పరిశ్రమలో ఇంధన సామర్థ్యం, సాంకేతికత అభివృద్ధికి పెర్ఫార్మ్, అచీవ్ ట్రేడ్ పథకం అమలు
రాష్ట్రంలో ఇప్పటి వరకూ పూర్తయిన మూడు ‘పాట్’ సైకిల్స్
పాట్ సైకిల్–3 వరకు 1.16 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వెలెంట్ (ఎంటీఓఈ) ఇంధనం ఆదా
ఎనర్జీ ఎఫిషియన్సీ పాలసీతో ఏటా 16,875 మిలియన్ యూనిట్లు ఆదా లక్ష్యం
పాట్ అమలులో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం, సమర్ధవంతంగా ఇంధన వ్యయాన్ని తగ్గించడం, కర్భన ఉద్గారాలను కట్టడి చేయడం వంటి లక్ష్యాలను సాదించడంలో భాగంగా, పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్ (పాట్) పథకం ద్వారా భారీ పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యం, సాంకేతికతను ప్రవేశ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోంది. పాట్ సైకిల్–3 వరకు 1.16 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వెలెంట్ (ఎంటీఓఈ) ఇంధనాన్ని రాష్ట్రం ఆదా చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎనర్జీ ఎఫిషియన్సీ పాలసీని కూడా రూపొందించింది. ఈ పాలసీ వల్ల ఏటా 16,875 మిలియన్ యూనిట్లు (మొత్తం డిమాండ్‌లో 25.6 శాతం) ఆదా అవుతుందని, వాటి విలువ రూ.11,779 కోట్లుకు పైగానే ఉంటుందని అంచనా. తద్వారా దాదాపు 14.34 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గే అవకాశం ఉంది.
ప్రయోజనాలు ఎన్నో..
ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవటం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయటమే కాకుండా పారిశ్రామిక ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించవచ్చు. తద్వారా ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ‘పాట్’ పథకానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. నూతన ఇంధన సామర్ధ్య సాంకేతికత సహాయంతో తక్కువ విద్యుత్‌తో ఎక్కువ పారిశ్రామిక ఉత్పత్తి సాధించడంపై పారిశ్రామికవేత్తలకు అవగాహన కలి్పస్తోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఆధారిత పరికరాలను సమకూరుస్తోంది. రాష్ట్రంలో 65 ఎంఎస్‌ఎంఈల్లో వీటిని అమర్చింది.
ఇవి విద్యుత్ వినియోగాన్ని, యంత్రాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన సూచనలు అందించడం ద్వారా ఇంధన ఆదాకు దోహదపడుతున్నాయి. దీంతో సరిపెట్టకుండా పాట్ పథకం కింద లక్ష్యాలను సాధించిన పరిశ్రమలకు ఇంధన పొదుపు సరి్టఫికెట్లను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ద్వారా అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 4 లక్షలకు పైగా సర్టిఫికెట్లను అందించింది. వీటిని మార్కెట్లో విక్రయించడం ద్వారా ఆయా పరిశ్రమలు ఆరి్థక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.
భారీ పరిశ్రమల్లో ప్రత్యేకంగా విద్యుత్ క్యాప్టివ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. దీనివల్ల పరిశ్రమలు విద్యుత్‌పై చేసే వ్యయం తగ్గుతుంది. మరోవైపు పరిశ్రమలలో ఆధునిక విధానాల్లో ఇంధనాన్ని సక్రమంగా వినియోగించే సాంకేతికతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం పాట్ పథకాన్ని అమలు చేస్తోంది.
ఆదర్శంగా నిలుస్తున్న ఏపీ
2030 నాటికి దేశ వ్యాప్తంగా 1 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించాలని, 2070 నాటికి వాటిని అసలు లేకుండా చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధనలో ఏపీ చురుకైన పాత్ర పోషిస్తోంది. 65 సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఐఓటీ ఆధారిత ఎనర్జీ ఎఫిషియన్సీ డెమోన్‌్రస్టేషన్ ప్రాజెక్టుల అమలు, న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఇంధన సామర్థ్య చర్యలు, పెర్ఫార్మ్, అచీవ్ – ట్రేడ్ (పాట్)లో పథకంలో 1.160 మిలియన్ టన్నుల చమురుకు సమానమైన ఇంధన పొదుపు, స్థానిక సంస్థల్లో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) అమలు వంటి కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా ఏపీకి గుర్తింపుతెచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment