మహిళా పారిశ్రామిక సదస్సును ప్రారంభిస్తున్న గోవా గవర్నర్ మృదులా సిన్హా
మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రభుత్వం ప్రోత్సహించాలి
గోవా గవర్నర్ మృదులా సిన్హా
ప్రారంభమైన మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సు
సాక్షి, హైదరాబాద్: ‘మగవారి కంటే మహిళల్లోనే వ్యాపార మెళకువలు మెండుగా ఉంటా యి. పారిశ్రామిక, రాజకీయ రంగాల్లో వారి ప్రాతినిధ్యం మరింత పెరగాలి. ఈ దిశగా కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా పారిశ్రామిక వేత్తలకు తగిన విధంగా ప్రోత్సాహకాలను అందించాలి’ అని గోవా రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హా సూచించారు. మహిళా పారిశ్రామిక వేత్తల సమాఖ్య(కోవె) ఆధ్వర్యంలో శనివారమిక్కడ హెచ్‌ఐసీసీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు ‘వైజ్- 2014’ను మృదులా సిన్హా ప్రారంభించారు.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 750 మంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు. గవర్నర్ మృదులా సిన్హా మాట్లాడుతూ తాము స్థాపించిన పరిశ్రమల ద్వారా వినూత్న ఉత్పత్తులను తెచ్చేందుకు మహిళా పారిశ్రామిక వేత్తలు ఎంతగానో శ్రమిస్తున్నారని, మెరుగైన ఆలోచనలు చేస్తున్నారని చెప్పారు. ఆయా ఉత్పత్తులకు సరైన విమర్శకు లు కూడా మహిళలేనన్నారు.
రవాణామంత్రి పి.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళా పారి శ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. పరిశ్రమలు స్థాపించాలనుకున్న వారికి కేవలం 15 రోజుల్లో అన్ని అనుమతులు, మౌలిక వసతులు కల్పించేలా సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు గవర్నర్ మృదులా సిన్హా, మంత్రి మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. అవార్డులను అం దుకున్న వారిలో పారిశ్రామిక వేత్తలు వందన, లలిత, విజయశారద, రుమానా, జానకి, శైలశ్రీ, జ్యోత్స్న, రిఖితాభాను, రాజేశ్వరి తదితరులున్నారు. కార్యక్రమంలో మహిళా పారిశ్రామిక వేత్తల సమాఖ్య(కోవె) అధ్యక్షురాలు సౌదామినీ, ఉపాధ్యక్షురాలు గిరిజారెడ్డి, కార్యదర్శి గీతాగోటే, ఐఎఎస్ అధికారులు ప్రదీప్‌చంద్ర, రత్నప్రభ తదితరులు పాల్గొన్నారు.