gutha sukender reddy
-
కేటీఆర్ అతి తెలివి ప్రదర్శించొద్దు: గుత్తా
సాక్షి, నల్గొండ: కేటీఆర్ అతి తెలివి ప్రదర్శిస్తున్నాడంటూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 50 అంతస్తుల భవనాలకు ఎవరు అనుమతి ఇచ్చారు? అని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలన్నీ బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని.. ఎవరేం పాపాలు చేశారో వారి ఆత్మలకు తెలుసు. ఒకసారి పరిశీలన చేసుకోవాలంటూ గుత్తా వ్యాఖ్యానించారు.‘‘మూసీ ప్రక్షాళనకు వాజ్‌పేయ్ హయాంలోనే బీజం పడింది. కేసీఆర్ కూడా మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు ఏర్పాటు చేశారు. సుందరీకరణ పేరుతో రేవంత్ దోచుకుంటున్నారనడం తగదు. నల్లగొండ జిల్లా ప్రజలు బాగుపడాలంటే మూసీ ప్రక్షాళన జరగాలి. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాల రాద్ధాంతం సరికాదు’’ అని గుత్తా హితవు పలికారు.అత్యుత్సాహం ప్రదర్శించొద్దు. అలా ప్రదర్శిస్తే మొన్నటి ఎన్నికల్లో ఏమైంది? మీ స్వార్థం కోసం ౫౦ అంతస్తుల భవనాలకు అనుమతి ఇచ్చి ఇబ్బందులకు గురిచేశారు. మీరు చేస్తే సుందరీకరణ అవతలోడు చేస్తే దోచుకోవడమా? రూ. 16500 కోట్లతో మూసీ సుందరీకరణ కు ప్రతిపాదనలు చేసింది బీఆర్ఎస్ కాదా? దేశభద్రత కు ఉపయోగపడే రాడార్ ఏర్పాటు విషయంలో కూడా విమర్శలేనా?. రాడార్ విషయంలో జీవోలు ఇచ్చింది బీఆర్ఎస్ కాదా?’’ అంటే గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నలు గుప్పించారు.మూసీ ప్రక్షాళన కోసం ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ప్రక్షాళన వద్దని చెప్పే పార్టీలకు గుణపాఠం చెప్పాలి. మూసీ పరివాహక ప్రాంతాల్లో నోరు తెరిస్తే దోమలే లోపలికి పోతాయి. నది గర్భంలో ఉన్న ఇళ్లను తొలుత తొలగించాలి. యాభై అంతస్తులు కట్టే వారంతా మట్టిని తవ్వి మూసీలోనే పోస్తున్నారు. అక్రమ నిర్మాణాల వల్ల జరిగే నష్టం, సెల్లార్లలో తీసిన మట్టి ఎటుపోతుందనేది కూడా హైడ్రా దృష్టి పెట్టాలి’’ అంటూ గుత్తా సూచించారు. -
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. క్లారిటీ ఇచ్చిన సుఖేందర్ రెడ్డి
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉందన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీలో క్షేత్రస్థాయిలో నిర్మాణ లోపం ఉందని ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో సీఎం రేవంత్ పాలన బాగానే ఉన్నట్టు ప్రజలు భావిస్తున్నారు. ఏ పార్టీకి సంబంధంలేని రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నాను. ఏ పార్టీ కండువా కప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు సీఎం రేవంత్ బంధువు అయినప్పటికీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాత్రమే కలిశాను. బయట ఎప్పుడూ కలవలేదు. నేను ఏ రాజకీయ పార్టీలో చేరను. నా కుమారుడు అమిత్‌కు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమే. కానీ ఎలాంటి చర్చలు జరగలేదు. అలాగే, బీఆర్ఎస్లో కొందరు నేతలు అమిత్‌కు సహకరించకపోవడంతో పోటీ చేయవద్దని నిర్ణయించుకున్నాడు. బీఆర్ఎస్ నుంచి పోటీకి అమిత్ దూరంగా ఉన్నాడు’ అని క్లారిటీ ఇచ్చారు. -
తెలంగాణపై మోదీ మరోసారి విషం కక్కారు: గుత్తా సుఖేందర్ ఫైర్
సాక్షి, నల్లగొండ: తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమంలో అస్సలు బీజేపీ పాత్ర లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో తెలంగాణ ప్రజలపై ప్రధాని మోదీ మరోసారి విషం కక్కారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా కాంగ్రెస్ ఆరు గ్యారంటీ స్కీమ్స్ తీసుకొచ్చింది. ఆచరణకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయొద్దు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ స్కీమ్స్ ఎందుకు అమలు చేయడం లేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో కిషన్ రెడ్డి తెలంగాణ కోసం ఎందుకు రాజీనామా చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను కప్పిపుచ్చుకునేందుకే మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: ఆరు నూరైనా ప్రజాక్షేత్రంలోనే ఉంటా.. -
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. తన కుమారుడికి పార్టీ అవకాశం ఇస్తే పోటీలో ఉంటారని పేర్కొన్నారు. జిల్లా రాజకీయాల్లో అంతర్గత కలహాలు అనేవి సహజమని చెప్పారు. రేవంత్, బండి సంజయ్‌కు రాష్ట్రంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని అన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్కు 2018 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లేకుండా కూటమి అని కేసీఆర్ అన్నారని, అందుకే విపక్ష సమావేశాలకు కేసీఆర్ వెళ్లడం లేదని తెలిపారు. వేముల విరేశం కాంగ్రెస్‌లోకి వెళ్తారనేది అవాస్తమని పేర్కొన్నారు. వారసుల కోసం తాము వేరే పార్టీలోకి వెళ్లమని, అవకాశం రాకపోతే పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. వారసత్వ రాజకీయాలు కేవలం గుర్తింపు వరకు మాత్రమే పనిచేస్తాయని.. గెలుపు కోసం పనికిరావని అన్నారు. ‘రేవంత్ రెడ్డి మాటలకు అంతూ పొంతు ఉండదు. రేవంత్ రెడ్డి పార్టీ మారలేదా? రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇవ్వకుండా పార్టీ అధ్యక్షుడికి ఇచ్చాడు. ఫిరాయింపులు ఆపేందుకు చట్టం తేవాల్సింది కేంద్రమే. అలాంటి కేంద్రమే ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందే తప్ప ఒక్క న్యాయం చేయలేదు. రెండు రాష్ట్రాల విభజన హామీలు కేంద్రం పరిష్కరించడంలో విఫలం అయింది’ అని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. చదవండి: కేంద్రం నుంచి ఇప్పటి వరకు అందిన సాయం సున్నా: కేటీఆర్ -
‘నాగార్జునసాగర్ కూడా కేసీఆరే కట్టించాడా?’
సాక్షి, నల్లగొండ: జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయని మంత్రి జగదీశ్వర్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డిలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. సోమవారం గుర్రంపోడులో ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలే క్షమాపణలు చెప్పాలన్న మంత్రి జగదీశ్ కామెంట్లపై భట్టి స్పందించారు. తెలంగాణ కోసం పోరాడిందే.. జలాల కోసం. అలాంటిది అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు కావస్తున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్ట్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలి. నేను ప్రశ్నిస్తే ముక్కు నేలకు రాయాలంటూ విమర్శలు చేసిన మీరు నీళ్లు ఇవ్వకుండా గాడిదలు కాస్తున్నారా?. ఎస్ఎల్బీసీ పూర్తి కాకుండా అడ్డుకున్నది ఎవరు?. నల్లగొండ జిల్లా ప్రజలకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పండి. దీనిపై చర్చించేందుకు నేను సిద్ధం. పది సంవత్సరాలుగా డిండి, ఎస్ఎల్బీసీ, నక్కలగండి ప్రాజెక్టులు పూర్తి చేయనందుకు చిత్తశుద్ధి ఉంటే సుఖేందర్ రెడ్డి ఇప్పుడు రాజీనామా చేయాలని భట్టి అన్నారు. జిల్లాలో ఏ చిన్న పిల్లాడిని అడిగిన నాగార్జునసాగర్ కట్టింది, కాలువలు తవ్వింది కాంగ్రెస్ అని చెప్తారు. నాగార్జునసాగర్ కూడా కేసీఆర్ కట్టాడన్న భ్రమలో జిల్లా మంత్రి(జగదీష్ రెడ్డిని ఉద్దేశించి..) ఉన్నాడు. ఎందరో మహానుభావులు ప్రాతినిధ్యం వహించిన నల్గొండ జిల్లాలో మంత్రిగా జగదీష్ రెడ్డి ఉండడం దురదృష్టకరం. నాగార్జునసాగర్ నిర్మాణం చేసినందుకా? పార్లమెంట్లో మెజార్టీ లేకున్నా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకా? ఢిల్లీ వరకు ముక్కు రాయాలి?. భూస్వామ్య గడీల మనస్తత్వం ఉన్నవారే ముక్కు నేలకు రాయమంటారు. జగదీష్ రెడ్డి మీరు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నారా? కేసీఆర్ కు భజన చేస్తూ భూస్వామ్య, ఫ్యూడలిజం సమాజంలో ఉన్నారా?. కాంగ్రెస్ నేతలు మంత్రి జగదీష్ రెడ్డిలా ఇసుక దందా, భూదందా చేయలేదు. పొద్దు తిరుగుడు పువ్వులా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ చేరే సుఖేందర్ రెడ్డి గారు మీ గత ఆస్తులకు ఇప్పుడు పొంతన ఉందా?. ఏ మాన్యువల్ లేని విధంగా ఎమ్మెల్యేలకు కూడా పైలట్ వాహనాలు ఇచ్చారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు కేసీఆర్ ని నిధులు ధైర్యం గుత్తా, జగదీష్ రెడ్డిలకులేదు. వారే రెండు చేతులు జోడించి జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఎత్తే అర్హత జిల్లా మంత్రికి లేదు. యాదాద్రి పవర్ ప్లాంటు త్వరితగరితన పూర్తి చేయకుండా జిల్లా మంత్రి గాడిదలు కాస్తుండా?. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్ని పవర్ ప్రాజెక్టులు కట్టింది?. ఏ పవర్ ప్రాజెక్టుల నుంచి కరెంటు ఇస్తున్నారు?. ఏ పవర్ ప్రాజెక్టు కట్టి విద్యుత్ ఇస్తున్నారో మంత్రి జగదీష్ రెడ్డి చెప్పాలి అని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఇదీ చదవండి: గవర్నర్-కేసీఆర్.. ఓ ఇంట్రెస్టింగ్ పరిణామం -
గవర్నర్ అంటే గౌరవం ఉంది: గుత్తా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మధ్య మాటల యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం సీఎస్ శాంతి కుమారిపైన కూడా గవర్నర్ తమిళిసై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌పై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, నల్లగొండలో సుఖేందర్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘గవర్నర్ అంటే మాకు గౌరవం ఉంది. చిన్న చిన్న విషయాల్లో ఆరోపణలు చేయడం సరికాదు. బడ్జెట్ సమావేశాల సందర్బంగా అసెంబ్లీలో తెలంగాణ అద్భుతంగా ఉందని ప్రసంగించారు. కానీ, బయట మాత్రం పలు వ్యాఖ్యలు చేస్తారు. ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు. అలాగే, తెలంగాణలో కూడా రాజకీయాల పార్టీల తీరుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీల వ్యవహారం ఆక్షేపనీయంగా ఉంది. రాజకీయాలను భ్రష్టు పటిస్తున్నారు. కొన్ని పార్టీల నేతలు బూతు పురాణాలు ఎత్తుకుంటున్నారు. ఇలా మాట్లాడటం వల్ల ప్రజల్లో తమ విలువ కోల్పోతున్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు: గుత్తా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని తాను భావిస్తున్నానని, ముందస్తు వచ్చే అవకాశం లేదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ముందస్తుకు వెళ్లేంత సమయం కూడా లేదని, మధ్యలో కేవలం ఆరు నెలలే గడువు ఉందన్నారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తు ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ముందుకు వెళ్లాలని మునుగోడు ఎన్నికల సమయంలో అవగాహన కుదిరినట్లు తమ పార్టీ వారు తనకు చెప్పారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్ వస్తుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దండుపాళ్యం బ్యాచ్ అని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నాయకులకే వర్తిస్తా యని విమర్శించారు. కేసీఆర్ సాధించిన ప్రగతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి మళ్లీ పట్టం కడుతుందన్నారు. -
గవర్నర్ ప్రసంగం సాఫీగా సాగుతుందని ఆశిస్తున్నా..
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీలో అక్కడి గవర్నర్ ప్రసంగం తరహాలో బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో తెలంగాణ గవర్నర్ ప్రసంగం ఉండదని భావిస్తున్నట్లు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేంద్రం చెప్పినట్లు రాష్ట్రాల గవర్నర్లు వ్యవహరిస్తున్నారని, గవర్నర్ ప్రసంగం సాఫీగా జరగాలని ఆశిస్తున్నానన్నారు. శాసనమండలి ఆవరణలో మంగళవారం గుత్తా సుఖేందర్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ నడుమ వివాదం సర్దుకుంటుందని తానే ముందే చెప్పానని, గవర్నర్‌తో విభేదాలు రావడం, పోవడం సహజమని వ్యాఖ్యానించారు. గవర్నర్, ప్రభుత్వం, అసెంబ్లీ పరస్పర సంబంధం కలిగి ఉంటాయని, ఇందులో ఏ ఒక్కరిదో విజయం అంటూ ఉండదని పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలు కలిసి పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. విపక్ష సభ్యులకు సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తామని, సభ్యుల సంఖ్య తక్కువగా ఉండటంతో వారికి కేటాయించే సమయం తక్కువగా ఉంటోందని చెప్పారు. ఫిబ్రవరి 3న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు 14వ తేదీ వరకు కొనసాగే అవకాశముందన్నారు. బీఆర్ఎస్కు జాతీయ స్థాయిలో ఆదరణ బీఆర్ఎస్కు జాతీయస్థాయిలో ఆదరణ ఉంటుందని, కొన్ని రాష్ట్రాల్లోని రాజకీయ శూన్యత బీఆర్ఎస్కు కలిసి వస్తుందని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. రాజకీయ నాయకులు ఎన్నడూ తెరమరుగు కారని, వారి పని అయిపోయిందని భావించకూడదని, సమయం వచ్చినపుడు సత్తా చూపుతారన్నారు. ఇటీవల బీఆర్ఎస్లో చేరిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ చాలా సీనియర్ నేత అనే విషయాన్ని గుర్తు చేస్తూ నీలం సంజీవరెడ్డి చాలా ఏళ్ల పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండి తర్వాతి కాలంలో ఎంపీగా, లోక్‌సభ స్పీకర్‌గా, రాష్ట్రపతిగా పదవులు చేపట్టారన్నారు. చనిపోయిన టీడీపీకి తెలంగాణలో జీవ గంజి పోసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నా అది సాధ్యం కాదన్నారు. పవన్ కల్యాణ్ వంటి వారి ప్రభావం ఎంతమాత్రం ఉండబోదని చెప్పారు. జగదీశ్‌రెడ్డితో విభేదాల్లేవు ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మంత్రి జగదీశ్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని, పంచాయతీలు, వ్యవహారాల్లో తలదూర్చను అని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధిస్తుందని, వామపక్షాలతో పొత్తు కలిసి వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని తన కుమారుడు అనుకుంటున్నా, తుది నిర్ణయం పార్టీదే అని చెప్పారు. -
దేశంలోనే తెలంగాణ నం.1
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలోని జాతిపిత మహాత్మాగాంధీ, బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసన మండలి ఆవరణలో గుత్తా, శాసనసభ ఆవరణలో పోచారం జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. దేశంలోనే అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో నిలిచిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ: స్పీకర్ కులమతాలకు అతీతంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజలందరూ కలిసి జరుపు కునే పండుగ గణతంత్ర దినోత్సవమని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శాంతియుతంగా తెచ్చిన స్వాతంత్య్ర ఫలాలను పరిపాలన ద్వారా అమలు చేసే విధులు, బాధ్యతలను పవిత్రమైన రాజ్యాంగం తెలియజేసిందన్నారు. తెలంగాణ భవన్లో.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కే.కేశవరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. టీటీడీపీ కార్యాలయంలో పతాకావిష్కరణ భారత 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో గురువారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు అట్లూరి సుబ్బారావు, ఆజ్మీరా రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆప్ కార్యాలయంలో జెండా వందనం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాష్ట్ర కార్యాలయంలో గురువారం గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆప్ కోర్ కమిటీ సభ్యురాలు ఇందిరా శోభన్ ఎగురవేశారు. -
టీఆర్ఎస్లో వారసుల హవా: మా వాడు వస్తున్నాడు.. దీవించండి!
సీనియర్ రాజకీయ నాయకులు చాలా మంది తమ వారసుల అరంగేట్రం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత.. తనయుడి రాజకీయ భవిష్యత్ కోసం వ్యూహ రచన చేశారు. దాన్ని అమలు చేస్తున్నారు కూడా. తన కుమారుడి గురించి నలుగురు చర్చించుకునే విధంగా స్లోగా తెరమీదకు తెస్తున్నారు. ఏదోవిధంగా గులాబీ బాస్ దృష్టిలో తన కుమారుడు పడేందుకు ప్లాన్ చేస్తున్నారు. మా వాడు వస్తున్నాడు.. దీవించండి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. ఇప్పటికే మూడు సార్లు ఎంపీగా కొనసాగారు. ఎంతో సీనియర్ అయినప్పటికీ ఆయన రాష్ట్రంలో మంత్రి కాలేకపోయారు. ఆ కోరిక అలాగే మిగిలిపోవడం సుఖేందర్‌రెడ్డిని తొలచివేస్తోందట. అలాగే తన కుమారుడు అమిత్‌రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావడం కూడా ఆయన కోరికల్లో మరొకటి. ఉమ్మడి జిల్లా నుంచి జగదీష్‌రెడ్డి మంత్రిగా ఉన్నందున మరో రెడ్డి సామాజిక వర్గ నేతకు మంత్రి పదవి ఇచ్చే అవకాశంలేదు. భవిష్యత్‌లో కూడా మంత్రి పదవి దక్కే అవకాశం కూడా కనిపించడంలేదు. ఇటువంటి పరిస్థితుల్లో కొడుకునన్నా రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయించి చట్టసభలోకి పంపించాలని గుత్తా ప్లాన్ చేస్తున్నారు. కొంచెం గుర్తు పెట్టుకోండి. ఈ నేపథ్యంలోనే కొంతకాలం నుంచి వీలు దొరికినప్పుడల్లా కొడుకు రాజకీయ ఆరంగేట్రం గురించి ప్రస్తావన తీసుకువస్తున్నారట. దీని ద్వారా అమిత్ పేరుపై జనాల్లో చర్చ జరగాలన్నది ఆయన వ్యూహంగా తెలుస్తోంది. జిల్లాలో ఏదో ఒక నియోజవకర్గం నుంచి అమిత్‌ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని గుత్తా చూస్తున్నారట. అయితే అది అంత సులువుగా నెరవేరే అవకాశం ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే సిట్టింగ్‌లకే సీట్లు ఇస్తామని సీఎం కేసీఆరే ప్రకటించారు. మరోవైపు జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో మొత్తం టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్‌కు అవకాశం ఎలా వస్తుంది? ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది తెలియాలి. ఒకవేళ ఎమ్మెల్యేగా అవకాశం రాకపోతే నల్లగొండ లోక్ సభ స్థానం నుంచి అయినా పోటీ చేయించాలని సుఖేందర్ రెడ్డి అనుకుంటున్నారట. ఎలాగూ గతంలో తాను ఎంపీగా పనిచేసిన స్థానం కావడంతో తనకున్న పరిచయాలు ఉపయోగపడతాయని లెక్కలు వేస్తున్నారట. మేమూ పోటీలో ఉన్నాం అయితే నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకునే నేతల లిస్ట్ కూడా టీఆర్ఎస్లో పెద్దగానే ఉందట. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఉత్తమ్ చేతిలో ఓడిపోయిన వేమిరెడ్డి నర్సింహ్మారెడ్డితో పాటు మరో పారిశ్రామికవేత్త, మొదటి నుంచి పార్టీలో ఉంటున్న ఓ మాజీ ఎంపీ కుమారుడితో పాటు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న మరో నేత కూడా టికెట్ కావాలని కోరుతున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్‌కు అవకాశం వస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇన్నాళ్లు తండ్రి చాటు తనయుడిగా పెరిగిన అమిత్ ప్రజల్లోకి రాకపోవడం మైనస్‌గా చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో తాను పదవిలో ఉన్నప్పుడే కొడుకు రాజకీయ భవిష్యత్‌కు బాటలు వేయాలని గుత్తా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకవేళ కుమారుడికి ఎంపీ టికెట్ ఇప్పించుకోవడంలో గుత్తా విఫలం అయితే మాత్రం.. అది అమిత్ రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తమ భవిష్యత్ కోసం, వారసుల రాజకీయ భవిష్యత్ కోసం చాలా మంది కలలు కంటారు. కాని కొందరికీ కలలు వాస్తవ రూపంలో నెరవేరతాయి. మరి గుత్తా సుఖేందర్ రెడ్డి తన కుమారుడిని చట్టసభకు పంపాలన్నా కల నెరవేరుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
'అందుకోసమే బీజేపీ రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించింది'
సాక్షి, నల్గొండ: స్వార్ధ ప్రయోజనాల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. రాజగోపాల్ రెడ్డికి ఆయన సోదరులు, భార్య కనిపించలేదా?. రాజగోపాల్ రెడ్డి రాజీనామా బీజేపీకి అవసరం. రాజకీయంగా విస్తరణ కోసమే బీజేపీ రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించింది. మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయం. రేవంత్ రెడ్డి అయినా బండి సంజయ్‌ల చేతికి రాష్ట్రం పోయిన తెలంగాణకు నష్టమే. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. రేవంత్‌రెడ్డిపై దాసోజు శ్రవణ్ వ్యాఖ్యలు వాస్తవికంగా ఉన్నాయి' అని గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. -
గవర్నర్... హద్దులు గుర్తెరగాలి
రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం గవర్నర్ పరిధి కాదని, రాష్ట్ర గవర్నర్ తన పరిధిలోనే ఉండాలని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తాను కూడా రాజ్యాంగ పదవిలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ఈ పదవుల్లో ఉన్న వారు తమ హద్దులను గుర్తెరగాలన్నారు. దేశంలో సరైన ప్రత్యామ్నాయ నాయకత్వం లేనందునే బీజేపీ ఆటలు సాగుతు న్నాయని, దేశానికి సరైన నాయకత్వం అవసరముందన్నారు. శాసనమండలిలోని తన చాంబర్లో గురువారం మీడియాతో గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సమకాలీన రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. – సాక్షి, హైదరాబాద్ రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోంది రాజకీయాల్లో నాణ్యత తగ్గుతోంది. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం ప్రతి విషయంలోనూ మోకాలడ్డుతోంది. నిరంకుశ, నియంత పాలన వైపుగా దేశాన్ని నడిపేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన జరపాలి. జమ్మూకశ్మీర్‌లో సాధ్యమైనపుడు తెలంగాణ, ఏపీలో ఎందుకు సాధ్యం కాదు? రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎనిమిదేళ్ల తర్వాత కేంద్రానికి గుర్తుకొచ్చాయా? సీఎంది పార్లమెంటరీ భాషే! ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ పార్లమెంటరీ భాషలోనే మాట్లాడుతున్నారు. ఏది పార్లమెంటరీ.. ఏది అన్‌పార్లమెంటరీ అనే అంశంపై మార్గదర్శకాలు ఇవ్వాలి. సర్వేల్లో బీజేపీ పుంజుకుందని చెబుతున్నా అధికారం టీఆర్ఎస్దే అనే విషయాన్ని మరిచిపోవద్దు. తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతోపాటు కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. హుజూర్నగర్, హుజూరాబాద్‌లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను 95 శాతం మేర నెరవేర్చింది. ఎన్నికల సమయంలో కొందరు నాయకులు పార్టీలు మారడం సహజం. ఈటలకు టచ్‌లో ఉన్న నేతలెవరో ఆయనకు తప్ప ఎవరికీ తెలియదు. చంద్రబాబు మాట విని ఏడు మండలాలను బీజేపీ ఏపీలో విలీనం చేసింది. పోలవరం ముంపు తగ్గించేందుకు సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. పోలవరంతో తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు ప్రమాదం ఉంది. ప్రకృతి ప్రకోపిస్తే అమెరికానే మునిగింది. కాళేశ్వరం కూడా ప్రకృతి వైపరీత్యమే. షర్మిల కోరుకుంటున్న పాలన తెలంగాణలో కాదు రావాల్సింది. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు లైఫ్ అండ్ డెత్... మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరుతాను అని అడిగిన విషయం నాకు తెలియదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశం రాజగోపాల్‌రెడ్డి చేతిలోనే ఉంది. అయితే ఆయన రాజీనామా అంశాన్ని సాగదీసే అవకాశం ఉంది. కోమటిరెడ్డి సోదరులకు మునుగోడు ఉప ఎన్నిక రాజకీయంగా చావుబతుకులకు సంబంధించిన సమస్య. ఉప ఎన్నిక వస్తే ఇద్దరు సోదరులు మునుగుతారు. మునుగోడులో నేను పోటీ చేయాలా వద్దా అనేది సీఎం నిర్ణయిస్తారు. -
శాసన మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా సుఖేందర్
-
శాసన మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా సుఖేందర్
-
రెండోసారి మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎగువ సభ ప్రతిష్టను, ఔన్నత్యాన్ని పెంచే విధంగా మనమంతా కృషి చేద్దామని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభ్యులకు సూచించారు. తన బాధ్యత తాను నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని చెప్పారు. సీనియర్ సభ్యులతో పాటు జూనియర్ సభ్యులు సభా సంప్రదాయాలపై అవగాహన పెంచుకుంటూ అందరం కలిసి ముందుకు సాగుదామని అన్నారు. సోమవారం కౌన్సిల్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు టి.జీవన్‌రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆయన్ను చైర్మన్ సీటు వద్దకు తీసుకెళ్లారు. సీటులో ఆసీనులైన గుత్తాకు మంత్రులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మాట్లాడారు. చట్టసభల నిర్వహణలో తెలంగాణ తలమానికంగా నిలుస్తోందని, సభా సంప్రదాయాల విషయంలో ఆదర్శంగా ఉందని తెలిపారు. గతంలో 21 నెలల పాటు కౌన్సిల్ చైర్మన్‌గా బాధ్యతలను నిర్వహించిన సందర్భంగా సభ గౌరవ మర్యాదలు కాపాడే ప్రయత్నం చేశామన్నారు. ఎగువసభ అధ్యక్ష బాధ్యతలు తనకు మరోసారి అప్పగించిన సీఎం కేసీఆర్‌కు, ఎన్నుకున్న సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. అత్యుత్తమ పదవుల్లో రైతు బిడ్డలే: మంత్రి కేటీఆర్ ‘తెలంగాణ సీఎం కేసీఆర్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మీరు (గుత్తా సుఖేందర్ రెడ్డి).. అంతా రైతు బిడ్డలే కావడం విశేషం. రైతు బిడ్డలే అత్యున్నతమైన రాజ్యాంగ పదవుల్లో ఉండ టం ఈ రాష్ట్ర అదృష్టం. ఈ రాష్ట్ర రైతాంగం పక్షాన కూడా మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను..’అంటూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కౌన్సిల్లో టీఆర్ఎస్ సభ్యులు 35, 36 మంది ఉన్నారని, అందువల్ల దామాషా ప్రకారం తమకు ఎక్కువ అవకాశాలివ్వాలని కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఒక్కరే ఉన్నా యువకుడిలా ఉత్సాహంగా మాట్లాడుతున్నారని, తాము మధ్యవయసు వారి మాదిరిగా నడుచుకోవాల్సి వస్తోందని అన్నారు. ‘నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారం కోసం కృష్ణా జలాలను ఇంటింటికీ అందించాలని సుఖేందర్‌రెడ్డి గతంలో సూచించారు. ప్రస్తుతం మిషన్ భగీరథ పథకంతో ఫ్లోరోసిస్ నుంచి విముక్తి పొందాం..’అని కేటీఆర్ చెప్పారు. రైతు సమన్వయ సమితి తొలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి సమర్థవంతంగా నిర్వహిం చారని గుర్తు చేశారు. మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, సభ్యులు కడియం శ్రీహరి, కల్వకుంట్ల కవిత, వాణీదేవి, ఉళ్ళోళ్ల గంగాధర్‌గౌడ్, ఎల్.రమణ, ఫారుఖ్ హుస్సేన్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెస్ ప్రభాకర్‌రావు, సయ్యద్ అమీనుల్ జాఫ్రీ, కాలేపల్లి జనార్ధనరెడ్డి కూడా అభినందనలు తెలియజేశారు. చదవండి: తెలంగాణ అసెంబ్లీ లైవ్ అప్డేట్స్ -
మండలి చైర్మన్‌గా గుత్తా నామినేషన్
సాక్షి, హైదరాబాద్: శాసన మండలి చైర్మన్ పదవికి మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి అసెంబ్లీ సెక్రటేరియట్లో నామినేషన్ పత్రాలు సమర్పించారు. గుత్తా వెంట మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్, గొంగిడి సునీత, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. నామినేషన్ పత్రాలు సమర్పించాక గుత్తా మాట్లాడుతూ.. రెండోసారి మండలి చైర్మన్‌గా అవకాశమిచ్చిన టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మండలి చైర్మన్‌గా తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన అన్ని పార్టీల నేతలకు కృతజ్ఞతలు చెప్పారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నేడు నోటిఫికేషన్? మండలి చైర్మన్ పదవికి గుత్తా ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సోమవారం జరిగే మండలి భేటీలో లాంఛనంగా ప్రకటించనున్నారు. తర్వాత గుత్తాకు కొత్త చైర్మన్‌గా ప్రొటెమ్ చైర్మన్ సయ్యద్ అమీనుల్ జాఫ్రీ బాధ్యతలు అప్పగిస్తారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కొత్త చైర్మన్ సోమవారం షెడ్యూలు, నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. సోమవారం సాయంత్రం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తి చేసి మంగళవారం జరిగే మండలి భేటీలో కొత్త డిప్యూటీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. -
ఉత్తమ్ పోయి ఉత్తర కుమారుడు వచ్చాడు: గుత్తా సుఖేందర్‌రెడ్డి
-
‘సాగర్’లో పోటీకి.. నన్నెవరూ అడగలేదు
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీకి సంబంధించి టీఆర్ఎస్ నుంచి ఎవరూ సంప్రదించలేదని, ప్రస్తుత పదవితో సంతృప్తిగా ఉన్నట్లు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది జూన్‌లో శాసనమండలి సభ్యుడిగా తన పదవీకాలం ముగుస్తుందన్నారు. ఆ తర్వాత తన రాజకీయ భవిష్యత్తును పార్టీ అధినేత నిర్ణయిస్తారన్నారు. మండలిలోని తన కార్యాలయంలో శనివారం గుత్తా మీడియాతో మాట్లాడారు. సాగర్‌లో స్థానికులు, స్థానికేతరులు అనే నినాదం అర్ధరహితమని, నాయకులందరూ హైదరాబాద్‌లో మకాం వేసి రాకపోకలు సాగిస్తున్నారన్నారు. సీఎంగా కేటీఆర్‌కు అన్ని అర్హతలు ‘ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు మంత్రి కేటీ రామారావుకు అన్ని అర్హతలు ఉన్నాయి. పాలనా సామర్ద్యం ఉంది’అని గుత్తా పేర్కొన్నారు. ‘ఇటీవలి కాలంలో కొందరు ఎంపీలు వాడుతున్న పదజాలం ఘోరంగా ఉంటోంది. తాత్కాలికంగా నాలుగు ఓట్లు వస్తాయేమో కానీ భవిష్యత్తు తరాలకు ఇది తప్పుడు సంకేతాలను ఇస్తుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తరహాలో సాగర్ ఫలితం ఉండదు. నల్గొండ జిల్లా రాజకీయ పరిస్థితులు వేరు. రాజకీయాల్లో ఎవరికీ ఎవరూ పోటీ కాదు’ అని గుత్తా వ్యాఖ్యానించారు. ఎన్నికల కోసమే ప్రమోషన్లు, పీఆర్సీ: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే సీఎం కేసీఆర్ ప్రమోషన్లు, ఉద్యోగాల భర్తీ, పీఆర్సీ అంశాలను ముందుకు తెచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. విద్యా వ్యవస్థ, ఉద్యోగుల సమస్యలపై ఈ ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని ధ్వజమెత్తారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఆర్భాటంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో ఒక్క పోస్టయినా భర్తీ చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 4 వేల ప్రధానోపాధ్యాయుల పోస్టులు, 92 శాతం ఎంఈవోలు, సగం డీఈవో పోస్టులతో పాటు వెయ్యికి పైగా ఉర్దూ మీడియం పోస్టుల ఖాళీలతో విద్యావ్యవస్థ నిర్వీర్యం అయిందని విచారం వ్యక్తంచేశారు. తక్షణమే ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూనే పీఆర్సీని వాయిదా వేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి తాబేదారులై అడుక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ముందు పార్టీకి రాజీనామా చెయ్: ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వేరే పార్టీ లో చేరాలనుకుంటే కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలని జీవన్‌రెడ్డి అన్నారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని, కొందరు నేతలు వ్యక్తిగత స్వార్థంతోనే పార్టీలు మారుతున్నారన్నారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయొద్దంటూ రాజగోపాల్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వ్యవసాయ బిల్లు; కార్పొరేట్లకు తెరిచిన ద్వారాలు..
సాక్షి, నల్లగొండ : కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే నూతన వ్యవసాయ బిల్లు తీసుకువచ్చారని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. దశల వారీగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)ను నిర్వీర్యం చేసే చర్య జరుగుతోందని ఆరోపించారు. జిల్లాలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దశల వారీగా కనీస మద్దతు ధరను తీసివేసే యోచన జరుగుతోందని అన్నారు. లాభ నస్టాలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. (గ్రేటర్లో ఆర్టీసీ బస్సులు నడపండి) ‘నూతన వ్యవసాయ బిల్లు అన్యాయమైనది. అందుకే రైతులు గగ్గోలు పెడుతున్నారు. మార్కెట్ యార్డులు నిర్వీర్యం అవుతాయి. టోటల్ విధానాన్ని రద్దుచేసి, కార్పొరేట్లకు ద్వారాలు తెరిచారు. ఈ చట్టాలు కేంద్రం చేతుల్లోకి తీసుకోవడం వల్ల రైతులకు నష్టం జరుగుతంది. నూతన విద్యుత్ విధానం రైతులకు శరాఘాతం వంటిది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వెసులుబాటు కల్పిస్తే కేంద్రం ఫెడరల్ విధానానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. విద్యా విధానం, జీఎస్టీ, తదితర పథకాలు అన్నీ కూడా రాష్ట్రాల మీద భారం మోపుతోంది. కేంద్ర ప్రభుత్వం అంచెలంచెలుగా ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతోంది.’ అని మండిపడ్డారు. (బీజేపీ మాయ మాటల పార్టీ: హరీశ్ రావు) -
మా ఇంట్లో ఆరుగురు కరోనాను జయించారు
సాక్షి, నల్గొండ: మనోధైర్యం, వైద్యుల సలహాలతో కరోనాను జయించవచ్చని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాతో సహజీవనం తప్పదు. మా ఇంట్లో ఇప్పటికే ఆరుగురు కరోనాను జయించారు. మొదట నా కొడుకు, కోడలికి పాజిటివ్ వచ్చింది. తర్వాత 15 రోజుల్లో మళ్లీ నెగిటివ్ వచ్చింది. తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోవాలని ప్రజలను కోరుతున్నా. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తది నిర్మించాలని గతంలోనే ప్రతిపాదించినప్పటికీ అప్పుడు ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం చేశాయి. అప్పుడు అడ్డుకొని ఇప్పుడు మాటమార్చి రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉమ్మడి నల్గొండలో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ఓ అద్భుతమేనని అన్నారు. కరోనా వ్యాధి నిర్ధారణ కోసం అన్ని ఏరియా ఆసుపత్రిల్లో, పీహెచ్సీ కేంద్రాల్లో ప్రభుత్వం రాపిడ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యంపైనే అధిక నిధులు ఖర్చు చేస్తున్నది. (గుజరాత్ తర్వాత మనమే!) పరిపాలనా సౌలభ్యం కోసం సచివాలయం కొత్తది నిర్మించడం చాలా అవసరం. అందువల్ల కోర్టులలో కేస్లు వేసిన వారు విత్ డ్రా చేసుకొని నూతన నిర్మాణానికి సహకరించాలి. ప్రతి విషయంలో రాజకీయాలు అవసరం లేదు. అనవసర విషయాలలో ప్రతిపక్షాలు రాద్ధాంతం మానుకోని కలిసి మెలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో 100 అంబులెన్స్‌లు సమకూర్చడం అభినందనీయమని' గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. -
దిశలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం
సాక్షి, నల్గొండ: కొత్త సంవత్సరం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ముందుందని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతోందన్నారు. భవిష్యత్తులోనూ తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు అభివృద్ధి వైపే ఉంటారని తెలిపారు. మరోసారి ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు అవాంతరాలు ఉండకపోవచ్చని గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇకపోతే 2019లో ‘దిశ’లాంటి కొన్ని సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. -
‘పురపోరు’లో టీఆర్ఎస్ విజయం ఖాయం
సాక్షి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ విజయఢంకా మోగించడం ఖాయమని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, నల్లగొండ మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ అభ్యర్థి గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ వల్లే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ పరుగులు పెడుతున్నాయన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలనే ఆసక్తిని సీఎం దృష్టికి తీసుకెళ్లాను.. అందుకు అనుగుణంగా సీఎం కేసీఆర్ అంగీకరించి ఎమ్మెల్సీగా ప్రకటించారన్నారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎమ్మెల్సీగా ప్రకటిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 7, లేదా 10న నామినేషన్వేస్తానని అందుకు సీఎం పొలిటికల్ కార్యదర్శి సుభాష్‌రెడ్డిని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ సెక్యులర్‌పార్టీ అని ప్రజల భవిష్యత్ టీఆర్ఎస్తోనే ముడిపడి ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్న సంక్షేమపథకాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం అమలు చేశారన్నారు. జిల్లా అభివృద్ధి కోసం మంత్రి జగదీశ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా అభివృద్ధికి పాటుపడతానన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయించడంతోపాటు నీటిలభ్యత ఉన్న ప్రాంతాలను గుర్తించి సద్వినియోగపరుస్తామన్నారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలోనే జిల్లాను అభివృద్ధిలో ముందుంచుతామన్నారు. పార్టీ సభ్యత్వాన్ని భారీగా చేపట్టామన్నారు. బీజేపీ నాలుగు సీట్లు గెలిచి ప్రత్యామ్నాయం అనుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సొరంగమార్గం, బివెల్లెంల, డిండి, చర్ల ప్రాజెక్టులను పూర్తి చేసి బీడు భూములకు సాగునీరు అందించి రైతు కళ్లల్లో ఆనందం నింపుతామన్నారు. కాంగ్రెస్ పాలనలో వెనుకబడిన జిల్లాను సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో జిల్లా అభివృది పథంలో నడుస్తుందన్నారు. ఎమ్మెల్సీగా ప్రకటించినందుకు కేసీఆర్, కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావులు మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించుకోవాలన్నారు. గుత్తాకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం పట్ల సీఎం కేసీఆర్‌కు, కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ కోఆర్డినేటర్ మాలె శరణ్యారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకట్‌నారాయణగౌడ్, మాజీ ఎంపీపీ దైద రజిత పాల్గొన్నారు. అనంతరం గుత్తాను జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యేలు కంచర్ల, భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావు.. గుత్తాను సన్మానించారు. పార్టీ నాయకులు సుంకరి మల్లేశ్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, రంగయ్య, యాదయ్య, ప్రసాద్, జగిని వెంకన్న, అంజయ్య, శరణ్యారెడ్డి, మామిడి పద్మ, సరోజ, బాలామణి పాల్గొన్నారు. -
గుత్తా పేరు ఖరారు చేసిన సీఎం కేసీఆర్
సాక్షిప్రతినిధి, నల్లగొండ : శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు ఖరారు అయింది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం అధికారికంగా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి శనివారం ఉదయం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ పత్రాల దాఖలులో గుత్తాకు సహకరించాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డికి ముఖ్యమంత్రి సూచించారు. గుత్తా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటనతో నల్లగొండ జిల్లాకు మరో ఎమ్మెల్సీ పదవి వరించినట్లు అయింది. ఇప్పటికే జిల్లా నుంచి నేతి విద్యాసాగర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా ప్రస్తుతం ఆయన శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా డాక్టర్ తేరా చిన్నపరెడ్డి విజయం సాధిం చారు. అంతకుముందు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉండగా, ఆయన మండలిలో ప్రభుత్వ విప్ పదవిలో కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఒక స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం లాంఛనమేనని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి.. టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ నుంచి.. టీఆర్ఎస్లోకి నల్లగొండ ఎంపీగా కాంగ్రెస్‌నుంచి 2014 ఎన్నికల్లో విజయం సాధించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యం లో టీఆర్ఎస్ గూటికి చేరారు. 2014 సార్వత్రిక ఎ న్నికల్లో, తెలంగాణ రాష్ట్రానికి జరిగిన తొలి ఎన్నికల్లో పదిహేడు ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించగా.. అందులో నల్లగొండ ఒకటి. టీఆర్ఎస్ గాలిని తట్టుకుని కాంగ్రెస్‌నుంచి విజయం సాధించిన ఆయన రాజకీయ పునరేకీకరణ పేర టీఆర్ఎస్ చేపట్టి ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా గులాబీ పార్టీకి చేరువయ్యారు. ఆయన తనతోపాటు మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండిన ఎన్.భాస్కర్‌రావు, సీపీఐ నుంచి దేవరకొండ ఎమ్మెల్యేగా ఉన్న రవీంద్రకుమార్లను కూడా టీఆర్ఎస్లోకి తీసుకువచ్చారు. గత ప్రభుత్వంలో మంత్రి పదవిని ఆశించిన గుత్తాకు చివరి వరకూ ఆ అవకాశమే దక్కలేదు. కానీ, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి మాత్రం దక్కింది. గతేడాది డిసెంబర్లో జరిగిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో కానీ, ఆ తర్వాత ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కానీ, ఆయన ఎక్కడి నుంచి టికెట్ కోసం ప్రయత్నించలేదు. ఎమ్మెల్సీ పదవిపైనే ఆశ పెట్టుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఖాళీ కావడం, నోటిఫికేషన్ కూడా వెలువడడంతో పాటు గుత్తా పేరు ఖరారు కావడంతో ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేశారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్థానానికి నవీన్‌రావు పేరు
-
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్‌రావు
సాక్షి, హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి నవీన్‌రావు పేరును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. గత కొంతకాలంగా ఆ స్థానానికి నల్గొండ మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఆఖరున నవీన్‌రావు పేరును ఖరారు చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మనసు నొచ్చుకోకుండా ఉండేందుకు.. త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానానికి అవకాశం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుండి మైనంపల్లి హన్మంతరావు టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి, విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్ దాఖలు చేయడానికి మంగళవారం చివరి తేదీ. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్థానానికి నవీన్‌రావు పేరు -
ప్రజల సహకారం మరువలేనిది : గుత్తా
సాక్షి, నల్గొండ : నియోజకవర్గ ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని, అందువల్లే తనకు 15 సంవత్సరాలు పూర్తి సమయం ఎంపీగా పని చేసే అదృష్టం లభించిందని టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ నిధులు పూర్తిగా శాశ్వత నిర్మాణాలకు కేటాయించి, నిధుల వినియోగంలో మొదటి స్థానంలో నిలవడం సంతోషంగా ఉందన్నారు. నల్గొండ, సూర్యాపేటలో మెడికల్ కళాశాలలు, నియోజకవర్గ పరిధిలో రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు జాతీయ రహదారుల అనుసంధానం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. రైల్వే లైన్ల విషయంలో పెండింగ్ పనులు మార్చి చివరికల్లా పూర్తి చేయించడం జరుగుతుందని తెలిపారు. మార్చి మొదటి వారంలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని చెప్పారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయించే దిశగా ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ముఖ్యమంత్రి చేపడుతున్న పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు. -
‘చంద్రబాబుపై కేసీఆర్ చేసిన ప్రతి మాట సరైనదే’
సాక్షి, నల్గొండ : అధికారం కోసం చంద్రబాబు నాయుడు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారని టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుట్రలకు, మోసాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. కేసీఆర్ చంద్రబాబుపై మాట్లాడిన ప్రతి మాట సరైనదేనన్నారు. ఏపీ మంత్రులు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హైకోర్టు విభజన చంద్రబాబుకు ఇష్టం లేదు కాబట్టే ఇన్ని రోజులు కోర్టు విభజనకు అడ్డుపడ్డారని ఆరోపించారు. రాజధాని ఏర్పాటు విషయంలో కూడా ఏపీ ప్రజలను మోసం చంద్రబాబు మోసం చేస్తున్నారని చెప్పారు. కులాలను అడ్డుపెట్టుకొని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు కుట్రలకు మళ్లీ బలి కావొద్దని ఏపీ ప్రజలను గుత్తా కోరారు. -
తెలంగాణకూ ప్రత్యేక హోదా ఇవ్వాలి
నల్లగొండ రూరల్: తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా పేరుతో తెలంగాణను మరో సారి అన్యాయానికి గురి చేయవద్ద న్నారు. విభజన చట్టం హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ నేతలు అడగడం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీర్మానం చేస్తే, తెలంగాణకు కూడా ఇవ్వాలని ఇక్కడి కాంగ్రెస్ నేతలు అడగకపోవ డం వారి అసమర్థతకు నిదర్శనమన్నారు. -
‘తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలి’
సాక్షి, నల్గొండ : తెలంగాణ ప్రజలకు వంచించడం చేతకాదని, అందుకే ప్రతీసారీ మోసపోతున్నామని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ మినహా మిగిలిన ప్రాంతమంతా వెనుకబడిందేనని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సమగ్రంగా వివరిస్తూ 2015లో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలకు లేఖ రాశానని గుర్తు చేశారు. అన్ని వనరులతో అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే.. వెనుకబడిన తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో కనీసం ఒక్క ప్రాజెక్టునైనా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కేంద్రానికి విఙ్ఞప్తి చేశారు. అధిష్టానంపై ఒత్తిడి తీసుకురండి.. ఏపీకి హోదా కల్పిస్తామని సీడబ్ల్యూసీ కమిటీ సమావేశంలో తీర్మానం చేస్తోంటే తెలంగాణ గురించి మాట్లాడకుండా ఏం చేశారంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలను గుత్తా ప్రశ్నించారు. విభజన చట్టం హామీలు నెరవేర్చాలని ఎంపీలు అడగలేక పోవడానికి కారణాలేంటో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇప్పటికైనా నోరు తెరచి అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సూచించారు. -
జానారెడ్డి ఇక రిటైర్మెంట్ తీసుకోవాలి!
సాక్షి, నల్లగొండ : కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇక రిటైర్మెంట్ తీసుకుంటే మంచిది.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చదువుకున్న అజ్ఞాని.. కోమటిరెడ్డి చదువుకోని అజ్ఞాని.. ఇవి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యలు.. ఆయన సోమవారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు పగటి కలల్లో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చదువుకున్న అజ్ఞాని అయితే, కోమటిరెడ్డి చదువుకోని అజ్ఞాని అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పీసీసీ చీఫ్ కుటుంబంలో ఇద్దరు, కోమటిరెడ్డి కుటుంబంలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, వీరిదంతా ఫ్యామిలీ పార్టీ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని విమర్శించారు. -
ఆ పథకాలు కేసీఆర్ ప్రకటించిన వరాలు: గుత్తా
సాక్షి, నల్గొండ : కోటిఎనభై లక్షలతో బత్తాయి మార్కెట్‌ను జిల్లాలో ఏర్పాటు చేయడం రైతులకు సంతోషకరమైన విషయమని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 2.5 లక్షల ఎకరాల భూమి సాగుకు అవకాశం ఉందన్నారు. డిండి ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, బ్రాహ్మణ వెళ్ళంల ప్రాజెక్టు ద్వారా మూడు నెలల్లో నీరు అందిస్తామని ప్రకటించారు. భూ రికార్డుల ప్రక్షాళన, ఎకారాకు ఎనిమిది వేల రైతు పెట్టుబడి, యాబై లక్షల రైతులకు ఐదు లక్షల బీమా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చెప్పకుండా ఇచ్చిన వరాలని పేర్కొన్నారు. 130 కోట్లతో నల్గోండలో ఇంటింటికి నీరు అందించేందుకు సర్వం సిద్దమవుతోందని, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సేవ చేసే అవకాశం కల్పించింనందుకు ధన్యవాదాలు తెలిపారు. -
‘సీఎం కేసీఆర్ దేశానికి ఆదర్శం’
సాక్షి, నల్లగొండ: దేశంలోనే వ్యవసాయరంగం దశాదిశ మార్చే విధంగా తెలంగాణ నిలవబోతోందని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతుబీమా పథకం చరిత్రాత్మకమైనదని తెలిపారు. బీమాతో 58 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని, అనుకోకుండా రైతు మరణిస్తే 10 రోజుల్లోనే కుటుంబానికి రూ. 5 లక్షలు అందిస్తామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి రైతులకు బీమా పత్రాలు అందిస్తాం. ఇతర రాష్ర్టాలు కూడా తెలంగాణ పథకాలను అమలు చేస్తున్నాయి. దేశానికి సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతు బంధు పథకంపై కాంగ్రెస్ నేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి నల్లొండ జిల్లాలో ఎయిమ్స్, మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. -
పెద్ద రైతులు పెట్టుబడి రాయితీ వదులుకోవాలి
నల్లగొండ: రాష్ట్రంలో ఆర్థికంగా బలంగా ఉన్న రైతులు ప్రభుత్వం అందించే పెట్టుబడి రాయితీని వదులుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారం తొలిసారిగా ఆయన నల్లగొండలో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న రైతులు పెట్టుబడి రాయితీ వదులుకుంటే ఆ నగదు మొత్తాన్ని రైతు సమన్వయ సమితి ఖాతాలో జమ చేస్తామన్నారు. తిరిగి రైతుల సంక్షేమానికే ఆ నిధులు ఖర్చు చేస్తామని తెలిపారు. ఓ రైతుగా స్వచ్ఛందంగా పెట్టుబడి రాయితీని వదులుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. అప్పుల బాధతో రైతులు బలవన్మరణాలకు పాల్పడవద్దని, అప్పులు తీర్చాలని ఎవరైనా ఒత్తిడికి గురిచేస్తే రైతులు సమన్వయ సమితుల దృష్టికి తీసుకురావాలని కోరారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర కార్పొరేషన్ వరకు రైతులు తమ సమస్యలను విన్నవించుకోవచ్చని చెప్పారు. రైతు సమస్యలకు సమన్వయ సమితులు పరిష్కార వేదికగా పనిచేస్తాయని ఆయన తెలిపారు. త్వరలో గ్రామ, మండల, జిల్లా కో ఆర్డినేటర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. సమన్వయ సమితుల లక్ష్యాలను సీఎం కేసీఆర్ కో ఆర్డినేటర్లకు వివరిస్తారని చెప్పారు. రాష్ట్ర కార్పొరేషన్ బోర్డు తొలి సమావేశాన్ని ఈ నెల 22న నిర్వహిస్తామని గుత్తా తెలిపారు. ఈ సమావేశంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మదర్‌డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, ఎంపీపీ పాశం రాంరెడ్డి పాల్గొన్నారు. -
తెలంగాణపై చంద్రబాబుకు అసూయ
మిర్యాలగూడ : తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి అసూయ కలుగుతోందని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మిర్యాలగూడలోని తన నివాసంలో స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు చేస్తే రెండు రాష్ట్రాలు కూడా సంతోషంగా ఉంటాయన్నారు. చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి కూడా తెలంగాణను చూసి అసూయ పడడం సరికాదని హితవుపలికారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకం కాదని ఎప్పుడో చెప్పాడని.. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా వారు ప్రశాంతంగా ఉన్నారని అన్నారు. నిజాం కాలంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని.. భవనాలు, ఉస్మానియా ఆస్పత్రి, ఉస్మానియా యూనివర్సిటీ, విమానాశ్రయం, రైల్వేస్టేషన్లు కూడా అప్పటివేనని అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న డ్రెయినేజీ వ్యవస్థ కూడా అప్పటిదే ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. 1948 నుంచి 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా మిగులు బడ్జెట్‌తోనే ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 14 సంవత్సరాల పాటు చేపట్టిన ఉద్యమంలో వల్ల తెలంగాణ ఏర్పడిందనన్నారు. చంద్రబాబునాయుడు కూడా ఆనాడు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చాడని గుర్తుచేశారు. ప్రతిపక్షాలు కూడా అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు దుర్గంపూడి నారాయణరెడ్డి, వీరకోటిరెడ్డి, ఎంపీపీ జానయ్య, పెద్ది శ్రీనివాస్‌గౌడ్, మదార్బాబా, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఇక సర్కారీ ఇన్సూరెన్స్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం సొంత ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. పత్తి సాగు చేసిన రైతుల కోసం పంజాబ్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా కంపెనీలు ఏర్పాటు చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నాయని చెప్పారు. ఆయా రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ సమాచారం తెప్పించుకొని, లోటుపాట్లపై అధ్యయనం చేయిస్తున్నారని తెలిపారు. ఎకరా పత్తికి రూ.33 వేలు ఇన్సూరెన్స్ చేస్తారని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 10 శాతం చొప్పున ప్రీమియం చెల్లిస్తే.. రైతు ఐదు శాతం అంటే రూ.1,650 ప్రీమియం చెల్లించాలన్నారు. ప్రీమియం ఎక్కువగా ఉండటంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఎక్కువ మంది రైతులు ఇన్సూరెన్స్ చేయించుకోలేకపోతున్నారని చెప్పారు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుందో ముఖ్యమంత్రి పలుసార్లు చర్చించారన్నారు. గత ఏడాది పలు బ్యాంకుల ఇన్సూరెన్స్ కంపెనీల లాభం రూ.16 వేల కోట్లు ఉందని, రైతులకు రావాల్సింది వాళ్లు లాభాల్లో చూపించుకుంటున్నారని పేర్కొన్నారు. -
మెడికల్ కాలేజీకి స్థల పరిశీలన
నల్లగొండ రూరల్: ఎస్ఎల్బీసీలో మెడికల్ కాలేజీకి అవసరమైన ఖాళీ స్థలాలను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎంపీ సుఖేందర్‌రెడ్డి, ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దార్ వినయ్‌కుమార్ శనివారం పరిశీలించారు. సీఎం సూర్యాపేటలో నిర్వహించిన సభలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఖాళీ స్థలాలు పరిశీలించారు. ఎస్ఎల్బీసీ కోసం భూమిని గతంలో సేకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. అక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తారా..! ఇతర ప్రభుత్వ పథకాలకు వినియోగిస్తారా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. -
కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి లేదు: గుత్తా
నల్గొండ: రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర కూడా పోషించే స్థితిలో కాంగ్రెస్ నేతలు లేరని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి కృష్ణా నీళ్లు విడుదల చేసేలా కృషి చేయాలన్నారు.కర్ణాటక ప్రభుత్వం దర్భుద్దితోనే కృష్ణా నీటిని విడుదల చేయడం లేదని ఆరోపించారు. స్థానిక కాంగ్రెస్ నేతలు కర్ణాటక ప్రభుత్వాన్ని నీళ్ల గురించి అడగడం లేదని, నాగర్జున సాగర్‌లో నీళ్లు లేకున్నా నోరు మెదపకుండా వ్యక్తిగత పంచాయితీలపై శ్రద్ద వహిస్తున్నారని ఎద్దేవ చేశారు.ఈ విషయంపై నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాశారని ఆయన పేర్కొన్నారు. -
రాంనారాయణ సేవలు మరువలేనివి
త్రిపురారం : టీఆర్ఎస్ మండల సీనియర్ నాయకుడు, దివంగత నేత ధూళిపాల రాంనారాయణ దుగ్గేపల్లి గ్రా మాభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్‌రావులు అన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన రాంనారాయణ విగ్రహాన్ని శుక్రవారం వారు ఆవిష్కరించి మాట్లాడారు. గ్రామంలో బడి, గుడితో పాటు రైతుల ప్రయోజనాలను దృష్టి ఉంచుకొని ఎత్తిపోతల ఏర్పాటుకు రాంనారాయణ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. గ్రామంలో బస్‌షెల్టర్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించి దానికి రాంనారాయణ పేరు పెట్టేలా చూస్తామన్నారు. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి నోముల నర్సిం హయ్య మాట్లాడుతూ రాంనారాయణ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ, అణగారిన వర్గాల ప్రజల కోసం నిరంతరం శ్రమించారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తియాదవ్, ఎంపీపీ ధూళిపాల ధనలక్ష్మి రామచంద్రయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనుముల శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ బుసిరెడ్డి అంజమ్మ అంజిరెడ్డి, రాంనారాయణ భార్య వెంకటమ్మ, సోదరులు సత్యనారాయణ, రాంచంద్రయ్య, గోవర్ధన్, అల్లుడు పులిజాల విష్ణుకుమార్, నాయకులు ఇస్లావత్ రాంచందర్‌నాయక్, భరత్‌రెడ్డి, ధన్‌సింగ్‌నాయక్, జానకీరామయ్య చౌదరి, నూకల వెంకట్‌రెడ్డి, అనుముల అనంతరెడ్డి, అనుముల రఘుపతిరెడ్డి, పెద్దబోయిన శ్రీనివాస్‌యాదవ్, మేడారపు మట్టయ్య, అనుముల సుధాకర్‌రెడ్డి, జంగిలి శ్రీనివాస్‌యాదవ్, జొన్నలగడ్డ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. -
టీఆర్ఎస్ను వీడను: గుత్తా
చందంపేట: అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని చూసి టీఆర్ఎస్ పార్టీ లో చేరానని, తాను మళ్లీ పార్టీ మారుతానని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టులను పూర్తి చేయడంలో సీఎం కేసీఆర్ కంకణ బద్ధులై ఉన్నారన్నారు. డిండికి నీటిని విడుదల చేయాలని సీఎంను కోరడంతో ప్రాజెక్టు జలకళ సంతరించుకుందని గుర్తు చేశారు. -
నోట్ల రద్దుకు వ్యతిరేకం కాదు
పెద్దవూర : పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకం కాదని ప్రజల ఇబ్బందులను తొలగించడానికి కావాల్సిన కరెన్సీని ప్రవేశ పెట్టాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పులిచర్ల గ్రామంలో ఎన్ఆర్ఐ, టీఆర్ఎస్ నాయకుడు గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి-లక్ష్మి దంపతులు నిర్వహించిన శ్రీ హనుమాన్ గాయత్రి మహా యజ్ఞంలో పాల్గొనటానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి పెద్ద నోట్ల ఇబ్బందులపై 26 సలహాలు అందించినట్లు తెలిపారు. దేశంలో 90శాతం ప్రజలు ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్రపోయే వరకు డబ్బులు ఇచ్చిపుచ్చుకునే పరిస్థితి ఉందన్నారు. టెలిఫోన్ విప్లవం వచ్చిందే గాని బ్యాంకుల విప్లవం సంపూర్తిగా రాలేదని అన్నారు. కుభేరుల వద్ద ఉన్న నల్లధనాన్ని వసూలు చేయటం మరిచి సామాన్య ప్రజలపై ఇబ్బందులు కలిగించవద్దని అన్నారు. 16 లక్షల 50 వేల కోట్ల కరెన్సీ చెలామణి అవుతుండగా అందులో 86 శాతం రూ.500, రూ.1000 నోట్లే ఉన్నాయని కేవలం 14 శాతమే మిగిలిన కరెన్సీ నోట్లు ఉన్నాయని అన్నారు. ఎక్కువ సంఖ్యలో ఉన్న నోట్లను రద్దు చేయడంతో దానికి సరిపోయే రూ.500 నోట్లను విడుదల చేసి తాత్కాలిక సమస్యను పరిష్కరించాలని కోరారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలలో నిల్వ ఉన్న నీటిలో ఏపీకి పోను తెలంగాణకు 103 టీఎంసీల నీరు ఉందని తెలి పారు. గత సీజన్లో ఖమ్మం జిల్లాకు కాకుండా కేవలం మొదటి జోన్‌కే ఆరుతడి పంటలకు నీరిచ్చామని తెలిపారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు నీరు ఇవ్వాలంటే ప్రస్తుతం 25 నుంచి 30టీఎంసీల నీరు లోటు ఉందని అన్నారు. దీనికి గాను వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆరుతడి పంటలకు ఆన్ అండ్ ఆఫ్ పద్దతిలో ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణరుుంచిందని అన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నర్సిం హయ్య, ఎంపీపీ మల్లిక, ఎన్ఆర్ఐ గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, వినయ్‌రెడ్డి, రవినాయక్, గాలి సైదిరెడ్డి, రవినాయక్ పాల్గొన్నారు. -
సాగునీటిపై టీఆర్ఎస్ సర్కార్ కృషి భేష్ !
ప్రశంసించిన సీఎల్పీ నేత కె.జానారెడ్డి - 50 వేల ఎకరాలకు సాగునీరివ్వడం అభినందనీయం - ఇరిగేషన్ అధికారుల పనితీరు బాగుందని కితాబు - ఎంపీ గుత్తాతో కరచాలనం.. ఆప్యాయంగా పలకరింపు - చర్చనీయాంశమైన అధికార, విపక్ష నేతల కలయిక పెద్దవూర: సీఎల్పీ నేత కె.జానారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. నిన్నమొన్నటి వరకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడిన ఆయన.. రైతులకు సాగు నీటిని అందించే విషయమై ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. జానారెడ్డి, టీఆర్ఎస్ నేత, ఎంపీ గుత్తాసుఖేందర్ రెడ్డి గురువారం నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) లో లెవల్ వరదకాల్వ పంప్‌హౌస్ ట్రయల్ రన్ నిర్మాణ పనులను వేర్వేరుగా పరిశీలించారు. ఉదయం తొమ్మిది గంటలకే గుత్తా అక్కడికి చేరుకుని పనులు పరిశీ లించి తిరుగుపయనమయ్యారు. ఇదే సమయం లో జానారెడ్డి అక్కడకు రాగానే గుత్తా పెద్దాయన వద్దకు వెళ్లారు. ఇద్దరూ కరచాలనం చేసుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. అక్కడ ఏం చూసి వస్తున్నావ్ అంటూ గుత్తాను జానారెడ్డి ప్రశ్నించారు. ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించానని, సభా ప్రాంగణం ఏర్పాటు చేసే ప్రదేశాన్ని చూసి సూచనలు చేసి వస్తున్నట్లు సుఖేందర్‌రెడ్డి వివరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం జానారెడ్డి వరద కాల్వ పంప్‌హౌస్ పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తీవ్ర కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంతంలోని ప్రజలకు 50 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వటానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఇది సంతోషకరమని వ్యాఖ్యానించారు. వారం, పది రోజులుగా ఇరిగేషన్ శాఖ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు. రైతుల ఆకాంక్ష మేరకు పంప్‌హౌస్‌ను పరిశీలించటానికి వచ్చినట్లు జానారెడ్డి తెలిపారు. ఏఎమ్మార్పీ లో లెవల్ కెనాల్ పలు కారణాలతోనే ఆలస్యమైనట్లు పేర్కొన్నారు. వచ్చే సీజన్ నాటికైనా ప్రాజెక్టు పరిధిలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రాజెక్టులో ఉన్న లోపాలను సరిచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతకుముందు వరదకాల్వ పరిశీలన సమయంలో కూడా గుత్తా విలేకరులతో మాట్లాడారు. 1997లో మంజూరైన ఈ ప్రాజెక్టు పనులు 19 ఏళ్ల తర్వాత కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో లక్ష్యాన్ని చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతాంగానికి సాగు నీరు అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుం దని కితాబిచ్చారు. అధికార, విపక్ష నేతల కలయిక, జానా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. -
విపక్షాల విమర్శలు అర్థరహితం: గుత్తా
నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నల్లగొండలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈర్ష్యకు మారుపేరుగా ప్రతి పక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను మెచ్చుకోకున్నా పర్వాలేదు గాని.. అనవసరంగా నోరుపారేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు. గత ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేసి ఎలాంటి కార్యక్రమాలు చేయని వాళ్లు ఇప్పుడిలా విమర్శలు చేయడం సరికాదన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నారని స్పష్టం చేశారు. వాణిజ్యపరంగా, పారిశ్రామికంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో నిలిస్తే.. ప్రతిపక్షాలు బోగస్ సర్వేలని ఆరోపించడం అవివేకమన్నారు. ఏపీ సర్కారు దొంగతనంగా పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా నీటిని తరలించుకుపోతుంటే నోరుమెదపని విపక్షాలు.. సొంత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన కేసీఆర్‌కు, పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా విశేష కృషి చేస్తున్న కేటీఆర్‌కు, ప్రాజె క్టుల విషయంలో సీఎం ఆశయాలకు అనుగుణంగా ముందుకు పోతున్న మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు ఎంపీ పేర్కొన్నారు -
రైతులను రెచ్చగొడతారా : ఎంపీ గుత్తా
కాంగ్రెస్, టీడీపీలపై ఎంపీ గుత్తా ధ్వజం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సాగునీటి ప్రాజెక్టులను ఆహ్వానిస్తామని చెబుతూనే రైతులను రెచ్చగొట్టడం తగదని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో లోపాలుంటే ప్రభుత్వానికి తెలియజేయూలని కాంగ్రెస్, టీడీపీలకు నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. మంగళవారం తన నివాసంలో విలేకరులతో గుత్తా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కిరణ్ కేబినెట్లో మంత్రి పదవుల కోసం కుక్కిన పేనులా ఉన్న బృందమే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడుతోందన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు ఒక్కటై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, ప్రాజెక్టులను అడ్డుకున్న నాయకులు భవిష్యత్తులో అభివృద్ధి నిరోధకులుగా మిగిలిపోతారని అన్నారు. గిత్త గాడు.. గత్తగాడితో కలసి మాట్లాడతారా? కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడడం సరైంది కాదని, ఆయన జాతీయ నాయకుడు కాబట్టి జాతీయ స్థాయిలోనే మాట్లాడితే బాగుంటుందని ఎంపీ గుత్తా వ్యాఖ్యానించారు. ‘మీరు జాతీయ స్థాయిలోనే మాట్లాడాలి. ఎల్లన్న, మల్లన్న.. గిత్తగాడు.. గత్తగాడు... పిట్ట గాండ్లతో కలిసి మాట్లాడితే మాకే సిగ్గేస్తోంది.’ అని ఎద్దేవా చేశారు. ఇక, మంత్రిగా ఎప్పుడు బాధ్యతలు చేపడతారని అడిగిన ప్రశ్నకు గుత్తా బదులిస్తూ ‘నాకు మంత్రి పదవి గురించి ఆలోచనే లేదు. అందుకోసం ప్రయత్నమూ చేయడం లేదు. ముఖ్యమంత్రి ఇష్టం.’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. -
తెలంగాణకూ సాయం చేయాల్సిందే
అరుణ్ జైట్లీకి ఎంపీ గుత్తా లేఖ సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్వ్యవస్థీకణ చట్టం ప్రకారం కేంద్రం ఏపీకి ఏవిధంగా ప్రయోజనాలు కల్పిస్త్తోందో అలాగే తెలంగాణకు కూడా కల్పించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి బుధవారం లేఖ రాశారు. తెలంగాణలో కూడా అనేక ఆర్థిక, సామాజిక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని చట్టంలో క్లుప్తంగా ఉన్నట్లు గుర్తుచేశారు. ఏపీతో సమానంగా తెలంగాణకు కేంద్రం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు విభజన, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఎయిమ్స్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని కోరారు. -
'ఆ శక్తులను కేసీఆర్ వదలరు'
నల్గొండ: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో అన్ని విషయాలను సిట్ వెలుగులోకి తెస్తుందని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వెల్లడించారు. గురువారం నల్గొండలో నయిం అంశంపై గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పందించారు. అరాచక శక్తులను సీఎం కేసీఆర్ వదలరని గుత్తా స్పష్టం చేశారు. పులిచింతల ప్రాజెక్టుకు అందాల్సిన రూ. 115 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ముంపు గ్రామాల ప్రజల పునరావాస ప్యాకేజీ అందక ఇబ్బందిపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ నాయకులది అనవసర రాద్ధాంతం
నల్లగొండ: తెలంగాణ ప్రభుత్వం గోదావరి, కృష్ణా బేసిన్ల పరిధిలో చేపడుతున్న రిజర్వాయర్ల నిర్మాణాలను కాంగ్రెస్ నాయకులు అడ్డుకుని హడావుడి చేస్తున్నారని ఎంపీ గుత్తా సుఖేంద్ రెడ్డి విమర్శించారు. సోమవారం నల్లగొండలో తన నివాసంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్ రెడ్డి, ఎంపీపీ పాశం రాంరెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగానికి ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చని పోతిరెడ్డిపాడు, పులిచింతల ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు చేపడుతున్న రిజర్వాయర్లకు అడ్డుతగలడం సరిౖయెన విధానం కాదన్నారు. రిజర్వాయర్ల నిర్మాణాలను వ్యతిరేకించడమే గాక రైతాంగాన్ని రెచ్చగొడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డిలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. పులిచింతల నిర్మాణంలో నల్లగొండ జిల్లాలో ఎకరం భూమి కూడా సాగులోకి రాకపోగా జిల్లా పరిధిలో 14 ఎకరాల భూమి కోల్పోవాల్సి వచ్చిందని, 14 గ్రామాలు ముంపునకు గురయ్యాయన్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద కేవలం 16,500 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతుందన్నారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే నల్లగొండ జిల్లాలో 2.63లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని తెలిపారు. అనవసర రా ద్ధాంతం చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలని ఎంపీ గుత్తా విజ్ఞఫ్తి చేశారు. -
కాంగ్రెస్ నాయకులది అనవసర రాద్ధాంతం
నల్లగొండ: తెలంగాణ ప్రభుత్వం గోదావరి, కృష్ణా బేసిన్ల పరిధిలో చేపడుతున్న రిజర్వాయర్ల నిర్మాణాలను కాంగ్రెస్ నాయకులు అడ్డుకుని హడావుడి చేస్తున్నారని ఎంపీ గుత్తా సుఖేంద్ రెడ్డి విమర్శించారు. సోమవారం నల్లగొండలో తన నివాసంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్ రెడ్డి, ఎంపీపీ పాశం రాంరెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగానికి ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చని పోతిరెడ్డిపాడు, పులిచింతల ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు చేపడుతున్న రిజర్వాయర్లకు అడ్డుతగలడం సరిౖయెన విధానం కాదన్నారు. రిజర్వాయర్ల నిర్మాణాలను వ్యతిరేకించడమే గాక రైతాంగాన్ని రెచ్చగొడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డిలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. పులిచింతల నిర్మాణంలో నల్లగొండ జిల్లాలో ఎకరం భూమి కూడా సాగులోకి రాకపోగా జిల్లా పరిధిలో 14 ఎకరాల భూమి కోల్పోవాల్సి వచ్చిందని, 14 గ్రామాలు ముంపునకు గురయ్యాయన్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద కేవలం 16,500 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతుందన్నారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే నల్లగొండ జిల్లాలో 2.63లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని తెలిపారు. అనవసర రా ద్ధాంతం చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలని ఎంపీ గుత్తా విజ్ఞఫ్తి చేశారు. -
44 శాతం ఫిట్మెంట్ ఘనత కేసీఆర్‌దే
ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి దేవరకొండ : ఆర్టీసీ చరి త్రలో కార్మికులకు 44శా తం ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం దేవరకొండ బ స్టాండ్ సమీపంలో జరిగిన టీఎంయూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడా రు. గత పాలకుల వైఫల్యం వల్లే ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని, లాభాల్లోకి తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపా రు. అందులో భాగంగా ఇప్పటికే రూ.500 కోట్ల మేరకు నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు. కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో టీఎంయూ గెలుపు కోసం కార్మికులు కృషి చేయాలని కోరారు. జెడ్పీ చైర్మన్ బాలునాయక్ మాట్లాడుతూ కార్మికుల పక్షాన పోరాడే టీఎంయూకు పట్టం కట్టాలని కోరారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారంలో టీఎంయూ ముందంజలో నిలుస్తుందన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు ఆలంపల్లి నర్సిం హ, తేరా గోవర్ధన్‌రెడ్డి, పున్న వెంకటేశ్వర్లు, గాజుల ఆంజనేయులు, బం డారు బాలనర్సిం హ, బోరిగం భూపాల్, శి రందాసు కష్ణయ్య, బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, ముత్యాల సర్వ య్య, హన్మంతు వెంకటేష్గౌ డ్, ఆర్టీసీ టీఎం యూ నాయకులు నరేందర్, పీ.జే. రావు, కె.ఎన్.రెడ్డి,యా దయ్య, మోహన్‌లాల్,చంటి, పున్న శ్రీనివాసులు, దశరథం, ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
'వేస్ట్ ఫెలోస్.. బెస్ట్ ఫెలోస్ అయ్యారా?'
నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని వేస్ట్ ఫెలోస్‌గా అభివర్ణించిన వారందరూ ఇప్పుడు బెస్ట్ ఫెలోస్ ఎలా అయ్యారో అర్థం కావడం లేదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివారం మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్వహించిన బహిరంగ సభలో కోమటిరెడ్డి సోదరులు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కరచాలనం చేసుకుని సంభాషించుకున్న వైనంపై ఎంపీ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. రూ.20 లక్షలు ఖర్చు పెట్టి నిర్వహించిన ఆ సభలో తనతో పాటు ఎమ్మెల్యే భాస్కర్‌రావు పేర్లనే జపించారని చెప్పుకొచ్చిన ఆయన వారిపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిలువునా మునిగిపోవడానికి పన్నెండు, పదమూడు మంది నాయకులు కారుకులయ్యారని, వారిలో కొందరు మిర్యాలగూడలో జరిగిన సభలో కూడా పాల్గొన్నారని ఎంపీ తెలిపారు. రాష్ట్రానికి కాబోయే సీఎంలు తామేనని ప్రగల్భాలు పలికి చిట్టచివరికి పార్టీనే ముంచారన్నారు. ఇలాంటి పంచాయితీల వల్ల పార్టీ నష్టపోతుందని, దీనిని చూసుకోవాల్సిందిగా సోనియాగాంధీకి లేఖ కూడా రాసినట్లు ఎంపీ చెప్పారు. కోమటిరెడ్డి సోదరులు, పీసీసీ అధినేత ఉత్తమ్ పెట్టే బాధ భరించలేకనే జానారెడ్డి రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని చెప్పారన్నారు. ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకోవడం ఎందుకని చెప్పి తామే పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. -
వాళ్లిద్దరి వల్లే కాంగ్రెస్ సర్వనాశనం: గుత్తా
నల్లగొండ: కాంగ్రెస్ నాయకులకు తనను విమర్శించే అర్హత లేదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వల్లే కాంగ్రెస్ పార్టీ సర్వ నాశనమైందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎల్పీ నేత జానారెడ్డి పలుమార్లు రాజకీయ సన్యాసం చేస్తానంటేనే తాము పార్టీ మారామని గుత్తా తెలిపారు. మరి బద్ధశత్రువులైన ఉత్తమ్, కోమటిరెడ్డిలు మంచి మిత్రులుగా ఎప్పుడు మారారో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్లదంతా ధృతరాష్ట్ర కౌగిలేనని గుత్తా వ్యాఖ్యలు చేశారు. కాగా గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. -
ఉత్తమ్, కోమటిరెడ్డి ఎందుకు అడ్డుకుంటున్నారు?
నల్గొండ : తెలంగాణ న్యాయవాదుల సమస్యలపు వెంటనే పరిష్కరించాలని కేంద్రప్రభుత్వాన్ని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నల్గొండలో ఎంపీ గుత్తా మాట్లాడుతూ... న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడిని సస్పెండ్ చేయడం బాధకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశంలో మరోసారి పునరాలోచన చేయాలని రాష్ట్ర హైకోర్టుకు ఈ సందర్భంగా గుత్తా సూచించారు. నల్గొండ జిల్లాకు మల్లన్నసాగర్ ప్రాజెక్టు వరప్రదాయని అని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల నల్గొండ జిల్లాకు 2 లక్షల 50 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. తెలంగాణలో ఓ ఎకరా కూడా పారని పులిచింతలకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్, కోమటిరెడ్డిలు మల్లన్నసాగర్ ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. -
మీ తగాదాల వల్లే కాంగ్రెస్‌ను వీడా
ఉత్తమ్, కోమటిరెడ్డిలపై ‘గుత్తా’ ఫైర్ నల్లగొండ: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డిల గ్రూపు తగాదాల వల్లే తాను కాంగ్రెస్‌పార్టీని వీడానని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ్, కోమటిరెడ్డి పరస్పరం ఓడించుకోవాలని ప్రయత్నం చేశారు. నాయకుల మధ్య నెలకొన్న ఈ గొడవల వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లింది. పార్టీలో చోటుచేసుకుం టున్న ఈ పరిణామాలను భరించలేకనే బయటకు వెళ్లాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు. మీ నియోజకవర్గాల్లో ఎంపీలంటే కనీసం గౌరవం ఉండడం లేదన్నారు. చావుకు లేదా పెళ్లికి పోయినా మీ అంగీకారం ఉండాల్సిందేనని విమర్శించారు. నియోజకవర్గాలను తమ సామ్రాజ్యాలుగా చేసుకొని ఏలుతున్నారని గుత్తా మండిపడ్డారు. ‘మా దగ్గర మీ చిట్టాలు చాలా ఉన్నాయి.. కానీ చెప్పను. అది మా సంస్కృతి కాదు. వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదు. సరైన సమాధానం చెబుతాం.’ అని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తల త్యాగాల వల్లనే సుఖేందర్‌రెడ్డి ఎంపీ అయ్యారని.. స్వశక్తి కలిగిన నాయకుడు కాదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలపై గుత్తా మండి పడ్డారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో పనిచేసి రాత్రికి రాత్రే టికెట్ తెచ్చుకుని కోదాడలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఉత్తమ్ స్వశక్తి కలిగిన నాయకుడా..? అని గుత్తా ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో నెల రోజుల పాటు చర్లపల్లి జైలులో శిక్ష అనుభవించిన రేవంత్ రెడ్డి.. స్థాయికి మించి విమర్శలు చేయడం సరియైంది కాదన్నారు. -
'మీ తగాదాల వల్లే కాంగ్రెస్‌ను వీడా'
- వ్యక్తిగత విమర్శలు చేస్తే సరైన సమాధానం చెబుతా - 'దొరికిన దొంగ' రేవంత్ రెడ్డి - సాంఘిక బహిష్కరణ చేయాల్సింది ఆయన్నే నల్లగొండ : పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డిల గ్రూపు తగాదాల వల్లే తాను కాంగ్రెస్ పార్టీని వీడానని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్లగొండలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని గుత్తా ఘాటైన విమర్శలు చేశారు. '2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ్, కోమటిరెడ్డి పరస్పరం ఓడించుకోవాలని ప్రయత్నం చేశారు. ఒకరిపై మరొకరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. నాయకుల మధ్య నెలకొన్న ఈ గొడవల వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లింది. పార్టీలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలను భరించలేకనే విసిగి వేసారి పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది' అని ఆయన వివరించారు. మీ నియోజకవర్గాల్లో ఎంపీలంటే కనీసం గౌరవం ఉండడం లేదని గుత్తా అన్నారు. చావుకు లేదా పెళ్లికి పోయినా మీ అంగీకారం ఉండాల్సిందేనని ఆయన విమర్శించారు. నియోజకవర్గాలను తమ సామ్రాజ్యాలుగా చేసుకొని ఏలుతున్నారు అని గుత్తా మండిపడ్డారు. 'మా దగ్గర మీ చిట్టాలు చాలా ఉన్నాయి.. కానీ చెప్పను. అది మా సంస్కృతి కాదు. ఇష్టానుసారంగా వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదు. సరైన సమాధానం చెబుతాం' అని హెచ్చరించారు. ఉత్తమ్.. స్వశక్తి కలిగిన నాయకుడా? కాంగ్రెస్ కార్యకర్తల త్యాగాల వల్లనే సుఖేందర్ రెడ్డి ఎంపీ అయ్యారని.. స్వశక్తి కలిగిన నాయకుడు కాదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలపై గుత్తా ఫైరయ్యారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో పనిచేసి రాత్రికి రాత్రే టికెట్ తెచ్చుకుని కోదాడలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఉత్తమ్ స్వశక్తి కలిగిన నాయకుడా..? అని గుత్తా ప్రశ్నించారు. తాను రెండు ఎన్నికల్లో ఎంపీగా గెలిచానంటే అందుకు ఉత్తమ్, కోమటిరెడ్డి, దామోదర్ రెడ్డి, జానారెడ్డిల సహకారం ఉన్న సంగతి వాస్తవమేనని చెప్పారు. ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు కట్టుబడి ఉన్నానని, ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా ఉప ఎన్నికకు వెళ్లి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరియైంది కాదని భావించి తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు ఎంపీ చెప్పారు. రేవంత్.. దొరికిన దొంగ పార్టీలు మారిన ఎంపీ గుత్తా, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, రవీంద్ర కుమార్‌లను సాంఘిక బహిష్కరణ చేయాలని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎంపీ ఘాటుగానే బదులిచ్చారు. 'నువ్వు దొరికిన దొంగ.. జైలుకు వెళ్లొచ్చిన చరిత్ర నీది! నోరు మూసుకుని నీ పని నువ్వు చూసుకో.. సాంఘిక బహిష్కరణ చేయాల్సి వస్తే ముందు నిన్ను చేయాలి' అని గుత్తా హెచ్చరించారు. ఓటుకు నోటు కేసులో నెల రోజుల పాటు చర్లపల్లి జైలులో శిక్ష అనుభవించిన రేవంత్ రెడ్డి.. స్థాయికి మించి విమర్శలు చేయడం సరియైంది కాదన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ పచ్చి రాజకీయ వ్యభిచారానికి పాల్పపడుతున్నారని ఎంపీ విమర్శించారు. నీ భార్యకు ఏం అర్హత ఉంది?: ఎమ్మెల్యే భాస్కర్‌రావు అనామకుడైన భాస్కర్‌రావును మిర్యాలగూడ ఎమ్మెల్యేగా గెలిపించింది కాంగ్రెస్ కార్యకర్తలేనని పీసీసీ నేత ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే భాస్కర్ రావు కొట్టిపారేశారు. 'నీ భార్య పద్మావతికి ఏం అర్హత ఉందని కోదాడ ఎమ్మెల్యే సీటు తెప్పించుకున్నావ్?' అని భాస్కర్ రావు ప్రశ్నించారు. 44 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాకంటే నువ్వు చాలా జూనియర్ అని ఉత్తమ్‌ను ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. సమావేశంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'గుత్తా పార్లమెంట్ సభ్యత్వం రద్దయ్యే వరకు పోరాటం'
ఆదిలాబాద్ : నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్లమెంట్ సభ్యత్వం రద్దయ్యే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని... ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. గురువారం ఆదిలాబాద్‌లో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ... తెలంగాణ కేబినెట్లో మాల, మాదిగ, మహిళలకు స్థానం కల్పించకపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారని దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. -
గులాబీ కండువా కప్పుకోని గుత్తా
అనర్హత ముప్పు తప్పించుకోవడానికా? సీఎంకు ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేనందునా? రాజకీయ వర్గాల్లో చర్చ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇంతా చేస్తే.. గులాబీ కండువా కప్పుకోనే లేదు! టీఆర్ఎస్లో చేరిక సందర్భంగా నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మిర్యాలగూడ, దేవరకొండ, నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఆయన పెద్దఎత్తున తన అనుచరులను తరలించారు. కాంగ్రెస్‌కు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్లోకి తీసుకువచ్చారు. కానీ సీఎం కేసీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పకపోవడం.. తన ప్రసంగంలో ఒక్కసారి మినహా గుత్తా పేరును పెద్దగా ప్రస్తావించకపోవడంపై చర్చ జరుగుతోంది. ఇది ఒకింత గందరగోళానికి దారి తీసింది. అయితే ఎంపీ గులాబీ కండువా కప్పుకోకపోవడం వెనుక రాజకీయ కోణం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. గుత్తా టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్న తర్వాత సీఎం కేసీఆర్‌తో జరిగిన తొలి భేటీలోనే తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి వస్తానని చెప్పారు. కానీ సీఎం అందుకు ససేమిరా అన్నట్టు తెలిసింది. రాజీనామా చేయకుండా పార్టీ మారితే.. తనపై అనర్హత వేటు పడే ముప్పు ఉందన్న సందేహాన్ని గుత్తా సీఎం వద్ద ప్రస్తావించారు. గుత్తా ఎంపీ పదవికి రాజీనామా చేస్తే .. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలకు పోలేమన్న చర్చ పార్టీ సీనియర్ నేతల్లో జరిగినట్లు చెబుతున్నారు. ‘‘ఉప ఎన్నికలకు కొంత సమయం తీసుకుందాం.. ప్రతీసారి ఎన్నికలంటే ప్రజల్లో వ్యతిరేకత రావొచ్చు. ప్రాజెక్టులపై దృష్టి పెట్టాల్సి ఉంది. వర్షాలు పడి కరువు తీరాక... ప్రజలు సంతోషంగా ఉన్న సమయంలో ఎన్నికలకు వెళ్దాం’’ అని సీఎం కేసీఆర్ అన్నట్టు తెలిసింది. సాంకేతికంగా ఇప్పుడే దొరికిపోవడం కన్నా.. రాజీనామా చేసే వరకు జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతోనే గుత్తా గులాబీ కండువా కప్పుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మీరు చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా?
కాంగ్రెస్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు నాడు మా 26 మంది ఎమ్మెల్యేల్లో 10 మందిని చేర్చుకోలేదా? రాష్ట్రం వ చ్చాక కూడా కాంగ్రెస్, టీడీపీ కుట్రలు చేశాయి బెర్లిన్ గోడ బద్దలైనట్టు మళ్లీ రెండు రాష్ట్రాలు కలుస్తాయన్నాడు చంద్రబాబు.. ఈ ప్రభుత్వం ఎల్లుండే పడిపోతుందన్నడు భట్టి తెలంగాణకు నీళ్లు వద్దన్న తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ జతకట్టడం ఏం నీతో జానారెడ్డి చెప్పాలి రాష్ట్రం రాజకీ య, ఆర్థిక సుస్థిరత సాధించాలి.. తెలంగాణకు టీఆర్ఎస్సే రక్షణ కవచం మేం పిలవడం లేదు.. అభివృద్ధిని చూసి వారే వస్తున్నారు టీఆర్ఎస్లో చేరిన ఎంపీ గుత్తా, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, రవీంద్రకుమార్, కాంగ్రెస్ నేతలు వివేక్, వినోద్ సాక్షి, హైదరాబాద్: ‘‘నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమం కోసం గెలిచిన 26 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 10 మందిని చేర్చుకున్నారు. ఆనాడు లేని నీతి ఇప్పుడెలా గుర్తుకొచ్చింది? సరిగ్గా ఎన్నికల ముందు మా ఎంపీ విజయశాంతిని, ఎమ్మెల్యే అరవిందరెడ్డిని చేర్చుకోలేదా..? మీరు చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా..?’’ అని సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రం రాజకీయ, ఆర్థిక సుస్థిరత సాధించాలని, తెలంగాణకు రక్షణ కవచం టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టంచేశారు. బుధవారం కాంగ్రెస్‌కు చెందిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, దేవరకొండ నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, కాంగ్రెస్ మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ మంత్రి జి.వినోద్, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ నేతలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ గుత్తా మాత్రం టీఆర్ఎస్ కండువా కప్పుకోలేదు. కాంగ్రెస్ నుంచి ఒక జెడ్పీ వైస్ చైర్మన్, ముగ్గురు ఎంపీపీలు, ఆరుగురు జెడ్పీటీసీ సభ్యులు, ఒక మున్సిపల్ చైర్పర్సన్, ఐదుగురు కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీ నేతల తీరును తూర్పారబట్టారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. నేను బతికా.. ప్రజలు ఆనందపడ్డరు.. రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో 14ఎఫ్ మార్పిడికి నిరసనగా ఆమరణ దీక్షకు దిగా. కేంద్రం దిగి వచ్చింది. తెలంగాణ ఇచ్చింది. దీక్ష సమయంలో నేను చావాల్సింది.. కానీ చావలేదు. ప్రజలు ఆనందపడ్డరు. అంతకుముందు ఎన్నోసార్లు తెలంగాణ కోసం మేం మూకుమ్మడి రాజీనామాలు చేసి పోటీకి వెళ్తే మాపై పోటీకి వచ్చారు. కానీ ప్రజలు మమ్ముల్నే గెలిపించారు. రాష్ట్రం వచ్చాక కూడా అనేక చర్యలకు పాల్పడ్డరు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తే 63 సీట్లలో గెలిచినం. మరో 14 సీట్లలో వెయ్యిలోపు ఓట్ల తేడాతో ఓడిపోయినం. బాబు మామూలు కుట్రలు చేయలే.. తెలంగాణ ప్రకటించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు మామూలు కుట్రలు చేయలేదు. బెర్లిన్ గోడ బద్దలై జర్మనీ ప్రజలు కలసిపోయినట్లు ఏపీ, తెలంగాణ మళ్లీ కలసిపోతయని మాట్లాడిండు. కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అయితే.. ఎల్లుండే ప్రభుత్వం పడిపోతదన్నడు. నేను సీఎంగా బాధ్యతలు తీసుకోక ముందే కుట్రలు చేసిండ్రు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ నాకు ఫోన్ చేసి ఇంటికొచ్చిండు. టీడీపీ, కాంగ్రెస్ ఏకమై టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకుండా కుట్రలు చేస్తున్నయని చెప్పిండు. రాష్ట్రపతి పాలన తెచ్చే కుట్రలు చేస్తున్నరని చెప్పిండు. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇదేందన్నడు. టీఆర్ఎస్కు మద్దతిస్తామని తెల్లారే ప్రకటించిండు. కాంగ్రెస్, టీడీపీ నేతల లక్ష్యం ఒక్కటే.. తెలంగాణ రాష్ర్టం ఏర్పడొద్దు. ఏర్పడితే బతకొద్దు. జానారెడ్డి రాష్ట్రం భ్రష్టు పడుతోందని అంటున్నడు. కాదు కాదు.. కాంగ్రెస్ భ్రష్టు పడుతోంది. కేసీఆర్‌కు ఒక్కటే నీతి.. తెలంగాణ రాష్ట్రం తన శక్తి మీద తాను నిలబడాలి. రాజకీయ సుస్థిరత, ఆర్థిక సుస్థిరత సాధించాలి. సమైక్యవాదుల కుట్రలకు బలికావొద్దు. బలంగా ఉండాలి. తెలంగాణకు రక్షణ కవచం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. 2019 కంటే ముందే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు అంటడు. చంద్రబాబూ.. ప్రభుత్వం కూలిపోతుందని అనడం ఏం నీతి? అది సక్రమమైన ఆలోచనా? రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఉండగానే అట్లెట్ల అంటడు? తెలంగాణకు నీళ్లు వద్దంటడు. పాలేరు ఉప ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ జతకట్టడం ఏ రకమైన నీతో జానారెడ్డి చెప్పాలి. అచ్చంపేట ఎన్నికల్లో అందరూ కలసి కూటమి కడతరు. ఇదేం నీతి? మీరు చేస్తే నీతి.. మేం చేస్తే అవినీతా? అభివృద్ధిని చూసే వస్తున్నారు.. టీఆర్ఎస్లోకి వలస వస్తున్న వారిని మేం పిలవడం లేదు. జరుగుతున్న అభివృద్ధిని చూసి వస్తున్నరు. ఇవి చిల్లర మల్లర రాజకీయ చేరికలు కావు. వీటిని అలా చూడటం లేదు. చాలా మందికి అనుమానాలు, అపోహలు ఉన్నాయి. సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సొంత నిర్ణయంతో వచ్చారు. మేం రమ్మన లేదు. ఎమ్మెల్యే భాస్కర్‌రావు కూడా ఏడాదిన్నరగా మాతో టచ్‌లో ఉన్నారు. అమ్ముడుపోయారని, కేసీఆర్ కొన్నాడని అంటున్నారు. మాజీ ఎంపీ వివేక్ కేవలం తన తండ్రి కోరిక మేరకే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. వెళ్లే ముందు నాకు చెప్పి వెళ్లారు. మీ పాలనలో మంచి పనులు జరుగుతున్నాయి. కలసి పనిచేస్తానని, మళ్లీ పార్టీలోకి వస్తానన్నారు. సుఖేందర్‌రెడ్డి, నేనూ ఆప్త మిత్రులం. 1996లోనే శ్రీరాంసాగర్ డ్యామ్‌పై కూర్చుని తెలంగాణ గురించి ఇద్దరం మాట్లాడుకున్నాం. ఆంధ్రా ప్రాంతానికి నీళ్లు తీసుకుపోయే నాగార్జున సాగర్ వైష్ణవాలయంలా ఉంటే.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు శివాలయంలా ఉందన్న. ఏపీలో ఉన్నన్ని రోజులు తెలంగాణకు న్యాయం జరగద ని ఆ రోజే చెప్పిన. 2001లో నేనే ఉద్యమం మొదలు పెట్టా. తెలంగాణది వందేళ్ల దుఃఖం. సమైక్య రాష్ట్రంలో చేరి కష్టాలు పడ్డాం. ఇప్పుడు ప్రతి పేద కుటుంబానికి మేలు చేస్తాం. పేదరికాన్ని రూపుమాపుతం. 2019లోగానే కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తం. సాదా బైనామాల రిజిస్ట్రేషన్‌కు గడువు పొడిగింపు ఈ సమావేశానికి వచ్చే ముందే సీసీఎల్ఎతో మాట్లాడా. సాదా బైనామాల రిజిస్ట్రేషన్లకు డిమాండ్ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సాదా బైనామాలకు సంబంధించి 6 లక్షల మంది ఆర్వోఆర్ పట్టాలు పొందారు. మరో వారం రోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగిస్తున్నాం. చరిత్రలో ఎవరూ ఈ ఆలోచన చేయలేదు. దీంతోపాటు హైదరాబాద్‌లో పేదలకు ఇప్పటికే లక్ష మందికి పట్టాలిచ్చాం. తెలంగాణ సమాజాన్ని సుస్థిరం చేయడమే మా లక్ష్యం. నేను మళ్లీ చెబుతున్నా.. టీఆర్ఎస్కు ప్రజలే బాసులు. సొల్లు కబుర్లు వద్దు. నిర్మాణాత్మక సలహాలివ్వండి. కేసీఆర్‌ను తిడితే ఏం జరగదు. 2019లోనూ గెలిచేది కూడా టీఆర్ఎస్సే. -
గుత్తాకు పాలమూరు ప్రాజెక్టు కాంట్రాక్టు
అందుకే పార్టీని వీడారు: పాల్వాయి సాక్షి, న్యూఢిలీ: పాల మూరు ప్రాజెక్టు కాం ట్రాక్ట్‌ను దక్కించుకున్నందుకే ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పార్టీని వీడి టీఆర్ఎస్లోకి వెళుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మంగళవారం ఇక్కడ ఆరోపించారు. వృథా నీరంతా బయటకుపోతోందన్నారు. టీడీపీ అధికారం కోల్పోయాక పదవులు అనుభవించడానికే గుత్తా కాంగ్రెస్‌లో చేరారని, పార్టీని వాడుకుని ప్రస్తుతం బయటకు వెళ్తున్నారని విమర్శించారు. గుత్తా వెళ్లినా కాంగ్రెస్‌కు నష్టం లేదని, కార్యకర్తలంతా పార్టీతోనే ఉన్నారని చెప్పారు. కొందరు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కోవర్టులుగా పనిచేస్తూ వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులు సంపాదించారన్నారు. మరి కొందరు గిట్టుబాటు కోసం ఎదురుచూస్తున్నారని, కోవర్టులు వెంటనే పార్టీని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. పార్టీని వీడేవారు పదవులకు రాజీనామా చేయాలన్నారు. -
వారి చర్య మాతృద్రోహం
గుత్తా, వివేక్, వినోద్, భాస్కర్‌రావులపై వీహెచ్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నంతకాలం పదవులను అనుభవించి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీపై నిందలు వేసి టీఆర్ఎస్లోకి వెళ్తున్న గుత్తా, వివేక్, వినోద్, భాస్కర్రావులది మాతృద్రోహమని ఏఐసీసీ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంతర్గత ప్రజాస్వామ్యం కేవలం కాంగ్రెస్ లోనే ఉందని, టీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం ఎంతుందో త్వరలోనే వారికి తెలుస్తుందన్నా రు. పార్క్ హయత్ పక్కన ఉన్న స్థలాన్ని దక్కించుకోవడానికి వివేక్, వినోద్, సాగునీటి పనుల కాంట్రాక్టుల కోసం గుత్తా టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. గుత్తా విలువ లు, ఆత్మను అమ్ముకున్నారని, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేకు న్నా ఎంపీ టికెట్ వచ్చే లా సహకరించిన జైపాల్‌రెడ్డి, జానారెడ్డిలకు ద్రోహం చేసి టీఆర్ఎస్లోకి వెళ్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ మారడం వ్యభిచారంతో సమానమని చెప్పిన గుత్తా ఇప్పుడు ఎలా మారుతున్నారన్నారు. దమ్ముంటే ఎంపీ పదవికి గుత్తా రాజీనామా చేసి పోటీ చేయాలని వీహెచ్ సవాల్ విసిరారు. పార్టీ మారే నాయకులు పందికొక్కులకన్నా ప్రమాదకరమని, వారి అసలు స్వరూపం కేసీఆర్‌కు కూడా త్వరలోనే తెలుస్తుందని వీహెచ్ హెచ్చరించారు. పదవులకు రాజీనామా చేయాలి... కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచి టీఆర్ఎస్లో చేరనున్న ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్ వెంటనే పదవులకు రాజీనామా చేయాలని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు బి.బిక్షమయ్యగౌడ్, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. కాంట్రాక్టులు, పదవుల కోసమే వారు పార్టీలు మారుతూ బంగారు తెలంగాణ అంటూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు. పార్టీ మారడం అంటే తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని మోసం చేయడమేనన్నారు. టీఆర్ఎస్కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నా రు. మిషన్ భగీరథ అక్రమాలపై 120 కిలోల పేపర్లను సేకరించిన గుత్తా టీఆర్ఎస్ను బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు. -
బంగారు తెలంగాణ కోసమే...
టీఆర్ఎస్లోకి వెళుతున్నామన్న గుత్తా, వివేక్, భాస్కర్‌రావు, రవీంద్రకుమార్ సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సహకరించాలనే టీఆర్ఎస్లో చేరుతున్నామని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ మంత్రి జి.వినోద్, మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, దేవరకొండ సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌నాయక్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని వివేక్ నివాసంలో సోమవారం విలేకరులతో వారు మాట్లాడారు. బుధవారం టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నామన్నారు. ఓటర్లు ఒత్తిడి తెచ్చారు: గుత్తా కాంగ్రెస్ పార్టీని వీడాల్సి రావడం బాధాకరంగానే ఉందని గుత్తా, వివేక్, వినోద్, భాస్కర్‌రావు పేర్కొన్నారు. అయితే పార్టీలోని అంతర్గత కలహాలు, నాయకుల మధ్య విబేధాలతో తాము తీవ్రంగా కలత చెందామన్నారు. సీనియర్ల మధ్య అంతర్గత విభేదాలు నాయకులను అయోమయానికి, గందరగోళానికి గురిచేస్తున్నాయని గుత్తా ఆరోపించా రు. వీటి వల్ల పార్టీ బలహీనపడుతోందన్నా రు. షోకాజ్ నోటీసులు ఇచ్చి పార్టీని కాపాడుకునే పరిస్థితి కాంగ్రెస్‌కు వచ్చిందన్నారు. టీఆర్ఎస్లో చేరాలంటూ తన ఓటర్లు ఒత్తిడి తెచ్చారని గుత్తా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహించానని...ఎంపీగా పోటీ చేయడానికి పార్టీ రెండుసార్లు అవకాశం ఇచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని తెలంగాణ దేవతగా గుత్తా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం టీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. సమయం, సందర్భాన్ని బట్టి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. పదవులు ఇస్తామని టీఆర్ఎస్ ఇప్పటిదాకా తనకు కమిట్మెంట్ ఇవ్వలేదన్నారు. జిల్లాలో ఏర్పాటవుతున్న యాదాద్రి పవర్‌ప్లాంటు, నల్లగొండ జిల్లా అభివృద్ధికోసం సీఎం కేసీఆర్‌తో కలసి పనిచేస్తానని ప్రకటించారు. పథకాలు ఆకర్షించాయి: వివేక్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మిషన్ కాకతీయ వంటి పథకాలు తనను ఎంతగానో ఆకర్షించాయని మాజీ ఎంపీ వివేక్ చెప్పారు. పార్టీలోకి వస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అడిగారని వెల్లడించారు. పార్టీలో ఇప్పటిదాకా సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో కృష్ణా పుష్కరాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 300 కోట్లు కేటాయించిందన్నారు. ఇప్పటిదాకా కేసీఆర్‌ను తాను కలవలేదని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరుతున్నానని చెప్పారు. -
అనూహ్యంగా తెరమీదికొచ్చిన మరో ఎమ్మెల్యే
♦ 15న గులాబీ గూటికి నల్లగొండ ఎంపీ గుత్తా.. ♦ మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, ముఖ్య కాంగ్రెస్ నేతలతో కలిసి ♦ అనూహ్యంగా తెరమీదికొచ్చిన దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ♦ ఆయన కూడా అదేరోజు అధికార పార్టీలోకి.. ♦ ఆదివారం సీఎం కేసీఆర్‌తో ఫాంహౌస్‌లో గుత్తా, భాస్కరరావు భేటీ ♦ అక్కడి నుంచి సీఎం కారులోనే క్యాంపు ఆఫీసుకు ♦ అక్కడ జిల్లా మంత్రితో చర్చల అనంతరం నిర్ణయం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉత్కంఠకు తెర పడింది. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈ నెల 15న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆదివారం మెదక్ జిల్లాలోని ఎర్రవెల్లి సీఎం ఫాంహౌస్‌తో పాటు బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన చర్చల్లో ముహూర్తం ఖరారైంది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావుతో పాటు ముఖ్యమైన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన బుధవారం గులాబీ కండువా కప్పుకోనున్నారు. దీంతో గుత్తా సుఖేందర్‌రెడ్డి గులాబీ గూటికి చేరుతున్నారన్న వార్తలు వచ్చిన నాటి నుంచి ఎప్పుడెప్పుడు నిర్ణయం జరుగుతుంది? అసలు చేరుతారా లేదా అనే సందేహాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జిల్లా రాజకీయ వర్గాల సస్పెన్స్ వీడినట్టయింది. అయితే, అధికార పార్టీలోనికి చేరే వారిలో ఉన్నట్టుండి దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కూడా తెరమీదకు వచ్చారు. ఆయన కూడా ఈనెల 15నే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఫాంహౌస్ టూ క్యాంప్ ఆఫీస్ గుత్తా టీఆర్ఎస్లో చేరే అంశంపై ఆదివారం కీలక చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే భాస్కరరావు, డీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పాశం రాంరెడ్డిలు మెదక్ జిల్లాలోని సీఎం ఫాంహౌస్‌కు వెళ్లారు. అక్కడ ఎంపీ, ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన అనంతరం ఈనెల 15న గుత్తా, భాస్కరరావులు టీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తంగా నిర్ణయించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని క్యాంపు ఆఫీసుకు వెళ్లిన సీఎం కేసీఆర్ తన కారులోనే ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే భాస్కరరావులను కూడా తీసుకెళ్లారు. అక్కడ వీరికి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా తోడయ్యారు. నలుగురూ చాలా సేపు చర్చించారు. పార్టీలో చేరే కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. అయితే, గుత్తా, భాస్కరరావులు పార్టీలో చేరే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాల్సిన అవసరం లేదని, కేవలం జెడ్పీటీసీలు, ఇతర ముఖ్య నేతలను మాత్రమే ఆ వేదికపై పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పది రోజుల తర్వాత వాస్తవానికి గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నారన్న వార్త ఈనెల 3న వెలుగులోనికి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్2న ఆయన సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిలతో హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీఆర్ఎస్ ఎంపీ బి. వినోద్‌కుమార్ (కరీంనగర్), రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి , తిప్పర్తి ఎంపీపీ, డీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పాశం రాంరెడ్డిలు పాల్గొన్నారు. ఈ భేటీలోనే గుత్తాను టీఆర్ఎస్లోనికి సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. అందుకు అంగీకరించిన గుత్తా తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనా మా చేసే అంశంపై సీఎంను స్పష్టత అడిగారు. ఆ అంశంపై తర్వాత... చూద్దాంలే అని చెప్పిన సీఎం కేసీఆర్ ఆదివారం జరిగిన చర్చల్లో ఈ అంశంపై కూడా గుత్తాతో మాట్లాడినట్టు తెలిసింది. అయితే, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతారా లేక చేయకుండానే గులాబీ కండువా కప్పుకుంటారా అనేది మాత్రం స్పష్టం కాలేదు. ఈ విషయంలో నేడో, రేపో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. కాగా, తొలి నుంచీ తాను టీఆర్ఎస్లో చేరే అంశాన్ని గుత్తా ఎక్కడా ఖండించలేదు. వార్త బయటకు వచ్చిన రోజు విలేకరులు అడిగినప్పుడు కూడా ఇప్పుడే ఏమీ చెప్పలేనని, భవిష్యత్ ఏం జరుగుతుందో ఊహించలేమని చెప్పిన గుత్తా ఎక్క డా అధికారికంగా నోరు విప్పలేదు. మి ర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు మాత్రం తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని, టీఆర్ఎస్లో చేరుతున్నానన్న వార్తల్లో వాస్తవం లేదని మరుసటి రోజే ఖండించారు. కానీ, 15న టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతుండడం గమనార్హం. రవీంద్రకుమార్.. రసకందాయం కాగా, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అనూహ్యంగా సీన్లోకి వచ్చారు. ఆయన అధికార టీఆర్ఎస్లో చేరుతారని గత రెండు నెలల క్రితం వార్తలు వచ్చాయి. కానీ, అది జరగలేదు. ఆయన కూడా తాను టీఆర్ఎస్లో చే రడం లేదని చెప్పారు. కానీ, మళ్లీ మనసు మార్చుకుని అధికార పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయినట్టు తెలిసింది. ఆదివారం సీఎం క్యాంపు ఆఫీసులో జరిగిన చర్చల్లో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ చర్చల్లో ఆయన టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. కాగా, ఈ విషయమై వివరణ కోరేందుకు రవీంద్రకుమార్‌కు ‘సాక్షి’ ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు. అయితే, అనూహ్యంగా తెరమీదకు వచ్చిన రవీంద్రకుమార్ టీఆర్ఎస్లో చేరితే దేవరకొండ రాజకీయం రసకందాయంలో పడనుంది. -
త్వరలో రాష్ట్ర కేబినెట్లోకి గుత్తా!
- సీఎం కేసీఆర్‌తో మరోసారి భేటీ - కారెక్కనున్న కాకా తనయులు - అదే బాటలో సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్! -15న టీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం సాక్షి, హైదరాబాద్/ నల్లగొండ: టీఆర్ఎస్లో చేరనున్న నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి త్వరలోనే రాష్ట్ర కేబినెట్లో అవకాశం దక్కనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనప్రాయంగా అంగీకరించినట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జోరందుకుంది. వివాద రహితునిగా పేరుండటంతో పాటు తెలంగాణ ఉద్యమ సమయంలోనూ వివిధ సందర్భాల్లో తనకు మద్దతుగా నిలిచిన నాయకుడిగా గుత్తాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ముందునుంచీ సదభిప్రాయముంది. దీంతో ఆయన పార్టీలో చేరికకు ముందునుంచీ సీఎం సానుకూలతను ప్రదర్శించారు. అదే సమయంలో ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు గుత్తా మొగ్గు చూపడంతోపాటు, ఒక్కసారైనా రాష్ట్రంలో మంత్రి పదవిని చేపట్టాలనే తన ఆకాంక్షను ఫామ్‌హౌస్‌లో జరిగిన మంతనాల సందర్భంగా గుత్తా, సీఎం ఎదుట వెలిబుచ్చినట్లు తెలిసింది. అయితే ఎంపీ పదవికి ఇప్పుడు రాజీనామా చేయవద్దని ముఖ్యమంత్రి వారించటంతో పాటు.. అవసరమైనప్పుడు తానే మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తానని గుత్తాకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేబినెట్లో నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి ఉన్నప్పటికీ.. అదే సామాజిక వర్గానికి చెందిన మరో బలమైన నాయకుడి అవసరం ఉందని సీఎం ఆలోచనలో ఉన్నారు. కేబినెట్లో గుత్తాకు అవకాశం ఇవ్వడం ద్వారా ఆ లోటు తీరిపోతుందనే భావన ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయటంతో ఆ సీటు ఖాళీ అయింది. దీంతో అదే ఎమ్మెల్సీ సీటును గుత్తాకు ఇచ్చి.. మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం లేకపోలేదని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. రెండు చోట్ల చర్చలు గుత్తా, భాస్కరరావులు టీఆర్ఎస్లో చేరే అంశంపై ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు చర్చలు జరిగాయి. ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే భాస్కరరావు, తిప్పర్తి జెడ్పీటీసీ, నల్లగొండ డీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పాశం రాంరెడ్డిలు ముందుగా సాయంత్రం మెదక్ జిల్లాలోని సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్ గుత్తా, భాస్కరరావులతో భేటీ అయ్యారు. అనంతరం అక్కడి నుంచి తన కారులోనే వారిద్దరినీ బేగంపేట సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి మరోసారి చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం వారు టీఆర్ఎస్లో చేరే ముహూర్తాన్ని నిర్ణయించారు. రవీంద్రకుమార్‌ను టీఆర్ఎస్లో చేర్చుకునే విషయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదిపినట్టు తెలుస్తోంది. కాగా, రవీంద్రకుమార్ మాత్రం గుత్తా, భాస్కరరావులతో ఫాంహౌస్‌కు వెళ్లకుండా క్యాంపు ఆఫీసులో జరిగిన చర్చల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఖరారైన ముహూర్తం.. నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దివంగత వెంకటస్వామి తనయులు.. జి.వినోద్, వివేక్‌లు టీఆర్ఎస్లో చేరే ముహూర్తం ఖరారైంది. ఆదివారం గుత్తాతో పాటు మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర్‌రావు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలుసుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జి.వివేక్, వినోద్‌ల నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీని వీడొద్దని నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. కానీ వివేక్, వినోద్‌లు టీఆర్ఎస్లో చేరేందుకే మొగ్గు చూపినట్లు తెలిసింది. వీరందరూ ఈనెల 15న కారెక్కేందుకు ముహూర్తం కుదిరినట్లు తెలిసింది. ముందుగా సోమవారమే వీరందరూ టీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ ఆ రోజు మంచి రోజు కాదని.. రెండ్రోజులు వాయిదా వేసుకున్నట్లు సమాచారం. మరో పక్క దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ (సీపీఐ) కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిసింది. -
మళ్లీ పార్టీ మారి పరువు పోగొట్టుకోకు : కోమటిరెడ్డి
హైదరాబాద్: నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ...ఇప్పటికే మూడు పార్టీలు మారావు, ఇప్పుడు మళ్లీ మారి పరువు పోగొట్టుకోకు అని ఎంపీ గుత్తాకు సూచించారు. గాంధీభవన్ మెట్లు ఎక్కకుండా..పార్టీ సభ్యత్వం లేకుండా..సోనియా చలవతోనే ఎంపీ అయ్యవనీ, ఒకవేళ పార్టీ మారాలనుకుంటే కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. సుఖేందర్ రెడ్డి పార్టీ మారతారని తాను అనుకోవడంలేదని తెలిపారు. రుణమాఫీకి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు వడ్డీకే సరిపోవడంలేదని అన్నారు. ఇప్పటికైనా రుణమాఫీ పూర్తిగా చేయాలని కోరారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకుల కోసం రూ.300 కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. ఆ డబ్బుతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకుంటే బాగుండేదని కోమటిరెడ్డి అన్నారు. -
మంత్రి పదవా.. కేబినెట్ హోదానా?
టీఆర్ఎస్లో గుత్తాకు పదవిపై తర్జనభర్జనలు - ఎంపీ పదవికి రాజీనామా చేసి వస్తానన్న గుత్తా - తొలుత అవసరం లేదన్నా.. ఆ తర్వాత తలూపిన సీఎం! - 2018లో రాజ్యసభ స్థానం, కేబినెట్ హోదాతో ఏదైనా పదవి, ఎమ్మెల్సీగా ఇచ్చి కేబినెట్లోకి తీసుకోవడంపై చర్చ? సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కాంగ్రెస్ సీనియర్‌నేత, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వారం, పది రోజుల్లోపే టీఆర్ఎస్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన అధికార పార్టీ గూటికి చేరతారన్న వార్త బయటికి వచ్చేలోపే.. అందుకు సంబంధించిన ‘వ్యవహారం’ అంతా అయిపోయిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గుత్తా టీఆర్ఎస్లో చేరే విషయంలో కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ కీలకపాత్ర పోషించారని సమాచారం. ఆయన చొరవతోనే తొలుత మంత్రి హరీశ్‌రావుతో చర్చలు జరిగాయని, ఆ తర్వాత గురువారం సీఎం కేసీఆర్‌తో క్యాంపు కార్యాలయంలో మూడు గంటలపాటు భేటీ జరిగిందని తెలుస్తోంది. ఈ చర్చల్లో సీఎం కేసీఆర్, నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ వినోద్‌కుమార్, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆయన అనుంగు అనుచరుడు, డీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పాశం రాంరెడ్డి పాల్గొన్నారు. అక్కడే గుత్తా టీఆర్ఎస్లో చేరే అంశం ఖరారైపోయింది. రాజీనామా చేయాలా.. వద్దా..? ఎంపీ గుత్తా టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఎలా సర్దుబాటు చేయాలన్నదే సీఎం కేసీఆర్ సమక్షంలో జరిగిన చర్చల్లో ప్రధాన ఎజెండా అని తెలుస్తోంది. ఎంపీ పదవికి రాజీనామా చేశాకే టీఆర్ఎస్లోనికి వస్తానని గుత్తా చెప్పినట్లు సమాచారం. అయితే, సీఎం తొలుత సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. ‘ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మనమే గెలుస్తాం. మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన అమలు చేయాల్సి ఉంది. మళ్లీ ఎన్నికలంటే సమయం వృథా అవుతుంది కదా?’ అని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. కానీ, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ తరఫున గెలిచి పార్టీ మారితే డిస్క్వాలిఫై చేసే అవ కాశాలున్నాయన్న చర్చను లేవనెత్తడంతో రాజీనామా చేశాకే పార్టీలోకి రావచ్చని కేసీఆర్ అన్నట్టు తెలుస్తోంది. రాజీనామా చేసి పార్టీ మారడం ద్వారా నైతిక విలువలకు కట్టుబడి ఉన్నారన్న గౌరవం కూడా దక్కుతుందనే ఆలోచనలో గుత్తా ఉన్నట్టు తెలుస్తోంది. గుత్తాను టీఆర్ఎస్లో ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై టీఆర్ఎస్ అధినాయకత్వం తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. 2018లో జరిగే రాజ్యసభ ఎన్నికల వరకు వెయిటింగ్లో ఉం చాలా... అప్పటిదాకా కేబినెట్ హోదాతో ఏదైనా పదవి ఇవ్వాలా.. లేదంటే ఎమ్మెల్సీగా చేసి కేబినెట్లోకి తీసుకోవాలా.. అనే మూడు అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ మూడింటిలో ఏదో ఒకటి ఖరారవుతుందని టీఆర్ఎస్ వర్గాలు, ఎంపీ గుత్తా శిబిరం చెబుతున్నాయి. గుత్తా స్థానంలో ఎంపీ అభ్యర్థిగా పల్లా..! గుత్తా రాజీనామా చేస్తే నల్లగొండ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని బరిలో దించాలనే చర్చ కూడా జరిగిందని సమాచారం. -
టీఆర్ఎస్లోకి గుత్తా?
- మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా..! - గురువారం సీఎం కేసీఆర్‌తో భేటీ అయినట్లు గుత్తా వెల్లడి - యాదాద్రి ప్లాంటు, జిల్లాల విభజనపై చర్చించామని వివరణ - గులాబీ పార్టీలో చేరికపై మంతనాలు జరిపినట్లు సమాచారం - ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుందా.. ఆ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారా..ఆయనతోపాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్.భాస్కరరావు కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారా.. ఈ ప్రశ్నలకు రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఈ చేరికలకు సంబంధించి కసరత్తు కూడా పూర్తయిందని... టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. గుత్తా, భాస్కరరావు గురువారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ కావడం, శుక్రవారం నల్లగొండలో విలేకరుల సమావేశం పెట్టి కేసీఆర్‌ను సమర్థించే వ్యాఖ్యలు చేయడం దీనిని బలపరుస్తున్నాయి. దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్‌లో ఉన్నా..! రాష్ట్రంలో తొలి నుంచీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తరఫున విమర్శలు గుప్పించిన నేతల్లో ఎంపీ గుత్తా ముందుంటారు. కానీ పలు కారణాల నేపథ్యంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నల్లగొండలో జరిగిన విలేకరుల సమావేశంలో ఓ ప్రశ్నకు గుత్తా చెప్పిన సమాధానం దీనిని బలపరుస్తోంది. ‘మీరు టీఆర్ఎస్లో చేరుతున్నారా?’ అని విలేకరులు ప్రశ్నించ గా.. ‘‘నేను ప్రస్తుతానికి కాంగ్రెస్‌లోనే ఉన్నా.. భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు.’’ అని గుత్తా వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకాదు సీఎం కేసీఆర్‌ను తాను, ఎమ్మెల్యే భాస్కరరావు కలిసినట్లు ఆయనే స్వయంగా చెప్పా రు. యాదాద్రి పవర్ ప్లాంటు, జిల్లాల విభజన అంశాలపై సీఎంతో మాట్లాడామన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ హర్షణీయమని, ప్రాజెక్టులు పూర్తయ్యేవరకు కేసీఆర్‌కు మద్దతిస్తామని పేర్కొన్నారు. అయితే టీఆర్ఎస్లో చేరే విషయంపై వారు ప్రధానంగా మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. తాను ఎంపీ పదవికి రాజీనామా చేశాకే టీఆర్ఎస్లో చేరుతానని గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. జిల్లా నేతలకు గాలం..? నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు కొందరు టీఆర్ఎస్లో చేరుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ జిల్లా నేతల్లో సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తోపాటు సీఎల్పీ ఉప నాయకుడు కోమటిరెడ్డి ఉండడం, మరో ఎమ్మెల్యే పద్మ పీసీసీ అధ్యక్షుడి సతీమణి కావడం, భాస్కరరావు సీఎల్పీ నేతకు ముఖ్య అనుచరుడు కావడంతో అంతా కాంగ్రెస్‌లోనే ఉండాల్సిన పరిస్థితులు కొనసాగాయి. కానీ సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలోనే పలుమార్లు పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగింది. స్థానిక రాజకీయాలతో పాటు వెంకటరెడ్డి సోదరుడు ఇటీవల కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా గెలవడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సుఖేందర్‌రెడ్డి, భాస్కరరావులను టీఆర్ఎస్ టార్గెట్ చేసిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. హరీశ్‌రావుతో గుత్తా భేటీ? సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇటీవల మంత్రి హరీశ్‌రావుతో రహస్యంగా సమావేశమైనట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎమ్మెల్యే భాస్కరరావు, గుత్తాకు సన్నిహితుడైన ఎంపీపీ పి.రాంరెడ్డి ఈ భేటీలో పాల్గొన్నట్టు సమాచారం. మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఈ భేటీని సమన్వయం చేశారని, గుత్తా బంధువైన ఓ ప్రముఖ కాంట్రాక్టర్ నివాసంలో ఈ భేటీ జరిగిందని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. గుత్తా సుఖేందర్‌రెడ్డి సమీప బంధువుకు చెందిన సంస్థకు రాష్ట్రంలో పలు కాంట్రాక్టులు దక్కాయి. ఆ పనులు అవాంతరాల్లేకుండా సాగాలంటే టీఆర్ఎస్లో చేరక తప్పదనే ఒత్తిడి వచ్చినట్లు ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. -
ఎన్నికలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి
టీడీపీ, టీఆర్ఎస్పై గుత్తా ధ్వజం సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు ఎన్నికలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు. శుక్రవారం ఇక్కడి ఏపీభవన్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై ఇప్పటికే సీఎల్పీ తరఫున స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని వివరించారు. కృష్ణా, గోదావరి నీటి కేటాయింపుల్లో పూర్తి వాటాను వాడుకునే హక్కు తెలంగాణకు ఉందని గుత్తా పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరు ఇవ్వడం సాధ్యమేనని, కాంగ్రెస్ హయాంలో 48 లక్షల ఎకరాలకు నీరందిందని వివరించారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కరువు పరిస్థితిని వదిలి రాజకీయాలపైనే దృష్టిపెట్టాయని ధ్వజమెత్తారు. వెంటనే కరువు ప్రాంతాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
పాపాలు తగిలిపోతారు
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై ‘గుత్తా’ ధ్వజం నల్లగొండ: అధికార మదంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌పై చేసిన విమర్శలు వెనక్కి తీసుకోకుంటే పాపాలు తగిలిపోతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన శని అని, దరిద్రపు కాంగ్రెస్ అని ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయడం వారి అహంకారానికి పరాకాష్టగా నిలిచిందని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? సోని యా, రాహుల్‌లకు కృతజ్ఞతలు చెప్పడానికి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలసి వెళ్లడం నిజం కాదా? అప్పుడు గుర్తుకు రాలేదా దరిద్ర కాంగ్రెస్ పార్టీ అని గుత్తా ప్రశ్నించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి పోటీ చేసిన సంగతిని కేసీఆర్ విస్మరించరాదని చెప్పారు. -
'అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్'
హైదరాబాద్ : కేసీఆర్ సర్కార్‌కు ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని నల్గొండ లోక్‌సభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. నిధులు పంచే రాష్ట్రంగా ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పులు రాష్ట్రంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో లక్ష కోట్లు అప్పులు కాగా ఏడాదిన్నర కేసీఆర్ పాలనలోనే 10 జిల్లాల తెలంగాణ లక్ష కోట్ల అప్పుల పాలైందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ నడుస్తున్నారని విమర్శించారు. అందుకే ఆయన తరహాలనే కేసీఆర్ ప్రభుత్వ జీవోలను రహస్యంగా ఉంచుతున్నారని గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. -
‘భగీరథ’ పనులపై విచారణ జరపండి: గుత్తా
నల్లగొండ: మిషన్ భగీరథ పనులపై గవర్నర్ నరసింహన్ సమగ్రవిచారణకు ఆదేశించాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ గవర్నర్ మిషన్ భగీరథ పనులను సందర్శించి భేషుగ్గా ఉన్నాయని కితాబు ఇవ్వడాన్ని గుత్తా ఆక్షేపించారు. గవర్నర్‌కు ఎన్నికల కోడ్ వర్తించకపోయినా ఆ పనులను ఎన్నికల సమయంలో మెచ్చుకోవడాన్ని పరోక్షంగా ప్రభుత్వాన్ని సమర్ధించినట్లే అవుతుందన్నారు. గవర్నర్ మిషన్ భగీరథ పునులపై విచారణకు ఆదేశించాలన్నారు. గ్రిడ్ పనుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని, పైపులైన్ల పనులకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన ఎస్టిమేట్లను తెప్పించుకుని కంపెనీలతో సంప్రదించి వాస్తవధరలను లెక్కకడితే ప్రభుత్వ బండారం బయటపడుతుందన్నారు. -
'గవర్నర్ పరోక్షంగా ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు'
నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మిషన్ భగీరథ పనులపై గవర్నర్ నరసింహన్ సమగ్ర విచారణకు ఆదేశించాలని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ గవర్నర్ మిషన్ భగీరథ పనులను సందర్శించి భేషుగ్గా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి కితాబు ఇవ్వడాన్ని గుత్తా సందేహాలు వ్యక్తంచేశారు. గవర్నర్‌కు ఎన్నికల కోడ్ వర్తించకపోయినా ప్రభుత్వం చేసే పనులను ఎన్నికల సమయంలో మెచ్చుకోవడాన్ని పరోక్షంగా ప్రభుత్వాన్ని సమర్థించినట్లే అవుతుందన్నారు. గ్రిడ్‌కు ఉపయోగించే పనుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని, పైపు లైన్ల పనులకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్ ను తెప్పించుకుని కంపెనీలతో సంప్రదించి వాస్తవ ధరలను లెక్కకడితే బండారం బయటపడుతుందన్నారు. 30 నుంచి 40 శాతం అధిక ధరలకు పైపులైన్లు కొనుగోలు చేశారని గుత్తా ఆరోపించారు. నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. ఉద్దేశ పూర్వకంగానే ఎన్నికలు సకాలంలో జరగకుండా వాయిదా వేస్తూ సుమారు రూ.300 కోట్లు వెచ్చించి అక్కడ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. ఎన్నికల జాప్యాన్ని ప్రదర్శించడం వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబం పోషించిన పాత్రను ప్రజలు గుర్తించి జీహెచ్ఎంసీ, నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. -
ఈ పనికిరాని మీటింగులెందుకు?
రైల్వే బడ్జెట్ సన్నాహక సమావేశంలో ఎంపీల ఆగ్రహం ♦ ఈ భేటీలతో టైం వేస్ట్ తప్ప.. ఫలితమేముంది? ♦ మా ప్రతిపాదనలను పట్టించుకునే నాథుడే లేడు ♦ మేం గతంలో చేసిన సూచనలను ఎందుకు పక్కన పడేశారు ♦ జీఎం చెప్పేది వినడం తప్ప చేసేదేమీ లేదు ♦ మళ్లీ భేటీ ఏర్పాటు చేస్తే రైల్వే మంత్రి లేదా బోర్డు చైర్మన్ రావాలి సాక్షి, హైదరాబాద్: ‘‘రెండు దశాబ్దాల కిందట మంజూరైన ప్రాజెక్టు పనులు ఇప్పటికీ మొదలు కాలేదంటే రైల్వేశాఖ పనితీరు ఎలా ఉందో అర్థమవుతోంది. బడ్జెట్లో నిధులిచ్చినా పనులు మొదలు కాలేదంటే నా జీవితంలో దాన్ని చూస్తానన్న నమ్మకం పోయింది. దీనిపై పార్లమెంటులో సభాహక్కుల తీర్మానం పెడతా.. అక్కడ నిరాహారదీక్షకు కూర్చుంటా..’’ - నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ‘‘ఎలాంటి ఫలితం లేని ఈ సమావేశాలతో మా విలువైన సమయాన్ని ఎందుకు వృథా చేస్తున్నారు. వచ్చే సంవత్సరం మళ్లీ భేటీ ఏర్పాటు చేస్తే రైల్వే మంత్రి లేదా రైల్వే బోర్డు చైర్మన్ రావాల్సిందే..’’ - మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి ...రైల్వే బడ్జెట్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీల ఆగ్రహావేశాలివీ! బుధవారం దక్షిణ మధ్య రైల్వేలోని హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలోని ఎంపీలతో జీఎం రైల్‌నిలయంలో భేటీ నిర్వహించారు. ఎంపీలు నగేశ్, బూర నర్సయ్య గౌడ్, కొండా విశ్వేశ్వరరెడ్డి, బి.వినోద్‌కుమార్, సీతారాం నాయక్, జితేందర్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, నంది ఎల్లయ్య, గుత్తా సుఖేందర్‌రెడ్డి, బాల్క సుమన్, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, రాపోలు ఆనంద భాస్కర్, దేవేందర్‌గౌడ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే పనితీరుపై ఎంపీలు నిప్పులు చెరిగారు. ప్రజలేం కోరుకుంటున్నారో గుర్తించి రైల్వే శాఖ ముందు ప్రతిపాదనలు ఉంచితే వాటిని పట్టించుకునే నాథుడే లేడంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. డిమాండ్లను రైల్వే బోర్డుకు చేరవే సి చేతులు దులుపుకునే ఇలాంటి సమావేశాలతో.. సమయం వృథా తప్ప మరో ఉపయోగమే లేదంటూ మండిపడ్డారు. ఈసారి వాళ్లొస్తేనే మీటింగ్.. గత బడ్జెట్ ముందు ఇదే తరహాలో నిర్వహించిన సమావేశంలో తాము చేసిన సూచనలను పట్టించుకోకపోవటాన్ని ఎంపీలు ఈ సందర్భంగా లేవనెత్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మాటలు వినడం తప్ప జీఎం చేసేదేమీ లేనప్పుడు ఈ సమావేశాలెందుకని ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రశ్నించారు. రైల్వే మంత్రి లేదా రైల్వే బోర్డు చైర్మన్ పాల్గొంటే తప్ప వచ్చేసారి ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయొద్ద న్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పటికీ అధికారులు తమను పట్టించుకోవటం లేదని బాల్క సుమన్ మండిపడ్డారు. నియోజకవర్గానికి ఓ సీనియర్ అధికారిని నియమించి తమతో కలిసి పనుల పురోగతిని పరిశీలించే ఏర్పాటు చేస్తేనే ఉపయోగం ఉంటుందని సుమన్‌తోపాటు జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. వాకౌట్ చేసిన గుత్తా రైల్వే శాఖ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సమావేశం నుంచి వాకౌట్ చేశారు. నల్లగొండ-మాచెర్ల మధ్య 20 ఏళ్ల కిందట కొత్త లైన్ మంజూరైందని, దాన్ని 2011 బడ్జెట్లో ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించారని చెప్పారు. గత బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించారని కానీ ఇప్పటివరకు పనులే ప్రారంభించలేదన్నారు. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి రైల్వే సహాయ మంత్రిగా ఉండగా.. పనులు మొదలుపెట్టాలని కోరినా పట్టించుకోలేదన్నా రు. ఇదే విషయమై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో సభా హక్కుల తీర్మానం ప్రవేశపెడతామని, అవసరమైతే నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. తన జీవితకాలంలో ఆ ప్రాజెక్టును చూస్తానన్న నమ్మకం కూడా లేదం టూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. జగ్గయ్యపేట-మేళ్లచెరువు లైన్ విషయంలో భూసేకరణకు సంబంధించి జిల్లా కలెక్టర్, తాను రైతులతో మాట్లాడుతున్నా రైల్వే అధికారులెవరూ రావటం లేదని ఆయన ఆరోపించారు. కరీంనగర్-ముంబై ఎక్స్‌ప్రెస్ ప్రారంభించండి పెద్దపల్లి-నిజామాబాద్ కొత్త మార్గంలో చిన్న బిట్ మాత్రమే పెండింగులో ఉందని, ఆ పనులు వేగంగా పూర్తిచేసి తెలంగాణ ఆవి ర్భావ దినోత్సవమైన జూన్ 2న కరీంనగర్-ముంబై మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించాలని ఎంపీవినోద్ కోరారు. ‘ఈ ప్రాంతం నుంచి ముంబై వెళ్లేవారి సంఖ్య తీవ్రంగా ఉన్నందున నిత్యం 100 బస్సులు తిరుగుతున్నాయి. అంత డిమాండ్ ఉన్న మార్గం అయినందున దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి’’ అని కోరారు. అయితే ట్రయల్ రన్ నిర్వహించాల్సి ఉన్నందున డిసెంబర్ వరకు అది సాధ్యం కాదని జీఎం తెలిపారు. మహబూబ్‌నగర్-సికింద్రాబాద్ డబ్లింగ్ పనులు ఆర్‌వీఎన్‌ఎల్‌కు కేటాయించొద్దని, నేరుగా రైల్వే శాఖనే నిర్వహించాలని ఎంపీ జితేందర్‌రెడ్డి కోరారు. చర్లపల్లి, నాగులపల్లి, హైటెక్‌సిటీ రైల్వే స్టేష న్ల వద్ద ఖాళీ స్థలం అందుబాటులో ఉన్నం దున 3 చోట్ల భారీ టెర్మినళ్లు నిర్మించి ప్రస్తుత స్టేషన్లపై భారం తగ్గించాలని వినోద్ సూచిం చారు. బోగస్ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికెట్లతో కొందరు రైల్వే ఉద్యోగాలు పొందారని, వారిని గుర్తించి విధుల్లోంచి తొలగించి కేసులు నమోదు చేయాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. రైల్వేలోని గ్రూప్-డి పోస్టుల్లో తెలంగాణ వారిని కాదని యూపీ, బిహార్, రాజస్థాన్ వారిని స్థాని కంగా నియమించటాన్ని తప్పు పట్టారు. సమ్మక్క జాతర నేపథ్యంలో విజయవాడ-బల్లార్షా మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని కోరారు. మరోవైపు కాజీపేటకు మంజూరైన వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీ ప్రతిపాదనను రైల్వే అటకెక్కించినట్లు ఈ సమావేశం ద్వారా తేలిపోయింది. అక్కడ వ్యాగన్ మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు జీఎం గుప్తా ఎంపీల దృష్టికి తెచ్చారు. -
యాగంతోనైనా కేసీఆర్‌కు సద్బుద్ధి కలగాలి: గుత్తా
నల్లగొండ టూటౌన్: వక్రబుద్ధితో ఆలోచించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు చండీయాగం వల్ల సద్బుద్ధి కలగాలని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆకాంక్షించారు. నల్లగొండలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అధర్మాన్ని కాపాడండి, అన్యాయాన్ని పెంచి పోషించండి’ అని యాగాలు చెబుతున్నాయా ? అందుకే కేసీఆర్ యాగం చేస్తున్నారా అని గుత్తా ప్రశ్నించారు. విశ్వశాంతి కోసం చండీయాగం చేస్తున్నానని చెబుతున్న ముఖ్యమంత్రి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందేందుకు అనైతికంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. -
మీదే గెలుపైతే మంత్రుల ప్రచారం ఎందుకో?
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఏకపక్షమైతే రాష్ట్ర మంత్రులంతా పరిపాలనను గాలికి వదిలి ఎందుకు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మోసంతో అన్ని వర్గాల ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వెల్లువెత్తుతున్నదన్నారు. వరంగల్‌లో మంత్రులు, అధికారపార్టీ నేతలు ఎక్కడికి వెళ్లినా నిలదీస్తున్నారని చెప్పారు. ప్రజా వ్యతిరేకతకు భయపడిన టీఆర్ఎస్ వరంగల్‌లో ఓడిపోతామనే భయంతో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించేవిధంగా మంత్రులు వ్యవహరిస్తున్నారని గుత్తా విమర్శించారు. టీఆర్ఎస్కు గెలుస్తామనే నమ్మకం ఉంటే మంత్రులను వెనక్కి రప్పించాలని సవాల్ చేశారు. పెరిగిన ప్రజా వ్యతిరేకత వల్ల ఓడిపోతామనే భయంతోనే మంత్రులంతా పరిపాలనను వదిలిపెట్టి, సచివాలయంలోకి రాకుండా వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారని గుత్తా విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏడాదిన్నరగా పట్టించుకోకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తామని, బీసీలకు కళ్యాణలక్ష్మీ పథకం వర్తింపజేస్తామని, పోలీసు నోటిఫికేషన్లు ఇస్తామని, మహిళలకు తగిన రిజర్వేషన్లు ఇస్తామని వరంగల్ ఎన్నికలకోసం మంత్రులు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. క్లబ్‌లు, గుళ్లు, మసీదులు, చర్చిల్లో కూడా మంత్రులు స్వయంగా ప్రచారంలో పాల్గొంటున్నారని అన్నారు. గెలుస్తామనే నమ్మకం ఉంటే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించేవిధంగా ప్రచారంచేయాల్సిన అవసరం ఏమిటని గుత్తా ప్రశ్నించారు. మంత్రులు చేస్తున్న ప్రకటనలను, టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ఆ పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ఎక్కువగా ప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం నుంచి ప్రకటనలు, ఆదాయం పొందుతున్న మీడియా సంస్థలు చేస్తున్న దుర్వినియోగాన్ని పార్లమెంటులో ప్రశ్నిస్తానని గుత్తా హెచ్చరించారు. -
కేసుల మాఫీ కోసమేనా చండీయాగం ?
నల్లగొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కలియుగం నుంచి ద్వాపర, త్రేతాయుగాలకు తీసుకెళ్తున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మొన్నటిదాకా ఉత్సవాలు, పండగలంటూ ఆర్భాటం చేసి, ఇప్పుడేమో చండీయాగం అంటున్నారని పేర్కొన్నారు. గురువారం నల్లగొండలో గుత్తా సుఖేందర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... వ్యక్తిగత ఇష్టాల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేయటం బాధాకరమని ఆయన అన్నారు. సహారా, ఈఎస్ఐ కేసుల్లో సీబీఐ దర్యాప్తు నుంచి బయట పడటానికేనా చండీయాగం అని కేసీఆర్‌ను గుత్తా సూటిగా ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాలో కాలువల షట్టర్లను మూసివేసి సాగర్ నీటిని ఖమ్మం జిల్లాకు తరలించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. నీరు అవసరమైతే షట్టర్లు ఎత్తుకోవాలని గుత్తా ప్రజలకు సూచించారు. జిల్లా మంత్రి చెప్పినా సాగర్ అధికారులు మాట వినటం లేదని అంతా అనుకుంటున్నారని... అలాంటప్పుడు సదరు మంత్రి ఎందుకని ఎంపీ గుత్తా నిలదీశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ పర్యటన ముగించుకుని బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులతో కూడా ఆయన భేటీ అయ్యారు. అయితే గతంలో కేంద్ర కార్మిక మంత్రిగా కేసీఆర్...ఈఎస్ఐ భవనాల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ కేసుల నుంచి బయటపడేందుకే కేసీఆర్ ఢిల్లీ పర్యటన అని ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. -
మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యటనలో దొంగల హల్చల్
హాలియా : మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు గురువారం వచ్చిన రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి కార్యక్రమంలో జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు. తిరుమలగిరి గ్రామంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి భూమిపూజ కార్యక్రమంలో బీజీగా ఉండగా, మండల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకుల ఆసక్తిగా గమనించారు. మంత్రి పర్యటన సందర్భంగా గట్టి బందోబస్తు నిర్వహించేందుకు పోలీసులు అక్కడ ఉండగానే జేబు దొంగలు తమ పని కానిచ్చారు. సుమారు రూ.18,500 కాజేశారు. స్థానికులు దుర్గారావు జేబులో రూ.7500, రమేశ్ దగ్గర రూ.8000, వీఆర్ఏ సత్రశాల నర్సింహా వద్ద రూ.3000, ఇరిగి నాగయ్య జేబులో రూ.200లు కాజేశారు. తమ జేబుకు చిల్ల్లుపడటంతో బాధితులు లబోదిబోమన్నారు. -
నన్ను విమర్శించే నైతిక హక్కు బీజేపీకి లేదు
నల్లగొండ : ‘నేను మతత్వ వాదిని కాదు.. సెక్యులర్ వాదిని.. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని.. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశా.. పార్టీలకతీతంగా పనిచేస్తున్నా.. ఎన్నికలప్పుడు పార్టీలు.. ఆ తర్వాత కార్యక్రమం అంతా కూడా అభివృద్ధి పైనే’ అని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల బీజేపీ నాయకులు జిల్లా పర్యటనలో భాగంగా పార్లమెంట్ సమావేశాలను కాంగ్రెస్ సభ్యులు అడ్డుకుంటున్నారని.. ఎంపీ గుత్తా అభివృద్ధి చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మణ్ చేసిన విమర్శలపై గుత్తా ఫైర్ అయ్యారు. గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. జిల్లా బీజేపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. 2009 ఎన్నికల్లో తన పై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారనే సంగతి విస్మరించరాదన్నారు. తన మీద మాట్లాడే వారిని ప్రజలే అసహ్యించుకుంటున్నారన్నారు. ఎంపీగా ఇన్నేళ్ల పదవీ కాలంలో జిల్లాకు సంబంధించినంత వరకు కోట్ల రూపాయాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. 15వ లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీగా ఉండి కూడా తెలంగాణ సాధన కోసం పార్టీకి వ్యతిరేకంగా తన గొంతు వినిపించి రెండు సార్లు సస్పెండ్ అయిన సంగతి బీజేపీ నేతలుమరిచి పోరాదన్నారు. 14 మాసాల కాలంలో బీజేసీ చేసింది ఏమిటి..? మాటలు తప్ప చేతల్లేవు.. ? ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటిస్తూ దేశాభివృద్ధి గురించి పట్టించుకోవడం మానేశారన్నారు. సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మునాసు వెంకన్న, మాజీ జెడ్పీటీసీ కొండేటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
నన్ను ఎవరూ ఆహ్వానించలేదు
- గ్రామజ్యోతి కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ప్రాతినిధ్యమే లేదు - ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్లగొండ : ప్రభుత్వ ఆర్భాటంగా ప్రవేశపెట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించలేదని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. 14 తేదీన మంత్రి జగదీశ్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో తాము ఇచ్చిన సలహాలు, సూచనలను ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం ఆగమేఘాల మీద జీఓలు జారీ చేసి కార్యక్రమాన్ని అమలు చేస్తుందని ఆ రోపించారు. సోమవారం నల్లగొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి సమీక్షలో కేవలం గ్రామాలను దత్తత తీసుకోవాలని చెప్పారే తప్పా నిధులు, విధుల విషయం లో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. ఎంపీ హోదాలో గతంలోనే తాను ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నానని కాబట్టి దాని అభివృద్ధి పైనే దృష్టి సారిస్తానని చెప్పారు. గ్రామజ్యోతి కార్యక్రమానికి తనను ఎవ రూ ఆహ్వానించలేదు కాబట్టి ఎక్కడా తాను పాల్గొనలేదని ఓ ప్రశ్నకు ఎంపీ బదులిచ్చారు. పార్టీలకతీతంగా చేపట్టాల్సిన గ్రామజ్యోతిని అందుకు భిన్నంగా నిర్వహిస్తున్నారన్నారు. గ్రామ కమిటీ ల్లో టీఆర్ఎస్ నాయకులనే సభ్యులుగా నియమిస్తున్నారని చెప్పారు.గ్రామజ్యో తి కార్యక్రమానికి నయాపైసా విడుదల చేయలేదన్నారు. ప్రజలను మభ్యపెట్టకుండా ప్రభుత్వం కళ్లు తెరిచి వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ పాశం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముక్కు నేలకు రాస్తా
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన రెండు పడక గదుల ఇళ్లు ఎక్కడైనా నిర్మించినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇవి పత్రికల్లోనే కనిపిస్తున్నాయి తప్ప.. ఆచరణలో శూన్యమన్నారు. అవినీతి జరిగిందన్న సాకుతో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం నిలిపేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇందిరమ్మ కాలనీలో చేపట్టిన మౌలిక సదుపాయాలకు చెల్లించాల్సిన బిల్లులు కూడా ఆపేశారని తెలిపారు. దీంతో చిలుకూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫోన్లో ఎస్ఎంఎస్ పంపాడన్నారు. -
'గ్రామజ్యోతి'తో పైసా ఉపయోగం లేదు: ఎంపీ గుత్తా
నల్లగొండ: టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన గ్రామజ్యోతి పథకంతో గ్రామాలకు ఎలాంటి ఉపయోగం ఉండదని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార ఆర్భాటానికే తప్ప ఈ పథకానికి పైసా విదిల్చేది ఉండదని విమర్శించారు. సోమవారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడిన గుత్తా.. గ్రామజ్యోతి పథకానికి సరైన ప్రణాళిక లేదన్నారు. పథకంలో ఎంపీటీసీ, జెడ్సీటీసీలను భాగస్వామ్యులు చేయకపోవడం తగదన్నారు. జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం అందించే నిధులే తప్ప గ్రామజ్యోతి కోసం ప్రత్యేకంగా ఒక్క పైసా కేటాయించడంలేదని వివరించారు. గతంలో నిర్వహించిన సమగ్ర సర్వే, మన ఊరు- మన ప్రణాళికలు చెత్తబుట్టకే పరిమితమయ్యాయన్నారు. -
'కేజీ టు పీజీ ఆంగ్లవిద్య అమలు ఏమైంది?'
నల్లగొండ : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా విద్యారంగానికి సంబంధించి ఇచ్చిన హామీలను ఆచరణలోకి తీసుకరాకపోవడం పట్ల ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతామని చెప్పిన సీఎం కేసీఆర్ ఆ దిశగా ఎలాంటి కార్యచరణ ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఆంగ్ల మాధ్యమం అమలవుతున్న మోడల్ స్కూల్స్ భవనాలకు సంబంధించి నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపేశారని అన్నారు. కేజీబీవీ స్కూ ల్స్‌లో ప్రహరీగోడలు నిర్మించినా.. వాటికి ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో 11 యూనివర్సిటీలకు పాలకమండళ్లు నియమించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. ఇదే విషయమై ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసినప్పుడు ప్రశ్నించానని చెప్పారు. మోడల్ స్కూల్స్ కు నిధులు విడుదల చేయాలని అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి, ప్రస్తుత మంత్రి కడియం శ్రీహరికి లేఖ రాసినట్లు తెలిపారు. -
కేబినెట్ హోదాలు రాజ్యాంగ విరుద్ధం
* హైకోర్టులో ఎంపీ గుత్తా పిల్ * సలహాదారులు, ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లకు ఆ హోదా ఉపసంహరించాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారులు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లకు కేబినెట్ హోదా కల్పించడం సరికాదని.. వెంటనే ఆ హోదాలను ఉపసంహరించుకునేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ సీఎస్‌తో పాటు సాధారణ పరిపాలన, యువజన సర్వీసులు, సాంస్కృతిక, సాంఘిక సంక్షేమశాఖల ముఖ్య కార్యదర్శులను, సలహాదారులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. వీరితోపాటు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు ఎస్.వేణుగోపాలచారి, రామచంద్రుడు తేజావత్, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు, ఎస్సీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పిడమర్తి రవి, తెలంగాణ ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సాంస్కృతిక సారథి చైర్మన్ బాలకిషన్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణలను కూడా ప్రతివాదులుగా చేర్చారు. మంత్రిమండలితో సంబంధం లేని వ్యక్తులకు కేబినెట్ హోదా ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని గుత్తా తన పిటిషన్లో పేర్కొన్నారు. ఖజానాకు భారం.. కేబినెట్ హోదా కలిగిన వ్యక్తులకు పే స్కేల్, ఉచిత గృహ వసతి, వైద్య సదుపాయాలు, సెక్రటేరియల్ స్టాఫ్, వాహనభత్యం, టెలిఫోన్, పన్ను మినహాయిపులు, ఎస్కార్ట్ తదితర సౌకర్యాలు ఉంటాయని, ఇవన్నీ రాష్ట్ర ఖజానాపై భారం మోపుతాయని గుత్తా తన పిటిషన్లో వివరించారు. కేబినెట్ అన్న పదం కేవలం మంత్రులకు మాత్రమే వర్తిస్తుందని, రాజ్యాంగంలోని అధికరణ 164(1) ప్రకారం మొత్తం సభ్యుల్లో కేబినెట్ మంత్రుల సంఖ్య 15 శాతానికి మించకూడదని పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు నచ్చిన వ్యక్తులకు కేబినెట్ హోదా కల్పించవచ్చని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని.. సలహాదారులు, ప్రత్యేక ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లకు కల్పించిన కేబినెట్ హోదాను ఉపసంహరించుకునే ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించే అవకాశం ఉంది. -
వారికి 'కేబినెట్ హోదా' తగదు!
హైదరాబాద్ :ప్రభుత్వ సలహాదారులు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లకు కేబినెట్ హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ గురువారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. వీరికి కల్పించిన కేబినెట్ హోదాను వెంటనే ఉపసంహరించుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మంత్రిమండలితో సంబంధం లేని వ్యక్తులకు కేబినెట్ హోదా ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని సుఖేందర్‌రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. కేబినెట్ హోదాను ఎవరికి పడితే వారికి పాలకుల ఇష్టానుసారం ఇవ్వడానికి వీల్లేదని ఎంపీ గుత్తా తెలిపారు. కేబినెట్ హోదా కలిగిన వ్యక్తులకు పలు సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని, దాంతో ఖజానాపై భారం పడుతుందని వివరించారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, సలహాదారులు, ప్రత్యేక ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లకు కల్పించిన కేబినెట్ హోదాను ఉపసంహరించుకునే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించే అవకాశం ఉంది. -
కందకాలపై అవగాహన అవసరం
రైతులకు ఎంపీ గుత్తా పిలుపు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కందకాల విషయంలో రైతులందరూ అవగాహన పెంచుకోవాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లాలో ‘సాక్షి’, తెలంగాణ విశ్రాంతి ఇంజనీర్ల వేదిక ఆధ్వర్యంలో రెండో రోజు గురువారం తిప్పర్తి, తుంగతుర్తి మండల కేంద్రాల్లో రైతు అవగాహన సదస్సులు జరిగాయి. తిప్పర్తిలోని టీఎన్నార్ ఫంక్షన్‌హాలులో జరిగిన సదస్సులో గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రతి విషయానికి రైతులు ప్రభుత్వాలపై ఆధారపడాల్సిన పనిలేదన్నారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే కందకాలను రైతులే తమ పొలాల్లో స్వయంగా తవ్వించుకుని భూగర్భ జలమట్టాలను పెంచుకోవాలని కోరారు. రైతులంతా తమకు అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ‘ నా మామిడి తోటలో నీళ్లు లేవు.. ఎండిపోతుందనే భయంతో రెండు ట్యాంకర్లు పెట్టి నీళ్లు తెచ్చి పోస్తున్నాం. కందకాలు తీయిస్తే నీటి సమస్య ఉండేది కాదు. ఇప్పుడు మీకు వీలుంటే చిట్యాల వరకు వచ్చి నా పొలంలో కందకాలు తీసి వెళ్లండి.’ అని గుత్తా కోరారు. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక అధ్యక్షుడు సంగెం చంద్రమౌళి మాట్లాడుతూ కందకాల ఏర్పాటు ద్వారా రెండేళ్ల వరుస కరువు వచ్చినా నీటికి ఇబ్బంది లేకుండా పంటలు పండించుకోవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా కందకాలు ఎలా తవ్వుకోవాలనే దానిపై ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సదస్సు సమన్వయకర్త, సాక్షి సాగుబడి డెస్క్ ఇంచార్జి పంతంగి రాంబాబు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డెరైక్టర్ కె. దామోదర్‌రెడ్డి, తిప్పర్తి ఎంపీపీ పాశం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కందకం అంటే... భూమిలో వాలుగా ప్రతి వంద మీటర్లకు ఒక మీటరు లోతు, అరమీటరు వెడల్పుతో సమతలంగా గోతిని తవ్వడాన్ని కందకం అంటారు. దీని వల్ల చేనులో కురిసిన వాన నీరంతా కందకాల ద్వారా భూమిలో ఇంకి భూగర్భజలాలు అభివృద్ధి అవుతాయి. అంటే భూగర్భాన ఒక చెరువు ఏర్పడుతుంది. -
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టం
- ప్రధానికి ఎంపీ ‘గుత్తా’ లేఖ నల్లగొండ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను చేస్తున్న ఈ వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల జరిగే లాభనష్టాలను వివరిస్తూ ప్రధాని నరేంద్రమోదీకి రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో అక్షరాస్యత, పరిశ్రమల రంగాల్లో ముందంజలో ఉందన్నారు. కృష్ణా, గోదావరి డెల్టాలు కూడా ఏపీలో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కంపెనీలు ఏపీకి తర లించారని లేఖలో పేర్కొన్నారు. -
గుత్తా సుఖేందర్ రెడ్డికి మాతృవియోగం
హైదరాబాద్: నల్గొండ కాంగ్రెస్ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి సరస్వతమ్మ ఆస్పత్రిలో చికిత్స సోమవారం కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సరస్వతమ్మ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం స్వస్థలమైన చిట్యాల మండలం ఊరమడ్లలో అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు గుత్తాకు పలువురు నేతలు సంతాపం తెలిపారు. -
‘బస్వాపురం’సామర్థ్యం పెంచాలి
నల్లగొండ రూరల్ : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తిప్పారం రిజర్వాయర్ నుంచి బస్వాపురం రిజర్వాయర్ వరకు గ్రావిటీ ద్వారా నీరందిస్తేనే క్షామ పీడిత ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేఇ 70 టీఎంసీల నీరు కేటాయించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు రాసిన లేఖను స్థానికంగా ఆయన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రారంభించినట్లు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. 16 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టును రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తూ ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో ఆలేరు, భువనగిరి, మునుగోడు ప్రాంతాల్లో 2 లక్షల 29 వేల 832 ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుందన్నారు. జిల్లాలో సాగునీరు అందించేందుకు రూ. వెయ్యి 82 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వరదలు వచ్చినప్పుడు నది నికర జలాలను జిల్లాలో వినియోగించుకునేందుకు బస్వాపురం రిజర్వాయర్‌ను 10 టీఎంసీలకు పెంచాలన్నారు. ప్రస్తుతం దీని సామర్థ్యం 0.8 టీఎంసీలు మాత్రమే ఉందన్నారు. పంటలకు నీరందించేందుకు 120 రోజులు అవసరం ఉంటుందని, కాగా 90 రోజుల వరకే నిర్ధారించడం వల్ల పంటలకు నీరందదన్నారు. ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టులో 16 ప్యాకేజీలో పనులు ప్రారంభమయ్యయన్నారు. సిద్ధిపేటలోని గజ్వేల్ తరహాలోనే ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలన్నారు. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ - 2 కింద కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే మూసీ వరకు కాల్వలను తవ్వించామన్నారు. మూసీకింద 2 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. దీని ద్వారా కొన్ని చెర్వులను మాత్రమే నింపామన్నారు. మిడ్ మానేరు బ్యాలెన్సింగ్ పనులను పూర్తి చేస్తే కొంత సాగునీరు అందుతుందన్నారు. మొత్తం జిల్లాలో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 70 టీఎంసీలు కేటాయించాలని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ హయంలోనే ఎస్‌ఈడబ్ల్యు, జీఎన్‌పీ, డీఎల్ఆర్కు అవార్డు చేసినట్లు గుర్తు చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించేందుకు 70 టీఎంసీల నికర జలాలను కేటాయించాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఏఎంఆర్‌పీలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 30 టీఎంసీలు, నక్కలగండి కింద 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 30 టీఎంసీలు, బి.వెల్లెంల ప్రాజెక్టు కింద లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు 10 టీఎంసీల చొప్పున మొత్తం 70 టీఎంసీల నీటిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. శ్రీశైలం సొరంగమార్గం ద్వారా ఎక్కువ నీళ్లను తీసుకోవడం ద్వారానే జిల్లాలో పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్య, కరువు దుర్భిక్షాన్ని అధిగమించవచ్చన్నారు. అందుకు 90 రోజుల నదీ నికర జలాలను కేటాయించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, కాంగ్రెస్ నాయకులు తుమ్మల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. -
కేటీఆర్ ...నోరు పారేసుకోవద్దు
హైదరాబాద్: తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్‌ను నోరు పారేసుకోవద్దని, వ్యక్తిగత దూషణలకు దిగవద్దని ఆయన సూచించారు. కేసీఆర్ సర్కార్‌కు కాంగ్రెస్ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. అయినా కాంగ్రెస్‌పై మంత్రులు ఎదురుదాడి చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ హయాంలో అసలు అభివృద్ధే జరగలేదని, నేతలంతా ఒళ్లు పెంచారని మంత్రి కేటీఆర్ సంస్కారం లేకుండా మాట్లాడారన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా అదనంగా గ్రామాలకు ఒక్క చుక్కతాగునీరు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉండేలా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ చేపట్టాలని సూచించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ నుంచే వలసలు ప్రోత్సహించడం కేసీఆర్‌కే సాపమన్నారు. అన్నం పెట్టిన తల్లి సోనియాకు కేసీఆర్ ద్రోహం చేస్తున్నారని గుత్తా విమర్శించారు. -
నిసిగ్గుగా ఫిరాయింపులు: ఎంపీ గుత్తా
న్యూఢిల్లీ: చంద్రబాబు, కేసీఆర్ నిసిగ్గుగా ఫిరాయింపులు పోత్సహిస్తున్నారని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ప్రమాణ స్వీకారానికి ముందే ఇతర పార్టీల ఎంపీలపై టీడీపీ, టీఆర్ఎస్ కం డువాలు కప్పుతున్నారని దుయ్యబట్టారు. ఇద్దరు సీఎంలు బాధపడే రోజు ఏదో ఒకనాడు వస్తుందని వ్యాఖ్యానించారు. పదవులకు రాజీనామా చేసిన తర్వాతే పార్టీలు మారాలని అన్నారు. -
నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు
{పారంభించనున్న ఏఐసీసీ దూత రామచంద్రకుంతియా డిండిలోని ప్రైవేట్ ఫంక్షన్హాల్లో కార్యక్రమం హాజరుకానున్న రాష్ట్ర, జిల్లా నేతలు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లాలో ఆదివారం ప్రారంభంకానుంది. తెలంగాణ కాంగ్రెస్ పిలుపుమేరకు పార్టీలో యువరక్తాన్ని నింపాలన్న లక్ష్యంతో సభ్యత్వ నమోదు చేపట్టనున్నారు. జిల్లాలో తొలిసారిగా దేవ రకొండ డివిజన్ పరిధిలోని డిండి మండల కేంద్రంలోని ఫంక్షన్హాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ దూత రామచంద్ర కుంతియా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ పక్ష నేత కుందూరు జానారెడ్డి, తెలంగాణ వర్కి ంగ్ ప్రెసిండెంట్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, జె డ్పీ చైర్మన్ నేనా వత్ బాలునాయక్, డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్ రెడ్డి తో పాటు ఇతర పార్టీ సీనియర్ నాయకులు హాజరుకానున్నారు. తొలి రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు డిండిలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కార్యక ర్తలు, నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. శిక్షణ శిబిరాలు నిర్వహించాలని నిర్ణయం కొత్త సభ్యత్వాలతో పాటు, నియోజకవర్గాల వారీగా పార్టీ శిక్షణ శిబిరాలు కూడా నిర్వహించాలని నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో జిల్లా పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. దీంతో పాటు క్షేత్రస్థాయిలో గ్రామ, మండల శాఖలు కూడా టీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా తయారైంది. అదీగాక పార్టీ జిల్లా బాధ్యతలు చూస్తున్న నేతలు సైతం వివిధ కార్యక్రమాలకు గైర్హాజరుకావడం పట్ల పార్టీలో పలువురు సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇందిరా, రాజీవ్ గాంధీ వర్ధంతులు, చాచా నెహ్రూ జయంతి వేడుకులకు కూడా జిల్లా పార్టీ నాయకులు దూరంగా ఉన్నారు. ఇటీవల కాలంలో పార్టీ పెద్దలు ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకోవడం పరిపాటిగా మారింది. దీంతో రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ పార్టీలో ఇంటిలొల్లి తీవ్రంకావడంతో పార్టీ ఉనికికే ముప్పు ఏర్పడింది. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగతా వారంతా తమ నియోజకవర్గం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చేపడతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏ మేరకు ముందుకు సాగుతుందో వేచి చూడాలి. -
సాగర్ విద్యుదుత్పత్తి ఆపేయాలని KCRకు MP గుత్తా లేఖ
-
‘నక్కలగండి’పై రాజకీయ దుమారం
- మంత్రి, ఎంపీ గుత్తా మధ్య వాగ్వాదం - కింద కూర్చొని నిరసన తెలిపిన జెడ్పీటీసీలు - గత ప్రభుత్వ హయాంలోని మంత్రులు, ఎంపీల ఇళ్ల వద్ద ధర్నా చేయండి : మంత్రి - సభలో తీవ్ర గందరగోళం రాంనగర్ : బీఆర్జీఎఫ్ పనుల ఆమోదం కోసం బుధవారం ఉదయాధిత్య భవన్లో నిర్వహించిన జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం రాజకీయ దుమారానికి వేదికైంది. నక్కలగండి ప్రాజెక్టుపై అధికార పక్షం, విపక్ష పార్టీల సభ్యులు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకోవడంతో సమావేశంలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. సమావేశం ప్రారంభమైన అరగంటకు విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి వచ్చారు. నక్కలగండి ప్రాజెక్డు కోసం అప్పటికే మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు కింద కూర్చోని నిరసన తెలిపారు. ‘కింద ఎందుకు కూర్చున్నారు. సీట్లలో కూర్చోండి’ అని మంత్రి వారిని కోరారు. నక్కలగండి ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్నా చేయాలనుకుంటే గత ప్రభుత్వంలో పని చేసిన మంత్రులు, ఎంపీల ఇళ్ల వద్ద చేయాలన్నారు. ఇది ఎవరు చేయిస్తున్నారో తెలుసని, తమకూ రాజకీయం చేయడం వచ్చని అన్నారు. ‘అవసరమైతే మా వాళ్లూ వచ్చి కింద కూర్చుంటారు. మేమేమీ భయపడం’ అని మంత్రి ఘూటుగా మాట్లాడారు. ‘నక్కలగండి ప్రాజెక్టును సందర్శించి దాని చరిత్ర తీస్తాం, దానికి ఎవరు బాధ్యులో కూడా చెబుతాం’ అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వాఖ్యలకు ఎంపీ గుత్తా కూడా తీవ్రంగానే స్పందించారు. మీరు ఇటీవల దేవరకొండ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకపోవడం వల్లే ప్రజల్లో అపోహ నెలకొంది. మంత్రిగా ప్రాజెక్టుపై సవివరమైన సమధానం చెప్పాల్సిన బాధ్యత ఉందనే విషయం మరువరాదన్నారు. మంత్రి జోక్యం చేసుకుంటూ నక్కలగండి ప్రాజెక్టుపై తాను అనని మాటలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 60 ఏళ్లుగా జిల్లా అభివృద్ధికి పని చేయని వాళ్లు తమపై తప్పుడు ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో ఎంపీ గుత్తా జోక్యం చేసుకుంటూ పదే పదే 60 ఏళ్లు అనడం, వాడు, వీడు అంటూ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడడం తగదని హెచ్చరించారు. సభలో తీవ్రగందరగోళం చోటుచేసుకోవడంతో సభ్యులు కూర్చోవాలంటూ జెడ్పీ చైర్మన్ పదే పదే కోరారు. వాడు అని ఉంటే ఉపసంహరించుకోవడానికి అభ్యంతరం లేదని మంత్రి పేర్కొన్నారు. నక్కల గండిని రద్దు చేస్తానని తాను చెప్పలేదని తెలిపారు. ఎవరితో నిరసన చేయించాల్సిన అవసరం తమకు లేదని గుత్తా పేర్కొన్నారు. అందరం కలిసి జిల్లా సమగ్రభివృద్ధికి కలిసి కట్టుగా పని చేద్దామని ఇరువురు నాయకులు అనడంతో సమావేశంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. -
ఒక్కసారే గేట్లెత్తిమొనగాళ్లమనుకుంటే ఎలా?
ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్లగొండ రూరల్ : జిల్లాలోని ప్రాజెక్టుల గేట్లెత్తి తమకు చేతులు నొప్పి పుట్టాయని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ నేతలు ఒక్కసారి గేట్లెత్తి మొనగాళ్లమనుకుంటే ఎలా అని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సాగర్‌లో డెడ్ స్టోరేజీ లెవల్లో నీరున్నప్పటికీ తాము ఏఎమ్మార్పీకి, సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల చేశామన్నారు. శ్రీశైలం సొరంగ మార్గం పూర్తయితే 6వేల కూసెక్కుల నీరు జిల్లాకు వస్తుందని, ఇందులో 4వేల క్యూసెక్కులు గ్రావిటీ ద్వారా, మరో 2వేల క్యూసెక్కులు డిండి దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించవచ్చన్నారు. సొరంగమార్గం విషయమై దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ జెడ్పీ సమావేశంలో ప్రశ్నిస్తే పనికిమాలిన ప్రాజెక్టు అని..పక్కకు పెట్టేస్తామని చెప్పడం మంత్రి జగదీష్‌రెడ్డికి ఉన్న అవగాహన అర్థమవుతుందని పేర్కొన్నారు. సొరంగ మార్గాన్ని పూర్తిచేసేందుకు దృష్టి సారించాలన్నారు. తాము అనేకసార్లు నీటివిడుదల చేసేందుకు గేట్లు తిప్పి అలసిపోయామన్నారు. కాంగ్రెస్ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన మంత్రి పదవిని త్యాగం చేశారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయకపోతే ప్రజలు రాళ్లతో కొడతారని హెచ్చరించారు. 1983 నుంచి 2000 వరకు కేసీఆర్ ఆంధ్రాపార్టీ కింద పనిచేయలేదా, 2004లో కేసీఆర్‌లో మంత్రిగా ఉండలేదా, ఇప్పుడున్న కొందరు నేతలు వైఎస్ఆర్ కింద మంత్రులుగా కొనసాగలేదా అని ప్రశ్నించారు. తానుగ్రామస్థాయి నుంచే నాయకుడిగా ఎదిగినప్పటికీ అనేక విషయాలను ఇప్పటికీ తెలుసుకునేందుకే ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. జేఏసీ పుట్టింది జానారెడ్డి ఇంట్లోనని, తెలంగాణ ఉద్యమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలకపోరాటం చేశారన్నారు. ఇటీవల గెలిసిన టీఆర్ఎస్ నాయకులు ఉద్యమంలో వెనుకనుంచి నాలుగు రాళ్లు వేశారో లేదో వారికే తెలియాలన్నారు. అలాంటి వారికి తమను విమర్శించేస్థాయి లేదన్నారు. టీఆర్ఎస్లో ఎందుకు చేరుతున్నారో.. వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో ఎందుకు చేరుతున్నారో అర్థం కావడం లేదని, ఆ పార్టీలో మొదటినుంచి పనిచేసిన వారే బాధపడుతున్నారని గుత్తా అన్నారు. టీఆర్ఎస్ అంటే ఒక హిస్టీరియా లాగా వ్యాపించిందన్నారు. ఆదరించి పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత లభించడం లేదని, మీరెందుకు వస్తున్నారంటూ ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్ తదితరులు వున్నారు. -
మా వాళ్లు రాజకీయంగా అమరులయ్యారు
నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్య హైదరాబాద్: తెలంగాణ కోసం వందలాది మంది యువకులు ప్రాణత్యాగాలు చేసి అమరవీరులైతే.. అదే అంశంపై పోరాడిన తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీలు రాజకీయంగా అమరులయ్యారని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కె.చంద్రశేఖరరావును అభినందించేందుకు గురువారం అసెంబ్లీ లాబీకి వచ్చిన సందర్భంగా గుత్తా... విలేకర్లతో ముచ్చటించారు. కాంగ్రెస్‌పై కక్షతో ప్రజలు దేశవ్యాప్తంగా పార్టీని ఓడిస్తే తెలంగాణ రాష్ట్రమిచ్చినా కనికరం లేకుండా ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలను సైతం ఓడించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం అమరులైన వారు కొత్త రాష్ట్రాన్ని చూడలేకపోయినా ఆ అదృష్టం తమ పార్టీ నేతలకు కలిగిందన్నారు. అంతకుముందు గుత్తా సీఎంను కలిసి జిల్లా సమస్యలపై వినతి పత్రం అందజేశారు. -
నామినేషన్ల కోలాహలం
నాలుగో రోజు 29 నామినేషన్లు లోక్‌సభకు 4, అసెంబ్లీ స్థానాలకు 25 దాఖలు నల్లగొండకు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మిర్యాలగూడ అసెంబ్లీకి తూడి సాక్షి, నల్లగొండ, జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నాలుగో రోజు శనివారం మొత్తం 29 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాలకు రెండుచొప్పున, 8 అసెంబ్లీ స్థానాలకు 25 చొప్పున ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. భువనగిరి, నాగార్జునసాగర్, దేవరకొండ, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి ఒక్క నామినేషన్ కూడా రాలేదు. అత్యధికంగా నల్లగొండ అసెంబ్లీ స్థానానికి 6 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి 7, టీడీపీ, టీఆర్ఎస్ నుంచి 3 చొప్పున, వైఎస్సార్ కాంగ్రెస్, భారత పిరమిడ్ పార్టీల నుంచి ఒక్కొక్కటి చొప్పున, స్వతంత్రులు 10మంది నామినేషన్లు వేశారు. ఎంపీ గుత్తా, డీసీసీ అధ్యక్షుడు తూడి.. నల్లగొండ లోక్‌సభ స్థానానికి సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి రెండు సెట్ల నామినేషన్లను సమర్పిం చారు. అదేవిధంగా భువనగిరి లోక్‌సభ స్థానానికి బీఎస్పీ అభ్యర్థిగా అర్వపల్లి అంబటి రెండు సెట్ల నా మినేషన్లు వేశారు. మిర్యాలగూడ అసెంబ్లీ స్థానానికి డీసీసీ జిల్లా అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా నకిరేకల్ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రెండుసెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. -
నాటి దేవరకొండ జెడ్పీటీసీలే.. నేటి ఎంపీ.. ఎమ్మెల్యే
దేవరకొండ జెడ్పీటీసీ సభ్యులుగా విజయం సాధించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి నేడు నల్లగొండ ఎంపీగా కొనసాగుతుండగా, బాలూనాయక్ దేవరకొండ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గుత్తా 1995లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో దేవరకొండ నుంచి విజయం సాధించారు. బాలూనాయక్ ఇదే స్థానం నుంచి 2001లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. కీలక పదవుల్లో ఉండి జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఎంపీ గుత్తా సుఖేం దర్‌రెడ్డి, ఎమ్మెల్యే బాలూనాయక్‌లకు రాజకీయ భవిష్యత్నిచ్చింది దేవరకొండ అనే విషయం అక్షర సత్యం. రాజకీయ అరంగేట్రంతోనే ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలైనప్పటికీ ఆ తర్వాత అక్కడి ప్రజలు వారిని అక్కున చేర్చుకున్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో భుజాలకెత్తుకున్నారు. నాటి నుంచి వెనుదిరిగి చూడకుండా ఆ ఇద్దరి నేతలు తమ రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నార కంచుకోటలో పాగా వేసిన బాలూనాయక్ దేవరకొండ మండలం ముదిగొండ గ్రామానికి చెందిన నేనావత్ బాలూనాయక్ రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో ఎంపీటీసీ సభ్యుడిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఓటమితో కుంగిపోకుండా 2001లో జరిగిన ఎన్నికల్లో జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసి విజయం సాధించారు. 2006 వరకు ఆ పదవిలో కొనసాగారు. అనంతరం 2009 వరకు దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకొండ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి అప్పటి వరకు సీపీఐకి కంచుకోటగా ఉన్న దేవరకొండలో పాగా వేశారు. ఐదేళ్ల పాలనలో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. తద్వారా తన స్థానాన్ని పదిలపర్చుకున్నారు. గల్లీ నుంచి ఢిల్లీకి ‘గుత్తా’ జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒకప్పుడు స్వగ్రామంలో వార్డు సభ్యుడిగా పోటీ చేసి ఓటమి పాలైనవ్యక్తే. ఓటమి విజయానికి నాం దిగా భావించి ఆ తర్వాత 1995లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో దేవరకొండ స్థానం నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. అనంతరం ఏపీ మదర్ డెయిరీ చైర్మనగా ఎంపికయ్యారు. 1999 సార్వత్రిక ఎన్నిక ల్లో తెలుగుదేశం పార్టీ నుంచి నల్లగొండ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. తిరిగి 2009 ఎన్నికల్లో మిర్యాలగూడ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన విషయంలో పార్లమెంటులో తన వాణిని గట్టిగా వినిపించి తెలంగాణ ప్రజల దృష్టిని ఆకర్షించారు. తనకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన దేవరకొండ అంటే ఎంతో మక్కువని తరుచూ వ్యాఖ్యానిస్తుండటం ఈ ప్రాంతంపై, ఇక్కడి ప్రజలపై ఆయనకున్న అభిమానాన్ని తెలియజేస్తోంది. -
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యం :ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి
కొండమల్లెపల్ల్లి, న్యూస్‌లైన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయిందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఆపలేరన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరిగిన మాట వాస్తవమే అన్నారు. గతంలో బీజేపీని, నరేంద్రమోడీని విమర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పుడు వారితో పొత్తుకు ప్రయత్నించడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం పదవికోసమే ఆయన వెంపర్లాడుతున్నారని పేర్కొన్నారు. సొనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలునాయక్, కాంగ్రెస్ నాయకులు మేకల శ్రీను, కేసాని లింగారెడ్డి, సాయి, యాదగిరి పాల్గొన్నారు. -
రూ.350 కోట్లతో మెడికల్ కాలేజీ
అన్నెపర్తి (నల్లగొండ రూరల్), న్యూస్‌లైన్ :జిల్లా కేంద్రంలో రూ.350 కోట్లతో మెడికల్ కాలేజీ, రూ.150 కోట్లతో ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం అన్నెపర్తి బెటాలియన్ వద్ద రూ.15 కోట్లతో చేపట్టిన కృష్ణా తాగునీటి పనులకు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ పూల రవీందర్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను మంత్రి పదవికి రాజీనామా చేయడంతో అభివృద్ధి పనులు ఆగిపోయాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా అభివృద్ధిలో పునరంకితమవుతామన్నారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం పానగల్లు నుంచి నార్కట్‌పల్లి వరకు ప్రత్యేక కృష్ణా పైప్‌లైన్ వేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో శ్రీశైలం సొరంగమార్గం, బ్రహ్మణవెల్లెంల ప్రాజెక్టుల మంజూరయ్యాయని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో నార్కట్‌పల్లి మండలంలోని ఆమ్మనబోలు వరకు తాగునీరు అందిస్తామన్నారు. తెలంగాణ కోసం తనతోపాటు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు ఎంతో పోరాటం చేశారన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను అడ్డుకునేందుకు సీఎంతో సహ సీమాంధ్ర మంత్రులు ఐక్యంగా పోరాటాలు చేస్తున్నారని, ఈ ప్రాంత మంత్రులు క్యాబినేట్ నోట్ పెట్టే విధంగా ఒత్తిడి చేయాలన్నారు. సీఎంను తెలంగాణ మంత్రులు నిలదీయాలన్నారు. ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ ఒక పక్క అభివృద్ధి, మరో వైపు తెలంగాణ ఉద్యమంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్యలు కీలకపాత్ర వహిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్య,జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, అన్నెపర్తి సర్పంచ్ ఎదుళ్ల పుష్పలత, కమాండెంట్ బాబుజీరావు, రేగట్టె నర్సింహారెడ్డి, నాయకులు ఉట్కూరి వెంకట్‌రెడ్డి, తుమ్మల లింగస్వామి యాదవ్, భిక్షంగౌడ్, బోధనపు వెంకట్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, నర్సిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌ను నిందించటం తగదు: గుత్తా
హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీని నిందించటం తగదని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటానికే తెలంగాణ ప్రకటన చేసిందనటం అవాస్తవమన్నారు. విభజన విషయంలో ఇతర పార్టీలు మాటతప్పి కాంగ్రెస్‌ను నిందించటం సరికాదని గుత్తా వ్యాఖ్యానించారు. సిడబ్ల్యూసీ సమావేశం అనంతరం ఓపికతో ఉండాలని అధిష్టానం పెద్దలు చెప్పారని.... అందుకే అప్పటి నుంచి ఓపిగ్గా ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఆగదని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్, నీటి పంపిణీ విషయాలపై ఓ కమిటీ ఏర్పడుతుందన్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో త్వరలో కార్యచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. -
నారా లోకేష్ పందికొక్కా?: ఎంపి గుత్తా
న్యూఢిల్లీ: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ముద్దపప్పు అని విమర్శించిన నేపధ్యంలో ఆయన కొడుకు నారా లోకేష్ పందికొక్కా? అని కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. లోక్‌సభలో తెలుగుదేశం ఎంపీలు బూతు పురాణాన్ని అబ్బించుకున్నారని విమర్శించారు. తెలుగుజాతి గౌరవాన్ని దిగజార్చారని ఆరోపించారు. ఎంపీల ప్రవర్తనపై చంద్రబాబు బహిరంగక్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీలపై అనర్హత వేటువేయాలని స్పీకర్‌కు ఫిర్యాదుచేసినట్లు సుఖేందర్ రెడ్డి చెప్పారు. -
బెటాలియన్ అభివృద్ధికి తోడ్పడతా
సాక్షి, నల్లగొండ :అన్నెపర్తిలోని 12వ బెటాలియన్ అభివృద్ధికి అన్ని విధాలా తన తోడ్పాటునందిస్తానని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రం సమీపంలోని అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో సెంట్రీ పోస్ట్, విచారణ కేంద్రాన్ని ఎంపీ గుత్తా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బెటాలియన్‌లో కమ్యూనిటీ వెల్ఫేర్ సెంటర్ నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ బెటాలియన్‌ను రాష్ట్రంలోకెల్లా మోడల్ బెటాలియన్‌గా తీర్చిదిద్దారని సిబ్బందిని ఆయన ప్రశంసించారు. బెటాలియన్‌లో పనిచేస్తున్న సిబ్బందంతా సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. బెటాలియన్ అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డి ఎంతో సహకరించారని కమాండెంట్ ఎస్ఎన్బీ శేఖర్ బాబూజీ తెలిపారు. ఈ సేవలను ఇకపై కూడా కొనసాగించాలని ఆయన కోరారు. కార్యక్రమం లో అదనపు కమాండెంట్ కేఎన్ బాలా జీ, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణ గౌడ్, గుమ్మల మోహన్‌రెడ్డి, పుష్పలత, భూ పాల్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ముని స్వామి, మోహన్‌రావు, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్‌షాపులు మూసేస్తాం
నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్ :తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేస్తామని మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన స్త్రీశక్తి ఉపాధిహామీ భవనాన్ని శనివారం ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పదవులపై ఆశలేదని, ప్రజాసేవే ముఖ్యమన్నారు. మంత్రి పదవిలో ఉండి ఉంటే బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పూర్తయ్యేదని చెప్పారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతోనే శ్రీశైలం సొరంగ మార్గం చేపట్టినట్లు వివరించారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ మూడవ విడత రచ్చబండలో అర్హులైన వారికి పింఛన్లు, రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పారు. మ ద్యానికి అలవాటు పడి ఎంతో మంది చనిపోతున్నారని, మద్యం మానిపించేందుకు మహిళలు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలవతోనే మహిళలకు ఆర్థిక స్వాలంభన లభించిందన్నారు. మహానేత చేపట్టిన మహిళా సంక్షేమ పథకాలు గర్వించదగినవన్నారు. అనంతరం మహిళా సంఘాలకు మంజూరైన రుణాలు అందజేశా రు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, డ్వామా పీడీ కోటేశ్వర్రావు, మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకనారాయణగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్య, ఉద్యానవనశాఖ ఏడీ బి.బాబు, తహసీల్దార్ కృష్ణారెడ్డి, ఎంపీడీఓ శైలజ పాల్గొన్నారు. -
విహెచ్పై దాడికి సీఎం, బొత్స బాధ్యులు: ఎంపి గుత్తా
నల్గొండ:రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుపై తిరుపతిలో జరిగిన దాడిని ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఖండించారు. ఈ దాడికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలే బాధ్యులని వారు పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నా ప్రభుత్వం ఎటువంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడంలేదని విమర్శించారు. వెంటనే పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. -
సీల్డ్ కవర్ సీఎంవి.. నీకేం తెలుసు?
నల్లగొండ, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ భిక్షతో సీల్డ్ కవర్ సీఎంగా దిగివచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఏమి తెలుసునని రాష్ట్ర విభజనతో సమస్యలు ఉత్పన్నమవుతాయంటూ మాట్లాడుతున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిప్పులు చెరిగారు. శుక్రవారం వారు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి నల్లగొండలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన అధిష్టానమే ఎలాంటి అర్హతలు లేకున్నా సీఎం కుర్చీలో కూర్చోబెట్టిందన్న విషయాన్ని కిరణ్ గుర్తుంచుకోవాలన్నారు. అభూత కల్పనలు, అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే సీఎంది సమన్యాయం, సమతూకమంటూ మాట్లాడే స్థాయి కాదని ఎద్దేవా చేశారు. సొంత చిత్తూరు జిల్లాకే తాగునీరంటూ రూ.700కోట్లు కేటాయించిన ఆయన సమన్యాయమంటూ ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటించిన 9రోజుల తర్వాత తెరపైకి వచ్చి ఉభయ ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచే రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడిన ఆయనకు ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హతలేదన్నారు. ఇంతకాలం తెరవెనుక సీమాంధ్ర ఉద్యమాన్ని పురిగొల్పిన ఆయన తక్షణమే రాజీనామాచేసి ప్రత్యక్ష సీమాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని హితవు పలికారు. తెలంగాణ నిర్ణయానికి వైఎస్ రాజశేఖరరెడ్డి కారణమంటూ మనసులో ఇంతకాలం పెట్టుకున్న అసూయను ఆయనపై రుద్దారంటూ మండిపడ్డారు. 2001లో వైఎస్‌తోనే తెలంగాణవాదం ముందుకొచ్చిందంటే, తెలంగాణవాదం 1969, 1972సంవత్సరాల్లో లేదా అన్ని ప్రశ్నించారు. రెండేళ్ల నుంచి ఏఎమ్మార్పీ ద్వారా తాగునీటికి తప్ప ఒక్క ఎకరానికన్నా అదనపు నీరు ఇచ్చారా, అసలు ఒక్క టీఎంసీకి ఎన్ని ఎకరాలు సాగునీరు పారుతుందో తెలుసా అని ప్రశ్నించారు. రెండున్నరేళ్లు సీఎంగా, ఇరవై ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న కిరణ్‌కు బచావత్ ట్రిబ్యునల్ తెలుసా అని ఎద్దేవా చేశారు. కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ నిర్ణయాన్ని వ్యతిరేకించడం లేదు, స్వాగతించడం లేదని చేసిన వ్యాఖ్యలు దేనికి నిదర్శనమన్నారు. సొంత జిల్లా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మూడో స్థానానికి పరిమితంచేసి ఆయన్ను చిత్తూరు ప్రజలే సీఎంగా పరిగణించడం లేదని ఎద్దేవా చేశారు. వ్యాఖ్యలకు కట్టుబడి వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని, లేదంటే అధిష్టానం వెంటనే బర్తరఫ్ చేసి సమన్యాయం పాటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విషయంలో ఇప్పటికిప్పుడు ఏవేవో సలహాలు, సూచనలు చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి, అలాంటి వారు వెయ్యి మంది వచ్చినా రాష్ట్ర ఏర్పాటు అడ్డుకోలేరని స్పష్టం చేశారు.