబజారు నడుస్తున్నట్లు తెలుస్తోంది. నేరస్తులకు ప్రభుత్వం కఠినమైన శిక్షలు అమలు చేయకపోవడంతో చట్టాలకు భయపడకుండా వారు బరితెగించి స్వేఛ్చగా బయట తిరగడంతోపాటు.. మరిన్ని నేరాలకు పాల్పడుతున్నట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది. తాజాగా బయటపడ్డ రేప్ వీడియోల బ్లాక్ ట్రేడ్ అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. భయంకర, అత్యాచార వీడియోలు సైతం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో నామమాత్రపు ధరకే సులభంగా అమ్మకాలు జరుపేస్తున్నారు. నల్లబజారుల్లో రేప్ వీడియోలు వందలకొద్దీ అమ్ముడవుతున్నట్లు ఓ పేరొందిన పత్రిక సేకరించిన ఆధారాలప్రకారం తెలుస్తోంది. 30 సెకన్లనుంచీ 5 నిమిషాల నిడివి ఉండే.. ప్రత్యేక రేప్ వీడియోలు, వీడియో క్లిప్పులు కేవలం 50 నుంచి 150 రూపాయలకే ఆయా మార్కెట్లలో భారీగా అమ్ముడుపోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అటువంటి వీడియోలు వినియోగదారులు పొందాలంటే విశ్వసనీయమైన ఓ చిన్న సోర్స్ ఉంటే సరిపోతుంది. తమకు దొరికిన సమాచారుంద్వారా వారు డీలర్లవద్దకు చేరుకుంటే పనైపోతుంది. అయితే ఆయా డీలర్లు మాత్రం ముందుగా వచ్చినవారితో ఎటువంటి సమాచారం గురించి చర్చించరు. వచ్చిన కస్టమర్ విశ్వసనీయమైన సమాచారం అందించిన తర్వాత మాత్రమే ఒప్పందం ప్రకారం ధర నిర్ణయించుకొని, డీలర్స్ డైరెక్టుగా వినియోగదారుల స్మార్ట్ ఫోన్లలోకి డౌన్లోడ్ చేయడమో.. లేదంటే పెన్ డ్రైవ్ లో కాపీ చేయడం ద్వారా విక్రయాలు జరుపుతారు. కొన్నిసార్లు ఇటువంటి విక్రయాలు వ్యక్లులు లేదా వ్యవస్థీకృత ముఠాలు ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి అకౌంట్లద్వారా డౌన్లోడ్ చేసుకునే విధంగా కూడా అమ్మకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అదంతా ఒకరకం వ్యాపారం అయితే.. కొన్నిసార్లు నేరస్తులు అత్యాచారాల వీడియోలను రికార్డు చేసి సదరు బాధితులపై వేధింపులకు పాల్పడటం, వాటిని అన్లైన్ లో పోస్ట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేయడం వంటివి కూడా జరుగుతుంటాయని డీలర్లే చెప్తుండటం విశేషం. రేపిస్టులు నేరాలను తమ ఫోన్లలో రికార్డు చేసి వేధింపులకు పాల్పడుతున్నట్లు కొందరు సీనియర్ పోలీసులు కూడా చెప్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు, లేదంటే వారిపై తిరిగి లైంగిక కార్యకలాపాలకు పాల్పడేందుకు ఆ వీడియోలను సాధనంగా ఉపయోగించుకుంటున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అలాగే ఆన్ లైన్లో పోస్ట్ చేస్తామని భయపెట్టడంతో కూడా బాధితులను మరింత లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నా...ఆగ్రాలోని బెలాన్ గంజ్, బాల్కేశ్వర్, కమ్లానగర్ మార్కెట్లతోపాటు.. మీరట్ లోని బారెల్లీ, అలిగర్ మొదలైన ప్రాంతాల్లో అటువంటి భయంకరమైన అత్యాచార వీడియోలు అందుబాటులో ఉండటం హాస్యాస్పదంగా కనిపిస్తోంది. -
ఐటీ రంగానికి ఏమైంది?
ముంబై: విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా ఐటీ దిగ్గజాలు ఆర్థిక ఫలితాలను నమోదు చేయడంతో దేశీయస్టాక్ మార్కెట్ లో ఐటి రంగం తీవ్ర నష్టాలను ఎదుర్కోంటోంది. టాప్ ఐటీ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండడం ఈ పరిణామానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో మార్కెట్ విశ్లేషకులు ఐటీ రంగం మరింత నెగిటివ్ గానే ఉండనుందనే అభప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పోటీతత్వం ఐటీ కంపెనీలను దెబ్బతీస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో వివిధ ఎనలిస్టులు ఐటీ రంగ షేర్లకు దూరంగా ఉంటేనే మేలని సూచిస్తున్నారు. మరోవైపు అమెరికా ఎన్నికల ఫలితాలు ఐటీ రంగాన్ని భారీగా ప్రభావితం చేయనుంది. అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీనుంచి డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం ఖరారు కావడం కూడా ఒక హెచ్చరిక లాంటిదని మార్కెట్ వర్గాల భావన. ఒక వేళ ట్రంప్ ప్రెసిడెంట్ గా ఎన్నికైతే భారత ఐటీ కంపెనీలకు భారీ కష్టాలు తప్పవని పేర్కొంటున్నారు. బ్రెగ్జిట్ పరిణామాల నేపథ్యంలో షార్ట్ పీరియడ్ లో టీసీఎస్ కు మరిన్ని కష్టాలు తప్పవని ఎనలిస్టులు అంటున్నారు. మదుపర్లు అప్రమత్తంగా ఉండాలని రెలిగేర్, షేర్ ఖాన్ తదితర బ్రోకరేజ్ సంస్థలు సూచిస్తున్నాయి. అమెరికా ఎన్నికల ఫలితాలు ఐటి కంపెనీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించనున్నాయని ఎనలిస్ట్ పశుపతి అద్వానీ పేర్కొన్నారు. మరోవైపు ఐటీ మేజర్ కంపెనీలు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, మైండ్ ట్రీ ఆర్థిక ఫలితాలు మదుపరులను నిరాశపర్చాయి. మార్కెట్లో భారీగా అమ్మకాలకు పాల్పడుతున్నారు. దీంతో ఫలితాల తర్వాత ఇన్ఫోసిస్ 11 నెలల కనిష్టానికి, మైండ్ ట్రీ షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. మంగళవారం ఫలితాలను ప్రకటించిన విప్రో బుధవారం ఉదయం ట్రేడింగ్ సమయానికి 7 శాతం పైగా నష్టపోగా, ఇన్ఫోసిస్, స్వల్ప నష్టాలతోనూ, మైండ్ ట్రీ టీసీఎస్ స్వల్ప లాభాలతోనూ కొనసాగుతున్నాయి. -
సం‘పన్నులు’ కరువు!
రూ.కోట్లలో వాణిజ్యం వసూలు కాని పన్నులు లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్న అధికారులు వ్యాపారులతో రహస్య ఒప్పందాలు? విశాఖపట్నం : ఆర్థిక రాజధాని విశాఖలో వర్తక, వాణిజ్యం ఊపందుకుంది. అయితే ఆ మేరకు పన్నులు వసూలు చేయడంలో మాత్రం వాణిజ్య పన్నుల శాఖ విఫలమవుతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఆ శాఖ చేరుకోలేకపోయింది. చెక్‌పోస్టులు లేకపోవడం, వాణిజ్యవేత్తలతో లాలూచీ పడడం వంటి కారణాలతో ఇక్కడి అధికారులు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం రూ.2035.20 కోట్లు. కానీ విశాఖ డివిజన్ పరిధిలో రూ.1616.10కోట్లే వసూలు చేశారు. అన్ని సర్కిళ్లలోనూ కలిపి 79 శాతం ఆదాయంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిజానికి విశాఖ డివిజన్ పరిధిలో భారీ పరిశ్రమలున్నాయి. అయినా ఆదాయం మాత్రం ఆ మేరకు రాకపోవడం చర్చనీయాంశమైంది. పన్ను వసూళ్లు, ఆదాయార్జనలో విశాఖ డివిజన్ రాష్ట్ర స్థాయిలో 8వ స్థానంలో ఉందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ శాఖలో ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు డివిజన్ మొత్తం మీద 285 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. రహస్య ఒప్పందాలు? పన్ను ఎగవేత దారులతో అధికారులు రహస్య ఒప్పందాలు చేసుకుని, వారికి అన్ని విధాల సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఆ శాఖ అధికారులు కొంతమంది అవినీతి నిరోధక శాఖకు చిక్కడం ఈ అంశానికి బలం చేకూరుస్తోంది. రాష్ర్ట సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే చెక్‌పోస్టులున్నాయి. అక్కడే వాణిజ్యశాఖ సిబ్బంది తనిఖీలు చేసి పన్ను ఎగవేత దారులపై జరిమానా విధిస్తుంటారు. కానీ జిల్లా సరిహద్దుల్లో అలాంటి ఏర్పాట్లేవీ లేకపోవడంతో పన్ను చెల్లించకుండానే సరకు రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. ఇలాంటి వాటిపై అడపా దడపా దాడులు చేయగా గతేడాది రూ.120 కోట్లు జరిమానా కింద వసూలైంది. అలాంటిది పూర్తి స్థాయిలో చెక్‌పోస్టులుంటే ఆదాయం మరింత పెరుగుతుందనేది ఎవరికీ తెలియనది కాదు. అయినా ఆదాయార్జనకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టిసారించలేకపోతోంది. -
13వ తేదీ నుంచీ గోల్డ్ బాండ్ల ట్రేడింగ్
ముంబై: మొదటి విడత జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లు 13వ తేదీ (సోమవారం) నుంచీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడవుతాయని రిజర్వ్ బ్యాంక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2015 నవంబర్ 30న జారీ చేసిన బాండ్లు సోమవారం నుంచీ ట్రేడవుతాయని, తరువాతి తేదీల్లో జారీ చేసిన బాండ్ల ట్రేడింగ్ తేదీలను తరువాత నోటిఫై చేస్తామని కూడా ఆర్బీఐ తెలిపింది. ఇప్పటివరకూ మూడు విడతల గోల్డ్ బాండ్ల జారీ జరిగింది. త్వరలో నాల్గవ విడతను కూడా ప్రకటించనున్నారు. ప్రస్తుతం బాండ్లపై వార్షిక వడ్డీరేటు 2.75 శాతం. -
మార్కెట్ల జోరు పెంచిన ఆ నాలుగు
ముంబై : బుధవారం ట్రేడింగ్ లో దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 575.70 పాయింట్ల భారీ ర్యాలీతో 25,881వద్ద, నిఫ్టీ 186.05 పాయింట్ల లాభంతో 7,934వద్ద నమోదైంది. ఇన్ఫోసిస్, హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్ ల జోరుతో దేశీయ సూచీలు లాభాలు పండించాయి. ఐటీ, రియాల్టీ, పవర్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంక్స్, ఆటో స్టాక్స్ సపోర్టుతో కీలకమైన మార్కు 7,900ను నిఫ్టీ అధిగమించింది. దేశీయ సూచీల్లో భారీ లాభాల్లో ముగియడానికి నాలుగు అంశాలు కీలకమైన పాత్ర పోషించాయి. మంచి రుతుపవనాలు... ఆశాజనకమైన రుతుపవనాల అంచనాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లో లాభాల ర్యాలీ కొనసాగించేలా దోహదంచేశాయి. రుతుపవనాల వర్షపాతం సగటున అంతకముందు అంచనా వేసిన 105శాతం కంటే ఎక్కువగా 109శాతం వరకూ ఉండొచ్చని స్కైమెట్ పేర్కొంది. ఆగస్టులో 113శాతం, సెప్టెంబర్ లో 123 శాతం వర్షపాతం మనం చూడబోతున్నామని రిపోర్టు నివేదించింది. దీంతో అంచనావేసిన దానికంటే ఎక్కువగానే వర్షపాతం ఉండొచ్చన్న అభిప్రాయంతో స్టాక్ మార్కెట్లో కన్సూమర్ గూడ్సుకు డిమాండ్ పెరిగింది. దేశ ఆర్థికవ్యవస్థలో 70శాతం జనాభా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్.... గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ దేశీయ మార్కెట్లో లాభాలు పండించాయి. అమెరికా నుంచి వెలువడిన హోమ్ సేల్స్ డేటా, ఆ దేశ ఆర్థికవ్యవస్థ మెరుగుపడిందని తెలిపింది. దీంతో జూన్ లేదా జూలైలో ఫెడ్ రిజర్వు కచ్చితంగా వడ్డీరేట్లు పెంచుతాదనే సంకేతాలు వచ్చేశాయి. ఈ డేటాతో అమెరికా మార్కెట్ 1శాతం లాభంలో ముగిసింది. ఆర్థిక మందగమనం నుంచి అమెరికా బయటపడిందని తెలియడంతో, ప్రపంచమార్కెట్లు బలమైన ట్రెండ్ కొనసాగించాయి. టెక్నికల్ లిప్ట్ ఆప్... వరుసగా నష్టాల్లో నమోదవుతున్న మార్కెట్లకి కొనుగోళ్ల మద్దతు లభించడంతో, ఓ మార్కు వద్ద నిఫ్టీ, సెన్సెక్స్ లు మళ్లీ పుంజుకున్నాయి. బేరిష్ సెంటిమెంట్ మందగించి, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో 7,940 మార్కుకు నిఫ్టీ చేరుకుంది. అంతేకాక 9,000 మార్కుకు నిఫ్టీ చేరుకుంటుందనే ఎనలిస్టుల సంకేతాలు కూడా నేటి మార్కెట్లలో సెంటిమెంట్ ను బలపరిచాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. మోర్గాన్ స్టాన్లి అప్ గ్రేడ్స్....ప్రధానిగా మోదీ రెండేళ్ల పాలన ముగించుకొనడంపై మోర్గాన్ స్టాన్లి రిపోర్టు నివేదించింది. మార్కెట్లో అచ్చే దిన్ కొనసాగుతుందని, ఈక్వల్ వేయిట్ గా ఉన్న మార్కెట్లు ఓవర్ వేయిట్ లోకి అప్ గ్రేడ్ అయ్యాయని పేర్కొంది. దీంతో దేశీయ సూచీలు లాభాలను నమోదుచేశాయి. మరింత ధరల తగ్గుదల భయాందోళనలు ప్రస్తుతం లేవని, ధరలు అదుపులో ఉంటాయని, మొత్తంగా దేశంలో అప్పుల శాతం తగ్గిందని, సంస్కరణలతో ఉత్పత్తి పెరిగిందని మోర్గాన్ స్టాన్లీ ప్రకటించింది. మోర్గాన్ స్టాన్లి దేశ ఆర్థికవ్యవస్థపై ఇచ్చిన శుభసంకేతాలతో, ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ ను బలపర్చింది.