Women Entrepreneurs
-
ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీలు
సాక్షి, అమరావతి: ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీలను రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇండ్రస్టియల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ డ్రాఫ్ట్ పాలసీలపై సీఎం సోమవారం సమీక్ష జరిపారు. ప్రైవేటు ఇండ్రస్టియల్ పార్క్ పాలసీపై మరికొంత కసరత్తు జరగాలని, మిగిలిన మూడు విధానాలను వచ్చే కేబినెట్ ముందుకు తేవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.సీఎం సూచనలు, పారిశ్రామికవర్గాల అభిప్రాయాలు, ఇతర రాష్ట్రాల విధానాల ఆధారంగా అధికారులు పాలసీలను రూపొందించి సీఎం ముందు ఉంచారు. ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ పాలసీ అమల్లోకి వచి్చన వెంటనే కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లి‹Ùమెంట్, డేట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ ఇచ్చిన మొదటి 200 పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రతిపాదనలు చేశారు. ఎక్కువ ఉద్యోగాలిచ్చే కంపెనీలకు అదనంగా 10 శాతం ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రతిపాదించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు అదనంగా 5 శాతం ఇన్సెంటివ్ ఇవ్వాలని సూచించారు. ఇన్నోవేషన్ హబ్‌కు రతన్ టాటా పేరు అమరావతి ఇన్నోవేషన్ హబ్‌కు దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా పేరు పెట్టాలని అధికారులకు సూచించారు. పారిశ్రామిక రంగ అభివృద్ధికి దోహదపడేలా రతన్ టాటా హబ్ తేవాలని నిర్ణయించామన్నారు. హబ్‌కు అనుబంధంగా రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో సెంటర్ల ఏర్పాటు జరుగుతుందని, ఒక్కో సెంటర్‌కు ఒక్కో మల్టీనేషనల్ కంపెనీ మెంటార్‌గా ఉండేలా ఈ విధానాన్ని రూపొందించాలని సీఎం ఆదేశించారు. పౌల్ట్రీ తరహాలోనే ఫుడ్ ప్రాసెసింగ్ విధానాలు: సీఎస్ ఆక్వా, పౌల్ట్రీ రంగంలో వచ్చిన విధంగా ఫుడ్ ప్రాసెసింగ్‌లోనూ మంచి ఫలితాలు వచ్చేలా విధానాలను అమలు చేయాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సూచించారు. పౌల్ట్రీతో పాటు పాడి పరిశ్రమ, మేకలు, గొర్రెల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు. ఈ సమీక్షలో మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.ఐటీ, డ్రోన్ పాలసీలను మెరుగుపరచాలిఐటీ, డ్రోన్ పాలసీలను మరింత మెరుగుపర్చాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ పాలసీలపై ఆయన సమీక్షించారు. నూతన పాలసీలను సీఎంకు అధికారులు వివరించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలసీలు, నిపుణులతో చర్చించి వీటిని రూపొందించినట్లు వివరించారు. వీటిపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. మరింత మెగుపరిచి వచ్చే కేబినెట్లో ఉంచాలని సూచించారు. ఈ నెల 22, 23వ తేదీల్లో జరగనున్న అమరావతి డ్రోన్ సమ్మిట్‌పై అధికారులు వివరించారు. కేంద్ర సివిల్ ఏవియేషన్ శాఖ భాగస్వామ్యంతో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఈ సదస్సులో 400 మంది అతిథులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.అతి భారీ వర్షాలపై అప్రమత్తం చేయండిరాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని, అతి భారీ వర్షాలు ఉండే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో సీఎం సోమవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. చెరువులు, కాలువలు, నీటి వనరులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు చెప్పారు. వర్షపాతం వివరాలను కూడా రియల్ టైంలో అందుబాటులో ఉంచాలన్నారు. కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి ప్రజల వినతులపై వేగంగా స్పందించాలని అన్నారు.ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి వర్షాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో ఈ సీజన్లో 676 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతానికి గాను ఇప్పటివరకు 734 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, 18 జిల్లాల్లో సాధారణంకంటే అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. -
మహిళలకు శుభవార్త.. బ్యాంకుల్లో ప్రత్యేక స్కీమ్స్!
ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) మహిళల కోసం, ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ ఫౌండర్ల కోసం త్వరలోనే ప్రత్యేక ఆర్థిక పథకాలను ప్రారంభించనున్నాయి.ఎన్హాన్స్డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్ (ఈఎస్ఈ 7.0) సంస్కరణల ఎజెండాలో భాగంగా మహిళా కస్టమర్లకు మద్దతు ఇచ్చే వ్యూహాన్ని రూపొందించాలని ఆర్థిక సేవల విభాగం బ్యాంకులను కోరినట్లు ‘లైవ్ మింట్’ కథనం పేర్కొంది. ఈఎస్ఈ 7.0 రిస్క్‌ను అంచనా వేయడం, నిరర్థక ఆస్తుల నిర్వహణ, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, కస్టమర్ సర్వీస్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై దృష్టి పెడుతుంది.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 31.2 కోట్ల మంది మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటు వేశారని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న ఎన్డీఏకు ఎక్కువ మంది మహిళలు ఓటేశారని సర్వేలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల ద్వారా మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చే ప్రత్యేక పథకాలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది.మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక బ్యాంకింగ్ సేవలు, తమ వెంచర్లకు ఆర్థిక సహాయం కోరుకునే వారికి 'లోన్ మేళాలు' వంటివి తాజా ఈఎస్ఈ సంస్కరణల్లో ఉన్నాయి. మహిళా వ్యవస్థాపకులను స్టార్టప్ ఇంక్యుబేటర్లతో అనుసంధానం చేసి వారి వెంచర్లను విస్తరించడానికి సహాయపడే కార్యక్రమాలను కూడా ప్రభుత్వ బ్యాంకుల ద్వారా నిర్వహించున్నారు. అయితే ఆర్థిక శాఖ నుంచి దీనిపై స్పందన రాలేదు. -
Budget 2024: ఉమెన్ పవర్‌కు ఊతం ఇచ్చేలా...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్ గురించి గత వారం రోజుల నుంచి ‘ఈసారి కూడా పేపర్‌లెస్ బడ్జెటే’ అనే విశేషంతో పాటు ఫైనాన్స్ బిల్లులు, కేటాయింపులు, స్మార్ట్ ఫోన్ పరికరాలపై దిగుమతి సుంకాలు, వాయుకాలుష్యం తగ్గించడానికి ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ఏంచేయబోతున్నారు... ఇలా రకరకాల విషయాలపై ఉహాగానాలు, చర్చలు జరిగాయి. వ్యాపార రంగంలో మహిళ వ్యాపారవేత్తలు సత్తా చాటుతున్న కాలం ఇది. వారి అడుగులను మరింత వేగవంతం చేయడానికి ఈ బడ్జెట్లో ఏం చేయబోతున్నారు? మహిళల్లో నైపుణ్యాభివృద్ధికి ఎలాంటి కార్యాచరణ ఉండబోతోంది? ఔత్సాహిక మహిళ పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ప్రోత్సాహకాలు, రాయితీలు అందనున్నాయి... ఇలాంటి ప్రశ్నలెన్నో బడ్జెట్ నేపథ్యంలో మదిలో మెదులుతాయి. ‘మహిళలకు సంబంధించి బడ్జెట్ 2024 ఎలా ఉండాలి?’ అనే దానిపై కొందరు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ల అభిప్రాయాలు... ప్రత్యేక నిధి గత అయిదేళ్లలో మన దేశంలో మహిళల యాజమాన్యంలోని వ్యాపారాలు 20 శాతానికి పైగా పెరిగాయి. రాబోయే అయిదేళ్లలో 90 శాతం వరకు పెరుగుతాయని అంచనా. ఎన్నో నగరాల్లో మహిళా వ్యాపారుల ప్రతిభాసామర్థ్యాలను ప్రత్యక్షంగా చూశాను. ఇలాంటి వారికి 2024 బడ్జెట్ ఫండింగ్, మౌలిక సదుపాయాల విషయంలో వెన్నుదన్నుగా నిలవాలి. మహిళా పారిశ్రామికవేత్తల కోసం నిధుల కేటాయింపులో గణనీయమైన పెరుగుదల ఉండాలి. –స్వాతి భార్గవ, కో–ఫౌండర్, క్యాష్ కరో మహిళా శ్రేయస్సు మహిళల హెల్త్‌కేర్ బ్రాండ్ వ్యవస్థాపకురాలిగా మహిళల శ్రేయస్సుకు 2024 బడ్జెట్ దోహదకారి కావాలని కోరుకుంటున్నాను. స్కిల్ డెవలప్మెంట్, హెల్త్‌కేర్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లలో మహిళలు రాణించేందుకు, వారికి సాధికారత కల్పించేందుకు బడ్జెట్ ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. – రచనా గుప్తా, కో–ఫౌండర్, జినోవేద గేమ్ చేంజర్‌గా... మహిళలు నిర్వహించే వ్యాపారాలను ముందుకు నడిపించే గేమ్‌చేంజర్‌గా ఈ బడ్జెట్ ఉండాలని ఆశిస్తున్నాను. రుణ ప్రక్రియను సరళతరం చేయాలి. మహిళల నేతృత్వంలోని వ్యాపారాల్లో వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులను ప్రోత్సహించాలి. నిధుల అంతరాన్ని పూడ్చాలి. గ్రాంట్లు, సబ్సిడీలు, పన్ను మినహాయింపుల రూపంలో ఆర్థిక ప్రోత్సాహకాల కోసం ఎదురు చూస్తున్నాం. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల వ్యాపార చతురత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించే శిక్షణా కార్యక్రమాల కోసం బడ్జెట్లో కేటాయింపులు అవసరం. మహిళలకు సంక్షేమ పథకాలు అందే విషయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయాలి. మాటలు కాదు కార్యాచరణ కనిపించాలి. ‘ఇది కొత్త బడ్జెట్’ అనిపించాలి. – సోమ్దత్తా సింగ్, ఇ–కామర్స్ ఎంటర్ ప్రెన్యూర్, ఏంజెల్ ఇన్వెస్టర్, రైటర్ మరిన్ని పొదుపు పథకాలు గ్రామీణ సమాజంలోని మహిళల కోసం మరిన్ని పొదుపు పథకాలను రూపొందిస్తారని ఆశిస్తున్నాను. వడ్డీ లేని రుణాలను ప్రవేశ పెట్టాలి. మహిళల నేతృత్వంలోని సంస్థల అభివృద్ధికి తోడ్పడేలా బడ్జెట్ ఉండాలి. మహిళలకు సంబంధించి ఎంటర్ ప్రెన్యూర్షిప్కు ప్రోత్సాహం అందేలా, స్కిల్ బిల్డింగ్‌కు ప్రయోజనం చేకూర్చే పథకాలను ప్రవేశపెట్టాలని ఆశిస్తున్నాను. స్కిల్ గ్యాప్స్ లేకుండా ఉండడానికి మహిళల కోసం ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు రూపొందించాలి. కృత్రిమ మేధ ఆధారిత రంగాలలో మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సాంకేతిక శిక్షణా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. – ఉపాసన టకు, కో ఫౌండర్–మొబిక్విక్ ప్రపంచ ఆర్థికశక్తిగా ఎదిగేలా... పన్నెండవ తరగతి తరువాత యువతులకు నైపుణ్యశిక్షణా కార్యక్రమాలు చేపట్టాలి. ‘మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం’ అని ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. వ్యవసాయరంగంలో ఉన్న మహిళలపై దృష్టి సారించాలి. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న మన దేశ లక్ష్యం నెరవేరేలా వివిధ రంగాల మహిళలకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. – జ్యోతీ బండారీ, లోవక్ క్యాపిటల్ ఫౌండర్, సీయివో బాలికల విద్యకు ప్రాధాన్యత రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అలవెన్స్ పెంచాలి. ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలి. బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. బాలికలకు సంబంధించి ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్‌ను పెంచాలి. – రాధిక దాల్మియ, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (కోల్‌కతా చాప్టర్)– చైర్పర్సన్ మహిళా రైతుల కోసం... బడ్జెట్లో మహిళా రైతులు, కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యానికి గుర్తింపు ఇచ్చే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. రాయితీల ద్వారా మహిళా రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా ప్రోత్సాహకాలు అందించాలి. – ధనశ్రీ మంధానీ, సలాం కిసాన్–ఫౌండర్ ఫ్యూచర్ రెడీ స్కిల్స్ ‘ఫ్యూచర్ రెడీ’ స్కిల్స్ కోసం మహిళలను సన్నద్ధం చేసే కార్యాచరణను రూపొందించాలి. మహిళల నైపుణ్య శిక్షణకు సంబంధించి పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు ఇవ్వాలి. స్కిల్ డెవలప్మెంట్ వల్ల కెరీర్ బ్రేక్ తీసుకున్న మహిళలు తిరిగి ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది. – నేహా బగారియా, ఫౌండర్– జాబ్స్ ఫర్ హర్ -
మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ ప్రోత్సాహం
సాక్షి, విశాఖపట్నం/తగరపువలస (విశాఖపట్నం): మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. విశాఖపట్నంలో రెండు రోజులు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల సదస్సును ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, వాటిలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. స్టార్టప్ కంపెనీలను స్థాపించే మహిళలకు ప్రోత్సాహకాలతోపాటు వినూత్న ఆలోచనలతో ముందుకువెళ్లేలా సహకారం అందిస్తున్నామని తెలిపారు. అనకాపల్లిలో 50 ఎకరాల్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా ఇండ్రస్టియల్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 27 ఎమర్జింగ్ ఇన్నోవేషన్స్ హబ్‌లను ఎంపిక చేయగా, వాటిలో రాష్ట్రం నుంచి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఉండడం గర్వకారణమన్నారు. ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతోపాటు ఆధునిక సాంకేతికతను కూడా వినియోగించుకుంటే మంచి ఫలితాలు సాధించగలరని సూచించారు. ఈ సదస్సులో ఎడ్–వెంచర్ స్కూల్ ప్రైవేట్ లిమిటెడ్, యాంటెన్నా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, హెడ్ స్టార్ట్ నెట్వర్క్ ఫౌండేషన్, వుయ్ ఫౌండర్ సర్కిల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు పలు ప్రాజెక్టుల కోసం ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. అనంతరం ఏపీఐఎస్ ఈ–మ్యాగజైన్‌ను మంత్రి అమర్నాథ్, ఐటీ కార్యదర్శి కోన శశిధర్ ఆవిష్కరించారు. ఈ సదస్సులో ఏపీఐఎస్ సీఈవో అనిల్‌కుమార్, ఏపీ, తెలంగాణ ఎస్టీపీఐ డైరెక్టర్ సీవీడీ రాంప్రసాద్, అదనపు డైరెక్టర్ సురేష్ బాతా, నీతి ఆయోగ్ సభ్యురాలు యశోధర, నాస్కాం సీఈవో సంజీవ్ మల్హోత్రా, సీఐఐ సదరన్ రీజియన్ ఉమెన్ నెట్వర్క్ ప్రెసిడెంట్ లక్ష్మి ముక్కవల్లి, స్టార్టప్ ఇండియా (న్యూఢిల్లీ) అసిస్టెంట్ మేనేజర్ ఖుష్బూ వర్మ, ఎన్ఆర్డీసీ డెవలప్మెంట్ ఇంజినీర్ శ్రీసుధ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు. ‘స్పేస్’ స్టార్టప్‌లపై దృష్టి పెట్టాలి అంతరిక్ష ప్రయోగాలు, ప్రాజెక్టులకు ప్రాధాన్యత పెరుగుతోందని, ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యువత స్పేస్ స్టార్టప్‌లను ప్రారంభించే దిశగా అడుగులు వేయాలని రాష్ట్ర భారీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సూచించారు. భీమిలి మండలం దాకమర్రిలో ఉన్న రఘు ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ దేశాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దగల సత్తా సాంకేతిక రంగానికి ఉందన్నారు. అంతరిక్ష ప్రయోగాలకు ప్రాధాన్యత పెరుగుతున్న కారణంగా ఈ రంగంవైపు పారిశ్రామికవేత్తలు అడుగులు వేయాలన్నారు. భవిష్యత్‌లో స్పేస్ టూరిజానికి మంచి డిమాండ్ ఉంటుందన్నారు. అంతరిక్ష రంగానికి సంబంధించిన స్టార్టప్‌లు ఏర్పాటు చేసే యువతకు సహకారం అందిస్తామని చెప్పారు. ఇస్రో డిప్యూటీ డైరెక్టర్ జి.రమేష్ బాబు మాట్లాడుతూ దేశ భవిష్యత్ అంతరిక్ష పరిశోధనలపై ఆధారపడి ఉందని అందరూ తెలుసుకోవాలన్నారు. స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమాల్లో షార్ శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా పాల్గొంటారన్నారు. యువత చిప్ మ్యానుఫ్యాక్చరింగ్‌పై దృష్టి సారించాలని సూచించారు. రఘు విద్యాసంస్థల చైర్మన్ కలిదిండి రఘు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల మ్యాగ్జైన్ను మంత్రి ఆవిష్కరించారు. -
కేశాలతో రూ. కోట్లు.. హైదరాబాదీ సిస్టర్స్ బిజినెస్ అదుర్స్!
అందాల ప్రపంచంలో జుట్టుకున్న ప్రాధాన్యత గురించి తెలిసిందే. చాలా మంది భారతీయ మహిళలకు జుట్టు రాలడం, పొట్టి కేశాలు అనేవి తీవ్రవైన సమస్యలు. ఈ నేపథ్యంలో ఇటీవల హెయిర్ ఎక్స్టెన్షన్లకు ఆదరణ బాగా పెరిగింది. ఈ రహస్యాన్ని గ్రహించిన హైదరాబాదీ సిస్టర్స్ బిజినెస్ ప్రారంభించి కోట్లు సంపాదిస్తున్నారు. రిచా గ్రోవర్ భద్రుకా (Richa Grover Badruka), రైనా గ్రోవర్ (Raina Grover).. హైదరాబాద్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు. భారత్‌లో హెయిర్ ఎక్స్టెన్షన్లకు పెరుగుతున్న డిమాండ్‌ను అర్థం చేసుకున్నారు. 2019లో ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీగా తమ బ్రాండ్ ‘1 హెయిర్ స్టాప్’ (1 Hair Stop)ను ప్రారంభించారు. మొదట్లో రోజుకు 2-3 ఆర్డర్లు వచ్చేవి. ఇప్పుడు ఆర్డర్ల సంఖ్య 130-150కి పెరిగింది. 2022-23లో రూ. 27 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన వీరి బిజినెస్ ఈ ఏడాది రూ. 31 కోట్లు ఆర్జించే దిశగా అడుగులు వేస్తోంది. అదే ప్రేరణ మహిళల జుట్టు సమస్యలకు ఏకైక పరిష్కారాలు మార్కెట్లో లేవని తాము గ్రహించామని, 1 హెయిర్ స్టాప్‌తో నిజమైన పరిష్కారాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రిచా గ్రోవర్ భద్రుకా చెబుతున్నారు. భారత్ గ్లోబల్ హెయిర్ ఎగుమతిలో అగ్రగామిగా ఉన్నప్పటికీ, భారత మార్కెట్లో అంతరాన్ని గుర్తించడంతో వారి ప్రయాణం ప్రారంభమైంది. భారతీయ మహిళల ప్రత్యేక అవసరాలకు ప్రత్యేకంగా అధిక-నాణ్యత జుట్టు ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నామని అని ఆమె పేర్కొంటున్నారు. కలిసొచ్చిన తండ్రి వ్యాపారం ఈ సిస్టర్స్ బిజినెస్ ప్రయాణంలో తమ వ్యక్తిగత నేపథ్యం కూడా కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్‌లో పెరిగిన రిచాకు చిన్నప్పటి నుంచి అందం, ఫ్యాషన్‌పై మక్కువ ఎక్కువ. ఆమె తండ్రి ఒకటిన్నర దశాబ్దం పాటు జుట్టు వ్యాపారంలో ఉండటం కూడా ఆమె సంకల్పానికి కలిసొచ్చింది. చదువును పూర్తి చేసిన తర్వాత రిచా కుటుంబ వ్యాపారంలో చేరారు. భారతీయ మార్కెట్‌కు నేరుగా సేవలందించే లక్ష్యంతో 2019లో ‘1 హెయిర్ స్టాప్’ను ప్రారంభించే ముందు ఆమె మొదట్లో హోల్‌సేల్ ఎగుమతులపై దృష్టి సారించారు. స్టార్టప్‌గా ప్రారంభమై.. స్టార్టప్‌గా ప్రారంభమైన ‘1 హెయిర్ స్టాప్’ మంచి వృద్ధిని సాధించింది. నేడు ఆధిపత్య పరిశ్రమగా అభివృద్ధి చెందుతోంది. ప్రారంభంలో రోజుకు కేవలం 1-3 ఆర్డర్లు వచ్చేవి. ఇప్పుడు రోజుకు 150-160 ఆర్డర్లు వస్తున్నాయి. ప్రారంభ రోజులలో కేవలం రూ. 10,000 మార్కెటింగ్ బడ్జెట్ ఉండేది. ఇప్పుడు మార్కెటింగ్ కోసం నెలకు రూ. 10-16 లక్షలు ఖర్చు పెడుతున్నారంటే వారి బిజినెస్ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. తమ ఉత్పత్తులను బయటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. 1 హెయిర్ స్టాప్ ఆదాయంలో 75 శాతం భారత్ నుంచి వస్తుంటే మిగిలినది అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ, సింగపూర్ వంటి దేశాల నుంచి వస్తోంది. మొత్తం అమ్మకాలు రూ. 61 కోట్లు 1 హెయిర్ స్టాప్ ఇప్పటివరకూ 1.2 లక్షలకు పైగా ఆర్డర్లను అందుకుంది. 2.1 లక్షలకు పైగా ఉత్పత్తులను విక్రయించింది. మొత్తం అమ్మకాలు రూ. 61 కోట్లు దాటాయి. 2022 ఆ సంస్థకు అత్యంత లాభదాయకమైన సంవత్సరం. ఎందుకంటే ఆ సంవత్సరంలో కంపెనీకి 47,000 ఆర్డర్లు రాగా 90,000 ఉత్పత్తులను విక్రయించింది. 2022-23లో రూ. 27 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ట్రెండ్‌కు అనుగుణంగా ఉత్పత్తులు కొత్త తరం అమ్మాయిలు హెయిర్‌స్టైల్‌తో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతారు. క్లీన్ గర్ల్ ఈస్తటిక్, ఫెయిరీ గర్ల్ ట్రెండ్, బార్బీ కోర్ ఈస్తెటిక్ హెయిర్ స్టైల్స్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటికీ హెయిర్ ఎక్స్టెన్షన్లు అవసరం. దీనికి అగుణంగా 1 హెయిర్ స్టాప్ పోర్ట్‌ఫోలియోలో కలర్‌ఫుల్ స్ట్రీక్స్, మెస్సీ బన్స్, పోనీ టెయిల్స్, ఫ్లైఫిక్స్, లేస్, సిల్క్ టాపర్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఎక్స్పీరియన్స్ సెంటర్‌ని ప్రారంభించడం ద్వారా ఆఫ్‌లైన్ స్పేస్‌లోకి ప్రవేశించాలని 1 హెయిర్ స్టాప్ యోచిస్తోంది. అదనంగా బ్రాండ్ తన హెయిర్‌కేర్ శ్రేణిని విస్తరించడం, సెలూన్ నెట్‌వర్క్‌లతో సహకారాన్ని అన్వేషించడం, సెమీ-పర్మనెంట్ హెయిర్ ఎక్స్టెన్షన్లను భారతీయ కస్టమర్లకు పరిచయం చేయడంపై దృష్టి సారించింది. -
మహిళల ఆర్థికాభివృద్ధితో పురోగతి
గాంధీనగర్: మహిళల ఆర్థిక పురోగతితో దేశాభివృద్ధి సాధ్య మని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మహి ళల నేతృత్వంలో అభివృద్ధి కార్య క్రమాలు చేపడితే మహిళా సాధికారత కూడా సాధ్యప డుతుందన్నారు. మహిళలు సంపన్నులైతే ప్రపంచం సుసంపన్నంగా మారుతుందన్నారు. జీ–20 సన్నాహక సదస్సుల్లో భాగంగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మహిళా సాధికారతపై మంత్రుల సదస్సునుద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. మహిళా పారిశ్రామికవేత్తలు మరింతగా రాణించడానికి ప్రభుత్వాలు చేయాల్సినదంతా చేయాలన్నారు. ‘‘మహిళలు వాణిజ్య రంగంలోనూ విజయవంతమయ్యేలా చర్యలు తీసుకోవడమే మనందరి లక్ష్యం కావాలి. మార్కెట్, గ్లోబల్ వాల్యూ చైన్, రుణాలు వంటివి వారికి అందుబాటులోకి తీసుకురావడానికి ఉన్న అడ్డంకుల్ని అధిగమించాలి. అప్పుడే మహిళలు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు’’ అని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని మోదీ కొనియాడారు. ఒక ఆదివాసీ మహిళ అయి ఉండి కూడా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రథమ మహిళగా ఎదిగారని, త్రివిధ బలగాలకు నేతృత్వం వవహిస్తున్నారని చెప్పారు. స్థానిక ప్రభుత్వాల్లో 46% మంది మహిళలే ఉన్నారని గుర్తు చేశారు. -
మహిళా వ్యాపారవేత్తల కోసం గుడ్‌న్యూస్.. ఈ ట్రైనింగ్ మీకోసమే
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు యూఎస్ కాన్సులేట్ అకాడమీ ఫర్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ప్రోగ్రామ్(AWE)చక్కటి అవకాశం కల్పిస్తోంది. యూఎస్ పూర్వవిధ్యార్థులతో ఇన్-క్లాస్ డిస్కషన్, మెంటరింగ్ వంటి ట్రైనింగ్ సెషన్‌ను నిర్వహిస్తుంది. యుఎస్ కాన్సులేట్ జనరల్ సహకారంతో కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్స్ (KIIT-TBI) సంయుక్తంగా ఈ ప్రొగ్రామ్‌ను నిర్వహిస్తుంది.అయితే ఈ ట్రైనింగ్ సెషన్‌కు హాజరు కావాలంటే అభ్యర్థులు జూన్ 30లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వరంగల్, భువనేశ్వర్, విశాఖపట్నం, తిరుపతి వంటి నాలుగు నగరాల్లో మొత్తం 100 మంది ఔత్సాహిక, మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించి వారికి అకాడమీ ఫర్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ ఈ ట్రైనింగ్ సెషన్‌ను అందిస్తుంది. ప్రతి లొకేషన్లో 25మంది పాల్గొనొచ్చు. కాబట్టి అభ్యర్థులు ముందుగానే ఆన్లైన్లో తమ పేరును రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరెవరు ఈ ట్రైనింగ్‌కు అర్హులు? ♦ ట్రైనింగ్ సెషన్‌కు హాజరయ్యే వాళ్ల మహిళల వయసు 18-50 ఏళ్ల మధ్య ఉండాలి. ♦ అప్లికేషన్‌ను జూన్ 30లోగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ♦ అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం చదవుతున్న వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు ♦ ముందుగానే ఏ బిజినెస్ చేయాలి? ఎలా చేయాలి వంటివాటిపై అవగాహన కలిగి ఉండాలి. అప్లికేషన్ ఆన్లైన్లో https://awe.kiitincubator.inలో అందుబాటులో ఉంది. పూర్తి సమాచారం కోసం https://forms.gle/zqSFnhZ6veNq7JQV7 వెబ్‌సైట్‌ను వీక్షించండి. Don’t miss out! We only have a few seats left in our Academy of Women Entrepreneurs (AWE) program in Telangana, Andhra Pradesh, and Odisha. Aspiring women entrepreneurs are encouraged to apply. Application deadline is Friday, 30 June. More details: https://t.co/Q2vyoS7tRa https://t.co/0wtqiZrXAL — U.S. Embassy India (@USAndIndia) June 27, 2023 -
ఇంట్లో ఇల్లాలు, ఇంటింటికీ తిరిగి సబ్బులమ్మి.. 200 కోట్లు సంపాదించింది!
చదువు పూర్తయింది. కోరుకున్న ఉద్యోగం. తోడు నీడలా ఉండే భర్త. తన వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా గడుస్తుందని తెగ సంబరపడింది ఆ ఇల్లాలు. ఆ ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేలా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మాతృత్వపు మాధుర్యంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తున్న ఆ తల్లిని చూసి విధికి కన్ను కుట్టిందేమో. అప్పుడే పుట్టిన కొడుకు మానసికంగా, శారీరకంగా పరిపక్వత రాకుండా అడ్డుకునే డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధి బారిన పడ్డాడని తెలిసి ఆమె గుండె బద్దలైంది. దీనికి ఎగ్జిమా అనే చర్మ సమస్య కూడా తోడవడంతో ఆ క్షణం ఆమె జీవితం ఒక్కసారిగా ఆగిపోయినట్లనిపించింది. నాకే ఎందుకిలా జరిగిందని కృంగిపోలేదు. అలా అని చూస్తూ కూర్చోలేదు. విధిని ఎదిరించింది. గెలిచి నిలబడింది. ఇంట్లో ఇల్లాలిగా ఉంటూ రూ.200 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఎంతో మంది మాతృ మూర్తులకు ప్రేరణగా నిలుస్తోంది. చదవండి👉 చూడటానికి కిరాణా కొట్టు లాగే ఉంది.. నెలవారీ బిజినెస్ రూ.4 కోట్లకు పై మాటే హరిణి శివకుమార్ ఎవరు? 1988లో వరదరాజన్ శివకుమార్ దంపతులకు హరిణి శివకుమార్ ఢిల్లీలో జన్మించారు.యావరేజ్ స్టూడెంటే అయినా చెన్నై కాలేజీ కామర్స్ డిగ్రీ, ఎంబీఏలో రీటైల్ మేనేజ్మెంట్ పూర్తి చేశారు. 22ఏళ్లకే వివాహం.. ఆవిరైన ఆనందం విద్యాభ్యాసం పూర్తి చేసిన వెంటనే ఓ ప్రముఖ కార్పొరేట్ బ్యాంక్‌లో చేరారు. 22 ఏళ్ల వయసులో వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. చూస్తుండగానే పండంటి బిడ్డకు జన్మనించింది. కానీ పుట్టిన మగ బిడ్డ (బార్గవ్)కు డౌన్ సిండ్రోమ్, ఎగ్జిమా అనే చర్మ సమస్యలు ఉన్నాయని తెలిసి ఆమె ఆనందం ఆవిరైంది. చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్‌డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో? ప్రతి సమస్యలోనూ ఓ అవకాశం ‘ప్రతి సమస్యలోనూ అవకాశాలు ఉంటాయి..ప్రయత్నించే వారికి దైవం కూడా సహకరిస్తుందనే నమ్మే ఆమె.. దృఢ నిశ్చయంతో పిల్లల చర్మ సమస్యలతో బాధపడే తనలాంటి తల్లుల సమస్యలకు పరిష్కారం చూపేందుకు సొంతంగా సోప్స్ బిజినెస్ చేయాలనే ఆలోచన మొదలైంది హరిణికి. అదికి కూడా మార్కెట్లో దొరికే సువాసన భరిత, రసాయనాలతో కూడిన సబ్బులు పడవని తెలుసుకొని, ఇవి లేని సబ్బుల కోసం అన్వేషించింది. శీకాకాయ, శెనగపిండి, మెంతులు, మందార, బీస్‌వ్యాక్స్, అవకాడో నూనె, ఆముదం నూనె, కొబ్బరి నూనె.. వంటి సహజసిద్ధమైన పదార్ధాలతో ఇంట్లోనే సబ్బుల తయారీ ప్రారంభించారు. ఆ సబ్బులతో సోరియాసిస్, ఎగ్జిమాలాంటి చర్మ సమస్యలకు పరిష్కారం చూపారు. ఎంతో మంది తల్లుల కడుపు కోత తీర్చి మాతృమూర్తి అయ్యారు. చదవండి👉 దేశంలోని ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. డబుల్ శాలరీలను ఆఫర్ చేస్తున్న కంపెనీలు! సోప్‌ఎక్స్ అలా మొదలైన బిజినెస్ ఆలోచనను ఆచరణలో పెట్టింది. కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన ఉత్పత్తులతో మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) ‘సోప్‌ఎక్స్ ఇండియా’ తన సొంత బ్రాండ్ పేరునే రిజిస్టర్ చేశారు. అదే బ్రాండ్ మీద సబ్బుల్ని తయారు చేసి ఇంటింటికి, వీధుల్లో, మార్కెట్లలో స్టాళ్లు పెట్టి అమ్మేవారు. కామర్స్ స్టూడెంట్ కాస్త .. కాస్మోటిక్ కెమెస్ట్రీలో రోజులు గడిచే కొద్దీ వ్యాపారం సవ్యంగా జరుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో తాను తయారు చేస్తున్న సబ్బుల్ని అమ్మాలని అనుకోలేదు. కానీ ఇంకెదో సాధించాలని అనుకున్నారు. సహజ పద్దతుల్ని చర్మాన్ని కాపాడేలా పదుల సంఖ్యలో ఉత్పత్తుల్ని తయారు చేసి అమ్మాలని భావించారు. అందుకే కామర్స్ డిగ్రీ చదివిన ఆమె 2016లో లిప్టిక్, షాంపూ,మేకప్ పౌండర్, నెయిల్ పాలిష్, టూత్ పేస్ట్, స్క్రిన్ కేర్ ప్రొడక్ట్‌లు, సన్ స్క్రీన్, బాడీ వాష్ వంటి ప్రొడక్ట్‌లను తయారు చేసే అర్హత సంపాదించేందుకు కాస్మోటిక్ కెమిస్ట్రీ కోర్స్‌లో చేరారు. చదవండి👉 ‘ఆఫీస్‌కి వస్తారా.. లేదంటే!’, వర్క్ ప్రమ్ హోం ఉద్యోగులకు దిగ్గజ టెక్ కంపెనీల వార్నింగ్ సోషల్ మీడియాలో విక్రయం కోర్స్ పూర్తి చేసిన అనంతరం కాస్మోటిక్ ప్రొడక్ట్‌లను తయారు చేసి సొంతంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయించడం ప్రారంభించారు. ఆ సమయంలో ఆమే సొంత వెబ్సైట్, బ్రాండ్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. వెబ్సైట్ తయారు చేయడం నుంచి ప్రొడక్ట్ ప్యాకేజింగ్, ప్రైసింగ్ ఇలా పనులన్నీ ఒక్కరే పూర్తి చేశారు. చదవండి👉 కడుపు నిండా తిండి పెట్టి.. ఉదయాన్నే చావు కబురు చల్లగా చెప్పిన ఐటీ సంస్థ! తండ్రికి తెగేసి చెప్పింది ఒక రోజు హరిణి ఇంట్లో కాస్మోటిక్స్ ప్రొడక్ట్‌లను తయారు చేస్తుంది. అదే సమయంలో కొడుకు ఏడుస్తున్నా పట్టించుకోలేదని తండ్రి హరిణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబం, వ్యాపారం ఒక్కటి కాదని.. రెండు వేర్వేరుగా చూడాలని, నువ్వు చేసేది చాలా తప్పని హెచ్చరించారు. అందుకు తాను బిజినెస్ చేయడం మానుకోలేనని తెగేసి చెప్పింది. దీంతో కుమార్తె హరిణి నిర్ణయాన్ని తండ్రి వరదరాజన్ శివకుమార్ అంగీకరించారు. ఆమెతో కలిసి వ్యాపారాన్ని కొనసాగించేందుకు సహాయం చేశారు. రూ.200 కోట్ల వ్యాపారం 2019లో సోప్‌ఎక్స్ బ్రాండ్‌ను ఎర్త్ రిథమ్ పేరుతో రీలాంచ్ చేశారు. 8 మంది మహిళా సిబ్బందితో గుర్గావ్లో కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రారంభించిన రెండేళ్లలో ఆ సంస్థ 500 రెట్ల వృద్ది సాధించింది. 10రెట్లు కొనుగోలు చేసే కస్టమర్లు పెరిగారు. ఇప్పుడు ఆ సంస్థలో 100 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎర్త్ రిథమ్ వెబ్సైట్ నుంచి 160కి పైగా కాస్మోటిక్స్ ఉత్పత్తులు అమ్ముతున్నారు. ఎర్త్ రిథమ్ సంస్థ తయారు చేసిన షాంపూ బార్ ప్రొడక్ట్ ప్రపంచ దేశాల్లో అత్యంత ప్రసిద్ది చెందింది. ఎలాంటి వ్యాపార అనుభవం లేకుండా రూ.200 కోట్ల బ్రాండ్‌ను నిర్మించానని, తనలాగే ఎవరైనా చేయొచ్చని విజయ గర్వంతో చెబుతున్నారు. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? -
పారిశ్రామిక రంగంలో దూసుకుపోతున్న మహిళామణులు
-
అంతర్జాతీయ విపణిలోకి మహిళా స్టార్టప్‌లు
సాక్షి, హైదరాబాద్: మహిళలను వాణిజ్యవేత్తలుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా నాలుగున్నరేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వి హబ్ (వుమెన్ ఎంట్రప్రెన్యూర్స్ హబ్) అటు గ్రామీణ, ఇటు అంతర్జాతీయ స్థాయికి కార్యకలాపాలు విస్తరించేలా ద్విముఖ వ్యూహానికి పదును పెడుతోంది. వి హబ్‌లో పురుడు పోసుకుంటున్న మహిళల సారథ్యంలోని స్టార్టప్‌లు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకునేలా ఓ వైపు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతాలకు కార్యకలాపాలు విస్తరించేందుకు అవసరమైన ప్రణాళికలను వి హబ్ సిద్ధం చేస్తోంది. ఆర్ధిక, సామాజిక అడ్డంకులను అధిగమించి మహిళలు వాణిజ్యవేత్తలుగా రాణించేందుకు అవసరమైన సహాయ, సహకారాలను అందించేందుకు చేయూతను అందిస్తోంది. తమ వద్ద ఉన్న వినూత్న ఆలోచనలు, పరిష్కారాలకు వాణిజ్య రూపం ఇచ్చేందుకు పడుతున్న ఇబ్బందులను మహిళలు అధిగమించేందుకు అవసరమైన సాయాన్ని వి హబ్ వివిధ రూపాల్లో అందిస్తోంది. మహిళల సారథ్యంలోని స్టార్టప్‌లు మహిళల్లో దాగి ఉన్న వినూత్న ఆలోచనలు, సంక్లిష్ట సమస్యలకు సులభ పరిష్కారం చూపుతూ స్టార్టప్‌ల ద్వారా వాణిజ్యరూపంలో ఊతమిచ్చేందుకు 2018 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం వి హబ్ ఏర్పాటు చేసింది. వి హబ్‌లో ప్రస్తుతం మహిళల సారథ్యంలోని 84 స్టార్టప్‌లు ఇంక్యుబేట్ అవుతుండగా, వి హబ్ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు 914 మహిళా స్టార్టప్‌లు ఇక్కడ ఏర్పాటయ్యాయి. వి హబ్‌లో ఇంక్యుబేట్ అవుతున్న స్టార్టప్‌లలో ఎక్కువగా నిత్యావసర వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందినవి కాగా, 25 శాతం చేనేత, వస్త్ర, దుస్తుల తయారీ పరిశ్రమ రంగాలు, 13 శాతం ఆరోగ్య, లైఫ్‌సైన్సెస్ రంగాలు కాగా మిగతావి ఇతర రంగాలకు చెందినవి. స్టార్టప్‌లు తమ ఆలోచనలకు పదును పెట్టుకునేందుకు అవసరమైన సాయంతో పాటు సాంకేతిక సాయం అందించే మెంటార్లను (మార్గదర్శకులు) కూడా వి హబ్ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటి వరకు బ్యాంకు లింకేజీలు, ఈక్విటీ ఫండింగ్, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ తదితరాల ద్వారా మహిళా స్టార్టప్‌లకు వి హబ్ రూ.83 కోట్ల మేర నిధులు సమకూర్చింది. అటు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌తో ఒప్పందం ఇటు మారుమూల ప్రాంతాల్లో విస్తరణ మహిళా స్టార్టప్‌లు అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించడం ద్వారా మెరుగైన వాణిజ్య అవకాశాలను పొందేందుకు వీలుగా వి హబ్ ఇటీవల వరల్డ్ ట్రేడ్ సెంటర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. పలు అంతర్జాతీయ కంపెనీలతోనూ మహిళా స్టార్టప్‌లు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇక హైదరాబాద్‌కే కార్యకలాపాలను పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాలపైనా వి హబ్ దృష్టి సారించనుంది. సిరిసిల్ల, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మంతో పాటు కొన్ని గిరిజన ప్రాంతాల్లోనూ స్టార్టప్ సంస్కృతిపై అవగాహన కల్పించాలని వి హబ్ నిర్ణయించింది. మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం రాష్ట్రంలో మహిళల సారథ్యంలోని స్టార్టప్‌లను ప్రోత్సహించడం ద్వారా మహిళా వాణిజ్యవేత్తలను తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. వినూత్న ఆలోచనలు కలిగిన మహిళలను గుర్తించడం, వారి ఆలోచనలకు స్టార్టప్‌ల ద్వారా వాణిజ్య రూపం ఇవ్వడం, వారికి అవ సరమైన పెట్టుబడి, సాంకేతిక, వాణిజ్య సల హాలు, మార్గదర్శనం ఇవ్వడంలో వి హబ్ కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ స్టార్టప్‌లు స్థానిక ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. – దీప్తి రావుల, సీఈఓ, వి హబ్ గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని.. ఇప్పుడు వాణిజ్యవేత్తను గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసిన నేను వి హబ్ ప్రోత్సాహంతో వాణిజ్యవేత్తగా మారాను. స్టార్టప్ ద్వారా బిజినెస్ ప్రారంభించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు, బిజినెస్ ఐడియాలు, మార్కెటింగ్ నెట్వర్క్ తదితరాల్లో ఇక్కడ మార్గదర్శకత్వం లభించింది. ప్రస్తుతం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషీన్ల వ్యాపారం చేస్తున్నా. ఎంబ్రాయిడరీ స్టూడియో నుంచి మొదలైన నా ఆలోచన ప్రస్తుతం ఎంబ్రాయిడరీ మెషీన్ల దాకా విస్తరించింది. ప్రస్తుతం రూ.1.2 కోట్ల వార్షిక టర్నోవర్‌తో నా వ్యాపారం సాగుతోంది. – భవ్య గుమ్మడి -
మహిళల పారిశ్రామిక అభ్యుదయం.. పరిశ్రమల స్థాపనకు ముందడుగు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఇంటికి దీపం ఇల్లాలు అనేది నానుడి. ఇప్పుడు ఇంటికే కాదు సమాజాభివృద్ధిలో మహిళలు కీలకమయ్యారు. ఏ రంగంలో అడుగుపెట్టినా నిరంతర కృషితో, ఒడుదొడుకులను ఎదుర్కొనే సామర్థ్యంతో తమదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు పారిశ్రామికం రంగంలోనూ తామే కర్త, కర్మ, క్రియ అన్నట్లుగా ఒంటిచేత్తే విజయాలను అందుకుంటున్నారు. సంక్షేమ పథకాల్లోనూ, రాజకీయ పదవుల్లోనూ మహిళలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి పారిశ్రామిక రంగంలోనూ అదే తరహాలో ప్రోత్సహిస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు స్థలంతో పాటు రుణాల మంజూరుకు ప్రభుత్వం నుంచి సహకారం అందుతోంది. పెట్టుబడిలో రాయితీలు కల్పిస్తోంది. సింగిల్ విండో విధానంలో త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తోంది. మరెక్కడా లేనివిధంగా కొత్తవలస మండలం రెల్లి వద్ద 159 ఎకరాల్లో మహిళలకు ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అనేకమంది మహిళలు పారిశ్రామిక ప్రగతిలో భాగస్వాములు అవుతున్నారు. పదిమందికీ ఉపాధి కల్పిస్తూ పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 37 భారీ, మెగా పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో 18,202 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో మహిళా భాగస్వామ్యం ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానంతో కొత్త పరిశ్రమలకు మార్గం సుగమమైంది. రూ.4,460 కోట్ల పెట్టుబడితో మరో 14 పరిశ్రమలు ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. వీటికి వివిధ దశల్లో అనుమతులు మంజూరు కావాల్సి ఉంది. అవి కార్యరూపంలోకి వస్తే 19,038 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మరో 2,883 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల యజమానుల్లో ఎక్కువ మంది మహిళలే. ఆ పరిశ్రమల ద్వారా ప్రస్తుతం 41,175 మందికి ఉపాధి లభిస్తోంది. జిల్లా కలెక్టర్‌గా ఎ.సూర్యకుమారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు. ఔత్సాహికులకు ప్రత్యేకంగా జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా 2,370 వరకూ దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 2,296 దరఖాస్తులకు అనుమతులు ఇచ్చారు. ఆయా లబ్ధిదారుల్లో ఎక్కువ మంది మహిళలే ఉండటం విశేషం. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ) కింద పరిశ్రమల స్థాపనకు అవసరమైన సహాయ సహకారాలను డీఐసీ అధికారులు అందిస్తున్నారు. కొత్తవలస మండలం బలిఘట్టం గ్రామంలో 70.41 ఎకరాలు, రామభద్రాపురం మండలం కొటక్కి గ్రామం వద్ద 187.08 ఎకరాలు, నెల్లిమర్ల నియోజకవర్గంలోని పూసపాటిరేగ మండలం జి.చోడవరం గ్రామంలో 155.92 ఎకరాల్లో కొత్తగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కోసమే ప్రత్యేకంగా కొత్తవలస మండలంలోని రెల్లి గ్రామం సమీపంలో 159 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కు అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం 2020–23 నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. సూక్ష్మ, చిన్న, మధ్య, భారీ, మెగా పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి రాయితీ 15 శాతం నుంచి 45 శాతం వరకూ ఇస్తోంది. భూమి కొనుగోలుపై స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, భూమి తనఖాకు 100 శాతం రాయితీ కల్పిస్తోంది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే మహిళలకు ఏపీఐఐసీ ప్లాట్లలో 50 శాతం రాయితీ ఇస్తోంది. వీటితోపాటు భూమి మార్పిడి చార్జీలు, విద్యుత్ వినియోగం, వడ్డీ రీయింబర్స్‌మెంట్‌పై రాయితీలు కల్పిస్తోంది. అమ్మకపు పన్ను, సీడ్ కాపిటల్‌పై 50 నుంచి శత శాతం రాయితీలు లభిస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకంతో పరిశ్రమ పెట్టా... ప్రత్యేకంగా నిర్మించిన ట్యాంకుల్లో అదీ తక్కువ నీటి వినియోగంతో చేపల పెంపకాన్ని కువైట్‌లో చూశాను. రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ (ఆర్ఏఎస్)లో నీటి పునర్వినియోగమవుతున్న తీరు నన్ను ఆకర్షించింది. అలాంటి పరిశ్రమను పెట్టాలనే ఆలోచనతో తమిళనాడులో శిక్షణ తీసుకున్నాను. జిల్లాకు వచ్చిన తర్వాత నా ప్రాజెక్టు రిపోర్టును చూసి మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ నిర్మలాకుమారి, ఎస్బీఐ భోగాపురం శాఖ మేనేజర్ లక్ష్మి ఎంతో ప్రోత్సహించారు. గత ఏడాది నిర్వహించిన ఎస్బీఐ క్రెడిట్ అవుట్‌రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి చేతుల మీదుగా రుణమంజూరు చెక్కును అందుకున్నాను. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు పీఎంఎంఎస్వై పథకంలో 60 శాతం సబ్సిడీ ప్రభుత్వం ఇస్తోంది. అందరూ సద్వినియోగం చేసుకోవాలి. – కేవీ నాగమణి, ఆర్ఏఎస్ యూనిట్ యజమాని, పోలిపల్లి, భోగాపురం మండలం వంద మందికి ఉపాధి కల్పనే లక్ష్యం... మనం బతకడమే కాదు పదిమందిని బతికించడంలోనే ఆనందం ఉంది. స్వతహాగా పిండివంటల తయారీపై అభిలాష ఉండేది. బెలగాంలోని మా ఇంటిలోనే ఎనిమిదేళ్ల క్రితం వివిధ రకాల పిండివంటల తయారీని వ్యాపారాత్మకంగా ప్రారంభించాను. నలుగురికి ఉపాధి కల్పించాను. వినియోగదారుల ఆదరణ పెరగడంతో తయారీని పెంచాం. ప్రస్తుతం 45 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. ఔత్సాహికులకు అవగాహన కల్పిస్తున్నాను. ఫుడ్‌గార్డెన్ స్టాల్ ప్రారంభించిన తొలిరోజుల్లో కాస్త ఒడుదొడుకులు ఎదురైనా తట్టుకొని నిలబెట్టాను. ఈ పరిశ్రమను మరింత విస్తరించి వంద మందికి ఉపాధి కల్పించాలనేది నా లక్ష్యం. – బి.కన్యాకుమారి, ఫుడ్‌గార్డెన్ యజమాని, పార్వతీపురం 18 మందికి ఉపాధి కల్పిస్తున్నా... వ్యాపార రంగంలో అడుగుపెట్టి పది మందికి ఉపాధి చూపించాలని తొలి నుంచి ఆలోచించేదాన్ని. 2012 సంవత్సరంలో రూ.75వేల పెట్టుబడితో టెక్ట్‌టైల్స్ వ్యాపారం ప్రారంభించాను. మూడేళ్లలో వచ్చిన లాభంతో గంట్యాడ మండలం నందాం గ్రామంలో 75 సెంట్ల స్థలం కొన్నాను. జిల్లాలో అత్యధికంగా పండే మామిడి పండ్లను ఎగుమతి చేయడానికి ప్రత్యేకంగా కార్టూన్ బాక్స్‌లు అవసరం. వాటిని తయారుచేసేందుకు శ్రీసాయిసుధా కోరుగేటెడ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో 2017లో పరిశ్రమను బ్యాంకు రుణం రూ.1.50 కోట్లతో ప్రారంభించాను. 2018 నుంచి ఉత్పత్తి మొదలైంది. రూ.40 లక్షల టర్నోవర్ వచ్చింది. తర్వాత సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాం. ప్రస్తుతం ఏటా కోటి రూపాయల టర్నోవర్ స్థాయికి చేరుకున్నాను. 18 మందికి సాంకేతిక అవగాహన కల్పించి ఉపాధి ఇస్తున్నాను. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆర్గానిక్ ఉత్పత్తుల పరిశ్రమను స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నాను. – బి.సుధార్చన, పారిశ్రామికవేత్త, నందాం, గంట్యాడ మండలం -
మహిళలూ... పరిశ్రమించండి!
‘ఇంజినీరింగ్ సీట్ అమ్మాయిలకెందుకు?’ ఇది నలభై ఏళ్ల నాటి మాట. విద్యావంతులు కూడా కనుబొమలు ముడివేస్తున్న రోజులవి. ‘నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తాను’ సంధ్య అనే ఓ అమ్మాయి పట్టుదల అది. ‘మెకానికల్లోనా అసలే కుదరదు... కావాలంటే ఎలక్ట్రానిక్స్‌లో చేరు’ కొద్దిగా రాజీపడుతూ ఆ అమ్మాయికి సీటిచ్చారు. ఇప్పుడామె దేశ రక్షణ రంగానికి పరికరాలు సమకూరుస్తున్నారు. ఆమే కోవె డైరెక్టర్ సంధ్యారెడ్డి. చేత వచ్చిన పనులతో కుటీర పరిశ్రమ లేదా చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు స్థాపించా లనుకుంటూ గ్రామాల్లో ఉన్న కారణంగా ఏ మార్గమూ లేదని నిరుత్సాహ పడుతున్న వారి కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమా లను, మెంటార్షిప్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల మంది ఔత్సాహిక గ్రామీణ ప్రాంతాల మహిళలకు శిక్షణనిస్తున్నారామె. హైదరాబాద్ బోరబండలో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టిన ఈ ప్రయత్నం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా అసలామెకు ఈ ఆలోచన రావడానికి గల కారణాలేమిటో వివరించారు. అవి ఆమె మాటల్లోనే... ‘‘మాది చాలా సింపుల్ బ్యాక్‌గ్రౌండ్. నాన్న హైదరాబాద్, ఎల్ఐసీలో చేసేవారు, అమ్మ గృహిణి. అమ్మ పూర్తిగా గ్రామీణ నేపథ్యం, చదువుకోలేదు. కానీ ఆమె ఆలోచనలు, లక్ష్యాలు చాలా ఉన్నతంగా ఉండేవి. పిల్లలను పెద్ద చదువులు చదివించాలనే పట్టుదలతో ఉండేది. నాన్న కూడా ఆడపిల్లలు అనే ఆంక్షలు లేకుండా ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి. దాంతో నాకు అమ్మాయి అనే కారణంగా పరిమితులు తెలియదు. సమాజం చిన్న చట్రంలో ఇమిడి ఉందనే విషయం కూడా ఇంజినీరింగ్‌లో సీటు దగ్గరే మొదటిసారిగా తెలిసింది. ఇంజినీరింగ్ సీటు ఆడపిల్లలకు ఇస్తే ఆ సీటు వేస్టవుతుందనే అపోహ ఉండేదప్పట్లో. బెంగళూరులో రెండేళ్లు ఉద్యోగం చేసి, తిరిగి హైదరాబాద్‌కి వచ్చి 1989లో సొంత ఇండస్ట్రీ పెట్టాను. తర్వాత యూఎస్‌కి వెళ్లి ఎనిమిదేళ్లు ఐటీ ఇండస్ట్రీ నడిపించాను. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిశ్రమ స్థాపించాను. మా కెన్రా టెక్నాలజీస్ ఇప్పుడు రక్షణ రంగానికి హై క్వాలిటీ పవర్ సప్లయ్ సిస్టమ్స్, లాండ్ బేస్డ్, ఎయిర్ బోర్న్, నావల్ ప్రాజెక్ట్‌లకు అవసరమైన పరికరాలను అందిస్తోంది. ఈ స్థాయికి చేరడానికి ఎంతగా శ్రమించానో నాకు తెలుసు. అందుకే పారిశ్రామిక రంగంలోకి రావాలనుకునే మహిళల కోసం ఒక వేదిక ఉంటే బావుంటుందని భావసారూప్యం కలిగిన అనేక మంది మహిళా పారిశ్రామికవేత్తల ఆలోచనతో 2004లో మొదలైంది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (కోవె). విస్తరించిన ‘పౌష్టిక్’ కోవె దేశవ్యాప్తంగా 13 వందలకు పైగా సభ్యులతో 11 చాప్టర్స్తో పని చేస్తోంది. అయితే ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలకే పరిమితమై పని చేసింది. గ్రామీణ, పట్టణాల్లో ఉండే మహిళలకు అందుబాటులోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో జిల్లాలకు విస్తరించే ప్రయత్నం మొదలుపెట్టాం. ఇందుకోసం ‘పౌష్టిక్’ అనే కార్యక్రమాన్ని రూపొందించాం. మహిళలు పోషకాలతో కూడిన ఆహారాన్ని ఇంట్లోనే వండి, పోటీలు జరిగే ప్రదేశానికి తెచ్చి ప్రదర్శించాల్సి ఉంటుంది. తెలంగాణలో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలున్నాయి. ఏపీలో విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, వైజాగ్‌లో నిర్వహించాం. ఆహారంతో మొదలుపెట్టడంలో మా ఉద్దేశం మహిళలకు పోషకాహారం ఆవశ్యకతను గుర్తు చేయడం, అందరికీ తెలిసిన ఆహారం నుంచి ఉపాధికి మార్గం వేసుకోవడం ఎలాగో నేర్పించడం అన్నమాట. మహబూబ్ నగర్ లో ఈ కార్యక్రమం రేపు ఉంది. ప్రతిచోటా వంద మంది వరకు పాల్గొంటున్నారు. పోటీల్లో గెలిచిన వాళ్లకు పోషకవిలువల గురించి వివరించగలగడం, ప్యాకేజింగ్, షెల్ఫ్‌లైఫ్‌ను అంచనా వేయడం వంటి అంశాల్లో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. వాళ్లంతా అక్టోబర్ లో జరిగే లైవ్ కిచెన్ పోటీలో పాల్గొనాలి. ఈ పోటీల్లో గెలిచిన మహిళల్లో దాదాపుగా అందరూ సొంత పరిశ్రమ స్థాపించడానికి ముందుకు వస్తారని నమ్మకం. అందిపుచ్చుకోండి కోవెని చాంబర్ ఆఫ్ కామర్స్ ఆస్ట్రేలియా, జర్మనీ, చైనా, శ్రీలంక, ఈజిప్టు వంటి ఇంటర్నేషనల్ ఉమెన్ ఆర్గనైజేషన్లతో అనుసంధానం చేశాం. సాధారణంగా పరిశ్రమ అనగానే మధ్యతరగతి మహిళలను అనేక రకాల భయాలు వెంటాడుతుంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్, కంపెనీ రిజిస్ట్రేషన్ వంటి ప్రక్రియల దగ్గరే వెనక్కిపోయేవాళ్లూ ఉంటారు. మహిళలకు తోడుగా ఈ పనులకు తిరగడానికి ఇంట్లో మగవాళ్లు మొదట విసిగిపోతారు. అలాంటప్పుడు ఆడవాళ్లలో ఎంత ఉత్సాహం ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోతుంటారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కోవెలో పరిశ్రమ స్థాపన, నిర్వహణకు అవసరమైన రిజిస్ట్రేషన్, ఐటీ ఫైలింగ్, మార్కెటింగ్ సర్వీస్‌లన్నీ అందిస్తున్నాం. యంత్ర పరికరాలు అవసరమయ్యే పరిశ్రమల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యంతో ఇన్క్యుబేటర్ సెంటర్లను ఏర్పాటు చేశాం. పరిశ్రమ పెట్టాలనుకునే మహిళ తొలిదశలోనే పెట్టుబడి కోసం ప్రయాస పడాల్సిన అవసరం ఉండదు, మేము ఏర్పాటు చేసిన ఇన్ క్యుబేషన్ సెంటర్లో పని మొదలుపెట్టి, తన మీద తనకు నమ్మకం కుదిరిన తర్వాత యంత్రాలు కొనుక్కుని సొంత పరిశ్రమ ప్రారంభించవచ్చు. ఈ సౌకర్యాలను అందిపుచ్చుకోండి’’ అని ఔత్సాహిక మహిళలకు పిలుపునిచ్చారు సంధ్యారెడ్డి. – వాకా మంజులారెడ్డి, ఫొటో: గడిగె బాలస్వామి అవకాశాలు విస్తరించాలి! పౌష్టిక్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న మహిళల్లో రాజమండ్రి వాళ్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలామంది ఇప్పటికే ‘ఫుడ్ ఇండస్ట్రీ లైసెన్స్ కోసం ఎలా అప్లయ్ చేయాలి’ వంటి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందులో వాళ్ల సందేహాలను తీరుస్తున్నాం. ఏపీలో ఇప్పటికే ఫుడ్ కార్పొరేషన్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే... మా తరంలో ఇన్ని అవకాశాల్లేవు. ఒక మహిళ పారిశ్రామిక వేత్తగా నిలదొక్కుకోవడం చాలా కష్టమయ్యేది. అనేకమంది ఉత్సాహంగా ముందుకు వచ్చి ఎదురీదలేక ఆగిపోయిన వాళ్లూ ఉన్నారు. నగరాల్లోనే ఇలా ఉంటే ఇక గ్రామాలు, పట్టణాల మహిళలకు ప్రయత్నం చేసే అవకాశం కూడా తక్కువే. అందుకే వాళ్ల చేత ఒక అడుగు ముందుకు వేయించాలనేదే కోవె సంకల్పం. – సంధ్యారెడ్డి కేశవరం -
పవర్ ఆఫ్ సారీ: రూ. 6 లక్షలతో..50 కోట్లు వచ్చాయ్!
సాక్షి,ముంబై: ఇంజనీర్లు చేస్తున్న ఉద్యోగం వారికి సంతృప్తి ఇవ్వలేదు. దీనికిమించి ఇంకేదో చేయాలని గట్టిగా అనుకున్నారు. ఆ ఆలోచన ‘సుత’ అనే చీరల బ్రాండ్ ఆవిష్కారానికి నాంది పలికింది. తమదైన ప్రతిభ, చొరవతో రాణిస్తూ సక్సెస్‌పుల్ విమెన్ ఆంట్రప్రెన్యూర్స్‌గా అవతరించారు. చెరొక మూడు లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన వ్యాపారం కేవలం ఆరేళ్లలో ఇపుడు 50 కోట్లకు చేరింది. బిజినెస్ టుడే కథనం ప్రకారం ముంబైకి చెందిన సుజాత (36) తానియా (34) ఇద్దరూ ఇంజనీర్లుగా పనిచేసేవారు. కొన్నాళ్ల తరువాత మరింత కష్టపడి ‘ప్రభావవంతమైన’ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే పెద్దపెద్ద వ్యాపారాలు చేయాలన ఆలోచనలేనప్పటికీ, చీరల పట్ల మక్కువతో చీరల బిజినెస్ బావుంటుందని నిశ్చయించు కున్నారు. పైగా ఇద్దరికీ భారతీయ సాంప్రదాయ దుస్తులు, తీరుతెన్నులపై మంచి అవగాహన ఉంది. అలా తమ ఇరువురి పేర్లలోని సు, త అనే మొదటి రెండు అక్షరాలతో ‘సుత’ (Suta) బ్రాండ్‌ని సృష్టించారు. photo courtesy : BusinessToday.In ఒక్కొక్కరు రూ.3 లక్షలు వెచ్చించి రూ.6 లక్షల కార్పస్ ఫండ్‌తో మొదలుపెట్టారు. అలా ఇన్‌స్టాగ్రాంలో పాపులర్ బ్రాండ్‌గా అవతరించింది. అలా అంచెలంచెలుగా విస్తరిస్తూ గత ఏడాది తమ వ్యాపారాన్ని 50 కోట్ల ఆదాయం సాధించే స్థాయికి తెచ్చారు. ఇప్పుడిక భౌతిక దుకాణాలను తెరవడానికి సిద్ధంగా ఉన్నారు. సాంప్రదాయ,నేత దుస్తులు, నేతన్నలపై లోతైన పరిశోధన చేశారు. మొదట్లో బెంగాల్, ఫూలియా, బిష్ణుపూర్, రాజ్పూర్, ధనియాఖలి వంటి గ్రామాలు, ఒరిస్సాతో పాటు చీరలకోసం అవసరమైన ప్రతిచోటికీ వెళ్లారు. అలా మొదట్లో అల్మారలో మొదలైన ప్రస్థానం గిడ్డంగిని అద్దెకు తీసుకునేదాకా శరవేగంగా వృద్ధిచెందేలా పరుగులు పెట్టించారు. కరోనా మహమ్మారి తరువాత అందరూ ఆన్లైన్ స్టోర్ల వైపు మొగ్గుచూపుతోంటే..లాక్డౌన్లు ముగిసిన వెంటనే భౌతిక దుకాణాలను తెరవాలని సుతా ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే దుస్తులు, ముఖ్యంగా చీరల షాపింగ్ ఆన్లైన్లో కంటే భౌతికంగా చూసిన తరువాత కొనడానికి ఇష్టపడతారు. అందుకే కోల్‌కతాలో ఒకటి ప్రారంభించగా, త్వరలోనే బెంగుళూరులో తొలి ఫ్లాగ్షిప్ స్టోర్‌ను ప్రారంభించబోతున్నారు. photo courtesy : BusinessToday.In తమ దగ్గర చీరలు సాధారణంగా రూ.2,500 నుంచి రూ.3,500 వరకు ఉంటాయని చెప్పారు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మార్కెట్‌ను బాగా స్టడీ చేయాలంటున్నారు. అంతేకాదు అక్కాచెల్లెళ్లుగా చిన్నచిన్న విషయాలపై పోట్లాడుకున్నా.. బిజినెస్ విషయంలోమాత్రం చాలా దృఢంగా ఉంటామని చెప్పారు. అలాగే సెల్ఫ్ ఫండింగ్‌తో నిర్వహించిన తమ బిజినెస్‌ను వీలైనంతవరకు అలాగే కొనసాగిస్తామని సుజాత ధీమా వ్యక్తం చేశారు. -
మహిళా వ్యాపారవేత్తలకు బిజినెస్ లోన్స్ అంత ఈజీ కాదు!
న్యూఢిల్లీ: జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో ఎక్కువ మంది మహిళా పారిశ్రామికవేత్తలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ‘భారతీయ యువ శక్తి ట్రస్ట్’ (బీవైఎస్టీ) నిర్వహించిన సర్వేలో తెలిసింది. దేశ రాజధాని ప్రాంతం, చెన్నై, పుణెకు చెందిన 450 మంది మహిళా పారిశ్రామికవేత్తలు ఈ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచు కున్నారు. బ్యాంకుల నుంచి కీలక ఆర్థిక సేవలను పొందడంలో తాము సమస్యలు ఎదుర్కొన్నట్టు 60 శాతం మంది చెప్పారు. ముఖ్యంగా రుణాలు తీసుకునే విషయమై 85 శాతం మందికి సవాళ్లు ఎదురైనట్టు ఈ సర్వే వెల్లడించింది. బీవైఎస్టీ సహకారంతో వచ్చే రుణ దరఖాస్తులను ఆహ్వనించేందుకు ప్రభుత్వరంగ బ్యంకులు సముఖంగా ఉన్నట్టు.. మేనేజింగ్ ట్రస్టీ లక్ష్మీ వెంకటరామన్ వెంకటేశన్ తెలిపారు. రుణ దరఖాస్తులను బ్యాంకులకు సమర్పించే ముందు తమ నిపుణుల ప్యానెల్ మదింపు వేస్తుందని చెప్పారు. -
దుమ్మురేపుతున్న మహిళా పారిశ్రామికవేత్తలు
-
మహిళల ఆర్థిక పరిపుష్టికి జగన్ సర్కారు చర్యలు.. రూ.10 లక్షల వరకు రుణ సదుపాయం
కోవిడ్ మహమ్మారి ఎంతోమంది మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి ఆర్థికంగా కోలుకోలేని స్థితికి చేరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వివిధ రకాల ప«థకాల ద్వారా ఆయా వర్గాలను ఆదుకుంటోంది. అందులో ఒకటి పీఎంఎఫ్ఎంఈ పథకం. ఇది ఆహార శుద్ధి రంగానికి సంబంధించినది. ఈ పథకం ద్వారా ఆహార పరిశ్రమలో రాణించాలనుకునే మహిళలకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో సహాయం చేయనుంది. అనంతపురం అర్బన్: అక్కచెల్లెమ్మలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి క్రమబద్ధీకరణ (పీఎంఎఫ్ఎంఈ) పథకం కింద స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ద్వారా శ్రీకారం చుట్టింది. ఆగస్టు నెలాఖరులోగా 110 యూనిట్లు ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొదటి విడతగా 34 యూనిట్ల కోసం డీపీఆర్ (డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ను బ్యాంకులకు పంపింది. ప్రస్తుతం ఉన్న ఆహార శుద్ధి యూనిట్లకు, కొత్త యూనిట్లకు రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించేలా చర్యలు చేపట్టింది. పరిశ్రమలు నెలకొల్పే సభ్యులకు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సాంకేతిక సహకారం అందించనుంది. ఆర్థిక సాయం ఇలా... సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు పీఎంఎఫ్ఎంఈ పథకం కింద బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారు. పెట్టుబడి కింద యూనిట్ విలువలో 10 శాతం మొత్తాన్ని లబ్ధిదారు చెల్లించాలి. బ్యాంక్ లింకేజీ ద్వారా 90 శాతం రుణం ఇస్తారు. ఇందులో 35 శాతం సబ్సిడీని ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పటికే ఉన్న యూనిట్లకు సంబంధించి యంత్రాల ఏర్పాటుకు రుణం ఇస్తారు. కొత్తగా యూనిట్ ఏర్పాటుకు, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రుణ సౌకర్యం కల్పిస్తారు. ప్రాజెక్టు వ్యయంలో 25 శాతం వర్కింగ్ క్యాపిటల్, 75 శాతం మిషనరీకి పెట్టాల్సి ఉంటుంది. పథకం ముఖ్య ఉద్దేశం ► ఆహార శుద్ధి రంగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయడం ► సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు రుణ సదుపాయం కల్పించడం ► పరిశ్రమల సామర్థ్యాల అభివృద్ధి, పనికి కావాల్సిన సాంకేతిక సహాయం అందించడం ► ఉత్పత్తుల మార్కెటింగ్, బ్రాండింగ్ తోడ్పాటు ► సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు మౌలిక ► సదుపాయాలు కల్పించడం ఆహారశుద్ధి పరిశ్రమలు ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి క్రమబద్ధీకరణ (పీఎంఎఫ్ఎంఈ) పథకం కింద వేరుశనగ నూనె మిల్లు, దాల్ మిల్లు, పిండిమిషన్, బొరుగుల బట్టీ, బేకరీ, రోటీ మేకర్, పచ్చళ్ల తయారీ, శనగల ప్రాసెసింగ్, పొటాటో చిప్స్ తయారీ, మురుకులు, మిక్చర్, చెక్కిలాలు, నిప్పట్ల తయారీ తదితర ఆహార శుద్ధి యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. మహిళల ఆర్థికాభివృద్ధి సాధన దిశగా.. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా పీఎంఎఫ్ఎంఈ పథకం కింద ఆగస్టు నెలాఖరుకు మండలానికి మూడు ఆహార శుద్ధి పరిశ్రమలు, అవసరమున్న చోట ఐదు చొప్పున జిల్లా వ్యాప్తంగా 110 యూనిట్లు ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. తొలి విడతగా 34 యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లను బ్యాంకులకు పంపించాం. – ఐ.నరసింహారెడ్డి, పీడీ, సెర్ప్ -
వ్యాపారాల్లో మహారాణులు: మష్రూమ్ పౌడర్‌తో థైరాయిడ్కి చెక్
కోచి: వ్యాపారంలో వారికంటూ ఓ చోటు కల్పించుకున్నారు. తమదైన ‘బ్రాండ్’ను సృష్టించుకోవడమే కాదు.. మార్కెట్ అవకాశాలను సొంతం చేసుకుంటూ సత్తా చాటుతున్నారు. ప్రగతి దిశగా సాగిపోతున్న ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలు వారంతా. కోచిలో ఏర్పాటు చేసిన ‘వ్యాపార్ 2022’ పారిశ్రామిక ఎగ్జిబిషన్లో వీరు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. 300 స్టాల్స్ ఏర్పాటు చేస్తే.. అందులో 65 మంది మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటైనవి. వీరిని పలుకరించగా.. ఎన్నో ఆసక్తికర విషయాలు, వ్యాపారంలో గొప్ప దార్శనికత, లక్ష్యం దిశగా వారికి ఉన్న స్పష్టత, ఆకాంక్ష వ్యక్తమైంది. చేతితో చేసిన ఉత్పత్తులు, ఆహారోత్పత్తులు ఇలా ఎన్నింటినో వారు ప్రదర్శనకు ఉంచారు. వీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలకు అందించడమే కాదు.. అంతర్జాతీయ మార్కెట్లోనూ తమకంటూ స్థానాన్ని సంపాదించుకున్నారు. ► సహజసిద్ధ రీతిలో పుట్టగొడుగులు (మష్రూమ్స్) సాగు చేస్తూ వాటిని అందరిలా కేవలం మార్కెట్లో విక్రయించడానికి ‘నహోమి’ బ్రాండ్ పరిమితం కాలేదు. విలువ ఆధారిత ఉత్పత్తులను రూపొందించి కొత్త మార్కెట్‌ను సృష్టించుకుంది. ఓయెస్టర్ మష్రూమ్ పౌడర్, ఆయిల్, చాక్లెట్, సోప్, పచ్చళ్లు, కేక్ ఇలా భిన్న ఉత్పత్తులతో కస్టమర్ల ఆదరణ చూరగొంటోంది. ‘‘ఒయెస్టర్ మష్రూమ్ పౌడర్ థైరాయిడ్ నయం చేయడంలో మంచి ఫలితాన్నిస్తోంది. విక్రయం కాకుండా మిగిలిన మష్రూమ్లను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మారుస్తాం. పెద్ద విక్రయ సదస్సుల్లో వాటిని విక్రయిస్తుంటాం’’అని నహోమి వ్యవస్థాపకురాలు మినిమోల్ మ్యాథ్యూ తెలిపారు. కేరళలోని తిరువనంతపురం సమీపంలో వితుర ప్రాంతానికి చెందిన ఆమె దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ వ్యాపార మేళాల్లో ఆమె పాల్గొంటుంటారు. ► కేరళలోని కలపెట్టా ప్రాంతానికి చెందిన గీత.. ‘వెస్ట్ మౌంట్ కేఫ్’ పేరుతో వ్యాపార వెంచర్ ప్రారంభించి.. నాణ్యమైన కాఫీ రుచులను ‘అరబికా కాఫీ’ బ్రాండ్‌పై ఫైవ్ స్టార్ హోటళ్లకు, దుబాయి మార్కెట్‌కు అందిస్తున్నారు. అరబికా కాఫీ ప్రీమియం బ్రాండ్. సంపన్న రెస్టారెంట్లు, బ్రాండెడ్ సూపర్ మార్కెట్లలోనూ ఇది అందుబాటులో ఉంటుంది. ► తలగడలు, పరుపులు తయారు చేసే ‘విఫ్లవర్స్’ ఆవిష్కర్త అరుణాక్షి కాసర్‌గఢ్‌కు చెందిన మహిళ. కరోనా సమయంలో ఏర్పాటైంది ఈ సంస్థ. గతేడాది రూ.50 లక్షల వ్యాపారాన్ని నమోదు చేశారు. ‘‘నేను 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. అందరూ మహిళలే. కర్ణాటక, కేరళ మా ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి’’అని అరుణాక్షి తెలిపారు. ► శాఖాహార, మాంసాహార పచ్చళ్లకు ప్రసిద్ధి చెందిన ‘టేస్ట్ ఆఫ్ ట్రావెన్కోర్’ అధినేత సుమారేజి పతనం తిట్టకు చెందిన వారు. 25 రకాల పచ్చళ్లను ఆమె మార్కెట్ చేస్తున్నారు. ఎటువంటి ప్రిజర్వేటివ్‌లు కలపకుండా సహజ విధానంలో పచ్చళ్లు తయారు చేసి విక్రయించడం టేస్ట్ ఆఫ్ ట్రావెన్ కోర్ ప్రత్యేకత. ఈ ప్రత్యేకత వల్లే లులూ గ్రూపు హైపర్మార్కెట్లో తమ ఉత్పత్తులకు చోటు దక్కిందంటారు ఆమె. వ్యాపార సదస్సు 2022 ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు ఎన్నో పలకరిస్తున్నట్టు ఆమె చెప్పారు. ► ఇంజనీరింగ్ చదివిన వందనా జుబిన్ ఏదో ఒక మంచి ఉద్యోగానికి అతుక్కుపోలేదు. ‘మినీఎం’ పేరుతో చాక్లెట్ కంపెనీ ఏర్పాటు చేశారు. పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు చాక్లెట్లను నచ్చని వారు ఉండరు. చాక్లెట్లో ఆరోగ్యానికి మేలు చేసేవి ఉన్నాయి. అలాగే, చక్కెర రూపంలో కీడు కూడా ఉంది. జుబిన్ ఆ చక్కెరను వేరు చేశారు. చక్కెర రహిత చాక్లెట్లతో ఎక్కువ మందిని చేరుకుంటున్నారు. షుగర్ బదులు తీపినిచ్చే స్టీవియాను ఆమె వినియోగిస్తున్నారు. 25 రకాల చాక్లెట్లను ఆమె మార్కెట్ చేస్తున్నారు. పెద్ద ఈ కామర్స్ సంస్థలతో టైఅప్ చేసుకుని ఎక్కువ మందిని చేరుకోవడమే తన లక్ష్యమని తెలిపారు. -
మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘ఉద్యమిక’
దినదినాభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, డిఫెన్స్, ఇతర నూతన రంగాల్లో ఉన్న అవకాశాలను మహిళా పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలి. సంప్రదాయ, చిన్నచిన్న ఉత్పత్తి రంగాలకే పరిమితం కాకుండా నూతన రంగాలపైనా దృష్టి సారించాలి. మహిళా పారిశ్రామికవేత్తల కోసం పార్క్ ఏర్పాటు చేయడం దేశంలోనే మొట్టమొదటిసారి. – కేటీఆర్ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మహిళా పారిశ్రామిక వేత్తల సమస్యలను పరిష్కరించేందుకు ‘ఉద్యమిక ’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సింగిల్ విండో విధానంలో పనిచేసే ఈ విభాగం మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభు త్వం అందించే ప్రోత్సాహకాలను, ఇతర అంశా లను ఎప్పటికప్పుడు సమీక్షించి వారికి అండగా నిలుస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి, పటాన్చెరులో మంగళవారం నిర్వహిం చిన పలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. సంగారెడ్డి పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో ఫ్లో(ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్) ఇండస్ట్రియల్ పార్క్‌ను ఆయన ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. మహిళా పారిశ్రామికవేత్తల పారిశ్రామికో త్పత్తిని సులభతరం చేసేందుకు కార్పస్‌ఫండ్ సైతం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళల కోసమే ఏర్పాటు చేసిన ఈ ఫ్లో ఇండస్ట్రియల్ పార్కులో 50 ఎకరాలను 25 మంది మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వం కేటాయించిం దన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం పార్క్ ఏర్పాటు చేయడం దేశంలోనే మొట్టమొదటిసారని చెప్పారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో మూడో వంతు... కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సిన్ ఉత్పత్తిలో 66 శాతం హైదరాబాద్‌లోనే జరిగిందని, హైదరాబాద్ దేశానికి ఫార్మా క్యాపిటల్‌గా అవతరిస్తోందని అన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేం దుకు ఏర్పాటు చేసిన ‘వీ హబ్ ఇంక్యుబేషన్ సెంటర్’ సేవలను వినియోగించుకోవాలని మహి ళా పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రూ.4.90 లక్షల కోట్లు ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) ఇప్పుడు రూ.11.50 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 130 శాతం వృద్ధి సా«ధించిందని పేర్కొన్నారు. ఆ అగ్ని ప్రమాదంతోనే ‘కల్యాణలక్ష్మి’కి శ్రీకారం పటాన్చెరు టౌన్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ‘కల్యాణలక్ష్మి’ పథకానికి పునాది ఓ అగ్ని ప్రమా దమని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మంగళ వారం పటాన్చెరు పట్టణంలోని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిం చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఒకసారి పల్లెనిద్రలో భాగంగా మహబూ బాబాద్‌లోని ఓ తండాకు వెళ్లగా అక్కడ ఓ వ్యక్తి కేసీఆర్ వద్దకు వచ్చి తన కూతురు వివాహం కోసం దాచుకున్న డబ్బు, ఇల్లు అగ్ని ప్రమాదం లో కాలిపోయాయని తన బాధను చెప్పుకున్నా డని కేటీఆర్ వివరించారు. ఆ తండ్రి వేదన, ఆ అగ్నిప్రమాదం బాధ నుంచి కేసీఆర్‌కు వచ్చిన ఆలోచనే కల్యాణలక్ష్మి పథకమని వెల్లడించారు. రూ.9వేల కోట్లతో పథకాన్ని ప్రారంభించి ఇప్పటివరకు పది లక్షల మంది ఆడపిల్లలకు ఆర్థికసాయం అందజేసి సీఎం కేసీఆర్ ఓ మేనమామలా నిలిచారని మంత్రి తెలిపారు. -
స్వయంగా పరిశ్రమలు నడుపుతున్న స్వయం సహాయక మహిళలు
-
మహిళా ఎంట్రప్రెన్యూర్షిప్ కోసం ‘సమర్థ్’
International Women's Day 2022: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని .. ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్ర లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ (ఎంఎస్ఎంఈ) సోమవారం ’సమర్థ్’ పేరిట ప్రత్యేక స్కీమును ఆవిష్కరించింది. స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా మహిళలు స్వావలంబన సాధించేందుకు ఇది తోడ్పడగలదని ఈ సందర్భంగా కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి నారాయణ్ రాణె తెలిపారు. సమర్థ్ కింద ఎంఎస్ఎంఈ శాఖ నిర్వహించే నైపుణ్యాభివృద్ధి ఉచిత శిక్షణా స్కీములు అన్నింటిలోనూ మహిళలకు 20 శాతం సీట్లను ఔత్సాహిక మహిళా ఎంట్రప్రెన్యూర్లకు కేటాయిస్తామని పేర్కొన్నారు. 2022–23లో దీనితో 7,500 మంది పైచిలుకు మహిళలకు ప్రయోజనం చేకూరగలదని ఆయన వివరించారు. ఇక మార్కెటింగ్పరమైన సహకారం అందించే పథకాల్లో భాగంగా దేశ, విదేశ ఎగ్జిబిషన్లకు పంపించే ఎంఎస్ఎంఈ వ్యాపార బృందాల్లో 20 శాతం వాటా మహిళల సారథ్యంలోని సంస్థలకు లభిస్తుందని మంత్రి చెప్పారు. అలాగే 2022–23లో జాతీయ చిన్న పరిశ్రమల కార్పొరేషన్ (ఎన్ఎస్ఐసీ)కి సంబంధించిన కమర్షియల్ స్కీముల వార్షిక ప్రాసెసింగ్ ఫీజులో 20 శాతం రాయితీ కూడా మహిళా ఎంట్రప్రెన్యూర్లు పొందవచ్చని పేర్కొన్నారు. -
మాకు కావాలి.. జెండర్ బడ్జెటింగ్
ముంబైకి చెందిన శ్రీజ సైన్స్ గ్రాడ్యుయేట్. ‘బడ్జెట్’ లేదా ‘బడ్జెట్‌కు సంబంధించిన విశేషాలు’ ఆమెకు ఏమంత ఆసక్తిగా ఉండేవి కావు. ఆరోజు బడ్జెట్ రోజు. ఒకప్పుడు తనతోపాటు కలిసి చదువుకున్న రూప తనను అడిగింది... ‘ఇది జెండర్ బడ్జెటే అంటావా?’ అని. శ్రీజకు ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. నిజం చెప్పాలంటే ‘జెండర్ బడ్జెట్’ అనే మాట వినడం తనకు తొలిసారి. దీని గురించి ఫ్రెండ్‌ను అడిగి తెలుసుకుంది. ఆరోజు మొదలైన ఆసక్తి తనను పబ్లిక్బడ్జెట్ను విశ్లేషిస్తూ జెండర్ బడ్జెటింగ్‌పై ప్రత్యేకంగా నోట్స్ రాసుకునేలా చేసింది. ‘బడ్జెట్ అనేది ఆర్థికవేత్తలు, ఎకనామిక్స్ స్టూడెంట్స్ వ్యవహారం అన్నట్లుగా ఉండేది నా ధోరణి. ఇది తప్పని, బడ్జెట్ అనేది మన జీవితానికి ముడిపడి ఉన్న విషయమని తెలుసుకోవడంలో కాస్త ఆలస్యం అయింది. ఇప్పుడు మాత్రం బడ్జెట్ విషయాలపై చాలా ఆసక్తి చూపుతున్నాను’ అంటుంది శ్రీజ. ప్రతి సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు, ప్రవేశ పెట్టిన తరువాత మహిళా పారిశ్రామికవేత్తలు, ఉద్యమకారుల నుంచి తరచుగా వచ్చే మాట... జెండర్ బడ్జెటింగ్ లేదా జెండర్ సెన్సిటివ్ బడ్జెటింగ్. ఏమిటిది? స్థూలంగా చెప్పాలంటే బడ్జెట్‌ను జెండర్ దృక్పథం నుంచి పరిశీలించి, విశ్లేషించడం. దీనివల్ల ఏమవుతుంది? నిపుణుల మాటల్లో చెప్పాలంటే...అసమానతలు, పక్షపాతధోరణులు లేకుండా చేయగలిగే మందు ఇది. స్త్రీ, పురుష ఉద్యోగులలో జీతభత్యాల మధ్య వ్యత్యాసం నుంచి వనరుల పంపకం వరకు తేడా లేకుండా చేయడానికి మార్గనిర్దేశం చేస్తుంది. సంస్థాగత స్థాయిలో ప్రభుత్వసంస్థల విధానాలను పదునుగా విశ్లేషిస్తుంది. రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక, ఆర్థిక సంక్షేమం, భద్రత, విద్య... మొదలైన వాటిలో లింగవివక్షతకు తావు ఇవ్వని విధానం రూపుదిద్దుకునేలా తోడ్పడుతుంది. ‘లింగ వివక్ష’కు కారణమయ్యే రాజకీయ, ప్రాంతీయ, సాంస్కృతిక పరిమితులను ప్రశ్నిస్తుంది. మహిళలకు సంబంధించిన సోషల్ రీప్రొడక్షన్ రోల్స్ పబ్లిక్ బడ్జెట్లో గుర్తింపుకు నోచుకోవనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో ‘జెండర్ బడ్జెటింగ్’కు ప్రాధాన్యత పెరిగింది. కోవిడ్ మహమ్మారి సృష్టించిన ప్రతికూలతల నేపథ్యంలో గతంతో పోల్చితే ‘జెండర్ బడ్జెటింగ్’ కు మరింత ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ పెరిగింది. ‘కోవిడ్ సృష్టించిన కల్లోలం ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌ను మొదలు పెట్టాలనుకునేవారికి శాపంలా మారింది. ఎంతో కష్టపడి కంపెనీలు నిర్వహిస్తున్నవారు నష్టాలతో పాలుపోలేని స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి పన్ను మినహాయింపు ఇవ్వాలి. జెండర్ బడ్జెటింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి’ అంటారు ఫ్లోరెన్స్ క్యాపిటల్ సీయీవో పోషక్ అగర్వాల్. ‘ఎన్నికలలో రాజకీయ పార్టీలు మహిళలను ఆకట్టుకోవడానికి రకరకాల వాగ్దానాలు చేస్తుంటాయి. అయితే వారి ఎన్నికల మ్యానిఫెస్టోలో జెండర్ బడ్జెటింగ్ అనే మాట కనిపించదు. ఇప్పటికైనా ఈ ధోరణిలో మార్పు రావాలి’ అంటారు తిరువనంతపురం (కేరళ)కు చెందిన లీనా. కొన్ని యూనిట్లు రకరకాల కారణాల వల్ల నాన్–పెర్ఫార్మింగ్ అసెట్స్(ఎన్పీఏఎస్) జాబితాలోకి వెళ్లిపోతున్నాయి. ఒక్కసారి ‘ఎన్పీఏఎస్’ ముద్ర పడిన తరువాత మహిళా పారిశ్రామికవేత్తల పరిస్థితి మరింత దిగజారుతుంది. దాంతో ఆ పారిశ్రామిక వేత్తలు పోరాటస్ఫూర్తిని కోల్పోయి నిస్తేజంగా మారుతున్నారు. ఎన్పీఏఎస్ జాబితాలో చేరిన తరువాత మహిళా వ్యాపారవేత్తలకు రుణాలు ఇవ్వడం లేదు. ఈ ధోరణిలో మార్పు రావాలంటుంది లేడి ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ (ఎంఎస్ఎంఈ) లేదా చిన్న తరహా వ్యాపారాలలో ఎంతోమంది మహిళలు ఉన్నారు. వారు ‘కేంద్ర బడ్జెట్ 2022’పై ఆశలు పెట్టుకున్నారు. వారి విజ్ఞప్తులలో ప్రధానమైనది బ్యాంక్‌లోన్‌కు సంబంధించిన వడ్డీరేటు తగ్గించాలనేది. ‘స్పెషల్ కోవిడ్ ఇన్సెంటివ్’ ప్రకటించాలని బలంగా కోరుకుంటున్నారు. వేగంగా పుంజుకోవడానికి, దూసుకెళ్లడానికి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఈ విషయంలో బ్యాంకులు ఉదారంగా ఉండాలని కోరుకుంటున్నారు. టెక్నాలజీ అప్గ్రేడెషన్కు సంబంధించి ‘ఎంఎస్ఎంఈ’లకు బ్యాంకుల నుంచి తగిన సహకారం అందడం లేదు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్లు, ఒక విజయం మరో విజయానికి స్ఫూర్తి ఇస్తుంది. అయితే కోవిడ్ తుఫాను ఎన్నో దీపాలను ఆర్పేసింది. ఈ నేపథ్యంలో సానుభూతి కంటే చేయూత ముఖ్యం అంటున్నారు మహిళా పారిశ్రామికవేత్తలు. ‘విజయాల మాటేమిటోగానీ, ఉనికే కష్టంగా మారే పరిస్థితి వచ్చింది. అట్టడుగు వర్గాలు, గ్రామీణప్రాంతాలలో ఎంతోమంది మహిళా వ్యాపారులు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారు. వారు నిలదొక్కువడానికి ప్రభుత్వం పూనుకోవాలి’ అంటుంది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్. విద్యారంగంపై దృష్టిపెట్టినట్లే పారిశ్రామిక రంగంపై దృష్టిపెట్టాలని, అప్పుడే సక్సెస్ఫుల్ ఫిమేల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వస్తారనేది అందరి నమ్మకం. పది మందికి ఉపాధి చూపుతూ, వందమందికి ఆదర్శంగా నిలుస్తున్న చిన్నతరహా మహిళా వ్యాపారులకు అండగా ఉండే ఆశావహపరిస్థితిని బడ్జెట్ నుంచి ఆశిస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు. ‘ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ ఎలా తయారవుతారు?’ అనే ప్రశ్నకు ‘ఉన్నత విద్యాసంస్థలలో చదువుకున్నవారు, ఉన్నత విద్యను అభ్యసించినవారు’ అనేది సరిౖయెన జవాబు కాదు. అది కాలానికి నిలిచే సమాధానం కూడా కాదు. అయితే, కాలానికి ఎదురీది కూడా నిలదొక్కునేవారే నిజమైన వ్యాపారులు అంటారు. దీనికి ప్రభుత్వ సహకారం కావాలి. ఆ సహకారం వెలుగు బడ్జెట్లో కనిపించాలి. ‘జెండర్ బడ్జెటింగ్’అనేది ఎంత ఆకర్షణీయమైన మాటో, ఆచరణ విషయానికి వచ్చేసరికి రకరకాల దేశాల్లో రకరకాల సవాళ్లు ఎదురవుతుంటాయి. దీనిలో సంప్రదాయ ఆలోచనదే అగ్రభాగం. అయితే ప్రసుత్తం మూస ఆలోచనలకు చెల్లుచీటీ పాడే కాలం వస్తుంది. ‘నిజంగానే మహిళాలోకం నిండు హర్షం వహిస్తుందా?’ అనే ప్రశ్నకు నేటి బడ్జెట్ సమాధానం చెప్పనుంది. పన్ను మినహాయింపుల ద్వారా మహిళ వ్యాపారవేత్తలను ప్రోత్సహించి నిలదొక్కుకునేలా చేయాలి. అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలి. – శ్రేయ సబర్వాల్, స్కైర్–ఫోర్క్ సీయీవో -
స్వయంగా ఎదగాలి
సాంకేతిక రంగంలో రెండు దశాబ్దాల విశేష అనుభవం. మోటరోలా, సిస్కో వంటి కంపెనీలకు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, స్ట్రాటజీ ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం.. మైక్రోసాఫ్ట్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్... ఫేబుల్స్ ఆప్‌తో ఎంటర్ప్రెన్యూర్... ఎన్నో విజయాలు సాధించారు విజయవాడకు చెందిన పద్మశ్రీ వారియర్. మరింతమంది మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగాలంటూ వారిని ఆహ్వానిస్తున్నారు. ‘మహిళలు సాంకేతిక రంగంలోకి ప్రవేశించి, అత్యున్నత స్థాయికి ఎదగాలి. స్త్రీలు ఉన్నతాధికారులుగా మారే రోజులు రావాలి. మీకు మీరుగా స్వయంగా ఎదగాలి. కొత్తకొత్త వ్యవస్థలను నిర్మించాలి, మీ అనుభవాలను అందరికీ పంచాలి’’ అంటారు పద్మశ్రీ వారియర్. ఇప్పుడు మహిళలు ముందుకు వచ్చి, అనేక రంగాలలో పనిచేస్తూ, ఉన్నత స్థానానికి ఎదుగుతున్నారు. కొన్ని దశాబ్దాల ముందు వరకు మహిళలు పైకి ఎదగడానికి చాలా నిచ్చెనలే ఎక్కవలసి వచ్చేది. నిర్ణయాలు తీసుకోవటానికి కూడా ఆలోచించవలసి వచ్చేది. ఆ రోజుల్లోనే అవలీలగా నిచ్చెనలు ఎక్కినవారిలో పద్మశ్రీ వారియర్ ప్రముఖంగా కనిపిస్తారు. సాంకేతిక రంగంలో నిస్సందేహంగా ప్రముఖ పాత్ర పోషించారు. మోటొరోలా, సిస్కో, టెస్టా కాంపిటీటర్ నియో కంపెనీలలో అపారమైన అనుభవం సంపాదించి, ఇప్పుడు స్వయంగా ‘ఫేబుల్’ ఆప్‌ను ప్రారంభించి, అందరూ మంచిమంచి పుస్తకాలు చదువుకోవటానికి అవకాశం కల్పిస్తున్నారు. ‘‘మహిళలు ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చి, భవిష్యత్తులో సాంకేతిక రంగానికి నాయకత్వం వహించాలని కోరుకుంటున్నాను’’ అంటారు పద్మశ్రీ వారియర్. అన్నిటికీ తట్టుకోవాలి... ఒక రంగంలోకి ప్రవేశించినప్పుడు ఎన్నో ఎత్తుపల్లాలు చూడాల్సి ఉంటుంది. అయినప్పటికీ.. అవకాశం దొరికినప్పుడు విడిచిపెట్టకుండా అందిపుచ్చుకుని, విజయాలు సాధించాలి. నిర్ణయం తీసుకోవటంలో జాగ్రత్తగా వహించాలి.. అంటూ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగబోతున్న మహిళలకు సలహా ఇస్తారు పద్మశ్రీ వారియర్. రెడ్పాయింగ్ వెంచర్స్ సంస్థ అందించిన 7.25 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ ఆప్‌ను ఎంతో ధైర్యంగా లాంచ్ చేశారు పద్మశ్రీ వారియర్. వార్షిక చందా కట్టి, ఈ – బుక్స్ ద్వారా పుస్తకాలను ఆన్లైన్లో కొనుక్కుని చదువుకోవచ్చు. 120 మిలియన్ల వాడకం దారులు ఉన్న గుడ్‌రీడ్స్ కంపెనీని తట్టుకుని, ముందుకు వెళ్లేలా ‘ఫేబుల్’ని రూపొందించారు పద్మశ్రీ వారియర్. సోషల్ మీడియాలో చర్చ.. పద్మశ్రీ వారియర్ ఈ ఆప్‌ను ప్రారంభించగానే, సోషల్ మీడియాలో, ‘గుడ్‌రీడ్స్ కంపెనీని తట్టుకుని నిలబడగలదా ఈ ఆప్’ అని రకరకాలుగా విమర్శించారు. అందరి మాటలను పక్కకు పెట్టి ముందుకు దూకారు పద్మశ్రీ వారియర్. ‘‘ఇరవై సంవత్సరాలకు పైగా అనుభవం గడించిన నేను నాకు ఏది ఇష్టమైతే అదే చేస్తాను. ముందుగా నా గురించి నేను సరైన అంచనా వేసుకుంటాను. ఒక అధికారిగా నా నిర్ణయాల సక్రమంగా ఉండేలా ఆలోచిస్తాను’’ అంటారు పద్మశ్రీ వారియర్, ఫేబుల్ సంస్థ ద్వారా అత్యున్నత ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదుగుతున్నారు. ఉద్యోగాలలో స్త్రీపురుషులను సమానంగా చూడాలనే అంశం మీద గొంతెత్తుతారు. ‘అందమైన రేపటి కోసం మహిళలు ఎంతో ఉత్సాహంగా పని చేస్తున్నారు, మరింతమంది మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగాలని ఆశిస్తాను’ అంటారు. అత్యంత ప్రతిభ.. విజయవాడలో పుట్టి పెరిగిన పద్మశ్రీ, ఢిల్లీ ఐఐటి నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో బి.ఎస్., అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్. పూర్తి చేశారు. సాంకేతిక రంగంలో 2020లో అత్యంత ప్రతిభ చూపిన 50 మందిలో పద్మశ్రీ వారియర్‌ను ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. సాంకేతిక రంగంలో సంపాదించిన అనుభవంతో ఇప్పుడు ఫేబుల్స్ ఆప్‌ను ప్రారంభించి ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిరూపించుకున్నారు పద్మశ్రీ వారియర్. ‘ఫేబుల్ హ్యాజ్ స్టోరీస్ ఫర్ ఎవ్రీవన్, మై హోప్ ఈజ్ దట్ యు విల్ టేక్ ఎ డైలీ బ్రేక్ టు రీడ్ బికాజ్ యు ఆర్ వర్త్ ఇట్’ అంటున్నారు. పద్మశ్రీ వారియర్ -
మహిళా స్టార్టప్‌లకు కొత్త ప్రోత్సాహకాలు
సాక్షి, హైదరాబాద్: ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఐటీశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు స్థాపించిన స్టార్టప్‌లను వర్గీకరిస్తూ మంగళవారం ఐటీ కమ్యూనికేషన్ల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థల వద్ద నమోదైన స్టార్టప్‌లలో మహిళల వాటా 33% ఉంటే, ఇకపై వాటిని మహిళా స్టార్టప్‌లుగా.. స్టార్టప్‌లలో వారివాటా 20% ఉంటే మహిళా ఎంటర్ ప్రెన్యూ ర్లుగా గుర్తిస్తారు. రాష్ట్రంలో 2 కోట్ల కంటే ఎక్కువ మంది గ్రామాల్లోనే ఉంటున్నారు. దీంతో సాంకేతికత లోపం, సంప్రదాయ వ్యవసాయ విధానాలను అనుసరించటం, ఆర్థిక వెనుకబాటు, నిరక్షరాస్యత వంటివి వారి ఎదుగదలను దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిలోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఐటీశాఖ ప్రత్యేక చర్యలకు సిద్ధమైంది. క్షేత్ర స్థాయి ఆవిష్కరణల్లో ఎంపికైన వారికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు గ్రాంటుగా అందజేస్తుంది. కాగా, ప్రభుత్వం 2017లో ప్రకటించిన ఎస్జీఎస్టీ, పేటెంట్ ధర, ఇంట ర్నేషనల్ మార్కెట్, రిక్రూట్మెంట్ అసెస్మెంట్, పనితీరు ఆధారిత గ్రాంటు తదితర విషయాల్లో గతంలో ప్రకటించిన మార్గదర్శకాల్లో తాజాగా స్వల్ప మార్పులు చేసింది. -
కరోనా : అమెజాన్‌లో వారికి భారీ ఊరట
సాక్షి, ముంబై: కరోనా వైరస్ సంక్షోభ సమయంలో అమెజాన్ చేతివృత్తులు, చిన్న, మహిళా వ్యాపారులకు మరోసారి భారీ ఊరట కల్పించింది. ఎస్ఓఏ (సేల్ ఆన్ అమెజాన్) ఫీజును తాజాగా 100 శాతం రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. మరో 10 వారాలపాటు ఈ మినహాయింపును పొడిగిస్తున్నట్లు అమెజాన్ ఇండియా ప్రకటించింది. ఫలితంగా లక్షలాదిమంది వ్యాపారులకు ఉపశమనం లభించనుంది. కోవిడ్-19 వల్ల ఏర్పడిన ఆర్థిక నష్టాలనుంచి చేతివృత్తులవారు, చేనేత కార్మికులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సహా 10 లక్షల మందికి పైగా పారిశ్రామికవేత్తలు కోలుకునేలా సాయం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అమెజాన్ ఇండియా ప్రతినిధి ప్రణవ్ భాసిన్ వెల్లడించారు. అమెజాన్ అందిస్తున్న కారీగర్ ప్రోగ్రాం ద్వారా 8 లక్షలకు పైగా చేతివృత్తులవారు, నేత కార్మికులు, అమెజాన్ సహేలి ప్రోగ్రాం ద్వారా 2.8 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలు 100 శాతం అమ్మకం ఫీజు మినహాయింపుతో ప్రయోజనం పొందుతారని అన్నారు. ఈ రెండు ప్రోగ్రామ్‌లలో చేరిన కొత్త అమ్మకందారులకు కూడా ఈ ఫీజు మినహాయింపు ఉంటుందని చెప్పారు. వీరి ఉత్పత్తులకు డిమాండ్ పెంచడం ద్వారా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక నష్టాలను పూడ్చుకోవడంతోపాటు, వారికి మూలధన సహాయానికి తోడ్పడుతుందని భాసిన్ తెలిపారు.(అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ రికార్డు) కారీగర్, సహేలి అమ్మకందారుల నుండి స్థానికంగా రూపొందించిన, చేతితో తయారు చేసిన ఉత్పత్తులకు కస్టమర్ డిమాండ్‌ను పెంచేందుకు 'స్టాండ్ ఫర్ హ్యాండ్‌మేడ్' స్టోర్ ను కూడా ఏర్పాటు చేసినట్టు భాసిన్ తెలిపారు. ఇందుకు ప్రభుత్వ ఎంపోరియంలు, ఐదు ప్రభుత్వ సంస్థలతో ఒప్పందం ఉందన్నారు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, మధ్య భారతదేశం సహా వివిధ ప్రాంతాల చేతివృత్తులవారు, మహిళా పారిశ్రామికవేత్తల ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చన్నారు. అలాగే మహిళలకోసం మహిళలు రూపొందించిన ఉత్పత్తులు కూడా లభిస్తాయని ఆయన ప్రకటించారు. కాగా జూన్ 2020 చివరి వరకు సెల్లింగ్ ఆన్ అమెజాన్ ఫీజును 50 శాతం మాఫీ చేస్తున్నట్టు గత నెలలో ప్రకటించింది. అలాగే స్టోరేజ్ ఫీజులను మాఫీ చేస్తున్నట్టు అమెజాన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
మహిళలకు రూ. 17వేల కోట్ల రుణాలు
న్యూఢిల్లీ: ‘స్టాండప్ ఇండియా’ పథకం కింద రుణాలు పొందిన వారిలో దాదాపు 81శాతం మంది మహిళలున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 4 సంవత్సరాల కాలంలో రూ .16,712 కోట్ల విలువైన రుణాలు అందిచినట్టు తెలిపింది. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చిన ఆరు పథకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై), ప్రధానమంత్రి జన-ధన్ యోజన (పీఎంజేడీవై), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై), ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎం జెజెబీ), ప్రధానమంత్రి బీమా సురక్షా యోజన (పీఎంఎస్బీవై) పథకాల ద్వారా మహిళలు సాధికారతతో మరింత మెరుగైన జీవితాన్ని సాగించేందుకు, వ్యాపారవేత్తలుగా తమ ఆకాంక్షలను సాకారం చేసుకునేందుకు ఈ పథకాలు తోడ్పడ్డాయని ఒక ప్రకటనలో పేర్కొంది. మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. గత ఆరు సంవత్సరాల్లో, మంత్రిత్వ శాఖ మహిళల సాధికారత కోసం ప్రత్యేక నిబంధనలు కలిగిన వివిధ పథకాలను ప్రారంభించామని వెల్లడించింది.2020 ఫిబవ్రరి 17 నాటికి స్టాండప్ ఇండియా స్కీమ్ కింద ఖాతాదారుల్లో 81 శాతం మంది మహిళలు ఉన్నారు. 73,155 ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయి. ప్రతి బ్యాంకు శాఖ పరిధిలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కొత్తగా సంస్థను ప్రారంభించేందుకు.. కనీసం ఒక్కరికైనా రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి దాకా రుణాలిచ్చే ఉద్దేశంతో 2016 ఏప్రిల్ 5న స్టాండప్ ఇండియా స్కీమ్‌ను కేంద్రం ప్రారంభించింది. అలాగే ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద మొత్తం రుణగ్రహీతలలో 70 శాతం మహిళలు. కార్పొరేతర, వ్యవసాయేతర చిన్న,సూక్ష్మ సంస్థలకు రూ .10 లక్షల వరకు రుణాలు అందించే లక్ష్యంతో పీఎంఎంవై 2015 ఏప్రిల్ 8 న ప్రారంభించింది. ఈరుణాలను వాణిజ్య బ్యాంకులు, ఆర్ఆర్బిలు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, ఎంఎఫ్ఐలు, ఎన్‌బిఎఫ్‌సిలు అందిస్తాయి