ప్రముఖ నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మంగళవారం హైదరబాద్లో మండిపడ్డారు.
హైదరాబాద్: ప్రముఖ నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మంగళవారం హైదరబాద్లో మండిపడ్డారు. ప్రశ్నించడం మాని పవన్ కల్యాణ్ భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్యాకేజీలు తీసుకుని పవన్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును ఎందుకు నిలదీయడం లేదని పవన్ను ఈ సందర్భంగా బాల్క సుమన్ సూటిగా ప్రశ్నించారు. ఎంపీలపై విమర్శలు గుప్పిస్తున్న పవన్... ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని సుమన్ గుర్తు చేశారు.