హీరోగా ఎంట్రీ ఇస్తోన్న వినోద్ కిషన్.. లిరికల్‌ సాంగ్ వచ్చేసింది! | Vinod Kishan Latest Movie Pekamedalu - Aanandham Athaki Swaaha Song Out | Sakshi
Sakshi News home page

Peka Medalu Song: 'ఆనందం అత్తకు స్వాహా.. మనశ్శాంతి మామకు స్వాహా'.. ఆసక్తిగా లిరికల్‌ సాంగ్!

Published Wed, Jul 3 2024 5:17 PM | Last Updated on Wed, Jul 3 2024 5:37 PM

Vinod Kishan Latest Movie Pekamedalu - Aanandham Athaki Swaaha Song Out

'నా పేరు శివ', 'అంధగారం' చిత్రాలతో మెప్పించిన వినోద్ కిషన్ హీరోగా నటిస్తోన్న మూవీ 'పేక మేడలు'. ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో అనూష కృష్ణ హీరోయిన్‌గా కనిపించనుంది. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్, సాంగ్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆడపిల్ల అనే పాటకు సాకే రాజశేఖర్ పాడగా.. భార్గవ కార్తీక్ లిరిక్స్ అందించారు. ఒక మంచి కాన్సెప్ట్, కంటెంట్ ఉన్న స్టోరీగా ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని జూలై 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీలో రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement