మాట తప్పిన కేసీఆర్: మంద కృష్ణ | You missed the story : mandha krishana | Sakshi
Sakshi News home page

మాట తప్పిన కేసీఆర్: మంద కృష్ణ

Published Mon, May 19 2014 1:32 AM | Last Updated on Tue, Oct 9 2018 5:22 PM

మాట తప్పిన కేసీఆర్: మంద కృష్ణ - Sakshi

మాట తప్పిన కేసీఆర్: మంద కృష్ణ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని తొలి ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చినమాటను తప్పారని మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసే రోజును దళితులను ఉరితీసే రోజుగా పరిగణించి నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దొరల పాలన వస్తుందని తాను గతంలోనే చెప్పిన మాట ఇప్పుడు అక్షరాలా నిజమైందన్నారు.

టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో సీఎంగా కేసీఆర్ పేరును దళితులే ప్రతిపాదించడం సిగ్గుచేటన్నారు. టీఆర్‌ఎస్‌లోని దళిత ఎమ్మెల్యేలంతా దొరల వద్ద బానిసలేనని, దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు త్వరలోనే కార్యాచరణ ప్రణాళికలు ప్రకటిస్తానని అన్నారు. తనలాంటి ఉద్యమకారులు చట్టసభల్లో అడుగుపెడితే దొరల ఆధిపత్యం దెబ్బతింటుందని వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తన ఓటమికి కొందరు కుట్రలు పన్నారని విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement