Telengana
-
జంతు దాడుల పరిహారం రూ. 20 లక్షలకు పెంపుపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల దాడుల ఘటనల్లో మరణించిన వారికి ఇచ్చే నష్టపరిహారాన్ని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిహారాన్ని రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. శుక్రవారం కొండా సురేఖ అధ్యక్షతన అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ గవరి్నంగ్ బాడీస్ సమావేశం జరిగింది.ఈ భేటీలో సురేఖ మాట్లాడుతూ ఆమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ల పరిధిలోని గ్రామాల తరలింపు ప్రక్రియ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్నందున వారిలో విశ్వాసాన్ని కల్పిస్తూ పునరావాస ప్రక్రియను చేపట్టాలని అధికారులకు సూచించారు. పునరావాసం కోసం తరలించిన కుటుంబాలకు శాశ్వత పట్టాలు అందించాలని, రాకపోకల నిమిత్తం గ్రీన్ పాసులు అందించాలని, స్కూల్ ఏర్పాటు చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు మంత్రిని కోరారు. సాధారణ అటవీ ఉత్పత్తులను సేకరించే స్థానికులపై మానవత్వం చూపాలని మంత్రి అధికారులకు సూచించారు. అక్కమహాదేవి గుహలు, సలేశ్వరం జాతరకు సౌకర్యాలు దోమలపెంట–శ్రీశైలం ఎకో టూరిజం సర్క్యూట్లో భాగంగా అక్కమహాదేవి గుహలను సందర్శించే భక్తులకు యాత్రా సౌకర్యాల కల్పనకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం జాతరను భవిష్యత్తులో చేపట్టనున్న సర్క్యూట్లలో చేర్చి ప్రభుత్వపరంగా యాత్రా సౌకర్యాలను కలి్పంచే దిశగా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఈ భేటీలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్. భూపతిరెడ్డి, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డోబ్రియాల్, పిసిసిఎఫ్ (వైల్డ్ లైఫ్) ఏలూసింగ్, డీసీసీఎఫ్ ఆంజనేయులు(హెడ్ ఆఫీస్), ఓఎస్డీ శంకరన్ పాల్గొన్నారు. -
పీసీసీ చీఫ్‌ల భేటీ.. సీఎం రేవంత్ ప్లేస్‌లో ఢిల్లీకి మంత్రి ఉత్తమ్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం(ఆగస్టు12) ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. పర్యటనలో భాగంగా నేషనల్డ్యామ్సేఫ్టీఅథారిటీ(ఎన్డీఎస్ఏ) ఛైర్మన్‌ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అవనున్నారు.మంగళవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే అధ్యక్షతన జరగనున్న అన్ని రాష్ట్రాల కాంగ్రెస్(పీసీసీ) అధ్యక్షుల భేటీలో ఉత్తమ్ పాల్గొననున్నారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయనకు బదులు సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారు. -
ట్యాంక్ బండ్‌పై ఘనంగా తెలంగాణ దశాబ్ది వేడుకలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఆదివారం రాత్రి ట్యాంక్‌బండ్‌పై ఘనంగా జరిగాయి. వర్షంలోనే ఆవిర్భావ ఉత్సవాలు కొనసాగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ హాజరవ్వగా, ఆయనతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, మంత్రులు ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు.ఉత్సవాల్లో భాగంగా కళాకారుల నృత్యాలు, ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో పూర్తి తెలంగాణ గీతాన్ని వినిపించారు. జయ జయహే తెలంగాణ గేయం 13.5 నిమిషాల పూర్తి వెర్షన్ విడుదల చేశారు. గేయ రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిలను ఘనంగా సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించడానికి నగరవాసులు భారీగా తరలివచ్చారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. లైటింగ్, భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. -
ఆయన రాహుల్ గాంధీ కాదు.. ‘రాంగ్’ గాంధీ: హరీశ్‌రావు
సాక్షి, సిద్ధిపేట జిల్లా: రైతుల ఉసురు పోసుకుందంటూ.. బీజేపీని కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీగా అభివర్ణించారు మాజీ మంత్రి హరీష్‌రావు. బడా బడా కార్పొరేట్ సంస్థల గురించి మాత్రమే బీజేపీ ఆలోచించిందని.. 14 లక్షల కోట్లు మాఫీ చేసిందన్నారు. పేదలకు ఒక్క రూపాయి మాఫీ చేయలేదని విమర్శించారు.హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, బీజేపీ పంచిన బొమ్మలను చూసి ఓటు వేస్తే కడుపు నిండుతుందా? అంటూ ప్రశ్నించారు.అయోధ్య రామాలయం బీజేపీ కట్టలేదు.. ట్రస్ట్ కట్టింది.ఆలయ నిర్మాణానికి తానుకూడా 2 లక్షలు ఇచ్చానని చెప్పారు.నిన్న హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ సభ తుస్సు మంది. 30 వేల కుర్చీలు వేస్తే 3 వేల మంది రాలేదు. కాంగ్రెస్ వాళ్లు వచ్చి ఓటు అడిగితే ఐదు నెలల 12,500 ఇచ్చిన తర్వాతే ఓటు వేస్తామని అక్క చెల్లెళ్లు చెప్పండి. ప్రియాంక గాంధీ గెలిచాక ఇస్తామని హామీ ఇచ్చిన మెడికల్ కాలేజీ హుస్నాబాద్‌కు వచ్చిందా? రేవంత్ రెడ్డి కంటే రాహుల్ గాంధీ ఎక్కువ అబద్ధాలు మాట్లాడున్నాడు, ఆయన రాహుల్ గాంధీ కాదు రాంగ్ గాంధీ’’ అంటూ హరీశ్ ఎద్దేవా చేశారు.‘‘ఈ కాంగ్రెస్ పాలన వచ్చాక కల్యాణ లక్ష్మి ఖతమయ్యింది. తులం బంగారం తుస్సు మంది. బండి సంజయ్ బొమ్మలు పంచి ఓట్లు వేయమంటున్నాడు. బండి సంజయ్ కి ఓటు వేస్తే అంతా వృధా అయిపోతుంది. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ మూడోస్థాలో ఉంది. అది గెలిచే ప్రసక్తే లేదు’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. -
ఆగస్టు 15 డెడ్‌లైన్.. నేను రాజీనామాకు రెడీ: రేవంత్‌కు హరీష్ సవాల్
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఆగస్టు 15వ తేదీలోపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి, హామీలను అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. దీంతో, ఎన్నికల వేళ మరోసారి పొలిటికల్ హీట్ చోటుచేసుకుంది. కాగా, మాజీ మంత్రి హరీష్ సంగారెడ్డిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా. అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చేసే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది. అలాగే, సీఎంకి కూడా సవాల్ చేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి.. ఆగస్టు 15లోగా ఏకకాలంలో రుణ మాఫీ చేస్తే.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. అలాగే రైతు రుణమాఫీ, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు అమలు చేయకపోతే.. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా?. తెలంగాణ అసెంబ్లీ ముందు ఉన్న అమరుల స్థూపం వద్ద తెలంగాణ అభివృద్ధిపై చర్చ పెడదాం. నేను చర్చకు వస్తాను. రేవంత్ చర్చకు వచ్చే దమ్ముందా?’ అని కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి నేను సవాల్ విసురుతున్నఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్దకి నేను వస్తా.. మీరు రండి అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాంఆగస్ట్ 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చెయ్యి..ఆగస్ట్ 15 లోపు పూర్తిగా ఆరు గ్యారంటీలు అమలు… pic.twitter.com/jUVKakgdYf— Telugu Scribe (@TeluguScribe) April 24, 2024Video Credit: Telugu Scribeఇదే సమయంలో సీఎం రేవంత్‌కు హరీష్ రావు కౌంటరిచ్చారు. ‘నాకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యం. గతంలో కొడంగల్‌లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని చెప్పి తోక ముడిచి మాట తప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆరు గ్యారెంటీలను డిసెంబర్ 9 కల్లా అమలు చేస్తామని చెప్పి మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన మాట తప్పడం, పూటకో పార్టీ మారడం మీ నైజం. 120 రోజులు దాటినా మీ గ్యారెంటీలు ఏమయ్యాయి?. మహాలక్ష్మి పథకంలో మహిళలకు రూ.2,500 ఎందుకు ఇవ్వలేదు? రైతులకు ఎకరానికి రైతు బంధు రూ.15,000 సహాయం ఎందుకు ఇవ్వలేదు? ధాన్యానికి రూ.500 బోనస్ ఏది?. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
TS: రాష్ట్రంలో టెస్లా, బీవైడీ తయారీ ప్లాంట్..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన సందర్భంగా పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆరు కంపెనీలు మొత్తం రూ.37,870 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా, చైనా ఈవీ కంపెనీ బీవైడీ తెలంగాణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. తెలంగాణలో తయారీ ప్లాంట్ల ఏర్పాటు గురించి టెస్లా, బీవైడీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. లండన్‌లోని భారత హైకమిషన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలను హైదరాబాద్‌కు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: రోడ్లపై ‘స్మార్ట్‌ఫోన్ జాంబీ’లున్నాయి జాగ్రత్త..! ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి చైనాకు చెందిన బీవైడీ సంస్థకు కేంద్రం గత ఏడాది అనుమతి నిరాకరించింది. టెస్లా రెండు సంవత్సరాలుగా భారతదేశంలోకి ప్రవేశించాలని చూస్తోంది. ట్యాక్స్ రాయితీలు ఇవ్వాలని టెస్లా డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే అందుకు కేంద్రం ఒప్పకోవడం లేదనే వాదనలున్నాయి. -
కేటీఆర్ మనసు దోచుకున్న కార్పెంటర్: మీరు కూడా ఫిదా అవుతారు
ప్రతిభ ఎవడి సొత్తూ కాదు. కానీ అసామాన్య ప్రతిభ మాత్రం కొందరికే సొంతం. రోజూ చేసే పనే అయినా దానిలో బుద్ధి కుశలతను ప్రదర్శించి, మేధో తనాన్ని రంగరించి కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతారు. ఆధునిక పోకడలకు, తమదైన టెక్నాలజీ జోడించి శభాష్ అనుపించుకుంటారు. అలాంటి నైపుణ్యంతో ఒక కార్పెంటర్ వార్తల్లో నిలిచారు. ఈ కళాకారుడు హస్తకళా నైపుణ్యంతో సత్యనారాయణ వ్రత పీఠాన్ని తయారు చేసిన తీరు అద్భుతంగా నిలిచింది. (ఆనంద్ మహీంద్ర ఎమోషనల్ వీడియో: బిగ్ సెల్యూట్ అంటున్న నెటిజన్లు) నేతన్న నైపుణ్యాన్ని చిన్న అగ్గిపెట్టెలో చీరను మడిచిపెట్టిన చందంగా ఒక కార్పెంటర్ పెట్టెలో పూజా పీఠాన్ని విడిగా అమర్చాడు. ఆ తరువాత ఒక్కో భాగాన్ని తీసి ఒక క్రమంగా పద్దతిలో ఎటాచ్ చేయడం సూపర్బ్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోను రాగుల సంపత్ ట్విటర్లో షేర్ చేశారు. దీన్ని తెలంగాణా ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ ఆయనకు సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనికి ఫిదా అయిన కేటీర్ చాలా గ్రేట్ స్కిల్ అంటూ కమెంట్ చేశారు. అతనికి ఎలా చేయూత అందించవచ్చో పరిశీలించాల్సిందిగా సంబంధింత అధికారులకు ట్విటర్ ద్వారా సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లును విపరీతంగా ఆకట్టుకుంటోంది. (దుబాయ్‌లో మరో అద్భుతం: ఈ వీడియో చూస్తే మతిపోవాల్సిందే!) Absolutely great skill Request @TWorksHyd to reach out to see how we could help https://t.co/KQe8zKOrCY — KTR (@KTRBRS) August 16, 2023 -
కేసీఆర్ వరాల జల్లు.. గిరిజనులపై పెట్టిన పోడు కేసుల మాఫీ
సాక్షి, ఆసిఫాబాద్: రాష్ట్రంలో పోడుసాగు విషయంలో గిరిజనులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గతంలో అడవులను ఆక్రమించారని కొందరు గిరిజనులపై కేసులు నమోదయ్యాయని, వాటిని ఎత్తేయాలని నిర్ణయించామని చెప్పారు. ఇందుకోసం అనుసరించాల్సిన ప్రక్రియను చేపట్టాలని సీఎస్, డీజీపీలను ఆదేశించామని వెల్లడించారు. రాష్ట్రంలో 1.51 లక్షల మంది గిరిజనులు, ఆదివాసీలకు 4.06 లక్షల ఎకరాలకుపైగా పట్టాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. గిరిజనేతరుల సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలివ్వడంలో కొంత సమస్య ఉందని, 75 ఏళ్లుగా వారు ఒకేచోట నివాసం ఉంటున్నట్టు రుజువు చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం ఓ ప్రక్రియను తీసుకొచ్చి సమస్యను పరిష్కరించి, ఆలస్యంగానైనా వారికి కూడా పట్టాలు అందజేస్తామన్నారు. కుమురంభీం జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఆసిఫాబాద్‌కు వచ్చిన సీఎం కేసీఆర్.. పట్టణంలో ఏర్పాటు చేసిన కుమురంభీం, మాజీ మంత్రి కోటా్నక భీంరావు విగ్రహాలను.. తర్వాత బీఆర్ఎస్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, సమీకృత కలెక్టరేట్ సముదాయాలను ప్రారంభించారు. అనంతరం ప్రగతి నివేదన సభలో ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గాల గిరిజనులకు పోడు పట్టాలు, రూ.23.56 కోట్ల మేర పోడు భూముల రైతుబంధు చెక్కులను మహిళల పేరిట అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు ‘మా గూడెంలో మా రాజ్యం.. మా తండాల్లో మా రాజ్యం’అని చెప్పేవారు. అనేక దశాబ్దాలు పోరాటం చేసినా సాధ్యం కాలేదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 3 నుంచి 4 వేల గిరిజన గూడేలు, తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశాం. పోరాట యోధుడు కుమురంభీం పేరిట ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు చేసుకున్నాం. ఒకప్పుడు బెజ్జూర్ నుంచి ఆదిలాబాద్ వెళ్లాలంటే చాలా బాధపడేవాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. మీ ముంగిటకే కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు వచ్చేశాయి. పోడు పట్టాల పంపిణీ ప్రక్రియకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు వర్షాకాలం వచ్చిందంటే గిరిజనులు వ్యాధులతో సతమతం అయ్యేవారు. ‘మంచం పట్టిన మన్యం’అంటూ వార్తలు వచ్చేవి. ఇప్పుడా దుస్థితి లేదు. మిషన్ భగీరథ నీళ్లు వచ్చాయి. వైద్య వ్యవస్థను బాగు చేసుకున్నాం. ఇప్పుడు మారుమూల ఆసిఫాబాద్‌కు కూడా వైద్యకళాశాలను సాధించుకున్నాం. ఆసిఫాబాద్ జిల్లాకు వరాలు.. వార్ధా నదిపై వంతెన కావాలని స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అడిగారు. ఆ బ్యారేజీ కోసం రూ.75 కోట్లు ఇప్పుడే మంజూరు చేస్తున్నా. అలాగే టెక్నికల్ కాలేజీ కావాలన్నారు. ఐటీఐని మంజూరు చేస్తున్నా. బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి మినీ ట్యాంక్‌బండ్‌గా నాగమ్మ చెరువును అభివృద్ధి చేస్తాం. ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు చొప్పున, జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున సీఎం ప్రత్యేక నిధి నుంచి మంజూరు చేస్తున్నాం. మంచిర్యాల జిల్లాలోని 7 మున్సిపాలిటీలు, 311 గ్రామ పంచాయతీలకు కూడా నిధులు మంజూరు చేస్తున్నా. ధరణి తీసేస్తే దోపిడీయే.. ఇవాళ గుంట నక్కలు అవాకులు చవాకులు పేలుతున్నాయి. రైతుల కోసమే ధరణి తెచ్చాం. కానీ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ధరణి తీసేస్తే మళ్లీ పైరవీకారుల, దోపిడీదారుల రాజ్యం వస్తుంది. పోడు భూములకు ఉచితంగా కరెంటు, బోర్లు రాష్ట్రంలో 1.51 లక్షల మంది గిరిజనులు, ఆదివాసీలకు 4.06 లక్షల ఎకరాలకుపైగా పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నాం. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కోరినట్లుగా ఆదివాసీ, గిరిజన బిడ్డల పొలాలకు ఉచితంగా త్రీఫేజ్ కరెంట్‌ను రెండు మూడు నెలల్లో ఇప్పిస్తాం. పట్టాలు పొందిన రైతులకు గిరివికాస్ కింద ఉచితంగా బోర్లు వేయిస్తాం..’’అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు కావాలని పొరుగున ఉన్న మహారాష్ట్ర రైతులు కోరుతున్నారని.. లేదంటే తెలంగాణలో కలిపేయాలని అక్కడి గ్రామాల సర్పంచులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాగా.. కేసీఆర్ ఆసిఫాబాద్‌లో కార్యక్రమం అనంతరం సాయంత్రం 5.15 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరారు. మధ్యలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గోదావరి వంతెన వద్ద ఆగారు. గోదారమ్మకు నమస్కరించి, నదిలో నాణేలు వేసి తిరిగి బయలుదేరి ఎర్రవల్లికి చేరుకున్నారు. -
మాటకు మాట..
-
రంజాన్ కి ముస్తాబవుతున్న పాతబస్తి మీర్ ఆలం ఈద్గా
-
కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోస్టుమెన్ నిర్వాకం..
-
వింతగా ప్రవర్తిస్తున్న కల్తీ కల్లు బాధితులు
-
టీ కాంగ్రెస్‌లో నోరు జారుతున్న నాయకులు..!
తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్ నాయకులు చాలా కష్టపడుతున్నారు. పాదయాత్రలు చేస్తున్నారు. ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నారు. కాని కొందరు నేతలు చేస్తున్న ప్రకటనలతో పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందనే ఆవేదన వ్యక్తం అవుతోంది. ఎంత శ్రమిస్తున్నా వారి మాటలతో తమ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతోందని వాపోతున్నారు. నోరు జారుతున్న ఆ నాయకులు ఎవరు? గడచిన 9 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పోరాడుతూనే ఉంది. మూడోసారి కూడా ఓడిపోతే...ఇక పార్టీ పరిస్థితి మరింత జారుతుందని గ్రహించిన టీ.కాంగ్రెస్ నేతలు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీవ్రంగా శ్రమిస్తున్నారు. రకరకాల కార్యక్రమాలతో సీనియర్లంతా రోడ్ల మీద జనంతోనే ఉంటున్నారు. పాదయాత్రలు చేస్తున్నారు. ప్రజలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అయితే కొందరు సీనియర్లు చేస్తున్న వ్యాఖ్యలు మొత్తంగా పార్టీకి నష్టం చేసేవిగా ఉంటున్నాయని గాంధీభవన్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై వేసిన అనర్హతను ఖండించేదుకు ప్రెస్ మీట్ పెట్టారు సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి. అయితే ఇదే సమయంలో జాతీయ స్థాయిలో కలసి వచ్చే పార్టీలతో పనిచేస్తాం. ప్రజలు నిర్ణయిస్తే బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందని కామెంట్ చేశారు జానారెడ్డి. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కునేందుకు అన్ని పార్టీలను కలుపుకుపోతాం అని జానారెడ్డి చెప్పదలుచుకున్నారు. కానీ మరోరకంగా అర్థం వచ్చేలా వాఖ్యానించడంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్, టీ కాంగ్రెస్ పొత్తు చర్చ కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం చేస్తుందని భావిస్తుంటే... పొత్తుకు మరింత బలం చేకూర్చేలా జానారెడ్డి చేసిన వాఖ్యలు టీ కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టాయి. మరోవైపు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వాఖ్యలు కూడా పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. తెలంగాణలో కాంగ్రెస్ కు 40 నుంచి 50 స్థానాలు వస్తాయని, సెక్యులర్ పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని కోమటిరెడ్డి వాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొత్తు చిగురిస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ సీనియర్లు చేస్తున్న ఇటువంటి ప్రకటనలను బీజేపీ తనకు అనుకూలంగా మలచుకుంటోంది. ఇక రాష్ట్రంలో వివిధ పార్టీలతో పొత్తుపై చర్చ జరిగేలా కొన్ని రోజులుగా బీఆర్ఎస్ వ్యవహార శైలి ఉంటోంది. రాహుల్ గాంధీపై పార్లమెంట్ లో అనర్హత వేటు విషయంలో సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఖండించారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటోందని సుప్రీం కోర్ట్ లో వేసిన పిటిషన్ లో కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ కూడా ఉంది. ఇలా టీ కాంగ్రెస్ నేతలు అప్పుడప్పుడు చేసే వాఖ్యలు, వారు వ్యవహరిస్తున్న తీరు, బీఆర్ఎస్ విధానాలు రెండు పార్టీల మధ్య పొత్తు గురించి ప్రజల్లో చర్చ జరిగేలా చేస్తున్నాయి... పొత్తు అంశంపై చర్చ జరిగితే అది కాంగ్రెస్ కే నష్టం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ నాయకులు చేసే ప్రకటనలు, వారి వ్యవహార శైలి వల్ల బీజేపీ పెరిగి...అంతిమంగా కాంగ్రెస్‌కే నష్టం కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
Telengana: రాష్ట్రం మొత్తాన్ని ఒకేసారి కవర్ చేసేలా.. బీజేపీ రథయాత్రలు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ‘రథయాత్ర’లకు బీజేపీ సిద్ధమౌతోంది. నిర్ణీతగడువు ప్రకారం వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఈ జనవరి నుంచి వివిధ రూపాల్లో పార్టీ కార్యక్రమాలను ఉధృతం చేయాలని జాతీయ నాయకత్వం నిర్ణయించింది. జనవరి 15 లేదా 16వ తేదీ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున పర్యటనలు చేపట్టనున్నారు. దాదాపు రెండువారాల్లో ఈ పర్యటనలు ముగిశాక, ఫిబ్రవరి మొదటి, రెండోవారంలో రథయాత్రలు చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు పార్టీవర్గాల సమాచారం. రాష్ట్రం మొత్తాన్ని ఒకేసారి కవర్ చేసేలా నాలుగుదిక్కులా నాలుగు రథయాత్రలను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ యాత్రల షెడ్యూల్, రూట్లపై చర్చించి, తుదిరూపునిచ్చేందుకు బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ రాష్ట్రానికి రానున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో బండి సంజయ్ పాదయాత్రలకు కూడా బ్రేక్ పడినట్టు సమాచారం. ఒకరిద్దరికే మైలేజ్ వచ్చేలా కాకుండా.. జనవరిలో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల పరిధిలోని 16 నుంచి 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరోవిడత పాదయాత్ర చేపట్టాలని తొలుత భావించారు. ఈ యాత్ర ఉంటే దానిపైనే మొత్తం పార్టీ యంత్రాంగం, వనరులు వంటివి పూర్తిస్థాయిలో కేంద్రీకరించాల్సి ఉన్నందున, బస్సుయాత్రలతో రాష్ట్రం నలువైపులా చుట్టివస్తే మంచిదనే అభిప్రాయంతో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకరిద్దరు ముఖ్యనేతలకే మైలేజ్ వచ్చేట్లు కాకుండా సమిష్టిగా నేతలకు ప్రాధాన్యత లభించేలా కార్యక్రమాలకు తుది రూపు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. 7న అసెంబ్లీ సదస్సులు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని సంస్థాగతంగా పూరిస్థాయిలో బలోపేతం చేయ డం, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో ప్రభారీ, విస్తారక్ల చొప్పున నియామకం, అన్ని పోలింగ్‌బూత్ కమిటీల నియామకం పూర్తి, మండల, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు వంటి వాటిని వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర పార్టీని జాతీయ నాయకత్వం ఆదేశించినట్టు సమాచారం. వచ్చేనెల మొదటివారం కల్లా మండలాల వారిగా బూత్ కమిటీల నియామకం పూర్తి చేసి, 7న 119 నియోజకవర్గాల్లో బూత్ కమిటీలు పాల్గొనేలా అసెంబ్లీ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సదస్సులనుద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. నేడు నగరానికి బీఎల్ సంతోష్.. ఈ నెల 28, 29 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ నియోజకవర్గాల పూర్తి సమయ కార్యకర్తల సమావేశం హైదరాబాద్‌లో జరగనుంది. మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని ఓ రిసార్ట్‌లో నిర్వహిస్తున్న ఈ శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్, కార్యదర్శి (సంస్థాగత) శివప్రకాష్, రాష్ట్ర సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్ మంగళవారం రాత్రి నగరానికి చేరుకుంటారు. శిక్షణా శిబిరం ముగిశాక 29న సాయంత్రం తెలంగాణ అసెంబ్లీ కోర్ కమిటీలతో సంతోష్, బన్సల్ సమావేశం కానున్నారు. ఒక్కో సెగ్మెంట్‌కు ఐదుగురు పాలక్‌లు ఒక్కో నియోజకవర్గానికి ఐదుగురేసి చొప్పున ముఖ్యనేతలను బీజేపీ నియమించనుంది. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జాతీయ కార్యవర్గసభ్యులు, ఇతర ముఖ్య నేతలను పాలక్‌లుగా నియమిస్తారు. ఇక ఒక్కో నియోజకవర్గానికి ఒక స్థానికేతర ఇన్చార్జి (ప్రభారీ)ని కూడా నియమిస్తారు. -
దేశ ఆరోగ్య వ్యయంలో సగం భారం ప్రజలదే
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యారోగ్య రంగంలో ఎన్ని పథకాలు తీసుకువస్తున్నా.. వైద్య సదుపాయాలు పెంచుతున్నట్టు చెప్తున్నా.. ప్రజలపై భారం మాత్రం తగ్గడం లేదు. దేశంలో ఆరోగ్యంపై జరుగుతున్న మొత్తం వ్యయంలో సగం ఖర్చును ప్రజలే సొంతంగా భరించాల్సిన పరిస్థితి ఉంది. ఇది పేద, మధ్య తరగతి వర్గాలపై మోయలేని భారంగా మారుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా పరిస్థితుల్లో ఆరోగ్యం కోసం ఖర్చు గణనీయంగా పెరిగినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చు అవసరమైన మేర పెరగడం లేదని, ప్రజలపైనే భారం పడుతోందని స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదికలోనే.. దేశంలో రాష్ట్రాల వారీగా ఆరోగ్యంపై ప్రభుత్వాలు, ప్రజలు చేస్తున్న ఖర్చుపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. 2018–19 నాటి అంచనాల ప్రకారం తయారు చేసిన ఈ నివేదికపై ఇటీవల పార్లమెంటులోనూ చర్చ జరిగింది. దాని ప్రకారం దేశంలో ఆరోగ్యంపై మొత్తంగా రూ.5,96,440 కోట్లు వ్యయం అవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి భరిస్తున్నది రూ.2,42,219 కోట్లే. అంటే సుమారు 41 శాతం మాత్రమే. అదే ప్రజలు సొంతంగా చేసిన ఖర్చులు రూ.2,87,573 కోట్లు (సుమారు 48శాతం) కావడం గమనార్హం. ఇక ప్రైవేటు ఆరోగ్య బీమా ద్వారా అందుతున్నది రూ.39,201 కోట్లు (6.57 శాతం), మిగతా సొమ్ము వివిధ స్వచ్చంద సంస్థలు, ఇతర మార్గాల ద్వారా ఆరోగ్య ఖర్చుల కోసం అందుతోంది. ప్రభుత్వాల వ్యయం పెరుగుతున్నా.. ఆరోగ్యం కోసం ప్రజలు చేస్తున్న సొంత ఖర్చు తగ్గుతోందని.. ప్రభుత్వాల వ్యయం పెరుగుతోందని కేంద్ర నివేదికలోని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2015–16లో ప్రభుత్వాల ఖర్చు సుమారు 30 శాతం వరకే ఉండగా ఇప్పుడు 41 శాతానికి చేరింది. ప్రజలు సొంతంగా చేస్తున్న ఖర్చు 62 శాతం నుంచి 48 శాతానికి తగ్గింది. ఆరోగ్య వ్యయంలో ప్రభుత్వాల వాటా గణనీయంగా పెరగడం మంచి పరిణామమే అయినా.. సగం కూడా లేకపోవడం, మిగతా భారం ప్రజలపై పడటం సరికాదని నిపుణులు చెప్తున్నారు. మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రజల ఖర్చు 10 శాతం వరకే ఉండాలని, ప్రభుత్వాలే వ్యయం పెంచాలని స్పష్టం చేస్తున్నారు. యూపీలో ఎక్కువ ఖర్చు దేశంలో ఆరోగ్యానికి అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో రూ.78,297 కోట్లు ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నారు. మహారాష్ట్రలో రూ.66,703 కోట్లు, పశ్చిమబెంగాల్లో రూ.45,277 కోట్లు, కేరళ రూ.34,548 కోట్లు, తమిళనాడులో రూ.32,767 కోట్లు, కర్ణాటకలో రూ.32,198 కోట్లు, రాజస్థాన్‌లో రూ.29,905 కోట్లు, గుజరాత్లో రూ.26,812 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.25,828 కోట్లు, మధ్యప్రదేశ్‌లో రూ.20,725 కోట్లు ఖర్చు చేశారు. ప్రభుత్వాలే భరించే ఖర్చు ప్రకారం చూస్తే.. ఉత్తరాఖండ్ 61 శాతంతో టాప్‌లో నిలిచింది. నివేదికలో ముఖ్యాంశాలివీ.. ► దేశంలో 2018–19 సంవత్సరానికి మొత్తం ఆరోగ్య వ్యయం రూ.5,96,440 కోట్లు (ఇది జీడీపీలో 3.16 శాతం.. తలసరి ఖర్చు రూ.4,470). ► మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు రూ.2,42,219 కోట్లు (తలసరి రూ.1,815)కాగా.. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 34.3 శాతం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 65.7 శాతంగా ఉంది. ►కేంద్రం జాతీయ ఆరోగ్య మిషన్‌పై చేస్తున్న వ్యయం రూ.30,578 కోట్లు, డిఫెన్స్ మెడికల్ సర్వీసెస్ కింద రూ.12,852 కోట్లు, రైల్వే హెల్త్ సర్వీసెస్ రూ.4,606 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) రూ.4,060 కోట్లు, ఎక్స్ సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్‌కు రూ.3,226 కోట్లు, అన్ని ప్రభుత్వ ఆర్థిక ఆరోగ్య బీమా పథకాల ద్వారా ఖర్చులు కలిపి రూ.12,680 కోట్లు. ► ఆరోగ్యంపై ప్రజలు సొంతంగా చేసిన ఖర్చులు రూ.2,87,573 కోట్లు (మొత్తం ఆరోగ్య వ్యయంలో 48.21 శాతం.. తలసరిన చూస్తే రూ.2,155), ప్రైవేటు ఆరోగ్య బీమా ద్వారా అందుతున్నది రూ.39,201 కోట్లు (6.57 శాతం). ►మొత్తంగా ఆరోగ్యానికి అయ్యే ఖర్చులో రూ.93,689 కోట్లు ప్రభుత్వ ఆస్పత్రులకు, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1,55,013 కోట్లు (28.69%). ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, డిస్పెన్సరీలు, కుటుంబ నియంత్రణ కేంద్రాలకు కలిపి చేసే ఖర్చు రూ.41,875 కోట్లు, ఇతర ప్రైవేట్ ప్రొవైడర్లకు (ప్రైవేట్ క్లినిక్‌లతో సహా) రూ.23,610 కోట్లు, పేషెంట్ ట్రాన్స్పోర్ట్, ఎమర్జెన్సీ రెస్క్యూ ప్రొవైడర్లకు రూ.18,909 కోట్లు, మెడికల్ అండ్ డయాగ్నస్టిక్ లేబొరేటరీలకు రూ.21,162 కోట్లు, ఫార్మసీలకు రూ.1,22,077 కోట్లు, ఇతర రిటైలర్లకు రూ.643 కోట్లు, ప్రివెంటివ్ కేర్ ప్రొవైడర్లకు రూ.28,841 కోట్లు, హెల్త్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్సింగ్ ప్రొవైడర్లు, ఇతర ఆరోగ్య సంరక్షణలకు దాదాపు రూ. 21,612 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరిన్ని నిధులు ఇతర అవసరాలకు ఖర్చవుతున్నాయి. ► తెలంగాణలో జీఎస్డీపీలో మొత్తం ఆరోగ్య ఖర్చు 1.8 శాతంగా ఉంది. ఇందులో ప్రభుత్వ ఖర్చు 0.7 శాతం, ప్రజలు సొంతంగా చేస్తున్న ఖర్చు 0.9 శాతం, ఆరోగ్య బీమా, ఇతర వ్యవస్థల ద్వారా 0.2శాతం ఖర్చు జరుగుతోంది. దేశంలో ఆరోగ్యంపై వ్యయం తీరు ఇలా.. (రూ.కోట్లలో) అంశం 2015–16 2016–17 2017–18 2018–19 ప్రభుత్వ ఖర్చు 1,61,863 1,88,010 2,31,104 2,42,219 ప్రజల సొంత ఖర్చు 3,20,211 3,40,196 2,76,532 2,87,573 ప్రైవేట్ బీమా కంపెనీలు 22,013 27,339 33,048 39,201 క్యూబాలో జనం సొంత ఖర్చు 8 శాతమే.. ప్రపంచంలో ఆరోగ్యంపై చేస్తున్న ఖర్చులో ప్రజలు సొంతంగా చేస్తున్నది 36 శాతమే. మన దేశంలో అది 48 శాతంగా ఉంది. అదే క్యూబా వంటి దేశంలో కేవలం 8 శాతమే. మన దేశంలో ప్రజల ఖర్చు తగ్గుతూ వస్తున్నట్టు కేంద్ర గణాంకాలు చెప్తున్నా.. ప్రభుత్వాలు భరించే మొత్తం గణనీయంగా పెరగాల్సి ఉంది. బడ్జెట్లో ఆరోగ్యానికి కేటాయింపులు పెంచడం వల్ల ప్రజల జేబు ఖర్చు తగ్గుతుంది. ప్రైవేట్ బీమా కంపెనీలు ఆరోగ్య రంగంలో భాగస్వామ్యం కావడం, ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్, ఇతర ఆరోగ్య పథకాలతో ప్రయోజనం ఉంటోంది. డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ జేబు ఖర్చు 10శాతం లోపే ఉండాలి ఆరోగ్య వ్యయంపై ప్రభుత్వ లెక్కలు సరిగా లేవని అనిపిస్తోంది. మాకున్న అంచనా ప్రకారం 80శాతం ఆరోగ్య ఖర్చును ప్రజలే భరిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వ లెక్కలనే పరిగణనలోకి తీసుకున్నా.. అది ప్రజలపై పెను భారమే. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆరోగ్యంపై ప్రజలు చేస్తున్న ఖర్చు కేవలం 10 శాతమే. డెన్మార్క్, చెకోస్లావేకియా, చైనా, వియత్నాం, ఉత్తర కొరియా వంటిచోట్ల ఎక్కువగా ప్రభుత్వాలే ఖర్చు చేస్తున్నాయి. అమెరికా వంటి చోట్ల బీమా పథకాలు ఉన్నాయి. కానీ బీమా కంపెనీలు ఎక్కువ ధరలతో కూడిన మందులు ఇవ్వడానికి, ఖర్చుకు ముందుకు రావు. అమెరికాలో వస్తున్న సమస్య ఇదే. అందువల్ల దేశంలో ప్రభుత్వమే ఖర్చు పెంచాలి. – డాక్టర్ యలమంచి రవీంద్రనాథ్, ప్రముఖ వైద్యుడు, ఖమ్మం -
అసైన్డ్ భూములపై తర్జనభర్జన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అసైన్డ్ భూములపై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది. ఈ భూములకు సంబంధించి నిరుపేదలకు హక్కులు కల్పించే విషయమై సమాలోచనలు చేస్తోంది. ఈ భూములపై లబ్ధిదారులకు హక్కులు కల్పించడానికి ఉన్న అవకాశాలేంటి? కల్పిస్తే జరిగే పరిణామాలేంటి? హక్కులు ఇవ్వడం ద్వారా పేదల నుంచి భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం తీసుకోగలిగిన చర్యలేమైనా ఉన్నాయా? లబ్ధిదారుల నుంచి ఇప్పటికే ఇతరుల చేతుల్లోకి వెళ్లిన భూములను ఏం చేయాలి? వీలున్నచోట్ల అసైన్డ్ భూములను ప్రభుత్వమే కొనుగోలు చేసే అవకాశముందా? అనే అంశాలపై ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే, ఏది చేయాలన్నా తెలంగాణ అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధచట్టం–1977 (పీవోటీ యాక్ట్)కు కచ్చితంగా సవరణ చేయాల్సి ఉన్నందున డిసెంబర్లో నిర్వహించే శీతాకాల లేదంటే బడ్జెట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు పెట్టే అవకాశముందని తెలుస్తోంది. ఆర్థిక భరోసా వచ్చేనా..? వాస్తవానికి, గత కొన్నేళ్లుగా రాష్ట్రంలోని వ్యవసాయ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వవర్గాల కథనం ప్రకారం ఏ మారుమూల ప్రాంతంలోనైనా ఎకరం భూమి 15–20 లక్షలు పలుకుతోంది. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఎకరా కోట్లు పలుకుతుంటే రాజధాని శివార్లలో పదుల కోట్లు దాటుతోంది. ఈ నేపథ్యంలో ఆ భూములను అనుభవించే వీలులేకుండా కేవలం సాగు హక్కులు కల్పించడంవల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, వ్యవసాయాన్నే నమ్ముకుని బతుకుతున్న పేదలు వారి అవసరాలకు వాటిని ఇతరులకు అమ్ముకోగలిగితే కొంత ఆర్థిక భరోసా వస్తుందనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా పలుమార్లు రాష్ట్రంలోని అసైన్డ్ భూముల పరిస్థితిపై ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుంది. అసైన్డ్ భూములు అసైనీల చేతుల్లోనే ఉన్నాయా? అన్యాక్రాంతమైన భూములెన్ని? అసైనీల దగ్గరి నుంచి కొనుగోలు చేసిన వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులేంటి? అన్నదానిపై రెవెన్యూ వర్గాలు ప్రభుత్వానికి వివరాలు పంపాయి. ఈ వివరాల ప్రకారం దాదాపు 40 శాతం భూములు అసైనీల చేతుల్లో లేవని సమాచారం. ఈ నేపథ్యంలో అన్యాక్రాంతమైన భూములను ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. 1/70 చట్టం తరహాలో... రాజధాని శివార్లలోని అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వడం(కొనుగోలు చేయడం) ద్వారా ఆ భూములను సొంతం చేసుకుని వాటిని వేలం వేయాలనే ప్రతిపాదన గతంలోనే ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ మేరకు శంషాబాద్సహా కొన్ని మండలాల్లోని అసైన్డ్ భూముల కొనుగోలు, అమ్మకాలపై ప్రభుత్వం వద్ద నివేదిక కూడా ఉంది. దీనికితోడు అసైన్డ్ భూములను ప్రభుత్వమే కొనుగోలు చేసే వెసులుబాటు కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వపరిధిలోని 1/70 చట్టం ప్రకారం(అటవీ చట్టం) గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూములుంటే వాటిని కేవలం గిరిజనులకు మాత్రమే అమ్మాలి. కొనేందుకు గిరిజనులెవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేయవచ్చు. ఈ వెసులుబాటు ఆధారంగానే రాష్ట్రంలోని అసైన్డ్ భూములను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. అయితే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని భూములను కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై న్యాయనిపుణుల సలహాలు కూడా తీసుకున్నట్టు సమాచారం. మొత్తం మీద అసైన్డ్ భూములకు హక్కులు కల్పించే విషయంలో అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్న ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తుందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. అన్నీ క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాతే... గత కొన్నేళ్ల పరిణామాలను చూస్తే దేశవ్యాప్తంగా భూముల అమ్మకాలు, కొనుగోళ్ల మీద ఆంక్షలన్నింటినీ సడలించుకుంటూ వస్తున్నాం. 2004లో ప్రపంచ బ్యాంకు తయారు చేసిన నివేదిక కూడా ఆంక్షలను తొలగించాలని, భూక్రయ, విక్రయ లావాదేవీలు సులభతరం చేయాలని ప్రతిపాదించింది. ‘ల్యాండ్ పాలసీస్ ఫర్ గ్రోత్ అండ్ పావర్టీ రిడక్షన్’ పేరిట భారతదేశం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన నివేదిక ఇది. ఆర్థిక సరళీకరణ సూత్రం మార్కెట్లో భూలావాదేవీలు సులభతరంగా ఉండాలని చెబుతోంది. మనం వద్దనుకున్నా, కావాలనుకున్నా ఆంక్షలు ఎత్తివేయడమే మన ముందున్న మార్గం. అయితే, ఆంక్షలు ఎత్తివేసే సమయంలో ఎవరి రక్షణ కోసం చట్టాలు చేశామో వారు నష్టపోకుండా చూసుకోవాలి. ఈ పరిస్థితుల్లో పేదల భూములపై కొంతమేరకు ఆంక్షల సడలింపు అవసరం. అసైన్డ్ భూములను ప్రభుత్వం కొనుగోలు చేసే అంశం లేదా ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు కొనుగోలు చేయాలన్న కోనేరు రంగారావు నివేదికను పరిశీలించాలి. లేదంటే కొంత కాలపరిమితికి అమ్ముకునే అవకాశమివ్వాలి. అలా అమ్ముకునే సమయంలో కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే ఆ భూమిపై హక్కులు బదలాయించాలి. –భూమి సునీల్, భూచట్టాల నిపుణుడు, నల్సార్ విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్ స్ఫూర్తికి విఘాతం కలిగితే..! తెలంగాణలో దాదాపు 15 లక్షల మందికిపైగా పేదలకు 24 లక్షల ఎకరాలను అసైన్ చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఈ భూములపై సదరు పేదలకు హక్కు ఉండదు. కేవలం సాగు మాత్రమే చేసుకోవాలి. ఇతరులకు అమ్మడం ద్వారా అసైనీలు వారి హక్కులను బదలాయించే వెసులుబాటు లేదు. పొరుగునే ఉన్న కర్ణాటకలో అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత అమ్ముకునే అవకాశముంది. మనరాష్ట్రంలో ఆ హక్కులు కల్పిస్తే బడుగుల చేతుల్లో ఉన్న ఆ కొద్ది భూమి ధనవంతులు, భూస్వాముల చేతుల్లోకి వెళ్లిపోతుందని, తద్వారా అసైన్డ్ స్ఫూర్తికే విఘాతం కలుగుతుందని, రాష్ట్రంలో భూముల్లేని పేదలసంఖ్య పెరిగిపోతుందనే వాదన ఉంది. ఈ వాదనను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని తెలుస్తోంది. -
ఆదిలోనే అడ్డంకులు!.. వాయిదా పడ్డ గ్రూప్-4 ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–4 కొలువుల భర్తీ ప్రక్రియకు ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. ఈ కొలువులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆకస్మికంగా వాయిదా పడగా.. పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను సైతం విడుదల చేయకపోవడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 25 విభాగాల్లో గ్రూప్–4 కేటగిరీలోని 9,168 ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఈనెల 1న వెబ్ నోట్ (ప్రాథమిక ప్రకటన)ను విడుదల చేసింది. ఈ క్రమంలో డిసెంబర్ 23వ తేదీన వెబ్సైట్లో పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించిన కమిషన్.. 23వ తేదీ నుంచి 2023–జనవరి 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఆ వెబ్‌నోట్‌లో వెల్లడించింది. దీంతో అభ్యర్థులంతా దరఖాస్తుల భర్తీ, శిక్షణకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఆకస్మికంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మరోవైపు జిల్లాల వారీగా ఉద్యోగ ఖాళీలు, రిజర్వేషన్లు, విద్యార్హతలు, రోస్టర్ ఆధారిత సమాచారంతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను విడుదల చేయకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. సాంకేతిక కారణాలంటూ.. సాంకేతిక కారణాల వల్ల గ్రూప్–4 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ తేదీలను మార్పు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ శుక్రవారం ఒక వెబ్‌నోట్‌ను విడుదల చేసింది. ఈనెల 30వ తేదీ నుంచి 2023 జనవరి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. ఈ ఉద్యోగాలకు అవసరమైన అర్హత సమాచారాన్ని వెబ్సైట్లో చూసి నిర్దేశించిన ప్రొఫార్మా ఆధారంగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో పూర్తిస్థాయి నోటిఫికేషన్‌పై స్పష్టత ఇవ్వనప్పటికీ, నిర్దేశించిన తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించింది. కాగా, గ్రూప్–4 ఉద్యోగాలకు సంబంధించి ప్రాథమిక ప్రకటనలో కేవలం శాఖల వారీగా ఉద్యోగ ఖాళీల సంఖ్య మాత్రమే ఉంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్లో జిల్లాల వారీగా ఖాళీలు, ఎవరెవరు అర్హులు, రిజర్వేషన్ల వారీగా పోస్టులు.. తదితర పూర్తిస్థాయి సమాచారం ఉంటుంది. అయితే పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కాకపోవడం.. సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ వాయిదా వేయడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. తదుపరి ఏమవుతుందో..? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత అత్యధిక పోస్టులతో గ్రూప్–4 ఉద్యోగాల భర్తీ ప్రకటించడం ఇదే మొదటిసారి. మరోవైపు అన్ని ప్రభుత్వ శాఖల్లో దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీ చేపడుతుండగా.. ఈ ఖాళీల్లో గ్రూప్–4 కొలువుల సంఖ్య 12 శాతం ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్న వేళ నిరుద్యోగులు అత్యంత ఉత్సాహంతో సన్నద్ధమవుతుండగా టీఎస్పీఎస్సీ ఇలా అర్ధంతరంగా దరఖాస్తుల స్వీకరణను వాయిదా వేయడం, పూర్తిస్థాయి ప్రకటన విడుదల చేయకపోవడంతో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు శాఖల వారీగా సరైన సమాచారం అందకుండానే ఉద్యోగాల భర్తీకి ప్రాథమిక ప్రకటన విడుదల చేశారనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. -
KTR: అభివృద్ధంటే కురుకురే పంచడం కాదు.. ఆ హక్కు కిషన్ రెడ్డికి లేదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేదని చరిత్రలో ఎన్నడూ లేనంతగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. నగర అభివృద్ధిపై కిషన్‌రెడ్డి కళ్లుండీ చూడలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. నగరం నలుమూలలా అద్భుతంగా విస్తరిస్తూ అభివృద్ధి సాధిస్తుంటే చూసి ఓర్వలేక, అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ నగరానికి ఒక్కపైసా అదనంగా తేలేని కేంద్రమంత్రి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విస్తృతమైన అభివృద్ధిలో కేంద్రం వాటా ఎంతో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ప్యాసింజర్ లిఫ్ట్‌లను ప్రారంభించడం, కురుకురే ప్యాకెట్లను పంచడమే అభివృద్ధి అనుకుంటున్న కిషన్‌రెడ్డి పనికిమాలిన మాటలు బంద్ చేసి హైదరాబాద్‌కు నిధులను తీసుకురావాలని సూచించారు. సొంత నియోజకవర్గంలో ఏం చేశావ్ కిషన్..? వరదలతో అతలాకుతలం అయిన హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి నయాపైసా నిధులు తీసుకురాలేని నిస్సహాయ మంత్రిగా కిషన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధులు, సంస్థలను గుజరాత్‌కు తరలించుకుపోయిన ప్రధానమంత్రిని ఇదేందని అడగలేని కిషన్ ..తెలంగాణ సొమ్ము తింటూ నరేంద్రమోదీ పాట పాడుతున్నారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం సికింద్రాబాద్‌లో కేంద్రప్రభుత్వ నిధులతో ఏం అభివృద్ధి చేసిండో చెప్పాలని నిలదీశారు. సొంత నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులు మూడేళ్ల నుంచి నిదానంగా కొనసాగుతూనే ఉన్నా రోడ్ల మీద ఏర్పడ్డ గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నా ఏ మాత్రం చలించని కిషన్‌రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం అజ్ఞానం, అవగాహనా రాహిత్యం తప్ప మరొకటి కాదని మంత్రి కేటీఆర్ గురువారం ఇక్కడ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
సాలార్ జంగ్ మ్యూజియం అరుదైన ఆఫర్స్ : అందరికీ ప్రవేశం ఉచితం
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రముఖ మ్యూజియం సాలార్ జంగ్ మ్యూజియం సందర్శకులకు ఒక బంపర్ ఆఫర్. అంతర్జాతీయ మ్యూజియం డే ని పురస్కరించుకుని కేంద్రం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 6 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పిల్లా పెద్దా అంతా ఉచితంగా మ్యూజియాన్ని సందర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది. అంతేకాదు ప్రత్యేక వర్క్‌షాప్‌లు, పెయింటింగ్స్ ఎగ్జిబిషన్, ఫోటోగ్రఫీ పోటీలను కూడా ఏర్పాటు చేసింది. మే 16వ తేదీ నుంచి 21 తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల వివరాలను నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు. ‘ఇంటర్నేషనల్ మ్యూజియం డే’ 1977 నుండి ప్రతి సంవత్సరం మే 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మ్యూజియం డేని నిర్వహిస్తున్నారు. సమాజ అభివృద్ధిలో మ్యూజియంలు ఎంత ముఖ్యమైనవో అవగాహన కల్పించే లక్ష్యంతో అంతర్జాతీయ మ్యూజియమ్స్ కౌన్సిల్ (ఐకామ్) ఈ పిలుపు నిచ్చింది. 2022లో ‘పవర్ ఆఫ్ మ్యూజియమ్స్’ అనే థీమ్‌తో ఈ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాల్లో పాల్గొంటాయి. గత సంవత్సరం, సుమారు 158 దేశాల్లో 37వేలకు పైగా మ్యూజియంలు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నాయి. 75 వసంతాల ఆజాదీ కా అమృత మహోత్సవ్‌లో భాగంగా అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలో కేంద్రం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ డా.నాగేందర్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని సాలార్ జంగ్ మ్యూజియంలో కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ ఉంటాయని తెలిపారు. అలాగే రాత్రి 9 గంటల వరకు ప్రజల సందర్శనార్థం మ్యూజియంను తెరిచి ఉంచుతామని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించు కోవాలని తెలిపారు. భవిష్యత్తులో కూడా రాత్రి తొమ్మిదిగంటల వరకు మ్యూజియం సందర్శన అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు సెల్ఫీలు లేదా ఫోటోలు తీసుకునేందుకు వీలుగా సెల్పీ, ఫోటో పాయింట్లను ఈ సందర్భంగా లాంచ్ చేయనున్నామని చెప్పారు. మ్యూజియాన్ని సందర్శించేలా దివ్యాంగులు, అనాథ విద్యార్థులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని ఆయన వెల్లడించారు. ఉత్సవాల చివరి రోజైన 21వ తేదీన వివిధ విదేశీ కార్యాలయాల ప్రతినిధులు కూడా మ్యూజియాన్ని సందర్శిస్తారని నాగేందర్ చెప్పారు. అలాగే చక్కటి పెయింటింగ్స్‌తో ఒక ఎగ్జిబిషన్ కూడా ఉంటుందని హైదరాబాద్ ఆర్ట్ అసోసియేషన్ సెక్రటరీ రమణారెడ్డి వెల్లడించారు. ఈ సెలబ్రేషన్స్‌లో విజేతలకు క్యాష్ అవార్డులను ఇస్తున్నట్టు తెలిపారు. ఆరు రోజుల ఉత్సవాల్లో భాగంగా 18వ తేదీ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ కూడా ఉంటుంది. మ్యూజియం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న పోటీదారులు ఒక్కొక్కరు 25 దాకా ఎంట్రీలను పంపవచ్చన్నారు. భాగ్య నగర్ ఫోటో ఆర్ట్ క్లబ్ సౌజన్యంతో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తామని సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ సెక్రటరీ కే జనార్థన్ తెలిపారు. వీటితో పాటు ఇంటాక్ కన్వీనర్ అనురాధారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు ప్రత్యేకమైన బిద్రి ఆర్ట్‌పై ప్రసంగిస్తారని నిర్వాహకులు తెలిపారు. అలాగే ప్రివెంటివ్ కన్జర్వేషన్ మీద ఒక వెబ్‌నార్ నిర్వహిస్తామని కూడా వెల్లడించారు. కాగా హైదరాబాద్‌లోని సాలార్ జంగ్ మ్యూజియం భారతదేశంలో మూడో అతిపెద్దది. ఈ మ్యూజియం ప్రపంచంలోని విభిన్న యూరోపియన్, ఆసియా, దూర ప్రాచ్య దేశాలకు కెందిన కళాత్మక వస్తువుల భాండాగారం. ప్రపంచం నలుమూలల నుండి సేకరించిన విలువైన వస్తువులు, అరుదైన కలాఖండాలు ఇక్కడ కొలువు దీరాయి. ముఖ్యంగా ఈ మ్యూజియంలో గంటల గడియారం ఒక పెద్ద ఆకర్షణ. ఇంకా మేలిముసుగు రెబెక్కా, స్త్రీ-పురుష శిల్పం, ప్రధానంగా చెప్పు కోవచ్చు. ఇంకా అలనాటి అపురూప కళాఖండాలు, ఏనుగు దంతాల కళాకృతులు, పాలరాతి శిల్పాలు, బొమ్మలు, వస్త్రాలు, చేతివ్రాతలు, సెరామిక్స్, లోహ కళాఖండాలు, తివాచీలు, గడియారాలు, చెస్ బోర్డులు ఇలా చాలానే ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ అవకాశాన్ని వినియోగించుకుని సాలార్ జంగ్ మ్యూజియంలోని విశేషాలను కనులారా వీక్షించండి. -
పల్లెల్లో షీటీమ్స్!
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత, రక్షణ కోసం ఆరేళ్ల కిందట హైదరాబాద్ నగరంలో ప్రారంభించిన ‘షీ టీమ్స్’ అద్భుత ఫలితాలు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మరికొన్ని పట్టణాలకూ ‘షీ టీమ్స్’ సేవలు విస్తరించాయి. ఇప్పుడు ఇదే కోవలో పల్లెల్లోని మహిళల కోసమూ ప్రత్యేక కమిటీలు ఏర్పాటుకానున్నాయి. గ్రామ, జిల్లా స్థాయిలో సామాజిక కార్యాచరణ కమిటీ(సోషల్ యాక్షన్ టీమ్)లు ఏర్పడనున్నాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో అంతర్భాగంగా ఉన్న గ్రామీణ దారిద్య్ర నిర్మూలన సొసైటీ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) ఆధ్వర్యంలో ఇవి ఏర్పడనున్నాయి. జిల్లా స్థాయి కమిటీలో కలెక్టర్, ఎస్పీ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి (డీఆర్డీఓ)కీ చోటు కల్పిస్తారు. గ్రామ, మండల మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయి కమిటీలు పరిష్కరించనున్నాయి. శిక్షణ అనంతరం క్షేత్రస్థాయి కార్యాచరణలోకి... రాష్ట్రంలోని ప్రతీ మండలంలో ముగ్గురు స్వయంశక్తి మహిళా సంఘాల సభ్యులతో సహా ఎమ్మార్వో, సబ్–ఇన్స్పెక్టర్, ఇందిరా క్రాంతి పథం ఏపీఎం, అంగన్వాడీ సూపర్వైజర్లు సభ్యులుగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో స్త్రీల సమస్యల పరిశీలన, తమ దృష్టికొచ్చే సమస్యల పూర్వాపరాలు తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలను ఈ కమిటీలు తీసుకుంటాయి. ఇప్పటికే వివిధ జిల్లాల పరిధిలో పలుచోట్ల సామాజిక కమిటీలు ఏర్పడగా, విడతల వారీ పూర్తి స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు చేపట్టాక క్షేత్రస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తాయి. ఈ కమిటీల సభ్యులకు న్యాయ, చట్ట, భద్రతా, రెవెన్యూ, ఇతరత్రా అంశాలపై ఆయా రంగాల నిపుణులతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా రెండు, మూడు దశలుగా శిక్షణ కార్యక్రమాలు పూర్తికాగా వేలాది సభ్యులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించినట్లు అధికారులు తెలిపారు. గతంలో ఏర్పాటుచేసిన జెండర్ కమిటీల్లో ఉన్నవారితోపాటు, గ్రామ, మండల సమాఖ్య పాల క మండళ్ల సభ్యులనూ ఈ కమిటీల్లోనూ నియమిస్తున్నారు. అలాగే కార్యాచరణ కమిటీకి గ్రామ స్థాయిలో ముగ్గురిని అనుబంధ సభ్యులుగా నియమిస్తారు. మహిళల సమస్యలను తక్షణం గుర్తించేందుకు వీరి నియామకం ద్వారా అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి ఆయా అంశాలకు సంబంధించిన బాధ్యతలను ఈ సోషల్ యాక్షన్ టీంలు నిర్వహించనున్నాయి. ఏయే బాధ్యతలు అప్పగించనున్నారంటే.. గ్రామీణ మహిళల సాధికారత సాధన దిశలో స్త్రీల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించడం. ఆర్థిక, సామాజిక, చట్టపరమైన అంశాల్లో అండగా ఉండడం. బాల్య వివాహాలు, వరకట్న, లైంగిక వేధింపులు, గృహ హింస, మహిళల అక్రమ రవాణా నివారణ, మూఢ నమ్మకాలు అరికట్టడం యుక్త వయసు దశ దాటే వరకు అమ్మాయిలు ఎదుర్కొనే వివిధ సమస్యలు అధిగమించేందుకు ఏం చేయాలనే దానిపై ప్రత్యేక అవగాహన కల్పించడం. కౌమార దశకు వచ్చే బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యపరంగా వచ్చే మార్పులపై అవగాహన కల్పించడం. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండా అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం. అనాథలు, వితంతువుల సమస్యలు అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి అవసరమైన సహాయం అందించడం. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకునే అధికారమూ కమిటీలకే ఇవ్వాలని భావిస్తున్నారు. గ్రామీణ మహిళల రక్షణకు సోషల్ యాక్షన్ టీమ్‌లు -
6,700 యూనిట్లకు క్లియరెన్సులు ఇచ్చాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు 6,700 యూనిట్లకు క్లియరెన్సులు ఇచ్చామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం వెల్లడించారు. వీటి ద్వారా రూ.1,36,000 కోట్ల పెట్టుబడులను ఆకర్శించామని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. పరోక్షంగా మరో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని వివరించారు. ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీల విస్తరణకు తోడ్పాటు అందిస్తున్నట్టు చెప్పారు. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ద్వారా ఖాయిలా పడ్డ యూనిట్లను తెరిచేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నట్టు తెలిపారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) దక్షిణ ప్రాంత మండలి తొలి సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. చిన్న, మధ్యతరహా (ఎస్ఎంఈ) కంపెనీలకు చేయూతనివ్వాల్సిందిగా ఐసీసీ ప్రతినిధులను కోరారు. రానున్న రోజుల్లో ఎస్ఎం ఈలే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించనున్నాయని అన్నారు. మంచి వ్యాపార ఆలోచన ఉండి కూడా మెంటార్షిప్ లేక విఫలమైన కంపెనీలు ఉన్నాయని గుర్తుచేశారు. తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకుంటామని ఐసీసీ దక్షిణ ప్రాంత మండ లి చైర్మన్ రాజీవ్ రెడ్డి తెలిపారు. సమావేశంలో ఐసీసీ ప్రెసిడెంట్ శాశ్వత్ గోయెంకా, చాంబర్ ప్రతినిధులు మయంక్ జలాన్, రాజీవ్ సింగ్ పాల్గొన్నారు. -
పొలిటికల్ కారిడర్ 2nd feb 2018
-
రాష్ట్రానికి డెంగీ సోకింది: భట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ, విషజ్వరాలతో ప్రజ లు పిట్టల్లా రాలిపోతుంటే ప్రభుత్వం నిద్రపోతోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క మంగళవారం విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి డెంగీ సోకిందన్నారు. అధికారులు, ప్రభుత్వ యంత్రాంగమంతా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సేవలు చేయడంలో మునిగిపోయారన్నారు. ఖమ్మం జిల్లాలోని బోనకల్, రావినూతల, ఆళ్లపాడు తదితర గ్రామాల్లో డెంగీ మరణాలు పదుల సంఖ్యను దాటిపోయాయన్నారు. ఒక్క రావినూతలలోనే వైద్య ఖర్చులకు పేదలు రూ.10కోట్లు ఖర్చుపెట్టారన్నారు. వైద్యానికి డబ్బు లేని పేదలు చాలామంది ప్రాణాలు కోల్పోయారన్నారు. రాష్ట్రం జ్వరాలతో ఇబ్బందులు పడుతుంటే... ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారని గవర్నర్ ఎలా పొగుడుతారన్నారు. డెంగీతో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. -
కొత్త కొలువులు
-
కొత్త కొలువులు
- నూతన జిల్లాల్లో అవసరమైన ఉద్యోగ నియామకాలకు సిద్ధం: కేసీఆర్ - అర్హత ఉన్నవారందరికీ ప్రమోషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం - ఎలాంటి పైరవీల్లేకుండా ప్రజలకు పథకాలు అందాలి - ఉమ్మడి రాష్ట్రంలోని అవలక్షణాలేవీ ఉండొద్దు - అనుబంధ శాఖలన్నీ ఒకే గొడుగు కిందకు తేవాలి - శాఖలన్నీ ప్రజలకు అందుబాటులో ఉండాలి - శాంతిభద్రతలు అత్యంత ముఖ్యం.. పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉండాలి - సిద్దిపేట జిల్లా ప్రారంభోత్సవంలో పాల్గొంటా - జిల్లాల పునర్విభజన పురోగతిపై 6న కలెక్టర్ల సదస్సు సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అవసరమైన మేరకు ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అర్హత ఉన్న ఉద్యోగులందరికీ ప్రమోషన్లు ఇచ్చి వారు పూర్తి నిబద్ధతతో ప్రజలకు సేవలందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పైరవీలకు తావులేకుండా సంక్షేమ పథకాల కోసం ప్రజలే నేరుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వ శాఖల పునర్ వ్యవస్థీకరణపై సీఎం శనివారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు, పదోన్నతులు, నియామకాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్ చంద్, సీఎంవో అధికారులు నర్సింగ్ రావు, స్మితా సబర్వాల్, శాంతాకుమారి, భూపాల్‌రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలు, పరిపాలనలో ఉద్యోగులూ భాగస్వాములేనన్నారు. అనుబంధ శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సూచించారు. నేరాల అదుపునకు పటిష్ట పోలీసు వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా ఏర్పడే మండల కేంద్రాల్లో పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు తగిన సిబ్బందిని నియమించాలన్నారు. ప్రజలకు చేరువగా..: కొత్త జిల్లాల్లో ప్రభుత్వ శాఖల పునర్వ్యవస్థీకరణ ప్రజలకు మేలు చేసేలా కార్యాచరణ ఉండాలని సీఎం ఆదేశించారు. సంక్షేమ పథకాలు పొందే లబ్ధిదారుడి పూర్తి వివరాలు కలెక్టర్ల కంప్యూటర్లో ఉండే విధంగా డిజిటలైజేషన్ చేపట్టాలన్నారు. ప్రభుత్వ శాఖలను పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరించాలన్నారు. ప్రభుత్వ శాఖలు ప్రజలకు అందుబాటులో ఉండేలా కొత్త జిల్లాల నమూనా ఉండాలన్నారు. సిద్దిపేట జిల్లా ప్రారంభోత్సవంలో పాల్గొంటా: రాష్ట్ర ప్రజలందరూ సంతోషించేలా కొత్త జిల్లాల ఆవిర్భావం జరగాలని సీఎం ఆకాంక్షించారు. దసరా రోజు కొత్తగా ఏర్పడే సిద్దిపేట జిల్లా ప్రారంభోత్సవంలో తాను పాల్గొంటానన్నారు. మంత్రులు, ప్రభుత్వ సీఎస్, డీజీపీ వంటి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇతర జిల్లాల్లో పరిపాలన ప్రక్రియను ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లాల పునర్విభజన పురోగతిని చర్చించేందుకు ఈ నెల 6న కలెక్టర్ల సదస్సు నిర్వహించాలన్నారు. సాగు, నీటిపారుదలకు అధిక ప్రాధాన్యం: వ్యవసాయం, నీటిపారుదల వంటి కీలక రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని సీఎం చెప్పారు. దేశానికే అన్నపూర్ణగా ఉండాల్సిన ప్రాంతం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కరువుతో తల్లడిల్లే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 58 ఏళ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో ఒకేఒక్కసారి బడ్జెట్‌కు సాగునీటి పారుదలకు రూ.15,500 కోట్ల బడ్జెట్లో కేటాయించారన్నారు. సమైక్య రాష్ట్రంలో అవే అత్యధిక కేటాయింపులని వివరించారు. ఇప్పుడు తెలంగాణలో ఏడాదికి రూ.25 వేల కోట్లు కేటాయిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 13 మంది ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు ఉంటే.. నేడు ఒక్క తెలంగాణకే 15 మంది ఉన్నారన్నారు. -
తెలంగాణలో వైఎస్సార్ సీపీ బలోపేతం
కాజీపేట రూరల్ : తెలంగాణలోæ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా పరిశీలకుడు వేముల శేఖర్ రెడ్డి అన్నారు. హన్మకొండ వైస్సార్ సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం జిల్లా స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో శేఖర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని వైఎస్సార్సీపీ బలోపేతానికి గ్రామ స్థాయి నుండి ప్రతి కార్యకర్త సైనికునివలే పని చేయాలని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి రాజన్న పాలన గురించి వివరించాలని అన్నారు. అక్టోబర్ నెలలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డితో వరంగల్ ముఖ్య నాయకులతో సమావేశం హైదరాబాద్‌లో ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సిఎం కేసీఆర్ పాలనతో ప్రజలు విస్తుపోతున్నారని అన్నారు. తెరమీదికి తీసువచ్చిన హన్మకొండ, వరంగల్ జిల్లాలో వరంగల్ జిల్లా మాత్రమే ఉండాలని జనగాంను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 2వ తేదీన జరిగే మహానేత దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి వర్థంతిని జిల్లా స్థాయిలో నాయకులు, కార్యకర్తలు జరుపాలని పలు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన అన్నారు. శేఖర్‌రెడ్డి, జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి సమక్షంలో 26 మంది వైఎస్సార్ సీపీ మండల పార్టి అధ్యక్షుల ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. అంతకు ముందు మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సంగాల ఇర్మియా, రాష్ట్ర కార్మిక కార్యదర్శి గౌని సాంబయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దోపతి సుదర్శన్‌రెడ్డి, జిల్లా యూత్ ప్రెసిడెంట్ అప్పం కిషన్, జిల్లా అధికార ప్రతినిధి అమరేందర్ రెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు అచ్చిరెడ్డి, మహిళ విభాగం అధ్యక్షురాలు బీంరెడ్డి స్వప్న, క్రిస్టియన్ మైనార్టి జిల్లా అధ్యక్షుడు జన్ను విల్సన్ రాబర్ట్, జిల్లా నాయకులు కమలాకర్‌రెడ్డి, ప్రభాకర్, చందా హరికృష్ణ, మైలగాని కళ్యాణ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొచ్చురవి, గాంధీ, సుమన్ గౌడ్, సుమిత్ గుప్తా, మండల అధ్యక్షుడు వీరారెడ్డి, సైదులు, భాస్కర్, రత్నాకర్, రవి, గజపతి, రమేష్, శ్రీను, జంపయ్య, ఆంజనేయులు, సుమన్, నర్సన్న, లింగన్న, సుజాత, సౌమ్యనాయక్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి రామన్నను కలిసిన ఆరె సంఘం నేతలు
హన్మకొండ : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నను తెలంగాణ ఆరె కుల సం క్షేమ సంఘం నాయకులు కలిశారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రిని తెలంగాణ ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోమిడి అంజన్‌రావు, మాజీ జెడ్పీటీసీ సభ్యు డు నాగూర్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సం ఘం నాయకులు కలిసి ఆరె కులాన్ని ఓబీసీలో చేర్చాలని కోరారు. ఈ అంశాన్ని కేంద్ర ఓబీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారని వారు తెలిపారు. సంఘం నాయకులు భలేరావు మనోహర్‌రావు, సిందె రాంనర్సయ్య, జెండా రాజేష్, ఇంగ్లీ శివాజీ, మాసంపల్లి లింగాజి పాల్గొన్నారు. -
‘విమోచన’ను అధికారికంగా నిర్వహించాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి హన్మకొండ : తెలంగాణ ప్రాంతం నైజాం పాలన నుంచి విముక్తి పొంది భారత్‌లో విలీనమైన రోజు సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం హన్మకొండలోని పార్టీ జిల్లా కార్యాలయం లో నిర్వహించిన బీజేవైఎం జిల్లా పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ఎంసెట్ పేపర్ లీకేజీలో ప్రభుత్వం హస్తముందని ఆరోపిం చారు. దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్‌గౌడ్, జిల్లా ఇన్చార్జి కేవీఎల్ఎన్ రెడ్డి, నాయకులు వల్లభు వెంకన్న, బుర్రి ఉమాశంకర్, పూసల శ్రావణ్, మోడెపల్లి సాయన్న, సురేష్, అశోక్, స్వామి, శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఘనంగా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర
-
మార్చి 2 నుంచి ఇంటర్ పరీక్షలు?
- ఒకవేళ కుదరకుంటే 9 నుంచి నిర్వహణకు బోర్డు కసరత్తు - రెండు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు - ఏపీ కంటే ముందుగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి 2 నుంచి ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు కసరత్తు చేస్తోంది. జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల తేదీలు, సెలవులను పరిగణనలోకి తీసుకొని ఒకవేళ 2 నుంచి నిర్వహణ సాధ్యం కాకుంటే అదే నెల 9వ తేదీ నుంచి నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు రెండు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. తొలుత మార్చి 11 నుంచి పరీక్షలు నిర్వహిం చాలని ఉన్నతాధికారులు భావించినా ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలను అదే తేదీ నుంచి నిర్వహించేందుకు ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు ఇప్పటికే షెడ్యూలు/టైంటేబుల్ జారీ చేయడంతో అంతకంటే ముందుగానే పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ మొదటి వారంలో (4వ తేదీన నిర్వహించే అవకాశం) ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ రాత పరీక్షను నిర్వహించే అవకాశం ఉండటం, అదే నెల నుంచి జూన్ వరకు వివిధ జాతీయస్థాయి పోటీ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో మార్చిలోనే ఇంటర్ పరీక్షలను పూర్తి చేయాలని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా విద్యార్థులు జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేం దుకు సులభంగా ఉంటుందని, విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చూడవచ్చని పేర్కొంటున్నాయి. ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రాక్టికల్స్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ వంటి పరీక్షలను ఫిబ్రవరిలోనే బోర్డు నిర్వహించనుంది. మరోవైపు మార్చి మూడో వారంలో పదో తరగతి పరీక్షలను (మార్చి 16 లేదా 18వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది) నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అంతకంటే ముందే ఇంటర్ పరీక్షలను పూర్తి చేసేలా బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. గత విద్యా సంవత్సరం ఇంటర్ పరీక్షలను 2015 మార్చి 9 నుంచి బోర్డు నిర్వహించింది. ప్రథమ సంవత్సర ఫలితాలను ఏప్రిల్ 22న, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఏప్రిల్ 27న ప్రకటించింది. -
కేసీఆర్‌తో చైనా పారిశ్రామికవేత్తల భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుతో శుక్రవారం చైనా పారిశ్రామికవేత్తల బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై సీఎం సమక్షంలో అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం, చైనా కంపెనీల మధ్య రెండు ఎంవోయూలు కుదిరాయి. తెలంగాణలో డ్రైపోర్టు ఏర్పాటుకు చైనాకు చెందిన సాని గ్రూపు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రీ ఫ్యాబ్ కాంక్రీట్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ స్థాపించేందుకు సాని గ్రూపు ముందుకువచ్చింది. -
సారూ.. నాపై నిర్లక్ష్యమేలా..?
కోటి రతనాల తెలంగాణ తొలిసారి సీఎం కేసీఆర్ గారు.. తొలిసారి వుుఖ్యవుంత్రి హోదాలో మా నియోజకవర్గంలో సోమవారం పర్యటిస్తున్నందుకు ధన్యవాదాలు. ప్రపంచంలోనే పర్యాటక, ఆహ్లాదకరమైన ప్రాంతంగా నాకు విదేశీయుులు ఎనమిదోస్థానం కల్పించారు. మనదేశంలో రెండోస్థానం నాదే. మీరు ఏలుతున్న రాష్ట్రంలో నేనే నంబర్‌వన్. మీరు వుుఖ్యవుంత్రి అయ్యూక జూరాల నీటిని తెచ్చి నాకు వురింత గుర్తింపు తెస్తారని ఆశించా. ఆలస్యమైనా ఓర్చుకుంటున్నా. పాకాల సరస్సు అనే నేను.. సవుస్త జీవరాశికి కల్పతరువును. నా చుట్టూ ఎత్తై గుట్టలు, పచ్చని చెట్లు, వాటి వుధ్య జీవితాలను అల్లుకున్న ప్రాణకోటికి అవసరమైన అంతులేని ఔషధ మొక్కలు. నిజం చెప్పాలంటే నేనే ప్రకృతిని.నీటిని..కూటిని..!! నాలో ఈదులాడే చేపపిల్ల.. దాని కోసం జపం చేసే కొంటె కొంగ.. ఆడఈడ మేసి ఆకలి వేయుగా దప్పిక తీర్చుకునేందుకు నా వద్దకు వచ్చే పశువుల వుంద.. నాలో ఉన్న చెట్లపై గూడు కట్టుకున్న పిచ్చుకల కిలకిలలు.. సహజ జీవన సౌందర్యం.. అలనాటి కాకతీయు రాజులు ఒక ప్రణాళిక ప్రకారం నాకు ప్రాణం పోశారు. ప్రపంచ సరస్సుల్లో దేశంలోనే రెండవ స్థానం వుుందే చెప్పినట్లు నీను ప్రకృతి ప్రతిరూపాన్ని...నాలో నీళ్ళు..వాట్లో చేపపిల్లలు ఉన్నారుు. అటవీ ప్రాంతంలో నివసించే వన్యప్రాణుల దప్పిక తీర్చుకునేందుకు ఏకైక దిక్కును.. చెరువు కట్టపై వానర సైన్యం సందడి..చెట్లపై కోరుులలు, చిలుకలు, గొర్రెంకలు, గిజిగాళ్ళు, పాలపిట్టలు, గువ్వలు లాంటి పక్షులు చేసే సందడి అంతా..ఇంతా కాదు. నీళ్లలో ఉన్న చెట్ల కొవ్ములకు వేలాడే గూళ్ళు కట్టే పచ్చపిట్టల అందాలను, వాటి కిలకిలారివాన్ని చెప్పనలవి కాదు. వడ్ల పిట్ట తన వాడి వుుక్కుతో చెట్ల కొవ్ములను తొలిచే చప్పుడు వినితీరాల్సిందే..ఎక్కడో వాటేడి తెచ్చుకున్న ఎరను నా తావుకు వచ్చి తినే గద్దలు, డేగలు, కాకుల సంగతి సరేసరి..ఇదే కాదండోయ్ నా వద్దకు వచ్చే పర్యాటకులందరికి సుగందపు వాసనలను వెదజల్లుతాను కూడా. . బాధపడుతున్నా.. ఇన్ని అద్భుతాలు నాలో ఇమిడి ఉన్నారుు. వీటిని వీక్షించేందుకు వస్తున్న పర్యాటకులను పూర్తి సంతృప్తి పర్చకపోవడంతో బాధపడుతున్నా. 1980లో నా చెంతన ఒక పార్కు ఉండేది..అందులో వివిధ రకాల జంతువుల ఉండే వి.. అప్పట్లో సందడి ఉండగా పర్యాటకులు ఆనందపడేవారు. 1985లో దాన్ని తొలగించడంతో దుఖిఃచాను. ఏళ్ల తరబడి కాసిన్ని డబ్బులు కేటారుుంచి నా వద్ద సౌకర్యాలు కల్పించి చూడాల్సిన వారు లేరు. అందుకే వుుఖ్యవుంత్రి మీరైనా నా అందాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు నా పరిధిలో సౌకర్యాలు కల్పించి, సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నా.. ఇట్లు మీ పాకాల సరస్సు - నర్సంపేట -
తెలంగాణలో లాభాలు.. ఏపీలో నష్టాలు
గత జూన్ నెల లెక్కలను విడివిడిగా వెల్లడించిన ఆర్టీసీ తెలంగాణలో రూ. 7.87 కోట్ల మిగులు ఆంధ్రప్రదేశ్‌లో రూ. 20.18 కోట్ల నష్టం ఇరు రాష్ట్రాల లెక్కలను తేల్చిన అధికారులు తెలంగాణలోని మూడు జోన్లలో లాభాల పంట ఏపీలోని అన్ని జోన్లూ నష్టాల బాటలోనే.. హైదరాబాద్: కొన్నేళ్లుగా తీవ్ర నష్టాల్లో ఉన్నామని చెబుతోన్న ఆర్టీసీ... తొలిసారిగా తెలంగాణ ప్రాంతంలో లాభాలు ఆర్జిస్తున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం భారీ నష్టాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. గత జూన్‌లో తెలంగాణ ఆర్టీసీ రూ. 7.87 కోట్ల లాభాలు ఆర్జించగా... ఇదే నెలలో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ రూ. 20.18 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నట్లు తెలిపింది. అధికారికంగా రాష్ట్ర విభజన జరిగిన జూన్ నెలలో ఇది చోటు చేసుకోవటం గమనార్హం. రాష్ట్రం విడిపోయినా ఆర్టీసీ ఉమ్మడిగా ఉండటంతో అన్ని లెక్కలనూ ఉమ్మడిగానే చూపుతూ వచ్చిన ఆర్టీసీ.. తొలిసారిగా గత జూన్ నెల లెక్కలను విడివిడిగా వెల్లడించింది. జూన్ నెల ఆదాయ/అప్పుల వివరాలతో కూడిన జాబితాను అధికారులు శుక్రవారం అధికారికంగా తేల్చారు. గత మే నెల వరకు రెండు ప్రాంతాల్లో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నట్లు చూపించగా... ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో లాభాలు వస్తున్నట్లు చూపారు. అయితే కొన్నేళ్లుగా లాభాల ఊసే లేని ఆర్టీసీలో ఒకే నెలలో ఏకంగా రూ. 7.87 కోట్ల లాభాలు చూపడంపై చర్చకు తెరలేచింది. గత ఆరు నెలల కాలానికి దేశవ్యాప్తంగా రవాణా సంస్థల లాభనష్టాల వివరాలను కేంద్ర రోడ్డు రవాణా ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలోని ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్’ తాజా సంచికలో వెల్లడించింది. దాని ప్రకారం దేశవ్యాప్తంగా కర్ణాటకలోని ఈశాన్య కర్ణాటక ఆర్టీసీ మాత్రమే లాభాల్లో ఉండగా... మిగతా 59 కార్పొరేషన్లు నష్టాల్లో ఉన్నాయి. అందులోనూ ఈశాన్య కర్ణాటక ఆర్టీసీ కూడా ఆరు నెలల కాలానికి కేవలం రూ. 2.70 కోట్ల లాభాలే ఆర్జించింది. అలాంటిది తెలంగాణ ఆర్టీసీ ఏకంగా ఒక్క జూన్ నెలలోనే రూ. 7.87 కోట్ల లాభాలు పొందడాన్ని అధికారులు విశేషంగా పరిగణిస్తున్నారు. అయితే తర్వాతి నెలల్లో ఈ లాభాలు ఉంటాయోలేదో చెప్పలేమని.. ఇంతకుముందటిలా నష్టాలు ఉండకపోవచ్చని మాత్రం చెబుతున్నారు. ప్రస్తుతం అధికారులు జూలై వివరాలను క్రోడీకరిస్తున్నారు. ఇటు లాభం.. అటు నష్టం గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలోని మూడు జోన్లకుగాను సిటీ జోన్ రెండు నెలల పాటు స్వల్ప లాభాలనార్జించగా హైదరాబాద్ జోన్, కరీంనగర్ జోన్ మాత్రం నష్టాలనే మూట గట్టుకున్నాయి. అదే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ నెలలో ఈ మూడు జోన్లు కూడా లాభాల బాటపట్టడం విశేషం. హైదరాబాద్ జోన్ రూ. 35 లక్షల స్వల్ప లాభాన్నే పొందినప్పటికీ... హైదరాబాద్ సిటీ, కరీంనగర్ జోన్లు ఏకంగా రూ. 3 కోట్లను మించి లాభాలు పొందాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, వైఎస్సార్ కడప, విజయవాడ, విజయనగరం జోన్లన్నీ నష్టాలు చవిచూశాయి. ఆర్టీసీలో అతిపెద్ద వ్యయం పద్దు డీజిల్‌దే. ఆ నెలలో తెలంగాణలో డీజిల్‌కు ఖర్చు రూ. 109 కోట్లు కాగా, ఏపీలో రూ. 140 కోట్లుగా నమోదైంది. ముందు నుంచీ లాభాలు.. చాలాకాలంగా తెలంగాణ ప్రాంతంలో ఆర్టీసీకి లాభాలు వస్తున్నప్పటికీ.. ఉమ్మడిగా ఉంటుండటంతో అది కనిపించడం లేదని ఆర్టీసీ తెలంగాణ అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ విభజన వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న షీలాభిడే కమిటీ నియమించిన ప్రైవేటు కన్సల్టెన్సీ రూపొందించిన నివేదిక తప్పుల తడక అని దీనితో తేలిపోయిందని అంటున్నారు. తెలంగాణ ఆర్టీసీ వార్షిక నష్టాలు రూ. 900 కోట్లుగా ఉన్నట్లు ఆర్టీసీ రికార్డులు సూచిస్తున్నా.. అవి రూ. 1,350 కోట్ల వరకు ఉన్నట్లు ప్రైవేటు కన్సల్టెన్సీ తేల్చిందని, అంత నష్టాలు ఉండవనేది తాజా లెక్కలతో తేలిపోయినందున ఆ నివేదికను పరిగణించొద్దని వారు పేర్కొంటున్నారు. -
తెలంగాణ జెన్కోకు ఇద్దరు డెరైక్టర్ల నియామకం
హైదరాబాద్: తెలంగాణ జెన్కోకు ప్రభుత్వం ఇద్దరు డెరైక్టర్లను నియమించింది. ఈ మేర కు ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోిషీ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. జెన్కోలో చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న సచ్చిదానందంను డెరైక్టర్ (థర్మల్)గా, జూలై 31న పదవీ విరమణ చేసిన వెంకటరాజంను డెరైక్టర్ (హైడల్)గా నియమించారు. వీరి నియామకానికి సంబంధించిన నియమ నిబంధనలపై ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీచేస్తామని పేర్కొన్నారు. టీ జెన్కోకు డెరైక్టర్లను నియమించాలని సంస్థ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు జూన్ 13న ప్రభుత్వాన్ని కోరారు. -
టీపీసీసీకి కొత్త సారథి?
-
హాలీవుడ్ స్థాయిలో సినిమాసిటీ: కేసీఆర్
హైదరాబాద్: అంతర్జాతీయ ప్రమాణాలతో హాలీవుడ్‌ను తలపించేలా తెలంగాణలో సినిమా సిటీని నిర్మించతలపెట్టినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సోమవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రవి కొత్తరకార, సి.కళ్యాణ్, శశికుమార్, నందకుమార్, ఎన్.శంకర్, హెచ్డి గంగరాజు, కాట్రగడ్డ ప్రసాద్, ఉదయ్‌సింగ్, ఎ.రాజ్‌కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సినిమా సిటీ కేవలం సినిమాలు తీయడానికే పరిమితం కాకుండా, టీవీ సీరియళ్లు, కార్యక్రమాల రూపకల్పన, గ్రాఫిక్ ఎఫెక్ట్స్, యాని మేషన్, ప్రజా సమస్యలపై లఘుచిత్రాలకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఎక్కడ, ఎలా నిర్మిం చాలనే దానిపై త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. ముంబై సినీ పరిశ్రమ ప్రతినిధులు, భారతదేశ సినీరంగపెద్దలు, తెలుగు సినీపరిశ్రమకు చెందిన ప్రతినిధులను ఆహ్వానించి వారి సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పా రు. అనంతరం ఫిల్మ్‌ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భారత్ కేం ద్రంగా తెలంగాణ ఫిల్మ్‌సిటీ మారాలనే సంకల్పానికి తాము కూడా చేయూతనందిస్తామని తెలిపారు. రెండువేల ఎకరాల్లో ప్రారంభించే ఈ ఫిల్మ్‌సిటీ అన్ని భాషల సినిమాల తయారీకి కేంద్రం కావాలని ఆశిస్తున్నామన్నారు. సీఎంతో టర్కీ కాన్సూల్జనరల్ భేటీ ఈ ఏడాది అక్టోబర్ 24న హైదరాబాద్‌లో జరగనున్న తమ జాతీయ దినోత్సవాల్లో పాల్గొనాలని టర్కీ కాన్సూల్జనరల్ మురాత్ ఒమెరోగ్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించారు. దీనికి కేసీఆర్ సమ్మతించారు. సోమవారం సచివాలయంలో మురాత్ తెలంగాణ సీఎంతో భేటీ ఆయ్యారు. కాగా, మరోసారి సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించాలని నిర్ణయించారు. టర్కీలోని ఇస్తాంబుల్ ఇప్పుడు నవీకరించిన నగరమని, దీనిని సందర్శించాలనే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాటుచేస్తామని మురాత్ ఒమెరోగ్లు హామీ ఇచ్చారు. -
టీపీసీసీకి కొత్త సారథి?
రేసులో భట్టి, శ్రీధర్‌బాబు, డీకే, షబ్బీర్, వివేక్, పొన్నం ఢిల్లీకి రావాలని జానారెడ్డికి అధిష్టానం పిలుపు రేపు హస్తినకు జానా.. ఢిల్లీ చేరిన పొన్నాల పార్టీ బలోపేతంపైనా చర్చించే అవకాశం తనకు మరికొంత గడువు ఇవ్వాలని హైకమాండ్‌కు వినతి హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి నుంచి పొన్నాల లక్ష్మయ్యను తప్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలనే అంశంపై హైకమాండ్ పెద్దలు కసరత్తు ముమ్మ రం చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డిని ఢిల్లీ రావాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ ఆదేశించినట్లు సమాచారం. సీఎల్పీ, టీపీసీసీ మధ్య సమన్వయం లేకపోవడం, టీపీసీసీ చీఫ్‌ను మార్చాలంటూ పార్టీలో పలువురు నేతలు హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తుండటం, పొన్నాలను తప్పించాలం టూ మరికొందరు నేతలు బాహాటంగానే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పొన్నాలను తప్పించి, అసంతృప్తికి తెరదించాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించారు. తెలంగాణ నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టేలా ఉత్సాహం నింపాలని యోచిస్తున్నారు. పార్టీ వర్గాల సమాచా రం మేరకు.. దిగ్విజయ్‌సింగ్ ఆదివారం జానారెడ్డికి ఫోన్ చేసి టీపీసీసీ చీఫ్ మార్పు, పార్టీ బ లోపేతం, టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు వంటి అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ రావాలని సూచించారు. వచ్చే వారంలో వస్తానని జానారెడ్డి చెప్పినప్పటికీ.. ఈ వారమే రావాలని దిగ్విజయ్ స్పష్టం చేశారు. దీంతో బుధవారం జానారెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రేసులో ఎందరో.. పొన్నాలను తప్పిస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుం డడంతో టీపీసీసీ పదవిపై పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. కొందరు నేతలు ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతోపాటు హైకమాండ్ పెద్దలను కలసి తమకు అవకా శం ఇవ్వాలని కోరారు. మరికొందరు తమకు అనుకూలంగా ఉన్న పెద్దల ద్వారా లాబీయింగ్ చేసే పనిలో పడ్డారు. శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క పేరు అధిష్టానం పెద్దల ముందు పరిశీలనకు వచ్చినప్పటికీ భట్టి వ్యతిరేకులు ఆయనపై పలు ఫిర్యాదులు చేయడంతో.. తాత్కాలి కంగా ఆ పేరును పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. శాసనమండలిలో ఉపనేత షబ్బీర్‌అలీ పేరు కూడా తెరపైకి వచ్చినా.. శాసనమండలి ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్ పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగుస్తున్నందున ఆ పదవిని షబ్బీర్ ఆశిస్తున్నట్లు తెలిసింది. ఇక మాజీ మంత్రి డీకే అరుణ కొద్దిరోజులుగా టీపీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. మాజీ ఎంపీలు వివేక్, పొన్నం ప్రభాకర్ కూడా లాబీయింగ్ చేస్తున్నారు. ఇక రాబోయే ఐదేళ్లు పార్టీకి అవసరమైన ఆర్థిక వనరులు సమకూరుస్తానని వివేక్ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే మాజీ మంత్రి శ్రీధర్‌బాబు పేరును జానారెడ్డి తెరపైకి తెచ్చినట్లు సమాచారం. సీఎల్పీ, పీసీసీ సమన్వయం తో ముందుకు వెళ్లాలంటే శ్రీధర్‌బాబుకు టీపీసీసీ చీఫ్ పగ్గా లు అప్పగించడం మేలని కొందరు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య హుటాహుటిన హస్తిన బయలుదేరి వెళ్లారు. తనకు మరికొంత గడువిస్తే పార్టీని గాడిలో పెడతానని హైకమాండ్ పెద్దలకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. -
జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్...
మంగళవారం కరీంనగర్, గురువారం నిజామాబాద్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లాలో, గురువారం నిజామాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తరువాత సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో మాత్రమే ఆయన ఒకరోజు పర్యటించారు. రెండు నెలల పాటు ఆయన హైదరాబాద్‌లోనే ఉంటూ ప్రతిరోజూ కలెక్టర్లతో సమీక్షలు నిర్వహించి ప్రభుత్వ ప్రాధాన్య అంశాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రస్తావించిన దాదాపు అన్ని అంశాలకు ఆమోద ముద్ర వేసిన తరువాత.. తొలిసారిగా జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ ప్రాణం పోసిందని, 2001 మే 17వ తేదీన అక్కడ నిర్వహించిన సభ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిందని కేసీఆర్ అధికారులకు తెలిపారు. కరీంనగర్‌తో తనకు విడదీయరాని అనుబంధం ఉందని, జిల్లా అభివృద్ధి తన బాధ్యత అని సీఎం వివరించారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆర్మూర్, అంకాపూర్ వెళ్ళనున్నట్లు వెల్లడించారు -
మూడోవారంలో టీఆర్ఎస్ ప్లీనరీ
ఎల్బీ స్టేడియంలో నిర్వహణ 5 నుంచి సీఎం జిల్లాల పర్యటన మంత్రులు, ఎంపీల సమావేశంలో కేసీఆర్ నిర్ణయం హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీని ఈ నెల మూడోవారంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఆది వారం రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నివాసంలో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. మూడోవారంలో ఒకరోజు పూర్తిగా పార్టీ ప్లీనరీని నిర్వహించాలని నిర్ణయిం చారు. ప్రభుత్వంతో పార్టీకి సమన్వయాన్ని పెంచాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి పార్టీ ఆశిస్తున్నదేమిటి, ప్రజల్లో ఎలాంటి డిమాండ్లు ఉన్నాయనే సమాచారాన్ని పార్టీ మండలస్థాయి నాయకుల నుంచి తీసుకోవాలంటున్నారు. పార్టీలో ఉన్న ఖాళీలు, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీ వంటివాటిపైనా దృష్టి సారించను న్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడం, తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం పెంచే విధంగా ప్లీనరీని నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ నెల 19న జరిగే ఇంటింటీ సర్వేను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 15నగాని, 22న గాని ఈ ప్లీనరీని నిర్వహిస్తారు. జిల్లాల పర్యటనలో కేసీఆర్... సీఎం కేసీఆర్ ఈ నెల 5న కరీంనగర్, 7న నిజామాబా ద్, 8న ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. జి ల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై సమాచారాన్ని సేకరించే బాధ్యతను మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు. చానళ్లపై దీటుగా స్పందించండి కొన్ని ఛానళ్లను తెలంగాణలో ఎంఎస్ఓలు నిలిపేయడంపై పార్లమెంటులో చర్చకు వస్తే, టీఆర్ఎస్ ఎం పీలు దీటుగా స్పందించాలని సీఎం కేసీఆర్ సూచిం చారు. ఆ ఛానళ్లపై చర్య అంశం స్పీకరు, మండలి చైర్మన్ పరిధిలోనే ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాలన్నారు. ప్రత్యేక హైకోర్టుపై పార్లమెంట్లో పోరాటం: కేకే తెలంగాణకు ప్రత్యేకంగా హైకోర్టును ఏర్పాటు చేయాలని, దీనిపై పార్లమెంటు సమావేశాల్లో పోరాడుతామ ని ఎంపీ కె.కేశవరావు చెప్పారు. ఏపీతో వైరం లేదని, అభివృద్ధిలో పోటీ మాత్రమే ఉందన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, డాక్టర్ టి.రాజయ్య, ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, సాగునీటిపారుదల, గనుల శాఖల మంత్రి టి.హరీశ్‌రావు, ఎక్సైజ్‌శాఖా మంత్రి టి.పద్మారావు, శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీలు కడియం శ్రీహరి, సీతారాం నాయక్, కె.విశ్వేశ్వర్ రెడ్డి, కె.కవిత, ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు. కేసీఆర్‌తో గట్టు, జనక్ ప్రసాద్, విజయారెడ్డి భేటీ ఇదిలా ఉండగా, కె.చంద్రశేఖర్‌రావుతో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలు గట్టు రామచంద్రరావు, జనక్ ప్రసాద్‌లు ఆదివారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో తెరువబోయే కల్లు దుకాణాల్లో పాతవారినే నియమించాలని సీఎంకు వారు విజ్ఞప్తి చేశారు. కల్లు దుకాణాల్లో గతంలో పనిచేసిన వారంతా ఉపాధిని కోల్పో యి చాలా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దీనికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు, భవిష్యత్ వ్యూహం, ప్రజల సమస్యలు, పరిష్కారాలపై సుమారు గంటన్నర పాటు వీరితో కేసీఆర్ మాట్లాడారు. వీరు చర్చిస్తున్న సమయంలోనే పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా వచ్చి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. గ్రేటర్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి రానున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా రాజధానిలో టీఆర్ఎస్ను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నా రు. ఇందుకోసం పార్టీశ్రేణులను సమాయత్తం చేయడంతోపాటు వివిధ పార్టీల ముఖ్యనేతలను, కార్పొరేటర్లను టీఆర్ఎస్లో చేర్చుకోవాలని ఆదేశించారు. సుమారు 25 మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరడానికి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ వెల్లడించారు. పార్టీని డివిజన్ల వారీగా సమాయత్తం చేయాల్సిన బాధ్యతను పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావుకు కేసీఆర్ అప్పగించారు. -
ముఖ్యమంత్రులిద్దరిదీ పదవీ దాహం: నారాయణ
బెంగళూరు: పదవులు కాపాడుకునేందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రశేఖర్‌రావు, చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని... ఆ క్రమంలోనే వారు ప్రజా సమస్యలను పట్టించుకోవటం మానేశారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ విమర్శించారు. బెంగళూరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ సమస్య తలెత్తకుండా చూడాలని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించాలని, ప్రజల మధ్య సఖ్యత పెంచే చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. -
కేసీఆర్‌తో వెంకయ్య దోస్తీ
తనంతట తానుగా వెళ్లి కలసిన కేంద్ర మంత్రి ఇరు రాష్ట్రాల మధ్య అగాధం నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత హైదరాబాద్: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో మళ్లీ దోస్తీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. శనివారం ఆయన తనంతట తాను తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి కేసీఆర్ తో సమావేశమయ్యారు. అంతకు ముందు చంద్రబాబుతోనూ భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య పలు అంశాలపై తీవ్రస్థాయిలో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ అం శాలపై బాబు సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులందరూ కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుం డగా... వీటికి ప్రతిగా కేసీఆర్ వీలున్నప్పుడల్లా చంద్రబాబుపైన, వెంకయ్యపైన ధ్వజమెత్తుతున్నారు. వెంకయ్య కూడా కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసేవారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టేవారు. ఇటీవలి కాలంలో కేసీఆర్‌పై వెంకయ్యనాయుడు వైఖ రిలో మార్పు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయా లు, ఇతర అంశాలపై మాట్లాడనని చెబుతున్నారు. సమస్యలపై రెండు ప్రభుత్వాలూ కలసి కూర్చొని మాట్లాడుకోవాలన్నది తన ఆకాంక్షని అంటున్నారు. సమస్యలను పరిష్కరించుకోవాలి : వెంకయ్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కూర్చొని సమస్యలను పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సలహా ఇచ్చినట్టు వెంకయ్యనాయుడు చెప్పారు. కేసీఆర్‌తో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల సీఎంలను మర్యాదపూర్వకంగా కలసినప్పటికీ, ఈ సమావేశాలు అర్థవంతంగా సాగాయన్నారు. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఏర్పడిన గ్యాప్ తొల గించడానికి తాను కేసీఆర్‌తో భేటీ అయ్యానన్న మీడి యా ప్రతినిధుల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనకు సంబంధించిన వివాదంపై మాట్లాడబోనన్నారు. విభజన చట్టంలో పేర్కొ న్న అంశాల మేరకు ప్రభుత్వాలు నడుచుకోవాలని, వివాదాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఏపీకి నిధులివ్వాలని కోరిన బాబు వెంకయ్యనాయుడుతో భేటీ సందర్భంగా రాష్ట్రానికి అందాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరినట్టు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, మంజూరు చేయాల్సిన పనుల విషయంలో సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. విశాఖ, వీజీటీఎం పరిధిలో మెట్రో రైలు ప్రాజెక్టులను సత్వరమే ప్రారంభించి పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరానన్నారు. -
‘సీఎం పనులు సచివాలయం దాటవా’
హైదరాబాద్: రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెబుతున్న మాటలు సమీక్షలకే పరిమితమయ్యాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నా పనులు మాత్రం సచివాలయం గేటు దాటడం లేదని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎంపీ కవిత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరూ పట్టించుకోలేదు కాని, తమ ఎమ్మెల్యే లక్ష్మణ్ సానియాపై చేసిన వ్యాఖ్యలపై రాద్ధాంతం చేశారని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వచ్చేనెలలో రాష్ట్రానికి వస్తున్నారని, పార్టీ బలోపేతానికి రెండురోజుల పాటు భేటీలు నిర్వహించి మార్గదర్శనం చేయనున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. -
ప్రాజెక్టులకు సహకరిస్తాం
తెలంగాణకు మహారాష్ట్ర హామీ ‘మహా’మంత్రితో హరీష్‌రావు చర్చలు సఫలం హైదరాబాద్: తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి, నిర్వహణకు సంపూర్ణ సహకారం అందిస్తామని మహా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు సహా లెండి, దిగువ పెన్‌గంగ ప్రాజెక్టులకు చెందిన అన్ని అంశాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు తోడ్పాటును అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రాణహిత బ్యారేజ్ తుది అలైన్మెంట్, ముంపు ప్రాంతం, బ్యారేజ్ ఎత్తు అంశాలపై చర్చించుకునేందుకు ఈ ఏడాది ఆగస్టుకు ముందే అంతర్రాష్ట్ర స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిం ది. సాగునీటి ప్రాజెక్టులకున్న అడ్డంకులను తొలగించుకునే క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు నేతృత్వంలోని ప్రజా ప్రతినిధులు, అధికారుల బృందం బుధవారం ముంబైకి వెళ్లిం ది. మహారాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హసన్ ముష్రిఫ్‌తో భేటీ అయిన బృందం లెండి, దిగువ పెన్‌గంగ, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులపై చర్చించింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి పలు అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. లెండి ప్రాజెక్టు ముంపు గ్రామాలకు సహాయ పునరావాసం, పునర్నిర్మాణం అందించేందుకు, హెడ్‌వర్క్‌లను పూర్తి చేసేం దుకు ఒప్పుకొంది. బిచ్కుంద, మద్నూర్ మండలాల్లో 22 వేల ఎకరాలకు సాగునీరందించే లెండి ప్రాజెక్టును 2015లో పూర్తి చేయాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం, పెరిగిన అంచనా వ్యయానికి తగ్గట్టు వాటాను చెల్లించేందుకు అంగీకరించింది. బ్యారేజ్ నిర్మాణ అధ్యయనానికి మద్దతు.. దిగువ పెన్‌గంగ ప్రాజెక్టు చేపట్టేందుకు రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాన్ని తిరిగి ధృవీకరించాలని కోరిన మహారాష్ట్ర అభ్యర్థనకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దిగువ పెన్‌గంగ, కింద ప్రతిపాదించిన బ్యారేజ్‌ను ప్రధాన పెన్‌గంగ నుంచి విడదీయాలని, గతంలో చేసిన ప్రతిపాదనలకు కేంద్ర జల సంఘం నుంచి ఆమోదం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా.. మహారాష్ట్ర అంగీకారం తెలిపింది. పెన్‌గంగ డ్యామ్ దిగువన బ్యారేజ్ నిర్మించేందుకు పూర్తిస్థాయి అధ్యయనానికి మహారాష్ట్ర ప్రభుత్వం తమ సమ్మతి తెలిపింది. ప్రతినిధి బృందంలో రాష్ట్ర అటవీశాఖ మం త్రి జోగు రామన్న, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు హన్మం త్ షిండే, కోనేరు కోనప్ప, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, నీటిపారుదలశాఖ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌రెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, ప్రాణహిత చీఫ్ ఇంజనీర్ హరిరామ్, గోదావరి బేసిన్ కమిషనర్ మధుసూదన్‌రావు ఉన్నారు. -
టీపీసీసీ చీఫ్ మార్పు!
పొన్నాలను తప్పించే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్! తెరపైకి మల్లు భట్టి విక్రమార్క పేరు హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను తప్పించాలని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు భావిస్తున్నారు. ఆయన స్థానంలో టీపీసీసీ సారథిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే అంశంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. పొన్నాల నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పలువురు సీనియర్ నేతలు ఆయనను తప్పించాలని కోరుతూ గత కొంత కాలంగా హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా కాంగ్రెస్ లబ్ధి పొందకపోవడానికి నాయకుల మధ్య ఐక్యత లోపించడమేనని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర నాయకులను సమన్వయపర్చడంలో పొన్నాల వైఫల్యం చెందారనే అంచనాకు వచ్చింది. అయితే గతంలోలా హైకమాండ్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అవకాశాల్లేవని, సీనియర్ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అధ్యక్షుడిని నియమించాలని నిర్ణయించిందని ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఆయన వ్యాఖ్యలకు బలం చేకూరే విధంగా పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ గత కొద్దిరోజులుగా రాష్ట్రంలోని పలువురు నేతలకు ఫోన్లు చేసి పొన్నాల పనితీరుతోపాటు కొత్త సారథి ఎవరయితే బాగుంటుందని ఆరా తీస్తుట్టు తెలిసింది. సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో ప్రతిపక్షనేత డీఎస్, ఉపనేత షబ్బీర్‌అలీ, ఏఐసీసీ కార్యదర్శులు వి.హనుమంతరావు, జి.చిన్నారెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డితోపాటు పలువురు సీనియర్ నేతలకు ఫోన్‌చేసి వారి అభిప్రాయాలను తీసుకున్నట్లు సమాచారం. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనమైనందున ఆ ప్రాంత నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగించాలని కొందరు, సామాజికవర్గాలతో పనిలేకుండా పార్టీ బలోపేతమే లక్ష్యంగా కొత్త అధ్యక్షుడిని నియామకం ఉండాలని మరికొందరు నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. సామాజిక సమీకరణల్లో భాగంగా ఎస్సీ లేదా బీసీ నేతను టీపీసీసీ చీఫ్‌గా నియమించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే రెడ్డి సామాజికవర్గానికి సీఎల్పీ, బీసీ సామాజిక వర్గానికి మండలి ప్రతిపక్షనేత పదవి ఇచ్చినందున ఇతరవర్గాలకు టీపీసీసీ పగ్గాలు అప్పగించడం ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని అంచనా వేసిన హైకమాండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మరో పక్క ఏఐసీసీ ప్రక్షాళనలో భాగంగా దిగ్విజయ్‌సింగ్‌ను తప్పిస్తే రాష్ట్ర ఇన్చార్జి పగ్గాలను ముకుల్ వాస్నిక్‌కు అప్పగించే అవకాశాలున్నాయని తెలిసింది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల తొలివారంలో ఏఐసీసీని పునర్వ్యవస్థీకరిస్తారని, ఆ తరువాతే టీపీసీసీ చీఫ్ నియామకం ఉంటుందని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. -
వారానికోరోజు టీ-టీడీపీకి సమయమిస్తా: బాబు
త్వరలోనే తెలంగాణ లో పార్టీకి పూర్తిస్థాయి కమిటీలు హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ పటిష్టత కోసం వారానికోకరోజు సమయమిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తెలంగాణలో పార్టీకి త్వరలోనే పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా, మండల స్థాయిల్లో కమిటీలను నియమించనున్నట్లు వివరించారు. లేక్‌వ్యూ అతిథి గృహంలో శుక్రవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు హాజరైన ఈ సమావేశంలో ఆయన తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతల అభిప్రాయాన్ని కోరారు. ఈ సమావేశానికి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న సనత్‌నగర్ ఎమ్మెల్యే, హైదరాబాద్ జిల్లా పార్టీ నగర అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్ గైర్హాజరయ్యారు. -
చివరకు మిగిలిందేమిటి?
తెలంగాణ కోసం అష్టకష్టాలు పడ్డాం పార్టీ ఫణంగా పెట్టినా ఆదరించలేదు జేఏసీ నేతల ఎదుట జానారెడ్డి నిర్వేదం హైదరాబాద్: ‘తెలంగాణ కోసం అష్టకష్టాలు పడ్డాం. ఎన్నో త్యాగాలు చేశాం. సొంత పార్టీనే ఎదిరించాం. పదవులనూ త్యజించాం. చివరకు సీమాంధ్రలో పార్టీనే ఫణంగా పెట్టాం. ఇంత చేసినా మాకు ఒరిగిందేమిటి? ప్రజలు మమ్ముల్ని ఆదరించలేదు. ఇంతకంటే ఇక మేం చేయగలిగిందేముంది?’ తెలంగాణ ఉద్యోగసంఘాల నేతల ఎదుట కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి నిర్వేదంగా చేసిన వ్యాఖ్యలివి. ఆదివారం సాయంత్రం జేఏసీ నేతలు సి.విఠల్, మణిపాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, సతీశ్ తదితరులు జానారెడ్డి ఇంటికి వెళ్లి రాజ్యసభలో పోలవరం బిల్లును అడ్డుకునేలా కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు మెజారిటీ ఉన్నందున పోలవరం బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తే వీగిపోతుందని చెప్పారు. ఈ సందర్భంగా జానారెడ్డి పైవిధంగా స్పందించారు. జేఏసీ వర్గాల సమాచారం మేరకు.. తెలంగాణ కోసం పార్టీలో, బయటా ఎంతో శ్రమించినా ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని జానారెడ్డి వాపోయారు. ఇదిలా ఉండగా, ముంపు గ్రామాల విలీనం పై కాంగ్రెస్ అధినేత్రితో సోనియాతో చర్చిస్తానని జానారెడ్డి జేఏసీ నేతలకు హామీ ఇచ్చారు -
మసకబారుతున్న తెలుగు ‘చంద్రులు’
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగుజాతి విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కీచులాటలు మానుకోవాలి. స్వల్ప విషయాలపై ఘర్షణ పంథాకు స్వస్తి చెప్పాలి. విశాల హృదయంతో వ్యవహరించేవారి స్థాయి పెరుగుతుంది. జాతీయ మీడియా, రాజకీయ పార్టీలు ఇదంతా వినోదంగా చూస్తున్నాయి. కేంద్రంలో నెల రోజుల పాలన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ట పెరిగింద న్న అభిప్రాయం ప్రధానంగా వ్యక్తమవుతోంది. అందరి అంచనాలను మించి ఆయన పనిచేస్తున్నారు. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల గురించి కూడా ఒకసారి మదింపు వేయాల్సిన అవసరం ఉంది. మోడీ సర్కారుకు నెల రోజులపాటు ‘రాజకీయ హనీ మూన్’ వ్యవధి లభిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ఒక్కరోజు కూడా ఊపిరి తీసుకోడానికి తీరికలేకుండా పోయింది. బీజేపీని గతంలో ఎన్నడూ సమర్థించని చిన్న రాష్ట్రాలు కూడా మోడీ ప్రధాని అయ్యాక ఆయనకు ఎంతో ప్రాధాన్యమివ్వడం ప్రారంభించాయి. మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల వైఖరుల కారణంగా తెలుగువారి ప్రతిష్ట మసకబారుతోంది. ఇది సాటి తెలుగువారికి ఎంతో ఆందోళన కలిగించే విషయం. ఆంగ్లేయులు ‘విభజించు-పాలించు’ సూత్రంతో భారత్‌ను పాలించగా, కే చంద్రశేఖరరావు, చంద్రబాబునాయుడు కీచులాడుకుంటూ కేంద్రం తలదూర్చేలా హాస్యాస్పదంగా వ్యవహారం చేస్తున్నారు. ఈ ఇద్దరు సీఎంలూ తాత్కాలిక పాలకులు. వీరు తమ విధానాలను చక్కదిద్దుకోకపోతే తెలుగువారి ప్రతిష్ట పూర్తిగా మంటగలిసిపోతుంది. ఇద్దరూ ఇద్దరే కేసీఆర్, చంద్రబాబు రాజకీయాలలో, పాలనాయంత్రాంగంలో రాటుదేలినవారే. ఏళ్ల తరబడి రాజకీయాలలో కొనసాగుతున్న ఈ రాజకీయ ద్వయానికి ఎత్తులు పైఎత్తులు బాగానే తెలుసు. తాము రచించుకునే వ్యూహాలను విజయవంతంగా అమలు చేయగలిగేవారే. వీరిలో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ రకరకాల కారణాల వల్ల హస్తినలో మాత్రం వీరికి అంత సానుకూలత లేదనే చెప్పాలి. తెలంగాణలో పూర్తి మెజారిటీ సాధించినందున ప్రభుత్వాన్ని నడిపేం దుకు కేసీఆర్‌కు ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు సమర్థిస్తానని ఎన్నికల ఫలితాలకు ముందు కేసీఆర్ ఒక సందర్భంలో అన్నారు. అంటే భవిష్యత్తులో కాంగ్రెస్‌తో తమకు రాజకీయ అవసరం పడుతుందన్న ఉద్దేశం అప్పట్లో ఆయన మనసులో ఉంది. అంతేకాదు, తమ సర్కారు ఏర్పాటుకు కాంగ్రెస్ తోడ్పాటు అవసరమొస్తుందని భావించి మోడీకి దూరమయ్యారు. టీఆర్ఎస్కు పార్లమెంట్లో 11 మంది ఎంపీలు ఉన్నప్పటికీ వారికి కేసీఆర్‌తో తూగగల రాజకీయ స్థాయి, వ్యూహ నిపుణత వంటి లక్షణాలు లేవు. టీఆర్ఎస్ ఎంపీలపై బీజేపీకి కూడా పెద్దగా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు కేసీఆర్ అనుసరించిన ఎత్తుగడలు సరిగా లేవని చెప్పాలి. ఆయనవి అన్నీ ప్రతికూల డిమాండ్లే! ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చినవన్నీ కచ్చితంగా తెలంగాణకూ ఇవ్వాలన్నట్టుగా డిమాండ్ చేస్తున్నారు. ఆయన ప్రతికూల వైఖరి అవలంబిస్తున్నారు. ఈ పద్ధతి జాతీయస్థాయిలో నడవదు. ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన సాయం అందించాల్సిందిగా కేసీఆర్ అడుగుతూనే... అదే సమయంలో తమ రాష్ట్రమైన తెలంగాణకు కావల్సిన డిమాండ్లు చేస్తే బాగుండేది. ప్రతి విషయంలో అడుగడుగునా ఆంధ్రప్రదేశ్‌కు అడ్డుతగులుతూ, ఆయన తన ప్రతిష్టను దిగజార్చుకున్నారు. అంతేగాదు, సమస్యలే కాని చిన్నాచితకా విషయాలను పెద్ద సమస్యలుగా సృష్టించి కేసీఆర్ తన ఇమేజ్ను మసకబార్చుకున్నారు. సచివాలయం, ఇతర కార్యాలయాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరించడం పిల్లచేష్టలుగా కనిపిస్తాయి. సెటిలర్స్‌ను బెదిరించడం వల్ల తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. మీడియాతో ఘర్షణ పంథా వల్ల జాతీయ మీడియాలో టీఆర్ఎస్ సర్కారుకు ఇప్పటికే చెడ్డ పేరు వచ్చింది. మజ్లిస్, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకట్టుకునేందుకు కేసీఆర్ చేసే ప్రయత్నాలు బట్టి ఒక విషయాన్ని ఊహించవచ్చు. అతి త్వరలో రాజకీయ తిరుగుబాటు జరగవచ్చన్న భయం ఆయన్ని పట్టి పీడిస్తూ ఉండవచ్చు. టీఆర్ఎస్కు పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి జనరంజకంగా పాలిస్తే ఆయన దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. కాని టీఆర్ఎస్లో కొన్ని సామాజిక వర్గాలు ఉన్నందున ఆయనలో కొంత భయం గూడుకట్టుకుని ఉంది. నిరంతరం సమస్యలను సృష్టించడం, ఆందోళనలు నడపడం ద్వారా ప్రభుత్వంలో భిన్నవైఖరులకు తావులేకుండా చూసుకోవాలన్నది ఆయన వ్యూహం. కేంద్రంలో బీజేపీ సర్కారు మాదిరిగా టీఆర్ఎస్లో కూడా రాజకీయ హేమాహేమీలు, చెప్పుకోదగిన ప్రముఖులెవరూ లేరు. 1978లో రాజకీయాలలో ప్రవేశించిన చంద్రబాబునాయుడు కేంద్రంలో దేవెగౌడ, ఐకే గుజ్రాల్ సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. తర్వాత వాజ్‌పేయి సర్కారుకు కూడా మద్దతునిచ్చారు. పదేళ్లపాటు ప్రతిపక్షంలో గడిపిన తర్వాత ఇటీవలే అధికారంలోకి వచ్చారు. గత 45 రోజుల్లో తెలుగువారు రెండు భిన్నరకాల చంద్రబాబులను చూశారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి అవసరమైన అనుభవం తనవద్ద ఉందని పదేపదే చెప్పారు. అయితే ఆ అనుభవం సరిపోతుందా అన్నది చర్చనీయాంశమే. గానుగెద్దుకు కూడా తన జీవితంలో ఎన్నో చుట్లు తిరిగిన విస్తృతానుభవం ఉంటుంది. అంతమాత్రాన అది సరిపోదు కదా! చంద్రబాబులో కొత్తగా ఎలాంటి ఐడియాలు లేవు. 30 ఏళ్ల క్రితం ఆయన చుట్టూ తిరిగిన వారే ఇప్పుడూ ఉన్నారు. వీరు కొత్తగా ఎలాంటి మార్పులు తీసుకురాలేరు. అవసరానికి మించిన అనుభవం ఆంధ్రప్రదేశ్ కొంపముంచేలా ఉంది. ఢిల్లీ చుట్టూ చంద్రబాబు చక్కర్లు అనుభవం తక్కువగా ఉన్న కేసీఆర్‌కు భిన్నంగా చంద్రబాబు మాటిమాటికీ ఢిల్లీకి చక్కర్లు కొడుతూ నిధుల కోసం దేబిరించడం చూడడానికే ఇబ్బందికరంగా ఉంది. రాజకీయంగా సీనియర్ నేత అయిన చంద్రబాబు కొంచెం హుందాగా వ్యవహరించి తెలుగువారి గౌరవాన్ని నిలబెట్టాలి. కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర జలవనరుల మంత్రి ఉమా భారతిల ముందు ఆయన మోకరిల్లాల్సిన అవసరమేముంది? ముఖ్యమంత్రులు జయలలిత, నవీన్ పట్నాయక్‌లు కేంద్రానికి దూరంగా ఉంటున్నప్పటికీ వారు అడిగిన పనులను మోడీ సర్కారు గౌరవంగా చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఎదుగుతుందని ఆ పార్టీ గట్టి విశ్వాసంతో ఉంది. సామరస్యంగా సమస్యల పరిష్కారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగుజాతి విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కీచులాటలకు స్వస్తి చెప్పాలి. విద్యార్థుల స్కాలర్షిప్లు, మరుగుదొడ్లు, క్యాంటీన్లు వంటి విషయాల్లో ఘర్షణ పంథాకు స్వస్తి చెప్పాలి. విశాల హృదయంతో వ్యవహరించేవారి స్థాయి పెరుగుతుంది. జాతీయ మీడియా, రాజకీయ పార్టీలు ఇదంతా వినోదంగా చూస్తున్నాయి. స్వల్ప విషయాలపై ఘర్షణపడడం మానుకోవాలి. సమస్యలపై ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించుకోవాలి. ముఖ్యంగా విద్యుత్, నదీ జలాలు, ఇతర సమస్యలను నేరుగా మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు. ఉమాభారతి, పీయూష్ గోయల్ వంటి జూనియర్ మంత్రులకు వీటిని పరిష్కరించే సత్తా ఏమీ లేదు. రెండు రాష్ట్రాల సీఎంలు తమ ఢిల్లీ పర్యటనలకు తగిన సందర్భాలలో ప్రతిపక్ష నాయకుల్ని కూడా వెంటబెట్టుకుని తీసుకువెళ్లాలి. దీనివల్ల కేంద్రానికి సానుకూల సంకేతాలు పంపినట్టవుతుంది. లోక్‌సభలో ప్రతిపక్ష హోదా కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎందుకు గట్టిగా పట్టుబడుతున్నారో తెలుసా? రాజకీయాలలో ‘ఇమేజ్’కు ఆమె ఇస్తున్న విలువే దీనికి కారణమని చెప్పాలి. రాజకీయాలలో ఇమేజ్ను కోల్పోతే అంతా కోల్పోయినట్టే. కేసీఆర్, చంద్రబాబునాయుడు కూడా రాజకీయాలలో ప్రతిష్ట విలువ గురించి ఇకనైనా తెలుసుకోవాలి. ప్రతిష్ట మంటగలిసాక, రాజకీయాల్లో నవ్వులపాలయ్యాక ఎవరూ లెక్కచెయ్యరు మరి! (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) పెంటపాటి పుల్లారావు -
నెల రోజుల్లోగా స్కూళ్లలో టాయిలెట్లు ఏర్పాటు చేయండి
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నెల రోజుల్లోగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, తాగునీటి వసతిని కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థులకు టాయిలెట్, తాగునీటి సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని.. 40 శాతం పాఠశాలల్లో కూడా టాయిలెట్ సదుపాయం లేదని ఒక స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణకు తెలంగాణ విద్యాశాఖ అధికారి ఒకరు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోని పాఠశాలల్లో ఈ సదుపాయాలు కల్పించేందుకు సుప్రీంకోర్టు నెల రోజులు గడువు ఇచ్చిందని చెప్పారు. కాగా, సుప్రీం తీర్పు నేపథ్యంలో ఏయే స్కూళ్లలో తాగునీరు, టాయిలెట్ సదుపాయాలు లేవో గుర్తించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆ సౌకర్యాలను కల్పించేందుకు చర్యలను వెంటనే చేపట్టాలని సూచించారు. -
‘ముంపు’ పిల్లలకు ఫీజు బెంగ
1956 కటాఫ్‌తో నష్టపోతామంటున్న భద్రాచలం, పాల్వంచ ప్రజలు హైదరాబాద్: 1956 కన్నా ముందు తెలంగాణలో స్థిరపడిన కుటుంబాలకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వర్తింపజేయాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించినట్లు వస్తున్న కథనాలపై కొన్ని ప్రాంతాల్లోని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో భద్రాచలం, పాల్వంచ డివిజన్ల పరిధిలోని ప్రజలు తీవ్రంగా కలవర పడుతున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఈ రెండు డివిజన్లకు చెందిన విద్యార్థులెవరికీ ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించే అవకాశాలు కనిపించడం లేదు. కేవలం ఈ రెండు డివిజన్లలోనే 60 వేల మందికిపైగా విద్యార్థులు ఫీజుల పథకానికి దూరం కానున్నారు. ఎందుకంటే 1956కు పూర్వం ఈ రెండు డివిజన్లు తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన మూడేళ్ల తర్వాత అంటే 1959 నవంబర్ 17న మళ్లీ ఈ రెండు డివిజన్లను ఖమ్మం జిల్లా పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో 1956 సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే తమ పిల్లలకు అన్యాయం జరుగుతుందని ఇక్కడి వారు అంటున్నారు. ఇప్పటికే పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌తో ఈ ప్రాంతం వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తాజాగా ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వ యోచన వారిని మరింత గందరగోళంలోకి నెట్టినట్లయింది. కాగా, ప్రభుత్వం తక్షణమే ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో మండలి నేత డీఎస్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ రెండు డివిజన్లకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. తెలంగాణ అంతటికీ 1956 నవంబర్ 1కి పూర్వం కటాఫ్‌గా నిర్ణయించినా, భద్రాచలం, పాల్వంచలకు మాత్రం 1959ను కటాఫ్‌గా ప్రకటించాలని కోరారు. మరోవైపు ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ముంపు మండలాలపై ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కూడా అందులో పేర్కొన్నారు. -
‘మధ్యమానేరు’కు కదలిక
ఆగిన ప్రాజెక్టుకు పరుగులు సీఎం సమీక్షలో నిర్ణయం {పాణహిత-చేవెళ్లతో లింక్ సాగు, తాగునీటికి కొత్త ఆశలు అర్ధంతరంగా ఆగిన మధ్యమానేరు ప్రాజెక్టుకు ప్రాణం పోసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మిడ్‌మానేరు వరకు వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. దీంతో మిడ్‌మానేరు ప్రాజెక్టుపై కొత్త ఆశలు చిగురించాయి. ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి మెగా ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనివ్వటంతో అందులో అంతర్భాగమైన మిడ్ మానేరుకు జవజీవం పోసినట్లయింది. నత్తనడకన సాగుతున్న పనులు వేగం పుంజుకోనున్నాయి. - సాక్షి ప్రతినిధి, కరీంనగర్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి జలయుజ్ఞంలో భాగంగా జిల్లాలో మిడ్ మానేరు ప్రాజెక్టును తలపెట్టారు. మెట్ట ప్రాంతంలోని రైతులను ఆదుకునేందుకు ఎనిమిదేళ్ల కిందట పనులు ప్రారంభించారు. కానీ కాంట్రాక్టర్ల గిమ్మిక్కులతో ఈ జలాశయు నిర్మాణం పునాదుల్లోనే ఆగిపోయింది. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని 18 మండలాల్లోని రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ఈ బృహత్తర ప్రాజెక్టును చేపట్టారు. దీంతో సిరిసిల్ల, హుస్నాబాద్ నియోజకవర్గాల పరిధిలోని 10 మండలాలు, 157 గ్రామాలకు సాగునీరు, తాగునీటి సమస్య తీరిపోనుంది. బోయినపల్లి మండ లం మాన్వాడ వద్ద 25.873 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు 2006లో మిడ్‌మానేరు జలాశయానికి అప్పటి సీఎం వైఎస్ శంకుస్థాపన చేశారు. మొదటిసారి రూ.339.39 కోట్లకే పనులు చేసేందుకు ముందుకు వచ్చిన కంపెనీ అడ్వాన్సులు తీసుకొని చేతులెత్తేసింది. నిదానంగా తేరుకున్న సర్కారు నాలుగేళ్ల తర్వాత రూ.454 కోట్ల అంచనాలతో మరోసారి టెండర్లు పిలిచింది. 20 శాతం లెస్‌కు రూ.360.90 కోట్లకు ఎంఎస్ ఎస్ఏపీఎల్, అండ్ ఎంబీఎల్, ఐవీఆర్సీఎల్ అనే సంస్థలు జాయింట్ వెంచర్లో పనులు దక్కించుకున్నారుు. 2012 ఏప్రిల్ 23న మంత్రులు శ్రీధర్‌బాబు, సుదర్శన్‌రెడ్డి రెండో దఫా పనులను ప్రారంభించారు. ఒప్పందం ప్రకారం 2015 ఏప్రిల్ నాటికి రిజర్వాయుర్ నిర్మాణం పూర్తి కావాలి. కానీ.. ఇప్పటికీ 20 శాతం పనులు పూర్తి కాలేదు. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ పరిసరాల్లో స్పిల్‌వే నిర్మాణంలో ఉంది. రిజర్వాయుర్కు 25 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రాజెక్ట్ పనుల్లో బాగంగా క్రాస్ రెగ్యులేటర్లు, రెండు తూము లు నిర్మించాల్సి ఉంది. బోయినపల్లి మండలం కొదురుపాక, నీలోజిపల్లె వద్ద కట్ట నిర్మాణం జరిగింది. మానేరు అవతలి వైపు ఇల్లంతకుంట మండలం గుర్రంవానిపల్లె, సిరిసిల్ల మం డలం చీర్లవంచ వైపు కట్ట నిర్మించారు. ప్రధాన కట్ట నిర్మాణం కొంత మేరకు పూర్తికాగా.. రాతి కట్టడాలు (రివిట్మెంట్) పూర్తి కాలేదు. కోట్ల రూపాయలతో జలాశయం చుట్టూ నిర్మిం చిన కట్టలు కనపడకుండా చెట్లు, పిచ్చిమొక్కలు, ముల్లపొదలు ఏర్పడి నిర్వీర్యమై వాటి ఆనవాల్లే కనపడడంలేదు. ఇప్పటికే కురిసిన వర్షాలతో అడుగడుగునా కట్టలకు గండ్లు పడ్డా యి. శ్రీరాంసాగర్ మిగులు జలాలను సద్వినియోగం చేసేం దుకు ఎస్సారెస్పీ నుంచి గతంలో 122 కిలోమీటర్ల పొడవున వరద కాలువ పూర్తి చేశారు. ఈ కాల్వ ద్వారా వచ్చిన వరద నీటిని సైతంనిల్వ చేసేందుకు వీలుగా ఈ రిజర్వాయుర్ డిజైన్ చేశారు. జలాశయంలో ముంపునకు గురయ్యే సిరిసిల్ల మండలంలోని చీర్లవంచ, చింతల్‌ఠాణా, వేములవాడ మండలంలోని అనుపురం, కొడుముంజ, రుద్రవరం, సంకెపల్లి, బోయినపల్లి మండలంలోని వర్దవెల్లి, కొదురుపాక, నీలోజిపల్లె, శాభాష్‌పల్లి గ్రామాల్లో నిర్వాసితులకు పరిహారం అసంపూర్ణంగా అందింది. నిర్వాసితుల సమస్యలతోపాటు ఈ ప్రాజెక్టుపై సర్కారు నిర్లక్ష్యం.. నిధుల కేటాయింపు తీరును ఎండగట్టేందుకు గతంలో ఇదే రిజర్వాయర్ సమీపంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వంటావార్పు చేపట్టి ఆందోళన చేశారు. తాజాగా సీఎం హోదాలో కేసీఆర్ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రాణహిత-చేవెళ్లతో లింక్ ఇలా.. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత నుంచి 160 టీఎంసీలు, ఎల్లంపల్లి బ్యారేజీ సమీపంలో గోదావరి నుంచి 20 టీఎంసీల నీటిని మెట్టప్రాంతాలకు మళ్లించేందుకు డాక్టర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. జలయజ్ఞంలో భాగంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మెగా ప్రాజెక్టును ప్రారంభించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 16.40 లక్షల ఎకరాలకు సాగునీటిని, జంట నగరాలకు, ప్రాజెక్టు విస్తరించిన పరిధిలోని గ్రామాలకు తాగునీటిని, పారిశ్రామిక అవసరాలకు సైతం నీటిని అందించే బహుళ ప్రయోజనాలుండేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ప్రాజెక్టును మొత్తం ఏడు లింక్‌లుగా విభజించారు. మొదటి లింక్‌లో ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మెడిహట్టి సమీపంలో నిర్మించే ప్రాణహిత బ్యారేజీ నుంచి గోదావరిఖని సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలిస్తారు. రెండో లింక్‌లో ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీటిని తరలిస్తారు. మూడో లింక్‌లో మిడ్ మానేరు నుంచి గంభీరావుపేట సమీపంలో ఉన్న ఎగువ మానేరుకు, నాలుగో లింక్‌లో మిడ్ మానేరు నుంచి మెదక్ జిల్లాలోని పాములపర్తి రిజర్వాయర్‌కు నీటిని మళ్లించాల్సి ఉంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మిడ్ మానేరు వరకు ప్రాణహిత ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించటంతో.. జిల్లా పరిధిలో దాదాపు 80 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. -
'డ్యాం సిబ్బంది నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం'
-
అదో ‘శాపం’
పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలి ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే కొనసాగించాలి రైతు రుణాలను మాఫీ చేసి,కొత్త రుణాలు ఇవ్వాలి విత్తనాల సరఫరాలో జాప్యం వీడి రైతులను ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి సీఎం, మంత్రులను కలిసిన ఖమ్మం ఎంపీ ఖమ్మం గాంధీచౌక్: పోలవరంపై కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్‌ను రద్దుచేసి తెలంగాణలోనే కొనసాగించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు విజ్ఞప్తి చేశారు. పొంగులేటి హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, ఐటీ మంత్రి కేటీఆర్, విద్యాశాఖమంత్రి జగదీశ్వర్ రెడ్డిలను కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటి రైతు రుణాలను వీలైనంత త్వరగా మాఫీ చేసి కొత్తరుణాలను మంజూరు చేయాలని కోరారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా నేటి వరకు అందాల్సిన విత్తనాలు దొరకక రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వెంటనే సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, కొన్ని ప్రాంతాల్లో ప్రజలు కిలోమీటర్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారని వివరించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి సాగర్ జలాలను విడుదల చేసి చెరువులను నింపాలని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థులు, కళాశాల యాజమాన్యాల్లో నెలకొన్న సందిగ్ధతను తొలగించాలన్నారు. కళాశాల యాజమాన్యాలకు దిశానిర్దేశం చేయాలన్నారు. పోలవరానికి వ్యతిరేకంగా పోరాడుతాం.. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో వెలువడిన పోలవరం ఆర్డినెన్స్‌ను తక్షణమే రద్దుచేయాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ముంపు ప్రాంతాల విలీనానికి వ్యతిరేకంగా అ టు పార్లమెంట్‌లోనూ, ఇటు జిల్లావాసిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాలు ముమ్మరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పోలవరానికి వ్యతిరేకంగా పోరాడే రాజకీయపక్షాలు, ప్రజా సంఘాలకు తమ మద్దతు ఉంటుందన్నారు. అమాయక గిరిజనులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రైతు రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చరేయాలని కోరారు. బియాస్ మృతుల వెతుకులాటలో జాప్యంపై పొంగులేటి మండిపడ్డారు. విద్యార్థులు గల్లంతై వారం దాటినా మృతదేహాలను వెలికి తీయకుండా వారి తల్లిదండ్రులను తీరని వేదనకు గురిచేస్తున్నారని వాపోయారు. మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేవారు. జిల్లాకు చెందిన బియాస్ మృతులు కిరణ్, ఉపేందర్ల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన జిల్లావాసి సాధనపల్లి ఆనంద్‌కుమార్, నిజామాబాద్‌కు చెందిన పూర్ణలను అభినందించారు. ఇటువంటి సాహసికులకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇస్తూ ముందుకు తీసుకు వెళ్లాలని కోరారు. జిల్లాకు చెందిన ఆనంద్‌కు తాను అండగా ఉంటానని పొంగులేటి పేర్కొన్నారు. త్వరలోనే ఈ విద్యార్థులను కలవనున్నట్లు ఆయన ప్రకటించారు. -
టీడీపీ చెల్లని పైసా: టీఆర్ఎస్
హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ చెల్లని పైసాగా మారిందని టీఆర్ఎస్ శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్, అధికార ప్రతినిధి కె.రాజయ్య యాదవ్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. శాసనసభాపక్ష కార్యాలయంలో విలేకరులతో ఈశ్వర్ మాట్లాడుతూ మద్యం విధానం, శాసనసభ సమావేశాల తీరుపై టీడీపీ తెలంగాణ అధ్యక్షులు ఎల్.రమణ చేసిన ఆరోపణలు దారుణమన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు హూందాగా వ్యవహరించారన్నారు. టీడీపీ సభ్యులకు పోలవరం ఆర్డినెన్సుపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ చవకబారు విమర్శలకు దిగడం మంచిది కాదన్నారు. అబద్దాలు మాట్లాడితే కోర్టుకీడుస్తాం: రాజయ్య యాదవ్ టీఆర్ఎస్ను, కేసీఆర్‌ను అప్రతిష్ట పాల్జేయడానికి అబద్దాలు మాట్లాడితే తెలంగాణ టీడీపీ నేతలను కోర్టుకు ఈడుస్తామని అధికార ప్రతినిధి కె.రాజయ్య యాదవ్ హెచ్చరించారు. తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ మద్యం విధానం, రైతు రుణమాఫీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అయినా టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడటం దారుణమన్నారు. అందుకే టీడీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తెలంగాణ ప్రజలు బుద్డి చెప్పారని గుర్తుచేశారు. -
'తల్లిదండ్రులకు మిస్సింగ్, డెత్ సర్టిఫికెట్లు'
-
అకస్మాత్తుగా నదిలో నీరు పెరగడంతోనే...
మండి : బియాస్ నదిలో గల్లంతు అయిన విద్యార్థుల తల్లిదండ్రులకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మిస్సింగ్, డెత్ సర్టిఫికెట్లను అందచేసింది. అకస్మాత్తుగా నదిలో నీరు పెరగటం వల్లే విద్యార్థులు కొట్టుకుపోయారని హిమాచల్ ప్రభుత్వం ధ్రువీకరించింది. మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఎఫ్ఐఆర్ కాపీలను అందచేసింది. మృతదేహాలు లభ్యమైతే హైదరాబాద్‌కు తరలిస్తామని హిమాచల్ ప్రభుత్వ అధికారులు...విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు. గత పదిరోజులుగా జరిగిన గాలింపు చర్యల్లో తమ పిల్లల జాడ తెలియక తల్లిదండ్రులు నిరాశతో వెనుదిరిగారు. మరోవైపు తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హిమాచల్ ప్రదేశ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. విద్యార్థుల గల్లంతుపై ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక సమర్పించనున్నారు. కాగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ముమ్మర గాలింపులు బియాస్‌నదిలో గల్లంతైన విద్యార్థుల మతదేహాలను వెలికితీయడంలో విఫలమయ్యాయి. భారీ స్థాయిలో గాలింపు చర్యలు జరిగినప్పటికీ ఒక్క మతదేహం కూడా బయటపడలేదు. సైడ్ సోనార్ పరికరాలు, మానవ రహిత విమానాలు ఉపయోగించినా, నీటి విడుదలను పూర్తిగా ఆపివేసి సంఘటనాస్థలంలో గజ ఈతగాళ్లు విస్తతంగా గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. 24మంది గల్లంతు కాగా కేవలం ఎనిమిది మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగతావారి జాడ తెలియలేదు. గల్లంతైన వారిలో 16 మంది విద్యార్థుల జాడ తెలియక పోవడంతో వారి తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా ఉంది. -
ప్రభుత్వం మాటలకే పరిమితం కావద్దు
బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హైదరాబాద్: తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో స్పష్టమైన వైఖరితో ముందుకు సాగాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వడంతో పాటు పాలనలో వేగం పెంచాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో 10 తీర్మానాలను తూతూ మంత్రంగా ఆమోదించారే తప్ప.. కనీస చర్చ జరపలేదన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో పాత రుణం చెల్లిస్తే గానీ, బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేసే పరిస్థితి లేదని, దీనిని దృష్టిలో పెట్టుకొని రుణమాఫీపై ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాల వంటి వాటి విషయంలో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నాయని, ఇళ్ల నిర్మాణ పథకం నిలిచిపోయిందని.. టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూంలు కట్టిస్తామని ప్రకటించడంతో లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారని చెప్పారు. అలాగే, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, దీంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల అడ్మిషన్ల విషయంలో ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతున్నాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎక్సైజ్ పాలసీలో కూడా బెల్టు షాపులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోలేదని, గత ప్రభుత్వం వైన్‌షాపుల నుంచి బార్లను వేరు చేయకపోవడంతో టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ముస్లిం రిజర్వేషన్లు అమలు జరిగే ప్రసక్తే లేదని, దీనిని తాము అడ్డుకుంటామన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. సోమవారం నగరంలో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుందని, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి సతీష్జీ పర్యవేక్షణలో ఈ సమావేశం జరుగుతుందన్నారు. రాష్ట్ర పదాధికారులు, జాతీయ నాయకులు, జిల్లాల అధ్యక్షులు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు ప్రకాష్‌రెడ్డి, ప్రదీప్ కుమార్, భీంరావు తదితరులు పాల్గొన్నారు. -
జాడ చెబితే 10 వేల బహుమతి
విద్యార్థుల మృతదేహాల కోసం హోంమంత్రి నాయిని ప్రకటన మండి జిల్లా, బియాస్ నదీపరీవాహక గ్రామాల్లో చాటింపు దుర్ఘటనపై సీఎంకు నివేదిక హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల జాడ తెలిపిన వారికి రూ.10 వేల బహుమతి ఇస్తామని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు బియాస్ నదీ పరీవాహక ప్రాంతంలోని గ్రామాలతోపాటు మండి జిల్లాలో చాటింపు వేయించినట్లు తెలిపారు. ఆ గ్రామాలకు గల్లంతైన విద్యార్థుల ఫోటోలను పంపించామన్నారు. అలాగే, బియాస్ నదీ పరీవాహకప్రాంతంలో ప్రభుత్వ సిబ్బందిని నియమించి నీటిలో ఏదైనా మృతదేహం కనిపిస్తే సమాచారం ఇచ్చేలా ఏర్పాట్లు చేయమని మండి జిల్లా కలెక్టరును, రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరామన్నారు. లార్జి డ్యాం వద్ద సహాయక చర్యలను గత ఎనిమిది రోజులుగా పర్యవేక్షిస్తున్న నాయిని నర్సింహారెడ్డి ఆదివారం రాత్రి ‘సాక్షి’తో మాట్లాడారు. విద్యార్థుల దుర్మరణానికి కారణమైన ఘటనపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు సమగ్ర నివేదిక ఇవ్వనున్నానని చెప్పారు. దాని ఆధారంగా విజ్ఞాన్‌జ్యోతి కాలేజీ యాజమాన్యంపై ఎలాంటి చర్య తీసుకోవాలనేది సీఎం నిర్ణయిస్తారని నాయిని వివరించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా గేట్లు తెరిచిన లార్జి ప్రాజెక్టు అధికారులపైన కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. దానికి సంబంధించి ఇక్కడి జిల్లా కలెక్టరు నివేదికను రూపొందిస్తున్నారన్నారు. ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు కాకుండా వారి బంధువులు ఉంటారని, అలాగే, కాలేజీ తరఫున మరో ఇద్దరు ఇక్కడే ఉంటారని నాయిని చెప్పారు. అవసరమైతే మృతదేహాలకు డీఎన్ఏ పరీక్ష కూడా చేయిస్తామని వెల్లడించారు. తాను, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మీనా సోమవారం హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నామని, తమస్థానంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర క్రీడల శాఖ కార్యదర్శి అగర్వాల్‌లు ఇక్కడికి వచ్చి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారని నాయిని వెల్లడించారు. స్పెషల్ బెటాలియన్ అదనపు డీజీ రాజీవ్‌త్రివేది సైతం మృత దేహాలు దొరికేంతవరకు తన టీమ్‌తో ఇక్కడే ఉంటారన్నారు. ఎనిమిదో రోజూ ఫలితమివ్వని గాలింపు ఆదివారం ఎనిమిదో రోజు లార్జి, పాండో డ్యాంలలో గాలింపు బృందాలు.. నదీజలాల లోతుల్లో ఉన్న వాటిని కూడా గుర్తించగల అత్యాధునిక సోనార్ పరికరం ద్వారా ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గాలింపు జరిపినా ఒక్క మృతదేహాన్ని కూడా కనుక్కోలేకపోయాయి. నౌకా దళానికి చెందిన గజ ఈతగాళ్ల బృందం పాండో డ్యాం నుంచి లార్జి డ్యాం వరకు 17 కిలోమీటర్ల మేర జల్లెడ పట్టినా ఫలితం లేకపోయింది. రాష్ట్రం నుంచి వెళ్లిన రాజీవ్ త్రివేది సైతం తన 25 మంది బృందంతో గాలింపు చర్యల్లో పాలుపంచుకున్నారు. పాండో డ్యాంకు ఎగువన మృతదేహాలు ఉండవచ్చని అనుమానించిన నేవీ అధికారులు ఆ ప్రాంతంలో కొన్ని గుర్తులు ఏర్పాటు చేసుకున్నారు. సోమవారం ఉదయం ఆ ప్రాంతాల్లో లోతుగా గాలించాలని నిర్ణయించారు. పెను ప్రమాదం జరిగి ఎనిమిది రోజులవుతున్నా గల్లంతైన వారిలో 16 మంది విద్యార్థుల జాడ తెలియక పోవడంతో వారి తల్లిదండ్రుల వేదన వర్ణణాతీతంగా ఉంది. కనీసం మా బిడ్డల మృతదేహాలైనా తెచ్చి ఇవ్వండంటూ మంత్రి నాయిని ముందు కన్నీరుమున్నీరవుతున్నారు. బురద లేదా బండరాళ్ల మధ్య ఒకవేళ మృతదేహాలు చిక్కుకుని ఉంటే పై నుంచి నీటిని వేగంగా వదలడం వల్ల అవి పైకి తేలే అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ సూచించారని, అయితే అందుకు విద్యార్థుల తల్లిదండ్రులు అంగీకరించలేదని నాయిని తెలిపారు. అది ఇసుక తవ్వకం కోసం వేసిన రోడ్డు సిమ్లా: బియాస్ నదిలో తెలుగు విద్యార్థుల దుర్మరణం.. హిమాచల్ ప్రదేశ్‌లో అక్రమ ఇసుక తవ్వకాల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. డ్యాం కిందనున్న నదిలోకి విద్యార్థులు ఇసుక తవ్వకం కోసం వేసిన ఒక అక్రమ రోడ్డు ద్వారానే వెళ్లారు. ఆ దుర్ఘటనను చిత్రీకరించిన వీడియోలోనూ నదీతీరం నుంచి ఇసుకను తీసుకువెళ్తున్న ఒక ట్రాక్టర్ కనిపించింది. ఈ నేపథ్యంలో.. విద్యార్థులు గల్లంతైన ప్రాంతాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ముఖేశ్ అగ్నిహోత్రి ఆదివారం సందర్శించారు. అక్రమ ఇసుక తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నదీతీరానికి దారితీసే అన్ని అనధికార దారులను మూసేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఫీజులు వాపసు: నాయిని విహారయాత్రలో మృతిచెందిన విద్యార్థులు చెల్లించిన ఫీజులను తిరిగి చెల్లించేందుకు విజ్ఞానజ్యోతి కాలేజీ యాజమాన్యం అంగీకరించిందని నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. బ్యాంకు రుణం ద్వారా ఫీజులు చెల్లించి ఉంటే, దానిని కూడా మాఫీ చేయిస్తారని చెప్పారు. అలాగే, మృతుల కుటుంబానికి చెందిన వారికి తమ కాలేజీలో ఇంజనీరింగ్ సీటును ఉచితంగా ఇచ్చేందుకు కూడా కాలేజీ యాజమాన్యం ఒప్పుకుందని తెలి పారు. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగమిచ్చే విషయంలో.. తమ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూలను జరిపి ఎంపిక చేస్తామని, అవసరమైతే నిబంధనలను పక్కనబెట్టే విషయాన్ని కూడా ఆలోచిస్తామని వారు హామీ ఇచ్చారని నాయిని తెలిపారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విషయంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారన్నారు. -
పరిశ్రమలకు ‘మహాభాగ్య’నగరి: కేటీఆర్
హైదరాబాద్: దేశంలోనే హైదరాబాద్‌ను పారిశ్రామికంగా మొదటిస్థానంలో నిలిపేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఐటీ,పంచాయతీరాజ్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు( కేటీఆర్) తెలిపారు. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా-9 ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, పెట్టుబడులు, వ్యాపారాలు అనువైన పరిస్థితులపై విశ్లేషించేందుకు, సందేహాలు నివృత్తి చేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారందరికీ తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే నగరంలో ఐటీ, ఫార్మా, బల్క్‌డ్రగ్, బయోటెక్నాలజీ, సీడ్, పౌల్ట్రీ పరిశ్రమలు విస్తరించాయన్నారు. ఆయారంగాల్లో మరిన్ని పెట్టుబడులను తాము ఆహ్వానిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఐఎస్బీ, ఐఐఐటీలతో కలసి దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌కు రూపకల్పన చేస్తామన్నారు. హైదరాబాద్‌ను వైఫై నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసే ఆలోచనలో ఉన్నామని, తద్వారా నగరఖ్యాతిని పెంపొందించడమే కాకుండా ఆకర్షణీయమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. లక్షకుపైగా ఇంజనీరింగ్ తదితర గ్రాడ్యుయేట్లు ప్రతి ఏటా ఉత్తీర్ణులై బయటకు వస్తున్నారని వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రభుత్వం సంధానకర్తగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రౌంట్ టేబుల్ ఇండియా 9 ప్రతినిధులు రియాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
విపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేఖ, సురేఖ, లక్ష్మి, శోభ హైదరాబాద్: ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందించాలని, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే కృషిలో కలసి రావాలని టీఆర్ఎస్ మహిళా శాసనసభ్యులు అజ్మీరా రేఖ, కొండా సురేఖ, బొడిగె శోభ, కోవ లక్ష్మి విపక్షాలను కోరారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మీడియాతో మాట్లాడారు. సభలో కేసీఆర్ చేసిన ప్రసంగం ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగించిందని పేర్కొన్నారు. రుణాల రీషెడ్యూలు, ఫీజు రీయింబర్స్మెంట్లపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని సీఎం చెప్పారని, ఈ అంశాలపై విపక్షాలు గందరగోళం సృష్టించవద్దని సూచించారు. సాహసోపేత నిర్ణయం: జూపల్లి, రవీందర్‌రెడ్డి 20 వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించడం సాహసోపేతమని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. బంగారు ఆభరణాలమీద తీసుకున్న రుణాలకు కూడా మాఫీ వర్తిస్తుందని ప్రకటించడంతో విపక్షాలకు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఎదురయ్యిందన్నారు. రుణమాఫీపై కొన్నిపార్టీలు రైతులను తప్పుదోవ పట్టించాయన్నారు. ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నాలను మానుకోవాలని వారు కోరారు. రిజర్వేషన్ల హామీపై అనుమానాలు: జీవన్‌రెడ్డి శాసనసభలో ముఖ్యమంత్రి మాటలను వింటే ముస్లిం రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకుంటారా అన్న సందేహం కలుగుతున్నదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి. జీవన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో స్పష్టమైన హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ముస్లింల కు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నం చేస్తామనడం బాధ్యతారాహిత్యమేనన్నా రు. తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులను స్వాతంత్య్ర సమరయోధులుగా ప్రకటించడం సాధ్యం కాదని చెప్పడం ఉద్యమకారులను అవమానించడమేనన్నారు. ఏపీ సచివాలయం ఎల్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనా కేంద్రమైన సచివాలయంలోని ఎల్ బ్లాక్ మూడో అంతస్తులో శుక్రవారం సాయంత్రం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. స్విచ్‌బోర్డు వద్ద షార్ట్ సర్క్యూట్ అవడంతో మంటలు రేగాయి. అయితే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. ఈ సంఘటనలో ఎలాంటి ఆస్తినష్టం వాటిల్లలేదు. ఇదే ఎల్ బ్లాక్‌లోని 8వ అంతస్తులో ఆంధ్రప్రదేశ్ సీఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుండడం తెలిసిందే. -
22న మంత్రివర్గ విస్తరణ?
