దక్షిణ కొరియా రాయబారితో కేటీఆర్ భేటీ
భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి చో హ్యున్‌తో మంత్రి కె. తారకరామారావు మంగళవారం ఢిల్లీలోని ఆ దేశ ఎంబసీలో భేటీ ఆయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని ఆహ్వానించారు. ఐటీ, ఫార్మాతో పాటు అన్ని రంగాల్లో వేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, నూతన పారి శ్రామిక విధానం ద్వారా విదేశీ పెట్టుబడులకు అనువైన పరిస్థితులు కల్పిస్తున్నామని కేటీఆర్ వివరించారు. కొరియన్ సంస్థలతో రాష్ట్రం లో వ్యాపార, వాణిజ్య సంబంధాల బలోపేతానికి కృషి చేయాలని చో హ్యున్‌ను కేటీఆర్ కోరారు.
అనంతరం తైవాన్ ఆర్థిక వ్యవహా రాల శాఖ ఉపమంత్రి మే హువాంగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమా వేశంలో తైవాన్ ఎలక్ట్రానిక్ సంస్థలను కేటీఆర్ రాష్ట్రానికి ఆహ్వానిం చారు. తైవాన్‌లోని అక్టోబర్‌లో జరిగే తైవాన్–భారత్ పారిశ్రామిక సదస్సుకు హాజరుకావాల్సిందిగా మంత్రిని తైవాన్ ప్రతినిధులు కోరారు. ఆ తర్వాత ఓవైఓ రూమ్స్ సీఈఓ రితేశ్ అగర్వాల్‌ను కేటీ ఆర్ కలిశారు. మరోవైపు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కలసి అదిలా బాద్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని కోరారు.