Department of Energy
-
కరెంట్ కోత.. చార్జీల మోత
మా ఇంటికి రూ.10 వేలు విద్యుత్ బిల్లు వచ్చింది. మాకేమీ ఏసీలు లేవు. లైన్‌మెన్‌ని అడిగితే ఫ్రిజ్ ఉన్నందున ఎక్కువ వాడి ఉంటారంటున్నారు. చివరకు అప్పు చేసి బిల్లు కట్టేశాం.– చిన్నం వెంకటేష్, ఎం.ఎం.పురం, ఏలూరు జిల్లాబోణం గణేష్, ఏలూరు జిల్లా మల్కీమహ్మద్పురం నుంచి సాక్షి ప్రతినిధికరెంట్ బిల్లులు శీత కాలంలోనూ ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి! ఒకపక్క ప్రతి నెలా రూ.వందలు... వేలల్లో బిల్లులు రావడం.. మరోపక్క చలి కాలంలోనూ కోతలు విధించడంతో దోమల బాధతో నిద్రలేని కాళరాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికే రూ.6,072.86 కోట్ల మేర విద్యుత్తు చార్జీల భారాన్ని మోపి హై వోల్టేజీ షాకులిచ్చిన కూటమి సర్కారు జనవరి నుంచి మరో రూ.9,412.50 కోట్ల చార్జీల భారాన్ని అదనంగా వేయనుండటం వినియోగదారులను గజగజ వణికిస్తోంది. ఆర్నెలల్లోనే రూ.9,412.50 కోట్ల విద్యుత్తు చార్జీల భారాన్ని మోపడం.. మరోపక్క సంక్షేమ పథకాలు నిలిచిపోవడం.. నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశన్నంటడంతో ప్రజలు అల్లాడుతున్నారు. ‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచం.. పైగా తగ్గిస్తాం.. నేను గ్యారెంటీ..!’ అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం మాట తప్పి రాష్ట్ర ప్రజలకు వరుసగా విద్యుత్ షాక్‌లు ఇస్తోంది. వాడకం తక్కువగా ఉండే శీతకాలంలోనే బిల్లులు ఇలా పేలిపోతుంటే వేసవిలో ఏ స్థాయిలో షాక్‌లు ఉంటాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్‌ను దూరం చేసి బిల్లులతో బాదేస్తున్న కూటమి ప్రభుత్వం ఇతర వర్గాలపైనా పెనుభారం మోపింది. వినియోగం తక్కువే.. అయినా కోతలురాష్ట్రంలో ప్రస్తుతం 194.098 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. డిమాండ్ అనుగుణంగా సరఫరా చేయలేక రాష్ట్రవ్యాప్తంగా సగటున 2 నుంచి 3 గంటల పాటు కోతలు విధిస్తున్నారు. వాడకం ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు అనధికారికంగా కోతలు అమలు చేస్తున్నారు. అధికారిక నివేదికల్లో విద్యుత్ లోటు, కోతలు లేవంటూ బుకాయిస్తున్నారు. నిజానికి గతేడాది కంటే 1.17 శాతం తక్కువగా విద్యుత్ డిమాండ్ ఉన్నా కూడా అందించేందుకు ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. గత సర్కారు మండు వేసవిలోనూ, తీవ్ర బొగ్గు సంక్షోభంలోనూ విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేసింది. కరెంట్ కష్టాలు చెప్పుకోలేక..ఏలూరు జిల్లా మల్కీమహ్మద్పురం (ఎం.ఎం.పురం) గ్రామంలో నెలకొన్న పరిస్థితులు రాష్ట్రంలో ప్రజల కరెంట్ కష్టాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పల్లపూరుగా పిలుచుకునే ఏలూరు జిల్లా ఎం.ఎం పురంలో ప్రజలంతా పేద, మధ్యతరగతి వారే. తెల్లవారుజామునే నిద్రలేచి, కూలి పనులకు వెళుతుంటారు. చుట్టు పక్కల వ్యవసాయ పనులు దొరక్కపోవడంతో దాదాపు 40 కి.మీ. దూరంలో ఉన్న హనుమాన్ జంక్షన్ వరకూ వెళ్లి రాత్రికి ఇంటికి చేరుతుంటారు. ఇంటికి వచ్చాక సేదదీరుదామంటే విద్యుత్ లేక ఫ్యాన్లు పనిచేయడం లేదు. దోమలతో తెల్లవార్లూ జాగారం చేయాల్సిన పరిస్థితి! అది చాలదన్నట్టు కరెంటు బిల్లులు షాక్ ఇస్తున్నాయి. వారి కష్టాల గురించి చెబితే పింఛన్లు తీసేస్తారని, రేషన్ కార్డు పోతుందని అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారు. నిబంధనల ప్రకారమే..రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ సరఫరా నిలిచిందంటే అది స్థానిక పరిస్థితుల కారణంగా జరిగి ఉంటుంది. అధికారికంగా ఎలాంటి విద్యుత్ కోతలు అమలు చేయడం లేదు. విద్యుత్ బిల్లులు కూడా నిబంధనల ప్రకారమే వేస్తున్నాం. ఎవరికైనా ఎక్కువ వేశారనిపిస్తే అధికారుల దృష్టికి తేవచ్చు. –కె.విజయానంద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ‘ఈ చిత్రంలో కనిపిస్తున్న అవ్వ పేరు సింగారపు పాపమ్మ. ఏలూరు జిల్లా మల్కీ మహ్మద్‌పురం (ఎంఎం పురం)లో నివసిస్తోంది. భర్త చుక్కయ్య, ఇద్దరు కుమారులు చనిపోవడంతో పిడికెడు మెతుకుల కోసం ఏడు పదుల వయసులోనూ పని మనిషిగా చేస్తూ ఒంటరిగా బతుకుతోంది. పగలంతా పనిచేసి రాత్రి ఎప్పటికో ఇంటికి చేరుతుంది. ఒక ఫ్యాను, సెకండ్ హ్యాండ్లో కొన్న చిన్న టీవీ, ఓ లైటు మినహా ఆమె ఇంట్లో మరో విద్యుత్ ఉపకరణం లేదు. అలాంటప్పుడు ఆమె ఇంటికి విద్యుత్ బిల్లు ఎంత రావాలి? మహా అయితే వందో.. రెండొందలో కదా! కానీ నవంబర్‌లో వినియోగానికి సంబంధించి ఈ నెల పాపమ్మకు వచ్చిన బిల్లు ఎంతో తెలుసా? ఏకంగా రూ.1,345.39. అది తెలిసి గుండె ఆగినంత పనైందని ఆ వృద్ధురాలు ‘సాక్షి’తో తన గోడు చెప్పుకుంది. ఇంత బిల్లు వేస్తున్నా కరెంట్ సవ్యంగా సరఫరా కావడం లేదు. చీకట్లో చేతులు కాల్చుకోవాల్సి వస్తోంది. ఇంకా దారుణమేమిటంటే ఎస్సీ సామాజికవర్గానికి చెందిన పాపమ్మకు గత ప్రభుత్వంలో ఉచితంగా విద్యుత్ అందగా ఇప్పుడు రూ.వేలల్లో బిల్లులు రావడం!!శుక్రవారం, మంగళవారం అసలు కరెంటు ఉండదు మా ఊరిలో శుక్రవారం, మంగళవారం కరెంటు ఉండదు. మిగతా రోజుల్లోనూ గంటల తరబడి తీసేస్తున్నారు. చార్జీలు మాత్రం భారీగా పెంచేశారు. పాచి పని చేసుకునేవాళ్లకు కూడా రూ.వేలల్లో బిల్లులు వేస్తున్నారు. ఇదేం ప్రభుత్వమో ఏంటో?. – ఓగిరాల లక్ష్మీ, ఎంఎం పురం, ఏలూరు జిల్లా రోజూ కరెంటు పోతోంది రాత్రిళ్లు 11 గంటలకు తీసేసి తెల్లవారుజాము రెండుకో, మూడుకో ఇస్తున్నారు. దోమలు కుట్టి రోగాల బారిన పడుతున్నాం. రోజూ కరెంటు పోతోంది. చిన్న పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కాలంలో కరెంటు కోతలు మేమెప్పుడూ చూడలేదు. – అంజమ్మ, ఎంఎం పురం, ఏలూరు జిల్లా జగనన్న అధికారంలో ఉండగా మేం బిల్లు కట్టాల్సి రాలేదుజగనన్న అధికారంలో ఉండగా మేం కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు బిల్లులు కట్టమని ఇంటికి వస్తున్నారు. కరెంటు మాత్రం రాత్రి, పగలూ అనే తేడా లేకుండా తీసేస్తున్నారు. – సరోజిని, ఎంఎం పురం, ఏలూరు జిల్లా -
రైతుల పొలాల్లో సోలార్ ప్లాంట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతుల పంట పొలాల్లో 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీఎం కుసుమ్ (ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవమ్ ఉత్థాన్ మహాభియాన్) పథకం కింద 2024–25 ఆర్థిక సంవత్సరంలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ పథకానికి సంబంధించి తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో)ను నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఏడాదిలో 300 రోజుల పాటు సౌరవిద్యుత్ ఉత్పాదనకు అనుకూలత ఉంది. చిన్న చిన్న ప్లాంట్లతో.. పీఎం కుసుమ్ పథకం కింద 2026 డిసెంబర్ 31 నాటికి దేశవ్యాప్తంగా 30,800 మెగావాట్ల సామర్థ్యమున్న సౌర విద్యుత్ ప్లాంట్లను రైతుల పంట పొలాల్లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పొలాల్లో 0.5 మెగావాట్ల నుంచి 2 మెగావాట్ల వరకు సామర్థ్యం కలిగిన ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్రంలో సౌర విద్యుత్ కేంద్రాల స్థాపనకు పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నా.. రైతులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి, ఉత్తర్వులు జారీ చేసింది.త్వరలో సబ్స్టేషన్ల వారీగా నోటిఫికేషన్ రాష్ట్రంలోని అన్ని 33/11 కేవీ సబ్ స్టేషన్ల వారీగా ఎంత స్థాపిత సామర్థ్యంతో కొత్త సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశాలున్నాయో వెల్లడిస్తూ త్వరలో డిస్కంలు నోటిఫికేషన్ ఇస్తాయి. ఆయా సామర్థ్యం మేరకు సౌర విద్యుత్ కేంద్రాల స్థాపనకు రైతుల నుంచి రెడ్కో దరఖాస్తులను స్వీకరించనుంది. రైతులు వ్యక్తిగతంగా, సంఘాలుగా, సహకార సంఘాలుగా ఏర్పడి వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. మహిళా గ్రూపులకు ప్రాధాన్యత స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ), మండల సమాఖ్యలు కూడా రైతుల నుంచి పొలాలను లీజుకు తీసుకుని సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు. ప్లాంట్ల మంజూరులో వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సౌర విద్యుత్ కేంద్రాల స్థాపనకు అవకాశమిచ్చి సంఘాల మహిళలను కోటీశ్వరులు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంత ఎస్‌హెచ్‌జీల్లోని మహిళలు రైతు కుటుంబాల వారేకావడంతో.. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు రైతుల చేతుల్లోనే ఉండనుంది. ఎస్‌హెచ్‌జీలకు పావలా వడ్డీకే రుణాలు లభిస్తాయి. ఒక మెగావాట్ ప్లాంట్ నుంచి ఏడాదికి సగటున 15 లక్షల యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. అంటే సుమారు రూ.45 లక్షల ఆదాయం వస్తుంది. మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఆరు ఎకరాల స్థలం, రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు వ్యయం అవుతుంది. ఈ మేరకు బ్యాంకులు రుణం ఇవ్వనున్నాయి. కరెంటు కొననున్న డిస్కంలు రైతులు తమ పొలాల్లో ఏర్పాటు చేసుకునే సౌర విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కొనుగోలు చేస్తాయి. ఒక్కో యూనిట్ విద్యుత్‌కు రూ.3.13 ధరను తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఇప్పటికే ఖరారు చేసింది. సోలార్ ప్లాంట్లలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో రైతులు తమ వ్యవసాయ అవసరాలకు వాడుకోగా.. మిగిలిన విద్యుత్‌ను డిస్కంలకు విక్రయించవచ్చు. డిస్కంలు ప్రస్తుతం సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి సగటున యూనిట్‌కు రూ.2.58 ధరతో విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. రైతులకు మాత్రం కాస్త ఎక్కువగా యూనిట్‌కు రూ.3.13 ధర చెల్లించనున్నాయి. -
జలకళ ఉన్నా హై‘డల్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కృష్ణా పరీవాహకంలోని జలాశయాలన్నీ పూర్తిగా నిండటంతో రోజూ లక్షల క్యూసెక్కుల వరదను కిందకు విడుదల చేస్తున్నా పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు జలవిద్యుదుత్పత్తి చేసుకొనే అవకాశం లేకుండా పోయింది. ఎగువ జూరాల, దిగువ జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రాలకు మరమ్మతులు నిర్వహించకుండా ఏడాదిగా తాత్సారం చేయడంతో రోజుకు రూ. 4 కోట్ల విలువ చేసే 7.93 మిలియన్ యూనిట్ల జలవిద్యుదుత్పత్తికి గండిపడుతోంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే మరమ్మతులు నిర్వహించాల్సి ఉండగా సత్వర నిర్ణయాలు తీసుకోకుండా తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) గత, ప్రస్తుత సీఎండీలు, డైరెక్టర్లు తీవ్ర తాత్సారం చేయడం, సకాలంలో టెండర్లు నిర్వహించకపోవడంతో సంస్థకు భారీ ఆదాయనష్టం కలుగుతోంది. సుమారు రూ. 30 కోట్లు ఖర్చు చేస్తే నాలుగు జలవిద్యుత్ కేంద్రాలకూ మరమ్మతులు పూర్తయ్యేవని జెన్కో అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కృష్ణా బేసిన్‌లోని జలాశయాలకు కనీసం నెల రోజులు వరద కొనసాగినా ఈ ఏడాది రూ. 120 కోట్ల విలువ చేసే విద్యుత్‌ను జెన్కో నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. గరిష్టంగా మూడు నెలలు వరద కొనసాగితే రూ. 300 కోట్ల నుంచి రూ. 420 కోట్ల విలువ చేసే విద్యుత్‌ను నష్టపోనుంది. 330.8 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తికి గండి.. రాష్ట్రంలో మొత్తం 2,441.76 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంగల జలవిద్యుత్ కేంద్రాలుండగా మరమ్మతులకు నోచుకోక ఏడాదికిపైగా 330.8 మెగావాట్ల సామర్థ్యంగల జలవిద్యుత్ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ప్రధానంగా శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎగువ జూరాల, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో కనీసం ఒక్కో యూనిట్ పనిచేయడం లేదు. వర్షాలు, వరదలు మొదలవడంతో ఇప్పుడు టెండర్లు పిలిచినా ఇప్పట్లో మరమ్మతులు నిర్వహించే పరిస్థితి లేదు. వర్షాకాలం ముగిశాకే పనులు చేసేందుకు వీలు కలగనుంది. రాష్ట్రంలోని జలవిద్యుత్ కేంద్రాలు ఏటా కనీసం 3,000 మిలియన్ యూనిట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉండగా వాటికి మరమ్మతులు జరగక లక్ష్యం నెరవేరట్లేదు. విద్యుత్ సంస్థలపై పర్యవేక్షణ లోపం రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శినే జెన్కో, ట్రాన్స్‌కోకు ఇన్చార్జి సీఎండీగా అదనపు బాధ్యతల్లో నియమించడంతో విద్యుత్ సంస్థలపై పూర్తి పర్యవేక్షణ లేకుండాపోయింది. ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ 15 రోజులపాటు సెలవులో వెళ్లడంతో ఆయన స్థానంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఆయన సచివాలయం నుంచే పనిచేస్తుండటంతో విద్యుత్‌సౌధలో రోజువారీ పాలనా వ్యవహారాల పర్యవేక్షణ గాడి తప్పిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరమ్మతులకు నోచుకోని జలవిద్యుత్ కేంద్రాల యూనిట్లు ఇవే.. – శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 900 (6150) మెగావాట్లు కాగా అందులో 150 మెగావాట్ల సామర్థ్యంగల 4వ యూనిట్ గతేడాది ఆగస్టు 17 నుంచి పనిచేయట్లేదు. స్టేటర్ వైండింగ్ కాలిపోవడంతోపాటు రోటర్ పోల్‌లో ఫాల్ట్ రాగా ఏడాదిగా మరమ్మతులు చేయలేదు. – నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 815.6 (1110 + 7100.8) మెగావాట్లు కాగా అందులో 100.8 మెగావాట్ల సామర్థ్యంగల రెండో యూనిట్‌కు సంబంధించిన రోటర్ స్పైడర్ ఆర్మ్‌కు పగుళ్లు వచ్చాయి. దీంతో గతేడాది నవంబర్ 10 నుంచి అది వినియోగంలో లేదు. జపాన్ నుంచి ఇంజనీర్లు వస్తేనే దానికి మరమ్మతులు జరుగుతాయని 9 నెలలుగా కాలయాపన చేస్తున్నారు. – ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 234 (639) మెగావాట్లు కాగా అందులో 39 మెగావాట్ల సామర్థ్యంగల మూడో యూనిట్లో స్టేటర్ వైండింగ్ కాలిపోవడంతో గతేడాది ఆగస్టు 7 నుంచి వినియోగంలో లేదు. – దిగువ జూరాల విద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 240 (640) మెగావాట్లు కాగా అందులోని అన్ని యూనిట్లలో సీల్ లీకవుతోంది. అన్ని యూనిట్లలో నిరంతర విద్యుదుత్పత్తి కొనసాగించే పరిస్థితి లేదు. – పులిచింతల జలవిద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 120 (430) మెగావాట్లు కాగా 2022 అక్టోబర్ 1 నుంచి 30 మెగావాట్ల సామర్థ్యంగల మూడో యూనిట్ నిరుపయోగంగా మారింది. దాదాపుగా రెండేళ్లు గడుస్తున్నా చెడిపోయిన రన్నర్ బ్లేడ్‌ను మార్చలేదు. – నిజాంసాగర్ జలవిద్యుత్ కేంద్రం 10 (25) మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉండగా మరమ్మతులు చేయకపోవడంతో 2022 నవంబర్ 9 నుంచి మొత్తం విద్యుత్ కేంద్రం నిరుపయోగంగా ఉంది. – పాలేరు మినీ హైడ్రో పవర్ స్టేషన్ సామర్థ్యం 2 (12) మెగావాట్లు కాగా మెగావాట్ల సామర్థ్యంగల ఒకటో యూనిట్ గత మార్చి 6 నుంచి నిరుపయోగంగా ఉంది. రన్నర్ హబ్‌కు మరమ్మతులు చేయాల్సి ఉంది. -
పురపాలకశాఖకు..రూ.15,594 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో పురపాలక శాఖకు భారీగా నిధులు దక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో రూ.15,594 కోట్లు కేటాయించారు. 2023–24 బడ్జెట్లో కేటాయించింది రూ.11,372 కోట్లే. కాగా ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో హైదరాబాద్‌లో చేపట్టే అభివృద్ధి పనులకే అత్యధికంగా రూ. 10వేల కోట్లు ప్రకటించడం గమనార్హం. రానున్న మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ గ్రేటర్ హైదరాబాద్‌కు భారీగా నిధులు కేటాయించారన్న వాదన ఉంది.హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం స్పెషల్ ఫోకస్ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే పలు ప్రతిపాదనలు చేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న జీహెచ్ఎంసీ, ఇతర కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, గ్రామపంచాయతీలను కలిపి జీహెచ్ ఎంసీ పరిధిలోకి తేవాలని సీఎం ఆలోచన. ఈ పరిధిలోనే రాబోయే పదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు వెచ్చించి అభివృద్ధి చేయాలని ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం ప్రతిపాదించారు.ఇందులో మూసీ రివర్ ఫ్రంట్, నాలాల అభివృద్ధి, మెరుగైన నీటిసరఫరా, మెట్రో విస్త రణ, ఓఆర్ఆర్కు ఇరువైపులా అభివృద్ధి, హైడ్రా ప్రాజె క్టుతో పాటు రీజినల్ రింగ్‌రోడ్డు(ఆర్ఆర్ఆర్) వంటివి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపో యినా, రాష్ట్ర ప్రభుత్వం తరపున అయినా ఈ అభివృద్ధి పనులు కొనసాగించాలని నిర్ణయించినట్టు రెండురోజుల క్రితం తన నివాసంలో జరిగిన మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.ఇందులో భాగంగానే ఈ 2024–25 బడ్జెట్లో కేవలం హైదరాబాద్ అభివృద్ధికే రూ. 10వేల కోట్లు కేటాయించారు. వచ్చే జనవరినాటికి హైదరాబాద్ శివారు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పాలకమండళ్ల పదవీకాలం ముగియనుంది. ఏడాదిన్న రలో జీహెచ్ఎంసీ పదవీకాలం కూడా ముగియనున్న నేప థ్యంలో ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని పాలకమండళ్ల పరిధి నిర్వహణకు ఎలాంటి ప్రణాళికలు చేయాలనే అంశంపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఓఆర్ఆర్ లోపల అభివృద్ధికి రూ.10వేల కోట్లు ఈ ఏడాదిలో వెచ్చించనున్నట్టు స్పష్టమవుతోంది.ఇతర జిల్లాల్లోని పురపాలికలకు...హైదరాబాద్, రంగారెడ్డి పాత ఉమ్మడి జిల్లాలు మినహా మిగతా 8 ఉమ్మడి జిల్లాల్లోని పురపాలక సంస్థల్లో రూ. 5,594 కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోప్రధానమైన 100 మునిసిపాలి టీలతో పాటు పాత కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లపై ఫోకస్ పెట్టనున్నట్టు సమాచారం. పౌరసరఫరాల శాఖకు రూ.3,836 కోట్లుసాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పౌరసరఫరాల శాఖకు రూ.3,836 కోట్లు కేటాయించారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. 2022–23లో ఈ శాఖకు రూ.2,213 కోట్లు కేటాయించగా.. 2023–24లో రూ.3,001 కోట్లు కేటాయించారు. ఈ సారి గత సంవత్సరం కన్నా రూ.835 కోట్లు అదనంగా కేటాయించడం గమనార్హం.రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఎల్పీజీ సబ్సిడీ కోసం రూ.723 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని 39.33 లక్షల కుటుంబాలకు ప్రతి గ్యాస్ సిలిండర్‌పై రూ.500 చొప్పున సబ్సిడీగా ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సంవత్సరానికి 3 సిలిండర్లకు రూ.500 చొప్పున సబ్సిడీ ఇస్తే రూ.590 కోట్లు ఖర్చవుతాయి. అదే 4 సిలిండర్లు ఇస్తే రూ.786 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.అటవీశాఖకు రూ.1,063 కోట్లుహైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు సంబంధించి రూ.1,063.87 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో అటవీ, పర్యావరణ శాఖలోని వివిధ అంశాలకు చేసిన కేటాయింపులు ఇలా ఉన్నాయి. పీసీసీఎఫ్, హెచ్‌వోడీకి శాఖాపరంగా పలు విధుల నిర్వహణకు సంబంధించి రూ.876 కోట్లు (రూ.162.13 కోట్లు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కలిపి) ప్రతిపాదించారు. ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు రూ.102.99 కోట్లు, జూపార్కులకు రూ.12 కోట్లు, అఫారెస్టేషన్ ఫండ్ రూ.5 కోట్లు, ప్రాజెక్ట్ టైగర్‌కు రూ.5.21 కోట్లు ప్రతిపాదించారు.ఇంధన శాఖకు రూ.16,410 కోట్లుసాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంధన శాఖకు బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. 2023–24లో శాఖకు రూ.12,727 కోట్లను కేటా యించగా, 2024–25 బడ్జెట్లో రూ.16,410 కోట్లకు కేటాయింపులను ప్రభుత్వం పెంచింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఇతర కేటగిరీలకు రాయితీపై విద్యుత్ సరఫరాకు గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ రూ.8,260 కోట్లను కేటాయించింది.ఉదయ్ పథకం కింద రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల రుణాలను ప్రభుత్వం టేకోవర్ చేసుకోవడానికి గతేడాది రూ.500 కోట్లను కేటాయించగా, ఈసారి రూ.250 కోట్లకు తగ్గించింది. ప్రతి నెలా పేదల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు అమల్లోకి తెచ్చిన గృహ జ్యోతి పథకానికి మరో రూ.2418 కోట్లను కేటాయించింది. ట్రాన్స్‌కో, డిస్కంలకు ఆర్థిక సహాయం కింద రూ.1509.40 కోట్లను కేటాయించింది. గత ఐదు నెలల్లో గృహ జ్యోతి పథకం అమలుకు రూ.640 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే డిస్కంలకు చెల్లించింది. ఈ పథకం కింద 46,19,236 కనెక్షన్లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తోంది. -
ఇంధన శాఖపై ‘కూటమి’ కన్ను!
సాక్షి, అమరావతి: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదుకోవడంతో అప్పులు తీర్చుకుని ఆదాయం బాట పట్టిన ఇంధన శాఖపై టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల కన్ను పడింది. డిస్కంలతో పాటు ఏపీ జెన్కో, ట్రాన్స్‌కోలో కీలక స్థానాల్లో తమ వారిని నియమించుకొని, కోట్లాది రూపాయలు దండుకొనేందుకు కూటమికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు పెద్ద కుతంత్రానికే తెరలేపారు. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో నియమితులైనవారిని రాజీనామాలు చేసి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభుత్వ శాఖలను జేబులు నింపుకొనేందుకు వాడుకున్నారో ఇప్పుడూ అదే తీరులో చెలరేగుతున్నారు. వారి ధన దాహానికి డైరెక్టర్ నుంచి అన్ని స్థాయిల ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. కూటమి పెద్దల బలవంతంతో వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. కొందరిని బలవంతంగా బయటకు పంపిస్తున్నారు. ఇప్పటికే ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ, విశ్రాంత ఐపీఎస్ అధికారి మల్లారెడ్డి చేత రాజీనామా చేయించారు. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్లో ముఖ్య ఆర్థిక సలహాదారులు హనుమంతరావు, సింహాచలం, జెన్కో ఓఎస్డీ ఆంటోని రాజు, మరికొందరిని విధుల నుంచి తప్పించారు. డైరెక్టర్లనూ రాజీనామా చేయాలని ఇటీవల హుకుం జారీ చేశారు. మంగళవారం రాత్రి మరోసారి గట్టిగా చెప్పడంతో ఏపీ ట్రాన్స్‌కో, జెన్కో, మూడు డిస్కంలలోని 10 మంది డైరెక్టర్లు బుధవారం రాజీనామా చేశారు. వారి బాధ్యతలను తాత్కాలికంగా సీజీఎంలకు అప్పగిస్తూ డిస్కంల సీఎండీలు ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీ అయిన పోస్టుల్లో కొన్నింటికి రూ. కోట్లలో బేరాలు మొదలు పెట్టినట్లు సమాచారం. కొన్ని పోస్టుల్లో అనుయాయులను నియమించుకొని వారి ద్వారా కోట్లు దండుకొనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల అధిపతులను కూడా మార్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తమకు అనుకూలంగా ఉండే పలువురు ఐఏఎస్ అధికారుల పేర్లును పరిశీలిస్తున్నట్లు సమాచారం.10 మంది డైరెక్టర్ల రాజీనామా ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, జెన్కో ఎండీ, డిస్కంల సీఎండీలకు 10 మంది డైరెక్టర్లు బుధవారం రాజీనామా లేఖలను అందజేశారు. వాటిని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు పంపగా, ఆయన వెంటనే ఆమోదించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాజీనామా చేసిన డైరెక్టర్లు » టి.వీరభద్రరెడ్డి (ఫైనాన్స్– ఏపీ ట్రాన్స్‌కో) » డి.ఎస్.జి.ఎస్.ఎస్. బాబ్జి (థర్మల్ – ఏపీ జెన్కో) » సయ్యద్ రఫి (హెచ్ఆర్, ఐఆర్ – ఏపీ జెన్కో) » ఎంవీవీ సత్యనారాయణ (హైడల్ – ఏపీ జెన్కో) » సి.శ్రీనివాసమూర్తి (ఆపరేషన్స్ – ఏపీఈపీడీసీఎల్) » ఎ.వి.వి.సూర్యప్రతాప్ (ప్రాజెక్ట్స్ – ఏపీఈపీడీసీఎల్) » వి. బ్రహా్మనందరెడ్డి (ఫైనాన్స్ – ఏపీసీపీడీసీఎల్) » బి. జయభారతరావు (టెక్నికల్ – ఏపీసీపీడీసీఎల్) » టి. వనజ (ప్రాజెక్ట్స్ – ఏపీసీపీడీసీఎల్) » కె.శివప్రసాదరెడ్డి (ప్రాజెక్ట్స్ – ఏపీఎస్పీడీసీఎల్) -
కేసీఆర్‌కు గత ఏప్రిల్‌లోనే నోటీసులు జారీ: జస్టిస్ నరసింహారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంపిటీటివ్ బిడ్డింగ్‌కి బదులుగా నామినేషన్ల ప్రాతిపదికన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మించాలని నిర్ణయం తీసుకోవడంలో పాత్రపై మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు గత ఏప్రిల్‌లో నోటీసులు జారీ చేసినట్లు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి తెలిపారు. కేసీఆర్ సహా మొత్తం 25 మంది అధికారులు, అనధికారులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శులైన సురేష్ చందా, ఎస్కే జోషీ, అరవింద్కుమార్లతో పాటు ట్రాన్స్‌కో, జెన్కో మాజీ సీఎండీ డి.ప్రభాకర్‌రావు, బీహెచ్ఈఎల్ మాజీ సీఎండీ, ప్రస్తుత సీఎండీలను విచారించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి మంగళవారం బీఆర్కేఆర్ భవన్‌లోని కమిషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగదీశ్‌రెడ్డికి నోటీసులు ఇవ్వలేదు ‘విద్యుత్ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్ల పరిశీలనలో మీ పాత్రను గుర్తించామని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ అందరికీ నోటీసులు ఇచ్చాం. కేసీఆర్ మినహా నోటీసులు అందుకున్న మిగతా వారంతా గడువులోగా తమ పాత్రపై రాతపూర్వకంగా వివరణ అందజేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తీరిక లేకుండా ఉన్నానని, జూలై 31 వరకు గడువు పొడిగించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేయగా, జూన్ 15 వరకు కమిషన్ గడువు పొడిగించింది. అయితే ఇప్పటికీ కేసీఆర్ నుంచి వివరణ అందలేదు. కొందరి వివరణలు సంతృప్తికరంగా లేకపోవడంతో అదనపు సమాచారం కోరు తూ మళ్లీ నోటీసులు జారీ చేశాం. నిర్ణయాల్లో అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి పాత్ర ఉన్నట్టుగా ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో ఆయనకు నోటీసులు జారీ చేయలేదు..’ అని జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. ఎవరు నిర్ణయం తీసుకున్నారో పరిశీలిస్తున్నాం ‘ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం అంశాల్లో నిర్ణయం ఎవరు తీసుకున్నారు? అనే అంశంపై విచారణ నిర్వహిస్తున్నాం. నిర్ణయాల్లో పాత్రలేని అధికారులు ఒక్కొక్కరిని తప్పించడం (ఎలిమినేషన్) ద్వారా అసలు నిర్ణయం తీసుకున్న వారెవరో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాం. మూడు అంశాల్లోనూ నాటి ప్రభుత్వం నేరుగా నిర్ణయాలు తీసుకుందని జెన్కో, ఇతర విద్యుత్ సంస్థల పాత్ర లేదని ట్రాన్స్‌కో, జెన్కో మాజీ సీఎండీ డి.ప్రభాకర్‌రావు చెప్పారు. ఇక్కడ ప్రభుత్వం అంటే.. నిర్ణయం తీసుకుంది ఎవరు? అనే అంశం పరిశీలిస్తున్నాం..’ అని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీకి అధికారాలు పెద్ద తప్పిదం ‘ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో రాష్ట్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచి్చనట్టుగా మా లెక్కల్లో తేలింది. ఒప్పందంపై కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ)కి బదులుగా ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీకి సర్వ అధికారాలు కట్టబెట్టడం పెద్ద తప్పిదం. 12 ఏళ్లకు ఒప్పందం జరిగితే, ఛత్తీస్‌గఢ్ కేవలం మూడు నాలుగేళ్లు మాత్రమే విద్యుత్ సరఫరా చేసి మానుకుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయడానికి 2014లో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకోగా, నాటి రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషీ దీనిపై సంతకం చేశారు. అయితే ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రమేయం లేకుండానే 2016లో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) జరిగింది. జీఎస్పీడీసీఎల్/టీజీఎన్పీడీసీఎల్ సీఎండీలు దీనిపై సంతకం పెట్టారు. అయితే అప్పటికి ఛత్తీస్‌గఢ్‌లో థర్మల్ విద్యుత్ కేంద్రం (మార్వా) నిర్మాణమే ప్రారంభం కాలేదని మా పరిశీలనలో తేలింది..’ అని జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. చర్యలు తీసుకోని ఈఆర్సీ ‘ఛత్తీస్‌గఢ్ ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అరవింద్‌కుమార్ వివరణ ఇచ్చారు. నామినేషన్ విధానంలో ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని, దీనికి బదులుగా విద్యుత్ కొనుగోళ్ల కోసం బహిరంగ టెండర్లను నిర్వహిస్తే బాగుంటుందని పేర్కొంటూ అరవింద్‌కుమార్ 2016 నవంబర్ చివరలో రాష్ట్ర ఈఆర్సీకి సుదీర్ఘ లేఖ రాయగా, ఈఆర్సీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తేలింది. ఈ లేఖ రాసిన వెంటనే తాను ఇంధన శాఖ నుంచి బదిలీకి గురైనట్టు అరవింద్‌కుమార్ తెలిపారు. 2000 మెగావాట్ల విద్యుత్‌ను దక్షిణాది రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేందుకు అనుమతిస్తూ ఎస్కే జోషి తొలుత జీవో 22 జారీ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు వీలు కలి్పంచేలా ఈ జీవోను సవరిస్తూ దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్ కొనుగోలు చేసేందుకు అనుమతించారు. 1000 మెగావాట్ల ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కోసం 2000 మెగావాట్ల విద్యుత్ కారిడార్‌ను బుక్ చేసుకున్నారు. అందులో 1000 మెగావాట్ల లైన్లను కూడా ఎన్నడూ పూర్తిగా వాడుకోలేదు..’ అని వివరించారు. సూపర్ క్రిటికల్‌కి బదులుగా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ‘భద్రాద్రి’ ‘ఉత్తర భారత దేశంలో నిర్మించతలపెట్టిన థర్మల్ విద్యుత్ కేంద్రం అవసరాల కోసం బీహెచ్ఈఎల్ తయారు చేసిన జనరేటర్లు, బాయిలర్లు నిరుపయోగంగా ఉండడంతో వాటిని తీసుకొచ్చి 1080 మెగావాట్ల సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించినట్టు మా పరిశీలనలో తేలింది. సూపర్ క్రిటికల్‌కి బదులుగా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి విద్యుత్ కేంద్రం నిర్మించడంతో బొగ్గు వాడకం పెరిగి ఏటా రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు వ్యయం పెరిగింది. బొగ్గు వాడకం పెరగడంతో పర్యావరణ కాలుష్యం కూడా పెరిగింది. 25 ఏళ్ల పాటు అధిక వ్యయం, కాలుష్యాన్ని భరించాల్సి ఉంటుంది. తెలంగాణ వచ్చాక కొత్తగూడెంలో 800 మెగావాట్ల కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో రికార్డు కాలంలో నిర్మించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సైతం సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోనే నిర్మిస్తున్నారు. కానీ భద్రాద్రి కేంద్రాన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి నిర్మించాలని నేరుగా ప్రభుత్వం నుంచే నిర్ణయం వెలువడిందని, ఇందులో తమ పాత్ర లేదని ప్రభాకర్ రావు చెప్పారు. ఈఆర్సీ మాజీ చైర్మన్‌ను విచారించేందుకు వీలుండదు త్వరలో మరో మాజీ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రాను విచారిస్తామని, టీజేఏసీ చైర్మన్ కె.రఘు, టీజేఎస్ అధినేత కోదండరాం, విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాల్ రావును కూడా పిలిపించి వారి వద్ద ఉన్న సమాచారాన్ని తెలుసుకుంటామని జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు. ఈఆర్సీ మాజీ చైర్మన్‌ను విచారించేందుకు వీలుండదని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. యాదాద్రి ఇప్పట్లో పూర్తయ్యేలా లేదుయాదాద్రి, భద్రాద్రి కేంద్రాలను రెండేళ్లలో నిర్మిస్తామని చెప్పి గడువులోగా పూర్తి చేయలేకపోయారు. యాదాద్రి కేంద్రాన్ని ఇటీవల సందర్శించగా, సమీప భవిష్యత్తులో పూర్తయ్యే పరిస్థితి కనిపించలేదు. కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా టెండర్లు నిర్వహించకుండా బీహెచ్ఈఎల్కు నామినేషన్ల విధానంలో వీటి పనులు అప్పగించారు. బీహెచ్ఈఎల్ మాజీ, ప్రస్తుత సీఎండీలను పిలిపించి విచారించగా, అవకతవకలు జరిగినట్టు అనుమానాలు ఉన్న అంశాల (గ్రే ఏరియాస్)పై పరిశీలన జరుపుతామని బదులిచ్చారు. తాను స్వల్పకాలం పాటే ఇంధన శాఖలో పనిచేశానని, అప్పట్లో ఎలాంటి నిర్ణయాలు జరగలేదని, కేవలం ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయని సురేష్ చందా చెప్పారు..’ అని జస్టిస్ నరసింహారెడ్డి వెల్లడించారు. -
‘విద్యుత్’ నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి?
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం.. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రస్తుత, మాజీ అధికారులకు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఆదివారం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఆయా అధికారులు, మాజీ అధికారులు పోషించిన పాత్ర ఏమిటనే వివరణ, అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. ఈ ప్లాంట్ల నిర్మాణం, విద్యుత్ కొనుగోలులో భాగస్వాములైన వ్యక్తులు, సంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు సోమవారం బహిరంగ ప్రకటన కూడా జారీ చేయనుంది. సంబంధిత వ్యక్తులు, సంస్థలు స్వచ్ఛందంగా తమ వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్‌కు రాతపూర్వకంగా అందించడానికి వీలు కల్పించనుంది. అవసరమైతే బహిరంగ విచారణకు రావాలని వారిని పిలిపించే అవకాశమూ ఉంది. ప్రస్తుత, మాజీ అధికారులందరికీ.. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంతో సంబంధమున్న ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, ట్రాన్స్‌కో, జెన్కో మాజీ సీఎండీ డి.ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ జి.రఘుమారెడ్డి, టీఎస్ఎన్పీడీసీఎల్ మాజీ సీఎండీలు కె.వెంకటనారాయణ, ఎ.గోపాల్‌రావుతోపాటు ఆయా విద్యుత్ సంస్థల మాజీ, ప్రస్తుత డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఇతర అధికారులకు కమిషన్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. వీరితోపాటు నామినేషన్లపై యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను దక్కించుకున్న బీహెచ్ఈఎల్ సంస్థ ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులు, ఛత్తీస్‌గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ మాజీ, ప్రస్తుత ఉన్నతాధికారులకు సైతం నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ఆదివారం సెలవు కావడంతో సోమవారం నుంచి వీరికి నోటీసులు అందనున్నట్టు సమాచారం. త్వరలో ప్రజాప్రతినిధులకు కూడా.. విద్యుత్ ప్లాంట్లు, కొనుగోళ్లపై న్యాయ విచారణలో భాగంగా తొలిదశలో ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసిన కమిషన్.. ఆ నిర్ణయాల్లో తమ పాత్రపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అవసరమైతే కమిషన్ ముందు క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరుకావాలని పిలిచే అవకాశం ఉందని విద్యుత్ వర్గాలు చెప్తున్నాయి. ఈ వివరణల్లో లభించే సమాచారం ఆధారంగా.. తర్వాతి దశలో పలువురు ప్రజాప్రతినిధులకు నేతలకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం గడువు విధించిన నేపథ్యంలో.. కమిషన్ న్యాయ విచారణ ప్రక్రియను వేగిరం చేయాలని నిర్ణయించింది. ఈఆర్సీకి అరవింద్ కుమార్ లేఖనే కీలకం.. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని.. ఆ ఒప్పందాన్ని ఆమోదించవద్దని కోరుతూ నాటి రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ 2016 డిసెంబర్లో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి లేఖ రాశారు. దీనిపై ఆగ్రహించిన అప్పటి సర్కారు.. ఆయనను మరుసటి రోజే ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా బదిలీ చేసింది. తాజాగా ఆయనకు కూడా విచారణ కమిషన్ నోటీసులు జారీ చేయడంతో.. నాటి లేఖ, ఆయన వివరణ కీలకంకానున్నాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఎన్టీపీసీ విద్యుత్ ఇక చాలు..!
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 2,400 (3్ఠ800) మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన రెండో దశ తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంటే భవిష్యత్తులో అది రాష్ట్రానికి పెనుభారంగా మారే ప్రమాదముందని ప్రభుత్వం అభిప్రాయానికి వచ్చింది. ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి 5–8 ఏళ్ల సమయం పట్టనుందని, దీని ద్వారా వచ్చే విద్యుత్ ధర యూనిట్‌కు రూ. 8–9 ఎగబాకుతుందని రాష్ట్ర ఇంధన శాఖ అంచనా వేసింది. బహిరంగ మార్కెట్లో దీనికన్నా తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుండగా ఇంత భారీ ధరతో 25 ఏళ్లపాటు విద్యుత్ కొనుగోలు చేసేందుకు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంటే రాష్ట్ర ప్రజలపై రూ. వేల కోట్ల అనవసర భారం పడుతుందని తేల్చింది. ఈ నేపథ్యంలో ఎన్టీపీసీతో రెండో దశ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. సత్వరమే ఒప్పందం చేసుకోకుంటే ఇతర రాష్ట్రాలతో ఒప్పందం చేసుకొని విద్యుత్ కేంద్రం నిర్మిస్తామని ఎన్టీపీసీ ఇటీవల రాష్ట్రానికి అల్టిమేటం జారీ చేయడంతో దీనిపై సమీక్షించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయానికి వచ్చింది. విభజన చట్టం కింద ఏర్పాటు..: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో విద్యుత్ కొరతను తీర్చడానికి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పునర్విభజన చట్టం–2014లో కేంద్రం హామీ ఇచ్చింది. అందులో తొలి దశ కింద 1,600 (2 ్ఠ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ఇటీవల ఎన్టీపీసీ పూర్తి చేసింది. రెండో దశ కింద 2,400 మెగావాట్ల ప్లాంట్లను నిర్మించాల్సి ఉంది. తొలి దశ ప్లాంట్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ. 5.90 ఉండగా ఒప్పందం కారణంగా కొనుగోలు చేయకతప్పని పరిస్థితి ఉంది. గత సర్కారు తప్పిదమే! రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన 4,000 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్‌లో 2,400 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి అందకపోవడానికి కారణం కూడా గత ప్రభుత్వ తప్పిదమేనని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రెండో దశ కింద 2,400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి వీలుగా ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోకుండా పదేళ్లపాటు కాలయాపన చేయడమే దీనికి కారణమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అప్పట్లో ఒప్పందం చేసుకొని ఉంటే ఇప్పటికే నిర్మాణం పూర్తై తక్కువ ధరకు విద్యుత్ రాష్ట్రానికి వచ్చేదని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పడు ఒప్పందం చేసుకుంటే భవిష్యత్తులో రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత సర్కారు అధిక ధరతో విద్యుత్ కొనుగోళ్లు చేయడంతోపాటు విచ్చలవిడి విధానాలను అనుసరించడం వల్ల గత పదేళ్లలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు దివాలా తీశాయని కాంగ్రెస్ సర్కారు ఆరోపిస్తోంది. ఇక కొత్త థర్మల్ ప్లాంట్లకు స్వస్తి.. దామరచర్లలో తెలంగాణ జెన్కో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నాలుగేళ్ల కిందే పూర్తికావాల్సి ఉండగా ఇంకా పనులు కొనసాగుతున్నాయి. ఈ జాప్యంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మెగావాట్‌కు రూ. 6–10 కోట్లకు పెరిగింది. కాలంచెల్లిన సబ్–క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన భద్రాద్రి విద్యుత్ కేంద్రం వ్యయం సైతం భారీగా పెరగడంతో దాని విద్యుత్ ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ సర్కారు న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మళ్లీ కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం జోలికి వెళ్లొద్దని ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చింది. ప్రత్యామ్నాయంగా మార్కెట్లో రూ. 2–4కు యూనిట్ చొప్పున లభిస్తున్న పునరుద్పాదక విద్యుత్‌తో రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం సౌర, జల, పవన, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ విద్యుత్‌పై సర్కారు దృష్టిపెట్టనుంది. -
‘పాట్’ అమలులో ఏపీ ఉత్తమం
సాక్షి, అమరావతి: పెర్ఫార్మ్, అచీవ్ ట్రేడ్ (పాట్) పథకం అమలులో రాష్ట్రం ఉత్తమ ఫలితాలు సాధిస్తోందని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చెప్పారు. పారిశ్రామికరంగంలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇంధన వ్యయాన్ని తగ్గించడం, గ్రీన్హౌస్ ఉద్గారాలను కట్టడిచేయడం వంటి లక్ష్యాలను సాధించడంలో భాగంగా పరిశ్రమల్లో ఎనర్జీ మేనేజర్లకు పాట్ పథకంపై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) బుధవారం విజయవాడలో రీజనల్ వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ వర్క్‌షాప్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయానంద్ ఏపీఎస్ఈసీఎం సీఈవో కుమారరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు, నెడ్‌క్యాప్ వీసీ, ఎండీ నందకిషోర్‌రెడ్డి, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ సీఎండీ కమలాకర్‌బాబు, బీఈఈ సీనియర్ సెక్టార్ ఎక్స్పర్ట్ నవీన్‌కుమార్‌లతో కలిసి పాట్‌పై బుక్‌లెట్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు పాట్ పథకం అమలు చేయటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం, ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో డీకార్బనైజేషన్ చర్యలు నిర్వహించడం వంటి పటిష్టమైన ప్లాన్‌ను రూపొందించిన ఉత్తమ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని చెప్పారు. ఈ పథకం దేశవ్యాప్తంగా అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నారు. పాట్ సైకిల్–1లో 8.67 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వివాలెంట్ (ఎంటీవోఈ) ఇంధనాన్ని ఆదా చేయడం వల్ల సుమారు 31 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను నివారించగలిగామని చెప్పారు. పాట్ సైకిల్–2లో 14.08 ఎంటీవోఈ ఇంధనం ఆదా చేయడంద్వారా 68 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించామని తెలిపారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో పరిశ్రమలు ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడం ద్వారా పాట్ సైకిల్–3 వరకు 1.16 ఎంటీవోఈ ఇంధనాన్ని ఆదా చేశాయని చెప్పారు. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే కాకుండా పారిశ్రామిక ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని ఆయన తెలిపారు. వర్క్‌షాప్‌లో ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సిమెంట్, టెక్స్టైల్స్, పవర్ప్లాంట్లు, ఎరువులు, ఇనుము, ఉక్కు, ఎరువులు, సిమెంట్, అల్యూమినియం, పేపర్, క్లోర్–ఆల్కల్ పరిశ్రమల నుంచి 100 మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఇంధన సామర్థ్య పరిశోధనల్లో ముందడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినూత్న ఇంధన సామర్ధ్య సాంకేతికతలను ప్రోత్సహించే లక్ష్యంతో, ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఈఈడీసీఓ) ముందడుగు వేసింది. ఇంటీరియర్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటర్ (ఐపీఎంఎస్‌ఎం) సాంకేతికతతో ఎనర్జీ ఎఫిషియెంట్ సబ్మెర్సిబుల్ మోటార్‌ను విజయవంతంగా తయారు చేసింది. దీని కోసం సబ్మెర్సిబుల్ వాటర్ పంపింగ్ అప్లికేషన్ల కోసం రూపొందించిన ఎలక్ట్రికల్ మోటార్ డ్రైవ్ సిస్టమ్ డిజైన్ ప్రోటోకాల్‌ను ఆంధ్రా విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. ఈ పరిశోధన ప్రాజెక్ట్‌లోని మోడల్ మోటార్‌ను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ విద్యుత్ సౌధలో శుక్రవారం ఆవిష్కరించారు. వ్యవసాయ రంగంలో పంపుసెట్లు కీలకపాత్ర పోషిస్తాయని, ఐపీఎంఎస్‌ఎం మోటార్ల ద్వారా ఈ రంగంలో విద్యుత్‌ను ఆదా చేయవచ్చని ఆయన తెలిపారు. ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ద్వారా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) నిధులతో దాదాపు 20 వ్యవసాయ పంపుసెట్లలో ఐపీఎంఎస్‌ఎం సాంకేతికతను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఏపీఈపీడీసీఎల్‌ను ఈ సందర్భంగా విజయానంద్ ఆదేశించారు. ఆంధ్రా వర్సిటీ ప్రొఫెసర్ మల్లికార్జున్ రావు, ఏపీఎస్‌ఈఈడీసీఓ టెక్నికల్ హెడ్ శ్రీనివాసులుతో కలిసి మోటార్ పనితీరును ఏపీఎస్ఈసీఎం సీఈఓ కుమార రెడ్డి వివరించారు. ఐపీఎంఎస్‌ఎం మోటార్లు సంప్రదాయ ఎలక్ట్రిక్ మోటార్లకు ప్రత్యామ్నాయమని, ఇండక్షన్ మోటార్లతో పోల్చితే తక్కువ విద్యుత్ వినియోగం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ మోటార్లకు 80 శాతం సామర్థ్యం ఉండగా, ఐపీఎంఎస్‌ఎం అనేది 90 శాతం ఉందని వెల్లడించారు. సంప్రదాయ మోటారు జీవిత కాలం సుమారు పదేళ్లుకాగా, అధిక గ్రేడ్ మెటీరియల్స్ కారణంగా ఐపీఎంఎస్‌ఎం మోటార్ సుమారు 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకూ పనిచేస్తుందని చెప్పారు. తక్కువ నిర్వహణ వ్యయం,30శాతం తక్కువ విద్యుత్ వినియోగం ఉంటుందని ఆయన వివరించారు. -
Telangana: ఉచిత కరెంట్‌లో మెలిక?!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు ‘గృహజ్యోతి’ పథకం కింద ప్రతి కుటుంబానికి కచ్చితంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా జరగదా? అర్హత గల ప్రతి కుటుంబం నిర్దిష్ట యూనిట్ల మేరకే ఉచిత విద్యుత్‌ను పొందుతుందా? గత ఏడాది విద్యుత్ వినియోగాన్ని ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంటున్నారా? పథకం అమలుకు ఇంధన శాఖ సిద్ధం చేసిన మార్గదర్శకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయా? అంటే.. అవుననే సమాధానమే లభిస్తోంది. నెలవారీ ఉచితంగా అనుమతించే వినియోగం (ఫ్రీ మంత్లీ ఎలిజిబుల్ కన్జంప్షన్ (ఎంఈసీ) పేరిట ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకం అమల్లోకి రానుంది. దీంతో ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు రెడీ అయ్యాయి. అధికంగా వాడితే వాతలే!: ఈ మార్గదర్శకాల ప్రకారం..200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు షరతులు వర్తించనున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తుందని భావించి గతానికి భిన్నంగా ఇష్టారాజ్యంగా వినియోగాన్ని పెంచేసుకుంటే, ఆ మేరకు అదనపు వాడకానికి బిల్లులు చెల్లించక తప్పదు. గత ఆర్థిక సంవత్సరం అంటే 2022–23లో నెలకు సగటున వాడిన విద్యుత్‌కు అదనంగా 10 శాతం విద్యుత్‌ను మాత్రమే గృహ జ్యోతి పథకం కింద ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయనుంది. నెలకు 200 యూనిట్ల గరిష్ట పరిమితికి లోబడి ఈ పథకం అమలు కానుంది. ఉదాహరణకు 2022–23లో ఒక కుటుంబ వార్షిక విద్యుత్ వినియోగం 960 యూనిట్లు అయితే, సగటున నెలకు 80 యూనిట్లు వాడినట్టు నిర్ధారిస్తారు. అదనంగా మరో 10 శాతం అంటే 8 యూనిట్లను కలిపి నెలకు గరిష్టంగా 88 యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే ఆ కుటుంబానికి ఉచితంగా సరఫరా చేయనున్నారు. 88 యూనిట్లకు మించి వాడిన విద్యుత్‌కు సంబంధిత టారిఫ్ శ్లాబులోని రేట్ల ప్రకారం బిల్లులు జారీ చేయనున్నారు. గతేడాది 2,400 యూనిట్లు మించితే అనర్హులే ఒక వేళ 2022–23లో సగటున నెలకు 200 యూనిట్లకు మించి విద్యుత్ వాడినట్టైతే ఈ పథకం వర్తించదు. వార్షిక విద్యుత్ వినియోగం 2,400 యూనిట్లు మించిన వినియోగదారులు ఈ పథకానికి అర్హులు కారు. ఇక నెలకు అనుమతించిన పరిమితి (ఎంఈసీ) మేరకు ఉచిత విద్యుత్‌ను వాడిన వినియోగదారులకు ‘జీరో’ బిల్లును జారీ చేయనున్నారు. అంటే వీరు ఎలాంటి చెల్లింపులూ చేయాల్సిన అవసరం ఉండదు. 200 యూనిట్లు దాటితే ఉచితం వర్తించదు ఒక వేళ వినియోగం అనుమతించిన పరిమితికి మించినా, గరిష్ట పరిమితి 200 యూనిట్లలోపే వాడకం ఉండాలి. ఇప్పుడు కూడా అదనంగా వాడిన విద్యుత్‌కు సంబంధించిన బిల్లును సంబంధిత టారిఫ్ శ్లాబు ప్రకారం జారీ చేస్తారు. ఒక వేళ నెల వినియోగం 200 యూనిట్లకు మించితే మాత్రం వాడిన మొత్తం కరెంట్‌కు బిల్లును యథాతథంగా జారీ చేస్తారు. ఎలాంటి ఉచితం వర్తించదు. బిల్లులు బకాయిపడినా నో విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించాల్సిన వినియోగదారులకు గృహజ్యోతి పథకం వర్తించదు. బకాయిలన్నీ చెల్లించిన తర్వాతే పథకాన్ని వర్తింపజేస్తారు. గృహజ్యోతి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బిల్లులను చెల్లించకుండా బకాయి పడిన వారికి సైతం పథకాన్ని నిలుపుదల చేస్తారు. బిల్లులు చెల్లించాకే మళ్లీ పథకాన్ని పునరుద్ధరిస్తారు. తెల్లకార్డు ఉంటేనే అర్హులు ఈ పథకం కింద తెల్లరేషన్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబం గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వాడుకోవడానికి అర్హత కలిగి ఉంటుంది. రేషన్‌కార్డు ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి. లబ్ధిదారులు దరఖాస్తులో పొందుపరిచిన గృహ విద్యుత్ సర్వీస్ కనెక్షన్ నంబర్‌ను రేషన్‌కార్డుతో అనుసంధానం చేస్తారు. రేషన్‌కార్డుతో విద్యుత్ కనెక్షన్‌ను అనుసంధానం చేసినా, విద్యుత్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వారి పేరు మీదే బిల్లింగ్ జరుగుతుంది. ఇప్పటికే నెలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లబ్ధి పొందుతున్న ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు కూడా గృహజ్యోతి వర్తించనుంది. గృహజ్యోతి పథకం కింద ఒక నెలకు సంబంధించిన సబ్సిడీలను తదుపరి నెలలోని 20వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుంది. తొలి విడతలో 34 లక్షల గృహాలకు.. ప్రజాపాలన కార్యక్రమం కింద గృహజ్యోతి పథకం అమలు కోసం 1,09,01,255 దరఖాస్తులు రాగా, అందులో 64,57,891 దరఖాస్తుదారులు ఆధార్‌తో అనుసంధానమై ఉన్న తెల్ల రేషన్‌కార్డును కలిగి ఉన్నారని రాష్ట్ర ఐటీ శాఖ నిర్ధారించింది. వీరిలో 34,59,585 మంది దరఖాస్తుదారులు మాత్రమే గృహ విద్యుత్ కనెక్షన్ కలిగి ఉండడంతో తొలి విడత కింద వీరికే గృహజ్యోతి వర్తింపజేయనున్నారు. ప్రస్తుత విద్యుత్ టారిఫ్ ప్రకారం..గృహజ్యోతి పథకం అమలుకు ఏటా రూ.4,164.29 కోట్ల వ్యయం కానుందని రాష్ట్ర ఇంధన శాఖ అంచనా వేసింది. -
డిస్కంలకు రూ.58,981 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు రూ.17,102 కోట్ల విద్యుత్ సబ్సిడీల తోపాటు మరో రూ.40,981 కోట్ల ప్రభుత్వ విద్యుత్ బిల్లుల బకాయిలు (హెచ్టీసీసీ) కలిపి మొత్తం రూ.58,684.17 కోట్లను 2024–25 బడ్జెట్లో కేటా యించాలని ఇంధనశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి పాదించింది. ఈ మేరకు బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023– 24లో డిస్కంలకు రూ.11,500 కోట్ల విద్యుత్ సబ్సి డీని మంజూరు చేయగా దాన్ని రూ.17,120 కోట్లకు పెంచాలని ఇంధన శాఖ కోరింది. అందులో టీఎస్ ఎస్పీడీసీఎల్కు రూ.3,654.51 కోట్లు, టీఎస్ఎన్పీ డీసీఎల్‌కు రూ.14,048 కోట్లను కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, గృహాలు, ఇతర కేటగిరీల వినియోగదారులకు ఇప్ప టికే అందిస్తున్న రాయితీలను కొనసాగించడంతో పాటు శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాను 2024–25లో ప్రారంభించడానికి రూ. 17,120 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని ఇంధన శాఖ అంచనా వేసింది. ప్రతి పాదిత సబ్సిడీలో రూ. 4 వేల కోట్లు గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించినవేనని అధికార వర్గాలు తెలిపాయి. రూ. 17,120 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినా వచ్చే ఏడాది కొంత మొత్తంలో విద్యుత్ చార్జీలను పెంచకుంటే డిస్కంల నష్టాలు మరింతగా పెరిగి పోతాయని అధికారులు తెలిపారు. సర్కారీ బకాయిలు రూ.40 వేల కోట్లు ఇవ్వండి గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ముగిసే నాటికి వివిధ శాఖలు, విభాగాల నుంచి డిస్కంలకు రావాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.28,842.72 కోట్లకు పెరిగాయని పేర్కొంటూ ఇటీవల విద్యుత్‌పై ప్రవేశ పెట్టిన శ్వేతపత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి న ఇతర విద్యుత్ బిల్లుల బకాయిలు కలిపి మొత్తం రూ.40,981 కోట్లను డిస్కంలకు 2024–25లో చెల్లించాలని ఇంధన శాఖ ప్రభుత్వాన్ని కోరింది. రూ.17,120 కోట్ల సబ్సిడీ, రూ.40,981 కోట్ల పెండింగ్ బిల్లులు కలిపి మొత్తం రూ.58,684.17 కోట్లను బడ్జెట్లో కేటాయించాలని కోరడం గమనార్హం. -
ఏపీలో విద్యుత్ కోతలు లేవు.. అవాస్తవాలు నమ్మొద్దు: విజయానంద్
సాక్షి, విజయవాడ: ఏపీలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని, పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చామని కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలు అవాస్తవమని ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ కే. విజయానంద్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిశ్రమలకు, వ్యవసాయానికి, గృహావసరాలకి ఎక్కడా కోతలు విధించటం లేదని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆగస్ట్ లో 18 శాతం డిమాండ్ పెరిగిందని ఆయన వివరించారు. ఆగస్ట్ నెలలో సరాసరిన రోజుకి 230 మిలియన్ యూనిట్ల డిమాండ్ కాగా, గత ఏడాదిలో 190 మిలియన్ యూనిట్ల మాత్రమే ఉంది. పెరిగిన డిమాండ్‌తో పాటు వర్షాభావ పరిస్ధితులు తోడయ్యాయి. ఆగస్ట్ 30, 31 తేదీల్లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. సెప్టెంబర్ నెల ఈ వారంలో సరాసరిన 210 మిలియన్ యూనిట్ల వరకు డిమాండ్ ఉంది. ఏపీలోనే కాదు దేశ వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ ఉంది. కర్ణాటక, తమిళనాడు, రాజస్ధాన్, మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో కోతలు అమలవుతున్నాయి. పెరిగిన విద్యుత్ డిమాండ్‌కి తగ్గట్లు ఏపీలో విద్యుత్ సరఫరా చేస్తున్నాం.’’ అని విజయానంద్ తెలిపారు. చదవండి: బాబు బంగ్లాకే ముడుపులు.. మళ్లీ ఆ ముగ్గురే ఏపీలో విద్యుత్ కొరత రాకుండా ముందు జాగ్రత్తగా 40 మిలియన్ యూనిట్ల కొనుగోలు చేశాం. యూనిట్‌ని 13 రూపాయిల వరకు కొనుగోలు చేయడానికి కేంద్రం అనుమతి ఉన్నా యూనిట్ 7.50 రూపాయిలకే కొనుగోలు చేశాం. బొగ్గు కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం. ఏపీలో సెప్టెంబర్ నెలకి సరిపడా బొగ్గు నిల్వలు’’ ఉన్నాయని విజయానంద్ వెల్లడించారు. -
అద్భుత ఘటన: ఇంజనీరింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు!
ఐశ్వర్యారాయ్ లాంటి ప్రపంచ సుందరిని అతి సమీపంలో చూసేసరికి రజనీ వంటి రోబోలో కూడా రసస్పందన కలిగింది. తట్టుకోలేని తమకంలో తలమునకలయ్యాడు. భగవంతుని ఈ సృష్టి వైచిత్రిని తలచుకుని తెగ ఆశ్చర్యపోయాడు. తనవంటి జడపదార్థంలోనూ జమకాలు పాడించిన ఆడదానికి ఓరచూపు పవరుకు పదేపదే సలాములు చేశాడు. ఇనుములో హృదయం మొలిచెనే... అనుకుంటూ డ్యుయెట్లు పాడుకుని మురిసిపోయాడు. దర్శక దిగ్గజం శంకర్ సృజన నుంచి పుట్టుకొచి్చన ఈ సూపర్‌హిట్ సినీ ఫాంటసీ నిజ జీవితంలోనూ జరిగితే? ఇనుములో నిజంగానే హృదయం మొలిస్తే? అమెరికాలో సరిగ్గా ఇదే జరిగింది. ఓ చిన్న ప్లాటినం ముక్క తనలో పుట్టుకొచి్చన పగుళ్లను తనంత తానుగా నయం చేసుకుంది. అదీ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలంతా కళ్లారా చూస్తుండగా! ఈ పరిణామాన్ని అతి సూక్ష్మమైన మైక్రోస్కోప్ ద్వారా వీక్షించి వాళ్లంతా అక్షరాలా అవాక్కయ్యారు. ‘‘మా కళ్లను మేమే నమ్మలేకపోయాం. దీనికి కారణమేమిటన్నది మాకైతే అంతుబట్టడం లేదు. మానవ మేధకు బహుశా ఎప్పటికీ అంతుబట్టదేమో!’’అని చెప్పుకొచ్చారు. ప్రాకృతిక నియమాలనే పూర్తిగా తలకిందులు చేయగల ఈ పరిణామం ఎలా సాధ్యమైందన్న కీలకాన్ని పట్టుకోగలిగితే ఇంజనీరింగ్ రంగంలో కనీవినీ ఎరగని విప్లవాత్మక మార్పులు ఖాయమని వారంతా ముక్త కంఠంతో అంటున్నారు. ఇప్పుడా కీలకాన్ని ఒడిసిపట్టే పనిలో తలమునకలుగా ఉన్నారు... నిరంతర వాడకం తదితరాల వల్ల అరుగుదల వంటివి జరిగి యంత్రాలు పగుళ్లివ్వడం, అవి క్రమంగా పెరిగిపోయి చివరికి పాడవడం సర్వసాధారణం. ఆ మాటకొస్తే ఇది ప్రతి ఇనుప వస్తువు విషయంలోనూ జరిగేదే. నిజానికి చాలా పరిశ్రమల్లో ఈ అరుగుదల తదితరాల ఖర్చే తడిసి మోపెడవుతూ ఉంటుంది కూడా. మరి కార్లు, బస్సులు, భారీ ఇంజన్లు, బ్రిడ్జిలు, విమానాల వంటి ఇనుప వస్తువులన్నీ తమలో తలెత్తే పగుళ్ల వంటి సమస్యలన్నింటినీ తమంతట తామే ఎప్పటికప్పుడు సరిచేసుకోగలిగితే? వాటి భద్రతపై దిగులుండదు. జీవితకాలమూ పెరుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా నిర్వహణ తదితర భారీ ఖర్చులన్నీ పూర్తిగా తప్పుతాయి. ఎంతగా అంటే, ఒక్క అమెరికాలోనే ఏటా వేలాది కోట్ల డాలర్లు ఆదా అవుతాయని ఈ పరిశోధనకు పూనుకున్న శాస్త్రవేత్తల బృందమే అంచనా వేస్తోంది! పైగా రిపేర్లు తదితరాలకు పట్టే అతి విలువైన సమయమూ పూర్తిగా ఆదా అవుతుంది! ఇప్పటికిది అందమైన ఊహే అయినా మున్ముందు నిజమయ్యే ఆస్కారం పుష్కలంగా ఉందంటున్నారు ప్రఖ్యాత అంతర్జాతీయ శాస్త్రవేత్తలు. అదే జరిగితే మౌలిక శాస్త్ర సాంకేతిక సిద్ధాంతాలన్నీ పూర్తిగా మారిపోవడం ఖాయమని కూడా చెబుతున్నారు. ఆ అద్భుతం జరిగిందిలా... ఇనుప పరికరాల్లో అతి సూక్ష్మస్థాయిలో పగుళ్లు ఎలా మొదలవుతాయో తెలుసుకునేందుకు అమెరికాలో ఇంధన శాఖకు చెందిన సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ నానోటెక్నాలజీస్ శాస్త్రవేత్తల బృందం ఇటీవల ఓ పరిశోధన చేసింది. అందులో యాదృచ్ఛికంగా అద్భుతమొకటి జరిగింది. ఏమైందంటే... ► అమెరికాలోని శాండియా, లాస్ అలామోస్ నేషనల్ లేబోరేటరీస్, టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ సంయుక్తంగా ఈ పరిశోధనకు పూనుకున్నాయి. అతి సూక్ష్మ పరిమాణంలోని ప్లాటినం ముక్కలో పగుళ్లు మొదలయ్యే తీరును లోతుగా పరిశోధించడం దీని ముఖ్యోద్దేశం. ► కానీ తీరా ప్రయోగం మొదలైన 40 నిమిషాలకు వారు కలలో కూడా ఊహించనిది జరిగింది. ప్లాటినం ముక్క మొదలైన పగులు విస్తరించడం ఆగిపోయింది! ► ఇదేమిటా అని వాళ్లు తల బద్దలు కొట్టుకుంటుండగానే, ఆ పగులు తనంతట తానే చిన్నదవుతూ క్రమంగా పూర్తిగా పూడి కనుమరుగైపోయింది! ఎంతగా అంటే, అక్కడ పగులు వచి్చన ఆనవాలు కూడా కనిపించలేదు! ► ఇలా మానవ జోక్యం అసలే లేకుండా ఓ లోహం తనలోని పగుళ్లను తానే పూడ్చుకోవడం మనకు తెలిసిన చరిత్రలో బహుశా తొలిసారి జరిగిందని సైంటిస్టులు చెబుతున్నారు. ► ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత జర్నల్ నేచర్‌లో ప్రచురితమయ్యాయి. అచ్చం అతను సూత్రీకరించినట్టే... ఇలాంటి దృగ్విషయాన్ని టెక్సాస్ ఏ అండ్ ఎం వర్సిటీ ప్రొఫెసర్ మైకేల్ డెంకోవిజ్ కొన్నేళ్ల క్రితమే కంప్యూటర్ సిమ్యులేషన్ల ఆధారంగా సూత్రీకరించాడు.తాజా పరిశోధన ఫలితం గురించి తెలిసి ఆయనిప్పుడు ఎంతగానో ఆనందపడుతున్నాడు. తన పాత ప్రయోగాన్ని మరోసారి చేసి చూపిస్తూ, ‘అప్పట్లో నేనెలా సూత్రీకరించానో ఇప్పడు అక్షరాలా అలాగే జరిగిం’దంటూ సంబరపడిపోతున్నాడు. అద్భుతమే, కాకపోతే... జరిగింది నిజంగానే మహాద్భుతమే. ఇందులో అనుమానమే లేదు. కాకపోతే లోహాల్లో అసలు ఈ ‘స్వీయ వైద్యం’ఎలా సాధ్యమన్నది మాత్రం మనకు ప్రస్తుతానికి ఏమీ తెలియదు. దీన్ని ఇంజనీరింగ్, తయారీ రంగాలకు ఎలా అన్వయించుకోవాలన్నది అంతకంటే అవగాహనలోకి రాలేదు. ‘‘అతి సూక్ష్మ స్ఫటికాకార లోహంపై గాలి తదితరాల ఆనవాలు కూడా లేని పూర్తి నియంత్రిత, కృత్రిమ శూన్య పరిస్థితుల్లో ఇది జరిగింది. సాధారణ వాతావరణంలో సంప్రదాయ లోహాల్లో ఇది ఏ మేరకు సాధ్యమన్నది ప్రస్తుతానికి పెద్ద ప్రశ్నే’’అని బాయ్స్ చెప్పుకొచ్చారు. కొసమెరుపు ఇదెలా సాధ్యపడిందన్న దానిపై నెలకొన్న అస్పష్టత, దీన్ని మనకు మేలు జరిగేలా మలచుకోవడం ఏ మేరకు సాధ్యమన్న సందిగ్ధత తదితరాలను పక్కన పెడితే ఇంజనీరింగ్, మెటీరియల్స్ సైన్స్ వంటి పలు రంగాల్లో ఈ పరిశోధన ఫలితం అతి పెద్ద ముందడుగన్నది మాత్రం నిస్సందేహం. లోహాల్లో పగుళ్లంటూ మొదలైతే పెరుగుతూనే పోతాయి. కానీ, అత్యంత జడమైనవిగా భావించే లోహాలకు కూడా ఇలా తమను తాము నయం చేసుకోగల స్వాభావిక సామర్థ్యం ఉందని మా పరిశోధన తేటతెల్లం చేయడం ఓ నమ్మశక్యం కాని నిజం!’’ – బ్రాడ్ బాయ్స్, మెటీరియల్స్ సైంటిస్టు, శాండియా నేషనల్ లేబోరేటరీస్ –సాక్షి, నేషనల్ డెస్క్ -
తెలంగాణ విద్యుత్ సంస్థలకు కొత్త బాస్‌లు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎండీలు, డైరెక్టర్ల మార్పు, కొత్తవారి నియామకంపై ఊహా గానాలు ఊపందుకున్నాయి. కొత్త సీఎండీలు, డైరెక్టర్ల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభించిందని చెబుతున్నారు. సింగరేణి సంస్థ సీఎండీగా ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఎన్.శ్రీధర్.. ట్రాన్స్‌కో, జెన్కో సంస్థల సీఎండీ రేసులో ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం. అయితే ఆయన ఇప్పటికే ఆయన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ సీఎండీగా ఎంపికైనా, ఇంకా నియామక ఉత్తర్వులు జారీ కాలేదు. శ్రీధర్ కాకుంటే, సీఎంకు అత్యంత విశ్వసనీయంగా ఉండే సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో ఒకరిని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. తనకు విముక్తి కల్పించాలంటున్న ప్రభాకర్‌రావు.. తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) సీఎండీగా, విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో)ల ఇన్చార్జి సీఎండీగా డి.ప్రభాకర్‌రావు గత నెలతో 9 ఏళ్లు, 2019 జనవరి 10 నాటికి విద్యుత్ సంస్థల్లో 50 ఏళ్ల సుదీర్ఘ సర్వీసు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించారు. ఆయన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్‌గా 1969 జనవరి 10న ఎలక్ట్రిసిటీ బోర్డులో చేరారు. విద్యుత్ రంగానికి సంబంధించిన విధానాల రూపకల్పన, నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ (టీఎస్పీసీసీ) చైర్మన్ హోదాలో ఆయన డిస్కంల నిర్వహణను సైతం పర్యవేక్షించారు. ఆయనకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) హోదాను కట్టబెట్టి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రస్తుతం 76 ఏళ్ల వయస్సులో ప్రభాకర్‌రావు వయోభారం, అనా రోగ్య సమస్యలతో ఇబ్బందులు పడు తున్నారు. తనను బాధ్యతల నుంచి తప్పిస్తే విశ్రాంతి తీసు కుంటానని గతంలో ఆయన విజ్ఞప్తి చేయగా సీఎం కేసీఆర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే గత నెల రోజులుగా ఆయన బహిరంగ సభల్లో తనకు బాధ్యతల నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సమీప భవిష్యత్తులో తాను బాధ్యతల నుంచి తప్పు కున్నా మరో విధంగా భావించవద్దని విద్యుత్ ఉద్యోగులకు ఆయన తాజా గా విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తులపై ప్రభుత్వం నుంచి సాను కూల సంకేతాలు అందిన నేపథ్యంలోనే ఆయనీ ప్రకటనలు చేశారని విద్యుత్ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 80 ఏళ్లకు చేరువలో ఉత్తర డిస్కం సీఎండీ.. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీ డీసీఎల్) సీఎండీగా ఎ.గోపాల్ రావు ఆరున్నరేళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన 2003లో చీఫ్ ఇంజనీర్‌గా రిటైరయ్యారు. ప్రస్తు తం ఆయన వయస్సు 78 ఏళ్లకు పైనే. వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఆయన వృద్ధాప్య సమ స్యల వల్ల తరుచుగా హైదరాబాద్‌కు రావాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యుత్ శాఖ వర్గాలు చెబుతు న్నాయి. ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని అంటున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీగా జి.రఘుమా రెడ్డి సైతం ఈ నెలలో 9 ఏళ్లను పూర్తి చేసుకోనున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు కూడా 71 ఏళ్లకు పైనే. ఒక వేళ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీగా నాన్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తే ఈయన పేరును సైతం పరిశీలించే అవకాశం ఉంది. డైరెక్టర్లు కూడా దీర్ఘకాలంగా.. టీఎస్ఎస్పీడీసీఎల్లో 8 మంది, టీఎస్ఎన్పీ డీసీఎల్‌లో ఆరుగురు, ట్రాన్స్‌కోలో జేఎండీ, మరో నలుగురు డైరెక్టర్లు, జెన్కోలో ఆరుగురు డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో చాలామంది 9 ఏళ్లకు పైగా ఆయా పదవుల్లో కొనసాగు తున్నారు. వీరిలో చాలామంది 70 ఏళ్లకు పైబడిన వారే. కొన్ని విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల సంఖ్య మంజూరైన పోస్టు ల సంఖ్య కంటే పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కొందరు డైరెక్టర్లను సాగనంపి వారి స్థానంలో కొత్తవారిని నియమించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. -
బాదుడు.. బుకాయింపే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను భారీగా పెంచేసిందంటూ టీడీపీ నేతలు, ఎల్లో మీడియా మరోసారి దుష్ప్రచారానికి తెగబడ్డాయి. రకరకాల పేర్లతో అదనపు బాదుడు పెరిగిందంటూ వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. నిజానికి విద్యుత్ బిల్లులో అన్ని వివరాలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతితో, మార్గదర్శకాల ప్రకారమే పొందుపరుస్తున్నట్లు ఇంధన శాఖ తెలిపింది. చట్టప్రకారమే సర్దుబాటు.. విద్యుత్ రిటైల్ సరఫరా వ్యవస్థలో ఏడాదికోసారి ఆర్థిక సంవత్సరం మొదలయ్యే ముందు ధరలు ప్రకటిస్తారు. విద్యుత్ పంపిణీ రంగంలో ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలకు అనుగుణంగా సర్దుబాటు చార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ, అవసరాల నివేదికను సెప్టెంబర్ నాటికి ఉన్న పరిస్థితుల ఆధారంగా రూపొందిస్తాయి. కాబట్టి అప్పుడు వంద శాతం ఖచ్చితత్వంతో విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని అంచనా వేయడం సాధ్యం కాదు. ఆర్థిక సంవత్సరం కొనసాగుతున్నప్పుడు విద్యుత్ కొనుగోలు ఖర్చులో హెచ్చు తగ్గులుంటాయి. విద్యుత్ చట్టం నిబంధనల్లో నిర్దేశించిన విధంగా ఇంధన చార్జీలు / కొనుగోలు వ్యయంలో హెచ్చుతగ్గులను సర్దుబాటు చార్జీల ద్వారా వసూలు చేసుకునే వెసులుబాటు డిస్కమ్‌లకు ఉంది. ఆ ప్రకారమే సర్దుబాటు చార్జీలను విధిస్తున్నాయి. రైతులపై పైసా భారం లేదు.. 2014–15 నుంచి 2018–19 వరకు పంపిణీ వ్యవస్థకు సంబంధించి నెట్వర్క్ ట్రూఅప్ చార్జీలు దాదాపు రూ.3,977 కోట్లుగా ఏపీఈఆర్సీ నిర్ధారించింది. ఇందులో ఏపీఎస్పీడీసీఎల్ వాటా రూ.2135 కోట్లు కాగా ఏపీసీపీడీసీఎల్ వాటా రూ.1,232 కోట్లు, ఏపీఈపీడీసీఎల్ ఖర్చు రూ.609 కోట్లుగా మండలి పేర్కొంది. ఉచిత వ్యవసాయ విద్యుత్ నిమిత్తం ట్రూఅప్ భారం రూ.1,066.54 కోట్లు. రైతులకు అందించే విద్యుత్ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరిస్తోంది. కాబట్టి ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగానికి సంబంధించి ఇంధన వ్యయ సర్దుబాటును కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మిగిలిన మొత్తం ఇతర కేటగిరీ (వ్యవసాయం కాకుండా) వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలని డిస్కమ్‌లను కమిషన్ ఆదేశించింది. పెరిగినదానికన్నా తక్కువే.. విద్యుత్ కొనుగోలులో స్థిర చార్జీలు, చర చార్జీలు (బొగ్గు, ఆయిల్, రవాణా, వాటిపై పన్నులు, డ్యూటీలు) ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. దానికి తోడు బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధరలు ప్రస్తుత అధిక డిమాండ్ సీజన్లో (ఫిబ్రవరి – జూన్) గరిష్టంగా యూనిట్ రూ.10 వరకు ఉంటున్నాయి. అంటే టారిఫ్ ఉత్తర్వుల్లో అంచనా విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ రూ.4.30 కన్నా వాస్తవ విద్యుత్ కొనుగోలు ధర అధికంగా ఉంటోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత పరిస్థితుల నడుమ విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. అయినప్పటికీ వినియోగదారులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. దానివల్ల విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్‌కు దాదాపు రూ.1.20 పెరిగింది. నిబంధనలకు లోబడి ప్రతి నెల విద్యుత్ కొనుగోలు వ్యయ సర్దుబాటు తగ్గింపు లేదా పెంపు యూనిట్‌కు రూ.0.40 వరకూ వసూలు చేసుకునేందుకు డిస్కమ్‌లకు అనుమతి ఉంది. కేంద్రమే చెప్పింది అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల ప్రకారం వార్షిక సర్దుబాటు విధానం స్థానంలో 2021–22 నుంచి త్రైమాసిక సర్దుబాటు విధానం అమలులోకి వచ్చింది. ఈ నిబంధనలకు అనుగుణంగానే ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే పంపిణీ సంస్థలు విద్యుత్ కొనుగోలు వ్యయంలో హెచ్చుతగ్గులపై నివేదికలను సమర్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు త్రైమాసిక విద్యుత్ సర్దుబాటు చార్జీల విధానానికి బదులుగా నెలవారీ విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని సర్దుబాటు చేసేలా ఇటీవల ఏపీఈఆర్సీ మార్గదర్శకాలు జారీ చేసింది. 2021–22కి సంబంధించి త్రైమాసికం ప్రాతిపదికన ఇంధన విద్యుత్ కొనుగోలు సవరింపు చార్జీలు వసూలు చేస్తుండగా ఏపీఈఆర్సీ నియమావళి ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నెల అదనపు విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని జూన్ నెల విద్యుత్ బిల్లులతో కలిపి తీసుకుంటున్నారు. -
పుష్కలంగా కరెంటు
సాక్షి, అమరావతి/ఇబ్రహీంపట్నం: రాష్ట్ర విద్యుత్ రంగంలో ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డాక్టర్ ఎన్టీటీపీఎస్)లో స్టేజ్–5 కింద 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన 8వ యూనిట్‌ను విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం చేసింది. కోవిడ్ కష్టకాలాన్ని, అనేక సవాళ్లను అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయించిన ఈ యూనిట్‌ను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ జెన్కో చైర్మన్ కె.విజయానంద్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు శుక్రవారం ఉదయం ‘లైట్ అప్’ చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. ఆగస్టు నాటికి దీనిలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే ఏపీ జెన్కో విద్యుదుత్పత్తి సామర్థ్యం 8,789 మెగావాట్లకు పెరుగుతుంది. తగ్గనున్న కొనుగోళ్లు ఏపీ జెన్కో ప్రస్తుతం 5,810 మెగావాట్ల థర్మల్, 1773.6 మెగావాట్ల హైడల్, 405.426 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంది. లోయర్ సీలేరులో 230 మెగావాట్ల అదనపు ఉత్పత్తి కోసం రెండు అదనపు యూనిట్లను 2024 ఏప్రిల్‌కి అందుబాటులోకి తేనుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఉమ్మడి ప్రాజెక్టు అయిన మాచ్‌ఖండ్ పవర్ హౌస్ సామర్థ్యాన్ని కూడా 120 నుంచి 150 మెగావాట్లకు పెంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పునర్నిర్మించాలని కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వేసవిలో ఎనిమిదేళ్ల తరువాత అనూహ్యంగా డిమాండు పెరిగినప్పటికీ ఏపీ జెన్కో రోజూ సగటున 105 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అందిస్తోంది. రాష్ట్ర మొత్తం వినియోగంలో 40 నుంచి 45 శాతం విద్యుత్ ఏపీ జెన్కో నుంచే వస్తోంది. కొత్తగా లైట్‌అప్ చేసిన యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తే రోజూ మరో 15 నుంచి 20 మిలియన్ యూనిట్లను జెన్కో అదనంగా సరఫరా చేస్తుంది. జెన్కో ఉత్పత్తి సామర్థ్యం ఎంత మేరకు పెరిగితే అంత మేరకు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలును డిస్కంలు తగ్గించుకోవచ్చు. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయాలు విజయానంద్ గత ఏడాది కాలంలో 1,600 మెగావాట్ల అదనపు సామర్థ్యం గల రెండు యూనిట్లు అందుబాటులోకి రావడం ఏపీ జెన్కో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయాలని జెన్కో చైర్మన్ విజయానంద్ చెప్పారు. ఎన్టీటీపీఎస్ నూతన యూనిట్‌ను ‘లైట్‌అప్’ చేశారు. ముందుగా బాయిలర్‌లో నీటి ద్వారా స్టీమ్ తయారీ ప్రక్రియను ప్రారంభించారు. కంట్రోల్ రూమ్‌లో స్టీమ్ రీడింగ్‌పై సంతృప్తి వ్యక్తం చేసి ఇంజినీర్లను అభినందించారు. ఆవిరి ప్రక్రియ పూర్తి స్థాయికి చేరగానే బొగ్గు ద్వారా స్టీమ్ రీడింగ్ పెరిగి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అనంతరం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో 800 మెగావాట్ల సామర్థ్యం గల స్టేజ్–2 యూనిట్‌ను గతేడాది అక్టోబర్ 27న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతికి అంకితం చేశారని గుర్తు చేశారు. ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల యూనిట్‌ను ఆగస్టు నాటికి కమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీఓడీ)కి వీలుగా సిద్ధం చేయాలని బీహెచ్ఈఎల్, బీజీఆర్ ప్రతినిధులకు సూచించారు. ట్రయల్ రన్లో వచ్చే లోటుపాట్లను సరిదిద్దుకుని, మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని జెన్కో ఎండీ చక్రధర్‌బాబు తెలిపారు. ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్నారు. ఏపీ జెన్కో డైరెక్టర్లు చంద్రశేఖర్‌రాజు (థర్మల్), బి.వెంకటేశులురెడ్డి (ఫైనాన్స్), సయ్యద్ రఫీ (హెచ్ఆర్, ఐఆర్), సత్యనారాయణ (హైడల్), అంథోనీ రాజ్ (కోల్) తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ వార్ఫేర్ను ఎదుర్కొనేలా మన ‘పవర్’
సాక్షి, అమరావతి: దేశ విద్యుత్ అవసరాల్లో దాదాపు 40 శాతం పునరుత్పాదక ఇంధనమైన గాలి, నీరు, సౌర విద్యుత్ నుంచే సమకూరుతోంది. మన రాష్ట్రంలో ప్రభుత్వం ఈ స్వచ్ఛ ఇంధనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులతో పాటు సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు రాష్ట్రం అనుకూలంగా మారింది. ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో జరిగిన దాదాపు రూ.9.47 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలే దీనికి నిదర్శనం. అయితే, ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ప్రాజెక్టులు సైబర్ దాడులకు గురవుతాయనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెండేళ్ల క్రితం పవర్ గ్రిడ్ పనితీరులో అంతరాలను నిపుణులు గుర్తించారు. దీనికి సైబర్ దాడి కారణం కావచ్చనే అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో దిగుమతి చేసుకున్న విద్యుత్ సరఫరా విడి భాగాలపై మంత్రిత్వ శాఖ సైబర్ భద్రతా చర్యలను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచే సింది. మాల్వేర్, ట్రోజన్లు వంటి ఏదైనా సైబర్ బెదిరింపుల కోసం దిగుమతి చేసుకున్న అన్ని విద్యుత్ సరఫరా విడి భాగాలను నేరస్తులు వాడుకునే అవకాశం ఉండటంతో హానికరమైన ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఉందేమో అనే విషయాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. అలాగే ఆ పరికరాలు భారతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాయో లేదో తనిఖీ చేస్తామని చెప్పింది. సైబర్ దాడులు దేశ విద్యుత్ సరఫరా వ్యవస్థకు విఘాతం కలిగించడంతో మొత్తం దేశాన్ని నిర్విర్యం చేయగలవని కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన పరీక్షలన్నీ తాము నిర్దేశించిన, ధ్రువీకరించిన ప్రయోగశాలల్లో తప్పనిసరిగా నిర్వహించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సీఎస్ఐఆర్ టీమ్ ఏర్పాటు సైబర్ సెక్యూరిటీలో భాగంగా పవర్ ఐలాండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. సెంట్రల్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ (సీఎస్ఐఆర్టీ)ను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ఆధ్వర్యంలో వివిధ ప్రైవేటు సంస్ధల్లో శిక్షణ పొందిన సైబర్ (ఇంటర్నెట్) నిపుణులు ఈ బృందంలో ఉంటారు. మన దేశంలో నార్తరన్, వెస్ట్రన్, సదరన్, ఈస్ట్రన్, నార్త్ ఈస్ట్రన్ అనే ఐదు ప్రాంతీయ పవర్ గ్రిడ్లు ఉన్నాయి. వీటన్నిటినీ ‘వన్ నేషన్.. వన్ గ్రిడ్’ కింద సెంట్రల్ గ్రిడ్‌కు అనుసంధానించారు. ఈ గ్రిడ్‌లన్నిటి కార్యకలాపాలన్నీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో జరుగుతుంటాయి. ఇంత పెద్ద గ్రిడ్‌కు సంబంధించిన సమాచార వ్యవస్థను శత్రువులు చేజిక్కుంచుకుంటే దేశం మొత్తం చీకటైపోతుంది. ఈ నేపథ్యంలో పవర్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాలపై సైబర్, ఉగ్ర దాడులను ఎదుర్కోవటానికి రాష్ట్రాల్లోని పలు నగరాల్లో పవర్ ఐలాండ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. గ్రిడ్‌లో ఏదైనా అంతరాయం ఏర్పడితే విద్యుత్ వ్యవస్థను వెంటనే దాని నుంచి వేరు చేయడాన్ని పవర్ ఐలాండింగ్ సిస్టమ్ అంటారు. దీనివల్ల పవర్ గ్రిడ్లు కుప్పకూలకుండా నియంత్రించవచ్చు. ఏపీ ఇంధన శాఖ అనుసరిస్తున్న జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) వల్ల ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంల మొత్తం ట్రాన్స్మిషన్, డి్రస్టిబ్యూషన్ నెట్‌వర్క్‌లను జియో ట్యాగింగ్ చేయడం తేలికైంది. దీంతో భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్లో భాగమైన సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ), దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్‌ను పర్యవేక్షించడానికి ఏపీ ట్రాన్స్‌కో జీఐఎస్ మోడల్‌ను తీసుకుంది. విద్యుత్ సంస్థల్లో ఎక్కువ మంది సిబ్బంది విద్యుత్ కార్యకలాపాలను తమ సెల్ఫోన్ల ద్వారానే నియంత్రిస్తున్నారు. వారిని మోసగించి వారి ఫోన్లో హానికర సాఫ్ట్వేర్ పంపి విలువైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. -
ఆర్డీఎస్ఎస్తో డిస్కంల అభివృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ప్రపంచస్థాయి సేవలు అందించేలా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను పునరుద్ధరణ పంపిణీరంగ పథకం (ఆర్డీఎస్ఎస్) ద్వారా అభివృద్ధి చేస్తున్నట్లు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చెప్పారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.11 వేల కోట్ల పెట్టుబడి పెడుతోందని తెలిపారు. ఈ మొత్తం పెట్టుబడిలో 60 శాతం కేంద్రం నుంచి గ్రాంట్‌గా పొందవచ్చని చెప్పారు. ఆయన ఆదివారం ఇంధనశాఖ ఆధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్డీఎస్ఎస్ ద్వారా డిస్కంలు బలోపేతం కావడం వల్ల అన్నివర్గాల వినియోగదారులకు అధిక నాణ్యత గల విద్యుత్‌ను అందించవచ్చనితెలిపారు. విద్యుత్ సంస్థ (పవర్ యుటిలిటీస్)ల ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాల తగ్గింపు, ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, పంప్డ్ హైడ్రోస్టోరేజి ప్రాజెక్టులు మొదలైన వాటితోసహా అనేక రాష్ట్ర ప్రభుత్వం పథకాలను నవరత్నాల కింద విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. తద్వారా గత మూడునెలల స్వల్ప వ్యవధిలో విద్యుత్ సంస్థలు జాతీయస్థాయిలో ఆరు అవార్డులు సాధించాయని చెప్పారు. 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ సరఫరాతోపాటు వ్యవసాయానికి సబ్సిడీ రూపంలో రూ.8,400 కోట్లు ఏటా కేటాయిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లను అమర్చడం వల్ల డిస్కంలకు, రైతులకు ప్రయోజనమని చెప్పారు. ఏ రైతు తమ జేబులోంచి ఒక్కపైసా చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే బిల్లు మొత్తాన్ని రైతుల ఖాతాలో జమచేస్తుందని చెప్పారు. 16,66,282 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు బిగించాలని నిర్ణయించగా.. 16,55,988 కనెక్షన్లకు సంబంధించిన రైతులు అంగీకారం తెలిపారని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, డిస్కంల సీఎండీలు జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు, ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. -
AP: ఈ వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు: విజయానంద్
సాక్షి, విజయవాడ: ఈ వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్నారు. గురువారం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ, వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. సీఎం ఆదేశాలతో ప్రణాళికాబద్దంగా వేసవి డిమాండ్‌ని అధిగమిస్తామన్నారు. ‘‘గత ఏడాది కంటే ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో సరాసరిన రోజుకి 202 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 227 మిలియన్ యూనిట్లకి పెరిగింది. గత ఏడాది మార్చి నెలలో రోజుకి 212 మిలియన్ యూనిడ్ల డిమాండ్ ఉంటే ఇపుడు 232 మిలియన్ యూనిట్లకి డిమాండ్ పెరిగింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో పీక్ డిమాండ్ 232 మిలియన్ యూనిట్ల కాగా.. ఈ ఏడాది మార్చి రెండవ వారంలోపే 232 మిలియన్ యూనిట్లు దాటాం. గడిచిన ఏడాది కాలంలో ఏపీలో పెరిగిన పరిశ్రమల కారణంగా వాణిజ్య అవసరాలకి 18 శాతం, పరిశ్రమలకి 20.31 శాతం విద్యుత్ వినియోగం పెరిగింది’’ అని విజయానంద్ వివరించారు. ‘‘ఈ కారణంగానే విద్యుత్ డిమాండ్ ఊహించని విధంగా రికార్డు స్ధాయికి పెరిగింది. మార్చి నెలాఖరుకి 240 మిలియన్ యూనిట్లు.. ఏప్రిల్ నెలకి 250 మిలియన్ యూనిట్లకి డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఏప్రిల్ నెలలో ఒక్క వ్యవసాయానికే సరాసరిన 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుంది. పెరిగిన డిమాండ్ కి తగ్గట్లుగా విద్యుత్ కోతలు లేకుండా చర్యలు చేపడుతున్నాం. పరిశ్రమలకి, గృహావసరాలకి నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉంటుంది. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫారా కొనసాగిస్తాం’’ అని ఆయన తెలిపారు. చదవండి: సీఎం జగన్ మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నారు: సజ్జల కృష్ణపట్నం మూడవ యూనిట్ ద్వారా 800 మెగా వాట్ల విద్యుత్ నేటి నుంచి పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. సెమ్ కాబ్ ద్వారా 500 మెగా వాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. మార్కెట్లో యూనిట్ ధర 12 రూపాయిలుంటే వేసవి అవసరాలను దృష్డిలో పెట్టుకుని ముందుగానే మార్చి, ఏప్రిల్ నెల కోసం యూనిట్ 7.90 రూపాయలకు విద్యుత్ కొనుగోలుకి ఎంఓయు చేసుకున్నాం. అదే విధంగా ఇతర రాష్ట్రాలతో 300 మెగా వాట్ల విద్యుత్‌కి బ్యాంకింగ్ ఒప్పందాలు చేసుకున్నాం’’ అని విజయానంద్ వెల్లడించారు. -
ఆదా.. ఇదిగో
సాక్షి, అమరావతి: ‘‘శ్రీకాకుళంలో స్మార్ట్ మీటర్లను అమర్చడం, నెలవారీ రీడింగ్‌లు నమోదు చేయడం అభినందనీయం. వ్యవసాయ విద్యుత్ మీటరింగ్ కోసం విలువైన పాఠాలను అందించేలా ఈ ప్రయోగం చేపట్టిన డిస్కమ్‌లు, సంబంధిత విభాగాలను అభినందించాల్సిన అవసరం ఉంది’’ – తుది నివేదికలో ప్రయాస్ సంస్థ ప్రశంసలివీ.. వ్యవసాయ బోర్లకు స్మార్ట్ విద్యుత్ మీటర్లను అమర్చడం వల్ల రైతులకు మేలేగానీ కీడు జరగదు. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం, ఇంధన శాఖ ఇప్పటికే అనేక సార్లు స్పష్టం చేసినా కొన్ని పార్టీలు, వాటి అనుకూల మీడియా పని గట్టుకుని విషప్రచారం చేస్తూనే ఉన్నాయి. అన్నదాతలను అయోమయంలోకి నెట్టేయాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నాయి. స్మార్ట్ మీటర్ల వల్ల ఏ మీటర్లో ఎంత విద్యుత్ వినియోగం జరుగుతోందనేది ప్రతి 15 నిమిషాలకు ఒకసారి తెలుస్తుంది. అదే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్, ఫీడర్ల వద్ద మీటర్లు పెట్టి రీడింగ్ తీస్తే వాటి పరిధిలోని నాలుగైదు మీటర్ల విద్యుత్ వినియోగం వస్తుంది. ఏ రైతు ఎంత విద్యుత్ వాడుతున్నారనేది కచ్చితంగా చెప్పడం కష్టం. పంటలు ఉన్నప్పుడు మీటర్ల దగ్గరికి వెళ్లడం చాలా కష్టం. అదే స్మార్ట్ మీటర్లతో ఈ సమస్యలన్నీ తీరుతాయి. రిమోట్ ద్వారా మీటర్‌ను ఆపరేట్ చేయవచ్చు. రీడింగ్ కోసం మీటర్ దగ్గరకు వెళ్లవలసిన అవసరం ఉండదు. రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మీటర్ అమర్చడమే కాకుండా వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్, మోటార్ కాలిపోకుండా, రైతుల ప్రాణ సంరక్షణ బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంది. అందుకు అవసరమైన ఐదు రక్షణ పరికరాలను (అలైడ్ మెటీరియల్) మీటర్లతో పాటు ఏర్పాటు చేయనుంది. మిగతా రాష్ట్రాల్లో కేవలం మీటర్లే ఇస్తున్నారు. మన దగ్గర స్మార్ట్ మీటర్‌తో పాటు మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్(ఎంసీసీబీ)తో కూడిన షీట్ మౌడ్లింగ్ కాంపొనెంట్(ఎస్ఎంసీ) బాక్స్‌ను అందిస్తున్నారు. ప్రస్తుతం ఫ్యూజు కారియర్లు ఇనుముతో చేసినవి ఉండగా వాటి స్థానంలో తాకినా విద్యుత్ షాక్ కొట్టని మెటీరియల్‌తో ఈ బాక్సులు తయారవుతాయి. ఇప్పుడున్నట్లు మూడు ఫ్యూజులు కూడా ఉండవు. దానివల్ల మోటార్లు కాలిపోయే అవకాశం ఉండదు. అలాగే ఎర్తింగ్ పైప్ కూడా ఇస్తారు. ఓల్టేజ్ సమస్యల నుంచి కాపాడేందుకు షంట్ కెపాసిటర్లను అమర్చుతారు. ఈ ఏర్పాటు వల్ల విద్యుత్ ప్రమాదాల నుంచి రైతులకు, జీవాలకు, వాతావరణ పరిస్థితుల నుంచి స్మార్ట్ మీటర్లకు రక్షణ లభిస్తుంది. అలైడ్ మెటీరియల్, మీటర్లకు కలిపి ప్రభుత్వం రూ.4,000 కోట్లు భరిస్తోంది. ఎవరు చెప్పారు? వాస్తవాలను వక్రీకరిస్తూ తప్పుడు సమాచారంతో అబద్ధాలను అడ్డంగా అచ్చేసిన ఈనాడు రాతలను ఇంధన శాఖ తీవ్రంగా తప్పుబట్టింది. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టవద్దని, వాటివల్ల విద్యుత్ ఆదా జరగకపోగా ఖర్చు వృథా అని ఏ సంస్థగానీ, రైతులుగానీ చెప్పలేదని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు. ఇంధన శాఖ జాయింట్ సెక్రటరీ బీఏవీపీ కుమార్‌రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, సెంట్రల్ డిస్కమ్ సీఎండీ జె.పద్మాజనార్ధనరెడ్డితో కలసి విజయవాడలోని విద్యుత్ సౌధలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ► మీటర్లు అమర్చడం ద్వారా డిస్కమ్‌లలో జవాబుదారీతనం పెరగడంతో పాటు రైతులకు ఉచిత విద్యుత్ హక్కుగా లభిస్తుంది. ‘ప్రయాస్’ సంస్థ ఏడాదిన్నర క్రితం జరిపిన శాంపుల్ అధ్యయనంలో పలు సూచనలు మాత్రమే చేసింది. సగటు విద్యుత్ కొనుగోలు ధరను ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ ఒక యూనిట్‌కి రూ.4.20 చొప్పున తీసుకుని లెక్కించడం వల్లే గణాంకాలు సరిగా లేవు. వాస్తవానికి సగటు సరఫరా ఖర్చు ఒక యూనిట్‌కి రూ.6.98 చొప్పున ఉంది. దీన్ని ఏపీఈఆర్సీ నిర్ణయించింది. ► ఫీడర్ల వద్ద నష్టాలు నమోదవుతున్నట్లు ప్రయాస్ చెబుతున్నా స్మార్ట్ మీటర్లు అమర్చిన తరువాత ఫీడర్ రీడింగ్ తీయలేదు. ఆ నష్టం విద్యుత్ చౌర్యం వల్ల జరిగి ఉండవచ్చు. ఇలాంటివి అరికట్టేందుకే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ► రెండు, మూడు వారాల్లో స్మార్ట్ మీటర్ల టెండర్ల ప్రక్రియ పూర్తవుతుంది. రైతులను గందరగోళానికి గురిచేస్తూ పదేపదే తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న పత్రికలు, ప్రసారం చేస్తున్న ఛానళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వాటి యాజమాన్యాలకు లీగల్ నోటీసులు కూడా పంపుతున్నాం. ► మొత్తం 16,66,282 వ్యవసాయ సర్వీసుల్లో 16,55,988 మంది రైతులు బ్యాంకు ఖాతాలు తెరిచి నిరభ్యంతర పత్రాలిచ్చారు. 10,294 మందికి మాత్రమే ఖాతాలు లేవు. వారితో కూడా తెరిపించేందుకు డిస్కమ్‌లు ప్రయత్నిస్తున్నాయి. శ్రీకాకుళంలో ఇలా.. శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టుగా 2023 ఫిబ్రవరి నాటికి 29,302 సర్వీసులకు స్మార్ట్ మీటర్లను అమర్చగా 83.16 శాతం పని చేస్తున్నాయి. ఈ మీటర్ల ద్వారా 2021–22లో 33.24 శాతం అంటే 2.81 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఆదా అయ్యింది. సగటున 6.66 శాతం మాత్రమే పాడవడం, కాలిపోవడం జరిగింది. భవిష్యత్తులో వాటి మరమ్మతుల ఖర్చు సరఫరా సంస్థ భరించేలా టెండర్లు రూపొందించారు. అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు పెడితే కేవలం రెండున్నరేళ్లలోనే పెట్టుబడి వెనక్కి వస్తుంది. -
జాతీయ లక్ష్యానికి చేయూతనివ్వాలి..
సాక్షి, అమరావతి : ఇంధన పొదుపు, సామర్థ్యంలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఏపీ.. జాతీయ లక్ష్యానికి మరింత చేయూతనివ్వాల్సిందిగా బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే కోరారు. మార్చి 1న న్యూఢిల్లీలోని ఇండియన్ హాబిటాట్ సెంటర్లో జరగనున్న బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) 21వ వ్యవస్థాపక దినోత్సవాలకు రాష్ట్రాన్ని ఆహ్వానించారు. ఈ మేరకు స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీ(ఎస్డీఏ)గా ఉన్న ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్(ఏపీఎస్ఈసీఎం)కు సమాచారం అందించడం కోసం బాక్రే ఆదివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. 2030 నాటికి ఏపీలో 6.68 మిలియన్ టన్నుల చమురుకు సమానమైన(ఎంటీవోఈ) ఇంధనాన్ని ఆదా చేయాలనే లక్ష్యాన్ని చేరుకునే కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డిని బాక్రే కోరారు. -
విద్యుత్ కొరత రాకూడదు
సాక్షి, అమరావతి: వేసవిలో విద్యుత్ కొరత రాకూడదని, డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను సమకూర్చుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. వేసవిలో విద్యుత్ డిమాండ్, రైతులకు విద్యుత్ కనెక్షన్లు, నాణ్యమైన విద్యుత్ సరఫరా తదితర అంశాలపై శుక్రవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఇంధన శాఖతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, వేసవి డిమాండ్ అంచనాలను ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున ఫిబ్రవరి 2వ వారం నుంచే విద్యుత్ డిమాండ్ పెరిగిందని చెప్పారు. మార్చిలో సగటున రోజుకు 240 మిలియన్ యూనిట్లు, ఏప్రిల్‌లో 250 మిలియన్ యూనిట్లు ఉంటుందని అంచనా వేశామని తెలిపారు. విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పవర్ ఎక్స్చ్ంజ్ (బహిరంగ మార్కెట్)లో విద్యుత్‌ను షార్ట్ టర్మ్ టెండర్ల ద్వారా ముందస్తుగా బుక్ చేసుకున్నామని చెప్పారు. బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్త వహించాలని, థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వేసవిలో విద్యుత్ కొరత కారణంగా కరెంటు కోతలనే సమస్య ఉత్పన్నం కాకూడదని స్పష్టం చేశారు. అదే నెలలో విద్యుత్ కనెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అందించే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై ఈ సమావేశంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి 1.06 లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేశామని సీఎంకు అధికారులు వెల్లడించారు. మార్చి నాటికి మరో 20 వేల కనెక్షన్లపైగా మంజూరు చేస్తున్నామని చెప్పారు. రైతులకు కనెక్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదన్న సీఎం.. ఇకపై ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో సర్వీసు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేస్తామని అధికారులు చెప్పారు. సరఫరాలో నాణ్యత విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచాలన్న సీఎం ఆదేశాల మేరకు అనేక చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తవుతోందని తెలిపారు. మార్చి ఆఖరు నాటికి వీటిని పూర్తి చేస్తామని తెలిపారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్న ఇళ్లకు వెంటనే కనెక్షన్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 2.18 లక్షలకుపైగా ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చామని, ఇళ్లు పూర్తవుతున్న కొద్దీ వాటికి శరవేగంగా కనెక్షన్లు ఇస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ కె.విజయానంద్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ట్రాన్స్‌కో జేఎండీలు ఐ.పృధ్వీతేజ్, బి.మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మాజనార్ధనరెడ్డి, నెడ్‌క్యాప్ వీసీఎండీ ఎస్.రమణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
స్మార్ట్ మీటర్లపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు
-
‘స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు.. అది తప్పుడు ప్రచారం’
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఏపీ జెన్కో ఆధ్వర్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని ఏపీ ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విద్యుత్ పంపిణీలో అత్యాధునిక విధానాలు ప్రవేశపెడుతున్నామన్నారు. స్మార్ట్ మీటర్లపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఐఆర్డీఏ మీటర్లకు, స్మార్ట్ మీటర్లకు వ్యత్యాసం ఉండదన్నారు. మారుతున్న సాంకేతికని ఇంధనశాఖ అంది పుచ్చుకుంటోందని విజయానంద్ అన్నారు. ‘‘ట్రాన్స్‌కోలో ప్రతీ జిల్లాలో 400 కేవీ సబ్ స్టేషన్స్ అందుబాటులోకి తీసుకువచ్చాం. వినియోగదారులకి త్వరితగతిన సేవలు అందించడానికే స్మార్ట్ మీటర్లు. స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్ దేశమంతా ఒకేలా ఉంటుంది. మొదటి ఫేజులో 27 లక్షల మీటర్లు స్మార్ట్ మీటర్లు బిగిస్తాం. ఇందులో 4.72 లక్షలు మాత్రమే గృహావసరాల కనెక్షన్స్ ఉన్నాయి. అమృత్ సిటీలోని జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో 200 యూనిట్లు దాటిన 4.72 లక్షల కనెక్షన్స్‌కి మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగిస్తాం. రాష్ట్రం మొత్తం 1.80 కోట్లు వినియోగదారులు ఉన్నారు. 1.80 కోట్ల కనెక్షన్లకి స్మార్ట్ మీటర్లనేది అవాస్తవం’’ అని విజయానంద్ స్పష్టం చేశారు. ‘‘13.54 లక్షల మందికి సెకండ్ ఫేజులో స్మార్ట్ మీటర్లు ఇవ్వాలని నిర్ణయిస్తున్నాం. ఇంకా టెండర్లు పిలవలేదు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర గుజరాత్ తదితర 15 రాష్ట్రాలు స్మార్ట్ మీటర్లకి టెండర్లు పిలిచాయి. ఏపీ 16వ రాష్ట్రంగా టెండర్లు పిలుస్తోంది. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలు ముందుకువచ్చాయి. ఇందుకు కేంద్రం నుంచి 5,484 కోట్లు గ్రాంటుగా వస్తాయి. స్మార్ట్ మీటర్ల ద్వారా వినియోగదారులకి అదనపు భారం పడదు. రైతులకి భారం పడకుండా ప్రభుత్వమే స్మార్ట్ మీటర్ల భారాన్ని భరిస్తోంది’’ అని ఆయన అన్నారు. ‘‘స్మార్ట్ మీటర్ల విషయంలో స్పష్టమైన విధానంతో ఇంధనశాఖ ముందుకు వెళ్తోంది. ఇంధన శాఖకి ఇష్టం లేదనేది అవాస్తవం. అన్ని డిస్కమ్‌లతో చర్చించిన తర్వాతే ఇంధన శాఖ ఈ నిర్ణయం. ఈ మొత్తం ప్రాజెక్ట్ పూర్తి అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఇంధన వ్యయ వినియోగం నేషనల్ మీటరింగ్ మోనిటరింగ్ సిస్టం పరిధిలోకి వెళ్తాయి. ఇంధన శాఖకి వ్యవసాయ, గృహావసరాల స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్‌పై ఎటువంటి అభ్యంతరాలు లేవు. స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారులకి ఎక్కువ బిల్లులు వస్తాయనేది అపోహ మాత్రమే’’ అని విజయానంద్ వివరించారు. చదవండి: టీడీపీ నేతల అమానుష చర్య.. చంద్రబాబు సభలో గాయపడిన మహిళకు అవమానం -
స్మార్ట్ మీటర్లపై అపోహలొద్దు
సాక్షి, అమరావతి: స్మార్ట్ మీటర్లవల్ల ప్రయోజనాలే తప్ప ఎలాంటి నష్టంలేదని, ఈ విషయంలో ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ కోరారు. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేయడంపై పలు పత్రికల్లో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఆ కథనాల్లోని సందేహాలను నివృత్తి చేస్తూ.. స్మార్ట్మీటర్లవల్ల కలిగే ప్రయోజనాలను, ఈ ప్రాజెక్టులోని వాస్తవాలను ఆయన వివరించారు. విజయవాడ విద్యుత్ సౌథలో గవర్నమెంట్ డిప్యూటీ సెక్రటరీ కుమార్‌రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ శ్రీధర్, సెంట్రల్ డిస్కం సీఎండీ పద్మాజనార్ధనరెడ్డిలతో కలిసి మంగళవారం విజయానంద్ మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్)లో భాగంగా 2025 మార్చి నాటికి దేశమంతా అన్ని రాష్ట్రాలూ స్మార్ట్ విద్యుత్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు 2019లోనే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఒక రెగ్యులేషన్ ఇచ్చింది. రాష్ట్రంలో ముందుగా 18.56 లక్షల వ్యవసాయ, హైవాల్యూ.. అంటే నెలకు 500 యూనిట్లు పైన విద్యుత్ వినియోగం ఉన్న 27.68 లక్షల సర్వీసులకు స్మార్ట్‌మీటర్లు అమర్చాలని ప్రభుత్వం అదే ఏడాది నిర్ణయించింది. అలాగే. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు పెట్టాలని 2020లో డిస్కంలకు ఆదేశాలు జారీచేసింది. టెండర్ల కోసం దేశమంతా ఒకే నిబంధనలతో ఒక డాక్యుమెంట్‌ను కేంద్రమే రూపొందించింది. దాని ప్రకారం టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. పైగా.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా టెండర్ డాక్యుమెంట్‌ను న్యాయ సమీక్షకు పంపించి అక్కడ నుంచి అనుమతి వచ్చాక మాత్రమే టెండర్ల ఖరారు జరుగుతుంది. మరోవైపు.. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ ఓపెన్‌గానే ఉంది. ఐఆర్డీఏ, బ్లూటూత్, స్మార్ట్, రేడియో ఫ్రీక్వెన్సీ మీటర్లను ఆయా ప్రాంతాల్లో వెసులుబాటులను బట్టి ఏర్పాటుచేసేలా టెండర్లు రూపొందించాం. ఎవరైనా ఈ టెండర్లలో పాల్గొనవచ్చు. ఏ ఒక్క సంస్థకో ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం ఎక్కడా జరగడంలేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా మీటర్ ఒక్కటే పెట్టడంతో సరిపెట్టకుండా రైతుల ప్రాణరక్షణ బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంది. అందుకు అవసరమైన పరికరాలను (అలైడ్ మెటీరియల్) ఆర్థికంగా భారమైనా మీటర్లతో పాటు ఏర్పాటుచేయనున్నాం. మిగతా రాష్ట్రాల్లో కేవలం మీటర్లే ఇస్తున్నారు. మన దగ్గర స్మార్ట్మీటర్తో పాటు (మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ (ఎంసీబీ)తో కూడిన ఫ్యూజ్బాక్స్నూ అందిస్తున్నాం. ముట్టుకున్నా షాక్ కొట్టని బాక్స్‌ను అందిస్తున్నాం. ఇప్పుడున్నట్లు మూడు ఫ్యూజులు ఉండవు. మోటార్లు కాలిపోయే అవకాశం ఉండదు. అలాగే, ఎర్తింగ్ రాడ్‌ను కూడా ఏర్పాటుచేస్తాం. గ్రిడ్‌పై లోడ్ పడకుండా జాగ్రత్త పడొచ్చు ఇక ప్రస్తుతం గ్రామాల్లో పొలాల మధ్య ఉండే వ్యవసాయ మీటర్ వద్దకు వెళ్లి రీడింగ్ నమోదు చేయడం శ్రమతో కూడుకున్నది కావడంతో ఎవరూ ముందుకు రావడంలేదు. పూర్తి ఆధునిక సాంకేతికతతో స్మార్ట్‌మీటర్లను ఇస్తున్నాం. అలాగే.. – వీటి ద్వారా మోటార్ ఆన్, ఆఫ్ చెయ్యొచ్చు. రైతు పొలానికి వెళ్లి మోటారు స్విచ్చాన్ చేయాల్సిన అవసరం ఉండదు. – భవిష్యత్‌లో గ్రిడ్‌పై పడే లోడ్‌ను మ్యానేజ్ చేయాలంటే స్మార్ట్‌మీటర్ల ద్వారానే వీలవుతుంది. – అదే విధంగా ఎప్పటికప్పుడు లోడ్‌ను మోనిటర్ చేస్తూ గ్రిడ్‌పై లోడ్ పడకుండా జాగ్రత్తపడొచ్చు. – తద్వారా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా కాపాడుకోవచ్చు. – పైగా ఒక ట్రాన్స్ఫార్మర్పై రెండు, మూడు సర్వీసులుంటే అన్ని సర్వీసులకూ ఒకే విధమైన వినియోగం జరగదు. అందరిదీ కలిపి ఒకే రీడింగ్ చూపిస్తుంది. దీనివల్ల రైతులకు నష్టం కలుగుతుంది. పైలట్ ప్రాజెక్టుతో సత్ఫలితాలు మరోవైపు.. స్మార్ట్ మీటర్లపై శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలిచ్చింది. ప్రయాస్ అనే సంస్థ 20 శాతం విద్యుత్ ఆదా అయినట్లు తేల్చింది. మేం అన్ని సర్వీసులపైనా అధ్యయనం చేశాం. 33 శాతం విద్యుత్ అదా కనిపించింది. ఇక రాష్ట్రంలో 12 వేల మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి వాడుతున్నారు. ఇందులో 20 శాతమే ఆదా అనుకుంటే రూ.1,900 కోట్లు, 33 శాతం అయితే రూ.3,600 కోట్లు మిగులుతాయి. మీటర్లు పెట్టడానికి రూ.4 వేల కోట్లు ఖర్చవుతోంది. అంటే పెట్టిన పెట్టుబడి ఒకటి, రెండేళ్లలోనే వచ్చేస్తుంది. ఈ ఫలితాల ఆధారంగానే స్మార్ట్ మీటర్లపై ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో 99 శాతం మంది రైతులు కూడా ఇప్పటికే తమ అంగీకారాన్ని తెలిపారు. -
అలల ఒడి నుంచి విద్యుత్!
సాక్షి, అమరావతి: సముద్ర అలల నుంచి విద్యుత్ పుట్టించవచ్చా.. సముద్ర కెరటాలతో వెలుగులు పంచవచ్చా.. ఆటుపోట్ల నుంచి శక్తిని ఉత్పత్తి చేయవచ్చా.. అనే అలోచనలతో శాస్త్రవేత్తలు జరుపుతున్న ప్రయోగాలు విజయవంతమై ఆచరణలోకి వస్తున్నాయి. ప్రపంచానికి భవిష్యత్‌లో కరెంటు కష్టాలు ఉండవనే ఆశలు కల్పిస్తున్నాయి. సముద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో సవాళ్లు, గ్రిడ్ కనెక్టివిటీ లేకపోవడంతో ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. మార్కెట్లలో గ్రిడ్లు చిన్నవిగా, అస్థిరంగానూ ఉంటాయి. అయినప్పటికీ సాంకేతికంగా.. ఆర్థిక పరంగా కష్టం, ఖర్చుతో కూడుకున్న ఓషన్ థర్మల్ ఎనర్జీ, వేవ్, టైడల్ పవర్ జనరేషన్ వంటి సముద్ర పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులు ప్రస్తుతం 31 దేశాల్లో విస్తరిస్తున్నాయి. మెరైన్ టెక్నాలజీల నుంచి విద్యుత్ ఉత్పత్తి రెండేళ్ల క్రితంతో పోలిస్తే 33 శాతం పెరిగింది. మన రాష్ట్రంలోనూ అలల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ఆలోచనపై అధ్యయనం జరిగిందంటే.. ఈ సాంకేతికత ఎంతగా విశ్వవ్యాప్తమయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐరోపాలో ఈ ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సముద్ర శక్తి సామర్థ్యంలో 98 శాతం వాటా దక్షిణ కొరియా, ఫ్రాన్స్, కెనడా దేశాలదే. పెట్రోలియం, పెట్రోలియం ఆధారిత ఇంధనాలపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉండటంతో అనేక దేశాలు సముద్రం, ఉష్ణ, హైడ్రోజన్, ఆఫ్ షోర్ విండ్, సోలార్ వంటి టెక్నాలజీలలో పెట్టుబడి పెడుతున్నాయి. రెట్టింపు కంటే ఎక్కువ విద్యుత్ ఆగ్నేయాసియాలో అలల నుంచి విద్యుత్ ఉత్పత్తికి గల అవకాశాలను నిపుణులు పరిశీలించారు. అక్క డి తీర ప్రాంతాలకు టైడల్ శక్తిని ఉత్పత్తి చేసే సా మర్థ్యం ఉందని గుర్తించారు. భారత్, పసిఫిక్ మ హాసముద్రంలోని మారిటైమ్ ఆగ్నేయాసియా అ ని పిలిచే ద్వీపాలు, సముద్ర సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయి. పునరుత్పాదక శక్తి సాంకేతికతలను అక్కడ నివసిస్తున్న 660 మిలియన్లకు పైగా ప్రజలకు ఎలా ఉపయోగించవచ్చనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. వాటిలో భాగంగా ఓషన్ థర్మల్ ఎనర్జీ, లవణ సాంకేతికతలు, వేవ్, టైడల్ పవర్ జనరేషన్ వంటి సముద్ర పునరుత్పాదక శక్తిపై దృష్టి సారించారు. ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐరెనా) చెబుతున్న దాని ప్రకారం.. సముద్రాలకు పునరుత్పాదక శక్తి సామర్థ్యం చాలా ఎక్కువ. సముద్ర విద్యుత్ చిన్న ద్వీపం, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు తక్కువ ఖర్చుతో, నాణ్యమైన విద్యుత్ అందించగలదని, సముద్రపు నీటి డీశాలినేషన్ ద్వారా తాగునీటి సరఫరాను పెంచుతుందని ‘ఇన్నోవేషన్ ఔట్లుక్–ఓషన్ ఎనర్జీ టెక్నాలజీస్’ నివేదిక నిర్ధారించింది. దీనివల్ల అదనంగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. స్థానికుల జీవనోపాధి మెరుగుపడుతుంది. సామాజిక–ఆర్థిక ప్రయోజనం లభిస్తుందని ఆ నివేదిక వెల్లడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు సవాళ్లను అధిగమించి, సముద్ర శక్తిని ఒడిసిపట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. మన రాష్ట్రంలోనూ అధ్యయనం రాష్ట్రంలోనూ సముద్ర అలల నుంచి విద్యుత్ ఉత్పత్తి దిశగా అడుగులు పడ్డాయి. విశాఖ–కాకినాడ మధ్య తీరంలో 100 కేవీ అలల విద్యుత్ సంస్థను ఏర్పాటు చేయాలని భావించారు. నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (నెడ్కాప్) ఆధ్వర్యంలో అలల విద్యుత్‌పై ఓ అధ్యయనానికి శ్రీకారం జరిగింది. అలల విద్యుత్ కేంద్రాలు నెలకొల్పితే వాటిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ మొత్తాన్నీ జెన్కో కొనుగోలు చేసే అవకాశాలపైనా చర్చ జరిగింది. ఇందుకోసం 12 తీర ప్రాంతాల్లో కూడా అలల విద్యుత్ అవకాశాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే, ప్రస్తుత తరుణంలో ఈ ప్రయత్నం అత్యంత ఖర్చుతోనూ, సాంకేతికంగా కష్టంగానూ కూడుకున్న వ్యవహారం కావడంతో మరింత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేవరకూ వేచి ఉండటం మంచిదని భావించి ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడం లేదు. భవిష్యత్‌లో పరిస్థితులు అనుకూలిస్తే కచ్చితంగా మన రాష్ట్రంలోనూ అలల నుంచి కరెంట్ పుట్టే అవకాశాలు ఉన్నాయని ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. -
అర్హులెవరికీ ఆగలేదు.. వాస్తవాలు దాచి పచ్చ పత్రిక మరో ఏడుపుగొట్టు కథనం
సాక్షి, అమరావతి: ఏడుపుగొట్టు వాడు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు. ఏ కారణం లేకపోయినా, ఏదో ఒకటి చెప్పి ఏడుస్తుంటాడు. తన మెదడులో మెదిలింది బయటకు వెళ్లగక్కి మరీ ఏడుస్తాడు. అందులో నిజం లేదన్న విషయం పట్టదు. ఇందుకు ప్రతీకలే పచ్చ పత్రికలు. విషతుల్యమైన వాటి మెదడు విషమే కక్కుతుంది. అబద్ధాలు వండి వారిస్తుంది. ఇటువంటి మరో కథనమే ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్తుపై అవాస్తవ కథనాలు. వాస్తవాలు మాత్రం వేరు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలను ఆదుకోవడానికి నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. కేవలం మాటిచ్చి ఊరుకోవడం అలవాటు లేని సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు శ్రీకారం చుట్టారు. ఆయన ఆశయానికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేయడానికి 2019 జూలై 25న ప్రభుత్వం జీవో నంబర్ 91 జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, తండాల్లో నివసించే వారికి ఉచిత విద్యుత్ అందిస్తామని ఆ జీవోలో స్పష్టంగా పేర్కొంది. దీనికి అనుగుణంగానే విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఆ కాలనీల్లో అర్హులైన అందరికీ ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాయి. దీంతో ఆయా వర్గాల ప్రజలు సీఎం జగన్‌కు గుండెల్లో గుడి కట్టి పూజిస్తున్నారు. తమ ఇంట విద్యుత్ కాంతులు నింపిన దేవుడని చేయెత్తి మొక్కుతున్నారు. ఇదంతా చూసి పచ్చపత్రిక తట్టుకోలేకపోతోంది. ఓ అబద్ధాన్ని బలవంతంగా ప్రజల మెదళ్లలోకి చొప్పించాలని కుట్రలు పన్నుతోంది. అనర్హులను తొలగిస్తే ’ఎస్సీ, ఎస్టీలకు షాక్’ అంటూ అసత్య కథనాన్ని అచ్చేసింది. ఆ తప్పుడు కథనాన్ని ఇంధన శాఖ ఖండించింది. అసలు నిజాలను వెల్లడించింది. ఆరోపణ: ఎస్సీ, ఎస్టీలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం లబ్ధిదారుల సంఖ్యలో ప్రభుత్వం కోత పెట్టింది. వాస్తవం: ఇది పూర్తిగా అవాస్తవం. గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకంలో ఇచ్చింది నెలకు 100 యూనిట్లు కాగా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకు 200 యూనిట్లకు పెంచింది. ఇలా పెంచడం వలన ఏర్పడ్డ అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ పథకం ద్వారా ఉచిత విద్యుత్ పొందడానికి ఈ ఏడాది నవంబర్ వరకు 22.56 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు అర్హత పొందారు. గత ప్రభుత్వం ఈ పథకానికి 2018–19 లో సుమారు రూ. 230 కోట్లు ఖర్చు పెట్టగా, వైఎస్ జగన్ ప్రభుత్వం 2021–22లో రూ.700 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు రూ.450 కోట్లు వెచ్చించింది. ఆరోపణ: సర్వేలో డొల్లతనం వల్ల ఉచిత విద్యుత్ జాబితా నుంచి అర్హుల కనెక్షన్లు తొలగించారు వాస్తవం: ఇది కూడా అబద్ధమే. ఉచిత విద్యుత్ పథకానికి 200 యూనిట్లకు మించి వినియోగించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించే వారు, ఆధార్ అనుసంధానం చేసినప్పుడు కుల ధ్రువీకరణ బీసీ, ఓసీగా నమోదైన వారిని మాత్రమే అనర్హులుగా నిర్ధారించారు. అర్హుల సర్వీసులేవీ తొలగించలేదు. ఒకవేళ అర్హత ఉండి ఈ పథకం రాకపోతే ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రంతో విద్యుత్ అధికారులను, గ్రామ సచివాలయ అధికారులను సంప్రదించాలని విద్యుత్ పంపిణీ సంస్థలు కోరుతున్నాయి. అనర్హులకూ ఇమ్మంటారా అర్హులైన ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఇంధన శాఖ స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీల్లోని నిరు పేదలకు అందాల్సిన ఈ పథకాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని డిస్కంలు వెల్లడించాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు సైతం భార్య, ఇతరుల పేరు మీద ఉచిత విద్యుత్ సర్వీసులు తీసుకున్నట్లు తెలిపాయి. ఇలాంటి వారిని గుర్తించి అనర్హుల జాబితాలో చేరుస్తున్నట్లు తెలిపాయి. విద్యుత్ వృథాను, అక్రమ కనెక్షన్లను తగ్గించడం ద్వారా వాస్తవ అర్హులకు లబ్ధి చేకూర్చాలనేది తమ ధ్యేయమని, అర్హులెవరూ ఆందోళన చెందవద్దని డిస్కంలు చెబుతున్నాయి. ఎస్సీ ఎస్టీ విద్యుత్ కనెక్షన్‌తో ఆధార్ నంబరు అనుసంధానం చేయడం ద్వారా రెండో కనెక్షన్‌కు ఉచిత విద్యుత్ పథకం అమలు కాకుండా నియంత్రణ విధిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని డిస్కంలు ఖండించాయి. అది వాస్తవం కాదని, పచ్చ పత్రిక రాతలు అనర్హులకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలంటున్నట్టుగా ఉన్నాయని డిస్కంలు మండిపడ్డాయి. -
AP: ఖర్చుకు వెనకాడొద్దు
సాక్షి, అమరావతి: విద్యుత్ ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను రూపొందించాల్సిందిగా రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంధన శాఖ అధికారులతో ఆయన ఆదివారం టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇటీవల అనంతపురం జిల్లాలో విద్యుత్ ప్రమాదం జరిగిన వెంటనే సీఎం వైఎస్ జగన్ తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలను పరిహారంగా అందజేశారని, అయితే మున్ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. విద్యుత్ సంస్థల బలోపేతానికి ఇప్పటికే రూ.40వేల కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ప్రజలకు విద్యుత్ భద్రత కల్పించే విషయంలో ఎంత వ్యయం చేసేందుకైనా వెనుకాడదని పెద్దిరెడ్డి స్పష్టంచేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యుత్ భద్రతకు అనుసరిస్తున్న సాంకేతిక పద్ధతులను అధ్యయనంచేసి తగిన కార్యాచరణ రూపొందించాలని ఆయన సూచించారు. ప్రమాదాల నివారణకు సూచనలు.. ఇక విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన క ల్పించేందుకు విద్యుత్ సబ్స్టేషన్ల కమిటీల సమావేశాలు నిర్వహించడంతోపాటు పత్రికలు, వివిధ మీడియాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ వంటి చర్యలు చేపట్టాలన్నారు. అలాగే.. మంత్రి ఇంకా ఏం చెప్పారంటే.. ► క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి ప్రజలను విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడే వివిధ అంశాలపై శిక్షణనివ్వాలి. ► విద్యుత్ ప్రమాదాలకు ఆస్కారం ఉన్నచోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలి. ఆపరేషన్, మెయింటెనెన్స్ సిబ్బంది, కాంట్రాక్టు ఏజెన్సీలు వీటిని కచ్చితంగా పాటించాలి. ► విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటి వాటిని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఈ పనులు నిర్వహించే చోట ప్రమాదాల నివారణకు లోకల్ ఎర్తింగ్ ఏర్పాటు చేయాలి. ► హైటెన్షన్ విద్యుత్ లైన్ల సమీపంలో గృహాలు, ఇతర నిర్మాణాలను చేపట్టకూడదు. ► ఏడువేల మంది ఎనర్జీ అసిస్టెంట్లకు విద్యుత్ భద్రతా అంశాలపై శిక్షణనిచ్చి వారి సేవలను వినియోగించుకోవాలి. ► 1912 టోల్ ఫ్రీ నంబర్లపై అవగాహన కల్పించాలి. ఫిర్యాదులను డిస్కంలు పరిష్కరించాలి. ► ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి. శ్రీధర్, డిస్కంల సీఎండీలు కె. సంతోషరావు, జె. పద్మ జనార్థనరెడ్డి, ఏపీఎస్ఈసీఎం సీఈఓ ఎ. చంద్రశేఖరరెడ్డి, వివిధ జిల్లాల నుంచి అధికారులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్ కోసమే మీటర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంతోపాటు విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసమే స్మార్ట్ మీటర్లను ఏర్పాటుచేస్తున్నట్టు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి తెలిపారు. ‘రైతు చేనుకు కడప మీటరు’ పేరుతో ఈనాడు దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనం వాస్తవానికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టులో వాస్తవాలతో వారు మంగళవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు.. రైతుల ప్రయోజనానికే మీటర్లు ప్రభుత్వ ఉత్తర్వుల (జీవోఎంఎస్ 22, తేదీ 01.09.2020) ప్రకారం పెడుతున్న ఈ మీటర్ల వల్ల మోటార్లు కాలిపోవు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందుతుంది. ఎంత విద్యుత్ వాడుతున్నారో కచ్చితంగా తెలియడం వల్ల సరిపడా కెపాసిటీ ఉన్న ట్రాన్స్ఫార్మర్లు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. లోడ్ సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటూ భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకోవచ్చు. మీటర్ల ఏర్పాటుకు రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. రైతులు ఎన్ని యూనిట్లు వినియోగిస్తారో.. దానికయ్యే చార్జీలను మొత్తం ప్రభుత్వమే నేరుగా రైతుల ప్రత్యేక ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) కింద జమచేస్తుంది. ఆ డబ్బు నేరుగా రైతుల ద్వారా డిస్కంలకు బదిలీ అవుతుంది. ఈ ప్రక్రియల వల్ల పూర్తి పారదర్శకత ఉంటుంది. కరెంటు సరఫరా కంపెనీలను ప్రశ్నించేహక్కు రైతులకు లభిస్తుంది. కంపెనీలకు కూడా బాధ్యత పెరుగుతుంది. తగ్గుతున్న నష్టాలు ప్రస్తుతం ఐఆర్డీఏ మీటర్లను మీటరు బోర్డుపై అమర్చాం. రీడర్లు ఐఆర్డీఏ పోర్టు ద్వారా రీడింగ్ తీయాల్సి ఉంది. ఈ వ్యవసాయ సర్వీసులు దూర ప్రాంతాల్లో విస్తరించి ఉండడం వల్ల ఈ పద్ధతిలో రీడింగ్ తీయడం కష్టంగా ఉంది. అందుకే స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ సంస్థలు సంకల్పించాయి. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం జిల్లాలో మీటర్లను ఏర్పాటుచేసిన తర్వాత ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ (స్వతంత్ర గ్రూప్) సర్వే రిపోర్టు ప్రకారం నష్టాలు 15–20 శాతానికి తగ్గినట్లు నమోదైంది. ఆ టెండర్లు ఎప్పుడో రద్దు విద్యుత్ సంస్థల్లో గ్రామీణ ప్రాంతాల్లోని త్రీఫేజ్ మీటర్లకు డీబీటీ విధానం కోసం ఐదేళ్ల కాలపరిమితితో టెండర్లను ఆహ్వానించాం. ఆర్డీఎస్ఎస్ కింద స్మార్ట్ మీటర్లను గడువులోపు పూర్తిచేస్తే 22.50 శాతం గ్రాంటు రూపంలో సమకూరుతుంది. మొదటి రీడింగ్ తీసిన తర్వాత కాంట్రాక్టర్‌కు ఒక్కో మీటరుకు కెపెక్స్ కింద రూ.1,800 చొప్పున చెల్లిస్తాం. తర్వాత మిగిలిన మొత్తంతోపాటు ఆపరేషన్, మెయింటెనెన్స్, రీడింగ్‌ల కోసం అయ్యే మొత్తాన్ని నెలవారీగా ఐదేళ్ల కాంట్రాక్ట్ కాలవ్యవధిలో ప్రాజెక్టు వ్యయాన్ని ఇస్తాం. వీటికి నెలకు రూ.254 చొప్పున గుత్తేదార్లు టెండర్లను దాఖలు చేశారు. కోవిడ్–19 సమయంలో రూపొందించిన అంచనాల హెచ్చుతగ్గులను పరిశీలించి ప్రభుత్వం టెండర్లు రద్దుచేసింది. ప్రస్తుత ధరల ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాం. ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు లభించిన తర్వాతే కొత్తగా టెండర్లు పిలుస్తాం. ఇటీవల మహారాష్ట్రలోని పట్టణ ప్రాంతాల్లో బెస్ట్ కంపెనీ స్మార్ట్ మీటర్ల కోసం ఆఫర్ చేసిన బిడ్లలో ఒక్కో మీటరుకు నెలకు వ్యయం రూ.200.96 పైసలుగా ఖరారైంది. ఏడున్నర సంవత్సరాల కాలవ్యవధి కలిగిన వీటిలో 80 శాతం సింగిల్‌ఫేజ్ మీటర్లు కాగా 20 శాతం మాత్రమే త్రీఫేజ్ మీటర్లు. కానీ ఏపీలో వ్యవసాయ సర్వీసులన్నీ త్రీఫేజ్ మీటర్లే. ఒక్కో మీటరుకు కేంద్రప్రభుత్వ అంచనా ధర పదేళ్ల కాలపరిమితికి రూ.6 వేలు. దీనికి అనుగుణంగా మీటర్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు పగటిపూట తొమ్మిదిగంటల నిరంతర విద్యుత్తును సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడువేల మెగావాట్ల సౌరవిద్యుత్తు కొనుగోలుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడానికి సుమారు రూ.1,700 కోట్లు ఖర్చుచేసి ఫీడర్లను ఏర్పాటు చేశాం. గడచిన 90 రోజుల్లో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో 48 గంటల్లోపే కొత్తవాటిని బిగించాం. రానున్నరోజుల్లో నూటికి నూరుశాతం 48 గంటల్లోపే మార్చేయాలని సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాలను అమలుచేయడానికి అన్ని రకాల చర్యలను విద్యుత్ పంపిణీ సంస్థలు తీసుకుంటున్నాయి. అనుబంధ పరికరాలకు రూ.14,455 వ్యయం మీటరుకు అనుబంధ పరికరాలు, నిర్వహణకు రూ.29 వేలు ఖర్చవుతోందని ఈనాడు దినపత్రిక రాసిన కథనంలో వాస్తవం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 18.58 లక్షల స్మార్ట్ మీటర్ల ద్వారా వ్యవసాయ విద్యుత్ సర్వీసుకు అనుబంధ పరికరాలకు రూ.14,455 వ్యయంతో, మీటరు బాక్స్‌తో పాటు, పీఈసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్ పరికరాలు ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ పథకం ఆర్డీఎస్ఎస్లో 60 శాతం గ్రాంటు రూపంలో డిస్కంకు సమకూరుతుంది. అనుబంధ పరికరాలను అమర్చడానికి, అవి పాడైపోకుండా ఉండేందుకు వీలుగా మీటరు బాక్సులను ఏర్పాటు చేస్తాం. ఎంసీబీ ద్వారా ఓవర్ లోడ్ ప్రొటెక్షన్ ఉంటుంది. తద్వారా విద్యుత్ ప్రమాదాలను తగ్గించడంతోపాటు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్‌ను కూడా తగ్గించవచ్చు. వ్యవసాయ పంపుసెట్లకు రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతుల కోసం ఏటా రూ.102 కోట్ల వ్యయాన్ని సంస్థలు భరించాల్సి వస్తోంది. కెపాసిటర్లను అమర్చడం ద్వారా నాణ్యమైన వోల్టేజ్‌తో రైతులకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. -
ఇంటింటికీ స్మార్ట్ మీటర్లు
సాక్షి, అమరావతి: సంప్రదాయ విద్యుత్ మీటర్ల స్థానంలో దేశవ్యాప్తంగా దాదాపు 25 కోట్ల స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌ను ఏపీలో అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలతో మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్, కచ్చితమైన విద్యుత్ బిల్లులు, ఉత్తమ సేవలు అందుతాయని మంత్రి వెల్లడించారు. విద్యుత్ సంస్థల్లో జవాబుదారీతనం, పారదర్శకత పెరగడంతో పాటు సాంకేతిక, వాణిజ్య నష్టాలు తగ్గేందుకు ఇవి దోహదపడతాయని ఆయన అన్నారు. బ్రిటన్, కేంద్ర అధికారుల భేటీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ.. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గేరేత్ విన్ ఓవెన్, బ్రిటిష్ హై కమిషన్ ఇంధన సలహాదారు సుష్మిత రామోజీ, కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ఇంధన శాఖ అధికారులను రెండు రోజుల క్రితం కలిసి ఏపీలో చేపట్టనున్న స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టుపై చర్చించారని మంత్రికి వివరించారు. ఈ మీటర్లు ఇంటర్నెట్కు అనుసంధానించడం వల్ల విద్యుత్ వినియోగ వివరాలు డిస్కంలకే గాక వినియోగదారులకు కూడా ఏరోజుకారోజు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యుత్ చౌర్యం వంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, వోల్టేజీ హెచ్చుతగ్గులను స్మార్ట్ మీటర్ రికార్డు చేస్తుందని వివరించారు. కాగా, ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలోని 5 సర్కిళ్లలో స్మార్ట్ మీటర్ ప్రాజెక్టు అమలుకు రూ.947.15 కోట్ల అంచనాతో ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సమర్పించినట్టు డిస్కం సీఎండీ కె.సంతోషరావు తెలిపారు. ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్ధనరెడ్డి, ఏపీ ఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. -
ఇంధన శాఖపై సీఎం జగన్ సమీక్ష
-
ప్రజలకు అందుబాటు ధరల్లో విద్యుత్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలకు, భవిష్యత్ తరాలకు అందుబాటు ధరలో విద్యుత్ పుష్కలంగా ఉండేలా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం ఇంధనశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి వేగవంతమవడంతో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని, ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. 2017–18లో 50,077 మిలియన్ యూనిట్లు ఉన్న డిమాండ్ 2021–22లో 60,943 మిలియన్ యూనిట్లకు (21.6 శాతం) పెరిగిందని తెలిపారు. వచ్చే మార్చి నాటికి డిమాండ్ రోజుకు 250 మిలియన్ యూనిట్లకు చేరుతుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఏపీ జెన్కో ఆధ్వర్యంలో శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం) స్టేజ్–2 (1్ఠ800 మెగావాట్లు) ఈ నెలాఖరుకు, డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో స్టేజి–5 (1్ఠ800 మెగావాట్లు) వచ్చే మార్చి నాటికి ప్రారంభించేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. పునరుత్పాదక విద్యుత్‌కు పెద్దపీట డిమాండ్‌ను అందుకోవడంతోపాటు విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్రంలో ఉన్న పునరుత్పాదక ఇంధన వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు ఢోకా లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మజనార్దనరెడ్డి, నెడ్‌క్యాప్ ఎండీ ఎస్.రమణారెడ్డి, ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. -
‘చీకటి’ కథనాలు ఉత్తదే
సాక్షి, అమరావతి: ‘అప్పుల చీకట్లో డిస్కంలు’ శీర్షికతో ‘ఈనాడు’ అసంబద్ధ కథనాన్ని ప్రచురించటాన్ని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఖండించారు. 2022–23 ఆర్థ్ధిక సంవత్సరానికి విద్యుత్ పంపిణీ సంస్థలు ఆగస్టు నాటికి నెలవారీ వాయిదా కింద చెల్లించాల్సిన అప్పులు రూ.24,838 కోట్లేనని చెప్పారు. డిస్కంల అప్పులు రూ.56 వేల కోట్లు దాటాయని అసత్యాలతో నిరాధార కథనాన్ని ప్రచురించటాన్ని తప్పుబడుతూ సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ, వివిధ శాఖలు, స్థానిక సంస్థలు వినియోగించిన విద్యుత్ చార్జీలను వసూలు చేయడం ద్వారా నెలవారీ అప్పులు, జీతభత్యాలు, ఇతర ఖర్చులను సకాలంలో చెల్లిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం కొత్తగా తెచ్చిన ఎలక్ట్రిసిటీ లేట్ పేమెంట్ సర్‌చార్జీ (ఎల్పీఎస్) పథకంలో చేరి మొదటి వాయిదాగా గత నెలలో రూ.1,422 కోట్లు చెల్లించినట్లు గుర్తు చేశారు. ఈ ఏడాది జూన్ 3 వరకు బకాయిలను పవర్ పీఎఫ్సీ, ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఈసీ) లిమిటెడ్ ద్వారా చెల్లిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల ఆలస్య రుసుము భారం నుంచి మినహాయింపు లభించి డిస్కంలకు ఆర్థికంగా కొంత మేర వెసులుబాటుగా ఉన్నట్లు తెలిపారు. -
పేదరికాన్ని నిర్మూలించే సామర్థ్యం ఎనర్జీ రంగానికి ఉంది
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ప్రపంచవ్యాప్తంగా విద్యుత్, వంటకు సరైన ఇంధనం లేక అనేక కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని గ్రీన్ కాలర్ అగ్రిటెక్ సొల్యూషన్స్ వ్యవస్థాపకురాలు హేమలత అన్నామలై అన్నారు. వారి పేదరికాన్ని నిర్మూలించే సామర్థ్యం ఎనర్జీ రంగానికి ఉందని చెప్పారు. బుధవారం విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన హేమలత అన్నామలై మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎనర్జీ రంగం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఐఐపీఈ అందించిందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇంధన రంగానికి సంబంధించి విద్యార్థుల భవిష్యత్తుతో దేశ భవిష్యత్ ముడిపడి ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏడుగురిలో ఒకరికి విద్యుత్ అందుబాటులో లేదన్నారు. ఇంకా మూడు బిలియన్ల ప్రజలు కిరోసిన్, కలప, బొగ్గు ఆధారంగానే వంటలు చేస్తున్నారని చెప్పారు. ఐఐపీఈ విద్యార్థులు నూతన ఆవిష్కరణలను చేసి ఎనర్జీ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. వేడుకల్లో భాగంగా 87 మందికి డిగ్రీ పట్టాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఐఐపీఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ పీకే బానిక్, ఐఐపీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ శాలివాహన్ తదితరులు పాల్గొన్నారు. -
