సాక్షి, నల్లగొండ: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉందన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీలో క్షేత్రస్థాయిలో నిర్మాణ లోపం ఉందని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కాగా, గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో సీఎం రేవంత్ పాలన బాగానే ఉన్నట్టు ప్రజలు భావిస్తున్నారు. ఏ పార్టీకి సంబంధంలేని రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నాను. ఏ పార్టీ కండువా కప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు సీఎం రేవంత్ బంధువు అయినప్పటికీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాత్రమే కలిశాను. బయట ఎప్పుడూ కలవలేదు. నేను ఏ రాజకీయ పార్టీలో చేరను.
నా కుమారుడు అమిత్‌కు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమే. కానీ ఎలాంటి చర్చలు జరగలేదు. అలాగే, బీఆర్‌ఎస్‌లో కొందరు నేతలు అమిత్‌కు సహకరించకపోవడంతో పోటీ చేయవద్దని నిర్ణయించుకున్నాడు. బీఆర్‌ఎస్ నుంచి పోటీకి అమిత్ దూరంగా ఉన్నాడు’ అని క్లారిటీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment