
సాక్షి, అమరావతి: పారిశ్రామిక ఇంధన పొదుపులో ఆంధ్రప్రదేశ్ పురోగతి సాధిస్తోందని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ప్రశంసించింది. రాష్ట్ర ఇంధన శాఖ ఈ విషయాన్ని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. పారిశ్రామిక రంగంలో కేంద్రం అమలు చేస్తోన్న ‘పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్’ (పాట్) పథకంలో ఏపీ అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపింది. పలు పరిశ్రమల్లో రూ.1,600 కోట్ల విలువైన 2,386 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఏపీ పొదుపు చేసిందని వివరించింది. విద్యుత్ వినియోగం అధికంగా ఉండే సిమెంట్, ఫెర్టిలైజర్స్, పవర్ జనరేషన్, పేపర్ అండ్ పల్ప్, రసాయన రంగాలకు చెందిన 22 పరిశ్రమల్లో ‘పాట్’ పకడ్బందీగా అమలు చేసినట్లు ఇంధన శాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment