సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగలింది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాగా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి సోమవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ సమక్షంలో గుత్తా అమిత్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ గార్ల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్.
జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి గారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్… pic.twitter.com/4YkyrxJvSy— Telangana Congress (@INCTelangana) April 29, 2024
ఇదిలా ఉండగా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గుత్తా అమిత్.. బీఆర్‌ఎస్ నుంచి పార్లమెంట్ స్థానం ఆశించారు. భువనగిరి లేదా నల్లగొండ స్థానం ఆశించి భంగపడ్డారు. బీఆర్‌ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు.. గుత్తా సుఖేందర్ కూడా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment