Vinod
-
చివరి సినిమా ఫిక్స్
తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. ‘దళపతి 69’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకుడు. కేవీఎన్ ప్రోడక్షన్స్పై ఎన్కే, వెంకట్ కె. నారాయణ ఆధ్వర్యంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. ‘‘విజయ్‌తో మా మొదటి చిత్రం ‘దళపతి 69’. ఈ సినిమా కోసం హెచ్. వినోద్ అద్భుతమైన కథని సిద్ధం చేశారు. మూడు దశాబ్దాల సినిమా ప్రయాణంలో తిరుగులేని స్టార్డమ్తో కథానాయకుడిగా రాణించారు విజయ్. ఆయన హీరోగా రూపొందుతోన్న చివరి చిత్రం ‘దళపతి 69’ కానుండటంతో భారతీయ సినీ చరిత్రలో నిలిచేపోయేలా తెరకెక్కిస్తాం. సరికొత్త రికార్డులను సృష్టించేలా ఈ సినిమాని రూపొందించనున్నాం. ఈ చితాన్ని 2025 అక్టోబర్‌లో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్. -
‘రేణుకాస్వామి ఇంటికి వెళ్లింది రాజీ కోసం కాదు’
దొడ్డబళ్లాపురం: పరప్పన అగ్రహార జైలులో దర్శన్‌ను కలిసిన నటుడు వినోద్ రాజ్ కొన్ని రోజుల వ్యవధిలోనే రేణుకాస్వామి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించడంపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ వస్తున్నాయి. దర్శన్, రేణుకాస్వామి కుటుంబం మధ్య రాజీ చేయడానికి వినోద్‌రాజ్ వెళ్లారని వదంతులు వినిపిస్తున్నాయి.ఇందుకు సంబంధించి వివరణ ఇచ్చిన వినోద్ రాజ్...తోటి ఆర్టిస్టు అనే అభిమానంతో, దర్శన్‌తో ఉన్న అనుబంధం నేపథ్యంలో దర్శన్‌ను జైలుకు వెళ్లి కలిశానన్నారు. మానవత్వం కోణంలో ఆలోచించి ఆ కుటుంబానికి ఏమైనా సాయం చేద్దామని రేణుకాస్వామి కుటుంబ సభ్యులను కలిశానని, రాజీ కుదిర్చే ఉద్దేశం ఆలోచన తనకు లేవన్నారు. -
'మనం జాబ్ చేయండి ఏంటి?'.. ఆసక్తిగా పేకమేడలు ట్రైలర్!
వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నటిస్తోన్న సినిమా 'పేకమేడలు'. ఈ చిత్రం ద్వారా వినోద్ కిషన్ హీరోగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాకేష్ వర్రే నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు సినీ ప్రియుల అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. మధ్య తరగతి జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఏ పనిపాట లేకుండా భార్య సంపాదన మీద బతికే ఓ వ్యక్తి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఒక అమ్మాయి పరిచయంతో అతని లైఫ్ ఎలా మారింది? అనే కథాంశంతో రూపొందించినట్లు అర్థమవుతోంది.'వెధవ పనులు చేసేటప్పుడు పదిమందికి తెలియకుండా చేయాలన్న ఇంగిత జ్ఞానం లేదారా నీకు?' అన్న డైలాగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. మొత్తానికి ట్రైలర్ చూస్తే ఫుల్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈనెల 19న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. కాగా.. ఈ చిత్రంలో రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ ముఖ్య పాత్రలు పోషించారు. -
హీరోగా ఎంట్రీ ఇస్తోన్న వినోద్ కిషన్.. లిరికల్ సాంగ్ వచ్చేసింది!
'నా పేరు శివ', 'అంధగారం' చిత్రాలతో మెప్పించిన వినోద్ కిషన్ హీరోగా నటిస్తోన్న మూవీ 'పేక మేడలు'. ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో అనూష కృష్ణ హీరోయిన్గా కనిపించనుంది. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్, సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆడపిల్ల అనే పాటకు సాకే రాజశేఖర్ పాడగా.. భార్గవ కార్తీక్ లిరిక్స్ అందించారు. ఒక మంచి కాన్సెప్ట్, కంటెంట్ ఉన్న స్టోరీగా ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని జూలై 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీలో రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
సైనిక్ స్కూల్‌పై రేవంత్ అబద్ధాలు: వినోద్
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో సైనిక్ స్కూల్ ఏర్పా టుపై సీఎం రేవంత్ రెడ్డి అసత్యాలు మాట్లా డుతున్నా రని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బి.వినోద్ కుమార్ విమర్శించారు. ఇకపై ఆయన చెప్పే అబద్ధాలకు దీటుగా సమాధానం ఇస్తామ న్నారు. మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి వినోద్ కుమార్ మంగళవారం తెలంగాణ భవన్లో విలేకరులతో మా ట్లాడారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ త ర్వాత రేవంత్ గోబెల్స్ తరహాలో మాట్లాడార న్నారు.వరంగల్‌లో సైనిక్ స్కూలు గతంలోనే మంజూరైందని, కానీ రక్షణశాఖ ఆధ్వర్యంలో నడపలే మని చెప్పినందునే సమస్య తలెత్తిందన్నారు. సైనిక్ స్కూల్ ఏర్పాటుపై గతంలో నాటి రక్షణ మంత్రులు మనోహర్ పారిక్కర్, అరుణ్ జైట్లీని అనేక మార్లు కలిశామని పేర్కొన్నారు. వరంగల్ సైనిక్ స్కూలు ఏర్పాటుపై గత ప్రభుత్వం కేంద్రంతో చేసిన ఉత్తర ప్రత్యుత్తరాలను రేవంత్ చదువుకోవాలని సూచించారు. రక్షణ శాఖ భూముల కేటాయింపునకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు రికార్డుల్లో ఉన్నాయని గుర్తు చేశారు. -
మే ఆఖరుకి సాధారణ స్థితికి కార్యకలాపాలు
న్యూఢిల్లీ: పైలట్ల ఆందోళనలతో ఫ్లయిట్ సర్విసులకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో మే నెలాఖరుకల్లా అంతా సద్దుమణుగుతుందని, పరిస్థితులు సాధారణ స్థితికి తిరిగొస్తాయని విమానయాన సంస్థ విస్తార సీఈవో వినోద్ కణ్ణన్ తెలిపారు. పైలట్లు లేవనెత్తిన సమస్యలపై దృష్టి పెట్టామని, వాటి పరిష్కార మార్గాలపై చర్చిస్తున్నామని ఆయన వివరించారు. ఫ్లయిట్ల సంఖ్య తగ్గవచ్చు గానీ ఈ వారాంతం నుంచి ఫ్లయిట్లను అప్పటికప్పుడు రద్దు చేసే పరిస్థితి ఉండబోదని కణ్ణన్ పేర్కొన్నారు. కార్యకలాపాలను కుదించుకునే క్రమంలో 20–25 రోజువారీ ఫ్లయిట్స్‌ను తగ్గించినట్లు ఆయన వివరించారు. విమానాలు రద్దు కావడం వల్ల ఇబ్బందిపడిన ప్రయాణికులకు తమ సిబ్బంది తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు కణ్ణన్ తెలిపారు. విస్తారాలో 6,500 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 1,000 మంది పైలట్లు, 2,500 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. -
సోదరుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు
కంటోన్మెంట్(హైదరాబాద్): ఆస్తి తగాదాలతో వరుసకు సోదరుడైన ఒక వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సికింద్రాబాద్ ప్రాంతంలోని బోయిన్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 70 శాతం గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బోయిన్పల్లి కంసారిబజార్ రామమందిరం సమీపంలో కందికొండ సత్తయ్య, ముత్తయ్యలకు నివాసస్థలం ఉంది. ముత్తయ్య కుమారుడు శ్రీనివాస్(62) ఇటీవల తన తండ్రి ద్వారా సంక్రమించిన స్థలంలో ఇంటినిర్మాణం చేపట్టి అద్దెకు ఇచ్చాడు. తాను సమీపబస్తీలో నివాసం ఉంటున్నాడు. కంసారి బజార్లో తన ఇంటి పక్కనే వరుసకు సోదరుడైన వినోద్ (సత్తయ్య కుమారుడు) మరో ఇంటిలో నివాసముంటున్నాడు. వీరిద్దరి ఇళ్ల నడుమ ఉన్న చిన్నపాటి సందు గుండానే శ్రీనివాస్ ఇంటికి దారి ఉంది. ఈ స్థలం విషయంలోనే వీరి మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఆదివారం శ్రీనివాస్ అద్దె వసూలు నిమిత్తం తన ఇంటికి వచ్చి తిరిగి వెళ్తుండగా వినోద్ అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తన అన్నను చంపానంటూ అరుస్తూ పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్‌లో శ్రీనివాస్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో శ్రీనివాస్ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ద్విచక్ర వాహనంపై అర్ధరాత్రి వస్తుండగా..
కరీంనగర్: మండలంలోని తుమ్మన్నపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వలస కూలీ మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం బైపాస్ రోడ్డు పనులు చేపడుతున్న డీబీఎల్ కంపెనీలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంగికలన్ మీర్జాపూర్‌కు చెందిన వినోద్(23) కూలీగా పనిచేస్తున్నాడు. ఓం ప్రకాశ్ అనే మరోవ్యక్తితో ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం ఖాజీపేటకు వెళ్లారు. తిరిగి తుమ్మనపల్లికి గురువారం అర్ధరాత్రి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఓంప్రకాశ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడి కుటుంబసభ్యుడు ఆమల్ ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవి చదవండి: అర్ధరాత్రి స్వాతి వద్దకు వచ్చిన వ్యక్తి ఎవరు.. -
కారులోనే తుదిశ్వాస విడిచిన ప్రముఖ మళయాల నటుడు
కొచ్చి: పాపులర్ మళయాల నటుడు వినోద్ థామస్(45) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.కేరళలోని పంపడిలోని ఓ హోటల్లో పార్క్ చేసి ఉన్న కారులో ఆయన చనిపోయి ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. చాలా సేపటి నుంచి హోటల్ ఆవరణలో ఉన్న కారులో ఒక వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు హోటల్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు వచ్చి చూశామని పోలీసులు చెప్పారు. హోటల్‌కు చేరుకున్న వెంటనే కారులో పడి ఉన్న వినోద్ థామస్‌ను ఆస్పత్రికి తరలించామని, అయితే అతను అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారని పోలీసులు తెలిపారు. వెంటనే మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపించామన్నారు. అయ్యప్పనుమ్ కోష్యుమ్, నథోలి, ఒరు చెరియ మీనల్ల, ఒరు వంత్ పాతాయా, హ్యాప్పీ వెడ్డింగ్, జూన్ లాంటి పాపులర్ సినిమాల్లో వినోద్ థామస్ నటింంచారు. ఇందులో అయ్యప్పనుమ్ కోష్యుమ్ అనే చిత్రం తెలుగులో భీమ్లానాయక్ పేరుతో రీమేక్ చేశారు. ఇదీచదవండి.. ‘అమ్మా..గంగమ్మ తల్లీ.. భారత్‌ను గెలిపించమ్మా’ -
ప్రేమ విఫలమైందని.. యువకుడి తీవ్ర నిర్ణయం..!
మహబూబాబాద్: ప్రేమ విఫలమైందనే ఆవేదనతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం ఇల్లెందు మండలం పోలారం గ్రామానికి చెందిన వినోద్(25) మానుకోట జిల్లా కలెక్టరేట్లోని దివ్యాంగుల విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పోలారం గ్రామానికే చెందిన ఓ యువతితో ఆయన ప్రేమలోపడగా, యువతి తండ్రి వినోద్‌ను హెచ్చరించాడు. దీంతో మనస్తాపానికి గురైన వినోద్ ఇరవై రోజుల క్రితం పురుగుల మందు తాగగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. వినోద్ తండ్రి ప్రభాకర్ ఫిర్యాదుతో యువతి కుటుంబానికి చెందిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఇల్లెందు ఎస్సై గిరిధర్‌రెడ్డి తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
Double-Decker Skyways: జేబీఎస్ టు శామీర్‌పేట డబుల్ డెక్కర్ స్కైవే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జూబ్లీ బస్టాండ్ (జేబీఎస్) నుంచి శామీర్‌పేట మధ్యలో డబుల్ డెక్కర్ స్కైవే నిర్మాణంతో కరీంనగర్–హైదరాబాద్ రూట్లో ప్రయాణానికి మహర్దశ పట్టినట్టే. ఇటీవల ఈ ప్రతిపాదనను కేంద్రం వద్ద ఉంచగా, సానుకూలత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. డబుల్ డెక్కర్ స్కైవే మూడంచెల పద్ధతి ఉంటుందని, పైభాగంలో మెట్రోరైలు, మధ్యలో ఫ్లైఓవర్, కిందిభాగంలో రోడ్డు ఉంటుందని వివరించారు. పనులు పూర్తయ్యే నాటికి రూ.ఐదువేల కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. కరీంనగర్ మార్గంలో జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు 18.5 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ స్కైవే నిర్మాణంతో సిద్దిపేట, కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు హైదరాబాద్‌కు సాఫీగా రాకపోకలు సాగించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డిలతో కలిసి తాను కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిపిన చర్చల ఫలితంగానే ఈ ప్రతిపాదన ఓ కొలిక్కి వచ్చినట్టు తెలిపారు. -
మణిపూర్: అమిత్ షా అఖిలపక్ష భేటీ.. ఏపీ, టీఎస్ నుంచి వెళ్లింది వీరే..
సాక్షి, ఢిల్లీ: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రహోం మంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. మణిపూర్ ఘర్షనల నేపథ్యంలో నేడు(శనివారం) అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు.. శుక్రవారం కూడా మరోసారి మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాల ప్రకారం.. హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని, సాధారణ స్థితిని పునరుద్ధరించే మార్గాలపై ఆలోచించడమే అఖిలపక్ష సమావేశం ఉద్దేశమని అమిత్ షా చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుందని తెలిపారు. అయితే, మణిపూర్ ఘర్షణల తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ఇక, ఈ సమావేశానికి ఏపీ నుంచి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ వినోద్ హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా.. మణిపూర్‌లో హింసాత్మక ఘటన నేపథ్యంలో తొమ్మిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నోంగ్‌తోంబమ్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయారని వారు విమర్శలు చేశారు. ఐదు అంశాలతో కూడిన మెమోరాండంను మోదీకి సమర్పించిన ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై, పరిపాలనపై తమకు నమ్మకం లేదన్నారు. చట్టపరంగా పరిపాలన అనుసరించడం ద్వారా సరైన పరిపాలన, ప్రభుత్వ పనితీరు కోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, తద్వారా ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందవచ్చు అని లేఖలో వివరించారు. కాగా, ఈ ఎమ్మెల్యేలంతా మైతి సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. లేఖపై సంతకాలు చేసిన ఎమ్మెల్యేలు వీరే.. - కరమ్ శ్యామ్ సింగ్, - తోక్చోమ్ రాధేశ్యామ్ సింగ్, - నిషికాంత్ సింగ్ సపం, - ఖ్వైరక్పం రఘుమణి సింగ్, - ఎస్. బ్రోజెన్ సింగ్, - టీ. రవీంద్రో సింగ్, - ఎస్, రాజేన్ సింగ్, - ఎస్. కేబీ దేవి, - వై. రాధేశ్యామ్. ఇది కూడా చదవండి: ఇండిగో విమానంలో మహిళకు గుండెపోటు.. సీపీఆర్ చేయడంతో.. -
దమ్ముంటే తమ మద్దతు లేకుండా గెలవాలంటూ గంగులకు చాలెంజ్
-
మామూలుగా తిట్టుకోవట్లే...
-
అన్నదమ్ముల అదృశ్యం..!
-
షార్ట్ కవరింగ్ లాభాలు
ముంబై: దేశీయ స్టాక్ సూచీలు మార్చి సిరీస్‌కు లాభాలతో వీడ్కోలు పలికాయి. ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్ల జరగడంతో బుధవారం సూచీలు అరశాతానికి పైగా లాభపడ్డాయి. బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు కొలిక్కి వస్తుండంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఉదయం మార్కెట్ ప్రారంభమైన తర్వాత మిడ్ సెషన్ వరకు సూచీలు స్థిరంగా కదలాడాయి. ఆ తర్వాత కాస్త నెమ్మదించినా.., చివరి గంటలో కీలక రంగాల్లో కొనుగోళ్ల జోరు పెరగడంతో లాభాలు పెరిగాయి. ఉదయం సెన్సెక్స్ 41 పాయింట్ల స్వల్ప నష్టంతో 57,613 మొదలైంది. ఇంట్రాడేలో 57,524 వద్ద కనిష్టాన్ని, 58,124 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 346 పాయింట్లు ఎగసి 57,960 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25 పాయింట్లు పతనమై 16,952 వద్ద మొదలైంది. రోజంతా 16,941 – 17,126 శ్రేణిలో ట్రేడైంది. చివరికి 129 పాయింట్ల లాభంతో 17,081 వద్ద నిలిచింది. అన్ని రంగాల షేర్లకు డిమాండ్ నెలకొంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు అధికాస్తకి చూపారు. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒకటిన్నర శాతానికి పైగా ర్యాలీ చేశాయి. ఎఫ్‌పీఐలు రూ.1,245 కోట్ల షేర్లను, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.823 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 15 పైసలు క్షీణించి 82.31 స్థాయి వద్ద స్థిరపడింది. శ్రీరామ నవమి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు కావడంతో ఎక్సే్చంజీలు తిరిగి శుక్రవారం ప్రారంభమవుతాయి. సూచీలు అరశాతానికి పైగా ర్యాలీ చేయడంతో బీఎస్ఈలో రూ.3.12 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఆసియా మార్కెట్లు ఒకశాతం, యూరప్ మార్కెట్లు ఒకటిన్నర శాతం పెరిగాయి. యూఎస్ స్టాక్ సూచీలు ఒకశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ‘‘ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతుందనే స్పష్టం వచ్చేంత వరకు, బ్యాంకింగ్ రంగంలో అనిశ్చితులు సంపూర్ణంగా సద్దుమణిగే దాకా ఒడిదుడుకులు తప్పవు. సాంకేతికంగా నిఫ్టీ గత 5 రోజుల్లో గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. ఎగువన 17,207–17,255 శ్రేణిలో నిరోధాన్ని, దిగువ స్థాయిలో 16,985 వద్ద తక్షణ మద్దతు ఏర్పాటు చేసుకుంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦కెన్ తన నివేదికలో నిరాధారమైన, సత్యదూరమైన ఆరోపణలు చేసిందంటూ అదానీ గ్రూప్ వివరణతో ఈ కంపెనీల షేర్లు ర్యాలీ చేశాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ తొమ్మిది శాతం, అదానీ పోర్ట్స్ ఏడుశాతం లాభపడ్డాయి. అదానీ పవర్, అదానీ విల్మార్, ఎన్డీటీవీ షేర్లు ఐదుశాతం ఎగసి అప్పర్ సర్క్యూట్ వద్ద లాకయ్యాయి. ♦ ఇండస్ఇండ్ బ్యాంకుతో వివాదాలను పరిష్కరించుకున్నామని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ తెలపడంతో జీ మీడియా షేరు మూడున్నర శాతం లాభపడి రూ.216 వద్ద స్థిరపడింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ 2% బలపడి రూ.1,056 వద్ద నిలిచింది. ♦ బైబ్యాక్ ఇష్యూలో పాల్గొనేందుకు అర్హత తేదీ ముగియడంతో సింఫనీ షేరు ఆరు శాతం పతనమైన రూ.1023 వద్ద ముగిసింది. -
వినోద్ అదానీ ప్రమోటర్ల గ్రూప్‌లో భాగమే: అదానీ గ్రూప్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ విషయంలో అదానీ గ్రూప్ స్పష్టత ఇచ్చింది. ఆయన ప్రమోటర్ గ్రూప్‌లో భాగంగా ఉన్నారని పేర్కొంది. తమ గ్రూప్‌లోని వివిధ లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్ల గ్రూప్‌లో వినోద్ కూడా ఒకరని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికన్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల్లో వినోద్ అదానీ (74) పేరు కూడా బైటికి వచ్చిన సంగతి తెలిసిందే. వినోద్‌కు అదానీ గ్రూప్‌లోని ఏ లిస్టెడ్ సంస్థలోనూ ఎటువంటి హోదా లేదని, కానీ మనీ లాండరింగ్ తదితర కార్యకలాపాల కోసం విదేశాల్లో డొల్ల కంపెనీల ఏర్పాటులో మాత్రం ఆయన పాత్ర ఉందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. వినోద్ పేరు సర్వత్రా చర్చనీయాంశంగా మారడంతో అదానీ గ్రూప్ తాజాగా వివరణ ఇచ్చింది. వివిధ సందర్భాల్లో స్టాక్ ఎక్సే్చంజీలకు సమర్పించిన వివరాల్లో వినోద్ అదానీ గురించి కూడా ప్రస్తావన ఉన్నట్లు తెలిపింది. -
అల్సర్‌ని తగ్గించిన అరటి! బేబీ ఫుడ్ రకాలు! 10 పిలకల ధర 4,200! సాగు చేస్తే..
Vinod Sahadevan- Banana Varieties: పండుగా, కూరగా, మరెన్నో ఉత్పత్తులుగా.. అరటి పంట మన జాతి సంస్కృతిలో అనదిగా విడదీయరాని భాగమైపోయింది. వైవిధ్యభరితమైన అరటి రకాలను అంతరించిపోకుండా సాగు చేస్తూ పరిరక్షించుకోవటం ఎంతో ముఖ్యమైన విషయం. ఈ బృహత్ కార్యాన్ని నెత్తికెత్తుకున్న కేరళకు చెందిన ఓ రైతు స్ఫూర్తికథనం ఇది. విలక్షణమైన అరటి రకాలను సేకరించి సాగు చెయ్యటమంటే కేరళకు చెందిన వినోద్(62)కు మహా ఇష్టం. ఇష్టం అనే కంటే పిచ్చి అంటే బాగా నప్పుతుందేమో. అందుకే ఆయనకు ‘వలచెట్ట’ అని పేరొచ్చింది. వలచెట్ట అంటే మళయాళంలో ‘అరటి అన్న’ అని అర్థం. తిరువనంతపురం నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన 4 ఎకరాల తోటలో 500 కంటే ఎక్కువ రకాల అరటి మొక్కల్ని నాటి ప్రాణప్రదంగా సాగు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలతో పాటు అనేక విదేశాల్లో తిరిగి మరీ అరటి రకాలను సేకరించి నాటడం పనిగా పెట్టుకున్నాడు. సుసంపన్నమైన అరటి జీవవైవిధ్యానికి నిలయంగా మారిన తన క్షేత్రాన్ని ‘అరటి గ్రామం’ (వలగ్రామం) అని పిలుచుకుంటున్నారు. శాస్త్రవేత్త ఇవ్వనన్నాడని... వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వినోద్‌కు చిన్నప్పటి నుంచే అరటి రకాలను సేకరించే అలవాటుంది. పదేళ్ల క్రితం ఎదురైన చేదు అనుభవం అతన్ని అరటి జీవవైవిధ్యానికి పట్టుగొమ్మగా మార్చేసింది. ఓ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తను తనకు ఇష్టమైన ఓ అరటి రకం మొక్క ఇవ్వమని అడిగితే అందుకు ఆయన నిరాకరించారు. ఆ సంఘటన వినోద్‌ను తీవ్రంగా బాధపెట్టింది. అరటి రకాల కోసం ఇకపై ఏ విశ్వవిద్యాలయంపై ఆధారపడకూడదని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి రకరకాల అరటి పిలకలను సేకరించి తన సొంత పొలంలో పెంచడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన పొలంలో 500 కన్నా ఎక్కువ అరటి రకాల మొక్కలున్నాయి. ఆ రకాలలో ఎంతో వైవిధ్యం ఉంది. విశేషమేమిటంటే.. తిరువనంతపురం అనే ఓ అరటి రకం ఉండేది. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. కానీ, వినోద్ పొలంలో ఉంది. పెయాన్తో.. పండుగా తినడానికి, పచ్చికాయలను కూర వండుకోవడానికి ఉపయోగపడే అరటి రకాలు మనకు తెలుసు. అంతేకాదు.. ఐస్‌క్రీమ్‌లు, షేక్స్‌కు ఉపయోగపడే ప్రత్యేక అరటి పండ్లు ఉన్నాయి. ‘పెయాన్’ రకం అరటి కాయలతో కేరళలో కూర చేస్తారు, తమిళనాడులో దీన్ని ఎక్కువగా పండుగా తింటారు. వేసవిలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యం ఉన్న పండు ఇది. చక్క, వాయల్వజా, కుల్లరకని, బారాబెన్లో, చిరపుంచి, పంథరాజ్, ఎఫ్హెచ్ఐఏ3, సబా మొదలైన పేర్లతోనూ దీన్ని పిలుస్తుంటారు. తక్కువ నీరు, ఎరువులతో పెరగటం దీని ప్రత్యేకత. అత్యధికంగా అమ్ముడయ్యే రకం అయినప్పటికీ రైతులకు ఈ రకం అరటి పిలకలు దొరక్క సాగు తగ్గిపోయింది. ఇవన్నీ ఇప్పుడు మన అరటి వీరుడు వినోద్ దగ్గర ఉన్నాయి! అల్సర్‌ని తగ్గించిన అరటి! మైసూరులో నవంబర్‌లో జరిగిన కిసాన్ స్వరాజ్ సమ్మేళనంలో వినోద్ తన తోటలో పండిన కనీసం 30 రకాల అరటి పండ్లను ప్రదర్శనకు పెట్టారు. మీకు బాగా ఇష్టమైన అరటి రకం ఏది అని ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ‘అన్నీ ఇష్టమే. ఒక్కో రకం రుచి, వాసన, సైజు వేరుగా ఉంటాయంతే’ అన్నారు. అదిసరే గానీ.. ప్రత్యేకతలున్న అరటి రకాల గురించి చెప్పండి అనడిగితే.. ‘కన్నామంఫలం’ రకం అరటి పండ్లలో ఔషధ గుణాల గురించిన ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. ఆయన తండ్రికి కడుపులో అల్సర్ సమస్య ఉండేది. ఎవరో చెబితే ‘కన్నామంఫలం’ అరటి పండ్లు కొన్ని రోజుల పాటు తింటే అల్సర్ సమస్య తీరిపోయింది. బేబీ ఫుడ్ అరటి రకాలున్నాయి.. పెద్దలకే కాదు శిశువులు, బాలలకు కూడా ‘కన్నామంఫలం’ మంచిదని.. ‘కన్నమంఫలం’ అంటే ‘శిశువుల ఆహారం’ అని అర్థమని వినోద్ వివరించారు. ‘కన్నమంఫలం’తో ΄పాటు కారయన్నన్, పొంకల్లి, కన్నన్పాజ్మ్, అడుక్కన్, కున్నన్.. ఇవన్నీ బేబీ ఫుడ్‌గా పనికొస్తాయన్నారు. ఈ రకాల అరటి పండ్లను ఎండబెట్టి పొడి చేసి చంటి పిల్లలకు తినిపిస్తారు. జీర్ణకోశ సమస్యలకు ఇది ఉత్తమంగా పనిచేస్తుందన్నారు. ఏపీ, తెలంగాణలో ఏ రకాన్నయినా సాగు చేయొచ్చు! మన దేశంలో ఎక్కువ రకాల అరటిని కలిగి ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. వినియోగం కూడా ఎక్కువే. అయినా అరుదైన అరటి పండ్ల రకాల పరిరక్షణపై అధికారులు ఆసక్తి చూపడం లేదన్నది వినోద్ ఫిర్యాదు. అందుకే కేరళలోని అన్ని జిల్లాల్లో తన పొలం మాదిరిగా ’అరటి జీవవైవిధ్య క్షేత్రాలను ఏర్పాటు చేయాలన్నది తన ఆశయమని వినోద్ చెబుతున్నారు. తన దగ్గర ఉన్న అరటి రకాలన్నీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నాటుకోవడానికి అనువైనవేనని వినోద్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. తాను సంరక్షిస్తున్న అరటి రకాల పిలకల(సక్కర్స్)ను విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. పది పిలకలను రూ. 4,200కు అమ్ముతున్నానని, ఆర్డర్ ఇస్తే కొరియర్లో పంపుతానన్నారు. ఫేస్బుక్లో ‘వలగ్రామం’ గ్రూప్ నిర్విహిస్తున్నారు. వల చెట్టన్ వాట్సప్: 94464 01615. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ చదవండి: సాగు చేస్తే చం'ధనమే'!.. పంటకాలం 12 ఏళ్లు.. చేతికి రూ.కోట్లలో ఆదాయం -
హిట్ చిత్రాల దర్శకుడితో కమల్ మూవీ?
విక్రమ్ చిత్రం అందించిన విజయోత్సవంతో నటుడు కమలహాసన్ వరుస చిత్రాల్లో నటించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరో పక్క బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోకు హోస్ట్‌గా వ్యహరిస్తూ బిజీగా ఉన్నారు. కాగా ఇండియన్ 2 చిత్రాలు పూర్తి చేసిన తర్వాత మలయాళ దర్శకుడు మహేష్ నారాయణన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నారు. కాగా ఆ తర్వాత చేసే చిత్రానికి కూడా కమల్‌హాసన్ పచ్చజెండా ఊపినట్లు తాజా సమాచారం. అజిత్ కథానాయకుడిగా నేర్కొండ పార్వై, వలిమై వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు హెచ్ వినోద్ ప్రస్తుతం అదే అజిత్ హీరోగా తుణివు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తదుపరి ఈయన కమల్‌హాసన్‌ను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర కథను దర్శకుడు హెచ్.వినోద్ ఇటీవల కమల్‌హాసన్‌కు వినిపించారని, ఆయన నటించడానికి సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఒక యాక్షన్ గేమ్ నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని కోలీవుడ్ వర్గాల టాక్. కాగా తుణివు చిత్రం విడుదల తర్వాత కమలహాసన్ హీరోగా నటించే చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. -
తెలంగాణలో కూడా మూడు రాజధానులు ఉండాలి : ప్రొపెసర్ వినోద్
-
రిసెప్షనిస్ట్ హత్యోదంతం.. నిందితుడి తండ్రి సంచలన వ్యాఖ్యలు!
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్, రిషికేష్‌లోని వంతారా రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేసే యువతి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుల్కిత్ ఆర్యను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆ మరుసటి రోజున నిందితుడి తండ్రి వినోద్ ఆర్య, సోదరుడు అంకిత్ ఆర్యను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను ఖండించారు బీజేపీ మాజీ నేత వినోద్ ఆర్య. పుల్కిత్ అమాయకుడని పేర్కొన్నారు. ‘అతడు ఒక సాదా సీదా అబ్బాయి. తన పనేదో తాను చూసుకుంటాడు. నా కుమారుడు పుల్కిత్, హత్యకు గురైన యువతి ఇరువురికి న్యాయం జరగాలని కోరుకుంటున్నా. పుల్కిత్ ఇలాంటి వాటిలో ఎప్పుడూ పాల్గొనలేదు. అతడు నిర్దోషి.’ అని తెలిపారు వినోద్ ఆర్య. చాలా రోజులుగా పులికిత్ తమ కుటుంబానికి దూరంగా జీవిస్తున్నాడని చెప్పారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా జరగాలనే ఉద్దేశంతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. హత్యకు గురైన రిసెప్షనిస్ట్, 19 ఏళ్ల యువతి పని చేస్తున్న రిసార్ట్ ఓనర్ పుల్కిత్ ఆర్య, మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాలను శుక్రవారమే అరెస్ట్ చేశారు పోలీసులు. దర్యాప్తులో నిందితులు తెలిపిన వివరాలు, బాధితురాలి మొబైల్ ఫోన్ ఛాటింగ్ ప్రకారం..టూరిస్టులకు ‘ప్రత్యేక సేవలు’ అందించాలని ఆమెపై ఒత్తిడి చేసినట్లు తేలిందని పోలీసు అధికారి అశోక్ కుమార్ శనివారం వెల్లడించారు. నిందితుడు పుల్కిత్ ఆర్య, హత్యకు గురైన యువతి ఇదీ చదవండి: రిసెప్షనిస్ట్ హత్య కేసులో కుమారుడు అరెస్టు.. తండ్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ -
రిచెస్ట్ ఎన్ఆర్ఐ వినోద్ అదానీ: తగ్గేదేలే అంటున్న అదానీ బ్రదర్స్
సాక్షి,ముంబై: ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 ప్రకారం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 10,94,400 కోట్ల సంపదతో టాప్ ప్లేస్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సోదరుడు వినోద్ శాంతిలాల్ అదానీ కూడా తగ్గేదేలా అంటున్నారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ (సెప్టెంబర్ 22, గురువారం) తాజా లిస్ట్ ప్రకారం దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త వినోద్ అదానీ రూ.1,69,000 కోట్లతో అత్యంత ధనవంతులైన ఎన్ఆర్ఐ, ఆరో సంపన్న భారతీయుడుగా నిలిచారు. 1976లో ముంబయిలో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించి సింగపూర్దాకా విస్తరించారు. జకార్తాలో వ్యాపార వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. గత సంవత్సరంలో వినోద్ అదానీ సంపద 28 శాతం లేదా 37,400 కోట్లు పెరిగింది. అలా టాప్ 10 సంపన్న వ్యక్తుల జాబితాలో ఆరోస్థానం కోసం రెండు ర్యాంకులు ఎగబాకినట్టు నివేదించింది. గత ఐదేళ్లలో వినోద్ అదానీ సంపద ఏకంగా 850 శాతం లేదా 1,51,200 కోట్లు పెరిగింది. నివేదిక ప్రకారం, 2018లో 49వ స్థానం నుంచి ఈ ఏడాది ఆరో స్థానానికి చేరారు. వినోద్ రోజువారీ ప్రాతిపదికన రూ. 102 కోట్లు. వార్షిక ప్రాతిపదికన నాలుగో అతిపెద్ద గెయినర్.అంతేకాదు ఇద్దరు అదానీల సంపద మొత్తం రూ. 12,63,400 కోట్లుగా ఉంది. అంటే హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లోని తొలి పదిమంది వ్యక్తుల సంపదలో దాదాపు 40 శాతం అన్న మాట. ఈ ఏడాది 94 మంది ఎన్నారైలు భారతీయ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. -
కామాంధుడిని ఎన్కౌంటర్ చేయండి.. తల్లడిల్లిపోతున్న దీక్షిత తల్లిదండ్రులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/ఏలూరు టౌన్: విజయవాడలో కామాంధుడు వినోద్‌జైన్ లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తెను తలచుకొంటూ తల్లడిల్లిపోతున్నారు. దీక్షిత ఫొటోను దగ్గరపెట్టుకొని, చూసుకొంటూ కన్నీటి పర్యంతమవుతూ ఉన్నారు. సీసీ ఫుటేజీలోని దృశ్యాలను చూసి తట్టుకోలేకపోతున్నారు. దుర్మార్గుడిని నడిరోడ్డుపై ఎన్కౌంటర్ చేయండని రోదిస్తున్నారు. మరో ఆడపిల్లకి అన్యాయం జరగకుండా చూడాలని, తమకు ఎదురైన కష్టం మరొకరికి రాకూడదంటూ వేడుకొంటున్నారు. తనకు ఇష్టమైన రంగు డ్రస్ వేసుకొని, వాంకింగ్కు వెళ్లే ముందు హగ్ చేసుకొందని, కరోనా కేసులు పెరుగుతున్నాయమ్మ, వాకింగ్ వద్దని చెప్పానని, వెళ్లొస్తానమ్మా అంటూ..వెళ్లిపోయిందని బాలిక తల్లి కన్నీరుమున్నీరవుతోంది. మెట్లు, లిఫ్ట్ వద్ద ఉండి నిందితుడు విష్ చేసేవాడని, వయసు రీత్యా తమకు అనుమానం రాలేదని చెప్పారు. పరామర్శించిన ఎమ్మెల్సీ... బాలిక కుటుంబాన్ని మంగళవారం ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి పరామర్శించి ఓదార్చారు. నిందితుడిని నడిరోడ్డుపై ఎన్కౌంటర్ చేసి మరో ఆడపిల్లకు అన్యాయం జరగకుండా చూడాలని బాలిక తల్లి తనతో అన్నట్లు ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి చెప్పారు. బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏలూరులో కొవ్వొత్తుల ప్రదర్శన కామాంధుడు వినోద్ జైన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ మహిళా నేతలు, కార్యకర్తలు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో ఆందోళన చేపట్టారు. మహిళలు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించి బాలికకు నివాళులర్పించారు. ఫైర్‌స్టేషన్ సెంటర్లోని దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, ఇడా చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి, మేయర్ షేక్ నూర్జహాన్, స్మార్ట్ సిటీ చైర్ పర్సన్ బొద్దాని అఖిల, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. -
వినోద్ జైన్‌కు రిమాండ్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నగరంలోని విద్యాధరపురానికి చెందిన పద్నాలుగేళ్ల బాలిక బలవన్మరణానికి కారకుడైన కామాంధుడు వినోద్ జైన్ (48)ను భవానీపురం పోలీసులు ఆరెస్టుచేసి, మంగళవారం సాయంత్రం విజయవాడలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సునీల్‌కుమార్ ముందు హాజరుపరిచారు. అపార్ట్మెంట్లోని సీసీ కెమెరా దృశ్యాలను సీజ్‌చేసి కోర్టుకు సమర్పించారు. తొలుత.. ఐపీసీలోని 306, 354(ఏ), (డి) 509, 506 పోక్సో చట్టంలోని 8, 10 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. విచారణ అనంతరం.. సేకరించిన సాక్ష్యాల ఆధారంగా 354, 354డి, 509, 506 ఐపీసీ సెక్షన్లను చేర్చారు. దీంతో మేజిస్ట్రేట్ నిందితుడికి ఈనెల 15 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. అనంతరం వినోద్‌ను మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించారు. మరిన్ని ఆధారాల కోసం నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌ను సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. బాలికకు ఏమైనా మెసేజ్‌లు పంపించేవాడాç? వీడియోలు ఏమైనా తీశాడా? బాలిక ఆత్మహత్య లేఖ కాకుండా గతంలో ఇంకా ఎక్కడైనా రాసుకుందా, తదితర అంశాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌ను కూడా పోలీసులు విచారించారు. బాలిక బయటకు వెళ్లే సమయాల్లో వినోద్ జైన్ అక్కడే ఉండేవాడని అతను చెప్పాడు. రిమాండ్ రిపోర్ట్‌లో అంశాలివే.. ► బాలికను లైంగికంగా వేధించి ఆత్మహత్య చేసుకోవడానికి వినోద్ జైన్ కారకుడయ్యాడు. ► బాలిక ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి ఆత్మహత్యకు కారకుడయ్యాడు. ► బాలిక నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ నాలుగో అంతస్తులోని జీ–43లో నిందితుడు ఉండేవాడు. ► జనవరి 29వ తేదీ సా.5.15 గంటలకు అపార్ట్మెంట్ పైనుంచి బాలిక దూకి ఆత్మహత్య చేసుకుంది. రెండు నెలలుగా వేధిస్తున్నట్లు సూసైడ్ నోట్లో ఆమె స్పష్టంగా రాసింది. ► దీంతోపాటు ఆమె సెల్‌ఫోన్, ట్యాబ్‌లో ఆ వేధింపులను పొందుపరిచింది. ► లిఫ్ట్, మెట్ల వద్ద వెంటపడేవాడు. బాలిక తమ్ముడు విఘ్నేష్ (10)ను స్కూల్ ఆటో వద్దకు తీసుకెళ్లేటప్పుడు, సరుకుల కోసం షాపునకు వెళ్లేటప్పుడు, వాకింగ్‌కు వెళ్లేటప్పుడు వినోద్ అసభ్యంగా ప్రవర్తించేవాడు. ► ఈ బాధలను భరించలేక ఆమె అపార్టుమెంట్ పైనుంచి దూకి చనిపోవాలని నిర్ణయించుకుంది. బాలిక సూసైడ్ నోట్‌తోపాటు, సెల్‌ఫోన్, ట్యా బ్‌ను పోలీసులు సీజ్‌చేశారు. 12 మంది సాక్షులను విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. -
2 నెలలుగా అసభ్యంగా ప్రవర్తించాను: నేరాన్ని ఒప్పుకున్న వినోద్ జైన్
సాక్షి ప్రతినిధి, విజయవాడ/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ)/విజయనగరం/నగరి: లైంగిక వేధింపులతో బాలికను చిదిమేసిన టీడీపీ నాయకుడు వినోద్ జైన్ తన నేరాన్ని అంగీకరించాడు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లోని లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్లో టీడీపీ నేత వినోద్ జైన్ లైంగిక వేధింపులు తాళలేక 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు జైన్‌ను ఆదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మృతురాలు సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లుగా తాను రెండు నెలలుగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన మాట వాస్తవమేనని చెప్పాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నించానన్నాడు. బాలిక స్కూల్‌కు వెళ్లి వచ్చే సమయాల్లో లిఫ్ట్, మెట్ల వద్ద వేచి ఉండేవాడినని, ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆనందించేవాడినని చెప్పాడు. తాను చేసింది తప్పేనని, ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదని.. వ్యవహారం ఇంతవరకు వస్తుందని కూడా తాను ఊహించలేదని చెప్పినట్లు తెలిసింది. ప్రేమానుబంధాలకు బాలిక ప్రాధాన్యత మరోవైపు.. ఆత్మహత్యకు ముందు బాలిక రాసిన లేఖ అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది. అందులో ఎక్కువగా ప్రేమానుబంధాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. రక్తసంబంధాలపై ఎంతో మమకారం పెంచుకున్నట్లు అందులోని ప్రతీ పదం ద్వారా అర్ధమవుతుంది. చిన్న వయసులోనే ప్రేమానుబంధాలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. రక్తసంబంధాలపై ఎంతో మమకారాన్ని పెంచుకుంది. కామాంధుడి దురాగతాలను తట్టుకోలేక ఈ లోకం నుంచి అర్థాంతరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఆ బాలిక.. అమ్మ, నాన్న, తమ్ముడి గురించే ఎక్కువగా తన లేఖలో పరితపించింది. ఆ ఐదు పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్లో బంధాలు, బాంధవ్యాల గురించే ఎక్కువగా ప్రస్తావించింది. ‘ఐ లవ్ యు మమ్మీ.. డాడీ.. మీరంతా బాగుండాలి’ అని ఆకాంక్షించింది. తల్లిదండ్రుల పట్ల ఆమెకున్న ఎనలేని ప్రేమాభిమానాలను ఆ లేఖలో చాటుకుంది. తన తమ్ముడ్ని సైతం పదేపదే ప్రస్తావించింది. తమ్ముడి పట్ల తనకున్న అభిమానాన్ని వివరించిన తీరు అందరినీ కదిలించింది. తనను బాగా చూసుకున్నారని తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఈ లేఖలోని అంశాలు చూసిన కుటుంబీకులు, స్థానికులు ఇంత ఘోరం చేశాడా, అని కన్నీటీపర్యంతం అవుతున్నారు. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బాలిక తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావటంలేదు. ‘న్యాయం చేయండి, మా బంగారు బొమ్మను మాకు తీసుకురండి’ అంటూ వారు తల్లడిల్లుతున్న తీరు చూపరులకూ కన్నీరు తెప్పిస్తోంది. అలాంటి వాడు అనుకోలేదు.. ఇక పోలీసులు అపార్టుమెంట్ వాసులను విచారించినప్పుడు, బాలిక వచ్చీవెళ్లే సమయంలో మెట్లు, లిఫ్ట్ వద్ద వినోద్ జైన్ కనిపించేవాడని చెప్పారు. అయితే, అతని వయస్సు రీత్యా అనుమానం రాలేదన్నారు. ఇలా వికృత చేష్టలకు పాల్పడతాడని తాము ఊహించలేదని తెలిపారు. ఇంతటి నీచానికి పాల్పడిన దుర్మార్గుడికి ఉరిశిక్ష వేసినా తక్కువేనని చెప్పినట్లు తెలిసింది. ఫుటేజీలో వికృత చేష్టలు అపార్ట్మెంట్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీ ఫుటేజీలో కామాంధుని వికృత చేష్టల దృశ్యాలు ఉన్నట్లు తెలిసింది. బాలిక అపార్ట్మెంట్ నుంచి దూకే దృశ్యాలు కూడా రికార్డ్ అయినట్లు పోలీసులు తెలిపారు. అపార్టుమెంటు పిట్టగోడ చివర బాలికను గమనించిన ప్రత్యక్ష సాక్షులు.. కింద పడతావు అని అరుస్తున్నా దూకేసిందని.. అంతా నిమిషంలోపే సంఘటన జరిగిందని వారు చెబుతున్నారు. మిన్నంటిన ఆందోళనలు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వినోద్ జైన్‌ను కఠినంగా శిక్షించాలని కృష్ణాజిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, అందోళనలు మిన్నంటాయి. ఘటనపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. విజయవాడ సింగ్‌నగర్‌లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి ర్యాలీ నిర్వహించారు. భవానీపురంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు పి. చైతన్యరెడ్డి, గుడివాడ నరేంద్రల ఆధ్వర్యంలో స్కూలు పిల్లలతో కలిసి మానవహారం, ర్యాలీ చేపట్టారు. కుమ్మరిపాలెం, లెనిన్ సెంటర్లో కూడా చేపట్టారు. పలువురు కార్పొరేటర్లు కూడా తమ తమ డివిజన్లలో శాంతియుతంగా నిరసన తెలిపారు. దోషిని కఠినంగా శిక్షించాలని విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నేతలు ఇక జిల్లాలోని జగ్గయ్యపేట, నూజివీడు, పెడన, గుడివాడలలో శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లాలోనూ సోమవారం నిరసన ర్యాలీలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి ఆధ్వర్యంలో మహిళలు పెద్దఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. చీపురుపల్లిలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. బొబ్బిలిలో ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. కీచకులను టీడీపీ పెంచి పోషిస్తోంది : రోజా టీడీపీ అధినేత చంద్రబాబు కీచకులను పెంచి పోషించడంవల్లే ఇలా రాష్ట్రంలో అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడిందని నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. వినోద్ జైన్‌కు వేసే శిక్ష ఎంత కఠినంగా ఉండాలంటే మరొకరు ఇలాంటి ఆలోచన చేయడానికే భయపడేలా ఉండాలన్నారు. బాలిక ఆత్మశాంతి కోసం సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో ఆమె పార్టీ నేతలతో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నిందితుడు వినోద్ జైన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని చెప్పారు. పైగా నారీ సంకల్ప యాత్ర దీక్ష చేపట్టడం వారికే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఈ దీక్ష వెనుక అసలు హీరో నారా లోకేష్ అని అందరికీ తెలుసునన్నారు. లోకేష్ పీఏ టీడీపీ మహిళలనే వేధిస్తున్నాడని ఆ విషయాన్ని కప్పిపుచ్చుకొనేందుకే ఈ నారీ దీక్ష చేపట్టి తన కొడుకును కాపాడుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని రోజా ఆరోపించారు.