తెలంగాణ జెన్‌కోకు ప్రభుత్వం ఇద్దరు డెరైక్టర్లను నియమించింది. ఈ మేర కు ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోిషీ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
హైదరాబాద్: తెలంగాణ జెన్‌కోకు ప్రభుత్వం ఇద్దరు డెరైక్టర్లను నియమించింది. ఈ మేర కు ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోిషీ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. జెన్‌కోలో చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న సచ్చిదానందంను డెరైక్టర్ (థర్మల్)గా, జూలై 31న పదవీ విరమణ చేసిన వెంకటరాజంను డెరైక్టర్ (హైడల్)గా నియమించారు.
వీరి నియామకానికి సంబంధించిన నియమ నిబంధనలపై ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీచేస్తామని పేర్కొన్నారు. టీ జెన్‌కోకు డెరైక్టర్లను నియమించాలని సంస్థ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు జూన్ 13న ప్రభుత్వాన్ని కోరారు.