‘ఎన్‌ఆర్‌ఐలు తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలి’ | nri shoul hand to gather for telangana development say vinod | Sakshi
Sakshi News home page

‘ఎన్‌ఆర్‌ఐలు తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలి’

Published Wed, Jun 15 2016 9:01 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

‘ఎన్‌ఆర్‌ఐలు తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలి’ - Sakshi

‘ఎన్‌ఆర్‌ఐలు తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలి’

వర్జీనియా: అమెరికాలోని తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలు తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. వర్జినియాలోని అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్‌తో పాటు ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యరు. ఈ సందర్భంగా ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ బంగారు తెలంగాణ కోసం పాటుపడుతున్నారని, ముఖ్యంగా అమెరికాలోని వివిధ స్టేట్స్‌లో ఉంటున్న ఎన్‌ఆర్‌ఐలు తెలంగాణలో పెట్టుబడులు పెడితే రాయితీలు కల్పిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అమెరికా తెలంగాణ సంఘం అధ్యక్షుడు రాంమోహన్, ప్రధాన కార్యదర్శి రవి, కోశాధికారి శ్రీనివాస్, బోర్డు సభ్యులు అరవింద్, చందు, మాదవరావు, ప్రకాశ్, నరేందర్‌రెడ్డి, రఘువీర్, శంకర్, శ్రీధర్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement