సాక్షి,ముంబై: ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 ప్రకారం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 10,94,400 కోట్ల సంపదతో టాప్ ప్లేస్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సోదరుడు వినోద్ శాంతిలాల్ అదానీ కూడా తగ్గేదేలా అంటున్నారు.
ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ (సెప్టెంబర్ 22, గురువారం) తాజా లిస్ట్ ప్రకారం దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త వినోద్ అదానీ రూ.1,69,000 కోట్లతో అత్యంత ధనవంతులైన ఎన్‌ఆర్‌ఐ, ఆరో సంపన్న భారతీయుడుగా నిలిచారు. 1976లో ముంబయిలో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించి సింగపూర్‌దాకా విస్తరించారు. జకార్తాలో వ్యాపార వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. గత సంవత్సరంలో వినోద్ అదానీ సంపద 28 శాతం లేదా 37,400 కోట్లు పెరిగింది. అలా టాప్ 10 సంపన్న వ్యక్తుల జాబితాలో ఆరోస్థానం కోసం రెండు ర్యాంకులు ఎగబాకినట్టు నివేదించింది. గత ఐదేళ్లలో వినోద్ అదానీ సంపద ఏకంగా 850 శాతం లేదా 1,51,200 కోట్లు పెరిగింది.
నివేదిక ప్రకారం, 2018లో 49వ స్థానం నుంచి ఈ ఏడాది ఆరో స్థానానికి చేరారు. వినోద్ రోజువారీ ప్రాతిపదికన రూ. 102 కోట్లు. వార్షిక ప్రాతిపదికన నాలుగో అతిపెద్ద గెయినర్.అంతేకాదు ఇద్దరు అదానీల సంపద మొత్తం రూ. 12,63,400 కోట్లుగా ఉంది. అంటే హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లోని తొలి పదిమంది వ్యక్తుల సంపదలో దాదాపు 40 శాతం అన్న మాట. ఈ ఏడాది 94 మంది ఎన్నారైలు భారతీయ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment