
మా వాళ్లు రాజకీయంగా అమరులయ్యారు
నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్య
హైదరాబాద్: తెలంగాణ కోసం వందలాది మంది యువకులు ప్రాణత్యాగాలు చేసి అమరవీరులైతే.. అదే అంశంపై పోరాడిన తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీలు రాజకీయంగా అమరులయ్యారని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కె.చంద్రశేఖరరావును అభినందించేందుకు గురువారం అసెంబ్లీ లాబీకి వచ్చిన సందర్భంగా గుత్తా... విలేకర్లతో ముచ్చటించారు.
కాంగ్రెస్‌పై కక్షతో ప్రజలు దేశవ్యాప్తంగా పార్టీని ఓడిస్తే తెలంగాణ రాష్ట్రమిచ్చినా కనికరం లేకుండా ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలను సైతం ఓడించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం అమరులైన వారు కొత్త రాష్ట్రాన్ని చూడలేకపోయినా ఆ అదృష్టం తమ పార్టీ నేతలకు కలిగిందన్నారు. అంతకుముందు గుత్తా సీఎంను కలిసి జిల్లా సమస్యలపై వినతి పత్రం అందజేశారు.