తెలంగాణకూ సాయం చేయాల్సిందే
అరుణ్ జైట్లీకి ఎంపీ గుత్తా లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్‌వ్యవస్థీకణ చట్టం ప్రకారం కేంద్రం ఏపీకి ఏవిధంగా ప్రయోజనాలు కల్పిస్త్తోందో అలాగే తెలంగాణకు కూడా కల్పించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి బుధవారం లేఖ రాశారు. తెలంగాణలో కూడా అనేక ఆర్థిక, సామాజిక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని చట్టంలో క్లుప్తంగా ఉన్నట్లు గుర్తుచేశారు. ఏపీతో సమానంగా తెలంగాణకు కేంద్రం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు విభజన, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఎయిమ్స్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని కోరారు.