హైదరాబాద్ ఎప్పటికీ... తెలంగాణ రాజధానే | Hyderabad forever ... Telangana capital | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ ఎప్పటికీ... తెలంగాణ రాజధానే

Published Wed, Apr 30 2014 12:46 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

హైదరాబాద్ ఎప్పటికీ...  తెలంగాణ రాజధానే - Sakshi

హైదరాబాద్ ఎప్పటికీ... తెలంగాణ రాజధానే

యూటీ చేయాలన్న ఆలోచన మోడీకి లేదు: ప్రకాశ్ జవదేకర్
 
  హైదరాబాద్: హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే శాశ్వత రాజధానిగా ఉంటుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. పదేళ్లపాటు సీమాంధ్ర, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉండనున్న హైదరాబాద్‌ను యూటీ చేసేందుకు నరేంద్రమోడీ ప్రయత్నిస్తున్నారంటూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యవుని ఖండించారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న ఆలోచన బీజేపీకి అసలే లేదని, ఓటమి భయంతో కేసీఆర్ ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందాలనే దురుద్దేశంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు.

మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రకాశ్ జవదేకర్ విలేకరులతో మాట్లాడారు. మోడీ ప్రధాని కావాలని దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్న తరహాలోనే తెలంగాణలో కూడా ఆయన ప్రభంజనం ఉందని, దీంతో తమ ఓటమి ఖాయమని టీఆర్‌ఎస్ నిర్ణయానికి వచ్చినట్టుందని పేర్కొన్నారు. ఆ నిరాశానిస్పృహలతోనే కేసీఆర్.. మోడీపై అనుచిత, అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఏం చేసినా మోడీ హవాను అడ్డుకోలేరన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement