Industrial sector
-
ఇండ్రస్టియల్ ఆల్కహాల్‌పై చట్టాలు చేసే హక్కు రాష్ట్రాలదే
న్యూఢిల్లీ: పారిశ్రామిక(ఇండ్రస్టియల్) ఆల్కహాల్ ఉత్పత్తి, సరఫరా నియంత్రపై చట్టాలు చేసే చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. 1990లో ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచి్చన తీర్పును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. రాష్ట్రాలకు ఈ విషయంలో ఉన్న అధికారాన్ని తొలగించలేమని తేలి్చచెప్పింది. ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ఉత్పత్తి, సరఫరాపై నియంత్రణ అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని ధర్మాసనం వెల్లడించింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 8:1 మెజారీ్టతో బుధవారం తీర్పును ప్రకటించింది. అయితే, ఈ తీర్పుతో ధర్మాసనంలోని జస్టిస్ నాగరత్న విభేదించారు. 1990లో సింథటిక్స్, కెమికల్స్ కేసులో అప్పటి ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇండ్రస్టియల్ ఆల్కహాల్ ఉత్పత్తిని నియంత్రించే అధికారం కేంద్రానికి ఉందని తీర్పు ఇచి్చంది. దీనిపై పలు అభ్యంతరాలు వచ్చాయి. 2010లో ఈ అంశాన్ని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనానికి సమీక్ష కోసం పంపించారు. ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అనేది మానవ వినియోగం కోసం కాదని ఈ ధర్మాసనం పేర్కొంది. -
చిన్న పరిశ్రమలపై భారీ ఆశలు
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రంగం పురోగతి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, ప్రపంచ మార్కెట్‌తో పోటీ పడటం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఆరు ప్రత్యేక విధానాలకు రూపకల్పన చేస్తోంది. ఎంఎస్ఎంఈలు, ఎగుమతులు, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఆరు విధానాల రూపకల్పనకు కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలోనే ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) పాలసీ–2024’ను సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఆవిష్కరించనున్నారు. ఎంఎస్ఎంఈల స్థాపన, అభివృద్ధి దిశగా ఈ విధానం ఉంటుందని, కొత్త పాలసీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తుందని పరిశ్రమల శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలకు కొత్త పాలసీ పరిష్కారం చూపుతుందనే ఆశలు రేకెత్తుతున్నాయి.ఐదు అంశాలకు పెద్దపీట: రాష్ట్రం శరవేగంగా ఆర్థికాభివృద్ధిని సాధించడంలో ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్ర ప్రభుత్వ భావిస్తోంది. ఈ నేపథ్యంలో 15కు పైగా పారిశ్రామిక సంఘాలను భాగస్వాములను చేస్తూ నిపుణుల నుంచి వందకు పైగా సలహాలు, సూచనలు స్వీకరించి ‘ఎంఎస్ఎంఈ పాలసీ 2024’ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించారు. ఇందులో ఐదు అంశాలకు పెద్దపీట వేసినట్లు సమాచారం. ‘ఎస్సీ, ఎస్టీలు, మహిళలు సహా అందరికీ లబ్ధి’, ‘అన్ని ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈలు సమరీతిలో అభివృద్ధి’, ‘ఉత్పాదక సామర్థ్యం పెంపుదల’, ‘ఉపాధి కల్పన పెంచడం’, ‘టెక్నాలజీ ఆధునీకరణ’కు ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. ఎంఎస్ఎంఈల సవాళ్లకు పరిష్కారం: భూమి, నిధులు, ముడి సరుకులు, కారి్మకులు, సాంకేతికత, మార్కెటింగ్ తదితర రూపాల్లో ఎంఎస్ఎంఈలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఈ సవాళ్ల పరిష్కారం కోసం నూతన పాలసీలో అనేక ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిసింది. ఎంఎస్ఎంఈ ల అభివృద్ధి కేంద్రాలు, కామన్ ఫెసిలిటీ సెంటర్లు, ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తారు. ఇందులో మహిళలకు 10 శాతం వరకు రిజర్వేషన్లు కలి్పంచే అవకాశం ఉంది. మూల ధన పెట్టుబడిపై సబ్సిడీ, నైపుణ్య శిక్షణ కోసం ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’లో ఎంఎస్ఎంఈలకు ఉపయోగపడే కోర్సులు వంటివి ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉన్న ఎంఎస్ఎంఈల్లో సాంకేతికత ఆధునీకరణ కోసం రూ.100 కోట్ల నిధితో ఓ ప్రత్యేక పథకాన్ని కూడా ప్రవేశ పెట్టే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల కొనుగోలుకు ప్రత్యేక సేకరణ విధానంపై కూడా కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. -
సేవల రంగం.. సుస్థిర ప్రగతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పురోగతిలో సేవల రంగం కీలకపాత్ర పోషిస్తోందని, కరోనా విపత్తు తర్వాత కోలుకున్న ఈ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక, ఉత్పత్తి రంగాల్లో అభి వృద్ధి కనిపిస్తున్నప్పటికీ అస్థిరత, మందగమనం కూడా నమోదవు తున్నా యని ఈ గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన సమగ్ర నివేదికను ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం ముందుంచింది. మంగళవారం ప్రజాభవన్‌లో జరిగిన సమావే శంలో, ఈ నివేదికలోని అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఆర్థిక శాఖ వివరించింది. ⇒ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో స్థిరంగా అభివృద్ధి కనిపిస్తోంది. జీఎస్డీపీ వృద్ధి రేటు జాతీయ సగటు 10.1 శాతం కాగా, తెలంగాణ 12.8% వృద్ధి నమోదు చేసుకుంటోంది. దేశ జనాభాలో తెలంగాణ జనాభా 2.8% కాగా, జీడీపీలో తెలంగాణ వాటా 5.1%. ⇒ రాష్ట్ర తలసరి ఆదాయం దేశ సగటుతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. ఈ వ్యత్యాసం ఏటా భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశ తలసరి ఆదాయం రూ. 1.84 లక్షలు కాగా, తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.57 లక్షలు. ⇒ 2014–15 నుంచి 2022–23 వరకు బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలిస్తే కేవలం 81 శాతం మాత్రమే ఖర్చు నమోదయింది. అంటే రూ.100 బడ్జెట్లో ప్రతిపాదిస్తే రూ.81 మాత్రమే ఖర్చు చేయగలిగాం. ⇒ రెవెన్యూ ఆదాయంలో అస్థిరత ఆర్థిక ప్రగతిలో హెచ్చుతగ్గులు, ద్రవ్యలోటుకు దారితీస్తోంది. జీఎస్డీపీతో పోలిస్తే దేశంలోని ఇతర రాష్ట్రాల రెవెన్యూ ఆదాయం 14.6 శాతం కాగా, తెలంగాణ ఆదాయం 12.2 శాతం మాత్రమే. ⇒ జీఎస్డీపీతో పోలిస్తే ద్రవ్యలోటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. పంజాబ్ (4.5 శాతం), కేరళ (4.90 శాతం) తర్వాతి స్థానంలో రాష్ట్రం ఉంది. ⇒జీఎస్డీపీతో పోలిస్తే అప్పులు 2014–15లో 18.1 శాతం ఉంటే, 2023–24 నాటికి 27.4 శాతానికి చేరాయి. రూ.5 వేల కోట్లు ఇప్పించండికేంద్ర ప్రభుత్వం నుంచి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా నిధులను ఇప్పించాలని 16వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (2014)లోని సెక్షన్ 94(2) ప్రకారం రూ.1,800 కోట్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రూ.1,188.88 కోట్లు, ఏపీ నుంచి రావాల్సిన రూ.408.49 కోట్లు, 2014–15 సంవత్సరంలో లెవీ కింద ఎక్కువగా తీసుకున్న రూ.1,468 కోట్లు, 2023–24 ఆర్థిక సంవత్సరంలోని మూడు, నాలుగు త్రైమాసికాలకు గాను జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఇవ్వాల్సిన రూ.323.73 కోట్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. ప్రజెంటేషన్‌లో రంగాల వారీగా పేర్కొన్న గణాంకాలివే..వ్యవసాయ అనుబంధ రంగాలు (ప్రైమరీ సెక్టార్)సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) ప్రకారం ఈ రంగంలో దేశ సగటు 3.5 శాతంతో పోలిస్తే తెలంగాణ సగటు 5.4 శాతంగా నమోదయింది. ఈ మేరకు ప్రగతి శాతం ఎక్కువగానే ఉన్నా ఈ రంగంలో అస్థిర పురోగతి నమోదవుతోంది. జీఎస్డీపీలో ఈ రంగం వాటా పరిశీలిస్తే పశువులు, జీవాలు 7.7 శాతం, మైనింగ్ 7.4 శాతం, మత్స్య పరిశ్రమ 6.4 శాతంగా నమోదయ్యాయి. పారిశ్రామిక రంగం (సెకండరీ సెక్టార్): ఈ రంగంలో ప్రగతి అస్థిరంగా ఉంది. దేశ సగటు 5.9 శాతంతో పోలిస్తే మందగమనం కనిపిస్తోంది. ఈ రంగంలో తెలంగాణ సగటు కేవలం 5.7శాతం మాత్రమే. జీఎస్డీపీలో ఈ రంగం వాటా కింద నిర్మాణ రంగం 7.6 శాతం, తయారీ రంగ పరిశ్రమలు 5.4 శాతం నమోదు చేస్తున్నాయి. సేవల రంగం (టెరిటరీ సెక్టార్): ఈ రంగంలో మాత్రం అభివృద్ధి సుస్థిరంగా కనిపిస్తోంది. దేశ సగటు 6.5 శాతంగా ఉంటే తెలంగాణ సగటు 8.1 శాతంగా నమోదవుతోంది. జీఎస్డీపీలో ఈ రంగం వాటా పరిశీలిస్తే వాణిజ్య సేవలు 12.4 శాతం, స్టోరేజీ 12, వాయు రవాణా 10.9 శాతం, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సేవలు 8.9 శాతంగా నమోదు చేసుకున్నాయి. -
నెమ్మదించిన పరిశ్రమలు
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం జూన్‌లో నెమ్మదించింది. ఐదు నెలల్లో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 4.2 శాతంగా నమోదయ్యింది. ఐఐపీ సూచీలో మెజారిటీ వెయిటేజ్ కలిగిన తయారీ రంగం పనితీరు నిరుత్సాహ పరిచినప్పటికీ విద్యుత్, మైనింగ్ రంగాలు చక్కటి ఫలితాలను నమోదుచేశాయి. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సూచీ వరుసగా 4.2%, 5.6%, 5.5%, 5.0%, 6.2 శాతం వృద్ధి రేట్లను (2023 ఇవే నెలలతో పోల్చి) నమోదుచేసుకుంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో సూచీ 5.2 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 4.7 శాతం. గత ఏడాది జూన్‌లో ఐఐపీ వృద్ధి రేటు 4 శాతంగా నమోదయ్యింది. అంటే అప్పటికన్నా తాజా సమీక్షా నెల జూన్‌లో (4.2 శాతం) కొంత మెరుగైన ఫలితం వెలువడ్డం గమనార్హం. 2023 అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో 11.9 శాతం ఐఐపీ వృద్ధి నమోదైంది. -
పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తాం
సాక్షి, అమరావతి: పారిశ్రామిక వృద్ధిలో అత్యుత్తమ స్థానాన్ని పొందిన గుజరాత్ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోను పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. గుజరాత్ తరహాలో మన రాష్ట్రంలో కూడా గిఫ్ట్ సిటీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఆయన గురువారం సచివాలయంలో రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య, ఆహారశుద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి తరలివచ్చి పరిశ్రమలు స్థాపించేందుకు అనువైన వాతావరణం కల్పిస్తామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎన్ఆర్ఐల సహకారంతో యువతకు ఉపాధిరాష్ట్ర చిన్న, మధ్య సూక్ష్మ పరిశ్రమల, సెర్ప్, ఎన్ఆర్ఐ సంబంధాల శాఖ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ గురువారం రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. ఎన్ఆర్ఐల సహకారంతో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి, డ్వాక్రా గ్రూప్ మహిళలు పారిశ్రామికంగా ఎదుగుదలకు ఒక రోడ్ మ్యాప్‌ను త్వరలోనే రూపొందిస్తామని వివరించారు. తాను బాధ్యతలు స్వీకరించిన అనంతరం 20 ఆదర్శ మండలాలకు రూ.10లక్షలు చొప్పున నిధులు, ఎస్సీ, ఎస్టీ ఎస్‌హెచ్‌జీలకు అందుబాటులో ఉన్న నిధులతో వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తూ రెండు ఫైళ్లపై సంతకాలు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ చెప్పారు.బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డీఎస్సీ కోచింగ్రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో వెనకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ అందించనున్నట్టు బీసీ, ఈడబ్ల్యూఎస్, చేనేత, జౌళి శాఖల మంత్రి సంజీవిరెడ్డిగారి సవిత తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆమె మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బీసీ స్టడీ సర్కిళ్ళలో ఉచిత డీఎస్సీ కోచింగ్, ఎన్టీఆర్ విదేశీ విద్య పథకంపై మొదటి, ద్వితీయ సంతకాలు చేశారు. వెనకబడిన తరగతుల్లోని నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ ఫైల్‌పై తొలి సంతకం చేసినట్టు సవిత తెలిపారు. 2014–19 లో ఉమ్మడి 13 జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవన్ల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. వారానికి ఒక్కసారైనా సచివాలయ ఉద్యోగులు, రాష్ట్ర ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సవిత ముఖ్య కార్యదర్శి సునీతతో కలిసి మూడో బ్లాకులోని లేపాక్షి ఎంపోరియంను సందర్శించారు. -
ఇంధనం సంరక్షణకు ‘పాట్’ పడుతున్న ఏపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం, సమర్ధవంతంగా ఇంధన వ్యయాన్ని తగ్గించడం, కర్భన ఉద్గారాలను కట్టడి చేయడం వంటి లక్ష్యాలను సాదించడంలో భాగంగా, పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్ (పాట్) పథకం ద్వారా భారీ పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యం, సాంకేతికతను ప్రవేశ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోంది. పాట్ సైకిల్–3 వరకు 1.16 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వెలెంట్ (ఎంటీఓఈ) ఇంధనాన్ని రాష్ట్రం ఆదా చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎనర్జీ ఎఫిషియన్సీ పాలసీని కూడా రూపొందించింది. ఈ పాలసీ వల్ల ఏటా 16,875 మిలియన్ యూనిట్లు (మొత్తం డిమాండ్‌లో 25.6 శాతం) ఆదా అవుతుందని, వాటి విలువ రూ.11,779 కోట్లుకు పైగానే ఉంటుందని అంచనా. తద్వారా దాదాపు 14.34 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గే అవకాశం ఉంది. ప్రయోజనాలు ఎన్నో.. ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవటం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయటమే కాకుండా పారిశ్రామిక ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించవచ్చు. తద్వారా ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ‘పాట్’ పథకానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. నూతన ఇంధన సామర్ధ్య సాంకేతికత సహాయంతో తక్కువ విద్యుత్‌తో ఎక్కువ పారిశ్రామిక ఉత్పత్తి సాధించడంపై పారిశ్రామికవేత్తలకు అవగాహన కలి్పస్తోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఆధారిత పరికరాలను సమకూరుస్తోంది. రాష్ట్రంలో 65 ఎంఎస్ఎంఈల్లో వీటిని అమర్చింది.ఇవి విద్యుత్ వినియోగాన్ని, యంత్రాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన సూచనలు అందించడం ద్వారా ఇంధన ఆదాకు దోహదపడుతున్నాయి. దీంతో సరిపెట్టకుండా పాట్ పథకం కింద లక్ష్యాలను సాధించిన పరిశ్రమలకు ఇంధన పొదుపు సరి్టఫికెట్లను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ద్వారా అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 4 లక్షలకు పైగా సర్టిఫికెట్లను అందించింది. వీటిని మార్కెట్లో విక్రయించడం ద్వారా ఆయా పరిశ్రమలు ఆరి్థక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.భారీ పరిశ్రమల్లో ప్రత్యేకంగా విద్యుత్ క్యాప్టివ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. దీనివల్ల పరిశ్రమలు విద్యుత్‌పై చేసే వ్యయం తగ్గుతుంది. మరోవైపు పరిశ్రమలలో ఆధునిక విధానాల్లో ఇంధనాన్ని సక్రమంగా వినియోగించే సాంకేతికతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం పాట్ పథకాన్ని అమలు చేస్తోంది.ఆదర్శంగా నిలుస్తున్న ఏపీ 2030 నాటికి దేశ వ్యాప్తంగా 1 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించాలని, 2070 నాటికి వాటిని అసలు లేకుండా చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధనలో ఏపీ చురుకైన పాత్ర పోషిస్తోంది. 65 సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఐఓటీ ఆధారిత ఎనర్జీ ఎఫిషియన్సీ డెమోన్‌్రస్టేషన్ ప్రాజెక్టుల అమలు, న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో ఇంధన సామర్థ్య చర్యలు, పెర్ఫార్మ్, అచీవ్ – ట్రేడ్ (పాట్)లో పథకంలో 1.160 మిలియన్ టన్నుల చమురుకు సమానమైన ఇంధన పొదుపు, స్థానిక సంస్థల్లో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) అమలు వంటి కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా ఏపీకి గుర్తింపుతెచ్చాయి. -
కుదేలైంది యంత్రం కాదు..రామోజీ కుతంత్రం!
అక్షరమనే వజ్రాయుధాన్ని ఎంతగా భ్రషు్టపట్టించాలో అంతగానూ రామోజీ భ్రషు్టపట్టిస్తున్నారు..ఈనాడు అంటేనే ఏవగింపు కలిగేలా అబద్ధాలు, కుళ్లూ కుట్రల రాతలతో పత్రికను నింపేస్తున్నాడీ ఎల్లో పెద్ద మనిషి. చంద్రబాబంటే ఆమడదూరం పారిపోయే పారిశ్రామికవేత్తలు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాతే తెప్పరిల్లారు. కోవిడ్ వంటి కష్టకాలంలోనూ జగన్ పరిశ్రమలను ఆదుకున్నారని దేశంలోనే గొప్ప పేరు తెచ్చుకున్న సీఎంగా గుర్తింపు పొందారు. అయిదేళ్ల కిందట తమకు దక్కని రాయితీలను పారిశ్రామిక వేత్తలు జగన్ ప్రభుత్వంలోనే అందుకుంటున్నారు. ఈ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాల ఫలితంగానే పారిశ్రామిక వికాసం, ఉద్యోగ కల్పన పెరిగాయనడానికి తలసరి ఆదాయ వృద్ధే నిదర్శనం...ఈ నిజం రామోజీకి తెలిసినా, తప్పుడు రాతలకే కంకణం కట్టుకున్నారు కనుక కట్టుకథలనే అల్లుతారు.. జగన్ ప్రభుత్వంలోనే రాష్ట్ర ఎగుమతులు పెరిగాయి...చంద్రబాబు హయాంలో ఉన్న ఎంఎస్ఎంఈల సంఖ్యతో పోలిస్తే జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు ఆరింతలుగా పెరిగింది...వాస్తవాలెప్పుడూ రామోజీకి చేదుగానే ఉంటాయి...అందుకే అక్షర గరళాన్ని జగన్ ప్రభుత్వంపై చిమ్ముతూనే ఉంటాడీయన... చంద్రబాబు ఎంఎస్ఎంఈలకు బకాయిలు పెట్టి జారుకుంటే...ఆ మొత్తాన్ని జగన్ తీర్చడమే కాదు...వాటికి ప్రోత్సాహకాలనూ అందిస్తూ...పారిశ్రామిక ప్రగతికి జగన్ అహరహం అడుగులు వేస్తున్నారు...ఆయన భరోసాయే పారిశ్రామికవేత్తలకు కొండంత అండ...ఏ వర్గానికీ మంచి జరగాలని చంద్రబాబు ఏనాడూ కోరుకోలేదు...రామోజీదీ అదే వరుస...అయినా వాస్తవాలు చెరిపేస్తే చెరిగిపోవు...చింపేస్తే చిరిగిపోవన్నది రామోజీ గుర్తించాలి... సాక్షి, అమరావతి: తనవాడి పాలన అయితే తందాన తాన...తనకు నచ్చని వ్యక్తి అయితే ఎడాపెడా కారుకూతల రాతల విషం చిమ్మడం రామోజీకి అలవాటైపోయింది. చంద్రబాబు అధికారంలో ఉంటే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోయినా రాష్ట్రంలో పారిశ్రామిక వెలుగులు అంటూ రాతలు రాస్తారు. అదే తనకు గిట్టని వాళ్లు అధికారంలో ఉంటే మాత్రం తిట్టిపోయడం రామోజీకి అలవాటై పోయింది. ఎంఎస్ఎంఈలకు బాబు పెట్టిన బకాయిలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీర్చినా సరే రాష్ట్రంలో పారిశ్రామిక రంగం తిరోగమనం ...అంటూ క్షుద్ర రాతలు రాస్తారు. ప్రపంచం ఎప్పుడూ చూడని విధంగా కోవిడ్ వంటి మహమ్మారి కాలంలోనూ రాష్ట్రంలో ఒక్క పరిశ్రమా మూత పడకుండా జగన్మోహన్రెడ్డి పారిశ్రామికవేత్తలను చేయిపట్టి నడిపించారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగమే కనుక తిరోగమనంలో ఉండి ఉంటే గత ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పారిశ్రామిక రంగ వాటా పెరగడం ఎలా సాధ్యమవుతుందో రామోజీ జవాబివ్వగలరా? 2019–20లో రాష్ట్ర జీఎస్డీపీలో 22.04 శాతంగా ఉన్న పరిశ్రమల వాటా 2022–23 నాటికి 23.36 శాతానికి చేరిన విషయం వాస్తవమో, కాదో రామోజీ బదులివ్వగలరా? పారిశ్రామిక ప్రగతి, ఉద్యోగ కల్పన లేకపోయి ఉంటే తలసరి ఆదాయం ఎలా పెరిగిందో రామోజీ మట్టిబుర్రకు తట్టలేదా? గతేడాది దేశంలో తలసరి ఆదాయం సగటున రూ.23,476 పెరిగితే, మన రాష్ట్రంలో దాన్ని మించి రూ.26,931గా ఎలా పెరిగిందో ఈనాడు చెబుతుందా? 2021–22లో రూ.1,92,587గా ఉన్న రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 2022–23 నాటికి రూ.2,19,518కు చేరిన విషయం రామోజీకి తెలియదా?. పారిశ్రామికవేత్తల అభిప్రాయాల అధారంగా ప్రకటిస్తున్న సులభతర వాణిజ్య ర్యాంకుల్లో వరుసగా మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుస్తోంది. రాష్ట్ర ఎగుమతులు రూ.90,000 కోట్ల నుంచి రూ.1,60,000 కోట్లకు చేరుకున్నాయి. చంద్రబాబు హయాంలో 1.93 లక్షలుగా ఉన్న ఎంఎస్ఎంఈల సంఖ్య ఇప్పుడు ఏకంగా ఏడు లక్షలు దాటింది. కోవిడ్ సమయంలో రీస్టార్ ప్యాకేజీ, వైఎస్ఆర్ నవోదయం వంటి పథకాలను జగన్ ప్రభుత్వం సమర్థంగా అమలు చేయడం ద్వారా ఎంఎస్ఎందఈ రంగం ఎలా పురోగమించిందో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. గత బకాయిలను విడుదల చేసింది ఈ ప్రభుత్వమే రామోజీ .. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను పూర్తిగా నిర్లక్ష్యం చేయగా, జగన్ ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఆదుకుంది. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు, స్పిన్నింగ్ మిలు్లలకు కలిపి బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను విడుదల చేయడమే కాకుండా రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసి ఆదుకున్న విషయం వాస్తవం కాదా రామోజీ? గతంలో పట్టణాలు నగరాలకు దూరంగా ఉన్న ఆటోనగర్లు, పారిశ్రామిక వాడలు పట్టణీకరణలో భాగంగా చాలాచోట్ల నగర మధ్య భాగంలోకి రావడంతో కాలుష్యకారక పరిశ్రమలను చాలా వరకు దూరప్రాంతాలకు ప్రభుత్వం తరలించింది. దీంతో పాత యూనిట్ల స్థలాలు వృధాగా ఉన్నాయి. కొన్ని సంస్థలు వాటి వ్యాపార కార్యకలాపాలను మార్చుకున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత భూములను ఇతర వాణిజ్య కార్యక్రమాలకు వినియోగించడం ద్వారా మరింత మందికి ఉపాధి కల్పించవచ్చని పారిశ్రామిక సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి జీవో నెంబర్ 5, 6ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ చర్యనూ తప్పు పడుతూ రామోజీ తన కలంతో ప్రభుత్వంపై విషం కక్కారు. అన్ని మౌలికవసతులు కల్పిస్తూ అభివృద్ధి చేసిన భూమి ధర మార్కెట్ రేటు కంటే అధికంగా ఉంటుంది. ఈ విషయాన్ని చిన్న పిల్లాడినా అడిగినా చెబుతాడు. ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కు అభివృద్ధికి అయిన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని భూమి ధరలను నిర్ణయిస్తుంది. మార్కెట్ ధరలతో పోలిస్తే పారిశ్రామిక పార్కుల్లో భూమి ధర ఎక్కువగా ఉందంటూ రామోజీ రాస్తున్నారంటే ఏ స్థాయికి దిగజారిపోయారో రాష్ట్రమంతటికీ అర్థమవుతోంది. -
‘పాట్’ అమలులో ఏపీ ఉత్తమం
సాక్షి, అమరావతి: పెర్ఫార్మ్, అచీవ్ ట్రేడ్ (పాట్) పథకం అమలులో రాష్ట్రం ఉత్తమ ఫలితాలు సాధిస్తోందని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చెప్పారు. పారిశ్రామికరంగంలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇంధన వ్యయాన్ని తగ్గించడం, గ్రీన్హౌస్ ఉద్గారాలను కట్టడిచేయడం వంటి లక్ష్యాలను సాధించడంలో భాగంగా పరిశ్రమల్లో ఎనర్జీ మేనేజర్లకు పాట్ పథకంపై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) బుధవారం విజయవాడలో రీజనల్ వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ వర్క్‌షాప్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయానంద్ ఏపీఎస్ఈసీఎం సీఈవో కుమారరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు, నెడ్‌క్యాప్ వీసీ, ఎండీ నందకిషోర్‌రెడ్డి, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ సీఎండీ కమలాకర్‌బాబు, బీఈఈ సీనియర్ సెక్టార్ ఎక్స్పర్ట్ నవీన్‌కుమార్‌లతో కలిసి పాట్‌పై బుక్‌లెట్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు పాట్ పథకం అమలు చేయటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం, ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో డీకార్బనైజేషన్ చర్యలు నిర్వహించడం వంటి పటిష్టమైన ప్లాన్‌ను రూపొందించిన ఉత్తమ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని చెప్పారు. ఈ పథకం దేశవ్యాప్తంగా అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నారు. పాట్ సైకిల్–1లో 8.67 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వివాలెంట్ (ఎంటీవోఈ) ఇంధనాన్ని ఆదా చేయడం వల్ల సుమారు 31 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను నివారించగలిగామని చెప్పారు. పాట్ సైకిల్–2లో 14.08 ఎంటీవోఈ ఇంధనం ఆదా చేయడంద్వారా 68 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించామని తెలిపారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో పరిశ్రమలు ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడం ద్వారా పాట్ సైకిల్–3 వరకు 1.16 ఎంటీవోఈ ఇంధనాన్ని ఆదా చేశాయని చెప్పారు. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే కాకుండా పారిశ్రామిక ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని ఆయన తెలిపారు. వర్క్‌షాప్‌లో ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సిమెంట్, టెక్స్టైల్స్, పవర్ప్లాంట్లు, ఎరువులు, ఇనుము, ఉక్కు, ఎరువులు, సిమెంట్, అల్యూమినియం, పేపర్, క్లోర్–ఆల్కల్ పరిశ్రమల నుంచి 100 మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాయ్
న్యూఢిల్లీ: కార్పొరేట్ ప్రపంచం దేశాభివృద్ధి లక్ష్యాలతో మమేకం అవుతుందన్న విశ్వాసమున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. తద్వారా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఆవిర్భవించడంలో భాగస్వాములవుతాయని తెలియజేశారు. వెరసి శత వసంత స్వాతంత్య్ర దినోత్సవ (2047) సమయానికల్లా వికసిత్ భారత్‌గా ఆవిర్భవించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. భవిష్యత్ తరాలకు అత్యుత్తమ భారత్‌ను అందించే బాటలో ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్‌ను సాధించేందుకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించినట్లు పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్ ః 2047: వికసిత్ భారత్– ఇండస్ట్రీ’ పేరుతో ఫిక్కీ నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. 2047కల్లా లక్ష్యాలను సాధించడంలో పారిశ్రామిక రంగం పాత్ర కీలకమన్నారు. -
ఒక్క ఏడాదిలోనే రూ. 2.46 లక్షల కోట్లు
సాక్షి, అమరావతి: పారిశ్రామిక రంగాన్ని సీఎం జగన్ వెన్నుతట్టి ప్రోత్సహిస్తుండటంతో రిలయన్స్, బిర్లా, టాటా లాంటి పారిశ్రామిక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. గతేడాది మార్చిలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో కుదిరిన ఒప్పందాలు వేగంగా వాస్తవ రూపంలోకి వస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రూ.4,178 కోట్లతో ఆదిత్య బిర్లా గ్రూప్, రిలయెన్స్ ఎనర్జీ, హెల్లా ఇన్ఫ్రా, వెసువియస్ ఇండియా లిమిటెడ్, ఏపీఐఐసీ, ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్‌కు సంబంధించిన మొత్తం 8 ప్రాజెక్టులకు బుధవారం వెలగపూడి సచివాలయం నుంచి ఆయన వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ‘ఏపీ ఎంఎస్ఎంఈ వన్’ వెబ్‌సైట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. పెట్టుబడులు పెడుతున్న రిలయన్స్, ఆదిత్య బిర్లా, హెల్లా ఇన్ఫ్రా సంస్థలకు సీఎం తరఫున ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ, సహకారాలను అందిస్తుందని పునరుద్ఘాటించారు. సాధారణంగా దేశంలో పెట్టుబడుల సదస్సులోజరిగే ఒప్పందాల్లో 16 నుంచి 17 శాతం మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తాయని, మన రాష్ట్రంలో మాత్రం సదస్సు జరిగి ఏడాది కాకుండానే 19 శాతం పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రావడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. జీఐఎస్‌లో మొత్తం రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు జరగ్గా రూ.2.46 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పనులు వేర్వేరు దశల్లో ఉన్నట్లు వివరించారు. పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉందని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన భరోసాతో పెట్టుబడులకు పరిశ్రమలు ముందుకొస్తున్నాయని చెప్పారు. గత మూడేళ్లుగా దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 11 పారిశ్రామిక కారిడార్లను నెలకొల్పుతుండగా ఏపీ పరిధిలో విశాఖ–చెన్నె, చెన్నె–బెంగళూరు, బెంగళూరు–హైదరాబాదు పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటవుతున్నట్లు చెప్పారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూ.1,000 కోట్లతో నక్కపల్లి, శ్రీకాళహస్తి నోడ్లను అభివృద్ధి చేస్తున్నామని, ఈ రెండు పారిశ్రామిక పార్కుల ద్వారా సుమారు రూ.60,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంత అభివృద్ధిపై దృష్టి సుదీర్ఘంగా 974 కి.మీ. పొడవైన సముద్ర తీరాన్ని కలిగి ఉన్న మన రాష్ట్రం పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనుకూలమని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక సుమారు రూ.20 వేల కోట్లతో నాలుగు ప్రధాన పోర్టులను నిర్మిస్తుండగా రామాయపట్నం పోర్టు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని తెలిపారు. మరో రూ.నాలుగు వేల కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్థానిక యువత ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే గత నాలుగేళ్లలో 2.50 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటు ద్వారా ఆరు లక్షల మందికి పైగా ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలను విస్తృతం చేసేందుకు 50కిపైగా పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుకు కృషి జరుగుతోందన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌కుమార్, పరిశ్రమల శాఖ కమిషనర్ సిహెచ్.రాజేశ్వర్‌రెడ్డితోపాటు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
AP: రాష్ట్రంలో మూడు రెట్లు పెరిగిన స్టార్టప్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యువత నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సరికొత్త ఆలోచనలతో ఆవిష్కరణల దిశగా అడుగులు వేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు చర్యలు చేపట్టారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల ద్వారా అందిస్తున్న సహకారంతో రాష్ట్రంలో స్టార్టప్‌ల సంఖ్య భారీగా పెరిగింది. వీటి ద్వారా సాంకేతిక నిపుణులైన యువత స్వయం ఉపాధి పొందడమే కాకుండా, వేలాది మందికి ఉద్యోగాలూ వస్తున్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్రంలో స్టార్టప్‌ల సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగినట్లు డిపార్టమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) వెల్లడించింది. ఆ సంస్థ తాజా గణాంకాల ప్రకారం.. 2019లో రాష్ట్రంలో 161 స్టార్టప్‌లు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 586 దాటింది. వీటిలో పనిచేసే ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగింది. 2019లో 1,552 మంది వీటిలో పనిచేస్తుండగా, ఆ సంఖ్య ఇప్పుడు 5,669కు చేరింది. గత చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఇంక్యుబేషన్ సెంటర్ పేరుతో ప్రచారానికే పరిమితమవడంతో స్టార్టప్‌లలో రాష్ట్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. వైఎస్ జగన్ ప్రభుత్వం దానికి భిన్నంగా స్టార్టప్‌ల ప్రోత్సాహానికి అనేక చర్యలు చేపట్టింది. స్టార్టప్‌లకు మెంటార్షిప్, ఫండింగ్, ఇండస్ట్రీ కనెక్ట్‌లతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈవో అనిల్ తెంటు ‘సాక్షి’కి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలి నాలుగో తరం పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ 4కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని కల్పతరువు పేరిట విశాఖలో ఏర్పాటు చేసింది. దీంతోపాటు నాస్కామ్ సహాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల స్టార్టప్‌ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను కూడా విశాఖలో ఏర్పాటు చేసింది. ఆంధ్రా యూనివర్సిటీలో ఏ హబ్, ఓడల నిర్మాణంపైన, మెడ్‌టెక్ జోన్‌లోనూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా పలు స్టార్టప్‌లు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. -
త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ
సాక్షి, హైదరాబాద్: ప్రజలు కోరుకున్న మార్పును తీసుకురావడంలో భాగంగా అందరి సలహాలు, సూచనలతో త్వరలో కొత్త పారిశ్రామిక విధానం రూపొందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. అందరి అభిప్రాయాలు తీసుకుని చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) తోడ్పాటును అందిస్తామని భరోసానిచ్చారు. వివిధ వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు ఎఫ్‌టీసీసీఐ, ఫిక్కి, సీఏఏ, ఎఫ్టీఎస్ఏసీ, డిక్కి సంస్థల ప్రతినిధులతో బుధవారం శ్రీధర్‌బాబు భేటీ అయ్యారు. పారిశ్రామిక కారిడార్ విషయంలోనూ సలహాలు, సూచనలు స్వీకరించడంతో పాటు అన్ని జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. చైనా కంటే ఉత్తమంగా అన్ని ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పారిశ్రామిక రంగానికి నూతన ఉత్తేజం కల్పించడంతోపాటు అర్బన్, రీజనల్, సెమీ అర్బన్ క్లస్టర్లుగా విభజించి పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. డ్రైపోర్ట్ విషయంలోనూ త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటామని, నల్లగొండ నుంచి పాత ముంబై హైవే ప్రాంతాలను అనుసంధానం చేయడాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తాం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చి న హామీ మేరకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంతో పాటు పారిశ్రామిక రంగం అభివృద్ధితో లక్షలాది మంది ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని శ్రీధర్ బాబు చెప్పారు. యువ పారిశ్రామికవేత్తలను తయారు చేసే దిశగా ‘ప్లాన్ 2050’అమలు చేస్తామన్నారు. ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్ అందించిన హైదరాబాద్‌ను అభివృద్ధి చెందిన దేశాలు కూడా గుర్తించేలా ‘ఫార్మా ఇండస్ట్రీ హబ్’గా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్‌లో తయారైన క్షిపణులు ఇజ్రాయెల్‌కు ఎగుమతి అవుతున్న వైనం రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి అద్దం పడుతోందన్నారు. అదానీ కంపెనీ వ్యవహారంలో కొంతమంది కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల పారిశ్రామిక వేత్తలకు అవకాశం రావాలన్నది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమని, తమ నాయకుడు రాహుల్ గాంధీ అదానీని వ్యతిరేకించారు కానీ అభివృద్ధిని కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అదానీ పెట్టుబడులు ఉన్నాయని, రాష్ట్ర అభివృద్ధిపైనే తమ ఆలోచన ఉంటుందని శ్రీధర్‌బాబు అన్నారు. -
రూ.2,851 కోట్ల పెట్టుబడులు
సాక్షి, అమరావతి: ఆహార శుద్ధి, పరిశ్రమల రంగంలో మొత్తం 13 కీలక ప్రాజెక్టులకు సంబంధించి రూ.2,851 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వచ్చాయి. వీటి ద్వారా 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుండగా ఆహార శుద్ధి యూనిట్ల ద్వారా 90,700 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా వీటికి భూమి పూజ, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. ఏడు ప్రాజెక్టుల పనులకు శ్రీకారం పరిశ్రమల రంగంలో రూ.2,294 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టుల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జగన్ వర్చువల్‌గా భూమి పూజ నిర్వహించనున్నారు. ఏడు ప్రాజెక్టుల ద్వారా 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. అనంతపురం జిల్లా డి.హీరేహళ్లో రూ.544 కోట్లతో ఎకో స్టీల్ ఇండియా, తిరుపతి నాయుడుపేటలో రూ.800 కోట్లతో గ్రీన్‌లామ్ సౌత్, బాపట్ల జిల్లా కొరిసిపాడు వద్ద శ్రావణి బయో ఫ్యూయల్ రూ.225 కోట్లు, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రూ.200 కోట్లతో నాగార్జునా ఆగ్రో కెమికల్స్, తూర్పుగోదావరి జిల్లా ఖండవల్లి వద్ద రూ.150 కోట్లతో రవళి స్పిన్నర్స్, శ్రీసత్యసాయి జిల్లా గూడుపల్లి వద్ద రూ.125 కోట్లతో యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటో ప్లాస్టిక్, శ్రీసత్యసాయి జిల్లా మడకశిర వద్ద రూ.250 కోట్లతో ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. పులివెందులలో అరటి ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.557 కోట్ల పెట్టుబడులకు సంబంధించి సీఎం చేతుల మీదుగా భూమి పూజ, ఉత్పత్తి ప్రారంభం, ఒప్పందాలు జరగనున్నాయి. వీటి ద్వారా 2,405 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుండగా 90,700 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ.65 కోట్లతో 13 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. తిరుపతి జిల్లా కంచరపాలెం వద్ద రూ.168 కోట్లతో ఏటా 40,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన డీపీ చాక్లెట్స్ యూనిట్‌ను సీఎం ప్రారంభిస్తారు. విశాఖపట్నం జిల్లా మద్ది వద్ద రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఓరిల్ ఫుడ్స్ నిర్మాణ పనులకు, అనకాపల్లి జిల్లా కొడవాటిపూడి వద్ద రూ.20 కోట్లతో ఏర్పాటు చేస్తున్న నేటివ్ అరకు కాఫీ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. తూర్పు గోదావరి జిల్లా అయ్యవర్తం వద్ద రూ.350 కోట్లతో 3 ఎఫ్ ఆయిల్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. కడప జిల్లా పులివెందులలో రూ.4 కోట్లతో ఏర్పాటు చేసిన అరటి ప్రాసెసింగ్ యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. -
యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు
భారీ పరిశ్రమలను ఆకర్షించేలా యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం 2023 – 27 విధివిధానాలను తాజాగా విడుదల చేసింది. 2023 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 30 వరకు నూతన పాలసీ అమల్లో ఉంటుంది. ఈ కాలపరిమితిలో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లకు ప్రత్యేక రాయితీలు లభిస్తాయి. యాంకర్ యూనిట్లతో పాటు లార్జ్, మెగా, అల్ట్రా మెగా, ఎంఎస్ఎంఈలకు రాయితీలు, ప్రోత్సాహకాలపై స్పష్టమైన విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేలా ప్రభుత్వం నూతన పాలసీ విధివిధానాలను రూపొందించింది. యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు అందించాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. యాంకర్ యూనిట్ రూ.500 కోట్లకు పైబడి పెట్టుబడితో ఏర్పాటవ్వాలి. కనీసం 1,000 మందికి ఉపాధి కల్పించాలి. ఈ యూనిట్ ఆధారంగా కనీసం మరో ఐదు యూనిట్లు ఏర్పాటవ్వాలి. ఇటువంటి యూనిట్లకు పారిశ్రామిక పాలసీ 2023 – 27లో పేర్కొన్న ప్రోత్సాహకాలతో పాటు అదనపు రాయితీలు కూడా లభిస్తాయి. యూనిట్ ఏర్పాటు వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కలిగే ప్రయోజనం, ఉపాధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ యూనిట్ ప్రతిపాదనలను బట్టి టైలర్ మేడ్ రాయితీలను ఇవ్వనున్నారు. తొలుత యాంకర్ యూనిట్ పూర్తి నివేదిక (డీపీఆర్)ను రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌కు సమర్పించాలి. వారు కోరుకొనే రాయితీలను ప్రజంటేషన్ రూపంలో చూపించాలి. ఆ రాయితీలు ఇవ్వడానికి సహేతుక కారణాలను వివరించాలి. ఈ ప్రతిపాదనలను ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీ ముందుకు తేవాలి. వాటిని ఎస్ఐపీబీ పరిశీలించి భూమి ధరలు, ప్రత్యేక రాయితీలపై నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లు విస్తరణ చేపట్టినా, లేక వేరే రంగంలో పెట్టుబడులు పెట్టినా వాటికి కూడా నిబంధనలకు అనుగుణంగా రాయితీలు అందుతాయి. రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించిన ప్రతి పరిశ్రమకు ఆధార్ తప్పనిసరిగా తీసుకోవాలని, ఉద్యోగుల్లో 75 శాతం స్థానికులకే అవకాశం కల్పించాలని, అటువంటి సంస్థలకే ఈ రాయితీలు, ప్రోత్సాహకాలు లభిస్తాయని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఎస్సీ, ఎస్టీ, పారిశ్రామికవేత్తలు స్థాపించే పరిశ్రమలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం కింద ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది. ఇందులోనూ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇందుకు విధివిధానాలను నూతన పాలసీలో పొందుపరిచింది. ఈ పరిశ్రమల్లో 100 శాతం పెట్టుబడి ఎస్సీలు, ఎస్టీల పేరు మీద ఉండాలి. 100 శాతం పెట్టుబడి ఎస్సీ, ఎస్టీ మహిళల పేరు మీద ఉంటే వాటిని ఎస్సీ, ఎస్టీ మహిళా యూనిట్లుగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ మహిళలను తొలి తరం పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేవలం ఆర్థిక ప్రోత్సాహకాలు మాత్రమే కాకుండా వారిని చేయిపట్టుకొని నడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు నూతన పాలసీలో ప్రభుత్వం పేర్కొంది. జగనన్న కాలనీల్లో వాక్ టు వర్క్ విధానంలో పనిచేసుకునే విధంగా ఉమ్మడి వసతులతో కూడిన సూక్ష్మ యూనిట్లు ఏర్పాటు చేయడానికి క్లస్టర్లను ఏర్పాటు చేయనుంది. ఈ క్లస్టర్లలో ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ కాలనీల్లో యూనిట్లు ఏర్పాటు చేసేలా ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. -
గోదాం వసతుల్లో 13–15 శాతం వృద్ధి
ముంబై: పారిశ్రామిక, వేర్ హౌస్ లాజిస్టిక్స్ పార్క్ సరఫరా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13–15 శాతం మేర పెరుగుతుందని ఇక్రా రేటింగ్స్ అంచనా వేసింది. ఎనిమిది ప్రధాన మార్కెట్లలో గోదాముల వసతి విస్తీర్ణం 435 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా 50 శాతం గోదాం వసతి గ్రేడ్ ఏ రూపంలోనే వస్తుందని తెలిపింది. అయితే, కొత్తగా వచ్చే వసతిలో వినియోగం 39 మిలియన్ చదరపు అడుగులుగానే ఉంటుందని పేర్కొంది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (రవాణా), ఆటోమొబైల్ రంగాల నుంచి గోదాముల పరిశ్రమ స్థిరమైన డిమాండ్‌ను చూస్తోందని, 2023 మార్చి నాటికి మొత్తం వేర్‌హౌసింగ్ లీజు విస్తీర్ణంలో ఈ రంగాల వాటా 53 శాతంగా ఉందని వివరించింది. దీనికి అదనంగా ఈ కామర్స్, అనుబంధ సేవల రంగాలు వేగంగా విస్తరిస్తుండడం కూడా గోదాములకు డిమాండ్‌ను పెంచుతోందని తెలిపింది. ప్రభుత్వం తయారీకి ప్రోత్సాహకాలు ఇస్తుండడం కూడా డిమాండ్ వృద్ధికి ఊతంగా నిలుస్తున్నట్టు వివరించింది. దేశవ్యాప్తంగా టాప్–8 పట్టణాల్లో గ్రేడ్ ఏ వేర్‌హౌస్ వసతి 17 శాతం వృద్ధి చెంది 195 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని అంచనా వేసింది. 2023 మార్చి నాటికి ఇది 167 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. కొత్తగా గ్రేడ్ ఏ విభాగంలో వచ్చే మార్చి నాటికి 28 మిలియన్ చదరపు అడుగుల వసతి అందుబాటులోకి వస్తుందని తన నివేదికలో ఇక్రా రేటింగ్స్ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న గ్రేడ్ ఏ గోదాముల వసతిలో 30 శాతాన్ని అంతర్జాతీయ ఆపరేటర్లు, ఇన్వెస్టర్లు అయిన సీపీపీఐబీ, జీఎల్పీ, బ్లాక్‌స్టోన్, ఈఎస్ఆర్, అలియాంజ్, జీఐసీ, సీడీపీ గ్రూప్ ఆక్రమించినట్టు తెలిపింది. దీర్ఘకాలంలో మెరుగైన వృద్ధి అవకాశాలు దీర్ఘకాలంలో గ్రేడ్–ఏ గోదాముల వసతి వృద్ధికి మెరుగైన అవకాశాలున్నట్టు ఇక్రా రేటింగ్స్ నివేదిక తెలిపింది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్, ఆటోమొబైల్ రంగాలే అందుబాటులోని గోదాముల విస్తీర్ణంలో సగం వాటా ఆక్రమిస్తున్నాయి. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ నుంచి 8–9 శాతం, ఆటోమొబైల్ రంగం 6–9 శాతం వృద్ధి ఉంటుందని తెలిపింది. ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె, చెన్నై, కోల్‌కతా మార్కెట్లు వేర్‌హౌసింగ్‌కు టాప్ మార్కెట్లుగా ఉన్నాయని, ఈ పట్టణాలే మొత్తం వసతుల్లో 75–78 శాతం వాటా కలిగి ఉన్నాయని వివరించింది. ముంబై, ఢీల్లీ ఎన్సీఆర్ మార్కెట్లే 50% వాటా ఆక్రమిస్తున్నట్టు తెలిపింది. -
Andhra Pradesh: ‘పారిశ్రామిక’ పరుగులు
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కడప సమీపంలోని కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్ కేంద్రంగా పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అలాగే, సీఎం సమక్షంలో టెక్నోడోమ్ (టీవీ యూనిట్), వర్చువల్ మేజ్, సంస్థలకు సీఎం శంకుస్థాపన చేయగా.. టెక్నోడోమ్ (వాషింగ్ మెషీన్ యూనిట్), ఛానెల్ ప్లే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు.అంతకుముందు.. కడప గడపలో రూ.5.61 కోట్లతో ఆధునికీకరించిన రాజీవ్‌మార్గ్, రూ.1.37 కోట్లతో ఏర్పాటుచేసిన రాజీవ్ పార్కునూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కొప్పర్తిలో పారిశ్రామికరంగం ఊపందుకుందన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానమ్, జెడ్పీ చైర్మన్ అమర్నాథ్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్.రఘురావిురెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి, డాక్టర్ సుధా, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి నగర మేయర్ సురేష్‌బాబు, చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వి. విజయరామరాజు, జేసీ గణేష్‌కుమార్, ఎస్పీ అన్బురాజన్, ట్రెయినీ కలెక్టర్ రాహుల్ మీనా, జెడ్పీటీసీ నరేన్ రామాంజనేయరెడ్డి, అల్ డిక్సన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ముగిసిన మూడ్రోజుల పర్యటన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 8న వైఎస్సార్ జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన జమ్మలమడుగు, పులివెందుల, కడపలలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు.. సోమవారం మధ్యాహ్నం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు జగన్‌కు ఆత్మీయ వీడ్కోలు పలికారు. 2.05 గంటలకు కడప విమానాశ్రయం నుంచి గన్నవరానికి బయల్దేరి వెళ్లారు. సంస్థల వివరాలు.. – అల్ డిక్సన్ టెక్నాలజీస్.. అల్ డిక్సన్ కంపెనీలో సీసీ కెమెరాలు, డిజిటల్ వీడియో రికార్డర్లు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాలను ఉత్పత్తి చేస్తారు. ఐదేళ్ల కాలవ్యవధిలో రూ.127 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ సంస్థలో 1,800 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. అలాగే, ఉత్పత్తి సామర్థ్యం పెంపులో భాగంగా మరో రూ.80 కోట్ల పెట్టుబడితో ‘ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, సెక్యూరిటీ కెమెరాలు మొదలైన పరికరాలు తయారుచేస్తారు. తద్వారా మరో 1,100 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే, రూ.125.26 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసే మరో యూనిట్ ద్వారా 630 మందికి ఉద్యోగావకాశాలు అందించే లక్ష్యంతో అల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ముందుకు సాగుతోంది. మొదటి దశలో ఉత్పత్తులు ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు కంపెనీ 860 మందికి ఉపాధి కల్పిస్తోంది. వర్చువల్ మేజ్ సాఫ్టీస్ ప్రైవేట్ లిమిటెడ్.. 2007 నుంచి వర్చువల్ మ్యాప్ ఆధారిత సాఫ్ట్వేర్ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేస్తున్న ‘వర్చువల్ మేజ్ సాఫ్టీస్ ప్రైవేట్ లిమిటెడ్’ ఉత్పత్తులు ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలకు వాడే బ్యాటరీలు, జీపీఎస్ ట్రాకర్, స్మార్ట్ పీసీబీ వంటి అధునాతన డివైస్‌లను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. రూ.71 కోట్ల పెట్టుబడితో పర్యావరణ హితమైన యూనిట్ ఏర్పాటుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. దీని ద్వారా సుమారు 1,350 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. టెక్నోడోమ్ సంస్థ.. అరబ్ దేశాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎలిస్టా కంపెనీకి అనుబంధంగా ‘టెక్నోడోమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ‘కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్ కంపెనీ రూ.52 కోట్లతో ఏర్పాటవుతోంది. దుబాయ్‌లో వీరి ప్రధాన కార్యాలయం ఉండగా, నోయిడాలో భారత్ ప్రధాన కార్యాలయం ఉంది. ట్రేడింగ్ కంపెనీగా ఈ సంస్థ గుర్తింపు పొందుతోంది. బ్రాండెడ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ప్రముఖ ఐటీ ఉత్పత్తుల సరఫరాదారులలో ఒకటిగా మారిన ఈ సంస్థ.. ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో భాగస్వామ్యమైంది. గృహోపకరణాలు, గృహ వినోదం, వంటగది ఉపకరణాలు, ఐటీ వస్తువులు, కార్ ఆడియో, గేమింగ్ ఉత్పత్తులు, స్మార్ట్ వాచీలను ఉత్పత్తి చేయనుంది. ప్రత్యక్షంగా 200 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఛానెల్ ప్లే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. రూ.100 కోట్ల పెట్టుబడితో ఆడియో సిస్టం భాగాలను ఉత్పత్తి చేయనున్న ఛానెల్ ప్లే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కన్సల్టింగ్, రీసెర్చ్ సంస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఎగ్జిక్యూషన్లో నైపుణ్యం కలిగి 8,000 పైగా ప్రాజెక్టు సిబ్బందితో మంచి వార్షిక ఆదాయంతో పెద్ద సంస్థగా గుర్తింపు పొందింది. ఇక్కడ 2,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ సొల్యూషన్స్ సేల్స్ ఫోర్స్ ఔట్సోర్సింగ్, విజువల్ మర్చండైజింగ్, లాయల్టీ ప్రోగ్రాంలు వున్నాయి. అలాగే, వీరి ముఖ్య ఉత్పత్తులు సౌండ్బార్లు, వూఫర్లు, మల్టీమీడియా స్పీకర్లు, పార్టీ స్పీకర్లు, టవర్లు వంటివి తయారుచేస్తారు. -
ఎంఎస్ఎంఈలపై త్రిముఖ సూత్రం
సాక్షి, అమరావతి: అత్యధిక సంఖ్యలో ఉపాధి కల్పిస్తూ పారిశ్రామిక రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల ఎగుమతులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వివిధ దేశాలకు ఎగుమతులు చేసే విధంగా డిమాండ్, టెక్నాలజీ, మార్కెటింగ్ లాంటి మూడు అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టి ప్రభుత్వం మార్గదర్శనం చేయాలని సూచించారు. ఎంఎస్ఎంఈలు తయారు చేసే ఉత్పత్తులను విక్రయించేందుకు కేవలం స్థానిక మార్కెట్లపైనే ఆధారపడకుండా ఎంఎన్‌సీలతో (బహుళ జాతి కంపెనీలు) అనుసంధానిస్తే మెరుగైన మార్కెటింగ్ ఫలితాలు ఉంటాయని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలుపై సీఎం జగన్ సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రంగాల వారీగా సమీక్షించారు. ఎంఎస్ఎంఈలను మరింత ప్రోత్సహించేలా పరిశ్రమల శాఖలో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పి కార్యదర్శిని నియమించాలని ఆదేశించారు. డిగ్రీలకు తోడు నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా పరిశ్రమలకు నిపుణులైన మానవ వనరులను అందుబాటులోకి తేవాలన్నారు. రూ.3,39,959 కోట్ల పెట్టుబడులకు ఆమోదం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పది దఫాలు ఎస్ఐపీబీ సమావేశాలను నిర్వహించిం 59 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు అధికారులు తెలిపారు. వీటిద్వారా రూ.3,39,959 కోట్ల పెట్టుబడులు రానుండగా 2,34,378 మందికి ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో పరిశ్రమలు వాణిజ్య శాఖ తరఫున 100 ఒప్పందాలు చేసుకోగా ఇప్పటికే రూ.2,739 కోట్ల విలువైన 13 ఒప్పందాలు వాస్తవ రూపం దాల్చినట్లు తెలిపారు. వీటిద్వారా 6,858 మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు పనులు మొదలు కానున్నాయి. 2024 జనవరిలోపు 38 కంపెనీలు, మార్చి లోపు మరో 30 కంపెనీలు పనులు పూర్తి చేసుకుని ఉత్పత్తిని ప్రారంభిస్తాయని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో భాగస్వామ్య సదస్సుల్లో 1,739 ఎంవోయూల ద్వారా రూ. 18,87,058 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకోగా 10 శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదన్నారు. విశాఖ ఖ్యాతిని పెంచేలా ఐటీ హబ్ ఐటీ, ఐటీ ఆధారిత సేవలకు విశాఖను హబ్‌గా తీర్చిదిద్దేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రముఖ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలన్నారు. దీనివల్ల విశాఖ నగర ఖ్యాతి పెరిగి ఐటీకి చిరునామాగా మారుతుందన్నారు. గత గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఐటీ, ఐటీ ఆధారిత, ఎలక్ట్రానిక్స్ రంగంలో రూ.44,963 కోట్ల విలువైన 88 ఒప్పందాలు కుదిరినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇప్పటికే 85 శాతం కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించడం / ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. జీఐఎస్‌లో కుదిరిన పెట్టుబడుల్లో ఇప్పటికే రూ.38,573 కోట్లు వాస్తవ రూపం దాల్చినట్లు తెలిపారు. రూ.8.85 లక్షల కోట్ల విద్యుత్ ప్రాజెక్టులు విశాఖ సదస్సు ద్వారా 25 విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు కుదుర్చుకోగా 8 ఎస్ఐపీబీ ఆమోదం కోసం పంపినట్లు అధికారులు తెలిపారు. మరో నాలుగు ప్రాజెక్టుల్లో పనులు ప్రారంభం కానుండగా మరో 8 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. విశాఖ సదస్సు కంటే ముందు 20 విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాలు కుదరగా 6 ప్రాజెక్టుల్లో పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మరో 11 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధమైనట్లు అధికారులు పేర్కొన్నారు. వీటి ద్వారా రూ.8.85 లక్షల కోట్ల పెట్టుబడులతో 1,29,650 మందికి ఉద్యోగాలు లభించనున్నట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడుల ప్రతిపాదనలను వీలైనంత త్వరగా కార్యరూపంలో తెచ్చేలా కృషి చేయాలని సీఎం ఆదేశించారు. డిమాండ్‌లో తరచూ తీవ్ర వ్యత్యాసం ఉండే టమాటా, ఉల్లి లాంటి పంటల విషయంలో ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పే పనులను వేగవంతం చేయాలన్నారు. నాలుగేళ్లలో వృద్ధి బాగుంది – స్థిర ధరల సూచీ ప్రకారం 2019లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి 5.36 శాతం. ఇది దేశ సగటు 6.5 శాతం కన్నా తక్కువ – గత నాలుగేళ్లలో మాత్రం రాష్ట్రం మంచి ప్రగతి సాధించింది ట – 2021–22లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 11.43 శాతానికి పెరిగింది – 2022–23లో జీఎస్డీపీలో గ్రోత్ రేట్ 16.22 శాతంగా ఉంది. – ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా నంబర్ వన్ స్థానంలో నిలుస్తున్న ఏపీ – జీడీఎస్‌డీపీలో రాష్ట్ర పారిశ్రామిక రంగం వాటా దాదాపు రూ.13 లక్షల కోట్లు. పారిశ్రామికరంగం వాటా 21 నుంచి 23 శాతానికి పెరుగుదల. – 2022 జనవరి – డిసెంబరు మధ్య రాష్ట్రానికి రూ.45,217 కోట్ల పెట్టుబడుల రాక. – 2022–23లో రాష్ట్రం నుంచి రూ.1.6 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తుల ఎగుమతి. – 2021–22లో ఎగుమతుల విలువ రూ.1.43 లక్షల కోట్లు కాగా గత ఆర్థిక సంవత్సరంలో రూ. రూ.1.6 లక్షల కోట్లకు పెరుగుదల. -
పరిశ్రమకు ‘ప్రోత్సాహం’
సాక్షి, హైదరాబాద్: పారిశ్రా మికాభివృద్ధి ప్రోత్సాహకాల కు పెద్దపీట వేస్తూ పారిశ్రా మిక రంగానికి 2023–24 రాష్ట్ర వార్షిక బడ్జెట్లో రూ.4,037 కోట్లు ప్రతిపాదించారు. ప్రస్తుత (2022–23) బడ్జెట్‌తో పోలిస్తే రూ.817 కోట్లు అదనంగా కేటాయించారు. నిర్వహణ పద్దు కింద రూ.254.77 కోట్లు, ప్రగతి పద్దు కింద వివిధ అవసరాల కోసం రూ.2,235.29 కోట్లు కేటాయించారు. వీటితో పాటు ఎస్సీ అభివృద్ధి నిధి నుంచి రూ.834.67 కోట్లు, ఎస్టీ అభివృద్ధి నిధి నుంచి రూ.717.25 కోట్లు కేటాయించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రూ.2,937.20 కోట్లు (సుమారు 72 శాతం) కేటాయించారు. విద్యుత్ సబ్సిడీకి రూ.316.39 కోట్లు, చిన్న, సూక్ష్మ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు పావలావడ్డీని వర్తింప చేస్తూ రూ.266.20 కోట్లు ప్రతిపాదించారు. నేత కార్మికుల బీమాకు రూ.50 కోట్లు నేత కార్మికుల బీమాకు రూ.50 కోట్లు, పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉన్న చేనేత, జౌళి పరిశ్రమల అభివృద్ధి కోసం రూ.2 కోట్లు చొప్పున కేటాయించారు. ఇసుక తవ్వకానికి టీఎస్ఎండీసీ వెచ్చిస్తున్న ఖర్చులను తిరిగి చెల్లించేందుకు రూ.120 కోట్లు ప్రతిపాదించారు. వాణిజ్యం, ఎగుమతులు, చెరుకు, గనులు, భూగర్భ వనరులు, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్, టీఎస్ లిప్కో తదితరాలకు నామమాత్ర కేటాయింపులే దక్కాయి. ఐటీ రంగానికి రూ.366 కోట్లు ఐటీ రంగానికి నిర్వహణ, ప్రగతి పద్దులను కలుపుకుని రూ.366 కోట్లను తాజా బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత ఏడాదితో పోలిస్తే ప్రగతిపద్దు కింద రూ.6 కోట్ల మేర స్వల్ప పెంపుదల కనిపించింది. టీ హబ్ ఫౌండేషన్‌కు రూ.177.61 కోట్లు, వీ హబ్‌కు రూ.7.95 కోట్లు కేటాయించింది. ఓఎఫ్సీ టెక్నాలజీతో అన్ని మండలాల్లోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల్లో వీడియో సమావేశ సదుపాయాల కోసం రూ.18.14 కోట్లు కేటాయించారు. స్టేట్ ఇన్నోవేషన్ సెల్‌కు రూ.8.88 కోట్లు, టీ ఎలక్ట్రానిక్స్‌కు రూ.8 కోట్లు కేటాయించింది. -
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పారిశ్రామిక పురోగతికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరిస్తే దేశానికి సహకరించినట్లేనని లేఖలో పేర్కొన్నారు. 'దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకంగా మారింది. తెలంగాణకు కేంద్ర ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులను కేటాయించాలి. హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ ఫార్మాసిటీకి బడ్జెట్లో నిధులు కేటాయించాలి. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలి' అని కోరారు. 'హైదరాబాద్- విజయవాడ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి నిధులివ్వాలి. ఆదిలాబాద్‌లో సీసీఐ రీ ఓపెన్ చేయాలి. డిఫెన్స్ ఇండిస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్‌లో హైదరాబాద్‌ను చేర్చాలి. చేనేత రంగానికి జీఎస్టీ మినహాయించాలి. ఐటీఐఆర్ లేదా సమాన ప్రాజెక్టు ఇవ్వాలి. జహీరాబాద్ నిమ్జ్‌కు కూడా నిధులు కేటాయించాలి' అని మంత్రి కేటీఆర్ లేఖలో కోరారు. చదవండి: (అమెరికాలో సంపాదించి.. ఆంధ్రాలో పోటీ చేయాలని..!) -
Andhra Pradesh: అభి'వృద్ధి'లో అగ్రగామి
సాక్షి, అమరావతి: వృద్ధి రేటు పరంగా 2022లో ఆంధ్రప్రదేశ్ రికార్డు నెలకొల్పింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశంలోనే అత్యధిక వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రంగా నిలిచింది. కోవిడ్ సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానాలు, ప్రోత్సాహకాల కారణంగా 2021–22లో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో భారీ వృద్ధి నమోదైంది. కోవిడ్‌కు ముందు 2018–19 చంద్రబాబు హయాంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో వృద్ధి కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. అయితే, 2021–22లో స్థిర ధరల ఆధారంగా వ్యవసాయ రంగంలో 11.27 శాతంతో రెండంకెల వృద్ధి నమోదు కాగా.. పారిశ్రామిక రంగంలో ఏకంగా 12.78 శాతంతో రెండంకెల వృద్ధి నమోదైంది. సేవా రంగంలో కూడా 2018–19 కన్నా 2021–22లో 9.73 శాతం వృద్ధి నమోదైంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 11.43 శాతం వృద్ధి మరోవైపు.. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా 11.43 శాతం వృద్ధి సాధించినట్లు ఆర్బీఐతో పాటు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ నివేదికలు ఇటీవలే వెల్లడించాయి. ఇదే 2018–19 చంద్రబాబు హయాంలో 5.36 శాతమే వృద్ధి నమోదైంది. కోవిడ్ సంక్షోభంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు అండగా నిలవడంవల్లే సాధారణ పరిస్థితులకు మించి రెండంకెల వృద్ధి నమోదవ్వడానికి కారణమని తేలింది. కోవిడ్ కారణంగా రాష్ట్ర సొంత ఆదాయంతో పాటు కేంద్రం నుంచి వచ్చే నిధుల వాటాలో తగ్గుదల ఉన్నప్పటికీ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుంటుపడకుండా అవసరమైన ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించడంతోనే ఈ రంగాలు నిలదొక్కుకుని దేశంలోనే అత్యధిక వృద్ధి సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబడింది. ఆదాయ వనరులు తగ్గినప్పటికీ కూడా ప్రజల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘నవరత్నాలు’ పథకాలను నిరాటంకంగా అమలుచేసింది. దీంతో ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో ఆ ప్రభావం రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధిపైన స్పష్టంగా కనిపించింది. అలాగే, కోవిడ్ ఆంక్షలున్నప్పటికీ వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలు కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. రైతులకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని చెప్పిన తేదీకి ఇవ్వడమే కాకుండా రైతులు పండించిన పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం, రైతులకు అవసరమైన రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పిండం వంటి చర్యలను ప్రభుత్వం పక్కాగా అమలుచేసింది. దీనివల్లే.. 2021–22లో వ్యవసాయ రంగం వృద్ధి 11.27శాతంగా నమోదైంది. అదే 2018–19లో కేవలం 3.54కు పరిమితమైంది. పారిశ్రామిక వృద్ధి ఇలా.. ఇక పారిశ్రామిక రంగం విషయానికొస్తే.. 2018–19లో చంద్రబాబు హయాంలో 3.17 శాతమే వృద్ధి నమోదు కాగా అదే 2021–22లో 12.78 శాతంతో రెండంకెల వృద్ధి నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానంతో పాటు పారిశ్రామిక రాయితీలను సకాలంలో విడుదల చేసింది. 2021–22లో సాధారణ కేటగిరిలో 1,046 ఎంఎస్ఎంఈలకు రూ.191.10 కోట్ల రాయితీలను విడుదల చేసింది. ఓబీసీ కేటగిరిలో 479 ఎంఎస్ఎంఈలకు రూ.101.31 కోట్ల రాయితీలను విడుదల చేసింది. వైఎస్సార్ నవోదయం పేరుతో ఒకసారి ఎంఎస్ఎంఈ రుణాల పునర్వ్యవస్థీకరణ అమలుచేశారు. ఏకంగా 1,78,919 ఖాతాలకు సంబంధించిన రుణాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. దీంతోపాటు 2021–22లో రూ.1,762.31 కోట్ల పెట్టుబడితో 5,907 ఎంఎస్ఎంఈలు ఏర్పాటవ్వడంతో 37,604 మందికి ఉపాధి లభించింది. అలాగే, కోవిడ్ కష్టాల్లోనూ పాక్షిక ఆంక్షలు, నిబంధనలు అమలుచేయడంతో సేవా రంగంలో కూడా 2021–22లో 9.73 % వృద్ధి నమోదైంది. అదే 2018–19 బాబు హయాంలో కేవలం 4.84 శాతమే. 2021–22లో కేంద్రం విడుదల చేసిన నివేదిక మేరకు స్థిర ధరల ఆధారంగా రాష్ట్రాల జీఎస్‌డీపీల శాతం ఇలా.. -
రాష్ట్రంలో రూ.400 కోట్ల ‘ఇంధన’ పెట్టుబడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పరిశ్రమల్లో రూ.400 కోట్ల ఇంధన సామర్థ్య ప్రాజెక్టులు రానున్నాయి. పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు అవసరమైన పెట్టుబడులను సులభంగా అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పరిశ్రమలు, ఆర్థికసంస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు దేశంలో తొలిసారిగా పెట్టుబడుల సదస్సులకు రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. వరుసగా రెండేళ్లు విశాఖపట్నంలో రాష్ట్ర ఇంధన శాఖకు చెందిన ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ఈ పెట్టుబడుల సదస్సులు నిర్వహించింది. ఈ సదస్సులు ఆదర్శంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) మరికొన్ని రాష్ట్రాల్లో ఈ తరహా సదస్సులు ఏర్పాటుచేసింది. పెట్టుబడిదారులు, పరిశ్రమల మధ్య సమన్వయం కోసం కొద్దిరోజుల కిందట ఒక ఫెసిలిటేషన్ సెంటర్‌ను కూడా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సుల్లో 73 పారిశ్రామిక ఇంధన పొదుపు ప్రాజెక్టులను గుర్తించింది. వీటిద్వారా రూ.2,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో వాటి జాబితాను విడుదల చేసింది. దాని ప్రకారం 14 ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆదర్శంగా ఏపీ సిమెంట్, స్టీల్, పవర్ప్లాంట్లు, ఫెర్టిలైజర్లు, కెమికల్స్, టెక్స్టైల్స్ రంగాలకు చెందిన ఈ 73 ప్రాజెక్టుల ప్రతిపాదనల్లో 45 ప్రాజెక్టులను బీఈఈ ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద నమోదైన 22 ఆర్థికసంస్థలకు సిఫార్సు చేసింది. వీటిని అమల్లోకి తీసుకురావడం వల్ల ఆయా పరిశ్రమల్లో సుమారు 125 ఇంధన సామర్థ్య సాంకేతిక మార్పులు చేపట్టవచ్చు. ఇందుకు రూ.2,218 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీనివల్ల ఏడాదికి 67.06 లక్షల మెగా వాట్ అవర్ (ఎండబ్ల్యూహెచ్) విద్యుత్ ఆదా అవుతుంది. 49,078 మెట్రిక్ టన్నుల బొగ్గు, 2.56 కోట్ల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎస్సీఎం) సహజ వాయువు, 95 వేల లీటర్ల హైస్పీడ్ డీజిల్ ఆదా అవుతాయి. 6.2 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ఫలితంగా పరిశ్రమల్లో ఉత్పాదకత, ఆదాయాలు మెరుగుపడతాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య కార్యక్రమాల ద్వారా దాదాపు రూ.3,800 కోట్ల విలువైన 5,600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయింది. తద్వారా 4.76 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించి రాష్ట్రం దేశానికి ఆదర్శమైంది. అదితితో సమన్వయం పెట్టుబడుల ప్రక్రియను సులభతరం చేయడానికి ‘అదితి’ పేరుతో రూపొందించిన ప్రత్యేక వెబ్ పోర్టల్‌ని న్యూఢిల్లీలో సోమవారం బీఈఈ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా బీఈఈ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఇంధన సామర్థ్య ప్రాజెక్టులు చేపట్టే పరిశ్రమలకు ఐదుశాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని ఏపీ చేసిన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల అమలులో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను అభినందించారు. రాష్ట్రం నుంచి వచ్చిన మరిన్ని ప్రాజెక్టులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఏపీ నుంచి ఈ సదస్సుకు హాజరైన ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పగటిపూట రైతుకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తూనే, పరిశ్రమలకు, గృహాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. బీఈఈ డైరెక్టర్ వినీత కన్వాల్ మాట్లాడుతూ పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థికసంస్థల మధ్య బీఈఈ ఫెసిలిటేషన్ సెంటర్ సమన్వయకర్తగా పనిచేస్తుందని చెప్పారు. -
Pre-Budget 2023: ఉపాధి కల్పనే ధ్యేయంగా బడ్జెట్..
న్యూఢిల్లీ: వినియోగాన్ని పెంచడానికి ఉపాధి కల్పనే ధ్యేయంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) బడ్జెట్‌ను రూపొందించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పారిశ్రామిక రంగం విజ్ఞప్తి చేసింది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ), వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబ్‌లను హేతుబద్ధీకరించాలని, తద్వారా పన్ను బేస్‌ను విస్తృతం చేసే చర్యలపై బడ్జెట్ దృష్టి పెట్టాలని ఆర్థిక మంత్రితో సోమవారం జరిగిన వర్చువల్ ప్రీ–బడ్జెట్ సమావేశంలో కోరాయి. ఈ సమావేశంలో తమ ప్రతినిధులు చేసిన సూచనలపై పారిశ్రామిక వేదికలు చేసిన ప్రకటనల ముఖ్యాంశాలు.. ప్రైవేటీకరణకు ప్రాధాన్యం: సీఐఐ ‘అంతర్జాతీయ పరిణామాలు కొంతకాలం పాటు అననుకూలంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో దేశీయ డిమాండ్, అన్ని రంగాల పురోగతి, వృద్ధి పెంపునకు చర్యలు అవసరం. ఉపాధి కల్పనను ప్రోత్సహించడం ద్వారా మన దేశీయ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దూకుడుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడి తప్పకుండా చూడ్డానికి పెట్టుబడులకు దారితీసే వృద్ధి వ్యూహంపై దృష్టి పెట్టాలి. మూలధన వ్యయాల కేటాయింపుల పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఉపాధి కల్పనను పెంచేందుకు ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టాలి. ముఖ్యంగా పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. వ్యాపారాలకు సంబంధించి పన్ను ఖచ్చితత్వం అవసరం. ఇందుకుగాను కార్పొరేట్ పన్ను రేట్లను ప్రస్తుత స్థాయిలో కొనసాగించాలి. పన్నుల విషయంలో మరింత సరళీకరణ, హేతుబద్ధీకరణ, చెల్లింపులో సౌలభ్యత, వ్యాజ్యాల తగ్గింపు ప్రధాన ప్రాధాన్యతలుగా ఉండాలి’ అని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ పేర్కొన్నారు. పంచముఖ వ్యూహం: పీహెచ్‌డీసీసీఐ ‘కేంద్ర బడ్జెట్ (2023–24) భౌగోళిక–రాజకీయ అనిశ్చితులు, అధిక ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం వంటి కీలకమైన తరుణంలో రూపొందుతోంది. ఈ తరుణంలో స్థిరమైన ఆర్థిక వృద్ధి పథాన్ని కొనసాగించడానికి, దేశీయ వృద్ధి వనరులను పెంపొందించడానికి కీలక చర్యలు అవసరం. ముఖ్యంగా ప్రైవేట్ పెట్టుబడులను పునరుద్ధరించడానికి పంచముఖ వ్యూహాన్ని అవలంభించాలి. వినియోగాన్ని పెంచడం, కర్మాగారాల్లో సామర్థ్య వినియోగాన్ని పెంచడం, ఉద్యోగాల అవకాశాల కల్పన, సామాజిక మౌలిక సదుపాయాల నాణ్యతను మెరుగుపరచడం, భారతదేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం వంటి చర్యలు ఇందులో కీలకమైనవి’అని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సాకేత్ దాల్మియా సూచించారు.æ శుక్రవారం రాష్ట్రాల ఆర్థికమంత్రులతో భేటీ కాగా, ఆర్థికమంత్రి సీతారామన్ వచ్చే శుక్రవారం (25వ తేదీ) రాష్ట్రాల ఆర్థికమంత్రులతో న్యూఢిల్లీలో ప్రీ–బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. -
23న విశాఖలో ఇంధన సామర్థ్య పెట్టుబడుల సదస్సు
సాక్షి, అమరావతి: ఇంధన సామర్థ్యం పెట్టుబడుల సదస్సు (ఇన్వెస్ట్మెంట్ బజార్)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) సమన్వయంతో 23న విశాఖలో నిర్వహించనున్నట్టు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే ప్రకటించారు. రాష్ట్ర ఇంధన శాఖ, ఏపీఎస్ఈసీఎం అధికారులతో ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్య సాంకేతికతను అందుబాటులోకి తేవటం, దానిని వినియోగించుకోవడం కోసం పరిశ్రమలకు ఆర్థిక సహకారం అందించడమే లక్ష్యంగా ఆసక్తి గల పరిశ్రమలను, బ్యాంకులను, ఆర్థిక సంస్థలను ఒకే వేదిక పైకి తెచ్చేందుకు సదస్సును నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఇన్వెస్ట్మెంట్ బజార్ వేదికగా పెట్టుబడులకు అవకాశమున్న ప్రాజెక్టులను గుర్తిస్తామని, సదస్సులో ఎంపికైన పరిశ్రమలకు ప్రాజెక్టులు అమలు చేసేందుకు ఆర్థిక సహకారం అందే ఏర్పాటు చేస్తామని అభయ్ బాక్రే చెప్పారు. గతేడాది మార్చిలో ఇదే విశాఖలో దేశంలో తొలిసారిగా ఇంధన సామర్థ్య పెట్టుబడుల సదస్సును నిర్వహించిన ఘనత ఏపీకి దక్కుతుందని, విద్యుత్ రంగంలో ప్రత్యేకించి ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో ఏపీ పనితీరును గుర్తించి మరోసారి విశాఖలో సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పరిశ్రమల నుంచి ఏపీఎస్ఈసీఎంకు ప్రతిపాదనలు వస్తే వాటికి అవసరమైన సాంకేతిక ప్రక్రియ నిర్వహించి, ఆర్థిక సంస్థలకు పంపుతామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. సమావేశంలో ఏపీఎస్ఈసీఎం సీఈవో చంద్రశేఖరరెడ్డి, ఇంధన శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పారిశ్రామిక రంగానికి ‘సెప్టెంబర్’ ఊరట
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం సెప్టెంబర్‌లో కొంత సానుకూల ఫలితాన్ని సాధించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సమీక్షా నెల్లో 3.1 శాతం (2021 ఇదే నెలతో పోల్చి) పెరిగింది. తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాలు సెప్టెంబర్‌లో మంచి ఫలితాలను అందించినట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పే ర్కొంది. ఆగస్టులో ఐఐపీలో అసలు వృద్ధిలేకపోగా 0.7% క్షీణతను నమోదుచేసుకుంది. జూలై లో వృద్ధి కేవలం 2.2%. అయితే 2021 సెప్టెంబర్‌లో పారిశ్రామిక వృద్ధి 4.4 శాతంకన్నా, తాజా వృద్ధి రేటు తక్కువగానే ఉండడం గమనార్హం. ► తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు దాదాపు 70 శాతం వెయిటేజ్ కలిగిన తయారీ రంగం సమీక్షా నెల్లో 1.8 శాతం పురోగమించింది. 2021 ఇదే నెల్లో వృద్ధి 4.3 శాతం. ► విద్యుత్: ఈ రంగం వృద్ధి రేటు 11.6%గా ఉంది. 2021 ఇదే నెల్లో ఈ రేటు కేవలం 0.9%. ► మైనింగ్: వృద్ధి 8.6% నుంచి 4.6%కి తగ్గింది. ► క్యాపిటల్ గూడ్స్: ఉత్పత్తి 10.3 శాతం పెరిగింది. 2021 ఇదే నెల్లో ఈ రేటు 3.3 శాతం. ► కన్జూమర్ డ్యూరబుల్స్: 4.5% క్షీణించింది. గతేడాది ఈ నెల్లో 1.6% వృద్ధి జరిగింది. ఆరు నెలల్లో 7 శాతం పురోగతి కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (2022–23, ఏప్రిల్–సెప్టెంబర్) ఐఐపీ వృద్ధి రేటు 7 శాతంగా నమోదైంది. -
స్టార్టప్‌లకు ‘కల్పతరువు’
సాక్షి, అమరావతి: పారిశ్రామికరంగంలో నాలుగో తరం టెక్నాలజీ ఆవిష్కరణలకు విశాఖ వేదిక అవుతోంది. విశాఖ ఉక్కు (ఆర్ఐఎన్ఎల్)తో కలిసి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) సంయుక్తంగా ‘కల్పతరువు’ పేరుతో ఏర్పాటుచేసిన ఇండస్ట్రీ–4.0 సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ) కార్యకలాపాలు సెప్టెంబర్ 20 నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. దేశంలోని స్టార్టప్‌లను ఆకర్షించేలా ఓపెన్ చాలెంజ్ ప్రోగ్రాం–1 (ఓసీపీ–1)ను కల్పతరువు సీఓఈ ప్రకటించింది. విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు ఆర్ఐఎన్ఎల్, ఎన్టీపీసీ, వైజాగ్ పోర్టు, హెచ్‌పీసీఎల్ వంటి పరిశ్రమల్లో మానవ వనరుల వినియోగం తగ్గించి ఖర్చులను నియంత్రించే నూతన టెక్నాలజీ ఆవిష్కరణలను పెంచి తద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు కల్పతరువు సీవోఈని ఏర్పాటుచేసినట్లు ఎస్టీపీఐ విశాఖ అడిషనల్ డైరెక్టర్ సురేష్ ‘సాక్షి’కి తెలిపారు. ఇందులో భాగంగా.. ముందుగా విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన ఆరు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఓసీపీ–1 పేరుతో స్టార్టప్‌లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో సమస్యకు ఇండస్ట్రీ–4 టెక్నాలజీతో చక్కటి పరిష్కరం చూపిన ప్రోటోటైప్ స్టార్టప్‌ను ఎంపికచేసి రూ.4 లక్షలు బహుమతిగా ఇవ్వడమే కాక, కల్పతరువు సీవోఈ ద్వారా ప్రాజెక్టు ఫండింగ్ సౌకర్యం కల్పిస్తారు. పరిశ్రమల్లో ఆటోమేషన్ పెంచేందుకు బిలియన్ డాలర్లు వ్యయం చేస్తున్నారని, ఇందులో నూతన ఆవిష్కరణలకు విశాఖ వేదిక కానుందని కల్పతరువు ప్రాజెక్టు మేనేజ్మెంట్ గ్రూపు సభ్యుడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) ప్రెసిడెంట్ శ్రీధర్ కోసరాజు తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి సౌరభ్ గార్గ్, ఆర్ఐఎన్ఎల్ సీఎండీ, కేంద్ర ఐటీ శాఖ అధికారులతో వర్చువల్‌గా మంగళవారం ఓసీపీ–1ను ప్రారంభించనున్నారు. రూ.20 కోట్లతో ‘కల్పతరువు’ సుమారు రూ.20 కోట్లతో కల్పతరువు ఇండస్ట్రీ–4 సీవోఈ అభివృద్ధి చేస్తున్నారు. ఆరు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ సీవోఈ పనులు వేగంగా జరుగుతున్నట్లు సురేష్ తెలిపారు. ఇప్పటికే ల్యాబ్ పనులు మొదలయ్యాయని, రెండు నెలల్లో ఈ సీవోఈని అధికారికంగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఓసీపీ–1లో ఎంపికైన స్టార్టప్‌లతో కల్పతరువును ప్రారంభించడానికి ఓపెన్ ఛాలెంజ్ ప్రోగ్రాంను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ పోటీలో గెలిచిన స్టార్టప్‌లు కల్పతరువులో ఏర్పాటుచేసిన ల్యాబొరేటరీ, ఇంక్యుబేషన్ వినియోగించుకోవడంతోపాటు ఎస్టీపీఐ నుంచి ఫైనాన్సింగ్, మానిటరింగ్ సహకారం లభిస్తాయి.