అసెంబ్లీ పదవులతో తగ్గిన ఒత్తిడి అయినా ఆశావహులు చాలామందే హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ నెల 22న ఉండే అవకాశముంది. జూన్ 2న ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్‌రావు, మరో 11 మంది మంత్రులు గా ప్రమాణం చేసినపుడు మరోవారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 22 వ తేదీకంటే ముందే మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం నిర్ణయిస్తే, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత ఈ నెల 18 న విస్తరణ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కేసీఆర్ సన్నిహితుడొకరు వెల్లడించారు. మంత్రిపదవుల కోసం ఆశావహుల జాబితా పెద్దగా ఉండడంతో ఒత్తిడిని తగ్గించుకోవడానికి శాసనసభ పదవులను కేసీఆర్ వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్రమంత్రివర్గంలో తప్పకుండా స్థానం దక్కుతుందని ఆశించిన పలువురు పార్టీ సీనియర్లకు శాసనసభలోనూ, మండలిలోనూ వివిధ హోదాల్లో అవకాశాలను కల్పిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన ఎస్.మధుసూదనాచారిని అసెంబ్లీ స్పీకర్‌గా చేశారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన పద్మా దేవేందర్ రెడ్డిని డిప్యూటీ స్పీకర్‌గా చేశారు. రెండోసారి గెలిచిన నల్లాల ఓదెలును చీఫ్‌విప్‌గా, విప్‌లుగా మరికొం దరు సీనియర్లను చేస్తున్నారు. మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో పాటు ఉద్యోగుల వ్యవహారాలను అప్పగిస్తామని ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌కు కేసీఆర్ గతంలో బహిరంగసభల్లోనే వాగ్దానం చేశారు. ఇప్పుడాయనకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా అవకాశం కల్పించాలనుకుంటున్నారు. శాసనసభ, శాసనమండలి పదవులతో మంత్రివర్గంపై ఆశావహుల ఒత్తిడిని కేసీఆర్ కొంతవరకు తగ్గించుకోగలిగారు. 12 మందితో ఏర్పాటైన తెలంగాణ మంత్రివర్గంలో మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు అవకాశం దక్కలేదు. మెదక్ (కేసీఆర్, హరీశ్‌రావు), కరీంనగర్ (ఈటెల రాజేందర్, కేటీఆర్) జిల్లాలకు రెండేసి మంత్రిపదవులు దక్కాయి. హైదరాబాద్‌లో నాయిని, టి.పద్మారావు, మహమూద్ అలీలకు ఇవ్వడం ద్వారా ముగ్గురికి అవకాశం కల్పించారు. మిగిలిన రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి మంత్రివర్గంలో ఒక్కొక్కరికి అవకాశం దక్కింది. అయితే వరంగల్‌కు స్పీకర్, మెదక్‌కు డిప్యూటీ స్పీకర్ పదవులు అదనంగా దక్కాయి. కాగా, మలిదశ విస్తరణలో ముందుగా మహబూబ్‌నగర్‌కు తప్పనిసరిగా అవకాశం ఇవ్వాల్సి ఉంది. ఖమ్మం జిల్లాలో జలగం వెంకట్రావు ఒక్కరు మాత్రమే ఎమ్మెల్యేగా ఉండడంతో దీనిపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అర్థం కావడం లేదు. కేసీఆర్‌కు చెందిన సామాజికవర్గం నుండి ఇప్పటికే మంత్రివర్గంలో ముగ్గురు (కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు) ఉన్నారు. మహబూబ్‌నగర్ నుండి జూపల్లి కృష్ణారావుకు తప్పనిసరిగా అవకాశం కల్పించే అవకాశం ఉంది. దీనితో ఆ సామాజికవర్గానికి మంత్రివర్గంలో సంఖ్య 4కు చేరుతుంది. అదే సామాజికవర్గానికి చెందిన జలగం వెంకట్రావుకు అవకాశం వస్తుందా అనేది అనుమానమే. వరంగల్ జిల్లా నుండి చందూలాల్, కొండా సురేఖ వంటి సీనియర్లు మంత్రివర్గంలో స్థానాన్ని ఆశిస్తున్నారు. మహబూబ్‌నగర్ నుండి సి.లక్ష్మా రెడ్డికి కూడా అవకాశం కల్పించనున్నారు. వి.శ్రీనివాస్‌గౌడ్ కూడా అమాత్యపదవిని ఆశిస్తున్నారు. కరీంనగర్ నుండి కొప్పుల ఈశ్వర్‌కు అవకాశం ఇవ్వాల్సి ఉంది. నిజామాబాద్ నుండి గంపా గోవర్ధన్, ఏనుగు రవీందర్ రెడ్డిలు ఆశిస్తుండగా వీరిలో ఒకరికి అవకాశం రానుంది. ఆదిలాబాద్‌లోని ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల్లో ఒకరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. -
మా వాళ్లు రాజకీయంగా అమరులయ్యారు
నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్య హైదరాబాద్: తెలంగాణ కోసం వందలాది మంది యువకులు ప్రాణత్యాగాలు చేసి అమరవీరులైతే.. అదే అంశంపై పోరాడిన తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీలు రాజకీయంగా అమరులయ్యారని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కె.చంద్రశేఖరరావును అభినందించేందుకు గురువారం అసెంబ్లీ లాబీకి వచ్చిన సందర్భంగా గుత్తా... విలేకర్లతో ముచ్చటించారు. కాంగ్రెస్‌పై కక్షతో ప్రజలు దేశవ్యాప్తంగా పార్టీని ఓడిస్తే తెలంగాణ రాష్ట్రమిచ్చినా కనికరం లేకుండా ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలను సైతం ఓడించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం అమరులైన వారు కొత్త రాష్ట్రాన్ని చూడలేకపోయినా ఆ అదృష్టం తమ పార్టీ నేతలకు కలిగిందన్నారు. అంతకుముందు గుత్తా సీఎంను కలిసి జిల్లా సమస్యలపై వినతి పత్రం అందజేశారు. -
తెలంగాణ రైల్వేకు వెయ్యి కోట్లివ్వాలి
రైల్వే మంత్రికి ఎంపీ దత్తాత్రేయ విజ్ఞప్తి న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి పనుల కోసం 2014-15 బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించాలని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడకు విజ్ఞప్తి చేశారు. అత్యాధునిక సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని విన్నవించారు. తెలంగాణలో చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టుల వివరాలతో కూడిన వినతిపత్రాన్ని గురువారం ఆయన రైల్వేమంత్రికి అందచేశారు. హైదరాబాద్- ఢిల్లీ, హైదరాబాద్- బికనీర్ మధ్య బుల్లెట్ రైళ్లను నడిపించాలని, సికింద్రాబాద్-బికనీర్, సికింద్రాబాద్ రాజ్‌కోట్‌ల మధ్య నడుస్తున్న సూపర్‌ఫాస్ట్ రైళ్లను ఇక మీదట రోజూ నడిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సికింద్రాబాద్-కాజీపేట మధ్య మూడో లైను ఏర్పాటు చేయాలని, సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలోని నిజామాబాద్, ఆదిలాబాద్ లైను విద్యుదీకరణ చేయాలని, కరీంనగర్-హసన్‌పర్తి లైనుకు నిధులు కేటాయించాలని ఆయన కోరారు. మణుగూరు-రామగుండం, భద్రాచలం-కొవ్వూరు, మెదక్-అక్కన్నపేట మధ్య కొత్త లైన్లను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్-మధురై (వయా తిరుపతి), సికింద్రాబాద్‌లో రాత్రి 9 గంటలకు బయలు దేరి మరుసటిరోజు ఉదయం 6.30 గంటలకు బెంగుళూరు చేరేలా షెడ్యూల్‌తో కొత్త రైలును ఏర్పాటు చేయాలని, సికింద్రాబాద్-మహబూబ్‌నగర్, హైదరాబాద్-భద్రాచలం రోడ్, సికింద్రాబాద్-నల్లగొండ, కాజీపేట-కాగజ్‌నగర్‌ల మధ్య ఇంటర్ సిటీ, సికింద్రాబాద్-గోవా, హైదరాబాద్-ముంబై మధ్య సూపర్‌ఫాస్ట్ రైళ్లను ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు. -
ప్రయోజనం లేని పథకాలను పరిహరిద్దాం!
అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ఆదేశం ఈనెల 30 లోగా బడ్జెట్ అంచనాలను పంపించాలని ఉత్తర్వులు హైదరాబాద్: ప్రణాళికేతర పథకాల కొనసాగింపు అవసరమా..? అవసరం లేని పథకాలకు నిధులు కేటాయించకపోతే ఏర్పడే పరిణామాలు ఏమిటన్న వివరాలను లోతుగా పరిశీలించాలని ఆర్థిక శాఖ అన్ని శాఖలను ఆదేశించింది. ఎలాంటి ప్రయోజనం లేని పథకాలను కొనసాగించడం కంటే వాటిని మూసేయడం, దశలవారీగా తగ్గించే అంశాలను కూడా పరిశీలించాలని స్పష్టం చేసింది. అలాంటి పథకాలకు నిధుల కోరే సమయంలో పూర్తి హేతుబద్ధత ఉండాలని సూచించాలని కోరింది. అనేక శాఖలు ఎలాంటి కసరత్తు లేకుండా బడ్జెట్ అంచనాలను పంపిస్తున్నాయని, అలా కాకుండా పూర్తిస్థాయి అధ్యయనం తరువాతే పంపించాలని స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ అంచనాలను ఈనెల 30వ తేదీలోగా పంపించాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆయా విభాగాల అధిపతులు తమ బడ్జెట్ అంచనాలను 25వ తేదీలోగా సంబంధిత శాఖల అధిపతులకు సమర్పిస్తే శాఖాధిపతుల స్థాయిలోనే వాటిని పరిశీలించాలని సూచించారు. కార్యాలయ వ్యయం కింద చూపే పద్దులో మంచినీరు, విద్యుత్ బిల్లుల అంశాన్ని స్పష్టంగా పేర్కొనాలని, ఏ అవసరం కోసం పరికరాలు కొనుగోలు చేస్తామన్న అంశాన్ని వివరించాల్సి ఉంటుందని ఆర్థికశాఖ పేర్కొంది. విద్యుత్, నీటి బకాయిలున్న పక్షంలో ఎంత మొత్తం బకాయిలున్నాయో వివరించడంతోపాటు, చెల్లించకపోవడానికి గల కారణాలను విశదీకరించాలని కోరారు. మరిన్ని ఆదేశాలు ఈ విధంగా ఉన్నాయిప్రణాళిక వ్యయాన్ని ప్రణాళికేతర వ్యయాన్ని కలపడానికి వీల్లేదు. తెలంగాణ రాష్ట్రానికి అనుగుణమైన ప్రణాళిక పథకాలనే అంచనాల్లో రూపొందించాలి.కొత్త పథకాలైతే ఎప్పుడు ప్రారంభించారు. ఎంత వ్యయం అయింది. ఈ సంవత్సరంలో ఎంత కావాల్సి ఉంది అన్న వివరాలను పొందుపర్చాలి. ఈ పథకాన్ని ఆమోదించిన తేదీని కూడా పేర్కొనాలి.ఆన్లైన్లో సంబంధిత శాఖలకు విభాగాల అధిపతులు అంచనాలను 25లోగా ఇవ్వాలి. ఆయా శాఖలు జూన్ 30లోగా ఆర్థిక శాఖకు పంపించాలి.జూన్ 30వ తేదీ తరువాత వచ్చే అంచనాలను బడ్జెట్లో పొందుపర్చడం సాధ్యం కాదు.ఆమోదించిన పథకంలో తొలగింపులు, మార్పులు చేయరాదు. ప్రస్తుతమున్న బడ్జెట్‌పై మరీ ఎక్కువ అంచనాలు వేసి పంపించవద్దు. ఒకవేళ బడ్జెట్ పెంచాల్సివస్తే.. అందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులను జత చేయాలి.కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు, రేట్ కాంట్రాక్టు, పీరియడ్ ఆఫ్ కాంట్రాక్టు, ఎంతమంది ఉన్నారన్న వివరాలు ఇవ్వాలి.సబార్డినేట్ ఉద్యోగుల యూనిఫాం కోసం కేటాయించిన నిధులను ఇతరత్రా మళ్లించరాదు. -
టీడీఎల్పీ ఫ్లోర్‌లీడర్‌గా బీసీలు పనికిరారా?
సీఎంగా పనికొచ్చే వ్యక్తి ఫ్లోర్‌లీడర్‌గా అనర్హుడా: బీసీ సంఘాల ప్రశ్న తలసాని, ఆర్.కృష్ణయ్యలకుటీ టీడీఎల్పీలో ఏ పదవులు ఇవ్వని బాబు ఉప నాయకులుగా రేవంత్, సండ్ర,విప్‌గా ప్రకాశ్ గౌడ్, కోశాధికారిగా మాగంటి బాబు నిర్ణయంపై తలసాని తీవ్ర అసంతృప్తి అసెంబ్లీ హాల్లో వెనకాల కూర్చొన్న తలసాని, ఆర్.కృష్ణయ్య హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం అధికారంలోకి వస్తే బీసీ నేత ఆర్.కృష్ణయ్యను సీఎం చేస్తా... ఎన్నికల ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలంగాణలోని బహిరంగసభల్లో చేసిన వాగ్దానమిది. సీమాంధ్ర ఎన్నికల ప్రచారంలోనూ ఇదే విషయాన్ని చెపుతూ అక్కడ బీసీ ఓట్లకు గాలం వేశారు. తీరా... తెలంగాణలో టీడీపీ 15 సీట్లు గెలుచుకొని మూడో అతిపెద్ద పార్టీగా నిలిచిన నేపథ్యంలో చంద్రబాబు తన వాగ్దానాన్ని పక్కనపెట్టారు. బీసీలకు సీఎం ఇస్తానన్న బాబు టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్‌ను కూడా ఇవ్వలేదు. తెలంగాణ టీడీఎల్పీ నాయకుడి విషయంలో రోజుకోరకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు తీరా సోమవారం రాత్రి పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావును ఫ్లోర్‌లీడర్‌గా నియమించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఈ పదవి కోసం పోటీ పడ్డ బీసీ నేతలైన కృష్ణయ్య, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు టీడీఎల్పీలో ఏ పదవులు ఇవ్వకుండా దూరం చేశారు. డిప్యూటీ ఫ్లోర్‌లీడర్లుగా ఎ.రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, విప్‌గా ప్రకాశ్ గౌడ్, కోశాధికారిగా మాగంటి గోపీనాథ్, టీడీఎల్పీ కార్యదర్శులుగా జి. సాయన్న, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డిలను నియమించారు. నేతల తీవ్ర అసంతృప్తి పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ సీఎంగా బీసీ నేత ఆర్.కృష్ణయ్యను ప్రకటించిన బాబు ... తీరా ఇప్పుడు పార్టీ ఫ్లోర్ లీడర్‌గా కూడా పనికిరాడన్న విధంగా వ్యవహరించడం ఏమిటని బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల బీసీ ఉద్యమంలో ఎన్నో విజయాలు సాధించిన చరిత్ర ఆర్.కృష్ణయ్యకు ఉందని ఎన్నికల్లో ప్రతిచోటా చెప్పిన బాబు... ప్రతిపక్షంలో ఫ్లోర్‌లీడర్‌గా కూడా వ్యవహరించ లేరని నిర్ధారణకు వచ్చారా? అని ప్రశ్నిస్తున్నారు. టీడీఎల్పీలో కృష్ణయ్యకు ఏ పదవి ఇవ్వకపోవడం బీసీలను అవమానపరచడమేనని మండిపడుతున్నారు. ఏ పదవీ వద్దన్న తలసానికి ఉత్తి చేతులే! చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీకే టీడీఎల్పీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే ఆర్.కృష్ణయ్య కాకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కే ఆ పదవి దక్కుతుందని భావించారు. కానీ శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఎర్రబెల్లిని ఖరారు చేస్తున్నట్లు తలసానికి చెప్పారు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తనకు ఏ పదవులు వద్దని, ఎమ్మెల్యేగానే కొనసాగుతానని చెప్పి వెళ్లిపోయారు. ఆయన ఆవేశంలో అన్న మాటలనే ని జం చేస్తూ ఉప నాయకుడి హోదా కూడా ఇవ్వకుండా చంద్రబాబు పక్కన పెట్టారు. కాగా సోమవారం అసెంబ్లీ హాలులో ఆర్.కృష్ణయ్య ఒంటరిగా వెనుక సీట్లలో కూర్చొని తన అసంతృప్తి వ్యక్తం చేయగా, తలసాని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో కలిసి మూడో బెంచీపై కూర్చోవడం గమనార్హం. -
స్పీకర్ మధుసూదనాచారి
అన్ని పార్టీల మద్దతుతో ఏకగ్రీవమైన ఎన్నిక నేడు అధికారిక ప్రకటన...అనంతరం బాధ్యతల స్వీకరణ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభాపతిగా వరంగల్ జిల్లా భుపాలపల్లి ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి ఎన్నికయ్యారు. స్పీకర్ అభ్యర్థిగా సోమవారం ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా విపక్షాల ఫ్లోర్‌లీడర్లు ఆయనకు మద్దతుగా నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. మంగళవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే మధుసూదనాచారి స్పీకర్‌గా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ జానారెడ్డి ప్రకటిస్తారు. ఆ తరువాత సీఎం సహా వివిధ పార్టీల ఫ్లోర్‌లీడర్లంతా మధుసూదనాచారిని స్పీకర్ స్థానం వరకూ గౌరవంగా తీసుకెళతారు. అనంతరం స్పీకర్‌కు అభినందనలు తెలిపే కార్యక్రమంతో సభ మరుసటిరోజుకు వాయిదా పడుతుంది. ఫలించిన టీఆర్ఎస్ మంతనాలు: శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు టీఆర్ఎస్ నేతలు గత రెండ్రోజులుగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు శని, ఆదివారాల్లో కాంగ్రెస్, టీడీపీ, మజ్లిస్, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ ఫ్లోర్‌లీడర్లను కలసి స్పీకర్ ఎన్నికపై మాట్లాడారు. మధుసూదనాచారిని స్పీకర్ అభ్యర్ధిగా బరిలో దింపుతున్నందున మద్దతివ్వాలని కోరారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆయా పార్టీల నేతలకు ఫోన్లు చేసి ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేయడంతో అన్ని పార్టీలు సానుకూలంగా స్పందించాయి. -
నెలాఖరుకల్లా ఐఏఎస్‌ల తుది పంపిణీ
ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువుగా ఉన్న 13 మంది తెలంగాణకు రోస్టర్ విధానంలో కేటాయింపు హైదరాబాద్: ఐఏఎస్‌ల తుది పంపిణీని ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయడానికి ప్రత్యూష సిన్హా కమిటీ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలను ఖరారు చేయనుంది. ఆ మార్గదర్శకాల మేరకు ఐఏఎస్‌ల తుది పంపిణీని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చేయనుంది. తాత్కాలికంగా తెలంగాణకు 41 మంది ఐఏఎస్‌లను మాత్రమే కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మిగతా ఐఏఎస్లందరూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే పనిచేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో శాఖలకు ఐఏఎస్ అధికారులు లేక పరిపాలన సాగడం లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ మంది ఐఏఎస్‌లు ఖాళీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నెలాఖరులోగా ఐఏఎస్‌ల పంపిణీని పూర్తి చేయాలని ప్రత్యూష సిన్హా కమిటీ నిర్ణయించింది. ఆ కమిటీ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డెరైక్ట్ రిక్రూటీ ఐఏఎస్‌ల్లో 13 మంది ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో ఎక్కువగా ఉన్న వారిని రోస్టర్ విధానంలో తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించనున్నారు. రెండు రాష్ట్రాల్లో ఐఏఎస్‌ల సంఖ్య ఎంత అనేది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన విషయం తెలిసిందే. జిల్లాల నిష్పత్తి ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 211 ఐఏఎస్ పోస్టులను, తెలంగాణకు 163 ఐఏఎస్ పోస్టులను కేంద్రం కేటాయించిన విషయం తెలిసిందే. -
ఉద్యోగులకు కుర్చీలు, టేబుళ్లు కరువు
-
సచివాలయం.. గందరగోళమయం
అస్తవ్యస్తంగా ఉద్యోగులు, ఫైళ్ల మార్పిడి పలు శాఖలకు ఇక్కడ, అక్కడ ఐఏఎస్‌లు లేరు ఇన్‌చార్జీలతో తాత్కాలిక ఏర్పాటు చేసిన సీమాంధ్ర సర్కారు సీమాంధ్ర ఆర్థిక శాఖ ఉద్యోగులకు కుర్చీలు, టేబుళ్లు కరువు సెక్షన్లకు అనువుగా లేని నార్త్ హెచ్ బ్లాకు సీమాంధ్రకు కేటాయించిన బ్లాకుల్లో కనీస వసతులు లేవు హైదరాబాద్: ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర రాష్ట్రాల పరిపాలనకు కేంద్ర బిందువైన సచివాలయంలో ఉద్యోగులు, ఫైళ్ల మార్పిడి గందరగోళంగా తయారైంది. అలాగే ఇటు తెలంగాణలోను, అటు సీమాంధ్రలోను పలు శాఖలకు ఐఏఎస్ అధికారులు లేకపోవడంతో సాధారణంగా కొనసాగాల్సిన పరిపాలన స్తంభించిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్‌లలో 44 మందిని తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం తాత్కాలికంగా కేటాయించడంతో వారందరికీ తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్‌లను ఇచ్చింది. దీంతో ఆ ఐఏఎస్ అధికారులందరూ తెలంగాణ ప్రభుత్వానికి చెందిన శాఖల పాలన పనులకే పరిమితం అయ్యారు. ఉదాహరణకు మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.కె. జోషి తెలంగాణ ప్రభుత్వానికి వెళ్లిపోవడంతో సీమాంధ్ర ప్రభుత్వంలో మున్సిపల్ శాఖకు ముఖ్యకార్యదర్శి ఎవరూ లేరు. దీంతో ఆ శాఖలో విభజన పనులు అస్తవ్యస్తంగా మారాయి. ఇలా 44 మంది ఐఏఎస్‌లు వదిలి వెళ్లిన శాఖల్లో ప్రస్తుత పరిస్థితి గందరగోళంగా ఉంది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రభుత్వం బుధవారం 22 శాఖలకు ఇన్చార్జిలుగా ఐఏఎస్‌లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీమాంధ్ర పరిస్థితి ఇలా ఉంటే.. తెలంగాణ సర్కారుకు కేవలం 44 మంది ఐఏఎస్‌లనే కేటాయించడంతో చాలా శాఖలకు ఐఏఎస్‌లు లేకుండా పోయారు. దీంతో ఆయా శాఖల్లో సాధారణ పరిపాలన అంశాలు కూడా ముందుకు కదలడం లేదు. గదులున్నాయ్.. కుర్చీలు, టేబుళ్లు లేవ్.. మరో పక్క సీమాంధ్ర ప్రభుత్వానికి సచివాలయంలో కేటాయించిన చాలా బ్లాకుల్లో ఉద్యోగులు పనిచేయడానికి కనీస వసతులు కూడా లేవు. దీని కారణంగా తెలంగాణకు చెందిన బ్లాకుల నుంచి సీమాంధ్ర బ్లాకుల్లోకి ఉద్యోగుల మార్పిడిలో జాప్యం జరుగుతోంది. అదే సమయంలో తెలంగాణకు చెందిన ఉద్యోగులు, అధికారులు వారికి కేటాయించిన బ్లాకుల్లోకి రావాలంటే సీమాంధ్రకు చెందిన వారు ఆ బ్లాకులు మారి వెళ్లాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుతం సచివాలయంలోని డీ బ్లాకులో ఆర్థిక శాఖ పనిచేస్తోంది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ఆర్థిక శాఖ అధికారులు, ఉద్యోగులకు నార్త్ హెచ్ బ్లాకును కేటాయించారు. ఆ బ్లాకులో రెండో అంతస్తులోని ఐఏఎస్‌ల కార్యాలయాలు చాలా చిన్నవిగా ఉన్నాయి. అయినా ఆర్థిక శాఖ అధికారులు అజేయ కల్లం, పీవీ రమేశ్, ప్రేమచంద్రారెడ్డి వెళ్లిపోయారు. అయితే అదే బ్లాకులో ఆర్థికశాఖ ఉద్యోగులు పనిచేయడానికి ఏ మాత్రం వీలుగా లేదు. సెక్షన్స్ పనిచేయడానికి వీలుగా అక్కడ విద్యుత్ కనెక్షన్లు, నెట్వర్క్ కనెక్షన్ లేదు. కంప్యూటర్లపై పనిచేయడానికి ఏర్పాట్లు కూడా లేవు. అక్కడ గదులు తప్ప వాటిలో కుర్చీలు, టేబుళ్లు లేవు. ఏ సెక్షన్లో ఎన్ని ఫైళ్లు: బుధవారం డి-బ్లాకులోని సీమాంధ్ర ఆర్థిక శాఖ ఉద్యోగులు ఫైళ్లు, పుస్తకాలను గోనె సంచుల్లో కట్టి సిద్ధంగా పెట్టుకున్నారు. ఏ రాష్ట్రానికి చెందిన ఫైళ్లను ఆ రాష్ట్రానికి ఇచ్చేందుకు వీలుగా.. పలు ఫైళ్లను స్కానింగ్ చేశారు. అయితే ఏ సెక్షన్లో ఎన్ని ఫైళ్లు ఉన్నాయో లెక్క తేల్చలేదు. దీంతో ఇరు రాష్ట్రాలకు చెందిన సెక్షన్ ఆఫీసర్లు.. ఫైళ్ల మార్పిడిపై సందిగ్ధంలో పడ్డారు. ఎన్ని ఉన్నాయో తెలియకుండా ఫైళ్లు అప్పగించారంటూ.. నో డ్యూ సర్టిఫికెట్ ఎలా ఇస్తామనే సందేహం సెక్షన్ ఆఫీసర్లలో నెలకొంది. -
సమష్టిగా పనిచేద్దాం
పోలీసు అధికారుల సంఘం నేతలతో డీజీపీ అనురాగ్‌శర్మ హైదరాబాద్: పోలీసు ప్రతిష్టను పెంచే విధం గా సమష్టిగా పని చేద్దామని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పిలుపునిచ్చారు. మంగళవారం పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి నేతృత్వంలో వివిధ విభాగాల సంఘం నాయకులు డీజీపీని కలిసి శుభాకాం క్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ పోలీసుల సమస్యలు చాలా వరకు తనకు తెలుసునని, తన పరిధిలో ఉన్న వాటి ని పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పా రు. ప్రభుత్వ స్థాయిలో ఉన్న వాటిని ముఖ్యమంత్రి, హోంమంత్రిల దృష్టికి తీసుకెళుతాన ని హామీ ఇచ్చారు. డీజీపీని కలిసిన వారిలో తెలంగాణ జిల్లాల పోలీసు సంఘాల అధ్యక్షులు, ఎస్పీఎఫ్, ఏపీఎస్పీ, గ్రేహౌండ్స్, ఆర్మ్డ్ రిజర్వు విభాగాల సంఘం నేతలు ఉన్నారు. పలువురు అదనపు డీజీల బాధ్యతల స్వీకరణ మంగళవారం పలువురు అదనపు డీజీ స్థాయి అధికారులు బాధ్యతలను స్వీరించారు. రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ సత్యనారాయణ్, తెలంగాణ స్పెషల్ పోలీసు బెటాలియన్, ఆక్టోపస్, పోలీసు స్పోర్ట్స్ విభాగం అదనపు డీజీ రాజీవ్ త్రివేది, ఎస్పీఎఫ్, ప్రింటింగ్ స్టేషనరీ కమిషనర్ తేజ్‌దీప్ కౌర్ మీనన్, జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ వినయ్‌కుమార్ సింగ్, అవినీతి నిరోధక శాఖ డెరైక్టర్ కుమార్ విశ్వజిత్‌లు ఉన్నారు. వీరితోపాటు ఐజీ స్థాయి అధికారులు వి.నవీన్‌చంద్, స్వాతి లక్రా, చారుసిన్హా, సౌమ్యమిశ్రా, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అమిత్ గార్గ్ తదితర అధికారులు కూడా బాధ్యతలను స్వీకరించిన వారిలో ఉన్నారు. -
పదవి కోసం పెద్ద లోల్లి
రసాభాసగా సీఎల్పీ భేటీ డీఎస్, షబ్బీర్‌కు మద్దతుగా రెండుగా చీలిపోయిన ఎమ్మెల్సీలు అధిష్టానం దూతల ముందే దూషణలపర్వం డీఎస్ ఒక్కో ఎమ్మెల్సీకి రూ.10 లక్షలు ఆఫర్ చేశారన్న రాజలింగం ఆరోపణలను ఖండించిన డీఎస్ వర్గం హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేత ఎంపిక కోసం మంగళవారం జరిగిన సీఎల్పీ భేటీ సవ్యంగానే జరిగినట్టు పైకి కనిపిస్తున్నా లోపల మాత్రం పెద్ద గొడవే జరిగింది. ఎమ్మెల్సీలు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపైకి ఒకరు దూషణలపర్వానికి దిగారు. దీంతో అధిష్టానం పెద్దలు బిత్తరపోవాల్సి వచ్చింది. చివరికి వారు ఇరువర్గాలను శాంతింపజేసి ఎంపిక ప్రక్రియను మమ అనిపించారు. తనకు మద్దతివ్వాలంటూ ఒక్కో ఎమ్మెల్సీకి డి.శ్రీనివాస్ రూ.10 లక్షలు ఇచ్చినట్లు ఆ పార్టీ ఎమ్మెల్సీ రాజలింగం ఏకంగా సీఎల్పీ సమావేశంలోనే ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్తో కుమ్మక్కైన డీఎస్‌కు మండలి ప్రతిపక్ష నేత పదవి ఎట్లా ఇస్తారంటూ నిలదీసిన రాజలింగంకు... మాజీ మంత్రి షబ్బీర్ అలీ సైతం మద్దతు పలికారు. ఆయనతోపాటు పలువురు ఎమ్మెల్సీలూ డీఎస్‌పై ఆరోపణలు చేశారు. వీటిని ఖండిస్తూ డీఎస్ వర్గం.. షబ్బీర్ అలీపై ప్రత్యారోపణలు చేయడంతో సమావేశం ఒకదశలో రసాభాసగా మారింది. భేటీ అదుపు తప్పిందని గ్రహించిన హైకమాండ్ దూతలు వయలార్, దిగ్విజయ్‌సింగ్‌లు... ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఒక్కొక్కరిని పిలిచి బుజ్జగింపు యత్నాలు ప్రారంభించారు. డీఎస్‌కు మండలి ప్రతిపక్ష నేత పదవి, షబ్బీర్ అలీకి ఉపనేత పదవి ఇస్తామని ప్రతిపాదించారు. ఇందుకు షబ్బీర్ అయిష్టత వ్యక్తం చేసినప్పటికీ ఆయన పేరును ప్రకటించారు. డీఎస్, షబ్బీర్ అలీ ఇద్దరూ నిజామాబాద్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. ఒకే జిల్లాకు రెండు పదవులు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బేరసారాలు బయటకు పొక్కడం, ఈ విషయం ప్రజల్లోకి వెళితే కాంగ్రెస్ మరింత చులకన అవుతుందనే ఉద్దేశంతోనే షబ్బీర్ అలీకి ఉపనేత పదవిని కట్టబెట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 17 మంది.. రెండున్నర గంటల సినిమా! కాంగ్రెస్ ఎమ్మెల్సీల సమావేశం సస్పెన్స్ సినిమాను తలపించింది. మండలిలో అధికార టీఆర్ఎస్తో పోలిస్తే ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రతిపక్ష పదవి కోసం గట్టి పోటీ నెలకొంది. డీఎస్, షబ్బీర్ గత వారం రోజులుగా ఎమ్మెల్సీలతో ముఖాముఖి సమావేశమై మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. చివరి నిమిషం వరకు ఎమ్మెల్సీలతో మంతనాలు జరిపారు. అభిప్రాయ సేకరణ సమయంలోనూ ఇద్దరు నేతలు ఎవరికి వారే తమకే మండలి ప్రతిపక్ష నేత పదవి దక్కుతుందనే ధీమాలో ఉన్నారు. కాంగ్రెస్‌కు 17 మంది ఎమ్మెల్సీలుండగా మంగళవారంనాటి సమావేశానికి 16 మంది మాత్రమే హాజరయ్యారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్ తన సమీప బంధువు చనిపోవడంతో రాలేదు. సమావేశానికి హాజరైన వారిలో ఏడుగురు (కేఆర్ ఆమోస్, యాదవరెడ్డి, భానుప్రసాద్, వి.భూపాల్‌రెడ్డి, రాజలింగం, జగదీశ్వర్‌రెడ్డి, పీర్ షబ్బీర్ అహ్మద్) షబ్బీర్ అలీకి మండలి ప్రతిపక్షనేత పదవి ఇవ్వాలని ప్రతిపాదించారు. అదే సమయంలో డీఎస్ పేరును ఏడుగురు (పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, నేతి విద్యాసాగర్, డి.రాజేశ్వర్, ఎమ్మెస్ ప్రభాకర్, బి.వెంకట్రావు, మాగం రంగారెడ్డి) ఎమ్మెల్సీలు ప్రతిపాదించారు. చివర్లో తాను డీఎస్‌కు మద్దతిస్తున్నట్లు సంతోష్‌కుమార్ లేఖ పంపడంతో హైకమాండ్ పెద్దలు డీఎస్ పేరును ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో రాజలింగం డీఎస్‌పై చేసిన ఆరోపణలు సమావేశంలో కలకలం రేపాయి. డీఎస్ రూ.10 లక్షలు ఇవ్వబోయారు: రాజలింగం సమావేశానంతరం రాజలింగం మీడియాతో మాట్లాడుతూ ‘‘ఒక్కో ఎమ్మెల్సీకి డీఎస్ రూ.10 లక్షలు ఇచ్చారు. నాకు కూడా ఆఫర్ చేస్తే వద్దని తిరస్కరించాను. టీఆర్ఎస్తో కుమ్మక్కై కేసీఆర్ ప్రభుత్వంలో లోపాయికారీ పనులు చేసుకునేందుకే డీఎస్ మండలి ప్రతిపక్షనేత పదవిని ఆశించి అందరినీ మేనేజ్ చేస్తున్నాడు. 8 మంది ఎమ్మెల్సీలు వ్యతిరేకించినా హైకమాండ్ పెద్దలు ఆయన పేరునే ఖరారు చేశారు’’ అని అన్నారు. కాగా, రాజలింగం చేసిన ఆరోపణలకు విలువ లేదని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. షబ్బీర్‌కు హ్యాండిచ్చిన ప్రభాకర్! మండలి ప్రతిపక్షనేత పదవిపై గంపెడాశలు పెట్టుకున్న షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్ హ్యాండిచ్చినట్లు తెలుస్తోంది. తనకు 8 మంది ఎమ్మెల్సీలు మద్దతు ఇస్తారని షబ్బీర్ భావించారు. వీరిలో ప్రభాకర్ కూడా ఉన్నట్లు షబ్బీర్ అలీ చెబుతున్నారు. అయితే సమావేశం ప్రారంభం వరకు తమతోనే ఉన్న ప్రభాకర్ చివరి నిమిషంలో డీఎస్వైపు వెళ్లారని షబ్బీర్ వాపోయారు. ఎన్నిక ఏకగ్రీవమే: వయలార్ మండలి ప్రతిపక్షనేతగా డీఎస్, ఉపనేతగా షబ్బీర్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వయలార్ రవి ప్రకటించారు. ఎమ్మెల్సీల సమావేశానంతరం దిగ్విజయ్‌సింగ్, వయలార్, పొన్నాల, డీఎస్ మీడియా ముందుకొచ్చారు. ఆ సమయంలో షబ్బీర్‌ను సైతం మీడియా ముందుకు రావాలని హైకమాండ్ పెద్దలు కోరినా ఆయన పట్టించుకోలేదు. తాను రానని పేర్కొంటూ వాహనం ఎక్కేందుకు ప్రయత్నించారు. కుంతియా, తిరునావక్కరసార్ ఆయనను బతిమిలాడి మీడియా ముందుకు తీసుకొచ్చారు. అనంతరం డీఎస్ మాట్లాడుతూ తనకు మద్దతిచ్చిన ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు తెలిపారు. షబ్బీర్‌తో కలిసి పనిచేస్తానని చెప్పారు. ఆ తర్వాత షబ్బీర్‌ను మాట్లాడాలని దిగ్విజయ్ కోరగా.. ‘ఇదేమైనా సంతోషకరమైన సమయమా? మాట్లాడటానికేముంది?’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 30న టీ-కాంగ్రెస్‌లో సమీక్ష డీఎస్‌పై ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నాం: దిగ్విజయ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించేందుకు నెలాఖరులో రెండు రోజులపాటు ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించింది. ఇందుకు ఈ నెల 30, వచ్చే నెల 1న సమావేశం కానున్నట్లు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పార్టీ ఓటమికి కారణాలపై లోతుగా అధ్యయనం చేస్తామన్నారు. కాగా, ఎమ్మెల్సీలను డబ్బులతో ప్రభావితం చేయడం వల్లే మండలి ప్రతిపక్ష నేతగా సీనియర్ నేత డీఎస్ ఎన్నికయ్యారంటూ ఎమ్మెల్సీ రాజలింగం చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు జిల్లా పరిషత్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో గాంధీభవన్‌లో దిగ్విజయ్ సమావేశమయ్యారు. ఈ విషయంలో పటిష్ట వ్యూహంతో ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలవారీగా ఫలితాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
దేశానికే కేంద్ర బిందువులా తెలంగాణ
టీ జేఏసీ చైర్మన్ కోదండరాం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం దేశ పటంలో కేంద్ర బిందువులా ఉందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో భారతదేశ మ్యాప్‌లో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని పొందుపర్చిన నమూనా మ్యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. మన రాష్ర్టం మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు కూడలిగా ఉందన్నారు. ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు వ్యాపార కేంద్రంగా ఉంటుందని, దాన్ని దృష్టిలో ఉంచుకొని రవాణ వ్యవస్థను పెంపొందించుకుంటే వ్యాపారాన్ని విస్తరించవచ్చన్నారు. గోదావరి, ప్రాణహితకు వంతెనలు నిర్మిస్తే అశేష అవకాశాలు లభిస్తాయన్నారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉంటుందని, రామగుండం నుంచి కాగజ్‌నగర్ వరకు పారిశ్రామికవాడలుగా మార్చుకునేందుకు అనువైన ప్రదేశంగా ఉందన్నారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణను మిగతా రాష్ట్రాల కన్నా అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు శ్రమించాలని కోరారు. సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని 29వ రాష్ట్రంగా దేశ చిత్రపటంలో నమోదు చేయడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. -
తొలి సీఎం తొలి రోజు
-
గులాబీ దళమిదీ...
-
రాష్ట్రం ఇచ్చింది రాజకీయు లబ్ధికోసం కాదు
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ శంషాబాద్, రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను గుర్తించే యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పేరు మార్చే యోచన సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. -
‘ముంపు’లో నిరసన గళం
నల్లజెండాలు ఎగురవేసిన ఆదివాసీలు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్తబ్ధత భద్రాచలం, ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందడి కనిపించలేదు. తెలంగాణ పది జిల్లాల్లో ఓ వైపు ఉవ్వెత్తున సంబురాలు చేసుకోగా, ముంపు మండలాల్లో ఆదివాసీలు నిరసన గళం వినిపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకు బదులు ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నిరసన దినంగా పాటించారు. భద్రాచలం లో ఆదివాసీ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో గిరిజన అమరవీరుల విగ్రహం వద్ద నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. ఆ తర్వాత అక్కడే నల్లజెండాను ఆవిష్కరించారు. చింతూరు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కుక్కునూరులో రాస్తారోకో నిర్వహించారు. మండల పరిషత్, రెవెన్యూ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. మండల సరిహద్దు గ్రామమైన లంకాలపల్లి వద్ద ‘ఆంధ్రా వద్దు-తెలంగాణ ముద్దు’ అంటూ బ్యానర్‌ను ఏర్పాటుచేశారు. ‘సీమాంధ్ర ఉద్యోగులారా.. మండలానికి రాకండి’ అంటూ నినాదాలు చేశారు. భద్రాచలం డివిజన్లోని కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, భద్రాచలం(పట్టణం మినహా) మండలాలు, పాల్వంచ డివిజన్లోని కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు (12 గ్రామాలు మినహా) మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా జాతీయజెండా ఎగురలేదు. ముంపు మండలాలన్నీ సోమవారం నుంచి భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌లో కలవడంతో ఈ ప్రాంతంలో వేడుకలు నిర్వహించలేదు. అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపిన మండలాల్లోని వివిధ శాఖల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులంతా దాదాపు తెలంగాణ రాష్ట్రానికే చెందిన వారే కావడంతో వేడుకలకు సిద్ధమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో వాటికి దూరంగా ఉన్నారు. -
జాతీయ పార్టీగా వైఎస్సార్ సీపీ
దేశం గర్వించేలా తెలుగువారి ఖ్యాతిని ముందుకు తీసుకెళదాం: జగన్ వైసీపీ కార్యాలయంలో తెలంగాణ సంబురాలు జాతీయ, పార్టీ జెండాలను ఆవిష్కరించిన జగన్ 2నిమిషాలు మౌనం పాటించి అమరులకు నివాళులు తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్ ఉన్నారని వెల్లడి హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇక నుంచి జాతీయ పార్టీగా కొనసాగనుందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణకు తొలిసీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. మంచి చేసే ప్రతి పనికి వైఎస్సార్సీపీ తోడుగా ఉంటుందన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జాతీయ పతాకంతో పాటు పార్టీ జెండా ను జగన్ ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమ అమరవీరులకు రెండునిమిషాల పాటు మౌనం పాటించి, నివాళులు అర్పించారు. అంతకు ముందు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. ఒకే భాష, ఒకే జాతిగా ఉన్న రెండు రాష్ట్రాల ప్రజలుగా ఒకరికొకరు సహకరించుకుంటూ దేశం గర్వపడేలా తెలుగువారి ఖ్యాతిని ముందుకు తీసుకెళదామని పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి పోయింది. తెలంగాణ రాకముందు అంతా కలిసి ఉండాలని.. తెలుగు వారిని చూసి దేశమంతా గర్వపడేలా ఉండాలని తాపత్రయపడ్డాం. కానీ విభజన జరిగిపోయింది. అయినా రాష్ట్రాలను వేరు చేయగలిగారుగాని తెలుగు వారి మనసులను వేరు చేయలేరని మరోసారి ఉద్ఘాటిస్తున్నా. ఈ ప్రాంతం వారికి ఏ సమస్య వచ్చినా ఆ ప్రాంతం వారు తోడుగా ఉంటారు. ఆ ప్రాంతం వారికి ఏ సమస్య వచ్చినా ఈ ప్రాంతం వారు తోడుగా ఉంటారు..’’అని జగన్మోహన్రెడ్డి చెప్పారు. సీమాంధ్రతో పాటు తెలంగాణలోనూ ప్రతీ ఒక్కరి గుండెల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి బతికే ఉన్నారన్నారు. గతంలో ఎవరూ చేయని విధంగా తెలంగాణ ప్రజల కోసం వైఎస్ గడప, గడపను తట్టారని, తెలంగాణ అభివృద్ధి కోసం ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా చేశారని ఆయన పేర్కొన్నారు. రైతులు 17 లక్షల పంపుసెట్ల ఆధారంగా వ్యవసాయం చేయగలుగుతున్నారంటే.. అది రాజశేఖరరెడ్డి ద్వారానే జరిగిందని చెప్పడానికి గర్వపడుతున్నామని జగన్ పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి వైఎస్ అండగా నిలబడ్డారు కాబట్టే, రాష్ట్రాలకు అతీతంగా తెలంగాణలో కూడా గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నారన్నారు. రాజశేఖరరెడ్డి కలలుగన్న సువర్ణయుగాన్ని కచ్చితంగా తెలంగాణలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తామని జగన్ చెప్పారు. తెలంగాణ నేతలతో సమావేశం తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ అనంతరం తెలంగాణకు చెందిన నేతలతో జగన్ అరగంట పాటు ప్రత్యేకంగా చర్చించారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం, తీసుకోవాల్సిన చర్యల గురించి సమాలోచనలు జరిపారు. వైఎస్ కలలు కన్న సువర్ణయుగాన్ని తెలంగాణలో తెచ్చుకునేందుకు కచ్చితమైన ప్రయత్నం చేయాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ అడహక్ కమిటీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, గట్టు రామచంద్రరావు, హెచ్.ఎ.రెహ్మాన్, బి.జనక్‌ప్రసాద్, నల్లా సూర్యప్రకాష్, విజయారెడ్డి, కె.శివకుమార్, టి.వెంకట్రావ్, గట్టు శ్రీకాంత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, బానోతు మదన్‌లాల్ తదితరులు పాల్గొన్నారు. -
విధేయతకే పెద్దపీట
కేసీఆర్ మంత్రివర్గంపై టీఆర్ఎస్లో తర్జనభర్జన! పార్టీ ముఖ్యుల మధ్య వాదోపవాదాలు హైదరాబాద్: తెలంగాణ సీఎంగా కేసీఆర్ నేతృత్వంలో కొలువుదీరిన రాష్ట్ర మంత్రివర్గంపై సోమవారం ఉదయం వరకు అధికార టీఆర్ఎస్ పార్టీ గోప్యతను పాటించింది. మంత్రివర్గ కూర్పుపై పార్టీలోని ముఖ్య నేతలకు కూడా సమాచారం అందలేదు. అయితే ఈ విషయంపై పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చలు జరిగాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలన్న దానిపై ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పార్టీ ముఖ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగినట్టు సమాచారం. దీని వల్లే కేబినెట్లో ఉండే సభ్యుల సంఖ్య, ఎవరెవరికి అవకాశం లభిస్తుందన్న విషయాలపై సోమవారం ఉదయం వరకూ స్పష్టత రాలేదు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ అదృష్ట సంఖ్యగా భావించే ఆరుగురితోనే సీఎం సహా మంత్రివర్గం ఉండాలని తొలుత భావించారు. అయితే ఆదివారం ఉదయానికి ఈ సంఖ్య తొమ్మిదికి చేరింది. తీవ్ర తర్జనభర్జనలతో అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన చర్చలతో చివరకు మంత్రుల సంఖ్య 12కు చేరింది. అయితే విధేయతకే కేసీఆర్ పెద్దపీట వేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి తనకు అండగా ఉన్న వారికే మంత్రివర్గంలో స్థానం దక్కింది. మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, జి.జగదీశ్ రెడ్డి, ఈటెల రాజేందర్, టి.పద్మారావు తదితరులు పార్టీకి కష్ట కాలాల్లోనూ కేసీఆర్‌కు విధేయంగా, అండగా ఉన్నారు. జగదీశ్ రెడ్డి ఆది నుంచీ కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. కాంగ్రెస్‌కు పట్టుండే నల్లగొండ జిల్లాలోని సగం నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించగలిగారు. నాయిని నర్సింహారెడ్డి కూడా అత్యంత విధేయుడు. ఈటెల రాజేందర్ కూడా పార్టీకి అన్ని కాలాల్లో విధేయంగా పనిచేశారు. మహమూద్ అలీకి సమర్థత కన్నా విధేయత, మైనారిటీల్లో సీనియర్ లేకపోవడం వంటి కారణాలతో అవకాశం వచ్చింది. ఇక ఉప ఎన్నికల్లో ఓడిపోయినా, పార్టీకి ప్రతికూల సమయాల్లోనూ కేసీఆర్‌కు అండగా ఉన్న పద్మారావుకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. మిగిలిన వారిలో సామాజికవర్గ సమతూకం, సీనియారిటీ, జిల్లాలకు అవకాశం వంటి అంశాల ఆధారంగా మంత్రి పదవి వరించింది. ఆదిలాబాద్ జిల్లాలో జోగు రామన్న కన్నా సీనియర్లు లేరు. బీసీ సామాజికవర్గం కూడా కావడంతో అనివార్యంగానే అవకాశం వచ్చింది. పోచారం శ్రీనివాస్ రెడ్డికీ గతంలో చాలా శాఖలు నిర్వహించిన సీనియారిటీ, సామాజికవర్గం కలిసి వచ్చింది. -
కేసీఆర్ తాతనైనా ఎదిరిస్తాం: నారాయణ
హైదరాబాద : తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పాలనలో పారదర్శకత లోపిస్తే ఆయన తాతనైనా ఎదిరిస్తామని సీపీఐ నేత కె.నారాయణ హెచ్చరించారు. తెలంగాణ ఆవిర్భావ సంబురాలను సోమవారం స్థానిక మఖ్దూంభవన్‌లో ఘనంగా నిర్వహించారు. నారాయణ మాట్లాడుతూ, తెలంగాణలో వనరులకు, కష్టపడే ప్రజలకు కొదవలేదన్నారు. తెలంగాణ ఏర్పడినా భూమి, భుక్తి కోసం ఇంకా పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. మన ప్రభుత్వమే కదాని ప్రజలు ఉదాసీనతగా ఉంటే మరో నిజాం ఏలుబడి వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రజలను చైతన్య పరిచేందుకు వామపక్ష పార్టీలన్నింటినీ ఒక గొడుగు కిందకు తెచ్చేం దుకు కృషి చేస్తామని చెప్పారు. కమ్యూనిస్టులు కలసి ఉంటే నిన్నటి ఎన్నికల్లో గులాబీ స్థానంలో ఎర్రజెండా ఎగిరేదన్నారు. టీసీపీఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో అందరి పాత్రా ఉందన్నారు. -
కేసీఆర్ మంత్రివర్గమా.. ఫ్యామిలీ ప్యాకేజా..?
టీడీపీ అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి హైదరాబాద్: తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ మంత్రివర్గాన్ని సొంత ఆస్తి పంచుకున్నట్లు ఏర్పాటు చేశారని టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శించారు. 25 శాతం మంత్రి పదవులు తన బంధువులకే ఇచ్చి, మంత్రివర్గాన్ని ఫ్యామిలీ ప్యాకేజీగా మార్చేశారన్నా రు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళకు గానీ, గిరిజనుడికి గానీ స్థానం కల్పిం చలేదన్నారు. ఏ సభ లోనూ సభ్యుడు కాని నాయిని నర్సింహారెడ్డికి హోం మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లిని ఎందుకు మరచిపోయారని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరుల ఉనికి కనిపించకుం డా చేయాలనేది కేసీఆర్ ప్రయత్నమన్నారు. అందుకే తెలంగాణ లోగోలో కూడా అమరవీరుల స్తూపానికి స్థానం ఇవ్వలేదని విమర్శించారు. జిల్లాలోని 7 అసెంబ్లీ, ఒక లోక్‌సభ సీటును గెలిపించిన పాలమూరుకు మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ ద్రోహం చేశారన్నారు. మంత్రివర్గంలో పాలమూరుకు అవకాశం ఇవ్వకపోతే కేసీఆర్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. శ్రీనివాస్‌గౌడ్, స్వామిగౌడ్ లకు మంత్రి పదవులు ఇస్తే బాగుండేదన్నారు. -
విడిపోయినా సహకరించుకోవాలి: వెంకయ్య
హైదరాబాద్: ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కొత్త ప్రభుత్వానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ సోదరులుగా ఒకరికొకరు సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్ని విధాలా కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించడానికి మోడీ నాయకత్వంలో ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని తెలిపారు.