trs mp
-
తెలంగాణ మెట్రో కారిడార్‌కు రూ.8,453 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: 2017 మెట్రో రైల్ పాలసీలో భాగంగా 50:50 ఈక్విటీ షేర్ పద్ధతిలో రూ.8,453 కోట్లు కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కోరినట్లు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ వెల్లడించారు. మెట్రోకారిడార్ సాయం ఏమైందని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అదేవిధంగా రాయదుర్గం స్టేషన్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వరకు రూ.6,105 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మెట్రో ప్రాజెక్టు విషయం కూడా తమ దృష్టిలో ఉందని తెలిపారు. ఎన్‌హెచ్–65లో 6 లేన్లు అవసరం లేదు ప్రస్తుతం నందిగామ సెక్షన్లో నాలుగు లేన్లు సరిపోతాయి లోక్‌సభలో ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్‌ల ప్రశ్నలకు కేంద్రమంత్రి గడ్కరీ జవాబు ఇచ్చారు. ఎన్‌హెచ్-65లో 6 లేన్లు అవసరం లేదని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: హైదరాబాద్–విజయవాడ ఎన్‌హెచ్-65పై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు.. -
బండి సంజయ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : టీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత
-
టీఆర్ఎస్ ఎంపీకి ఈడీ మరో షాక్..
సాక్షి, హైదరాబాద్/ఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్ ఇచ్చింది. నామా, ఆయన కుటుంబసభ్యులకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని మొత్తం 28 స్థిరాస్తు లను సోమవారం జప్తు చేసింది. వీటి విలువ రూ.80.65 కోట్లు ఉంటుందని స్పష్టం చేసింది. గత జూలైలోనూ నామాకు, ఆయన కుటుంబానికి సంబంధించి రూ.73.74 కోట్ల విలువ గల 105 స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో నుంచి మధుకాన్ గ్రూపు రూ.361.92 కోట్లు దారిమళ్లించినట్లు ఈడీ నిగ్గుతేల్చింది. మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ ప్రమోటర్‌గా, డైరెక్టర్‌గా ఉన్న నామా నాగేశ్వరరావు బ్యాంకుల కన్సార్షియం నుంచి తీసుకునే రుణానికి పూచీకత్తుగా కూడా ఉన్నారని ఈడీ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య ఆధ్వర్యంలోని ఉషా ప్రాజెక్ట్స్, శ్రీ బీఆర్ విజన్స్, శ్రీధర్మ శాస్త కన్స్ట్రక్షన్స్, శ్రీ నాగేంద్ర కన్స్ట్రక్షన్స్, రాగిణి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, వరలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అనే ఆరు డొల్ల కంపెనీలకు రూ.75.50 కోట్లు మళ్లించారని ఈడీ గుర్తించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని మధుకాన్ ప్రధాన కార్యాలయం, నగరంలోని మరికొన్ని ఆస్తులతో పాటు ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లోని ఆ సంస్థ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం కాంట్రాక్ట్ రద్దు రాంచీ నుంచి జంషెడ్‌పూర్‌ను కలిపే 163 కిలోమీటర్ల నిడివి గల ఎక్స్‌ప్రెస్ వే అయిన నాలుగు లేన్ల ఎన్‌హెచ్ 33కి సంబంధించి కాంట్రాక్టును మధుకాన్ కంపెనీ పొందింది. ఇందుకోసం 15 బ్యాంకుల కన్సార్షియం రూ.1,151 కోట్ల రుణం మంజూరు చేయగా, అందులోంచి రూ.1,029 కోట్లు మధుకాన్ సంస్థ తీసుకుంది. బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం పురోగతి లేక, పెద్దఎత్తున నిధులు దుర్వినియోగమైనట్లు, ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించినట్లు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ గుర్తించింది. దీంతో కన్సార్షి యం బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. జార్ఖండ్ హైకోర్టు సైతం సీబీఐని దర్యాప్తు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో కేసు నమోదు చేసిన సంగతి విదితమే. మనీ లాండరింగ్ కింద ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మధుకాన్ కాంట్రాక్టును జాతీయ రహ దారుల సంస్థ రద్దు చేయడంతోపాటు రూ.73.95 కోట్లను స్వాధీనం చేసుకుంది. చదవండి: యువతుల కోసం అపార్ట్‌మెంట్‌కు సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఇంతలోనే షాకింగ్ ట్విస్ట్ -
'బుల్లెట్ బండి' పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఎంపీ
మహబూబాబాద్: ఇటీవల సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం పొందిన ‘బుల్లెట్టు బండెక్కి’ పాటకు అందరూ ఆకర్షితులవుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ యాసలో ఎంతో మధురంగా ఉన్న ‘బుల్లెట్టు బండి’ పాటకు మంచిర్యాల జిల్లాకు చెందిన సాయిశ్రీయ తన పెళ్లి బరాత్‌లో అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపింది. చదవండి: Bullettu Bandi Bride: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్ తాజాగా మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత ఒక వివాహ వేడుకలో బుల్లెట్ బండి పాటకు ఆడిపాడారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఎంపీ కవిత.. నూతన వధూవరులతో పాటు వారి కుటుంబసభ్యులతో కలిసి డ్యాన్స్ చేశారు. తన డ్యాన్స్‌తో అక్కడన్న వారందరిని అలరించారు. ఎంపీ డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
చట్టసభల్లో బీసీ కోటాపై మీ చిత్తశుద్ధి ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లపై మీ చిత్తశుద్ధి ఏంటని కేంద్రాన్ని టీఆర్ఎస్ ప్రశ్నించింది. రాజ్యాంగ (127వ సవరణ) బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆ పార్టీ ఎంపీ బండ ప్రకాశ్ బీసీ రిజర్వేషన్లపై మాట్లాడుతూ ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఓబీసీ జాబితాలో మార్పులు, చేర్పులపై అధికారాలను రాష్ట్రాలకు దఖలుపరుస్తూ ప్రతిపాదించిన బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తోంది. పొరపాటును సరిదిద్దుతూ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను పునరుద్ధరించడం అభినందనీయం. బీసీ జాబితాలో పలు కులాలను చేర్చాలంటూ వివిధ రాష్ట్రాల్లో డిమాండ్లు ఉన్నాయి. కానీ రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న నిబంధనలు ఉన్నాయి. ఎస్సీ జనాభా పెరిగినప్పుడు.. బీసీ రిజర్వేషన్ తగ్గుతూ వస్తోంది. 50 శాతం పరిమితి కారణంగా బీసీలకు న్యాయమైన వాటా దక్కడం లేదు. 50 శాతం ఏ డేటా ఆధారంగా నిర్ణయిస్తున్నారు? సుప్రీంకోర్టు ఏ డేటాను అనుసరించి నిర్ణయిస్తోంది? శాస్త్రీయ ప్రాతిపదిక ఏముంది? 1931 నుంచి దేశంలో కులాల జనగణన లేదు. ఓబీసీ జనగణన చేస్తామని 2018లో అప్పటి మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హామీ ఇచ్చారు. రోడ్‌మ్యాప్ కూడా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు కార్యాచరణ లేదు. వెంటనే బీసీ జనగణన చేపట్టాలి. ఉన్నత విద్యాసంస్థలైన ఐఐటీలు, ఐఐఎంలలో ప్రవేశాలు, చివరకు పీహెచ్డీ ప్రవేశాల్లో కూడా రిజర్వేషన్లు సరిగా అమలు కావ డం లేదు. సమానత్వం కోసం రిజర్వేషన్లు అమలు చేస్తున్నందున రాజకీయంగా కూడా రిజర్వేషన్లు అమలు చేయాలి. తెలంగాణ సీఎం కేసీఆర్ చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనిని కేంద్రానికి పంపారు. కానీ అది ఇప్పుడు ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సిన పరిస్థితి. పార్లమెంటులో బీసీలకు రిజర్వేషన్లపై మీకున్న చిత్తశుద్ధి ఏంటి? లోక్‌సభలో, రాజ్యసభలో బీసీలు ఎంతమంది ఉన్నారు? ఈ అంశాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించండి. చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయండి’అని డిమాండ్ చేశారు. క్రీమీలేయర్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ‘న్యాయ వ్యవస్థ వెనకబడిన తరగతులకు వ్యతిరేకంగా అనేక తీర్పులు ఇస్తోంది. వెనకబడిన తరగతుల విషయానికి వచ్చేసరికి వారు పరిమితి గురించి ఆలోచిస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ విషయంలో వారు ఎందుకు పరిమితి ఆలోచించరు? కేంద్రం స్వయంగా 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేస్తూ 50 శాతం పరిమితిని ఉల్లంఘించింది. సుప్రీంకోర్టు ఎం దుకు మౌనంగా ఉంది? మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి పెరిగితే ఎందుకు మౌనంగా ఉన్నారు? కేవలం బీసీల విషయంలోనే క్రీమీలేయర్ గురిం చి ఆలోచిస్తారు. ఇతర విషయాల్లో ఎందుకు ఇలా చేయరు? ఈ క్రీమీలేయర్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? రాజ్యాంగంలో ఉందా? మైనా రిటీలు, మహిళలు, ఎస్సీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు ఉండదు? బీసీల అభ్యున్నతి లేనప్పుడు దేశాభివృద్ధి కూడా సాధ్యం కాదు’అని బండ ప్రకాశ్ చెప్పారు. -
‘రామప్ప’కు రూ. 250 కోట్ల ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: రామప్ప ఆలయానికి రూ.250 కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. భద్రాచలం ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చాలని, మేడారం జాతరకు జాతీయహోదా కల్పించి అభివృద్ధి చేయాలని విన్నవించారు. బుధవారం కేంద్రమంత్రిని కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు పలు అంశాలపై చర్చించారు. మహబూబాబాద్ పర్యాటకంగా అభివృద్ధి చెంది, ప్రజల జీవన ప్రమాణాలు అభివృద్ది చెందాలంటే కేంద్రమంత్రిగా చొరవ తీసుకోవాలని, తెలంగాణబిడ్డగా పూర్తి సహకారం అందించాలని కిషన్‌రెడ్డిని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కోరారు. రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు పొందడం దేశానికే గర్వకారణమన్నారు. -
ఎంపీ మాలోతు కవితకు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో బూర్గంపహాడ్ మండలంలో డబ్బు పంపిణీ చేశారంటూ ఆమెపై నమోదుచేసిన కేసులో ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ ప్రత్యేక కోర్టు విధించిన 6 నెలల జైలుశిక్ష అమలును నిలిపివేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ జి.శ్రీదేవి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. -
టీఆర్ఎస్ ఎంపీ ఎన్నిక చెల్లదంటూ పిటిషన్
సాక్షి, జహీరాబాద్ : జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఎంపీ బీబీ పాటిల్ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించలేదని, ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించనందున ఎన్నిక రద్దు చేయాలని కోరారు. మదన్ మోహన్ రావు తరపున సుప్రీం కోర్టు న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రతివాదులుగా బీబీ పాటిల్, ఎన్నికల కమిషన్, టీఆర్ఎస్ పార్టీలను పిటిషన్లో చేర్చారు. విచారించిన హైకోర్టు ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కాగా, మదన్ మోహన్‌రావు 2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి బీబీ పాటిల్ చేతిలో ఓడిపోయారు. -
గల్లీలో కాదు.. ఢిల్లీలో పోరాటం చేయాలి
సాక్షి, షాద్‌నగర్: కాంగ్రెస్ నాయకులు గల్లీలో కాదు ఢిల్లీలో పోరాటం చేసి పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకరావాలని మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం షాద్‌నగర్‌లోని ఆర్‌ఆండ్‌బీ అతిథిగృహంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసేందుకు సీఎం కేసీఆర్ తగిన చర్యలు చేపట్టారని అన్నారు. రెండేళ్లలో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తికావడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పాలమూరు ఎత్తిపోతల పథకంపై లేని పోని రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా సాధించేందుకు కాంగ్రెస్, బీజెపీ నాయకులు పోరాటం చేయాలని అన్నారు. లక్ష్మీదేవునిపల్లి ప్రాజెక్టు నిర్మించకుంటే వచ్చే ఎన్నికల్లో తాము ప్రజల నుండి ఓట్లు అడగమని అన్నారు. లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు.. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. లక్ష్మీదేవునిపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి భూ సేకరణ చేయాలని సీఎం కేసీఆర్ ఇటీవల అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో భూ సేకరణ పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. లక్ష్మీదేవునిపల్లి ప్రాజెక్టు నిర్మించాలని మొదట సీఎం కేసీఆర్ చెప్పారని అన్నారు. కాంగ్రెస్‌పార్టీ హయాంలో ప్రాజెక్టు నిర్మాణం వారికి సాధ్యం కాలేదని, సీఎం కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని అన్నారు. దీంతో కాంగ్రెస్‌పార్టీ నేతలకు ఏమితోచక లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు అందెబాబయ్య, కొందూటి నరేందర్, అగ్గునూరు విశ్వం, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, జెడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంఎస్ నట్రాజ్, ఎమ్మె సత్యనారాయణ, యుగెంధర్, చింటు, మన్నె నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కవిత ఆస్తుల విలువ రూ.7.63 కోట్లు
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన పేరు మీద రూ.7.63 కోట్లు, భర్త రామయగారి దేవనపల్లి అనిల్‌కుమార్ పేరు మీద రూ.9.7 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. కవిత దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆమె రూ.5,55,30,620 విలువ గల స్థిరాస్తులు, రూ. 2,08,37,049 విలువైన చరాస్తులను కలిగి ఉండగా, భర్త అనిల్‌కుమార్ రూ.6,76,64,099 విలువైన చరాస్తులు, రూ.2,97,77,746 విలువైన స్తిరాస్తులను కలిగిఉన్నారు. కవిత రెండు టయోటా ఫార్చునర్ కార్లను కలిగి ఉన్నారు. కవిత తనయులు ఆదిత్య రూ.24.81 లక్షలు, ఆర్య రూ.30.90 లక్షల చరాస్తులను కలిగి ఉన్నారు. కవిత రూ.2.27 కోట్ల అప్పులు, అనిల్ కుమార్ రూ.6.79 కోట్ల అప్పు లు కలిగి ఉన్నారు. ఆమెపై ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆమె వీఎన్ఆర్ వీజేఐఈటీ నుంచి 1999లో ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లుగా పేర్కొన్నారు. -
హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్నది చంద్రబాబే
-
తండ్రిని వెనకేసుకొచ్చిన ఎంపీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘పెద్ద బఫూన్’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) చేసిన వ్యాఖ్యలను ఆయన కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సమర్థించారు. ఢిల్లీలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... వెర్రి పనులు చేసే వారిని బఫూన్‌గా వర్ణిస్తామని, పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసిన తింగరి చేష్టలను దేశమంతా చూసిందన్నారు. ‘సభా సంప్రదాయాలను ఉల్లఘించి లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అమాంతంగా వాటేసుకోవడం జాతి యావత్తు వీక్షించింది. రాహుల్ చర్యను ప్రతి ఒక్కరు వెర్రి పనిగా భావించారు. అందుకే మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూడా స్పందిచార’ని కవిత వివరించారు. ప్రాంతీయ పార్టీలదే హవా తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలపై స్పందిస్తూ.. తెలంగాణలో కాంగ్రెస్ దారుణంగా వైఫల్యం చెందిందని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం రాలేదని, బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందని తెలిపారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను టీ20 మ్యాచ్‌లా ప్రజలు ఉత్కంఠతో వీక్షించారని చెప్పుకొచ్చారు. రాజస్తాన్‌లో పాత సంప్రదాయం కొనసాగడం వల్లే కాంగ్రెస్‌కు అధికారం దక్కిందని విశ్లేషించారు. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల హవా ఉంటుందని అభిలషించారు. ‘ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు ఉండివుంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవని గట్టిగా చెప్పగలను. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో జాతీయ పార్టీలు విఫలమయ్యాయి. ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలు మెరుగ్గా ఉన్నాయ’ని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ తథ్యం కాంగ్రెస్, బీజేపీ లేకుండా ఫెడరల్ ఫ్రంట్ సాకారమవుతుందని, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల అవసరాలను గుర్తించేలా ఫెడరల్ ఫ్రంట్ ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని డీఎంకే నేత స్టాలిన్ భావి ప్రధానిగా వర్ణించడంపై స్పందిస్తూ.. కాంగ్రెస్ అనుకూల కూటమిలో లుకలుకలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాహుల్‌ను ఒక పార్టీ సమర్థిస్తే, అదే కూటమిలోని రెండు ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకించాయన్నారు. ‘మేము ఏర్పాటు చేయాలనుకుంటున్న మూడో ప్రత్యామ్నాయం ఒకరిని ప్రధాని చేయడానికో, ఒక పార్టీని అధికారంలోకి తేవడానికో కాదు. కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కొనుగొనాలన్న ఉద్దేశంతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. తెలంగాణలో మా పార్టీ ఇప్పటికే చేసి చూపించింది. తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలుల్లోకి తేవాలనుకుంటున్నామ’ని ఎంపీ కవిత వెల్లడించారు. -
రాహుల్‌తో ఎంపీ కొండా భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న సిద్ధాం తంతోపాటు సెక్యులరిజం నుంచీ టీఆర్ఎస్ దూరం గా వెళ్లిపోయిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల, ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక క్రమంగా వారికి దూర మవుతూ వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్‌ను విశ్వేశ్వర్‌రెడ్డి ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. భేటీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, హరియాణాకు చెందిన ఎంపీ దీపేందర్‌సింగ్ హుడా పాల్గొన్నారు. 15 నిమిషాలు జరిగిన భేటీలో రాష్ట్రంలో టీఆర్ఎస్ హామీ ఇచ్చి నెరవేర్చని ప్రాజెక్టులు, చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని సమస్యలను రాహుల్‌కు ఆయన వివరించారు. కొండా రాకతో పార్టీ బలోపేతం... అనంతరం మీడియాతో కుంతియా మాట్లాడుతూ.. మతతత్వ పార్టీ బీజేపీతో జట్టుకట్టడం లాంటి అనేక అంశాలపై టీఆర్ఎస్తో విభేదిస్తూ కొండా ఆ పార్టీని వీడారన్నారు. ఈ నెల 23న సోనియా, రాహుల్ సమక్షంలో సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్‌లో చేరతారని వెల్లడించారు. చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిత్వంపై ప్రస్తుతానికి రాహుల్ హామీ ఇవ్వలేదని, పార్లమెంట్ ఎన్నికల సమయంలో అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. విశ్వేశ్వర్‌రెడ్డి రాకతో కాంగ్రెస్ బలోపేతం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే మరికొందరు ఎంపీలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు చెప్పారు. కేసీఆర్ వద్ద ఉన్న అనేకమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వారేనని, వారంతా తమతో టచ్‌లో ఉన్నట్లు వివరించారు. ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నంత మాత్రానా టీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ కాబోదని, ఎంఐఎం కూడా బీజేపీ వంటి మతతత్వ పార్టీయేనని మీడియా ప్రశ్నకు బదులిచ్చారు. ముస్లిం ఓటు ఎంఐఎంకు వెళ్లాలి.. హిందూ ఓటు బీజేపీకి వెళ్లాలి.. అన్నది వారి అవగాహన అని అన్నారు. కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకమైతే.. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల సమయంలో, పార్లమెంట్ తీర్మానాల సమయంలో ప్రతి విషయంలోనూ మద్దతెలా ఇచ్చారని ప్రశ్నించా రు. తెలంగాణలో 9 నెలల ముందుగానే ఎన్నికలు జరపాలన్నది ఓ పథకం ప్రకారం చేశారని, తద్వారా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎన్డీయేలో చేరా లన్నది టీఆర్ఎస్ వ్యూహమని అన్నారు. ప్రజలకు దూరమైన టీఆర్ఎస్... టీఆర్ఎస్ సైద్ధాంతిక మార్పులకు లోనైందని. అం దుకే ఆ పార్టీకి రాజీనామా చేశానని విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలన్న అసలు సిద్ధాంతాన్ని, సెక్యులరిజాన్ని పక్కకు పెట్టిందన్నా రు. చేవెళ్ల నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం రాహుల్‌ని కలిశానని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. వికారాబాద్‌ను శాటిలైట్ సిటీ చేస్తామని, తాండూరు సమస్యలను పరిష్కరిస్తామని గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని వీటన్నింటినీ నెరవేర్చాలని కోరా నన్నారు. రాష్ట్రంలోని సాగునీరు, పాలమూరు–రంగారెడ్డి వంటి ప్రాజెక్టులు, టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వంటి అంశాలపై భేటీలో చర్చించామన్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువత టీఆర్ఎస్ ప్రాథమిక ఓటర్లని, ప్రస్తుతం వీరంతా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. పార్టీ పూర్తిగా సైద్ధాంతిక మార్పు కు లోనైందని, దీన్ని సహించలేకే పార్టీ వీడినట్లు పేర్కొన్నారు. ఈనెల 23న కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ చేయని వాటిని కాంగ్రెస్ ద్వారా సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీ పదవికి రాజీనామాపై స్పందిస్తూ స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలిసి రాజీనామా ఇస్తానని పేర్కొన్నారు. మహేందర్‌రెడ్డితో నాలుగేళ్లుగా విభేదాలు.. మంత్రి మహేందర్‌రెడ్డితో వ్యక్తిగత విభేదాలు పార్టీలో చేరినప్పటి నుంచి ఉన్నాయని విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. దాని కోసమే అయితే ఇప్పుడు పార్టీ వీడాల్సిన అవసరం లేదని, ఆ పని నాలుగేళ్ల ముందే చేసేవాడినని తెలిపారు. చిన్నచిన్న వ్యక్తిగత కారణాలతో పార్టీ వీడేవాడి ని కాదన్నారు. అధికారం చేపట్టిన తొలినాళ్లలో సీఎం మంచిగా ఉండేవారని, అందుకే పలు ప్రాజెక్టులు చేపట్టారని అన్నారు. ప్రాంతీయ పార్టీలో ప్రజాస్వామ్యం చాలా తక్కువని, అదే కాంగ్రెస్‌లో ఆ వీలు ఉంటుందన్నారు. కాంగ్రెస్‌లోనే ఎందుకు చేరుతున్నారని ప్రశ్నించగా, గురువారం నిర్వహించబోయే విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వివరిస్తానని చెప్పారు. -
మహిళాబిల్లు తెస్తే మద్దతిస్తాం
హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెడితే టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. లోక్‌సభ, రాజ్యసభల్లో బీజేపీ ప్రభుత్వానికి తగిన మెజార్టీ ఉన్నందున బిల్లు ఆమోదం పొందుతుందని చెప్పారు. శుక్రవారం ఇక్కడి గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ హైదరాబాద్, ఐఎస్బీ సంయుక్త ఆధ్వర్యంలో 2018 ‘యంగ్ థింకర్స్ కాన్ఫరెన్స్’లో కవిత మాట్లాడారు. చట్టసభల్లో రిజర్వేషన్ల ద్వారానే రాజకీయాల్లో మహిళలకు ప్రాతినిథ్యం పెరుగుతుందన్నారు. లోక్‌సభలో 542 మంది సభ్యుల్లో 64 (11శాతం), రాజ్యసభలో 245 మందికి 27 మంది(11 శాతం) మహిళలు మాత్రమే ఉన్నారని, అన్ని రాష్ట్రాల్లో కలిపి 4,198 మంది ఎమ్మెల్యేలుండగా అందులో 9 శాతమే మహిళా ఎమ్మెల్యేలున్నారని ఆమె వివరించారు. మనీ, మీడియా, మెన్ అనే ఈ మూడు అంశాలతో మహిళలు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ప్రతి ఆడపిల్లను చదివించాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న 3 లక్షల డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను మహిళల పేరిట ఇస్తున్నామన్నారు. దళితులకు 3 ఎకరాల భూపంపిణీలో భాగంగా ఇప్పటివరకు 13,000 మందికి పట్టాలివ్వగా అవన్నీ మహిళల పేరిటే ఉన్నాయని చెప్పారు. షీ టీమ్స్, భరోసా కేంద్రాల రాష్ట్ర ఇన్చార్జీ స్వాతి లక్రా మాట్లాడుతూ షీటీమ్స్, భరోసా కేంద్రాల ఏర్పాటుతో మహిళల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నా రు. కార్యక్రమంలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్య్రూ ఫ్లెమింగ్, ఐఎస్బీ డిప్యూటీ డీన్ ప్రొఫెసర్ మిలింద్ సోహానీ, రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్, టీఆర్‌ఈఎస్ కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్, ఇండియన్ నెవీ లెఫ్టినెంట్ కమాండర్ ఐశ్వర్య బొడ్డపాటి, భారత పర్వాతారోహకులు మాలావత్ పూర్ణ, జాహ్నవి శ్రీపెరంబుదూరు, సామాజికవేత్త తెమ్సుతుల ఇమ్సాంగ్లు పాల్గొన్నారు. -
ఎంపీ బాల్క సుమన్‌పై ఆరోపణలు.. స్పష్టత
పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కొన్ని మీడియా సంస్థలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు మహిళలపై ఎంపీ లైంగిక దోపిడీకి పాల్పడ్డారంటూ ప్రధానికి పాత్రికేయుల లేఖ రాశారంటూ ఓ కథనం చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించారు. సాక్షి, మంచిర్యాల: టీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ వివాదంలో చిక్కుకున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో మంచిర్యాల సీఐ మహేష్ శుక్రవారం ఉదయం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ‘ఎంపీ బాల్క సుమన్‌పై వైరల్ అవుతున్న లైంగిక వేధింపుల ఘటన అవాస్తవం. బాధితులుగా చెప్పుకుంటున్న బోయిని సంధ్య, విజేతలు గతంలోనూ పలువురిని బ్లాక్మెయిల్ చేసి వేధించినట్లు మా విచారణలో వెల్లడైంది. ఎంపీపై ఆరోపణలకుగానూ వారిద్దరిపై ఫిబ్రవరి 6న కేసు నమోదు చేశాం. ఇప్పుడు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లోనూ వారిపై కేసులు నమోదు అయ్యాయి. ఎంపీని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ ద్వారా డబ్బు గుంజాలని యత్నించారు. అందులో భాగంగానే ఎంపీ కుటుంబ సభ్యుల ఫోటోను నిందితులు మార్ఫింగ్ చేసి ఆన్లైన్లో సర్క్యూలేట్ చేశారు’ అని సీఐ మహేష్ వెల్లడించారు. సంధ్య, విజేతలపై ఐపీసీ 420 , 292ఏ , 419 , 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. -
ఆ పథకాలు కేసీఆర్ ప్రకటించిన వరాలు: గుత్తా
సాక్షి, నల్గొండ : కోటిఎనభై లక్షలతో బత్తాయి మార్కెట్‌ను జిల్లాలో ఏర్పాటు చేయడం రైతులకు సంతోషకరమైన విషయమని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 2.5 లక్షల ఎకరాల భూమి సాగుకు అవకాశం ఉందన్నారు. డిండి ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, బ్రాహ్మణ వెళ్ళంల ప్రాజెక్టు ద్వారా మూడు నెలల్లో నీరు అందిస్తామని ప్రకటించారు. భూ రికార్డుల ప్రక్షాళన, ఎకారాకు ఎనిమిది వేల రైతు పెట్టుబడి, యాబై లక్షల రైతులకు ఐదు లక్షల బీమా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చెప్పకుండా ఇచ్చిన వరాలని పేర్కొన్నారు. 130 కోట్లతో నల్గోండలో ఇంటింటికి నీరు అందించేందుకు సర్వం సిద్దమవుతోందని, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సేవ చేసే అవకాశం కల్పించింనందుకు ధన్యవాదాలు తెలిపారు. -
ఫెడరల్ ఫ్రంట్ గేమ్ చేంజర్: ఎంపీ కవిత
ఢిల్లీ : రైతులకు రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ చేసినా మళ్లీ అప్పులు పాలై ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఈ కష్టాల నుంచి రైతులను గట్టెక్కించేందుకే రైతుబంధు పథకం తెచ్చామని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రైతులు వడ్డీ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు రైతు బంధు పథకం ఉపయోగపడుతుందని అన్నారు. దక్షిణ, ఉత్తర భారత రాష్ట్రాలు అనే భేదాలు వద్దని, మనమందరం భారతీయులమని అన్నారు. ఫలితాలిచ్చే రాష్ట్రాలను, ఫలితాలు చూపని రాష్ట్రాలను ఒక గాటన కట్టొద్దని కోరారు. తెలంగాణలో టీఆర్ఎస్ బలమైన పార్టీ అని అన్నారు. అందుకే బీజేపీ ఏజెంట్, కాంగ్రెస్ ఏజెంట్ అని ఇతర పార్టీలు దుష్ర్పచారం చేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వాల మార్పిడి కాదు, వ్యవస్థలో మార్పు కావాలని పేర్కొన్నారు. ‘ఫెడరల్ ఫ్రంట్ గేమ్ చేంజర్’ అని వ్యాఖ్యానించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు పక్రియ కొనసాగుతుందని, తమ జెండా నచ్చి వచ్చే వారందరికీ స్వాగతం చెబుతామని తెలిపారు. బీజేపీకి తాము సన్నిహితంగా లేమని, మోదీ ప్రభుత్వంతో వర్కింగ్ రిలేషన్స్ మాత్రమే ఉన్నాయని చెప్పారు. దేశాన్ని మార్చే అవకాశాన్ని మోదీ జారవిడుచుకున్నారని, ఈ ఏడాదిలోనైనా రైతులకు మేలు చేస్తారేమో చూడాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రాలను పరిగణలోనికి తీసుకోకుండా పాలసీలు రూపొందించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. -
బాల్క సుమన్ ఇంట్లో చోరీ
సాక్షి, మంచిర్యాల : పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఇంట్లో చోరీ జరిగింది. మంచిర్యాల పట్టణంలోని గౌతమ్‌నగర్‌లోని ఎంపీ సుమన్ నివాసం ఉంది. ఎంపీ ఇంటితో పాటు మరో రెండు ఇళ్లల్లో శుక్రవారం అర్థరాత్రి చోరీ జరిగినట్లు సమాచారం. ఎంపీ ఇంట్లో రూ. లక్ష నగదును దొంగలు అపహరించినట్లు తెలుస్తోంది. బాల్క సుమన్ సహా మిగతా ఇంటి యజమానులు అందుబాటులో లేకపోవడంతో ఎంత మొత్తంలో చోరీ జరిగిందో తెలియడం లేదు. చోరీ ఘటనను పోలీసులు గోప్యంగా దర్యాప్తు చేస్తున్నారు. రెండు నెలల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో రెండో సారి దొంగతనం జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. -
ఆధ్యాత్మిక చింతనతో మనశ్శాంతి
