investements
-
రియల్ ఎస్టేట్‌లో భారీగా డబ్బులు పెట్టిన సెలబ్రిటీలు వీళ్లే..
సినిమాలలో అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ సెలబ్రిటీలు భారీ మొత్తంలో సంపాదిస్తారు. వీరిలో చాలా మంది మంచి వ్యాపారవేత్తలు కూడా. తమ నట జీవితంతో పాటు సమాంతర వ్యాపారాలను ప్రారంభించడం మనం చూశాం. కొందరు రెస్టారెంట్లు, ఫ్యాషన్ బ్రాండ్లు లేదా విలాసవంతమైన పబ్బులు, క్లబ్బులు నడుపుతుండగా మరికొందరు రియల్ ఎస్టేట్‌లో భారీగా డబ్బులు పెడుతున్నారు. ఇలా ఇటీవల రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టిన కొందరు సెలబ్రిటీల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..అమితాబ్ బచ్చన్బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇటీవల ముంబైలోని వీర్ సావర్కర్ సిగ్నేచర్ బిల్డింగ్ లో మూడు ఆఫీస్ స్పేస్ లను రూ.60 కోట్లకు కొనుగోలు చేశారు. కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనలిటిక్స్ సైట్ FloorTap.com కు లభించిన డాక్యుమెంట్ల ప్రకారం.. ఈ కార్యాలయ స్థలాలు ముంబైలోని అంధేరి వెస్ట్ పరిసరాల్లో, వీర దేశాయ్ రోడ్ సమీపంలో ఉన్నాయి.మొత్తం 8,429 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు కార్యాలయ భవనాలను రూ.59.58 కోట్లకు బిగ్ బీ కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ లావాదేవీకి అమితాబ్ బచ్చన్ రూ.3.57 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించడంతో 2024 జూన్ 20న సేల్ డీడ్ ఖరారైంది. వ్యాపార ప్రాంగణం మూడు పార్కింగ్ స్థలాలతో వచ్చినట్లు డాక్యుమెంట్లు సూచిస్తున్నాయి. వీర్ సావర్కర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కమర్షియల్ ప్రాపర్టీ అమ్మకందారుగా గుర్తించారు.గత ఏడాది ఆగస్టులో అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేసిన భవనంలో ఇప్పటికే నాలుగు ఆఫీస్ సూట్లు ఉన్నాయి. 2023 డిసెంబర్లో ముంబైలోని ఓషివారా ప్రాంతంలో సుమారు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న నాలుగు వాణిజ్య స్థలాలను రూ.2.07 కోట్లకు లీజుకు తీసుకుని రూ.1.03 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చేశారు.ఇతర సెలబ్రిటీలు కూడా ఇదే భవనంలో పెట్టుబడులు పెట్టారు. తాజా అప్డేట్ ప్రకారం.. బిగ్ బీకి ఇప్పుడు సిగ్నేచర్ బిల్డింగ్ 7 ఆఫీస్ స్పేస్‌లు ఉన్నాయి. ఆయన ఒక్కరే కాదు, సిగ్నేచర్ బిల్డింగ్ ఇతర సెలబ్రిటీలకు కూడా హాట్ స్పాట్. సీనియర్ బచ్చన్ తో పాటు మనోజ్ బాజ్‌పాయ్, కాజోల్, అజయ్ దేవగణ్, కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్ వంటి సెలబ్రిటీలకు కూడా ఈ భవనంలో కమర్షియల్ యూనిట్లు ఉన్నాయి.అజయ్ దేవగణ్, కాజోల్ఈ భవనంలో 194 చదరపు మీటర్ల కమర్షియల్ యూనిట్‌ను కాజోల్ గత ఏడాది ఆగస్టులో రూ .7.64 కోట్లకు కొనుగోలు చేశారు. సిగ్నేచర్ బిల్డింగ్ లోని 16, 17 అంతస్తుల్లో ఉన్న ఐదు కమర్షియల్ ప్రాపర్టీలను అజయ్ దేవగణ్ రూ.45.9 కోట్లకు కొనుగోలు చేశారు. ఇందుకోసం ఆయన రూ.2.70 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు హిందుస్థాన్ టైమ్స్ తెలిపింది.అభిషేక్ బచ్చన్కొన్ని వారాల క్రితం అభిషేక్ బచ్చన్ బోరివాలిలో ఉన్న ఒబెరాయ్ రియల్టీ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఒబెరాయ్ స్కై సిటీలో ఆరు కొత్త రెసిడెన్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. 57వ అంతస్తులో మొత్తం 4,894 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్మెంట్లను రూ.15.42 కోట్లు చెల్లించి కొనుగోలు చేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ కథనం పేర్కొంది.మనోజ్ బాజ్పాయ్మనోజ్ బాజ్‌పాయ్, ఆయన భార్య షబానా రజా గత ఏడాది అక్టోబర్‌లో సిగ్నేచర్ బిల్డింగ్‌లోని నాలుగు యూనిట్లలో రూ.31 కోట్లు పెట్టుబడి పెట్టారు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం ఒక్కో యూనిట్ ధర రూ.7.77 కోట్లు కాగా, యూనిట్ కు రూ.46.62 లక్షల స్టాంప్ డ్యూటీ ఉంది.కార్తిక్ ఆర్యన్, సారా అలీఖాన్కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్‌లు సిగ్నేచర్ బిల్డింగ్‌లో 2,099 చదరపు అడుగుల యూనిట్‌ను కలిగి ఉన్నారు. సారా అలీఖాన్, అమృతా సింగ్ 2023 జూలైలో రూ.9 కోట్లకు ఫ్లాట్‌ను కొనుగోలు చేయగా, కార్తీక్ ఆర్యన్ 2023 సెప్టెంబర్‌లో రూ.10 కోట్లకు అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. ఐశ్వర్య ప్రాపర్టీ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రెండు ప్రాపర్టీల అమ్మకానికి వెసులుబాటు కల్పించింది. -
ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసలు
మాస్కో: ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పలు ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత్ అమలు పరుస్తున్న విదేశి విధానాలు అసాధారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఇటువంటి సమయంలో అన్ని రంగాల్లో ప్రపంచం వ్యాప్తంగా దూసుకుపోవటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంటి ధృడమైన నాయకత్వం ఉండటమే కారణమని మోదీపై పుతిన్ ప్రశంసలు కురిపించారు. భారత్‌ను శక్తివంతమైన దేశంగా ముందుకు నడిపించటంలో మోదీ గుర్తింపు పొందారని పుతిన్ అభిప్రాయపడ్డారు. గురువారం కలింగ్రాడ్ ప్రాంతంలో నిర్వహించిన ‘రష్యన్ స్టుడెంట్ డే’ కార్యక్రమంలో పుతిన్ పాల్గొన్నారు. ‘ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్. సమర్థవంతమైన నాయకత్వం లక్షణాలు ఉన్న వ్యక్తి భారత్‌కు ప్రధానిగా ఉన్నారు. ప్రధాని నాయకత్వ పటిమ వల్లనే ఇండియా ఈ రోజు మనం చూస్తున్న వృద్ధిలోకి వచ్చింది’ పుతిన్ పేర్కొన్నారు. ‘ప్రపంచ వేదికలపై భారత్.. రష్యాపై ఎప్పుడూ వ్యతిరేకమైన వైఖరితో నిర్ణయాలు తీసుకోలేదు. రష్యాపై ఇప్పటివరకు ద్వంద వైఖరిని భారత్ ప్రదర్శించలేదు. అందుకే భారత్, ఆ దేశ నాయకత్వంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉంది’ అని పుతిన్ అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి కార్యక్రమం రష్యాతోపాటు ప్రపంచ దేశాల్లో కూడా చర్చకు వస్తోందన్నారు. భారత్‌కు అంత్యంత ఎక్కువ విదేశి పెట్టుబడులు రష్యా నుంచి లభిస్తున్నాయని తెలిపారు. తమ దేశంలోని పలు కంపెనీలు భారత్‌లో ఇప్పటికే సుమారు సుమారు 23 బిలియన్ అమెరికా డాలర్ల మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టినట్లు వెల్లడించారు. చదవండి: ఖరీదైన బ్యాగ్ గిఫ్ట్.. దక్షిణ కొరియా రాజకీయాల్లో దుమారం -
రిస్క్ లపై ఇన్వెస్టర్లలో అవగాహన అంతంతే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కష్టపడి సంపాదించే ధనాన్ని భవిష్యత్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఇదే క్రమంలో పెట్టుబడి సాధనంగా మ్యుచువల్ ఫండ్స్‌కి కూడా ఆదరణ పెరుగుతోంది. కానీ, ఇన్వెస్టర్లలో రిస్కులు, తమ రిస్కు సామర్థ్యాలపై అవగాహన అంతంతమాత్రంగాన ఉంటోంది. సరైన మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవడంలో తమ రిస్కు సామర్థ్యాలను అర్థం చేసుకుని, వ్యవహరించడం కీలకాంశమని 89 శాతం మంది ఇన్వెస్టర్లు భావిస్తున్నప్పటికీ .. వాస్తవంగా ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాన్ని పరిగణనలోకి తీసుకుంటున్న వారు 27 శాతమే. 53 శాతం మంది ఇన్వెస్టర్లు తమ వ్యక్తిగత రిస్కుల మదింపు విషయంలో ధీమాగా వ్యవహరించలేకపోతున్నారు. యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ (ఏఎంసీ) నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మ్యుచువల్ ఫండ్స్ పెట్టుబడుల్లో ఉండే రిస్కుల విషయంలో ఇన్వెస్టర్ల ధోరణిని తెలుసుకునేందుకు నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 1,700 మంది పైచిలుకు యాక్సిస్ ఎంఎఫ్ ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. సర్వే నివేదిక ప్రకారం ఫండ్ రిస్కులను మదింపు చేసేందుకు రిస్్క–ఓ–మీటర్ అనే సాధనాన్ని ఉపయోగించుకోవచ్చని 55 శాతం మందికి, అలాగే వ్యక్తిగత రిస్కులను మదింపు చేసుకునేందుకు రిస్క్ ప్రొఫైలర్‌ను ఉపయోగించుకోవచ్చని 69 శాతం మందికి అవగాహన లేదు. దేశీయంగా మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ కీలక దశలో ఉందని, ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు సరైన నిర్ణయాలు తీసుకోగలిగేలా వారికి మరింత తోడ్పాటు అందించేందుకు పరిశ్రమ కృషి చేస్తోందని యాక్సిస్ ఏఎంసీ ఎండీ బి. గోపకుమార్ తెలిపారు. సర్వేలో మరిన్ని అంశాలు.. ► ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రామాణికంగా తీసుకోతగిన అంశాల్లో, దాని గత పనితీరు కూడా ఒకటని 59% మంది ఇంకా విశ్వసిస్తున్నారు. పెట్టుబడులను దీర్ఘకాలికంగా కొనసాగించాల్సిన అవసరం, కాంపౌండింగ్ ప్రయో జనాల గురించి తెలిసినప్పటికీ చాలా మంది ఇ న్వెస్టర్లు పలు సందర్భాల్లో తమ పెట్టుబడులను ముందుగానే ఉపసంహరించుకుంటున్నారు. ► పరిశ్రమ సమాఖ్య యాంఫీ గణాంకాల ప్రకారం 22.2% మంది ఈక్విటీ ఇన్వెస్టర్లు 12–24 నెలల పాటే తమ పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. 48.7% మంది తమ పోర్ట్‌ఫోలియోను రెండేళ్లు, అంతకన్నా తక్కువ వ్యవధిలోనే రిడీమ్ చేసుకుంటున్నారు. ► పెట్టుబడులు పెట్టేటప్పుడు తమ రిస్కు సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పిన 27% మందిలో దాదాపు 64% మందికి రిస్కు సామర్థ్యాలను మదింపు చేసుకోవడానికి రిస్క్ ప్రొఫైలర్ సాధనాన్ని ఉపయోగించుకోవచ్చని తెలియదు. మొత్తం సర్వేలో పాల్గొన్న వారిలో 30% మందికి మాత్రమే రిస్క్ ప్రొఫైలర్ గురించి అవగాహన ఉంది. ► 61% మందికి రిస్్క–ఓ–మీటర్ దేన్ని సూచిస్తుందనేది తెలియదు. ఇది ‘ఫండ్’ రిసు్కను సూచిస్తుందని 16% మందికి మాత్రమే తెలుసు. తాము పెట్టుబడులు పెట్టే ముందు రిస్కోమీటర్ను చూసుకునే ఇన్వెస్ట్ చేస్తామని సదరు ఇన్వెస్టర్లు తెలిపారు. -
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం మంచిదేనా?
ఫ్లెక్సీక్యాప్, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్.. ఒకేసారి, ఒకటికి మించిన ఫండ్ విభాగాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా?– వెంకటరమణ మీరు సంక్లిష్టతను ఇష్టపడే వారు అయితే ఒకటికి మించిన విభాగాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే నిర్ణీత కాలానికి ఒకసారి పోర్ట్‌ఫోలియోని రీబ్యాలన్స్ (సమీక్ష/మార్పులు, చేర్పులు) చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా ఎన్నో విభాగాల మధ్య పెట్టుబడులను వర్గీకరించినప్పుడు అది గజిబిజీగా, పన్ను పరంగా అనుకూలం కాకపోవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. ఎందుకంటే ఈ పథకాలు వివిధ మార్కెట్ విలువ కలిగిన కంపెనీల్లో (స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్) ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కాకపోతే ఆయా విభాగాలకు కేటాయించే మొత్తం పథకాలను బట్టి వేర్వేరుగా ఉండొచ్చు. సాధారణంగా ఫ్లెక్సీక్యాప్ పథకాలు తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో 70–75 శాతాన్ని లార్జ్‌క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మిగిలిన పెట్టుడులను మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాలకు కేటాయిస్తుంటాయి. కనుక మీరు రెండు నుంచి మూడు ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఎక్కువ మొత్తాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక మీరు విడిగా లార్జ్‌క్యాప్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు. పెట్టుబడుల విషయంలో మరింత దూకుడుగా, రిస్క్ తీసుకునే వారు, ఫ్లెక్సీక్యాప్నకు అదనంగా 10–15 శాతం పెట్టుబడులను మిడ్, స్మాల్‌క్యాప్‌నకు కేటాయించుకోవడం ద్వారా దీర్ఘకాలంలో అధిక రాబడులు సొంతం చేసుకోవచ్చు. పెట్టుబడికి రియల్ ఎస్టేట్ మెరుగైన సాధనమేనా? ఇతర ఉత్పత్తులతో దీన్ని ఎలా పోల్చి చూడాలి? – శివమ్ రియల్ ఎస్టేట్‌ను పెట్టుబడి సాధనంగా నేను భావించడం లేదు. ఇల్లును ఒక కుటుంబం నివసించేందుకే గానీ, పెట్టుబడిగా చూడకూడదు. ఒక్కసారి ఇల్లు కొనుగోలు చేసి, దానిలో నివసిస్తుంటే విలువ పెరుగుతుందా? లేక తగ్గుతుందా అన్నది పట్టించుకునే విషయం కాదు. పెట్టుబడిగా రియల్ ఎస్టేట్‌కు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. పెట్టుబడి పరిమాణం అధికంగా కావాల్సి ఉంటుంది. ఇతర సాధనాలతో పోలిస్తే లిక్విడిటీ (నగదుగా మార్చుకునే సౌలభ్యం) తక్కువగా ఉంటుంది. దీంతో కోరుకున్నప్పుడు విక్రయించుకునే వీలు ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడిలో సవాళ్లూ ఉంటాయి. మరో కోణం నుంచి చూస్తే.. ప్రాపర్టీని అద్దెకు ఇస్తే క్రమం తప్పకుండా అద్దె రూపంలో ఆదాయం వస్తుంది. కిరాయిదారు రూపంలో ఇంటి నిర్వహణ సక్రమంగా ఉండొచ్చు. అలా చూస్తే ఇల్లు మంచి పెట్టుబడే అవుతుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణంతోపాటే అద్దె కూడా పెరుగుతూ వెళుతుంది. అదే సమయంలో ప్రతికూలతలూ కనిపిస్తాయి. ఇల్లు ఎంత గొప్పది అయినా 20 ఏళ్ల తర్వాత డిమాండ్ తగ్గుతుంది. అద్దెకు ఉండేవారు అధునికమైన, కొత్త ఇంటి కోసం ప్రాధాన్యం ఇస్తుంటారు. కనుక రియల్ ఎస్టేట్ విలువ పెరిగినా కానీ, దానికి అనుగుణంగా అద్దె రాబడి మెరుగ్గా ఉండదు. అందుకే ప్రాపర్టీని కొనుగోలు చేసే ముందు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. నా సలహా ఏమిటంటే రియల్ ఎస్టేట్‌ను పెట్టుబడిగా కాకుండా నివాసంగానే చూడండి. -
భారత్‌లో రెనో–నిస్సాన్ రూ. 5,300 కోట్ల పెట్టుబడులు
చెన్నై: ఆటోమొబైల్ దిగ్గజాలు రెనో–నిస్సాన్ భారత్‌లో సుమారు 600 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 5,300 కోట్లు) ఇన్వెస్ట్ చేయను న్నాయి. రెండు చిన్న ఎలక్ట్రిక్ కార్లతో పాటు ఆరు కొత్త వాహనాలను ఆవిష్కరించనున్నాయి. అలాగే చెన్నైలోని తమ ప్లాంటును కూడా అప్‌గ్రేడ్ చేయనున్నాయి. నిస్సాన్ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అశ్వనీ గుప్తా ఈ విషయాలు తెలిపారు. రెనో ఇండియా కంట్రీ సీఈవో వెంకట్రామ్ మామిళ్లపల్లి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పంద పత్రాలను రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలోని నోడల్ ఏజెన్సీ గైడెన్స్ బ్యూరో ఎండీ విష్ణు వేణుగోపాల్, గుప్తా ఇచ్చిపుచ్చుకున్నారు. రెనో–నిస్సాన్ అనేది ఫ్రాన్స్‌కి చెందిన రెనో, జపాన్‌కి చెందిన నిస్సాన్ కంపెనీల జాయింట్ వెంచర్. కొత్తగా వచ్చే వాహనాల్లో నాలుగు ఎస్‌యూవీలు ఉంటాయి. వీటిలో మొదటిది 2025 నాటికి మార్కెట్లోకి రానుందని గుప్తా చెప్పారు. దేశీయంగా ప్రవేశపెట్టే ఆరు వాహనాల్లో నిస్సాన్, రెనోవి చెరో మూడు వాహనాలు ఉంటాయి. తాజా పెట్టుబడులతో కొత్తగా 2,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని గుప్తా ఈ సందర్భంగా వివరించారు. పునర్వ్యవస్థీకరణ.. జాయింట్ వెంచర్లో సమాన వాటాదార్లుగా ఉండేలా రెండు సంస్థలు భారత్‌లో తమ తయారీ, ఆర్అండ్డీ విభాగాల్లో పెట్టుబడుల స్వరూపంలో మార్పులు, చేర్పులు చేస్తున్నాయి. దీని ప్రకారం జేవీలో నిస్సాన్ వాటా 70 శాతం నుంచి 51 శాతానికి తగ్గనుండగా రెనో వాటా 30 శాతం నుంచి 49 శాతానికి పెరుగుతుంది. తమ చెన్నై తయారీ కేంద్రాన్ని 2045 నాటికల్లా పూర్తిగా పునరుత్పాదక విద్యుత్‌తో నడిచేలా తీర్చిదిద్దనున్నట్లు గుప్తా వివరించారు. భారత మార్కెట్‌కు రెనో, నిస్సాన్ కట్టుబడి ఉన్నాయని నిస్సాన్ రీజియన్ చైర్పర్సన్ (ఆఫ్రికా తదితర ప్రాంతాలు) గిలోమ్ తెలిపారు. -
పిల్లల ఎడ్యుకేషన్ కోసం పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా!
నాకు పదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి ఉన్నత విద్య కోసం ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనువైన వేదికలు ఏవి? – వెంకట్రావ్ పిల్లల విద్య కోసం ఏక మొత్తంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అని చాలా మంది తల్లిదండ్రులు సాధారణంగా అడిగే ప్రశ్న. ప్రాపర్టీ విక్రయం లేదా బోనస్ లేదా తాతలు తమ మనవళ్లు, మనవరాళ్ల కోసం నగదు బహుమతి ఇచ్చినప్పుడు.. ఆ మొత్తాన్ని పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ఈ మొత్తాన్ని పిల్లల ఉన్నత విద్య కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అందుకు, పదేళ్ల వరకు కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలకు మించి మెరుగైన సాధనం లేదనే చెప్పాలి. అందులోనూ ఫ్లెక్సీక్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు పెట్టుబడులను డైవర్సిఫై చేస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన (డైవర్సిఫైడ్) కంపెనీల్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడులు పెడతారు. ఒకవేళ పన్ను ప్రయోజనం కూడా కోరుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్లెక్సీక్యాప్ మాదిరే పనిచేస్తుంటాయి. అన్ని రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించే విధంగా ఈఎల్ఎస్ఎస్ పథకాల పనితీరు ఉంటుంది. ఈ పథకాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది. ఈక్విటీలు సహజంగానే అస్థిరతంగా ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోనూ ఇదే కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి, మార్కెట్లు గరి ష్టాల వద్ద ఉన్నప్పుడు రిస్‌్కను తగ్గిస్తుంది. మూడేళ్ల కాలంలో పెట్టుబడులు పెట్టుకోవడం అన్నది తగిన విధంగా ఉంటుంది. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. డివిడెండ్ ప్లాన్ల పనితీరును, అవి పంచే డివిడెండ్ ఆధారంగా తెలుసుకోవచ్చు. మరి గ్రోత్ ప్లాన్ల పనితీరు ఎలా తెలుసుకోవాలి? – పదమ్ దేవ్ ముందుగా ఒక పథకం డివిడెండ్ ఇస్తుంది కదా అని మంచి పనితీరు చూపిస్తుందని అనుకోవడం పొరపాటు. డివిడెండ్ ఇచ్చినా కానీ, చెత్త పనితీరు చూపించే అవకాశం లేకపోలేదు. అందుకని ఓ పథకం పనితీరును కచ్చితంగా అంచనా వేయాలంటే అందుకు రాబడులే ప్రామాణికం. వ్యాల్యూ రీసెర్చ్ ఆన్లైన్ పోర్టల్‌లో పథకాల పనితీరు గణాంకాలను పరిశీలించుకోవచ్చు. పోటీ పథకాలతో పోలిస్తే మీరు శోధించే పథకం పనితీరు ఎలా ఉందన్న సమాచారాన్ని పొందొచ్చు. లార్జ్‌క్యాప్ పథకం రాబడులను పరిశీలిస్తుంటే దానికి ప్రామాణిక సూచీ నిఫ్టీ లేదా సెన్సెక్స్ అవుతుంది. సూచీలతో పోలిస్తే లార్జ్‌క్యాప్ పథకం రాబడుల్లో ముందుందా? లేక వెనుకబడిందా తెలుసుకోవచ్చు. ట్రెయిలింగ్ రాబడుల కంటే రోలింగ్ రాబడులు మరింత కచి్చతంగా ఉంటాయి. ఏడాదికాల రోలింగ్ రాబడులు అంటే.. ఏడాది కాల రాబడులను ప్రతీ రోజుకు లెక్కించి సగటు రాబడిని చెప్పడం. గత ఏడాది కాలంలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారన్న దానితో సంబంధం లేకుండా రాబడుల రేటును తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ట్రెయిలింగ్ రాబడులు అంటే సరిగ్గా ఏడాది క్రితం ఇన్వెస్ట్ చేస్తే వచి్చన రాబడి. రోలింగ్ అంటే.. ఏడాది కాల రాబడులను ప్రతి రోజుకు అన్వయించి చెప్పడం. -
చిన్న ఇన్వెస్టర్లకూ ప్రభుత్వ బాండ్లు!!
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా బ్యాంకులు, బీమా కంపెనీల్లాంటి పెద్ద సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటున్న ప్రభుత్వ బాండ్లను ఇకపై చిన్న స్థాయి రిటైల్ ఇన్వెస్టర్లు కూడా కొనుగోలు చేయొచ్చు. అంతే కాదు, బ్యాంకింగ్ సేవా లోపాలకు సంబంధించి వివిధ సంస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకు సంబంధించిన రెండు స్కీములను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్, సమగ్ర అంబుడ్స్‌మన్ స్కీమ్ వీటిలో ఉన్నాయి. దేశీయంగా పెట్టుబడి అవకాశాలను మరింతగా పెంచడానికి, సురక్షితమైన వ్యవస్థ ద్వారా క్యాపిటల్ మార్కెట్లలో సులువుగా ఇన్వెస్ట్ చేయడానికి రిటైల్ డైరెక్ట్ స్కీమ్ తోడ్పడగలదని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. అభివృద్ధి పనుల కోసం నిధులు సమీకరించుకునేందుకు కూడా ఇది దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. ‘‘మధ్య తరగతి, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, సీనియర్ సిటిజన్లు మొదలైన వర్గాల వారంతా తమ పొదుపు మొత్తాలను నేరుగా, సురక్షితంగా ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ఉపయోగపడుతుంది. ప్రభుత్వ సెక్యూరిటీలకు కచ్చితమైన సెటిల్మెంట్ హామీ ఉంటుంది కాబట్టి చిన్న ఇన్వెస్టర్లకు భరోసా ఉంటుంది’’ అని మోదీ చెప్పారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరింతగా ప్రభావం చూపేందుకు రిజర్వ్ బ్యాంక్ విధానాలు కూడా తోడ్పడ్డాయని ఆయన తెలిపారు. సమష్టి కృషితో ఎకానమీ రికవరీ: ఆర్థిక మంత్రి కోవిడ్–19తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ, ఇటు ఆర్థిక శాఖ అటు ఆర్బీఐ కలిసికట్టుగా పనిచేయడం వల్ల, వేగంగా కోలుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రిటైల్ డైరెక్ట్ స్కీముతో బాండ్ల మార్కెట్ మరింతగా విస్తరించగలదని ఆమె తెలిపారు. మరోవైపు, తమ సర్వీసులను మెరుగుపర్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలను గణనీయంగా ఉపయోగించుకుంటోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్.. ఈ స్కీముతో వ్యక్తిగత రిటైల్ ఇన్వెస్టర్లు ఇకపై ప్రైమరీ, సెకండరీ మార్కెట్ల ద్వారా ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ బాండ్లు, సావరీన్ గోల్డ్ బాండ్లు, రాష్ట్రాల అభివృద్ధి రుణాలకు సంబంధించిన బాండ్లు మొదలైన వాటిని నేరుగా కొనుగోలు చేయొచ్చు. ఇతర ఇన్వెస్టర్లకు గిఫ్టుగా కూడా ఇవ్వొచ్చు. ఇందుకోసం ఆర్బీఐ వద్ద ఆన్లైన్ రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ (ఆర్డీజీ ఖాతా) తెరవాల్సి ఉంటుంది. ఈ అకౌంట్లు ఆయా ఇన్వెస్టర్ల పొదుపు ఖాతాలకు అనుసంధానమై ఉంటాయి. ఎన్డీఎస్–ఓఎం అనే ఎలక్ట్రానిక్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ బాండ్ల జారీ, సెకండరీ మార్కెట్ లావాదేవీల్లో రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనవచ్చు. ప్రస్తుతం ఇది కేవలం బ్యాంకులు, ప్రైమరీ డీలర్లు, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి బడా సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటోంది. ఒకే అంబుడ్స్‌మన్.. సమగ్ర అంబుడ్స్‌మన్ స్కీమ్ 2021 కింద, రిజర్వ్ బ్యాంక్ పరిధిలో పనిచేసే ఆర్థిక సంస్థలు అందించే సేవల్లో లోపాలపై కస్టమర్లు ఒకే చోట ఫిర్యాదు చేయొచ్చు. ప్రస్తుతం బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు వంటి వాటికి వేర్వేరుగా అంబుడ్స్‌మన్ ఉంటున్నారు. వీటికి సంబంధించిన బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ 2006, అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ 2018, అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 2019 అనే 3 స్కీములను కలిపి కొత్తగా సమగ్ర అంబుడ్స్‌మన్ స్కీమ్ 2021ను రూపొందించారు. రూ. 50 కోట్ల పైగా డిపాజిట్ పరిమాణం ఉన్న షెడ్యుల్యేతర సహకార బ్యాంకులనూ దీనిలోకి చేర్చారు. ఫిర్యాదులపై ఆయా ఆర్థిక సంస్థలు 30 రోజుల్లోగా సంతృప్తికరమైన పరిష్కారం చూపకపోతే, కస్టమర్లు సమగ్ర అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు. -
నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపర్చుకోవాలి
న్యూఢిల్లీ: సంక్షోభాన్నుంచి గట్టెక్కేందుకు నిర్వహణ సామర్థ్యాలను మరింతగా మెరుగుపర్చుకోవాల్సిన అవసరాన్ని కోవిడ్–19 మహమ్మారి ప్రత్యేకంగా తెలియజెప్పిందని 90 శాతం మంది దేశీ వ్యాపార దిగ్గజాలు అభిప్రాయపడ్డారు. దీన్నుంచి నేర్చుకున్న పాఠాలను, భవిష్యత్తులో కచ్చితంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ సంస్థల్లో లీడర్ల కన్నా మన వారు చాలా ధీమాగా ఉన్నారు. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం కరోనా కారణంగా తమ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడిందని సుమారు 59 శాతం దేశీ సంస్థలు తెలిపాయి. కరోనా వైరస్ నేపథ్యంలో టెక్నాలజీపై గణనీయంగా ఇన్వెస్ట్ చేసినట్లు 80 శాతం కంపెనీలు తెలిపాయి. అంతర్జాతీయ సంక్షోభ సర్వే 2021లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార వర్గాలు వ్యక్తపర్చిన అభిప్రాయాలనే దేశీయంగా కూడా దిగ్గజాలు కాస్త అటూ, ఇటూగా వ్యక్తపర్చినట్లు పీడబ్ల్యూసీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 2,800 పైచిలుకు బిజినెస్ లీడర్లు తమ కంపెనీ డేటాను, కరోనా ప్రభావాలపై వ్యక్తిగత అభిప్రాయాలను, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను ఈ సర్వేలో తెలియజేశారు. సంక్షోభ సమయంలో గుర్తించిన సమస్యలను పరిష్కరించుకోవడం, భారీ అవాంతరాలపై తక్షణం స్పందించేందుకు వ్యూహాన్ని రూపొందించుకోవడం, చర్యల అమలు తర్వాత ప్రక్రియలను సమీక్షించుకోవడం తదితర 5 అంశాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు వారు తెలిపారు. -
ఐసీఐసీఐలో చైనా భారీ పెట్టుబడులు
సాక్షి, ముంబై: ఒకవైపు దేశంలో చైనా బ్యాన్ ఉద్యమం ఊపందుకున్న సమయంలో దేశీయ ప్రైవేటు బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకులో చైనా భారీ పెట్టుబడులు చర్చనీయాంశమయ్యాయి. తాజాగా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (సెంట్రల్ బ్యాంకు) ఐసీఐసీఐ బ్యాంకులో ఏకంగా 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టింది. క్వాలిఫైడ్ ఇన్స్ టిట్యూషనల్ ప్లేస్ మెంట్ ఒప్పందం కింద దీనిపై చైనా సెంట్రల్ బ్యాంకు అధికారులు సంతకాలు చేశారు. ఈ ఏడాది ఆరంభంలో హెచ్డీఎఫ్సీ లిమిటెడ్‌లో పెట్టుబడులతో భారత మార్కెట్లో సంచలనం సృష్టించిన తరువాత చైనా సెంట్రల్ బ్యాంక్ తాజాగా ఐసీఐసీఐ బ్యాంకును ఎంచుకుంది. కాగా ఐసీఐసీఐ బ్యాంకులో సింగపూర్, మోర్గాన్ ఇన్వెస్ట్ మెంట్ సొసైటీ జనరల్ లాంటి ఇతర సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టాయి ప్రస్తుతం, ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నప్పటికీ భారతదేశంలో చైనా పెట్టుబడులకు ఎటువంటి అడ్డంకులు, ఆంక్షలు లేవని నిపుణులు పేర్కొంటున్నారు. సరిహద్దులో చైనా దుశ్యర్య తరువాత చైనాకు చెందిన టిక్‌టాక్, షేర్ఇట్, వీచాట్‌తో సహా 59 చైనా యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. అలాగే చైనా పెట్టుబడులను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. -
జియో నిధుల్లో కొంత డెట్ ఫండ్స్‌లోకి!
డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియోలో వాటా విక్రయం ద్వారా సమీకరించిన నిధుల్లో కొంతమేర డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వల్పకాలిక డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు రిలయన్స్ జియోలో వాటా విక్రయం, మరోపక్క రైట్స్ ఇష్యూ చేపట్టడం ద్వారా సమీకరించిన నిధుల్లో కొంతమేర అతి స్వల్పకాలిక, మనీ మార్కెట్ ఫండ్స్, తదితర రుణ సెక్యూరిటీలలో పెట్టుబడి పెడుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సగటున మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితిగల వివిధ రుణ సెక్యూరిటీలలో నిధులను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశాయి. 20 బిలియన్ డాలర్లు ఇటీవల రిలయన్స్ జియోలో వాటా విక్రయం ద్వారా మాతృ సంస్థ ఆర్ఐఎల్ 20 బిలియన్ డాలర్లను(రూ. 1,50,000 కోట్లకుపైగా) సమకూర్చుకుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో విదేశీ దిగ్గజాలు గూగుల్, ఫేస్బుక్ ప్రస్తావించదగ్గ స్థాయిలో వాటాలు కొనుగోలు చేసిన విషయం విదితమే. కొద్ది వారాలుగా పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ స్థాయిలో నిధులను సమీకరిస్తోంది. దీంతో ఆర్ఐఎల్ స్వల్పకాలిక పెట్టుబడులపై ఇటీవల ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆసక్తి పెరిగినట్లు విశ్లేషకులు తెలియజేశారు. కొంతమంది మనీ మేనేజర్ల వివరాల ప్రకారం ఇటీవల ఆర్ఐఎల్ సుమారు రూ. 35,000 కోట్లు(4.7 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. భారీ కార్పొరేట్ కంపెనీ నుంచి ఇటీవల రుణ సెక్యూరిటీలలోకి పెట్టుబడులు ప్రవహిస్తున్నట్లు మ్యూచువల్ ఫండ్ అడ్వయిజరీ సంస్థ వేల్యూ రీసెర్చ్ సీఈవో ధీరేంద్ర కుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు. రుపీకి బలం ఇటీవల కొద్ది వారాలుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ స్థాయిలో విదేశీ నిధులను సమీకరిస్తుండటంతో దేశీ కరెన్సీకి బలమొచ్చినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో గత నెల రోజుల్లో డాలరుతో మారకంలో రూపాయి 1 శాతానికిపైగా పుంజుకున్నట్లు తెలియజేశాయి. వెరసి ఆసియా కరెన్సీలలో రూపాయి ముందంజ వేసినట్లు తెలియజేశాయి. జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా విక్రయం ద్వారా సమీకరించిన నిధుల్లో కొంతమేర ఆర్ఐఎల్ వడ్డీ రేట్ల ఆధారిత పెట్టుబడులకు మళ్లిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
వయసు 60- సంపద రూ. 16000 కోట్లు
దేశీ స్టాక్ మార్కెట్లలో బిగ్ బుల్గా పేరొందిన సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా గత వారాంతాన 59 ఏళ్ల వయసును దాటారు. అరవైలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జున్‌జున్‌వాలా పెట్టుబడులు, మార్కెట్లపై అభిప్రాయాలు వంటి అంశాలను ఫోర్బ్స్ తదితరాల సహకారంతో ఆంగ్ల మీడియా వివరించింది. ఆ వివరాలు చూద్దాం.. 2.2 బిలియన్ డాలర్లకు రాకేష్ 1985లో స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించారు. తొలుత రూ. 5,000తో ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్రారంభించారు. తదుపరి విజయవంతమైన ఇన్వెస్టర్‌గా నిలుస్తూ సంపదను పెంచుకుంటూ వచ్చారు. ప్రస్తుతం రాకేష్ పెట్టుబడుల విలువ 2.2 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 16,400 కోట్లు). తద్వారా దేశీయంగా సంపన్న వ్యక్తులలో 48వ ర్యాంకులో నిలుస్తున్నారు. వెరసి రాకేష్ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల వయసు 35 ఏళ్లకు చేరినట్లు నిపుణులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. తొలి నాళ్లలో రాకేష్ తొలినాళ్లలో చేసిన పలు ఇన్వెస్ట్మెంట్స్ భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. జాబితా చూద్దాం.. 1998-2015 మధ్య అపోలో హాస్పిటల్స్‌లో పెట్టుబడులు 100 రెట్లు రిటర్నులు ఇచ్చాయి. ఇతర రిటర్నులలో బాటా(1996-2019), బీఈఎల్ (1998-2007)90 రెట్లు, ప్రాజ్ ఇండస్ట్రీస్(2001-07) 700 రెట్లు, ర్యాలీస్ ఇండియా (2004-20) 55 రెట్లు ఉన్నాయి. జాబితా ఇంకా 2000 ప్రాంతంలో రాకేష్ భారీ లాభాలను ఆర్జించిన పెట్టుబడుల్లో బీఈఎంఎల్(100 రెట్లు), లుపిన్(160 రెట్లు), ఎస్సీఐ(1200 శాతం) ప్రస్తావించదగ్గవిగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇక తాజా పెట్టుబడులను పరిశీలిస్తే.. ఎస్కార్ట్స్(2013-20) 20 రెట్లు, టాటా కమ్యూనికేషన్స్(2010-20) 200 శాతం లాభాలు ఆర్జించాయి. ఇక టైటన్ అయితే 2005-20 కాలంలో 80 రెట్లు ప్రతిఫలాలను ఇచ్చింది. ఇప్పటికీ టైటన్‌లో రాకేష్ పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. రెండూ వేరువేరు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో ట్రేడింగ్- ఇన్వెస్ట్మెంట్ అనేవి భార్య, శ్రీమతి వంటివని రాకేష్ పేర్కొన్నారు. రెండింటినీ సమానంగా మేనేజ్ చేయలేము. కనుక విడిగా నిర్వహించడమే మేలు అంటూ వ్యాఖ్యానించారు. ట్రేడింగ్ అనేది మొమెంటమ్ ఆధారంగా వెంటవెంటనే పూర్తి చేయవలసి ఉంటుందని, ఇన్వెస్ట్మెంట్ అయితే సొంత ఆలోచనలతో దీర్ఘకాలంపాటు స్థిరంగా చేపట్టవలసి ఉంటుందని పేర్కొన్నారు. -
జియో హాట్రిక్ : మరో మెగా డీల్
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని రిలయన్స్ జియో విదేశీ పెట్టుబడులతో దూసుకుపోతోంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, ప్రైవేటు ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ ఒప్పందాలతో జోరుమీదున్న జియో తాజాగా అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్టనర్స్ కంపెనీతో మరో మెగా ఒప్పందానికి సన్నద్ధమైంది. ఈ ఒప్పందం ద్వారా ఆర్ఐఎల్కు రూ.11,367 కోట్లు సమకూరనున్నాయి. ఈ ఒప్పందంలో ఈక్విటీ విలువ రూ .4.91 లక్షల కోట్లు, ఎంటర్ప్రైజ్ విలువ రూ .5.16 లక్షల కోట్లు అని రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్‌ఫామ్‌లు శుక్రవారం ప్రకటించాయి. దీంతో విస్టా జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా నిలిచింది. కేవలం రెండు వారాల్లోనే అమెరికాకి చెందిన మరో కంపెనీ జియోలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం విశేషం. తమ ఇతర భాగస్వాముల మాదిరిగానే, విస్టా కూడా భారతీయ డిజిటల్ పర్యావరణ వ్యవస్థ ద్వారా భారతీయులందరికీ ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో తమతో జత కట్టిందని ఆర్ఐఎల్ ఛైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. తాజా పెట్టుబడులతో ప్రముఖ టెక్నాలజీ ఇన్వెస్టర్ల నుంచి రూ .60,596.37 కోట్లు పెట్టుబడులను మూడు వారాల్లో సేకరించగలిగామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. దీంతో శుక్రవారం నాటి మార్కెట్ లో రిలయన్స్ 3 శాతానికి పైగా ఎగిసింది. (జియో మరో భారీ డీల్ ) కాగా ఏప్రిల్ 22 న జియోలో 9.99 శాతం వాటా కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫేస్‌బుక్‌తో 43,574 కోట్ల రూపాయల ఒప్పందాన్ని, ప్రైవేటు ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ నుంచి రూ .5,656 కోట్ల పెట్టుబడిని సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ సారథ్యంలోని ఆర్ఐఎల్ మార్చి 2020 నాటికి రూ.1.61 లక్షల కోట్ల అప్పుతో ఉన్న కంపెనీ 2021 నాటికి రుణ రహిత సంస్థగా అవతరించే లక్ష్య సాధనలో సమీప దూరంలో నిలిచింది. చదవండి : జియో మరో సంచలనం, ప్రత్యర్థులకు షాక్ -
స్టాక్ సూచనలతో జాగ్రత్త
పెట్టుబడుల విషయంలో సలహా సేవల పేరుతో ఇన్వెస్టర్లకు పెద్ద ఎత్తున జరిగిన మోసం ఇటీవల వెలుగుచూసింది. ట్రోకా పేరుతో రూ.10 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన ముగ్గురి పెట్టుబడుల సలహాలన్నీ మోసపూరితమేనని, అవి ఫలితాలు ఇవ్వలేదని, కాల్ చేసినా వారి నుంచి స్పందన లేదంటూ ఇన్వెస్టర్ల నుంచి సెబీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. పైగా ఈ కేటుగాళ్లు సెబీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ వాస్తవ లైసెన్స్ చూపించి మరీ మోసానికి పాల్పడడం పరాకాష్ట. ఇందుకు సంబంధించి రిషబ్ జైన్, ఉబైదుర్ రెహ్మాన్, జి కాదర్ హుస్సేన్‌లపై సెబీ నిషేధం విధిస్తూ ఈ ఏడాది మార్చి 20న ఆదేశాలు జారీ చేసింది. అయితే, మనలోనూ చాలా మందికి ఈ తరహా అనుభవాలు ఎదురు కావచ్చు. ముఖ్యంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వారికి మధ్యప్రదేశ్, ఇండోర్ కేంద్రంగా కాల్స్ వస్తుంటాయి. తాము స్టాక్స్ రికమండేషన్స్ ఇస్తామని, ముందు ఉచిత ట్రయల్ కూడా ఉందంటూ వారు ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ తరహా మోసాల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాబడులకు హామీ లేదు... రిషబ్ జైన్, అతడి భాగస్వాములు భారీ హామీలను గుప్పించారు. తమ వెబ్సైట్లో రెండు ఉత్పత్తుల సమాచారాన్ని వీరు ఆకర్షణీయంగా పొందుపరిచారు. స్టాక్ ఆప్షన్ (నష్టాల్లేని) జాక్‌పాట్ ఇందులో ఒకటి. నిఫ్టీ ఆప్షన్ (నష్టాల్లేని) జాక్‌పాట్ మరొకటి. 95–99 శాతం కచ్చితమైన రికమండేషన్, నష్టాలు సున్నా, జాక్‌పాట్ వంటి పదాలను వినియోగించారు. వీటి ద్వారా అద్భుతమైన రాబడులపై ఇన్వెస్టర్లలో ఆశలు కల్పించారు. మొత్తం 10 వెబ్సైట్ల ద్వారా వీరు ఈ తరహా పెయిడ్ సూచనల సేవల వ్యవహారాలు నడిపినట్టు సెబీ దర్యాప్తులో వెలుగు చూసింది. నిఫ్టీష్యూర్ షాట్ డాట్‌కామ్, న్యూస్బేస్డ్టిప్స్ డాట్ కామ్, ఆప్షన్టిప్స్ డాట్ ఇన్ సైట్లు కూడా వీరు నిర్వహించినవే. ఈ తరహా జాక్‌పాట్, నష్టాల్లేని, కచ్చితమైన రికమండేషన్స్ అనే పదాలు కనిపిస్తే అప్రమత్తం కావాల్సిందే. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో కచ్చితమైన రాబడులు ప్రతీ లావాదేవీలో రావడమన్నది అసాధ్యం. ఈ తరహా పదాలతో కూడిన ప్రకటనలు స్పెక్యులేటివ్ తరహావిగా భావించాలి. ఎందుకంటే సెబీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ గైడ్‌లైన్స్ 2013, సెబీ మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్స్ ప్రకారం... ఏ మ్యూచువల్ ఫండ్ కూడా, డిస్ట్రిబ్యూటర్ లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ రాబడులపై భరోసా కానీ, గ్యారంటీ కానీ ఇవ్వరాదు. ‘‘మార్కెట్ ఆధారిత సాధనాలపై రాబడులు గ్యారంటీ అని పేర్కొంటే అది మోసపూరితమే. ఎవ్వరూ ఈ తరహా హామీ ఇవ్వరాదు. వారు వారి ట్రాక్ రికార్డునే ఇవ్వాల్సి ఉంటుంది. భవిష్యత్తు రాబడులపై హామీలు ఇవ్వరాదు’’ అని ఓరో వెల్త్ సహ వ్యవస్థాపకుడు విజయ్ కృష్ణ కుప్ప తెలిపారు. స్టాక్ టిప్స్‌కు దూరం స్టాక్ టిప్స్ రూపంలోనూ పెద్ద ఎత్తున మోసాలు జరుగుతాయన్న అవగాహన అవసరం. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ గైడ్‌లైన్స్ ప్రకారం పెట్టుబడులకు సంబంధించి సలహాలిచ్చే వారు... కస్టమర్ల రిస్క్‌కు తగిన పోర్ట్‌ఫోలియోను సూచించాల్సి ఉంటుంది. ఆయా సాధనాల్లో ఉండే రిస్క్ గురించి కూడా వివరించాలి. కానీ, జైన్ అతడి సహచరులు మాత్రం ఈ పనిచేయలేదు. సెబీ వద్ద నమోదు చేసుకున్న సలహాదారులు... కేవలం ఈక్విటీలే కాకుండా మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇలా అన్ని రకాల సాధనాల గురించి తెలియజేయడంతోపాటు, ఇన్వెస్టర్లకు అనుకూలమైన వాటిని సూచించాలి. ‘‘స్టాక్ ట్రేడింగ్ టిప్స్ ఇచ్చే వారి విషయంలో అప్రమత్తంగానే ఉండాలి. ఎందుకంటే వాటి రూపంలో మోసాలకు పాల్పడే ప్రమాదం పొంచి ఉంటుంది. కస్టమర్లు అధిక రాబడులు ఆశిస్తుంటారు. కొంత మంది ఆర్థికంగా కష్టాల్లో ఉండడంతో భారీ రాబడులు వచ్చే చోట ఇన్వెస్ట్ చేసి ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలని చూస్తుంటారు. దీన్నే మోసగాళ్లు అవకాశంగా మలుచుకుంటారు’’ అని అర్థయంత్ర సీఈవో నితిన్ బి వ్యాకరణం తెలిపారు. ట్రాక్ రికార్డు మీరు ఎంచుకునే సలహాదారులు, సలహా సంస్థలకు సంబంధించి గత ట్రాక్ రికార్డు అనేది ఒక ఆధారంగా పనికొస్తుంది. కానీ, ఆ ట్రాక్ రికార్డులో వాస్తవమెంతో ఎవరు చూసొచ్చారు? ఓ సారి ఆలోచించండి. జైన్ టీమ్ తమ వెబ్సైట్లో పేర్కొన్న రాబడుల చరిత్ర అంతా మోసపూరితమే. సానుకూల రివ్యూలు వారు సృష్టించినవి. అద్భుతమైన రాబడుల వివరాలను కూడా వారే కల్పించారు. వీటి ద్వారా చందాదారులను ఆకర్షించే ప్రయత్నం చేసినట్టు సెబీ తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. అందుకే ఈ తరహా పోర్టల్స్‌లోని సమాచారాన్ని గుడ్డిగా నమ్ముకోకూడదు. గూగుల్‌లో సెర్చ్ చేయడం ద్వారా ఆయా పోర్టల్స్ రికమండేషన్లలో ఉన్న మోసాల గురించి తోటి బాధితులు ఎవరైనా వివరాలు ఉంచితే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ చెల్లింపులు ఇక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సంస్థ గురించి బయట విచారించకోకుండా, ఆన్లైన్లోనే సబ్స్క్రిప్షన్ చెల్లించేయడం సరికాదు. మీ డబ్బులను తీసుకుని సదరు సంస్థ ఎత్తివేసే అవకాశాలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జైన్, అతడి బృందం చేసిన పనే ఇది. పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్ల నుంచి చందాలు తీసుకుని కాల్ చేసినా స్పందించకుండా ఉడాయించారు. ఆన్లైన్ వేదికగా ఫైనాన్షియల్ సేవలు అందించే సంస్థలు అన్నింటికీ ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఉండాలి. వీరితో ఒకసారి మాట్లాడి వివరాలను ధ్రువీకరించుకోవడం మంచిది. కాల్ చేసినప్పుడు మీ పెట్టుబడి రెట్టింపు అవుతుందని, రాబడులు గ్యారంటీ అనే మాటలు అటునుంచి వినిపిస్తే వారికి దూరంగా ఉండడం మంచిదన్నది నితిన్ వ్యాకరణం సూచన. ఆధారాలను పరిశీలించాల్సిందే మష్రువాలా, క్యాప్మెట్రిక్స్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ల లైసెన్స్‌లను ట్రోకా తనవిగా చూపించుకుని, సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్‌గా చలామణి కావడం గమనార్హం. కనుక సలహా తీసుకునే ముందు సంబంధిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ లైసెన్స్ వాస్తవమైనదేనా అన్నది కూడా చూడాలని ఈ అనుభవం చెబుతోంది. డిస్ట్రిబ్యూటర్ లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఏదన్నది తెలిస్తే... యాంఫి సైట్‌కు వెళ్లి డిస్ట్రిబ్యూటర్ గుర్తింపును చెక్ చేసుకోవచ్చు. సెబీ వెబ్‌సైట్‌కు వెళ్లి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నిజమైనదేనా కాదా పరిశీలించుకోవచ్చు. వ్యక్తి పేరు లేదా వెబ్సైట్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా వివరాలు తెలుసుకునే వీలుంది. రికార్డుల్లో కాంటాక్ట్ నంబర్, ఈమెయిల్ ఐడీ తదితర వివరాలు లభిస్తాయి. ఆ వివరాల ద్వారా సంప్రదించే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత వారి వెబ్సైట్లో పొందుపరిచిన వివరాలతో సరిపోల్చుకోవడం ద్వారా అసలైన వారా, నకిలీనా అన్నది తెలుసుకోవచ్చు. తమ వెబ్సైట్ దిగువ భాగంలో యాంఫి రిజిస్ట్రేషన్ నంబర్ (69583)ను చూడొచ్చని ఫండ్స్ ఇండియా డాట్ కామ్ సీవోవో శ్రీకాంత్మీనాక్షి సూచించారు. ఆ నంబర్‌పై క్లిక్ చేస్తే స్కాన్డ్ డాక్యుమెంట్ పాపప్ స్క్రీన్‌ఫై కనిపిస్తుందని, అందులో సంస్థ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చూడొచ్చని తెలిపారు. సంస్థ అసలు పేరు వెల్త్ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ అని అక్కడ ఉంటుందని చెప్పారు. యాంఫి వెబ్‌సైట్‌కు వెళ్లి తమ రిజిస్ట్రేషన్ నంబర్ 69583ను ఎంటర్ చేసినా అవే వివరాలు కనిపిస్తాయన్నారు. వివరాలు అక్కడ లేకుంటే సమస్య ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుందన్నారు. -
దక్షిణ కొరియా రాయబారితో కేటీఆర్ భేటీ
ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులకు తైవాన్ ప్రతినిధులకు ఆహ్వానం సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి చో హ్యున్‌తో మంత్రి కె. తారకరామారావు మంగళవారం ఢిల్లీలోని ఆ దేశ ఎంబసీలో భేటీ ఆయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని ఆహ్వానించారు. ఐటీ, ఫార్మాతో పాటు అన్ని రంగాల్లో వేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, నూతన పారి శ్రామిక విధానం ద్వారా విదేశీ పెట్టుబడులకు అనువైన పరిస్థితులు కల్పిస్తున్నామని కేటీఆర్ వివరించారు. కొరియన్ సంస్థలతో రాష్ట్రం లో వ్యాపార, వాణిజ్య సంబంధాల బలోపేతానికి కృషి చేయాలని చో హ్యున్‌ను కేటీఆర్ కోరారు. అనంతరం తైవాన్ ఆర్థిక వ్యవహా రాల శాఖ ఉపమంత్రి మే హువాంగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమా వేశంలో తైవాన్ ఎలక్ట్రానిక్ సంస్థలను కేటీఆర్ రాష్ట్రానికి ఆహ్వానిం చారు. తైవాన్‌లోని అక్టోబర్‌లో జరిగే తైవాన్–భారత్ పారిశ్రామిక సదస్సుకు హాజరుకావాల్సిందిగా మంత్రిని తైవాన్ ప్రతినిధులు కోరారు. ఆ తర్వాత ఓవైఓ రూమ్స్ సీఈఓ రితేశ్ అగర్వాల్‌ను కేటీ ఆర్ కలిశారు. మరోవైపు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కలసి అదిలా బాద్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని కోరారు. -
'పర్యటనలతో ఎన్ని ఉద్యోగాలొచ్చాయి'
విజయవాడ : ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే దావోస్ పర్యటనపై వస్తున్న ఆరోపణలపై శ్వేత పత్రం విడుదల చేయాలని కాంగ్రెస్‌పార్టీ డిమాండ్ చేసింది. ఇప్పటి వరకు ఏపీలో ఎంతమందికి ఉపాధి కల్పించారో చెప్పాలని పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకు మాజీ స్పీకర్, పీసీసీ ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ లేఖ రాశారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాద్యత ప్రభుత్వం పై ఉందని లేఖలో పలు అంశాలను పేర్కొన్నారు. ► 2015లో కూడా దావోస్ పర్యటనలో భాగంగా బిల్ గేట్స్, సత్యనాదెళ్లను కలిసినట్టు తెలిపారు. ఏపీలో మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు, హీరో మోటార్స్ కార్పొరేషన్, పెప్సీ, వాల్ మార్ట్, విప్రో లాంటి సంస్థలు త్వరలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులతో వస్తాయని ప్రకటించారు. ► చంద్రబాబు మూడవసారి కూడా దావోస్ పర్యటించిన సందర్భంగా అనేక మంది వ్యాపార దిగ్గజాలను కలిసి భారీ ఒప్పందాలను చేసుకున్నట్టు అధికార యంత్రాంగం పదే పదే ప్రకటనలు విడుదల చేస్తున్నారు. ► 2016 దావోస్ పర్యటనలో పాల్గొని రూ. 2000 కోట్ల పెట్టుబడితో ఘెర్జి టెక్స్ టైల్ మెగా పార్క్‌ను ఏపీలో స్థాపించబోతున్నట్టు ప్రకటించారు. ► 'స్మార్ట్ సిటీ, స్మార్ట్ విలేజ్, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్' ఇదేనా అభివృద్ధి మంత్రం అంటూ 2016లో మీరు స్విట్జర్లాండ్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలిపారు. ఆయా సంస్థల గురించి ఇప్పుడు ఎందుకు కృషి చేయడం లేదో ప్రజలకు వివరించాలి. ► పెట్టుబడులు ఆకర్షించడానికి మంత్రుల బృందం పర్యటనలకు అయిన ఖర్చులు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, లభించిన ఉపాధి వివరాలు వెల్లడించాలి. ► 12 జవవరి 2016న రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమ్మిట్‌ను నిర్వహించింది. అప్పుడు జరిగిన ఒప్పందాల ద్వారా 4 లక్షల 78 వేల కోట్ల పెట్టబడులు రాష్ట్రానికి వస్తాయని, 6 లక్షల మందికి కొత్తగా ఉపాధి దొరుకుతుందని ఊదరగొట్టారు. కానీ, ఇప్పటి వరకు ఎంత మందికి ఉపాధి లభించిందో వాస్తవాలు తెలియజేయాలి. ► 40 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్వహించిన ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా రాష్ట్ర ప్రజలలో ప్రత్యేకంగా యువతలో మీరు భారీ ప్రకటనల ద్వారా ఆశలను రేకెత్తించారు. ఆర్భాటాలతో ప్రచారం కోసం ప్రజాధనం వృధాచేస్తుందన్న అనుమానాలకు ప్రభుత్వం వాస్తవాలు వివరించాలని లేఖలో పేర్కొన్నారు. -
‘ఎన్ఆర్ఐలు తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలి’
వర్జీనియా: అమెరికాలోని తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐలు తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. వర్జినియాలోని అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్‌తో పాటు ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యరు. ఈ సందర్భంగా ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ బంగారు తెలంగాణ కోసం పాటుపడుతున్నారని, ముఖ్యంగా అమెరికాలోని వివిధ స్టేట్స్లో ఉంటున్న ఎన్ఆర్ఐలు తెలంగాణలో పెట్టుబడులు పెడితే రాయితీలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికా తెలంగాణ సంఘం అధ్యక్షుడు రాంమోహన్, ప్రధాన కార్యదర్శి రవి, కోశాధికారి శ్రీనివాస్, బోర్డు సభ్యులు అరవింద్, చందు, మాదవరావు, ప్రకాశ్, నరేందర్‌రెడ్డి, రఘువీర్, శంకర్, శ్రీధర్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
'98 సంస్థలతో సర్కారు ఒప్పందం'
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలో పెట్టుబడులుపెట్టేలా 98 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ పెట్టుబడుదారుల సమ్మేళనం కార్యక్రమం గురువారం చెన్నైలో ముగిసింది. దీనిలో భాగంగా తమిళనాడు సర్కారు వ్యాపారవేత్తలతో రూ.2.40లక్షల కోట్ల పెట్టబడులకు ఒప్పందాలను కుదుర్చుకుంది. మళ్లీ ప్రపంచ పెట్టుబడుదారుల సమ్మేళనం 2017లో నిర్వహించాలని తమిళనాడు సర్కారు నిర్ణయించింది.