బొగ్గు కొరత రానివ్వొద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఇంధన, గనులు, ఖనిజాభివృద్ధి శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్కేంద్రాలకు దేశీయంగా లభిస్తున్న బొగ్గుతో పాటు విదేశాల నుంచి కూడా దిగుమతులు చేసుకుంటున్నామన్నారు. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) వంటి ప్రభుత్వరంగ సంస్థలు బొగ్గు రంగంలోకి ప్రవేశించిన నేపథ్యంలో దేశీయంగా లభించే బొగ్గును మన రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాలు వినియోగించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా బొగ్గు గనుల నిర్వహణకు ఏపీఎండీసీ సిద్ధంగా ఉందని, ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో సుల్యారీ గనిని నిర్వహిస్తోందన్నారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో మరికొన్ని గనులను కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును అందించేందుకు ఉన్న అన్ని మార్గాలను పరిశీలించాలని.. ఇందుకు ఇంధన, గనుల శాఖాధికారులు సమన్వయం చేసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. ఇంధన శాఖ పునర్వ్యవస్థీకరణ ఇక ఇంధన శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయడంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో పెరిగిన జిల్లాలకు అనుగుణంగా ఇంధన శాఖను కూడా పునర్వ్యవస్థీకరించాలని ఆయన సూచించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులకు వ్యవసాయ కనెక్షన్లను ఇవ్వడంలో జాప్యం చేయకూడదని సీఎం జగన్ ఆదేశాలిచ్చారని.. దానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలన్నారు. అలాగే, వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని కూడా నిర్ణీత లక్ష్యంలోగా పూర్తిచేయాలని సూచించారు. పెండింగ్ కేసులపై దృష్టి ఇంధనశాఖ పరిధిలో వివిధ విభాగాలకు సంబంధించిన కోర్టు కేసులను సత్వరం పరిష్కరించే విషయంలో అధికారులు దృష్టిసారించాలని కూడా మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నెడ్‌క్యాప్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులపై రూపొందించిన హ్యాండ్‌బుక్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే విజయానంద్, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ట్రాన్స్‌కో సీఎండీ బీ శ్రీధర్, నెడ్‌క్యాప్ వీసీ–ఎండీ ఎస్.రమణారెడ్డి, ఏపీఎండీసీ వీసీ–ఎండీ వీజీ వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
సత్ఫలితాలిస్తున్న ‘పాట్’
సాక్షి, అమరావతి: భారీ పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యం, సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్ (పాట్) పథకం సత్ఫలితాలనిస్తోంది. రాష్ట్ర ఇంధన శాఖకు చెందిన రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) పదేళ్లుగా రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇంధన శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. పాట్ వల్ల రాష్ట్రంలోని 36 భారీ పరిశ్రమల్లో దాదాపు రూ.5,709 కోట్ల విలువైన బొగ్గు, చమురు, గ్యాస్, లిగ్నైట్‌తో కూడిన 0.818 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వెలెంట్ (ఎంటీఓఈ) ఇంధనం ఆదా అయింది. అంతేకాదు.. 2.464 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను కూడా తగ్గించింది. ‘బీఈఈ’ ప్రోత్సాహం పరిశ్రమలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ కరెంటును సమర్థంగా వినియోగించుకోవటం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయటమే కాకుండా పారిశ్రామిక ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించవచ్చు. తద్వారా ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) పాట్ పథకానికి ప్రోత్సాహం అందిస్తోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఆధారిత పరికరాలను అందిస్తోంది. రాష్ట్రంలో ఏపీఎస్ఈసీఎం ద్వారా 65 ఎంఎస్ఎంఈల్లో వీటిని అమర్చింది. ఇవి విద్యుత్ వినియోగాన్ని, యంత్రాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన సూచనలు అందిస్తాయి. తద్వారా ఇంధన ఆదాకు దోహదపడతాయి. పాట్ పథకం లక్ష్యాలను సాధించిన పరిశ్రమలకు ఇంధన పొదుపు సర్టిఫికెట్లను కూడా బీఈఈ ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలా 4,01,496 సర్టిఫికెట్లను అందించింది. వీటిని పవర్ ఎక్సే్ఛంజ్‌లో విక్రయించడం ద్వారా ఆ పరిశ్రమలు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఇంధన పొదుపు లక్ష్యాలను సాధించని పరిశ్రమలు ఆ సర్టిఫికెట్లను డబ్బులిచ్చి కొనుగోలు చేయాలి. అలా 2,79,667 సర్టిఫికెట్లను పలు పరిశ్రమలు కొన్నాయి. అన్ని పరిశ్రమలు ‘పాట్’ పరిధిలోకి రావాలి భారీ పరిశ్రమల్లో ప్రత్యేకంగా విద్యుత్ క్యాప్టివ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. దీనివల్ల పరిశ్రమలు విద్యుత్‌పై చేసే వ్యయం తగ్గుతుంది. పరిశ్రమలలో ఆధునిక విధానాల్లో ఇంధనాన్ని సక్రమంగా వినియోగించే సాంకేతికతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పాట్ పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలో పాట్ పథకం వల్ల భారీ పరిశ్రమలలో ఇంధన సామర్థ్యం పెరిగింది. ఈ పథకం పరిధిలోకి రావాలని అన్ని పరిశ్రమలను కోరుతున్నాం. –కె.విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. -
మీటర్లతో మిగులుతున్న విద్యుత్
సాక్షి, అమరావతి: ‘రైతులు, ప్రజా సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రెండడుగులు వేశారు. నేను నాలుగడుగులు వేస్తాను..’ అని చెప్పిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ దిశగా ఉచిత విద్యుత్తు పథకం పటిష్టంగా అమలు చేయాలని సంకల్పించారు. ఉచిత విద్యుత్ పథకం ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకూడదని, దాన్ని రైతుల హక్కుగా మార్చాలని సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రైతులపై ఒక్క రూపాయి భారం పడకుండా.. వారికి శాశ్వత ప్రయోజనం కల్పించేందుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పథకాన్ని అమలు చేస్తున్నారు. రెండేళ్ల కిందట శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ పథకం సత్ఫలితాలనిస్తోంది. భారీగా విద్యుత్‌ను ఆదా చేస్తోంది. సర్వీసులు పెరిగినా మిగిలిన విద్యుత్ రాష్ట్రమంతటా ఒకేసారి కాకుండా శ్రీకాకుళం జిల్లాలో 2021–22 నుంచి పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇక్కడ మీటర్లు అమర్చకముందు.. అంటే 2020–21లో వ్యవసాయ విద్యుత్ సర్వీసులు 101.51 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించాయి. 2021 మార్చి నాటికి జిల్లాలో 26,063 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 2021–22లో వ్యవసాయ విద్యుత్ సర్వీసులు 67.76 మిలియన్ యూనిట్లే వినియోగించాయి. 2022 మార్చి నాటికి జిల్లాలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 28,393కు చేరింది. జిల్లాలో ఏడాదిలో 2,330 సర్వీసులు పెరిగినా.. మీటర్లు బిగించడం వల్ల 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయింది. ఇదే విధంగా రాష్ట్రంలోని దాదాపు 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేస్తే భారీగా విద్యుత్ ఆదా అవుతుందని పైలెట్ ప్రాజెక్ట్ నిరూపించింది. రైతులకు హక్కుగా ఉచిత విద్యుత్ రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను పగటిపూట 9 గంటలు ఉచితంగా రానున్న 30 ఏళ్ల పాటు సరఫరా చేయాలనేది సీఎం జగన్ ధ్యేయం. డీబీటీ పథకం ద్వారా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా రైతులు తమ హక్కుగా విద్యుత్ పొందుతారని, విద్యుత్ వృధా తగ్గి ఆదా అవుతుందని సీఎం స్పష్టంగా చెప్పారు. దీంతో పథకం అమలుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. గ్రామ, మండల, డివిజన్, జిల్లా, కంపెనీ, ప్రభుత్వ కమిటీలంటూ క్షేత్రస్థాయి నుంచి, ప్రభుత్వస్థాయి వరకు వివిధ కమిటీలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాం. కరపత్రాలు, పోస్టర్లు, ప్రకటనలు, సదస్సుల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. –కె.విజయానంద్, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ శ్రీకాకుళం జిల్లాలో మోటార్లకు మీటర్లు అమర్చే పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైంది. ఇక్కడి రైతులంతా మీటర్లకు తమ సంపూర్ణ మద్దతు తెలిపి, అంగీకారపత్రాలు కూడ ఇచ్చారు. మీటర్ల వల్ల విద్యుత్తు లోడ్‌ను ఎప్పటికప్పుడు సరిచూసి ఆమేరకు కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను అందించవచ్చు. – కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ డిస్కంలకు జవాబుదారీ తనం మీటర్ల ఏర్పాటు కోసం రూ. 1,200 కోట్ల వ్యయం అవుతుందనేది ప్రాథమిక అంచనా. ఈ మొత్తం వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. నగదు బదిలీ విధానంలో రైతులపై ఒక్కపైసా కూడా భారం పడదు. వ్యవసాయ విద్యుత్‌కు వచ్చిన బిల్లు మొత్తాన్ని రైతుల బ్యాంకు ప్రత్యేక ఖాతాల్లో ప్రభుత్వమే జమచేస్తుంది. దాన్ని రైతులు డిస్కంలకు చెల్లిస్తారు. దీనివల్ల డిస్కంలకు జవాబుదారీతనం పెరుగుతుంది. – జె.పద్మజనార్ధనరెడ్డి, సీఎండీ, ఏపీసీపీడీసీఎల్ -
విద్యుత్ సవరణ బిల్లుపై ఉద్యోగుల నిరసన
సాక్షి, అమరావతి: లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు 2022ను ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ వ్యతిరేకించింది. బిల్లులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపినప్పటికీ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో నిరసనలకు దిగారు. విజయవాడలోని విద్యుత్ సౌధలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు కార్యాలయం బయటకు వచ్చి ధర్నా చేపట్టారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ను జేఏసీ చైర్మన్ పి.చంద్ర శేఖర్, జనరల్ సెక్రటరీ పి.ప్రతాపరెడ్డి, కన్వీనర్ బి.సాయికృష్ణ తదితరులు కలిసి బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. కేంద్రం ఈ విషయంలో ముందుకు వెళితే తక్షణమే ఆందోళనలకు దిగేలా కార్యాచరణ రూపొందించినట్టు వెల్లడించారు. ఆందోళనకు ఇదీ కారణం ప్రైవేటు విద్యుత్ పంపిణీ సంస్థలకు లైసెన్స్ విధానాన్ని సులభతరం చేయడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని చెబుతున్నప్పటికీ, విద్యుత్ రంగం ప్రైవేటీకరణను అనుమతించడం వల్ల వినియోగదారులపై ధరల భారం పడే అవకాశం ఉందని, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువవుతుందని జేఏసీ అభిప్రాయం పడింది. బిల్లు ఆమోదం పొందితే టెలిఫోన్, మొబైల్, ఇంటర్నెట్ సేవల కోసం వినియోగదారులు తమకు నచ్చిన నెట్‌వర్క్‌ను ఎంచుకుంటున్న విధంగా విద్యుత్ సరఫరాదారుని కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఒకే ప్రాంతంలో పలు కంపెనీలకు విద్యుత్ పంపిణీ లైసెన్సులివ్వాల్సి వస్తే వాటి కోసం ’క్రాస్ సబ్సిడీ నిధి’ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తుంది. డిపాజిట్ సొమ్మును ముందుగా చెల్లించకపోతే డిస్కంలు కోరినంత విద్యుత్‌ను ‘జాతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రం’(ఎన్ఎల్డీసీ) సరఫరా చేయదు. -
బీచ్ శాండ్ మైనింగ్ ఎక్కడాలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీచ్ శాండ్ మైనింగ్ ద్వారా మొనాజైట్ ఖనిజాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తాజాగా వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మైనింగ్ డైరెక్టర్ వి.జి. వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 2019 నుంచి ఎక్కడా బీచ్ శాండ్ మైనింగ్ జరగడంలేదని స్పష్టంచేశారు. అసలు మైనింగ్ ఆపరేషన్స్ జరగనప్పుడు మొనాజైట్ ఖనిజాన్ని అక్రమంగా రవాణా చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం ఆయనొక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 2019కి ముందు రెండు ప్రైవేటు సంస్థలు బీచ్ శాండ్ మైనింగ్ కార్యక్రమాలు నిర్వహించాయని.. 2019లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో హెవీ మినరల్ బీచ్ శాండ్ మైనింగ్ పూర్తిగా నిలిపివేశామన్నారు. ఇటీవల బీచ్ శాండ్ మైనింగ్‌లో అక్రమాలంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం) ద్వారా విచారణ జరిపించాలని కేంద్ర గనుల శాఖను అణు ఇంధన శాఖ కోరిందని తెలిపారు. ఐబీఎం విచారణలో ఆ సంస్థలు మైనింగ్ నిర్వహించిన కాలంలో ఏవైనా అక్రమాలకు పాల్పడి ఉంటే అందుకు సంబంధించిన వాస్తవాలు వెలుగుచూస్తాయన్నారు. అక్రమాలు వాస్తవమని నిర్ధారణ జరిగితే బాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆ రెండింటి అనుమతుల ప్రక్రియ పూర్తికాలేదు ఇక బీచ్ శాండ్ మైనింగ్ కోసం గత ఏడాది కేంద్ర అణుశక్తి సంస్థ (డీఏఈ)కు ఏపీఎండీసీ 16 ప్రతిపాదనలను సమర్పించిందని వెంకటరెడ్డి తెలిపారు. దానిలో విశాఖ జిల్లా భీమునిపట్నం పరిధిలో 90.15 హెక్టార్లు, కృష్ణాజిల్లా మచిలీపట్నం తీరప్రాంతంలో 1,978.471 హెక్టార్లలో రెండు బీచ్ శాండ్ డిపాజిట్లకు ఏపీఎండీసీని ప్రాస్పెక్టివ్ లెస్సీగా డీఏఈ నియమించిందని తెలిపారు. ఇక్కడ మైనింగ్ జరిపేందుకు అనుమతుల కోసం ఏపీఎండీసీ దరఖాస్తు చేసుకుందన్నారు. అయితే, ఆ అనుమతుల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంవల్ల కేంద్రం ప్రతిపాదించిన ఈ రెండు బ్లాక్‌లలో ఇప్పటివరకు ఎటువంటి మైనింగ్ ప్రారంభం కాలేదని ఆయన స్పష్టంచేశారు. హెవీ మినరల్ బీచ్ శాండ్‌లో మొనాజైట్ అవశేషాలు జీరో శాతం మాత్రమే ఉండాలని, అంతకుమించి ఉన్నట్లు నిర్ధారణ అయితే సదరు మైనింగ్ లీజులను రద్దుచేయాలంటూ కేంద్రం 2019 మార్చి ఒకటిన మెమో ద్వారా రాష్ట్రానికి ఆదేశాలు ఇచ్చిందన్నారు. దాని ప్రకారం మన రాష్ట్రంలోని బీచ్ శాండ్‌లో మొనాజైట్ శాతం కేంద్రం నిర్దేశించిన దానికన్నా ఎక్కువగా ఉన్నందున అన్ని బీచ్ శాండ్ లీజులను గనుల శాఖ రద్దుచేసిందని వెంకటరెడ్డి ఆ ప్రకటనలో వివరించారు. కేంద్రానికి ఏపీ సమగ్ర వివరణ ఇక బీచ్ శాండ్ మైనింగ్‌పై కేంద్ర ప్రభుత్వం తాజాగా వ్యక్తంచేసిన సందేహాల నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 12న కేంద్ర అణు ఇంధన శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం గనుల శాఖ ద్వారా సమగ్ర వివరణ ఇచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో బీచ్ శాండ్ మైనింగ్ జరుగుతోందని, దాని ద్వారా పర్యావరణానికి నష్టం, మైనింగ్ చట్టాలకు విఘాతం, మొనాజైట్ అక్రమ రవాణా జరిగిందంటూ వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కేంద్రానికి సమర్పించిన నివేదికలోనే స్పష్టంచేసిందని వెంకటరెడ్డి పేర్కొన్నారు. -
CM YS Jagan: బొగ్గు కొరత రానివ్వద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బొగ్గు కొరత రాకుండా తగిన ప్రణాళిక రూపొందించాలని, థర్మల్ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూడాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, వినియోగంపై సమీక్ష నిర్వహించారు. బొగ్గు కొరతను అధిగమించడానికి సులియారీ బొగ్గు గని నుంచి ఉత్పత్తి పెంచడంతో పాటు సింగరేణి బొగ్గు గనుల యాజమాన్యంతోనూ సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. కృష్ణపట్నం పోర్టు ద్వారా బొగ్గు దిగుమతి చేసుకోవడం వల్ల రవాణా ఖర్చులు కలిసి రావడంతో పాటు, ఉత్పత్తి ఖర్చు మిగతా వాటితో పోలిస్తే తగ్గుతుందని అన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు అమర్చడం వల్ల రైతులపై ఒక్క పైసా కూడా భారం పడదని, బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయాన్ని వారికి వివరించాలని సూచించారు. డిసెంబర్‌లోగా పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల టెండర్లు పూర్తి కావాలని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత ఉన్న రోజుల్లో వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని భారీగా విద్యుత్ కొనుగోలు చేశామని ఇంధన శాఖ అధికారులు సీఎంకు తెలిపారు. ఏటా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నా, దానికి సరిపడా బొగ్గు సరఫరా కేంద్రం నుంచి ఉండటం లేదని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్ (పీహెచ్‌ఎస్‌పీపీ)పై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం అన్ని రకాలుగా ప్రయత్నం.. ► కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు బొగ్గు సరఫరా జరిగేలా చూసుకోవాలి. ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గని నుంచి మరింత మెరుగ్గా ఉత్పత్తి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలి. ► కృష్ణపట్నం పోర్టు రేవు దగ్గరే విద్యుత్ ప్లాంట్ ఉండటం వల్ల ఓడల ద్వారా తెప్పించుకునే బొగ్గు ద్వారా అక్కడ పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చూడాలి. సింగరేణి నుంచి కూడా అవసరమైన బొగ్గు వచ్చేలా అక్కడి యాజమాన్యంతో సంప్రదింపులు జరపాలి. కోల్ స్వాపింగ్ (ఇచ్చిపుచ్చుకోవడం) లాంటి వినూత్న ఆలోచనలు అమలు చేయాలి. ► విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న రోజుల్లో పూర్తి సామర్థ్యంతో పవర్ ప్లాంట్లు నడిచేలా చూసుకోవాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గి, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయొచ్చు. డిమాండ్ అధికంగా ఉన్న రోజుల్లో కూడా పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరాపై సరైన ప్రణాళిక ప్రకారం నడుచుకోవాలి. మీటర్ల ఏర్పాటుపై రైతులకు లేఖలు ► వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చడం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలేమిటో వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇందు కోసం రైతులకు లేఖలు రాయాలి. శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ ఎలా విజయవంతం అయ్యిందో, దానివల్ల రైతులకు జరిగిన మేలేంటో కూడా వివరించాలి. అక్కడ 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయిన విషయాన్ని రైతులకు తెలియాజేయాలి. ► మీటర్లు కారణంగా మోటార్లు కాలిపోవని, ఎంత కరెంటు కాలుతుందో తెలుస్తుందని, విద్యుత్ సరఫరాలో నాణ్యత ఉంటుందనే విషయాలపై రైతుల్లో అవగాహన కల్పించాలి. వ్యవసాయ కనెక్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరు చేయాలి. ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ పాడైనా వెంటనే రీప్లేస్ చేయాలి. ► ఈ సమావేశంలో ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బీ శ్రీధర్, నెడ్కాప్ ఎండీ ఎస్ రమణారెడ్డి, డిస్కంల సీఎండీలు కే సంతోషరావు, జే పద్మా జనార్ధనరెడ్డి పాల్గొన్నారు. డిసెంబర్‌లోగా టెండర్లు ► పోలవరం విద్యుత్ కేంద్ర ప్రాజెక్ట్ పనులపైనా సీఎం సమీక్షించారు. పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. దిగువ సీలేరు వద్ద 115 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు యూనిట్ల నిర్మాణాన్ని 2024 ఏప్రిల్ నాటికి పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే అన్ని ఇళ్లకూ కరెంటు సరఫరా చేశామని అధికారులు తెలిపారు. నీళ్లు పూర్తిగా తగ్గాక వ్యవసాయ పంపులకు కరెంటు ఇస్తామన్నారు. ► ఎగువ సీలేరులో 150 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 9 యూనిట్ల పంప్డు స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి డిసెంబర్‌లోగా టెండర్లు ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు(పీఎస్పీ)లపై సమగ్ర సమాచారంతో రూపొందించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్ ఆవిష్కరించారు. జగనన్న కాలనీల్లో ఇంటింటికీ కరెంటు పనులపై తగిన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సూచించారు. ► కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ యూనిట్–3 సెప్టెంబర్ నుంచి, విజయవాడ థర్మల్ ప్లాంట్ ఐదవ స్టేజ్ 2023 ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి వస్తాయని అధికారులు చెప్పారు. ఈ రెండు యూనిట్ల ద్వారా అదనంగా 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. -
విద్యుత్ రంగ విజయోత్సవం
సాక్షి, అమరావతి: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు విద్యుత్ రంగంలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ‘ఉజ్వల్ భారత్, ఉజ్వల్ భవిష్య’ వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ నెల 25 నుంచి 31 వరకు 773 జిల్లాల్లోని 1,546 ప్రాంతాల్లో ఈ వారోత్సవాలు జరగనున్నాయి. రాష్ట్రంలోనూ వీటి నిర్వహణకు ప్రభుత్వం సహకారం అందిస్తోంది. విశాఖ, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని కార్యక్రమాలకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ), మిగిలిన జిల్లాల్లోని కార్యక్రమాలకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లు సెంట్రల్ నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరించనున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మకు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ ఆదివారం లేఖ రాశారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు నోడల్ అధికారిగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2047 నాటికి విద్యుత్ రంగంలో సాధించాల్సిన లక్ష్యాలతో కూడిన విజన్‌ను ఈ వేడుకల్లో ఆవిష్కరించనున్నట్లు బీఈఈ తెలిపింది. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ‘ఉజ్వల్ భారత్, ఉజ్వల్ భవిష్య’కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందించనున్నట్లు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇంధన శాఖ అధికారులతో ఆదివారం ఆయన టెలీకాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడారు. కలెక్టర్లు ఈ కార్యక్రమం నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న డిస్కంలకు ప్రభుత్వం ఇప్పటికే రూ.34 వేల కోట్లు విడుదల చేసిందని మంత్రి తెలిపారు. స్వతంత్ర పోరాటంతో సంబంధమున్న గ్రామాలు, ఇటీవల విద్యుద్దీకరణ జరిగిన గ్రామాల్లో ‘ఉజ్వల్ భారత్, ఉజ్వల్ భవిష్య’ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం సూచించినట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. సమావేశంలో ఏపీ ట్రాన్స్‌కో ఎండీ బి.శ్రీధర్, జేఎండీ పృథ్వితేజ్, డిస్కంల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె.పద్మజనార్ధనరెడ్డి, కె.సంతోషరావు, నెట్ క్యాప్ ఎండీ ఎస్.రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ కోతల్లేవు.. ‘ప్రైవేటు’ కుట్రల్లేవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కోతలు లేవని ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్ స్పష్టంచేశారు. పల్లెల్లో కోతలంటూ జరుగుతున్న ప్రచారం పచ్చి అబద్ధమని చెప్పారు. 4వ తేదీన మాత్రమే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో గ్రిడ్ భద్రత దృష్ట్యా కేవలం కొన్ని గంటలు లోడ్ రిలీఫ్ విధించాల్సి వచ్చిందని తెలిపారు. కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో బూడిదను బయటికి పంపడంలో ఏర్పడ్డ సాంకేతిక సమస్యపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ఈ ప్లాంటును ప్రైవేటీకరించడానికే హాఫర్స్‌ను కూల్చారన్నది అవాస్తవమని వివరించారు. ఈ ప్లాంట్‌ను ఆదానీకి అప్పగిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. శ్రీధర్ సోమవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు తీవ్రంగా ఉండి, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పటికీ అతి తక్కువ కోతలతో విద్యుత్ సరఫరా చేశాం. ఏప్రిల్ 15 నుంచి పరిశ్రమలకు పవర్ హాలిడే కూడా ఎత్తేశాం. ఆ తరువాత రోజుకి 180 నుంచి 190 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండేది. ఉష్ణోగ్రతలు పెరిగి, గృహ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండటంతో నాలుగు రోజులుగా డిమాండ్ అనూహ్యంగా 225 ఎంయూకు పైగా ఉంది. ఈ నెల 4న 224 ఎంయూ డిమాండ్ ఉంది. అయినా అంతమేరకు విద్యుత్ సరఫరా చేశాం. అయితే పవన విద్యుత్ 800 మెగావాట్లు పడిపోయింది. బయటి మార్కెట్లో దొరకలేదు. ఫలితంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య పీక్ అవర్స్‌లో 4.6 ఎంయూ లోటు ఏర్పడింది. అప్పటికే సెంట్రల్ గ్రిడ్ నుంచి అదనంగా విద్యుత్ తీసుకున్నాం. ఇంకా తీసుకుంటే గ్రిడ్ కూలిపోతుంది. దీంతో 2 నుంచి 3 గంటలు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్ఆర్) అమలు చేయాల్సి వచ్చింది. అంతేతప్ప అది విద్యుత్ కోత కాదు. విదేశీ బొగ్గుతో నడిచే కృష్ణపట్నం ప్లాంట్‌కు టన్ను రూ.24 వేలు చొప్పున 18 లక్షల టన్నులను అదానీ సంస్థ సరఫరా చేస్తుంది. స్వదేశీ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేసే డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీసీ), రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లకు 13 లక్షల బొగ్గును టన్ను రూ.19,500కు చెట్టినాడు సంస్థ సమకూరుస్తుంది. ఈ రెండు టెండర్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుమతితో ఖరారు చేశాం. జూలై మొదటి వారం నుంచి బొగ్గు సరఫరా మొదలవుతుంది. మన దగ్గర విద్యుత్ ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలకు ఇచ్చి, వారి దగ్గర ఉన్నప్పుడు తీసుకునే ఏర్పాటు చేస్తున్నాం. అవసరమైనప్పుడు కొనేలా షార్ట్‌టర్మ్ టెండర్లు పిలుస్తున్నాం. కృష్ణపట్నం ప్లాంటుకు క్వాలిటీ బొగ్గు కావాలి. దీని నుంచి వచ్చే ఫ్లైయాష్‌ను సిమెంటు కంపెనీలు తీసుకోవడంలేదు. రెండేళ్లుగా పెన్నా సిమెంట్ మాత్రమే 40శాతం తీసుకుంటోంది. స్థానికంగా వాడేది 10శాతం. మిగిలిన 50శాతాన్ని యాష్‌పాండ్‌లోకి పంపుతుంటారు. పైపు నుంచి బూడిద వెళుతున్నప్పుడు దానిలోని ఎలక్ట్రోడ్స్ను ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ (ఈఎస్పీ) సేకరించి కిందకు పంపుతుంది. ఎక్కువ బూడిద రావడంతో ప్లేట్స్ (హాఫర్స్) కింద పడిపోయాయి. దీంతో ప్లాంటును నిలిపివేయాల్సి వచ్చింది. దీనిపై డైరెక్టర్, చీఫ్ ఇంజనీర్, ఎస్ఈ బృందంతో విచారణ చేయిస్తున్నాం. ఇది సాంకేతిక సమస్యే తప్ప ఎలాంటి కుట్రా లేదు. కృష్ణపట్నం ప్లాంటును ప్రైవేటీకరించం. ప్లాంట్ నిర్వహణకు మనకు పడుతున్న కాస్ట్కంటే తక్కువకు ఎవరైనా ఇస్తామంటే పారదర్శక టెండర్ల ద్వారా ఓ అండ్ ఎం విధానంలో అప్పగిస్తాం. దీనివల్ల యూనిట్ రేటు తగ్గి వినియోగదారులకే మేలు జరుగుతుంది. ఎస్బీఐ కాప్స్ బిడ్ డాక్యుమెంట్ తయారు చేసి టెండర్ల ప్రక్రియకు సహకరించేందుకు ఈరోజే ఆదేశాలిచ్చాం. ప్లాంటులో ఉద్యోగులంతా ఏపీ జెన్కో నుంచి డిప్యుటేషన్‌పై వెళ్లినవారే. వారు అభద్రతకు గురి కావద్దు. -
పరిశ్రమలకు పూర్తి విద్యుత్తు
సాక్షి, అమరావతి: ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశ్రామిక రంగానికి పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. విద్యుత్ సంస్థల అధికారులతో బుధవారం ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. పరిశ్రమలకు విద్యుత్ సరఫరాపై అన్ని పరిమితులను ఎత్తివేసి సాధారణ స్థితిని పునరుద్ధరించినట్లు మంత్రి పేర్కొన్నారు. పారిశ్రామిక రంగానికి విద్యుత్ సరఫరా కొనసాగించాలనే లక్ష్యంతో అధిక ధరలతో కొనుగోలుకు కూడా వెనుకాడలేదన్నారు. విదేశీ బొగ్గుకు టెండర్లు రాష్ట్రంలో బొగ్గు సరఫరా పర్యవేక్షణకు కోర్ మేనేజ్మెంట్ బృందాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా స్థితిగతులను సీఎం తరచూ సమీక్షిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. థర్మల్ ప్లాంట్లకు తగినంత బొగ్గు సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరామని, 32 లక్షల టన్నుల విదేశీ బొగ్గు దిగుమతి కోసం టెండర్లు జారీ చేశామని వివరించారు. దేశంలో బొగ్గు సరఫరా ఇంకా సమస్యాత్మకంగానే ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని విద్యుత్ సంస్థలకు సూచించారు. ఖరీఫ్‌కు కొరత రాకూడదు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్నందున వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కొరత రాకూడదని మంత్రి పెద్దిరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. వ్యవసాయ అవసరాల కోసం 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం చేసుకుంటున్నామని, బొగ్గు సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్ స్టోరేజీ హైడ్రోపవర్ ప్లాంట్ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. సమీక్షలో ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ట్రాన్స్‌కో జేఏండీ ఐ. పృథ్వీతేజ్, డిస్కమ్‌ల సీఎండీలు కె.సంతోషరావు, జే పద్మజనార్దనరెడ్డి, హెచ్. హరనాథరావు, డైరెక్టర్ ఏవీకే భాస్కర్ పాల్గొన్నారు. -
యుద్ధ ప్రాతిపదికన బొగ్గు సేకరణ
సాక్షి, అమరావతి: భానుడి ఉగ్రరూపంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. విద్యుత్‌కు విపరీతంగా డిమాండ్ ఏర్పడడంతో.. దేశంలోని అనేక రాష్ట్రాలు విద్యుదుత్పత్తిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగానూ, అంతర్జాతీయంగానూ బొగ్గు సమస్య తీవ్రమై ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ప్రభావం దిగుమతులపైనా పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి విఘాతం కలుగకుండా బొగ్గు నిల్వలు పెంచుకోవాలని ఇంధన శాఖను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో దాదాపు 32 లక్షల టన్నుల బొగ్గును సమకూర్చుకోవడానికి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. రికార్డు స్థాయిలో వినియోగం.. రాష్ట్ర్రంలో పీక్ డిమాండ్ రికార్డులు సృష్టిస్తోంది. ఏప్రిల్ 8న అత్యధికంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 12,293 మెగావాట్లకు చేరింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక డిమాండ్. ఈ నెల ప్రారంభంలో దాదాపు 11,767 మెగావాట్లుగా ఉన్న డిమాండ్ ప్రస్తుతం 9,711 మెగావాట్లుగా ఉంది. ఇక రోజువారీ విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టుగా 200 మిలియన్ యూనిట్లను విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సరఫరా చేస్తున్నాయి. దీనిలో బుధవారం రూ.56.75 కోట్లతో 40.32 మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్‌నుంచి యూనిట్ రూ.14.07 చొప్పున కొనుగోలు చేశారు. నెలలోపే టెండర్లు ఖరారు.. కొరతను అధిగమించేందుకు బొగ్గును దిగుమతి చేసుకోవటానికి అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ జెన్కోను ఆదేశించింది. దీంతో కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల ఉత్పత్తిని పెంచడానికి ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లక్ష టన్నుల దిగుమతి చేసుకున్న మెరుగైన గ్రేడ్ బొగ్గు కోసం టెండర్లు పిలిచింది. అదే విధంగా ఏపీజెన్కో 18 లక్షల టన్నుల కోసం, ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్) 13 లక్షల టన్నుల కోసం తాజాగా టెండర్లు ఆహ్వానించాయి. ఈ మొత్తం టెండర్ల ప్రక్రియను నెల రోజుల్లోపే పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఎక్కడా దొరకని బొగ్గు, విద్యుత్.. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)లో 0.83 రోజులు, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లో 2.10 రోజులు, కృష్ణపట్నంలో 6.02 రోజులు, హిందుజాలో 4.24 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మన రాష్ట్రంలో బొగ్గు క్షేత్రాలు లేకపోవడంతో మహానది కోల్ ఫీల్డ్స్, సింగరేణి కాలరీస్‌పై ఆధారపడాల్సి వస్తున్నది. అక్కడి నుంచి కూడా తగినంత బొగ్గు సరఫరా జరగడం లేదు. ఈ నేపథ్యంలో అవసరమైన బొగ్గును అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మరోవైపు విద్యుత్ ఎక్సే్ఛంజీల్లోనూ కరెంటు పరిమితంగానే దొరుకుతోంది. కొనుగోలు వ్యయం గత పదేళ్లలో లేనంతగా రికార్డు స్థాయికి చేరుకుంది. యూనిట్ రూ.12 నుంచి 16 వరకు పలుకుతోంది. పీక్ అవర్స్‌లో రూ.20కి కూడా కొనాల్సి వస్తోంది. -
గనులు, అటవీశాఖ మంత్రిగా పెద్దిరెడ్డి బాధ్యతలు స్వీకరణ
-
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సాక్షి, అమరావతి: గనులు, విద్యుత్, అటవీశాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అంతకమందు సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి పెద్దిరెడ్డి దంపతులు, ఎంపీ మిథున్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ, గనులు, విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఆదాయం మరింత పెంచేందుకు కృషి చేస్తా బాధ్యతల స్వీకరణ అనంతరం మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడాను. సీఎం జగన్‌ని పిన్నెల్లి కలుస్తారు. అన్నా రాంబాబు, సామినేని ఉదయభానులకు కూడా సర్ది చెప్పాను. సీఎం జగన్ అందరికీ గుర్తింపు, గౌరవం ఇస్తారు. నాకు ఇచ్చిన మూడు శాఖల్లో మంచి పేరు తెచ్చేందుకు కృషి చేస్తా. రైతులకు ఉచిత విద్యుత్‌ని సమర్థవంతంగా అమలు చేస్తాము. పరిశ్రమలకు పవర్ హాలిడే లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటాం. గనుల శాఖలో చేపట్టిన సంస్కరణల వలన ఆదాయం పెరిగింది. ఆ ఆదాయం మరింత పెంచేందుకు కృషి చేస్తాను' అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చదవండి: (మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చెల్లుబోయిన వేణు) రాజకీయ నేపథ్యం: 1974 ఎస్వీయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1985లో కాంగ్రెస్ పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 1989లో పీలేరు నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో ఓటమిపాలైన ఆయన పీలేరు నుంచి 1999, 2004 సంవత్సరాల్లో, పుంగనూరు నుంచి 2009లో విజయం సాధించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995-2004 మధ్య తొమ్మిదేళ్లు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2009 నుంచి 2010 వరకు వైఎస్సార్, రోశయ్య మంత్రివర్గాల్లో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. 2012 నవంబర్‌లో రాజీనామా చేశారు. ఆ తర్వాతి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పుంగనూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తిరిగి రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. -
ఎకరం కూడా ఎండకూడదు.. ఇంధన శాఖకు ఆదేశాలు
సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్ సరఫరాపై ప్రత్యేకంగా పర్యవేక్షించి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో ఒక్క ఎకరం పంట పొలం కూడా ఎండకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఇంధన శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అవసరాలకు విద్యుత్ సరఫరాపై ఇంధన శాఖ అప్రమత్తమైంది. వేసవి, విద్యార్థులకు పరీక్షలను దృష్టిలో పెట్టుకొని గృహ విద్యుత్‌కూ డిస్కమ్‌లు ప్రాధాన్యమిస్తున్నాయి. రోజూ 50 ఎంయూల కొరత రాష్ట్రంలో 2018–19లో మొత్తం విద్యుత్ డిమాండ్ 63,605 మిలియన్ యూనిట్లు ఉండగా 2021–22 నాటికి 68,905 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అంటే 8.3 శాతం పెరిగింది. గృహ వినియోగం 32 శాతం, పారిశ్రామిక వినియోగం 6 శాతం, వ్యవసాయ వినియోగం 16 శాతం చొప్పున పెరిగింది. గృహ విద్యుత్ డిమాండ్ 2018–19లో 14,681 ఎంయూలు ఉండగా 2021–22లో 19,355 మిలియన్ యూనిట్లకు చేరింది. పారిశ్రామిక రంగంలో డిమాండ్ 17,781 మిలియన్ యూనిట్ల నుంచి 18,844 మిలియన్ యూనిట్లకు చేరింది. వ్యవసాయ రంగంలో వాడకం 10,832 మిలియన్ యూనిట్ల నుంచి 12,720 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. వివిధ రంగాల్లో పెరిగిన విద్యుత్ డిమాండ్ కారణంగా రోజూ 50 మిలియన్ యూనిట్ల మేర కొరత ఎదుర్కొంటున్నట్లు ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. దీన్ని అధిగమించేందుకు బహిరంగ మార్కెట్లో నిత్యం 30 మిలియన్ యూనిట్ల మేర కొనుగోలు చేస్తుండగా మరో 20 ఎంయూల కొరత నెలకొంది. ఈ నెలలో విద్యుత్ డిమాండ్ 6,720 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. కొరతకు రెండు ప్రధాన కారణాలు.. కోవిడ్ ప్రభావం తగ్గిన నేపథ్యంలో వివిధ రంగాలలో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ పెరగడానికి ఇది ఒక కారణం. రష్యా – యుక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా బొగ్గు ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో దేశంలో బొగ్గు కొరత కారణంగా కొద్ది నెలలుగా అసాధారణంగా పెరిగాయి. ఇది మరో ప్రధాన కారణం. గతంలో టన్ను బొగ్గు రూ.6 వేల నుంచి రూ.8 వేలు ఉండగా ఇప్పుడు రూ.17 వేల నుంచి రూ.40 వేలకు చేరింది. దీంతో గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోనూ బొగ్గు కొరత నెలకొంది. విద్యుత్ డిమాండ్‌ను అందుకునేందుకు వివిధ రాష్ట్రాలు పవర్ ఎక్సే్ఛంజీల నుంచి విద్యుత్ కొనుగోలుపై ఆధారపడుతున్నాయి. ఫలితంగా డిమాండ్, సరఫరా మధ్య అంతరం పెరిగి బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం యూనిట్ ధర పీక్ అవర్స్‌లో రూ.12 వరకూ ఉంది. నెలాఖరుకు సాధారణ పరిస్థితి.. ‘‘రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను అందుకునేలా దీర్ఘకాలిక ప్రాతిపదికన బొగ్గు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. విద్యుత్ కొరత కారణంగా పారిశ్రామిక వినియోగంపై కొంతమేర ఆంక్షలు విధించక తప్పని పరిస్థితి ఎదురైంది. అలా ఆదా చేసిన విద్యుత్‌ను వ్యవసాయ, గృహ అవసరాల కోసం సరఫరా చేస్తున్నాం. ఈ నెలాఖరు నాటికి విద్యుత్ కొరత సమస్య చాలా వరకు తీరుతుందని భావిస్తున్నాం. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ను అందించడంలో రాజీ లేదు’’ – బి.శ్రీధర్, ఇంధన శాఖ కార్యదర్శి -
విద్యుత్‌పై ఉత్త కబుర్లే.. ఆ ‘బాబు’ గొప్పేమీ లేదు
సాక్షి,అమరావతి: గతంలో టీడీపీ అధికారంలోకి వచ్చేసరికే రాష్ట్రంలో విద్యుదుత్పత్తి కేంద్రాలున్నాయని, గత సర్కారు హయాంలోనే మొదలయ్యాయనడంలో ఏమాత్రం వాస్తవం లేదని ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ స్పష్టం చేశారు. ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృథ్వీతేజ్తో కలసి ఆదివారం విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుదిబండల్లా పీపీఏలు.. బకాయిలు ఆర్టీపీపీలో 600 మెగావాట్లు, కృష్ణపట్నంలో 1600 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు 2009లోనే మొదలయ్యాయని ఇంధనశాఖ కార్యదర్శి వెల్లడించారు. 2014 నాటికి దేశ వ్యాప్తంగా మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ అధిక ధరలకు 8,000 మెగావాట్ల పీపీఏలు కుదుర్చుకోవడంతో పాతికేళ్ల పాటు ఏటా రూ.3 వేల కోట్లు భారం డిస్కంలపై పడుతోందన్నారు. గత సర్కారు హయాంలో రూ.30 వేల కోట్ల రుణాలు తీసుకుని 2018–19 నాటికి రూ.62 వేల కోట్లకు చేర్చారని, ఏటా రూ.8 వేల కోట్లు చొప్పున ఇవ్వాల్సిన సబ్సిడీలను ఇవ్వకుండా రూ.2 వేల కోట్లే ఇవ్వడం వల్ల బకాయిలు పెరిగిపోయాయని చెప్పారు. గత ప్రభుత్వం ట్రూ అప్ చార్జీలను (విద్యుత్ కొనుగోలు ఖర్చులు) ఏపీఈఆర్సీకి సమర్పించకుండా, తప్పుడు నివేదికలు సమర్పించడంతో ఆర్థిక భారం పడిందన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు, బకాయిలకే రెండున్నరేళ్లలో రూ.36 వేల కోట్లు ఇచ్చిందన్నారు. నెలలోపే కృష్ణపట్నం యూనిట్ రాష్ట్ర ప్రభుత్వం పోలవరంలో 960 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును సిద్ధం చేస్తోందని, 2024 నుంచి దశలవారీగా ఆ విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఇంధన శాఖ కార్యదర్శి వివరించారు. సీలేరులో 1350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు చేపట్టామని, మూడు నెలల్లో టెండర్లు ఖరారు చేస్తామని తెలిపారు. వీటీపీఎస్, కృష్ణపట్నంలో 800 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్లను త్వరగా ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని వెల్లడించారు. కృష్ణపట్నం యూనిట్ నెలలోపే ప్రారంభిస్తామన్నారు. నెడ్ కాప్ ద్వారా 6600 మెగావాట్ల సామర్థ్యంతో ఏడు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని, డీపీఆర్ సిద్ధమవుతోందని తెలిపారు. సాగుకు సౌర విద్యుత్తుతో భరోసా వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న విధానాలతో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఇటీవల ఎన్టీపీసీ చైర్మన్‌తో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి తెలియచేశారని ఇంధనశాఖ కార్యదర్శి చెప్పారు. రాబోయే 30 ఏళ్ల పాటు రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వ్యవసాయానికి సెకీ ద్వారా తక్కువ ధరకే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ రూ.2.49కే సేకరిస్తోందని, తద్వారా 2024లో వ్యవసాయ మిగులు విద్యుత్‌ను గృహ, పారిశ్రామిక అవసరాలకు అందిస్తామన్నారు. ప్రస్తుతం సగటున విద్యుత్తు కొనుగోలు వ్యయం యూనిట్ రూ.5.10 చొప్పున ఉందన్నారు. ఈ లెక్కన సంవత్సరానికి దాదాపు రూ.3,750 కోట్లు ఆదా అవుతుందని తెలిపారు. వ్యవసాయ రంగానికి గత సర్కారు హయాంలో విడుదల చేసిన మొత్తం రాయితీలు రూ.13,255 కోట్లు కాగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లలో విడుదల చేసిన సబ్సిడీలు రూ.21,497 కోట్లు అని శ్రీధర్ వెల్లడించారు. బొగ్గు సంక్షోభంతో.. దేశంలో విపత్కర పరిస్థితులు, వ్యవసాయ రంగం డిమాండ్, బొగ్గు సంక్షోభం విద్యుత్ కోతలకు ప్రధాన కారణాలని శ్రీధర్ తెలిపారు. 2014–15 మధ్య కాలంలో 6 శాతంగా ఉన్న విద్యుత్ గ్రోత్ (సంవత్సరానికి సంవత్సరానికి మధ్య గ్రోత్) 2020–21లో 14 శాతానికి పెరిగిందని తెలిపారు. 2014–19లో కెపాసిటీ ఎడిషన్ జరగడం వల్ల డిస్కంలపై, వినియోగదారులపై భారం పడిందని, విద్యుత్ కొరతకు ఇది కూడా ఓ కారణమన్నారు. మే నెలలో మొదలై జూన్, జూలై వరకు మాత్రమే విండ్ పవర్ తక్కువ సమయం అందుబాటులో ఉంటుందన్నారు. తాత్కాలిక సమస్యలే.. ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సమస్యలు తాత్కాలికమేనని, త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఇంధన శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం రోజు తక్షణమే తీసుకున్న చర్యల వల్ల గృహావసరాలు, వ్యవసాయానికి ఆదివారం రోజు విద్యుత్ కోతలను తగ్గించగలిగామని చెప్పారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. గత నెల నుంచి విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరిందని, వ్యవసాయ విద్యుత్ వినియోగం ఈ నెలాఖరుకు తగ్గే అవకాశం ఉందన్నారు. సాగు విద్యుత్ వినియోగం తగ్గాక పరిశ్రమలకు యథావిథిగా విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు. పరిశ్రమల నుంచి ఇప్పటికే వినతులు అందుతున్నాయని, త్వరలో సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఎలాంటి బకాయిలు లేవు.. గత అక్టోబర్ నుంచి బొగ్గు సంక్షోభం నెలకొన్నా కోల్ కంపెనీలకు ఎటువంటి బకాయిలు లేవని, సింగరేణి నుంచి నిరంతరాయంగా సరఫరా జరుగుతోందని ఇంధనశాఖ కార్యదర్శి చెప్పారు. శనివారం రోజు కోల్ కంపెనీలకు రూ.150 కోట్లు చెల్లించామన్నారు. కోల్ ఇండియా నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేస్తోందని, రైల్వేలు కూడా క్రమం తప్పకుండా ర్యాక్‌లు సమకూరుస్తున్నాయని చెప్పారు. విశాఖలోని హిందూజా పవర్‌కు బొగ్గు సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరామని, అక్కడ విద్యుత్ ఉత్పత్తి జరిగితే పీపీఏ ప్రకారం మనకు 1000 మెగావాట్లు అందుతుందని తెలిపారు. విద్యుత్ సమస్యలపై కేంద్రం ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్న సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. బాబు దూరదృష్టితోనే దేశమంతా మెరుగైందా? రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విద్యుత్ కొరత నెలకొనగా టీడీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే సమస్య తగ్గిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారని, అయితే, ఇంధన కొరత తగ్గడం అనేది దేశవ్యాప్తంగా ఏర్పడ్డ పరిస్థితుల వల్లే కానీ గత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కాదన్నారు. 2014 జూన్ 3న 16 రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఉండగా 2016 జూన్ 3 నాటికి నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే విద్యుత్ కొరత ఉందన్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించి పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందన్నారు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు తన దూరదృష్టితో కూడిన నాయకత్వం వల్లే దేశం మొత్తం విద్యుత్ పరిస్థితి మెరుగుపడిందని చెప్పగలరా? అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చేటప్పటికి 90 శాతం కంటే ఎక్కువ అభివృద్ధి దశలో ఉన్న కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్.. ప్రభుత్వం ఏర్పడిన తేదీ నుంచి ఏడాది లోపు కార్యకలాపాలను ప్రారంభించిందన్నారు. గత ప్రభుత్వాల ప్రయత్నాల వల్లే అది సాధ్యమైంది కానీ టీడీపీ సర్కారు గొప్పతనమేమీ కాదన్నారు. డిస్కమ్‌లపై తీవ్ర ఒత్తిడి టీడీపీ పాలనలో డిస్కంలపై తీవ్ర ఒత్తిడి ఉండేదని, చంద్రబాబు తనను తాను దార్శనికుడిగా అభివర్ణించుకునే అవకాశం లేదన్నారు. వాస్తవానికి విభజన తర్వాత మొదటి సంవత్సరానికి 54,225 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్‌ను ఏపీఈఆర్సీ ఆమోదించిందని, 54,867 మిలియన్ యూనిట్ల లభ్యతను అంచనా వేయడం విద్యుత్ కొరత లేదని సూచిస్తుందన్నారు.ఆ సమయంలో దేశంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2,43,028 మెగావాట్లు ఉంటే, గరిష్ట డిమాండ్ 1,35,918 మెగావాట్లేనన్నారు. అలాంటప్పుడు దీర్ఘకాలిక ప్రాతిపదికన భారీ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అధిక ఖర్చులతో తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అయినా టీడీపీ ప్రభుత్వం హడావుడిగా 8 వేల మెగావాట్ల పీపీఏలను అధిక ధర (యూనిట్ రూ. 4.84 చొప్పున)లకు కుదుర్చుకుందని గుర్తుచేశారు. రెట్టింపు అప్పులు.. భారీ బకాయిలు టీడీపీ హయాంలో విద్యుత్ రంగం అప్పులు రూ.29,703 కోట్ల నుంచి రూ.58,596 కోట్లకు చేరాయన్నారు. విద్యుదుత్పత్తిదారులకు డిస్కంల బకాయిలు రూ.2,893.23 కోట్ల నుంచి రూ.21,540.96 కోట్లకు పెరిగాయని తెలిపారు. ఐదేళ్లలో రాష్ట్ర పంపిణీ, వినియోగాల నికర విలువ రూ.4,315.72 కోట్ల ప్రతికూల విలువ నుంచి రూ.19,926.27 కోట్ల ప్రతికూల విలువకు క్షీణించిందన్నారు. కనీసం నెట్‌వర్త్ సానుకూలంగా ఉంటే చంద్రబాబు దూరదృష్టి గల వ్యక్తి అనే వాదనను కొంతవరకు సమర్థించవచ్చని, కానీ ఆయన హయాంలో నెట్‌వర్త్ గణనీయంగా క్షీణించిందన్నారు. -
అక్టోబర్ నుంచే దేశంలో బొగ్గు కొరత: ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్
సాక్షి, విజయవాడ: గత ఏడాది అక్టోబర్ నుంచి దేశంలో బొగ్గు కొరత ఉందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఎక్కడా బొగ్గు సరఫరాకు డబ్బు కొరత లేదు. సమయానికి చెల్లింపులు చేస్తున్నాం. కోల్ ఇండియా వాళ్లకు రూ.150 కోట్లు నిన్న చెల్లించాం. హిందూజకు బొగ్గు సరఫరా చేయాలని కేంద్రానికి లేఖ రాశాం. విద్యుత్ వినియోగం 14 శాతానికి పెరిగింది. దీనికి తోడు బొగ్గు కొరత ఏర్పడింది. సెకితో 2024 వరకు ప్రభుత్వం 7 వేల మెగావాట్ల కోసం ఒప్పందం ఉంది. ఇది రాష్ట్రంలోని 19 లక్షల బోర్లకు ఉపయోగిస్తున్నాము. 2014-15 వరకు డిస్కంలు తెచ్చిన రుణాలు రూ.30 వేల కోట్లు ఉన్నాయి. 2018-19కి ఇవి రూ.62 వేల కోట్లకు పెరిగాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి గత ప్రభుత్వంలో చేసిన అప్పులు పెరిగాయి. 2019 నుంచి ఈ ప్రభుత్వం వచ్చాక డిస్కమ్‌లకు 36 వేల కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారు. బొగ్గు, వినియోగం పెరగడం వల్ల విద్యుత్తు కొరత ఏర్పడింది. నెలాఖరుకి సమస్య పరిష్కారం అవుతుంది' అని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ అన్నారు. చదవండి: (మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై బొత్స కీలక వ్యాఖ్యలు) -
అదుపులోకి విద్యుత్ కొరత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ కొరత క్రమంగా అదుపులోకి వస్తోందని, ఈ నెలాఖరుకల్లా అంతా సర్దుకుంటుందని ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్ అన్నారు. గృహావసరాలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడం తమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టంచేశారు. ఆస్పత్రులకు కరెంట్ కష్టాలు లేకుండా చూడాలని డిస్కమ్‌లకు ఆదేశాలిచ్చామని, పరిస్థితులను అర్ధంచేసుకుని వినియోగదారులు సహకరించాలని కోరారు. బొగ్గు కొరతతో దేశవ్యాప్తంగా విద్యుత్ సమస్య ఏర్పడిందని.. అలాగే, బొగ్గు ధర కూడా విపరీతంగా పెరిగిందన్నారు. ఇక ఈ నెలాఖరుకల్లా కరెంట్ కోతల నుంచి ఉపశమనం కలుగుతుందని శ్రీధర్ ఆశాభావం వ్యక్తంచేశారు. విజయవాడ ఆర్ అండ్ బీ భవనంలో శనివారం ఆయన మీడియాకు రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. విద్యుత్ కొరతకు ఇవే కారణాలు.. దేశవ్యాప్తంగా గతేడాది అక్టోబర్ నుంచి ఏర్పడ్డ బొగ్గు కొరత.. పోస్ట్ కోవిడ్ తర్వాత రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం.. దేశీయంగా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లకు పెరిగిన డిమాండ్ వంటి మూడు ప్రధాన కారణాలవల్ల విద్యుత్ కొరత ఏర్పడింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే బొగ్గు వినియోగం కూడా పెరిగి లభ్యత తగ్గింది. గతంలో రూ.6 వేలకు దొరికిన బొగ్గు ధర ఇప్పుడు రూ.17 వేల నుంచి రూ.40 వేల వరకూ వెళ్లింది. బొగ్గు సరఫరా గురించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానితో మాట్లాడటం, రైల్వే, కోల్, ఎనర్జీ మంత్రిత్వ శాఖలకు లేఖలు రాయడం, ఎంపీలు కూడా వారిని వెళ్లి కలవడంతో బొగ్గు నిల్వలు లేనప్పటికీ మన రాష్ట్రానికి రోజుకి కావాల్సినంత బొగ్గు వస్తోంది. అన్ని రంగాల్లో పెరిగిన వినియోగం 2020 మార్చి–ఏప్రిల్‌లో కోవిడ్ లాక్డౌన్ కారణంగా కేవలం 160 మిలియన్ యూనిట్ల గృహ వినియోగం మాత్రమే ఉండేది. 2021 మార్చి–ఏప్రిల్‌లో 200 నుంచి 210 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. 2022 మార్చి–ఏప్రిల్‌లో కోవిడ్ పరిస్థితి నుంచి బయటపడటం.. అన్ని రంగాల్లోనూ కార్యకలాపాలు పెరగడం.. ఈ ఏడాది మార్చి నుంచే మొదలైన ఎండలవల్ల గృహావసరాల వినియోగం కూడా ఎక్కువగా ఉండడంతో రోజుకి సగటున 235 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతోంది. 20–25 ఎంయూల విద్యుత్ లోటు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినంత వినియోగం ఇప్పుడు ఒక్క మన రాష్ట్రంలో జరుగుతోంది. 2014–15లో రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగం 130 మిలియన్ యూనిట్లు ఉండేది. ఇప్పుడది 190 మిలియన్ యూనిట్లకు చేరింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కలిపి మొత్తం 500 మిలియన్ యూనిట్లు అవసరం. అలాగే, రాష్ట్రంలో సగటున రోజుకి 235 మిలియన్ యూనిట్ల అవసరం ఉండగా, పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న ఏపీ జెన్కో ద్వారా 80 నుంచి 85 ఎంయూ, ఎన్టీపీసీ ద్వారా 45 ఎంయూ, ఐపీపీఎస్ 10 ఎంయూ, సోలార్ 25 ఎంయూ, విండ్ 10 ఎంయూ, ద్వారా అన్నీ కలిపి మొత్తం 175 ఎంయూ వరకూ విద్యుత్ అందుబాటులో ఉంటోంది. ఇంకా 55 మిలియన్ యూనిట్లు లోటు ఉంటోంది. 30 మిలియన్ యూనిట్ల వరకు కొనుగోలు చేస్తున్నాం. మార్చిలో 1,551 మిలియన్ యూనిట్లను యూనిట్‌కి రూ.8.11 చొప్పున రూ.1,058 కోట్లతో విద్యుత్ కొనుగోలు చేశాం. ఇంకా 20–25 ఎంయూ వరకూ లోటు ఉంది. దక్షిణాదిలో కొరత ఎక్కువ పవర్ ఎక్సే్ఛంజ్‌లో విద్యుత్ దొరకని కారణంగా ఇటీవల వ్యవసాయానికి, గృహాలకు కోత విధించాల్సి వచ్చింది. వ్యవసాయానికి పగటిపూట ఏడు గంటల నిరంతర విద్యుత్ ఇవ్వాలని ఆదేశాలిచ్చాం. గృహ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున పరిశ్రమలకు లోడ్ రిలీఫ్ ఇవ్వాలని నిర్ణయించాం. లేదంటే గ్రిడ్‌కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. విద్యుత్ కొరత తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనూ ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు ఇంకా ఎక్కువగా ఉంది. గుజరాత్లో పవర్ హాలిడే ఇచ్చారు. ఇక నిరంతరం నడిచే పరిశ్రమలు 50 శాతం మాత్రమే విద్యుత్ వాడాలనే నిబంధనతోపాటు పరిశ్రమలకు పవర్ హాలిడే వల్ల 10 మిలియన్ యూనిట్ల వరకూ ఆదా అవుతోంది. ఈ మొత్తాన్ని గృహావసరాలకే కేటాయిస్తున్నాం. దీంతో శనివారం కేవలం 4 మిలియన్ యూనిట్లే కోరత ఏర్పడింది. సాగుకు వాడే విద్యుత్ వినియోగం ఈనెల 15 తరువాత తగ్గే అవకాశం ఉంది. అది వస్తే పరిశ్రమలకు యథావిథిగా విద్యుత్ సరఫరా ఉంటుంది. -
AP: విద్యుత్ కోతలు తాత్కాలికమే.. ఇతర రాష్ట్రాలది ఇదే పరిస్థితి
సాక్షి, విజయవాడ: మార్చి నెల నుంచి ఎండలు పెరగడంతోనే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరిగిందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీధర్ అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '2020 మార్చ్ నెలలో 160 మిలియన్ యూనిట్ల కాగా గత ఏడాది 210 మిలియన్ యూనిట్లు ఉంది. ఈ ఏడాది ఇపుడు 240 మిలియన్ యూనిట్లకి చేరుకుంది. ఇంత డిమాండ్ ఉమ్మడి రాష్డ్రంలో ఉండేది. జెన్ కో ద్వారా పూర్తి ఉత్పత్తి జరుగుతోంది. జెన్ కో ద్వారా సగం ఉత్పత్తి మాత్రమే జరుగుతోందని కొన్ని మీడియాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. డిమాండ్‌కి ఉత్పత్తికి దాదాపు 55 మిలియన్ యూనిట్లు తేడా ఉంది. ఏపీలోనే కాదు తెలంగాణా, గుజరాత్ తదితర రాష్ట్రాలు ఇదే సమస్యని ఎదుర్కొంటున్నాయి. మార్చ్ నెలలో రాష్ట్ర అవసరాల కోసం 1551 మిలియన్ యూనిట్లని కొనుగోలు చేశాం. ఇందుకోసం దాదాపు రూ.1250 కోట్లని ఖర్చు చేశాం. బొగ్గు కొరత కారణంగా ఈ సమస్య ఏర్పడింది. విద్యుత్ కొనడానికి సిద్దంగా ఉన్నా దొరకటం లేదు. తప్పని పరిస్ధితులలో పరిశ్రమలకి 15 రోజులపాటు ఆంక్షలు విధించాము. వారంలో ఒకరోజు పరిశ్రమలకి పవర్ హాలిడే ప్రకటించాయి. నెలాఖరునాటికి సాదారణ పరిస్ధితులు వస్తాయని భావిస్తున్నాం. వ్యవసాయ విద్యుత్ వినియోగం నెలాఖరు నుంచి పూర్తిగా తగ్గుతుంది. తెలంగాణా, తమిళనాడు రాష్డ్రాల అధికారులతో మాట్లాడాం అక్కడా ఇదే పరిస్ధితి. చదవండి: (కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై సజ్జల కీలక వ్యాఖ్యలు) 2014-15లో సరాసరిన 130 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే ప్రస్తుతం సరాసరిన రోజుకి 190 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంది. రోజుకి 30 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తున్నాం. తప్పని పరిస్ధితుల్లోనే రోజుకి గ్రామీణ ప్రాంతాలలో గంట.. పట్టణ ప్రాంతాలలో అరగంట మాత్రమే కోతలు ప్రకటించాం. ఆసుపత్రులకి పూర్తిస్ధాయి సరఫరా కొనసాగించాలని ఆదేశించాం. వ్యవసాయానికి నిరంతరాయంగా ఏడు గంటల విద్యుత్ ఇవ్వాలని ఆదేశించాం. పూర్తి సామర్ద్యంతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ విద్యుత్ కోతలు తాత్కాలికం మాత్రమే. ప్రజలు అర్ధం చేసుకుని సహకరించాలని కోరుతున్నాం. నెలాఖరు నుంచి మళ్లీ విద్యుత్ డిమాండ్ తగ్గి సాధారణ పరిస్ధితులకి వస్తుంది అని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. -
AP: విద్యుత్ కోతలు తాత్కాలికమే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ కొరత కారణంగా ఎదురవుతున్న కరెంట్ కోతల నుంచి ఈ నెలాఖరుకల్లా ఉపశమనం కలుగుతుందని ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్ తెలిపారు. బొగ్గు కొరత, రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం, దేశీయంగా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లకు పెరిగిన డిమాండ్‌తో ఏర్పడ్డ ప్రస్తుత పరిస్థితులు తాత్కాలికమేనని, త్వరలోనే విద్యుత్ అందుబాటులోకి వచ్చి, అంతా చక్కబడుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ పరిస్థితిపై ‘సాక్షి ప్రతినిధి’కి శుక్రవారం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. బొగ్గు దొరకడంలేదు గతేడాది అక్టోబర్ నుంచి అంతర్జాతీయంగా చైనా వంటి దేశాలు తీసుకున్న నిర్ణయాలవల్ల దేశంలో బొగ్గు కొరత ఏర్పడింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే బొగ్గు వినియోగం పెరిగి లభ్యత తగ్గిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని వేసి రాష్ట్రాలకు కోటా నిర్ణయించి బొగ్గు కేటాయింపులు ప్రారంభించింది. మార్చిలో మళ్లీ బొగ్గు సంక్షోభం వస్తుందని, నిల్వలు పెట్టుకోమని సూచించింది. కానీ, దొరకడంలేదు. 5 లక్షల మెట్రిక్ టన్నుల కోసం మూడుసార్లు టెండర్లు పిలిచాం. రూ.6 వేలు ఉండే బొగ్గు టన్ను రూ.17 వేల నుంచి రూ.40 వేలు పలుకుతుండటంతో ఆ ధరకు టెండరు ఇవ్వలేకపోతున్నాం. దీంతో కృష్ణపట్నంలో 800 మెగావాట్ల ఉత్పత్తి జరగడంలేదు. మార్చిలో రూ.1,258 కోట్లతో విద్యుత్ కొనుగోలు ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు దాదాపు 60 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ప్రతిరోజూ సింగరేణి కాలరీస్, మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి 10 నుంచి 12 ర్యాకులు వస్తోంది. ఇది ఏ రోజుకారోజు ఉత్పత్తికి సరిపోతోంది. నిల్వ చేసుకోవడం కుదరడంలేదు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండటంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు పోటీ పెరిగింది. కానీ, పవర్ ఎక్సే్ఛంజ్‌లో 14వేల మెగావాట్లు వరకూ అందుబాటులో ఉండే విద్యుత్ ప్రస్తుతం 2 వేల మెగావాట్లు మాత్రమే ఉంది. దీనిని కొనేందుకు దేశంలోని డిస్కంలన్నీ పోటీపడుతున్నాయి. ఇక్కడ యూనిట్ ప్రస్తుతం రూ.12 వరకూ ఉంది. ఆ రేటుకి కొందామన్నా కూడా దొరకడంలేదు. మార్చిలో రూ.1,258 కోట్లతో 1,551 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేశాం. పల్లెల్లో గంట.. పట్టణాల్లో అరగంట.. గ్రిడ్ డిమాండ్ బాగా పెరిగినప్పుడు గృహాలకు గ్రామాల్లో ఒక గంట, పట్టణాల్లో అరగంట అధికారిక లోడ్ రిలీఫ్ అమలుచేయాల్సిందిగా డిస్కంలకు ఆదేశాలిచ్చాం. కోవిడ్ పూర్తిగా అదుపులోకి రావడంతో పరిశ్రమలు పూర్తిస్థాయిలో పనిచేయడం, వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు పెరగడంవల్ల విద్యుత్ వాడకం పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లు ఉంది. 2021తో పోలిస్తే 3.54 శాతం, 2020తో పోల్చితే 46 శాతం ఎక్కువ వినియోగం జరుగుతోంది. ఏపీజెన్కో, ఏన్టీపీసీ నుంచి 120 మిలియన్ యూనిట్లు ధర్మల్ విద్యుత్ అందుబాటులో ఉంది. జల, సౌర, పవన, న్యూక్లియర్ విద్యుత్ మొత్తం కలిపి 180 మిలియన్ యూనిట్ల వరకూ అందుబాటులో ఉండగా మరో 40–50 మిలియన్ యూనిట్లు కొనాల్సి వస్తోంది. పెరిగిన వ్యవసాయ వినియోగం 2019లో దాదాపు 17.3 లక్షల వ్యవసాయ సర్వీసుండగా, 2022కి వాటి సంఖ్య 18.5 లక్షలకు చేరింది. అంతేకాక.. వ్యవసాయానికి 9 గంటలు పగటిపూట విద్యుత్ సరఫరా అందించడంవల్ల రైతులు ఏడాది పొడవునా మూడు, నాలుగు పంటలు వేస్తున్నారు. ఫలితంగా వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరిగింది. ఇలా 2018–19లో 10,832 మిలియన్ యూనిట్లు.. 2021–22లో 12,720 మిలియన్ యూనిట్లు జరిగింది. అంటే దాదాపు 20 శాతం పెరిగింది. అయినప్పటికీ రైతులకు ఇబ్బంది రాకుండా 9 గంటలు విద్యుత్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తోంది. నెలాఖరుకు కొరత తీరుతుంది పరిశ్రమలు 50 శాతం విద్యుత్‌ను మాత్రమే వినియోగించాలని, వారాంతపు సెలవుకు అదనంగా మరోరోజు పవర్ హాలిడే విధించాలని ఆంక్షలు పెట్టాం. దీనివల్ల 15 నుంచి 20 మిలియన్ యూనిట్లు విద్యుత్ మిగులుతుంది. నెలాఖరుకల్లా పంట కోతలు పూర్తికానుండటంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గుతుంది. దానివల్ల కనీసం 15 మిలియన్ యూనిట్లు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నాం. పవన విద్యుత్ మే, జూన్ నెలల్లో మరికొంత అందుబాటులోకి వస్తుంది. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం రూ.12 ఉన్న యూనిట్ ధర కూడా రూ.4లకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఈ నెలాఖరుకి విద్యుత్ కొరత సమస్య తీరుతుంది. ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌కు ఈ ఆదా తోడయితే విద్యుత్ కోతలు ఉండవని భావిస్తున్నాం. మొదలైన ‘పవర్ హాలిడే’ వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు పరిశ్రమలకు ఇంధన శాఖ ఈ నెల 22 వరకు ప్రకటించిన ‘పవర్ హాలిడే’ శుక్రవారం నుంచి రాష్ట్రంలో మొదలైంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ (డిస్కం)లు తమ పరిధిలోని జిల్లాల వారీగా దీనిని అమలుచేస్తున్నాయి. పవర్ హాలిడే లేని రోజుల్లో పరిశ్రమలు ప్రతిరోజూ 50 శాతం విద్యుత్‌ను మాత్రమే వినియోగించాలని.. షాపింగ్ మాల్స్ తరహాలోని వాణిజ్య సముదాయాల్లో కూడా 50 శాతం మేరకు తగ్గించుకోవాలని.. ప్రకటనలకు సంబంధించిన సైన్ బోర్డులకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని, అలాగే ఏసీల వాడకాన్ని కూడా తగ్గించుకోవాలని డిస్కంల సీఎండీలు ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలపై వినియోగదారులు కాల్ సెంటర్ నంబరు 1912కు ఫోన్‌చేసి విద్యుత్ సమస్యలను పరిష్కరించుకోవచ్చని వారు సూచించారు. చదవండి: వాళ్ల కడుపు మంటకు మందే లేదు: సీఎం జగన్ -
చార్జీల పెంపు స్వల్పమే
సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాలతో పోల్చితే వంద యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు కరెంట్ చార్జీలు ఆంధ్రప్రదేశ్‌లోనే అతి తక్కువని ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ వెల్లడించారు. కామన్ టెలిస్కోపిక్ విధానం ప్రకారం సామాన్యులపై భారం లేకుండా విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కొత్త టారిఫ్ ప్రకటించిందని చెప్పారు. విద్యుత్ చార్జీలను భారీగా పెంచినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. కొత్త టారిఫ్ ప్రకారం చార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. గురువారం విజయవాడలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృథ్వీతేజ్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్ధనరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలివీ.. ► విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.35 వేల కోట్లు ఇచ్చి ఆదుకుంది. ఇకపైనా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వంద యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు చార్జీలు ఏపీలోనే తక్కువ. 75 యూనిట్ల వరకు వినియోగానికి టారిఫ్ ఇప్పటికీ సగటు సరఫరా వ్యయంలో 50 శాతం కంటే తక్కువగా ఉంది. దీని పరిధిలోకి వచ్చే వారు మొత్తం గృహ వినియోగదారుల్లో 50 శాతం వరకు ఉంటారు. ► టెలిస్కోపిక్ విధానంలో 0–30 యూనిట్లకు విద్యుత్ చార్జీల పెంపు చాలా స్వల్పం. ప్రజల వినతి మేరకే ఏపీఈఆర్సీ ఈ శ్లాబ్‌లను తెచ్చింది. ► తెలంగాణలో తాజాగా రూ.5,600 కోట్ల మేర విద్యుత్ చార్జీలను పెంచగా ఆంధ్రప్రదేశ్‌లో పెంపుదల రూ.1,400 కోట్లు మాత్రమే ఉంది. ► ట్రూ అప్ చార్జీలను మూడో త్రైమాసికంలో ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.3,368 కోట్లు, ఏపీఈపీడీసీఎల్‌లో రూ.609 కోట్లుగా మండలి నిర్ణయించింది. రూ.3,977 కోట్ల సర్దుబాటు మొత్తంలో వ్యవసాయ విద్యుత్ వినియోగదారుల రాయితీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,066.54 కోట్ల భారాన్ని భరిస్తుండగా మిగతాది మాత్రమే ఇతర వినియోగదారుల నుంచి పంపిణీ సంస్థలు వసూలు చేయాలని మండలి ఆదేశించింది. అది కూడా వినియోగదారుల వాస్తవ వినియోగం ఆధారంగా యూనిట్‌కు ఏపీఎస్పీడీసీఎల్ రూ.0.23, ఏపీసీపీడీసీఎల్ రూ.0.22, ఏపీఈపీడీసీఎల్ రూ.0.07 చొప్పున మాత్రమే విధించాలని నిర్దేశించింది. ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్‌లో ఆగస్టు 1వ తేదీ నుంచి 36 నెలలు, ఏపీఈపీడీసీఎల్ 18 నెలల వాయిదాలలో వసూలు చేయాలని ఆదేశించింది. దీని ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ట్రూఅప్ వసూలు రూ.700 కోట్లు మాత్రమే. గత సర్కారు ట్రూ అప్ ఫైల్ చేయకపోవడం పెనుభారంగా పరిణమించింది. ► 2022–23లో మొత్తం ఆదాయ అవసరం రూ.45,398.66 కోట్లుగా డిస్కమ్‌లు అంచనా వేశాయి. ఇందులో రూ.11,123.21 కోట్లను ఉచిత విద్యుత్, సబ్సిడీల కింద రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుండటంతో 20.76 లక్షల మంది వినియోగదారులపై చార్జీల పెంపు ప్రభావం ఏమాత్రం ఉండదు. మూడు పంపిణీ సంస్థల సగటు విద్యుత్ కొనుగోలు ఖర్చు యూనిట్‌కు రూ.6.82 నుంచి రూ.6.98కు పెరిగింది. ► రాష్ట్రంలో 74 శాతం విద్యుత్ థర్మల్ ద్వారా ఉత్పత్తి అవుతుండగా ప్రస్తుతం 230 మిలియన్ యూనిట్ల వినియోగం జరుగుతోంది. మనకు బొగ్గు గనులు లేకపోవడంతో మహానది (ఒడిశా), సింగరేణి కాలరీస్(తెలంగాణ)పై ఆధారపడి కొనుగోలు చేస్తున్నాం. బొగ్గు రేట్లు, రవాణా చార్జీల పెరుగుదల కారణంగా ఏటా 14 శాతం ఉత్పత్తి వ్యయం అధికం అవుతోంది. నిజానికి దీని కారణంగానే విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చింది. గుదిబండల్లా పీపీఏలు గత సర్కారు హయాంలో కుదుర్చుకున్న దీర్ఘకాలిక పీపీఏల వల్ల విద్యుత్ సంస్థలపై అదనపు భారం పడుతోందని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ పేర్కొన్నారు. గత ప్రభుత్వం సగటు విద్యుత్ కొనుగోలు రేటు కంటే అధిక ధరలకు 25 ఏళ్లకు పీపీఏలు కుదుర్చుకుందని పీపీఏల రద్దు వల్ల చార్జీలు పెరిగాయనే వాదనలో వాస్తవం లేదన్నారు. ఆ పీపీఏలను రద్దు చేయలేదని, ధరలను సమీక్షించాలని ప్రభుత్వం ఆయా కంపెనీలకు సూచించిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి విద్యుత్ రంగంలో రూ.68 వేల కోట్లకుపైగా అప్పులు, రూ.21 వేల కోట్లకుపైగా బిల్లుల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. 2014 నాటికి విద్యుత్తు సంస్థలు రూ.29,703 కోట్ల మేర అప్పుల్లో ఉండగా టీడీపీ హయాంలో 2019 నాటికి రూ.68,596 కోట్లకు పెరగడంతో నష్టాలతో దివాలా తీసే పరిస్థితి నెలకొందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యుత్ రంగ సంస్కరణలతోపాటు పొదుపు చర్యలను సమర్థంగా అమలు చేయడం, ఆర్థికంగా చేయూత ద్వారా డిస్కమ్‌లను ఆదుకున్నట్లు చెప్పారు. గత సర్కారు ట్రూ అప్ చార్జీలను ఫైల్ చేయకుండా వ్యవస్థలను అడ్డదిడ్డంగా మేనేజ్ చేయడం వల్లే అప్పులు ఆ స్థాయికి పెరిగాయని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం నిర్వాకాల కారణంగా విద్యుత్తు రంగం కుప్పకూలే పరిస్థితి నెలకొనడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రైతులకు అందించే వ్యవసాయ ఉచిత విద్యుత్ కోసం సెకీ నుంచి తక్కువ ధరకే కరెంట్ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. -
డిస్కంలకు చేయూత
సాక్షి, అమరావతి: ఇంధన శాఖలో కేంద్రం ప్రవేశపెట్టిన ‘పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం’ సాయంతో విద్యుత్ పంపిణీ వ్యవస్థలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్యుత్ పంపిణీ సంస్థలకు చేయూతనందించి వాటిని బలోపేతం చేయడం ద్వారా వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం కాగా దానికయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 3:2 నిష్పత్తిలో భరిస్తాయి. నష్టాలను తగ్గించి.. పథకంలో భాగంగా డిస్కంలు 2024–2025 నాటికి అగ్రిగేట్ ట్రాన్స్మిషన్, కమర్షియల్(ఏటీసీ) నష్టాలను 12–15 శాతానికి తగ్గించాలి. విద్యుత్ సరఫరా సగటు వ్యయం (ఏసీఎస్) అగ్రిగేట్ రెవిన్యూ రిపోర్ట్ (ఏఆర్ఆర్) మధ్య అంతరాన్ని కూడా తగ్గించాల్సి ఉంటుంది. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడం, ట్రాన్స్మిషన్, పంపిణీ నష్టాలను తగ్గించడం, నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం, సౌర విద్యుత్ సరఫరాకు అనువుగా వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను వేరు చేయడం వంటి కార్యక్రమాలను డిస్కంలు చేపట్టాలి. వినియోగదారులకు ప్రయోజనం పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, ఫీడర్లు వేరు చేయడం వల్ల వ్యవసాయానికి ఉచిత విద్యుత్ నేరుగా అందడంతో పాటు మిగతా వినియోగదారులకు విద్యుత్ అంతరాయాల్లో సమస్యలు తలెత్తవు. నష్టాలు తగ్గడం వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలు వినియోగదారులపై వేసే చార్జీల భారం కూడా తగ్గుతుంది. వార్షిక ఆదాయ, వ్యయ నినేదికలు సకాలంలో సమర్పించడం, టారిఫ్ పిటిషన్‌ను సకాలంలో దాఖలు చేయడం, టారిఫ్ ఆర్డర్ల జారీ, యూనిట్ వారీగా సబ్సిడీ అకౌంటింగ్, ఇంధన ఖాతాల ప్రచురణ, కొత్త వినూత్న సాంకేతికతలను అనుసరించడం వంటి చర్యలతో డిస్కం లలో జవాబుదారీతనం పెరుగుతుంది. ఇప్పటికే మొదలు విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసి రైతులకు, ఇతర వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (సెకీ) నుంచి వ్యవసాయానికి 9 గంటలు ఉచిత సౌర విద్యుత్‌ను 25 ఏళ్లపాటు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కేబినెట్ కూడా ఆమోదం తెలిపాయి. వ్యవసాయ ఫీడర్లను వేరుచేసే ప్రక్రియ కూడా మొదలైంది. విశాఖపట్నంలో గృహ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి, ఫలితాలను అక్కడి డిస్కం పర్యవేక్షణలో అధ్యయనం చేయిస్తోంది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా విద్యుత్ కొనుగోళ్లలో ఆదా చేస్తోంది. ఆ మొత్తాన్నీ ట్రూ డౌన్ కింద తిరిగి వినియోగదారులకే తిరిగి ఇస్తోంది. -
ఉచిత విద్యుత్‌కు పూర్తి భరోసా
సాక్షి, అమరావతి: వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరగనున్న దృష్ట్యా వ్యవసాయానికి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేలా చర్యలు తీసుకోవాలని డిస్కమ్‌లను ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాపై విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.7,714 కోట్ల సబ్సిడీని అందిస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు 6,663 ఫీడర్ల ద్వారా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు కృషి చేస్తూనే వ్యవసాయానికి 9 గంటలు పగటిపూట కరెంట్ సరఫరాకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కాగా, వ్యవసాయం, అనుబంధ రంగాలకు 2021–22లో 19,096 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా 2022–23లో 19,819 ఎంయూలకు చేరుకునే వీలుందని అంచనా వేస్తున్నట్లు విద్యుత్‌శాఖ అధికారులు మంత్రికి తెలిపారు. ఈ ఏడాది 3.7% మేర విద్యుత్ వినియోగం పెరగనుందని చెప్పారు. వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ డిమాండ్‌ను తీర్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు దక్షిణ, మధ్య, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు హరనాథరావు, పద్మ జనార్దనరెడ్డి, సంతోషరావు చెప్పారు. విద్యుత్ లోడ్, కచ్చితమైన వినియోగాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఏడాదిలోగా మీటర్లు అమర్చేలా కృషి చేస్తున్నట్లు సీఎండీలు పేర్కొన్నారు. విద్యుత్ మోటార్లు కాలిపోవడం, లోవోల్టేజీ లాంటి సమస్యలను అరికట్టి రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఉపకరిస్తుందన్నారు. -
విద్యుత్ ధరలపై ఆచితూచి అడుగులు
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు ధరలపై పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కొనుగోలు వ్యయం పెరుగుతున్నప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఇంధన శాఖ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ఎక్కడ ధర తక్కువ ఉంటే అక్కడి నుంచే కొనుగోలు చేస్తున్నాయి. తద్వారా విద్యుత్ కొనుగోలు వ్యయం పెరగకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం (2020–21)లో విద్యుత్ కొనుగోలు జరిగిన ఖర్చునే ఈ ఆర్థిక సంవత్సరం (2021–22)లో కూడా వర్తింపజేయాలని కోరుతున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ)కి పంపిణీ సంస్థలు (ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్) ప్రతిపాదనలు సమర్పించాయి. హెచ్చుతగ్గులతో ప్రమేయం లేకుండా.. పంపిణీ సంస్థలు దీర్ఘకాలిక, స్పల్పకాలిక కొనుగోలు ఒప్పందాల ద్వారా ఉత్పత్తి సంస్థల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంటాయి. ఇలా కొనే విద్యుత్ ధరలు ఒక్కో సంస్థకు ఒక్కో విధంగా ఉంటాయి. పలు ఉత్పత్తి సంస్థలు యూనిట్ ధరను రూ.5.54 వరకూ నిర్ణయించి అమ్ముతున్నాయి. హైడల్ విద్యుత్ యూనిట్ రూ.1.58 పైసలకే లభిస్తుంది. కానీ.. దీని లభ్యత చాలా తక్కువ. ఈ పరిస్థితుల్లో డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను ఎక్కువ ధర చెల్లించైనా సమకూర్చుకుని వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత డిస్కంలపై ఉంది. ఈ నేపథ్యంలో హెచ్చుతగ్గులతో ప్రమేయం లేకుండా ఎక్కడ విద్యుత్ దొరికితే అక్కడ కొనుగోలు చేస్తున్నాయి. 23న ఏపీ ఈఆర్సీ విచారణ ఇలా కొన్న విద్యుత్ సగటు వ్యయం ఈపీడీసీఎల్ యూనిట్ రూ.4.51గా, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ యూనిట్ రూ.4.53గా నిర్ధారించాయి. తాము కొంటున్న విద్యుత్ ధరలను సంస్థల వారీగా కూడా డిస్కంలు ఏపీ ఈఆర్సీకి నివేదించాయి. ఈ మొత్తం కొనుగోలు ఖర్చులకు 2021–22 ఏడాది కూడా అనుమతించాల్సిందిగా మండలిని కోరాయి. డిస్కంలు సమర్పించిన లెక్కలు, ప్రతిపాదనలపై మార్చి 23న ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో ఏపీ ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఈ లోగా ఎవరైనా తమ అభ్యంతరాలను, సూచనలను ఏపీ ఈఆర్సీ ఈ మెయిల్ commn& secy@aperc.inకు పంపవచ్చు. వాటిని కూడా పరిగణలోకి తీసుకుని మండలి విచారణ చేపడుతుంది. -
ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై పరువు నష్టం కేసు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై దురుద్దేశపూర్వకంగా అసత్య కథనాలు ప్రచురిస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రికలపై పరువు నష్టం కేసు వేస్తున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ శాఖ కార్యదర్శిగా పలుమార్లు విలేకరుల సమావేశాలు, పత్రికా ప్రకటనల ద్వారా రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని తెలియజేస్తున్నప్పటికీ, ప్రజల్లో గందరగోళం సృష్టించడంతోపాటు ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేలా వార్తలు ప్రచురిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ 24 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు. రైతులందరికీ 9 గంటలపాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. అయినా, కల్పిత వార్తలు ప్రచురించడం పట్ల విస్మయం వ్యక్తంచేశారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని శ్రీకాంత్ హెచ్చరించారు. (చదవండి: అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది) -
‘అపోహలు సృష్టిస్తున్నారు.. వారిపై పరువు నష్టం కేసు వేస్తాం’
అమరావతి: విద్యుత్ సరఫరాపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం కేసు వేస్తామని ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఏపీలో విద్యుత్ కోతలు లేవని చెప్పినా, ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని, ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసే విధంగా వార్తలు ప్రచురిస్తున్నారన్నారు. అలాంటి వారిపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఏపీలో 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని, రైతులకు 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నా కల్పిత వార్తలు రాస్తున్నారని, తప్పుడు వార్తలు ప్రచురించే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పుష్కలంగా విద్యుత్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ పుష్కలంగా అందుబాటులో ఉందని, మూడు రోజులుగా ఎటువంటి విద్యుత్ కోతలు లేవని ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ స్పష్టం చేశారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. శనివారం ఆయన ఏపీ జెన్కో ఎండీ బి.శ్రీధర్‌తో కలిసి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ను రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ సర్వీసులకు 6,663 ఫీడర్ల ద్వారా అందిస్తున్నామని చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల ఎక్కడైనా కొద్ది సేపు అంతరాయం ఏర్పడితే ఆ సమయాన్ని అదే రోజు సర్ధుబాటు చేసి విద్యుత్ సరఫరా చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.9,717 కోట్లు సబ్సిడీ రూపంలో విడుదల చేసిందన్నారు. ఏడాదిలోగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తామని, తొలుత శ్రీకాకుళంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. కోతలు లేకుండా చూస్తున్నాం ► పరిశ్రమలకు, గృహ, వాణిజ్య అవసరాలకు ఎటువంటి అవాంతరాలు లేకుండా చవక ధరలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. 2020లో 4,36,837 అంతరాయాలుంటే 2021లో వాటిని 2,02,496కు తగ్గించాం. ► రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం 204 మిలియన్ యూనిట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయంలో 198 యూనిట్లు ఉండింది. ప్రస్తుత డిమాండ్‌లో 170 మిలియన్ యూనిట్ల వరకు ఏపీజెన్కో, కేంద్ర విద్యుత్ సంస్థలైన ఎన్టీపీసీ, నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్, న్యుక్లియర్ పవర్ ప్లాంట్స్, ప్రైవేటు పవర్ ప్లాంట్లతో ఉన్న దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా వస్తోంది. ► మిగతా 34 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను బహిరంగ మార్కెట్ నుంచి రోజు, వారం, నెల వారీ బిడ్డింగ్‌ల ద్వారా తీసుకుంటున్నాం. ఈ మూడు మాసాల్లో మాత్రమే అదనపు డిమాండ్ ఉంటుంది. దీనికోసం దీర్ఘకాలిక ఒప్పందాలు అవసరం లేదు. ► 700 నుండి 2000 మెగావాట్ల వరకు ప్రతి పావుగంటకు మార్కెట్లో ఆక్షన్ ద్వారా అన్ని రాష్ట్రాలతో పాటు మనం కూడా పాల్గొని నిర్ధారణ అయిన రేట్ల ప్రకారం కొనుగోలు చేస్తున్నాం. విద్యుత్ వినియోగించే సమయాలను బట్టి రేట్లలో మార్పులు ఉంటాయి. అన్ని జాగ్రత్తలు తీసుకుని రైతుల పంపు సెట్లకు, గృహ, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. ► విద్యుత్ కొనుగోలు చెల్లింపులకు సంబంధించి గత ఏడాది నుంచి కేంద్రం నిబంధనలను కఠిన తరం చేసినందున అడ్వాన్సుగా చెల్సించాల్సి వస్తోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండేళ్ల నుండి పెద్ద ఎత్తున నిధులను విద్యుత్ అవసరాలకు కేటాయిస్తోంది. ఎన్టీపీసీ విషయంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ సమస్య ఉత్పన్నమైతే రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ ఆ సమస్యను పరిష్కరించాయి. ► ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈఓ ఎ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. బొగ్గు సమస్య లేదు ఏపీ జెన్కోకు సంబంధించి విజయవాడ, కృష్ణపట్నం, రాయసీమలో మూడు థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 5,010 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇందులోని మొత్తం 15 యూనిట్లు ఫంక్షనింగ్‌లో ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 80 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇందుకోసం రోజుకు 60 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు వినియోగించాల్సి ఉంటుంది. బొగ్గు సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. – బి.శ్రీధర్, ఏపీ జెన్కో ఎండీ -
ఏపీలో విద్యుత్ కోతల ప్రచారం అబద్దం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ అంతరాయంపై వస్తున్న కథనాలను ఏపీ విద్యుత్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నాగులపల్లి శ్రీకాంత్ ఖండించారు. విద్యుత్ అంతరాయంపై వస్తున్న కథనాలన్నీ అవాస్తవమని పేర్కొన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 24 గంటలు విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగానే విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ కనెక్షన్లకు పూర్తిగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రోజుకి 204 మిలియన్ యూనిట్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. 30 మిలియన్ యూనిట్లను రోజు తాత్కాలిక అవసరాల కోసం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. డిమాండ్‌కు తగ్గట్టుగా దీర్ఘకాలిక విద్యుత్‌ను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. జెన్కో, కృష్ణపట్నం, సెంట్రల్ జెనరేటింగ్, విండ్, సోలార్, జలవిద్యుత్ ఉత్పత్తిని వినియోగిస్తున్నామని వెల్లడించారు. 7 వందల నుండి 2 వేల మెగావాట్ల వరకు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఎన్టీపీసీతో ఉన్న సమస్య పరుష్కరించామని తెలిపారు. -
జెన్కోకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీజెన్కో)ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల ఉద్యోగులకు ఈ నెల జీతాల చెల్లింపు ఆలస్యం అయినప్పటికీ మంగళవారం అందరికీ చెల్లించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చెల్లింపుల వివరాలను ఆయన ‘సాక్షి’కి వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పుడిలా.. 2019–20 ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వ విభాగాల విద్యుత్ బిల్లులు, వివిధ వర్గాలకు ఇవ్వాల్సిన సబ్సిడీ కలిపి మొత్తం రూ.12,388.93 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.16,849.27 కోట్లు అందాయి. 2020–21లో రూ.15,299.67 కోట్లు రావాల్సి ఉండగా రూ.12,989.81 కోట్లు ఇచ్చింది. 2021–22లో జనవరి నాటికి రూ.12,632.78 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.11,947.76 కోట్లు జమచేసింది. అప్పుడలా.. గత ప్రభుత్వ హయాంలో 2014–15లో రూ.4,099.60 కోట్లు కట్టాల్సి వస్తే రూ.3,953.52 కోట్లు, 2015–16లో రూ.5,302.54 కోట్లకు రూ.4589.96 కోట్లు ఇచ్చారు. 2016–17 నుంచి చెల్లింపులు తగ్గిస్తూ వచ్చారు. ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.6,176 కోట్లకుగాను రూ.4,022.57 కోట్లు, 2017–18లో రూ.6,578.81 కోట్లకుగాను రూ.4,141.96 కోట్లు, 2018–19లో రూ.9,641 కోట్లకుగాను రూ.3,458.85 కోట్లు ఇచ్చారు. దీంతో పాత బకాయిలే చాలావరకు మిగిలిపోయాయి. వాటిని కూడా ప్రస్తుత ప్రభుత్వం చెల్లిస్తోంది. జెన్కో నుంచి రోజుకు 57 మిలియన్ యూనిట్లు ఏపీ జెన్కో నుంచి రాష్ట్రానికి 2014–15లో 16,285.4 మిలియన్ యూనిట్లు (ఎంయూ), 2015–16లో 22,044.4 ఎంయూల విద్యుత్ వినియోగించారు. 2016–17లో 24,728.8 ఎంయూ, 2017–18లో 20,562 ఎంయూ, 2018–19లో 22,362.2 ఎంయూ, 2019–20లో 22,470 మిలియన్ యూనిట్లు, 2020–21లో 16,430 ఎంయూ, 2021–22 జనవరి నాటికి 17,539.4 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను జెన్కో నుంచి తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో రోజుకి సగటున 57.3 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఏపీజెన్కో అందిస్తోంది. -
ఆ ‘వెలుగు’ దేశానికే ఆదర్శం
సాక్షి, అమరావతి: రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంతో పాటు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. అంతర్జాతీయంగా కర్బన ఉద్గారాలపై జరుగుతున్న యుద్ధంలో తొలి అడుగు వేసిన ఏపీ సంస్కరణలు.. దేశంలోని మిగతా రాష్ట్రాల్లోనూ అమలయ్యే దిశగా సాగుతున్నాయి. తాజాగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ఇంధన శాఖ కార్యదర్శులతో జరిపిన సమావేశంలో ఏపీ తర హా చర్యలను అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలని సూచించింది. దేశంలో పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా మారుతున్న వాతావరణ పరిస్థితులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుండటంతో దానిపై కేంద్రం దృష్టి సారించింది. విద్యుదుత్పత్తి రంగంలో మార్పులకు శ్రీకారం చుడుతూ.. బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తిని తగ్గించి, సౌర, పవన విద్యుదుత్పత్తిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీని కోసం లక్ష్యాలనూ నిర్దేశించుకుంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని భావిస్తోంది. 2070 నాటికి దేశంలో కాలుష్యం అనేది జీరో స్థాయికి తీసుకురావాలన్నది అంతిమ లక్ష్యం. ఈ మేరకు రాష్ట్రాల మద్దతును కోరుతోంది. అయితే కొన్ని రాష్ట్రాలే ఈ ప్రయత్నం లో ఉత్సాహంగా భాగమవుతున్నాయి. వాటిలో మన రాష్ట్రం ముందుందని కేంద్రం ప్రశంసించింది. పర్యావరణ పరిరక్షణలో ఏపీ ముందడుగు.. రాష్ట్రం ప్రభుత్వం వ్యవసాయానికి సౌర విద్యుత్‌ను వినియోగించాలని నిర్ణయించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్(సెకీ) నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను తీసుకుని వ్యవసాయానికి ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. సెకీతో ఒప్పందానికి కేబినె7ట్ ఆమోదం కూడా తెలిపింది. అంతేకాకుండా రైతులకు అందించే ఉచిత విద్యుత్ కోసం ప్రత్యేక విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పుడు ఇదే ప్రక్రియను మిగిలిన రాష్ట్రాలూ అనుసరించాలని కేంద్రం చెబుతోంది. 2024 నాటికి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యవసాయ అవసరాలకు పునరుత్పాదక విద్యుత్‌నే వినియోగించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచించింది. దీని కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలంది. మరోవైపు గృహ నిర్మాణంలోనూ ఇంధన పొదుపు చర్యలను చేపట్టాలని కూడా కేంద్రం చెప్పింది. దీనినీ ఏపీ ఇప్పటికే అమలు చేస్తోంది. జగనన్న కాలనీల్లో ఇంధన సామర్థ్యం గల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ తరహా ఇళ్ల నిర్మాణం ద్వారా విద్యుత్‌ను పొదుపు చేయడంతో పాటు పేదల జీవన ప్రమాణాలను మెరుగుపర్చవచ్చు. -
ప్రభుత్వ సహకారంతో నష్టాలను అధిగమిస్తున్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 2021–22లో విద్యుత్ పంపిణీ సంస్థలకు వివిధ రకాల సబ్సిడీల కింద రూ.9,717 కోట్లు విడుదల చేసిందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ తెలిపారు. ఏపీ సీపీడీసీఎల్ అమలు చేస్తున్న వివిధ నూతన ప్రాజెక్టులు, ప్రగతిపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యుత్ సంస్థల బలోపేతానికి సీఎం వైఎస్ జగన్, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు. అలాగే నష్టాలను తగ్గించడంలో డిస్కంలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయని అభినందించారు. వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే అత్యుత్తమ డిస్కంలలో ఒకటిగా నిలిచే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. పవర్ ఫర్ ఆల్ పథకం కింద రూ.517 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. స్కాడా కింద విజయవాడ, గుంటూరులలో సబ్స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో 16 ఇండోర్ సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. విజయవాడలో కంటైనర్ సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని తెలిపారు. అగ్రికల్చర్ డీబీటీ పథకం కింద స్మార్ట్ ఎనర్జీ మీటర్ల ఏర్పాటుకు టెండర్లు పూర్తయ్యాయన్నారు. 5వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలకు 3 ఫేజ్ విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. -
విద్యుత్ ఉద్యోగులకు ‘పీఆర్సీ’ ఏర్పాటు
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల ఉద్యోగుల కోసం వేతన సవరణ సంఘాన్ని(పీఆర్సీ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ మన్మోహన్‌సింగ్‌కు ఈ బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర విద్యుత్ బోర్డు(ఏపీఎస్ఈబీ) కింద నియమితులై ఆంధ్రప్రదేశ్ దక్షిణ, మధ్య, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌కోలలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, ఇతర ప్రయోజనాలను సవరించేందుకు గానూ అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 2 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
విద్యుత్ కొనుగోళ్లలో రూ.4,925 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్ర విద్యుత్ సంస్థలు 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.4,925 కోట్లను ఆదా చేశాయని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ తెలిపారు. విద్యుత్ సౌధలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు ఏపీఈఆర్సీ రూ.31,346 కోట్ల వ్యయానికి అనుమతి ఇవ్వగా మన డిస్కంలు రూ.26,421 కోట్లను మాత్రమే ఖర్చు చేశాయని చెప్పారు. ఆదా అయిన రూ.4,925 కోట్లలో రూ.3,373 కోట్లను వినియోగదారులకు బదిలీ చేసేందుకు వీలుగా ట్రూ డౌన్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయడం వల్ల్ల దాదాపు 18.50 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. ఉచిత విద్యుత్ పథకానికి ప్రభుత్వం రూ.7,714.21 కోట్ల సబ్సిడీ అందించడంతోపాటు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను 2024 నుంచి దశలవారీగా కొనుగోలు చేయాలని భావిస్తోందని చెప్పారు. దేశంలోనే తొలి సాంకేతికత విద్యుత్ డిమాండ్‌ను ఒకరోజు ముందుగానే అంచనా వేసేందుకు ‘డే ఎ హెడ్ ఎలక్ట్రిసిటీ ఫోర్ కాస్టింగ్ మోడల్’ను మన విద్యుత్ సంస్థలు రూపొందించాయని శ్రీకాంత్ తెలిపారు. ఆర్టి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో పనిచేసే ఈ వ్యవస్థ దేశంలోనే మొదటిదని, దీనివల్ల విద్యుత్ సరఫరా, గ్రిడ్ నిర్వహణ వంటి అంశాల్లో కచ్చితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ పంపిణీ నష్టాలు గత ఏడాది 7.50 శాతం ఉండగా, 2021–22లో ఇప్పటివరకు 5 శాతానికి తగ్గాయని చెప్పారు. సాంకేతిక, వాణిజ్య (ఏటీ అండ్ సీ) నష్టాలు 2020–21లో 16.36 శాతం ఉండగా.. 2021–22 నవంబర్ నాటికి 11 శాతానికి తగ్గించగలిగామన్నారు. కాగా, విద్యుత్ సౌధలో బుధవారం 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లు ఐ.పృధ్వీతేజ్, బి.మల్లారెడ్డి, ట్రాన్స్‌కో, జెన్కో డైరెక్టర్లు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
యుద్ధ ప్రాతిపదికన డిజిటల్ లైబ్రరీలు పూర్తి చేయాలి: సీఎం జగన్
-
యుద్ధ ప్రాతిపదికన డిజిటల్ లైబ్రరీలు
సాక్షి, అమరావతి: యుద్ధ ప్రాతిపదికన వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది జూన్ నాటికి తొలి దశ డిజిటల్ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణ పనుల పురోగతిపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతి డిజిటల్ లైబ్రరీలో డెస్క్‌టాప్, యూపీఎస్, ఇంటర్నెట్ కనెక్షన్‌తో పాటు డెస్క్‌టాప్ టేబుల్స్, సిస్టం చెయిర్స్, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, ఐరన్ ర్యాక్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. డిజిటల్ లైబ్రరీల పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అధికారులు వివరించారు. ఫేజ్–1 లో మిగిలిపోయిన డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలను ఫేజ్ 2లో కవర్ అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేసినట్లవుతుందని, ఇంకా మొదలు కాని చోట్ల పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పారు. కంప్యూటర్లు, ఇంటర్నెట్ కనెక్షన్, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సంబంధించిన పనులపై మరింత ధ్యాస పెట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంతోనే వర్క్ ఫ్రం హోం సులువవుతుందని పేర్కొన్నారు. ఫేజ్ –1లో 4,530 గ్రామాల్లో ఏర్పాటవుతున్న డిజిటల్ లైబ్రరీలకు అవసరమైన నెట్ కనెక్టివిటీ ఫిబ్రవరి 2022 నాటికి పూర్తవుతుందని అధికారులు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: కొత్త పీఆర్సీతో ఎవరి జీతాలు తగ్గవు: సీఎస్ సమీర్ శర్మ -
పర్యావరణహిత టీటీడీ
సాక్షి, అమరావతి: దేశంలోని పర్యాటక, యాత్రా స్థలాలను పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) సంకల్పించింది. ఇందులో భాగంగా ‘నెట్ జీరో ఎనర్జీ టూరిజం డెస్టినేషన్’ ప్రాజెక్టుకు మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, జమ్మూ కశ్మీర్‌లలోని పర్యాటక ప్రాంతాలతో పాటు ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ను ఎంపిక చేసింది. ఇంధన సామర్థ్యానికి తీసుకోవాల్సిన చర్యలపై నెడ్‌క్యాప్‌తో కలిసి బీఈఈ అధ్యయనం చేయనుంది. ఆ తర్వాత ఇంధన సామర్థ్యం కలిగిన వాటర్ పంపింగ్ సిస్టమ్, ఫ్యాన్లు, లైట్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను బీఈఈ సౌజన్యంతో ఇంధన పరిరక్షణ మిషన్ ఆధ్వర్యంలో టీటీడీ అధికారులు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ప్రభుత్వ సహకారంతో తిరుమలను కాలుష్య రహితంగా, పర్యావరణ హిత, ఇంధన సామర్థ్య పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది. తిరుపతిలోని కళాశాలలు, పాఠశాలలు, తిరుమలలోని టీటీడీ భవనాల్లో 2.2 మెగావాట్ల రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్, పవన విద్యుత్ ప్రాజెక్టులు, బయోగ్యాస్ ప్లాంట్లు, విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి నెడ్ క్యాప్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరింత మెరుగ్గా ముందుకు.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీలో సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈవో జవహర్‌రెడ్డి చెప్పారు. టీటీడీ, ఇంధన శాఖ అధికారులతో వర్చువల్ విధానంలో ఆయన సమీక్ష జరిపారు. ఈ వివరాలను ఏపీ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. టీటీడీ భవనాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, పునరుత్పాదక ఇంధన కార్యక్రమల ద్వారా కొంత మేర విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడం లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆధునిక, ఇంధన సామర్థ్య, పునరుత్పాదక కార్యక్రమాలు చేపట్టడంలో ఏపీ దేశంలోనే అగ్రగామిగా నిలవాలని ప్రభుత్వం భావిస్తోందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. 2070 నాటికి కాలుష్య రహిత దేశంగా తీర్చిదిద్దాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ప్రముఖ యాత్రా స్థలాల్లో నెట్ జీరో ఎనర్జీ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే తమకు పంపిన సందేశంలో పేర్కొన్నట్లు నెడ్ క్యాప్ ఎండీ ఎస్.రమణారెడ్డి వెల్లడించారు. -
15వేల మి.యూ. విద్యుత్ ఆదా లక్ష్యం
సాక్షి, అమరావతి: భవిష్యత్‌లో 15 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్రంలో ఆదా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఇంధన శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లు, విద్యుత్ శాఖ సమన్వయంతో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. స్టార్ రేటెడ్ ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఇళ్లలో ఉపయోగించడంవల్ల సగటున 40 శాతం విద్యుత్ ఆదా అవుతుందని, విద్యుత్ బిల్లులూ తగ్గుతాయి కాబట్టి వాటిని ఉపయోగించాలని ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ రాష్ట్ర ప్రజలకు సూచించారు. కృష్ణాజిల్లా కలెక్టర్ జె. నివాస్‌తో కలిసి విజయవాడలో మంగళవారం ఆయన జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాలను ప్రారంభించారు. ఏపీఎస్ఈసీఎం, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్) ఆధ్వర్యంలో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలతో ర్యాలీ నిర్వహించారు. ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ. చంద్రశేఖరరెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ బి. మల్లారెడ్డి, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె పద్మజనార్ధనరెడ్డి, విజయవాడ ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శివప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. -
పేదలపై విద్యుత్ చార్జీల భారం వేయం
సాక్షి, అమరావతి: పేద ప్రజలపై ఎటువంటి భారం లేకుండా, విద్యుత్ చార్జీలను స్వల్పంగా పెంచేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)ని కోరాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికి అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఎఆర్ఆర్), రిటైల్ సప్లై బిజినెస్ (ఆర్ఎస్బీ)ను సోమవారం ఏపీఈఆర్సీకి సమర్పించాయి. ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ సమక్షంలో తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంతాల విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్)ల సీఎండీలు కె.సంతోషరావు, హెచ్. హరనాధరావు, జె.పద్మాజనార్ధనరెడ్డిలు ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, సభ్యులు పి.రాజగోపాలరెడ్డి, ఠాకూర్ రామసింగ్లకు సమగ్ర ఆదాయ ఆవశ్యకత (ఏఆర్ఆర్) నివేదికలను అందజేశారు. ప్రస్తుతం ఉన్న శ్లాబుల్లో ఈ సారి మార్పులు చేశారు. ఇకపై గృహ విద్యుత్ 0–30 యూనిట్ల లోపు వినియోగానికి యూనిట్‌కు రూ.1.45 పైసలు వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి. 31–75 వరకు రూ.2.80 పైసలు, 0–100 వరకు రూ.4, 101–200 వరకు రూ.5, 201–300 వరకు రూ.7, 300 యూనిట్ల పైన రూ.7.50 పైసలు చొప్పున వసూలుకు అనుమతి కోరారు. ప్రస్తుతం 301–400 యూనిట్లు వినియోగిస్తే రూ.7.95 పైసలు, 401 నుంచి 500 వరకూ రూ.8.50 పైసలు, ఆ పైన రూ.9.95 పైసలు చొప్పున చార్జీలు విధిస్తున్నారు. తాజా ప్రతిపాదనల్లో ఇవి కొంతవరకూ తగ్గించడం ఊరట కలిగిస్తోంది. అదే విధంగా వాణిజ్య విద్యుత్ టారిఫ్‌లను కూడా తగ్గించాలని ప్రతిపాదించారు. 0–50 యూనిట్లు వాడే వారికి యూనిట్ రూ.6.90 పైసల నుంచి రూ.5.40 పైసలకు తగ్గించారు. హైటెన్షన్ విద్యుత్ సర్వీసులకు 11 కెవీ, 33 కేవీ, ఈహెచ్‌టీల టారిఫ్‌లలో మార్పు లేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగిస్తామన్నారు. హార్స్ పవర్ పెరిగే కొద్దీ విధించే చార్జీలను పెంచాలని అడగలేదు. పరిశ్రమలకు విధించే టారిఫ్‌లపైనా మార్పు లేదు. ఇలా అన్ని వర్గాల వారిపైనా భారం లేకుండా నామమాత్రంగా చార్జీలను పెంచేందుకు అనుమతించాలని డిస్కంలు విజ్ఞప్తి చేశాయి. సరాసరి విద్యుత్ సరఫరా వ్యయం రూ.6.58 పైసలుగా తేల్చాయి. కొత్త టారిఫ్‌ల ప్రకారం విద్యుత్ చార్జీలను వచ్చే ఏడాది ఆగస్టు 1 నుంచి అమలులోకి తేవాలనుకుంటున్నట్లు డిస్కంలు మండలికి తెలిపాయి. 2022–23 ఆర్ధిక సంవత్సరానికి వివిధ మార్గాల ద్వారా 74,815 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనాల్సి ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో డిస్కంల ఆదాయం రూ.40,962.4 కోట్లు ఉంటే ఖర్చు రూ.41,220.99 కోట్లు ఉంది. రూ.258.59 కోట్ల వ్యత్యాసం ఉంది. 2022–23లో మొత్తం ఖర్చులు రూ.45,398.58 కోట్లుగా అంచనా వేయగా లోటు వచ్చే అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తోందని చెబుతూ నికర ఆర్థిక లోటును 0 గా చూపించాయి. అయితే 2014 నుంచి ఈ ఏడాది మార్చి 31 నాటికి డిస్కంలు రూ.28,599 కోట్ల నష్టాల్లో ఉన్నాయని తెలిపాయి. ఇవి కాకుండా రూ.37,465 కోట్ల అప్పులున్నట్లు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2021–22లో ఇప్పటి వరకూ రూ.13,560 కోట్ల రుణాలు తీసుకున్నట్లు వివరించాయి. విద్యుత్ కొనుగోలు, సరఫరా ఖర్చులు గడిచిన ఏడేళ్లలో రూ.25,595 కోట్లకు చేరాయని తెలిపారు. గత ఆగస్టులో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) నివేదిక ప్రకారం 100 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగంపై దేశంలోనే అత్యంత తక్కువ చార్జీ ఏపీలో ఉందనే విషయాన్ని గుర్తు చేశాయి. మిగిలితే వినియోగదారులకు ఇస్తున్నాం 2014–15 నుంచి 2018–19 వరకూ ఆమోదించిన ట్రూఅప్ చార్జీలను ఏపీఈఆర్సీ నిలిపివేసింది. తిరిగి వాటి వసూలుకు అనుమతించాలని డిస్కంలు కోరాయి. చార్జీలు వసూలు చేయడమే కాకుండా మిగిలితే తిరిగి వినియోగదారులకు ఇస్తున్నామని, ఈ విధంగా 2022లో ట్రూ డౌన్ రూ.3,373 కోట్లుగా ఇప్పటికే నిర్ధారించామని తెలిపారు. విద్యుత్ కొనుగోలు ఖర్చుల ట్రూ డౌన్ రూ.4,761 కోట్లు, ఆదాయ లోటు రూ.3,685 కోట్లు, అదనపు ఖర్చు రూ.183 కోట్లు, 2021కి అదనపు ఆదాయ లోటు ట్రూ అప్ రూ.2,480 కోట్లు చొప్పున లెక్క గట్టాయి. ఈ అంశాలన్నింటిపైనా ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ (పబ్లిక్ హియరింగ్) నిర్వహించి, తగిన నిర్ణయాన్ని వెలువరిస్తుంది. -
విద్యుత్ పొదుపులో కీలక మలుపు
సాక్షి, అమరావతి: విద్యుత్ పొదుపులో రాష్ట్రం కీలక మైలు రాయిని అధిగమించి, సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాదిలో రూ.3,800 కోట్ల విలువైన 5,600 మిలియన్ యూనిట్ల ఇంధనాన్ని ఆదా చేసింది. వార్షిక నివేదిక ప్రకారం ఇంధన శాఖ ఈ అంచనాకు వచ్చింది. పరిశ్రమలలో పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్ (పీఏటీ)లో భాగంగా ఇంధన పొదుపు కార్యక్రమాల అమలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు.. పట్టణాలు, గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు, వ్యవసాయ పంపుసెట్ల పంపిణీ, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) పరికరాల ఏర్పాటు వంటి చర్యల కారణంగా రాష్ట్రం ఈ ఘనత సాధించింది. ఇంతటితో సరిపెట్టుకోకుండా, సంపూర్ణ ఇంధనపొదుపు చర్యలను ఉద్యమంలా నిర్వహిస్తే రాష్ట్రంలో 15 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేసేందుకు అవకాశం ఉందని ఇంధన శాఖ చెబుతోంది. ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్న ఇంధన పొదుపు వారోత్సవాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అన్ని వర్గాల వారినీ ఇందులో భాగస్వామ్యం చేయనుంది. ఇంధన పొదుపుపై అవగాహన కల్పించడంలో భాగంగా వారం పాటు ఎనర్జీ కన్జర్వేషన్ ర్యాలీ, ఎంఎంఎస్ఈ సెక్టార్లో ఐఓటీ టెక్నాలజీ, విద్యుత్ వాహనాలు, ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ), పీఏటీ వంటి అంశాలపై వెబ్‌నార్ లేదా వర్క్‌షాప్‌లను రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాష్ట్ర ఇంధన సంరక్షక మిషన్ (ఏపీఎస్ఈసీఎం) నిర్వహించనుంది. దీని కోసం జిల్లా స్థాయి నుంచి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ప్రతిష్టాత్మకంగా వారోత్సవాలు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు–2021ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిందని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆ శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, ఇంధన శాఖ అధికారులతో గురువారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్‌ను అందించాలనేది సీఎం జగన్ లక్ష్యమన్నారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్, ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) నుంచి విద్యుత్‌ను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. -
ఇంధన పొదుపుతో ఖర్చుల అదుపు
సాక్షి, అమరావతి: ఇంధన సామర్థ్యం, పొదుపు చర్యలపై ప్రజలు, ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ దృష్ట్యా అందరూ ఇంధన పరిరక్షణ వారోత్సవాలలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంధన సంరక్షక మిషన్ (ఏపీఎస్ఈసీఎం) చైర్మన్ సమీర్‌శర్మ కోరారు. రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి మొదలయ్యే ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా అందించనున్న స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ (సెక) 2021పై ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, ఇతర అధికారులతో ఆయన ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను అందుకోవడానికి, ఇంధన భద్రత, ఆర్థికాభివృద్ధి సాధించేందుకు, ఇంధనంపై వ్యయాన్ని తగ్గించేందుకు ఇంధన సామర్థ్య చర్యలు దోహదపడతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇంధన పరిరక్షణ అవార్డుల కార్యక్రమంలో ఎక్కువ మంది పాల్గొనేలా సహకరించాల్సిందిగా అన్ని ప్రభుత్వ శాఖలకు ఇప్పటికే విజ్ఞప్తి చేసినట్లు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ సీఎస్‌కు వివరించారు. వివిధ రంగాల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా ఏటా 15 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేసే అవకాశముందని పేర్కొన్నారు. ‘సెక’ పోటీలో ఎక్కువ మంది పాల్గొనేందుకు వీలు కల్పిస్తూ దరఖాస్తు గడువును ఈ నెల 8వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. కేటగిరీల వారీగా అవార్డులకు అర్హతలు ఇలా.. పరిశ్రమలు, భవన నిర్మాణం, మునిసిపల్ రంగానికి సంబంధించిన వివిధ సంస్థల మధ్య నిర్విహిస్తున్న సెక–2021 అవార్డుల పోటీకి సంబంధించిన అర్హత ప్రమాణాలను ఏపీఎస్ఈసీఎం ఆదివారం ప్రకటించింది. పారిశ్రామిక రంగం కింద, మొత్తం వార్షిక ఇంధన వినియోగం 3000 టీన్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ (టీఓఈ) లేదా అంతకంటే ఎక్కువ కలిగిన సిమెంట్ పరిశ్రమలు, 1500 టీఓఈ లేదా అంతకంటే ఎక్కువ మొత్తం వార్షిక ఇంధన వినియోగం కలిగిన టెక్స్టైల్ పరిశ్రమలు, 1000 కేవీఏ, అంతకంటే ఎక్కువ డిమాండ్ ఉన్న ఎంఎస్ఎంఈ సంస్థలు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు. భవనాల విభాగం కింద, వాణిజ్య భవనాలు, హోటళ్లు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్, ప్లాజాలు, యూనివర్సిటీలు, 100 కిలోవాట్, 120 కిలోవాట్ లేదా అంతకంటే ఎక్కువ కాంట్రాక్ట్ డిమాండ్ ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు, 50 కిలోవాట్ కంటే ఎక్కువ లోడ్ ఉన్న విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాలలు దరఖాస్తుకు అర్హులు. మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, మురుగు నీటి పంపింగ్ బోర్డులు, తాగునీటి సరఫరా బోర్డులు కూడా పోటీలో పాల్గొనవచ్చు. దరఖాస్తు వివరాలు ఏపీఎస్ఈసీఎం, డిస్కంల వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయి. పూరించిన దరఖాస్తును seca.apsecm.gmail.com ద్వారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు సమర్పించాలి. -
మీరే ఇప్పించి.. తీసేసుకోండి!
సాక్షి, అమరావతి: తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకున్న విద్యుత్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన రూ.6,283.68 కోట్ల బకాయిలను ఇప్పించాల్సిందిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇంధన శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ సమస్యలపై శనివారం నివేదిక ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర డిస్కంలు పొందుతున్న ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం రుణం కింద ఏపీ జెన్కో బకాయిలు జమ చేయాలని రాష్ట్రం కోరనుంది. ఈ పథకం ద్వారా కేంద్రం రాష్ట్రాలకు రుణాలిస్తుంటుంది. ఏపీకి సంబంధించిన రుణ బకాయిలను తెలంగాణ నుంచి తీసుకోవాలని ప్రధానంగా విజ్ఞప్తి చేయనుంది. నాడు ఆదుకున్న ఏపీ: ఏపీ విభజన సమయంలో డిమాండ్‌కు సరిపడా తెలంగాణలో విద్యుదుత్పత్తి లేకపోవడంతో ఏపీజెన్కో తెలంగాణ డిస్కంలకు 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు సరఫరా చేసింది. ఆ కాలంలో సరఫరా చేసిన విద్యుత్ ఖర్చు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం, రూ.3,441.78 కోట్లు, ఆలస్యమైనందుకు సర్‌చార్జి రూ.2,841.90 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు తెలంగాణ చెల్లించలేదు. ప్రస్తుతం ఏపీ జెన్కో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. తెలంగాణ బకాయిలు రాకపోవడంతో.. ఏపీ జెన్కో జూన్ 2021లో విద్యుత్ ఆర్థిక సంస్థ, గ్రామీణ విద్యుదీకరణ సంస్థలకు రూ.1700 కోట్ల రుణ వాయిదాలను గడువులోగా తీర్చలేకపోయింది. జూలై, ఆగస్టులో చెల్లించాల్సిన మరో రూ.1,020 కోట్లు చెల్లించలేదు. అంగీకరించారు గానీ..: వాస్తవానికి 2019 ఆగస్టు 19న ఏపీ, తెలంగాణ విద్యుత్ సంస్థల మధ్య జరిగిన సమావేశంలోనూ, 2020 జనవరి 30న ఏపీ, తెలంగాణ సీఎస్ల సమావేశంలోనూ తెలంగాణ, ఏపీలు కలిసి ఈ బకాయిల చెల్లింపుపై వివిధ సందర్భాల్లో చర్చించాయి. తెలంగాణ డిస్కంలు ఈ మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరించాయి. కానీ డబ్బులు ఇవ్వలేదు. కేంద్రం ఆదేశాలివ్వడం వల్లనే తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసినందున ఆ బకాయిలను ఆత్మనిర్భర్ పథకం ద్వారా రాష్ట్రానికి ఇప్పించి, వాటిని ఆర్ఈసీ, పీఎఫ్‌సీల రుణాలకు జమచేసుకోవాలనే ప్రతిపాదనను అమిత్ షా ముందుంచాలని రాష్ట్రం భావిస్తోంది. -
ఏపీలో పెరిగిన సగటు విద్యుత్ వినియోగం
సాక్షి, అమరావతి: వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయి. బొగ్గు సంక్షోభంలోనూ డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్ అందిస్తూ రాష్ట్రంలో వెలుగులు నింపుతున్నాయి. తీవ్ర బొగ్గు కొరత వల్ల అక్టోబర్‌లో అనేక రాష్ట్రాలు ఇబ్బందులు పడినా.. ఏపీలో మాత్రం జాతీయ సగటు కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం నమోదయ్యింది. సంక్షోభంలోనూ రికార్డు.. ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి, వినియోగదారుల సంక్షేమానికి.. నిరంతరం విద్యుత్ సరఫరా అందించటం కీలకమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తగినట్లే విద్యుత్ పంపిణీ సంస్థలు, ఇంధన శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా జాతీయ సగటు విద్యుత్ వినియోగం అక్టోబర్‌లో 4.8 శాతం పెరిగితే, ఏపీలో ఏకంగా 17.2 శాతం పెరిగింది. గతేడాది ఇదే నెలలో రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగం 4,972 మిలియన్ యూనిట్లుగా నమోదు కాగా.. ఈ ఏడాది అక్టోబర్‌లో 5,828 మిలియన్ యూనిట్లకు చేరింది. దేశంలో గతేడాది అక్టోబర్‌లో 109.17 బిలియన్ యూనిట్లుగా నమోదు కాగా.. ఈ ఏడాది 114.37 బిలియన్ యూనిట్లకు చేరింది. ఇక గతేడాది అక్టోబర్ 31న రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ వినియోగం 8,820 మెగావాట్లుగా ఉండగా.. ఈ ఏడాది అక్టోబర్ 19న గరిష్ట విద్యుత్ వినియోగం 9,865 మెగావాట్లుగా నమోదైంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ రాజీ లేదు ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన, చౌక విద్యుత్ అందించే విషయంలో ప్రభుత్వం రాజీపడదని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ చెప్పారు. విద్యుత్ డిమాండ్‌పై ఏపీ ట్రాన్స్‌కో, రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ విభాగాలతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. చౌక విద్యుత్ సరఫరాలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలని సీఎం జగన్ లక్ష్యమని శ్రీకాంత్ తెలిపారు. భవిష్యత్‌లో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు వంద శాతం నమ్మకమైన, నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు అవసరమైన కృషి జరగాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని చెప్పారు. సమావేశంలో ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లు ఇమ్మడి పృథ్వీతేజ్, బి.మల్లారెడ్డి, డైరెక్టర్ కె.ప్రవీణ్, చీఫ్ ఇంజనీర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, వినియోగదారులకు నాణ్యమైన చౌక విద్యుత్‌ను అందించేందుకు, రాష్ట్రానికి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చేందుకు ఇంధన శాఖ అధికారులు చేస్తున్న కృషిని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభినందించారు. -
‘సెకీ’ విద్యుత్‌తో లాభమే
సాక్షి, అమరావతి: సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ–సెకీ) నుంచి రాష్ట్ర ప్రభుత్వం 7 వేల మెగావాట్ల సోలార్ పవర్‌ను రైతుల కోసం కొనుగోలు చేస్తుందని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 2024 నుండి 25 ఏళ్ల పాటు రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులకు పగటి పూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను ప్రత్యేక డిస్కమ్ ద్వారా అందిస్తుందని తెలిపారు. సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం అత్యంత లాభదాయకమని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థం లేనివని మంత్రి వివరించారు. టీడీపీ హయాంలోనే అనవసరంగా అధిక ధరకు సౌర, పవన విద్యుత్ కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఉచిత విద్యుత్ కోసం ట్రాన్స్‌కో, డిస్కంలు గత రెండేళ్లలో రూ.3,762 కోట్ల విలువైన నెట్‌వర్క్‌ను పెంచుకున్నాయని, డిమాండ్‌ను పెంచడానికి 20 కొత్త ట్రాన్స్‌కో సబ్స్టేషన్లు, 162 కొత్త డిస్కం సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెకీ.. టెండర్ ధర ప్రకారం యూనిట్ ధర రూ.2.49 ఉంటుందన్నారు. రెగ్యులేటరీ కమిషన్ ద్వారా విద్యుత్ చట్టం ప్రకారం టారిఫ్ నిర్ణయిస్తారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సోలార్కు యూనిట్‌కు రూ.6.99, పవన విద్యుత్ యూనిట్‌కు రూ.4.84 వరకు అధిక ధర చెల్లించి కొనుగోలు చేసినట్లు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పీపీఏ)లో స్పష్టంగా ఉందన్నారు. నిజానికి 2016లో టీడీపీ ప్రభుత్వం ఇదే సెకీ నుంచి యూనిట్‌కు రూ.4.57 (గాలివీడు)తో 400 మెగావాట్లు, మైలవరంలో యూనిట్‌కు రూ.2.77 చొప్పున మరో 750 మెగావాట్లు కొనుగోలు చేసిందని మంత్రి పేర్కొన్నారు. డిస్కంలపై భారం ఉండదు సెకీ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయడం ద్వారా ప్రస్తుత డిస్కంలపై భారం పడదని, అన్ని ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడంతో పోలిస్తే 25 ఏళ్ల పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జీల నుంచి మినహాయింపు వస్తుందని, అదే ఇక్కడైతే సెంట్రల్ గ్రిడ్ చార్జీలు 25 ఏళ్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రాజెక్టును రాష్ట్రం వెలుపల ఏర్పాటు చేస్తే, విద్యుత్ సరఫరాకు సబ్స్టేషన్లు తదితరాల ఖర్చును రాష్ట్రం భరించాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రం వెలుపల నుంచి వచ్చే విద్యుత్‌కు కేంద్రం సెంట్రల్ గ్రిడ్ చార్జీలను మినహాయిస్తోందన్నారు. కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే, మొదట సెంట్రల్ గ్రిడ్‌ను ఉపయోగించి తమిళనాడు, కర్ణాటకకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10,000 మె.వా. ప్రాజెక్ట్ కోసం కేటాయించిన మొత్తం భూమి ఇతర ప్రయోజనాల కోసం రాష్ట్రం వద్ద ఉందన్నారు. చంద్రబాబు ప్రారంభించిన థర్మల్ ప్లాంట్లు ఏవీ లేవని, ఆయన హయాంలో కృష్ణపట్నం ఖర్చు మెగావాట్‌కు రూ.5.5 నుంచి రూ.9.3కి పెరిగిందని మంత్రి వివరించారు. -
రైతుల ప్రయోజనాలకే నూతన డిస్కం
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి రానున్న 25 ఏళ్లపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు పగటిపూటే 9 గంటలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అందుకోసమే ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్ రూరల్ అగ్రికల్చరల్ సప్లై కంపెనీ’ పేరుతో నూతన డిస్కంని ఏర్పాటు చేస్తోందని ఆయన సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూర్తిగా ఉచితంగానే విద్యుత్తుని సరఫరా చేస్తుందని, రైతులపై ఎలాంటి భారం పడనీయదని తెలిపారు. రైతుల్లో అనుమానాలు రేకెత్తించేందుకు, గందరగోళం సృష్టించేందుకు కొందరు చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. నవరత్నాల్లో భాగంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పగటిపూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందిస్తామని సీఎం వైఎస్ జగన్ చేసిన వాగ్దానాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని, ఇందుకోసం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.8,559 కోట్లు కేటాయించిందని తెలిపారు. వైఎస్సార్ ఉచిత విద్యుత్తు పథకం వల్ల ప్రతి రైతు ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. 9 గంటల ఉచిత విద్యుత్తు సరఫరాచేసే సామర్థ్యంగల వ్యవసాయ ఫీడర్లను రూ.1,700 కోట్లతో అప్‌గ్రేడ్ చేయించామని, గత రబీ సీజన్ నుంచి నూరుశాతం వ్యవసాయ ఫీడర్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను శాశ్వత పథకంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంటున్నట్టు చెప్పారు. దీనివల్ల యూనిట్ రూ.2.49 చొప్పున ఏడాదికి 7 వేల మెగా వాట్ల విద్యుత్తును పాతికేళ్ల పాటు కొనుగోలు చేసేందుకు వీలవుతుందని ఆయన తెలిపారు. -
‘సెకీ’ విద్యుత్ లాభమే
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) ఏర్పాటుచేసే 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకోవడం లాభదాయకమేనని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ స్పష్టం చేశారు. ‘సెకీ నుంచి విద్యుత్ కొంటే నష్టమే’ శీర్షికతో ఈనాడు ప్రచురించిన కథనంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రాజెక్టు ఏర్పాటుకు ఇచ్చే నిధులు మౌలిక సదుపాయాలు కల్పించే నిమిత్తం పార్క్ డెవలపర్‌కు చెల్లించేవేనని, బిడ్డింగ్ ధరలో ఈ అంశం కూడా ఉంటుందన్నారు. అలాగే.. జీఎస్టీ పన్నును విద్యుత్ ఉత్పత్తి ధరలో భాగంగా పరిగణించకూడదన్నారు. ‘సెకీ’ నుంచి విద్యుత్ తీసుకోవడంవల్ల ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న భూమి కూడా భవిష్యత్తులో ఇతర ప్రాజెక్టులు చేపట్టడానికి పనికొస్తుందని ఆయన పేర్కొన్నారు. యూనిట్ రూ.2.49 పైసలకు తీసుకుంటే 3% అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార నష్టాలు 7.5 పైసలు మాత్రమే వస్తుందని.. 27 పైసలు కాదని శ్రీకాంత్ తెలిపారు. అంతేకాక.. రాష్ట్రంలో సౌర ప్రాజెక్టులు చేపట్టినప్పుడు వాటికి కావలసిన విద్యుత్ లైన్లు, అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థ బలోపేతానికి అయ్యే ఖర్చు.. బయటి రాష్ట్రం నుంచి నేరుగా సౌర విద్యుత్ తీసుకున్నప్పుడు అంతర్గత వ్యవస్థకు అయ్యే ఖర్చుల మధ్య కూడా తేడా ఉంటుందని వివరించారు. ప్రాథమికంగా ఇప్పుడున్న అంతర్రాష్ట్ర, అంతర్గత రాష్ట్ర విద్యుత్ ప్రసార వ్యవస్థల సామర్థ్యాన్ని బేరీజు వేసుకుంటే.. బయటి రాష్ట్రాల నుంచి సౌర విద్యుత్ తీసుకున్నప్పుడే ఖర్చు తక్కువవుతుందని శ్రీకాంత్ స్పష్టంచేశారు. యూనిట్‌కు రూ.1.87 పైసల ఆదా ప్రస్తుతం రూ.4.36 పైసల చొప్పున ఒక యూనిట్ విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నామని.. అయితే, ‘సెకీ’ నుండి దీర్ఘకాలిక ఒప్పందం ద్వారా అదే ఒక యూనిట్ విద్యుత్‌ను 2.49 పైసలకు కొనుగోలు చేయడంవల్ల యూనిట్‌కు రూ.1.87 పైసల వరకు ఆదా అవుతుందని శ్రీకాంత్ తెలిపారు. ఈ లెక్కన ఏటా దాదాపు రూ 3,060 కోట్లు ఆదా అవుతుందని ఆయన వివరించారు. ఉచిత వ్యవసాయ విద్యుత్ కోసమే.. ఇక సీఎం వైఎస్ జగన్ సత్సంకల్పంతో రానున్న 25 ఏళ్లకు రాష్ట్రంలోని రైతుల ఉచిత వ్యవసాయ విద్యుత్ అవసరాల కోసమే ‘సెకీ’ నుంచి విద్యుత్ తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఒక సుస్థిరమైన, ప్రత్యేక ఫీడర్లు కల్గిన, అదనపు లోడ్ గుర్తించే సామర్థ్యమున్న మీటర్లతో ఒక స్వతంత్ర విద్యుత్ వ్యవస్థను తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఈ తక్కువ ధర సౌర విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అమలులో వున్న సౌర పీపీఏల సగటు యూనిట్ ధర దాదాపు రూ.4.50 ఉందన్నారు. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌కి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర యూనిట్ రూ.2.79 పైసల (ట్రేడింగ్–మార్జిన్ కలిపి) కన్నా ‘సెకీ’ ప్రతిపాదించిన యూనిట్ రూ.2.49పై. (ట్రేడింగ్–మార్జిన్ కలిపి) ధర తక్కువని శ్రీకాంత్ స్పష్టంచేశారు. కాబట్టి.. అనవసరంగా లేనిపోని అభూత కల్పనలతో అవాస్తవాలను ప్రచారం చేయవద్దని ఆయన హితవు పలికారు. -
ఇంధన పొదుపుపై కసరత్తు
సాక్షి, అమరావతి: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల్లో భారీ స్థాయిలో ఇంధన పొదుపునకు అవకాశం ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ భావిస్తోంది. ఇంధన సామర్థ్య చర్యలను ప్రోత్సహించడం, అత్యాధునిక ఇంధన సామర్థ్య సాంకేతికతలను ప్రవేశపెట్టడం ద్వారా పెద్దఎత్తున ఇంధనాన్ని ఆదా చేయడానికి అవకాశం ఉందని నమ్ముతోంది. ఈ దృష్ట్యా ఇంధన ఆడిట్ నిర్వహించేలా ఎంఎస్ఎంఈ యజమానులను ప్రోత్సహించాలని రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులను ఆదేశించింది. రూ.1,200 కోట్ల విలువైన విద్యుత్ ఆదా పరిశ్రమల్లో ఇంధన వినియోగం ఏటా 17,000 మిలియన్ యూనిట్లు ఉండగా..ఇందులో ఎంఎస్ఎంఈలు 5,000 మిలియన్ యూనిట్లు వినియోగించుకుంటున్నాయి. కనీసం 10 శాతం పొదుపు చేస్తే 500 మిలియన్ యూనిట్లు ఆదా అయినట్టే. ఎంఎస్ఎంఈల్లో పూర్తిస్థాయిలో ఇంధన సామర్థ్య చర్యలు చేపడితే దాదాపు 2,000 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పొదుపు చేయవచ్చని, ఇది రూ.1,200 కోట్లకు సమానమని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రానికి బీఈఈ ఆడిటర్లు భారీ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల్లో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ (ఐజీఈఏ) నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్కో) సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ సంచాలకులు, జిల్లాల్లోని జనరల్ మేనేజర్లను తాజాగా ఆదేశించారు. ఈ క్రమంలోనే ఎంఎస్ఎంఈల్లో ఇంధన ఆడిట్ నిర్వహించేందుకు సాంకేతిక సాయం అందించడంతో పాటు గుర్తింపు పొందిన ఇంధన ఆడిటర్లను రాష్ట్రానికి పంపేందుకు బీఈఈ (బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ) అంగీకరించింది. ది ఎనర్జీ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (టీఈఆర్ఐ) సమర్పించిన ఇంధన ఆడిట్ నివేదిక ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఫిషరీస్ క్లస్టర్లో 43 ఎంఎస్ఎంఈలు 455 మిలియన్ యూనిట్లు వినియోగిస్తున్నాయి. వీటి విద్యుత్ బిల్లు రూ.296 కోట్లు వస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద ఏపీఎస్ఈసీఎం రెండు ఫిషరీస్ ఎంఎస్ఎంఈలు ఆనంద ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, కదెర్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థల్లో ఇంధన ఆడిట్ చేసింది. రూ.1.37 కోట్ల పెట్టుబడితో 1.45 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పొదుపు చేయవచ్చని, 1,306 టన్నుల కార్బన్ డయాౖఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చని ఈ ఆడిట్ లో తేల్చింది. పరిశ్రమల శాఖ మద్దతు హర్షణీయం టీఈఆర్ఐ సంస్థ ద్వారా రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ ఇప్పటికే ఇంధన ఆడిట్ నిర్వహించి ఫిషరీస్ విభాగంలో ఇంధన పొదుపునకు భారీగా అవకాశాలు ఉన్నట్టు గుర్తించింది. ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో పరిశ్రమల శాఖ సంపూర్ణ మద్దతు ఇస్తుండటం హర్షించదగ్గ విషయం. – నాగులాపల్లి శ్రీకాంత్, కార్యదర్శి, ఇంధన శాఖ బీఈఈ సంస్థలతోనే ఆడిట్ పరిశ్రమల్లో ఇంధన పొదుపు తద్వారా ఆర్థిక పొదుపు అవకాశాలను గుర్తించేందుకు ఇంధన శాఖకు చెందిన ఏపీ సీడ్కో ఐజీఈఏ (ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ ) కార్యక్రమాన్ని చేపడతాయి. ఐజీఈఏను బీఈఈకి చెందిన ఇంధన ఆడిట్ సంస్థలే నిర్వహించనున్నాయి. ఐజీఈఏ ఖర్చు పరిశ్రమను బట్టి ఉంటుంది. – కరికాల వలవన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ ఆడిట్ తో అనేక ప్రయోజనాలు ఆడిట్ తో అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇంధన ఖర్చును, ఉత్పత్తి ఖర్చును, విదేశీ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. పర్యావరణం దెబ్బతినకుండా, కాలుష్యం పెరగకుండా చూసుకోవచ్చు. గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు పోటీతత్వం, ఇంధన సరఫరాను మెరుగుపర్చుకోవచ్చు. –జేవీఎన్ సుబ్రహ్మణ్యం, కమిషనర్, పరిశ్రమల శాఖ -
విద్యుత్‌ను పొదుపుగా వాడండి
సాక్షి, అమరావతి: దేశంలో బొగ్గు సంక్షోభం నెలకొన్న కారణంగా మన రాష్ట్రంపైన కూడా ఆ ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదముందని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ఈ విపత్కర పరిస్థితిలో విద్యుత్ సంస్థలకు సహకరించాల్సిందిగా వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రతి వినియోగదారుడు విద్యుత్ పొదుపుపై శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పీక్ అవర్స్‌గా పిలుచుకునే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, రాత్రి 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏసీల వంటి పరికరాల వాడకం తగ్గించుకోవాలన్నారు. ఈ మేరకు విజయవాడలో శనివారం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం సహకారమందించాలి.. బొగ్గు కొరత సంక్షోభాన్ని అధిగమించేందుకు తగిన సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్ ఇప్పటికే లేఖ రాశారు. ఆ లేఖలో రాష్ట్రంలో 2,300 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు పనిచేయడం లేదని తెలిపారు. వాటికి ఓఎన్జీసీ, రిలయెన్స్ నుంచి గ్యాస్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని సీఎం కోరారు. అలాగే బొగ్గు కొనుగోలు ధరలు, విద్యుత్ మార్కెట్ ధరలు విపరీతంగా పెరిగినందున రాష్ట్ర విద్యుత్ సంస్థలు బొగ్గు కొనుగోలు చేయడానికి రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. పడిపోయిన జెన్కో ఉత్పత్తి.. కోవిడ్ తర్వాత విద్యుత్ వినియోగం 2019తో పోలిస్తే 2021లో దేశవ్యాప్తంగా 18 శాతం, ఏపీలో 20 శాతం పెరిగింది. ఒకవేళ కోవిడ్ లేకపోతే జరిగే వినియోగం కంటే ఇది 8 శాతం ఎక్కువ. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకి వినియోగిస్తున్న 190 మిలియన్ యూనిట్లలో 80 మి.యూనిట్ల విద్యుత్ ఏపీ జెన్కో ద్వారా అందుతోంది. ప్రస్తుతం జెన్కో ఉత్పత్తి 50 శాతం (40 మి.యూ)కి పడిపోయింది. కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి రోజుకు 40 మి.యూ విద్యుత్ ఉత్పత్తి అవ్వాల్సి ఉండగా అందులో 75 శాతం (30 మి.యూ) మించి ఉత్పత్తి అవ్వట్లేదు. జల విద్యుత్ ఉత్పత్తి 25 మిలియన్ యూనిట్ల వరకే చేయగలం. రోజుకి 15 మి.యూ సౌర విద్యుత్ వస్తోంది. 30 మి.యూ పవన విద్యుత్ ఉత్పత్తి అవ్వాల్సి ఉండగా.. కేవలం 5 నుంచి 10 మి.యూనిట్లకే పరిమితమవుతోంది. బహిరంగ మార్కెట్లో ధరలు పెరిగాయి.. రాష్ట్రంలో 40 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తుండగా ఈ నెల 8 నుంచి యూనిట్ సగటు ధర రూ.15కు పెరిగింది. ఇండోనేషియా నుంచి సరఫరా అయ్యే బొగ్గు ఏప్రిల్‌లో టన్ను 86.68 డాలర్లుండగా ఇప్పుడు 162 డాలర్లు అయ్యింది. మనరాష్ట్రంలో ఉన్న 5 వేల మెగావాట్ల థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. జెన్కో ప్లాంట్లకి రోజుకు 70,000 టన్నుల బొగ్గు అవసరం. గత నెలలో 24,000 టన్నులు మాత్రమే బొగ్గు అందుబాటులో ఉంది. కేంద్రాన్ని కోరాక అది ప్రస్తుతం రోజుకు 40,000 టన్నులకు చేరింది. 20 బొగ్గు ర్యాక్స్ కేటాయించాలని విజ్ఞప్తి చేశాం.. బొగ్గు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏటా అక్టోబర్ నుంచి జనవరి వరకు రాబోయే వేసవి కోసం నిల్వలు పెంచుతాయి. ఈ నేపథ్యంలో 2022 కోసం రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు 20 బొగ్గు ర్యాక్స్ కేటాయించాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. అలాగే దేశంలో విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలు, బొగ్గు సరఫరా ఒప్పందాలు లేని కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిపేసిన కొన్ని ప్లాంట్లలో వెంటనే తాత్కాలికంగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థించాం. విద్యుత్ సంస్థలను ఆదుకోవడానికి గత రెండేళ్లలో ప్రభుత్వం చేయగలిగినంత సహాయం చేసింది. దాదాపు రూ.34,340 కోట్ల ఆర్థిక సహాయం చేసి ఆదుకుంది. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటుకే రూ.9,165 కోట్లు చెల్లించింది. మార్చి 2019 నాటికి రూ.27,239 కోట్లు ఉన్న విద్యుత్ సంస్థల మొత్తం నష్టాన్ని మార్చి 2021 నాటికి రూ.27,552 కోట్ల వద్దనే నిలువరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నాటికి చెల్లించాల్సిన విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం చెల్లించేసింది. బొగ్గు కొరత సంక్షోభం ప్రభావం విద్యుత్ రంగంపై తాత్కాలికమేనని భావిస్తున్నాం. అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్ పంపిణీ సంస్థలు కృషి చేస్తాయి.