'పునర్వ్యవస్థీకరణ సమగ్ర బిల్లును లోక్ సభలో పెట్టాలి'
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఖమ్మంలోని ఏడు మండలాల ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని టీఆర్ ఎస్ ఎంపీ వినోద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి గడిచిన ఏడాది వ్యవధిలో రెండు సవరణలు చేశారని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన లోక్ సభలో మాట్లాడుతూ...చీటికీ మాటికీ చట్టంలో సవరణలు చేయకుండా లోపాలను సవరించి సమగ్ర బిల్లును సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఖమ్మంలోని ఏడు మండలాల ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత పునర్విభజన బిల్లుకు టీఆర్ ఎస్ పార్టీ పూర్తిగా మద్దతిస్తోందన్నారు.