
న్యూఢిల్లీ: ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు సాధికారత కల్పించేందుకు, ఎగుమతుల వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో మంగళవారం షీట్రేడ్స్ ఇండియా హబ్‌ను ఆవిష్కరించింది. ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ (ఐటీసీ) భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ కేంద్రానికి బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన షీట్రేడ్స్ కామన్వెల్త్‌ప్లస్ ప్రోగ్రాం కింద నిధులు అందుతాయి.
ఇదీ చదవండి: ఫ్రెంచ్ కంపెనీపై జైడస్ లైఫ్ కన్ను
ఇది మహిళల సారథ్యంలో ఎగుమతుల వృద్ధికి దోహదపడుతుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిస్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) సంతోష్ కుమార్ సారంగి తెలిపారు. ఇందులో 3 లక్షల మంది మహిళా ఎంట్రప్రెన్యూర్లను ఎన్‌రోల్ చేయడంపై ఎఫ్‌ఐఈవో, ఐటీసీ దృష్టి పెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా మహిళల ఆధ్వర్యంలోని వ్యాపారాలకు వనరులను సమకూర్చే సమగ్ర కేంద్రంగా షీట్రేడ్స్ ఇండియా హబ్ ఉంటుంది. ఇందులో సామర్థ్యాలను పెంచుకునేందుకు ఉపయోగపడే వర్క్‌షాప్‌లు, మెంటారింగ్ సెషన్లు మొదలైనవి నిర్వహిస్తారు. భారత్ ఏటా 80,000 కోట్ల డాలర్ల ఉత్పత్తులు, సర్వీసులు ఎగుమతి చేస్తోందని, వచ్చే కొన్నేళ్లలో దీన్ని 2 లక్షల కోట్ల డాలర్లకు చేర్చుకోవాలనేది లక్ష్యంగా నిర్దేశించుకుందని సారంగి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment