నల్గొండ: గ్యాంగ్స్టర్ నయీం కేసులో అన్ని విషయాలను సిట్ వెలుగులోకి తెస్తుందని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి వెల్లడించారు. గురువారం నల్గొండలో నయిం అంశంపై గుత్తా సుఖేందర్రెడ్డి స్పందించారు. అరాచక శక్తులను సీఎం కేసీఆర్ వదలరని గుత్తా స్పష్టం చేశారు.
పులిచింతల ప్రాజెక్టుకు అందాల్సిన రూ. 115 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ముంపు గ్రామాల ప్రజల పునరావాస ప్యాకేజీ అందక ఇబ్బందిపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.