సప్తగిరికాలనీ(కరీంనగర్): ప్రస్తుత కాలంలో మానవునికి ఆధ్యాత్మిక చింతన అవసరమని, మనశ్శాంతి కోరుకునే వారు ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కావాలని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు వినోద్‌కుమార్ అన్నారు. కరీంనగర్లో జరుగుతున్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు, ఆలయ అర్చుకులు, పాలకవర్గం పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పురాతన ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న తీరును చూస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. తొమ్మిది రోజుల పాటు హాజరయ్యే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులను కోరారు. 23, 24, 25 తేదీల్లో జరుగనున్న కళ్యాణం, శోభాయాత్ర కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అన్నీ తానై వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే గంగులను ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కల్గకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ వాసాల రమేశ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేశ్, కార్పొరేటర్లు వై. సునీల్‌రావు, ఏవీ రమణ, పిట్టల శ్రీనివాస్, శ్రీకాంత్, ఆలయ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు. అలరించిన సాంసృతిక కార్యక్రమాలు.. శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంసృతిక కార్యక్రమాలు అబ్బుర పరిచాయి. భక్తీ రసాన్ని పండించే విధంగా విద్యార్థులు, చిన్నారులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కట్ట సిస్టర్స్ మంజుల, సంగీత, పెందోట బాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తీ సంగీతం, జవహర్ బాల కేంద్రం ఆధ్వర్యంలో సాంసృతిక కార్యక్రమాలు, కనపర్తి శ్రీనివాస్, సౌజన్య, రాసమల్ల రవి, రాధిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. -
బడ్జెట్ మొత్తం అస్పష్టతే..: ఎంపీ వినోద్
సాకి, హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌పై టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అరకొర అంశాలతో అసంపూర్తిగా, అస్పష్టంగా ఉందని అభిప్రాయపడ్డారు. దేశ ప్రజల ఆరోగ్యం కోసం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌భవ పథాకానికి విధివిధానలపై కనీస వివరణ కూడా లేదని ఆయన మండిపడ్డారు. దేశం అంటే రాష్ట్రాల సముదాయమని అన్న ఆయన ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలను ఎందుకు సంప్రదించలేదంటూ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా సుమారు 40శాతం మందికి కేవలం రూ.2 వేల కోట్లతో చికిత్స ఎలా అందిస్తారో వివరణ ఇవ్వలన్నారు. ఇన్సూరెన్స్ మోడల్లో స్కీమ్ ప్రధానంగా రూపొందితే పాలసీదారులు పెరిగేకొద్దీ ప్రీమియం తగ్గుతుందన్న ఆయన కేవలం రూ.2వేల కోట్ల ప్రారంభ నిధితో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ఎలా చేపడతారని ప్రశ్నించారు. అలాగే వరి తదితర ఖరీఫ్ పంటలకు ఉత్పత్తి వ్యయం కన్నా 50 శాతం అధికంగా మద్దతు ధర కల్పించే అంశం, మద్దతు ధర విషయంలోను స్పష్టత లేదన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.11 లక్షల కోట్లు పంట రుణాలు ఇస్తామని వెల్లడించిన జైట్లీ, విధి విధానాలు ప్రకటించడంలో మాత్రం విఫలమయ్యారని అన్నారు. కేంద్రం ఇప్పటికైనా స్పందించి ఆయుష్మాన్‌భవ, పంటల మద్దతు ధరపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అస్పష్ట అంశాలతో ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం సరికాదని వినోద్ అన్నారు. -
హైకోర్టు చివాట్లు పెట్టినా సిగ్గురాలేదు
-
మహిళ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
-
తెలంగాణ శకటానికి అవకాశమివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం ప్రదర్శనకు అవకాశమివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, బీబీ పాటిల్ కోరారు. సోమవారం అరుణ్ జైట్లీని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలసిన ఎంపీలు.. తెలంగాణలో ఎయిమ్స్, ఐఐఎం ఏర్పాటుకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. వెనకబడిన జిల్లాల అభివృద్ధికి మూడో విడత నిధులు కేటాయించాలని, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గణతంత్ర వేడుకల్లో ప్రదర్శనకు వివిధ దశల్లో ఎంపికైన తెలంగాణ బతుకమ్మ శకటాన్ని చివరి దశలో కేంద్ర రక్షణ శాఖ తిరస్కరించిన విషయం తెలిసిందే. -
తెలంగాణకూ సాయం చేయాల్సిందే
అరుణ్ జైట్లీకి ఎంపీ గుత్తా లేఖ సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్వ్యవస్థీకణ చట్టం ప్రకారం కేంద్రం ఏపీకి ఏవిధంగా ప్రయోజనాలు కల్పిస్త్తోందో అలాగే తెలంగాణకు కూడా కల్పించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి బుధవారం లేఖ రాశారు. తెలంగాణలో కూడా అనేక ఆర్థిక, సామాజిక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని చట్టంలో క్లుప్తంగా ఉన్నట్లు గుర్తుచేశారు. ఏపీతో సమానంగా తెలంగాణకు కేంద్రం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు విభజన, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఎయిమ్స్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని కోరారు. -
'ఆ శక్తులను కేసీఆర్ వదలరు'
నల్గొండ: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో అన్ని విషయాలను సిట్ వెలుగులోకి తెస్తుందని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వెల్లడించారు. గురువారం నల్గొండలో నయిం అంశంపై గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పందించారు. అరాచక శక్తులను సీఎం కేసీఆర్ వదలరని గుత్తా స్పష్టం చేశారు. పులిచింతల ప్రాజెక్టుకు అందాల్సిన రూ. 115 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ముంపు గ్రామాల ప్రజల పునరావాస ప్యాకేజీ అందక ఇబ్బందిపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
'కేంద్రం తీరుపై సీఎం ఆవేదనతో ఉన్నారు'
హైదరాబాద్ : హైకోర్టు విభజన విషయంల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై సీఎం కేసీఆర్ ఆవేదనతో ఉన్నారని నిజామాబాద్ ఎంపీ కె.కవిత తెలిపారు. అందుకే ఆయన ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నామని కేంద్రప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో కె.కవిత విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... హైకోర్టు విభజనపై ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్ పలుమార్లు చర్చించారని కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ప్రక్రియ అంతా కేంద్రంపరిధిలోనే జరగాలన్నారు. క్లాస్ -4 ఎంప్లాయిస్ నుంచి జడ్జిల నియామకం వరకు వివాదం నెలకొని ఉందన్నారు. రేపు జరిగే ఎల్పీ సమావేశంలో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. న్యాయాధికారులకు ఆప్షన్ విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కె.కవిత డిమాండ్ చేశారు. ఇద్దరు జడ్జిలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలన్నారు. కేంద్రం వెంటనే స్పందించి హైకోర్టును విభజించాలన్నాని తెలిపారు. జడ్జిలకు జరిగిన అన్యాయంపై స్పందించాలని ఆమె అన్ని పార్టీలకు సూచించారు. ఇంత జరుగుతున్న విపక్షాలు ఎందుకు మాట్లాడటం లేదని కె.కవిత ప్రశ్నించారు. -
తెలంగాణ అభివృద్ధికి ఎన్ఆర్ఐలు కృషి చేయాలి
ఆటా సదస్సులో ఎంపీ వినోద్‌కుమార్ రాయికల్ : అమెరికాలోని తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐలు రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ కోరారు. వర్జీనియూలోని అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఎంపీతోపాటు కవి, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అమెరికాలోని వివిధ స్టేట్స్లో ఉంటున్న ఎన్ఆర్ఐలు తెలంగాణలో పెట్టుబడులు పెడితే రాయితీలు కల్పిస్తామన్నారు. అధ్యక్షుడు రాంమోహన్, ప్రధాన కార్యదర్శి రవి, కోశాధికారి శ్రీనివాస్, బోర్డు సభ్యులు అరవింద్, చందు, మాధవరావు, ప్రకాశ్, నరేందర్‌రెడ్డి, రఘువీర్, శం కర్, శ్రీధర్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణకు టీఎన్నారైలే కీలకం
డల్లాస్ : తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో టీ ఎన్నారైలు కీలక పాత్ర పోషిస్తున్నారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు జితేందర్ రెడ్డి ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వానికి మీరంతా పూర్తి సహాయ సహకారాలు అందించాలని టీ ఎన్నారైలకు ఆయన పిలుపునిచ్చారు. తొలిసారిగా ప్రపంచ తెలంగాణ సమావేశాలు డల్లాస్‌లో అట్టహాసంగా ప్రారంభమమైన సంగతి తెలిసిందే. అందులోభాగంగా ఆదివారం డల్లాస్ నగరంలో తెలంగాణ ఎన్నారైల రాజకీయ చర్చా వేదిక నిర్వహించారు. ఈ చర్చా కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, డీకే అరుణా, మధుయాష్కీగౌడ్, తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చా కార్యాక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో ఎన్నారైల పాత్రను ప్రస్తుతించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను మరింతగా ప్రజల్లోకి వెళ్లేలా చర్యలు చేపట్టాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో వాచ్ డాగ్స్ వలే వ్యవహరించాలని ఎన్నారైలకు ఉత్తమ్ సూచించారు. తెలంగాణ ఎన్నారైలకు గోబల్ తెలంగాణ కన్వెన్షన్ ఓ వేదికగా ఉపయోగపడుతోందన్నారు. అందుకు నిర్వాహాకులు అధ్యక్షుడు విశ్వేశ్వరరెడ్డి, ఉపాధ్యక్షుడు విజయ్ పిట్టా లక్ష్మణ్, సెక్రటరీ ప్రవీణ్ కాశీ రెడ్డి, ఎఫ్‌బీఐ ట్రస్టీ అజయ్ రెడ్డి, రవిశంకర్ పటేల్‌లను ధన్యవాదాలు తెలిపారు. ది హిందూకు చెందిన రవికాంత్ రెడ్డి ఈ చర్చావేదికలో అనుసంధానకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి డేటా(డల్లా ఏరియా తెలంగాణ అసోసియేషన్), టీప్యాడ్(తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్) సంస్థలు కూడా మద్దతిచ్చాయి. -
'పీవీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు'
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తీరుపై పెద్ద పల్లి ఎంపీ బాల్క సుమన్ స్పందించారు. దొంగ దీక్షలు, యాత్రలు చేయడం కాంగ్రెస్ కు అలవాటని ఆయన విమర్శించారు. శుక్రవారం బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ జైపాల్ రెడ్డి ది తెలంగాణను మోసం చేసిన గొప్ప చరిత్ర అని మండిపడ్డారు. ఆయన సోనియా మెప్పు పొందడం కోసం పీవీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారన్నారు. జైపాల్ రెడ్డి పదవులే పరమావధిగా బతికిన వ్యక్తి అని అన్నారు. -
'మాకూ, టీడీపీకి తేడా అదే'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ మంగళవారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. రాజ్యసభకు మేం ప్రజల కోసం పని చేసే వాళ్లను పంపిస్తుంటే.. చంద్రబాబు మాత్రం వ్యాపారులను పంపిస్తున్నారని వినోద్‌కుమార్ ఆరోపించారు. మాకు, టీడీపీకి తేడా అదే అని ఆయన స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ మంగళవారంతో ముగిస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పార్టీలు ఎంపిక చేసిన అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ తరఫున సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, టీడీపీ మద్దతుతో బీజేపీ తరఫున కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి నామినేషన్ వేశారు. తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావును ఎంపిక చేసింది. వీరిద్దరు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్‌పై విధంగా స్పందించారు. -
కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా మలచండి
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో ఎంపీ వినోద్ సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీ జాబితాలో కరీంనగర్‌ను చేర్చాలని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడికి కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఇక్కడ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారితో కలిసి వెంకయ్యనాయుడితో ఈ అంశంపై చర్చించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. జాబితాలో చేరేందుకు కరీంనగర్ ప్రణాళికలో కొన్ని సంస్కరణలు అవసరమని, దీనిపై అధికారులకు సూచనలిచ్చిన ట్లు మంత్రి వెల్లడించారు. -
వెయ్యి మంది బాబులు అడ్డొచ్చినా....
హైదరాబాద్ : తెలంగాణ వ్యతిరేకతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు మరోసారి చాటుకున్నారని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మంగళవారం హైదరాబాద్‌లో ఆరోపించారు. వెయ్యి మంది బాబులు అడ్డొచ్చినా రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం ఆగదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ నోట్లో మట్టి కొట్టే పార్టీలో టీడీపీ నేతలు ఎలా కొనసాగుతారని బాల్క సుమన్ ప్రశ్నించారు. ముందు చంద్రబాబుపై పోరాడాలని ఆ పార్టీ సీనియర్ నేత రేవంత్‌రెడ్డికి హితవు పలికారు. తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. -
'సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం'
హైదరాబాద్ : రాష్ట్రంలోని కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని నిజామాబాద్ ఎంపీ కె.కవిత స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన మేడే వేడుకల్లో ఆమె పాల్గొని... ప్రసంగించారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కార్మికులు కీలక పాత్ర పోషించారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తే మాత్రం అడ్డుకుంటామని కవిత తెలిపారు. -
అదంతా వట్టి ప్రచారమే : ఎంపీ కవిత
న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరుతుందంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కె.కవిత ఖండించారు. ఇది అంతా వట్టి ప్రచారమే అని ఆమె తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీలో కె.కవిత విలేకర్లతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీకి, కేంద్రానికి మధ్య ఉన్న సంబంధాలు ప్రభుత్వ సంబంధాలే అని ఆమె స్పష్టం చేశారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీని కలిసిన తర్వాత కొన్ని పనులు వేగవంతమయ్యాయని వెల్లడించారు. అందులోభాగంగానే ఇటీవలే వెనుకబడిన జిల్లాలకు రూ. 450 కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. వచ్చే బడ్జెట్లో విభజన చట్టంలో ఉన్న వాగ్ధానాలకు నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని కవిత డిమాండ్ చేశారు. హైకోర్టు ఏర్పాటు టీడీపీ వల్లే ఆలస్యం అవుతోందని కె. కవిత ఆరోపించారు. -
ఎంపీ బాల్క సుమన్ సోదరి వివాహానికి హాజరైన సీఎం
మెట్పల్లి: కరీంనగర్ జిల్లా మెట్పల్లి పట్టణంలోని వెంకట్‌రెడ్డి గార్డెన్స్‌లో బుధవారం జరిగిన పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ సోదరి స్వర్ణ-శ్రీకాంత్ వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు హాజరై ఆశీర్వదించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సీఎం తన సతీమణి శోభ, కూతురు, నిజామాబాద్ ఎంపీ కవితతో కలసి మెట్పల్లి వచ్చారు. ఈ వివాహానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, పద్మారావు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రభుత్వ సలహాదారు డి.శ్రీనివాస్, ఎంపీలు వినోద్‌కుమార్, కొత్తకోట ప్రభాకర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, సింగరేణి సీఎండీ శ్రీధర్, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి తదితరులు హాజరయ్యారు. -
టీడీపీని వద్దనుకుంటున్నారు: బాల్క సుమన్
హైదరాబాద్ : కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. ప్రలోభాలు పెట్టే చరిత్ర రేవంత్‌రెడ్డిది అని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేలను కొనుగోలుకు యత్నించి జైలు పాలైన ఘనత రేవంతరెడ్డిది అని సుమన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కావాల్సిందే అని ఎద్దేవా చేశారు. రేవంత్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని బాల్క సుమన్ విమర్శించారు. ఈ రాష్ట్రంలో ప్రలోభాలు చరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసునన్నారు. పక్క రాష్ట్రంలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఎస్పీవై రెడ్డికి పచ్చకండువా కప్పారని, ఆయనకు మరి టీడీపీ పార్టీ ఏం ప్రలోభపెట్టిందని బాల్క సుమన్ సూటిగా ప్రశ్నించారు. టీడీపీ పక్క రాష్ట్రంలో ఏం చేస్తుందో గుర్తు తెచ్చుకుని మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణలో టీడీపీని బతికించుకుందామనే ప్రయత్నం సాధ్యం కాదంటూ రేవంత్‌కు సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ కేవలం ఏపీకి మాత్రమే పరిమితం కావాల్సిందేనని బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ ప్రజలు టీడీపీని వద్దనుకుంటున్నారని, రేవంత్ ఎంత మొరిగినా టీడీపీ ఉండదని ఆయన వ్యాఖ్యలు చేశారు. -
'ఖేడ్‌లో డిపాజిట్లు గల్లంతు ఖాయం'
మెదక్: నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. సోమవారం పెద్దశంకరంపేటలోని తిరుమలాపూర్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ ఫథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఈ నెల 13న నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. -
అత్యాచార బాధితులకు అండ : ఎంపీ కవిత
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బోదేపల్లిలో అత్యాచారానికి గురై ఇటీవల మరణించిన మైనార్టీ యువతి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని నిజామాబాద్ ఎంపీ కవిత స్పష్టం చేశారు. శనివారం నిజామాబాద్‌లో స్థానిక మైనార్టీ సంస్థల ప్రతినిధులు ఎంపీ కవితను కలసి సదరు యువతి కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన కవిత... జిల్లా కలెక్టర్ యోగితారాణాతో మాట్లాడారు. అనంతరం కవిత మాట్లాడుతూ... బాధితురాలి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇంటితోపాటు రెండు ఎకరాల పొలం తమ ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. జిల్లాలోని మోర్తాడు మండలం ఏర్గట్ల గ్రామంలో మైనార్టీ వర్గానికి చెందిన మరో మహిళ రెండేళ్ల క్రితం అత్యాచారానికి గురైంది. ఆమెకు ప్రభుత్వం తరఫున కేవలం రూ. 50 వేలు ఇచ్చారని మైనార్టీ నాయకులు గుర్తు చేశారు. దాంతో బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని సదరు మైనార్టీ నాయకులకు కవిత ఈ సందర్బంగా భరోసా ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధులు హఫీజ్ మహమ్మద్ లయిక్ ఖాన్, హఫీజ్ ఇంతియాజ్, హఫీజ్ అబ్దుల్ హకీం, మౌలానా అబ్దుల్ హలీం, హఫీజ్ అష్రఫ్ తదితరులు ఎంపీ కవితను కలిసిన వారిలో ఉన్నారు. -
సవాలు స్వీకరించే సత్తా లేకే విమర్శలు
విపక్షాలపై ఎంపీ బాల్క సుమన్ మండిపాటు హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగురకపోతే పదవికి రాజీనామా చేస్తానంటూ మంత్రి కేటీఆర్ చేసిన సవాలును.. దమ్ముంటే విపక్షాలు స్వీకరించాలని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, దివాకర్‌రావుతో కలిసి మంగళవారం టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో బాల్క సుమన్ విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్ విసిరిన సవాలుకు నేరుగా స్పందించకుండా.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరు దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నిజంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి వుంటే కేటీఆర్ సవాలును ఎందుకు స్వీకరించడం లేదని ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సుమారు వంద సీట్లు గెలుస్తుందని అన్ని సర్వేలు సూచిస్తున్నాయని.. తమ పార్టీ మేయర్ పీఠం దక్కించుకుంటుందని సుమన్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటమి ఖాయమని తేలడంతో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ముఖం చాటేస్తున్నాయంటూ ఆ పార్టీలపై బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. పెద్దవారిని దూషిస్తే పెద్ద నాయకుడిని అవుతాననే భ్రమలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ పాత్రను గుర్తు చేస్తూ... కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వస్తున్నాయంటూ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. టీఆర్ఎస్ది రాజకీయ ఉగ్రవాదం అంటూ పీసీసీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై సుమన్ మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రాక్షస చరిత్ర వుందని, చంపే.. చంపించే సంస్కృతి ఆ పార్టీ సొంతం అంటూ వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బల్దియా ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం వుంటే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ మంత్రి కేటీఆర్ సవాలును స్వీకరించాలన్నారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు టీడీపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో రేవంత్ పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడితే ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని కృష్ణారావు హెచ్చరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
ముంబైలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ముంబై: తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ వేడుకలు ముంబైలో ఆదివారం ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్, జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్ ఎంపీ కవిత, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే సతీమణి లక్ష్మీథాక్రే, పలువురు ఎమ్మెల్యేలు పాల్లొన్నారు. మహిళలతో కలిసి ఎంపీ కవిత, లక్ష్మీ థాక్రే ఉల్లాసంగా బతుకమ్మ ఆడారు. తీరొక్క పూలతో పేర్చిన అందమైన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ, లయబద్ధంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడారు. -
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్ట్ రీడిజైన్ చేసి నిర్మిస్తాం
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్ కుమార్ ఆదివారం కరీంనగర్లో ఖండించారు. ప్రాణహిత - చేవెళ్ల, మిడ్ మానేరు, తోటపల్లి ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ పాలన హయాంలో ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలని ఆ పార్టీ నేతలను టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు. ఈ సదరు ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో చేపట్టినవేనని ఆయన గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ప్రస్తుతం వాటి కోసం ధర్నాలు చేయడమేంటని నిలదీశారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన పనులు వృధా కాకుండా కొనసాగింపుగా ఇది ఉంటుందన్నారు. అయితే, కమిషన్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైన్ చేస్తున్నారంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ఆరోపణలను వినోద్ కొట్టిపడేశారు. గత రెండు దఫాల పాలనలో మిడ్ మానేరు ప్రాజెక్టు పనులు 30 శాతం లోపే కాగా, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే 20 శాతం పనులు పూర్తి చేసినట్టు వినోద్ కుమార్ చెప్పారు. -
బీడీ కార్మికులందరికీ పింఛన్లు: కవిత
నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ హయాంలో పథకాలు పక్కదారిపట్టాయని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో నిధులు దుర్వినియోగం కావడంతో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. సోమవారం నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామజ్యోతి సభలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తున్నామన్నారు. బీడీ కార్మికులందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పారు. -
మంత్రి, ఎంపీకి చేదు అనుభవం
బెంగళూరు: తెలంగాణ - కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డికి మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సదరు ప్రజా ప్రతినిధులతోపాటు పలువురు నాయకులు బృందంగా మంగళవారం ఆ ప్రాజెక్టులను పరిశీలించేందుకు బయలుదేరింది. ఆ విషయం తెలిసిన కర్ణాటక పోలీసులు సరిహద్దుల్లో వారిని అడ్డుకున్నారు. మీ పర్యటనకు తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదంటూ అక్కడి పోలీసులు జూపల్లి, జితేందర్‌రెడ్డికి తేల్చి చెప్పారు. ఆ క్రమంలో వారు కర్ణాటక పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తంగా మారింది. ప్రాజెక్టులు పరిశీలించేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ వారు కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి.. అక్కడే భీష్మించుకుని కుర్చున్నారు. -
కేకేకు అస్వస్థత : నిమ్స్‌కి తరలింపు
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు నిమ్స్‌కి తరలించారు. గుండె సంబంధిత వ్యాధితో కేశవరావు బాధపడుతున్నారని వైద్యులు వెల్లడించారు. కె. కేశవరావు గతంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. మరోసారి ఆయన రాజ్యసభకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అడ్డుకుంది. ఆ క్రమంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరి... సెక్రటరీ జనరల్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఆ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. -
పార్లమెంట్లో TRS సభ్యుల ఆందోళన
-
హామీలపై కేంద్రాన్ని నిలదీద్దాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షపై గట్టిగా నిలదీయాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించుకుంది. ఈ మేరకు పార్టీ ఎంపీలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఇప్పటికే జరిగిన భేటీలో వ్యూహరచన చేసుకున్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కేంద్రం ఇప్పటివరకు నెరవేర్చకపోవడాన్ని తప్పుబడుతూ మంగళవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలను అడ్డుకోవాలని టీఆర్ఎస్ ఎంపీలు నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా తెలంగాణకు ప్రత్యేక హోదా, హైకోర్టు విభజన, ఉద్యోగుల పంపిణీలో జాప్యం, కమలనాథన్ కమిటీ పనితీరు, విభజన చట్టం మేరకు ఏర్పాటు కావాల్సిన ఐఐ ఎం, హార్టికల్చర్ వర్సిటీ వంటి అంశాలపై ఎంపీలు పట్టుబట్టనున్నారని సమాచారం. ప్రాణహితకు జాతీయ హోదా కోసం పట్టు... సాగునీటి రంగంలో గత పాలకులు ప్రదర్శించిన అలసత్వం వల్ల తెలంగాణలో వలసలు పెరిగాయన్న నిశ్చితమైన అభిప్రాయం టీఆర్ఎస్లో ఉంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోపాటు నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడితుల గొంతు తడిపేందుకు ఉద్దేశించిన డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఏపీ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు, దీనిపై కేంద్రం అనుసరిస్తున్న నిర్లిప్త వైఖరిపై సభను స్తంభింపజేయాలన్న వ్యూహంతో ఆ పార్టీ ఎంపీలున్నారు. వీటితోపాటు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదాపైనా పట్టుబట్టాలని నిర్ణయించారు. ప్రాజెక్టులపై, అడ్డుపడుతున్న ఏపీ నిర్వాకంపై కేంద్రానికి ఫిర్యాదు చేయడంతోపాటు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతిని కలిసి చర్చించనున్నారు. ‘ప్రధానంగా హైకోర్టు విభజన అంశంపైనే దృష్టి పెట్టనున్నాం. అన్ని సౌకర్యాలున్నా, కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రకటనలు చేసినా, విభజనలో ఆలస్యం జరుగుతోంది. మూడు రోజుల కిందట గవర్నర్‌నూ కోరాం. ఇక్కడి వారిపై నమ్మకం లేదు. కాకుంటే మా కేసులను ఒడి శా లేదా తమిళనాడుకు మార్చాలని కూడా కోరుతాం..’ అని ఒక ఎంపీ వ్యాఖ్యానించారు. పదో షెడ్యూల్లోని సంస్థల విభజన విషయంలో బాగా ఆలస్యం జరుగుతోందని ఎంపీలు పేర్కొంటున్నారు. కేంద్రంలోని కొందరు పెద్దలు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా, తెలంగాణ అంశాలకు వ్యతిరేకంగా ఉంటున్నారన్న బలమైన అభిప్రాయంతో ఉన్న టీఆర్ఎస్ నాయకత్వం, తమ ఎంపీల ద్వారా కేంద్రంతో అమీతుమీకి సిద్ధపడుతున్నట్లు భావిస్తున్నారు. టీ ప్రభుత్వంపై టీడీపీ కుట్ర... ఎన్డీయేలో భాగస్వామ్యపక్షమైన టీడీపీ... తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతోందని ఎంపీలు విమర్శిస్తున్నారు. ‘ బేగంపేట విమానాశ్రయం నిజాం మనకు ఇచ్చిన వారసత్వ సంపద. అది తెలంగాణ సొత్తు. కానీ టీడీపీకి చెందిన పౌర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతి రాజు బేగంపేట విమానాశ్రయాన్ని సైన్యానికి కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారు..’ అని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. బేగంపేట విమానాశ్రయ వ్యవహారాన్ని పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాలని, కేంద్రం తీరుపై నిరసన తెలపాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బయట ఎవరినీ నిందించవద్దని, ముఖ్యంగా న్యాయవ్యవస్థ విషయంలో జాగ్రత్తగా, ఆచితూచి మాట్లాడాలని కొందరు ఎంపీలకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచించినట్లు సమాచారం. హైకోర్టు విభజనపై సాధ్యమైనంతగా కొట్లాడాలని, ఏది మాట్లాడినా, అది పార్లమెంటు సమావేశాల్లోనే మాట్లాడాలని కూడా వీరికి సూచించారని తెలిసింది. లోక్‌సభ స్పీకర్ సోమవారం నిర్వహించనున్న అఖిలపక్ష భేటీకి హాజరవుతున్నామని, మంగళవారం నుంచి మొదలయ్యే పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి వ్యూహాన్ని అమలు చేస్తామని టీఆర్ఎస్ ఎంపీ ఒకరు వివరించారు. -
ప్రశ్నించడం మాని భజన చేస్తున్న పవన్
హైదరాబాద్: ప్రముఖ నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మంగళవారం హైదరబాద్‌లో మండిపడ్డారు. ప్రశ్నించడం మాని పవన్ కల్యాణ్ భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్యాకేజీలు తీసుకుని పవన్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును ఎందుకు నిలదీయడం లేదని పవన్‌ను ఈ సందర్భంగా బాల్క సుమన్ సూటిగా ప్రశ్నించారు. ఎంపీలపై విమర్శలు గుప్పిస్తున్న పవన్... ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని సుమన్ గుర్తు చేశారు. -
రేవంత్ తొడగొట్టి... మీసాలు మెలేయడం...
కరీంనగర్: కొడంగల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో బెయిల్ పై చర్లపల్లి జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన వ్యవహరించిన తీరుపై టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ మండిపడ్డారు. గురువారం కరీంనగర్లో బి.వినోద్‌కుమార్ విలేకర్లతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి తొడగొట్టి ... మీసాలు మెలేయడం సాక్షులను బెదిరించడమే అని ఆయన అభిప్రాయపడ్డారు. మాకు వ్యతిరేకంగా ఉంటే అంతుచూస్తామన్నట్లు రేవంత్ వ్యవహరించారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలను కాపాడేలా లేరని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల స్వేచ్ఛకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్న చంద్రబాబు .... రేవంత్‌ను పావులా వాడుకున్నారని విమర్శించారు. ఈ నెల 21వ తేదీ లోపు హైకోర్టు విభజన లేకుంటే పార్లమెంట్‌ను స్తంభింపచేస్తామని ఎంపీ వినోద్ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
'చంద్రబాబుకు ఆ విషయం కూడా తెలియదా'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై నల్గొండ జిల్లా భువనగిరి లోక్‌సభ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ శుక్రవారం హైదరాబాద్‌లో విరుచుకుపడ్డారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆరోపణలు నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు రోజుకో అంశాన్ని తెరపైకి తెస్తున్నారని నర్సయ్య గౌడ్ ఆరోపించారు. చంద్రబాబు ఇల్లు కట్టుకోవడానికి అనుమతి తీసుకోవాలని కూడా తెలియని స్థితిలో చంద్రబాబు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీరుపై ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. -
ఆంధ్రావాళ్లపై దాడులు జరగలేదు: ఎంపీ వినోద్
న్యూఢిల్లీ: తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్లపై ఎలాంటి దాడులు జరగలేదని ఎంపీ వినోద్ అన్నారు. గురువారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లో ఎవరిపైనా అక్రమ దాడులు కానీ.. ఉద్దేశపూరిత దాడులు కానీ జరగలేదని వినోద్ అన్నారు. అదే విధంగా సెక్షన్ - 8ను అమలు చేయాల్సిన అవసరం లేదని ఎంపీ వినోద్ చెప్పారు. -
కువైట్ చేరుకున్న ఎంపీ కవిత
కువైట్: తెలంగాణ ప్రవాసీయులను కలవడానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గురువారం కువైట్‌కు చేరుకున్నారు. కువైట్‌లో ఆమెకు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ప్రవాసీ ప్రముఖులు వినయ్ కుమార్, పూర్ణచంద్రరావు, ఇమ్రానుద్దీన్ ఇమ్మూ తదితరులు కువైట్ విమానాశ్రయానికి వచ్చి ఆమెకు స్వాగతం పలికారు. కువైట్ లోని వివిధ వర్గాల తెలంగాణ ప్రవాసీయులతో కవిత సమావేశం అయ్యేందుకు అక్కడికి చేరుకున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లేబర్ క్యాంపులో ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించడంతో పాటు కువైట్‌లోని భారతీయ రాయబారి సునిల్ జైన్‌తో సమావేశం అవుతారు. అనంతరం కేంబ్రిడ్జి పాఠశాలలో జరిగే సభలో పాల్గొంటారు. శుక్రవారం బహ్రెయిన్‌లో జరుగనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కవిత ముఖ్య అతిథిగా పాల్గొంటారని హరిప్రసాద్ తెలిపారు. ఈసా టౌన్‌లోని భారతీయ పాఠశాల మైదానంలో ఆ కార్యక్రమం ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణకు చెందిన రాజకీయ ప్రముఖులు ఈ రెండు దేశాల్లో పర్యటించటం ఇదే తొలిసారి. గతవారం కవిత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయి, అబుదబి నగరాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. -
టీఆర్ఎస్కు దగ్గర కాబోం: మురళీధర్‌రావు
న్యూఢిల్లీ: ఎన్డీయేలో చేరే విషయమై టీఆర్ఎస్ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ప్రతికూలంగా స్పందించింది. తెలంగాణలో టీఆర్ఎస్కు దగ్గరయ్యే ప్రసక్తిలేదని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు స్పష్టం చేశారు. ఆ రాష్ట్రంలో బలమైన పోరుకు బీజేపీ శ్రీకారంచుడుతోందన్నారు. శుక్రవారం ఢిల్లీలో విలేకరుల ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఆహ్వానిస్తే ఎన్డీఏలో చేరే విషయమై ఆలోచిస్తామంటూ టీఆర్ఎస్ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా ఇతర పార్టీలను ఆహ్వానించే అవసరం తమకు లేదన్నారు. తెలంగాణలో బీజేపీ బలాన్ని నిరూపించుకోడానికి గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు ముఖ్యమైనవన్నారు. ఒంటరిగా ఎదిగే ప్రయత్నంలో తెలంగాణ నుంచి ఇంకో పార్టీని ఎన్డీయేలోకి తీసుకునే ఆలోచన లేదన్నారు. రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి సహకరించాలని అన్ని పార్టీలను కలుస్తుంటామని, ఆ క్రమంలో టీఆర్ఎస్తోనూ సంప్రదించడం జరుగుతుందన్నారు. -
'లోకేష్ ఏ హోదాలో యూఎస్‌లో తిరుగుతున్నారు'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో చేపట్టనున్న రైతు భరోసా యాత్రపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ బుధవారం న్యూఢిల్లీలో స్పందించారు. రాహుల్‌ది భరోసా యాత్ర కాదని.. కాంగ్రెస్ భరోసా యాత్ర అని ఆయన ఎద్దేవా చేశారు. వడగండ్ల వాన పడితే అమేథిలో పర్యటించకుండా తెలంగాణలో రాహుల్ పర్యటించడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. లోకేష్ ఏ అధికార హోదాతో ప్రత్యేక విమానాల్లో అమెరికాలో తిరుగుతున్నారని బాల్క సుమన్ ప్రశ్నించారు. అమెరికాలోని పెద్ద సంస్థలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణకు తెస్తున్నారని తెలిపారు. -
‘గీత’ సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేయండి
ప్రధాని మోదీకి టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ విజ్ఞప్తి న్యూఢిల్లీ: గీత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్రమోదీకి టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారమిక్కడ పార్లమెంట్‌లోని ప్రధానమంత్రి చాంబర్లో కలసి వినతిపత్రం ఇచ్చారు. కల్లు ఉత్పత్తులను పారిశ్రామిక ఉత్పత్తిగా గుర్తించడంతోపాటు ఎగుమతులకు అనుమతించాలని కోరారు. కల్లు గీతలో అత్యాధునిక పద్ధతులపై శిక్షణ ఇప్పించేందుకు ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్య బీమా సదుపాయాన్ని గీత కార్మికులతోపాటు వారి కుటుంబ సభ్యులకు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదవశాత్తు గీతకార్మికుడు మరణిస్తే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని విన్నవించారు. ‘మేక్ ఇన్ ఇండియా’లో చేతివృత్తులను భాగస్వాములు చేయాలని కోరారు. -
'పునర్వ్యవస్థీకరణ సమగ్ర బిల్లును లోక్ సభలో పెట్టాలి'
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఖమ్మంలోని ఏడు మండలాల ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని టీఆర్ ఎస్ ఎంపీ వినోద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి గడిచిన ఏడాది వ్యవధిలో రెండు సవరణలు చేశారని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన లోక్ సభలో మాట్లాడుతూ...చీటికీ మాటికీ చట్టంలో సవరణలు చేయకుండా లోపాలను సవరించి సమగ్ర బిల్లును సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఖమ్మంలోని ఏడు మండలాల ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత పునర్విభజన బిల్లుకు టీఆర్ ఎస్ పార్టీ పూర్తిగా మద్దతిస్తోందన్నారు. -
'పవన్ పోరాటం ఎవరిపైనో స్పష్టం చేయాలి'
-
'పవన్ పోరాటం ఎవరిపైనో స్పష్టం చేయాలి'
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోరాటం ఎవరిపైనో స్పష్టం చేయాలని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ గురువారం హైదరాబాద్‌లో డిమాండ్ చేశారు. భూ సేకరణపై చంద్రబాబును ఎందుకు నిలదీయడం లేదని ఈ సందర్బంగా పవన్ కల్యాణ్‌ను బాల్క సుమన్ ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు కరీంనగర్లో పర్యటన చేస్తారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాబు పట్ల ప్రజల్లో నమ్మకం పోయిందని... అందుకే ప్రజలు దృష్టిని మళ్లించే బాబు యత్నం చేస్తున్నారని విమర్శించారు. -
'33 శాతం రిజర్వేషన్ కల్పించినప్పుడే మహిళా సాధికారత'
కరీంనగర్: రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అవుతుందని టీఆర్ ఎస్ ఎంపీ వినోద్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మాట్లాడుతూ..చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు. పురుషులతో సమానంగా మహిళలకు టీఆర్ఎస్ లో సభ్యత్వం కల్పిస్తామని తెలంగాణ టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు తుల ఉమ పేర్కొన్నారు. -
ఎంపీకి బ్లాక్ మెయిల్: రూ.25 కోట్లు డిమాండ్
హైదరాబాద్ : ‘నామినేషన్లో ఎలక్షన్ కమిషన్‌కు మీరు తప్పుడు ఆస్తులు చూపించారు. మా వద్ద సాక్ష్యాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే రూ.25 కోట్లు ఇవ్వండి’ అని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి కొద్ది రోజుల క్రితం ఈమెయిల్ బెదిరింపు వచ్చింది. ఈ మేరకు సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు డెకాయి ఆపరేషన్ నిర్వహించి ముగ్గురిని రిమాండ్ చేశారు. నిందితుల్లో ఓ మాజీ ఎంపీ బంధువు ఉండడం గమనార్హం. సైబరాబాద్ క్రైమ్ ఏసీపీ జయరాం కథనం ప్రకారం..జూబ్లీహిల్స్‌కు చెందిన వెకంటరమణారెడ్డి, బెంగుళూరుకు చెందిన రాజేష్, కుమార్ కలిసి ఎంపీ కుమారుడు కొండా అనిధిత్‌రెడ్డికి డిసెంబర్ 8వ తేదీన మెయిల్ చేశారు. మీ ఆస్తుల వివరాలపై ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే రూ. 25 కోట్లు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఈ మెయిల్‌ను అతడు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి చూపించాడు. రెండు రోజులకు మరో మెయిల్ పెట్టారు. వరుసగా సెల్ఫోన్లో కూడా వేధించడం ప్రారంభించారు. దీంతో ఎంపీ జనవరి 8వ తేదీన సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్ రియాజుద్దీన్ కేసు నమోదు చేసుకుని ఎస్ఐలు కె.శ్రీనివాస్, కె.విజయవర్ధన్‌లతో కలిసి నిందితులతో డెకాయి ఆపరేషన్ నిర్వహించారు. రూ.25 కోట్లు ఇస్తామని ముగ్గురు నిందితులను గచ్చిబౌలికి పిలిపించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
వనరులు గుర్తించండి..
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వనరులను గుర్తించాలని టీఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. గురువారం ఆదిలాబాద్‌కు వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్బీ విశ్రాంతి భవనంలో మంత్రి జోగు రామన్న, కలెక్టర్ జగన్మోహన్తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న వనరులను గుర్తించి పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల నిరుద్యోగ సమస్య తీరుతుందని అన్నారు. సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ మూతపడడానికి గల కారణాలపై అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ఎయిర్‌పోర్టుకు సంబంధించిన వివరాలు కలెక్టర్ ద్వారా తెలుసుకున్నారు. నేరడిగొండ మండలం కుంటాల జలపాతంపై విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే జిల్లాకు సరిపోయే విద్యుత్‌తోపాటు ఇతర జిల్లాలకు కూడా సరఫరా చేయవచ్చని అన్నారు. హైడల్ పవర్ ప్రాజెక్టు వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదని తెలిపారు. ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణ సబంధించి కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారని, అర్హులైన వారికి న్యాయం చేయాలని అన్నారు. యాపల్‌గూడలో ఏర్పాటు చేయనున్న సిమెంట్ ఫ్యాక్టరీ వివరాలను మంత్రి రామన్న వివరించారు. అంతకుముందు కలెక్టర్ జగన్మోహన్, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి స్వాగతం పలికారు. -
' షూటింగ్ హబ్‌గా హైదరాబాద్'
హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని షూటింగ్ హబ్‌గా మారుస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆమె మాట్లాడుతూ... హైదరాబాద్‌లో సినిమా షుటింగ్ చేసుకునే వారికి రాయితీ ఇచ్చేలా సీఎం కేసీఆర్‌తో చర్చించామని తెలిపారు. ఫిల్మ్ సిటీ ఏర్పాట్లపై కేసీఆర్ ప్రయత్నాలను ముమ్మరం చేశారని వివరించారు. రంగారెడ్డి జిల్లా రాచకోండలోని సువిశాలమైన స్థలంలో ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఫిల్మ్ సిటీ నిర్మాణం కోసం ఇప్పటికే సీఎం కేసీఆర్ రాచకోండ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. -
కేసీఆర్ కూతురంటే నిజాం కూతురా ?
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ హిట్లర్ కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారని టీటీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని ఆయన అన్నారు. గురువారం తెలంగాణ అసెంబ్లీలో టీటీడీపీ ఎమ్మెల్యేలను వారం పాటు సస్పెండ్ చేశారు. దాంతో ఎర్రబెల్లితోపాటు మిగతా టీటీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సమగ్ర సర్వేలో సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత రెండు చోట్ల తన వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేసుకున్నారని... దీనిపై సమాధానం ఇవ్వాలని తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రశ్నించారని గుర్తు చేశారు. ఈ విషయం వాస్తవమా కాదా అన్న విషయం సభలో వెల్లడించాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉందని ఎర్రబెల్లి అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా రెండురోజులగా అసెంబ్లీ సమావేశాలు జరగకుండా గందరగోళం సృష్టిస్తుందని విమర్శించారు. ప్రజల సమస్యలను నిలదీస్తామనే ఉద్దేశ్యంతోనే తమను సభ నుంచి వారం రోజుల పాటు సస్పెండ్ చేసేశారని ఆరోపించారు. ప్రభుత్వమే కాదు స్పీకర్ కూడా ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం, స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టెందుకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కవిత విషయంపై సభలో ప్రశ్నిస్తే.... నా కూతురు గురించి మాట్లాడుతారా అంటూ కేసీఆర్, తమ సీఎం కూతురు గురించి మాట్లాడుతారా అంటూ టీఆర్ఎస్ సభ్యులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కూతురంటే నిజాం కూతురా? ఆమె గురించి ప్రశ్నించడం తప్పా అని విలేకర్ల ఎదుట ఎర్రబెల్లి ప్రశ్నించారు. -
సాక్షి, నమస్తే తెలంగాణలనే ఎందుకు అడ్డుకుంటున్నారు?
కరీంనగర్: ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అవసరమని కరీంనగర్ ఎంపీ, టీఆర్ఎస్ నాయకుడు బి.వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం కరీంనగర్లో వినోద్ కుమార్ మాట్లాడుతూ... మీడియాపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరీపై మండిపడ్డారు. పత్రికా స్వేచ్ఛ గురించి బాగా మాట్లాడే చంద్రబాబు... నమస్తే తెలంగాణ, సాక్షి మీడియాను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏదైనా విషయం జరిగితే గోరంతను కొండంతలుగా రాసే వారు చంద్రబాబు తీరును ఎందుకు ఎండగట్టడం లేదని ప్రశ్నించారు. అక్టోబర్‌లో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని వినోద్ కుమార్ చెప్పారు. -
'ఆ షెడ్యూళ్ల'పై ఏపీ అధికారులు కొత్త అర్థం ...
న్యూఢిల్లీ: 9, 10 షెడ్యూల్‌పై ఆంధ్రప్రదేశ్ అధికారులు కొత్త అర్థాలు చెబుతున్నారని టీఆర్ఎస్ ఎంపీ బి. వినోద్ కుమార్ ఆరోపించారు. ఆదివారం తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం టీఆర్ఎస్ ఎంపీ వినోద్ మాట్లాడుతూ... చట్టం ప్రకారం ఏ ప్రాంతంలో ఉన్న సంస్థలు ఆ ప్రాంతానికే చెందెలా స్పష్టత ఇవ్వాలని రాజ్‌నాథ్‌కు కోరినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న సంస్థలపై ఏపీ ప్రభుత్వం అధికారం చెలాయించాలని చూస్తుందని ఆరోపించారు. ఈ అంశంపై కూడా ఓ నిర్ధిష్టమైన స్పష్టత ఇవ్వాలని కేంద్ర హోంశాఖ మంత్రిని కోరినట్లు చెప్పారు. అయితే హైదరాబాద్‌లో గవర్నర్‌కు అధికారులు అనే అంశంపై చర్చ మాత్రం జరగలేదని వినోద్ స్పష్టం చేశారు. -
హోం మంత్రిని కలవనున్న టీఆర్ఎస్ ఎంపీలు